అఖిల్ ప్రకటన వచ్చేస్తోంది..?
అఖిల్ ప్రకటన వచ్చేస్తోంది..?
Published Wed, Apr 6 2016 12:57 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM
భారీ అంచనాల మధ్య తెరంగేట్రం చేసిన అక్కినేని నట వారసుడు అఖిల్, తొలి సినిమాతో ఆకట్టుకోలేకపోయాడు. ఎంతో హైప్ క్రియేట్ చేసిన 'అఖిల్' డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో రెండో సినిమా విషయంలో అక్కినేని ఫ్యామిలీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే చాలా మంది దర్శకుల పేర్లు వినిపించినా, ఫైనల్గా నాగార్జున లీడ్ రోల్లో ఊపిరి సినిమాను తెరకెక్కించిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అఖిల్ హీరోగా హిందీ సూపర్ హిట్ సినిమా 'ఏ జవానీ హై దివానీ'ని రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
అయితే వంశీ పైడిపల్లి మాత్రం రీమేక్ కన్నా కొత్త కథతో సినిమా చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. ఇప్పటికే ఊపిరి సినిమాను రీమేక్గా తెరకెక్కించిన వంశీ, మరో సినిమా కూడా రీమేక్ చేస్తే తన మీద రీమేక్ డైరెక్టర్ అన్న ముద్ర పడుతుందన్న ఆలోచనలో ఉన్నాడట. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానమిస్తూ ఉగాది సందర్భంగా ఏప్రిల్ 8న అఖిల్ సినిమా ప్రకటన వస్తుందన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈసారైనా అఖిల్ ప్రకటిస్తాడో లేదో చూడాలి.
Advertisement
Advertisement