Hyderabad Metro Rail Project
-
ఫోర్త్‌సిటీకి మెట్రో
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోరైలు రెండోదశ పనులకు ప్రభుత్వం పరిపాలన ఆమోదం తెలిపింది. రెండోదశ ప్రాజెక్టులో భాగంగా రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కిలోమీటర్ల మేర ఐదు కారిడార్ల (పార్ట్–ఏ కింద)ను నిర్మించనున్నారు. పార్ట్–బీలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్ సిటీ (స్కిల్స్ యూనివర్సిటీ)వరకు ఆరో కారిడార్‌ను నిర్మించనున్నారు. దీనికి రూ.8 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. దీనికి సంబంధించిన అలైన్మెంట్, నిర్మాణ వ్యయం ఇతర అంశాలపై సర్వే జరుగుతోంది. ఈ మేరకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జాయింట్ వెంచర్‌గా నిర్మాణం రెండోదశ మెట్రో ప్రాజెక్టును దేశంలోని ఇతర నగరాల తరహాలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి 50:50 జాయింట్ వెంచర్ (జేవీ)గా నిర్మించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం నడుస్తున్న 69 కిలోమీటర్ల తొలిదశ మెట్రోరైలు ప్రపంచంలోనే పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టు. ఐదు కారిడార్లలో 76.4 కిలోమీటర్ల రెండోదశ మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణానికి అంచనా వేసిన రూ.24,269 కోట్లలో తెలంగాణ ప్రభుత్వం వాటా రూ. 7,313 కోట్లు (30 శాతం) కాగా, కేంద్ర ప్రభుత్వం వాటా రూ.4,230 కోట్లు (18 శాతం), జపాన్ ఇంటర్నేషన్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా), ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ), న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) మొదలైన ఆర్థిక సంస్థల వాటా రూ.11,693 కోట్లు (48 శాతం), మరో 4 శాతం అంటే రూ.1,033 కోట్లను పీపీపీ విధానం ద్వారా సమీకరిస్తారు. ఫోర్త్‌సిటీ మెట్రో కనెక్టివిటీకి రూ.8 వేల కోట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించిన ఫోర్త్ సిటీ మెట్రో కనెక్టివిటీ లైన్ కోసం అనేక ఆకర్షణీయ ఫీచర్లతో వినూత్న రీతిలో డీపీఆర్ తయారు చేస్తున్నట్లు పురపాలక శాఖ తెలిపింది. ఈ కొత్త లైన్ డీపీఆర్ మినహా మిగిలిన ఐదు కారిడార్లకు సంబంధించిన డీపీఆర్‌ను త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని అధికారులు తెలిపారు. ఫోర్త్ సిటీ మెట్రో కనెక్టివిటీకి సుమారు రూ.8,000 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. దీంతో మొత్తం రెండో దశ ప్రాజెక్ట్ కు అయ్యే వ్యయం దాదాపు రూ.32,237 కోట్లు (రూ.24,237 కోట్లు + రూ. 8,000 కోట్లు)గా అవుతుంది. కొత్త హైకోర్టును కలుపుతూ.. మెట్రో రైల్ రెండో దశ డీపీఆర్‌ల రూపకల్పనపై సీఎం రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం పురపాలక శాఖ సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మెట్రో రెండో దశ కారిడార్ల అలైన్మెంట్, స్టేషన్లు, ఇతర ముఖ్యమైన ఫీచర్లు తదితర అంశాల గురించి ప్రెజెంటేషన్ ఇచ్చారు. హెచ్ఎండీఏ కోసం సిద్ధం చేస్తున్న సమగ్ర మొబిలిటీ ప్లాన్ (సీఎంపీ) ట్రాఫిక్ అధ్యయన నివేదిక తరువాత డీపీఆర్‌లకు తుదిరూపం ఇచ్చారు. మెట్రో మార్గాల్లో ట్రాఫిక్ అంచనాలను సీఎంపీతో క్రాస్–చెక్ చేయాల్సి ఉంటుంది. కేంద్రానికి డీపీఆర్‌లను సమర్పించడానికి ఈ అధ్యయనం తప్పనిసరి. దీంతో మెట్రో అలైన్మెంట్లు, స్టేషన్లు ఇతర అంశాలపై పూర్తిస్థాయిలో సర్వే చేసి, నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేశారు. ఆ డీపీఆర్‌లకు సీఎం ఆమోదం తెలిపారు. కాగా గతంలో ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిర్ణయించిన ప్రకారం ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్ ను ఇప్పుడు ఆరామ్‌ఘర్, 44వ నెంబర్ జాతీయ రహదారి (బెంగళూరు హైవే)లోని కొత్త హైకోర్టు ప్రాంతం మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునేలా ఖరారు చేశారు. ఐదు కారిడార్ల అలైన్మెంట్లు ఇలా.. కారిడార్ –4 (ఎయిర్పోర్ట్ మెట్రో కారిడార్): నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు దాదాపు 36.6 కి.మీ. ఎల్బీ నగర్, కర్మన్‌ఘాట్, ఒవైసీ హాస్పిటల్, డీఆర్డీఓ, చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, ఆరామ్‌ఘర్, న్యూ హైకోర్టు, శంషాబాద్ జంక్షన్ ద్వారా జాతీయ రహదారి మీదుగా ఈ మార్గం ఉంటుంది. ఇది నాగోల్, ఎల్బి నగర్, చంద్రాయన్ గుట్ట వద్ద ఉన్న అన్ని మెట్రోలైన్లకు అనుసంధానం చేయబడుతుంది. 36.6 కి.మీ పొడవులో 35 కి.మీ పిల్లర్ల మీద (ఎలివేటెడ్ ), 1.6 కి.మీ మార్గం భూగర్భంలో వెళ్తుంది. విమానాశ్రయం వద్ద భూగర్భ స్టేషన్ ఉంటుంది. ఈ మార్గంలో మొత్తం 24 స్టేషన్లు ఉంటాయి కారిడార్ 5: రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి కోకాపేట నియోపోలిస్ వరకు వరకు ఈ మార్గం ఉంటుంది. బయోడైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడ రోడ్, నానక్ రామ్ గూడ జంక్షన్, విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్, కోకాపేట నియోపోలిస్ వరకు నిర్మిస్తారు. ఇది మొత్తం పిల్లర్లపైనే ఉండే ఎలివేటెడ్ కారిడార్. ఇందులో 8 స్టేషన్లు ఉంటాయి. కారిడార్ 6 (ఓల్డ్ సిటీ మెట్రో): ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణ గుట్ట వరకు ఇది ఉంటుంది. ప్రస్తుతం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న గ్రీన్ లైన్ పొడిగింపుగా 7.5 కి. మీ మేర నిర్మించబడుతుంది. ఓల్డ్ సిటీలోని మండి రోడ్, దారుల్షిఫా జంక్షన్, శాలిబండ జంక్షన్, ఫలక్‌నుమా మీదుగా ప్రయాణిస్తుంది. ఈ కారిడార్ సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్ నుంచి 500 మీటర్ల దూరం నుంచి వెళ్తున్నప్పటికీ చారిత్రక ప్రాముఖ్యత కారణంగా ఆ పేర్లనే స్టేషన్లకు పెట్టాలని నిర్ణయించారు. ఈ రూట్లో ఉన్న రోడ్లను విస్తరిస్తారు. రోడ్డు విస్తరణ, మెట్రో అలైన్మెంట్లో దాదాపు 1100 ఆస్తులు ప్రభావితమవుతాయి. ప్రభావితమైన 400 ఆస్తులకు ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేశారు. ఈ మార్గంలో దాదాపు 103 మతపరమైన, వారసత్వ, ఇతర సున్నితమైన నిర్మాణాలు ఉన్నాయి. వాటన్నింటికీ తగిన ఇంజినీరింగ్ పరిష్కారాలు చూపుతారు. మెట్రో పిల్లర్ స్థానాల సర్దుబాటు ద్వారా ఆ నిర్మాణాలకు నష్టం కలుగకుండా చూస్తామని అధికారులు తెలిపారు. ఈ కారిడార్ దాదాపు 6 స్టేషన్లతో పూర్తి ఎలివేటెడ్ మెట్రో. కారిడార్ 7: ముంబై హైవేపై రెడ్ లైన్ పొడిగింపుగా నిర్మించబడుతోంది. ప్రస్తుతం ఉన్న మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి పటాన్చెరు వరకున్న 13.4 కి.మీ ఈ మెట్రోలైన్ ఆలి్వన్ క్రాస్ రోడ్, మదీనాగూడ, చందానగర్, బీహెచ్ఈఎల్, ఇక్రిసాట్ మీదుగా వెళ్తుంది. ఇది దాదాపు 10 స్టేషన్లతో ఉండే పూర్తి ఎలివేటెడ్ కారిడార్. కారిడార్ 8: విజయవాడ హైవేపై ఎల్.బి నగర్ నుంచి ప్రస్తుతం ఉన్న రెడ్ లైన్ పొడిగింపుగా హయత్‌నగర్ వరకు 7.1 కి.మీ మేర ఈ లైన్ నిర్మిస్తారు. ఈ లైన్ చింతలకుంట, వనస్థలిపురం, ఆటోనగర్, ఆర్టీసీ కాలనీ మీదుగా వెళుతుంది. ఇది కూడా పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్. ఈ లైన్లో 6 స్టేషన్లు ఉంటాయి. -
కేంద్రం అనుమతిస్తేనే.. మెట్రో రెండో దశకు కదలిక
హైదరాబాద్ మెట్రో రెండో దశకు రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో కేంద్రం అనుమతి తప్పనిసరిగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ఆమోదం కీలకంగా మారింది. మొదటి దశ ప్రాజెక్టు అనంతరం రెండో దశకు ప్రణాళికలను రూపొందించినప్పటికీ.. ఇప్పటికే తీవ్ర జాప్యం నెలకొంది. ఢిల్లీ తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ఈ జాప్యం కారణంగా ఇతర మెట్రోపాలిటన్ నగరాల్లో మెట్రో రెండు, మూడో దశలు కూడా పూర్తయ్యాయి. కానీ.. నగరంలో రెండోదశ ఏడెనిమిదేళ్లు ఆలస్యంగా ప్రారంభం కావడం గమనార్హం. కేబినెట్ ఆమోదంతో ఒక అడుగు ముందుకు పడింది కానీ ఇప్పుడు కేంద్రం అనుమతితో పాటు నిధుల కేటాయింపే కీలకంగా మారింది. 2029 నాటికి పూర్తయ్యే అవకాశం.. భాగ్య నగరం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మెట్రో రెండో దశ అనివార్యంగా మారింది. మొదటి దశలో మూడు కారిడార్లలో మెట్రో పరుగులు తీస్తోంది. నిత్యం సుమారు 5 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. రెండో దశ పూర్తయితే 8 లక్షల మంది మెట్రోల్లో పయనించే అవకాశం ఉంది. నాగోల్ నుంచి రాయదుర్గం వరకు, ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు చేపట్టిన మెట్రో మొదటి దశ నిర్మాణానికి రూ.22 వేల కోట్ల వరకు ఖర్చు కాగా, ప్రస్తుత రెండో దశకు రూ.24, 269 కోట్లతో హైదరాబాద్ మెట్రో రైల్ డీపీఆర్‌ను రూపొందించింది. 5 కారిడార్లలో 76.4 కిలో మీటర్ల మేర నిర్మాణం చేపట్టనున్నారు. కేంద్రం సకాలంలో అనుమతించి నిధులు కేటాయిస్తే 2029 నాటికి రెండో దశ పూర్తయ్యే అవకాశం ఉంది. కేంద్రం నుంచి అనుమతి లభించడంలో ఆలస్యం జరిగితే ఈప్రాజెక్టు మరింత వెనక్కి వెళ్లనుంది. రానున్న బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రం ఆమోదంతో పాటు నిధుల కేటాయింపు తప్పనిసరి.9వ స్థానానికి.. మెట్రో రెండో దశలో ఆలస్యం కారణంగా ఢిల్లీ తర్వాత రెండో స్థాననంలో ఉన్న హైదరాబాద్ ఇప్పుడు 9వ స్థానానికి పడిపోయినట్లు రవాణారంగ నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి పెద్ద నగరాలతో పాటు, పుణె, నాగపూర్, అహ్మదాబాద్ వంటి చిన్న నగరాలు కూడా మెట్రో విస్తరణలో హైదరాబాద్‌ను అధిగమించాయి. రెండో దశ నిర్మాణంలో జరిగిన ఆలస్యం వల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం కూడా భారీగా పెరిగింది. గత ప్రభుత్వ హయాంలోనే పీపీపీ పద్ధతిలో పూర్తి చేయాల్సిన ఎంజీబీఎస్– ఫలక్‌నుమా మార్గం నిలిచిపోయింది. ప్రస్తుతం దాన్ని రెండో దశలో కలిపి చాంద్రాయణగుట్ట వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. చదవండి: జన్వాడ ఫామ్ హౌస్ కేసులో మరో ట్విస్ట్!ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన అనంతరం మెట్రో రెండో దశతో పాటు మూసీ ప్రక్షాళనను ప్రతిష్టాత్మకంగా భావించి కార్యాచరణ చేపట్టారు. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.24.269 కోట్లలో 30 శాతం అంటే రూ.7,313 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, 18 శాతం అంటే రూ.4,230 కోట్లు కేంద్ర ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంది. మిగతా 52 శాతం నిధులను రుణాలతో పాటు పీపీపీ విధానంలో సమకూర్చుకోవాలని నిర్ణయించారు.5 కారిడార్లలో రెండో దశ..నాగోల్– శంషాబాద్ ఎయిర్ పోర్టు (36.8 కి.మీ) రాయదుర్గం–కోకాపేట్ నియోపొలిస్ (11.6 కి.మీ) ఎంజీబీఎస్–చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ) మియాపూర్–పటాన్చెరు (13.4కి.మీ) ఎల్బీనగర్–హయత్ నగర్ (7.1 కి.మీ.) -
మెట్రో రెండో దశ.. నార్త్ హైదరాబాద్‌కు తీవ్ర నిరాశ!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టు నార్త్ హైదరాబాద్‌ను తీవ్ర నిరాశకు గురిచేసింది. సికింద్రాబాద్, ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట్ మీదుగా ఔటర్‌రింగ్ రోడ్డు వరకు మెట్రో విస్తరణకు గత ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. కానీ.. ఇటీవల హైదరాబాద్ మెట్రోరైల్ ప్రకటించిన రెండో దశ డీపీఆర్‌లో ఉత్తరం వైపు మెట్రో ప్రస్తావన లేకపోవడం పట్ల తాజాగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు మేడ్చల్ మెట్రో సాధన సమితి ప్రతినిధులు ఇటీవల హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు.గత ప్రభుత్వ హయాంలో నగరానికి నలువైపులా మెట్రో సేవలను విస్తరించేలా 278 కిలోమీటర్ల మేర ప్రణాళికలను రూపొందించగా.. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు 6 కారిడార్లలో 116.2 కిలోమీటర్లకే పరిమితం చేసింది. ఎయిర్‌పోర్టుతో పాటు కొత్తగా ప్రతిపాదించిన ఫోర్త్‌సిటీకి సైతం మెట్రో విస్తరించనున్నట్లు పేర్కొంది. గతంలోనే ప్రణాళికలను సిద్ధం చేసినప్పటికీ రెండో దశలో నార్త్‌సిటీ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. డబుల్ డెక్కర్ మెట్రో ఎక్కడ? జంట నగరాలతో పాటు ఉత్తర తెలంగాణలోని అయిదు జిల్లాల ప్రజలు, వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించింది. ఇదే మార్గంలో మెట్రో రైల్ నిర్మాణం చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమధ్య ప్రకటించినా ఇప్పటివరకు ఈ దిశగా ఎలాంటి పురోగతి లేదు. ప్రస్తుతం ఈ రూట్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఎలాంటి నిధులను కేటాయించలేదు. భూసేకరణ దశకే ఈ ప్రాజెక్టు పరిమితమైంది.ప్యారడైజ్ జంక్షన్ నుంచి తాడ్‌బండ్, బోయినపల్లి జంక్షన్ల మీదుగా డెయిరీఫాం రోడ్డు వరకు ఆరు వరుసల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని ప్రతిపాదించారు. ఇది పూర్తయిన తర్వాత ఈ ఎలివేటెడ్ కారిడార్‌పై మెట్రో నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదన ఉంది. ప్రస్తుతం ఈ రూట్లో ప్రతిరోజూ లక్షలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. నగరవాసులు సిటీ బస్సులపై ఆధారపడి ప్రయాణం చేయాల్సివస్తోంది. పలుచోట్ల రహదారులు ఇరుకుగా ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సుమారు రూ.1,580 కోట్ల అంచనాలలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించి, అదే రూట్లో డబుల్ డెక్కర్ మెట్రో కారిడార్‌ను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదించారు. కానీ ఎలాంటి పురోగతి లేకుండాపోయింది. మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆవిర్భావం.. నార్త్ సిటీకి మెట్రో నిర్మాణం చేపట్టాలనే డిమాండ్‌తో ఆవిర్భవించిన మేడ్చల్ మెట్రోసాధన సమితి ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసనలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ నేతృత్వంలో మేడ్చల్ సాధన సమితి ఆవిర్భవించింది. గత ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి తూంకుంట వరకు 17 కిలోమీటర్ల మార్గంలో డబుల్ ఎలివేటెడ్ ఫ్లై ఓవర్, మెట్రో రైల్ నిర్మాణం చేపట్టాలని, , ప్యారడైజ్ నుంచి కండక్లకోయ వరకు 12 కి.మీ మార్గంలో, ఓఆర్ఆర్ మేడ్చల్ ఇంటర్‌ఛేంజ్‌కు రాకపోకలు సాగించేలా మెట్రో సదుపాయం కల్పించాలని ఈ సంఘం డిమాండ్ చేస్తోంది. చదవండి: హైడ్రా.. రిజిస్ట్రేషన్లు విత్డ్రాఅలాగే గతంలో ప్రతిపాదించినట్లుగా ఉప్పల్‌క్రాస్‌రోడ్ నుంచి ఘట్కేసర్ ఓఆర్ఆర్– బీబీనగర్ వరకు 25 కిలోమీటర్లు, తార్నాకా ఎక్స్‌రోడ్– ఈసీఐఎల్ ఎక్స్‌రోడ్ వరకు 8 కిలోమీటర్ల మేర మెట్రో చేపట్టాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. మరోవైపు ప్రతిరోజూ లక్షలాది మంది రాకపోకలు సాగించే సూరారం, కుత్బుల్లాపూర్ ప్రాంతాలకు మెట్రో విస్తరణ చేపట్టాలని, ఎల్బీనగర్–మియాపూర్ రూట్లోని భరత్‌నగర్ నుంచి మూసాపేట్ మీదుగా సూరారం, కుత్బుల్లాపూర్ వరకు మెట్రో విస్తరించాలని ఆ ప్రాంతాల్లోని వివిధ కాలనీల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. -
Hyderabad Metro: నగరానికి నలువైపులా మెట్రో.. ఫ్యూచర్‌సిటీకి మహర్దశ
సాక్షి, సిటీబ్యూరో: రెండో దశ ప్రాజెక్టుతో హైదరాబాద్ నగరం నలువైపులా మెట్రో సేవలు విస్తరించనున్నాయి. ప్రస్తుతం నాగోల్ నుంచి రాయదుర్గం, ఎల్బీనగర్ నుంచి మియాపూర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మూడు కారిడార్లలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. రెండో దశలో కొత్తగా మరో ఆరు మార్గాల్లో మెట్రో విస్తరించనున్నారు. నగరంలోని ఎక్కడి నుంచైనా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకొనేవిధంగా ఎయిర్‌పోర్టు మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన ఫోర్త్‌సిటీకి కూడా ఈ రెండో దశలోనే మెట్రో నిర్మాణానికి అడుగులు పడనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తరువాత అనేక రకాల ఆకర్షణీయమైన ఫీచర్లతో ఫ్యూచర్‌సిటీ మెట్రో డీపీఆర్‌ను తయారు చేయనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మరోవైపు ఇటు మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు, అటు ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు, కొత్తగా పడమటి వైపు కోకాపేట్ నియోపోలిస్ వరకు మెట్రో విస్తరించనున్న దృష్ట్యా కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకొనే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫోర్త్‌సిటీకి కూడా మెట్రో పరుగులు పెట్టే అవకాశం ఉన్న దృష్ట్యా దక్షిణ హైదరాబాద్ అభివృద్ధి చెందనుంది. ఇప్పటికే ఔటర్ రింగ్‌రోడ్డు వరకు జీహెచ్ఎంసీ పరిధిని విస్తరించిన సంగతి తెలిసిందే. మరోవైపు హెచ్ఎండీఏ పరిధిని కూడా ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ వరకు పొడిగించింది. దీంతో ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు పెద్ద ఎత్తున టౌన్‌షిప్పులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ప్రజారవాణా, మౌలిక సదుపాయాలు సైతం విస్తరించనున్నాయి.పెరిగిన రూట్...రెండో దశ మెట్రో ప్రాజెక్టును మొదట 72 కిలోమీటర్ల వరకు నిర్మించేందుకు ప్రణాళికలను రూపొందించారు. కానీ రెండు, మూడు దఫాలుగా ప్రాజెక్టును వివిధ మార్గాల్లో పొడిగించారు. దీంతో ప్రస్తుతం ఇది 116.2 కిలోమీటర్లతో అతి పెద్ద ప్రాజెక్టుగా అవతరించింది. గతంలో మైలార్‌దేవ్‌పల్లి నుంచి పీ–7 రోడ్డు మార్గంలో ఎయిర్‌పోర్టు వరకు ప్రతిపాదించిన రూట్‌ను తాజాగా మార్చారు. ఆరాంఘర్ నుంచి కొత్త హైకోర్టు మీదుగా మళ్లించారు. అలాగే రాయదుర్గం నుంచి అమెరికన్ కాన్సులేట్ వరకు మొదట ప్రతిపాదించిన రూట్‌ను సైతం ఇప్పుడు కోకాపేట్ నియోపోలిస్ వరకు పొడిగించడంతో రెండో దశ రూట్ కిలోమీటర్లు పెరిగాయి. కొత్తగా ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్‌సిటీ వరకు 40 కిలోమీటర్ల మార్గాన్ని కూడా ఈ రెండో దశలోనే ప్రతిపాదించడం గమనార్హం. అలాగే ఓల్డ్‌సిటీ రూట్లో మొదట ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు ప్రతిపాదించగా దాన్ని ప్రస్తుతం చాంద్రాయణగుట్ట వరకు పొడిగించారు. ఇలా అన్ని వైపులా అదనంగా పొడిగించడంతో రెండో దశ పరిధి బాగా విస్తరించింది.1.5 కి.మీకు ఒకటి..రెండో దశ ప్రాజెక్టులో కొత్తగా 80కి పైగా మెట్రో స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. చాంద్రాయణగుట్ట వద్ద భారీ ఇంటర్‌ఛేంజ్ స్టేషన్‌ను నిర్మిస్తారు. వివిధ మార్గాల్లో వచ్చే రైళ్లు ఈ స్టేషన్ నుంచి మారే అవకాశం ఉంది. ప్రతి ఒక కిలోమీటర్‌కు, లేదా 1.5 కిలోమీటర్లకు ఒకటి చొప్పున అందుబాటులో ఉండేవిధంగా అన్ని రూట్లలో పెద్ద సంఖ్యలో స్టేషన్లను నిర్మిస్తారు. ప్రస్తుతం హెచ్ఎండీఏ రూపొందిస్తున్న కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లానింగ్ ప్రకారం స్టేషన్లను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఇప్పుడున్న మూడు కారిడార్ల నుంచి కూడా ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు, ఫోర్త్‌సిటీ, పటాన్చెరు, హయత్‌నగర్ తదితర అన్ని వైపులకు ప్రయాణించేవిధంగా మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు ఎయిర్‌పోర్టు వద్ద కొత్తగా ప్రతిపాదించిన 1.6 కిలోమీటర్ల భూగర్భ మెట్రో మార్గంలోనే మెట్రో స్టేషన్ కూడా రానుండడం మరో ప్రత్యేకత. -
116 కి.మీ. 80స్టేషన్లు..
సాక్షి, హైదరాబాద్: రెండోదశలో భాగంగా మొత్తం ఆరు కారిడార్లలో 116.2 కిలోమీటర్ల మేర 80కు పైగా స్టేషన్లతో మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఎయిర్‌పోర్ట్‌తో పాటు, కొత్తగా ప్రతిపాదించిన ఫోర్త్‌సిటీతో సహా నగరంలోని వివిధ మార్గాల్లో మెట్రో సేవలను విస్తరించనున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రెండోదశ ప్రాజెక్టు డీపీఆర్‌లకు తుదిమెరుగులు దిద్దుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ ఎనీ్వఎస్ రెడ్డి వెల్లడించారు. 40 కి.మీ పొడవుతో కొత్తగా ప్రతిపాదిస్తున్న ఎయిర్పోర్ట్ టూ ఫోర్త్ సిటీ కారిడార్‌కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) మినహా మిగతా ఐదు కారిడార్ల డీపీఆర్‌లను త్వరలోనే కేంద్రానికి సమరి్పంచనున్నట్లు తెలిపారు.ఎయిర్పోర్ట్ టూ ఫోర్త్ సిటీ డీపీఆర్ ఆకర్షణీయమైన ఫీచర్లతో రూపుదిద్దుకుంటోందని, మరికొద్ది నెలల్లో దీన్ని కేంద్రం అనుమతి కోసం పంపుతామని చెప్పారు. ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్లో మార్పు చేస్తూ కొత్తగా డీపీఆర్ సిద్ధం చేసినట్లు వివరించారు. మెట్రో రైలు రెండోదశపై ఆదివారం బేగంపేట్ మెట్రో భవన్లో ఆయన సవివరమైన ప్రెజెంటేషన్ ఇచ్చారు. ట్రాఫిక్ అధ్యయనం ‘రెండోదశకు సంబంధించి హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ పరిధిలోప్రస్తుతం ట్రాఫిక్ అధ్యయనం కొనసాగుతోంది. త్వరలో రూపొందించనున్న ట్రాఫిక్ అధ్యయన నివేదికను (కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ (సీఎంపీ) కూడా పరిగణనలోకి తీసుకోనున్నాం. రెండోదశ మెట్రో మార్గాలలో ట్రాఫిక్ అంచనాలను సీఎంపీతో క్రాస్‌చెక్ చేయనున్నాం. రెండో దశ డీపీఆర్‌లకు కేంద్రం నుంచి ఆమోదం పొందేందుకు ఇది తప్పనిసరి. ఎయిర్పోర్ట్ రూట్‌కు సంబంధించి అలైన్మెంట్లో కొంత మార్పు చేశాం. గతంలో మైలార్‌దేవ్‌పల్లి నుంచి నేరుగా ఎయిర్‌పోర్టు వరకు ప్రతిపాదించగా, ప్రస్తుతం దాన్ని ఆరాంఘర్ నుంచి 44వ నంబర్ జాతీయ రహదారి (బెంగళూరు హైవే)లోని కొత్త హైకోర్టు ప్రాంతం మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునేలా డీపీఆర్‌ను ఖరారు చేస్తున్నాం..’అని ఎనీ్వఎస్ రెడ్డి తెలిపారు. ఇతర ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. భూగర్భంలో మెట్రో రైల్ నాగోల్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు సుమారు 36 కిలోమీటర్ల మార్గంలో నిర్మించనున్న నాలుగో కారిడార్ ఎల్బీనగర్, కర్మన్‌ఘాట్, ఒవైసీ ఆసుపత్రి, డీఆర్డీఓ, చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, ఆరాంఘర్, కొత్త హైకోర్టు మీదుగా శంషాబాద్ జంక్షన్ నుంచి సాగుతుంది. రాయదుర్గం నుంచి నాగోల్ వరకు, మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న కారిడార్లు.. ఎయిర్‌పోర్టు మార్గంలో నాగోల్, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట స్టేషన్ల వద్ద అనుసంధానమవుతాయి. మొత్తం 36.6 కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ మెట్రో రూట్లో 35 కిలోమీటర్లు ఎలివేట్ చేయనున్నారు. 1.6 కిలోమీటర్ల వరకు మెట్రోలైన్ భూగర్భంలో నిర్మిస్తారు. ఎయిర్పోర్ట్ స్టేషన్ కూడా భూగర్భంలోనే ఉంటుంది. ఈ రూట్లో 24 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ⇒ ఐదవ కారిడార్‌లో ఇప్పుడు ఉన్న రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి కోకాపేట్ నియోపొలిస్ వరకు కొత్తగా లైన్ నిర్మించనున్నారు. ఇది బయోడైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడ రోడ్, నానక్ రామ్‌గూడ జంక్షన్, విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ నియోపోలిస్ వరకు ఉంటుంది. ఇది పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్. ఈ 11.6 కిలోమీటర్ల మార్గంలో 8 స్టేషన్లు నిర్మించే అవకాశం ఉంది.⇒ ఆరో కారిడార్‌లో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న రూట్‌ను గతంలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు విస్తరించాలని ప్రతిపాదించారు. తాజాగా ఈ మార్గాన్ని చాంద్రాయణగుట్ట వరకు పొడిగించారు. ఇది ఎంజీబీఎస్ నుంచి ఓల్డ్ సిటీలోని మండి రోడ్ మీదుగా దారుల్íÙఫా జంక్షన్, శాలిబండ జంక్షన్, ఫలక్‌నుమా మీదుగా చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సాలార్జంగ్ మ్యూజియం, చారి్మనార్లు ఈ కారిడార్‌కు 500 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, అక్కడ నిర్మించే స్టేషన్లకు ఆ పేర్లే పెట్టనున్నారు. రోడ్ల విస్తరణ ⇒ ప్రస్తుతం దారుల్íÙఫా జంక్షన్ నుంచి శాలిబండ జంక్షన్ మధ్య ఉన్న 60 అడుగుల రోడ్డు, శాలిబండ జంక్షన్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు ఉన్న 80 అడుగుల రోడ్లను 100 అడుగులకు విస్తరించనున్నారు. స్టేషన్లు ఉండే ప్రాంతాల్లో మాత్రం 120 అడుగులకు విస్తరిస్తారు. పాతబస్తీ మెట్రో అలైన్మెంట్, రోడ్డు విస్తరణ నేపథ్యంలో సుమారు 1,100 నిర్మాణాలను తొలగించే అవకాశంఉంది. ఆరో కారిడార్‌లో 103 మతపరమైన, వారసత్వ, ఇతర సున్నితమైన నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటన్నింటికీ తగిన ఇంజనీరింగ్ పరిష్కారాలతో, మెట్రో పిల్లర్ స్థానాలను సర్దుబాటు చేయనున్నారు. ఈ రూట్లో మొత్తం 6 స్టేషన్లు ఉంటాయి. ⇒ ఏడవ కారిడార్‌లో మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి పటాన్చెరు వరకు 13.4 కిలోమీటర్ల మేర లైన్ నిర్మించనున్నారు. మియాపూర్ నుంచి ఆలి్వన్ క్రాస్‌రోడ్స్, మదీనాగూడ, చందానగర్, బీహెచ్ఈఎల్, ఇక్రిసాట్ మీదుగా ఇది వెళుతుంది. ఈ రూట్లో సుమారు 10 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇది పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్. ⇒ ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు నిర్మించనున్న 8వ కారిడార్ 7.1 కిలోమీటర్ల వరకు ఉంటుంది. చింతలకుంట, వనస్థలిపురం, ఆటోనగర్, ఆర్టీసీ కాలనీల మీదుగా హయత్‌నగర్ వరకు నిర్మిస్తారు. సుమారు 6 స్టేషన్లు ఉంటాయి. ఇది కూడా పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్. 9వ కారిడార్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫోర్త్‌సిటీలోని స్కిల్స్ యూనివర్సిటీ వరకు ఉంటుంది. ⇒ రెండోదశ ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు రూ..32,237 కోట్లు వ్యయం కానున్నట్లు అంచనా. ఇందులో 40 కిలోమీటర్ల ఫోర్త్‌సిటీ మెట్రోకే రూ.8 వేల కోట్ల వరకు ఖర్చు కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా మెట్రో రెండో దశ చేపట్టనున్నారు.రెండో దశ కారిడార్లు ఇవీ (కిలో మీటర్లలో)కారిడార్ – 4 నాగోల్ – ఎయిర్పోర్ట్ 36.6కారిడార్ – 5 రాయదుర్గం–కోకాపేట్ నియోపొలిస్ 11.6కారిడార్ – 6 ఎంజీబీఎస్ –చాంద్రాయణగుట్ట (ఓల్డ్ సిటీ కారిడార్) 7.5కారిడార్ – 7 మియాపూర్ – పటాన్చెరు 13.4కారిడార్ – 8 ఎల్బీనగర్–హయత్ నగర్ 7.1కారిడార్ – 9 ఎయిర్పోర్ట్– ఫోర్త్ సిటీ (స్కిల్స్ యూనివర్సిటీ) 40 -
రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే మెట్రో విస్తరణ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయనే 270 కి.మీ. మెట్రో రైలు నిర్మాణం చేస్తామంటూ బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయించిందని, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే ఈ మెట్రో విస్తరణ అని అందరూ అనుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. తొమ్మిదేళ్లలో కనీసం పాతబస్తీలో 5.5 కి.మీ మైట్రోరైలు సదుపాయం కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వం, ఒకేసారి రూ.69 వేల కోట్ల అంచనా వ్యయంతో దీనిని నిర్మిస్తామనడం పలు అనుమానా లకు తావిస్తోందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాల యంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వరదలో మునిగిపోయి ప్రజ లు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి వరద ప్రాంతాల్లో పర్యటించకుండా బీఆర్ఎస్ పార్టీ విస్తరణ కోసం మహారాష్ట్ర వెళ్లారన్నారు. -
Greater Hyderabad: నలుదిశలా మెట్రో పరుగులు.. మారనున్న ముఖచిత్రం
సాక్షి, హైదరాబాద్: మెట్రో విస్తరణతో గ్రేటర్ హైదరాబాద్ రవాణా ముఖచిత్రం మారనుంది. నగరానికి నలుదిశలా మెట్రో సేవలను అందుబాటులోకి తేవాలని తాజాగా రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో సుమారు 7,220 చదరపు కిలోమీటర్ల పరిధిలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరానికి మెట్రో మణిహారంగా పరుగులు తీయనుంది. ఔటర్చుట్టూ మెట్రో, ఎంఎంటీఎస్ వంటి సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణ సమయంలోనే ప్రత్యేకంగా కొంత భూమిని కేటాయించారు. దీంతో ఆ మార్గంలో మెట్రో విస్తరణపైన ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. అన్ని వైపులా మెట్రో రైళ్లు అందుబాటులోకి వస్తే ప్రజారవాణా వేగవంతమవుతందని, ప్రజలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకై నా తేలిగ్గా రాకపోకలు సాగిస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రెండో దశకింద బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకాఫూల్ వరకు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో పొడిగించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అలాగే రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు మెట్రో నిర్మాణానికి కార్యాచరణ మొదలైంది. మెట్రో మొదటిదశలో మిగిలిపోయిన ఎంజీబీఎస్–ఫలక్‌నుమా రూట్లో 5.5 కి.మీ.మార్గానికి లైన్ క్లియర్ అయింది. ఈ లైన్ పూర్తయితే మొదటిదశలో ప్రతిపాదించిన 72 కిలోమీటర్ల మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయి. శంషాబాద్ నుంచి తుక్కుగూడ వరకు విస్తరించాలనే ప్రతిపాదన ఉంది. అలాగే ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు కూడా మెట్రో విస్తరణపైన ప్రభుత్వం తాజాగా దృష్టి సారించింది. 2021 నాటికే హైదరాబాద్ నగరానికి 200 కిలోమీటర్ల వరకు మెట్రో సేవలు అవసరమని లీ అసోసియేషన్ తేల్చిచెప్పింది. ప్రస్తుతం ఈ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇవీ లీ అసోసియేషన్ ప్రతిపాదనలు ... ► హైదరాబాద్ మహానగర రవాణా రంగంపై 2011లోనే సమగ్రమైన అధ్యయనం చేపట్టిన లీ అసోసియేషన్ ప్రభుత్వానికి అందజేసిన నివేదిక ప్రకారం 2041 నాటికి మహానగర జనాభా 2.5 కోట్లు దాటుతుంది. ఈ మేరకు భువనగిరి.సంగారెడ్డి, షాద్‌నగర్ వరకు సుమారు 420 కిలోమీటర్ల వరకు మెట్రో సదుపాయం కల్పించవలసి ఉంటుంది. ► మెట్రో నగరాల్లో కనీసం 20 శాతం రోడ్లు అందుబాటులో ఉండాలి. కానీ నగరంలో ప్రస్తుతం 5 శాతం రోడ్లే ఉన్నాయి. కానీ రోడ్లపైన ప్రతి రోజు సుమారు 75 లక్షలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ► వేగంగా విస్తరిస్తున్న నగర అవసరాలకు అనుగుణంగా అంతేవేగవంతమైన రవాణా సేవలకు మెట్రో ఒక్కటే పరిష్కారం. 2011 నాటికే 72 కిలోమీటర్ల మేరకు మెట్రో సదుపాయం కల్పించాలని లీ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఎయిర్‌పోర్టు మెట్రోతో ఊరట... రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు సుమారు రూ.5 వేల కోట్లకు పైగా అంచనాలతో చేపట్టిన ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ వే కార్యాచరణవేగవంతమైంది. టెండర్ల ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. ప్రస్తుతం రెండు దిగ్గజ సంస్థలో పోటీలో ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి ఎయిర్‌పోర్టు మెట్రోను దక్కించుకోనుంది. దీంతో ఈ ఏడాదిలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎయిర్‌పోర్టు మెట్రో విస్తరణ వల్ల కేవలం ప్రయాణికులకే కాకుండా జీవో 111 ప్రాంతాలకు కూడా మెట్రో అందుబాటులోకి వస్తుంది. ఆ 38 కిలోమీటర్లు ఎంతో కీలకం... అత్యధిక వాహన సాంద్రత కలిగిన మార్గాల్లో బీహెచ్ఈఎల్, పటాన్చెరు నుంచి హయత్‌నగర్ వరకు ఉన్న మార్గం ఎంతో కీలకమైంది. ఈవైపు నుంచి ఆ వైపు చేరుకోవాలంటే కనీసం 3 గంటల సమయం పడుతుంది. కానీ మెట్రో అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. అలాగే వాహనాల వినియోగం కూడా చాలావరకు తగ్గుతుంది. మెట్రో రెండోదశపైన ప్రభుత్వం ఇప్పటికే సమగ్రమైన నివేదికను సిద్ధం చేసింది. నగరం నలువైపులా మెట్రో.... ► ఇప్పటికే రెండో దశలో బీహెచ్ఈఎల్ నుంచి లకిడికాఫూల్ వరకు ప్రతిపాదించిన మార్గాన్ని అటు బీహెచ్ఈఎల్ నుంచి పటాన్చెరు, ఇస్నాపూర్ వరకు సుమారు 13 కిలోమీటర్ల వరకు విస్తరించాలని నిర్ణయించారు. ► అలాగే ఎల్బీనగర్ వరకు ఉన్న మెట్రోను హయత్‌నగర్, పెద్దఅంబర్‌పేట్ వరకు మరో 13 కిలోమీటర్లు పొడిగిస్తారు. ► శంషాబాద్ నుంచి కొత్తూరు. షాద్‌నగర్ వరకు మరో 25 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉప్పల్ వరకు ఉన్న మెట్రోను ఘట్కేసర్ , బీబీనగర్ వరకు పొడిగిస్తారు.శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ప్రస్తుతం నిర్మించ తలపెట్టిన మెట్రో కారిడార్‌ను మరో 26 కిలోమీటర్లు పొడిగించి తుక్కుగూడ, మహేశ్వరం, కందుకూరు వరకు మెట్రో సదుపాయం కల్పిస్తారు. ► తార్నాక నుంచి ఈసీఐఎల్ వరకు 8 కిలోమీటర్ల ఎలివేటెడ్ మార్గాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు ఔటర్‌రింగ్‌రోడ్డు చుట్టూ 158 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి తూంకుంట, ప్యారైడెజ్ నుంచి కండ్లకోయ, కొంపల్లి, తదితర ప్రాంతాలకు కూడా మెట్రోను విస్తరించే ప్రతిపాదనలు ఉన్నాయి. సుమారు రూ.60 వేల కోట్ల అంచనాలతో 400 కిలోమీటర్ల మేరకు మెట్రో విస్తరణపై కేబినెట్ లో తాజాగా చేసిన ప్రతిపాదనలు హైదరాబాద్ మహానగర రవాణా ముఖచిత్రాన్ని సమూలంగా మార్చనున్నాయి. -
Hyderabad: మెట్రో రెండో దశ.. దూరమే!
సాక్షి, హైదరాబాద్: మెట్రోరైలు విస్తరణ పనులు మరింత ఆలస్యమయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. హైదరాబాద్ మెట్రోరైలు రెండో దశ కింద చేపట్టాలని భావించిన మూడు ప్రాజెక్టుల్లో ఒకటైన రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు కేరిడార్‌ను రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు శంకుస్థాపన కూడా చేసింది. మిగతా రెండు ప్రాజెక్టులైన బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకాపూల్, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు పొడిగింపు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వంతో కలిసి జాయింట్ వెంచర్‌గా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ.. ఆ దిశగా అడుగులు అంత వేగంగా పడడం లేదు. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి సామాజిక కార్యకర్త ఇనుగంటి రవికుమార్ ఆర్టీఐ ద్వారా కేంద్రాన్ని కోరగా, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి వికాష్ కుమార్ ఈ మేరకు సమాధానమిచ్చారు. హైదరాబాద్ మెట్రో రెండో దశకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖలకు తాము స్పందించామని, తదుపరి కార్యాచరణ లేదని స్పష్టం చేశారు. మెట్రో రెండో దశ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ రాసిన లేఖకు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సమాధానమిస్తూ మెట్రో మంజూరుకు కీలకమైన డీపీఆర్‌లో మార్పులతో పాటు సాధ్యాసాధ్యాలపై పలు సందేహాలు వ్యక్తం చేశారు. వివరణ పంపని రాష్ట్రం డీపీఆర్‌ను ప్రస్తుత ధరలకు అనుగుణంగా మార్చాలని సూచించడంతో పాటు 14 అంశాలపై వివరణ కోరారు. తాము కోరిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణలు వస్తే పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు అర్వింద్‌కుమార్‌కు గత డిసెంబర్ 1న లేఖ రాసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి వివరణ పంపలేదు. కేంద్రం అడిగిన కేబినెట్ తీర్మానం కాపీ, స్పెషల్ పర్పస్ వెహికిల్, నిధులు సమకూర్చే సంస్థను ఎంపిక చేయడం, రోడ్‌మ్యాప్ మొదలైనవాటిని ఫైనలైజ్ చేసి పంపాలని కోరినా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పంపలేదని ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నలకు కేంద్రం సమాధానమిచ్చింది. ఈ నేపథ్యంలో రెండోదశ మెట్రో పనులపై అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. -
రాష్ట్రంపై ‘శత్రు’ వైఖరి: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోసం ఎన్ని ప్రతిపాదనలు పంపినా పట్టించుకోవడం లేదని మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. హైదరాబాద్‌లో మెట్రోరైలు విస్తరణకు ఉన్న డిమాండ్‌పై ఏమాత్రం స్పందించడం లేదని.. మరోవైపు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని నగరాలలో మెట్రో ప్రాజెక్టులకు కేంద్ర వాటాతో పాటు సావరిన్ గ్యారంటీల పేరిట పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని మండిపడ్డారు. అయినా హైదరాబాద్ ప్రజల ఆకాంక్ష, పెరుగుతున్న నగర అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వమే మెట్రో ప్రాజెక్టు విస్తరణ కోసం కృషి చేస్తోందని చెప్పారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా శనివారం ప్రశ్నోత్తరాల సమయంలో మెట్రో రైలు ప్రాజెక్టు పొడిగింపు అంశంపై సభ్యులు అరికపూడి గాంధీ, దానం నాగేందర్, ప్రకాశ్‌గౌడ్, భట్టి విక్రమార్క.. చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు (సీపీపీ)పై ఎంఐఎం సభ్యులు.. ఎస్‌ఎన్‌డీపీపై దానం నాగేందర్, వివేకానంద అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానాలు ఇచ్చారు. కోటీ 20లక్షల మంది నివసిస్తున్న హైదరాబాద్‌కు నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి మనసు రావడం లేదని, శత్రుదేశంపై పగబట్టినట్టుగా తెలంగాణపై కక్షగట్టి వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అసెంబ్లీలో కేటీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘కాంగ్రెస్ హయాంలో చేపట్టిన మెట్రో ప్రాజెక్టు ఒప్పందం మేరకే ప్రస్తుతం మూడు కారిడార్లలో ఎల్అండ్టీ సంస్థ ద్వారా నిర్వహణ ప్రక్రియ కొనసాగుతోంది. రూ.6,250 కోట్లతో ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు శ్రీకారం చుట్టాం. రాయదుర్గ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు ఈ ఎక్స్‌ప్రెస్ మెట్రోను మూడేళ్లలో పూర్తిచేయనున్నాం. హైదరాబాద్ మెట్రో ఉద్యోగాల్లో 80 శాతం వరకు తెలంగాణ వాళ్లే ఉన్నారు. కాంగ్రెస్ హయాంలో కుదిరిన ప్రైవేట్, పబ్లిక్ పార్ట్నర్షిప్ ఒప్పందంలో భాగంగా మెట్రో టికెట్ ధరలను పెంచుకునే అధికారాన్ని నిర్వహణ సంస్థకే ఇచ్చారు. అయినా ఇష్టానుసారం ధరలు పెంచకూడదని ప్రభుత్వం తరఫున చెప్పాం. ఆర్టీసీ ధరలతో పోల్చి మెట్రో టికెట్ ధరలు ఉండాలన్నాం. పాతబస్తీలో మెట్రో రైలు ప్రాజెక్టును పొడిగించే విషయంలో ఇటీవలే ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌తో సమావేశమయ్యాను. ముందుగా రూ.100 కోట్లతో రోడ్ల విస్తరణ పూర్తిచేసి పనులు చేపట్టనున్నాం. హైదరాబాద్ ఆత్మ ఎప్పటికీ చెదిరిపోదు హైదరాబాద్ సాంస్కృతిక వైభవాన్ని కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది. చార్మినార్ సంరక్షణ కోసం పాదచారుల ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. ఎన్ని అధునాతన భవంతులు వెలిసినా హైదరాబాద్ ఆత్మ ఎప్పటికీ చెదిరిపోదు. మూసీనదిపై అఫ్జల్‌గంజ్ వద్ద ఐకానిక్ పెడస్ట్రియన్ బ్రిడ్జి నిర్మాణం కోసం టెండర్లు పిలిచాం. మరో పెడస్ట్రియన్ బ్రిడ్జిని నయాపూల్ వద్ద నిర్మించే యోచనలో ఉన్నాం. గుల్జార్‌హౌస్, మీరాలం మండి, ఆషుర్ ఖానాకు పూర్వవైభవం తీసుకొస్తున్నాం. మదీనా నుంచి పత్తర్‌ఘట్టి వరకు పనులు పూర్తికావొచ్చాయి. పాతబస్తీలో సుందరీకరణ, సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టాం. చార్మినార్ నుంచి దారుల్–ఉలం స్కూల్ వరకు రోడ్డు వెడల్పు పనులు పూర్తయ్యాయి. హుస్సేనీ ఆలం నుంచి దూద్‌బౌలి వరకు విస్తరణ పనులు జరుగుతున్నాయి. హెరిటేజ్ భవంతుల పూర్వ వైభవం కోసం ఎంత ఖర్చయినా వెనుకాడబోం. ఎస్ఎన్డీపీ ఏ నగరంలోనూ లేదు హైదరాబాద్‌లో రూ.985.45 కోట్లతో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి (స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఎన్డీపీ)) చేపట్టాం. జీహెచ్ఎంసీ పరిధిలో 35 పనులకు 11 పూర్తిచేశాం. పరిసర మున్సిపాలిటీల్లో 21 పనులకుగాను 2 పూర్తిచేశాం. నగరంలో వందేండ్ల క్రితం నిర్మించిన నాలాలే ఉన్నాయి. పలుచోట్ల నాలాలపై 28వేల మంది పేదలు ఇండ్లు కట్టుకున్నారు. ప్రస్తుతం ఎస్ఎన్డీపీ ఫేజ్–2కు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. పలు కాలనీల్లో గత వర్షాకాలంలో ముంపు సమస్య కొంతమేర తగ్గింది..’’ అని కేటీఆర్ వివరించారు. 9 నెలల్లో పిల్లలు వస్తారు – మీరు రారు! సభలో మొదట సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో మెట్రోరైలు ప్రాజెక్టు వచ్చిందని, కానీ ఇప్పుడు ఆదాయాన్ని మొత్తంగా నిర్వహణ సంస్థకే దోచిపెడుతున్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. ‘‘60 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆమాత్రం చేయలేరా?’’ అని నవ్వుతూ అంటూనే.. ‘‘మాట్లాడితే తొమ్మిది నెలల్లో మేం వస్తాం అంటున్నారు. తొమ్మిది నెలల్లో పిల్లలు వస్తారు. మీరు రారు’’ అని వ్యాఖ్యానించారు. దీనితో సభలో అంతా ఒక్కసారిగా ఘొల్లుమన్నారు. ఇక సంగారెడ్డి మెట్రో ప్రాజెక్టు గురించి జగ్గారెడ్డి అడుగుతున్న విషయాన్ని కేటీఆర్ ప్రసంగం తర్వాత గుర్తుచేయగా నవ్వుతూ.. ‘‘9 నెలల్లో వస్తారుగా.. అప్పుడు చూసుకోండి’’ అని పేర్కొన్నారు. అప్పటికే మైక్ ఆపేయడంతో ఆ మాటలు రికార్డులకు ఎక్కలేదు. ప్రతిపాదనలన్నీ వెనక్కే.. కోటీ 20లక్షల మంది నివసిస్తున్న హైదరాబాద్‌కు నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం శత్రుదేశంపై పగబట్టినట్టుగా తెలంగాణపై కక్షగట్టి వ్యవహరిస్తోంది. హైదరాబాద్‌లో మెట్రో పొడిగింపు కోసం కేంద్ర ప్రభుత్వ వాటా ఇవ్వాలని కేంద్ర మంత్రిని కలుద్దామంటే అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. అధికారులను పంపించినా సానుకూల స్పందన రాలేదు. ఢిల్లీ మెట్రో అధికారులతో హైదరాబాద్ మెట్రో ఆడిటింగ్ చేయించాం. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ మెట్రోకు కేంద్ర ప్రభుత్వ సాయం కోరితే వయబిలిటీ లేదని, ఇతర కారణాలు చూపుతూ నిధులు కేటాయించడం లేదు. వడ్డించేవాళ్లు మనవాళ్లయితే అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోంది. బెంగళూరు మెట్రోకు కేంద్రం 20 శాతం వాటాతోపాటు రూ.29వేల కోట్లకుపైగా సావరిన్ గ్యారెంటీ ఇచ్చింది. చెన్నై మెట్రోకు కేంద్రం వాటా, సావరిన్ గ్యారంటీ కలిపి రూ.58,795 కోట్లు కేటాయించింది. యూపీ లోని ఆరు పట్టణాలకు 20 శాతం వాటాతో పాటు సావరిన్ గ్యారంటీ ఇస్తోంది. – మంత్రి కేటీఆర్ -
హైస్పీడ్‌లో మెట్రో పనులు.. రాయదుర్గం-ఎయిర్పోర్ట్ మధ్య అలైన్మెంట్ ఖరారు!
