Akkineni Akhil
-
పూరితో అఖిల్ మూవీ ఫిక్స్..
-
సహించేది లేదు... క్షమించేది లేదు: అఖిల్
నాగచైతన్య–సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ మాట్లాడిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యల్ని సినీ ప్రముఖులు ముక్తకంఠంతో ఖండించారు. దీంతో ఆమె క్షమాపణలు చెప్పడంతోపాటు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. కాగా కొండా సురేఖపై నాగార్జున పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని అఖిల్ మరోసారి స్పందించి, సోషల్ మీడియాలో ఘాటుగాపోస్టు పెట్టారు. దాని సారాంశం ఏంటంటే... ‘‘కొండా సురేఖ చేసిన నిరాధారమైన వ్యాఖ్యలు అసభ్యకరంగా, జుగు΄్సాకరంగా ఉన్నాయి. ప్రజా సేవకురాలిగా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఆమె తన నైతికత, సామాజిక సంక్షేమాన్ని మరచిపోయి ప్రవర్తించిన తీరు సిగ్గు చేటు, క్షమించరానిది. ఆమె మాటలతో మా కుటుంబ సభ్యులతోపాటు ప్రజలు కూడా బాధపడ్డారు. స్వార్థపూరితంగా గెలవడానికి ప్రయత్నిస్తున్న రాజకీయ యుద్ధంలో.. తన కంటే చాలా ఉన్నత విలువలు, సామాజిక అవగాహన ఉన్న అమాయక వ్యక్తులపై సిగ్గు లేకుండా దాడి చేసి బలిపశువులను చేశారామె. కుటుంబ సభ్యుడిగా, చిత్ర పరిశ్రమ సభ్యుడిగా మౌనంగా చూస్తూ ఉండలేను. ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని శిక్షించాలి. మన సమాజంలో ఆమెలాంటి వాళ్లకు చోటు, గౌరవం లేదు. ఆమెను సహించేది లేదు... క్షమించేది లేదు’’ అని పేర్కొన్నారు అఖిల్. -
అక్కినేని హీరోకు సమంత విషెస్.. పోస్ట్ వైరల్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్లో అగ్ర హీరోలందరితో సినిమాలు చేసింది. గతేడాది శాకుంతలం, ఖుషి సినిమాలతో అలరించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఇండియన్ వర్షన్ సిటాడెల్ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. వరుణ్ ధావన్‌తో కలిసి ఇందులో కనిపించనుంది. తాజాగా సమంత చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ బర్త్ డే విషెస్ తెలిపింది సామ్. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. క్యూట్ పప్పీతో అఖిల్ ఉన్న ఫోటోను పంచుకుంది. హ్యాపీ బర్త్ డే అఖిల్ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. అయితే అక్కినేని హీరో నాగచైతన్యను పెళ్లాడిన సమంత.. విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. గతేడాది అఖిల్ ఏజెంట్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపర్చింది. ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. -
Akhil Akkineni: అయ్యగారు.. అప్పుడే నెం.1! (ఫోటోలు)
-
కొత్త కథ కోసం ఎదురు చూస్తున్న యంగ్ హీరో
-
డిజాస్టర్ అయినా తగ్గేదేలే అంటున్న అఖిల్
-
ఆ ఓటీటీలో ఏజెంట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
గత చిత్రాల్లో రొమాంటిక్‌గా కనిపించిన అఖిల్ ఏజెంట్ సినిమాలో అందుకు భిన్నంగా వైల్డ్‌గా కనిపించేందుకు ప్రయత్నించాడు. స్పై థ్రిల్లర్ యాక్షన్ మూవీగా వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ కంటే ఎక్కువగా నెగెటివ్ టాకే వస్తోంది. దీంతో హీరో అఖిల్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి పడ్డ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిందని అభిమానులు బాధపడుతున్నారు. ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు అంతంతమాత్రమే స్పందన లభిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీలివ్ ఇదివరకే సొంతం చేసుకున్న విషయం తెలిసిందే కదా! తాజాగా ఏజెంట్ మూవీ నెల లోపే ఓటీటీలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే మే నెలాఖరులోపు సోనీలివ్‌లో ఏజెంట్ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. వీలైతే మే మూడో వారంలోపే ఓటీటీలో రిలీజ్ చేయాలని చూస్తున్నారట మేకర్స్. ఇక ఏజెంట్ సినిమా విషయానికి వస్తే.. ఇందులో మమ్ముట్టి కీలక పాత్ర పోషించాడు. హిప్ హాప్ తమిళ సంగీతం అందించగా అనిల్ సుంకర నిర్మించారు. చదవండి: స్టార్ హీరోతో హీరోయిన్ లవ్.. నటుడి విరహవేదన.. ఇన్నాళ్లకు స్పందించిన నటి -
మా కుక్కలు కూడా డైట్ మెయింటైన్ చేస్తాయి...అందుకే మాకు పొట్టలు రావు
-
ఆ స్టంట్ చేసేటపుడు గజగజ ఓనికను...
-
మా నాన్న మీద నేను అందుకు డిపెండ్ అవ్వాలి అందుకే ఇలా చేశా
-
ఏజెంట్ ప్రీ రిలేస్ బిజినెస్ ఎన్ని కోట్లో తెలుసా?
-
సెంటిమెంట్ తో ఏజెంట్ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్!
-
ఏజెంట్ వైల్డ్‌గా ఉంటాడు
తిరుపతి కల్చరల్: తన గత సినిమాల కంటే ఏజెంట్ చిత్రం కొత్తగా ఉంటుందని, తనను తాను నిరూపించుకునేందుకు ఏజెంట్ సినిమాలో వైల్డ్‌గా ప్రయత్నించానని యువ హీరో అక్కినేని అఖిల్ తెలిపారు. అక్కినేని అఖిల్, సాక్షి వైద్య హీరో హీరోయిన్న్లుగా, ముమ్మటి ప్రత్యేక పాత్రలో సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నిర్మితమైన ఏజెంట్ చిత్రం ప్రమోషన్లో భాగంగా చిత్ర బృందం శుక్రవారం రాత్రి తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో సందడిచేసింది. మీడియా సమావేశంలో అఖిల్ మాట్లాడుతూ ఈ చిత్రం ట్రైలర్‌కు విశేష స్పందన రావడం సంతోషకరమన్నారు. ఈ సినిమాలో హీరోయిన్ సాక్షి వైద్యతో కెమిస్ట్రీ బాగా కుదిరిందని, అవసరం మేరకే సినిమాలో లవ్ స్టోరీ ఉంటుందన్నారు. అక్కినేని వారసుడిగా కాకుండా తనను తానుగా ప్రమోట్ చేసుకునేందుకే తాను ఇష్టపడతానని తెలిపారు. -
భారం అంతా అఖిల్ పైనే...సీన్ లోకి అతను ఎందుకు రావట్లేదు?
-
రొమాన్స్ లేదా అఖిల్.. ఏజెంట్ మూవీ స్పెషల్ ఇంటర్వ్యూ
-
నాని, అఖిల్ మాస్ మంత్రం ఫలిస్తుందా
-
అక్కినేని ఫ్యామిలీలో మోగనున్న పెళ్లి బాజాలు..!
గత ఏడాది అక్టోబర్‌లో నాగ చైతన్య, సమంత వీడిపోతున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి రోజు వీరి విడాకుల ఇష్యూపై సోషల్ మీడియాలో డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈ సంగతి ఇలా ఉంటే.. ఇప్పుడు నాగచైతన్యకు రెండో పెళ్లి అనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఏడాదిలోనే చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని దాని సారాంశం. చైతన్యకు, అఖిల్.. ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేసేయాలని నాగార్జున డిసైడ్ అయ్యారట. అఖిల్ కోసం అమ్మాయిని వెతికే పనిలో నాగ్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు నాగచైతన్య ఓ హీరోయిన్ తో మళ్లీ లవ్ లో పడినట్లు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం నాగ్ వరకు వెళ్లిందట. చైతూ తన లవ్‌ను కన్ ఫామ్ చేసేస్తే అఖిల్‌తో పాటు అతనికి కూడా పెళ్లి చేసేస్తాను అని నాగార్జున అంటున్నారని గాసిప్ రాయుళ్లు కథనాలు అల్లేస్తున్నారు. అయితే ఇవి కేవలం రూమర్స్ మాత్రమేననని అక్కినేని ఫ్యామిలీ సన్నిహితంగా ఉండేవారు చెప్పుకొస్తున్నారు. నాగ చైతన్య , అఖిల్ ప్రస్తుతం తమ కెరీర్స్ పై సీరియస్ గా ఫోకస్ పెట్టారని, కాబట్టి ఈ రూమర్స్ ను లైట్ తీసుకోమంటున్నారు. బంగార్రాజు తర్వాత నాగ చైతన్య థ్యాంక్యూ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక అఖిల్ ప్రస్తుతం ‘ఏజెంట్’మూవీ చేస్తున్నాడు. ఆగస్ట్‌లో ఈ చిత్రం విడుదల కాబోతుంది. -
లేట్‌గా వస్తున్న 'ఏజెంట్'.. డేట్ మారినా దూకుడు మారదు
Agent Movie Postponed Due To Corona: థియేటర్స్‌లోకి కాస్త ఆలస్యంగా రాబోతున్నాడు ‘ఏజెంట్’. అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న స్పై థ్రిల్లర్ మూవీ ‘ఏజెంట్’. ఇందులో సాక్షీ వైద్య హీరోయిన్గా కనిపించనుంది. శుక్రవారం (డిసెంబరు 24) విడుదల కావాల్సిన ఈ సినిమాను వాయిదా వేసినట్లు ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ‘‘కరోనా వల్ల మా ‘ఏజెంటు’ డేటు మారినా దర్జా మారదు. దూకుడు మారదు. ధీమా మారదు. అఖిల్ అద్భుతమైన యాక్టింగ్, సురేందర్ రెడ్డి స్టైల్ ఆఫ్ మేకింగ్‌తో ‘ఏజెంట్’ వరల్డ్ క్లాస్ స్పై థ్రిల్లర్‌గా రాబోతోంది’’ అని ట్వీట్ చేశారు అనిల్ సుంకర. ఇదిలా ఉంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌తో దసరా హీరోగా మారాడు అఖిల్. రుసగా మూడు ఫ్లాపుల తర్వాత ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో చేసిన ఈ సినిమాతో ఎట్టకేలకు హిట్టు కొట్టాడు అక్కినేని వారసుడు. అయితే 'ఏజెంట్' మూవీని 'బ్యాచ్‌లర్'ను మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ముఖ్య పాత్రలో కనిపించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. రామబ్రహ్మం సుంకర మరో నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కో– ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర, పత్తి దీపా రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి. అక్కినేని అభిమానులందరికి నమస్కారం కరోనా వలన మా ఏజెంట్ డేటు మారినా దర్జా మారదు, దూకుడు మారదు. ధీమా మారదు. #Agent will be on par with any world class spy movies with abundant Action(Akhil)and Style(Surender)We promise all the fans that we will deliver 1000% whatever u r dreaming. pic.twitter.com/jglmoXsCrI — Anil Sunkara (@AnilSunkara1) December 24, 2021 ఇదీ చదవండి: మాస్ సాంగ్‌తో 'బంగార్రాజు' షూటింగ్ పూర్తి.. నాగార్జున ట్వీట్ -
నగరంలో వరుస హత్యలు.. రావాలి ఓ గూఢచారి
నగరంలో వరుస హత్యలు జరుగుతుంటాయి... హంతకుడిని పట్టుకోవాలంటే రావాలి ఒక గూఢచారి. పిల్లలు మాయమవుతుంటారు... కిడ్నాప్ చేసిందెవరో కనిపెట్టాలంటే రావాలి ఒక గూఢచారి. ప్రపంచ వినాశనానికి ఓ గ్యాంగ్ ప్లాన్ చేస్తుంది. గ్యాంగ్‌ని పట్టుకోవడానికి రావాలి ఓ గూఢచారి. ఈ నిందితులను పట్టుకోవడానికి గూఢచారి వేసే ప్లాన్లు భలే ఆసక్తిగా ఉంటాయి. అందుకే వెండితెరపై గూఢచారి కథలకు భలే క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం ‘గూఢచారి’ పాత్ర చేస్తున్న కొందరు తారల గురించి తెలుసుకుందాం... పోలీసాఫీసర్ పాత్రలు నాగార్జునకు కొత్తేం కాదు.. ఒకప్పటి హిట్ ‘శివమణి’, రీసెంట్గా వచ్చిన ‘ఆఫీసర్’ వరకు వీలైనప్పుడల్లా నాగార్జున లాఠీ పట్టారు. కానీ కాస్త రూటు మార్చి ‘వైల్డ్‌డాగ్’లో సీక్రెట్ ఏజెంట్‌గా డ్యూటీ చేశారు నాగార్జున. మళ్లీ ‘ది ఘోస్ట్’ మిషన్ కోసం సీక్రెట్ ఏజెంట్‌గా చార్జ్ తీసుకుని ముష్కరుల వేట ప్రారంభించారు. ఈ మిషన్‌ను ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ ఘోస్ట్ మిషన్‌లోనే మరో సీక్రెట్ ఏజెంట్‌గా కనిపిస్తారు కాజల్ అగర్వాల్. ఈ సినిమా కోసం నాగార్జున, కాజల్ యాక్షన్ సీక్వెన్సెస్‌కు ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నారు. తండ్రి నాగార్జున గూఢచారి పాత్ర చేస్తుంటే మరోవైపు తనయుడు అఖిల్ కూడా ఆ పాత్ర చేస్తుండటం విశేషం. ‘ఏజెంట్’ సినిమాలో అఖిల్ గూఢచారి పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు. ఈ సినిమా కోసం అఖిల్ సిక్స్ప్యాక్లోకి మారారు. అంతేకాదు.. యాక్షన్ సీక్వెన్స్, గుర్రపు స్వారీలో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. మరోవైపు నిఖిల్ కూడా గన్ పట్టుకుని గూఢచారి అవతారం ఎత్తనున్నారు. ఈ మిషన్‌కు గ్యారీ బి హెచ్ డైరెక్టర్. వచ్చే ఏడాది ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇక కల్యాణ్ రామ్ తాజాగా మిస్టరీ మూవీ ‘డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’ సైన్ చేశారు. ఇందులో బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపించనున్నారు కల్యాణ్ రామ్. బ్రిటిష్ ఇండియా మద్రాస్ ప్రెసిడెన్సీ 1945 కాలంనాటి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రానికి నవీన్ మేడారం దర్శకుడు. ఇప్పటికే ‘గూఢచారి’ చిత్రంలో సక్సెస్ఫుల్ సీక్రెట్ ఏజెంట్‌గా మెప్పించిన అడివి శేష్ మరోసారి ఆ పాత్రలో కనిపించనున్నారు. ‘గూఢచారి’కి సీక్వెల్‌గా ‘గూఢచారి 2’ చేయనున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే ‘హిట్’కు సీక్వెల్‌గా రూపొందుతున్న ‘హిట్2’లో శేష్ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపిస్తారట. ‘హిట్’ తొలి భాగాన్ని డైరెక్ట్ చేసిన శైలేష్ కొలనుయే ‘హిట్ 2’ను కూడా డైరెక్ట్ చేయనున్నారు. వీరే కాకుండా మరికొంతమంది హీరో హీరోయిన్లు కూడా సీక్రెట్ ఏజెంట్‌గా కనిపించేందుకు సీక్రెట్‌గా కొత్త కథలు వింటున్నారు. -
ఒంటిపై మేక టాటూ.. కంప్లీట్‌గా మారిపోయిన అఖిల్ లుక్
సురేందర్ రెడ్డి డైరెక్షన్లో అఖిల్ నటిస్తున్న సినిమా ఏజెంట్. ఫుల్ యాక్షన్ మూవీగా తయారయ్యే ఈ సినిమాలో ఓ అండర్‌కవర్ ఆపరేషన్ చేసే ఏజెంట్ పాత్రలో అఖిల్ కనిపించనున్నాడు. అఖిల్ నటిస్తున్న ఈ 5వ చిత్రంలో అతడు సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. అఖిల్ లుక్కు సంబంధించి ఓ పోస్టర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఇందులో అఖిల్ లుక్ కంప్లీట్‌గా మారిపోయింది. కండలు తిరిగిన దేహంతో జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న అఖిల్ ఫోటోను రిలీజ్ చేస్తూ..'ఇది ఆరంభం మాత్రమే. ముందు ముందు ఉంది పండగ' అంటూ ఓ పోస్టర్‌ను వదిలారు. ముఖ్యంగా అఖిల్ లుక్ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తోంది. ఈ ఫోటోలో అఖిల్ బాడీపై కొమ్ములు కలిగిన మేక టాటూ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. 'ఏజెంట్ లోడింగ్. వైల్డ్ రైడ్‌కు మీరు సిద్ధంగా ఉన్నారా?' అంటూ ట్విట్టర్లో షేర్ చేశారు. ఇక ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడుతున్నట్లు లుక్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతవరకు ఎప్పుడు చూడనంతగా రఫ్ లుక్‌లో అఖిల్ కనిపించాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ ఈనెల 12 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. This is just the beginning...Meeku mundu mundu undi pandaga!!@AkhilAkkineni8 @AnilSunkara1 @MusicThaman @VamsiVakkantham@AKentsOfficial @S2C_Offl pic.twitter.com/trOj5shejN — SurenderReddy (@DirSurender) July 11, 2021 -
మాల్దీవ్స్ లో వెకేషస్ ఎంజాయ్ చేస్తున్న అఖిల్..
