
అఖిల్... ఫస్ట్ మెట్రోప్యాసింజర్!
నిజమే... తెలుగు సినిమా హీరోల్లో హైదరాబాద్ మెట్రో ట్రైన్ ఎక్కిన ఫస్ట్ పర్సన్ అక్కినేని అఖిలే. అదేంటి? ఇంకా మెట్రో స్టార్ట్ కాలేదు కదా అనే ఆలోచన ఈ పాటికే మీ మైండ్‌లో మొదలై ఉంటుంది. నిజమే కానీ, కొన్ని చోట్ల మెట్రో వర్క్స్ పూర్తయ్యాయి. పట్టాల మీదకు ట్రైన్ ఎక్కేసింది కూడా. అంటే... ట్రయల్ రన్ కోసం నడిపారులెండి.
అసలు రన్ ఇంకా మొదలు కాకముందే అఖిల్ ఎలా ట్రైన్ ఎక్కాడనుకుంటున్నారా? హైదరాబాద్ మెట్రో మేనేజ్‌మెంట్ దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకుని కొత్త సినిమా షూటింగ్ చేశాడు అఖిల్. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం మెట్రోలో యాక్షన్ సీక్వెన్స్ అండ్ చేజ్ తీశారు. ‘టెర్మినేటర్–2, ట్రిపుల్ ఎక్స్: జాండర్ కేజ్, కెప్టెన్ అమెరికా: ద వింటర్ సోల్జర్’ తదితర హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన స్టంట్ మాస్టర్ బాబ్ బ్రౌన్ ఈ యాక్షన్ సీక్వెన్స్ తీయడం ఈ సినిమా స్పెషాలిటీ. బల్గేరియన్ కెమేరామెన్ (స్టడీకామ్) నిక్కి ఈ సినిమాకు పని చేయడం మరో స్పెషాల్టీ.