సాక్షి, సిటీబ్యూరో: ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌మెట్రో నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి మధ్యన అలైన్మెంట్ ఖరారు, గ్రౌండ్ డేటా సేకరణ తదితర పనులను వేగవంతం చేసేందుకు రెండు సర్వే బృందాలను ఏర్పాటు చేసినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఈ మార్గంలో జరుగుతున్న సర్వే పనులను ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. మెట్రో పిల్లర్లు, వయాడక్ట్, స్టేషన్ల నిర్మాణం, వాటి ఎత్తు ఎంత వుండాలనే విషయంలో ఈ డేటా కీలకం కానుందన్నారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి నార్సింగి జంక్షన్ వరకు ఎయిర్పోర్ట్ మెట్రో మార్గాన్ని పరిశీలించారు. దాదాపు 10 కి.మీ మేర ఉన్న ఈ మార్గంలో కాలినడకన వెళుతూ ఇంజినీర్లకు, సర్వే బృందాలకు తగిన సూచనలిచ్చారు. దిశానిర్దేశం ఇలా.. - మెట్రో స్టేషన్లు ప్రధాన రహదారి జంక్షన్లకు దగ్గరగా ఉండాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు ఎయిర్పోర్ట్ మెట్రో కారిడార్‌ను శివారు ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగ పడేలా తయారు చేయాలన్నారు. ఈ కారిడార్ విమానాశ్రయ ప్రయాణికులతో పాటు ఈ ప్రాంతంలో ఉండే వారందరికీ, శివార్లలో నివసించే తక్కువ ఆదాయ వర్గాల వారందరికీ ఉపయోగపడేలా ఉండాలని ఎనీ్వఎస్ రెడ్డి ఆదేశించారు. - ప్రయాణికులు తాము పనిచేసే ప్రాంతాలకు కేవలం 20 నిముషాల వ్యవధిలో చేరుకునేలా ఈ కారిడార్‌ను డిజైన్ చేయాలని స్పష్టం చేశారు. ఈ ప్రాంతం ఇప్పటికే ఆకాశహరŠామ్యలతో నిండి ఉంది. భవిష్యత్తులో ఈ ప్రాంత అభివృద్ధి ఊహించలేనంతగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మెట్రో స్టేషన్లు, స్కై వాక్‌ల నిర్మాణం ఉండాలని సూచించారు. మెట్రో స్టేషన్లకు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి ప్రయాణికుల వాహనాల పార్కింగ్ ఏరియా ఏర్పాటు చేయాలన్నారు. - రాయదుర్గ్ స్టేషన్ నుంచి సుమారు 900 మీటర్ల మేరకు స్టేషన్‌ను పొడిగించనున్న నేపథ్యంలో.. నూతన టెరి్మనల్ స్టేషన్, ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్లను అనుసంధానానికి మార్గాలను అన్వేíÙంచాలన్నారు. స్థలాభావం కారణంగా ఐకియా భవనం తర్వాత రెండు కొత్త స్టేషన్లు ఒకదానిపై ఒకటి నిర్మించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. - మొదటి రెండు అంతస్తుల్లో ఎయిర్ పోర్ట్ కొత్త రాయదుర్గ్ స్టేషన్, పొడిగించిన కొత్త బ్లూ లైన్ స్టేషన్ ఎగువ రెండు అంతస్తుల్లో ఉండేలా డిజైన్ చేయాలని అన్నారు. జేబీఎస్ స్టేషన్, అమీర్‌పేట్ ఇంటర్చేంజ్ స్టేషన్ల మాదిరిగా నాలుగు అంతస్తుల్లో ఈ స్టేషన్ల నిర్మాణం ఉండాలని సూచించారు. ఈ రూట్లో ట్రాన్స్‌కో సంస్థ ఇటీవల వేసిన 400 కేవీ అదనపు హై ఓల్టేజ్ భూగర్భ విద్యుత్ కేబుళ్లను మార్చే అవసరం లేకుండా చూడాలన్నారు. - బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద ఉన్న ఫ్లైఓవర్ మీదుగా ఎయిర్పోర్ట్ మెట్రో వయాడక్ట్ క్రాసింగ్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేయాలని సూచించారు. హై ఓల్టేజ్ అండర్‌గ్రౌండ్ కేబుళ్లను మార్చాల్సిన అవసరం లేకుండా చూడాలి. సైబర్ టవర్స్ జంక్షన్ ఫ్లైఓవర్ దగ్గర చేసినట్లు, ఫ్లైఓవర్ ర్యాంప్ పక్కనే మెట్రో పిల్లర్లు ఉండాలి. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌కు ఆనుకుని మెట్రో పిల్లర్ల నిర్మాణం తర్వాత, ట్రాఫిక్ కు ఏమాత్రం అంతరాయం రాకుండా చూడాలన్నారు. - బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద మెట్రే స్టేషన్‌ను నిర్మించే సమయంలో.. ఇదే మార్గంలోనే సమీప భవిష్యత్తులో నిర్మించనున్న బీహెచ్ఈఎల్– లక్డీకాపూల్ మెట్రో కారిడార్ అవసరాలపై కూడా దృష్టి సారించాలని ఎండీ సూచించారు. నానక్‌రామ్‌గూడ జంక్షన్ వద్ద మెట్రో స్టేషన్ నిర్మాణ విషయంలో అక్కడ నాలుగు దిక్కుల నుంచి వచ్చే ట్రాఫిక్‌ను విశ్లేషించాలన్నారు. ఇక్కడ నిర్మించబోయే స్కైవాక్ ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉండాలన్నారు. ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్ నుంచి వచ్చే వారి ప్రయాణ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని, దగ్గరలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో విశాలమైన పార్కింగ్ సౌకర్యాలు కలి్పంచే అవకాశాన్ని పరిశీలించమన్నారు. ∙నార్సింగి, కోకాపేట తదితర ప్రాంతాలలో వస్తున్న కొత్త కాలనీలు, వాణిజ్య సదుపాయాల అవసరాలను గుర్తించి నార్సింగి జంక్షన్ సమీపంలో నిర్మించే మెట్రో స్టేషన్ స్థానాన్ని ప్లాన్ చేయాలని సూచించారు. ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్‌కు ఆవల నుంచి వచ్చే ప్రయానికులను అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. -
మెట్రో రెండోదశకు నిధులు కేటాయించండి
సాక్షి, హైదరాబాద్: దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రోపాలిటన్ నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌లోని మెట్రోరైల్ ప్రాజెక్టు రెండోదశ కారిడార్ పనులను ఆమోదించడంతోపాటు కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదనలు చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి లేఖ రాశారు. హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తోందని, ప్రజల రవాణా అవసరాలకు అనుగుణంగా మెట్రో రైల్ రెండోదశలో రెండు కారిడార్లలో పనులు చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం 69 కిలోమీటర్ మార్గంలో మెట్రో రైళ్లు పరుగులు తీస్తున్నాయని, పీపీపీ మోడల్లో, వయబుల్ గ్యాప్ ఫండింగ్(వీజీఎఫ్) పథకం కింద చేపట్టిన మొదటిదశ మెట్రో రైల్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా నిలిచిందని లేఖలో పేర్కొన్నా రు. ఈ క్రమంలోనే రెండోదశలో భాగంగా 31 కి.మీ. నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కేటీఆర్ తెలిపారు. రెండు మార్గాల్లో విస్తరణ బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకా పూల్ వరకు 23 స్టేషన్లతో 26 కిలో మీటర్లు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు 4 స్టేషన్లతో 5 కిలోమీటర్ల మెట్రో కారిడార్లను నిర్మించేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లను కూడా రూపొందించినట్లు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టేందుకు రూ.8,453 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు లేఖలో వివరించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ద్వారా అక్టోబర్ 22న కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. రెండోదశ మెట్రోపైన కేంద్రమంత్రితో చర్చించేందుకు అనుమతి కోరినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఎక్స్టర్నల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్‌తో అమలయ్యే ఈ ప్రాజెక్టుకు పాలనాపరమైన సూత్రప్రాయ అనుమతులు ఇవ్వాలని, హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్ట్ రెండోదశను వచ్చే కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించాలని కోరారు. -
మరో మూడు మార్గాల్లో మెట్రో దౌడ్
సాక్షి, హైదరాబాద్/రాంగోపాల్‌పేట్: మెట్రో రెండో దశలో భాగంగా మరో 3 మార్గాల్లో మెట్రో ప్రాజెక్టు చేపట్టేందుకు డీపీఆర్ సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించామని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే ఈ పనులు ప్రారంభిస్తామన్నారు. మంగళవారం రసూల్‌పురాలోని మెట్రో భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. రాయదుర్గ్– శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు వయా నానక్‌రాంగూడ రూట్లో 31 కి.మీ.లు, మియాపూర్–బీహెచ్ఈఎల్కు అక్క డి నుంచి వయా హఫీజ్‌పేట్, కొండాపూర్, గచ్చిబోలి, ఓల్డ్ ముంబై హైవే, రేతిబౌలి, మెహదీపట్నం, మాసబ్‌ట్యాంక్ మీదుగా లక్డీకాపూల్ కారి డార్ 1కు మరో 26 కి.మీ., నాగోల్– ఎల్బీనగర్ వరకు 5 కి.మీ. దూరం మేర రెండోదశ ప్రాజెక్టు చేపడతామన్నారు. మొత్తం ఫేజ్– 2లో 62 కి.మీ. మెట్రో రైల్ మార్గం నిర్మించేందుకు డీపీఆర్ తయా రు చేసినట్లు చెప్పారు. నగరంలోని చాలా ప్రాంతాలవాసులు మెట్రో రైల్ విస్తరణ గురించి విజ్ఞప్తులు చేస్తున్నారని చెప్పారు. ఇందులో ఎల్బీనగర్– హయత్‌నగర్, తార్నాక– మెట్టుగూడ– ఈసీఐఎల్–మల్కాజ్గిరి, ప్యారడైజ్– మేడ్చల్ వరకు విస్తరించాలనే విజ్ఞప్తులు వస్తున్నాయని అన్నారు. ఫేజ్–1లో ప్రతి కిలోమీటర్ మెట్రో ఏర్పాటుకు రూ.230 కోట్లు ఖర్చు కాగా ఫేజ్–2లో రూ.300 కోట్ల వరకు ఖర్చు అవుతుందని స్పష్టం చేశారు. ఫేజ్– 1లో ఎంజీబీఎస్–ఫలక్‌నుమా రూట్లో (5 కి.మీ.) మార్గంలో మెట్రో నిర్మించాల్సి ఉందన్నారు. రోడ్డు విస్తరణకు కొన్ని చోట్ల కొన్ని మతాలకు సంబంధించిన భవనాలు, సమస్యాత్మక స్థలాలు అడ్డుగా ఉన్నాయన్నారు. మెట్రో స్పీడ్ పెంచాలని తాము రైల్వే సేఫ్టీ కమిషనర్‌ను కోరామని అన్ని రకాల పరీక్షలు పూర్తయ్యాయని త్వరలోనే స్పీడ్ పెరుగుతుందని తద్వారా ప్రీక్వెన్సీ కూడా పెంచుతామన్నారు. రోజుకు వెయ్యి ట్రిప్పులు... ప్రస్తుతం 55 రైళ్లను నడుపుతున్నామని, మరో రెండు రైళ్లను పరీక్షిస్తున్నామని 10 రోజుల్లో వాటిని కూడా అందుబాటులోకి తీసుకుని వస్తామని వివరించారు. గతంలో రోజూ 700 నుంచి 800 ట్రిప్పులు తిప్పే వారమని ప్రస్తుతం అది వెయ్యి ట్రిప్పులకు పెరిగిందన్నారు. ప్రతి రోజు నాలుగు లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణిస్తున్నారని అన్నారు. కారిడార్–1 నుంచి, కారిడార్–3 నుంచి అమీర్‌పేట్‌కు ఎక్కువగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండటంతో రాయ్‌దుర్గ్ రూట్లో సమస్య వస్తుందని అన్నారు. మెట్టుగూడ నుంచి రాయ్‌దుర్గ్ కొన్ని రైళ్లను, అమీర్‌పేట్ నుంచి రాయ్‌దుర్గ్‌కు అదనపు రైళ్లను తిప్పుతున్నామని వివరించారు. మెట్రోకు అధికంగా భూములిచ్చారని కొందరు ఆరోపణలు చేస్తున్నారని.. కానీ, 3 మెట్రో డిపోలకు 212 ఎకరాలు, మరో 57 ఎకరాలు స్టేషన్ల కోసం మొత్తం 269 ఎకరాలు మాత్రమే ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. మియాపూర్ డిపో వద్ద ఇచ్చిన 100 ఎకరాల్లో డిపోకు 70 ఎకరాలు 30 ఎకరాలు వాణిజ్య సముదాయాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ప్రతి కిలోమీటరు మెట్రో ఏర్పాటుకు ఢిల్లీలో 6 ఎకరాలు, నాగ్‌పూర్‌లో 7 ఎకరాలు, చెన్నైలో 4 ఎకరాలు ప్రభుత్వం కేటాయించిందని.. హైదరాబాద్ మెట్రోకు కి.మీ.కు 4 ఎకరాలు మాత్రమే కేటాయించారన్నారు. మెట్రో ఏర్పాటుకు ఎల్అండ్టీ తీసుకున్న రుణానికి వాణిజ్య బ్యాంకులకు ఏటా 11 శాతం వడ్డీ చెల్లిస్తున్నారని చెప్పారు. ప్రతి ఏడాది రూ.1,300 కోట్లు వడ్డీ చెల్లించాల్సి వస్తుందన్నారు. మెట్రోకు రోజుకు రూ.కోటి.. ఏటా రూ.480 కోట్ల ఆదాయం లభిస్తుం దన్నారు. ఇందులో రూ.365 కోట్లు చార్జీలు మిగతాది మెట్రో మాల్స్ ద్వారా లభిస్తోందన్నారు. తిరుపతి మెట్రో కోసం ప్రాథమికంగా పరిశీలించాం.. తిరుమల తిరుపతి మెట్రో రైల్ కోసం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరిక మేరకు మూడు రోజుల పాటు ప్రాథమికంగా పరిశీలన మాత్రమే చేశామని ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుమల మార్గంలో అత్యధిక మలుపుతో ఉన్న ఘాట్‌రోడ్డు ఉందని, అలాగే అటవీ ప్రాంతం, వన్యప్రాణుల అభయారణ్యం ఉండటంతో అన్నీ పరిశీలించాల్సి ఉంటుందన్నారు. గతంలో రోప్‌వే నిర్మాణానికి ఆగమశాస్త్రం ఒప్పుకోలేదని, దీన్ని కూడా పరిశీలించాల్సి ఉందన్నారు. శాస్త్రాలను, కాంటూర్స్ను అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. అవన్నీ చూశాక ఒక పరిష్కార మార్గం కనుగొనాలని అన్నారు. -
జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో ప్రారంభించిన కేసీఆర్
-
జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో ప్రారంభం
-
వైఎస్సార్ స్వప్నం సాకారమైన వేళ
సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగర వాసుల మెట్రో కల సంపూర్ణమైంది. హైదరాబాద్ మహానగర కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచిన మెట్రో రైలు జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గంలో పరుగులు పెట్టింది. దీంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రారంభించిన యజ్ఞం నేటితో నెరవేరింది. హైదరాబాద్ మెట్రో తొలిదశ ప్రాజెక్ట్ పూర్తయ్యింది. 2008 మే 14న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో నగర మెట్రోప్రాజెక్ట్ రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. (హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డు) జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గంలో (11 కి.మీ) ముఖ్యమంత్రి కేసీఆర్ చేతలు మీదగా మెట్రో రైళ్లు శుక్రవారం లాంఛనంగా ప్రారంభం అయ్యాయి. సాయంత్రం 4 గంటలకు జేబీఎస్ వద్ద ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ మార్గం పూర్తితో గ్రేటర్ నగరంలో 69 కిలోమీటర్ల మెట్రో మార్గం అందుబాటులోకి వచ్చింది. ఈ మెట్రో రైలు మార్గంలో జేబీఎస్-పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ వెస్ట్, న్యూ గాంధీ హాస్పటల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్, ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లు ఉంటాయి. ఈ మార్గంలో ఒక చివర నుంచి మరో చివరకు చేరుకునేందుకు 16 నిమిషాలు పట్టనుంది. కాగా ఎల్బీనగర్– మియాపూర్, నాగోల్–రాయదుర్గం మార్గాల్లో నిత్యం 4 లక్షలమంది రాకపోకలు సాగిస్తున్నారు. (హైదరాబాద్ మెట్రోలో ‘గరుడ వేగ’ సర్వీసులు!) -
వైఎస్సార్ స్వప్నం సాకారమైన వేళ
-
హైదరాబాద్ మెట్రో మరో రికార్డ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు శుక్రవారం మరో కొత్త రికార్డు నెలకొల్పింది. ఒక్క రోజులో ఏకంగా 2.95 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి మరో అడుగు ముందుకేసింది. వీకెండ్ రోజుల్లో అత్యధికంగా సాధారణ ప్రయాణికులు సైతం తమ విందు, వినోదం, షాపింగ్‌ల కోసం మెట్రో స్టేషన్లను ఎంచుకుంటున్నట్లు తాజా లెక్కలు వెల్లడించాయి. వివిధ రకాల మాల్స్ ఏర్పాటైన అమీర్‌పేట స్టేషన్ నుండి శుక్రవారం ఒక్క రోజే 19 వేల మంది ప్రయాణికులు నమోదు కాగా.. ఇటీవలే ప్రారంభమైన హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ నుంచి 17,201 మంది ప్యాసింజర్లు మెట్రో సేవలను ఉపయోగించుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు పనిచేసే రోజుల్లో 2 మెట్రో రూట్లలో 2.65 మంది ప్యాసింజర్లు సగటున ప్రయాణాలు చేస్తుండగా, వీకెండ్లో మాత్రం రోజూ వచ్చిపోయే వారు కాకుండా సాధారణ ప్రయాణికులు (మెట్రో కార్డులు లేనివారు) మెట్రో సేవల వైపు మొగ్గుతుండటం శుభపరిణామమని హెచ్ఎంఆర్ పేర్కొంటోంది. వారానికి 5 వేలు అదనంగా.. రెండు మాసాల క్రితం వరకు వారానికి 4 వేల మంది ప్యాసింజర్స్ చొప్పున పెరిగిన మెట్రో గత 2 వారాల నుంచి 5 వేల మందికి పెరిగినట్లు ప్రకటించింది. ఇందులో సాధారణ ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటాన్ని స్వాగతించింది. నగరంలో శుక్రవారం నాటి పరిస్థితి చూస్తే అమీర్‌పేట, హైటెక్ సిటీలతోపాటు ఎల్బీ నగర్లో 16 వేలు, మియాపూర్‌లో 14 వేలు, కేపీహెచ్బీలో 13 వేలు, ఉప్పల్‌లో 10 వేలు, పరేడ్ గ్రౌండ్లో 7 వేల మంది ప్రయాణాలు చేశారు. ఉప్పల్, పరేడ్‌గ్రౌండ్ స్టేషన్లలో జిల్లాల నుంచి వస్తోన్న ప్రయాణికుల సందడి అధికంగా కనిపిస్తోంది. లక్ష్యం సాధిస్తాం: ఎన్వీఎస్రెడ్డి, ఎండీ మెట్రో రైల్ హైదరాబాద్ మెట్రో ఆశించిన లక్ష్యం దిశగా పరుగులు పెడుతోంది. వారానికి 5 వేల మంది చొప్పున ప్రయాణికులు అదనంగా యాడ్ అవుతున్నారు. మెట్రో స్టేషన్లు నగరంలో మరో కొత్త హ్యాంగవుట్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారబోతున్నాయి. ఇప్పటికే అమీర్‌పేట స్టేషన్ పూర్తి వ్యాపార, వినోద కేంద్రంగా మారిపోయినట్లు ప్రయాణికుల లెక్కలే చెబుతున్నాయి. -
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషన్ షురూ..
సాక్షి,సిటీబ్యూరో: నాగోల్–హైటెక్‌సిటీ కారిడార్‌లోని జూబ్లీహిల్స్ చెక్పోస్ట్మెట్రో స్టేషన్ శనివారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఈ స్టేషన్లో ఇవాళ్టి నుంచి మెట్రో రైలు సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ఈ స్టేషన్ ఏర్పాటుతో ఫిల్మ్‌నగర్, జర్నలిస్ట్‌కాలనీ, నందగిరి హిల్స్, తారకరామ నగర్, దీన్‌దయాళ్‌నగర్, గాయత్రి హిల్స్, జూబ్లీ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్, జైల్‌సింగ్‌నగర్, హైలంకాలనీ పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రయాణికులకు మెట్రో జర్నీ సాకారం అయింది.. ఈ స్టేషన్ ప్రారంభంతో ఎల్బీనగర్–మియాపూర్ రూట్లో 27 స్టేషన్లు, నాగోల్–హైటెక్‌సిటీ రూట్లో 23 స్టేషన్లు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. తల్లకిందులు.. గ్రేటర్‌వాసుల కలల మెట్రోలో ప్రయాణం చేసే వారి సంఖ్య విషయంలో అధికారుల అంచనాలు తల్లకిందులయ్యాయి. జర్నీ చేసే ప్రయాణికుల సంఖ్య ముందుగా నిర్దేశించిన లక్ష్యానికి సగమే చేరువైంది. ఎల్బీనగర్–మియాపూర్(29 కి.మీ), నాగోల్–హైటెక్‌సిటీ(27 కి.మీ)రూట్లో ప్రయాణికుల సంఖ్య సుమారు ఐదు లక్షల మేర ఉంటుందని అంచనా వేసినప్పటికీ..నిత్యం 2.60 లక్షలు దాటడంలేదు. వారాంతాలు, సెలవురోజుల్లో ప్రయాణికుల సంఖ్య మరో 15–25 వేలచొప్పున పెరుగుతోంది. అయితే మెట్రో ప్రారంభానికి ముందు ఈ రెండు మార్గాల్లో నిత్యం సుమారుఐదు లక్షల మంది జర్నీ చేస్తారని అధికారులు అంచనా వేసిన విషయం విదితమే. కానీ వారానికి కేవలం 4 వేల మంది ప్రయాణికులే పెరుగుతుండడం గమనార్హం. ప్రధానంగా మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలు, బస్తీలకు చేరుకునేందుకు ఫీడర్ బస్సు సర్వీసులు లేకపోవడం, అన్ని మెట్రో స్టేషన్ల వద్ద ద్విచక్రవాహనాలు, కార్లు పార్కింగ్ చేసుకునే అవకాశం లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. కొన్ని స్టేషన్లు వెలవెల.. సిటీలో పలు మెట్రో స్టేషన్లకు ప్రయాణికుల తాకిడి లేక చిన్నబోతున్నాయి. స్టేషన్ నుంచి తమ ఇంటికి చేరుకునేందుకు ఫీడర్బస్సు సర్వీసులు లేకపోవడం, స్టేషన్లు అత్యంత సమీపంలో ఉండడం, పార్కింగ్ కష్టాలు వెరసి పలు స్టేషన్లకు గిరాకీ తగ్గడం గమనార్హం. ఎల్బీనగర్–మియాపూర్, నాగోల్–హైటెక్‌సిటీ మార్గాల్లోని ఇంటర్‌ఛేంజ్ మెట్రోస్టేషన్లను మినహాయిస్తే మొత్తంగా 50 స్టేషన్లున్నాయి. వీటిలో 14 స్టేషన్ల నుంచి నిత్యం రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికుల సంఖ్య మూడు వేలలోపు మాత్రమే కావడం గమనార్హం. అయితే మిగతా స్టేషన్లలో మాత్రం రద్దీ పదివేలకు పైగానే ఉండడం విశేషం. మొత్తంగా రెండు కారిడార్ల పరిధిలోని మొత్తం 56 కిలోమీటర్ల రూట్లో మెట్రో అందుబాటులోకి వచ్చింది. ఇటీవల మెట్రో ప్రయాణికుల సంఖ్య 2.70 లక్షలకు చేరుకుంది. ప్రతీవారం మెట్రో ప్రయాణికుల సంఖ్యలో నాలుగువేల మేర పెరుగుదల నమోదవుతోందని..సిటీజన్లు మెట్రో జర్నీ పట్ల ఇప్పుడిప్పుడే ఆసక్తిచూపుతున్నట్లు మెట్రో అధికారులు చెబుతున్నారు. అయితే మెట్రో అధికారుల అంచనా ప్రకారం ఈ రెండు రూట్లలో ఐదు లక్షలమంది ప్రయాణం చేస్తేనే నిర్మాణ సంస్థ లాభాల బాట పట్టే అవకాశం ఉందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఈ స్టేషన్లు చిన్నబోతున్నాయ్..! రెండు మార్గాల్లోని మొత్తం 50 స్టేషన్లకుగాను 14 స్టేషన్లకు ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది. ఆయాస్టేషన్లలో రాకపోకలు సాగించేవారు అత్యల్పంగా ఉంటున్నారు. మెట్రోరైలు రెండు కారిడార్లలో 56 కి.మీ. అందుబాటులోకి వచ్చింది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్(కారిడార్1) మార్గంలో 27 స్టేషన్లు ఉంటే నాగోల్–హైటెక్‌సిటీ(కారిడార్3)లో 24 స్టేషన్లు ఉన్నాయి. ప్రస్తుతం 50 స్టేషన్లు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. అయితే వీటిలో ప్రయాణికులు లేక చిన్నబోతున్న స్టేషన్లు కారిడార్ల వారీగా ఇలా ఉన్నాయి. ఎల్బీనగర్–మియాపూర్(కారిడార్1): ఈ మార్గంలో 7 స్టేషన్లకు ప్రయాణికుల ఆదరణ పెద్దగా లేదు. స్టేషన్లు మరీ దగ్గరగా ఉండటం, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి స్టేషన్ వరకు చేరుకునే ఫీడర్ సర్వీసులు లేకపోవడం, ఆయా స్టేషన్ల వద్ద పార్కింగ్ వసతుల లేమి తో ఆదరణ పెద్దగా లేదు. బాలానగర్, మూసాపేట, భరత్‌నగర్, ఈఎస్ఐ, అసెంబ్లీ, మూసారాంబాగ్, న్యూమార్కెట్ (మలక్‌పేట గంజ్) స్టేషన్లలో ఎక్కేవారు 3 వేలలోపే ఉంటున్నారు. దిగేవారే సంఖ్య కూడా ఇంచుమించు ఇంతే మొత్తంలో ఉంది. నాగోల్–హైటెక్‌సిటీ(కారిడార్3)లో:ఈమార్గంలో 7 స్టేషన్లలో ప్రయాణికుల ఆదరణ అంతంతమాత్రంగానే ఉంది. చుట్టుపక్కల కాలనీల నుంచి మెట్రో వరకు ఫీడర్ సర్వీసుల సదుపాయం లేకపోవడంతో చాలామంది సొంత వాహనాలపైనే వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. ప్రధానంగా సర్వే ఆఫ్ ఇండియా, ఎన్జీఆర్ఐ, మధురానగర్, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్ రోడ్‌నెంబరు 5, పెద్దమ్మగుడి, మాదాపూర్ స్టేషన్లలో ఎక్కేవారు, దిగేవారు తక్కువగా ఉంటున్నారు. ఇక్కడ ప్రతిస్టేషన్లో ఎక్కేవారు 2000 నుంచి 3500లోపే ఉంటున్నారు. దిగేవారి సంఖ్య ఇంచుమించు ఇదేవిధంగా ఉంది. ఐదు వేలపైన ప్రయాణికులుఈ స్టేషన్లలోనే.. ప్రయాణికుల సంఖ్య ఐదువేల నుంచి పదివేలలోపు ఉన్న స్టేషన్లు అత్యధికంగా ఉన్నాయి. వీటిలో నాగోల్, ఉప్పల్, సికింద్రాబాద్, పరేడ్‌గ్రౌండ్స్, బేగంపేట, దుర్గం చెరువు, కూకట్పల్లి, పంజగుట్ట, ఎర్రమంజిల్, లక్డీకాపూల్, దిల్సుఖ్నగర్, చైతన్యపురి స్టేషన్లలోనూ చెప్పుకోదగ్గ సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. అనుసంధానంతో ఫలితాలు అంతంతే.. మెట్రోరైలు స్టేషన్లను నగరంలోని ప్రధాన బస్సుస్టేషన్లు, రైల్వేస్టేషన్లు, ఎంఎంటీఎస్ స్టేషన్లతో అనుసంధానం చేశారు. ఆయా చోట్ల మెట్రోస్టేషన్లను సైతం నిర్మించారు. సికింద్రాబాద్, బేగంపేట, ఖైరతాబాద్, లక్డీకాపూల్ మినహా మిగతా వాటికి పెద్దగా ఆదరణ లేదు. ఎంజీబీఎస్‌లో హెచ్చుతగ్గులు బాగా ఉంటున్నాయి. మొత్తంగా చూస్తే 45 వేలలోపే ప్రయాణికులు ఉంటున్నారు. కొన్నిస్టేషన్లలో రెండు వేలకు మించడం లేదు. భరత్‌నగర్‌లో 2 వేల లోపే మెట్రో ఎక్కుతున్నారు. నాంపల్లి, మలక్‌పేట మెట్రో స్టేషన్లలో 3500కు మించడం లేదు. నాంపల్లి రైల్వేస్టేషన్‌కు ఉదయాన్నే వేర్వేరు ప్రాంతాల నుంచి రైళ్లు వస్తున్నాయి. ఇక్కడ దిగిన ప్రయాణికులు మెట్రోలో గమ్యస్థానం చేరుకుందామంటే ఉదయం 7 గంటలు దాటినా కొన్నిసార్లు మెట్రో స్టేషన్లు గేట్లు తీయడం లేదని పలువురు ప్రయాణికులు వాపోతుండడం గమనార్హం. -
సాంకేతిక కారణాలతో నిలిచిన మెట్రో రైలు
సాక్షి, హైదరాబాద్: కాటెనరీ ఓహెచ్ఈ పార్టింగ్ కారణంగా శనివారం మూసాపేట్–మియాపూర్ మధ్య మెట్రో సేవలకు అంతరాయం కలిగినట్లు మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. ఉదయం 9.57 నుంచి 11.40 గంటల వరకు మెట్రో రైళ్లు నిలిచిపోయినట్లు పేర్కొన్నా రు. ఉదయం 11.40కి సింగిల్ లైన్ పనిచేసేలా చర్యలు తీసుకోవడంతో పాటు, సర్వీసులను మూసాపేట్ నుంచి మియాపూర్ మార్గంలో డీగ్రేడెడ్ పద్ధతిలో పునరుద్ధరించారు. సాంకేతిక లోపాలను సరిదిద్దేందుకు కాటెనరీ మెయింటెనెన్స్ వెహికల్ (సీఎంవీ)తో పాటు, మెయింటెనెన్స్ బృందం సత్వరమే స్పందించి చర్యలు చేపట్టింది. దీంతో మధ్యాహ్నం 1.20కి మెట్రో రైలు సర్వీసులను యధావిధిగా పునరుద్ధరించారు. మెట్రో రైళ్ల రాకపోకల అంతరాయం వల్ల ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, సాంకేతికంగా తలెత్తిన సమస్యలపై అధ్యయనం చేస్తున్నామని ఎన్వీఎస్ రెడ్డి ఓ ప్రకటనలో తెలియజేశారు. -
బాలానగర్ స్టేషన్లో నిలిచిన మెట్రోరైల్
-
కరెంట్ లేక ఆగిన మెట్రోరైల్
సాక్షి, హైదరాబాద్ : మియాపూర్-అమీర్ పేట్ మెట్రో రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. ప్రయాణీకులతో బయలు దేరిన మెట్రోరైలు ఆకస్మాత్తుగా కూకట్పల్లి వై జంక్షన్‌లోని డాక్టర్ అంబేడ్కర్ బాలానగర్ రైల్వే స్టేషన్లో నిలిచిపోయింది. మెట్రో పవర్ ప్లాంట్‌లో సమస్య తలెత్తడంతోనే రైలు నిలిచిపోయిందని సిబ్బంది తెలిపారు. ప్రయాణీకులు మాత్రం విద్యుత్ అంతరాయం వల్లనే రైలు మార్గ మధ్యలో ఆగిపోయిందని ఆరోపించారు. రైలు ఆగిపోవడంతో ఆందోళన చేపట్టిన ప్రయాణీకులకు అధికారులు వారి టికెట్ ధర చెల్లించి పంపించేశారు. ఈ ఘటనతో కొద్దిసేపు మియాపూర్ నుంచి ఎర్రగడ్డ వరకు మెట్రోసేవలు నిలిచిపోయాయి. ఒక ట్రాక్ వైర్ తెగిపడిపోవడంతోనే ఈ సమస్య తలెత్తిందని అధికారులు స్పష్టం చేశారు. రెండో ట్రాక్‌పై రైల్లు నడుస్తున్నాయన్నారు. ఈ సమస్యను పరిష్కరించగానే పూర్తి సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. సమస్య పరిష్కారానికి అధికారులు మరమత్తు చర్యలు చేపట్టారు. -
డిసెంబర్‌కు డౌటే!
సాక్షి, సిటీబ్యూరో: అమీర్‌పేట్–హైటెక్‌సిటీ మార్గంలో మెట్రో రైలు పనులు ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తయ్యే అవకాశాలు దరిదాపుల్లోనూ కనిపించడంలేదు. ఇటీవల ఎల్బీనగర్–అమీర్‌పేట్ మార్గంలో మెట్రో రైలును లాంఛనంగా ప్రారంభించిన గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్..డిసెంబర్ నాటికి హైటెక్ సిటీ కారిడార్‌ను పూర్తిచేసి మెట్రో రైళ్లనుసిటీజన్లకు అందుబాటులోకి తీసుకురావాలని హెచ్ఎంఆర్, ఎల్అండ్టీ అధికారులకు సూచించారు. అయితే ఈ మార్గంలో మెట్రో పనుల పూ ర్తికి పలు బాలారిష్టాలు ఎదురవుతున్నాయి. ప్రధానంగా రివర్సల్ ట్రాక్ ఏర్పాటు పనులు ఆలస్యమౌతుండడమే దీనికి కారణమని మెట్రో వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితితో ఈ రూట్లో మెట్రో రాకకోసం ఎదురుచూస్తున్న లక్షలాదిమంది ఐటీ, బీపీఓ, కెపిఓ రంగాల ఉద్యోగులకు మరో ఆరునెలలపాటు నిరీక్షించక తప్పని పరిస్థితి నెలకొంది. రివర్సల్‌ట్రాక్ పనులే కీలకం... నాగోల్–హైటెక్‌సిటీ(28 కి.మీ)మెట్రో మార్గాన్ని ప్రభుత్వం 1.5 కి.మీ మేర పెంచి రాయదుర్గం వరకు పొడిగించిన విషయం విదితమే. రాయదుర్గం ప్రాంతంలో 15 ఎకరాల సువిశాల స్థలంలో టెర్మినల్ స్టేషన్‌తోపాటు మెట్రోమాల్స్, ప్రజోపయోగ స్థలాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అయితే మెట్రో మార్గాన్ని ఉన్నఫలంగా పొడిగించడం..హైటెక్‌సిటీ–రాయదుర్గం రూట్లో పనులు సకాలంలో మొదలుకాకపోవడం ప్రధాన అడ్డంకిగా మారింది. మరోవైపు హైటెక్‌సిటీ నుంచి శిల్పారామం వరకు అరకిలోమీటరు మేర మెట్రో పిల్లర్లను పొడిగించి అక్కడివరకు మెట్రోట్రాక్ ఏర్పాటుచేసి అక్కడి నుంచి రివర్సల్‌ట్రాక్(మెట్రో రైళ్లు మలుపుతిరిగే ట్రాక్)ఏర్పాటుచేయాలని తొలుత నిర్ణయించారు. అయితే ఈ మార్గంలో ఎస్ఆర్డీపీ పనుల కారణంగా మెట్రో పిల్లర్లు ఏర్పాటుచేయడం కష్టసాధ్యమని నిపుణులు స్పష్టంచేయడంతో రివర్సల్‌ట్రాక్ ఏ ర్పాటు పనులు మరింత ఆలస్యమయ్యాయి. దీం తో ఈ రూట్లో మెట్రో మరింత ఆలస్యమౌతోంది. రివర్సల్ ట్రాక్‌కు ప్రత్యామ్నాయమిదే.. హైటెక్‌సిటీకి సకాలంలో మెట్రోను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హెచ్ఎంఆర్,ఎల్అండ్టీ అధికారులు ఆగమేఘాల మీద పనులు ప్రారంభించారు. రివర్సల్ ట్రాక్ ఏర్పాటు చేస్తేనే అమీర్‌పేట్–హైటెక్‌సిటీ(10 కి.మీ)మార్గంలో ప్రతి ఐదు నిమిషాలకోరైలును నడిపే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా హైటెక్‌సిటీ నుంచి 500 మీటర్ల దూరంలోని లెమన్‌ట్రీ హోటల్ వరకు 7 మెట్రో పిల్లర్లను ఏర్పాటుచేసి మెట్రో ట్రాక్‌ను పొడిగించనున్నారు. అక్కడి నుంచి రివర్సల్ ట్రాక్‌ను ఏర్పాటుచేసి మెట్రో రాకపోకలకు మార్గం సుగమం చేయనున్నట్లు మెట్రో అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పనులు ప్రారంభమైనప్పటికీ వీటిని పూర్తిచేసేందుకు వచ్చే ఏడాది మార్చి వరకు సమయం పట్టనున్నట్లు స్పష్టంచేశారు. ఎల్బీనగర్–మియాపూర్ మెట్రో ఫుల్..జోష్ ఎల్బీనగర్–మియాపూర్(29 కి.మీ)మార్గం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో ఈ రూట్లో మెట్రోలో రద్దీ క్రమంగా పెరుగుతూనే ఉంది. సాధారణ రోజుల్లో రద్దీ 1.30 లక్షలు కాగా..సెలవురోజుల్లో రద్దీ 1.50 లక్షలనుంచి 1.60 లక్షలవరకు ఉందని మెట్రో అధికారులు చెబుతున్నారు. ఇక నాగోల్–అమీర్‌పేట్ మార్గంలో నిత్యం 50–60 వేల మంది రాకపోకలు సాగిస్తుండగా..సెలవురోజుల్లో రద్దీ 80–90 వేల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఎల్బీనగర్–మియాపూర్ మార్గంలో త్వరలో రద్దీ రెండు లక్షల మార్కు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. -
జల్సా మాల్స్!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో మెట్రోస్టేషన్లకు అనుసంధానంగా నిర్మించిన మాల్స్‌కు జనాదరణ పెరుగుతోంది. ప్రస్తుతానికి పంజగుట్ట, హైటెక్‌సిటీ మెట్రోమాల్స్ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. డిసెంబరు నుంచి ఎర్రమంజిల్, మూసారాంబాగ్ మెట్రోమాల్స్ సైతం ప్రారంభించనున్నారు. వీటిని సమీప మెట్రో స్టేషన్లలోని స్కైవేల(ఆకాశ మార్గాలు) ద్వారా అనుసంధానించనున్నారు. దీంతో ప్రతి మెట్రో స్టేషన్ నుంచి నిత్యం రాకపోకలు సాగించే వేలాదిమంది ప్రయాణికులు ఈ మాల్స్‌లోకి సులభంగా ప్రవేశించి తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసే వీలుంది. అంతేకాదు.. మాల్స్‌లో ఏర్పాటు చేసిన కిడ్స్ గేమ్స్ జోన్, పెద్దల కోసం స్నూకర్ వంటి గేమ్స్ జోన్లు ఆటవిడుపుగా మారాయి. ఇక నూతనంగా పీవీఆర్ సినీప్లెక్స్‌ల ఏర్పాటుతో వినోదాన్ని సైతం ఇక్కడ పొందే అవకాశం లభించింది. వివిధ ప్రాంతాల్లో మెట్రో మాల్స్ ఇలా.. ప్రస్తుతానికి పంజగుట్టలో 4.80 లక్షల చదరపు అడుగులు, ఎర్రమంజిల్‌లో 3.25 లక్షలు, మూసారాంబాగ్‌లో 2.40 లక్షలు, హైటెక్‌సిటీలో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మాల్స్ నిర్మించారు. సమీప భవిష్యత్‌లో రాయదుర్గం మెట్రో టర్మినల్ స్టేషన్ వద్ద 13 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇనార్బిట్ మాల్‌ను మించిన విస్తీర్ణంతో బడా మాల్‌ను నిర్మించేందుకు ఎల్అండ్టీ సిద్ధమైంది. ఇక కూకట్పల్లి, ఉప్పల్, మియాపూర్ మెట్రో స్టేషన్ల వద్ద కూడా 4–5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మాల్స్ ఏర్పాటుకు నిర్మాణ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. మొత్తంగా ప్రభుత్వం ఎల్అండ్టీకి వివిధ ప్రాంతాల్లో కేటాయించిన 269 ఎకరాల స్థలాల్లో ఈ మాల్స్ ఏర్పాటు కానున్నాయి. వచ్చే 15 ఏళ్లలో రూ.2,243 కోట్లతో నగర వ్యాప్తంగా మేట్రో మార్గంలో 60 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మాల్స్, ఇతర వాణిజ్య స్థలాలను అభివృద్ధి చేయాలని సదరు సంస్థ నిర్ణయించింది. కాగా మెట్రో ప్రాజెక్టులో ప్రయాణికుల చార్జీల ద్వారా వచ్చే ఆదాయం కేవలం 45 శాతం మాత్రమే. మిగతా 50 శాతం రెవెన్యూ రియల్టీ ప్రాజెక్టులే ఆధారమంటే అతిశయోక్తి కాదు. ఇక మరో ఐదు శాతం వాణిజ్య ప్రకటనల ద్వారా సమకూర్చుకోవాలని నిర్మాణ సంస్థ భావిస్తోంది. నిర్మాణ ఒప్పందం కుదిరిన 2011 తొలినాళ్లలో 18 చోట్ల మాల్స్ నిర్మించాలనుకున్నప్పటికీ ప్రస్తుతానికి నాలుగు చోట్లనే మాల్స్ నిర్మాణం పూర్తయింది. మాల్స్‌లో ఏముంటాయంటే.. పంజగుట్ట మాల్‌ను నాలుగు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మించారు. దీని నిర్మాణ విస్తీర్ణం 4.8 లక్షల చదరపు అడుగులు. ఇందులో ఆరు సినీప్లెక్స్‌లు ఏర్పాటు చేశారు. హైటెక్‌సిటీ మాల్‌ను రెండెకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో 2 లక్షల చదరపు అడుగుల వాణిజ్య స్థలం అందుబాటులోకి వచ్చింది. దీనికి అద్దె ప్రతి చదరపు అడుగుకు స్టోర్ లేదా ఆఫీసు విస్తీర్ణం, రకాన్ని బట్టి ప్రతినెలా రూ.75 నుంచి రూ.150 చొప్పున ఎల్అండ్టీ సంస్థ వసూలు చేస్తోంది. ఈ మాల్స్‌లో దేశ, విదేశాలకు చెందిన పలు కంపెనీల స్టోర్స్, సినీ మల్టీప్లెక్స్‌లు ఉంటాయి. ఆఫీసు, వాణిజ్య స్థలాలు, ఫుడ్‌కోర్టులు, చాట్‌బండార్స్, బేకరీలు, కన్ఫెక్షనరీలు సైతం ఉంటాయి. ట్రామాకేర్ సెంటర్లు, డయాగ్నోస్టిక్స్ సెంటర్లు, బ్యాంకులు, ఏటీఎంలు ఏర్పాటు చేస్తారు. వినోదాలు, పిల్లల ఆట పాటలు, గేమ్స్, స్కేటింగ్ వంటి సైతం ఉంటాయి. అంతేగాక సిమ్యులేటర్ డ్రైవింగ్ సెంటర్లు సైతం ఏర్పాటు చేస్తారు. వీటితోపాటు అన్ని రకాల నిత్యావసరాలు దొరికే ఏటు జడ్ స్టోర్స్, కాఫెటీరియాలు, ఐస్‌క్రీమ్ పార్లర్లు, బ్రాండెడ్ దుస్తులు, పుస్తకాలు, పాదరక్షల దుకాణాలు, కాస్మొటిక్స్, ఫ్యాషన్ మెటీరియల్ సైతం అందుబాటులో ఉంటాయి. ఖాళీగా మెట్రో రిటైల్ స్పేస్.. ప్రస్తుతం మూడు మెట్రో రూట్లలో మొత్తం 72 కి.మీ మార్గంలో 64 స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఎల్బీనగర్–మియాపూర్ మార్గంలో 27 మెట్రో స్టేషన్లు, నాగోల్–అమీర్‌పేట్ రూట్లో 16 స్టేషన్లు వినియోగంలోకి వచ్చాయి. ఆయా స్టేషన్లలో మధ్యభాగం (కాన్కోర్స్ లెవల్)లో సరాసరిన ఒక్కో స్టేషన్‌కు 9,500–15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వాణిజ్య స్థలం(రిటైల్ స్పేస్) అందుబాటులో ఉంది. అయితే ఇప్పటివరకు అమీర్‌పేట్, మియాపూర్ మినహా చాలా చోట్ల స్టేషన్లు ఖాళీగానే కనిపిస్తున్నాయి. ఆయా స్టేషన్లలో రిటైల్ స్పేస్‌ను బహుళ జాతి సంస్థలు దక్కించుకున్నప్పటికీ ప్రస్తుతానికి స్టేషన్లు అంతగా రద్దీ లేకపోవడంతో స్టోర్లను ఏర్పాటు చేయలేదు. దశలవారీగా అన్ని స్టేషన్లలో ఏర్పాటయ్యే అవకాశం ఉంది. -
భువికి మేలు చేసే 'భవనం'
సాక్షి, హైదరాబాద్: హైటెక్ బాటలో దూసుకుపోతున్న మన గ్రేటర్ సిటీ ఇక హరిత భవనాలకూ కేరాఫ్ అడ్రస్‌గా నిలవబోతోంది. ఇప్పుడు వాణిజ్య, గృహ అవసరాలకు సైతం ఆయా వర్గాలు హరిత భవనాలను ఎంపిక చేసుకోవడం నిర్మాణ రంగంలో నయా ట్రెండ్‌గా మారింది. ఇటీవల మహానగరం పరిధిలో సుమారు 30 ప్రముఖ నిర్మాణ సంస్థలు భారీ హరిత భవనాల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం విశేషం. ఆయా బహుళ అంతస్తుల భవంతుల్లో సుమారు 18 లక్షల చదరపు అడుగుల మేర నివాస, వాణిజ్య స్థలం అందుబాటులోకి రానుంది. దక్షిణాదిలో బెంగళూర్ తర్వాత అత్యధిక గ్రీన్ బిల్డింగ్స్ నిర్మాణంతో మన సిటీ ముందుకెళుతోంది. మెట్రో నగరాల్లో గ్రీన్‌బెల్ట్ ఇలా.. దేశంలో 35 శాతం గ్రీన్‌బెల్ట్‌తో చండీగఢ్ తొలిస్థానంలో ఉంది. 20.20 శాతంతో ఢిల్లీ, 19 శాతంతో బెంగళూర్, 15 శాతంతో కోల్‌కతా, 10 శాతంతో ముంబై,9.5 శాతంతో చెన్నై తరువాతి స్థానాల్లో ఉన్నాయి. హైదరాబాద్‌లో హరితం 8 శాతానికే పరిమితమైనందున, భవిష్యత్‌లో హరిత భవనాల నిర్మాణాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. హరిత భవనాలకు డిమాండ్... హరిత భవనాల్లో సహజ సిద్ధమైన సౌరశక్తి వినియోగం, పునర్వినియోగ విధానంలో మురుగునీటిని శుద్ధి చేసి వినియోగించడం, స్వచ్ఛమైన ఆక్సిజన్, కంటికి ఆహ్లాదం కలిగించేలా గ్రీన్‌బెల్ట్‌ను పెంపొందించే అవకాశాలుండటంతో ఇప్పుడు అన్ని వర్గాలవారు హరిత భవనాల వైపు మొగ్గుచూపుతున్నారు. మన నగరంలో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ప్రమాణాల మేరకు హరిత భవనాలను నిర్మించేందుకు పలు నిర్మాణ సంస్థలు ముందుకొస్తున్నాయని కౌన్సిల్ ప్రతినిధులు తెలిపారు. గ్రేటర్ పరిధిలో కొన్ని నిర్మాణ సంస్థలు ఇటీవల 30 భారీ గ్రీన్ బిల్డింగ్స్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాయి. హరిత భవనాల నిర్మాణానికి సాధారణ భవనాల కంటే 20% అధికంగా ఖర్చు అవుతున్నా భవిష్యత్‌లో ఆయా వాణి జ్య, గృహ సముదాయాలున్న భవనాలకు నిర్వహణ వ్యయం తగ్గుముఖం పడుతుందని విశ్లేషిస్తున్నారు. హరిత భవనాలతో ఉపయోగాలివీ... సహజ వనరులను పర్యావరణానికి హాని కలగని రీతిలో వినియోగించేందుకు వీలు. - భవనాల నిర్మాణ ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణ వంటి అంశాల్లోనూ గ్రీన్ టెక్నాలజీ వినియోగంతో కర్బన ఉద్గారాలు, క్లోరోఫ్లోరో కర్బన్ల ఉద్గారాలు తగ్గుతాయి. గాలి, నీరు, నేల కాలుష్యం తగ్గుతుంది. - ఆహ్లాదకరమైన హరిత వాతావరణంతో యూవీ రేడియేషన్ తీవ్రత తగ్గుతుంది. - ఆయా భవనాల నుంచి వెలువడే మురుగునీటిని మినీ మురుగుశుద్ధి కేంద్రాల్లో శుద్ధిచేసి గార్డెనింగ్, ఫ్లోర్‌క్లీనింగ్, కార్ వాషింగ్ వంటి అవసరాలకు వినియోగించడం. - చుట్టూ హరితహారం ఉండటంతో ఆయా భవనాల్లో ఉండేవారికి స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుతుంది. - ఘన వ్యర్థాలను సైతం రీ సైకిల్ చేసి పునర్వినియోగం చేసేందుకు అవకాశం. -
3.50 నిమిషాలకో మెట్రో రైలు
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో జర్నీకి ఉదయం, సాయంత్రం వేళల్లో (పీక్ అవర్స్) గ్రేటర్ సిటీజన్ల నుంచి అనూహ్య స్పందన కనిపిస్తుండడంతో రైళ్ల ఫ్రీక్వెన్సీని 3 నిమిషాల 50 సెకన్లకు తగ్గించినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య ఎల్బీనగర్–మియాపూర్ రూట్లో ప్రతీ స్టేషన్లో అత్యధిక రద్దీ ఉండడంతో 3.50 నిమిషాలకో రైలు నడిపినట్లు పేర్కొన్నారు. ఈ మార్గంలో ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న 18 రైళ్లకు అదనంగా మరో మూడు రైళ్లను నడిపామన్నారు. సోమవారం నుంచి ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో ఇదే ఫ్రీక్వెన్సీ ప్రకారం రైళ్లను నడపనున్నామన్నారు. కాగా ఆదివారం మెట్రో రైళ్లలో ప్రయాణించిన వారి సంఖ్య రెండు లక్షల మార్కును దాటిందని పేర్కొన్నారు. ఇందులో 1.80 లక్షలమంది పెయిడ్ ప్యాసింజర్లే(టిక్కెట్ కొనుగోలు చేసి)నని పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి రైళ్ల ఫ్వీక్వెన్సీని క్రమంగా తగ్గించనున్నామన్నారు. కాగా సాధారణంగా రద్దీ వేళల్లో ప్రతి ఆరునిమిషాలకో రైలు..రద్దీ లేని సమయాల్లో 8 నిమిషాలకో రైలును నడుపుతున్న విషయం విదితమే. అయితే సాధారణ రోజుల్లో నాగోల్–అమీర్‌పేట్–మియాపూర్(30 కి.మీ) మార్గంతోపాటు ఎల్బీనగర్–మియాపూర్(29 కి.మీ) రూట్లో మెట్రో జర్నీ చేస్తున్న ప్రయాణికుల సంఖ్య 1.70 లక్షలు దాటుతోందని తెలిపారు. కాగా మెట్రో జర్నీ పట్ల నగరంలో పలు సీనియర్ సిటిజన్స్, ట్రావెలింగ్ గ్రూపుల సభ్యులు, మహిళలు సంతృప్తిగా ఉన్నారని..ఎవరి సహాయం లేకుండానే మెట్రో జర్నీ చేస్తున్నట్లు పలు సంఘాలు తమకు రాతపూర్వకంగా తెలిపాయన్నారు. ఇటీవల కృష్ణకాంత్ పార్క్ ట్రావెలింగ్ గ్రూపు సభ్యులు మెట్రో జర్నీ చేసి సంతృప్తి వ్యక్తంచేశారని, ఈ గ్రూపులో రిటైర్డ్ జడ్జీ ఎ. హనుమంత్, చీఫ్ ఇంజినీర్ గణపతిరావు తదితరులున్నారన్నారు. -
శరవేగంగా హైటెక్ సిటీ మెట్రో కారిడార్
సాక్షి,సిటీబ్యూరో: హైటెక్‌సిటీ వరకు మెట్రో కారిడార్ ఏర్పాటు పనుల్లో వేగం పెంచాలని హైదరాబాద్ మెట్రో రైలు మేనేజింగ్డైరెక్టర్ ఎన్వీఎస్రెడ్డి మెట్రో నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ అధికారులను ఆదేశించారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సూచనల మేరకు ఈ ఏడాది డిసెంబర్‌లోగా పనులను పూర్తి చేయాలన్నారు. ఆదివారం సైబర్టవర్స్ నుంచి రహేజా మైండ్‌స్పేస్ జంక్షన్ వరకు జరుగుతున్న మెట్రో పనులు,హైటెక్‌సిటీ స్టేషన్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ ప్రాంతాల్లో చేపట్టిన సుందరీకరణ పనులను ఆయన పరిశీలించారు. పనులు వేగవంతంపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ⇔ సైబర్టవర్స్,శిల్పారామం ఫ్లైఓవర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న మెట్రో పిల్లర్లను ప్రధాన రహదారి మధ్యలో కాకుండా పక్కన ఏర్పాటు చేయాలి. ఈ ప్రాంతంలో పిల్లర్ల ఏర్పాటు పనులను ఇంజినీరింగ్ సవాళ్లను అధిగమించాలి. ⇔ హైటెక్‌సిటీ–ట్రైడెంట్ హోటల్ మార్గంలో 22 మెట్రో పిల్లర్లు, వయాడక్ట్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలి. ఈ పనుల పూర్తితో మెట్రో రైలు రివర్సల్ సదుపాయం ఏర్పాటు కానుంది. ఈ పనుల పూర్తికి ప్రధాన రహదారిని మూసివేసి ట్రాఫిక్ డైవర్షన్ చేసేందుకు సహకరించాలని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్‌కు సూచించారు. తాత్కాలికంగా సైబర్‌టవర్ జంక్షన్ నుంచి సైబర్ టవర్ గేట్‌వే జంక్షన్ మార్గంలో ప్రధాన రహదారిని మూసివేయడం లేదా పాక్షికంగా తెరిచే ఏర్పాటు చేయాలి. సైబర్టవర్స్ ఫ్లైఓవర్‌ను సైబర్‌గేట్‌వే వరకు వన్‌వే ఫ్లైఓవర్‌గా చేయాలి. ఈ మార్గంలో ట్రాఫిక్‌ను డెలాయిట్ ఎక్స్‌రోడ్–ఒరాకిల్ జంక్షన్–గూగుల్ఎక్స్రోడ్–హైటెక్స్–శిల్పారామం–హైటెక్‌సిటీ జంక్షన్ మీదుగా మళ్లించాలి. ⇔ ట్రాఫిక్ దారి మళ్లించేందుకు ప్రత్యామ్నాయ రహదారులను యుద్ధప్రాతిపదికన హెచ్ఎంఆర్, ఎల్అండ్టీ అధికారులు అభివృద్ధి చేయాలి. ⇔ సైబర్టవర్స్ వద్ద 2 పోర్టల్ పిల్లర్ల నిర్మాణ పనులను తక్షణం పూర్తిచేయాలి. ⇔ ఈ పిల్లర్ల నిర్మాణ సమయంలో ట్రాఫిక్నుదారిమళ్లించాలి. ⇔ పోర్టల్ పిల్లర్ల నిర్మాణం తరువాత సాధారణ మెట్రో పిల్లర్లను ఏర్పాటు చేసేందుకు ట్రైడెంట్ హోటల్ వద్ద ప్రధాన రహదారిని విస్తరించాలి. ⇔ మెట్రో పిల్లర్ల ఏర్పాటు అనంతరం దెబ్బతిన్న రహదారిని తక్షణం పునరుద్ధరించాలి. ట్రాఫిక్, ఎల్అండ్టీ అధికారులు సమన్వయంతో పనిచేయాలి. ⇔ మెట్రో పిల్లర్లకు ఫౌండేషన్లు ఏర్పాటైన చోట ఎల్అండ్టీ సిబ్బంది బార్కేడ్లను తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలి. ⇔ హైటెక్‌సిటీ స్టేషన్ నుంచి ట్రైడెంట్ హోటల్ వరకు 650 మీటర్ల మేర ఏర్పాటుచేయనున్న రివర్సల్ ట్రాక్ ఏర్పాటుకు స్ట్రక్చరల్,ట్రాక్, సిగ్నలింగ్, ఎలక్ట్రికల్ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలి. సుందరీకరణ పనుల పరిశీలన.. ⇔ జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, పెద్దమ్మదేవాలయం, మాదాపూర్, దుర్గంచెరువు, హైటెక్‌సిటీ వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ పనులను ఎల్అండ్టీ అధికారులు తక్షణం పూర్తిచేయాలి. ⇔ దుర్గం చెరువు స్టేషన్ వద్ద ఇప్పటికే మెట్రో పనుల కోసం సేకరించిన ఆస్తులను టౌన్‌ప్లానింగ్ విభాగం అడ్డు తొలగించాలి. ⇔ అమీర్‌పేట్–హైటెక్‌సిటీ మార్గంలోని ఐదు మెట్రో స్టేషన్ల వద్ద మిగిలిన పనులను, సుందరీకరణ పనులను తక్షణం పూర్తిచేయాలి. -
‘వరల్డ్ పీపుల్స్ చాయిస్’ రేస్‌లో మెట్రో
సాక్షి, హైదరాబాద్: అతిపెద్ద ఇంజనీరింగ్ ప్రాజెక్టు ఘనతను సాధించే విషయంలో హైదరాబాద్ మెట్రో ప్రపంచవ్యాప్తంగా పలు భారీ ఇంజనీరింగ్ ప్రాజెక్టులతో పోటీపడుతోంది. ఇదే క్రమంలో తాజాగా లండన్‌కు చెందిన ఐసీఈ సంస్థ ప్రదానం చేసే పీపుల్స్ చాయిస్ అవార్డు సాధించేందుకు కేవలం 2 వేల ఓట్ల దూరంలో గ్రేటర్ మెట్రో నిలిచినట్లు హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ అవార్డు రేసులో నగర మెట్రో ప్రాజెక్టుతో న్యూజిలాండ్‌లోని మరో భారీ ఇంజనీరింగ్ ప్రాజెక్టు పోటీపడుతోందని తెలిపారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు ఓటు వేసేందుకు https://www.ice. org.uk/what&is&civil&engineering/what&do&civil&engineers&do/hyderabad&metro&rail&project లింక్‌ను క్లిక్ చేసి ఓటు వేయాలని ఆయన విజ్ఙప్తి చేశారు. -
మా మంచి మెట్రో!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వాసుల కలల మెట్రో కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ప్రపంచవ్యాప్తంగా విశ్వనగరాలుగా ప్రసిద్ధి చెందిన లండన్, మెల్బోర్న్, మాంచెస్టర్, బోస్టన్ తదితర మహానగరాల కంటే మెరుగైన మెట్రో సేవలందిస్తూ ప్రయాణికులను సంతృప్తి పరుస్తోందని తేలింది. ప్రయాణికుల సంతృప్తి, భద్రత, సౌకర్యాల విషయంలో 98 శాతం మెరుగైన స్కోరు సాధించి ఈ అరుదైన ఘనత సొంతం చేసుకున్నట్లు మెట్రో ప్రాజెక్టు నిర్వహణ సంస్థ కియోలిస్ (ఫ్రాన్స్) సంస్థ జరిపిన తాజా సర్వేలో వెల్లడైంది. కియోలిస్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 13 నగరాల్లో వివిధ రకాల ప్రజారవాణా వ్యవస్థలను నిర్వహిస్తోంది. ఇందులో లండన్ ఆటోమెటిక్ మెట్రో, మెల్బోర్న్ ట్రామ్వే, బోస్టన్ కమ్యూటర్ ట్రెయిన్, స్టాక్‌హోమ్ సిటీ బసెస్, లయాన్ మెట్రో అండ్ బస్ సర్వీసెస్, మాంచెస్టర్ ట్రామ్వే తదితర ప్రజారవాణా వ్యవస్థలను నిర్వహిస్తోంది. నగరంలో మూడు మార్గాల్లో పరుగులు తీయనున్న 57 మెట్రో రైళ్లు, స్టేషన్లు, డిపోలు, ట్రాక్‌లు, సిగ్నలింగ్ వ్యవస్థ, టెలీకమ్యూనికేషన్ వ్యవస్థ, టికెటింగ్, టికెట్ల విక్రయాలు, కమ్యూనికేషన్ బేస్డ్ ట్రెయిన్ కంట్రోల్ వ్యవస్థల నిర్వహణ బాధ్యతల కాంట్రాక్టును కియోలిస్ సంస్థ 2012లో దక్కించుకున్న విషయం విదితమే. సర్వే సాగిందిలా.. ఈ సర్వేలో ప్రధానంగా మెట్రో సేవల పట్ల ప్రయాణికులు సంతృప్తి చెందుతున్నారా.. మెట్రో సిబ్బంది అందిస్తున్న సేవల పట్ల ఎలా ఫీలవుతున్నారు.. ప్రయాణికులకు మెట్రో స్టేషన్లలో సరైన సమాచారం అందుతుందా.. సిబ్బంది వారికి సహకరిస్తున్నారా.. మెట్రో ప్రయాణం సురక్షితమని ప్రయాణికులు భావిస్తున్నారా.. తాము చెల్లించిన డబ్బుతో సౌకర్యవంతమైన ప్రయాణం చేస్తున్నామని ప్రయాణికులు అనుకుంటున్నారా.. తదితర అంశాలపై సుమారు వెయ్యి మంది అభిప్రాయాలను కియోలిస్ సంస్థ పరిశీలించింది. ఈ ఏడాది 25 జూన్ నుంచి– జూలై 11 మధ్య కాలంలో సేకరించిన ఈ సర్వే ఫలితాలను బుధవారం విడుదల చేసింది. ఎల్బీనగర్– మియాపూర్ 1.14 లక్షల మంది.. ఎల్బీనగర్– మియాపూర్ మార్గం (29 కి.మీ)లో మంగళవారం రికార్డు స్థాయిలో ప్రయాణికులు మెట్రో ప్రయాణం చేశారు. ఉదయం 6.30 నుంచి రాత్రి 10.30 వరకు మెట్రో రైళ్లు నిండుగా రాకపోకలు సాగించినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్.రెడ్డి తెలిపారు. నూతనంగా అందుబాటులోకి వచ్చిన ఎల్బీనగర్– అమీర్‌పేట్ మార్గంలో ఏకంగా 69 వేల మంది మెట్రో రైళ్లలో ప్రయాణించారని చెప్పారు. ఇక మియాపూర్– అమీర్‌పేట్ మార్గంలో 45 వేల మంది రాకపోకలు సాగించారన్నారు. నిత్యం ఈ మార్గంలో సుమారు లక్షమంది రాకపోకలు సాగిస్తారని అంచనా వేస్తున్నామని చెప్పా రు. ఇక మంగళవారం నాగోల్– అమీర్‌పేట్ మార్గంలో 51 వేల మంది మెట్రో ప్రయాణం చేశారని తెలిపారు. -