-
కొత్త గెటప్
‘బొమ్మరిల్లు’ భాస్కర్ సినిమాతో బిజీ బిజీగా ఉన్నారు అఖిల్. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఈ మధ్యనే ప్రారంభమైంది. అప్పుడే తదుపరి సినిమాను లైన్లో పెడుతున్నారట అఖిల్. ‘అ!, కల్కి’ చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఓ సినిమా రూపొందనుందని తెలిసింది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని టాక్. ఇందులో అఖిల్ లుక్ సరికొత్తగా, ఇప్పటివరకూ చూడని విధంగా ఉంటుందట. అందుకే ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌తో చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమాను ప్రారంభించాలనుకుంటున్నారట. -
అఖిల్ కొత్త చిత్రం ప్రారంభం
-
‘మిస్టర్ మజ్ను’ ప్రెస్‌మీట్
-
హిట్ గ్యారంటీ.. డౌట్ లేదు
‘‘మిస్టర్ మజ్ను’ సినిమా చాలా బాగా వచ్చింది. గ్యారంటీగా మంచి హిట్ అవుతుంది. అందులో ఏ మాత్రం డౌట్ లేదు. జనరల్‌గా హీరోలు.. హీరోయిన్స్‌ని బాగా చూసుకుంటారు. కానీ, అఖిల్ మాత్రం నన్ను బాగా చూసుకున్నాడు (నవ్వుతూ). సాంకేతిక నిపుణులందరూ చాలా బాగా పని చేశారు. ప్రేక్షకులు మా సినిమా చూసి, ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ అన్నారు. అఖిల్, నిధీ అగర్వాల్ జంటగా ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ మజ్ను’. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో వెంకీ అట్లూరి మాట్లాడుతూ– ‘‘తొలిప్రేమ’ సినిమా కంటే ముందే ‘మిస్టర్ మజ్ను’ కథ రాసి, నిర్మాత ‘దిల్’ రాజుగారికి వినిపించా. ‘బలమైన ఎమోషన్స్ ఉన్న కథ ఇది.. అనుభవం ఉన్న దర్శకుడైతే చక్కగా తీయగలడు. ఓ ఏడాది నాతో ట్రావెల్ చెయ్. కొంచెం అనుభవం వస్తుంది, ఆ తర్వాత చేద్దాం’ అన్నారు. ఆ ప్రయాణంలో ఉన్నప్పుడే ‘తొలిప్రేమ’ కథ రాసి, రాజుగారికి వినిపించా. బాగుంది.. ‘ఈ సినిమా తర్వాత ‘మిస్టర్ మజ్ను’ తీస్తే మంచి స్పాన్ ఉంటుంది’ అన్నారు. 2011–2012లో ఈ కథ రాశా. టైటిల్ ‘మిస్టర్ మజ్ను’ అని, సినిమా ఏఎన్ఆర్గారి వారసులతోనే చేయాలని ఫిక్స్ అయ్యా. ఈ కథకి అఖిల్ చక్కగా న్యాయం చేయగలడనే నమ్మకం కుదిరింది. తనకు కథ చెప్పగానే ఓకే అన్నాడు. ఇందులో అఖిల్‌ది ప్లేబోయ్ పాత్ర కాదు. 20నిమిషాలు నాటీ పాత్ర ఉంటుంది. ఆ తర్వాత అంతా లవ్‌స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఉంటుంది. మా సినిమా చూసి నవ్వుతారు, ఏడుస్తారు, ఆలోచిస్తారు. ‘తొలిప్రేమ’ కంటే మంచి పాటలివ్వాలని తమన్ నాకంటే బాగా కష్టపడ్డారు’’ అన్నారు. అఖిల్ మాట్లాడుతూ– ‘‘నేను ఇలాంటి సినిమా చేసినందుకు నాన్నగారు (నాగార్జున) చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా మా ఫ్యామిలీకి తగ్గ జోనర్. మంచి ప్రొడక్ట్ ఇస్తున్నామనే నమ్మకంతో ప్రతిరోజూ షూటింగ్‌కి ఎంతో ఉత్సాహంగా వెళ్లేవాణ్ని’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన ప్రసాద్ సార్‌కి, వెంకీకి థ్యాంక్స్. అఖిల్ మంచి సహనటుడు. ఈ చిత్రంలోని పాత్రకు బాగా కనెక్ట్ అయ్యి చేశా’’ అన్నారు నిధీ అగర్వాల్. -
‘మజ్ను’ ఈవెంట్‌కు ఎన్టీఆర్..!
‘అఖిల్’ సినిమాతో ఘోర పరాజయాన్ని చవిచూడగా.. హలో సినిమాతో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు అక్కినేని యువ హీరో అఖిల్. ఈసారి మాత్రం బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేందుకు ఈ యంగ్ హీరో రెడీ అవుతున్నాడు. ఓ డిఫరెంట్ లవ్‌స్టోరితో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ‘మిస్టర్ మజ్ను’ టీజర్, సాంగ్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. జనవరి 19న సాయంత్రం ఆరుగంటలకు హైదరాబాద్‌లో జరుగనున్న ఈ ఈవెంట్‌కు ఎన్టీఆర్ హాజరుకాబోతున్నారని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. తొలిప్రేమతో మంచి హిట్‌ను అందుకున్న వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. See you soon ! Thanks to my brother @tarak9999 for extending his support. Excited to share the stage with you :))) #MrMajnurprereleaseon19th #MrMajnu pic.twitter.com/ySIN37qNPm — Akhil Akkineni (@AkhilAkkineni8) January 17, 2019 -
‘హలో’ కోలీవుడ్..!
అక్కినేని వారసుడు అఖిల్‌కు కాలం కలిసిరావడం లేదు. ‘అఖిల్’ సినిమాతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇద్దామనుకుంటే.. అది కాస్తా బెడిసికొట్టింది. రెండో సినిమాకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుని.. ‘హలో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తే.. అందరినీ ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఆచితూచి చేస్తున్న మూడో చిత్రం ‘మిస్టర్. మజ్ను’తోనైనా సక్సెస్ కొట్టాలని అఖిల్ ఆశపడుతున్నాడు. అయితే ఇప్పడు ‘హలో’ సినిమాకు సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాను డబ్చేసి తమిళనాట రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. మరి ఇక్కడే మెప్పించలేకపోయిన సినిమా అక్కడ ఎలాంటి మ్యాజిక్ చేయనుందో చూడాలి. -
రెండు గంటల్లోనే ఫోన్ డెలివరీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మల్టీబ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ ‘బిగ్ సి’ కొత్త సేవలకు శ్రీకారం చుడుతోంది. వెబ్ లేదా ఫోన్ కాల్ ద్వారా మొబైల్ ఫోన్ కావాలని ఆర్డరిస్తే... రెండు గంటల్లోపు ఫ్రీ డెలివరీ చేస్తారు. తమకు ప్రస్తుతం స్టోర్లున్న అన్ని ప్రాంతాల్లో ఈ సేవలను నెల రోజుల్లోగా ప్రారంభిస్తామని ‘బిగ్ సి’ ఫౌండర్ ఎం.బాలు చౌదరి చెప్పారు. బుధవారమిక్కడ కంపెనీ డైరెక్టర్లు స్వప్న కుమార్, బాలాజీ రెడ్డి, గౌతమ్ రెడ్డి, కైలాష్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వినియోగదారుడు కోరితే ఇంటి వద్దే మొబైల్ డెమో సైతం ఇస్తామని, దీనికి అదనపు చార్జీలేవీ వసూలు చేయబోమని స్పష్టంచేశారు. మొబైల్స్ రిటైల్ రంగంలో భారత్‌లో తొలిసారిగా తాము ఈ సర్వీసులను ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. త్వరలో ఇతర దక్షిణాది రాష్ట్రాలకు.. బిగ్ సి 200వ ఔట్‌లెట్‌ను సినీ నటుడు అఖిల్ అక్కినేని ప్రారంభించారు. అలాగే బుధవారం మరో ఆరు స్టోర్లను సైతం కంపెనీ తెరిచింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సంస్థ ఔట్లెట్ల సంఖ్య 206కు చేరింది. హైదరాబాద్‌లోనే 60 కేంద్రాలున్నాయని బాలు చౌదరి ఈ సందర్భంగా చెప్పారు. ‘జూలైకల్లా భాగ్యనగరిలో కొత్తగా మరో 40 స్టోర్లు వస్తాయి. ఈ ఏడాదే కర్ణాటక, తమిళనాడు, కేరళలో అడుగుపెడుతున్నాం. వీటిలో ప్రతి రాష్ట్రంలో ఏడాదిన్నరలో 100 కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. మొత్తంగా 2019 మార్చి నాటికి బిగ్ సి ఔట్లెట్ల సంఖ్య 350 దాటుతుంది. కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్‌కు తొలి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఏడాది కాలంలో అన్ని స్టోర్లను అప్‌గ్రేడ్ చేశాం’ అని వివరించారు. 50 శాతం వాటా లక్ష్యం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆఫ్‌లైన్‌లో ప్రస్తుతం నెలకు 7.5 లక్షల వరకూ మొబైల్ ఫోన్లు అమ్ముడవుతున్నాయని, దీన్లో తమ వాటా 33 శాతమని ఈ సందర్భంగా బాలు చౌదరి చెప్పారు. ‘‘ఏడాదిలో ఈ వాటాను 50 శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మా దగ్గర కొంటున్న వారిలో 80 శాతం మంది అంతకు ముందు కొన్నవారే ఉంటున్నారు. 2017–18లో కంపెనీ రూ.1,000 కోట్లకుపైగా టర్నోవర్‌ను నమోదు చేసింది. ఈ ఏడాది రూ.2,000 కోట్లు దాటుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సంస్థ ఔట్లెట్లలో మొత్తం 2,500 మంది ఉద్యోగులున్నారు. ఒక్కో కేంద్రం ద్వారా కొత్తగా 12– 15 మందికి ఉపాధి లభిస్తోందని బాలు చౌదరి తెలియజేశారు. -
సైకిల్ చైన్‌తో కొట్టినా సరే!
‘హలో’ తర్వాత అఖిల్ తదుపరి సినిమా ఏంటి? అనే క్యూరియాసిటీతో ఉండగానే ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరితో మూవీకి క్లాప్ కొట్టారు అఖిల్. ఆ సినిమా అఫీషియల్‌గా సెట్స్ మీదకు వెళ్లకముందే మరో సినిమా అనౌన్స్ చేశారు. కానీ ఇది అనౌన్స్ చేసింది అఖిల్ కాదు ఆర్జీవీ (రామ్ గోపాల్ వర్మ). ట్వీటర్ అకౌంట్ ద్వారా అఖిల్‌తో తన తదుపరి సినిమా ఉంటుందని పేర్కొన్నారు ఆర్జీవీ. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ– ‘‘జీవితంలో ఈ సర్కిల్ భలే గమ్మత్తుగా ఉంది. దర్శకుడిగా నా తొలి సినిమా ‘శివ’ను నాగార్జున నటించి, నిర్మించారు. 25ఏళ్ల తర్వాత నాగార్జునతో ‘ఆఫీసర్’ సినిమాను స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నాను. ఇప్పుడు అఖిల్‌ని డైరెక్ట్ చేయబోయే సినిమాను నాగార్జున నిర్మించబోతున్నారు. ‘మీరు (నాగ్ని ఉద్దేశించి) నన్ను సైకిల్ చైన్‌తో కొట్టినా సరే.. నేనో విషయం నిజాయితీగా చెప్పదలుచుకున్నాను. మీరు ‘శివ’ సినిమా చేస్తున్నప్పుడు మీకున్న స్టైల్, యాటిట్యూడ్, వాయిస్ కంటే అఖిల్ అన్నింట్లో బెటర్‌గా ఉన్నాడు. అఖిల్‌తో నేను చేయబోయే సినిమా యంగ్ క్యూట్ లవ్‌స్టోరీ కాదు.. ఇంటెన్స్‌తో కూడిన రియలిస్టిక్ యాక్షన్ మూవీ’’ అని పేర్కొన్నారు ఆర్జీవీ. -
ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది
గత రెండు చిత్రాలు నిరాశపరచటంతో అక్కినేని హీరో అఖిల్ ఈసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. ఈ క్రమంలో మూడో చిత్రం ఏమై ఉంటుందా? అన్న సస్పెన్స్ గత కొన్ని రోజులుగా నెలకొంది. అయితే ఉగాది సందర్భంగా ఆ సస్పెన్స్‌ను రివీల్ చేస్తూ ఓ క్లారిటీ ఇచ్చేశాడు.తన డెబ్యూ చిత్రం తొలిప్రేమతో బిగ్ హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరితో మూడో ప్రాజెక్టు అన్న విషయాన్ని అఖిల్ చెప్పేశాడు. తొలిప్రేమ చిత్రాన్ని నిర్మించిన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర.. అఖిల్-వెంకీ చిత్రాన్నీ నిర్మించబోతోంది. నటీనటులు, పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తామని నిర్మాణ సంస్థ తన ట్వీట్లో తెలియజేసింది. Here's a special #Ugadi surprise to all the movie lovers. After super successful #TholiPrema, teaming up with @dirvenky_atluri yet again for another wonderful project with @AkhilAkkineni8. Keep watching the space for more details.#Akhil3 #SVCC https://t.co/hERrqfJPNN — SVCC (@SVCCofficial) 18 March 2018 -
నా మనసు దోచేశావ్ అని మెసేజ్ చేసింది
‘‘ మాస్, క్లాస్ అని కాదు. కథ బాగుండాలి. నాకు నచ్చాలి. స్క్రిప్ట్‌లోని నా క్యారెక్టర్ ప్రేక్షకులు మెచ్చుకుంటారని నాకు అనిపిస్తే తప్పకుండా సినిమా చేస్తాను. మంచి సినిమాలో భాగం కావడానికి ఎప్పుడూ రెడీగానే ఉంటా. ముందు మాస్, ఆ తర్వాత క్లాస్, మళ్లీ మాస్... ఇలా లెక్కలు వేసుకుని సినిమాలు చేయాలన్న మైండ్‌సెట్ ప్రజెంట్ నాకు లేదు. నేనేం మిస్టేక్ చేశానో తెలుసుకోవడానికి నా ఫస్ట్ మూవీ ‘అఖిల్’ని 30 సార్లు చూశా’’ అన్నారు అఖిల్. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో అఖిల్, కల్యాణి ప్రియదర్శన్ జంటగా అక్కినేని నాగార్జున నిర్మించిన చిత్రం ‘హలో’. ఈ నెల 22న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల స్పందన బాగుందని చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయులు సమావేశంలో హీరో అఖిల్ చెప్పిన విశేషాలు... ► యాక్టర్‌గా ఇంప్రూవ్ అయ్యానని నాతోటి యాక్టర్స్ అన్నారు. ‘సెటిల్డ్ ఫెర్మార్మెన్స్’ అని చిరంజీవిగారు అన్నారు. చిరంజీవిగారు నా లక్కీ చార్మ్. ఆయన ఒక ఫాదర్‌లా గైడ్ చేస్తారు. చరణ్‌తో కూడా నేను క్లోజ్‌గా ఉంటాను. నన్నే కాదు యాక్టర్స్ అందర్నీ చిరంజీవిగారు ప్రోత్సహిస్తారు. ఆయనకు సినిమాల మీద ఉన్న ప్యాషన్ అలాంటిది. డైరెక్టర్ ప్రియదర్శన్‌గారు నాన్నగారికి ఫోన్ చేసి అభినందిచారు. ► నాన్నగారు చాలా స్ట్రాంగ్ ప్రొడ్యూసర్. ఈ సినిమాకి ఫాదర్ ఆయన. రామ్‌గోపాల్ వర్మ సినిమా షూటింగ్ షెడ్యూల్‌ని క్యాన్సిల్ చేసి మరీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చూసుకున్నారు నాన్నగారు. అలాంటి ప్రొడ్యూసర్ దొరకడం నాకు లక్కీ. టెన్షన్ అంతా నాన్నగారే తీసుకున్నారు. నాన్నగారు ‘హలో’ సినిమాను 20 సార్లు చూశారు. దాంతో నాన్నగారికి సినిమాపై జడ్జ్మెంట్ పోయింది. ఫస్ట్‌టైమ్ ఎడిట్ రూమ్‌లో సెకండాఫ్, క్లైమాక్స్ చూసి హ్యాపీ ఫీలయ్యారు. యాక్టర్‌గా ఇంప్రూవ్ అయ్యావని నాన్నగారు మెచ్చుకున్నారు. హ్యాపీగా అనిపించింది. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ సాయంతోనే పాట పాడగలిగాను. ‘అఖిల్’ సినిమాను నాన్నగారు సెలక్ట్ చేయలేదు. నేనే ఎంచుకున్నాను. ► సినిమా స్టార్ట్ చేసినప్పుడే సీజీ వర్క్ ఎక్కువగా వద్దనుకున్నాం. యాక్షన్ సీక్వెన్స్ బాగా రావడానికి నేను ఒక్కడినే కారణం కాదు. 15 మెంబర్స్ టీమ్ వర్క్ ఉంది. అయితే ట్రైనింగ్ కోసం కష్టపడ్డాను. సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నాం. విక్రమ్‌గారు బాగా తీశారు. రమ్యకృష్ణగారితో నటించడం హ్యాపీగా ఫీలవుతున్నాను. హీరోయిన్ కల్యాణీ బాగా చేసింది. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నేను ఇన్వాల్వ్ కాలేదు. కానీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌లో కొంచెం ఇన్వాల్వ్ అయ్యాను. ► క్లైమాక్స్ సీన్‌కు సంబంధించి ఒక అమ్మాయి ‘యు స్టోల్ మై హార్ట్’ అని మేసేజ్ చేసింది. అదే బెస్ట్ కాంప్లిమెంట్‌గా ఫీల్ అవుతున్నాను. స్క్రిప్ట్ పరంగా డ్యాన్స్‌కు పెద్ద స్కోప్ లేదు. కథను నమ్మాను. సో.. సినిమాలో చైల్డ్ ఎపిసోడ్ లెంగ్త్ ఎక్కువ అనిపించలేదు. శ్రీను (అఖిల్ పాత్ర పేరు), జున్ను (కల్యాణి పాత్ర పేరు) చిన్నప్పటి క్యారెక్టర్లు చేసిన పిల్లలు బాగా నటించారు. ► జనరల్‌గా నాకు టెన్షన్ ఎక్కువ. ఈ సినిమా రిలీజ్‌కు ముందు అసలు నిద్రపోలేదు. మార్నింగ్ 8 వరకూ వెయిట్ చేసి యూఎస్ ఫస్ట్ రివ్యూ విన్న తర్వాత ఆనందపడ్డాను. ఆ తర్వాత హాయిగా నిద్రపోయాను. సినిమా రివ్యూల్లో 3రేటింగ్ ఇచ్చారు. హ్యాపీ ఫీలయ్యాను. హిట్ సాధించాను. కలెక్షన్స్ గురించి మాట్లాడటంలేదు. ఒక మంచి సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. బాక్సాఫీస్ వద్ద సోలోగా వస్తే బాగుండు అనిపించింది. కానీ రెండు సినిమాలను తీసుకోగల మార్కెట్ తెలుగు ఇండస్ట్రీలో వచ్చిందనుకుంటున్నాను. ► ఈ సినిమా చేస్తున్నప్పుడు యాక్టింగ్ వైజ్‌గానే కాదు. ఫిల్మ్ మేకింగ్ పరంగా కొత్త విషయాలను నేర్చుకున్నాను. మా నాన్నగారు, పీఎస్ వినోద్, కె.విక్రమ్‌కుమార్ లాంటి డెడికేషన్ ఉన్నవారితో వర్క్ చేసాను. ఆ అనుభవం నాకు హెల్ప్ అవుతుంది. ► ఈ సినిమా సక్సెస్ తర్వాత గ్యాప్ తీసుకోవాలనుకోవ డం లేదు. హాలిడేస్ వద్దు. జనవరిలో కొత్త సినిమాను అనౌన్స్ చేసి, ఫిబ్రవరిలో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలనుకుంటున్నాను. నా నెక్ట్స్ సినిమా ఇంకా ఫిక్స్ కాలేదు. జనవరి 10లోపు అనౌన్స్ చేయాలనుకుంటున్నాను. డైరెక్టర్ వంశీ పైడిపల్లిని కలిశాను. కొరటాల శివగారితో లంచ్ చేశాను. ఇలా కలిసిన అందరి డైరెక్టర్స్‌తో సినిమాలు చేయలేం. సుకుమార్‌గారితో చేయాలని ఉంది. కథ కుదరాలి. బాలీవుడ్లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో చేయాలని ఉంది. హిందీ, తెలుగు భాషల్లో బైలింగువల్ చేయాలనే ఆలోచన ఉంది. తెలుగు ఇండస్ట్రీనే నాకు ముఖ్యం. క్రికెట్ నాకు ఓన్లీ స్ట్రెస్ బస్టర్ మాత్రమే. న్యూ ఇయర్ అన్నయ్య(నాగచైతన్య), వదినలతో(సమంత)సెలబ్రేట్ చేసుకుంటా. -
హలో టీజర్ వచ్చేసింది
సాక్షి, సినిమా : అక్కినేని యంగ్ హీరో అఖిల్ కొత్త సినిమా హలో టీజర్ కాసేపటి క్రితం విడుదలైంది. మనం ఫేమ్ విక్రమ్ కే కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక టీజర్ విషయానికొస్తే.. మొత్తం యాక్షన్ సన్నివేశాలతో నింపేశారు. చిన్నతనంలో విడిపోయిన ఇద్దరు స్నేహితులు.. పెద్దయ్యాక ఆ అమ్మాయిని వెత్కుకుంటూ అన్వేషణ కొనసాగించే యువకుడి పాత్రలో అఖిల్ కనిపించబోతున్నాడని హింట్ ఇచ్చేశారు. టీజర్‌కు తగ్గట్లు అనూప్ రూబెన్స్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. ఇక చివర్లో అఖిల్ హల్లో అని చెప్పే సింగిల్ డైలాగ్ మాత్రమే ఉంది. జగపతి బాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్గా నటిస్తోంది. డిసెంబర్ 22న హలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. -
హలో టీజర్ వచ్చేసింది
-
హలో... అప్పుడు రావడం పక్కా!