డిసెంబర్ నాటికి మరో 2 మార్గాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో రెండు మార్గాల్లో మిగిలిన మెట్రో ప్రాజెక్టు పనులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తిచేస్తామని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం రసూల్‌పురాలోని మెట్రో రైలు భవన్లో ఎల్అండ్టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డితో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల అవసరాల మేరకు మెట్రో రైలు వేళల్లో మార్పులు చేర్పులు చేస్తామన్నారు. అమీర్‌పేట్–హైటెక్ సిటీ, జేబీఎస్–ఎంజీబీఎస్ రూట్లో ఈ ఏడాది చివరి నాటికి మెట్రో పనులు పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నామన్నారు. ఎంజీబీఎస్–ఫలక్‌నుమా మార్గంలో మెట్రో ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు సర్వే, మార్కింగ్ ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలిపారు. నాగోల్–అమీర్‌పేట్–మియాపూర్ మార్గంలో నిత్యం 16 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయని.. వీటిలో రోజూ 80 వేల నుంచి లక్ష మంది రాకపోకలు సాగిస్తున్నారన్నారు. ఎల్బీనగర్–అమీర్‌పేట్ మార్గం అందుబాటులోకి రావడంతో అదనంగా మరో లక్ష మంది మెట్రో జర్నీ చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ రూట్లోనూ నిత్యం 19 రైళ్లను నడుపుతున్నామన్నారు. రద్దీ వేళల్లో ప్రతి ఆరున్నర నిమిషాలకో రైలు.. రద్దీ లేని సమయాల్లో ప్రతి 8 నిమిషాలకో రైలును నడుపుతున్నామన్నారు. ఉదయం 6.30 గం. నుంచి రాత్రి 10.30 గం. వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఇప్పటి వరకూ 46 కి.మీ. మెట్రో ట్రాక్ పరిధిలో 8 ఆర్వోబీలు నిర్మించామని తెలిపారు. మెట్రో రూట్లలో కొన్నిచోట్ల 60 నుంచి 70 అడుగుల ఎత్తున ట్రాక్ వేయాల్సి వచ్చిందని, దాదాపు 2,000 మెట్రో పిల్లర్లను నిర్మించామన్నారు. ఎల్అండ్టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ.. మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటివరకు తమ సంస్థ రూ.13,000 కోట్లు ఖర్చు చేసిందని.. మరో రూ.2,000 నుంచి 2,500 కోట్లు వ్యయం చేస్తేనే మిగిలిన పనులు పూర్తవుతాయన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం భూములు, ఆస్తుల సేకరణకు రూ.2,300 కోట్లు ఖర్చు చేసిందన్నారు. మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి అయిన అదనపు వ్యయంపై మొత్తం ప్రాజెక్టు పూర్తయిన తరువాతే స్పష్టత రానుందని తెలిపారు. నాగోలు–ఎల్బీనగర్ మెట్రో లైను కలుపుతాం... మెట్రో రెండో దశలో నాగోలు నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రోలైన్‌ను కలుపుతామని ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. విమానాశ్రయానికి అన్ని వైపుల నుంచి మెట్రోలైన్ కలపాలని కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. రెండో దశ ప్రాజెక్టుపై సర్వే తుది అంకానికి చేరుకుందని.. ఫేజ్–1లో పాత బస్తీ మెట్రో మినహా మిగిలిన పనులు తుది దశకు చేరాయని చెప్పారు. అమీర్‌పేట–ఎల్బీనగర్ మార్గంలో సాయంత్రం నుంచి ప్రయాణికులకు అనుమతించామని, రైళ్లన్నీ నిండుగా కనిపించాయన్నారు. దశలవారీగా అన్ని పార్కింగ్ సదుపాయాలు, స్మార్ట్బైక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, కార్లు అద్దెకిచ్చే సదుపాయాలు కల్పించనున్నామన్నారు. ఈ సందర్భంగా మెట్రో ప్రాజెక్టు సాకారానికి కృషి చేసిన ఎల్అండ్టీ ఇంజనీర్లు, ఉన్నతాధికారులు రవిశంకర్, రామకృష్ణ, సతీష్, ఎం.పి. నాయుడు, కియోలిస్ సంస్థ బెర్నార్డ్, కేఎం రావు తదితరులను జ్ఞాపిక బహూకరించి అభినందించారు. తొలి ఐదేళ్లు నష్టాలబాటే.. మెట్రో ప్రాజెక్టు తొలి ఐదేళ్లు నష్టాలబాట తప్పదని ఎన్వీఎస్రెడ్డి స్పష్టం చేశారు. ఆ తరువాత నష్టాలు తగ్గి వ్యయం, ఆదాయం మధ్య అంతరం తగ్గుతుందని అంచనా వేస్తున్నామన్నారు. మెట్రో ప్రాజెక్టులో ప్రయాణికుల చార్జీల ద్వారా 50 శాతమే ఆదాయం సమకూరుతుందని.. మరో 45 శాతం స్టేషన్లు, మాల్స్‌లో రిటైల్ వ్యాపారం, రియల్ ఎస్టేట్ అభివృద్ధి ద్వారానే రానుందన్నారు. మరో ఐదు శాతం వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో సమకూర్చుకోనున్నామని వివరించారు. కాగా మెట్రో స్మార్ట్ కార్డులపై 10 శాతం రాయితీ ఇస్తున్నామని, త్వరలో మెట్రో పాస్‌లను జారీ చేయాలని నిర్ణయించామన్నారు. ప్రయాణికులకు ఈ పాస్‌లపై 25 శాతం రాయితీ ఇచ్చేలా కసరత్తు చేస్తున్నామన్నారు. -
వచ్చె ఏడాది హైదరాబాద్ మోట్రోరైల్ పూర్తి
-
చారిత్రక కట్టడాలకు మెట్రో లుక్
సాక్షి, సిటీబ్యూరో :ఎల్బీనగర్–అమీర్‌పేట్ (16 కి.మీ) మార్గంలో మెట్రో ప్రారంభం కావడంతో... ఈ మార్గంలోని చారిత్రక, వారసత్వ కట్టడాలకు మెట్రో లుక్ వచ్చినట్లైంది. ప్రధానంగా అసెంబ్లీ, అమరవీరుల స్థూపం, మొజంజాహీ మార్కెట్, రంగమహల్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఎంజీబీఎస్, చాదర్‌ఘాట్ వంతెనకు ఆనుకొని ప్రవహిస్తున్న మూసీ అందాలను వీక్షిస్తూ సిటీజనులు మెట్రో జర్నీ చేసే అవకాశం లభించింది. ఎంజీబీఎస్ మెట్రోస్టేషన్ ఇక్కడి బస్ స్టేషన్‌కు అత్యంత సమీపంలో ఉండడంతో ప్రయాణికులకు సౌకర్యవంతంగా మారనుంది. ఈ స్టేషన్ ఆసియాలోనే అత్యంత పెద్ద స్టేషన్లలో ఒకటి కావడం విశేషం. సోమవారం సాయంత్రం 6గంటల నుంచి ఈ రూట్లో మెట్రో రైళ్ల వాణిజ్య రాకపోకలు ప్రారంభమయ్యాయి. 18 రైళ్లు సిద్ధం... మంగళవారం నుంచి రద్దీ వేళల్లో ప్రతి 6నిమిషాలకో రైలు, మిగతా వేళల్లో ప్రతి 8నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుందని మెట్రో అధికారులు తెలిపారు. ఈ మార్గంలో నిత్యం రాకపోకలు సాగించేందుకు 18 రైళ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఉదయం 6:30గంటల నుంచి రాత్రి 10:30గంటల వరకు మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఎల్బీనగర్ నుంచి 29 కి.మీ దూరంలో ఉన్న మియాపూర్ వరకు జర్నీ చేసేందుకు రోడ్డు మార్గంలో రెండు గంటలకు పైగా సమయం పడుతుండగా... మెట్రోలో కేవలం 52 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉండడం విశేషం. అదీ కేవలం రూ.60 చార్జీతో ఒక చివరి నుంచి మరో చివరికి ప్రయాణించవచ్చు. మెట్రో జర్నీతో సమయం ఆదా అవడంతో పాటు ట్రాఫిక్, కాలుష్యం నుంచి సిటీజనులకు విముక్తి లభించనుంది. ఇక ఎల్బీనగర్ నుంచి దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే వారితో పాటు ఈ రూట్లోని దిల్సుఖ్నగర్, ఎంజీబీఎస్, నాంపల్లి రైల్వేస్టేషన్లతో పాటు మలక్‌పేట్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ల నుంచి నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మందికి ఈ మెట్రో మార్గం సౌకర్యవంతంగా మారనుంది. ప్రధానంగా ఎల్బీనగర్–మియాపూర్ (29 కి.మీ) మార్గంలోని మెట్రో మార్గానికి ఇరువైపులా పలు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వాణిజ్య, వ్యాపార సముదాయాలు, మార్కెట్లు, విద్యాసంస్థలు, కార్పొరేట్ ఆస్పత్రులున్నాయి. ఆయా కేంద్రాలకు వెళ్లే వేలాది మందికి మెట్రో జర్నీ సౌకర్యవంతంగా మారనుంది. పార్కింగ్ పరేషాన్ తప్పదు... మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ కష్టాలు మాత్రం ప్రయాణికులకు చుక్కలు చూపనున్నాయి. ఎల్బీనగర్–అమీర్‌పేట్ మార్గంలో 17 స్టేషన్లుండగా... వీటిలో ఎల్బీనగర్, విక్టోరియా, మూసారాంబాగ్, ఎర్రమంజిల్ మినహా మిగతా స్టేషన్లలో పార్కింగ్ వసతి లేదు. ద్విచక్రవాహనాలు, కార్లలో తరలివచ్చిన ప్రయాణికులకు పార్కింగ్ కష్టాలు చుక్కలు చూపనున్నాయి. ప్రధానంగా ఆటోలు, బస్సులు, క్యాబ్ సర్వీసుల్లో మెట్రో స్టేషన్లకు తరలివచ్చే వారికే మెట్రో జర్నీ సౌకర్యవంతంగా మారనుంది. దశలవారీగా ఆయా స్టేషన్ల వద్ద పార్కింగ్ సదుపాయాలు కల్పిస్తామని, సుందరీకరణ పనులు పూర్తి చేస్తామని మెట్రో అధికారులు చెబుతున్నారు. ఆయా స్టేషన్ల వద్ద స్మార్ట్‌బైక్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలు, బైక్‌లు, కార్లు అద్దెకు ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇస్తున్నారు. ఉద్యోగుల హర్షం... పంజగుట్ట /సుల్తాన్‌బజార్/అఫ్జల్‌గంజ్: ఎల్బీనగర్ – అమీర్‌పేట్ మెట్రో రైలు ప్రారంభం కావడంపై పలువురు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎర్రమంజిల్ కాలనీలో జలసౌధ, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యాలయం, విద్యుత్ సౌధ తదితర ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు, నిమ్స్ ఆసుపత్రి, మరెన్నో ప్రైవేట్ సంస్థలు, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. దీంతో ఈ రహదారిలో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎల్బీనగర్ నుంచి పంజగుట్టకు రావాలంటే ఆఫీస్ సమయాల్లో దాదాపు 2గంటలు పడుతోంది. ఇప్పుడు మెట్రోలో అరగంటలో రావచ్చు. ఇక కాలుష్యం, ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది ఉండదని ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పార్కింగ్ సమస్య... మెట్రోను హడావుడిగా ప్రారంభించారే తప్ప సరైన వసతులు కల్పించలేదు. ఖైరతాబాద్‌లో వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు సౌకర్యం లేదు. ఎర్రమంజిల్‌లో కూడా పార్కింగ్ లేదు. స్టేషన్ పక్కనే నిర్మిస్తున్న షాపింగ్‌మాల్‌లో పార్కింగ్ సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సౌకర్యాలు అంతంతే..! ఎంజీబీఎస్, కోఠి ఉస్మానియా మెడికల్ కళాశాల మెట్రో రైల్వే స్టేషన్లలో సౌకర్యాలు అంతంతామాత్రంగానే ఉన్నాయి. మరుగుదొడ్లు, మూత్రశాలల పనులు పూర్తి కాలేదు. ఎస్కలేటర్ పనులు సైతం కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాథమిక దశలోనే మొరాయించడంతో మరమ్మతులు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక మెట్రో స్టేషన్లలో పార్కింగ్ సౌకర్యం కూడా లేదు. దీనిపై మెట్రో అధికారులను వివరణ కోరగా ఎంజీబీఎస్ బస్టాండ్‌లో పార్కింగ్ చేసుకోవచ్చని ఉచిత సలహా ఇస్తున్నారు. 20 నిమిషాల్లో... నాకు మియాపూర్‌లో సెలూన్ ఉంది. ప్రతిరోజు బైక్‌పై వెళ్లి రావాలంటే చాలా కష్టమవుతోంది. ఇప్పుడు ఇంటికి దగ్గర్లోని ఎర్రమంజిల్ స్టేషన్లో మెట్రో ఎక్కితే 20 నిమిషాల్లో మియాపూర్ చేరుకుంటాను. హ్యాపీగా, సాఫీగా వెళ్లిపోవచ్చు. – సంతోష్, ఎర్రమంజిల్ కాలనీ తగ్గిస్తే మేలు.. ఢిల్లీలో మాదిరి హైదరాబాద్‌లోనూ టికెట్ ధరలు తగ్గించాలి. ఆదరణ పెరగాలంటే చార్జీలు తగ్గించి, స్టేషన్లలో సెక్యూరిటీ పెంచాలి. – సాన శ్రీతిషా ఎంతో హాయి... ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు ఎలాంటి ట్రాఫిక్‌జామ్ లేకుండా మెట్రో రైలులో వెళ్లడం ఎంతో హాయినిచ్చింది. బైక్‌లో వెళ్లడం కంటే మెట్రోలో సేఫ్ కూడా. ఇది ప్రజలకెంతో సౌకర్యం. – స్వరూప్‌రెడ్డి, ప్రయాణికుడు చార్జీలు తగ్గించాలి.. నేను నిమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగిని. తార్నాకలో ఉంటాను. రోజు ట్రాఫిక్‌లో రావాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. ఇక ఇప్పుడు మెట్రోలో ఇబ్బందులు లేకుండా వెళ్లొచ్చు. నిమ్స్‌కు వచ్చే వారికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కానీ చార్జీలు కొంత మేరకు తగ్గించి, పేదలకు కూడా అందుబాటులోకి తీసుకురావాలి. – సత్యగౌడ్, నిమ్స్ ఉద్యోగి చార్జీలు ఇలా... మెట్రో రైలులో ఎల్బీనగర్–మియాపూర్ (29 కి.మీ) మార్గంలో ఒక చివరి నుంచి మరో చివరికి ప్రయాణించేందుకు రూ.60 చార్జీ అవుతుంది. ఇక మియాపూర్‌లో బయలుదేరిన వ్యక్తికి స్టేషన్ల వారీగా మెట్రో టిక్కెట్ చార్జీ ఇలా ఉంది ప్రయాణం చార్జీ (రూ.ల్లో) మియాపూర్–జేఎన్టీయూ 10 కేపీహెచ్‌బీ కాలనీ 15 కూకట్పల్లి 25 బాలానగర్ 30 మూసాపేట్ 30 భరత్‌నగర్ 30 ఎర్రగడ్డ 35 ఈఎస్ఐ 35 ఎస్ఆర్నగర్ 40 అమీర్‌పేట్ 40 పంజగుట్ట 40 ఎర్రమంజిల్ 40 ఖైరతాబాద్ 45 లక్డీకాపూల్ 45 అసెంబ్లీ 45 నాంపల్లి 45 గాంధీభవన్ 50 ఉస్మానియా మెడికల్ కాలేజ్ 50 ఎంజీబీఎస్ 50 మలక్‌పేట్ 50 న్యూమార్కెట్ 50 మూసారాంబాగ్ 55 దిల్సుఖ్నగర్ 55 చైతన్యపురి 60 విక్టోరియా మెమోరియల్ 60 ఎల్బీనగర్ 60 -
కాలుష్యరహితం మెట్రో ప్రయాణం
సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న ఇంధన ధరలు.. కాలుష్యం నుంచి విముక్తి పొందేందుకు మెట్రో రైలులో ప్రయాణించాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నగరవాసులకు సూచించారు. సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు అమీర్‌పేట్–ఎల్బీనగర్ మెట్రో మార్గాన్ని అమీర్‌పేట్ స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మంత్రులు కేటీఆర్, నాయిని, తలసాని, పద్మారావు, ఎంపీలు దత్తాత్రేయ, మల్లారెడ్డి తదితరులతో కలసి మెట్రో రైలులో ఎల్బీనగర్ వరకు ప్రయాణించారు. మధ్యలో ఎంజీబీఎస్ స్టేషన్లో దిగి అక్కడి వసతులను పరిశీలించారు. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వద్ద మీడియాతో గవర్నర్ మాట్లాడారు. అందరూ మెట్రో రైలులో ప్రయాణిస్తే రహదారులపై ట్రాఫిక్ రద్దీ ఉండదని, అంబులెన్స్‌లు ఫ్రీగా వెళ్లే వీలుంటుందని తెలిపారు. వచ్చే డిసెంబర్ 15 నాటికి అమీర్‌పేట్–హైటెక్ సిటీ మెట్రో మార్గాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కోరారు. ప్రతి మెట్రో స్టేషన్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారని.. ప్రయాణం సౌకర్యవంతంగా ఉందన్నారు. మెట్రో, ఎంఎంటీఎస్, బస్సు ప్రయాణం సహా షాపింగ్‌కు వీలుగా బహుళ ప్రయోజన సింగిల్ కార్డును త్వరలో వినియోగంలోకి తీసుకురావాలని మెట్రో అధికారులకు సూచించారు. ఉరుకుల పరుగుల జీవితం గడిపే నగరవాసులకు మెట్రో ప్రయాణంతోపాటు నిత్యావసరాలు, ఆహార పదార్థాలను సైతం స్టేషన్లో కొనుగోలు చేసుకునేలా అవకాశం కల్పించడం విశేషమన్నారు. దేశంలోనే నంబర్ 2... దేశంలో రెండో అతిపెద్ద మెట్రో ప్రాజెక్టు మనదే అని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్టు కూడా ఇదేనని తెలిపారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నగర మెట్రో ప్రాజెక్టు విశిష్టతలను తెలియజేశారు. ప్రపంచస్థాయిలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు, సౌకర్యాలు కల్పించామన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రీకాస్ట్ సెగ్మెంట్లతో వయాడక్ట్, స్టేషన్లను నిర్మించామని తెలిపారు. మెట్రో ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సహా పలు అంతర్జాతీయ సంస్థల నుంచి అవార్డులు అందుకున్న విషయాన్ని గుర్తుచేశారు. లాస్ట్‌మైల్, ఫస్ట్‌మైల్ కనెక్టివిటీ కోసం అధునాతన సైకిళ్లు, స్మార్ట్‌బైక్‌లు, జూమ్కార్లు, ఎలక్ట్రిక్ బైక్‌లను పలు స్టేషన్ల వద్ద అందుబాటులో ఉంచామన్నారు. మియాపూర్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో స్టేషన్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామన్నారు. ఎల్బీనగర్–మియాపూర్ మార్గంలో నిత్యం లక్ష మంది ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నామన్నారు. మెట్రో నిర్మాణం కోసం తొలగించిన చెట్లను ట్రాన్స్‌లొకేషన్ విధానంలో వేరొక చోట నాటామన్నారు. అనంతరం నగర మెట్రో ప్రాజెక్టును పీపీపీ విధానంలో చేపట్టేందుకు, ఎల్అండ్టీ సంస్థ అత్యధిక పెట్టుబడులు పెట్టేందుకు సహకరించిన ఆ సంస్థ ఆర్థిక సలహాదారు శంకరన్‌ను గవర్నర్ నరసింహన్ ఘనంగా సన్మానించారు. అనంతరం స్టేషన్లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, శ్రీనివాస్‌యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, మేయర్ బొంతు రాంమోహన్, డిప్యూటీ మేయర్ బాబాఫసీయుద్దీన్, ఎంపీలు బండారు దత్తాత్రేయ, మల్లారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ కమి షనర్ దానకిశోర్, హెచ్ఎండీఏ కమిషనర్ జనార్ధన్ రెడ్డి, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ తదితరులు పాల్గొన్నారు. కాగా మెట్రో ప్రారంభోత్సవంలో ఎక్కడా ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో లేకపోవడంతో అలకబూనిన దత్తాత్రేయ ఎంజీబీఎస్ స్టేషన్ వద్ద మెట్రో దిగి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. గవర్నర్, కేటీఆర్ స్మార్ట్‌బైక్ రైడ్... మెట్రో ప్రయాణం అనంతరం ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన స్మార్ట్‌బైక్‌ను గవర్నర్ రైడ్ చేస్తూ రాజ్‌భవన్‌కు వెళ్లారు. మంత్రి కేటీఆర్, ఎస్.కె.జోషి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, దానకిశోర్‌లు ఆయ న వెంట స్మార్ట్‌బైక్‌లను తొక్కుకుంటూ వెళ్లారు. ఈ స్మార్ట్‌బైక్‌లు ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉంటాయని గవర్నర్ వివరించారు. స్మార్ట్ బైక్ సైకిల్‌పై రాజ్‌భవన్‌కు వెళుతున్న గవర్నర్ నరసింహన్, కేటీఆర్ -
ప్రారంభమైన అమీర్‌పేట్-ఎల్బీనగర్ మెట్రోరైలు
-
ఎల్బీనగర్-అమీర్‌పేట్ మెట్రోరైలు ప్రారంభం
-
ప్రారంభమైన ఎల్బీనగర్-అమీర్‌పేట్ మెట్రోరైలు
సాక్షి, హైదరాబాద్ : ఎల్బీనగర్-అమీర్‌పేట్ (16 కి.మీ.) మార్గంలో మెట్రో రైలు ప్రారంభమైంది. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జెండా ఊపి లాంఛనంగా మెట్రో రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆపద్ధర్మ మంత్రులు కేటీఆర్, నాయిని నరసింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొని.. మెట్రోరైలులో ప్రయాణించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రయాణికులకు ఈ మార్గంలో మెట్రోరైళ్లు అందుబాటులోకి వస్తాయి. ఈ రూట్లో మొత్తం 17 స్టేషన్లుండగా.. నాలుగు మినహా మిగతాచోట్ల ఇప్పటివరకు పార్కింగ్ వసతులు అందుబాటులో లేవు. ఈ మార్గం ప్రారంభంతో ఎల్బీనగర్ నుంచి బయలుదేరిన వ్యక్తి 29 కి.మీ. దూరంలో ఉన్న మియాపూర్‌కు 52 నిమిషాల్లో చేరుకోవచ్చు. ప్రారంభంలో ప్రతి ఐదు నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది. ఈ రైళ్లు 80 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తాయి. ఆ తరవాత రైళ్ల ఫ్రీక్వెన్సీ 2 నిమిషాలకు కుదిస్తామని అధికారులు తెలిపారు. అత్యంత రద్దీగా ఉండే ఈ రూట్లో మెట్రో ప్రారంభంతో ఎంజీబీఎస్, దిల్సుఖ్నగర్ బస్ డిపో, మలక్‌పేట్, నాంపల్లి రైల్వేస్టేషన్లకు నిత్యం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే లక్షలాది మంది ప్రయాణికులకు ట్రాఫిక్ నరకం నుంచి ఉపశమనం కలగనుంది. ఈ రూట్లో అసెంబ్లీ–ఎంజీబీఎస్ మార్గంలో పలు చారిత్రక కట్టడాలున్న నేపథ్యంలో ఐదు కిలోమీటర్ల మార్గంలో దక్కనీ, ఇండో పర్షియన్ కళాత్మకత ఉట్టిపడేలా తీర్చిదిద్దనున్నారు. తొలిరోజు సుమారు 50 వేలు.. తర్వాత నిత్యం లక్ష మంది ఈ మార్గంలో ప్రయాణిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. -
షాకింగ్ : మెట్రో నగరాల్లో పెట్రో సెగలు
సాక్షి, న్యూఢిల్లీ : ముడిచమురు ధరల భారంతో పెట్రో సెగలు కొనసాగుతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సోమవారం లీటర్ పెట్రోల్ ధర రూ 90.08కి పెరగ్గా, డీజిల్ లీటర్‌కు రూ 78.58కి చేరింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ 82.72కు పెరగ్గా, డీజిల్ ధర లీటర్‌కు రూ 74.02కు ఎగిసింది. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ రూ 87.58కి పెరిగింది. ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 77 డాలర్లకు పెరగడంతో పాటు పెట్రో ఉత్పత్తులపై పన్నుల భారంతో పెట్రో ధరలు పరుగులు పెడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో పెట్రో ధరలు రికార్డు స్ధాయిలకు చేరడంతో ప్రభుత్వం ఇంధన భారాలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. పెట్రో ఉత్పత్తులపై పన్నులను భారీగా తగ్గించాలని వినియోగదారులు కోరుతున్నారు. -
మార్వలెస్.. మెట్రో స్టేషన్
సాక్షి, సిటీబ్యూరో: మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌కు సమీపంలో నిర్మించిన మెట్రోస్టేషన్ ఆసియాలోనే అతిపెద్ద స్టేషన్ కావడం విశేషం. ఈ భారీ స్టేషన్ నగరవాసులకు సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. ఎల్బీనగర్–మియాపూర్(కారిడార్–1)మార్గంతోపాటు కారిడార్–2(జేబీఎస్–ఫలక్‌నుమా)మార్గాన్ని సైతం అనుసంధానించేలా నాలుగు అంతస్తుల భారీ స్టేషన్‌ను ఇక్కడ నిర్మించడం ఇంజినీరింగ్ అద్భుతమని హెచ్ఎంఆర్ వర్గాలు తెలిపాయి. సోమవారం నుంచి ఎల్బీనగర్–అమీర్పేట్రూట్లో మెట్రో రాకపోకలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ స్టేషన్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ స్టేషన్‌కు 58 ప్రధాన పిల్లర్లు, ఆరుగ్రిడ్లతో నిర్మించారు. ఈ స్టేషన్ నిర్మాణానికి అత్యంత ఒత్తిడిని తట్టుకునే స్టీలు, రీయిన్‌ఫోర్స్‌డ్ సిమెంట్ కాంక్రీటును వినియోగించినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. ఈస్టేషన్‌కు ఇరువైపులా ఉన్న ఎంజీబీఎస్, చాదర్‌ఘాట్ పరిసరాలను సుందరీకరించామన్నారు. కబుల్స్టోన్స్, తాండూర్, షాబాద్ రాళ్లతో పరిసరాలను తీర్చిదిద్దామన్నారు. అసెంబ్లీ–ఎంజీబీఎస్ మార్గంలో 5 కి.మీ మెట్రో మార్గంలో చారిత్రక,వారసత్వ కట్టడాలున్నందున వాటి ప్రత్యేకతను చాటేలా పరిసరాలను తీర్చిదిద్దామన్నారు. ఈ మార్గంలో ప్రధానంగా నాంపల్లి, ఎంజేమార్కెట్, జాంభాగ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, రంగమహల్ ప్రాంతాలున్నాయన్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజ్, రంగమహల్ ప్రాంతాల్లో అత్యధిక ఎత్తులో ఉన్న పిల్లర్లతో నిర్మిచినట్లు తెలిపారు. ఈ పిల్లర్లు, స్టేషన్ల నిర్మాణం ఎన్నో ఇంజినీరింగ్ అద్భుతాలకు శ్రీకారం చుట్టిందన్నారు. ఆయా స్టేషన్లను వారసత్వ కట్టడాలను తలపించేలా తీర్చిదిద్దుతామని..పర్యాటకులను ఆకర్షించే స్థాయిలో సుందరీకరిస్తామని తెలిపారు. ఈ మార్గంలో తీరైన స్ట్రీట్‌ఫర్నీచర్, చూపరులను కట్టిపడేసేలా ఉండే తీరైన ఫుట్‌పాత్‌లు,హరిత వాతావరణంతో తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. -
ఎల్బీనగర్–అమీర్‌పేట్ మెట్రో నేడే
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌వాసుల కలల మెట్రో రైలు ఎల్బీనగర్–అమీర్‌పేట్ (16 కి.మీ.) మార్గంలో నేటి నుంచి అందుబాటులోకి రానుంది. మధ్యాహ్నం 12 గంటలకు అమీర్‌పేట్ మెట్రో స్టేషన్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జెండా ఊపి లాంఛనంగా మెట్రో రైలును ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రయాణికులకు ఈ మార్గంలో మెట్రో రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ రూట్లో మొత్తం 17 స్టేషన్లుండగా.. నాలుగు మినహా మిగతా చోట్ల ఇప్పటివరకు పార్కింగ్ వసతులు అందుబాటులో లేవు. ఈ మార్గం ప్రారంభంతో ఎల్బీనగర్ నుంచి బయలుదేరిన వ్యక్తి 29 కి.మీ. దూరంలో ఉన్న మియాపూర్‌కు 52 నిమిషాల్లో చేరుకోవచ్చు. ప్రారంభంలో ప్రతి ఐదు నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది. ఈ రైళ్లు 80 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తాయి. ఆ తరవాత రైళ్ల ఫ్రీక్వెన్సీ 2 నిమిషాలకు కుదిస్తామని అధికారులు తెలిపారు. అత్యంత రద్దీగా ఉండే ఈ రూట్లో మెట్రో ప్రారంభంతో ఎంజీబీఎస్, దిల్సుఖ్నగర్ బస్ డిపో, మలక్‌పేట్, నాంపల్లి రైల్వేస్టేషన్లకు నిత్యం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే లక్షలాది మంది ప్రయాణికులకు ట్రాఫిక్ నరకం నుంచి ఉపశమనం కలగనుంది. ఈ రూట్లో అసెంబ్లీ–ఎంజీబీఎస్ మార్గంలో పలు చారిత్రక కట్టడాలున్న నేపథ్యంలో ఐదు కిలోమీటర్ల మార్గంలో దక్కనీ, ఇండో పర్షియన్ కళాత్మకత ఉట్టిపడేలా తీర్చిదిద్దనున్నారు. తొలిరోజు సుమారు 50 వేలు.. తర్వాత నిత్యం లక్ష మంది ఈ మార్గంలో ప్రయాణిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. -
ఎల్బీనగర్ అమీర్‌పేట మెటో మార్గానికి అంతాసిద్ధం
-
అర్ధరాత్రి వేళల్లోనూ మెట్రో నడపాలని డిమాండ్
‘‘మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో సిస్టం ఇంజినీర్‌గా పనిచేస్తున్నా. ఉదయం10 గంటలకు డ్యూటీకి వెళితే వర్క్ పూర్తయ్యేసరికి రాత్రి 10 అవుతుంది. ఆఫీస్ నుంచి అమీర్‌పేట్‌కు 11 గంటలకల్లా వస్తున్నా.. అక్కడి నుంచి కొత్తపేట్ వెళ్లే పరిస్థితి లేదు. ఆ సమయంలో మెట్రో సర్వీస్ ఉంటే నాలాంటి వారికి ఉపయోగంగా ఉంటుంది’’ అని అంటున్నాడు కొత్తపేట్‌కు చెందిన రామకృష్ణ. అమీర్‌పేట్.. విద్యా,వ్యాపారం కేంద్రం. పంజగుట్ట.. వాణిజ్య సముదాయాలకు, కోఠి, అబిడ్స్.. హోల్‌సేల్ వ్యాపారానికినిలయం. దిల్సుఖ్నగర్.. కోచింగ్ సెంటర్ల హబ్.కొత్తపేట్ హోల్‌సేల్ దుస్తులు, పండ్ల మార్కెట్‌కు సెంటర్. ఇక ఎల్బీనగర్.. నిత్యం ఆంధ్ర ప్రాంతానికి వెళ్లే వేలాది మందికి రవాణా సౌకర్యం దొరికే పాయింట్. ఇంతకాలం ఆయా ప్రాంతాలకు బస్సుల్లోనో, సొంత వాహనాల్లోనో వెళ్లేవారు ట్రాఫిక్ ఇక్కట్లతో సతమతమయ్యేవారు. ఇకపై వారికి ఆ కష్టాలు తీరనున్నాయి. సోమవారం నుంచి అమీర్‌పేట్–ఎల్బీనగర్ మార్గంలో మెట్రో రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ రూట్లో ఉన్న 16 మెట్రో స్టేషన్లు వేలాది మందికి సేవలు అందించనున్నాయి. సాక్షి,సిటీబ్యూరో: ఎల్బీనగర్–అమీర్‌పేట్ (16 కి.మీ) రూట్లో రెండురోజుల్లో మెట్రో రైళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ రూట్లో తిరిగే ప్రయాణికులకు కల్పించిన వసతులు, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ, పార్కింగ్ వంటి అంశాలన్నీ ఆసక్తికరంగా మారాయి. సోమవారం మధ్యాహ్నం 12.15 గంటలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఈ మార్గంలో మెట్రో రైళ్లను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రయాణికులకు రైళ్లు అందుబాటులో ఉంటాయని మెట్రో అధికారులు చెబుతున్నారు. రాత్రి 10.30 గంటల వరకు ప్రతి ఐదు నిమిషాలకో రైలు చొప్పున 84 ట్రిప్పుల మేర రాకపోకలు సాగిస్తాయంటున్నారు. మంగళవారం నుంచి నిత్యం సుమారు లక్ష మంది ఈ మార్గంలో ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా, అమీర్‌పేట్ నుంచి ఎల్బీనగర్ వరకు ఉన్న 16 స్టేషన్ల వద్ద వయాడక్ట్, స్టేషన్ నిర్మాణం పనులను ఎల్అండ్టీ సంస్థ పూర్తి చేసింది. ప్రధాన రహదారి వద్ద స్టేషన్ల పరిసరాల్లో ఫుట్‌పాత్‌లు, రెయిలింగ్, సుందరీకరణ పనులను హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ చేపట్టింది. దిల్సుఖ్నగర్, ఎర్రమంజిల్ స్టేషన్ వద్ద పరిసరాల సుందరీకరణ పనులు పూర్తయ్యాయి. మరో వారం రోజుల్లో అన్ని స్టేషన్ల వద్ద ఈ పనులు పూర్తి చేస్తామని హెచ్ఎంఆర్ అధికారులు చెబుతున్నారు. ఇక్కడా పార్కింగ్ పరేషానే.. ♦ ఎల్బీనగర్–అమీర్‌పేట్ మధ్య అత్యంత రద్దీగా ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో స్టేషన్లకు ద్విచక్రవాహనాలు, కార్లలో వచ్చే ప్రయాణికులకు పార్కింగ్ కష్టాలు తప్పవు. నాలుగు స్టేషన్లు మినహా మిగతా 12 స్టేషన్లలో పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో ప్రయాణికులు బస్సులు, ఆటోలు, క్యాబ్సర్వీసుల్లో మాత్రమే స్టేషన్లకు రావాల్సి ఉంటుంది. ♦ ఇప్పటి దాకా ఎల్బీనగర్లో స్టేడియం పక్కనే మెట్రోకు రెండు ఎకరాల స్థలం ఉన్నప్పటికీ పార్కింగ్ ఏర్పాట్లు పూర్తికాలేదు. కానీ ఎల్బీనగర్ స్టేషన్ పరిసరాల్లో పరిమిత సంఖ్యలో ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేసుకునే సదుపాయం కల్పించారు. ♦ ఇక ముసారాంబాగ్‌లో మెట్రో మాల్ ఉంది. అక్కడ వాహనాలు పార్క్ చేసుకోవచ్చు. ఎర్రమంజిల్‌లోనూ మెట్రో మాల్ పూర్తయింది. ఇక్కడా వాహనాలు నిలుపుకోవచ్చు. ♦ పంజగుట్ట వద్ద కూడా మెట్రో మాల్లో వాహనాల్ని పార్క్ చేయవచ్చు. నాంపల్లి రైల్వేస్టేషన్ వద్ద అధునాతన మల్టీలెవల్ పార్కింగ్ సముదాయ నిర్మాణానికి ఇటీవల భూమి పూజ చేసినప్పటికీ ఈ పనులు పూర్తి కావాలంటే మరో ఏడాది వేచిచూడక తప్పదు. భద్రతా తనిఖీలు ముమ్మరం ఎల్బీనగర్ మార్గంలోని 16 స్టేషన్లలో భద్రతా తనిఖీలు మొదలయ్యాయి. డాగ్ స్క్వాడ్ బృందం స్టేషన్లలో తనిఖీలు చేస్తోంది. ఈ మార్గంలోని చివరి స్టేషన్ ఎల్బీనగర్లో గురు, శుక్రవారాల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. అనుమతి లేనిదే ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. మెట్ల మార్గాలు, ఎస్కలేటర్లు, లిఫ్ట్, ఫ్లోరింగ్‌ను సిబ్బంది శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. 850 ఆర్టీసీ బస్సుల రాకపోకలు.. అమీర్‌పేట్–ఎల్బీనగర్ మెట్రో రైలు మార్గానికి అనుసంధానంగా సిటీ బస్సులను విస్తరించేందుకు గ్రేటర్ ఆర్టీసీ కార్యాచరణ చేపట్టింది. ఇప్పటి దాకా ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు తిరిగే బస్సుల సంఖ్యను తగ్గించి మెట్రోస్టేషన్లకు రెండు వైపులా ఉన్న కాలనీలకు, శివారు ప్రాంతాలకు వాటి సంఖ్యను పెంచారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ రూటు వల్ల ఇటు ఎల్బీనగర్ నుంచి నాంపల్లి, లక్డీకాపూల్ మీదుగా అటు ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ మీదుగా రెండు ప్రధాన కారిడార్లలో మియాపూర్‌కు మెట్రో కనెక్టివిటీ పెరగనుంది. దీంతో ఆర్టీసీకి ప్రయాణికుల ఆదరణ తగ్గే అవకాశం ఉంది. మొదటి కారిడార్ వల్ల ఆర్టీసీపై పెద్దగా ప్రభావం కనిపించలేదు. కానీ రెండో కారిడార్ వల్ల అతి పెద్ద రూట్ల మధ్య మెట్రో అనుసంధానం పెరుగుతుంది. దీంతో ఆర్టీసీ ప్రయాణికులు ఎక్కువగా మెట్రో వైపు వెళ్లే అవకాశం ఉంది. ఈ మార్పును దృష్టిలో ఉంచుకొని సుమారు 850 బస్సులను ఎల్బీనగర్–అమీర్‌పేట్ మార్గంలోని కాలనీలకు, శివారు ప్రాంతాలకు విస్తరించారు. 500 కాలనీలకు అనుసంధానం హయత్‌నగర్ నుంచి ఎల్బీనగర్ మీదుగా, వనస్థలిపురం ఎన్జీఓస్ కాలనీ నుంచి ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, కోఠి, నాంపల్లి, ఖైరతాబాద్, అమీర్‌పేట్, కూకట్పల్లి, మియాపూర్, బీహెచ్ఈఎల్, లింగంపల్లి మార్గంలో సిటీబస్సులు ప్రతిరోజు సుమారు 7,295 ట్రిప్పులు తిరుగుతున్నాయి. ఇప్పటి దాకా ఆర్టీసీకి అత్యధికంగా ఆదాయాన్ని తెచ్చే మార్గాలు కూడా ఇవే. ఈ రూట్లలో తిరిగే బస్సుల్లో ప్రతిరోజు 65 శాతానికి పైగా ఆక్యుపెన్సీరేషియో నమోదవుతుంది. ఎల్బీనగర్–అమీర్‌పేట్ మార్గంలో మెట్రో అందుబాటులోకి రావడం వల్ల బస్సుల సంఖ్యను గణనీయంగా తగ్గించనున్నారు. లింగంపల్లి, బీహెచ్ఈఎల్ మీదుగా వచ్చే బస్సులను మియాపూర్ వరకు పరిమితం చేస్తారు. అలాగే హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం రూట్లలో వచ్చే బస్సులను ఎల్బీనగర్ వరకు పరిమితం చేస్తారు. ఈ కారిడార్‌లో సమాంతరంగా నడిచే బస్సులను ప్రయాణికుల రద్దీ, ఆదరణకు అనుగుణంగా రూట్ కోర్సుల్లో మార్పులు చేస్తారు. సమాంతర రూట్ బస్సులను కుదించడం వల్ల మెట్రోకు రెండు వైపులా ఉండే సుమారు 500 కాలనీలు, నగర శివారు ప్రాంతాలకు అదనపు సర్వీసులు పెంచనున్నారు. కర్మన్‌ఘాట్, బీఎన్‌రెడ్డినగర్, నందనవనం, ఇబ్రహీంపట్నం, బాలాపూర్, మీర్పేట్, కొహెడ, తదితర ప్రాంతాల్లోని కొత్త కాలనీలకు బస్సులను విస్తరిస్తారు. ఈ రూట్ల లోంచి ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్లకు సిటీ బస్సులను కనెక్ట్ చేస్తారు. అలాగే పాతబస్తీలోని వివిధ ప్రాంతాల నుంచి ఇటు దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్‌కు, అటు లక్డీకాపూల్‌కు సిటీ బస్సుల కనెక్టివిటీ పెరగనుంది. మియాపూర్‌లో పెరిగిన ఆక్యుపెన్సీ ఉప్పల్– అమీర్‌పేట్– మియాపూర్ మెట్రో కారిడార్‌లో రెండు వైపులా కాలనీలకు మెట్రో అందుబాటులోకి రావడంతోనే ఆర్టీసీ బస్సులను ప్రవేశపెట్టారు. చిలుకానగర్, హేమానగర్, బోడుప్పల్, నాగోల్, బండ్లగూడ, ఘట్కేసర్, నారపల్లి, తదితర ప్రాంతాలకు ట్రిప్పులను పెంచారు. అలాగే మియాపూర్ మార్గంలో అపురూపకాలనీ, హైటెక్‌సిటీ, జగద్గిరిగుట్ట, వీబీఐటీ, జేఎన్టీయూ, హైటెక్‌సిటీ, కూకట్పల్లి, హైటెక్‌సిటీ, అమీర్‌పేట్– హైటెక్‌సిటీ, తదితర ప్రాంతాలకు 60 బస్సులను అదనంగా ప్రవేశపెట్టారు. దీంతో ఈ రెండు రూట్లలో కాలనీలకు బస్సుల కనెక్టివిటీ పెరిగింది. ఇప్పుడు ఈ బస్సులన్నీ ప్రతి రోజు 70 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. గతంలో 68 శాతం ఉన్న ఆక్యుపెన్సీ 2 శాతం పెరిగినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. తొలిరోజు 50 వేలు.. తర్వాత లక్ష మంది సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 84 ట్రిప్పుల మెట్రో రైళ్లలో సుమారు 50 వేల మంది రాకపోకలు సాగించే అవకాశాలున్నట్లు మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. మంగళవారం ఉదయం 6.30 నుంచి రాత్రి 10.30 గంట వరకు(16 గంటలు) ఐదు నిమిషాలకొకటి చొప్పున 192 మెట్రో రైళ్ల ట్రిప్పులు నడిచే అవకాశం ఉంది. ఈ రద్దీ లక్ష మంది వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక ఆదివారం, ఇతర పర్వదినాలు, సెలవు రోజుల్లో రద్దీ లక్షకు మించుతుందని భావిస్తున్నారు. స్పీడు పెరిగిన మెట్రో రైళ్లు.. కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ధ్రువీకరణ రావడంతో మెట్రో రైళ్ల వేగం ఊపందుకుంది. ప్రస్తుతం మెట్రో రైలు 60 కేఎంపీహెచ్ వేగంతో దూసుకెళుతున్నట్టు మెట్రో అధికారులు చెబుతున్నారు. మెట్రో రైళ్ల గరిష్ట వేగం 8 కేఎంపీహెచ్ అని చెబుతున్నారు. ప్రారంభంలో నాగోల్–అమీర్‌పేట్ మార్గంలో 30–40 కేఎంపీహెచ్ వేగంతోమాత్రమే మెట్రో రైళ్లు రాకపోకలు సాగించగా.. ఇప్పుడు ఈ మార్గంలోనూ రైళ్ల వేగం 60 కేఎంపీహెచ్‌కు పెరిగిందని చెబుతున్నారు. ఇక ఎల్బీనగర్ నుంచి మెట్రోలో బయలుదేరిన వ్యక్తి కేవలం 52 నిమిషాల్లోనే 29 కి.మీ దూరంలో ఉన్న మియాపూర్‌కు చేరుకోవచ్చు. అదే బస్సు లేదా కారులో రెండు గంటల పాటు ట్రాఫిక్ రద్దీలో జర్నీ చేయక తప్పదు. త్వరలో ఈ బైక్‌లు, అధునాతన సైకిళ్ల సేవలు.. ఈ మార్గంలోని 16 స్టేషన్ల వద్ద అధునాతన సైకిళ్లు, ఈ బైక్‌లు, కార్లు, ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోఉండే స్టేషన్ల వివరాలను త్వరలో వెల్లడిస్తామని హెచ్ఎంఆర్ అధికారులు తెలిపారు. ఈ మార్గంలోని స్టేషన్ల వద్ద ఉబర్, ఓలా క్యాబ్ సర్వీసులు, ఆటోలు నిలుపుకునేందుకు వసతులు కల్పించడంతో పాటు, ప్రత్యేక బుకింగ్ కౌంటర్లను సైతం దశలవారీగా ఏర్పాటు చేస్తామన్నారు. అర్ధరాత్రి వరకు మెట్రో సర్వీసులు ప్రస్తుతం నాగోల్–అమీర్‌పేట్–మియాపూర్ మార్గంలో మెట్రో రైళ్లు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకే అందుబాటులో ఉన్నాయి. ఇక మియాపూర్–ఎల్బీనగర్ మార్గంలో ప్రముఖ విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, ఆస్పత్రులు, మార్కెట్లు ఉండడంతో పాటు ఈ మార్గం వివిధ రంగాలకు హబ్‌గా మారింది. ఈ రూట్లో నిత్యం లక్షలాది మంది ట్రాఫిక్ రద్దీలో ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న ఎల్బీనగర్ నుంచి ఏపీ రాజధాని అమరావతి సహా వివిధ ప్రధాన నగరాలకు నిత్యం 300 వరకు ప్రైవేటు ట్రావెల్ బస్సులు బయలుదేరి వెళతాయి. ఇవన్నీ అర్ధరాత్రి 12 దాటిన తరవాతే వెళుతుంటాయి. ఈనేపథ్యంలో ట్రావెల్స్ బస్సుల్లో వివిధ నగరాలకు బయలుదేరి వెళ్లే ప్రయాణికులు, ప్రధానం నగరం వచ్చి తిరిగి వెళ్లే ఉద్యోగులు, కార్మికుల సౌకర్యార్థం ఎల్బీనగర్–అమీర్‌పేట్ మార్గంలో అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రోరైళ్లను నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. కనీసం రాత్రి 10 గంటల తరవాత ఫ్రీక్వెన్సీ తగ్గించి 15 నిమిషాలకో రైలునైనా నడపాలని కోరుతున్నారు. ఈ విషయమై మెట్రో అధికారులను వివరణ కోరగా.. ప్రయాణికుల రద్దీ, డిమాండ్, మూడ్‌ను బట్టి రాత్రి 11.30 గంటల వరకు మెట్రోరైళ్లను నడిపే అవకాశాలున్నట్లు హెచ్ఎంఆర్ అధికారులు తెలిపారు. ఎప్పటి నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందో త్వరలో తెలియజేస్తామన్నారు. -
‘పెట్రో మంటలతో మోదీ మెట్రో బాట’
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ఔటర్‌పై వీవీఐపీల తాకిడితో ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తొలగించాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ మెట్రో రైలులో ప్రయాణించారని భావిస్తుంటే కాంగ్రెస్ మాత్రం పెట్రో ధరల పెంపుతో ఈ అంశాన్ని ముడిపెట్టి బీజేపీని ఇరుకునపెట్టింది. మోదీ మెట్రో యాత్రతో ఎవరికీ ఎలాంటి ప్రయోజనం లేదని కాంగ్రెస్ పెదవివిరిచింది. ఢిల్లీ మెట్రో ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్లో ప్రధాని మోదీ 14 నిమిషాల పాటు ప్రయాణించడాన్ని ఆ పార్టీ ఆక్షేపించింది. ఢిల్లీలో ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతోనే ప్రధాని విధిలేని పరిస్థితుల్లో మెట్రోలో ప్రయాణించారా లేక ఇది మరో ఎన్నికల ఎత్తుగడా అంటూ కాంగ్రెస్ పార్టీ కర్ణాటక యూనిట్ ట్వీట్ చేసింది. ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతుండటాన్ని నిరసిస్తూ రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ మోదీ సర్కార్‌ను టార్గెట్ చేస్తోంది. పెట్రో భారాలకు నిరసనగా ఆ పార్టీ గతవారం దేశవ్యాప్తంగా భారత్ బంద్‌ను పాటించింది. మరోవైపు ఇంధన ధరలకు చెక్ పెట్టేందుకు పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవడమే పరిష్కారమని పెట్రోలియం సహజవాయు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. -
24 నుంచి ఎల్బీనగర్ - అమీర్‌పేట్ మెట్రో పరుగులు
సాక్షి, హైదరాబాద్: నగర వాసులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎల్బీనగర్– అమీర్‌పేట్ మెట్రో ప్రారంభానికి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 24న (సోమవారం) మధ్యాహ్నం 12.15కి ఎల్బీనగర్–అమీర్‌పేట మెట్రో రైలు మార్గం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ నరసింహన్ హాజరై మెట్రో రైళ్లను ప్రారంభించనున్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కె.జోషి, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్.రెడ్డిలతో కలసి బుధవారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు ఆహ్వానపత్రం అందించారు. ఇప్పటికే నగరంలో నాగోల్– అమీర్‌పేట్– మియాపూర్ (30 కి.మీ) మార్గంలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ మార్గంలో నిత్యం సుమారు 80 వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఆదివారం, ఇతర సెలవు దినాల్లో రద్దీ లక్షకుపైగానే నమోదవుతోంది. ఈ మార్గంలో ప్రతి ఐదు నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది. నవంబర్‌లో అమీర్‌పేట్–హైటెక్‌సిటీ మెట్రో.. అత్యధిక ట్రాఫిక్ రద్దీ ఉండే ఎల్బీనగర్– అమీర్‌పేట్– మియాపూర్ (29 కి.మీ) మార్గంలో నిత్యం సుమారు లక్ష మందికి పైగానే మెట్రో జర్నీ చేసే అవకాశం ఉంటుందని హెచ్ఎంఆర్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్‌లో అమీర్‌పేట్– హైటెక్‌సిటీ మార్గంలోనూ మెట్రో రైళ్లు పరుగులు తీస్తాయని మెట్రో వర్గాలు చెబుతున్నాయి. జేబీఎస్– ఎంజీబీఎస్ రూట్లో వచ్చే ఏడాది మార్చిలో మెట్రో రైళ్లు పట్టాలెక్కనున్నట్లు తెలిపాయి. కాగా ఎంజీబీఎస్– ఫలక్‌నుమా (5.5 కి.మీ) మార్గంలో మెట్రో పనులు మరో ఏడాది ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పార్కింగ్ అవస్థలు తప్పవు.. ఎల్బీనగర్– అమీర్‌పేట్ (16 కి.మీ) మార్గంలో 17 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. అన్ని స్టేషన్ల వద్ద ద్విచక్రవాహనాలు, కార్లు పార్కింగ్ చేసుకునేందుకు అవసరమైన పార్కింగ్ స్థలాలు అందు బాటులో లేవు. దీంతో ప్రయాణికులకు పార్కిం గ్ అవస్థలు తథ్యమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఆయా స్టేషన్ల వద్ద మెట్రో రైలు దిగిన ప్రయాణికులు తిరిగి సమీప కాలనీలు, బస్తీల్లో ని తమ నివాసాలకు చేరుకునేందుకు ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించి జేబులు గుల్లచేసుకునే పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే మెట్రో చార్జీలు అధికంగా ఉన్నాయని భావిస్తున్న సిటిజన్లకు ఇది అదనపు భారంగా పరిణమించనుంది. -
రైలు పట్టాలపై పిల్లి.. నిలిచిపోయిన రైలు
యశవంతపుర : మెట్రో పట్టాలపై ఓ పిల్లి హల్చల్ చేయడంతో పది నిముషాల పాటు మెట్రో రైలు సంచారాన్ని నిలిపివేసిన ఘటన శుక్రవారం రాత్రి జాలహళ్లి మెట్రో స్టేషన్లో జరిగింది. శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో జాలహళ్లి నుంచి మెట్రో రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఇంతలో ఓ తెల్లపిల్లి పట్టాలపై తచ్చాడుతూ కనిపించింది. వెంటనే అప్రమత్తమైన పైలెట్ మెట్రో అధికారులు సమాచారం ఇచ్చారు. విద్యుత్ తీగలను తాకుతుందనే ఉద్దేశ్యంతో ఆ ట్రాక్‌లో విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేయించారు. ఇంతలో అటు ఇటు తిరిగిన పిల్లి చివరకు అక్కడి నుంచి వెళ్లిపోయింది. పిల్లి కోసం సిబ్బంది గాలించినా అది కనిపించలేదు. దాదాపు పది నిముషాల పాటు అన్ని స్టేషన్లలో రాకపోకలకు పిల్లి కారణంగా అంతరాయం ఏర్పడింది. -
హైదరాబాద్ మెట్రోలో ఎంతమంది ప్రయాణించారో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రో రైలు ఎంతమందిని చేరవేసిందో తెలుసా? జంట నగర వాసుల ఆదరణతో ఇప్పటివరకు 20 మిలియన్ల (రెండు కోట్ల మంది) ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చింది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం ట్విటర్లో వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రయాణికులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక వీడియోను షేర్ చేసింది. 2017, నవంబర్ 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులు మీదుగా మెట్రో రైలు ప్రారంభమైంది. ప్రధాని స్వయంగా ఇందులో ప్రయాణించారు. నాగోల్-మియాపూర్ మధ్య మెట్రో తన పరుగును ఆరంభించింది. మెట్రో రైలుపై నగర వాసుల భారీ ఆసక్తితో ఆరంభంలోనే భారీ ఆదరణను దక్కించుకుంది. కిక్కిరిసిన జనంతో మెట్రో రైలు పెద్ద విశేషంగా నిలిచిన విషయం తెలిసిందే. కాగా, ఎల్బీనగర్-అమీర్‌పేట మార్గంలో మెట్రో రైలు సేవలు ఈ నెలాఖరుకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. Hyderabad Metro Rail is a convenient mode of transportation for 20 million riders. Reaching here would not be possible without you. Thank you for trusting and travelling with us. #MeeMetro #20MillionPassengers #ManaMetro pic.twitter.com/GxCpqnGrs1 — L&T HydMetroRail (@ltmhyd) September 5, 2018 -
ఊహూ..నై..నై!
సాక్షి,సిటీబ్యూరో: పాతనగరంలో మెట్రో రైలు పనులు కష్టతరంగానే కన్పిస్తోంది. నిర్మాణ పనులు చేపట్టేందుకు వీలుగా ఇటీవల అలైన్మెంట్ (మార్గం) పరిశీలన జరిగినప్పటికీ..సవాలక్ష సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రధానంగా ఎంజీబీఎస్–ఫలక్‌నుమా(5.5 కి.మీ) మార్గంలో పనులు చేపట్టేందుకు సుమారు వెయ్యి ఆస్తుల సేకరణ, మరో 69 వరకు ప్రార్థనాస్థలాలు దెబ్బతినకుండా మార్గాన్ని రూపొందించడం, మెట్రో పనులు చేపట్టేందుకు అవసరమైన రైట్‌ఆఫ్‌వే స్థలాన్ని సేకరించడం వంటి పనులు కత్తిమీదసాములా మారాయి. ఈనేపథ్యంలో పాతనగరంలో మెట్రో పనులను చేపట్టేందుకు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి విముఖంగా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే రైట్ ఆఫ్ వే సమస్యల కారణంగా ఎల్బీనగర్–మియాపూర్, నాగోల్–రాయదుర్గం, జేబీఎస్–ఎంజీబీఎస్ మార్గాల్లో 2017 జూన్ నాటికి పూర్తిచేయాల్సిన మెట్రో ప్రాజెక్టు దాదాపు రెండేళ్లు ఆలస్యమవుతున్న విషయం విదితమే. సవాళ్లెన్నో... పాతనగరంలో మెట్రో మార్గాన్ని ఏర్పాటుచేసేందుకు సుమారు వెయ్యి ఆస్తులను సేకరించాల్సి ఉంది. వీటికి సుమారు వందకోట్లకుపైగానష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఓల్డ్‌సిటీలో ఎంజీబీఎస్–ఫలక్‌నుమా రూట్లో 5.5 కి.మీ మార్గంలో మెట్రో ప్రాజెక్టును ఏర్పాటుచేయడంతోపాటు సాలార్‌జంగ్‌మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఫలక్‌నుమా, శంషీర్‌గంజ్ ప్రాంతాల్లో ఐదు మెట్రో స్టేషన్లను నిర్మించేందుకు రూ.1250 కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక ఆస్తుల సేకరణ ఆలస్యమైతే పనులు చేపట్టేందుకు అవసరమైన రైట్ఆఫ్ వే స్థల సమస్యల కారణంగా> ప్రాజెక్టు నిర్మాణ గడువు మరో రెండేళ్లపాటు ఆలస్యమయ్యే ప్రమాదం పొంచి ఉంది. పనుల ఆలస్యంతో నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ రూట్లో సుమారు 69 వరకు ఉన్న ప్రార్థనాస్థలాలకు నష్టం వాటిల్లుతుందన్న ఆందోళనలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ సమస్యల కారణంగానే నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ఓల్డ్‌సిటీలో మెట్రో పనులు చేపట్టేందుకు విముఖంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు తొలిదశ మెట్రో మార్గాల్లో పనుల ఆలస్యం కారణంగా వాణిజ్య బ్యాంకుల నుంచి సేకరించిన రుణాలపై వడ్డీ, ఇతరత్రా నిర్మాణ వ్యయాలు పెరగడంతో అదనంగా రూ.4 వేల కోట్లు నిర్మాణ వ్యయం పెరిగిందని..ఈ మొత్తాన్ని సైతం తమకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని నిర్మాణ సంస్థ వర్గాలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. కాగా గతంలో పాతనగరంలో మెట్రో మార్గాన్ని బహదూర్‌పూరా– కాలపత్తర్– ఫలక్‌నుమా మీదుగా మళ్లించాలన్న డిమాండ్లున్న విషయం విదితమే. ఈ రూట్లలో మెట్రో రైట్..రైట్.. సెప్టెంబరు తొలివారంలో ఎల్బీనగర్–అమీర్‌పేట్ మార్గంలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఈ రూట్లో ఇప్పటికే మెట్రో రైళ్లకు భద్రతా పరీక్షలు జరుగుతున్నాయి. నేడో రేపో కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ నుంచి భద్రతా ధ్రువీకరణ జారీకానుందని మెట్రో వర్గాలు తెలిపాయి. ఇక ఈ ఏడాది నవంబరులో అమీర్‌పేట–హైటెక్‌సిటీ రూట్లో మెట్రో రైళ్లు పట్టాలెక్కనున్నాయని పేర్కొన్నాయి. జేబీఎస్–ఎంజీబీఎస్ మార్గంలో వచ్చే ఏడాది మార్చినాటికి మెట్రో రైళ్లు పరుగులు తీసే అవకాశాలున్నాయని తెలిపాయి. కాగా ఇప్పటికే నాగోల్–అమీర్‌పేట్–మియాపూర్(30 కి.మీ)మార్గంలో మెట్రో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. వీటిల్లో నిత్యం సుమారు 85 వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. పండగలు, సెలవు దినాల్లో రద్దీ లక్షకుపైగానే ఉంది. ఇక త్వరలో ప్రారంభంకానున్న ఎల్బీనగర్–అమీర్‌పేట్ రూట్లో మెట్రో అందుబాటులోకి వస్తే ఈ రూట్లో నిత్యం అదనంగా మరో లక్షమంది రాకపోకలు సాగించే అవకాశాలున్నట్లు మెట్రో వర్గాలు అంచనావేస్తున్నాయి. అత్యంత రద్దీగా ఉండే ఈ మార్గంలో ఎల్బీనగర్–మియాపూర్(29 కి.మీ)మార్గంలో బస్సు లేదా కారు లేదా ద్విచక్రవాహనంపై ప్రయాణానికి గంటన్నర నుంచి సుమారు రెండున్నర గంటల సమయం పడుతోంది. అదే మెట్రో జర్నీ అయితే ఒక చివర నుంచి మరోచివరకి కేవలం 45–55 నిమిషాల్లోనే గమ్యస్థానం చేరుకోవచ్చు. దీంతో ప్రయాణికులకు తమ వ్యక్తిగత వాహనాల్లో వినియోగించే ఇంధన ఖర్చుతోపాటు విలువైన సమయం ఆదా అయ్యే పరిస్థితులుండడంతో మెట్రో జర్నీకి మొగ్గు చూపే అవకాశాలున్నాయంటున్నారు. ప్రధానంగా ఈ రూట్లో నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులు, ఉద్యోగులు, వాహనదారులు, వ్యాపారులు ఈ రూట్లో మెట్రోలో ప్రయాణించేందుకు ఆసక్తిచూపుతారని భావిస్తున్నట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. ఆయా మెట్రో స్టేషన్ల వద్ద తమ వ్యక్తిగత వాహనాలను పార్కింగ్ చేసుకునే సదుపాయం కల్పించడంతోపాటు ఆయా స్టేషన్ల వద్ద ఆర్టీసీ బస్సులు, బ్యాటరీ వాహనాలు, కార్లు, ద్విచక్రవాహనాలు, ఆధునిక సైకిళ్లు ,బైక్‌లు అద్దెకు లభిస్తాయని..క్యాబ్‌సర్వీసులు సైతం అందుబాటులో ఉంటాయని మెట్రో వర్గాలు పేర్కొన్నాయి. ఈ రూట్లో మెట్రో సాకారమైతే ప్రధాన రహదారిపై వాహనాల రద్దీ సైతం తగ్గుముఖం పట్టే అవకాశముందని తెలిపాయి. -
మెట్రో: తాజాగా బీహెచ్ఈఎల్ – లక్డీకాపూల్ రూట్!