ఏడు నెలల క్రితం ఎంతో ఎగై్జటింగ్‌గా అఖిల్ ‘హలో... కొత్త సినిమా స్టార్ట్ చేశా గురూ’ అన్నారు. ఏడు నెలల తర్వాత ఇప్పుడూ అంతే ఎగై్జటింగ్‌గా ‘హలో.. లాస్ట్ షెడ్యూల్లోకి ఎంటరయ్యా’ అంటున్నారు. సినిమా స్టార్ట్ అయినప్పుడు ఎంత ఎగై్జటెడ్‌గా ఉన్నారో... ఎండింగ్‌కి వచ్చేసరికి అంతే ఎగై్జటెడ్‌గా ఉన్నారు అఖిల్. దాన్ని బట్టి షూటింగ్‌ని ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ఊహించవచ్చు. అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘హలో’ చివరి షెడ్యూల్ జరుగుతోంది. ముందుగా ప్రకటించినట్లుగానే డిసెంబర్ 22న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అఖిల్ తలకిందులుగా ఉన్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత గాల్లో ఎగురుతున్నట్లు ఉన్న సెకండ్ స్టిల్ కూడా సూపర్ అనిపించుకుంది. హిట్ కాంబినేషన్ కావడంతో సినిమాపై మంచి అంచనాలు పెరిగాయి. అక్కినేని కుటుంబానికి కలిసొచ్చిన నెల డిసెంబర్. నాగార్జున నటించిన పలు చిత్రాలు ఈ నెలలోనే విడుదలై, మంచి హిట్టయ్యాయి. ఆ సెంటిమెంట్‌ని బట్టి చూస్తే.. ‘హలో’ కూడా హిట్టే అని ఫిక్సయ్యారు అక్కినేని అభిమానులు. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కూతురు కల్యాణి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. ‘‘ముందు చెప్పినట్లే డిసెంబర్ 22న సినిమా విడుదలవుతుంది. త్వరలో మరిన్ని ఆసక్తికర విషయాలు చెబుతా’’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు అఖిల్. -
'హలో' అంటున్న మరో భామ..!
అఖిల్ సినిమాతో నిరాశపరిచిన అక్కినేని నటవారసుడు అఖిల్ రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమాతో కళ్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్ గా పరిచయం అవుతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా కనిపించనుందట. ఈ శుక్రవారం రిలీజ్ కు రెడీ అవుతున్న మగలిర్ మట్టుమ్ సినిమాలో కీలక పాత్రలో నటించిన నివేదితా సతీష్, అఖిల్ హాలోలో మరో హీరోయిన్ గా నటిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నివేదిత షూటింగ్ లో కూడా పాల్గొంటుందన్న టాక్ వినిపిస్తోంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నాడు. -
హలో... న్యూస్టిల్ ఇదిగో!
అఖిల్ హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ మనం ఎంటర్ప్రైజెస్ సమర్పణలో అక్కినేని నాగార్జున నిర్మి స్తున్న సినిమాకు ‘హలో’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు నిన్న సాయంత్రం ప్రకటించారు. టైటిల్‌తో పాటు మీరు చూస్తున్న కొత్త స్టిల్‌ను విడుదల చేశారు. ఈ సినిమా టైటిల్ ‘హలో’ అయ్యుంటుందని సోమవారమే ‘హలో... టైటిల్ ఇదే!?’ పేరుతో ‘సాక్షి’ వార్తను ప్రచురించింది. -
హలో... టైటిల్ ఇదే!?
హలో... హలో... హలో... అక్కినేని అభిమానుల్లో ఇప్పుడీ సౌండ్ ఎకోలో వినిపిస్తోంది. ఎందుకంటే... అఖిల్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న సినిమా టైటిల్ ‘హలో’ అట! నేడు ఈ సిన్మా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే... రెండు రోజుల క్రితం ‘నిర్ణయం’లోని ‘హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం...’ పాటను ట్వీట్ చేసిన నాగార్జున... ‘‘ఇందులో అఖిల్ సినిమా టైటిల్ ఉంది. కనుక్కోండి’’ అన్నారు. ఆదివారం నాగచైతన్య ‘ఏ మాయ చేసావె’లో ‘ఈ హృదయం’ పాట ర్యాప్‌ను పోస్ట్ చేసి సెకండ్ క్లూ ఇచ్చారు. రెండిటిలోనూ కామన్‌గా ఉన్నది ‘హలో’ అనే పదం ఒక్కటే. సో, అదే అఖిల్ సినిమా టైటిల్ అయ్యుంటుందని అక్కినేని అభిమానులు, ప్రేక్షకులు ఫిక్సయ్యారు. వాళ్ల అంచనా నిజమో? కాదో? ఈ రోజు తెలుస్తుంది. -
అఖిల్ కొత్త సినిమా స్టిల్స్ లీక్
సాక్షి, హైదరాబాద్: అక్కినేని అఖిల్ తన తొలి చిత్రం నిరాశ పరచడంతో సుదీర్ఘ విరామం తీసుకున్నారు. ఈ నిరీక్షణకు తెరదించుతూ తన ద్వితీయ చిత్రానికి గత ఏప్రిల్‌లో శ్రీకారం చుట్టారు అక్కినేని అఖిల్. 'మనం' ఫేం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం శర వేగంగా తెరకెక్కుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్ప్రైజెస్ పతాకాలపై నాగార్జున నిర్మిస్తున్నారు. ఇందులో కళ్యాణి ప్రియదర్శిని కధాయికగా నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం ఫిల్మ్ ఛాంబర్లో 'ఎక్కడ ఎక్కడ ఎక్కడ వుందో తారక' అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన స్టిల్స్ లీక్ అయింది. దీనిపై అఖిల్ తండ్రి, కింగ్ నాగార్జున స్పందించారు. లీక్ అయిన ఫొటో కంటే అందమైన, మెరుగైన ఫొటోలు చాలా ఉన్నాయని అన్నారు. ఈనెల 21న వీటికి సంబంధించిన స్టిల్స్‌ను విడుదల చేయబోతున్నట్లు నాగార్జున ప్రకటించారు. అవి ఎలా ఉండబోతున్నాయనే తెలపడానికి శనివారం ఓ క్లూ ఇస్తానని సోషల్ మీడియా ట్విట్టర్లో తెలిపారు. డిసెంబర్ 22న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. So what if it's already leaked? -
అఖిల్ కోసం కలర్‌ఫుల్ టైటిల్..!
తొలి సినిమాతో నిరాశపరిచిన అక్కినేని నట వారసుడు అఖిల్, తన రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. లాంగ్ గ్యాప్ తరువాత మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టిన సిసింధ్రీ సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేస్తున్నాడు. ఇంకా హీరోయిన్ ఫైనల్ కాకపోయినా అఖిల్ పార్ట్ ను మాత్రం శరవేగంగా పూర్తి చేస్తున్నారు. అక్కినేని నాగార్జున ఈ సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. ఈ సారి ఎలాగైన అఖిల్ కు బిగ్ హిట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు నాగ్. కొద్ది రోజుల క్రితం ఈ సినిమాకు జున్ను అనే టైటిల్ ను నిర్ణయించారన్న ప్రచారం జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ టైటిల్ రిజిస్టర్ అవ్వటంతో అది అఖిల్ సినిమా కోసమే అని ఫిక్స్ అయ్యారు. తాజాగా అదే బ్యానర్ రంగుల రాట్నం అనే టైటిల్ ను రిజిస్టర్ చేశారట. దీంతో అఖిల్ సినిమా టైటిల్ ఇదే అంటూ కొత్త టాక్ మొదలైంది. ఇంత వరకు అధికారిక ప్రకటన లేకపోయినా.. అఖిల్ కొత్త సినిమా వార్తల్లో గట్టిగానే వినిపిస్తుంది. అఖిల్ సినిమా నిర్మాణ బాధ్యతలు చూసుకుంటునే రాజుగారి గది 2 సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు నాగ్. -
కల్యాణితో జోడీ కుదిరిందా?
అఖిల్ సినిమాలో హీరోయిన్ ఎవరు? గత కొన్నాళ్లుగా జరుగుతోన్న చర్చ ఇది. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఈ చిత్రం షూటింగ్ ఆరంభమైంది. అయితే కథానాయికను ఫైనలైజ్ చేయలేదు. దాంతో ఈ అక్కినేని యువ హీరో సరసన ఎవరు నటిస్తారు? అనే చర్చల్లో పలువురి కథానాయికల పేర్లు వినిపించాయి. తాజాగా, దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కల్యాణి పేరు వినిపిస్తోంది. మలయాళం, తమిళ్, హిందీ చిత్రాలతో పాటు నాగార్జునతో తెలుగులో ‘నిర్ణయం’ చిత్రం తెరకెక్కించారు ప్రియదర్శన్. తండ్రి బాటలో కల్యాణి డైరెక్టర్ కావాలనుకున్నారని తెలుస్తోంది. విక్రమ్ హీరోగా రూపొందిన ‘ఇంకొక్కడు’ సినిమాకు ఆమె అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. సో.. కల్యాణి డైరెక్టర్ కావడం ఖాయం అనుకుంటున్న టైమ్‌లో ఆమె కథానాయికగా చేయనుందనే వార్త వచ్చింది. మరి.. అఖిల్ సరసన కథానాయికగా నటించబోయేది కల్యాణియేనా? వెయిట్ అండ్ సీ. -
హలో గురూ ప్రేమ కోసమే
జున్ను లేదు... బన్ను లేదు... అఖిల్ రెండో సినిమాకు ‘హలో గురూ ప్రేమ కోసమే’ టైటిల్‌ను ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసినట్లేనని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జనాలు చెప్పుకుంటున్నారు. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా అక్కినేని నాగార్జున ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ లవ్ అండ్ యాక్షన్ బేస్డ్ ఎంటర్టైనర్కు ‘జున్ను’తో పాటు పలు టైటిల్స్ వినిపించాయి. చివరకు, అఖిల్ తల్లిదండ్రులు నాగార్జున, అమల జంటగా నటించిన ‘నిర్ణయం’లో సూపర్ హిట్ సాంగ్ ‘హలో గురూ ప్రేమ కోసమే..’లో పల్లవినే టైటిల్‌గా కన్ఫర్మ్ చేశారట! త్వరలో ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ మొదలు కానుంది. అందులో రొమాంటిక్ సీన్స్ తీస్తారట. ఫస్ట్ షెడ్యూల్లో హీరోపై ఫైట్స్ తీశారు. ఇందులో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఎనౌన్స్ చేయలేదు. -
నాగ్, అమల ప్రేమపెళ్లికి 25 ఏళ్లు...
హైదరాబాద్ : నవ మన్మధుడు అక్కినేని నాగార్జున, అమల తమ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. వీరిద్దరి వివాహం జరిగి పాతిక సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నాగార్జున ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని షేర్ చేశారు. నాగార్జున తన పెళ్లి ఫోటోని షేర్ చేస్తూ ‘నేటితో 25 ఏళ్ళు పూర్తైంది. ఈ కపుల్ కి యానివర్సరీ విషెస్ తెలపండి’ అంటూ కామెంట్ పెట్టారు. అలాగే అమలతో పాటు, తమపై ప్రేమ, అభిమానం చూపిన అందరికి కృతజ్ఞతలు అని నాగ్ తెలిపారు. 1992లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు అక్కినేని అఖిల్ కూడా అమ్మా,నాన్నలతో కలిసి ఉన్న ఓ ఫోటోను షేర్ చేశాడు. కాగా ప్రస్తుతం నాగ్... రాజుగారి గది-2లో నటిస్తున్నారు. ఇక పెళ్లి తర్వాత చాలాఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్న అమల... శేఖర్ కమ్మల దర్శకత్వం వహించిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. మలయాళ చిత్రం ‘కేరాఫ్ సైరాభాను’లో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. -
యువ నటుడితో శ్రియా భూపాల్ వీకెండ్ పార్టీ
శ్రియా భూపాల్ ఈ పేరు గుర్తుండే ఉంటుంది కదా. జీవీకే కుటుంబానికి చెందిన ఆమె...అక్కినేని కుటుంబంలో కోడలుగా అడుగుపెట్టబోయి... జస్ట్ మిస్ అయిన విషయం తెలిసిందే. అఖిల్, శ్రియా భూపాల్‌లకు నిశ్చితార్థం కూడా జరిగి చివరి నిమిషంలో వారిద్దరి పెళ్లి రద్దు అయిన వార్త గతంలో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. తాజాగా శ్రియా భూపాల్ పేరు సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంది. టాలీవుడ్ హీరో అల్లు శిరీష్‌తో కలిసి శ్రియా భూపాల్ రెడ్డి వీకెండ్ పార్టీలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు కెమెరా కంటికి చిక్కాయి. వీరిద్దరూ పార్టీని ఎంజాయ్ చేస్తూ, డ్యాన్స్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా ‘తన బెస్ట్ ఫ్రెండ్ శరత్ రెడ్డి, బేబీ సిస్టర్ శ్రియాతో పార్టీ’ లో ఉన్నానని, ఈ సందర్భంగా తీసిన ఓ ఫొటోను అల్లు శిరీష్ పోస్ట్ చేశాడు. చిరంజీవితో పాటు,అల్లు అరవింద్ కుటుంబానికి జీవీకే ఫ్యామిలీకి మంచి సాన్నిహిత్యమే ఉంది. వీరి ఇళ్లలో జరిగే అన్ని శుభకార్యాల్లో అందరూ హాజరు అవుతూ ఉంటారు. అంతేకాకుండా రామ్‌చరణ్ భార్య ఉపాసన కూడా శ్రియా భూపాల్ ఎంగేజ్మెంట్ సమయంలో చాలా క్లోజ్‌గా మూవ్ అయిన విషయం విదితమే. కాగా అఖిల్‌తో పెళ్లి రద్దు అనంతరం శ్రియా కుటుంబం ...విదేశాలకు వెళ్లింది. అక్కడే ఓ ఎన్నారైతో ఆమె వివాహం నిశ్చయం అయినట్లు వార్తలు వచ్చాయి. త్వరలో ఎన్నారైతో శ్రియా భూపాల్ మూడుముళ్లు వేయించుకోనుందట. -
అఖిల్... ఫస్ట్ మెట్రోప్యాసింజర్!
నిజమే... తెలుగు సినిమా హీరోల్లో హైదరాబాద్ మెట్రో ట్రైన్ ఎక్కిన ఫస్ట్ పర్సన్ అక్కినేని అఖిలే. అదేంటి? ఇంకా మెట్రో స్టార్ట్ కాలేదు కదా అనే ఆలోచన ఈ పాటికే మీ మైండ్‌లో మొదలై ఉంటుంది. నిజమే కానీ, కొన్ని చోట్ల మెట్రో వర్క్స్ పూర్తయ్యాయి. పట్టాల మీదకు ట్రైన్ ఎక్కేసింది కూడా. అంటే... ట్రయల్ రన్ కోసం నడిపారులెండి. అసలు రన్ ఇంకా మొదలు కాకముందే అఖిల్ ఎలా ట్రైన్ ఎక్కాడనుకుంటున్నారా? హైదరాబాద్ మెట్రో మేనేజ్మెంట్ దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకుని కొత్త సినిమా షూటింగ్ చేశాడు అఖిల్. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం మెట్రోలో యాక్షన్ సీక్వెన్స్ అండ్ చేజ్ తీశారు. ‘టెర్మినేటర్–2, ట్రిపుల్ ఎక్స్: జాండర్ కేజ్, కెప్టెన్ అమెరికా: ద వింటర్ సోల్జర్’ తదితర హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన స్టంట్ మాస్టర్ బాబ్ బ్రౌన్ ఈ యాక్షన్ సీక్వెన్స్ తీయడం ఈ సినిమా స్పెషాలిటీ. బల్గేరియన్ కెమేరామెన్ (స్టడీకామ్) నిక్కి ఈ సినిమాకు పని చేయడం మరో స్పెషాల్టీ. -
అఖిల్ అదే తప్పు చేస్తున్నాడా..?
అక్కినేని నటవారసుడిగా భారీ అంచనాల మధ్య వెండితెరకు పరిచయం అయిన హీరో అఖిల్. తొలి సినిమాతోనే మాస్ హీరో ఇమేజ్ కోసం ప్రయత్నించిన అఖిల్ అభిమానులను నిరాశపరిచాడు. చాక్లెట్ బాయ్‌ల కనిపించే అక్కినేని అందగాడు, భారీ యాక్షన్ సీన్లు, చేజ్లు చేయటంతో అభిమానులు కనెక్ట్ కాలేకపోయారు. దీంతో అఖిల్ తొలి ప్రయత్నం డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అయితే రెండో సినిమా విషయంలో కూడా అదే తప్పు చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ తన రెండో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించిన అఖిల్, భారీ యాక్షన్ సీన్స్‌కు రెడీ అవుతున్నాడట. అందుకోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్లను తీసుకువస్తున్నారు. ఈ సినిమాతో అయినా అఖిల్, తండ్రి బాటలో మన్మథుడి ఇమేజ్ కంటిన్యూ చేస్తాడనుకుంటే మరోసారి యాక్షన్ హీరో అయ్యే ప్రయత్నాల్లో ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ ప్రయత్నం ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. నాగార్జున స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా అఖిల్ కెరీర్‌కు శివ లాంటి బ్రేక్ ఇస్తుందని యూనిట్ గట్టిగా నమ్ముతోంది. -
ట్రెండ్ సెట్టర్ అవుతుంది – నాగార్జున
అక్కినేని అఖిల్ హీరోగా నటించబోయే రెండో సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందా? అని ఎదురు చూస్తున్న అక్కినేని అభిమానుల నిరీక్షణకు ఫుల్స్టాప్ పడింది. అఖిల్ హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న సినిమా ఆదివారం సాయంత్రం 6 గంటల 17 నిమిషాలకు పూజా కార్యక్రమాలతో అక్కినేని కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కెమేరా స్విచ్ఛాన్ చేయగా, ఏయన్నార్ ముని మనవరాళ్లు సత్య, సాగరి క్లాప్ ఇచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజస్ సంస్థలపై రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ నేటి నుంచి మొదలవుతుంది. ‘‘మనం’ టెక్నికల్ టీమ్ వర్క్ చేస్తున్న ఈ సినిమా తప్పకుండా ఒక ట్రెండ్ సెట్టర్ అవుతుంది’’ అన్నారు నాగర్జున. ‘‘డిఫరెంట్ కమర్షియల్ సినిమా ఇది. క్లాసిక్ హిట్ ‘మనం’ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో మళ్లీ ఓ మంచి సినిమా చేస్తుండడం హ్యాపీగా ఉంది’’ అన్నారు విక్రమ్ కుమార్. యార్లగడ్డ సురేంద్ర, అమల, సుప్రియ, సుమంత్, నాగచైతన్య, సుశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, ఆర్ట్: రాజీవన్, కెమేరా: పి.ఎస్. వినోద్, సంగీతం: అనూప్ రూబెన్స్. -
అఖిల్ ఇంట్రస్టింగ్ ట్వీట్ : 'వీడెవడు'
సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉండే అక్కినేని నటవారసుడు అఖిల్, మంగళవారం ఉదయం ఇంట్రస్టింగ్ ట్వీట్ చేశాడు. ఓ మూవీ పోస్టర్‌ను తన ట్విట్టర్ పేజ్‌లో పోస్ట్ చేసిన అఖిల్, ఆ హీరో ఎవరో గెస్ చేయండి అంటూ అభిమానులకు క్వశ్చన్ వేశాడు. వీడెవడు అనే టైటిల్‌తో ఉన్న ఈ పోస్టర్లో ఓ వ్యక్తి.., చేతిలో గన్‌తో వెనుక నుంచి కనిపిస్తున్నాడు. పోస్టర్ మొత్తం కిల్లర్, లూజర్, విలన్, గ్యాంబ్లర్, హీరో, ఫైటర్ లాంటి పదాలు గజిబిజీగా రాసి ఉన్నాయి. ఈ ఫోటోను ట్వీట్ చేసిన అఖిల్ అతనెవరో కనుకునేందుకు హింట్ కూడా ఇచ్చాడు. అతను నా టీంమెట్ అంటూ క్లూ ఇచ్చాడు. కేవలం ఒక్క సినిమా మాత్రమే చేసిన అఖిల్, ఆ సినిమా కోసం నితిన్‌తో కలిసి పనిచేశాడు. అఖిల్ తొలి సినిమాకు నితిన్ నిర్మాత. దీంతో అఖిల్ చెప్పిన టీంమెట్ నితిన్ అయి ఉంటాడంటున్నారు ఫ్యాన్స్. నితిన్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఓల్డ్ సిటీ కుర్రాడిగా రఫ్ లుక్‌లో కనిపించనున్నాడు నితిన్. సీనియర్ నటుడు అర్జున్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. మరి అఖిల్ రిలీజ్ చేసిన ఈ ప్రీ లుక్ నితిన్ సినిమాకు సంబంధించినదేనా.. లేక ఇంకెవరిదోనా..? తెలియాలంటే మాత్రం ఫిబ్రవరి 14 వరకు వెయిట్ చేయాల్సిందే. #Veedavadu?? Take a guess who ?? Hint: He's my team mate..... wishing my buddy all the very best! Rock on Releasing this summer - April 2017 pic.twitter.com/3DBxealPLh — Akhil Akkineni (@AkhilAkkineni8) 7 February 2017 -
అఖిల్ నిశ్చితార్థం
-
అక్కినేని అఖిల్ నిశ్చితార్థం
ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్, ప్రముఖ వ్యాపారవేత్త జీవీ కృష్ణారెడ్డి (జీవీకే) మనవరాలు శ్రీయా భూపాల్ల నిశ్చితార్థ వేడుక శుక్రవారం హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. జీవీకే స్వగృహంలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో అమల, జీవీకే, నాగార్జునలతో అఖిల్, శ్రీయా భూపాల్. -
డిసెంబర్ తొలి వారంలో అఖిల్ సినిమా
తొలి సినిమా అఖిల్‌తో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన అక్కినేని నట వారసుడు, తన నెక్ట్స్ సినిమాకు రెడీ అవుతున్నాడు. తొలి సినిమా నిరాశపరచటంతో రెండో సినిమా విషయంలో నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం తీసుకున్నాడు ఈ యంగ్ హీరో. స్టార్ డైరెక్టర్ల నుంచి కుర్ర దర్శకుల వరకు అందరినీ ట్రై చేసి ఫైనల్ గా మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. ఇప్పటికే ఈ సినిమా ఎనౌన్స్ చేసి చాలా రోజులవుతున్నా ఇంత వరకు పట్టాలెక్కలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ తొలి వారంలో అఖిల్ రెండో సినిమాను లాంఛనంగా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఆ తరువాత అఖిల్ నిశ్చితార్థ కార్యక్రమాలు పూర్తి చేసి జనవరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంబించాలని భావిస్తున్నారు. అన్ని అనుకున్నట్టుగా జరిగితే అఖిల్ వివాహం కన్నా ముందే రెండో సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన నాగ చైతన్య
హైదారాబాద్ : అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య తన పెళ్లి గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. హీరోయిన్ సమంత, చైతు ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. అయితే వివాహం ఎప్పుడనే దానిపై స్పష్టత లేని విషయం తెలిసిందే. తమ పెళ్లి వచ్చే ఏడాది జరుగుతుందని, అది కూడా తన సోదరుడు అఖిల్ వివాహం తర్వాతే అని నాగచైతన్య తెలిపారు. ఓ ప్రయివేట్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు పేర్కొన్నాడు. త్వరలోనే ముహుర్తం వివరాలు తెలుపుతామని, తాను, సమంత కొంతకాలంగా మంచి స్నేహితులమని తెలిపాడు. ఇక పెళ్లి తర్వాత సమంత నటిస్తుందా, లేదా చిత్ర పరిశ్రమగు గుడ్‌బై చెబుతున్న అన్న వందతులకు నాగచైతన్య తెర దించాడు. పెళ్లి తర్వాత కూడా సమంత నటిస్తుందని స్పష్టం చేశాడు. దీంతో చైతు, సమంతల పెళ్లిపై వదంతులు, పుకార్లకు పుల్‌స్టాప్ పడ్డట్లే. కాగా అఖిల్... ఫ్యాషన్ డిజైనర్ శ్రియ భూపాల్‌ను ప్రేమ వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. డిసెంబరు 9 వ తేదీన అఖిల్ నిశ్చితార్థం జరగనుందని సమాచారం. -
అఖిల్ కొత్త సినిమా.. కొత్త ఏడాదిలోనే..
అక్కినేని నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ రెండో సినిమా కోసం అభిమానులు మరికొద్ది రోజుల పాటు వెయిట్ చేయాల్సిందేనట. తొలి సినిమా అఖిల్‌తో నిరాశపరిచిన ఈ యంగ్ హీరో రెండో ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. స్టార్ డైరెక్టర్ల నుంచి ఎన్నో యంగ్ డైరెక్టర్ వరకు చాలా మందిని సంప్రదించిన తరువాత ఫైనల్‌గా మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమాను ఫైనల్ చేశాడు. కింగ్ నాగార్జున కూడా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ సినిమా అంటూ అఫీషియల్ గా ప్రకటించినా.. ఈ సినిమా సెట్స్ మీదకు వెల్లడానికి మాత్రం మరింత సమయం పట్టనుందట. ప్రస్తుతం కథకు తుదిమెరుగులు దిద్దుతున్న విక్రమ్, మరో మూడు నెలల పాటు స్క్రీప్ట్ మీదే వర్క్ చేయనున్నాడు. దీంతో అఖిల్ సినిమా ఈ ఏడాదిలో మొదలయ్యే అవకాశం కనిపించటం లేదు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని 2017 జనవరిలో సినిమాను ప్రారంబించాలని ప్లాన్ చేస్తున్నారు అక్కినేని టీం. -
నవంబర్‌లో అఖిల్ రీ లాంచ్..?
అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని వారసుడు అఖిల్ తొలి సినిమాతో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. భారీ హీరోయిజం, మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యంగ్ హీరోను ప్రేక్షకులు ఆదరించలేదు. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న అక్కినేని అందగాడు, ఇప్పుడు తన రీ లాంచ్‌కు భారీ ప్రణాళికలు వేస్తున్నాడట. అఖిల్ తొలి సినిమా విషయంలో పెద్దగా కలుగజేసుకోని నాగార్జున, రెండో సినిమాను మాత్రం అంతా తానై నడిపించాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ నెక్ట్స్ సినిమా ఉంటుందని ప్రకటించిన అక్కినేని కుటుంబం, ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని భావిస్తుందట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను నవంబర్‌లో ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. -
విక్రమ్ దర్శకత్వంలో అఖిల్..?