మెట్రో రెండో దశ ప్రాజెక్టులో తొలుత అనుకున్న రూట్లలో కొన్ని మార్పులు జరిగాయి. తాజాగా బీహెచ్ఈఎల్– లక్డీకాపూల్ (25 కి.మీ) రూట్లో మెట్రో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతోపాటు రాయదుర్గం– శంషాబాద్ (30 కి.మీ), ఎల్బీనగర్– నాగోల్ (5 కి.మీ) మార్గాల్లో మొత్తంగా 60 కి.మీ రూట్లో రెండో దశ మెట్రో ప్రాజెక్టు ఏర్పాటుపై వేగంగా కసరత్తు జరుగుతోంది. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ) ఈ నెలాఖరుకు ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రెండో దశ ప్రాజెక్టుకు సుమారు రూ.10 వేల కోట్లు వ్యయం కానుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. రెండో దశ మార్గాల్లో చేపట్టనున్న డిపోలు, స్టేషన్లు, పార్కింగ్ సదుపాయాల కల్పనకు అవసరమైన స్థలాలను ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది. – సాక్షి, హైదరాబాద్ బీహెచ్ఈఎల్– లక్డీకాపూల్ రూట్ ఇలా.. బీహెచ్ఈఎల్(రామచంద్రాపురం)లో మెట్రో డిపోకు సుమారు70 ఎకరాల స్థలాన్ని కేటాయించనున్నట్లు తెలిసింది. ఈ కారిడార్ పరిధిలో 22 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మార్గంలో బీహెచ్ఈఎల్, మదీనగూడ, హఫీజ్‌పేట్, కొండాపూర్, కొత్తగూడ జంక్షన్,షేక్‌పేట్, రేతిబౌలి, మెహిదీపట్నం, లక్డీకాపూల్‌లలో మెట్రో స్టేషన్లు ఏర్పాటుకానున్నాయి. రాయదుర్గం– శంషాబాద్ రూట్ ఇలా.. రాయదుర్గం, బయోడైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడ, తెలంగాణ పోలీస్ అకాడమీ, రాజేంద్రనగర్ మీదుగా శంషాబాద్ వరకు ఏర్పాటుచేయనున్నారు. ఈ మార్గంలో బుద్వేల్ లేదా శంషాబాద్ ప్రాంతాల్లో 60 ఎకరాల స్థలాన్ని మెట్రో డిపో ఏర్పాటు కోసం కేటాయించనున్నారు. ఈ మార్గంలో హైస్పీడ్ రైలును నడపనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో శంషాబాద్ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికులకు సమయం ఆదా కానుంది. ఈ మేరకు డీఎంఆర్సీ అధికారులు రెండో దశ మార్గాల్లో విస్తృతంగా అధ్యయనం జరిపి ఈ రూట్లను ఖరారు చేసినట్లు తెలిసింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్) విధానంలో చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మార్గాల్లో మెట్రో లేనట్టేనా? ప్రస్తుతం రెండో దశ ప్రాజెక్టుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినప్పటికీ గతంలో మరో ఐదు మార్గాల్లో రెండో దశ మెట్రో ప్రాజెక్టును ఏర్పాటుచేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఆ దిశగా అడుగులు పడకపోవడంతో ఎల్బీనగర్– హయత్‌నగర్, ఎల్బీనగర్– ఫలక్‌నుమా– శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, మియాపూర్– పటాన్చెరు, తార్నాక– ఈసీఐఎల్, జేబీఎస్– మౌలాలి మార్గాల్లో మెట్రో అనుమానమే అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డీఎంఆర్సీ నివేదికలో అంశాలివే.. ♦ రెండో దశ మెట్రో రైళ్లకు సిగ్నలింగ్ వ్యవస్థ, కోచ్‌ల ఎంపిక, ట్రాక్‌ల నిర్మాణం ఎలా ఉండాలో సూచించనుంది. ♦ భద్రతాపరమైన చర్యలు ♦ టికెట్ ధరల నిర్ణయం ♦ రెండో దశ ప్రాజెక్టుకు నిధుల సమీకరణ ♦ వివిధ రకాల ఆర్థిక నమూనాల పరిశీలన ♦ ప్రాజెక్టును పూర్తిచేయాల్సిన గడువు, దశలవారీగా చేపట్టాల్సిన షెడ్యూల్ ఖరారు సెప్టెంబర్ తొలి వారంలో ఎల్బీనగర్– అమీర్‌పేట్.. గ్రేటర్‌వాసుల కలల మెట్రో రైళ్లు ఎల్బీనగర్– అమీర్‌పేట్ (16 కి.మీ) మార్గంలో సెప్టెంబర్ తొలి వారంలో పరుగులు పెట్టనున్నాయి. ఈ మార్గానికి సంబంధించి త్వరలో కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ధ్రువీకరణ అందనుందని హెచ్ఎంఆర్ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ మార్గంలో మెట్రో రైళ్ల వాణిజ్య రాకపోకలకు మార్గం సుగమం కానుంది. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఈ రూట్లో నిత్యం సుమారు లక్ష మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశాలున్నట్లు మెట్రో వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక అమీర్‌పేట్– హైటెక్ సిటీ (13 కి.మీ) మార్గంలో ఈ ఏడాది నవంబర్‌లో మెట్రో రైళ్లు కూతపెట్టనున్నాయి. ఇక జేబీఎస్– ఫలక్‌నుమా మార్గంలో వచ్చే ఏడాది మార్చిలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. -
మెట్రో జర్నీ రికార్డు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వాసుల కలల మెట్రో రైలులో ప్రయాణించే వారి సంఖ్య లక్షణంగా ‘లక్ష’దాటింది. ఈ నెల 16న నాగోల్–అమీర్‌పేట్–మియాపూర్ మార్గంలో ప్రయాణించిన వారి సంఖ్య 1.07 లక్షలుగా ఉందని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి శుక్రవారం తెలిపారు. రోజురోజుకూ మెట్రో ప్రయాణికుల సంఖ్య పెరుగుతోందని..మెట్రో రూట్లలో క్రమంగా వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గుముఖం పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ మొదటివారంలో ఎల్బీనగర్–అమీర్‌పేట్ మార్గంలో మెట్రో ప్రారంభం కానుండటంతో ఈ మార్గంలో నిత్యం 2.5 లక్షల మంది మెట్రో జర్నీ చేసే అవకాశం ఉందని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మార్గానికి సంబంధించి త్వరలో కమిషనర్ ఆఫ్ రైల్వేసేఫ్టీ నుంచి భద్రతా ధ్రువీకరణ పత్రం అందనుందని తెలిపారు. -
ప్రజా రవాణాతోనే ‘ట్రాఫిక్’కు చెక్
సాక్షి, హైదరాబాద్: మౌలిక వసతుల మెరుగుదలే లక్ష్యంగా బహుముఖ ప్రణాళికలు, వ్యూహాలతో నగరాభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని మునిసిపల్, ఐటీ మంత్రి కె. తారకరామారావు పేర్కొన్నారు. ప్రజా రవాణా, పట్టణ రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనకు దృష్టి సారించినట్లు తెలిపారు. ఎల్బీనగర్లో కామినేని ఆస్పత్రి వద్ద రూ.49 కోట్లతో నిర్మించిన ఫ్లై ఓవర్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ... 2030 నాటికి హైదరాబాద్ మెగా సిటీగా అవతరిస్తుందని, దానికనుగుణంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయన్నారు. ప్రజారవాణా మెరుగుపడి, ప్రైవేట్ వాహనాలు తగ్గితేనే ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. వచ్చే నెల మొదటి వారంలో మెట్రో రైలు.. అమీర్‌పేట–ఎల్బీనగర్ మెట్రో రైలు ఆగస్టు 15న ప్రారంభించాలని అనుకున్నప్పటికీ, సీఎంఆర్ఎస్ అనుమతి జాప్యంతో మరో 15 రోజులు ఆలస్యం కానుందని మంత్రి చెప్పారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ మార్గం ప్రారంభం అవనుందన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు నాగోలు నుంచి ఎల్బీనగర్, ఎల్బీనగర్ టూ ఫలక్‌నుమా, శంషాబాద్ వరకు మెట్రో ప్రయాణానికి రూపకల్పన చేస్తున్నామన్నారు. వేగంగా ఎస్సార్డీపీ పనులు.. నగరంలో ఎస్సార్డీపీ పనులు వేగంగా జరుగుతున్నాయని, రూ.23 వేల కోట్ల ఈ ప్రాజెక్టులో రూ.3 వేల కోట్లకు పైగా పనులు వివిధ దశల్లో ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. మరో రూ.4 వేల కోట్ల పనులు పరిపాలన అనుమతి దశలో ఉన్నాయన్నారు. కేంద్రంతో కలసి సంయుక్తంగా రూ.1,500 కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. నగరంలో ఎక్కడా ఖర్చుపెట్టని విధంగా ఎల్బీనగర్లో రూ.450 కోట్లు రోడ్ల విస్తరణకు ఖర్చుపెడుతున్నామని తెలిపారు. పాదచారుల హక్కులను పరిరక్షించేందుకు ఫుట్‌ఫాత్‌లపై 8వేలకు పైగా ఆక్రమణలను తొలగించడంతో పాటు, రూ.100 కోట్లను నిర్మాణ పనులకు కేటాయించినట్లు చెప్పారు. ‘మన నగరం’లో భాగంగా మంజూరైన రూ.42 కోట్లతో ఎల్బీనగర్కు పలు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. రికార్డు స్థాయిలో వేగంగా కామినేని ఫ్లైఓవర్‌ను నిర్మించిన నిర్మాణ సంస్థను అభినందించారు. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రూ.46 వేల కోట్లతో రోడ్ల అభివృద్ధి.. రంగారెడ్డి జిల్లా పరిధిలో రూ.46 వేల కోట్లతో రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శివారు ప్రాంతాల్లో రూ.1,900 కోట్లతో ఇంటింటికి మంచినీరు అందించామన్నారు. ఔటర్ రింగ్‌రోడ్డు ప్రాంతంలోని గ్రామాలకు రూ.600 కోట్లతో మంచినీటిని అందిస్తున్నట్లు వివరించారు. కేటీఆర్‌కు కితాబు..: విశ్వనగరంలో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.1,600 కోట్లను వెచ్చించడం జరిగిందని ఎల్బీ నగర్ టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఎల్బీనగర్ అభివృద్ధి పథంలో ముందుందని కితాబిచ్చారు. సీఎం వినూత్న విధానాలకు ప్రజల మద్దతుతో పాటు తమ మద్దతు ఉంటుందన్నారు. శ్రీకాంతాచారి పేరు పెట్టాలి.. కామినేని వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్‌కు తెలంగాణ ఉద్యమంలో అమరుడైన కాసోజు శ్రీకాంతాచారి పేరు పెట్టాలని అతని తల్లి శంకరమ్మ డిమాండ్ చేశారు. ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవానికి మద్దతుదారులతో వచ్చిన ఆమె ప్లకార్డులతో నిరసన తెలిపారు. దీంతో పోలీసులు వారిని పక్కకు జరిపారు. కేటీఆర్ తిరిగి వెళ్లిన అనంతరం ఆందోళన చేశారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రతినిధుల నిరసన.. కనీస వేతనాలు అమలు చేసి, ఉద్యోగులకు గుర్తింపు కార్డులివ్వాలని కోరుతూ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మహిళా ఉద్యోగులు మంత్రి కేటీఆర్ సభ వద్ద నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని మంత్రిని కోరడానికొస్తే పోలీసులు అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
సిటీ బస్..మెట్రో రూట్
సాక్షి,సిటీబ్యూరో: మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానున్న ఎల్బీనగర్– అమీర్‌పేట్ మెట్రో రైలుకు అనుగుణంగా సేవలను విస్తరించేందుకు గ్రేటర్ ఆర్టీసీ సిద్ధమవుతోంది. ఉప్పల్– అమీర్‌పేట్, మియాపూర్– అమీర్‌పేట్ కారిడార్లలో రెండు వైపులా ఉన్న కాలనీలకు సిటీ బస్సులను అనుసంధానం చేసినట్టే.. ఎల్బీనగర్–అమీర్‌పేట్ మార్గంలోని కాలనీలకూ విస్తరించేందుకు కసరత్తు చేపట్టింది. ఈ మార్గంలో సమాంతరంగా తిరిగే బస్సులను ఇకపై కొత్త మార్గాల్లోకి మళ్లించనున్నారు. మరోవైపు ఎల్బీనగర్– అమీర్‌పేట్ మెట్రో ప్రారంభమైతే ఇటు ఎల్బీనగర్ నుంచి నాంపల్లి, లక్డీకాపూల్ మీదుగా అటు ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ మీదుగా రెండు ప్రధాన కారిడార్లలో మియాపూర్‌కు మెట్రో కనెక్టివిటీ పెరగనుంది. దీంతో ఆర్టీసీకి ప్రయాణికుల ఆదరణ తగ్గే అవకాశం ఉంది. మొదటి కారిడార్ వల్ల ఆర్టీసీపై పెద్దగా ప్రభావం కనిపించలేదు. కానీ రెండో కారిడార్ అందుబాటులోకి రావడం ద్వారా అతి పెద్ద రూట్ల మధ్య ‘మెట్రో అనుసంధానం’ పెరుగుతుంది. దీంతో ఆర్టీసీ ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో మెట్రో వైపు వెళ్లే అవకాశముంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మెట్రో సమాంతర మార్గాల స్థానంలో మెట్రోకు అభిముఖంగా ఉండే రూట్లకు సిటీ బస్సుల సేవలను విస్తరించేందుకు ఆర్టీసీ అధికారులు సీరియస్‌గా దృష్టి సారించారు. ఈ మేరకు తాజాగా ఎల్బీనగర్– అమీర్‌పేట్ కారిడార్‌కు రెండు వైపులా గల కాలనీలపై సర్వే ప్రారంభించారు. మెట్రో రైలు పట్టాలెక్కే నాటికి గ్రేటర్ ఆర్టీసీ రూట్ కోర్సుల్లో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. వంద కాలనీలకు అదనపు సర్వీసులు ప్రస్తుతం హయత్‌నగర్ నుంచి ఎల్బీనగర్ మీదుగా, వనస్థలిపురం ఎన్జీఓస్ కాలనీ నుంచి ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, కోఠి, నాంపల్లి, ఖైరతాబాద్, అమీర్‌పేట్, కూకట్పల్లి, మియాపూర్, బీహెచ్ఈఎల్, లింగంపల్లి మార్గంలో 804 బస్సులు తిరుగుతున్నాయి. ఇవి ప్రతి రోజు సుమారు 7295 ట్రిప్పులు వేస్తున్నాయి. ఇప్పటి దాకా ఆర్టీసీకి అత్యధికంగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే మార్గాలు ఇవే. ఈ మార్గాల్లో బస్సుల ఆక్యుపెన్సీ 65 శాతానికి పైగా ఉంది. త్వరలో ఎల్బీనగర్–అమీర్‌పేట్ మెట్రో అందుబాటులోకి వస్తే 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉన్న ఈ రూట్కోర్సుల్లో సమూలమైన మార్పులు చేయనున్నారు. ఎల్బీనగర్ నుంచి అమీర్‌పేట్ మీదుగా మియాపూర్ వరకు బస్సుల సంఖ్యను గణనీయంగా తగ్గించనున్నారు. లింగంపల్లి, బీహెచ్ఈఎల్ మీదుగా వచ్చే బస్సులను మియాపూర్ వరకు పరిమితం చేస్తారు. అలాగే హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం రూట్లలో వచ్చే బస్సులను ఎల్బీనగర్ వరకు పరిమితం చేస్తారు. ఈ కారిడార్‌లో సమాంతరంగా నడిచే బస్సులను పూర్తిగా రద్దు చేయడం కాకుండా ప్రయాణికుల రద్దీ, ఆదరణకు అనుగుణంగా మార్పులు ఉంటాయి. సమాంతర రూట్ బస్సులను కుదించడం వల్ల మెట్రోకు రెండు వైపులా ఉండే సుమారు 100 కాలనీలకు అదనపు సర్వీసులు పెరిగే అవకాశం ఉంది. దీంతో కర్మన్‌ఘాట్, బీఎన్‌రెడ్డినగర్, నందనవనం, ఇబ్రహీంపట్నం, బాలాపూర్, మీర్పేట్, కోహెడ, తదితర ప్రాంతాల్లోని కొత్త కాలనీలకు బస్సులను విస్తరిస్తారు. ఈ రూట్లలోంచి ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్లకు సిటీ బస్సులను కనెక్ట్ చేస్తారు. అలాగే పాతబస్తీలోని వివిధ ప్రాంతాల నుంచి ఇటు దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్‌కు, అటు లక్డీకాపూల్‌కు సిటీ బస్సుల కనెక్టివిటీని పెంచేందుకు కార్యాచరణ చేపట్టారు. దీంతో ఇప్పటికిప్పుడు వంద కాలనీలకు అదనపు సదుపాయం లభిస్తుంది. అలాగే ప్రధాన కారిడార్లకు ప్రత్యామ్నాయంగా కాలనీలకు విస్తరించడం వల్ల ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుందని ఆర్టీసీ భావిస్తోంది. 100 కాలనీలతో ప్రారంభించి మెట్రోకు దూరంగా ఉన్న సుమారు 500 కాలనీలు, శివారు గ్రామాలకు బస్సులను పెంచనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మియాపూర్‌లో పెరిగిన ఆక్యుపెన్సీ.. ఉప్పల్–అమీర్‌పేట్–మియాపూర్ మెట్రో కారిడార్‌లో రెండు వైపులా కాలనీలకు మెట్రో అందుబాటులోకి రావడంతోనే ఆర్టీసీ బస్సులను ప్రవేశపెట్టారు. చిలుకానగర్, హేమానగర్, బోడుప్పల్, నాగోల్, బండ్లగూడ, ఘట్కేసర్, నారపల్లి తదితర ప్రాంతాలకు ట్రిప్పులను పెంచారు. అలాగే మియాపూర్ మార్గంలో అపురూపకాలనీ–హైటెక్‌సిటీ, జగద్గిరిగుట్ట–వీబీఐటీ, జేఎన్టీయూ–హైటెక్‌సిటీ, కూకట్పల్లి–హైటెక్‌సిటీ, అమీర్‌పేట్–హైటెక్‌సిటీ తదితర ప్రాంతాలకు 60 బస్సులను అదనంగా ప్రవేశపెట్టారు. దీంతో ఈ రెండు రూట్లలో కాలనీలకు బస్సుల కనెక్టివిటీ పెరిగింది. ఇప్పుడు ఈ బస్సులన్నీ ప్రతి రోజు 70 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ షెడ్యూల్స్ విభాగం ఉన్నతాధికారి శ్రీధర్ తెలిపారు. ‘పెద్ద బస్సులు వెళ్లగలిగే అన్ని ప్రాంతాలకు సిటీ బస్సులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇక చిన్న కాలనీలకు వెళ్లాలంటే పెద్ద బస్సులకు సాధ్యం కాదు. ప్రయాణికుల ఆదరణకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ప్రణాళికలను రూపొందిస్తూనే ఉన్నా’మని తెలిపారు. గ్రేటర్ ఆర్టీసీ ఇలా.. మొత్తం డిపోలు: 29 సిటీలో తిరిగే బస్సులు: 3,560 మొత్తం ట్రిప్పులు: 42 వేలు ప్రయాణికుల సంఖ్య: 33 లక్షలు రూట్లు: 1050 సగటు ఆక్యుపెన్సీ: 65 శాతం -
సెప్టెంబర్ 1న ఎల్బీనగర్–అమీర్‌పేట్ మెట్రో రన్
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్–అమీర్‌పేట్ మార్గంలో మెట్రో ప్రారంభానికి ముహూర్తం కుదిరింది. సెప్టెంబర్ ఒకటి నుంచి మెట్రో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ కేవీబీ రెడ్డి తెలిపారు. ఈ మార్గంలో అన్ని పనులు, పరీక్షలు పూర్తయ్యాయని.. ట్రయల్ రన్ ముమ్మరంగా సాగుతుందని చెప్పారు. వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించి కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ (సీఎంఆర్ఎస్) ధ్రువీకరణ పొందేందుకు జూలై 31న ఆ సంస్థకు దరఖాస్తు సమర్పించామన్నారు. ఇండిపెండెంట్ సేఫ్టీ అసెసర్ (ఐఎస్ఏ), హాల్క్రో (యూకే) సంస్థలు సిగ్నలింగ్ వ్యవస్థ భద్రతను పరీక్షిస్తున్నాయని చెప్పారు. ఇండిపెండెంట్ సేఫ్టీ అసెస్మెంట్ సర్టిఫికెట్ అందిన తర్వాత సీఎంఆర్ఎస్ ప్రతినిధులు ఎల్బీనగర్–అమీర్‌పేట్ సెక్షన్‌ను పరిశీలించి భద్రతా ధ్రువీకరణ జారీ చేస్తారన్నారు. అన్ని స్టేషన్లకూ ఫీడర్ బస్సులు ఇప్పటివరకు 2.75 లక్షల మెట్రో స్మార్ట్ కార్డులు గ్రేటర్ సిటిజన్లు కొనుగోలు చేసినట్లు ఎల్అండ్టీ ప్రతినిధులు తెలిపారు. అన్ని మెట్రో స్టేషన్ల నుంచి సమీపంలోని కాలనీలు, బస్తీలకు ఫీడర్ బస్సు సర్వీసులను ఆర్టీసీ సహకారంతో అందుబాటులో ఉంచామన్నారు. మియాపూర్, జేఎన్టీయూ, కేపీహెచ్‌బీ, కూకట్పల్లి, అమీర్‌పేట్, బేగంపేట్, ప్రకాశ్‌నగర్, రసూల్‌పురా, ప్యారడైజ్, పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్, హబ్సిగూడ, ఎన్జీఆర్ఐ, ఉప్పల్, నాగోల్ తదితర 15 మెట్రో స్టేషన్లలో ప్రయాణికులకు లాస్ట్ మైల్ కనెక్టివిటీని సాకారం చేసేందుకు అత్యాధునిక సైకిళ్లు, స్మార్ట్ బైకులు, పీఈడీఎల్, మెట్రో బైకులు, డ్రైవ్‌జీ వాహనాలు లభ్యమవుతున్నాయని చెప్పారు. మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద సొంతంగా నడుపుకుని వెళ్లేందుకు వీలుగా జూమ్‌కార్ విద్యుత్ వాహనాలు.. మియాపూర్, పరేడ్ గ్రౌండ్స్ మెట్రో స్టేషన్ల వద్ద జూమ్‌కార్ పెట్రోల్, డీజిల్ వాహనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. పలు మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ సదుపాయమూ అందుబాటులో ఉందని చెప్పారు. ప్యారడైజ్ స్టేషన్ ఫుట్ఓవర్ బ్రిడ్జీని ప్రారంభించడం ద్వారా ప్యారడైజ్ సర్కిల్, పీజీ రోడ్, ఎంజీ రోడ్ తదితర ప్రాంతాలకు చేరుకోవడం సులభమవుతోందన్నారు. ప్రకాశ్‌నగర్ మెట్రో స్టేషన్ వద్ద ఆర్మ్‌డీ ఎంట్రీ, ఎగ్జిట్ పూర్తికావడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తొలిగాయని చెప్పారు. -
మెట్రో జర్నీ విత్ బైక్.. కార్
గచ్చిబౌలి: ఉప్పల్‌లో ఉండే సందీప్ మార్కెటింగ్‌ఎగ్జిక్యూటివ్. మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో పనిచేస్తుంటాడు. సొంత బైక్‌పై వెళ్లాలంటే రెండు గంటల సమయం పడుతుంది. ట్రాఫిక్‌లో అలసిపోయి విధులు నిర్వహించాలంటే భారంగా మారుతోంది. దీంతో అతను ఇప్పుడు తన బైక్‌పై రావడం లేదు. మెట్రో రైలులోమియాపూర్ వరకు వెళ్లి, అక్కడి స్టేషన్‌లోని బైక్ తీసుకొని విధులు నిర్వహిస్తున్నాడు. సాయంత్రం బైక్ స్టేషన్లోఅప్పగించేసి, తిరిగి మెట్రోలోనే ఇంటికి వెళ్తున్నాడు. ఇక కూకట్పల్లి, మాదాపూర్‌లలో షాపింగ్ చేయాలనుకుంటే ఎంచక్కా మెట్రోలో వచ్చి, మియాపూర్ స్టేషన్లో జూమ్ కారు అద్దెకు తీసుకుంటున్నారు. చక్కగా కారులో వెళ్లి, షాపింగ్ చేసేసి తిరిగి మెట్రోలో ఇంటికి వెళ్తున్నారు. మెట్రో స్టేషన్లకు అనుసంధానంగా ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో బైక్‌లు, జూమ్ కార్లను అందుబాటులోకి తీసుకురావడంతో జర్నీ ఈజీగా మారింది. వీటికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే మియాపూర్‌తో పాటు మరికొన్ని స్టేషన్లలో బైక్‌లు అందుబాటులో ఉండగా...కార్లు మాత్రం ఇక్కడే ఉన్నాయి. వీటి సంఖ్యను మరింత పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. బైక్‌లకు భలే డిమాండ్... మియాపూర్ మెట్రో స్టేషన్లో వివిధ కంపెనీలకు చెందిన 24 స్కూటీలు, హర్నెట్ బైక్ అందుబాటులో ఉన్నాయి. ఉదయం 7:30 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. ఏదైనా కారణంగా బైక్ తిరిగి ఇవ్వకపోతే సమాచారం అందించాలి. లేని పక్షంలో యాప్‌లో సమయం పొడిగించుకోవాలి. ప్రతి గంటకు రూ.15 చెల్లించడంతో కిలోమీటర్‌కు రూ.4 చార్జీ ఉంటుంది. పెట్రోల్ చార్జీలు ఉండవు. ఇక హెల్మెట్ ఉచింతంగా ఇస్తారు. దీంతో బైక్‌లకు మంచి డిమాండ్ ఉంటోంది. ఉదయం 11 గంటల వరకే బైక్‌లన్నీ బుక్ అయిపోతున్నాయి. వీకెండ్లో బైక్‌ల కోసం ఎక్కువగా స్టూడెంట్స్ వస్తుంటారు. గంటల ప్రాతిపదికన కాకుండా రోజంతా బైక్ తీసుకోవాలని అనుకుంటే... రోజుకు రూ.470 చెల్లించి, పెట్రోల్ పోయించుకోవాలి. మియాపూర్‌తో పాటు నాగోల్, పరేడ్‌గ్రౌండ్, బేగంపేట్ మెట్రో స్టేషన్లలో ఈ బైక్స్ అందుబాటులో ఉన్నాయి. బుకింగ్ ఇలా... గూగుల్ ప్లేస్టోర్‌లో మెట్రో బైక్స్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసి గుర్తింపు కార్డును అప్లోడ్ చేయాలి. ఎన్ని బైక్‌లు అందుబాటులో ఉన్నాయి? వాటి అద్దె ఎలా? తదితర వివరాలు ఉంటాయి. బైక్ ఏ సమయానికి కావాలి? ఎక్కడి నుంచి వస్తున్నారో? లోకేషన్ షేర్ చేయాలి. పేటీఎం ద్వారా చార్జీలు చెల్లించాలి. మెట్రో స్టేషన్‌కు వెళ్లాక బుకింగ్‌ను, ఒరిజినల్ ఐడీ కార్డు చూపిస్తే బైక్ ఇస్తారు. ఎలక్ట్రికల్ కార్లు... ఒక్క మియాపూర్ మెట్రో స్టేషన్లోనే ఎలక్ట్రికల్ కార్లు అందుబాటులో ఉన్నాయి. జూమ్ సంస్థ గత నెల 24న ఈ సేవలు ప్రారంభించింది. 10 మహీంద్రా ఈటుఓ కార్లు ఇక్కడున్నాయి. ఇవి బ్యాటరీతో పనిచేస్తాయి. గంటన్నర చార్జింగ్ చేస్తే 100 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. వీటికి గంటకు రూ.40 చెల్లించాలి. ఒకవేళ మీ ప్రయాణం మొత్తం 4కిలోమీటర్లు మాత్రమే అయితే పూర్తిగా ఉచితం. అంతకంటే ఎక్కవ దూరమైతే గంటల చార్జీలతో పాటు కిలోమీటర్‌కు రూ.9 చెల్లించాలి. డీజిల్ కార్లు 14 అందుబాటులో ఉన్నాయి. వీటికి గంటకు రూ.120 చెల్లించాలి. ఒకవేళ మీ ప్రయాణం మొత్తం 10 కిలోమీటర్లు మాత్రమే అయితే పూర్తిగా ఉచితం. అంతకంటే ఎక్కవ దూరమైతే గంటల చార్జీలతో పాటు కిలోమీటర్‌కు రూ.12 చెల్లించాలి. ఇలా బుకింగ్... ప్లేస్టోర్‌లో జూమ్ కారు యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. 20 ఏళ్లకు పైబడిన తమ ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ అప్లోడ్ చేయాలి. యాప్‌లో ఎన్ని కార్లు అందుబాటులో ఉన్నాయో చూపిస్తుంది. అవసరమైన కారును బుక్ చేసుకొని ఆన్లైన్లో లేదా పేటీఎం ద్వారా చార్జీలు చెల్లించాలి. స్టేషన్‌కు వెళ్లి బుకింగ్‌ను చూపిస్తే కారు ఇస్తారు. మరిన్ని అవసరం.. నేను బీహెచ్ఈఎల్లో ఇంటర్న్‌షిప్ చేస్తున్నాను. మెట్రోలో వచ్చి మియాపూర్ స్టేషన్లో దిగాను. బైక్‌పై వెళ్దామనుకుంటే, బైక్‌లు లేవని చెప్పారు. బైక్‌ల సంఖ్య పెంచితే బాగుంటుంది.– సరిత, బీటెక్ విద్యార్థిని -
మెట్రో రెండో దశ ప్రారంభానికి రంగం సిద్ధం
-
విశాఖ మెట్రో రేస్‌లో ఐదు సంస్థలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో పీపీపీ విధానంలో మెట్రో రైల్ నిర్మాణం చేపట్టడానికి ఐదు సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం షార్ట్‌లిస్ట్ చేసిందని, వారికి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ)ను జారీ చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం తమకు సమాచారం ఇచ్చినట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గురువారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌ను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయడానికి ఆసక్తిగల సంస్థల నుంచి ఏపీ ప్రభుత్వం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (ఈవోఐ)ని ఆహ్వానించగా పలు సంస్థల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన మేరకు ఆర్ఎఫ్పీలను జారీ చేయడానికి అయిదు సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసినట్లు మంత్రి చెప్పారు. మెట్రో రైల్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించిన తర్వాత విశాఖపట్నం మెట్రో రైల్ నిర్మాణానికి ఎంత ఖర్చువుతుందని అంచనా వేశారు.. ఈ ప్రాజెక్ట్‌లో ఎన్ని కారిడార్లు ఉంటాయి?.. ప్రతి కారిడార్ పొడవు ఎంత?.. అన్న ప్రశ్నలకు మంత్రి నుంచి స్పష్టమైన సమాధానం రాలేదు. నగరం అభివృద్ధిలో రవాణా వ్యవస్థ ఒక అంతర్భాగం. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో మాత్రమే ఉంటుంది. అందువలన మెట్రో రైల్ ప్రాజెక్ట్‌ల ప్రతిపాదనలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే రూపొందిస్తాయి. అందువలన మెట్రో రైల్ ప్రాజెక్ట్ అలైన్మెంట్ ఎలా ఉండాలి, మొత్తం ఎంత వ్యయం అవుతుందో ఏపీ ప్రభుత్వమే నిర్ణయించాల్సి ఉంటుందని మంత్రి వివరించారు. మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహాయం కోరుతున్నట్లయితే ఆ ప్రతిపాదనలు మెట్రో రైల్ విధానంలోని పలు అంశాలకు అనుగుణంగా ఉండి తీరాలని మంత్రి స్పష్టం చేశారు. షీలానగర్‌లో ఈఎస్ఐ ప్రారంభం ఎప్పుడు? 2016లో షీలానగర్‌లో ఈఎస్ఐ హాస్పటల్‌కి ఏడు ఎకరాలు కేటాయించి శంకుస్థాపన చేసినా ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదని ఎంపీ విజయసాయిరెడ్డి మరో ప్రశ్నను సంధించారు. ఈఎస్ఐ ఆస్పత్రిని 300 నుంచి 500 పడకలకు పెంచడానికి అవసరమైన మరో రెండు ఎకరాల భూమిని ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసిందని, అయితే ఈఎస్ఐ ఆస్పత్రి లేకపోవటంతో ప్రైవేటు ఆసుపత్రులకు కార్మికులు వెళ్లాల్సి వస్తోందని, తద్వారా అప్పులపాలవుతున్నారని విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. -
పేరు తెలుసుకునేందుకే పదేళ్లు..!
సాక్షి, సిటీబ్యూరో: అండమాన్ నికోబార్ దీవుల నుంచి వచ్చిన శర్థక్ రావు బబ్రాస్ దేశంలోని దాదాపు అన్ని మెట్రో నగరాల్లోనూ పంజా విసిరాడు. స్టార్ హోటల్స్ అడ్డాగా చేసుకుని కథ నడిపిన ఇతగాడిని ఢిల్లీ పోలీసులు పదేళ్లకు పట్టుకోగలిగారు. బసేర హోటల్లో బస చేసి, అమర్సన్స్ పెరల్స్ అండ్ జ్యువెల్స్ యజమానిని మోసం చేసిన ఆరోపణలపై ఇతడిని గోపాలపురం పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన విషయం విదితమే. ‘డు నాట్ డిస్ట్రబ్’ అంటూ... పోర్ట్ బ్లేయర్లోని ఎంజీ రోడ్ ప్రాంతానికి చెందిన శర్థక్ రావు బబ్రాస్ ఉద్యోగం కోసం ముంబై వచ్చి నేరగాడిగా మారాడు. 2002 నుంచి వరుస పెట్టి అనేక స్టార్ హోటళ్లకు టోకరాలు వేస్తూ వచ్చాడు. విమానాల్లో తిరుగుతూ స్టార్ హోటళ్ళకు వెళ్లే ఇతగాడు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుంటాడు. బోగస్ ధ్రువపత్రాలు ఇచ్చి గదిలో దిగుతాడు. కనీసం వారు రోజుల పాటు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా బస చేస్తాడు. ఎవరైనా అడిగితే... తాను విమానంలో వచ్చానని, తన సహాయకులు రైలు లేదా రోడ్డు మార్గంలో వస్తున్నారని, నగదుతో పాటు లగేజ్ వారి వద్దే ఉండిపోయిందని చెప్పి కాలం గడుపుతాడు. హోటల్ సిబ్బంది నుంచి ఒత్తిడి పెరుగుతోందని భావిస్తే తన గది బయట ‘డు నాట్ డిస్ట్రబ్’ బోర్డు తగిలిస్తాడు. సదరు కస్టమర్లను నేరుగా, ఫోన్ ద్వారా కూడా డిస్ట్రబ్ చేయకపోవడం హోటళ్ల పాలసీ కావడం ఇతడికి కలిసి వచ్చింది. ఆపై అదును చూసుకుని ఆ హోటల్ ట్రావెల్ డెస్క్ నుంచే టిక్కెట్ బుక్ చేయించుకుని ఉడాయిస్తాడు. ఈ పంథాలో 2002 నుంచి 2012 వరకు గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో నేరాలు చేసినా పోలీసులకు చిక్కలేదు. బెడిసికొట్టిన ‘కంఫర్ట్ ఇన్’ ప్రయత్నం.. ఇలా పదేళ్ల పాటు రెచ్చిపోయిన శర్థక్ అసలు పేరు ఏమిటో, ఎక్కడి నుంచి వచ్చాడో కూడా ఏ పోలీసులకూ తెలియలేదు. 2012లో ఢిల్లీలోని కంఫర్ట్ ఇన్‌లో దిగిన అతను కేంద్ర ప్రభుత్వంలో జాయింట్ సెక్రటరీ హోదా అధికారినని, తన పేరు లోహానీగా చెప్పుకున్నాడు. తన వారు వస్తారనే, డు నాట్ డిస్ట్రబ్ అని బోర్డు పెట్టే ప్రయత్నాలన్నీ ముగిసే సరికి హోటల్ యాజమాన్యానికి అనుమానం వచ్చింది. దీంతో హోటల్ రూమ్ నుంచి అతడు ఎక్కడెక్కడికి కాల్స్ చేశాడో ఆరా తీయగా, ముంబై, భోపాల్, కోల్‌కతాలతో పాటు పోర్ట్ బ్లేయర్కూ కాల్స్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో కోల్‌కతాకు చెందిన ఓ నెంబర్‌ను సంప్రదించగా... అతడు ట్రావెల్ ఏజెంట్‌గా తేలింది. లోహానీ తనకూ డబ్బు ఇవ్వాలని వారు చెప్పడంతో వీరి అనుమానాలు బలపడ్డాయి. దీంతో డబ్బు చెల్లిస్తే తప్ప హోటల్ రూమ్ వదిలి వెళ్లనివ్వమని నిర్భంధించారు. ఆర్మీలోని మద్రాస్ రెజిమెంట్‌లో పని చేస్తున్న తన స్నేహితులు అమిత్, వినీత్ వస్తున్నారని.. వారే డబ్బు కడతారన్నా హోటల్ యాజమాన్యం బయటకు వెళ్ళేందుకు అంగీకరించలేదు. గుట్టు విప్పిన శర్థక్ భార్య కవిత.. హోటల్ బకాయిలు పెరిగిపోవడంతో సిబ్బంది లోహానీగా చెప్పుకున్న శర్థక్ సెల్‌ఫోన్ లాక్కున్నారు. అందులో అతడు కాల్స్ చేసిన నెంబర్లు పరిశీలించగా... ఓ నెంబర్‌తో ఎక్కువగా మాట్లాడినట్లు గుర్తించారు. హోటల్ యాజమాన్యం సైతం ఆ నెంబర్‌కు ఫోన్ చేయడంతో కవిత అనే మహిళ మాట్లాడారు. ఈ ఫోన్ నెంబర్ తన మాజీ భర్తదని, అతడు పచ్చి మోసగాడని, అందుకే వదిలేసి దూరంగా ఉంటున్నట్లు తెలిపింది. అతడి పేరు శర్థక్ రావు బబ్రాస్గా వెల్లడించింది. దీన్ని నిరూపించడం కోసం కొన్ని సర్టిఫికెట్లు సైతం హోటల్‌కు ఫ్యాక్స్ చేసింది. దీంతో హోటల్ సిబ్బంది అతడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. విచారణ నేపథ్యంలో అప్పటికే దాదాపు పదేళ్ళుగా తాను న్యూ ఢిల్లీలోని ఓబెరాయ్, రాడిస్సన్, మౌర్య షెరిటాన్, హయత్ రీజెన్సీ, సెంచూరీ, కోల్‌కతాలోని తాజ్ బెంగాల్, నోయిడాలోని హోటల్ ఫార్చూన్, లక్నోలోని తాజ్ హోటల్ తదితర చోట్ల బస చేసి మోసాలు చేసినట్లు బయటపెట్టాడు. తాజాగా శర్థక్ను అరెస్టు చేసిన గోపాలపురం పోలీసుల ఇతడిపై ఆయా నగరాల్లో నా న్–బెయిలబుల్ వారెంట్లు జారీ అయి ఉం టాయని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని నగరాలకు సమాచారం ఇవ్వాలని నిర్ణయించారు. -
ప్రభుత్వ ప్రాజెక్టుగా ‘మెట్రో’ రెండో విడత!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశను ప్రభుత్వ ప్రాజెక్టుగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రెండో దశ ప్రాజెక్టు కింద నగర శివార్లలో తక్కువ జన సాంద్రత కలిగిన ప్రాంతాలను మెట్రో రైలుతో అనుసంధానం చేస్తుండటంతో భవిష్యత్తులో ఆదాయం రూపంలో పెట్టుబడులు తిరిగి వచ్చే అవకాశాలు అంతంత మాత్రమేనని తేల్చింది. హైదరాబాద్ మెట్రో రైలు (హెచ్ఎంఆర్) తొలి దశ కింద నిర్మాణం పూర్తి చేసుకున్న రెండు కారిడార్ల పరిధిలో ఇప్పటికే రవాణా సేవలు ప్రారంభించగా, ఆశించిన రీతిలో ప్రయాణికుల నుంచి స్పందన లేదు. నగరంలో ఆర్టీసీ బస్సుల ద్వారా సగటున రోజుకు 40 లక్షల మంది ప్రయాణిస్తుండగా, మెట్రో రైలును రోజుకు సగటున 70 వేల మందే వినియోగించుకుంటున్నారు. తొలి దశ ప్రాజెక్టుతో పోల్చితే రెండో దశ ప్రాజెక్టు పరిధిలోని ప్రాంతాల్లో జన సాంద్రత చాలా తక్కువగా ఉంది. దీనికి తోడు ప్రపంచ వ్యాప్తంగా మెట్రో రైలు ప్రాజెక్టులన్నీ నిర్వహణలో తీవ్ర నష్టాలు కలిగిస్తున్నాయి. దేశంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుల విషయంలోనూ ప్రైవేటు పెట్టుబడిదారులు ముందుకు రాలేదని ప్రభుత్వం గుర్తించింది. ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్య పద్ధతి (పీపీపీ)లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వెళితే పెట్టుబడులు వచ్చే అవకాశం అంతంతేనని అంచనాకు వచ్చింది. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.9,378 కోట్లు ఈ క్రమంలో పూర్తిగా ప్రభుత్వ ప్రాజెక్టుగానే మెట్రో రెండో దశ ప్రాజెక్టును నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెట్టుబడులతో మెట్రో రెండో దశ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల ప్రతిపాదనలు పంపించింది. రెండో దశ ప్రాజెక్టు ప్రాథమిక నివేదిక ప్రకారం రూ.9,378 కోట్ల అంచనా వ్యయంతో మూడు మార్గాల్లో మొత్తం 62 కి.మీ. పొడవున మెట్రో రైలు నిర్మాణానికి అనుమతులు జారీ చేయాలని కోరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమ యాజమాన్య ప్రాజెక్టు (ఈక్వల్ వోనర్షిప్ ప్రాజెక్టు)గా రెండో దశ చేపట్టాలని, కేంద్ర, రాష్ట్రాల పెట్టుబడి వాటాలు పోగా మిగిలిన వ్యయ భాగాన్ని విదేశీ ఆర్థిక సంస్థల నుంచి రుణాల రూపంలో సమీకరిస్తామని పేర్కొంది. డీపీఆర్ రూపకల్పనకు రూ.50 కోట్ల నిధులు మెట్రో రైలు రెండో విడత సవివర పథక నివేదిక (డీపీఆర్) రూపకల్పన కోసం హెచ్ఎంఆర్కు రూ.50 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మంజూరు చేసింది. రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రెండో దశ ప్రాజెక్టుకు డీపీఆర్ రూపకల్పన బాధ్యతలను ఢిల్లీ మెట్రో రైలు సంస్థ (డీఎంఆర్‌సీఎల్)కు హెచ్ఎంఆర్ అప్పగించింది. తొలి దశ కింద ఇప్పటికే మూడు కారిడార్లలో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతుండగా, రెండో దశ కింద నాలుగో కారిడార్‌గా గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ పార్కు నుంచి శంషా బాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 30.7 కి.మీ. పొడవున ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ వే నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐదో కారిడార్‌లో బీహెచ్ఈఎల్ నుంచి మియాపూర్ మీదుగా లక్డీకాపూల్ వరకు 26.2 కి.మీ. మెట్రో రైలు మార్గం ఏర్పాటు కానుంది. అదేవిధంగా తొలిదశలో మూడో కారిడార్ (నాగోల్–రాయ్‌దుర్గ్) విస్తరణలో భాగంగా నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు 5.1 కి.మీ. మెట్రో రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. -
సర్ప్రైజ్ విజిట్ : మెట్రోలో గవర్నర్ దంపతులు
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, భార్యతో కలసి అతి సామాన్యుల్లా మెట్రో రైలులో ప్రయాణించి సర్ప్రైజ్ చేశారు. అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా బేగంపేట్ మెట్రో స్టేషన్‌కు వచ్చిన నరసింహన్ దంపతులు మెట్రో రైలు ఎక్కి అమీర్‌పేట్ జంక్షన్లో దిగారు. అక్కడినుంచి మియాపూర్‌కు కనెక్టింగ్ ట్రైన్లో బయల్దేరారు. కూకట్‌పల్లిలో అప్పటికే ఇన్స్పెక్షన్ చేస్తున్న హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్(హచ్ఎంఆర్ఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి సమాచారం చేరడంతో ఆయన హుటాహుటిని మియాపూర్‌కు చేరుకుని గవర్నర్ దంపతులకు స్వాగతం పలికారు. అయితే, గవర్నర్ ఆయన స్వాగతాన్ని తొలుత నిరాకరించారు. అయినప్పటికీ పట్టువదలని ఎన్వీఎస్ రెడ్డి మియాపూర్ జంక్షన్‌లోని సౌకర్యాలను చూపుతానని కోరారు. దీంతో సాధారణ ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూపాలని నరసింహన్ కండీషన్ పెట్టారు. ఇందుకు అంగీకరించిన రెడ్డి.. నరసింహన్ దంపతులకు వసతులను చూపారు. మెట్రో సదుపాయాలపై గవర్నర్ దంపతులు హర్షం వ్యక్తం చేశారు. హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిలతో పాటు స్టాఫ్‌ను అభినందించారు. మాస్కోలోని మెట్రో తరహాలో ఆర్ట్ మ్యూజియంలను కూడా మెట్రో స్టేషన్ల వద్ద ఏర్పాటు చేయాలని సూచించారు. -
గూగుల్ మ్యాప్‌తో మెట్రో పిల్లర్ నంబర్ల అనుసంధానం
-
మెట్రో వేళల్లో మార్పులు
సాక్షి, సిటీబ్యూరో: ఈనెల 16 నుంచి(సోమవారం) మెట్రో రైలు పని వేళల్లో స్వల్ప మార్పులు చేస్తూ ఎల్‌అండ్‌టీహెచ్‌ఎంఆర్‌ఎల్ సంస్థ నూతన సమయపట్టిక ప్రకటించింది. ఎల్బీనగర్–అమీర్‌పేట్, అమీర్‌పేట్–హైటెక్‌సిటీ మార్గంలో మెట్రో రైళ్ల ట్రయల్‌రన్ నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయంతీసుకున్నట్లు తెలిపింది. దీంతో ఇప్పటికే నాగోల్–అమీర్‌పేట్–మియాపూర్ మార్గంలో రాకపోకలు సాగిస్తున్న రైళ్ల పనివేళలు స్వల్పంగా మారనున్నాయి. ఇకపై సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే తొలిరైలు 6.30 గంటలకు బయలుదేరనుంది. ఇక ఆదివారం రోజున ఉదయం 6 గంటలకు మొదలయ్యే తొలి రైలు ఉదయం 7గంటలకు బయలుదేరనుంది. ట్రయల్‌రన్ నేపథ్యంలో మెట్రో రైళ్ల పనివేళలను అరగంటపాటు కుదించినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. కాగా రాత్రి 10 గంటల వరకు యథావిధిగా మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తాయని తెలిపింది. కాగా ఎల్బీనగర్–అమీర్‌పేట్ రూట్లో ఆగస్టు తొలివారంలో, అమీర్‌పేట్–హైటెక్‌సిటీమార్గంలో ఈ ఏడాది అక్టోబరులో మెట్రో రైళ్లు సిటీజన్లకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హెచ్ఎంఆర్ ఏర్పాట్లు చేస్తున్న విషయం విదితమే. ఇప్పటికే నిత్యం 75 వేల మంది ప్రయాణికులు నాగోల్–అమీర్‌పేట్–మియాపూర్ (30 కి.మీ)మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారు. -
గూగుల్ మ్యాప్‌తో ‘మెట్రో’ నంబర్ల అనుసంధానం
సార్.. మీకు కొరియర్ వచ్చింది.. మీ అడ్రస్ ఎక్కడ..? మెట్రో పిల్లర్ నంబర్ 1392 వద్దకు వచ్చేశావనుకో.. ఆ ఎదురు సందులో.. డాడీ క్యాబ్ బుక్ చేస్తున్నా.. సినిమా థియేటర్ అడ్రస్ ఎక్కడ..? మెట్రో పిల్లర్ నంబర్ 506.. దాని ఎదురుగానే షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్.. సాక్షి, హైదరాబాద్: త్వరలో నగరంలోని అడ్రస్‌లన్నింటికీ మెట్రో పిల్లర్లే మూలస్తంభంగా మారనున్నాయి. ఈ మేరకు మెట్రో రైలు పిల్లర్లను త్వరలో జీపీఎస్ సాంకేతికతతో గూగుల్ మ్యాప్ కు అనుసంధానించనున్నారు. వీటికి నంబర్లను కేటాయించడం ద్వారా పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతోపాటు వాణిజ్య, వ్యాపార సముదాయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారనున్నాయి. ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్– ఫలక్‌నుమా, నాగోల్–రాయదుర్గం మూడు మెట్రో కారిడార్లలో 66 కి.మీ. మార్గంలోని 2,541 మెట్రో పిల్లర్లకు దశలవారీగా నంబర్ల కేటాయింపు ప్రక్రియ మొదలుకానుంది. ఇప్పటికే ప్రకాశ్‌నగర్–రసూల్‌పురా మార్గంలో సీ1,300–సీ1,350 వరకు పిల్లర్లకు నంబర్లు కేటాయించారు. నీలిరంగు బోర్డుపై తెలుపు అక్షరాలతో వీటిని చిన్నగా ఏర్పాటు చేశారు. భవిష్యత్‌లో పెద్ద పరిమాణంలో అందరికీ కనిపించేలా రేడియంతో ఏర్పాటు చేయనున్నట్లు హెచ్ఎంఆర్ వర్గాలు తెలిపాయి. కాగా పీవీ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే తరహాలో మెట్రో పిల్లర్లు సైతం నగరవాసులకు ల్యాండ్‌మార్క్ చిహ్నలుగా మారనుండటం విశేషం. ఎల్బీనగర్ పిల్లర్ నం.1..? మెట్రో కారిడార్లలో ‘ఏ’కారిడార్‌గా పిలిచే ఎల్బీనగర్–మియాపూర్ (29 కి.మీ.) మార్గంలో ఎల్బీనగర్ రింగ్‌రోడ్డు వద్ద పిల్లర్ నం.1 ఏర్పాటుకానుంది. ఈ మార్గంలో మొత్తం 1,108 పిల్లర్లున్నాయి. ఇక జేబీఎస్–ఫలక్‌నుమా (15 కి.మీ.) మార్గాన్ని ‘బీ’కారిడార్‌గా పిలుస్తున్నారు. ఈ మార్గంలో మొత్తం 588 పిల్లర్లున్నాయి. నాగోల్–రాయదుర్గం (28 కి.మీ.) మార్గంలో 845 పిల్లర్లున్నాయి. ఈ మార్గంలోనే ప్రస్తుతానికి ప్రకాశ్‌నగర్–రసూల్‌పురా మార్గంలోనే సి1300–సి1350 వరకు నంబర్లను కేటాయించారు. ఇక మెట్రో రెండోదశ కింద ఎబ్బీనగర్–నాగోల్, ఎల్బీనగర్–ఫలక్‌నుమా, రాయదుర్గం–శంషాబాద్ ఎయిర్పోర్ట్ తదితర మార్గాల్లోనూ ఏర్పాటుచేసే పిల్లర్లతో వీటి సంఖ్య మరింత పెరగనుంది. జీపీఎస్‌తో అడ్రస్ ఈజీ... మూడు మెట్రో కారిడార్ల పరిధిలో ప్రస్తుతం పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ఆస్పత్రులు ఉన్నాయి. ఈ కారిడార్లకు రెండు వైపులా వేలాది కాలనీలు, బస్తీలున్నాయి. అత్యంత రద్దీగా ఉండే ఈ రూట్లలో గ్రేటర్ సిటిజన్లే కాకుండా ఇతర జిల్లాల వాసులూ రాకపోకలు సాగిస్తారు. వీరికి ఇప్పుడు ఆయా కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలను తేలికగా గుర్తించేందుకు పిల్లర్ నంబర్లే ఆధారం కానున్నాయి. ఈ పిలర్ల నెంబర్లను జీపీఎస్ సాంకేతికతతో గూగుల్ మ్యాప్‌కు అనుసంధానం చేయనుండటంతో.. పిల్లర్ నంబర్ ఆధారంగా గమ్యస్థానం చేరుకోవచ్చు. -
ఉరేసుకొని చస్తాం..
తాడేపల్లి రూరల్: రాజధాని ప్రాంత రైతుల్లో ప్రభుత్వం మళ్లీ అలజడి సృష్టిస్తోంది. సర్వేలంటూ, హైటెన్షన్ వైర్లంటూ రైతుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఇప్పటికే భూ సమీకరణతో వేలాది ఎకరాలను బీడు పెట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు అరకొరగా మిగిలిన భూముల్లో కూడా పంటలు సాగుచేసుకోనివ్వకుండా దారుణంగా వ్యవహరిస్తోంది. తాజాగా పంట పొలాల మీదుగా హైటెన్షన్ వైర్లు లాగడంపై రాజధాని ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ స్థలాల్లో గానీ, ఇళ్ల మీదుగా కానీ ఇలాంటి విద్యుత్ వైర్లు వేయగలరా? అంటూ అధికారులను నిలదీశారు. అయినా కూడా వారు వెనక్కి తగ్గకపోవడంతో.. ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటామంటూ రైతులు బెదిరించారు. వివరాలు.. రాజధాని ప్రాంతం ముంపునకు గురవకుండా ఇరిగేషన్ శాఖ రూ.240 కోట్లతో కృష్ణానదిపై కొండవీటివాగు హెడ్‌స్లూయిస్ వద్ద ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసింది. దీనికి అవసరమైన విద్యుత్ కోసం నులకపేట 130 కె.వి సబ్‌స్టేషన్ నుంచి గుంటూరు చానల్ మీదుగా హైటెన్షన్ వైర్లు ఏర్పాటు చేశారు. కొండవీటి వాగు వద్దకు వచ్చేసరికి రైతుల పంట పొలాలు, స్థలాల మీదుగా హైటెన్షన్ వైర్లు ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై రైతులు గతంలో కూడా అభ్యంతరం తెలిపారు. దీంతో తాత్కాలికంగా పనులు విరమించిన ఇరిగేషన్ శాఖ అధికారులు.. మళ్లీ మంగళవారం రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పొలాల్లోంచి హైటెన్షన్ వైర్లను లాగడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు వెంటనే అక్కడకు చేరుకొని అధికారులను అడ్డుకున్నారు. ఎక్కడో పైన వెళ్లే వైర్లను ఆపడానికి మీరెవరంటూ రైతులను ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రశ్నించగా.. మీ స్థలాలు, ఇళ్ల మీదుగా ఇలాంటి భారీ కరెంటు వైర్లు వెళుతుంటే ఊరుకుంటారా అంటూ నిలదీశారు. ఇక్కడ ఉన్న అర ఎకరం, ఎకరం భూములను ఐదారుగురు పంచుకోవాల్సి ఉందని, ఇది అగ్రికల్చరల్ భూమి కాదని.. మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి వీల్లేదంటూ అభ్యంతరం తెలిపారు. రాజధాని నిర్మాణానికి మా భూములు ఇవ్వబోమంటూ గతంలో కోర్టును ఆశ్రయించామని.. అలాంటి భూముల్లో ఎలా వైర్లు ఏర్పాటు చేస్తారంటూ ప్రశ్నించారు. అయినా కూడా అధికారులు పట్టించుకోకపోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి.. రైతులను అక్కడ్నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో మా పొలాల మీదుగా వైర్లు లాగితే వాటికే ఉరేసుకొని చస్తామని రైతులు స్పష్టం చేశారు. ఒకవేళ అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళితే అక్కడే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో పోలీసులు, ఇరిగేషన్ శాఖ అధికారులు తిరిగి వెళ్లిపోయారు. మెట్రో రైల్ సర్వే కోసమంటూ.. మైట్రో రైల్ సర్వే కోసమంటూ వచ్చి హడావుడి చేసిన కొందర్ని ఉండవల్లి రైతులు మంగళవారం అడ్డుకున్నారు. ఓ సర్వే సంస్థకు చెందిన బృందం మంగళవారం ఉదయం పొలాలను ఇష్టం వచ్చినట్టు తొక్కుతూ తిరుగుతుండటంతో.. అక్కడ ఉన్న ఇద్దరు రైతులు వారిని నిలదీశారు. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులున్నాయని.. అడ్డుకుంటే అడ్డుకుంటే ఇబ్బందులు పడతారంటూ వారు బెదిరింపులకు దిగారు. దీంతో రైతులు వారిని పొలాల్లోంచి బయటకు వెళ్లిపోవాలంటూ హెచ్చరించారు. ఇంతలో ఈ విషయం తెలిసిన గ్రామ రైతులు భారీగా అక్కడకు చేరుకున్నారు. తాము ప్రభుత్వానికి భూములివ్వలేదని.. దీనిపై కోర్టులో కేసు నడుస్తున్నందున సర్వే చేయవద్దంటూ వారికి తేల్చిచెప్పారు. ఈలోగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని.. వారిని అక్కడ్నుంచి తీసుకెళ్లిపోయారు. మళ్లీ వస్తే కేసులు పెడతామంటూ రైతులు సర్వే బృందాన్ని హెచ్చరించారు. -
ఆర్టీసీ, మెట్రో, ఉబర్‌లతో ప్రత్యేక యాప్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రజలను ప్రజా రవాణా వ్యవస్థ వైపు మళ్లించేందుకు ఆర్టీసీ, మెట్రో, ఉబర్, ఓలా, ఇతర ప్రైవేటు మినీ వాహనాలతో ఓ యాప్‌ను తీసుకురానున్నట్లు ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ చెప్పారు. మంగళవారం ఆయన బస్‌భవన్‌లో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులతో కలసి విలేకరులతో మాట్లాడారు. నగరంలో సౌకర్యవంత ప్రయాణానికి పరిష్కారాలు అన్వేషించటం కోసం మెట్రో రైలు, ఆర్టీసీ, ఎంఎంటీఎస్ తదితర సంస్థల అధికారులతో కలసి ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. తొలిసారిగా ఈ టాస్క్‌ఫోర్స్ సమావేశమైంది. ఈ సందర్భంగా సునీల్ శర్మ మాట్లాడుతూ.. ఒక ప్రత్యేక యాప్‌ను రూపొందించి మెట్రో, ఆర్టీసీ, ఉబర్, ఓలా తదితరాలను దాని పరిధిలోకి తీసుకువస్తామని చెప్పారు. వీటన్నిటికి కలిపి ఒకే కామన్ టికెట్ ఉండేలా చూస్తామన్నారు. అయితే ఈ ఆలోచన ప్రస్తుతానికి తొలిదశలోనే ఉందని, నెల రోజుల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. భవిష్యత్‌లో మెట్రోరైలుతో ఆర్టీసీకి పోటీ ఉండదని, రెండు ప్రజా రవాణా సంస్థల మధ్య సమన్వయం ఉంటుందన్నారు. కాలనీ ప్రాంత ప్రయాణికులకు మైట్రో స్టేషన్ వరకు తీసుకువచ్చే విధంగా బస్సులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆర్టీసీ–మెట్రో అనుసంధానంపై రెండు నెలల్లో ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థ పెరిగితే వ్యక్తిగత వాహనాలు, కాలుష్యం తగ్గుతుందని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. -
‘తెలంగాణ సవారీ తరహాలో యాప్’
సాక్షి, హైదరాబాద్ : మెట్రోరైలు, ఆర్టీసీ అనుసంధానంపై మంగళవారం నగరంలో సమావేశం జరిగింది. తెలంగాణ సవారీ తరహాలో యాప్ రూపొందిస్తామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. టీఎస్ ఆర్టీసీ ఎండీ, మైట్రోరైలు ఎండీలతో పాటు సంబంధిత అధికారులు సమావేశానికి హాజరయ్యారు. అంతేకాక అనుసంధానంపై కీలక విషయాలను చర్చించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ టీఎస్ ఇంచార్జి ఎండీ సునీల్ శర్మ మాట్లాడుతూ.. మెట్రోరైలు, ఆర్టీసీ అనుసంధానంపై టాస్క్ ఫోర్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్టీసీ బస్సులు, మెట్రోరైలు ట్రాకింగ్ పై ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘వాహనాల ట్రాకింగ్ కోసం ప్రత్యేక యాప్ రూపకల్పన చేసేందుకు ఆలోచిస్తున్నాం. ప్రైవేట్ వాహన సంస్థలతో పేమెంట్స్ పై చర్చ జరిపాం. ప్రజలకు వేగవంతమైన, సుఖవంతమైన ప్రయాణం కోసం ఆలోచన చేస్తున్నాము.మొదటి మీటింగ్ నిర్వహించాం. రేపు కూడా మళ్లీ సమావేశం ఉంటుంది. మెట్రో, ఆర్టీసీ ప్రయాణ అనుసంధానం పై 2నెలల్లో ప్రణాళికలు రూపొందిస్తాం. గ్రేటర్ సిటీలో ఆర్టీసీ, మెట్రో కలిసి పని చేయాలి. గ్రేటర్ సిటీలో మెట్రో, ఆర్టీసీ కలిసేందుకు మొదటి ప్రయత్నం చేస్తున్నాం. 18వందల బస్సులకు ఇప్పటికే ట్రాకింగ్ సిస్టం ఉంది. మిగతా వాటికి కూడా ఏర్పాటు చేస్తాం. పేదలకు నష్టం కలుగకుండా ప్రణాళికలు చేస్తున్నాం. మెట్రో, ఆర్టీసీ, ఓలా, ఉబర్ సంస్థలతో కలిసి సమన్వయంతో పనిచేస్తాం. ప్రజల అవసరాలు, రద్దీని బట్టి ఆర్టీసీలో మార్పులు ఉంటాయి. ఆర్టీసీలో కొత్త కమిటీ వేశాం.. త్వరలోనే ప్రకటన చేస్తాం’ అని ఎండీ సునీల్ వర్మ తెలిపారు. మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా రవాణా వ్యవస్థ పెరిగితే.. వ్యక్తిగత వాహనాలు తగ్గుతాయన్నారు. తెలంగాణ సవారీ తరహాలో యాప్ రూపొందిస్తామని ఆయన తెలిపారు. సిటీలో ఆర్టీసీలో 33లక్షల మంది, ఎంఎంటీఎస్‌లో 2లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. మెట్రోలో ప్రస్తుతం 8వేల మంది ప్రయాణం చేస్తున్నట్లు మెట్రో ఎండీ తెలిపారు. ‘గ్లోబల్ కంపెనీలు దేశంలో ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కి వస్తున్నాయి. బెంగుళూరు తరహాలో ట్రాఫిక్ లేకుండా హైదరాబాద్‌ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలను టాస్క్ ఫోర్స్ చేస్తది. నగరంలో ట్రాఫిక్ తగించడంతో పాటు సుఖవంతమైన ప్రయాణం కోసం కృషి చేస్తున్నాం. దేశంలో ఎక్కడలేని విధంగా మెట్రో రైల్‌ని రూపొందిస్తున్నాం. జీఎచ్ఎంసీ ద్వారా గ్రేటర్లో బస్ షెల్టర్ నిర్మాణం జరుగుతుందని’ ఆయన పేర్కొన్నారు. -
మెట్రో రైలు ముందు దూకేశాడు
న్యూఢిల్లీ : దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసు పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ 23 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. కరోల్ బాగ్ మెట్రో స్టేషన్లో ఈరోజు ఉదయం ప్లాట్‌ఫామ్ మీదకు వస్తున్న మెట్రో రైలు ముందుకు దూకాడు. ఈ ఘటన ఉదయం తొమ్మిదిన్నర గంటలకు చోటు చేసుకుంది. మెట్రో రైలు ముందుకు దూకడంతో ఆ విద్యార్థి తలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థిని అధికారులు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. ముంబైకి చెందిన ఈ విద్యార్థి సివిల్ సర్వీసు పరీక్షల కోసం సిద్ధమవుతున్నాడు. తూర్పు ఢిల్లీలోని నిర్మాన్ విహార్‌లో తన స్నేహితుడితో కలిసి ఉంటున్నాడు. కరోల్ బాగ్ మెట్రో స్టేషన్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్లాట్‌ఫామ్ మీదకు రైలు వస్తున్న క్రమంలో బ్లూలైన్ వద్ద రైలు ముందు దూకినట్టు సీనియర్ ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులు చెప్పారు. ఈ ఘటనతో మెట్రో అధికారులు ఒక్కసారిగా షాకయ్యారు. మెట్రో సర్వీసులకు కొద్ది సేపు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. -
మెట్రో జర్నీ.. మేడ్ ఈజీ!
సనత్‌నగర్: అమీర్‌పేట్–ఎల్బీనగర్ రూట్లో ఆగస్టులో మెట్రో రైళ్లు పరుగులు తీస్తాయని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో ప్రయాణికులకు లాస్ట్‌మైల్ కనెక్టివిటీ వరకు సౌకర్యవంతమైన ప్రయాణం సాకారం చేసేందుకు మెట్రోస్టేషన్ల వద్ద ద్విచక్ర వాహనాలతో పాటు కార్లను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. మెట్రో స్టేషన్ల వద్ద నూతనంగా ప్రవేశపెట్టిన ‘డ్రైవ్ జీ’ యాక్టివా వాహనాలను గురువారం ఆయన బేగంపేట తాజ్‌వివంతా హోటల్ వేదికగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్రెడ్డి మాట్లాడుతూ.. ఏ నగరానికైనా ప్రజా రవాణా ముఖ్యమని, నగరాలను కార్ల కోసం అభివృద్ధి చేయడం కాదని, ప్రజల కోసం, వారి అవసరాల కోసమేనని స్పష్టం చేశారు. గ్రేటర్లో హైదరాబాద్ మెట్రో రైల్ తరుఫున అన్ని హంగులతో కూడిన ప్రజారవాణా వ్యవస్థను తీర్చిదిద్దేదిశగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే పెడల్, జూమ్‌కార్ సంస్థలతో కలిసి మియాపూర్, కేపీహెచ్‌బీ, కూకట్పల్లి, బేగంపేట, నాగోలు, పరేడ్‌గ్రౌండ్ మెట్రోస్టేషన్లలో ద్విచక్రవాహనాలు, కార్లను అద్దె ప్రాతిపదికన అందజేసే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మరో ఐదు స్టేషన్లలో ‘డ్రైవ్‌జీ’ యాక్టివా వాహనాలను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఫస్ట్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ అందించే దిశగా డ్రైవ్‌జీ వాహనాలను ప్రారంభించినట్లు వివరించారు. 125 డ్రైవ్ జీ యాక్టివా వాహనాలు షురూ... మొదటి విడతగా 125 డ్రైవ్‌జీ వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ వాహనాలను బాలానగర్, కూకట్పల్లి, ప్రకాష్‌నగర్, తార్నాక, మెట్టుగూడ మెట్రోస్టేషన్లలో అందుబాటులో ఉంచారు. డబ్లు్యడబ్లు్యడబ్లు్య.డ్రైవ్‌జీ.కామ్ వెబ్సైట్ ద్వారా వాహనాన్ని బుక్ చేసుకుని ఆయా స్టేషన్ల వద్ద వీటిని పికప్ చేసుకోవచ్చు. అయితే ముందుగా మీ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు పాన్‌కార్డును కూడా ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కిలోమీటర్‌కు రూ.3... డ్రైవ్‌జీ వాహనాలను అద్దెకు తీసుకునే వారి నుంచి కిలోమీటరుకు రూ.3 ఛార్జీగా వసూలు చేస్తారు. కనీస దూరం ఐదు కిలోమీటర్లుగా పరిగణించి రూ.15 వసూలు చేయాలని నిర్ణయించారు. నెలవారీగా అద్దెకు తీసుకోవాలంటే రూ.2,700 చెల్లించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో వినియోగదారుల సంఖ్యను బట్టి ఈ ధర మారుతుందన్నారు. త్వరలో ఏడు రోజులు, 15 రోజుల చొప్పున పాస్‌లు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మల్టీలెవల్ పార్కింగ్‌కు ప్రతిపాదనలు... ప్రకాష్‌నగర్ స్టేషన్ మినహాయించి అన్ని మెట్రోస్టేషన్లలోనూ పార్కింగ్‌కు ఏర్పాట్లు చేసినట్లు ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. రద్దీగా ఉండే మెట్రో స్టేషన్లకు సమీపంలో మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాలకు ప్రతిపాదనలు సిద్ధంచేశామన్నాన్నారు. ఎంజీబీఎస్ వద్ద స్కైవాక్‌లు... ఎంజీబీఎస్‌కు అనుసంధానం చేసేలా రెండు వైపులా స్కైవాక్‌ల నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దీని ద్వారా మెట్రో స్టేషన్ల నుంచి నేరుగా ఎంజీబీఎస్‌లోకి వెళ్లేందుకు సౌలభ్యంగా ఉంటుందని చెప్పారు. త్వరలోనే ఈ పనులను పూర్తి చేయనున్నట్లు ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. -
జూలై 26 లేదా 27న అమీర్‌పేట్ టు ఎల్బీనగర్
-
అమీర్‌పేట్ టు ఎల్బీనగర్..
సాక్షి, హైదరాబాద్ : అమీర్‌పేట్–ఎల్బీనగర్ మధ్య మెట్రో రైలు పరుగులు తీసేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెలాఖరులో(26 లేదా 27వ తేదీన) ఎల్బీనగర్–అమీర్‌పేట్ మార్గంలో మెట్రో రైలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. 16 కిలోమీటర్ల దూరం ఉన్న ఎల్బీనగర్–అమీర్‌పేట్ మార్గంలో రైళ్ల రాకపోకలకు అవసరమైన సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్, ట్రాక్షన్ వ్యవస్థ ఏర్పాటు వంటి పనులన్నీ పూర్తయ్యాయి. ఈ రూట్లో రైళ్లకు 18 రకాల సామర్థ్య పరీక్షలను వరుసగా నిర్వహిస్తున్నారు. ఈ మార్గానికి సంబంధించి త్వరలో రైల్వే శాఖ పరిధిలోని కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ధ్రువీకరణ సైతం అందనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ మార్గంలో మెట్రోను ప్రారంభించేందుకు హైదరాబాద్ మెట్రో రైల్(హెచ్ఎంఆర్) సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే ప్రభుత్వ వర్గాలు కచ్చితమైన ప్రారంభ తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ఈ మార్గంలో నిత్యం సుమారు 75 వేల మంది రాకపోకలు సాగించే అవకాశాలున్నట్లు అంచనా. అక్టోబర్‌లో అమీర్‌పేట్ హైటెక్‌సిటీ మరోవైపు అమీర్‌పేట్–హైటెక్‌సిటీ(13 కి.మీ.) మార్గంలో అక్టోబర్‌లో మెట్రో రైళ్లు పరుగులు తీసే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. సైబర్టవర్స్ వద్ద మెట్రో రివర్సల్ ట్రాక్‌కు రీడిజైన్ చేయనుండటంతో పనులు ఆలస్యమవుతున్నాయని తెలిపారు. ఇక జేబీఎస్–ఎంజీబీఎస్(10 కి.మీ.) మార్గంలో వచ్చే ఏడాది మార్చిలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగించనున్నాయని చెప్పారు. ప్రస్తుతం నాగోల్–అమీర్‌పేట్–మియాపూర్(30 కి.మీ) మార్గంలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా.. నిత్యం 75–80 వేల మంది ప్రయాణం చేస్తున్నారు. రెండోదశకు వడివడిగా అడుగులు.. మెట్రో రెండోదశ ప్రాజెక్టు(61.5 కి.మీ.) దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. రెండోదశలో ప్రధానంగా ప్రస్తుత మూడు మెట్రో కారిడార్ల నుంచి శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్టివిటీని పెంచే అంశంపైనే ప్రధానంగా సర్కారు దృష్టి సారించింది. రెండోదశపై ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ సమగ్ర అధ్యయనం జరిపి ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాయదుర్గం బయోడైవర్సిటీ పార్కు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు (30 కి.మీ.)మార్గాన్ని తొలివిడతగా చేపట్టనున్నారు. ఎల్బీనగర్–నాగోల్(5.5 కి.మీ.), బీహెచ్ఈఎల్–లక్డీకాపూల్(26 కి.మీ.) మార్గాల్లోనూ రెండో దశలో చేపట్టనున్నట్లు తెలిసింది. ఇందుకు సుమారు రూ.10 వేల కోట్లు అంచనా వ్యయంగా ప్రాథమికంగా నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీ(డీపీఆర్)లో ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులు నిమగ్నమయ్యారు. ఆగస్టులో డీపీఆర్ సిద్ధంకానుంది. ఈ నివేదికతో రెండోదశ మెట్రో అలైన్‌మెంట్‌పై స్పష్టత రానుంది. మెట్రో తొలివిడత ప్రాజెక్టును పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన విషయం విదితమే. రెండోవిడతకు మాత్రం 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా సమకూర్చడం, మరో 60 శాతం నిధులను జైకా వంటి ఆర్థిక సంస్థల నుంచి రుణంగా సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. పాతనగరానికి మెట్రో కష్టమే.. ఎంజీబీఎస్–ఫలక్‌నుమా(5.5 కి.మీ.) మార్గంలో మెట్రోకు బాలారిష్టాలు తప్పడం లేదు. ఈ మార్గం లో సుమారు వెయ్యి ఆస్తుల సేకరణ, బాధితులకు పరిహారం చెల్లింపు అంశం జఠిలంగా మారుతోంది. పరిహారం చెల్లింపునకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంది. కానీ ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా భారీ మొత్తంలో పరిహారం చెల్లింపు ఎలా జరుపుతుందన్న దానిపై సందేహాలు వ్యక్తమౌతున్నాయి. నిర్మాణ సంస్థ సైతం ఇదే అంశంపై మల్లగుల్లాలు పడుతోంది. -
మెట్రోతో మారుమూలల అనుసంధానం
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైలుకు అనుసంధానంగా మారుమూల ప్రాంతాల్లో రవాణా సౌకర్యాల మెరుగుదలకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. రవాణా మంత్రి పి.మహేందర్ రెడ్డితో కలసి సోమవారం ఇక్కడ మారుమూల ప్రాంతాలకు మెట్రో రైలు అనుసంధానంపై సమీక్షించారు. మెట్రో రైలు పనులు త్వరలో పూర్తి కానున్న నేపథ్యంలో మారుమూల ప్రాంతాలను అనుసంధానం చేసేందుకు రవాణా శాఖ, ఆర్టీసీ, సెట్విన్, మెట్రో రైలు సంస్థలు సమన్వయంతో ముందుకు పోవాలని కోరారు. శాఖల మధ్య సమన్వయం, నగరంలో ప్రజారవాణా వ్యవస్థ మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యల కోసం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రవాణా, పురపాలక శాఖల ముఖ్య కార్యదర్శులు, మెట్రో రైలు ఎండీ, సెట్వీన్, జీహెచ్ఎంసీ, దక్షిణ మధ్య రైల్వే సంస్థల ప్రతినిధులను ఈ టాస్క్ఫోర్సులో సభ్యులుగా నియమించారు. నగరంలో ప్రజారవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ఇందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలని ఈ కమిటీని కోరారు. రెండు నెలల్లో ప్రాథమిక నివేదికతో ముందుకు రావాలని ఆదేశించారు. నగరంలో రవాణా అవసరాలను తీర్చడంలో ఆర్టీసీ, మెట్రో రైలు సంస్థలు పరస్పర సహకారంతో పనిచేస్తే మరింత మేలు చేకూరుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. నగరంలో ప్రయాణికుడే లక్ష్యంగా ప్రజా రవాణా సౌకర్యాలుంటాయని, ఇంటి నుంచి మెట్రో స్టేషన్‌కు, మెట్రో స్టేషన్ నుంచి కార్యాలయాలను అనుసంధానం చేస్తూ రవాణా సదుపాయం కల్పించేందుకు దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. నగరంలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశ పెట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం ఎలక్ట్రిక్ బస్సులు, వ్యాన్లు, ఆటోలనే తీసుకోవాలన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు నగరంలోని మెట్రో స్టేషన్లు, బస్సు డిపోల వద్ద చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్నారు. -
మెట్రోలో ప్రమాణాలకు కమిటీ
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ నగరాల్లో ఉన్న మెట్రోరైల్ వ్యవస్థలకు కొన్ని ప్రమాణాలను నిర్దేశించేందుకు ఓ కమిటీని ఏర్పాటుచేసే ప్రతిపాదనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారు. ‘మెట్రోమ్యాన్’ శ్రీధరన్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. ఢిల్లీ మెట్రో విస్తరణలో భాగంగా బహదూర్గఢ్–ముండ్కా మార్గాన్ని మోదీ ఆదివారం ప్రారంభించారు. పట్టణాల్లో సౌకర్యవంతమైన, అందుబాటు ధరల్లో లభించే రవాణా వ్యవస్థలను నిర్మించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ‘మెట్రోరైళ్లకు సంబంధించి మా ప్రభుత్వం ఓ విధానం తీసుకొచ్చింది. మెట్రో వ్యవస్థల మధ్య సమన్వయం ఉండాలనీ, కొన్ని ప్రాథమిక ప్రమాణాల ప్రకారమే అవి పనిచేయాలని మేం భావిస్తున్నాం’ అని మోదీ చెప్పారు. ‘దేశంలో వివిధ నగరాల్లోని మెట్రోరైల్ నెట్‌వర్క్‌లను నిర్మించేందుకు ఇతర దేశాలు మనకు సాయం చేశాయి. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆయా దేశాల్లోని మెట్రో రైళ్లకు బోగీలను మన దేశంలో తయారుచేయడం ద్వారా వారికి మనం సాయం చేస్తున్నాం’ అని మోదీ తెలిపారు. -
మెట్రో కార్ ఆగయా!
మియాపూర్: సిటీ రూపురేఖలను సమూలంగా మార్చేసిన మెట్రో రైల్.. మరో ముందడుగు వేసింది. ఆయా స్టేషన్లలో దిగిన ప్రయాణికులు చివరి గమ్యస్థానం చేరేందుకు ఎలక్ట్రికల్ కార్లను ప్రవేశపెట్టింది. వీటిని స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లే సౌకర్యం సైతం కల్పించింది. మహేంద్ర తయారు చేసిన ‘ఈ2ఓ ప్లస్’ ఎలక్ట్రిక్ కారును శుక్రవారం మియాపూర్ మెట్రో స్టేషన్లో హైదరా బాద్ మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. మెట్రో ప్రయాణికులకు సెల్ఫ్ డ్రైవ్ సౌకర్యంతో పాటు.. గ్రేటర్లో వాయు కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించేందుకు ఈ ఎలక్ట్రిక్ కార్లు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అన్నారు. గ్రేటర్ సిటీజన్లుడీజిల్, పెట్రోల్ వాడకాన్ని తగ్గించి ఎలక్ట్రికల్ కార్లను వినియోగించాలని సూచించారు. భవిష్యత్‌లో నగరంలో మూడు కారిడార్లలోని 65 మెట్రో స్టేషన్ల వద్ద దశలవారీగా ఎలక్ట్రికల్ కార్లను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, మెట్రో జర్నీ చేసే పప్రయాణికులు తక్కువ ఖర్చుతో గమ్యస్థానానికి చేరుకోవచ్చన్నారు. ప్రస్తుతం మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద 25 ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి తెచ్చామన్నారు. అందుబాటులోకి ‘బయో టాయిలెట్స్’.. మియాపూర్ మెట్రోస్టేషన్ వద్ద నేచర్ సని ఆర్గనైజేషన్ సంస్థ ఏర్పాటు చేసిన బయో టాయిలెట్లను హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి ప్రారంభించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఈ మరుగుదొడ్లలో నీరు అవసరం లేకుండానే పరిశుభ్రంగా ఉంటాయన్నారు. వీటి ఏర్పాటులో వినియోగించే సాంకేతిక పరిజ్ఞానంతో మూత్రాన్ని శుద్ధిచేసి.. ఆనీటిని మొక్కల పెంపకానికి వినియోగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ డీవీఎస్ రాజు, అనిల్‌కుమార్ షైనీ, జూమ్ కార్ సీఈఓ సురేందర్‌రాజు తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రిక్ కార్లు వినియోగించండిలా.. ఎలక్ట్రికల్ కారును వినియోగించాలనుకునే ప్రయాణికులు మొదటగా ‘జూమ్ యాప్’లో అందులో డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకు ఖాతా వివరాలను ఆప్‌లోడ్ చేయాలి. అనంతరం యాప్ ద్వారా కారు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మెట్రో స్టేషన్ల సమీపంలో ఉండే ఈ కారు వద్దకు వెళ్లి కారు డోరుకు ఉన్న బటన్ ప్రెస్ చేస్తే డోర్ తెరుచుకుంటుంది. కారులో ఉన్న తాళం చెవితో స్టార్ట్ చేసుకొని డ్రైవ్ చేసుకుంటూ గమ్యస్థానానికి వెళ్లవచ్చు. గమ్యానికి చేరుకున్న తరువాత కారు కీని అందులోనే ఉంచి మరల డోర్‌కు ఉన్న బటన్ ప్రెస్ చేస్తే కారు లాక్ అయిపోతుంది. ఎలక్ట్రిక్ కార్ల అద్దె ఇలా.. ఈ కారుకు అటోమెటిక్ గేర్, సెల్ఫ్ డ్రైవింగ్ సౌకర్యం ఉంటుంది. గంటకు రూ.40 చొప్పున అద్దెగా నిర్ణయించారు. లేదా నెలకు రూ.10 వేలు చెల్లించి కారును వినియోగించుకోవచ్చు. ఇలా కాకుండా ప్రతీ కిలోమీటరుకు అద్దె చెల్లిస్తూ వాడినట్లయితే ప్రతి కి.మీ.కి రూ.8.50 చార్జీ చెల్లించాలి. నెల వారీగా అద్దెకు తీసుకునే వారు ఇంట్లో కూడా చార్జింగ్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. 8 గంటలు చార్జింగ్ చేస్తే 120 కిలో మీటర్లు ప్రయాణించవచ్చు. మెట్రో స్టేషన్లో ఏర్పాటు చేసిన ‘స్పీడ్ చార్జర్’తో 90 నిమిషాల్లో 90 శాతం చార్జింగ్ పూర్తవడం ఈ కారు ప్రత్యేకత. శంషాబాద్ ఎయిర్పోర్ట్, గచ్చిబౌలి, మాదాపూర్, జీవీకే మాల్, పరేడ్ గ్రౌండ్, కొత్తపేట్, మియాపూర్ ప్రాంతాల్లో ఈ ఎలక్ట్రిక్ కారు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జూమ్‌కార్స్ నిర్వాహకులు తెలిపారు. -
మెట్రోరైల్ ప్రయాణీకుల కోసం ఎలక్ట్రిక్ కార్లు
-
జూలైలో ఎల్బీనగర్–అమీర్‌పేట్ మెట్రో
సాక్షి, హైదరాబాద్: జూలై చివరివారంలో ఎల్బీ నగర్– అమీర్‌పేట్(16 కి.మీ) మార్గంలో మెట్రో రైళ్లు పరుగులు తీస్తాయని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవం చేస్తా రని తెలిపారు. బుధవారం ఈ మార్గం మెట్రోరైలులో ప్రయాణించి ట్రయల్‌రన్‌ను పరిశీలించా రు. లక్డీకాపూల్, ఎంజీబీఎస్, ఎల్బీనగర్ మెట్రోస్టేషన్లు, పరిసరాల అభివృద్ధి పనులను మంత్రి తనిఖీ చేశారు. అక్టోబర్‌లో హైటెక్ సిటీ–అమీర్‌పేట్ మార్గంలో మెట్రోరైళ్లు పరుగులు తీస్తాయని చెప్పారు. ఎల్బీనగర్ మెట్రోస్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోని 3 మెట్రో కారిడార్లను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానించేలా మెట్రో రెండోదశ ప్రాజెక్టును చేపడతామన్నారు. గచ్చిబౌలి–శంషా బాద్ విమానాశ్రయం, ఎల్బీనగర్–నాగోలు, ఎల్బీనగర్–ఫలక్‌నుమా–శంషాబాద్ విమానా శ్రయ మార్గాల్లో మెట్రోప్రాజెక్టుల సమగ్ర ప్రాజె క్టు నివేదిక ఆగస్టులో సిద్ధమవుతుందన్నారు. కేటీఆర్ వెంట మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ మల్లా రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి మెట్రోలో ప్రయాణించారు. 15 రోజుల్లో టెండర్లు.. మెట్రోస్టేషన్ల వద్ద పార్కింగ్ కష్టాలను తీర్చేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో 3 మెట్రో కారిడార్లతోపాటు అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద 42 మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. ఈ పార్కింగ్ కేంద్రాల నిర్మా ణానికి 15 రోజుల్లో టెండర్లు పిలవనున్నామని తెలిపారు. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్స్టేషన్లు, సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లను మెట్రో ప్రాజెక్టుకు అనుసంధానిస్తామని చెప్పారు. అమీర్‌పేట్–ఎల్బీనగర్ రూట్ మెట్రో ప్రారంభమైతే 46 కిలోమీటర్ల మేర మెట్రో ప్రజలకు అందుబాటులోకి రానుందన్నారు. మెట్రో రెండోదశ మార్గాలివే ... మెట్రో రెండోదశ ప్రాజెక్టులో ప్రధానంగా నాగోల్–ఎల్బీనగర్, గచ్చిబౌలి–శంషాబాద్, ఎల్బీనగర్–ఫలక్‌నుమా–శంషాబాద్ విమానాశ్రయ మార్గాల్లో మెట్రో ప్రాజెక్టును విడతలవారీగా చేపడతామని కేటీఆర్ తెలిపారు. నగరంలో కాలుష్య ఉద్గారాలను తగ్గించడానికి జీహెచ్ఎంసీ, హెచ్ఎంఆర్, సెట్విన్‌ల సౌజన్యంతో 500 ఎలక్ట్రిక్ బస్సులను త్వరలో ప్రవేశపెడతామని కేటీఆర్ చెప్పారు. మియాపూర్ మెట్రో డిపోలో ప్రయోగాత్మకంగా ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్లు, డిపోలు, మెట్రోస్టేషన్లు, అందుబాటులో ఉన్న ప్రభుత్వస్థలాల్లో ఎలక్ట్రిక్ బస్సులు, వాహనాల చార్జింగ్ కేంద్రాలను నెలకొల్పుతామని చెప్పారు. నాంపల్లి– రంగమహల్ మార్గంలో.. నాంపల్లి–రంగమహల్ మెట్రో మార్గంలో మొజం జాహీ మార్కెట్‌సహా పలు చారిత్రక కట్టడాలు, నగర వారసత్వ సంపద కనిపించేలా పలు అభివృద్ధి పనులు చేపడతామని మంత్రి తెలిపారు. మియాపూర్ మెట్రో డిపో తరహాలోనే ఎల్బీనగర్ ప్రాంత మెట్రోస్టేషన్ల పరిసరాల్లో ప్రజోపయోగ స్థలాలు, తీరైన పార్కింగ్, స్ట్రీట్ ఫర్నిచర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిర్మాణ సంస్థకు నిధుల కటకట? నాగోల్–హైటెక్‌సిటీ, ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్ రూట్లో మెట్రో ప్రాజెక్టు నిర్మాణవ్యయం ప్రస్తుతం అనుకున్న రూ.14 వేల కోట్లకు అదనంగా మరో రూ.3500 కోట్లు పెరిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆస్తుల సేకరణ ప్రక్రియ జఠిలంగా మారడం, అలైన్మెంట్ తకరారు వంటి కారణాలతో నిర్మాణ సమయం కూడా పెరిగిన నేపథ్యంలో వ్యయం అనూహ్యంగా పెరిగినట్లు సమాచారం. పెరిగిన వ్యయాన్ని తమకు చెల్లించాలని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ప్రభుత్వానికి పలుమార్లు నివేదించినా సర్కారు నుంచి స్పందన లేదని తెలిసింది. నిర్మాణవ్యయం పెరగడంతో నిధులసేకరణ కష్టంగా మారినట్లు సమాచారం. వెయ్యి ఆస్తుల సేకరణ, పరిహారం చెల్లింపు వంటి అంశాలు జఠిలంగా మారడంతో పాతనగరంలో మెట్రోరైళ్లు పరుగుల తీయడం మరింత ఆలస్యమవుతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. -
జూలైలో ఎల్బీనగర్-అమీర్‌పేట మెట్రో రైలు పరుగులు
-
మెట్రో కోచ్‌ల తయారీలోకి భెల్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కంపెనీ భెల్ మెట్రో రైలు కోచ్‌ల తయారీరంగంలోకి ప్రవేశించనున్నదని కేంద్ర మంత్రి అనంత్ గీతే తెలిపారు. భారత్‌లో నాలుగు విదేశీ కంపెనీలతో కలిసి లిథియమ్–ఆయాన్ బ్యాటరీలను తయారు చేసే సాధ్యాసాధ్యాలపై ఈ కంపెనీ కసరత్తు చేస్తోందని ఆయన వివరించారు. ప్రజా రవాణాకు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడానికి ఉద్దేశించిన ఫేమ్ ఇండియా రెండో దశ సెప్టెంబర్ తర్వాత ప్రారంభమవుతుందని ఒక పత్రికా సమావేశంలో ఆయన చెప్పారు. ఫేమ్ రెండో దశ అమలు కోసం రూ.9,300 కోట్లు కేటాయించాలని బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయని, దీంట్లో రూ.1,000 కోట్లు ఛార్జింగ్ సదుపాయాల కోసం వెచ్చించనున్నట్లు తెలిపారు. లిథియమ్ అయాన్ జేవీలో 20% వాటా భెల్‌కు, మిగిలిన 80%వాటా ఆ నాలుగు కంపెనీలకు ఉంటాయని తెలిపారు. -
నాలిక కరుచుకున్న డిగ్గీ రాజా
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పప్పులో కాలేశారు. పాత ఫోటో ఒకదానిని సోషల్ మీడియాలో ట్వీట్ చేసి ట్రోలింగ్‌ను ఎదుర్కున్నారు. పాత ఫోటోకు, అసలు ఫోటోకు ఆ మాత్రం తేడా తెలీదా అంటూ కొందరు ఆయన పరువు తీసేస్తున్నారు. విషయం ఏంటంటే భోపాల్ రైల్వే బ్రిడ్జి ఫోటో పరిస్థితి అంటూ డిగ్గీ రాజా శనివారం ఓ ట్వీట్ చేశారు. ‘పౌరుల భద్రత కోసం బీజేపీ తెగ శ్రమిస్తున్నట్లు చెబుతోంది. కానీ, ఇది పరిస్థితి. వారణాసిలో 18 మంది మృతి చెందిన ఘటన వాళ్లకు గుర్తుండే ఉంటుంది’ అంటూ సందేశం ఉంచారు. అయితే అది గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన పాక్ మెట్రో పిల్లర్(విరిగిపోయిన) ఫోటో. ఫేక్ న్యూస్‌లపై అసలు గుట్టును విప్పే ఓ ప్రముఖ పత్రిక దిగ్విజయ్ ట్వీట్‌ను ప్రస్తావిస్తూ కథనం ప్రచురించింది. దిగ్విజయ్ క్షమాపణలు.. ఆ కథనం చూసిన దిగ్విజయ్ సింగ్ తన తప్పు ఒప్పుకున్నారు. ‘తప్పు నాదే. క్షమించండి. నా స్నేహితుడొకరు ఆ ఫోటోను నాకు పంపారు. దానిని పరీశించకుండా నేను పోస్ట్ చేశా’ అంటూ ఆయన రీట్వీట్ చేశారు. यह है सुभाष नगर रेल्वे फाटक भोपाल पर बन रहे रेल्वे ओवर ब्रिज का एक पोल,जिसमें आ गई दरारे/क्रैक इसकी गुणवत्ता पर सवाल उठाती हैं,अभी तो पुल भी नही बना ।एक भाजपा नेता के मार्ग दर्शन निर्माण में हो रहा है ,फिर यह सब क्यों और कैसे ? वाराणसी की दुर्घटना यहॉं भी ना हो जाये। pic.twitter.com/oycXREebp0 — digvijaya singh (@digvijaya_28) 10 June 2018 గతంలోనూ ఇదే ఫోటో... అన్నట్లు రెండేళ్ల క్రితం తెలంగాణలో ఇదే ఫోటో హాట్ టాపిక్‌గా మారింది. వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ఫోటో విపరీతంగా చక్కర్లు కొట్టింది. ‘హైదరాబాద్ మెట్రో పిల్లర్ ప్రమాదకరంగా ఉందంటూ... ఫోటో వైరల్ కాగా, స్వయానా తెలంగాణ మంత్రి కేటీఆర్ అది ఫేక్ అని, రావల్పిండి(పాక్) ఫోటో అంటూ స్పష్టత ఇచ్చేశారు. This is not in Hyderabad neither in Metro nor in PVNR. Actually it's in Rawalpindi, Pakistanhttps://t.co/q8wilsOq0T https://t.co/WKGrXmn8rf — KTR (@KTRTRS) 3 August 2016 సోషల్ మీడియాలో గతంలో ఇలాంటి ఉదంతాలే చాలానే వెలుగు చూశాయి. దిగ్గజ నటి షబానా అజ్మీ ఓ వీడియోను పోస్ట్ చేస్తూ.. మన రైల్వే శాఖ మురికి నీటిలో పాత్రలను శుభ్రం చేస్తోందంటూ ఓ సందేశం ఉంచారు. అయితే ఈ వీడియోపై విచారణ చేపట్టిన రైల్వే శాఖ అది మలేషియాలోది అని తేల్చగా.. చివరకు ఆమె క్షమాపణలు చెప్పారు. -
ఆగస్టులో అమీర్‌పేట్–ఎంజీబీఎస్ మెట్రో
సాక్షి,సిటీబ్యూరో : అమీర్‌పేట్–ఎంజీబీఎస్ మార్గంలో మెట్రో రైళ్ల ట్రయల్‌రన్‌కు మార్గం సుగమమైంది. ఈ మార్గంలో మెట్రో ట్రాక్ విద్యుదీకరణ ప్రక్రియ, సెక్షన్ ఓవర్‌హెడ్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టం(ఓఈటీఎస్)ను గురువారం కేంద్ర ప్రభుత్వ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ డీవీఎస్ రాజు తనిఖీచేసి సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ ట్రాక్షన్ సిస్టంకు అవసరమైన విద్యుత్ ఎంజీబీఎస్, మియాపూర్‌లలో నిర్మించిన 132 కెవి/25 కెవి రిసీవింగ్ సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్‌ను అందుకుంటుంది. ఈ ఆర్ఎస్ఎస్కు ఇన్కమింగ్ సరఫరా టీఎస్ ట్రాన్స్‌కోకు చెందిన 220 కెవి/132 కెవి మెయిన్ సబ్‌స్టేషన్ నుంచి సరఫరా అవుతుందని మెట్రో అధికారులు తెలిపారు. కాగా ఈ ప్రక్రియ పూర్తికావడంతో ఈ మార్గంలో మెట్రో రైళ్లకు 18 రకాల సాంకేతిక పరీక్షలను నిర్వహించేందుకు మార్గం సుగమమౌతోందని తెలిపారు. ఆగస్టులో ఎల్బీనగర్–అమీర్‌పేట్ రూట్లో మెట్రో పరుగులు.. ఈ ఏడాది ఆగస్టునెలలో ఎల్బీనగర్–అమీర్పేట్మార్గంలో మెట్రో రైళ్లు ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది. జూలై నెలలో ఈ మార్గంలో ట్రయల్‌రన్ ప్రక్రియను పూర్తిచేసేందుకు మెట్రో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ప్రారంభతేదీని మాత్రం ప్రభు త్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక అమీర్‌పేట్–హైటెక్‌సిటీమార్గంలో అక్టోబరులో,ఎంజీబీఎస్–జేబీఎస్మార్గంలో ఈ ఏడాది డిసెంబరు నాటికి మెట్రో రైళ్లు గ్రేటర్ సిటీజన్లకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మెట్రో అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. -
ఆగస్టులో అమీర్‌పేట్–ఎంజీబీఎస్ మెట్రో పరుగులు!
సాక్షి,సిటీబ్యూరో : అమీర్‌పేట్–ఎంజీబీఎస్ మార్గంలో మెట్రో రైళ్ల ట్రయల్‌రన్‌కు మార్గం సుగమమైంది. ఈ మార్గంలో మెట్రో ట్రాక్ విద్యుదీకరణ ప్రక్రియ, సెక్షన్ ఓవర్‌హెడ్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టం(ఓఈటీఎస్)ను గురువారం కేంద్ర ప్రభుత్వ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ డీవీఎస్ రాజు తనిఖీచేసి సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ ట్రాక్షన్ సిస్టంకు అవసరమైన విద్యుత్ ఎంజీబీఎస్, మియాపూర్‌లలో నిర్మించిన 132 కెవి/25 కెవి రిసీవింగ్ సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్‌ను అందుకుంటుంది. ఈ ఆర్ఎస్ఎస్కు ఇన్కమింగ్ సరఫరా టీఎస్ ట్రాన్స్‌కోకు చెందిన 220 కెవి/132 కెవి మెయిన్ సబ్‌స్టేషన్ నుంచి సరఫరా అవుతుందని మెట్రో అధికారులు తెలిపారు. ఆగస్టులో పరుగులు.. ఈ ఏడాది ఆగస్టునెలలో ఎల్బీనగర్–అమీర్పేట్మార్గంలో మెట్రో రైళ్లు ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది. జూలై నెలలో ఈ మార్గంలో ట్రయల్‌రన్ ప్రక్రియను పూర్తిచేసేందుకు మెట్రో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ప్రారంభతేదీని మాత్రం ప్రభు త్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక అమీర్‌పేట్–హైటెక్‌సిటీమార్గంలో అక్టోబరులో,ఎంజీబీఎస్–జేబీఎస్మార్గంలో ఈ ఏడాది డిసెంబరు నాటికి మెట్రో రైళ్లు గ్రేటర్ సిటీజన్లకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మెట్రో అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. -
మెట్రో ప్రయాణికులకు శుభవార్త
సాక్షి,సిటీబ్యూరో : మెట్రోస్టేషన్ల నుంచి గమ్యస్థానాలకు చేరుకునే ప్రయాణికులకు స్మార్ట్‌జర్నీని సాకారం చేసేందుకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ, ఎల్అండ్టీ సంస్థలు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. స్టేషన్ యాక్సెస్ అండ్ మొబిలిటీ(ఎస్‌టీఏఎంపీ) కార్యక్రమాన్ని ఈనెల 9న ప్రారంభించనుంది. ఈ కార్యక్రమానికి వరల్డ్ రిసోర్స్ ఇన్సిట్యూట్, టయోటామొబిలిటీ ఫౌండేషన్లు సహకరిస్తున్నట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా మెట్రో స్టేషన్లకు వచ్చే ప్రయాణీకులు చివరి గమ్యస్థానం చేరుకునేందుకు అవసరమైన ఎలక్ట్రికల్ వాహనాలను అందుబాటులో ఉంచే అంశంపై ఔత్సాహిక అంకుర పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలతో ఈ సదస్సులో చర్చించడంతోపాటు వారికి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ సదస్సు ద్వారా నగరంలో మెరుగైన ప్రజారవాణా వ్యవస్థను ఏర్పాటుచేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. ప్రధానంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు వెళ్లేవారికి మెట్రో జర్నీని సులభతరం చేయడం,స్టేషన్లకు చేరుకోవడం, తిరిగి వారి ఇళ్లకు చేరుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈనెల 9న జరిగే ఈ సదస్సుకు ‘ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ టు ఎన్‌హ్యాన్స్ అర్బన్‌మొబిలిటీ’ పే రుతో నిర్వహిస్తున్నామని కార్యక్రమానికి ము ఖ్య అతిథిగా మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్ హాజరుకానున్నట్లు తెలిపారు. -
హరిత హరివిల్లు.. నగరంలో నిల్లు!
సాక్షి, హైదరాబాద్ : తోటల నగరంగా ప్రసిద్ధి చెందిన భాగ్యనగరంలో హరిత హననం జరుగుతోంది. శరవేగంగా విస్తరిస్తున్న రహదారులు, బహుళ అంతస్తుల భవంతులు, ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న వాణిజ్య సముదాయాలతో విశ్వనగరి కాంక్రీట్ మహారణ్యంలా మారుతోంది. కాంక్రీట్ విస్తరణకు అనుగుణంగా గ్రీన్‌బెల్ట్ పెరగకపోవడంతో మోటారు వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న కార్బన్డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి ఉద్గారాలతో వాతావరణం త్వరగా వేడెక్కు తోంది. దీంతో స్వచ్ఛ ఆక్సిజన్‌ను.. స్వేచ్ఛగా పీల్చే పరిస్థితి ఉండటం లేదు. ప్రాణవాయువు అందక నగరవాసులు ఇప్పటికే ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30 శాతం గ్రీన్‌బెల్ట్ (హరిత వాతావ రణం) ఉండాల్సి ఉండగా.. కేవలం 8 శాతమే ఉండటం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. ఓ వృక్షం.. 260 పౌండ్ల ఆక్సిజన్ ఒక భారీ వృక్షం ఏటా 260 పౌండ్ల (సుమారు 118 కిలోలు) ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను పీల్చుకోవాలంటే నలుగురు సభ్యులున్న ఓ కుటుంబానికి ఇలాంటి నాలుగు వృక్షాల చొప్పున అందుబాటులో ఉండాల్సిందే. కానీ గ్రేటర్ హైదరాబాద్‌లో ఆ పరిస్థితి లేదు. మహా నగరంలో ఒక్కో కుటుంబానికి సరాసరిన రెండు చెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితి కారణంగానే నగరవాసులు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందక ఉక్కిరిబిక్కిరయ్యే దుస్థితి తలెత్తింది. ప్రతివ్యక్తికి తలసరిగా అవసరమైన హరిత శాతం (పర్‌హెడ్ ట్రీ కవర్) జాతీయ స్థాయి సగటు కంటే తక్కువగా భాగ్యనగరంలో ఉండటం కూడా ఆందోళన కలిగిస్తోంది. జాతీయ సగటు ప్రకారం ప్రతివ్యక్తి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునేందుకు, స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను గ్రహించేందుకు 10 మీటర్ల హరిత వాతావరణం అవసరం కాగా.. నగరంలో కేవలం 2.6 మీటర్ల హరితం మాత్రమే అందుబాటులో ఉంది. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ఏడో స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. జాతీయ స్థాయి సగటు కంటే అధిక హరిత శాతంతో చండీగఢ్ ముందుంది. 12 మీటర్ల తలసరి హరితంతో తొలిస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో నిలిచిన ఢిల్లీలో 10.2 మీటర్ల హరితం ఉంది. బెంగళూరులో 10 మీటర్లు, కోల్‌కతాలో 8 మీటర్లు, ముంబైలో 7 మీటర్లు, చెన్నై 6 మీటర్లు, హైదరాబాద్‌లో 2.6 మీటర్లు మాత్రమే ఉంది. పలు మెట్రో నగరాల్లో గ్రీన్‌బెల్ట్ శాతం ఇలా హైదరాబాద్‌లో 8 శాతమే గ్రేటర్ హైదరాబాద్ నగరం 1.54 లక్షల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో 30 శాతం గ్రీన్‌బెల్ట్ ఉండాలి. కానీ నగరంలో 8 శాతం మాత్రమే ఉంది. సుమారు 12,320 ఎకరాల్లో హరిత వాతావరణం (గ్రీన్‌బెల్ట్) అందుబాటులో ఉంది. దీన్ని కనీసం 24,710 ఎకరాలకు పెంచాల్సి ఉంది. అంటే నగర విస్తీర్ణంలో హరితం శాతం కనీసం 16 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. దేశంలో 35 శాతం గ్రీన్‌బెల్ట్‌తో చండీగఢ్ తొలిస్థానంలో నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీలో 20.2 శాతం, గ్రీన్ సిటీగా పేరొందిన బెంగళూరులో 19 శాతం, కోల్‌కతాలో 15 శాతం, ముంబైలో 10 శాతం, చెన్నైలో 9.5 శాతం గ్రీన్‌బెల్ట్ ఉన్నట్లు పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. హైదరాబాద్‌లో హరితం 8 శాతానికే పరిమితమైంది. ఇలా చేస్తే మేలు.. నగరంలోని ప్రధాన రహదారులు, 185 చెరువుల చుట్టూ పెద్దమొత్తంలో మొక్కలు నాటాలి. తద్వారా భూగర్భ జల మట్టాలు పెరుగుతాయి. పర్యావరణ కాలుష్యం కూడా బాగా తగ్గుతుంది. విశాల ప్రాంగణాల్లో బహుళ అంతస్తుల భవంతులు నిర్మిస్తున్న వారు విధిగా కొంత విస్తీర్ణంలో మొక్కలు పెంచుతామని, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తామని డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే వారికి జీహెచ్ఎంసీ భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలి. నూతనంగా ఏర్పడిన కాలనీల్లో 30 శాతం గ్రీన్‌బెల్ట్ ఉండేలా చూడాలి. నూతన లే అవుట్లకు అనుమతులిచ్చే సమయంలో ఈ విషయాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. జల వనరులకూ శాపం మహా నగరంలో చెరువులు, కుంటలకు పట్టణీకరణ శాపంగా పరిణమిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల ఉన్న సుమారు 3,500 చెరువులు, కుంటల విస్తీర్ణం గణనీయంగా తగ్గుతోంది. ఆయా భూములు కబ్జాకు గురవడం, విల్లాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, బహుళ అంతస్తుల భవంతులు వెలియడంతో జలాశయాలు రోజురోజుకూ చిన్నబోతున్నాయి. పర్యావరణ సంస్థ నీరి (ఎన్ఈఈఆర్ఐ) 2005–2018 మధ్యకాలాన్ని పరిగణనలోకి తీసుకొని తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెలుగుచూసింది. ఔటర్‌కు లోపల చిన్న, పెద్ద చెరువులు, కుంటల సంఖ్య 3,500 వరకు ఉంది. వీటి విస్తీర్ణం 2005లో సుమారు 30,978 ఎకరాలుగా ఉండేది. తర్వాత రియల్ రంగం పురోగమించడం, పొరుగు రాష్ట్రాలు, దేశాల నుంచి ఉద్యోగాలు, వ్యాపారాల కోసం వలసలు అధికమవడంతో శివార్లలో పరిస్థితి మారింది. ఇదే క్రమంలో అక్రమార్కుల కన్ను విలువైన జలాశయాలపై పడింది. జీవో 111 పరిధిలో ఉన్న గ్రామాల్లో చెరువులు, కుంటల్లో నిబంధనలకు విరుద్ధంగా విల్లాలు, రియల్ వెంచర్లు, వాణిజ్య స్థలాలు, బహుళ అంతస్థుల భవంతులు వెలిశాయి. ఒకప్పుడు పచ్చటి పంట పొలాలు, నిండు కుండలను తలపించే చెరువులు, కుంటలతో కళకళలాడిన ప్రాంతాలు ఇప్పుడు కాంక్రీట్ మహారణ్యంగా దర్శనమిస్తున్నాయి. 30,978 ఎకరాలుగా ఉన్న చెరువులు, కుంటల విస్తీర్ణం.. 5,641 ఎకరాలకు చేరింది. గత 13 ఏళ్ల కాలంలో సుమారు 80 శాతం తగ్గిపోయింది. ఇందుకు పట్టణీకరణ ప్రభావం ఒక కారణమైతే, రెవెన్యూ, పంచాయతీరాజ్, చిన్న నీటిపారుదల శాఖల నిర్లక్ష్యం మరో కారణంగా ఉందని పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు. ఇళ్లలో నాటే మొక్కలతో గ్రీన్‌బెల్ట్ పెరగదు: జీవానందరెడ్డి, పర్యావరణ వేత్త ప్రభుత్వం ప్రారంభించిన మూడో విడత హరితహారంలో నాటిన మొక్కల్లో 95 శాతం ఇళ్లలో పెంచుతున్నవే ఉన్నాయి. వీటితో నగరంలో గ్రీన్‌బెల్ట్ పెరిగే అవకాశం లేదు. దీర్ఘకాలం మన్నికగలవి, ఆక్సిజన్ అందించేవి, కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించే వేప, రావి, మర్రి, మద్ది, చింత వంటి సంప్రదాయ చెట్లను పెద్దమొత్తంలో నాటితేనే గ్రీన్‌బెల్ట్ పెరుగుతుంది. అలా ఆక్సిజన్ శాతం పెరిగి నగరవాసులకు కాలుష్యం నుంచి విముక్తి లభిస్తుంది. సర్కారు హరితహారంతో వల్ల నర్సరీల నిర్వాహకులకే లాభం చేకూరింది. -
ఫ్లెక్సీ గండంతో ఆగిన మెట్రో రైలు
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైళ్లకు హోర్డింగులు, వాటిపై ఏర్పాటుచేసిన వాణిజ్య ప్రకటనల ఫ్లెక్సీలు గండంలా పరిణమిస్తున్నాయి. తాజాగా గురువారం జేఎన్టీయూ వద్ద ఓ హోర్డింగ్‌కు ఉన్న ఫ్లెక్సీ చిరిగి మెట్రో రూట్లోని ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలపై పడింది. దీంతో సాయంత్రం 5.35 నుంచి 6.05 వరకు మెట్రో రైలును నిలిపివేశారు. ఘటనపై హైదరాబాద్ మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి స్పందిస్తూ.. ఓ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన ఫ్లెక్సీ మెట్రో ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలపై పడటంతోనే రైలును 20 నిమిషాల పాటు నిలపాల్సి వచ్చిందన్నారు. ఈ ఘటనతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేశారు. కాగా నగర మెట్రో రైళ్లు ఆధునిక సాంకేతికతతో దూసుకెళ్తాయని గతంలో అధికారులు చెప్పినప్పటికీ.. ఎంఎంటీఎస్ తరహాలోనే రైళ్లను తరచూ నిలపాల్సి రావడం పట్ల ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఖైరతాబాద్‌లో రైలు పట్టాలపైనున్న ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలపై ఓ ఫ్లెక్సీ చిరిగిపడటంతో ఎంఎంటీఎస్ రైలును గంటపాటు నిలిపివేసిన విషయం తెలిసిందే. గతంలో నాగోల్– అమీర్‌పేట్ మార్గంలో రెండుసార్లు ఇలానే ఫ్లెక్సీలు చిరిగి పడటంతో మెట్రో రైళ్లను అరగంటపాటు నిలిపివేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే.. ప్రస్తుతం నాగోల్– అమీర్‌పేట్, మియాపూర్– అమీర్‌పేట్ మార్గంలో 18 మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటికి ఆనుకొని పలు హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఉన్నాయి. వీటిని తొలగించే విషయంలో జీహెచ్ఎంసీ, మెట్రో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతోనే తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. మరోవైపు ఈ ఏడాది ఆగస్టులో ఎల్బీనగర్– అమీర్‌పేట్, అక్టోబర్‌లో అమీర్‌పేట్– హైటెక్‌సిటీ మార్గంలోనూ మెట్రో రైళ్లు పరుగులు తీయనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా మార్గాల్లో మెట్రో మార్గానికి ఆనుకొని ఉన్న భారీ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను తక్షణం తొలగించాలని నిపుణులు, ప్రయాణికులు కోరుతున్నారు. -
చిరిగిన ప్లెక్సీ..ఆగిన మెట్రో
సాక్షి, హైదరాబాద్: నగరంలో గురువారం సాయంత్రం పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షం పడింది. దీంతో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కూకట్ పల్లి మెట్రో స్టేషన్ వద్ద గాలి దుమారానికి ప్లెక్సీలు చిరిగి పట్టాలపై పడడంతో మెట్రో ట్రైన్ అరగంట పాటు ఆగాల్సి వచ్చింది. అమీర్‌పేట నుంచి మియాపూర్ వెళ్లే మార్గంలో హోర్డింగ్ ప్లెక్సీ ఊడిపోయి వచ్చి మెట్రో విద్యుత్ తీగలపై పడింది. వెంటనే స్పందించిన మెట్రో సిబ్బంది ట్రైన్‌ను అరగంట వరకు నిలుపుదల చేశారు. అనంతరం మెట్రో సిబ్బంది ప్లైక్సీలను తొలగించి మెట్రో సేవలను పునరుద్దరించారు. -
మెట్రోకే ప్రజల ఓటు
బొమ్మనహళ్లి: నగరంలో ట్రాఫిక్ పద్మవ్యూహాల్లో నలిగిపోతున్న వాహనదారులను, ప్రజలను మెట్రో రైళ్లు జోరుగా ఆకర్షిస్తున్నాయి. ట్రాఫిక్ సిగ్నళ్ల బెడద లేకుండా, గంటలకొద్దీ స్తంభించిపోతున్న ట్రాఫిక్‌కు నివారణగా వచ్చిన మెట్రో రైలు నగరవాసులకు వరదాయిని అనడంలో ఎలాంటి సందేహం లేదు. పది నిమిషాలకో రైలు, నిముషాల్లోనే గమ్యస్థానం చేరుకోవడం లాంటి వెసులుబాట్లు రా రమ్మంటుండడంతో నగరవాసులు మెట్రో రైళ్ల వైపు పరుగులు తీస్తున్నారు. ఇటీవలి కాలంలో కార్లలో ఆఫీసులకు వెళ్లే టాప్ ఎగ్జిక్యూటివ్‌లు సైతం మెట్రో రైళ్లలోనే ప్రయాణానికి మక్కువ చూపుతున్నారు. దీనికి తోడు నైరుతి రుతుపవనాలకు ముందస్తుగా గత రెండు, మూడు వారాలుగా సాయంత్రం పూట పడుతున్న వానల వల్ల కూడా మెట్రో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఇటీవలి వరకు రోజూ మూడు లక్షలా 60 వేల మంది మెట్రో రైళ్లలో ప్రయాణిస్తుంటే, ఇప్పుడా సంఖ్య నాలుగు లక్షలను దాటుతోంది. రద్దీతో తప్పని అవస్థలు ఈ అనూహ్య రద్దీతో, ముఖ్యంగా సాయంత్రం పూట అమ్మాయిలు, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వృద్ధుల సంగతి సరేసరి. రైల్లోకి ఎక్కడం కూడా కష్టమే. ఇక సీట్లు దొరకవు, కనీసం నిలబడడానికి కూడా స్థలం కరువే. వీరంతా రద్దీ తగ్గేంతవరకు ఎదురుచూడాల్సి వస్తోంది. కెంపేగౌడ స్టేషన్లో అయితే వచ్చే, పోయే రైళ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. కెంపేగౌడ స్టేషన్ వచ్చినప్పుడు, మెట్రో రైళ్ల నుంచి దిగే ప్రయాణికులను చూస్తే చీమల దండు గుర్తుకు వస్తుంది. దీని వల్ల టాప్టాప్లు, బ్యాక్‌ప్యాక్‌లతో వచ్చే ప్రయాణికులు నిలబడడానికి చోటు లేక అవస్థలు పడుతుంటారు. తమ కాళ్ల సందుల్లో వాటిని భద్రంగా ఉంచుకుని, తోసుకొచ్చే ప్రయాణికుల నుంచి వాటిని కాపాడుకోవడానికి తంటాలు పడాలి. అదనపు బోగీలు ఎక్కడ? పెరుగుతున్న రద్దీని తట్టుకోవడానికి వీలుగా మార్చి నుంచి రైళ్లకు అదనపు బోగీలను సమకూర్చుతామని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ జనవరిలో హామీ ఇచ్చింది. అయితే ఆ హామీ అమలును జూన్ వరకు వాయిదా వేయడంతో ప్రయాణికులు మరికొన్ని రోజుల పాటు మెట్రో రైళ్లలో కుస్తీలు పడక తప్పేట్లు లేదు. -
ఎక్స్‌ప్రెస్ మెట్రో!
సాక్షి, సిటీబ్యూరో: రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రోడ్డు మార్గంలో చేరుకునేందుకు సుమారు 50 నిమిషాల సమయం పడుతుంది. కానీ మెట్రోరైళ్లలో కేవలం 25 నిమిషాల్లో విమానాశ్రయానికి చేరుకునేందుకు వీలుగా ఎక్స్‌ప్రెస్ మెట్రో కారిడార్‌ను ఏర్పాటు చేసేందుకు నగర మెట్రో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈమేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదికకు మరో పక్షం రోజుల్లో తుదిరూపునిచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంచేశారు. ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ అధికారులు నేరుగా క్షేత్రస్థాయిలోకి దిగి శంషాబాద్–రాయదుర్గం మార్గంలో పర్యటించారు. ఈమేరకు డీపీఆర్‌ను సిద్ధంచేస్తున్నారు. సుమారు రూ.4500 కోట్ల అంచనావ్యయంతో చేపట్టనున్న ఈ మెట్రోకారిడార్ ఏర్పాటుతో గ్రేటర్ సిటీ నుంచి విమానాశ్రయానికి వెళ్లే సిటీజన్లకు ట్రాఫిక్ అవస్థలు తప్పనున్నాయి. ప్రస్తుతం నగరంలో అందుబాటులో ఉన్న మెట్రో కారిడార్లు విమానాశ్రయానికి కనెక్టివిటీ లేకపోవడంతో..తక్షణం విమానాశ్రయానికి మెట్రో మార్గం ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్‌ఆదేశించడంతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీలో వేగం పెరగడం విశేషం. ప్రతి ఐదు కిలోమీటర్లకో స్టేషన్..! విమానాశ్రయమార్గంలో ప్రతీ ఐదు కిలోమీటర్లకు ఓ మెట్రో స్టేషన్‌ను ఏర్పాటుచేయనున్నట్లు తెలిసింది. స్టేషన్లకు అనుసంధానంగా రవాణా ఆధారిత ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేషన్లను ఔటర్‌రింగ్‌రోడ్డుకు సమీపంలోని గచ్చిబౌలి,అప్పాజంక్షన్,కిస్మత్పూర్,గండిగూడా చౌరస్తా,శంషాబాద్ విమానాశ్రయం తదితర ప్రాంతాల్లో ఏర్పాటుకు స్థలపరిశీలన జరుపుతున్నారు. పిల్లర్ల ఏర్పాటుకు వీలుగా సాయిల్టెస్ట్ చేస్తున్నట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. డీపీఆర్ తయారీతో కచ్చితంగా ఎక్కడ స్టేషన్లు నిర్మించాలన్న అంశంపై స్పష్టతరానుందని పేర్కొన్నాయి. పీపీపీ విధానంలో ముందుకొచ్చేదెవరో...? ప్రస్తుతం నాగోల్–రాయదుర్గం,ఎల్భీనగర్–మియాపూర్,జేబీఎస్–ఫలక్‌నుమా మార్గంలో మొదటిదశ మెట్రో ప్రాజెక్టును పీపీపీ విధానంలో చేపట్టారు. మూడు మార్గాల్లో 72 కి.మీ ప్రాజెక్టు పూర్తికి సుమారు రూ.14 వేల కోట్ల అంచనా వ్యయం అవుతుందని తొలుత అంచనావేశారు. కానీ ఆస్తులసేకరణ ఆలస్యం కావడం, అలైన్మెంట్ చిక్కులు, రైట్‌ఆఫ్‌వే సమస్యలకారణంగా మెట్రో అంచనా వ్యయం సుమారు రూ.3 వేల కోట్లు అదనంగా పెరిగినట్లు సమాచారం. ఈనేపథ్యంలో రెండోదశ మెట్రో ప్రాజెక్టును పీపీపీ విధానంలో చేపట్టేందుకు ఏ సంస్థ ముందుకొస్తుందా అన్నది సస్పెన్స్‌గా మారింది. కాగా రాయదుర్గం–శంషాబాద్ ఎక్స్‌ప్రెస్‌మెట్రో కారిడార్ ఏర్పాటుకు స్పెషల్ పర్పస్ వెహికిల్(ప్రత్యేక యంత్రాంగం)ను ప్రభుత్వం ఏర్పాటుచేసిన విషయం విదితమే. -
స్టేషన్ బయట ప్రయాణికులకు ఫ్రీ హగ్స్
కోల్‌కతా : ఇద్దరు దంపతులు మెట్రో రైల్లో కౌగిలించుకున్నారని కొంతమంది తోటి ప్రయాణికులు వారిని చితకబాదిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కేవలం కౌగిలించుకుంటేనే దాడి చేస్తారా అని ప్రశ్నిస్తూ.. దాడికి గురైన దంపతులకు మద్దతుగా కొంతమంది యువత బుధవారం కోల్‌కత్తాలోని దమ్ దమ్ మెట్రో స్టేషన్ బయట ఫ్రీ హగ్స్ పేరిట ప్రయాణికులకు ఆలింగనం చేసుకున్నారు. మెట్రోలో కౌగిలించుకున్నారని దంపతులపై దాడి చేసిన వారిపై నిరసన తెలియజేస్తూ ఈ విధంగా విన్నూత నిరసన చేపట్టారు. కౌగిలింత అనేది తప్పేంకాదని అది ప్రేమానుబంధాలకు ప్రతీక అని నిరసన చేస్తున్న యువత అన్నారు. సామాజిక మాధ్యమాల్లో కూడా దాడి చేసిన వారిపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. ఫ్రీ హగ్ హ్యాష్ ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చదవండి...మెట్రోలో కౌగిలించుకున్నారని.. జంటపై దౌర్జన్యం -
కౌగిలించుకున్నారని.. జంటపై దౌర్జన్యం
కోల్‌కతా : దేశంలో మోరల్ పోలీసింగ్ పేరిట జంటలపై దాడులు కొత్త కాదు. యువతీయువకులు సన్నిహితంగా కనిపించారనే కారణంతో.. దాడి చేసే మూకలు అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటాయి. తాజాగా కోల్‌కతా మెట్రో రైల్లో ఇలాంటి ఘటనే జరిగింది. సోమవారం రాత్రి ఓ జంట కోల్‌కతా మెట్రోలో ప్రయాణించింది. ఈ సందర్భంగా వారు కౌగిలించుకున్నారంటూ.. తోటి ప్రయాణికుల్లోని ఓ మూక దాడికి దిగింది. దమ్‌దమ్ మెట్రో స్టేషన్లో ఆ జంట దిగిన తర్వాత వారితో కొందరు ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. ఎందుకు కౌగిలించుకున్నారంటూ వారు నిలదీయడం.. మాటా-మాటా పెరిగిపోవడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. దీంతో ఆగ్రహానికి లోనైన మూక జంటపై దాడి చేసి.. వారిని చితకబాదింది. ప్రత్యక్ష సాక్షిని ఉటంకిస్తూ ఈ షాకింగ్ ఘటన గురించి ఆనందబజార్ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. స్వేచ్ఛాయుత వాతావరణం, భద్రతకు పేరొందిన కోల్‌కతా నగరంలో ఇలాంటి ఘటన జరగడం తనను షాక్‌కు గురిచేసిందని, కేవలం మెట్రోలో కౌగిలించుకున్నారని జంటపై మూక దాడికి దిగడం బాధించిందని, ఈ నగరం కూడా భద్రమైనది కాదనే భావన కలిగించిందని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. -
రెండు నెలల్లో ఎల్బీనగర్ మెట్రోమార్గం రెడీ!