అక్కినేని వారసుడు అఖిల్ రెండో సినిమా విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. తొలి సినిమా నిరాశపరచటంతో రెండో సినిమా ఎంపిక విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. దీంతో చాలా రోజులగా కథ ఎంపిక విషయంలోనే కసరత్తులు చేస్తూ కాలం గడిపేస్తున్నారు. అయితే ఇటీవల సినిమా ఫైనల్ అయినట్టుగా వార్తలు వినిపించినా అది కూడా పట్టాలెక్కేలా కనిపించటం లేదు. అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాథ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు హను రాఘవపూడితో తన నెక్ట్స్ సినిమా ఉంటుందని ప్రకటించాడు అఖిల్. అయితే నిర్మాణ పరమైన సమస్యల కారణంగా ఈ సినిమా వాయిదా పడిందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో మరో దర్శకుడి కోసం అఖిల్ ప్రయత్నాలు ప్రారంభించాడట. అదే సమయంలో ఓ రొమాంటిక్ థ్రిల్లర్ కథను రెడీ చేసిన విక్రమ్ కుమార్‌తో అఖిల్ సినిమా ఉంటుందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. మనం, 24 లాంటి వరుస హిట్స్ అందించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తే అఖిల్ కెరీర్‌కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
క్రికెట్ అంటే చాలా ఇష్టం: యువ హీరో
► స్టార్టప్ క్రికెట్ బ్రాండ్ అంబాసిడర్‌గా అఖిల్ మాదాపూర్: క్రికెట్ అంటే తనకెంతో ఇష్టమని యువ సినీహీరో అక్కినేని అఖిల్ అన్నాడు. కొత్తగా రూపుదిద్దుకున్న స్టార్టప్ క్రికెట్ లీగ్‌కు అతను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం మాదాపూర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అఖిల్ మాట్లాడుతూ స్టార్టప్ కంపెనీలు క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నాడు. నాలుగు నగరాల్లో ఈ క్రికెట్‌ను ఆడతారని, గెలుపొందిన వారికి లక్ష రూపాయలు నగదు బహుమతిని అందజేయనునున్నట్లు వెల్లడించాడు. స్టార్టప్ క్రికెట్ లీగ్ వ్యవస్థాపకులు సాయికిరణ్ మాట్లాడుతూ స్టార్టప్ కంపెనీలకు ఇదో సదావకాశమని తెలిపాడు. వచ్చే నెల 6వ తేదీ నుంచి ఈ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయని ఆయన తెలిపాడు. -
టాలీవుడ్‌కి కంగ్రాట్స్ చెప్పిన అఖిల్
మెగాస్టార్ 150 సినిమాపై అభిమానుల్లోనే కాదు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఎంతో ఆసక్తి ఉంది. ముఖ్యంగా ఈ సినిమా పై క్రియేట్ అయిన హైప్, సినిమా ప్రారంభ సమయంలో చిరు లుక్స్, అన్ని సినిమా మీద అంచనాలను పెంచేస్తున్నాయి. ముఖ్యంగా సినీ వేడుకల్లో చిరంజీవి కొత్త సినిమాపై భారీగా చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన సినీ మా అవార్డ్స్ ఫంక్షన్లో వేదిక మీద పర్ఫామ్ చేసి అందరినీ అలరించాడు మెగాస్టార్. అయితే సింగపూర్ వేదికగా జరిగిన సైమా అవార్డ్స్ ఫంక్షన్లోనూ చిరు మేనియా కనిపించింది. ఏదో మెగా ఫ్యామిలీ హీరో చిరు గురించి చెప్పటం కాదు. ఏకంగా అక్కినేని వారసుడు అఖిల్ చిరంజీవి రీ ఎంట్రీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'మెగాస్టార్ ఈజ్ బ్యాక్.. అందుకే నేను ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకు శుభాకాంక్షలు చెబుతున్నా' అన్నాడు అఖిల్. సైమా 2016 అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ నూతన నటుడిగా అవార్డ్ అందుకున్న అఖిల్ ఈ కామెంట్స్ చేశాడు. -
టాలీవుడ్‌కి కంగ్రాట్స్ చెప్పిన అఖిల్
మెగాస్టార్ 150 సినిమాపై అభిమానుల్లోనే కాదు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఎంతో ఆసక్తి ఉంది. ముఖ్యంగా ఈ సినిమా పై క్రియేట్ అయిన హైప్, సినిమా ప్రారంభ సమయంలో చిరు లుక్స్, అన్ని సినిమా మీద అంచనాలను పెంచేస్తున్నాయి. ముఖ్యంగా సినీ వేడుకల్లో చిరంజీవి కొత్త సినిమాపై భారీగా చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన సినీ మా అవార్డ్స్ ఫంక్షన్లో వేదిక మీద పర్ఫామ్ చేసి అందరినీ అలరించాడు మెగాస్టార్. అయితే సింగపూర్ వేదికగా జరిగిన సైమా అవార్డ్స్ ఫంక్షన్లోనూ చిరు మేనియా కనిపించింది. ఏదో మెగా ఫ్యామిలీ హీరో చిరు గురించి చెప్పటం కాదు. ఏకంగా అక్కినేని వారసుడు అఖిల్ చిరంజీవి రీ ఎంట్రీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'మెగాస్టార్ ఈజ్ బ్యాక్.. అందుకే నేను ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకు శుభాకాంక్షలు చెబుతున్నా' అన్నాడు అఖిల్. సైమా 2016 అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ నూతన నటుడిగా అవార్డ్ అందుకున్న అఖిల్ ఈ కామెంట్స్ చేశాడు. -
మంచు హీరోకి అక్కినేని వారసుడి గిఫ్ట్
టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ జనరేషన్ హీరోలు ఈగోలను పక్కనపెట్టి కలిసిపోతున్నారు. స్టార్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన హీరోలు, ఫ్యూచర్లో తమకు పోటీ వస్తారన్న ఆలోచన ఉన్నవారితో కూడా ఎంతో స్నేహంగా ఉంటున్నారు. అదే బాటలో యంగ్ హీరో అఖిల్, మంచు వారబ్బాయికి గిఫ్ట్ ఇచ్చాడు. మంచు హీరో మనోజ్, ప్రణీత దంపతుల తొలి మ్యారేజ్ యానివర్సరీకి కానుకగా ఈ గిఫ్ట్ ఇచ్చాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ లో ప్రకటించిన మనోజ్, అఖిల్‌కు థ్యాంక్స్ చెపుతూ గిఫ్ట్ ఫోటోను పోస్ట్ చేశాడు. అమల నటనకే కాదు జంతు ప్రేమకు కూడా వారసుడిగా పెరిగిన అఖిల్ దగ్గర ఎన్నో అరుదైన జాతుల పెట్స్ ఉన్నాయి. వాటిలో ఒకటైన అలస్కన్ మాలామ్యూట్ను మనోజ్ దంపతులకు ప్రెజెంట్ చేశాడు. నీలి కళ్లతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ బుజ్జి కుక్కపిల్లను తమ ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తున్నట్టుగా తెలిపిన మనోజ్ దానికి జోయా అని పేరు పెట్టుకున్నాడు. New addition to our family :) pl welcome Zoya:) I thank @AkhilAkkineni8 for gifting us 'Zoya' for our anniversary:) pic.twitter.com/EoUcFtEBt1 — Manchu Manoj (@HeroManoj1) 5 June 2016 Zoya is Blue eyed Alaskan Malamute pic.twitter.com/agTTJGbe6d — Manchu Manoj (@HeroManoj1) 5 June 2016 -
మేము సైతం రహదారి భద్రత ఉద్యమంలో..
కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏకు విచ్చేసిన జూనియర్ ఎన్టీఆర్, అఖిల్ సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం రవాణా శాఖ చేపట్టే రహదారి భద్రతా ఉద్యమంలో తాము కూడా పాల్గొని, ప్రజల్లో అవగాహన కల్పిస్తామని సినీనటులు జూనియర్ ఎన్టీఆర్, అక్కినేని అఖిల్ వెల్లడించారు. కొత్తగా కొనుగోలు చేసిన వాహనాల రిజిస్ట్రేషన్ కోసం వారు విడివిడిగా శనివారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి విచ్చేశారు. మొదట అక్కినేని అఖిల్ తన నూతన కారు మెర్సిడెస్ బెంజ్ (రూ. 1.94 కోట్లు) రిజిస్ట్రేషన్ కోసం వచ్చారు. తనకు నచ్చిన నంబర్ ‘టీఎస్ 09 ఈఎల్ 9669’ కోసం ఇటీవల వేలంలో రూ. 46,500 చెల్లించి సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టీఏ అధికారులతో మాట్లాడుతూ.. తాను ఇప్పటికే ‘డ్రంకన్‌డ్రైవ్’పై వాహనదారుల్లో అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు వివరించారు. రోడ్డు భద్రతా కార్యక్రమాల్లోనూ తన వంతు సహకారం అందిస్తానని హామీనిచ్చారు. అనంతరం తన కొత్త వాహనం బీఎండబ్ల్యూ (రూ. 1.21 కోట్లు) రిజిస్ట్రేషన్ కోసం జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు. ఈ కారు కోసం ఆయన ఇటీవలే ‘టీఎస్ 09 ఈఎల్ 9999’ నంబర్ కోసం వేలంలో రూ. 10.5 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నారు. ఆల్‌నైన్ నంబర్ కోసం ఇంతపెద్ద మొత్తం చెల్లించడం ఇదే మొదటిసారి. వాహనం రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ నిబంధనల ప్రకారం ఫొటో దిగి, డిజిటల్ ప్యాడ్‌పైన సంతకం చేశారు. ఈ సందర్భంగా ‘ఆర్టీఏ చేపట్టే రోడ్డు భద్రతా ఉద్యమంలో పాల్గొనాలని’ జేటీసీ రఘునాథ్ ఆహ్వానించగా, తప్పకుండా హాజరవుతానని చెప్పారు. ఆర్టీవో జీపీఎన్ ప్రసాద్, ఇతర అధికారులు కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. -
అఖిల్ ప్రకటన వచ్చేస్తోంది..?
భారీ అంచనాల మధ్య తెరంగేట్రం చేసిన అక్కినేని నట వారసుడు అఖిల్, తొలి సినిమాతో ఆకట్టుకోలేకపోయాడు. ఎంతో హైప్ క్రియేట్ చేసిన 'అఖిల్' డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో రెండో సినిమా విషయంలో అక్కినేని ఫ్యామిలీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే చాలా మంది దర్శకుల పేర్లు వినిపించినా, ఫైనల్‌గా నాగార్జున లీడ్ రోల్లో ఊపిరి సినిమాను తెరకెక్కించిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అఖిల్ హీరోగా హిందీ సూపర్ హిట్ సినిమా 'ఏ జవానీ హై దివానీ'ని రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే వంశీ పైడిపల్లి మాత్రం రీమేక్ కన్నా కొత్త కథతో సినిమా చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. ఇప్పటికే ఊపిరి సినిమాను రీమేక్‌గా తెరకెక్కించిన వంశీ, మరో సినిమా కూడా రీమేక్ చేస్తే తన మీద రీమేక్ డైరెక్టర్ అన్న ముద్ర పడుతుందన్న ఆలోచనలో ఉన్నాడట. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానమిస్తూ ఉగాది సందర్భంగా ఏప్రిల్ 8న అఖిల్ సినిమా ప్రకటన వస్తుందన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈసారైనా అఖిల్ ప్రకటిస్తాడో లేదో చూడాలి. -
అఖిల్ సినిమాకు డైరెక్టర్ ఫిక్స్..?
అక్కినేని మూడో తరం వారసుడిగా భారీ అంచనాల మధ్య వెండితెరకు పరిచయం అయిన నటుడు అఖిల్. తొలి సినిమా అఖిల్‌తోనే సంచలనాలు నమోదు చేస్తాడని భావించిన ఆ సినిమా అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలకు కూడా షాక్ ఇచ్చింది. అఖిల్ ఆకట్టుకున్నా.., సినిమా రిజల్ట్ మాత్రం బెడిసికొట్టడంతో అక్కినేని ఫ్యామిలీ ఆలోచనలో పడింది. దీంతో రెండో సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది దర్శకుల పేర్లను పరిశీలించిన అక్కినేటి టీం, ఫైనల్‌గా వంశీ పైడిపల్లికే ఫిక్స్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం వంశీ దర్శకత్వంలో నాగార్జున ప్రధాన పాత్రలో ఊపిరి సినిమా తెరకెక్కుతోంది. దీంతో వంశీ పైడిపల్లి వర్కింగ్ స్టైల్ మీద నమ్మకంతో అఖిల్ రెండో సినిమా అవకాశం ఇచ్చాడు నాగార్జున. ఇప్పటికే రెండో సినిమాకు సంబంధించి అఖిల్ లుక్‌పై ఫోటో సెషన్ కూడా పూర్తి చేశారట. త్వరలోనే ఈ సినిమాపై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది. -
కిడ్నీ వ్యాధిగ్రస్తుడి కోసం ఆటో నడిపిన అఖిల్
ఖమ్మం: కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఏడేళ్ల చిన్నారి అశ్విత్‌రెడ్డిని సినీ హీరో అక్కినేని అఖిల్ పరామర్శించారు. మంచు లక్ష్మి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఓ ప్రైవేట్ టీవీ చానల్ ద్వారా అశ్విత్‌రెడ్డి దుస్థితిని తెలుసుకున్న అఖిల్ మంగళవారం ఖమ్మం వచ్చారు. ఈ సందర్భంగా అశ్విత్‌రెడ్డి వైద్యానికి అవసరమయ్యే డబ్బు కోసం ఆటో నడిపి కొంత మొత్తం సేకరించారు. నగరంలోని నర్సింహస్వామి దేవాలయం రోడ్డులో ఉంటున్న కట్టూరి కృష్ణారెడ్డి, కవితలకు కుమారుడు అశ్విత్‌రెడ్డి, కుమార్తె అనుషిత ఉన్నారు. రెండు నెలల క్రితం అశ్విత్ డెంగీ జ్వరం బారినపడటంతో వైద్య పరీక్షలు చేయించారు. ఆ సమయంలో అతనికి రెండు మూత్రపిండాలు పాడైనట్లు వైద్యులు తెలిపారు. వైద్యం కోసం ఆస్తి, బంగారం అమ్మి రూ.6 లక్షల వరకు ఖర్చు చేశారు. కిడ్నీ మార్పిడికి రూ.10 లక్షల వరకు ఖర్చు వస్తుందని డాక్టర్లు చెప్పారు. అంతమొత్తం వెచ్చించే స్థోమత అశ్విత్‌రెడ్డి తల్లిదండ్రులకు లేదు. ఈ నేపథ్యంలో టీవీ చానల్ ద్వారా విషయాన్ని తెలుసుకున్న అఖిల్ ఖమ్మం వచ్చి ఆటో నడిపి డబ్బులు సేకరించి ఇచ్చాడు. -
చిన్నారికి అఖిల్ పరామర్శ
ఖమ్మం: టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని పరామర్శించారు. ఖమ్మంకు చెందిన ఆరేళ్ల అశ్విత్ రెడ్డి గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. కుమారుడు ఆరోగ్యం మెరుగుపడడం కోసం అతని తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఈ క్రమంలో అశ్విత్ రెడ్డి హీరో అఖిల్‌ను కలవాలని కోరాడు. ఈ విషయం తెలుసుకున్న అఖిల్ మంగళవారం ఖమ్మంలో చిన్నారిని పరామర్శించారు. కొద్దిసేపు అతనితో కలసి మాట్లాడి ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నాడు. అంతకు ముందు అఖిల్ ఖమ్మం నగరంలో సందడి చేశాడు. సరదాగా ఆటో నడిపాడు. ప్రయాణికులు ఇచ్చిన నగదును అఖిల్ అశ్విత్ రెడ్డి కుటుంబానికి అందజేశాడు. దీంతో చిన్నారితో పాటు అతని కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అశ్విత్ రెడ్డి త్వరగా కోలుకోవాలని అఖిల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. గతంలో స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, బాలకృష్ణలు అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానులను స్వయంగా పరామర్శించిన విషయం తెలిసిందే. -
సుకుమార్ డైరెక్షన్లో అఖిల్..?