హైదరాబాద్: ఎల్బీనగర్ చింతలకుంట చెక్ పోస్ట్ వద్ద అండర్ పాస్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అండర్ పాస్‌ను సుమారు రూ.12.70 కోట్లతో నిర్మించారు. నేటి నుంచి అండర్ పాస్ అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎల్బీనగర్ మార్గంలో రెండు నెలల్లో మెట్రో రైలు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. నగరంలోని 52 రద్దీ ప్రాంతాలలో సిగ్నల్ ఫ్రీ జంక్షన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఎస్ఆర్డీపీతో పాటు మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్ఆర్డీపీలో భాగంగా రూ.3 వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. -
మెట్రో ప్రయాణికులకు శుభవార్త
-
ఇంటి ఎంపికలో వంట గదే కీలకం!
మెట్రో నగరాల్లో గృహ కొనుగోలులో వంట గది కీలకంగా మారింది. అందుబాటు ధర, అభివృద్ధి చెందే ప్రాంతం, వసతులు మాత్రమే కాదండోయ్.. ఇంట్లోని వంట గది శైలి కూడా ఆధునికంగా ఉండాలంటున్నారు కొనుగోలు దారులు. అందుకే సాధారణ కిచెన్స్ స్థానంలో ఇప్పుడు ఓపెన్ కిచెన్స్ ట్రెండ్ నడుస్తోంది. లివింగ్, డైనింగ్రూమ్లతో వంట గది కలిసి ఉండటమే దీని ప్రత్యేకత! సాక్షి, హైదరాబాద్ : నగరంలోని నిర్మాణ సంస్థలు 1,000 చ.అ. పైన ఉండే ప్రతి ఫ్లాట్‌లోనూ ఓపెన్ కిచెన్స్ ఏర్పాటుకే ప్రాధాన్యమిస్తున్నాయి. హాలుకు అనుసంధానంగా అడ్డుగా గోడలు లేకుండా ఓపెన్ కిచెన్స్‌ను ఏర్పాటు చేస్తారు. అంటే లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్‌కు కిచెన్ కలిసే ఉంటుందన్నమాట. ముచ్చటిస్తూ వంటలు.. ఓపెన్ కిచెన్స్‌లో సానుకూల, ప్రతికూల రెండు రకాల అంశాలూ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. ♦ వంట చేస్తూనే ఇతర గదుల్లో ఉన్నవారితో, ఇంటికి వచ్చిన అతిథులతో సంభాషించవచ్చు. హాల్లో ఉండే టీవీలోని కార్యక్రమాలనూ వీక్షించొచ్చు. ♦ ఓపెన్ కిచెన్ కాబట్టి శుభ్రంగా ఉంచేందుకు శ్రద్ధ తీసుకుంటారు. ఇంటిని అందంగా అలంకరించే కసరత్తును వంట గది నుంచి మొదలుపెడతారు. ♦ ఘుమఘుమలు ఇల్లంతా పరుచు కుంటాయి. దీంతో కుటుంబ సభ్యుల మూడ్‌ను ఇవి మారుస్తాయి. ♦ ఇంట్లో చిన్నారులు ఉంటే వంట గది నుంచి కూడా వీరిపై పర్యవేక్షణకు వీలుంటుంది. ♦ వంట పాత్రలు బయటికి కన్పిస్తుంటాయి. కాబట్టి ఇది కొందరికి నచ్చదు. ♦ డిష్వాషర్, మిక్సీల శబ్దాలు ఇతర గదుల్లో విన్పించి అసౌకర్యంగా ఉంటుంది. ♦ దూరపు బంధువులు, అంతగా పరిచయం లేనివారు వచ్చినప్పుడు వారి ముందు వంట చేయడం కొంత మందికి అంతగా నప్పదు. సంప్రదాయ వంట గది.. వీటిని పాత రోజుల నుంచి చూస్తున్నవే. వంట గది ప్రత్యేకంగా ఉంటుంది. ఏకాంతంగా వంట చేయాలని కోరుకునే వారు సంప్రదాయ శైలిలో ఉండే వంటిల్లునే ఇష్టపడతారు. ♦ గదికి అన్ని వైపులా గోడలుంటాయి. అరలు ఎక్కువ ఏర్పాటుకు వీలుండటంతో పాత్రలన్నింటిని చక్కగా సర్దేయవచ్చు. ♦ వంటింట్లోని శబ్ధాలు, వాసనలు బయటికి రావు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ♦ చుట్టూ గోడలు ఉండటంతో ఇరుకిరుగ్గా, చీకటిగా ఉంటుంది. ఒకేసారి ఎక్కువ మంది తిరిగేందుకు వీలుండదు. ♦ ఇల్లు డిజైన్ సమయంలోనే ఎలాంటి వంట గది కావాలో నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఒకసారి వంట గదిని నిర్మించేశాక మళ్లీ ఓపెన్ కిచెన్‌లా మార్చాలంటే మరింత ఖర్చు అవుతుంది. -
మెట్రో ప్రయాణికులకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. నగరంలోని మెట్రో రైళ్లు దూకుడు పెంచాయి. మియాపూర్- అమీర్‌పేట్- నాగోల్ మధ్య రద్దీ సమయాల్లో 7 నిమిషాలకో మెట్రో టైన్ నడవనుంది. ఈ విషయాన్ని ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. శనివారం ఉదయం నుంచి రద్దీ సమయాల్లో ప్రతి 7 నిమిషాలకో మెట్రో రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. కొత్త సిగ్నలింగ్ వ్యవస్థకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ(సీఎంఆర్ఎస్) అనుమతి ఇచ్చిందని ఆయన తెలిపారు. ఈ విషయం నగర ప్రయాణికులతో పంచుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్ ట్వీట్ చేశారు. మియాపూర్ - అమీర్‌పేట్ - నాగోల్ మధ్య రేపు ఉదయం 6 గంటల నుంచి రద్దీ సమయాల్లో ప్రతి 7 నిమిషాలకు మెట్రో రైలు, రద్దీ లేని సమయాల్లో ప్రతి 8 నిమిషాలకు ఓ రైలు నడవనుంది. Happy to announce CMRS has cleared the new signalling system & Hyderabad Metro will now run trains every 7 minutes during peak hours & every 8 minutes during non-peak on Miyapur - Ameerpet- Nagole stretches from tomorrow 6 am onwards — KTR (@KTRTRS) April 20, 2018 -
ఉబెర్ ఒప్పందానికి డ్రైవర్ల సెగ
-
మెట్రో రైలు-ఉబెర్ ఒప్పందానికి డ్రైవర్ల సెగ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ సంస్థ ఉబర్‌తో హైదరాబాద్ మెట్రోరైలు అవగాహన ఒప్పందానికి డ్రైవర్ షాక్ తగిలింది. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఉబెర్ డ్రైవర్లు ఆందోళనకు దిగడంతో గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా తమకు జీతాలు పెంచాలంటూ డ్రైవర్లు నినదించారు. అలవెన్సులు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని విమర్శించారు. సుమారు17మంది డ్రైవర్లు డ్యూటీలో ఉండగా ప్రాణాలు కోల్పోతే ఉబెర్ యాజమాన్యం పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో పరిస్తితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో సమావేశం మధ్యలోనుంచే ఉబెర్ సీవోవో బార్నీ హర్ఫర్డ్ నిష్క్రమించారు. మెట్రోరైలు ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా లాస్ట్‌మైల్ కనెక్టివిటీలో భాగంగా ఇప్పటికే ఓలా, తదితర కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న హెచ్‌ఎమ్మార్ గురువారం ఉబెర్‌తో కూడా ఎంఓయూ కుదుర్చుకునే కార్యక్రమాన్ని తలపెట్టింది. అయితే ఉబెర్ సీవోవో మధ్యలోనే లేచి వెళ్లిపోవడంతో దీనికి బ్రేక్ పడిందా లేక ఒప్పందం జరిగిందా అనేది క్లారిటీ రాలేదు. ఈ కార్యక్రమానికి రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి సహా, ఐటీ సెక్రెటరీ జయేశ్‌రంజన్, హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఉబెర్ ఇండియా, సౌత్ ఆఫ్రికా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మధుకన్నన్, ప్రెసిడెంట్ అమిత్‌జైన్ తదితరులు హాజరైనారు. -
సాక్షి మెగా ప్రాపర్టీ షో!
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైలు పరుగులతో హైదరాబాద్ రియల్టీ పట్టాలెక్కేసింది. స్థానిక ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు, ప్రోత్సాహకాలతో కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభాలూ పెరిగాయి. భవిష్యత్తులో ధరలు పెరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం కొనుగోళ్లూ వృద్ధి చెందాయి. ఇలాంటి సానుకూల పరిస్థితుల్లో నగరంలో తక్కువ ధరలో ప్రాపర్టీని సొంతం చేసుకోవటమెలా? అభివృద్ధి చెందే ప్రాంతాల్లో అందుబాటు గృహాలున్నాయా? నివాస, వాణిజ్య, రిటైల్ ప్రాపర్టీల్లో పెట్టుబడులు పెట్టాలంటే ఎలా.. వంటి సవాలక్ష సందేహాలొస్తాయి. వీటన్నింటికీ ఒకే వేదికగా పరిష్కారం చూపించేందుకు మరోసారి నగరవాసుల ముందుకురానుంది ‘సాక్షి మెగా ప్రాపర్టీ షో’! మాదాపూర్‌లోని హైటెక్స్ సమీపంలోని సైబర్ కన్వెన్షన్‌లో మే 19, 20 తేదీల్లో జరగనున్న ఈ ప్రదర్శనలో నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు పాల్గొననున్నాయి. స్టాళ్ల ఏర్పాటుకు ఆసక్తి ఉన్నవాళ్లు 99122 20380, 87902 30124లో సంప్రదించవచ్చు. -
రాహుల్ సెల్ఫీలపై బీజేపీ సెటైర్లు
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బెంగళూర్ మెట్రోలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సెల్ఫీలపై బీజేపీ చురకలు వేసింది. ‘మెట్రో టికెట్ కౌంటర్ వద్ద సెల్ఫీలు తీసుకోవడం...సంపన్నుల బిడ్డలే సామాన్యుల జీవితాలతో ఇలా ఆడుకుంటా’రని కర్ణాటక బీజేపీ ట్వీట్ చేసింది. జనాశీర్వాద్ యాత్రలో భాగంగా రాహుల్ ఆదివారం బెంగళూర్‌లో ప్రచార సభలతో హోరెత్తించారు. బెంగళూర్ మెట్రో స్టేషన్లో ప్రయాణీకులతో ముచ్చటించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పాటు ప్రయాణీకులతో సెల్ఫీలు దిగారు. బీజేపీపాలిత రాష్ట్రాలతో పోలిస్తే కాంగ్రెస్ పాలిత కర్ణాటకకు కేంద్ర ప్రభుత్వం తక్కువ నిధులను కేటాయిస్తోందని ఆరోపించారు. వచ్చే నెలలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్, బీజేపీలు భారీస్ధాయిలో ప్రచారం చేపట్టాయి. -
స్పీడ్ రన్!
హైదరాబాద్ మెట్రో రైల్ వేగం పుంజుకోనుంది. ప్రస్తుతం 30 కేఎంపీహెచ్ (కిలోమీటర్ పర్ అవర్)తో పరుగులు తీస్తోన్న రైలు ఇకపై60 కేఎంపీహెచ్ స్పీడ్ అందుకోనుంది. ఇప్పుడు నాగోల్– అమీర్‌పేట్ మార్గంలో ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు తిరుగుతుండగా దీన్ని8 నిమిషాలకు తగ్గించనున్నారు. మియాపూర్– అమీర్‌పేట్ రూట్లో ప్రతి 8 నిమిషాలకో రైలు పరుగులు పెడుతుండగా ఈ మార్గంలో రైళ్లఫ్రీక్వెన్సీ ఆరు నిమిషాలకు తగ్గించనున్నారు. ఈ రెండు మార్గాల్లో రైళ్ల సంఖ్యను సైతం 16కు పెంచనున్నట్లు సమాచారం. సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుతం నాగోల్–అమీర్‌పేట్(17 కి.మీ.) మార్గంలో మెట్రో రైళ్ల వేగం కనిష్టంగా ఉండడం, కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ నిబంధనలు ప్రతిబంధకంగా మారడంతో ప్రయాణ సమయం 45–50 నిమిషాలు పడుతోంది. అయితే ఫ్రీక్వెన్సీ, వేగం పెరిగితే ప్రయాణ సమయం 25 నిమిషాలకు తగ్గే అవకాశాలున్నట్లు మెట్రో వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రస్తుతం అమీర్‌పేట్–మియాపూర్ (13 కి.మీ) మార్గంలో ప్రయాణానికి 25 నిమిషాల సమయం పడుతోంది. రైళ్ల వేగం, ప్రీక్వెన్సీ పెరిగితే ప్రయాణ సమయం 20 నిమిషాలకు తగ్గుతుంది. దీనికి సంబంధించి కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ వద్ద పెండింగ్‌లో ఉన్న ఫైలుపై ఈ నెలలోనే ఆమోదముద్ర వేసే అవకాశం ఉన్నట్టు మెట్రో రైలు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మెట్రో రైళ్లలో రోజుకు సరాసరి 60 వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. పండగలు, సెలవు దినాల్లో రద్దీ 75 వేల నుంచి లక్ష వరకు ఉంటోంది. జూన్‌లో ఆ రెండు రూట్లలో డౌటే..? అమీర్‌పేట్–హైటెక్‌సిటీ, ఎల్బీనగర్–అమీర్‌పేట్ రూట్లో ఈ ఏడాది జూన్ నాటికి మెట్రో రైళ్లను అందుబాటులోకి తేవాలని మెట్రో వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. కానీ.. స్టేషన్ల నిర్మాణం, ట్రయల్ రన్ వంటి సాంకేతిక కారణాలతో మరో రెండు నెలలు ఆలస్యమయ్యే అవకాశముంది. ఇక జేబీఎస్–ఎంజీబీఎస్ మార్గంలో సుల్తాన్ బజార్లో ఆస్తుల సేకరణ ప్రక్రియ కొలిక్కి రాలేదు. దీంతో ఈ రూట్లో డిసెంబర్ నాటికి మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎంజీబీఎస్–ఫలక్‌నుమా మార్గంలో ఇటీవలే లైన్ క్లియర్ కావడంతో ఈ రూట్లో 2020 నాటికే పాతనగరానికి మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మెట్రో సబ్స్టేషన్లు రెడీ ఎల్బీనగర్–గాంధీభవన్ మార్గంలో మెట్రో స్టేషన్లు, రూటు విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. ఈ మార్గంలో కేంద్ర ప్రభుత్వ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్(సీఈఐజీ) డీవీఎస్‌రాజు గురువారం తనిఖీ చేశారు. ఎల్బీనగర్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, గాంధీభవన్ మెట్రో స్టేషన్లను పరిశీలించారు. విద్యుదీకరణ పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. సిగ్నలింగ్, టెలీకమ్యూనికేషన్, ఆటోమేటిక్ టిక్కెట్ కలెక్షన్ యంత్రాల ఏర్పాటు, ఆయా వ్యవస్థల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ మార్గంలోని మెట్రో స్టేషన్లకు ఎంజీబీఎస్ వద్దనున్న రిసీవింగ్ సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్‌ను సరఫరా చేయనున్నారు. ఈ పనులు పూర్తితో ఎల్బీనగర్–అమీర్‌పేట్ మార్గంలో మెట్రో రైళ్ల రాకపోకలకు సంబంధించిన పనులు తుదిదశకు చేరుకున్నట్లు డీవీఎస్‌రాజు తెలిపారు. ఆయన వెంట పి.శ్రీనివాసమూర్తి, ఆనంద తదితరులు ఉన్నారు. -
ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ సందడి వారం రోజుల్లో మొదలు కానుంది. ఏప్రిల్ 7నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో ఐపీఎల్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్న నేపథ్యంలో ఆ మార్గంలో ప్రస్తుతం నడుస్తున్న మెట్రో రైళ్లను అర్థరాత్రి 12.30 గంటల వరకూ పొడిగిస్తున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. ఏప్రిల్‌తో పాటు మే నెలలో కూడా ఈ పొడిగింపు కొనసాగనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ మార్గంలో మెట్రో రైళ్లను రాత్రి 10.00 గంటల వరకే నడుపుతున్నారు. గతంలో ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు చూడటానికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఇపుడు మెట్రో అధికారుల నిర్ణయంతో ఐపీఎల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.. అభిమానుల కోసం.. ఐపీఎల్ అభిమానుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ పొడిగింపుకు సంబంధించి సీబీటీసీ అనుమతి కోరగా, వారి నుంచి క్లియరెన్స్ వచ్చిందన్నారు. అమీర్‌పేట నాగోల్ మార్గంలో ప్రతి 15 నిమిషాలకు ఓ రైలు... అమీర్‌పేట మియాపూర్ మార్గంలో 8 నిమిషాలకు రైలు నడుస్తుందన్నారు. -
మెట్రోలో కేసీఆర్ అవినీతి పై విచారణ జరపాలి..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఆస్తులు పెంచుకోవడానికి తెలంగాణ రాలేదన్నారు. గతంలో మెట్రో ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందని అప్పటి ప్రభుత్వంపై విమర్శలు చేసింది, సుల్తాన్ బజార్లో డిజైన్ మార్చాలన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. పురాతన సంపద పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక పాత డిజైన్‌కే కేసీఆర్ ఎందుకు ఓకే చెప్పారో సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వ వాటాను అమ్మేందుకు కుట్ర ‘హైటెక్స్‌లో 52 ఎకరాలు, డెలాయిట్ బిల్డింగ్, విజయవాడలో ఎయిర్పోర్ట్ ముందు 31 ఎకరాలు, వైజాగ్‌లో 2 ఎకరాల భూములను, హైటెక్స్ బిల్డింగ్‌లో 15 వేల స్వ్కేర్ ఫీట్‌ని ఎల్ అండ్ టీ నుంచి కేసీఆర్ బినామీలు సొంతం చేసుకున్నారు. 1200 కోట్ల ఆస్తులు ఎల్ అండ్ టీ నుంచి బినామీ కంపెనీకి బదలాయింపు జరిగాకే పాత మెట్రో డిజైన్‌కు కేసీఆర్ ఓకే చెప్పారు. కేసీఆర్ ధన దాహంతో మెట్రోలోని ప్రభుత్వ వాటాలను కూడా అమ్మేందుకు కుట్ర జరుగుతుంది. ఆయన కుటుంబం ఎల్ అండ్ టీ ఆస్తులను బలవంతగా రాయించుకున్నది వాస్తవం. హెచ్ఎండీ ఆస్తులను అమ్మి మైహోం జూపల్లి కోసం రాయదుర్గం మెట్రోను నిర్మించాల్సిన అవసరం ఏముంది. నా ఆరోపణలపై స్పందించకుండా తేలు కుట్టిన దొంగల్లా మౌనంగా ఉన్నారు. స్పందిస్తే నిజాలు బయటపడతాయనే సీఎం, మంత్రులు మాట్లాడటం లేదు. తప్పుడు వాదనలు చేయలేకనే ఏజీ ప్రకాశ్ రెడ్డి రాజీనామా చేశారు’ అని రేవంత్ ఆరోపించారు ఆంధ్ర ఉద్యోగులకు అందలాలు.. ‘మెట్రోలో కేసీఆర్ అవినీతికి అనుకూలంగా ఉన్నందుకే ఆంధ్రకు చెందిన ఎన్వీఎస్ రెడ్డిని మెట్రోకు శాశ్వత ఎండీగా నియమించారు. కేసీఆర్ పాలనలో ఆంధ్ర ఉద్యోగులకు అందలమెక్కిస్తున్నారు. అట్టడగు వర్గాలకు చెందిన విద్యార్థులను ఎవరెస్టు ఎక్కించిన తెలంగాణ బిడ్డ ఐసీఎస్ ప్రవీణ్ కేసీఆర్‌కు కనబడరు. కేటీఆర్ సెక్యూరిటీ లేకుండా అసదుద్దీన్‌తో చర్చలు జరిపింది పాతబస్తీ మెట్రో తరలింపును ప్రశ్నించకుండా ఉండటానికే. పాతబస్తీలో రావాల్సిన మెట్రోని రాయదుర్గంకు తరలిస్తున్నారు’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. -
ఉప్పల్ మెట్రో స్టేషన్లో తుపాకీ కలకలం
ఉప్పల్ : ఉప్పల్ మెట్రోస్టేషన్లో రైలు ఎక్కబోతున్న వ్యక్తి వద్ద తుపాకీ లభ్యం కావడంతో కలకలం సృష్టించింది. ఉప్పల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు కథనం మేరకు.. భూపాలపల్లి జిల్లా, కాటారం గ్రామానికి చెందిన తోట సతీష్ అదే ప్రాంతానికి చెందిన జెడ్పీటీసీ సల్ల నారాయణరెడ్డి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నారాయణరెడ్డి వ్యాపార పనుల నిమిత్తం పూణె వెళుతూ తన తుపాకీని డ్రైవర్‌కు ఇచ్చి వెళ్లాడు. డ్రైవర్ సతీష్ మంగళవారం రాత్రి కూకట్పల్లి వెళ్లేందుకు ఉప్పల్ మెట్రోస్టేషన్‌కు వెళ్లాడు. తన వద్ద తుపాకీ ఉండటంతో ఇదే విషయాన్ని సెక్యూరిటీ సిబ్బందికి చెప్పాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఉప్పల్ పోలీసులు సతీష్ వద్ద ఉన్న 7.65 ఎంఎం తుపాకీ, 8 రౌండ్లను స్వాధీనం చేసుకున్నారు. సతీష్‌ను అదుపులోకి తీసుకుని, అతనితో పాటు నారాయణరెడ్డిపై కేసు నమోదు చేశారు. కాగా తుపాకీకి లైసెన్స్ ఉన్నట్టు ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. -
మెట్రోలో తుపాకీ కలకలం
హైదరాబాద్ : ఉప్పల్ మెట్రో స్టేషన్లో మంగళవారం రాత్రి తుపాకీ కలకలం రేగింది. ఓ వ్యక్తి ఉప్పల్ నుంచి కూకట్ పల్లికి మెట్రోరైలులో వెళ్లే సమయంలో మెట్రో సిబ్బంది బంధించి ఉప్పల్ పోలీసులకి సమాచారం ఇచ్చారు. ఎనిమిది రౌండ్లు కల్గిన తుపాకీని పోలీసులు స్వాధీన పరుచుకుని నిందితుడిని ఉప్పల్ పీఎస్‌కి తరలించారు. నిందితుడు తన పేరు సతీష్ అని చెప్పాడు. తాను భూపాలపల్లి జిల్లా కాటారం జెడ్పీటీసీ చల్లా నారాయణ రెడ్డి కారు డ్రైవర్‌నని పోలీసులకు చెప్పాడు. నారాయణ రెడ్డి వ్యాపార పనుల నిమిత్తం పూణె వెళ్లడంతో తనకు తుపాకీ ఇచ్చి వెళ్లాడని చెప్పాడు. పోలీసుల విచారణలో నారాయణరెడ్డి పేరు మీదే తుపాకీ రిజిస్టరై ఉన్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వారికోసమే ఆ రూట్లో మెట్రో: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మరోసారి తనదైనశైలిలో విమర్శలు గుప్పించారు. మెట్రో ప్రాజెక్ట్‌పై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మెట్రో ప్రాజెక్ట్ పేరుతో కేసీఆర్ ధనదాహం తీర్చుకుంటున్నారని ఆరోపించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రవాణా వ్యవస్థను జీఎమ్మార్ సంస్థే ఏర్పాటు చేసేలా ఆనాటి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందనీ, అయినప్పటికీ రాయదుర్గం-శంషాబాద్ రూట్లో కొత్తగా మెట్రో రైల్వే ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడం వెనుక కారణాలేంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ బంధువైన ప్రవీణ్ రావ్, మై హోమ్ సంస్థ, ఇతర బంధువుల భూముల విలువ పెరగటం కోసమే ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నారని ఆరోపించారు. మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణం అపేయాలని ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాసింది నిజమా? కాదా? అని ప్రశ్నించారు. మెట్రోను అడ్డుపెట్టుకొని కేసీఆర్ దోపిడి చేస్తున్నారనేది ముమ్మాటికి వాస్తవమని ఆరోపించారు. కేసీఆర్ చేస్తున్న మెట్రో స్కామ్‌పై కోర్టుకు వెళ్తామన్నారు. తను మెట్రో ప్రాజెక్టుపై చేసినవి అసత్య ఆరోపణలయితే ఏ శిక్షకైనా సిద్దమేనన్నారు. కేసీఆర్ కుటుంబం పట్టపగలే తెలంగాణను దోపిడి చేస్తుందని ధ్వజమెత్తారు. తండ్రీ-కొడుకుల దోపిడితో భవిష్యత్తులో బంగారు తెలంగాణ కాకపోగా అప్పుల తెలంగాణగా మారుతుందని రేవంత్ రెడ్డి ఎద్దేవాచేశారు. -
‘మెట్రో’ రైలు సీన్ రివర్స్!
హైటెక్ నగరిలో అద్భుత ఆవిష్కరణ అంటూ వచ్చిన ‘మెట్రో’ రైలు చతికిలబడుతోంది. ఈ రైళ్ల రాకతో ఆర్టీసీ ప్రయాణికులు తగ్గుతారని భావిస్తే బస్సుల్లో మాత్రం ఆక్యుపెన్సీ అమాంతం పెరిగింది. పైగా మెట్రోకు సమాంతరంగా నడిచే సిటీ బస్సుల్లో ప్రయాణికులు రెండు శాతం పెరగడం గమనార్హం. మెట్రో జర్నీ, ఈ రూట్లలో ఆర్టీసీ సర్వీసులపై ‘సాక్షి’ బృందం క్షేత్రస్థాయిలో నిర్వహించిన పరిశీలనలో ఇది స్పష్టమైంది. గతేడాది నవంబరులో నగరంలోని రెండు మార్గాల్లో మెట్రో రైళ్లు ప్రారంభమయ్యాయి. తొలి రెండు నెలలు రోజూ లక్షల మంది వీటిలో ప్రయాణం చేయడాన్ని చూసిన అధికారులు.. ఇదే ఆదరణ ఉంటుందని భావించారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రస్తుతం మెట్రోల్లో ప్రయాణికులు 50 వేలు మించడం లేదు. ఉదయం, సాయంత్రం మినహా మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మెట్రో స్టేషన్లు బోసిపోతున్నాయి. అధిక చార్జీలు, పార్కింగ్ సమస్యలతో వివిధ వర్గాలు మెట్రో జర్నీకి ‘నో’ చెబుతున్నాయి. మెట్రో రైళ్లు అందుబాటులోకి వస్తే సిటీ బస్సులకు ఆదరణ తగ్గుతున్న అంచనాలు తలకిందులయ్యాయి. రెండు కారిడార్లలో మొత్తం 1700 బస్సులు రాకపోకలు సాగిస్తుండగా, రోజూ 15 లక్షల మంది సిటీ బస్సుల సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ రెండు రూట్లలో అద్భుతమైన ఆక్యుపెన్సీ నమోదైంది. నెల రోజుల్లోనే ఆక్యుపెన్సీ 66 శాతం నుంచి 68 శాతానికి పెరిగింది. మెట్రో రాకతో ఆర్టీసీ అధికారులు సైతం మేల్కొని పలుప్రాంతాలకు అదనపు బస్సులను నడపడం.. మెట్రో రూట్లోని సమీప కాలనీల నుంచి నేరుగా గమ్యస్థానాలకు బస్సులనుతిప్పున్నారు. పైగా లాంగ్ రూట్ సర్వీసులను సైతం పెంచారు. కొన్ని బస్తీలకు ఫీడర్ బస్సులను కూడా తిప్పుతుండడంతోఆర్టీసీకి ప్రజాదరణ మెరుగుపడింది. పైగా మెట్రో జర్నీ కంటే ఆర్టీసీ చార్జీలు తక్కువగా ఉండడంతో సగటు మధ్యతరగతి ప్రయాణికుడు సిటీబస్సుకే ‘జై’ కొడుతున్నాడు. సాక్షి, సిటీబ్యూరో/మియాపూర్/ఉప్పల్/సికింద్రాబాద్ :మెట్రో కలలు కరిగిపోతున్నాయి. ప్రయాణికుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత ఏడాది నవంబరులో మెట్రో రైళ్లు ప్రారంభమయ్యాయి. తొలి రెండునెలలు జాయ్‌రైడ్స్‌తో సిటీజన్లు ఎంజాయ్ చేసినా.. ఇప్పుడు సీన్ రివర్సయ్యింది. నిత్యం మెట్రో రైళ్లలో రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య సరాసరి 50 వేలకు మించడం లేదు. ఆదివారం, ఇతర సెలవురోజుల్లో రద్దీ సుమారు 70 వేలుగా ఉంటోంది. ఉదయం, సాయంత్రం మినహా మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పలు మెట్రో స్టేషన్లు ప్రయాణికులు లేక బోసిపోతున్నాయి. అధిక చార్జీలు, పార్కింగ్ చార్జీల మోత కారణంగా వివిధ వర్గాలు మెట్రో జర్నీపై ఆసక్తి కనబర్చడంలేదు. నాగోల్– అమీర్‌పేట్ (17కి.మీ), మియాపూర్–అమీర్‌పేట్ (13కి.మీ) రెండురూట్లలో సుమారు రెండు లక్షలమంది నిత్యం ప్రయాణం చేస్తారనుకున్న అంచనాలు ఇప్పుడు తల్లకిందులవడం గమనార్హం. అంతేకాదు రోజువారీగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అల్పాదాయ, మధ్యాదాయ, అసంఘటిత రంగ కార్మికులు, వేతనజీవులు ఇప్పటికీ సింహభాగం ఆర్టీసీ బస్సులు, వ్యక్తిగత బైక్‌లనే వినియోగిస్తున్నట్లు ‘సాక్షి’ బృందం మెట్రో రూట్లలో క్షేత్రస్థాయిలో నిర్వహించిన పరిశీలనలో సుస్పష్టమైంది. వ్యక్తిగత పనులు, వివిధ శుభకార్యాల నిమిత్తం బంధుమిత్రులను చూసేందుకు ఇతర జిల్లాల నుంచి నగరానికి వస్తున్న వారు చాలా మంది మెట్రోలో జాయ్‌రైడ్స్ చేస్తుండడం గమనార్హం. మెట్రో జర్నీ విముఖతకు కారణాలివే.. ⇔ నగరంలో అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలు, మార్కెటింగ్‌రంగం, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, చిరుద్యోగులు అధిక మెట్రో చార్జీలు, పార్కింగ్ ఫీజులు తడిసి మోపడవుతున్న కారణంగా మెట్రో జర్నీకి వెనుకంజ వేస్తున్నారు. మెట్రోలో కనీసం రూ.10,గరిష్టంగా రూ.60 టికెట్ చార్జీలు వసూలు చేస్తున్న విషయం విదితమే. ⇔ ప్రధానంగా రూ.25 వేలలోపు ఆర్జిస్తున్న వేతనజీవులు, కార్మికులు వ్యక్తిగత వాహనాలను వినియోగించడంతోపాటు, ఆర్టీసీ బస్సుల్లో నెలవారీ పాస్‌లతోనే రాకపోకలు సాగిస్తున్నారు. ⇔ మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలు, బస్తీలకు చేరుకునేందుకు ఆర్టీసీ మినీ బస్సులు అందుబాటులో లేకపోవడం, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ కల్పించడంలో ప్రభుత్వం, మెట్రో అధికారులు విఫలమవడం శాపంగా పరిణమిస్తోంది. ⇔ ఉదాహరణకు మియాపూర్ నుంచి ఉప్పల్‌కు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సుల్లో చార్జీ రూ.30 అవుతోంది. అదే మెట్రో రైల్లో రూ.80 చార్జీ అవుతోంది. బస్సు కంటే రూ.50 అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని పలువురు ప్రయాణికులు అంటున్నారు. ⇔ ఇక నలుగురు సభ్యులున్న కుటుంబం ఉప్పల్ నుంచి ప్యారడైజ్ వరకు వెళ్లేందుకు.. ఇంటి నుంచి మెట్రో స్టేషన్‌కు వెళ్లి అక్కడ తమ కారు పార్కింగ్ చేసి.. ఆ తర్వాత మెట్రోలో జర్నీ చేసి.. షాపింగ్ పూర్తిచేసుకొని ఇంటికి తిరిగి వస్తే ఖర్చు రూ.300కుపైమాటే. అదే క్యాబ్‌లో ఇంటి నుంచి నేరుగా షాపింగ్‌కు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకుంటే ఖర్చు రూ.200 మాత్రమే. దీంతో చాలామంది కుటుంబ సమేతంగా క్యాబ్ జర్నీ వైపే మొగ్గు చూపుతుండడం గమనార్హం. ⇔ ఇక శని, ఆదివారాలు, ఇతర సెలవురోజుల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ఇతర జిల్లాల నుంచి నగరానికి వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రయాణికులు మెట్రో రైళ్లలో జాయ్‌రైడ్స్ చేసి ఆనందిస్తున్నారు. వామ్మో మెట్రో పార్కింగ్..! రెండు రూట్లలో 17 పార్కింగ్ స్థలాలను ఏర్పాటుచేశారు. పలు పార్కింగ్ స్థలాలు ప్రధాన రహదారికి ఆనుకొనే ఉన్నాయి. ఇక్కడ వాహనాలను సురక్షితంగా నిలుపుకొనేందుకు ఎలాంటి షెడ్లు ఏర్పాటు చేయలేదు. దీంతో వాహనాలను ఎండలోనే పార్కింగ్ చేయాల్సి వస్తోందని. దీంతో వాహనాలు దుమ్ముకొట్టుకుపోవడంతోపాటు అందులోని ఇంధనం ఎండకు ఆవిరవుతోందని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. ఇక పార్కింగ్ రుసుము బైక్‌కు రెండు గంటలకు రూ.5, అదనంగా మరో గంటకు రూ.2 చెల్లించాల్సి వస్తోంది. సుమారు 8 గంటలు బైక్ పార్కింగ్ చేస్తే ఖర్చు రూ.17 తథ్యం. డెయిలీ పాస్ ద్వారా ఏడు గంటలకు రూ.15, మంత్లీ పాస్ తీసుకుంటే రూ.250 చెల్లించాల్సి ఉంది. కారుకు రెండు గంటలకు రూ.12, అదనంగా ప్రతీ గంటకు రూ.6 చెల్లించాల్సి వస్తోంది. డెయిలీ కార్ పాస్ అయితే ఏడు గంటలకు రూ.40, మంత్లీ పాస్ అయితే నెలకు రూ.750 చొప్పున పార్కింగ్ రుసుము బాదేస్తుండడం గమనార్హం. స్మార్ట్కార్డులకుగిరాకీ నామమాత్రమే.. మెట్రో జర్నీని సులభతరం చేసేందుకు జారీ చేసిన నెబ్యులా స్మార్ట్‌కార్డులు ఇప్పటివరకు 2.50 లక్షలు విక్రయించారు. ఇందులో నెలవారీగా రీచార్జీ అవుతున్నవి రూ.30 వేలకు మించి లేకపోవడం గమనార్హం. ఈ కార్డులు కేవలం మెట్రో జర్నీకే పరిమితం కావడం, ఇతర సేవలు పొందేందుకు ప్రస్తుతానికి అవకాశం లేకపోవడంతో ఈ కార్డులను పలువురు ప్రయాణికులు ఇళ్లలో అలంకార ప్రాయంగానే వీటిని పెట్టినట్లు తెలుస్తోంది. స్మార్ట్ సైకిళ్లకుఆదరణ అంతంతే.. మియాపూర్, జేఎన్టీయూ, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్లతోపాటు మియాపూర్ ఎక్స్ రోడ్డు, సైబర్ టవర్స్, జేఎన్టీయూ యూనివర్సిటీ గేటు దగ్గర స్మార్ట్ సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడు స్టేషన్లలో 75 స్మార్ట్ సైకిళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ వీటిని రోజువారీగా వినియోగిస్తున్నవారు 400కు మించకపోవడం గమనార్హం. ఈ సైకిళ్లను వినియోగించాలనుకున్నవారు మొదటగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి స్మార్ట్ యాప్‌ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ లేదా వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సైకిల్ వినియోగించే వారు రూ. 500 చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఆధార్ కార్డు, డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. స్మార్ట్ మొబైల్ యాప్‌లోకి వెళ్లి సైకిల్ వెనక ఉండే ఆన్ బోర్డు కంప్యూటర్‌పై చూపిస్తే కోడ్ వస్తోంది. దానిని అక్కడ నమోదు చేస్తే సైకిల్‌కు ఉన్న తాళం తెరుచుకుంటుంది. మెట్రో కార్డు ద్వారా కూడా ఈ సిస్టమ్ పనిచేస్తోంది. ఒక స్టేషన్లో తీసుకొని మరో స్టేషన్లో అమర్చే వరకు తిరిగే సమయాన్ని లెక్కిస్తోంది. రూ.500 చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మొదటి అర గంట ప్రతిరోజు ఉచితం. ఆ తర్వాత అరగంట నుంచి రూ.10 అద్దె చెల్లించాల్సిందే. ఇక వారం రోజుల పాటు పాస్ తీసుకుంటే రూ.199, నెలకు రూ.399, ఆరు నెలలకు రూ.1199, ఏడాదికి రూ.1999 చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్, పాస్ లేకపోతే మొదటి అరగంటకు కూడా అద్దె చెల్లించాల్సి ఉంటుంది. స్మార్ట్ బైక్స్దీ అదే దారి.. మెట్రో బైక్స్ సంస్థ రూపొందించిన మెట్రో బైక్స్‌ను వినియోగించడానికి మొబైల్లో మెట్రో యాప్‌ను డౌన్ లోడ్ చేసుకొని బైక్‌ను బుకింగ్ చేసుకోవచ్చు. లేదా ఠీఠీఠీ. ఝ్ఛ్టటౌbజీజ్ఛుట. జీn వైబ్ సైట్ ద్వారా బైక్‌లను పొందవచ్చు. ప్రయాణికులు బైక్‌ను పొందేందుకు ఆధార్ కార్డు, లైసెన్స్ అవసరమవుతాయి. 18ఏళ్లు నిండిన వారికి బైక్స్‌ను వినియోగించడానికి అవకాశం ఉంది. మియాపూర్, నాగోల్, గచ్చిబౌలి ప్రాంతాల్లో 20 మెట్రో బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని నిత్యం వినియోగిస్తున్నవారు 250కి మించి లేకపోవడం గమనార్హం. వీటి వినియోగానికి కిలో మీటరుకు రూ.4 చొప్పున బైక్స్ అద్దెకు ఇస్తున్నారు. ఒక్క రోజు అద్దె రూ.300, వారం రోజులకు రూ.1500, నెలకు రూ.4,500 చెల్లించాలి. వారం, నెల పాస్ తీసుకున్నవారు బైక్‌లో పెట్రోల్ ఖర్చులు భరించాల్సి ఉంటుంది. జీపీఎస్ పద్ధతి ద్వారా ఎక్కడ ఉందో ఎంత దూరం ప్రయాణించిందో తెలుసుకోవచ్చు. తగ్గని ఆదరణ మెట్రో రూట్లలో ఆర్టీసీకి సాక్షి, సిటీబ్యూరో: నగర ప్రజారవాణా వ్యవస్థలో గ్రేటర్ ఆర్టీసీ స్థానం చెక్కుచెదరలేదు. లక్షలాది మంది ప్రయాణికులతో సిటీ బస్సులు పరుగులు తీస్తూనే ఉన్నాయి. మెట్రో రైళ్లు అందుబాటులోకి వస్తే సిటీ బస్సులకు ఆదరణ తగ్గుతుందన్న అంచనాలు తలకిందులయ్యాయి. రెండు కారిడార్లలో మొత్తం 1,700 బస్సులు రాకపోకలు సాగిస్తుండగా, నిత్యం 15 లక్షల మంది ప్రయాణికులు సిటీ బస్సుల సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ రెండు రూట్లలో 68 శాతం ఆక్యుపెన్సీ నమోదవుతున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తమ్ ‘సాక్షి’తో చెప్పారు. నెల రోజుల్లోనే 2 శాతం ఆక్యుపెన్సీ అదనంగా నమోదై 66 శాతం నుంచి 68 శాతానికి పెరిగింది. అన్ని వేళల్లో ప్రయాణికులకు సిటీ బస్సులు అందుబాటులో ఉండడం, సమీప కాలనీల నుంచి నేరుగా గమ్యస్థానాలకు రాకపోకలు సాగించే సదుపాయం ఉండడం ఆర్టీసీకి బాగా కలిసివచ్చింది. మరోవైపు విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ వర్గాలకు చెందిన లక్షలాది మంది బస్సుపాస్ వినియోగదారులు సిటీ బస్సులపైనే ఆధారపడి ఉన్నారు. ఎల్బీనగర్ నుంచి నేరుగా మియాపూర్, హైటెక్ సిటీ, కూకట్పల్లి, సికింద్రాబాద్, జూబ్లీ బస్‌స్టేషన్ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు మెట్రో రైళ్ల కంటే సిటీ బస్సులే ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి. పైగా పేద, అల్పాదాయ వర్గాలకుఅనుకూలంగా ఉన్న ఆర్టీసీ చార్జీలు కూడా ఇందుకు మరో కారణం. అంచనాలు తారుమారు.. మెట్రో రాకతో సిటీ బస్సులపై ప్రభావం పడొచ్చన్న అంచనాల నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు లాంగ్ రూట్ బస్సులపై ప్రధానంగా దృష్టి సారించారు. హయత్‌నగర్ నుంచి నేరుగా కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు, సికింద్రాబాద్, జూబ్లీబస్‌స్టేషన్ వంటి దూరప్రాంతాల బస్సుల రాకపోకలపై అధ్యయనం చేశారు. ఉప్పల్– సికింద్రాబాద్, తార్నాక– సికింద్రాబాద్, మియాపూర్– కూకట్పల్లి, సికింద్రాబాద్– అమీర్‌పేట్– మియాపూర్ తదితర మార్గాల్లోనూ ప్రయాణికుల రద్దీని గమనించారు. మెట్రో రైళ్లు ప్రారంభించిన తొలి నెలరోజుల పాటు ఆర్టీసీ ఆక్యుపెన్సీ స్వల్పంగా తగ్గినప్పటికీ తక్కువ వ్యవధిలోనే తిరిగి పుంజుకుంది. నాగోల్ నుంచి సికింద్రాబాద్ వరకు 740 బస్సులు, అమీర్‌పేట్ నుంచి మియాపూర్ వరకు 960 బస్సులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయి. మెట్రో రాకకు ముందు నుంచి కూడా రెండు రూట్లలో మొత్తం 1,700 బస్సులు ప్రతిరోజు 8 వేల ట్రిప్పులకుపైగా తిరుగుతున్నాయి. సుమారు 15 లక్షల మంది ప్రయాణికులు ఈ రెండు రూట్లలో ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారు. నాగోల్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే బస్సులు చాలా వరకు నాగోల్ చౌరస్తా నుంచే కాకుండా సమీపంలోని కొత్తపేట్, దిల్సుఖ్నగర్, బండ్లగూడ, జైపురి కాలనీ, తట్టిఅన్నారం ప్రాంతాల నుంచి నేరుగా బయలుదేరడంతో ప్రయాణికులు ఇంటి నుంచి నేరుగా వెళ్లేందుకు అవకాశం లభిస్తోంది. అలాగే మియాపూర్–అమీర్‌పేట్ మార్గంలోనూ వందలాది కాలనీలకు నేరుగా సిటీ బస్సు సదుపాయం ఉంది. ఫీడర్ రూట్లలో 85 బస్సులు.. మరోవైపు మెట్రో కారిడార్లకు రెండు వైపుల కాలనీల నుంచి ప్రయాణికులకు మెట్రో స్టేషన్లకు చేరవేసేందుకు ఆర్టీసీ ప్రవేశపెట్టిన ఫీడర్ బస్సులు కూడా పెరిగాయి. గతంలో రెండు మార్గాల్లో 75 బస్సులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాటిని 85కు పెంచారు. మియాపూర్, జేఎన్టీయూ, కూకట్పల్లి తదితర ప్రాంతాల నుంచి హైటెక్ సిటీ, ఐటీ కారిడార్లు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండడంతో బస్సుల సంఖ్య పెంచినట్లు అధికారులు తెలిపారు. మెట్రో రైలు దిగిన ప్రయాణికులు తిరిగి క్యాబ్‌లు, ఆటోల్లో వెళ్లకుండా ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. -
పాత బస్తీవాసులు మెట్రో ఎక్కకూడదా?
సాక్షి, హైదరాబాద్: ‘మెట్రోరైల్ ప్రాజెక్టు ఫేజ్–1లో పాత బస్తీ పరిధిలోని ఫలక్‌నుమా కారిడార్ కూడా ఉంది. నగరం మొత్తం ఫేజ్–1 పనులు జరుగుతున్నా పాతబస్తీలో మాత్రం ప్రారంభించలేదు. పాతబస్తీ వాసులు మెట్రో రైలు ఎక్కకూడదా?, మెట్రో రైలు చూడాలంటే కొత్త నగరనికి రావాల్సిందేనా?’ అని ప్రభుత్వంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పాతబస్తీకి మెట్రో రాకుండా జరుగుతున్న నిర్లక్ష్యానికి కారణమేంటని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎంఐఎం సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానం చెబుతున్న సమయంలో కిషన్‌రెడ్డి జోక్యం చేసుకుని పాతబస్తీపై జరుగుతున్న నిర్లక్ష్యంపై ప్రశ్నించారు. మంత్రి సమాధానానికి సంతృప్తి చెందని బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. -
స్వల్పంగా పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు
సాక్షి, న్యూడిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జారీ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయనీ, పెరిగిన ధరలు మంగళవారం ఉదయం 6గంటలనుంచి అమల్లో ఉంటుందని ప్రకటించింది. డీజిల్‌పై 7పైసలు, పెట్రోల్‌పై ఒక పైస పెరిగిందని చెప్పింది. పెరిగిన ధరల ప్రకారం మెట్రో నగరాల్లో లీటరు పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ( రూ. 72.94), కోల్‌కతా( రూ. 74.94), ముంబై( 80.07), చెన్నై( రూ.74.87). మొత్తంగా ఈ సంవత్సరం మొత్తంలో పెట్రోల్‌పై రూ.2.20 -2.34, డిజీల్‌పై రూ. 3.16-3.61 పెరిగాయి. మరోవైపు అంతర్జాతీయంగా చమురు ధర సోమవారం స్వల్పంగా క్షీణించింది. ఫ్యూచర్స్‌లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 24 సెంట్లు నష్టపోయి 65.97 డాలర్లుగా నమోదైంది. -
నగరం నిద్రపోతోంది
సాక్షి, బెంగళూరు : నిద్ర ఒక యోగం అని సెలవిచ్చారు పెద్దలు. ఎంత పరి వారం, సిరిసంపదలతో తులతూగుతున్నా కునుకు పట్టకపోతే నరకమే. పగలంతా పనిచేసి రాత్రి తనివితీరా నిద్రాదేవి ఒడిలో సేదదీరడం ఈ స్పీడ్ యుగంలో అదృష్టం కిందే లెక్క. ఎవరైతే ఆఫీసుల్లో 100 శాతం పనిచేస్తారో అలాంటివారికి చక్కగా నిద్రపడుతుందని, 75 శాతం అంతకన్నా తక్కువగా పనిచేసే వారు చాలా తక్కువగా నిద్రపోతారని ఇటీవల ఒక సర్వే పేర్కొంది. శుక్రవారం అంతర్జాతీయ నిద్ర దినోత్సవం సందర్భంగా ‘ఇండియా స్లీప్ అండ్ వెల్నెస్’ పేరిట సండే మాట్రెస్ సంస్థ ఈ సర్వేని నిర్వహించింది. దేశంలోని ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో సర్వే సాగింది. 25 ఏళ్లు పైబడిన ఉద్యోగుల నుంచి నిద్ర వివరాలను రాబట్టారు. ఈ సర్వే ప్రకారం పెద్ద వయసున్న ఉద్యోగుల కంటే 30 ఏళ్ల లోపు యువ ఉద్యోగులే సజావుగా నిద్రపోతున్నట్లు తేలింది. 45 ఏళ్ల పైబడిన ఉద్యోగులు నిద్రలేమితో బాధపడుతున్నారని తెలిసింది. సర్వేలో పాల్గొన్న వారిలో 40 శాతం మంది ఉదయం నిద్ర లేవాలంటే ఆలారమ్ తప్పక కావాల్సిందేనని చెప్పారు. బెంగళూరులో10 -11 గంటలకు పడకకు బెంగళూరువాసులు రోజూ రాత్రి 10 నుంచి 11 గంటలల్లోపు పడక ఎక్కుతున్నారు. కానీ ముంబయి వాసులు అర్ధరాత్రి దాటితే కానీ నిద్ర పోవడం లేదని తెలిసింది. ముంబయి, ఢిల్లీతో పోల్చితే బెంగళూరు వాసులు అధికంగా, చక్కగా నిద్రపోగలుగుతున్నారు. – బెంగళూరులో తక్కువ శబ్ద కాలుష్యం బాగా నిద్రపోవడానికి ఒక కారణం. చిన్నపిల్లలతో కలిసి నిద్రించేవారికి మంచి నిద్ర పడుతోంది. పిల్లల్లేని భార్యభర్తలు నిద్రలేమితో ఇబ్బందులు పడుతున్నారు. నిద్రపోయే రెండు గంటల ముందు భోజనం చేస్తే బాగా నిద్రపడుతుంది. ఇలా రాత్రి భోజనం కూడా నిద్రపై ప్రభావం చూపుతుందని తెలిపింది. రాత్రిపూట తక్కువగా ఆహారం తీసుకునేవారిలో 50 శాతం మందికి పైగా మంచి నిద్రపోతున్నారని తెలిసింది. ఈ విషయంలో ఢిల్లీ, ముంబయి కంటే బెంగళూరు వాసులు కొద్దిగా ముందున్నారు. బెంగళూరు వాసులు రాత్రి పూట కొద్దిగా ఆహారం తీసుకుంటున్నారు. అందువల్ల చక్కగా నిద్రపోతున్నారు. కాగా, 52 శాతం పొగరాయుళ్లు రాత్రివేళల్లో నిద్ర పట్టగా సతమతమవుతున్నారు. రోజుకి 5 నుంచి 10 సిగరెట్లు తాగేవారిలో 10 శాతం అధికంగా నిద్ర సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. స్థూలకాయులను నిద్రాదేవి కనికరించడం లేదు. వారికి నిద్ర సమస్యలు తప్పడం లేదు. ఇక వారానికి 2–3 సార్లు జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేసేవారు చాలా చక్కగా నిద్రపోతున్నారని తేలింది. ఉద్యోగం కోసం కొందరు ఆఫీసుకు వెళ్లేందుకు గంటకు పైగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలాంటివారు కూడా సరిగా నిద్రపోవడం లేదు. ఎక్కువ ప్రయాణ సమయం నిద్రపై ప్రభావం చూపుతోంది. -
రాయదుర్గం టు ఆర్జీఐఏ
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రైలు మార్గాన్ని రాయదుర్గం నుంచి శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) వరకు (31 కి.మీ) పొడిగించేందుకు తాజా బడ్జెట్లో ప్రభుత్వం రూ.400 కోట్లు కేటాయించింది. మరో రూ.200 కోట్ల నిధులను మెట్రో మొదటి దశ పనులకు కేటాయించింది. ప్రస్తుతం నాగోల్–అమీర్‌పేట్–మియాపూర్ (30 కి.మీ) మార్గంలో మెట్రోరైళ్లు రాకపోకలు సాగిస్తున్న విషయం విదితమే. తాజాగా ఎంజీబీఎస్–ఫలక్‌నుమా మార్గానికి సైతం పాత అలైన్మెంట్ ప్రకారం పనులు చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ నాటికి ఎల్బీనగర్–అమీర్‌పేట్, హైటెక్‌సిటీ–అమీర్‌పేట్ మార్గంలో మెట్రోను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మెట్రో మార్గాన్ని పొడిగించాలని సీఎం కేసీఆర్ గత నాలుగేళ్లుగా మెట్రోరైలుపై ఏర్పాటు చేస్తున్న ప్రతి సమీక్ష సమావేశంలో సూచిస్తున్నారు. ఆయన ఆదేశాల మేరకు 31కి.మీ మార్గంలో మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు బడ్జెట్లో రూ.400కోట్లు కేటాయించారు. ఈ నిధులతో ఈ మార్గంలో మెట్రో ఏర్పాటుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీ, సాధ్యాసాధ్యాల పరిశీలన, స్టేషన్ల ఏర్పాటుకు అవసరమైన ప్రాంతాలు గుర్తించడం, అవసరమైన భుములు, ఆస్తులు సేకరించడం, రహదారుల విస్తరణ, బాధితులకు పరిహారం చెల్లించడం తదితర పనులు చేపట్టనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. కాగా ఈ మార్గంలో ఒక్కో కిలోమీటర్ దూరానికి రూ.200 కోట్ల చొప్పున మొత్తం రూ.6,200 కోట్లు వ్యయం కానుంది. ఈ స్థాయిలో నిధులను ప్రభుత్వం ఏదేని ఆర్థిక సంస్థ నుంచి రుణంగా సేకరిస్తుందా? లేదా మెట్రో మొదటి దశ తరహాలో పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం లేదా హైబ్రీడ్ యాన్యుటీ విధానంలో చేపడుతుందా? అన్నది సస్పెన్స్‌గా మారింది. కాగా ప్రభుత్వం గతేడాది బడ్జెట్లో మెట్రోకు రూ.200 కోట్లు కేటాయించింది. తొలిదశకే ఆపసోపాలు... ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఫలక్‌నుమా, నాగోల్–రాయదుర్గం మొత్తం మూడు కారిడార్లలో 72 కి.మీ మార్గంలో మెట్రో మొదటి దశను చేపట్టిన విషయం విదితమే. ఈ పనులకే రూ.14,500 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఆస్తుల సేకరణ ప్రక్రియ ఆలస్యం కావడంతో మెట్రో నిర్మాణ గడువు 18 నెలలు పెరిగి నిర్మాణ వ్యయం రూ.3వేల కోట్లకు చేరిందని నిర్మాణ సంస్థ గగ్గోలు పెడుతోంది. ఈ నేపథ్యంలో శంషాబాద్ వరకు మెట్రో మార్గాన్ని చేపట్టేందుకు ఎవరు ముందుకు వస్తారన్నది తేలాల్సి ఉంది. -
2020 నాటికి ఓల్డ్‌సిటీకి మెట్రో
సాక్షి, సిటీబ్యూరో: పాతబస్తీవాసుల మెట్రో కల త్వరలో సాకారం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. పాత అలైన్మెంట్ ప్రకారమే పాత నగరానికి మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో ఓల్డ్‌సిటీ మెట్రో ప్రాజెక్టుపై మళ్లీ ఆశలు చిగురించాయి. జేబీఎస్–ఫలక్‌నుమా మార్గంలో ప్రస్తు తం మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ వరకు మాత్రమే (సుమారు 10 కిలోమీటర్ల మార్గంలో) మెట్రో పనులు దాదాపు పూర్తికావచ్చాయి. అక్కడి నుంచి సుమారు 5.3 కి.మీ దూరంలో ఉన్న ఫలక్‌నుమా వరకు మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రధానంగా ఎంజీబీఎస్ నుంచి సాలార్జంగ్ మ్యూజియం–చార్మినార్–శాలిబండ–శంషీర్‌గంజ్–జానంమెట్–ఫలక్‌నుమా మార్గంలో మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మార్గంలో మెట్రో ప్రాజెక్టు కోసం సుమారు వెయ్యి ఆస్తులను సేకరించాల్సి ఉందని హైదరాబాద్ మెట్రో రైలు వర్గాలు తెలిపాయి. కాగా ఇప్పుడు పనులు ప్రారంభించి.. ఆస్తుల సేకరణ ప్రక్రియ సజావుగా పూర్తయితే మరో రెండేళ్లలో అంటే 2020లో మాత్రమే పాతబస్తీ వాసులకు మెట్రో కల సాకారం కానుంది. కాగా పాతనగరానికి మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేయాలని ఇటీవల విపక్షాలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టిన విషయం విధితమే. పాతఅలైన్‌మెంట్ ప్రకారం మెట్రో చేపడితే ఈ రూట్లో ఉన్న సుమారు 50 ప్రార్థన స్థలాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని కొన్ని రాజకీయ పక్షాలు ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ మార్గాన్ని మార్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం నిర్ణయించింది. అయితే మూసీ గర్భం నుంచి మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేయడం సాంకేతికంగా సాధ్యపడదని ఎల్అండ్టీ నిపుణుల కమిటీ తేల్చిచెప్పడంతో సర్కారు పాత అలైన్మెంట్ వైపే మొగ్గుచూపడం గమనార్హం. -
‘మెట్రో’లో అలా భాగమయ్యా..
టీనేజ్‌లో ఉన్నవారికి పెద్ద బాధ్యత అప్పగిస్తే కంగారు పడతారు. ఆ బాధ్యత దేశ, రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించింది అయితే భయపడతారు. ఏ చిన్న పొరపాటు జరిగినా అందరి వేళ్లు అటువైపే చూపిస్తాయి. ఎంతో ఒత్తిడిలో కూడా ప్రతిభావంతంగా తనకు అప్పగించిన పని పూర్తి చేసి దేశప్రధాని చేత శభాష్ అనిపించుకుంది ‘సుప్రియా సనమ్’. ఈ పేరు బయటి ప్రపంచానికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ గతేడాది నవంబరులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి, ఇంకా రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు ప్రయాణించిన మెట్రో రైల్‌ను విజయవంతంగా నడిపిన యువతి అంటే గుర్తుపడ్తారు. మహిళా దినోత్సవం సందర్భంగా సుప్రియ తన మనోగతాన్ని, తన విజయ రహస్యాన్ని ‘సాక్షి’కి వివరించారు. సాక్షి, సిటీబ్యూరో: సాహసమే శ్వాసగా సాగుతున్న సుప్రియ.. లక్ష్య సాధనలో సవాళ్లు.. ప్రతిసవాళ్లు.. ఓటములను సమర్థంగా ఎదుర్కొని గమ్యాన్ని చేరుకోవాలని నేటి తరం అమ్మాయిలకు పిలుపునిస్తున్నారు. అవకాశాలు ఎవరో ఇస్తారని ఎదురు చూడటం కంటే ఎంచుకున్న మార్గంలో ఎన్ని కష్టాలు ఎదురైనా నిలిచి గెలిచి సాధించడమే ధీర వనితల లక్షణమంటున్నారు. లక్ష్య సాధనలో ఓసారి విఫలమైనా.. ప్రయత్నించడమే నేటి తరం అమ్మాయిలు నేర్చుకోవాల్సిన జీవితపాఠం అంటున్నారు. ప్రస్థానం మొదలైందిలా.. ‘మాది నిజామాబాద్ పట్టణంలోని కంఠేశ్వర్ ప్రాంతం. నాన్న ప్రమోద్‌కుమార్ ప్రైవేటు స్కూలు టీచర్. తర్వాత అదే పాఠశాలకు ఇన్చార్జ్గా పనిచేశారు. అమ్మ ప్రభావతి డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పనిచేసేవారు. నేను, అన్నయ్య ప్రసన్న కుమార్ పిల్లలం. చిన్నప్పుడు పాఠశాల చదువు నిజామాబాద్‌లోనే సాగింది. బీటెక్ హైదరాబాద్‌లోని విజ్ఞానభారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెకానికల్ పూర్తిచేశాను. ఎంటెక్ సీబీఐటీలో చేశాను. ‘మెట్రో’లో అలా భాగమయ్యా.. ఎంటెక్ ఫైనల్స్‌లో ఉన్నప్పుడు నగరంలో మెట్రో బూమ్ మొదలైంది. సాహసం.. సవాళ్లను ఎదుర్కొనేవారికి ఎల్అండ్టీ సంస్థ ఆహ్వానం పలికింది. వెంటనే అప్లై చేశాను. నాలుగు దశల పరీక్షలను పూర్తిచేసి మెట్రో లోకోపైలెట్‌గా ఎంపికయ్యాను. ఏడాది పాటు శిక్షణ పొందాను. ఛాలెంజింగ్ జాబ్‌ను నిత్యం ఎంజాయ్ చేస్తున్నా. మా ఇంట్లో వివక్ష లేదు.. మా తల్లిదండ్రులు ఎప్పుడూ నాపట్ల వివక్ష చూపలేదు. నేను చదవాలనుకున్న కోర్సులో చేర్పించారు. అన్నయ్యతో పాటే నేనూ క్రికెట్, బాస్కెట్‌బాల్ ఆడాను. నేను ఆడపిల్లను అన్న కోణంలో ఎప్పుడూ చూడలేదు. లోకోపైలెట్‌గా జాబ్‌లో చే రతానంటే ఓకే అన్నారు తప్ప ఎక్కడా నో చెప్పలేదు. నా సక్సెస్‌లో నా తల్లిదండ్రుల పాత్ర మరువలేనిది. చిన్నప్పటి నుంచి వారు నాకు ఇచ్చిన స్ఫూర్తి, ప్రోత్సాహంతోనే ఎదిగాను. చిన్నప్పటి నుంచి సాహసాలు చేయడమంటే నాకు ఇష్టం. బైక్ డ్రైవింగ్ కూడా ఆ సక్తితో నేర్చుకున్నాను. లక్ష్య సాధనకు శక్తి వంచన లేకుండా ప్రయత్నించాలన్నదే నా సిద్ధాంతం. నేటి యువతలకు నేను చెప్పే మాట కూడా అదే.. -
చుట్టేసి.. దూకేసి!
గ్రేటర్ వాసులకు మెట్రో డివైడర్లు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్న నాగోల్–అమీర్‌పేట్ (17 కి.మీ), అమీర్‌పేట్–మియాపూర్(13 కి.మీ)మార్గంలో మెట్రో పిల్లర్ల మధ్యన ఎత్తయిన గోడలతో డివైడర్లు, పలు చోట్ల దూరంగా యూటర్న్లు ఏర్పాటు చేశారు. దీంతో పాదచారులకు రోడ్డు దాటడం కష్టంగా మారింది. వాహనదారులు రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి యూటర్న్ తీసుకోవాల్సి వస్తోంది. ఆయా యూటర్న్ల వద్ద జీబ్రా క్రాసింగ్స్, పాదచారుల మార్గం లేకపోవడం శాపంగా పరిణమిస్తోంది. రాకపోకలు కష్టమై మెట్రో రూట్లో రహదారికి ఇరువైపులా వ్యాపారాలు సైతం పడిపోయాయి. బుధవారం ‘సాక్షి’ బృందం పరిశీలనలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. సాక్షి నెట్వర్క్: మెట్రో మార్గాల్లో డివైడర్ల నిర్మాణంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా ఎత్తులో డివైడర్లు ఉండడం, అర కిలోమీటర్‌కు పైగా దూరంలో యూటర్న్లు ఏర్పాటు చేయడం, జీబ్రాక్రాసింగ్‌లు లేకపోవడంతోసిటీజనులు అవస్థలు పడుతున్నారు. దీంతో కస్టమర్లు రాక వ్యాపారాలు దివాళాతీస్తున్నాయని రోడ్‌సైడ్ వ్యాపారులు వాపోతున్నారు. నాగోల్–అమీర్‌పేట్ (17 కి.మీ), అమీర్‌పేట్–మియాపూర్ (13 కి.మీ) మార్గాల్లో ‘సాక్షి’ బుధవారం విజిట్ నిర్వహించగా ఈ ఇబ్బందులు కళ్లకు కట్టాయి. సిగ్నల్స్ లేవ్... మలేసియాటౌన్‌షిప్:కూకట్పల్లి నుంచి మియాపూర్ మార్గంలో కొన్నిచోట్ల జిబ్రాక్రాసింగ్లు ఉన్నప్పటికీ సిగ్నల్స్, ట్రాఫిక్ సిబ్బంది లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వాహనాలు, పాదచారులు ఏక కాలంలో రోడ్డు దాటుతుండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ♦ కేపీహెచ్‌బీ కాలనీ రైల్వే స్టేషన్ దాటాక రామ్‌దేవ్‌రావ్ ఆసుపత్రి దగ్గర జిబ్రాక్రాసింగ్ ఏర్పాటు చేశారు. కానీఇక్కడ సిగ్నలింగ్ వ్యవస్థ లేదు. దీంతో ఇప్పటికే చాలా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ♦ కూకట్పల్లి, కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్లు, నిజాంపేట్ క్రాస్‌రోడ్ ప్రాంతాల్లో సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసిన్పటికీ.. ట్రాఫిక్ సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ♦ ఇక్కడ ప్రధాన రహదారికి ఇరువైపులా వస్త్ర, వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. డివైడర్ల ఏర్పాటుతో వ్యాపారం తగ్గుముఖం పట్టిందని వ్యాపారులు వాపోతున్నారు. ఉప్పల్‌లో వ్యాపారులకు తిప్పలు.. ఉప్పల్: మెట్రో రైలు మార్గంలో పిల్లర్ల కింద నిర్మించిన డివైడర్లు స్థానిక వ్యాపారులకు శాపంగా మారాయి. దూరంగా యూటర్న్ ఏర్పాటు చేయడంతో ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న వాణిజ్య సముదాయాలకు 50 శాతం వరకు గిరాకీ తగ్గిందని వాపోతున్నారు. ఇలానే కొనసాగితే వ్యాపారాలు మూసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హబ్సిగూడ వీధి నెంబర్–8 నుంచి చౌరస్తా వరకు 1.5 కిలోమీటర్ల దూరంలో రెండే యూటర్న్లు ఉన్నాయి. దీంతో పాదచారులు చాలా దూరం నడవాల్సి వస్తోంది. దివాళా... డివైడర్ల కారణంగా మా వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. వీధి నెంబర్–8 వద్ద దారిని మూసేయడంతో మా పరిస్థితి మరింత దారుణంగా మారింది. దారి లేక కస్టమర్లు రాలేకపోతున్నారు. మాగోడు ఎవరూ వినడం లేదు. – ప్రసాద్, వ్యాపారస్తుడు ట్రాఫిక్ జంఝాటం.. గచ్చిబౌలి: జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం నుంచి హైటెక్ సిటీలోని సైబర్ టవర్స్ వరకు 2.7 కిలోమీటర్ల మార్గంలో ఐదు యూటర్న్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లో తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఈ మార్గంలో 26 క్రాసింగ్స్ ఏర్పాటు చేసినప్పటికీ.. అవన్నీ ఇరుకుగా మారడంతో సిటీజనులు రోడ్డు దాటేందుకు అవస్థలు పడుతున్నారు. ఇక ఈ రూట్లో ప్రధాన రహదారి ఇరుకుగా మారడంతో పార్కింగ్ సమస్యలతో కస్టమర్లు రావడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర కిలోమీటర్ నడవాల్సిందే.. సనత్‌నగర్/అమీర్‌పేట: అమీర్‌పేట్–ప్యారడైజ్ వరకు ఆరు యూటర్న్లు, అమీర్‌పేట్–ఎర్రగడ్డ వరకు మూడు యూటర్న్లు ఉన్నాయి. ఒక్కో యూటర్న్‌కు అరకిలోమీటరు పైగానే దూరం ఉంది. దీంతో పాదచారులు రోడ్డు దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంత దూరం నడవలేక డివైడర్లు ఎక్కి ప్రమాదకరంగా రోడ్డు దాటుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారు. ♦ ముఖ్యంగా అమీర్‌పేట్, ఎస్ఆర్నగర్, ఈఎస్ఐ మెట్రో స్టేషన్లకు దూరంలో యూటర్న్లు ఉండడంతో ప్రయాణికులు ఆటోకు రూ.50 చెల్లించి రోడ్డు దాటాల్సి వస్తోంది. ♦ యూటర్న్ల వద్ద లైటింగ్, రేడియం స్టిక్కర్లతో ఇండికేషన్ బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. ♦ అమీర్‌పేట్–సికింద్రాబాద్ మార్గంలో రోడ్డుకు ఇరువైపులా వ్యాపార, వాణిజ్య సముదాయాలే ఉంటాయి. ఈ మార్గం మొత్తం డివైడర్లు ఏర్పాటు చేయడంతో అటు.. ఇటు వెళ్లే దారిలేక షాపులకు వచ్చే వారి సంఖ్య తగ్గిందని వ్యాపారులు వాపోతున్నారు. ఇక్కడ కాస్త బెటర్ సికింద్రాబాద్: సికింద్రాబాద్ ఈస్ట్ – పరేడ్‌గ్రౌండ్స్ – ప్యారడైజ్ – రసూల్‌పురా మార్గంలో పరిస్థితి కొంచెం బెటర్‌గా ఉంది. సికింద్రాబాద్ ఈస్ట్ – పరేడ్‌గ్రౌండ్స్ వరకు మినహా మిగతా మార్గంలో డివైడర్ల సమస్య లేదు. ♦ ఈ మార్గంలో ప్యాట్నీ, ప్యారడైజ్ ఫ్లైఓవర్లకు సమాంతరంగా రోడ్డుకిరువైపులా ఫుట్‌పాత్ వెంబడి మెట్రో లైన్ ఏర్పాటు చేశారు. దీంతో గతంతో పోలిస్తే రోడ్డు దాటేందుకు పాదచారులకు కొత్తగా ఇబ్బందులేవీ లేవు. ♦ ఇక పరేడ్‌గ్రౌండ్స్ – సికింద్రాబాద్ ఈస్ట్ మార్గంలో పెద్దగా కమర్షియల్ జోన్ లేనందున వ్యాపారులకు ఎలాంటి సమస్యలు లేవు. ♦ ప్యారడైజ్ – రసూల్‌పురా స్టేషన్ల మధ్య దగ్గర్లోనే యూటర్న్ ఉంది. వ్యాపారం తగ్గింది.. డివైడర్ల ఏర్పాటుతో వ్యాపారం బాగా తగ్గింది. సుదూర ప్రాంతాల్లో యూటర్న్లు ఏర్పాటు చేయడంతో.. అంత దూరం వెళ్లలేక కస్టమర్లు షాపులకు రావడం లేదు. డివైడర్ల ఎత్తు తగ్గించి పాదచారులు రోడ్డు దాటేందుకు వీలు కల్పించాలి. అమీర్‌పేట్ స్టేషన్ దగ్గర ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేసినా పాదచారులను అనుమతించడం లేదు. – గులాబ్‌సింగ్, వ్యాపారవేత్త, అమీర్‌పేట్ సౌకర్యాలేవీ? మెట్రో మార్గాల్లో రోడ్డు దాటాలంటే నరకమే.! అసలు రోడ్డు దాటేందుకు వీలుగా దారి ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. చాలా దూరంగా యూటర్న్ ఉన్నాయి. ఇక జిబ్రాక్రాసింగ్లే లేవు. పాదచారులు, వాహనదారులకు సౌకర్యాలు కల్పించాలి. – మంకయ్య, బల్కంపేట -
పార్కింగ్ కష్టాలకు చెక్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మెట్రో పార్కింగ్ కష్టాలు ఒక్కొక్కటిగా తొలగుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నాంపల్లి, అమీర్‌పేట్ ఇంటర్ఛేంజ్మెట్రో స్టేషన్లకు అవసరమైన పార్కింగ్ స్థలాలు ఎట్టకేలకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ సేకరించింది. సోమవారం అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ సమీపంలో ఎవర్ కార్స్ సంస్థ అధీనంలో ఉన్న 1,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న పార్కింగ్ స్థలాన్ని మెట్రో అధికారులు సేకరించారు. స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు తమ వ్యక్తిగత వాహనాలను ఈ స్థలంలో నిలుపుకొనేందుకు వీలుగా హెచ్ఎండీఏ అధికారులు మెట్రోకు ఈ స్థలాన్ని కేటాయించారు. దీనిని తమకు రూ.15 కోట్లకు విక్రయించాలంటూ.. ఖాళీ చేసేందుకు ఎవర్కార్స్ సంస్థమొండికేసింది. దీంతో రంగంలోకి దిగిన మెట్రో అధికారులు ఆ సంస్థకు సంబంధించిన వస్తువులను పోలీసుల సహకారంతో సోమవారం బలవంతంగా తొలగించారు. ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ అన్ని వసతులతో పార్కింగ్ స్థలం ఏర్పాటుచేస్తా మని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపా రు. మెట్రో స్టేషన్లకు సమీపంలో ప్రభుత్వం కేటాయించిన పార్కింగ్ స్థలాల సేకరణ జటిలంగా మారినప్పటికీ ప్రభుత్వ సహకారంతో ఒక్కో సమస్యను అధిగమిస్తున్నామన్నారు. నాంపల్లిలోనూ.. ఇక నాంపల్లి మెట్రో స్టేషన్.. రైల్వే స్టేషన్ మధ్యలోని 2,800 చదరపు అడుగుల ప్రభుత్వ స్థలాన్ని సైతం మెట్రో పార్కింగ్‌కు కేటాయించారు. సుమారు రూ.28 కోట్ల విలువైన ఈ స్థలాన్ని ప్రైవేటు ట్యాక్సీ అసోసియేషన్లు ఆక్రమించాయి. ఇటీవలే ఆక్రమణలను తొలగించి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో మెట్రో ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు బస్బేతో పాటు ఆధునిక సౌకర్యాలతో వెహికిల్ బే, అత్యాధునిక మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. మెట్రో విద్యుదీకరణ పనులు భేష్ సాక్షి, సిటీబ్యూరో: నగరమెట్రో ప్రాజెక్టులో భాగంగా మలక్‌పేట్ నుంచి మూసారాంబాగ్ రూట్లో మెట్రో కారిడార్ల విద్యుదీకరణ పనులను కేంద్ర ప్రభుత్వ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా (ఈసీఐజీ) డీవీఎస్‌రాజు సోమవారం తనిఖీ చేశారు. ఈ మార్గంలో 33,415 కెవి ఇండోర్ సబ్స్టేషన్లను తనిఖీచేసి పనుల పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ మార్గంలో స్టేషన్లు,ట్రాక్ విద్యుదీకరణ పనులతోపాటు సిగ్నలింగ్, టెలీ కమ్యూనికేషన్స్, ఆటోమేటిక్ టికెట్ కలెక్టింగ్ యంత్రాల వ్యవస్థను పరిశీలించారు. కాగా ఈ సబ్స్టేషన్లకు ఎంజీబీఎస్ వద్ద ఏర్పాటు చేసిన భారీ రిసీవింగ్ సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా చేయనున్నారు. ఈ సబ్స్టేషన్ల పూర్తితో ఎల్బీనగర్–అమీర్‌పేట్ మార్గంలో మెట్రో రైళ్ల రాకపోకలకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతోందని డీవీఎస్ రాజు తెలిపారు. ఆయన వెంట మెట్రో ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.పి.నాయుడు తదితరులున్నారు. -
మెట్రోలో ఉద్యోగాలంటూ టోకరా
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రైలులో ఉద్యోగాలిప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసి మోసగించిన నలుగురు సభ్యుల ముఠాను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితులు టి.అనిత, జి.విజితరెడ్డి, భార్యభర్తలు పి.రవిచంద్ర, అమృతల నుంచి రూ.14,50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం...పదో తరగతి వరకు చదివిన కామారెడ్డి జిల్లా, నిజాంసాగర్ గ్రామవాసి టి.అనిత 1989లో మెదక్‌జిల్లా కౌడపల్లికి చెందిన ఓంప్రకాశ్‌ను వివాహం చేసుకొని 15 ఏళ్ల క్రితం ఉప్పల్‌లోని చిలుకానగర్‌కు వచ్చి స్థిరపడింది. భర్త ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడంతో అనిత గృహిణిగా ఉంటూ తన ముగ్గురు పిల్లల బాగోగులను చూసుకునేది. బోడుప్పల్లో ఉంటూ ఘట్కేసర్లోని మెగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్యోగం చేస్తున్న ఆదిలాబాద్ జిల్లాకు చెందిన విజితరెడ్డితో ఆమెకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరు డబ్బులు సంపాదించాలనే ఆశతో మెట్రో రైలులో టికెట్ జారీ అధికారులు, ట్రాక్ ఇంజినీర్లు, ఇంటిగ్రేటెడ్ అసిస్టెంట్ మేనేజర్లు, అసోసియేట్ మేనేజర్ల ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసగించాలని పథకం వేశారు. అప్పటికే ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్న విజితరెడ్డి రవిచంద్ర, అమృత దంపతులను సంప్రదించింది. అమీర్‌పేటలో ఆసియన్ బ్రైట్ కెరీర్ (ఏబీసీ) కన్సల్టెన్సీని ప్రారంభించి కమ్యూనికేషన్ స్కిల్స్, కెరీర్ డిజైనింగ్, వెబ్ డిజైనింగ్ తదితర కోర్సులను ఆఫర్ చేస్తున్న వారిని కలిసి మెట్రో అధికారులతో తమకు మంచి పరిచయాలున్నాయని, అభ్యర్థులను చూపిస్తే కమీషన్ ఇస్తామని చెప్పారు. ఒక్కో అభ్యర్థికి రూ.1,20,000 తీసుకుంటామని చెప్పడంతో వీరు ఇన్స్టిట్యూట్లోని ఒక్కో అభ్యర్థి నుంచి రూ.50 వేల నుంచి రూ.3,50,000 చొప్పున దాదాపు 1,27,20,000 వసూలు చేశారు. ఇందులో తమ వాటా తీసుకుని మిగతా మొత్తాన్ని టి.అనిత, విజితరెడ్డి అందజేశారు. అనిత మెట్రో రైలు హెచ్ఆర్ మేనేజర్లుగా కొత్త ప్రకాశ్, శివ ప్రసాద్ పేర్లపై నకిలీ నియామక పత్రాలు సృష్టించి విజితరెడ్డికి ఇవ్వడంతో ఆమె రవిచంద్ర, అమృతలకు ఇవ్వగా అభ్యర్థులకు ఇచ్చారు. అభ్యర్థులు మెట్రోరైలు అధికారులను అభ్యర్థులు కలవగా అవి నకిలీవని తేలింది. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం నిందితులను అరెస్టు చేసి రూ.14,50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను ఎస్ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు. -
కేపీహెచ్బీలో సైకోల వీరంగం
-
రోడ్డు మధ్య డివైడర్‌తో ప్రజల అవస్థలు
-
కేపీహెచ్బీలో సైకోల వీరంగం
సాక్షి, హైదరాబాద్ : పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న కేపీహెచ్‌బీ మెట్రో రైల్వేస్టేషన్ సమీపంలో ఇద్దరు సైకోలు వీరంగం సృష్టించారు. మెట్రోస్టేషన్ వద్ద ప్రయాణికులపై రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. దీంతో ప్రయాణికులు భయంతో చల్లాచెదురుగా పరుగులు తీశారు. దీని కాణంగా భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన మెట్రోస్టేషన్‌కు చేరుకున్నారు. అప్పటికే కొంత మంది యువకులు, స్థానికులు ఇద్దరు సైకోలను పట్టుకొని తాళ్లతో బంధించారు. రాళ్లదాడితో ఆగ్రహించిన స్థానికులు వారికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. నిందితులు వీరేవు కృష్ణ, వెంకటేష్‌గా పోలీసులు గుర్తించారు. -
మెట్రో రైలుపై మంత్రి కేటీఆర్ సమీక్ష
హైదరాబాద్ : మెట్రో రైలు కార్యకలాపాలపై తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు మంగళవారం సమీక్షించారు. బేగం పేట మెట్రోరైల్ భవన్లో ఈ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మెట్రో పనితీరును మంత్రి అడిగి తెలుసుకున్నారు. మెట్రో రైళ్ల ఫ్రీక్వేన్సీని పెంచేందుకు ప్రయత్నించాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఫ్రీక్వెన్సీతోపాటు రైళ్ల వేగం పెంచడం వల్ల ప్రస్తుతం ఉన్న ప్రయాణ సమయం మరింత తగ్గుతుందని మెట్రోరైల్ ఎండీ ఎన్వీయస్ రెడ్డి మంత్రికి తెలిపారు. ఇతర మెట్రోలతో పొల్చితే హైదరాబాద్ మెట్రోలో ప్రయాణీకుల సంఖ్య బాగుందన్నారు. చెన్నైలాంటి నగరాల్లో రెండు సంవత్సరాల్లో ప్రయాణించిన సంఖ్యతో పొల్చితే నగర మెట్రోలో ప్రయాణీకుల సంఖ్య ఎక్కువగానే ఉందని మెట్రో అధికారులు తెలిపారు. ప్రారంభం నాటి నుంచి ఇప్పటిదాకా ఎలాంటి సమస్యలు లేకుండా మెట్రో కార్యకలాపాలు నడుస్తున్నాయన్నారు. మెట్రో టికెటింగ్‌లో మరిన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సెట్విన్ వంటి సంస్ధల ఆధ్వర్యంలో నూతనంగా వంద ఎలక్ర్టిక్ బస్సులను ఏర్పాటు చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను తెలపాలన్నారు. మెట్రో కారిడార్‌లో పార్కింగ్, ఫుట్ పాత్, రోడ్ల వంటి మౌళిక వసతుల కల్పన మరింత వేగంగా జరగాలన్నారు. పార్కింగ్ సదుపాయాన్ని మరింత పెంచడం కోసం 12 మల్టీ లెవల్ పార్కింగ్(ఎంఎల్పీ) సదుపాయాలకు టెండర్లు పిలవనున్నట్లు మంత్రికి మెట్రో అధికారులు తెలిపారు. నాంపల్లి మెట్రో స్టేషన్ వద్ద ఈ-ఎంఎల్పీ సదుపాయానికి వారం పది రోజుల్లో టెండర్లు పూర్తి కానున్నట్లు తెలిపారు. మహిళల కోసం ప్రత్యేకంగా షి టాయ్లెట్ల నిర్మాణం చేయాలని మంత్రి ఆదేశించారు. మెట్రోలో మిగినలిన కారిడార్ల నిర్మాణం త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని, ఆయా కారిడార్ల పనుల పురోగతిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. అమీర్ పేట్ నుంచి హైటెక్ సిటీ వరకు పనులు వేగంగా నడుస్తున్నాయని అధికారులు మంత్రికి తెలిపారు. మెట్రో రెండో దశ ప్రణాళికలపైన ఈ సందర్భంగా మంత్రి చర్చించారు. కారిడార్ల ఎంపిక, స్టేషన్ల గుర్తింపు, నిధుల సేకరణ వంటి అంశాలపైన ఒక నివేదిక సిద్దం చేయాలని, త్వరలోనే ముఖ్యమంత్రి ఈ అంశంపైన సమీక్షించే అవకాశం ఉన్నదని అధికారులకు తెలిపారు. ఎయిర్ పోర్ట్ ఎక్స్ మెట్రో ( మెట్రోరైలు) ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి అదేశించారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఎయిర్ పొర్ట్కు కనెక్టివిటీ ఉండేలా ప్రణాళికలు తయారు చేయాలని మెట్రో అధికారులను కోరారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కూమార్‌తో పాటు, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సిటీలో అమెరికా స్టేషన్!
అవును...మన నగరంలో అగ్రరాజ్యంలోని కంపెనీ పేరిట మెట్రో రైలు స్టేషన్ ఏర్పాటైంది. ఇది ప్రత్యేకంగా ఏర్పాటు కాలేదు...ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్‌కే అమెరికాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థ ‘ఇన్వెస్కో’ పేరు పెట్టారు. ఇలా నగరంలోని 65 మెట్రో స్టేషన్ల పేర్లు ఇక బహుళ జాతి కంపెనీలు, విదేశీ సంస్థల పేరిట మార్పు చెందనున్నాయి. ఆదాయం పెంపు కోసం ఎల్ అండ్ టీ సంస్థ మెట్రో స్టేషన్ల పేర్లను లీజుప్రాతిపదికన కట్టబెట్టేందుకు నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వానికి, హెచ్ఎంఆర్కు ప్రతిపాదించింది. కానీ దీనిపై హెచ్ఎంఆర్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. హైదరాబాద్ నగరంలో ఎన్నో చారిత్రక ప్రాంతాలు, ప్రత్యేకతలు ఉన్న నేపథ్యంలో విదేశీ కంపెనీల పేర్లు పెడితే వివాదాలు తలెత్తుతాయని పేర్కొంది. సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో అత్యాధునిక హంగులతో నిర్మించిన మెట్రో స్టేషన్లకు బహుళజాతి, ప్రైవేటు కంపెనీల పేర్లు పెట్టే అంశం తెరమీదకు రావడంతో వివాదం నెలకొంది. ప్రస్తుత తరుణంలో ప్రయాణికుల చార్జీలతో మెట్రో గట్టెక్కే పరిస్థితి లేనందున.. వివిధ ఆర్థిక సంస్థల నుంచి తాము తీసుకున్న రుణాలపై కనీసం వడ్డీ అయినా కలిసివస్తుందన్న అంచనాతో నిర్మాణ సంస్థ పలు మెట్రో స్టేషన్లకు ప్రైవేటు సంస్థల నుంచి నెలవారీగా లేదా వార్షిక ప్రాతిపదికన లీజు తీసుకొని ఆయా స్టేషన్లకు ప్రైవేటు కంపెనీల పేర్లు పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇటు ప్రభుత్వానికి, అటు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ముందు పెట్టింది. అంతటితో ఆగకుండా ప్రకాశ్‌నగర్ మెట్రో స్టేషన్‌కు ఏకంగా అమెరికాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థ ఇన్వెస్కో సంస్థ పేరు పెట్టడం గమనార్హం. నిర్మాణ సంస్థ ప్రతిపాదనలను ఇటు ప్రభుత్వం, అటు హెచ్ఎంఆర్ అధికారులు ససేమిరా అన్నట్లు తెలిసింది. చారిత్రక భాగ్యనగరిలో ప్రతి ప్రాంతానికి భౌగోళికంగా, చారిత్రకంగా ప్రత్యేకత ఉన్న నేపథ్యంలో ఆయా స్టేషన్లకు ప్రైవేటు కంపెనీల పేర్లు పెడితే అనేక వివాదాలు తలెత్తుతాయని హెచ్ఎంఆర్ అధికారులు ఎల్అండ్టీకి స్పష్టం చేయడం గమనార్హం. అంతేకాకుండా నిర్మాణ ఒప్పందంలో ఇలా ఇష్టారాజ్యంగా పేర్లు పెట్టే క్లాజ్ కూడా లేదని చెప్పినట్లు సమాచారం. పేరు పెట్టేయ్.. లీజు పట్టేయ్.. మెట్రో స్టేషన్లకు ప్రైవేటు పేర్లు పెట్టే ప్రతిపాదనలు దుబాయి మెట్రో ప్రాజెక్టు నుంచి మొదలైనట్లు మెట్రో అధికారులు చెబుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ మెట్రో రైలు అధికా>రులు ఈ ప్రతిపాదనలను దశలవారీగా అమలుచేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో బెంగళూరు, చెన్నై నగరాలు కూడా ఇదేబాటలో ముందుకెళతాయని అంచనా వేస్తున్నామన్నారు. అయితే ఇప్పటికే మెట్రో స్టేషన్లు,పిల్లర్ల ఏర్పాటుతో నగరంలో ఎంతో చారిత్రక నేపథ్యంలో ఉన్న కట్టడాలు తమ వైభవాన్ని కోల్పోయాయన్న విమర్శలున్న నేపథ్యంలో ఈ పేర్ల రగడ కొత్త వివాదాలు సృష్టిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎవరి లెక్కలు వారివే.. నగరంలో మొత్తం ప్రాజెక్టును 2018 డిసెంబరు నాటికి పూర్తిచేసేందుకు నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తోంది. మొత్తంగా 72 కి.మీ ప్రాజెక్టు పూర్తికి రూ.16,375 కోట్లు వ్యయం చేయనున్నారు. ఇందులో ఇప్పటికే రూ.13,200 కోట్లు ఖర్చుచేసినట్లు ఎల్అండ్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో రూ.11 వేల కోట్లు వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణంగా సేకరించినట్లు పేర్కొంటున్నాయి. ఇక మెట్రో నిర్మాణ ఒప్పందం ప్రకారం మెట్రో ప్రాజెక్టుకు అయిన వ్యయాన్ని నిర్మాణ సంస్థ.. 50 శాతం ప్రయాణీకుల చార్జీలు..మరో 45 శాతం రవాణా ఆధారిత ప్రాజెక్టులు,రియల్ఎస్టేట్ అభివృద్ధి, మరో ఐదు శాతాన్ని వాణిజ్య ప్రకటనల ద్వారా 40 ఏళ్లపాటు సమకూర్చుకోవాలని నిర్మాణ ఒప్పందంలో పేర్కొన్నారు. ప్రస్తుత తరుణంలో వినూత్న ఆర్థిక విధానాలను అమలుచేయని పక్షంలో తొలి ఏడేళ్లు తమకు నష్టాల బాట తప్పదని, బ్యాంకుల నుంచి తాము సేకరించిన రుణాలపై వడ్డీ భారం కూడా పెరుగుతోందని నిర్మాణ సంస్థ చెబుతోంది. రోజుకు 70 వేలమంది ప్రయాణికులే... తొలివిడత మెట్రో రైళ్లు పరుగులుపెడుతోన్న నాగోల్–అమీర్‌పేట్(17 కి.మీ) మార్గంలో రోజుకు సరాసరిన 40 వేల మంది..మియాపూర్–అమీర్‌పేట్(13 కి.మీ)మార్గంలో రోజుకు సరాసరిన 30 వేల మంది..మొత్తంగా 30 కి.మీ మార్గంలో నిత్యం 70 వేలమంది మాత్రమే మెట్రో జర్నీ చేస్తుండడం గమనార్హం. ఆదివారం, ఇతర సెలవురోజుల్లో రద్దీ మరో 10 వేలు అదనంగా ఉంటోందని మెట్రో అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు సుమారు 2 లక్షల స్మార్ట్‌కార్డులు విక్రయించినప్పటికీ ఇందులో నెలవారీగా రీచార్జి అవుతున్నవి 50 వేలకు మించి లేకపోవడం గమనార్హం. ఈ లెక్కన ఎల్అండ్టీ సంస్థ ఆశించిన ఆదాయం లేనట్టే అని చెప్పొచ్చు. ఎల్బీనగర్–అమీర్‌పేట్, హైటెక్‌సిటీ–అమీర్‌పేట్ రూట్లో ఈ ఏడాది జూన్‌లో మెట్రో ప్రారంభమైతే రద్దీ అనూహ్యంగా పెరుగుతుందని మెట్రో అధికారులు చెబుతున్నారు. గ్రేటర్లో 65 స్టేషన్లు.. భారీగా ఆదాయం.. గ్రేటర్ పరిధిలో నాగోల్– రాయదుర్గం,ఎల్భీనగర్– మియాపూర్, జేబీఎస్– ఫలక్‌నుమా మూడు కారిడార్లలో మొత్తం 72 కి.మీ మార్గంలో 65 మెట్రో స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే మెట్రో పరుగులు పెడుతున్నా నాగోల్– అమీర్‌పేట్– మియాపూర్ మార్గంలో మొత్తం 30 కి.మీ రూట్లో 24 మెట్రో స్టేషన్లున్నాయి. వీటిని ఒక్కోటి రూ.65 నుంచి రూ.100 కోట్లు ఖర్చుచేసి అత్యాధునిక హంగులతో నిర్మించారు. ఒక్కో స్టేషన్‌కు ప్రైవేటు, బహుళ జాతి కంపెనీ నుంచి అద్దె లేదా లీజు రూపంలో నెలకు కనీసం రూ.10 లక్షలు వసూలు చేసినా.. మొత్తంగా 65 స్టేషన్లకు నెలకు రూ.6.5 కోట్లు. ఏడాదికి రూ.78 కోట్లు ఆదాయం లభిస్తుందని నిర్మాణ సంస్థ ఈ పేర్లు పెట్టే ప్రణాళికను తెరమీదకు తీసుకొచ్చిందని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తుండడం గమనార్హం. -
మార్చిలో మెట్రో మాల్స్ ప్రారంభం!
సాక్షి, హైదరాబాద్: నగర మెట్రో ప్రాజెక్టులో రవాణా ఆధారిత అభివృద్ధి ప్రాజెక్టు కింద పంజగుట్ట, హైటెక్ సిటీల్లో నిర్మించిన భారీ మెట్రో మాల్స్‌ను మార్చి 1వ తేదీన లాంఛనంగా ప్రారంభించేందుకు నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం పంజగుట్టలోని మెట్రో మాల్లో 13 తెరల పీవీఆర్ సినిమాస్, హైటెక్ సిటీ మెట్రో మాల్లో 4 తెరల పీవీఆర్ సినిమా హాళ్లు ఇటీవలే ప్రారంభమయ్యాయి. అలాగే ఇతర ఫుడ్ కోర్టులు, బ్రాండెడ్ దుస్తులు, షూస్, వైద్య సేవలందించే పలు రకాల సంస్థలు మాల్స్ ప్రారంభమైన తర్వాత కార్యకలాపాలు మొదలుపెడతాయని సంస్థ తెలిపింది. ఈ మేరకు ఆయా సంస్థలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ మాల్స్‌కు జీహెచ్ఎంసీ, అగ్నిమాపక శాఖ నుంచి కొన్ని అనుమతులు రావాల్సి ఉందని తెలిపాయి. ప్రస్తుతం మాల్స్‌లోని పీవీఆర్ సినిమా హాళ్లకు ప్రేక్షకుల రద్దీ అధికంగా ఉందని పేర్కొన్నాయి. మరో 2 నెలల్లో ఎర్రమంజిల్, మూసారాంబాగ్ల్లోనూ మెట్రో మాల్స్‌ను ప్రారంభిస్తామని చెప్పాయి. మొత్తంగా 4 చోట్ల కలిపి 18 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎల్అండ్టీ సంస్థ మెట్రో మాల్స్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. -
మెట్రో స్టేషన్లో కీచక పర్వం
-
అమీర్‌పేట మెట్రో స్టేషన్లో లైంగిక వేధింపులు
సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగరం కీర్తి ప్రతిష్టలను మరోసారి దేశవ్యాప్తంగా తెలియచేసిన ఘనత హైదరాబాద్ మెట్రో రైలుది. అలాంటి మెట్రో స్టేషన్లు పలు అసాంఘీక కార్యక్రమాలకు నెలవులుగా మారుతున్నాయి. మెట్రో ప్రారంభమైన నెల రోజులు కాకముందే ఓ ప్రబుద్దుడు యువతుల ఫోటోలు అసభ్యకరంగా తీస్తూ దొరికిన సంగతి మర్చిపోకముందే మరో సంఘటన చోటు చేసుకుంది. సికింద్రాబాద్‌కు చెందిన యువతి గురువారం పనినిమిత్తం జేఎన్టీయూ వెళ్లడానికి మెట్రోరైలు ఎక్కింది. అమీర్‌పేట స్టేషన్ వద్ద ఇంటర్చేంజ్ సమయంలో ఎలా వెళ్లాలంటూ అక్కడ విధులు నిర్వహిస్తున్న నితిన్ రెడ్డిని అడిగింది. మూడో అంతస్తుకు వెళ్లాలని చెప్పిన నితిన్‌రెడ్డి.. ఆమెతోపాటు లిప్ట్‌లో ఎక్కి అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేశాడు. ఈ సంఘటతో షాక్ తిన్న యువతి, ఎస్ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నితిన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. -
మెట్రో కథ కంచికేనా?
అమరావతిలో మెట్రో రైలు ప్రాజెక్టు వ్యవహారం కొలిక్కి వచ్చే పరిస్థితులు కనుచూపుమేరలో కానరావడంలేదు. కేంద్రం నిధులు ఇవ్వని వైనం.. రాష్ట్రం డొంకతిరుగుడు మంత్రాంగం వెరసి నవ్యాంధ్రలో మెట్రో రైలు కథ.. కంచికేనా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మెట్రో టెండర్ల వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల లోపాయికారీ వ్యవహారాలు నచ్చక ఇప్పటికే డీఎంఆర్సీ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. మొత్తంగా పరిశీలిస్తే పాలకుల చిత్తశుద్ధి లోపం ఈ ప్రాజెక్టు విషయంలో స్పష్టమవుతోంది. సాక్షి, విజయవాడ : అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టు ఊహలకే పరిమితమవుతోంది. నిధులు కేటాయించడానికి కేంద్రం ఏమాత్రం ముందుకు రాకపోవడంతో, రాష్ట్ర ప్రభుత్వం కేవలం సర్వేలకే పరిమితం చేయడం, భూసేకరణ విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో మెట్రో రైలు ప్రాజెక్టు కథ కంచికి చేరినట్లేనని కొందరు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆఖరు బడ్జెట్లో సైతం కేంద్రం మెట్రో రైలుకు ఒక్క రూపాయి కేటాయించకపోయినా అధికార పార్టీ ఎంపీలకు చీమకుట్టినట్లు కూడా లేకపోవడం రాష్ట్ర అభివృద్ధిపై వారి చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తోంది. టెండర్ల దశలో అడ్డుకున్న రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు ఏర్పాటును ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ) జూలై 2014లో చేపట్టింది. సర్వే చేసే ఏలూరు రోడ్డులో నిడమానూరు వరకు, బందరు రోడ్డులో పెనమలూరు వరకు 26.03 కి.మీ. మేర రెండు కారిడార్స్‌తో డీపీఆర్ (సమగ్ర నివేదిక)ను తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చింది. దాని ప్రకారం టెండర్లు పిలిచారు. ప్రభుత్వం సూచించిన విధంగా ఎల్ అండ్ టీ సంస్థకు 30 శాతం ఎక్కువ రేటుకు టెండర్లు ఇవ్వడానికి డీఎంఆర్సీ సలహాదారు ఈ.శ్రీధరన్ అంగీకరించలేదు. టెండర్లలో ఎక్కువ కంపెనీలు పాల్గొనేందుకు వీలుగా తిరిగి టెండర్లు పిలవాలంటూ ఆయన సూచించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చకపోవడంతో డీఎంఆర్సీని రాష్ట్ర ప్రభుత్వం పక్కకు తప్పించింది. దీంతో మెట్రో రైలు ప్రాజెక్టు పక్కదారి పట్టింది. డీపీఆర్ దశ దాటని లైట్ మెట్రో రైలు రూ.6,769 కోట్ల వ్యయంతో మీడియం మెట్రో ఏర్పాటు చేసే కంటే, దాని కంటే తక్కువ వ్యయంతో లైట్ మెట్రో రైలు ఏర్పాటు చేయాలని అధికారులు భావించారు. దీంతో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అధికారులతో కలసి చైనాలో పర్యటించి లైట్ మెట్రో గురించి అధ్యయనం చేసి వచ్చారు. అయితే నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టుకు పెద్దగా ఇచ్చింది ఏమీలేదు. ప్రాజెక్టుకు అవసరమైన నిధులు సమీకరించుకునేందుకు మెట్రో అధికారులు అంతర్జాతీయ కంపెనీలతో సంప్రదింపులు జరపగా, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ రూ.2,500 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. మీడియం మెట్రోకు బదులుగా జక్కంపూడి కాలనీ నుంచి మూడు కారిడార్ల లైట్ మెట్రో రైలు ప్రాజెక్టుకు డీపీఆర్ తయారు చేసే సంస్థను ఎంపిక చేసేందుకు కేఎఫ్‌డబ్ల్యూ సిద్ధమైంది. అయితే మన దేశంలో లైట్ మెట్రో రైలు ప్రాజెక్టు ఎక్కడా లేకపోవడం, ఆంధ్రాలోనే తొలిసారిగా ప్రారంభించాల్సిరావడంతో దీనిపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. కేఎఫ్‌డబ్ల్యూ లైట్ మెట్రో రైలు డీపీఆర్ తయారీకి సంబంధించి టెండర్లను గత జూలైలో పిలిచింది. ఐదు కంపెనీలు టెండర్లలో పాల్గొన్నా ఇప్పటి వరకు ఏ సంస్థకు డీపీఆర్ తయారు చేసే బాధ్యతను కేఎఫ్‌డబ్ల్యూ అప్పగించలేదు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వకపోవడంతో అంతర్జాతీయ సంస్థ కూడా ముందుకు రావడం లేదని మెట్రో రైలు కంపెనీ అధికార వర్గాలు చెబుతున్నాయి. -
అమరావతికి మెట్రో లేదు
సాక్షి, అమరావతి: మెట్రో రైలు లేదా లైట్ మెట్రో రైలు వ్యవస్థలను అమరావతిలో ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించింది. వైఎస్సార్ సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరి గురువారం రాజ్యసభలో ఈమేరకు సమాధానం ఇచ్చారు. ఏపీ రాజధాని అమరావతిలో ఏ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌నూ చేపట్టే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదన్నారు. ప్రధాని మాతృ వందనం పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జార్ఖండ్, చత్తీస్ఘడ్ కంటే కూడా వెనుకబడినట్లు మహిళా శిశు సంక్షేమశాఖ సహాయ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ తెలిపారు. ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు ఆయన సమాధాం ఇస్తూ పథకం అమలు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ 19వ స్థానంలో ఉన్నట్లు చెప్పారు. పథకం కింద ఈ ఏడాది ఫిబ్రవరి 5వతేదీ నాటికి ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 2,352 మంది మాత్రమే లబ్ధి పొందినట్లు తెలిపారు. చీరాల పట్టు చీరలకు జియో ట్యాగింగ్ ప్రతిపాదన రాలేదు చీరాల పట్టు చీరలకు జియా ట్యాగింగ్‌కు సంబంధించి ఎలాంటి ప్రతిపాదన రాలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు గురువారం లోక్‌సభలో కేంద్ర మంత్రి అజయ్ తమ్తా లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. -
‘ఎల్బీనగర్– అమీర్‌పేట్ ’ మెట్రో ట్రయల్‌రన్!
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్– అమీర్‌పేట్ మార్గంలో ఏప్రిల్‌లో మెట్రోరైల్ ట్రయల్‌రన్‌కు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జూన్ తొలివారం నాటికి 17 కిలోమీటర్ల ఈ మార్గాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా పనులను పరుగెత్తిస్తు న్నారు. ఈ మార్గంలో మొత్తంగా 652 పిల్లర్ల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. వీటిపై మెట్రో పట్టాలు పరిచేందుకు వీలుగా వయాడక్ట్ సెగ్మెంట్ల ఏర్పాటు పనులు కూడా పూర్తికావచ్చాయి. ఫిబ్రవరి, మార్చిల్లో మెట్రోట్రాక్, విద్యుదీకరణ పూర్తి చేయనున్నారు. లక్డీకాపూల్ వద్ద రైలు ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తిచేయడంతోపాటు ఈ మార్గంలోని పదిహేడు స్టేషన్ల నిర్మాణ పనులు శరవేగంగా చేస్తున్నారు. ప్రధానంగా ఎంజీబీఎస్ వద్ద రెండు కారిడార్లు కలిసే భారీ ఇంటర్ ఛేంజ్ మెట్రోస్టేషన్ ఏర్పాటు పనుల్లో వేగం పుంజుకుంది. నగరంలో ఒక చివర నుంచి మరో చివరకు(ఎల్బీనగర్– మియాపూర్) వరకు 29 కిలోమీటర్ల కారిడార్ పరిధిలో ఇప్పటికే 12 కిలోమీటర్ల మార్గంలో (అమీర్‌పేట్–మియాపూర్) మెట్రోరైళ్లు పరుగులు తీస్తున్న విషయం విదితమే. ఈ కారిడార్ పూర్తయితే నిత్యం సుమారు 6–7 లక్షల మంది మెట్రోరైళ్లలో రాకపోకలు సాగించే అవకాశాలున్నాయని, ప్రధాన రహదారిపై ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుముఖం పడుతుందని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. జూన్ నాటికి ఒకటి.. ఈ ఏడాది చివరికి మరోటి? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నాటికి అమీర్‌పేట్–హైటెక్ సిటీ మార్గంలోనూ మెట్రో పనులను పూర్తి చేసే దిశగా మెట్రో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జూబ్లీ చెక్‌పోస్ట్, పెద్దమ్మగుడి, శిల్పారామం ప్రాంతాల్లో మెట్రోస్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాల రీడిజైన్లు, స్వల్ప ఆటంకాలు మినహా అమీర్‌పేట్– హైటెక్‌సిటీ మార్గంలో మెట్రో పనుల పూర్తికి ఇబ్బందులు లేవని అధికారులు చెబుతున్నారు. ఎంజీబీఎస్– జేబీఎస్ మార్గంలో ప్రధానంగా సుల్తాన్‌బజార్ ప్రాంతంలో పిల్లర్లు, వాటిపై వయాడక్ట్ సెగ్మెంట్ల ఏర్పాటు ప్రక్రియ జటిలంగా మారడం, పుత్లీబౌలి ప్రాంతంలో డబుల్ ఎలివేటెడ్ మార్గంలో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతుండటంతో ఈ ఏడాది చివరినాటికి ఈ మార్గంలోనూ మెట్రోరైళ్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
అమరావతిలో మెట్రో మాట ఉత్తదే
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో మెట్రో రైలు, లైట్ మెట్రో రైలు ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి ప్రతిపాదన తమ వద్ద లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అమరావతిలో మెట్రో స్థానంలో లైట్ మెట్రో ప్రాజెక్ట్ చేపట్టనున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే అంశాన్నివిజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రశ్నించారు. ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్(డిఎంఆర్సీ) డీపీఆర్ సమర్పించక ముందే కన్సల్టెన్సీ చార్జీల పేరుతో రూ. 60 కోట్లు చెల్లించాలని ఎందుకు అడుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టుల విషయంలో తమ నిర్ణయాన్ని మార్చుకున్న నేపథ్యంలో అసలు అమరావతిలో మెట్రో ఏర్పాటు జరిగే అవకాశం ఉందా అని ప్రశ్నించారు. అసలు మెట్రో రైలు, లైట్ మెట్రో రైలుకు సంబంధించి ప్రతిపాదనలే లేవని కేంద్రం స్పష్టం చేయడంతో టీడీపీ ఆడుతున్న డ్రామా బయటపడింది. రాష్ట్రంలోని చంద్రబాబు సర్కారు మెట్రో పేరుతో పైకి మాటలు చెబుతూ ఏవిధంగా ప్రజలను మోసం చేస్తుందో స్పష్టం అవుతోంది. టీడీపీ నేతలు మెట్రో రైలు రాలేదంటూ అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అసలు ప్రతిపాదనలే లేనప్పుడు కేంద్రం ఎలా మంజూరు చేస్తోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘మాతృ వందనం’లో వెనుకబడ్డ ఏపీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానమంత్రి మాతృ వందనం పథకం(పీఎంవీవై) అమలు అతంత మాత్రంగానే ఉన్నట్టు కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి వీరేంద్ర కుమార్ వెల్లడించిన వివరాల ద్వారా తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్ని రాష్ట్రాల్లో పీఎంవీవై పథకం అమలు తీరు ఎలా ఉందని అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా వాటికి సంబంధించిన గణంకాలను ఆయన వెల్లడించారు. గర్భిణిలు, బాలింతల ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో రూ. 5 వేలు అందజేస్తుంది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు మహారాష్ట్రలో అత్యధికంగా 50,831 మంది గర్భిణిలు, బాలింతలైన తల్లులు లబ్ది పొందగా, ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 2,352 మంది మాత్రమే లబ్ది పొందారు. ఈ పథకం అమలులో జార్ఖండ్, ఛత్తీస్‌ఘఢ్‌ల కన్నా ఏపీ వెనుకబడి ఉంది. -
అమరావతిపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామటూ గతంలో ఎన్నో గొప్పలు చెప్పిన చంద్రబాబు నేడు అందుకు పొంతన లేని మాటలు మాట్లాడటం చర్చనీయాంశమైంది. అమరావతిని సింగపూర్ చేస్తా, జపాన్ చేస్తా అంటూ ఏ దేశం వెళ్తే ఆ దేశం పేర్లు చెప్పిన సీఎం చంద్రబాబు.. నేడు అమరావతి గురించి మాట్లాడుతూ.. ఇది ఇటు పల్లెకాదు.. అటు పట్నం కాదని, ఆ కారణంగానే మెట్రోకు కేంద్రం నిధులు ఇవ్వలేదేమోనంటూ కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలికినట్లు తెలుస్తోంది. శుక్రవారం జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడంతో అమరావతి స్థాయిని దిగజార్చి మాట్లాడుతున్న వ్యక్తి.. ఏ స్థాయి రాజధానిని నిర్మిస్తారో చెప్పాలంటున్నారు. విశాఖ పెద్ద సిటీనే కదా అని మంత్రి గంటా శ్రీనివాసరావు సీఎం చంద్రబాబును అడగగా.. స్పందన కరువైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయా శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపుల వివరాలపై చంద్రబాబు ప్రశ్నించగా, తమకు డేటా అందుబాటులో లేదని చెప్పడం అధికారుల వంతయింది. కేంద్ర అధికారులతో మాట్లాడి శాఖలకు కేటాయించిన నిధుల వివరాలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఏపీ కేబినెట్ భేటీలో చర్చించిన అంశాలు ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో ఆరు ఎకనామిక్ సిటీల నిర్మాణానికి ఆమోదం తెలిపిన కేబినెట్ కృష్ణాజిల్లా చెవుటూరు, పినపాకలో రూ.2706 కోట్లతో గుంటూరు జిల్లా మంగళగిరి, విశాఖ జిల్లా అచ్యుతాపురంలలో రూ.13,580 కోట్లతో ఎకనామిక్ సిటీ నిర్మాణం కంటెంట్ కార్పొరేషన్, డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటుకే కేబినెట్ ఆమోదం గుంటూరులో తల్లీపిల్లల ఆస్పత్రి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఆస్పత్రుల్లో వసతుల మెరుగుకు ప్రపంచ బ్యాంకు నుంచి రూ.2,100 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమోదం అర్బన్ హౌసింగ్‌లో రూ.38 వేల కోట్ల ఖర్చు చేయాలని నిర్ణయం అగ్రిగోల్డ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం -
మెట్రో స్టేషన్ వద్ద ఆందోళన
హైదరాబాద్ : మెట్రో స్టేషన్లలో పని చేసే స్టేషన్ అసిస్టెంట్ ఉద్యోగులను ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తీసివేయడంతో వారు మియపూర్ మెట్రో స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. సుమారు 300 మంది నగరంలోని మెట్రో స్టేషన్లలో అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. ట్రిగ్ అనే సంస్థ తమను చేర్చుకుని మెట్రోస్టేషన్లలో అసిస్టెంట్లుగా నియమించిందని బాధితులు చెబుతున్నారు. ఎలాంటి సమాచారం లేకుండా తొలగించడంపై బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగం కల్పిస్తామని ఒక్కొక్కరి వద్ద లక్ష రూపాయలు తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వమే కల్పించుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
పేటీఎంతో మెట్రో టికెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పేటీఎం ద్వారా హైదరాబాద్ మెట్రో రైల్ టికెట్‌ను కొనుగోలు చేసే వీలుంది. అంటే మెట్రో స్మార్ట్ కార్డ్ రీచార్జ్ చేసుకోవచ్చు. దీనికోసం హెచ్‌ఎంఆర్‌తో ఒప్పందం చేసుకున్నామని, పలు సాంకేతికాంశాల కారణంగా అధికారికంగా వెల్లడించలేదని పేటీఎం రీజినల్ హెడ్ టామ్ జాకబ్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో చెప్పారు. ఢిల్లీ మెట్రోతోనూ ఒప్పందం చేసుకున్నామని, ప్రస్తుతం అక్కడి మొత్తం టికెట్ విక్రయాల్లో 48 శాతం పేటీఎం ద్వారానే జరుగుతున్నాయని ఆయన తెలిపారు. పేటీఎం క్యూఆర్ కోడ్ డెవలప్‌మెంట్స్‌కు సంబంధించి గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 5 లక్షల మంది పేటీఎం క్యూఆర్ కోడ్ వర్తకులున్నారని.. ఇందులో 3.5 లక్షల మంది హైదరాబాద్‌లోనే ఉన్నారని, ఈ ఏడాది ముగిసేలోగా 10 లక్షల వ్యాపారులను లకి‡్ష్యంచామని ఆయన వివరించారు. -
‘మెట్రో’ రెండో దశకు నిధుల వేట!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో మెట్రో రెండో దశపై ఆశలు చిగురిస్తున్నాయి. పెట్టుబడుల కోసం దక్షిణ కొరియా, జపాన్ దేశాల్లో మున్సిపల్ మంత్రి కేటీఆర్ బృందం విస్తృతంగా పర్యటిస్తోంది. తాజాగా మెట్రో రెండో దశకు ఆర్థిక సహకారం అందించడంతోపాటు పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని ప్రముఖ ప్రైవేటు రవాణా రంగ సంస్థ ఎంఐటీ–ఎస్‌యూఐతో ఈ బృందం సంప్రదింపులు జరిపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మరోవైపు ప్రభుత్వ పరంగా చేయాల్సిన వ్యయానికి సంబంధించి నిధుల సమీకరణకు జపనీస్ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీతోనూ చర్చించినట్లు సమాచారం. రెండో దశ కింద సుమారు ఏడు మార్గాల్లో 81 కి.మీ. మార్గంలో ప్రాజెక్టును చేపట్టాలని గతంలో నిర్ణయించిన విషయం విదితమే. రెండో దశ ప్రాజెక్టు వ్యయం, భూసేకరణకు రూ.20 వేల కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కాగా ప్రస్తుతం మొదటి దశలోని నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఫలక్‌నుమా కారిడార్ల (72 కి.మీ.)లో మెట్రో ప్రాజెక్టును చేపట్టిన విషయం విదితమే. వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థ, ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించాయి. రెండో దశపై ఎల్అండ్టీ విముఖత? మొదటి దశ పనులు చేపట్టిన ఎల్అండ్టీ రెండోదశ ప్రాజెక్టు చేపట్టేందుకు విముఖత చూపుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే మొదటి దశలో పెరిగిన అంచనా వ్యయం రూ.3 వేల కోట్లను ప్రభుత్వం తమకు చెల్లించాలని ఈ సంస్థ పట్టుబడుతోంది. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి తాము మొదటి దశ పనుల పూర్తిపైనే దృష్టి సారించినట్లు ఎల్అండ్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నిధుల కోసం అన్వేషణ... మెట్రో రెండో దశనుసైతం పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టేందుకు ఆసక్తిగల సంస్థలను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇదే క్రమంలో పెట్టుబడుల ఆకర్షణ కోసం విదేశాల్లో పర్యటిస్తోన్న కేటీఆర్ బృందం జపనీస్ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీ (జైకా), ఎంఐటీ–ఎస్‌యూఐతో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. అయితే దీనిపై ఆ సంస్థలు ఎలా స్పందించాయన్న అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ జైకా బ్యాంకు రుణ మంజూరుకు అంగీకరిస్తే రాష్ట్ర ఆర్థిక శాఖ ఆ బ్యాంకుకు పూచీకత్తు(కౌంటర్ గ్యారంటీ) ఇవ్వాల్సి ఉంటుంది. వడివడిగా ప్రతిపాదనలు రెడీ... ఏడాది క్రితం మెట్రో రెండోదశ ప్రతిపాదిత మార్గాల్లో ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ సహ, నగర మెట్రో ప్రాజెక్టు అధికారుల బృందం పలు మార్గాల్లో సర్వే చేపట్టి ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించింది. ప్రస్తుతమున్న మెట్రో కారిడార్‌ను శంషాబాద్ విమానాశ్ర యం వరకు పొడిగించాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలో అధికారులు ఆ దిశగా ప్రణాళికలు రూపొందించిన విషయం విదితమే. అయితే ప్రభుత్వ ఆదేశాలు, క్షేత్రస్థాయి పరిశీలన, సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించే క్రమంలో ప్రతిపాదిత మార్గాల్లో మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలున్నాయి. రెండోదశ.. ప్రతిపాదిత రూట్లు: 7 దూరం: 81 కి.మీ.(సుమారు) అంచనా వ్యయం: సుమారు రూ.20 వేల కోట్లు మార్గాలివే... 1.నాగోల్–ఎల్బీనగర్: 5 కి.మీ. 2.ఎల్బీనగర్–హయత్‌నగర్: 7 కి.మీ. 3.ఎల్బీనగర్–ఫలక్‌నుమా–శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం: 20 కి.మీ. 4.మియాపూర్–పటాన్చెరు: 15 కి.మీ. 5.రాయదుర్గం–శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం: 20 కి.మీ. 6.తార్నాక–ఈసీఐఎల్: 7 కి.మీ. 7.జేబీఎస్–మౌలాలి: 7 కి.మీ. -
వాసన చూసి అవి చోరీ.. మహిళల్లో భయం భయం!
సాక్షి, బెంగళూరు: గతేడాది తరహాలోనే మరోసారి బెంగళూరు నగరంలో మహిళల లో దుస్తులు చోరీ కావడం వారిని ఆందోళనకు గురి చేస్తుంది. గతంలో మహారాణి కాలేజీ లేడిస్ హాస్టల్లోకి గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడప్పుడు చొరబడుతూ విద్యార్థినుల లోదుస్తులు చోరీ చేసేవారు. తాజాగా బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ (బీఎంఆర్సీఎల్) ఉద్యోగుల క్వార్టర్స్‌లో తమ లో దుస్తులు చోరీకి గురవుతున్నాయంటూ ఫిర్యాదులు వస్తున్నాయి. జనవరి 11న బపనహల్లి పోలీసులకు ఓ ఫిర్యాదు అందింది. బాధితురాలు మాట్లాడుతూ.. అర్ధరాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో అలికిడి కాగా వరండాలోకి వెళ్లి చూశాను. ఓ గుర్తు తెలియని వ్యక్తి లోదుస్తుల పక్కన తచ్చాడుతుండటం చూసి అనుమానం రావడంతో.. ఎవరు నువ్వు అంటూ ధైర్యం తెచ్చుకుని పశ్నించాను. తాను వాచ్మెన్ అని నమ్మించాలని చూసిన వ్యక్తి, ఆపై తన వెంట తెచ్చుకున్న కత్తితో బెదిరించినట్లు చెప్పారు. లోదుస్తులు వాసన చూసి తర్వాత వాటిని చోరీచేసి పారిపోతూ తాను దొంగనని ఆ వ్యక్తి బదులిచ్చినట్లు మహిళా ఉద్యోగిని పోలీసులకు వివరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. -
ఈ సిటీలు సో ఫిట్..