తొలి సినిమా డిజాస్టర్‌గా నిలిచినా యంగ్ హీరో అక్కినేని అఖిల్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. సినిమా ఆకట్టుకోలేకపోయినా, వ్యక్తిగతంగా డ్యాన్సులు, ఫైట్స్ విషయంలో మంచి మార్కులే కొట్టేశాడు. అందుకే అఖిల్‌తో రెండోసినిమా చేయడానికి స్టార్ డైరెక్టర్లు కూడా సై అంటున్నారు. ఇప్పటికే కొంతమంది దర్శకులు కథ రెడీ చేసే పనిలో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. తొలి సినిమా రిజల్ట్‌తో రెండో సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు అఖిల్. ఎలాంటి కథను ఎంచుకోవాలో ఇంతవరకు ఫైనల్ చేయకపోయినా అఖిల్ సినిమా కోసం ఎదురుచూసే దర్శకులు సంఖ్య మాత్రం రోజురోజుకు పెరిగిపోతోంది. త్రివిక్రమ్, విక్రమ్ కె కుమార్, శ్రీనువైట్ల, వంశీ పైడిపల్లి లాంటి టాప్ మేకర్స్ పేర్లు ఇప్పటికే క్యూలో ఉండగా తాజాగా మరో స్టార్ డైరెక్టర్, ఈ లిస్ట్‌లో చేరిపోయాడు. నాన్నకు ప్రేమతో సినిమాతో సంక్రాంతి బరిలో ఘనవిజయం సాధించిన సుకుమార్, అఖిల్ హీరోగా ఓ ప్రేమకథను తెరకెక్కించాలని భావిస్తున్నాడట. అయితే ఇప్పటికే దేవీ శ్రీ ప్రసాద్ హీరోగా సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించిన సుకుమార్.. అఖిల్ సినిమాను ఎప్పుడు మొదలు పెడుతాడన్న విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. ఇప్పటివరకు అక్కినేని ఫ్యామిలీ నుంచి కూడా సుకుమార్ సినిమా గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ సినిమా అయినా పట్టాలెక్కుతుందో లేక మిగతా దర్శకుల్లాగా సుకుమార్ కూడా క్యూలో ఉండిపోతాడో చూడాలి. -
ఆ రీమేక్ మీద మనసుపడ్డాడా?
భారీ అంచనాల మధ్య తెరంగేట్రం చేసి.., ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన స్టార్ వారసుడు అఖిల్. అక్కినేని నట వారసుడిగా అఖిల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సిసింద్రీ.. తొలి సినిమా 'అఖిల్'తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా, సక్సెస్ మాత్రం సాధించలేకపోయాడు. దీంతో రెండో సినిమా విషయంలో డైలామాలో పడ్డాడు. అఖిల్ సినిమా రిలీజ్ అయి చాలా రోజులవుతున్నా, ఇంతవరకు తన రెండో సినిమా గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. యాక్షన్ ఇమేజ్‌తో ఎంట్రీ ఇచ్చిన అఖిల్, రెండో సినిమా కోసం ఏ జానర్ ఎంచుకోవాలో తేల్చుకోలేకపోతున్నాడు. దీంతో సేఫ్ గేమ్ ఆడేందుకు సిద్ధపడుతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అందుకే బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన 'యే జవానీ హై దివానీ' సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట. ఈ సినిమాతో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకోవచ్చ ప్లాన్ చేస్తున్నాడు అఖిల్. -
అఖిల్ అంత రిస్క్ చేస్తాడా..?
తొలి సినిమా వైఫల్యంతో ఆలోచనలో పడ్డ అఖిల్ రెండో సినిమా విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. స్టార్ డైరెక్ట్లతో సినిమా చేయడానికి ఎవరూ అందుబాటులో లేకపోవడంతో.. మరోసారి రిస్క్ చేయాలా..? లేక వెయిట్ చేయాలా అన్న డైలమాలో ఉన్నాడు. వి.వి. వినాయక్ దర్శకత్వంలో 'అఖిల్' సినిమాతో గ్రాండ్‌గా లాంచ్ అయిన అఖిల్ పర్సనల్‌గా మంచి మార్కులు సాధించినా.. కమర్షియల్‌గా మాత్రం ఆశించిన స్థాయిని అందుకోలేకపోయాడు. తన రెండో సినిమాను త్రివిక్రమ్, సుకుమార్‌లలో ఒకరితో చేయాలని భావించినా, ఈ ఇద్దరు ఇప్పట్లో ఫ్రీ అయ్యే అవకాశం కనిపించటం లేదు. గౌతమ్ మీనన్ లాంటి క్లాస్ డైరెక్టర్‌తో సినిమా చేయాలని ప్లాన్ చేసినా, అది కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. దీంతో ఏ డైరెక్టర్‌తో సినిమా చేయాలా అనే ఆలోచనలో ఉన్నాడు అక్కినేని నట వారసుడు. తాజాగా అఖిల్ నెక్ట్స్ సినిమాపై ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది. కెరీర్లో ఇప్పటివరకు ఒక్క భారీ కమర్షియల్ హిట్ కూడా లేని దేవ కట్ట దర్శకత్వంలో.. సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట అఖిల్. ఆటోనగర్ సూర్య, డైనమైట్ సినిమాలతో నిరాశపరిచిన దేవాతో అఖిల్ సినిమా చేయటం రిస్క్ అన్న టాక్ వినిపిస్తోంది. మరి అఖిల్ ఆ రిస్క్ చేయడానికి రెడీ అవుతాడో.. లేదో.. తెలియాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
వాణిజ్య ప్రకటనతోనే నా ప్రయాణం: అఖిల్
హైదరాబాద్: వాణిజ్య ప్రకటన (యాడ్)తోనే తన సినీ జీవితం మొదలైందని యువహీరో అక్కినేని అఖిల్ అన్నారు. హైదరాబాద్‌లో ఓ ప్రముఖ షాపింగ్ మాల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా లోగోను శుక్రవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం సంతోషంగా ఉందన్నారు. -
క్రిష్ దర్శకత్వంలో అఖిల్..?
తొలి సినిమా రిలీజ్‌కు ముందే స్టార్ స్టేటస్ అందుకున్న యంగ్ హీరో అఖిల్.. ఆ సినిమా రిజల్ట్‌తో సంబందం లేకుండా తన నెక్ట్స్ సినిమా మీద దృష్టి పెడుతున్నాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన 'అఖిల్' సినిమాకు డివైడ్ టాక్ రావటంతో నెక్ట్స్ సినిమాకు కమర్షియల్ డైరెక్టర్‌ను కాదని, ఓ ప్రయోగాత్మక దర్శకుడిని తీసుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది. తొలి సినిమా రిజల్ట్ విషయాన్ని పక్కన పెడితే హీరోగా అఖిల్ మాత్రం మంచి మార్కులే సాధించాడు. ముఖ్యంగా డ్యాన్సులు, ఫైట్ల విషయంలో యంగ్ హీరోస్‌కు షాక్ ఇచ్చాడు అక్కినేని వారసుడు. నెక్ట్స్ సినిమాతో నటుడిగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు అఖిల్. అందుకే ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించే క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ) దర్శకత్వంలో రెండో సినిమాను ప్లాన్ చేసుకుంటున్నాడు. కంచె సినిమాతో కమర్షియల్ సక్సెస్ కూడా సాధించిన క్రిష్, అఖిల్ సినిమాకు తన మార్క్ కథను రెడీ చేస్తున్నాడు. ఇప్పటివరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా, 2016 ప్రథమార్థంలోనే ఈ సినిమాను పట్టాలెక్కించడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సినిమాను అక్కినేని ఫ్యామిలీ ఆస్థాన నిర్మాత డి. శివప్రసాద్ రెడ్డి నిర్మించనున్నారు. -
'అఖిల్' మూవీ రివ్యూ
టైటిల్ : అఖిల్ జానర్ : రొమాంటిక్, యాక్షన్ ఎంటర్టైనర్ తారాగణం : అఖిల్, సయేషా సైగల్, రాజేంద్ర ప్రసాద్, మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం : వి.వి. వినాయక్ నిర్మాత : శ్రేష్ట్ మూవీస్ సంగీతం : అనూప్ రుబెన్స్, థమన్ అక్కినేని వంశంలో మూడో తరం నట వారసుడిగా భారీ అంచనాల మధ్య తెరంగేట్రం చేసిన నటుడు అఖిల్. గతంలో ఏ హీరోకి రాని హైప్ అఖిల్ తొలి సినిమాకు వచ్చింది. అందుకు తగ్గట్టుగానే భారీ బడ్జెట్‌తో అఖిల్ సినిమాను తెరకెక్కించారు. అఖిల్ లుక్కు తగ్గట్టుగా క్లాస్ రొమాంటిక్ సీన్స్ తో పాటు, వినాయక్ మార్క్ మాస్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉన్న అఖిల్ దీపావళి కానుకగా బుధవారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. సోషియో ఫాంటసీ తరహా కథాంశంతో తెరకెక్కిన అఖిల్ ఆడియన్స్‌ను ఎంత వరకు మెప్పించింది. భారీ అంచనాల మధ్య వెండితెరకు పరిచయం అయిన అఖిల్ ఆ అంచనాలను అందుకున్నాడా..? కథ : అఖిల్ హ్యాపీగా జీవితాన్ని గడిపే ఓ సాదాసీదాకుర్రాడు. అలా జీవితం సాగిపోతున్న సమయంలో పిజి చదువుతున్న హీరోయిన్ సయేషాతో ప్రేమలో పడతాడు. ఆమెను ఒప్పించి ప్రేమను గెలుచుకుంటాడు. ఇంతలో కొంత మంది రౌడీలు సయోషాను కిడ్నాప్ చేస్తారు. ఆమె కోసం వెతికే ప్రయత్నంలో ఆమె ఆఫ్రికాలో ఉందని తెలుసుకున్న అఖిల్ అక్కడికి వెళతాడు. తన ప్రియురాళిని కాపాడుకోవటానికి అక్కడి గిరిజనుల సాయం తీసుకుంటాడు. అసలు ఆ గిరిజనులు ఎవరు. సయేషాను విలన్లు ఎందుకు కిడ్నాప్ చేశారు. అక్కడికి వెళ్లిన అఖిల్ జీవితం ఎలా మారిపోయింది అన్నదే మిగతా కథ. నటీనటులు : అఖిల్ పూర్తి స్థాయి ఫాంటసీ కథాంశం కాకపోయినా, చిన్న ఫాంటసీ లైన్‌ను రియలిస్టిక్‌గా రూపొందించారు. ముఖ్యంగా అఖిల్ లాంచింగ్ సినిమా కావటంతో, కథా కథనాలు అన్ని అఖిల్ పాత్ర చుట్టూ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే అఖిల్ కూడా తన మీద ఉన్న బాధ్యతకు పూర్తి న్యాయం చేశాడు. తొలి సినిమానే అయినా ఎక్కడ అలా కనిపించలేదు. డ్యాన్స్, ఫైట్స్ తో పాటు డైలాగ్ డెలివరీ బాడీలాంగ్వేజ్ వంటి విషయాల్లో కూడా మంచి ఈజ్ కనబరిచాడు. అయితే కామెడీ విషయంలో మాత్రం ఇంకాస్త వర్క్ చేస్తే బాగుండనిపించింది. హీరోయిన్గా నటించిన సయేషా సైగల్ కూడా మంచి నటన కనబరిచింది. ముఖ్యంగా డ్యాన్స్‌ల విషయంలో అఖిల్‌తో పోటి పడిన సయేషా మంచి మార్కులు సాధించింది. బ్రహ్మనందం, జయప్రకాష్ రెడ్డిల కామెడీ అలరిస్తుంది. ఇక రాజేంద్రప్రసాద్ మరోసారి ఆకట్టుకోగా, విలన్‌గా మహేష్ మంజ్రేకర్ తన మార్క్ చూపించాడు. సాంకేతిక నిపుణులు : తెర మీద అఖిల్ వన్ మేన్ షోలా సాగిన అఖిల్ సినిమా. తెర వెనుక వినాయక్ వన్ మేన్ షోలా సాగింది. ఎన్నో అంచనాలు ఉన్న అక్కినేని వారసున్ని వెండితెరకు పరిచయం చేసే భారీ బాధ్యతను తలకెత్తుకున్న వినాయక్ అందుకు తగ్గ స్ధాయిలో కష్టపడ్డాడు. ముఖ్యంగా తనకు బాగా పట్టున్న మాస్ యాక్షన్‌ను క్లాస్‌గా ప్రజెంట్ చేసి, స్టార్ వారసులకు గ్రాండ్ లాంచింగ్ ఇవ్వటంలో తాను స్పెషలిస్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. కథా కథనాల్లో ఎక్కడా పట్టు కోల్పోకుండా సినిమా అంతా చాలా ఇంట్రస్టింగ్‌గా తెరకెక్కించాడు. అనూప్, థమన్లు కమర్షియల్ నెంబర్స్‌తో అలరించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కెమెరా వర్క్ సూపర్ అనిపించింది. గతంలో ఎన్నడూ చూడని లొకేషన్స్‌లో షూట్ చేసిన చిత్రయూనిట్, ఆ ప్రాంతాలను గ్రాండ్‌గా ప్రజెంట్ చేశారు. అఖిల్, సయేషాలు తెర మీద చాలా అందంగా కనిపించారు. ఎడిటింగ్, కొరియోగ్రఫీ, యాక్షన్స్ సీన్స్ ఇలా అన్నీ అప్ టు ద మార్క్ గా ఉన్నాయి. విశ్లేషణ : అఖిల్ ఫాంటసీ కథాంశం కాకపోయినా.. చిన్న ఫాంటసీ ఎలిమెంట్‌ను పక్కా కమర్షియల్ జానర్లో ప్రజెంట్ చేశారు. అఖిల్ తొలి సినిమానే అయినా ఓ స్టార్ హీరో సినిమాలో ఉండే అన్ని ఎమోషన్స్‌ను ఈ సినిమాలో చూపించారు. ఫ్యామిలీ సెంటిమెంట్, లవ్ ఎపిసోడ్స్, యాక్షన్, డ్రామా ఇలా అన్ని రకాల సీన్స్‌తో అఖిల్ స్టామినా ప్రూవ్ చేసే ప్రయత్నం చేశారు. సినిమా కూడా అదే స్ధాయిలో వచ్చింది. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకుంది. ప్లస్ పాయింట్స్ : అఖిల్ పర్ఫామెన్స్, డ్యాన్స్, యాక్షన్ వినాయక్ టేకింగ్ సినిమా నిడివి బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ మైనస్ పాయింట్స్ : రొటీన్ స్టోరీ లైన్ సెకండాఫ్ లో కొన్ని సీన్స్ గ్రాఫిక్స్ ఓవరాల్‌గా 'అఖిల్' అక్కినేని అభిమానులకు ఫుల్ ట్రీట్, అఖిల్ కు పర్ఫెక్ట్ లాంచింగ్ -
నాగార్జున ఫ్యాన్స్ ఆందోళన: ఇద్దరి ఆత్మహత్యాయత్నం
కర్నూలు : నగరంలో ఆనం థియేటర్ వద్ద నాగార్జున ఫ్యాన్స్ మంగళవారం ఆందోళనకు దిగారు. అఖిల్ సినిమా టికెట్లను అధిక ధరకు విక్రయిస్తున్నారని వారు సినిమా హాల్ ఎదుట ఆందోళనకు దిగారు. అయితే ఇద్దరు అభిమానులు మాత్రం తమ ఒంటిపై కిరోసిన్ పోసుకున్నారు. అంతలో అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిద్దరిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. టాలీవుడ్ హీరో నాగార్జున అక్కినేని తనయుడు అఖిల్ అక్కినేని అఖిల్ సినిమా ద్వారా హీరోగా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం బుధవారం విడుదల కానుంది. ఆ క్రమంలో సినిమా థియేటర్లు టికెట్లు అడ్వాన్స్ గా విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. -
ప్రయోగానికి రెడీ అంటున్న అఖిల్
తొలి సినిమా ఇంకా రిలీజ్ కాకపోయినా స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గని ఫాలోయింగ్ సొంతం చేసుకున్న యంగ్ హీరో అఖిల్. అక్కినేని నట వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ప్రస్తుతం తన తొలి సినిమా ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్ కాకపోయిన అఖిల్ చేయబోయే తరువాత ప్రాజెక్ట్స్ పై రకరకాల వార్తలు టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే స్టార్ డైరెక్టర్లు అఖిల్‌తో సినిమాకు రెడీ అంటూ టాక్ వినిపిస్తున్న నేపధ్యంలో తాజాగా మరో ఆసక్తికరమైన వార్త తెరమీదకు వచ్చింది. రెగ్యులర్ కమర్షియల్ జానర్‌కు దూరంగా డిఫరెంట్ టేకింగ్‌తో సినిమాలను తెరకెక్కించే క్రిష్ (రాధాకృష్ణ జాగర్లమూడి) దర్శకత్వంలో అఖిల్ సినిమా చేయనున్నాడట. అల్లు అర్జున్, రానా, అల్లరి నరేష్, మనోజ్ లాంటి యంగ్ హీరోలతో సినిమాలు చేసిన క్రిష్, తాజాగా వరుణ్ తేజ్ హీరోగా కంచె సినిమాను తెరకెక్కించాడు. వినాయక్ దర్శకత్వంలో, నితిన్ నిర్మాతగా తెరకెక్కించిన అఖిల్, ఈ దసరాకు రిలీజ్ కావాల్సి ఉండగా గ్రాఫిక్స్ డిలే కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాను దీపావళికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ సినిమా రిజల్ట్ చూసిన తరువాతే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాడు అక్కినేని వారసుడు. -
'అఖిల్' వాయిదా
అక్కినేని నట వారసుడు అఖిల్ హీరోగా పరిచయం అవుతున్న తొలి సినిమా 'అఖిల్'. మాస్ స్పెషలిస్ట్ వివి వినాయక్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని భావించారు. అయితే ఈ సినిమా అనుకున్నట్టుగా దసరాకు రిలీజ్ కావటం లేదు. గ్రాఫిక్స్ ప్రధానంగా తెరకెక్కుతున్న అఖిల్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అఖిల్ ఇంట్రడ్యూసింగ్ సినిమా కావటంతో త్వరగా పని పూర్తిచేసి రిలీజ్ చేయడం కన్నా, పూర్తి క్వాలిటీతో రిలీజ్ చేయాలని భావించిన యూనిట్.., ఆలస్యం అయినా గ్రాఫిక్స్ క్వాలిటీ బాగా వచ్చాకే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. యంగ్ హీరో, అఖిల్ సినిమా నిర్మాత నితిన్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ లో ప్రకటించారు. 'గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యం అయిన కారణంగా అనుకున్న సమయానికి అఖిల్ సినిమా రిలీజ్ చేయలేకపోతున్నాం, కొత్త రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటిస్తాం.. సారీ ' అంటూ తన ట్విట్టర్ లో అభిమానులకు మెసేజ్ ఇచ్చాడు. Due to delay in graphics work v r unable to release AKHIL on oct22nd..sorry for the delay..will announce the new release date soon..sorry.. — nithiin (@actor_nithiin) October 15, 2015 -
‘ఎస్కేప్ రీలోడెడ్’లో అఖిల్ సందడి
-
థ్యాంక్యూ మహేష్..
తన మొదటి సినిమా 'అఖిల్' ఆడియో లాంచ్‌కు విచ్చేసినందుకు హీరో మహేష్ బాబుకు థ్యాంక్యూ అంటూ అఖిల్ ట్వీట్ చేశారు. ఆడియో లాంచ్‌కు మహేష్ రావడం, తనలాంటి కొత్త నటుడిని ప్రోత్సహించడం అమేజింగ్‌గా అనిపించిందని.. హర్షం వ్యక్తం చేశారు. అలాగే అఖిల్ సినిమాకి సంబంధించి సహకారం అందించిన ఎస్.ఎస్.కార్తికేయ(రాజమౌళి తనయుడు) పట్ల కూడా తన అభిమానాన్ని అఖిల్ ట్వీట్ రూపంలో చాటారు. అలాగే తనను ఎంకరేజ్ చేసి, ఆడియో రిలీజ్ ఫంక్షన్‌ను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు కూడా థ్యాంక్యూ చెప్తూ ట్వీట్ చేశారు. ఇక సినిమా రిలీజ్ కోసమే తన ఎదురుచూపులని, అక్టోబర్ 22వ తేదీన ఆ బిగ్ డే రానుందని చెప్పుకొచ్చారు. సెప్టంబర్ 24 నుంచి పూర్తి స్థాయిలో సినిమా ప్రమోషన్ ఉంటుందని అఖిల్ ట్విట్టర్లో వెల్లడించారు. కాగా అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆదివారం 'అఖిల్' ఆడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. A special thanks to @urstrulyMahesh it was amazing to see him come and encourage a new comer like me. Thank you very much — Akhil Akkineni (@AkhilAkkineni8) September 21, 2015 I need to mention @ssk1122 Karthikeya my brother for being the brain behind all the promos and footage you have seen. You are amazing love u — Akhil Akkineni (@AkhilAkkineni8) September 21, 2015 -
అఖిల్ ఆడియోకు రికార్డ్ రేటు
అక్కినేని నటవారసుడు అఖిల్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న తొలి సినిమా రిలీజ్‌కు ముందు నుంచే సంచలనాలను నమోదు చేస్తుంది. గతంలో ఏ హీరో తొలి సినిమాకు లేని విధంగా భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా అదే స్ధాయిలో 40 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. స్టార్ మేకర్ వినాయక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద అంచనాలను మరింత పెంచేస్తున్నాయి. ఈ హైప్ అఖిల్ సినిమా బిజినెస్ మీద కూడా బాగానే ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే సినిమా బిజిసెన్ కూడా పూర్తవ్వటంతో నిర్మాతలు చాలా హ్యాపిగా ఉన్నారు. దీనికి తోడు తాజాగా ఆడియో రిలీజ్ హక్కుల విషయంలోనూ అదే జోరు చూపించాడు అఖిల్.. గతంలో అత్యంత భారీ వ్యయానికి ఆడియో రిలీజ్ హక్కులను అమ్మిన రికార్డ్ ఇండియాస్ బిగెస్ట్ మోషన్ పిక్చర్ బాహుబలి పేరిట ఉంది. బాహుబలి తరువాత స్థానంలో నిలిచాడు అఖిల్. దీంతో తొలి సినిమాతోనే ఈ ఘనత సాదించిన హీరోగా రికార్డ్ సృష్టించాడు. యంగ్ హీరో నితిన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సయేషా సెహగల్ అఖిల్ సరసన హీరోయిన్ గానటిస్తుంది. తమన్‌తో పాటు అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా సెప్టెంబర్ 20 రిలీజ్ కానుంది. -
తండ్రి ట్విట్టర్లో తనయుడి టీజర్ రిలీజ్
త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అక్కినేని అఖిల్ బుధవారం (ఏప్రిల్ 8) ) పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. కొడుకు పుట్టినరోజు సందర్భంగా అతడు నటిస్తున్న టీజర్‌ను హీరో నాగార్జున తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రిలీజ్ చేశాడు. 'హ్యాపీ 21 బర్త్‌డే మై డియర్ సన్. మే యువర్ గ్రాండ్ ఫాదర్ గైడ్ యూ అండ్ బ్లెస్ యూ. వియ్ లవ్ యూ!!!' అంటూ నాగార్జున ట్విట్ చేశారు. ట్విట్టర్ లో పెట్టిన ఫోటోలో నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, అమల నవ్వుతూ ఫోజ్ ఇచ్చారు. ఇక హీరో నితిన్ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై వీవీ వినాయక్ దర్శకత్వంలో అఖిల్‌ను హీరోగా ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు. ఈ సందర్భంగా నితిన్ ...అక్కినేని అభిమానులకు అఖిల్ ఫస్ట్‌లుక్ టీజర్ గిఫ్టు ఇచ్చారు. టీజర్ విడుదల చేసిన వెంటనే అక్కినేని అభిమానులు, నితిన్ ఫ్యాన్స్ షేర్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ నెట్‌వర్క్‌లో అఖిల్ టీజర్ హల్చల్ చేస్తోంది. ఇక అక్కినేని కుటుంబంలోని మూడుతరాల వాళ్లందరూ కలిసి నటించిన 'మనం' చిత్రంలో అఖిల్ అతిథి పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే. ఇక పూర్తి స్థాయి హీరోగా మాత్రం అఖిల్‌కి ఇది తొలి చిత్రం. happy 21st birthday my dear son @AkhilAkkineni8 ..may your grandfather guide you and bless u. We love you!!! pic.twitter.com/viuQgEu54o — Nagarjuna Akkineni (@iamnagarjuna) April 7, 2015 Great start on your bday !!@AkhilAkkineni8 I love the energy and confidence http://t.co/nudHl2HJee — Nagarjuna Akkineni (@iamnagarjuna) April 8, 2015 -
అక్కినేని అఖిల్ పేరుతో మోసం!
-
అక్కినేని అఖిల్ తెరంగేట్ర వేడుక
-
అభిమానులందరికీ ప్రమాణం చేస్తున్నా..
-
అఖిల్‌తో జతకడుతోన్న సుందరి.. సయేషా!