సాక్షి, న్యూఢిల్లీ : ఫిట్‌నెస్‌పై మెట్రో నగరాల్లో రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది. గురుగ్రాం, నోయిడా, ఘజియాబాద్ సిటీలు ఫిట్నెస్ క్రేజీ నగరాలుగా ముందువరుసలో నిలిచాయి. ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబయి, హైదరాబాద్, బెంగళూర్, చెన్నై వంటి మెట్రో సిటీల్లోనూ ప్రజలు చురుగ్గా వర్కవుట్స్ చేస్తున్నారని మొబైల్ హెల్త్ అండ్ ఫిట్నెస్ సంస్థ హెల్థీఫైమ్ నివేదిక పేర్కొంది. గురుగ్రాం, నోయిడా, ఘజియాబాద్‌లో 45 శాతం మంది పైగా రోజూ 4700 అడుగులు వేస్తూ పరుగులు పెడుతున్నారు. ఈ నగరాల ప్రజలు రోజుకు 340 కేలరీల వరకూ ఖర్చు చేస్తూ నెలలో పది రోజుల వరకూ వర్కవుట్లు చేస్తున్నట్టు తేలింది. అయితే కోల్‌కతా, లక్నో, అహ్మదాబాద్ మాత్రం లేజీ సిటీల జాబితాలో చేరాయి. ఇక్కడి సిటిజనులు నెలలో కనీసం నాలుగు రోజులు కూడా వర్కవుట్స్ చేయడం లేదు. ఇతర నగరాలతో పోలిస్తే ఇక్కడి ప్రజలు తమ శరీరాల నుంచి తక్కువ కేలరీలనే ఖర్చు చేస్తున్నారని తేలింది . దేశంలోని మిగిలిన నగరాల్లో సగటున రోజుకు 4300 అడుగులు నడుస్తున్నారు.భారత్‌లోని 220 నగరాల్లో 36 లక్షల మంది వ్యాయామ, ఆహార అలవాట్లకు సంబంధించిన డేటాను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించామని హెల్థీఫైమ్ వ్యవస్థాపక సీఈఓ తుషార్ వశిష్ట్ తెలిపారు. ఇక మహిళలతో పోలిస్తే పురుషులు మరింత చురుకుగా ఉంటున్నట్టు వెల్లడైంది. అయితే కోల్‌కతా, అహ్మదాబాద్, లక్నో నగరాల్లో మహిళలు ఇంచుమించు పురుషులకు దీటుగా వ్యాయామం, నడక వంటి యాక్టివిటీస్‌లో చురుకుగా ఉన్నారు.మొత్తంమీద పురుషులు నెలలో 14 రోజులు వర్కవుట్లు చేస్తుండగా.మహిళలు కేవలం 11 రోజులే వర్కవుట్ చేస్తున్నారు. ఇక పురుషులు అధిక కేలరీలు కరిగించే పుషప్స్, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేస్తుండగా, మహిళలు యోగా, సూర్యనమస్కారాలు వంటి తేలికపాటి వ్యాయామాలతో సరిపెడుతున్నారు. -
మెట్రో పిల్లర్ గుంతలో లైవ్ బాంబు..
ముంబయి : ముంబయిలో పెద్ద ప్రమాదం తప్పింది. మూడో దశ మెట్రో పనులు చేస్తున్న కార్మికులకు ఓ మెట్రో పిల్లర్ గుంట తీస్తుండగా ఓ పాత లైవ్ బాంబ్ లభ్యమైంది. అదృష్టం కొద్ది వారు వెలికి తీసే సమయంలో అది పేలలేదు. ఈ విషయం తెలుసుకున్న బాంబు నిర్వీర్య బృందం హుటాహుటిన ఆ స్థలానికి చేరుకుని బాంబును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అదే ప్రాంతంలో దాన్ని నిర్వీర్యం చేశారు. అయితే, ఆ క్రమంలో చిన్నసైజు పేలుడు సంభవించింది. అయితే ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. దీనిపై ఓ పోలీసు అధికారి వివరణ ఇస్తూ బుధవారం సాయంత్రం 6.30గంటల ప్రాంతంలో మెట్రో పిల్లర్ గుంట తీస్తుండగా తమకు ఓ అనుమానాస్పద వస్తువు దొరికిందంటూ వారికి ఫోన్ వచ్చింది. రోడ్డు ఉపరితలానికి ఓ మీటర్ లోతు తవ్వకాలు జరిపిన తర్వాత ఆ వస్తువు బయటపడింది. దాంతో పోలీసులు ముందే అనుమానించి బాంబ్ స్క్వాడ్‌కు ఫోన్ చేశారు. దీంతో దాన్ని నిర్వీర్యం చేశారు. ఆ బాంబులో స్ప్లింటర్లు, నెయిల్స్వంటివి కూడా చాలా ఉన్నాయి. ఆ బాంబు లభించిన చోట గతంలో ఓ టైరు షాపు, ప్రజా మరుగుదొడ్డి ఉండేదని అధికారులు తెలిపారు. ఏదైనా భారీ ఉగ్రవాద కుట్రతో ఆ బాంబును అమర్చి ఉంచారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
విశాఖ మెట్రోపై విదేశీ సంస్థల ఆసక్తి
సాక్షి, విశాఖపట్నం: ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్న విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులో ఒకింత కదలిక కనిపిస్తోంది. తక్కువ వడ్డీకి అప్పు పుట్టక, రుణం ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రాక ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. ఇటీవల దక్షిణ కొరియా బ్యాంకు రాష్ట్ర ప్రభుత్వానికి రుణం ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ (ఏఎంఆర్‌సీ) నేతృత్వంలోని విశాఖ మెట్రో రైలు (వీఎంఆర్) ప్రాజెక్టుకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ గత జూన్ 16న నోటిఫికేషన్ జారీ చేసింది. జులై 7న గ్లోబల్ టెండర్ల దాఖలుకు ఆసక్తి ఉన్న సంస్థలను ఆహ్వానించింది. అక్టోబర్ 12న ప్రీబిడ్ నిర్వహించింది. అనంతరం ఆసక్తి ఉన్న సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. తొలుత డిసెంబర్ 15, ఆ తర్వాత జనవరి 25 వరకు గడువు విధించింది. అయితే గడువు పెంచాలని కొన్ని సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఫిబ్రవరి ఆఖరు వరకు పొడిగించేందుకు సుముఖంగా ఉంది. దాదాపు 15 సంస్థలు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో విదేశీ సంస్థలే ఎక్కువగా ఉన్నాయి. వీటిలో సీమెన్స్ జర్మనీ, ఆల్‌స్టాంఫ్రాన్స్, హుండాయ్ అండ్ బాంకర్ ఇన్వెస్ట్మెంట్ దక్షిణ కొరియా, మిట్సుయి జపాన్, అన్‌సాల్టో ఇటలీ, ప్రసారణ మలేసియా, భారత్ నుంచి ఎల్అండ్టీ, అదానీ, ఐఎల్ఎస్ ముందుకొచ్చాయి. రూ.8,800 కోట్ల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టును పబ్లిక్ ప్రైవేటు పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో చేపట్టనున్నారు. ఇందులో ప్రభుత్వ వాటా 53, ప్రైవేటు వాటా 47 శాతం కాగా ప్రభుత్వ వాటా రూ.4,600 కోట్లు సమకూర్చాల్సి ఉంది. మిగిలినది కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ పెట్టుబడి పెడుతుంది. దాదాపు రూ.9 వేల కోట్ల వ్యయం అవుతున్నందున ఈ ప్రాజెక్టును 34 సంస్థలు కన్సార్టియంగా ఏర్పాటై చేపట్టాల్సి ఉంటుంది. ఆయా సంస్థల అభ్యర్థన మేరకు బిడ్ల స్వీకరణకు మరికొన్నాళ్ల సమయం ఇవ్వనున్నామని ఏఎంఆర్‌సీ ఎండీ రామకృష్ణారెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. వీటిని పరిశీలించాక తుది జాబితాను తయారు చేస్తారు. తర్వాత రెండో దశలో టెండర్లు పిలిచి ఖరారు చేస్తారు. ఇందుకు నాలుగైదు నెలల సమయం పడుతుంది. -
బస్సులకు, మెట్రోకు కామన్ కార్డు
న్యూఢిల్లీ : నగర రవాణా వ్యవస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా రవాణా కోసం వాడే బస్సులకు, మెట్రోకు కామన్ మొబిలిటీ కార్డును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లాంచ్ చేశారు. దీంతో కామన్ మొబిలిటీ కార్డును లాంచ్ చేసిన తొలి నగరంగా ఢిల్లీ పేరులోకి వచ్చింది. మెట్రో రైళ్లతో పాటు, 200 డీటీసీ, 50 క్లస్టర్ బస్సులకు ఈ కార్డును వాడుకోవచ్చని లాంచింగ్ సందర్భంగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెప్పారు. రవాణా వ్యవస్థలో తాము తీసుకున్న ఈ నిర్ణయం చాలా కీలకమైనదని, ఢిల్లీ ప్రజలకు అనంతమైన ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్డు లాంచింగ్ సందర్భంగా ముఖ్యమంత్రి కొంచెం సేపు డీటీసీ బస్సులో ప్రయాణించారు. డెబిట్ కార్డు లాగానే ఈ కామన్ కార్డు పనిచేస్తుందని, ఏప్రిల్ 1 నుంచి డీటీసీ, క్లస్టర్ బస్సుల్లో దీన్ని వాడుకోవచ్చని చెప్పారు. నగరవ్యాప్తంగా మొత్తం 3900 డీటీసీ, 1600కి పైగా క్లస్టర్ బస్సులు ఉన్నాయి. షీలా దీక్షిత్ ప్రభుత్వంలోనే ఈ కార్డును తొలిసారి ప్రతిపాదనలోకి వచ్చిందని, కానీ దీన్ని ప్రారంభించడం ఆలస్యం చేశారని కేజ్రీవాల్ అన్నారు. ఎందుకు ఆలస్యం చేశారో మాజీ సీఎం షీలా దీక్షిత్‌ను అడగండంటూ సూచించారు. ఏదేమైనప్పటికీ, తమ ప్రభుత్వం ఈ కార్డును అందుబాటులోకి తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. దీంతో ఢిల్లీ ప్రజలకు ప్రయాణం సులభతరం అవుతుందని చెప్పారు. ఢిల్లీ మెట్రో ఛార్జీలు పెంచిన నేపథ్యంలో దీనికి కౌంటర్‌గా కామన్ మొబిలిటీ కార్డును కేజ్రీవాల్ తీసుకొచ్చారు. ఈ పైలెట్ ప్రాజెక్ట్ ఆవిష్కరణ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి కైలాస్ గెహ్లోత్ కూడా ఉన్నారు. -
మెట్రో పిల్లర్ కూలిందన్న వార్తతో...
బెంగళూర్ : నమ్మ మెట్రో మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి ఫేక్ వీడియో వాట్సాప్‌లో వైరల్ కావటంతో మైసూర్ నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మైసూర్ సమీపంలో మెట్రో పిల్లర్ కూలిందంటూ కొన్ని దృశ్యాలు బుధవారం అర్ధరాత్రి దాటాక వాట్సాప్‌లో వ్యాపించాయి. దీనికి తోడు కొన్ని స్థానిక ఛానెళ్లు కూడా దాన్ని బ్రేకింగ్ న్యూస్ అంటూ ప్రసారం చేయటంతో ఆ వార్త ఒక్కసారిగా దావానంలా పాకింది. దీంతో ప్రజల్లో భయాందోళనలు చెలరేగి తమ బంధు మిత్రుల క్షేమ సమాచారాల గురించి ఆరా తీయటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో నగరంలో ఫోన్ సర్వీసులకు కాసేపు అంతరాయం కూడా కలిగింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీస్ శాఖ, బెంగళూర్ మెట్రో రైల్వే అధికారులు అదంతా అసత్యప్రచారమని, వందతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జరిగిందేంటంటే... శనివారం రాత్రి నయందహల్లి వద్ద నిర్మాణంలో ఉన్న ఓ పిల్లర్‌ను ఒక ట్రక్కు ఢీ కొట్టింది. దీంతో ఆ పిల్లర్ స్వల్పంగా దెబ్బతింది. ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ కూడా గాయాలతో బయటపడ్డాడు. అయితే ఇది మైసూర్ రోడ్ మెట్రో స్టేషన్ వద్ద జరిగిందంటూ వార్త వైరల్ కావటం ఇక్కడ కొసమెరుపు. మెట్రోలో గడబిడ -
మెట్రోలో గడబిడ
సాక్షి, బెంగళూరు: సాంకేతిక లోపం తలెత్తడంతో మెట్రో రైలు కొద్ది నిమిషాల పాటు నిలిచిపోవడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. మంగళవారం ఉదయం 10:17 గంటలకు మైసూరు రోడ్ నుంచి బయ్యప్పనహళ్లికి బయలుదేరిన మెట్రోరైలు కబ్బన్‌పార్క్ స్టేషన్‌కు చేరుకోవడానికి ముందు రెండుసార్లు ఆగిపోతున్నట్లుగా అనిపించింది. ఎలాగో కబ్బన్స్టేషన్కు చేరుకోగానే సాంకేతిక లోపం తలెత్తడంతో రైలు తలుపులు తెరుచుకోలేదు. బోగీల్లో ఏసీ కూడా పనిచేయకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు లోనయ్యారు. గాలి సరిగా ఆడక కంగారు పడ్డారు. మెట్రో సిబ్బంది బయట నుంచి చేసిన సూచనలతో ఎగ్జిట్ ద్వారాల వద్దనున్న అత్యవరసన బటన్‌ను ఒత్తడంతో ఎగ్జిట్ ద్వారాలు తెరుచుకోగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అధికారులతో ప్రయాణికుల వాగ్వాదం వెంటనే రైలు నుంచి బయటకు వచ్చిన ప్రయాణికులు తీవ్ర ఆగ్రహంతో మెట్రో అధికారులు, సిబ్బందితో జరిగిన ఘటనపై వాగ్వాదానికి దిగారు. అసలే భూగర్భంలో ప్రయాణించే రైలులో ఇటువంటి అనుకోని ఘటనలు చోటుచేసుకున్నపుడు ఏం చేయాలనే విషయంపై ప్రయాణికులకు అవగాహన కల్పించలేదని ప్రశ్నించారు. రైలులో ఏసీ కూడా సరిగా పనిచేయకుపోవడాన్ని కూడా పట్టించుకోలేదని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది నిమిషాలు పాటు రైళ్లో ఊపిరి ఆడక వందలాది మంది అగచాట్లు పడ్డామని, ఇలాంటి పరిస్థితిలో ఎవరికైనా ఏదైనా జరిగితే బాధ్యులెవరని మెట్రో అధికారులపై మండిపడ్డారు. హఠాత్తుగా కదిలిన రైలు.. మళ్లీ ఆగ్రహం అదే సమయంలో సాంకేతిక సమస్యతో నిలిచిపోయిన మెట్రోరైలు ఎటువంటి సూచన లేకుండా ఒక్కసారిగా ముందుకు కదలడంతో ప్రయాణికులు మరింత ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. వెంటనే ఉన్నతాధికారులను ఇక్కడికి పిలిపించాలంటూ పట్టుబట్టారు. అధికారులు, సిబ్బంది ఫోన్ల ద్వారా చాలాసేపు ప్రయత్నించినా ఉన్నతాధికారుల నుంచి స్పందన కరువైంది. దీంతో మరోసారి ఇటువంటి సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహిస్తామని, ఈ ఒక్కసారికి మన్నించాలంటూ కబ్బన్‌పార్క్ స్టేషన్ అధికారులు, సిబ్బంది వేడుకోవడంతో ప్రయాణికులు శాంతించారు. -
రాత్రి 2.30 వరకు మెట్రో రైళ్లు
సాక్షి, హైదరాబాద్ : నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి 2.30 గంటల వరకు మెట్రో రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. నాగోల్, మియాపూర్ స్టేషన్ల నుంచి రాత్రి 2.30 గంటలకు చివరి రైళ్లు బయలుదేరతాయన్నారు. కాగా మెట్రో రైళ్లలో ప్రతిరోజూ సరాసరిన లక్ష మంది రాకపోకలు సాగిస్తుండగా.. ఆదివారం ఇతర సెలవు దినాలలో మాత్రం 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. -
ఇది మెట్రో ఇయర్
హైదరాబాద్ చరిత్రలో 2017 సంవత్సరం మర్చిపోలేనిది. ప్రజల కలల మెట్రో రైలు పట్టాలెక్కిన వేళ...ఇది ‘మెట్రో ఇయర్’ అని చెప్పొచ్చు. వచ్చే ఏడాది జూన్ నాటికి అమీర్‌పేట–ఎల్బీనగర్ (17 కిలోమీటర్లు), అమీర్‌పేట– హైటెక్ సిటీ (8.5 కిలోమీటర్లు) మార్గంలోనూ మెట్రో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తాం. నెల రోజుల్లో 32.25 లక్షల మంది మెట్రో రైలులో ప్రయాణించారు. మార్చి నుంచి రైళ్ల ఫ్రీక్వెన్సీ, బోగీల సంఖ్యను పెంచుతాం. చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే..వాటిని అధిగమించి రానున్న రోజుల్లో నగరవాసులకు అద్భుతమైన ప్రయాణ అనుభవాన్ని కల్పించేందుకు గట్టిగా కృషి చేస్తాం. – ఎన్వీఎస్ రెడ్డి, మెట్రో రైల్ ఎండీ సాక్షి, సిటీబ్యూరో/సనత్‌నగర్ : వచ్చే ఏడాది జూన్ నాటికి అమీర్‌పేట–ఎల్బీనగర్ (17 కిలోమీటర్లు), అమీర్‌పేట– హైటెక్ సిటీ (8.5 కిలోమీటర్లు) రూట్లో మెట్రో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. పాతనగరంలోనూ ఎంజీబీఎస్–ఫలక్‌నుమా మార్గంలో మెట్రో పూర్తికి ప్రయత్నాలు ముమ్మరం చేశామన్నారు. గ్రేటర్ వాసుల కలల మెట్రో ప్రారంభమై శుక్రవారానికి నెలరోజులు పూర్తయిన సందర్భంగా రసూల్‌పురాలోని మెట్రోరైల్ భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా చేపట్టిన ప్రతిష్టాత్మక మెట్రో ప్రాజెక్టు అమలు సాధ్యం కాదంటూ ప్రారంభంలో చాలామంది కొట్టిపడేశారని, అలాంటి ప్రాజెక్టును సుసాధ్యం చేసినట్లు తెలిపారు. ఆర్థిక వనరుల లేమి కారణంగా పీపీపీ కింద ఈ ప్రాజెక్టును చేపట్టామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన సమయంలో చాలామంది మెట్రోరైల్ ప్రాజెక్టుపై పుకార్లు సృష్టించారని, వాటన్నింటినీ తాము ఏమాత్రం పట్టించుకోకుండా మెట్రోరైల్ ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేశామన్నారు. హైదరాబాద్ చరిత్రలో 2017 సంవత్సరం మెట్రో ఏడాదిగా నిలిచిపోనుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషిలో మెట్రోరైల్ ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు. హైటెక్‌సిటీ–రాయదుర్గం(1.5 కి.మీ)మార్గంలో మెట్రో పిల్లర్ల ఏర్పాటుకు అలైన్మెంట్ ఖరారు చేశామని..త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. 30 రోజుల్లో 32.25 లక్షల మంది ప్రయాణికులు గడిచిన 30 రోజుల్లో 32.25 లక్షల మంది ప్రయాణికులు మెట్రో రైలులో ప్రయాణించారని ఎండీ తెలిపారు. సరాసరిన రోజుకు లక్ష మంది ప్రయాణికులు మెట్రోరైల్ ప్రయాణం చేశారన్నారు. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ మెట్రోలు ప్రారంభమైన తొలినాళ్లలో ఇంత భారీ స్థాయిలో రద్దీలేదని ఆయన స్పష్టం చేశారు. మెట్రోరైళ్లు రాకపోకలు సాగిస్తోన్న నాగోలు–అమీర్‌పేట–మియాపూర్ మార్గంలోని 24 స్టేషన్లలో ఒక్క ప్రకాష్‌నగర్ స్టేషన్ మినహా మిగతా 23 స్టేషన్లలో పార్కింగ్ వసతి కల్పించామన్నారు. ఇందులో 11 చోట్ల ఎక్స్‌క్లూజివ్ పార్కింగ్ స్టేషన్లు (అర ఎకరా స్థలం కంటే ఎక్కువ) ఉన్నా వాటిల్లో సగం కూడా నిండని పరిస్థితి ఉందన్నారు. త్వరలో కంప్యూటరైజ్డ్ స్మార్ట్ పార్కింగ్ విధానాన్ని అమలులోకి తీసుకురానున్నామన్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సు, ఆటోలకు కలరింగ్ కోడ్ ఇచ్చి పార్కింగ్ విధానం అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. మెట్రో స్టేషన్ల నుంచి సమీప భవనాలకు చేరుకునేందుకు వీలుగా స్కైవాక్‌లు ఏర్పాటుచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జనవరి 15 నాటికి స్టేషన్ల సుందరీకరణ.. అన్ని స్టేషన్ల వద్ద పట్టణ నవీకరణ పథకం కింద చేపట్టిన స్ట్రీట్‌ఫర్నీచర్, ఫుట్‌పాత్‌లు, హరిత వాతావారణం, టైల్స్ ఏర్పాటు పనులు 80 శాతం వరకు పూర్తి చేశామన్నారు. ఒక్కో స్టేషన్ నిర్మాణానికి రూ.60 కోట్లు ఖర్చు చేశామని..వీటివద్ద సుందరీకరణ పనులకు మరో రూ.2 కోట్లు ఖర్చు చేశామన్నారు. అమీర్‌పేట్, మియాపూర్ ఇంటర్‌ఛేంజ్ స్టేషన్ల నిర్మాణానికి రూ.250 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ప్రతీ స్టేషన్‌కు రెండు వైపులా 1.5 కిలోమీటరు మేర ఫుట్‌పాత్ నిర్మాణ పనులతో పాటు సుందరీకరణ పనులు చేపట్టామన్నారు. జనవరి 15 వరకు దాదాపు అన్ని స్టేషన్లలో ఆయా పనులు పూర్తి చేయాలనే లక్ష్యం నిర్దేశించామన్నారు. కారిడార్–3లోని జూబ్లీహిల్స్ నుంచి హైటెక్ సిటీ వరకు పెద్ద సంఖ్యలో ఆక్రమణలను తొలగించామని, ఇదో సవాల్‌గా మారిందన్నారు. బస్సులు, క్యాబ్‌లకు ప్రత్యేక పార్కింగ్ కేపీహెచ్‌బీ, అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ల నుంచి హైటెక్ సిటీకి వెళ్లేందుకు బస్సులతో పాటు ఓలా, ఉబర్ క్యాబ్‌లు నిలిపేందుకు ప్రత్యేక పార్కింగ్ స్థలం కేటాయించామన్నారు. మెట్రో స్టేషన్ల నుంచి ఆర్టీసీ 57 ఫీడర్ బస్సులు నడుపుతుందని..త్వరలో స్టేసన్ల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు నడిపేందుకు వీలుగా ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీని ప్రభుత్వం అమలు చేయనుందన్నారు. అన్ని మెట్రో స్టేషన్ల నుంచి ఫీడర్ బస్సు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అలాగే హైదరాబాద్ బైస్కిల్ క్లబ్ తరుపున స్టేషన్లలో అధునాతన సైకిళ్లను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. గడచిన నెల రోజుల్లో 1.5 లక్షల మెట్రో స్మార్ట్ కార్డులను విక్రయించామన్నారు. ప్రస్తుతం రోజుకు రెండు వేల కార్డుల వరకు విక్రయాలు జరుగుతున్నాయన్నారు. స్మార్ట్‌కార్డు రీచార్జిని పేటీఎం లేదా టీసవారీ యాప్ ద్వారా చేసుకోవచ్చన్నారు. మార్చి తరవాత పెరగనున్న రైళ్ల ఫ్రీక్వెన్సీ.. ప్రస్తుతం మూడు బోగీలతో వెయ్యి మంది ప్రయాణికులతో నడుస్తుండగా మార్చి నుంచి ప్రతీ మెట్రోకు ఆరు బోగీలు ఏర్పాటుచేసి రెండు వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మియాపూర్ నుంచి అమీర్‌పేట మార్గంలో ప్రస్తుతం ఎనిమిది నిమిషాలకో సర్వీసు, అమీర్‌పేట్– నాగోలు మార్గంలో ప్రతి 15 నిమిషాలకో సర్వీసు నడుస్తుందన్నారు. మార్చి తరవాత ఫ్రీక్వెన్సీని 3–5 నిమిషాలకు తగ్గిస్తామని..రైళ్ల సంఖ్యను కూడా రద్దీని బట్టి పెంచుతామన్నారు. ప్రస్తుతం మెట్టుగూడా–అమీర్‌పేట్ మార్గంలో మార్చి వరకు కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ మార్గదర్శకాల మేరకు రైళ్లను మ్యాన్యువల్గానడుపుతున్నామని..ఈ మార్గంలో మరిన్ని భద్రతా పరీక్షలు జరుగుతున్నాయన్నారు. మార్చి తరవాత ఈ రూట్లోనూ కమ్యూనికేషన్‌బేస్డ్ ట్రైన్ కంట్రోల్ వ్యవస్థ ఆధారంగా రైళ్లు నడపనుండడంతో రైళ్ల వేగం పెరుగుతుందని ఆయన స్పష్టంచేశారు. 24 మెట్రో స్టేషన్లలో ..ప్రతీ స్టేషన్‌కు రెండు చివరలా టాయిలెట్ల ఏర్పాటు, నిర్వహణకు టెండర్లను ఆహ్వానించామని..త్వరలో మెట్రో స్టేషన్లలో త్రీస్టార్ హోటళ్లలో ఉండే విధంగా టాయిలెట్స్ నిర్మాణం జరుగుతుందన్నారు. ప్రస్తుతం పోలీసు శాఖ బాంబు హెచ్చరికల నేపథ్యంలో స్టేషన్లలో డస్ట్బిన్లు ఏర్పాటుచేయలేదని..త్వరలో పూర్తిగా పారదర్శకంగా ఉండేలా డిజైన్ చేసిన డస్ట్బిన్లను ఏర్పాటుచేస్తామన్నారు. మెట్రో వ్యయం రూ.16,511 కోట్లు.. మెట్రో ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.16,511 కోట్లు ఖర్చు చేశామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇందులో ఎల్అండ్టీ సంస్థ రూ.14,261 కోట్లు (ఎల్ అండ్ టీ) ఖర్చు చేయగా.. తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిపి మరో రూ.2250 కోట్లు ఖర్చుచేసినట్లు ఎండీ తెలిపారు. మరో రూ.500 కోట్ల వ్యత్యాస నిధులు(వీజీఎఫ్) కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందన్నారు. జర్మనీకి చెందిన కెఫ్డబ్లు్య సంస్థనుంచి సుందరీకరణ పనులకు రుణం సేకరించనున్నామన్నారు. ఎల్అండ్టీ సంస్థ రూ.12,500 కోట్లు వివిధ బ్యాంకుల నుంచి రుణంగా సేకరించిందన్నారు. పంజగుట్ట, హైటెక్ సిటీ ప్రాంతాల్లోని షాపింగ్ మాల్స్ త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని, వాటిల్లోని మొత్తం 16 అధునాతన తెరలపై పడుకుని మరీ సినిమాను వీక్షించే వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు. టిక్కెట్ ధరల తగ్గింపు లేనట్టే.. మెట్రో ప్రయాణ ఛార్జీలు అధికంగా ఉన్నాయన్న ఆందోళన ఉన్నప్పటికీ ఇప్పట్లో ఛార్జీల తగ్గింపు లేనట్టేనని..ఛార్జీలపై నిర్ణయం ఉన్నతస్థాయి కమిటీదేనన్నారు. ఇక ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లలో ప్రయాణించేందుకు వీలుగా కామన్ బస్‌పాస్‌ను ప్రవేశపెట్టేందుకు చర్చలు జరుగుతున్నాయన్నారు. -
మెట్రో జర్నీ సూపర్బ్.. క్యాథరీన్
సాక్షి,సిటీబ్యూరో: నగరంలోని అమెరికా రాయబార కార్యాలయం కాన్సుల్ జనరల్ క్యాథరీన్ బి. హడ్డా గురువారం మెట్రో జర్నీ చేశారు. రసూల్‌పురా–మెట్టుగూ డ మార్గం లో మెట్రోలో ప్రయాణించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రయాణీకులతో సరదాగా గడి పారు. ఆమెకు మెట్రో స్టేషన్లలో ప్రయాణీకులకు కల్పించిన వసతులు, సౌకర్యాలను ఎండీ ఎన్వీఎస్రెడ్డి వివరించారు. మెట్రో ప్రాజెక్టు నిర్మాణంలో వినియోగించిన ఆధునిక సాంకేతికత, పీపీపీ ఆర్థిక నమూన, అధిగమించిన ఇంజినీరింగ్ సవాళ్లను ఆయన వివరించారు. ఆమె వెంట అమెరికా రాయబార కార్యాలయం అసిస్టెంట్ పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ ఆకాశ్ సూరీ, ఇతర ఉన్నతాధికారులున్నారు. -
న్యూ ఇయర్‌కు మెట్రో వాత
జనం ఉత్సాహంతో జేబు నింపుకోవడానికి మెట్రో రైల్ సంస్థ పథకం వేసింది. 31న రాత్రి వేడుకల కోసం ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్‌కు భారీగా తరలివచ్చే ఔత్సాహికులు మెట్రో రైలు ఎక్కాలంటే రెట్టింపు చార్జీలు చెల్లించాలి. ఆ రోజు రాత్రి 11 గంటల నుంచి వేకువజాము 2 వరకు ఇదే తంతు. సాక్షి, బెంగళూరు: న్యూ ఇయర్ వేడుకలను సొమ్ము చేసుకోవడానికి బెంగళూరు నమ్మ మెట్రో రైల్ సంస్థ చార్జీలను తాత్కాలికంగా పెంచింది. చిల్లర సమస్య వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెబుతుండటం గమనార్హం. ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్డులో న్యూ ఇయర్ వేడుకలు భారీగా జరుగుతాయి. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఎం.జీ రోడ్డుకు మెట్రో కనెక్టివిటీ ఉంది. దీంతో క్యాబ్‌లు, సొంత వాహనాలు వదిలి ప్రజలు మెట్రోలోనే వేడుకలకు వచ్చే అవకాశముంది. డిసెంబర్ 31 రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 2 గంటల మధ్య ట్రినిటీ సర్కిల్, ఎం.జీరోడ్, కబ్బన్ పార్క్ నుంచి నగరంలోని ఏ ప్రాంతంలోని మెట్రో స్టేషన్‌కు వెళ్లే వారు రూ.50 చెల్లించి టికెట్‌ను కొనాల్సిందే. ఇతర ప్రాంతాల నుంచి ఈ మూడు మెట్రో స్టేషన్లకు వచ్చేవారు కూడా ఇంతే మొత్తం ఇచ్చుకోవాలి. స్మార్ట్ కార్డ్ కలిగిన వారు మాత్రం పాత ధరల్లోనే ప్రయాణించవచ్చు. అంతేకాకుండా ఎప్పటిలాగా 15 శాతం రాయితీ కూడా లభించనుందని మెట్రో అధికారులు చెబుతున్నారు. ఇందిరానగర్లోనూ వేడుకల జోరు సాధారణంగా న్యూ ఇయర్ వేడుకలు నగరంలోని బ్రిగెడ్, ఎంజీ రోడ్లలో నిర్వహించుకోవడానికి యువత ఎక్కువ ఆసక్తి చూపించేంది. ఈసారి ఇందిరానగర్ 100 ఫీట్ రోడ్డు, కోరమంగళ, జాలహళ్లి ప్రాంతంలో కూడా న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించుకోవడానికి యువత తహతహలాడుతోంది. ఆయా ప్రాంతాల్లో కొత్తగా బార్లు, పబ్‌లు రావడం ఒక కారణమైతే ఎంజీరోడ్, బ్రిగెడ్ రోడ్డుల్లో గత ఏడాది జరిగిన సంఘటనలూ మరో కారణం. అందులోనూ ఇందిరానగర్ రెస్టారెంట్ హబ్‌గా మారడం, మెట్రో కనెక్టివిటీ ఉండటం వల్ల యువత మిగిలిన రెండు ప్రాంతాలతో పోలిస్తే ఇందిరానగర్‌కు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇందిరానగర్‌తో పాటు కోరమంగళ, జాళహళ్లి ప్రాంతాల్లో కూడా అదనపు సీసీ కెమెరాల ఏర్పాటు, పోలీసు సిబ్బంది మోహరింపు తదితర చర్యలను నగర పోలీసులు చేపడుతున్నారు. ఇక న్యూ ఇయర్ వేడుకల్లో గస్తీ బృందంలో 500 హొయ్సల, 150 చీతా వాహనాలు గస్తీ కాస్తాయి. వాహనాల పార్కింగ్‌ను ఎంజీరోడ్, బ్రిగెడ్‌రోడ్, చర్చ్ స్ట్రీట్లలో నిషేదించనున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఇలా డ్రంక్ అండ్ స్పెషల్ డ్రైవ్‌ను ఈనెల 31 అంటే ఆదివారం రాత్రి 9 గంటలకు మొదలయ్యి సోమవారం 4 గంటల వరకూ కొనసాగనుంది. రవాణా శాఖ కూడా ఆదాయం పెంచుకోవడానికి రెడీ అవుతోంది. క్యాబ్‌లు, ఆటో వాలల పై నిఘా పెట్టి వినియోగదారుల నుంచి ఎక్కువ వసూలు చేయకుడా చర్యలు చేపడుతామని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. ఇక న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా బీఎంటీసీ సేవలను సైతం విస్తరించారు. బెంగళూరు నగరంలో ఆదివారం అర్ధరాత్రి 2 గంటల వరకు బీఎంటీసీ బస్సులు నగర వాసులకు అందుబాటులో ఉండనున్నాయి. -
సిటీలో ఇక‘స్టాక్’ పార్కింగ్!
గ్రేటర్ నగరంలో వాహనాల పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ప్రస్తుతం సరైన వసతి లేక వాహనదారులు పడరానిపాట్లు పడుతున్నారు. మెట్రోరైలు అందుబాటులోకి వచ్చినప్పటికీ పలు స్టేషన్ల వద్ద పార్కింగ్ సదుపాయం లేదు. వీటిని పరిగణనలోకి తీసుకున్న జీహెచ్ఎంసీ వీలైనన్ని ప్రాంతాల్లో, వీలైనన్ని పద్ధతుల్లో పార్కింగ్ కల్పించాలని భావిస్తోంది. అందులో భాగంగా తక్కువ స్థలంలోనే ఎక్కువ కార్లు పార్కింగ్ చేయడానికి అనువైన ‘స్టాక్ పార్కింగ్’ విధానంపై దృష్టి సారించింది. జీహెచ్ఎంసీకి చెందిన ఖాళీ స్థలాలతోపాటు నగరంలో వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన ఖాళీ స్థలాల్లోనూ పార్కింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించాలని భావిస్తోంది. ముఖ్యంగా మెట్రో స్టేషన్లకుసమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశాలపై ప్రత్యేక దృష్టి సారించింది. సాక్షి, సిటీబ్యూరో: తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాలు పార్కింగ్ చేసేలా కొత్త కాంప్లెక్సులు నిర్మించాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. ఈమేరకు స్టాక్ పార్కింగ్ విధానాన్ని ఎంచుకుంది. ఈ విధానంలో రెండు కార్లు పట్టే స్థలంలోనే 12 కార్లను పార్కింగ్ చేయవచ్చు. ఒక కారుపై మరో కారు ఉండేలా నిలువుగా పార్కింగ్ ఏర్పాట్లు చేస్తారు. ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో ఉన్న ఈ విధానం ద్వారా తక్కువ స్థలంలోనే ఎక్కువ కార్లు నిలిపి ఉంచొచ్చు. నగరంలో ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు తొలుత జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం తో పాటు జోనల్, సర్కిల్ కార్యాలయాల్లోని స్థలాలను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. బీఓటీ (బిల్ట్, ఆపరేట్, ట్రాన్స్ఫర్) పద్ధతిలో స్టాక్ పార్కింగ్ కాంప్లెక్సులు ఏర్పాటు చేసే ఆలోచన ఉందని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ప్రయోగాత్మకంగా తొలుత జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో వీటిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. పార్కింగ్ ఫీజును మాత్రం జీహెచ్ఎంసీయే నిర్ణయిస్తుందన్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే.. తగిన స్థలమున్న ప్రైవేట్ వ్యక్తులు సైతం ఇలాంటి పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవచ్చునన్నారు. తద్వారా మెట్రో స్టేషన్లతోపాటు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పార్కింగ్ సమస్యలు తగ్గుతాయన్నారు. జీహెచ్ఎంసీ, ప్రభుత్వ స్థలాల్లో.. జీహెచ్ఎంసీకి వివిధ ప్రాంతాల్లో ఉన్న ఖాళీ ప్రదేశాల్లో, నగరంలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఖాళీ స్థలాల్లోనూ పార్కింగ్ కాంప్లెక్సులు నిర్మించాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. ఇందుకుగాను ప్రైమ్, నాన్ ప్రైమ్, మిడిల్ ప్రైమ్ ప్రాంతాలుగా వర్గీకరించి మూడు ప్రాంతాలతో కలిపి ఒక ప్యాకేజీగా టెండర్లు ఆహ్వానించాలని యోచిస్తున్నారు. పాతబస్తీలోని ఖిల్వత్ వద్ద మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్ కోసం ఏళ్లతరబడి టెండర్లు పిలుస్తున్నప్పటికీ, గిట్టుబాటు కాదని ఎవరూ ముందుకు రావ డం లేరు. ఇలాంటి పరిస్థితి నివారించేందుకు రద్దీ ఎక్కువగా ఉండి, బాగా డిమాండ్ ఉండే ప్రాంతాలను ప్రైమ్ ఏరియాలుగా, డిమాండ్ లేని వాటిని నాన్ప్రైమ్ ఏరియాగా, తక్కువ డిమాండ్ ఉండేవాటిని మిడిల్ ప్రైమ్ ఏరియాగా వర్గీకరించి ఒకే ప్యాకేజీలో మూడు ప్రాంతాలూ ఉండేలా టెండర్లు పిలవాలని భావిస్తున్నారు. తద్వారా పార్కింగ్ కాంప్లెక్సుల నిర్మాణాలకు ముందుకొస్తారని భావిస్తున్నారు. ఇందుకుగాను ఇప్పటికే కొన్ని ప్రాంతాలను గుర్తించినట్లు మేయర్ రామ్మోహన్ తెలిపారు. చిక్కడపల్లి మార్కెట్లో దాదాపు రెండెకరాల స్థలం ఉంది. అక్కడ మార్కెట్‌తోపాటు పార్కిం గ్ కాంప్లెక్స్‌కూ వీలుందన్నారు. మెట్రోస్టేషన్కూ దగ్గరగా ఉంటుందని దాన్ని ఎంపిక చేశారు. చుడీబజార్‌లో జీహెచ్ఎంసీ బీటీ మిక్సింగ్ ప్లాంట్ వద్ద దాదాపు 2000 గజాల స్థలం ఉంది. అక్కడ నాలుగైదు అంతస్తుల్లో నిర్మించే కాంప్లెక్స్‌లో ఒక అంతస్తులో చార్మినార్ పరిసరాల్లోని వీధి వ్యాపారులకు దుకాణాలు కేటాయించే ఆలోచన కూడా ఉంది. చార్మినార్ పాదచారుల పథకం, అమృత్సర్ స్వర్ణదేవాలయం తరహా లో చార్మినార్ దగ్గరి వీధి వ్యాపారులను తరలించాల్సి ఉన్నందున ఇక్కడ వారికి సదుపాయం కల్పించవచ్చునని భావిస్తున్నారు. ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ వాహనాల పార్కింగ్ యార్డు వద్దే మెట్రో స్టేషన్ ఉంది. బస్టాప్ కూడా ఉంది. అక్కడి స్థలంలో పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మించడం ద్వారా ఎన్నో విధాలుగా ఉపయుక్తంగా ఉం టుందని అంచనా వేశారు. ఖిల్వత్ దగ్గర, శాలిబండ వద్ద కూడా పార్కింగ్కాంప్లెక్స్ల నిర్మా ణం ఆలోచనలున్నాయి. వీటితోపాటు జీహెచ్ఎంసీకి చెందిన దాదాపు పది స్థలాల్లో, ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన 15 ఖాళీస్థలాలు పార్కింగ్ కాంప్లెక్సుల నిర్మాణానికి అనువుగా ఉన్నాయని గుర్తించారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్ ద్వారా ఆయా శాఖలనుంచి పార్కింగ్ కోసం స్థలాలు పొందాలని భావిస్తున్నారు. కోఠి మహిళా కళాశాల, కొత్తపేట పండ్ల మార్కెట్, రంగారెడ్డి జిల్లా కోర్టులు తదితర ప్రదేశాల్లో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన çస్థలాలున్నట్లు గుర్తించారు. అక్కడ పార్కింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి అవకాశముంటుందని అంచనా వేశారు. -
పాత బస్తీలో మెట్రో కోసం పోరాడతాం: బీజేపీ లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: పాత బస్తీలో మెట్రో పనులు వెంటనే ప్రారంభించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఎంఐఎం ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గుతోందని, పాత బస్తీలో మెట్రో రైలు కోసం రాజకీయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. తార్నాక నుంచి అమీర్‌పేట్ వరకు ఆయన మెట్రో రైలులో ఆదివారం ప్రయాణించారు. ఈ సందర్భంగా మెట్రోలో ప్రయాణికులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. మెట్రో ప్రయాణం సామాన్యులకు భారం అవుతోందని, చార్జీలు తగ్గించాలని కోరారు. మెట్రో స్టేషన్ లలో పార్కింగ్ లేదంటూ పార్కింగ్ వసతులను కల్పించాలని సూచించారు. -
మెట్రోలో లేడీస్ స్పెషల్
సాక్షి, బెంగళూరు: ట్రాఫిక్ పద్మవ్యూహంతో కూడిన బెంగళూరు నగరంలో మెట్రో రైల్ నిత్యం వేల మంది ప్రజలను సకాలంలో గమ్యం చేరుస్తోంది. మూడు బోగీలు మాత్రమే ఉన్న మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. మహిళల కోసం ప్రత్యేకంగా బోగీలు లేకపోవడంతో కిక్కిరిసిన బోగీల్లో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో మెట్రో రైళ్లల్లో మహిళల కోసం ప్రత్యేక బోగీలు ఏర్పాటు చేయాలంటూ గతకొద్ది కాలంగా డిమాండ్లు ఊపందుకున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకున్న మెట్రో సంస్థ బీఎంఆర్సీఎల్ ఒక్కో మెట్రో రైలుకు మహిళల కోసం అదనంగా ఒక బోగీని అమర్చాలని నిర్ణయించింది. అదనపు బోగీల్లో ఒకటి కేటాయింపు కొత్త మెట్రో బోగీల నిర్మాణం, అనుసంధాన ప్రక్రియను బీహెచ్ఈఎల్ సంస్థకు అప్పగించింది. ప్రస్తుతం మూడు బోగీల నిర్మాణ పనులు తుది దశకు చేరుకోగా ప్రయోగాత్మకంగా ఒక రైలుకు అమర్చి పరీక్షించనున్నారు. వీటిì పనితీరు, మహిళల స్పందన పరిశీలించిన అనంతరం ఈ ప్రయోగం విజయవంతమైతే జూన్ నెల నుంచి అన్ని రైళ్లకు అదనంగా మూడు బోగీలను అమర్చడానికి బీఎంఆర్సీఎల్ నిర్ణయించుకుంది. అందులో ఒక బోగీ మహిళలకే ప్రత్యేకంగా కేటాయిస్తారు. రెండు రోజులు క్రితం బీఎంఆర్సీఎల్ ఎండీ మహేంద్ర జైన్ బీహెచ్ఈఎల్ సంస్థకు వెళ్లి ప్రస్తుతం తుది దశలోనున్న మెట్రో బోగీలను పరిశీలించారు. విమానాశ్రయ మార్గంలో వినూత్న వసతులు నాగవార, హెగ్డే నగర, జక్కూరు మీదుగా మెట్రో రైలు మార్గాన్ని కెంపేగౌడ అంర్జాతీయ విమానాశ్రయం వరకూ నిర్మించడానికి ప్రభుత్వం ఆమోదించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెట్రో ద్వారా ఎయిర్‌పోర్టు చేరుకునే ప్రయాణికులకు నమ్మ మెట్రో అనేక ప్రయోజనాలు కల్పించాలని భావిస్తోంది. ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనలకు అటు ప్రభుత్వంతో పాటు ఇటు ఎయిర్పోర్ట్ నిర్వాహకుల నుంచి కూడా అనుమతి లభించినట్లు సమాచారం. ముఖ్యంగా ఎయిర్‌పోర్టుకు వెళ్లే వారికి మెట్రోలోనే చెక్ ఇన్ సదుపాయం కల్పించనున్నారు. దీని వల్ల సమయం ఆదా అవుతుంది. ఇక విమానాల రాకపోకల సమయాన్ని ఎప్పటికప్పుడు తెలియజేసే డిజిటల్ డిస్ప్లే కూడా అందుబాటులోకి రానుంది. అదనపు లగేజీని రవాణాకు ప్రత్యేక బోగి ఏర్పాటు చేసే ఆలోచన కూడా నమ్మమెట్రో వద్ద ఉంది. దీని వల్ల విమానయానం చేయాలనుకునే వారు ఎక్కువగా మెట్రోనే ఆశ్రయిస్తారని తద్వారా సంస్థకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనకరమని అధికారులు భావిస్తున్నారు. జనవరి చివర్లో బోగీలు వస్తాయి ‘జనవరి నెలాఖరునాటికి బోగీలను అందించనున్నట్లు బీహెచ్ఈఎల్ సంస్థ తెలిపింది. బోగీలు అందిన వెంటనే మెట్రోరైలుకు అమర్చి రెండు నెలల పాటు బోగీల పనితీరు, మహిళల నుంచి స్పందన పరిశీలిస్తాం. తరువాత వీలైనంత త్వరగా మిగిలిన అన్ని రైళ్లకు అదనపు బోగీలను అమర్చుతాం’ –మహేంద్ర జైన్, బీఎంఆర్సీఎల్ ఎండీ -
మెట్రో రైలుపై అంచనాలు తప్పాయా?
మహానగరంలో మెట్రో రైలు పరుగుపై అధికారులు పెంచుకున్న అంచనాలు తప్పాయి. నాగోల్–అమీర్‌పేట్, మియాపూర్–అమీర్‌పేట్ మార్గంలో నిత్యం 2.50 లక్షల మంది ప్రయాణిస్తారని భావించగా.. ఇందులో సగం మంది కూడా ప్రయాణించడం లేదు. గ్రేటర్లో మెట్రో రైలు పరుగులు మొదలై బుధవారానికి 22 రోజులు పూర్తయ్యాయి. ఈ మధ్య కాలంలో సుమారు 25 లక్షల మంది జాయ్‌రైడ్ చేసి ఆనందించారు. శని, ఆదివారాల్లో రద్దీ రెండు లక్షలు కాగా.. మిగతా రోజుల్లో కనాకష్టంగా లక్ష మంది ప్రయాణించారు. దీనికంతటికీ ఆయా స్టేషన్లలో పార్కింగ్ సదుపాయం లేకపోవడం, తాగునీరు, టాయిలెట్లు ఏర్పాటు చేయకపోవడమే కారణమని తేలింది. నగరవాసులకు ప్రయాణ సేవలు అందిస్తున్న ఎంఎంటీఎస్‌పై మెట్రో రైలు ప్రభావం చూపిస్తుందని అంతా భావిస్తే.. ఇప్పుడా లెక్క తప్పని తేలింది. సిటీలో మెట్రో రైలు 22 రోజులుగా పరుగులు తీస్తున్నా ఎంఎంటీఎస్‌కు ప్రయాణికుల ఆదరణ మాత్రం తగ్గలేదు. రోజూ సుమారు 1.50 లక్షల మంది నగరంలోని వివిధ ప్రాంతాలకు ఎంఎంటీఎస్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. మెట్రో వల్ల సికింద్రాబాద్–హకీంపేట్ మార్గంలో కొంతమేర ప్రభావం ఉండవచ్చని మొదట్లో రైల్వే వర్గాలు భావించినా రద్దీ మాత్రం ఎప్పటిలాగే కొనసాగుతోంది. దీనికి ఎంఎంటీఎస్ సేవలు ఐటీ కారిడార్‌కు సమీపంలో ఉండడం, టికెట్ ధర కూడా తక్కువ కావడమేనని అధికారులు భావిస్తున్నారు. 22 రోజుల్లో 25 లక్షల మంది మెట్రో జర్నీ సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లోని మెట్రో రైలు పరుగులు తీస్తున్న నాగోల్–అమీర్‌పేట్, మియాపూర్–అమీర్‌పేట్ మార్గాల్లో నిత్యం 2.50 లక్షల మంది ప్రయాణిస్తారని తొలుత అధికారులు వేసిన అంచనాలు తల్లకిందులైంది. ఈ 22 రోజుల్లో కేవలం 25 లక్షల మంది మాత్రమే ప్రయాణించినట్టు లెక్క తేల్చారు. అదీ శని, ఆదివారాల్లోనే రద్దీ పెరిగినట్టు గుర్తించారు. మెట్రో నడుస్తున్న మొత్తం 30 కి.మీ. మార్గంలోని 24 స్టేషన్లు ఉన్నాయి. వీటిలో పార్కింగ్ సదుపాయం ఉన్న స్టేషన్లు కేవలం ఐదు మాత్రమే. మిగతా 19 స్టేషన్ల వద్ద పార్కింగ్ సమస్య జఠిలంగా మారడంతో వ్యక్తిగత వాహనాలతో స్టేషన్లకు వచ్చినవారికి అగచాట్లు తప్పడంలేదు. వసతుల లేమితో వెనుకంజ నగరంలోని మెట్రో స్టేషన్లకు చేరుకునేందుకు సమీప కాలనీల నుంచి ఆర్టీసీ ఫీడర్ బస్సులు అరకొరగానే నడుస్తున్నాయి. ఇక స్టేషన్లకు లక్షలాదిమంది ప్రయాణికులు ఒకేసారిగా తరలివస్తే రద్దీ నియంత్రణ కష్టతరమవుతోంది. స్టేషన్లలో మంచినీరు వసతి అసలే లేకపోవడం, టాయిలెట్ వసతులు అరకొరగా ఉండడం.. అదీ పెయిడ్ విధానం కావడం పట్ల ప్రయాణికులు మెట్రో ప్రయాణానికి మొగ్గుచూపడం లేనట్టు తెలుస్తోంది. ఇక టోకెన్లు, స్మార్ట్‌కార్డుల కొనుగోలు, వాటి రీచార్జి వంటి అంశాలపై ప్రయాణికులకు సరైన అవగాహన లేకపోవడంతో బాలారిష్టాలు తప్పడంలేదు. ఈ నేపథ్యంలో గత 22 రోజులుగా మెట్రో నేర్పిన పాఠాలు.. అధికారులు నేర్వాల్సిన గుణపాఠాలు.. తక్షణం తీసుకోవాల్సిన చర్యలు.. పబ్లిక్ డిమాండ్స్ ఇలా ఉన్నాయి.. ♦ పార్కింగ్ పరేషాన్ పరిష్కరించాలి: మొత్తం 24 స్టేషన్లల్లో మియాపూర్, రసూల్‌పురా, సికింద్రాబాద్ పాత జీహెచ్ఎంసీ కార్యాలయం, నాగోల్ మెట్రో డిపో, చాలిస్ మకాన్ (అమీర్‌పేట్)లో మాత్రమే పార్కింగ్ సదుపాయం ఉంది. అన్ని చోట్లా ఉచిత పార్కింగ్ వసతి కల్పించాలని సిటీజన్లు కోరుతున్నారు. ♦ ఫీడర్ బస్సుల సంఖ్యను పెంచాలి: ప్రస్తుతం 30 కి.మీ. మెట్రో కారిడార్‌లో సమీప కాలనీలకు ఆర్టీసీ కేవలం 50 ఫీడర్ బస్సులను 10 రూట్లలో మాత్రమే నడుపుతోంది. ప్రతీ స్టేషన్ నుంచి 25 బస్సులు నిరంతరం సమీప కాలనీలు, బస్తీలకు రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలి. ♦ రైళ్ల సంఖ్యను పెంచాల్సిందే: నాగోల్–అమీర్‌పేట్ (17కి.మీ), మియాపూర్–అమీర్‌పేట్ (13 కి.మీ) మార్గంలో ప్రస్తుతం 7 చొప్పున 14 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అధిక రద్దీ నేపథ్యంలో వీటి సంఖ్యను పదికి పెంచాలన్నది పబ్లిక్ డిమాండ్. ప్రస్తుతం రైళ్ల ఫ్రీక్వెన్సీ 10–15 నిమిషాలుగా ఉంది. దీన్ని 5 నిమిషాలకు తగ్గించాలి. ♦ రద్దీ నియంత్రణ : శని,ఆదివారాల్లో మెట్రో స్టేషన్లు ఎగ్జిబిషన్‌ను తలపిస్తున్నాయి. వేలాదిమంది పిల్లాపాపలతో స్టేషన్లకు తరలివస్తున్నారు. రద్దీ నియంత్రణకు పోలీసు శాఖ సహకారంతో తొక్కిసలాట జరగకుండా స్టేషన్లలోనికి, ప్లాట్ఫారం పైకి, బోగీల్లోకి వెళ్లే సమయంలో క్యూపద్ధతి, బార్కేడింగ్ సిస్టం ఏర్పాటు చేయాలి. ♦ స్మార్ట్‌కార్డు, మొబైల్యాప్: మెట్రో స్మార్ట్‌కార్డు ప్రస్తుతానికి మెట్రో జర్నీకే ఉపయుక్తం. దీని ద్వారా షాపింగ్, ఇంధన అవసరాలు, ఎంఎంటీఎస్, ఆర్టీసీ ఇలా 16 రకాల సేవలు అందేలా చర్యలు తీసుకుంటే ప్రయాణికులకు మేలు జరుగుతుంది. ఈ కార్డు ద్వారా అందే ప్రయోజనాలపై వినియోగదారులకు అవగాహన పెంచాలి. ఇక ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన ‘టి–సవారీ’ యాప్ ఉపయోగాలపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సివుంది. ♦ టోకెన్ల తకరారు: స్టేషన్లలో టిక్కెట్ విక్రయయంత్రాల వద్ద పాతనోట్లను యంత్రాలు తిరస్కరిస్తున్నాయి. టిక్కెట్‌కు సరిపడా చిల్లర లభించక వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. వీటి వినియోగం పైనా జర్నీ చేసేవారికున్న అపోహలను మెట్రో అధికారులు తొలగించాల్సిన అవసరం ఉంది. ♦ మంచినీరు, టాయిలెట్స్: మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు దాహార్తిని తీర్చుకునే అవకాశం లేక విలవిల్లాడుతున్నారు. ప్రతీ స్టేషన్లో స్వచ్ఛమైన తాగునీటిని అందుబాటులో ఉంచాలి. ఇక స్టేషన్లలో ఉన్న పే అండ్ యూజ్ టాయిలెట్లు.. అదీ అరకొరగానే ఉండడంతో ప్రయాణీకుల అవస్థలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. తక్షణం స్టేషన్ రెండు చివరలా అత్యధికులు ఉపయోగించుకునేలా ఉచిత టాయిలెట్లు ఉండాలి. ♦ ఫుట్‌పాత్‌లు, స్ట్రీట్ ఫర్నిచర్: ప్రతీ స్టేషన్ వద్ద తీరైన ఫుట్‌పాత్‌లు, బస్‌లు, ఆటో, క్యాబ్‌లు నిలిపేందుకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేస్తామన్న అధికారుల మాటలు కాగితాలకే పరిమితమయ్యాయి. పలు స్టేషన్ల వద్ద ప్రధాన రహదారులు ఇరుకుగా ఉన్నాయి. ఫుట్‌పాత్‌లు, స్ట్రీట్ ఫర్నిచర్ ఏర్పాటు, హరిత వాతావరణం ఏర్పాటు చేసే పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులను తక్షణం పూర్తిచేయాలి. ♦ అమ్మో సైకిల్‌స్టేషన్లు: ప్రస్తుతానికి మియాపూర్ మెట్రోడిపోలనే ఈ సదుపాయం ఉంది. మరిన్ని స్టేషన్లకు ఈ సదుపాయం కల్పించాలని.. సైకిలింగ్ క్లబ్లో ప్రవేశించేందుకు సభ్యత్వ రుసుం సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ♦ మెట్రో రూట్లలో తగ్గని ట్రాఫికర్: ప్రస్తుతం రెండు మార్గాల్లో మెట్రో జర్నీ చేస్తున్నవారి సంఖ్య లక్షకు మించడం లేదు. నాగోల్–అమీర్‌పేట్, మియాపూర్–అమీర్‌పేట్ మార్గాల్లో ట్రాఫికర్ అధికంగానే కనిపిస్తోంది. మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ వసతి లేకపోవడం, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ సమస్య కారణంగా మెజార్టీ సిటీజన్లు తమ వాహనాలనే నమ్ముకుంటున్నారు. దీంతో మెట్రో రూట్లలో ఉదయం,సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ టెర్రర్ అలాగే ఉంది. ♦ హైటెక్‌సిటీ.. ఎల్బీనగర్ వరకు ఉండాలి: అమీర్‌పేట్ వరకున్న మెట్రో మార్గాన్ని ఇటు హైటెక్‌సిటీ.. అటు ఎల్బీనగర్ వరకు పొడిగిస్తేనే మెట్రో రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతుందని మెజార్టీ సిటీజన్ల అభిప్రాయం ప్రధానంగా అమీర్‌పేట్–హైటెక్‌సిటీ మార్గంలో పలు ఆస్తుల సేకరణ, స్టేషన్ల ఎంట్రీ ఎగ్జిట్ మార్గాల డిజైన్లు మమార్చడం, సైబర్ టవర్స్, శిల్పారామం ప్రహరీల కూల్చివేతలు రీడిజైనింగ్ కారణంగా.. ఈ ప్రాంతాల్లో మెట్రో రూటు పనులు జఠిలంగా మారనున్నాయి. అమీర్‌పేట్– ఎల్బీనగర్ మార్గంలో లక్డీకాపూల్ వద్ద రైలు ఓవర్‌బ్రిడ్జీ నిర్మాణం, పుత్లీబౌలి వద్ద మెట్రో పనులు నత్తనడకన సాగుతుండడం ప్రతిబంధకంగా మారింది. ఈ పనులను త్వరగా పూర్తి చేయాలి. ఈ రెండు మార్గాలు పూర్తయితేనే మెజార్టీ సిటీజన్లకు మెట్రో జర్నీ ఉపయుక్తంగా ఉంటుంది. ఎంఎంటీఎస్‌పై ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది.... సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా ముద్రపడిన మెట్రో రైలు.. ఎంఎంటీఎస్‌పై ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. గత 22 రోజులుగా మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నా ఎంఎంటీఎస్ సర్వీసులను వినియోగించుకుంటున్న ప్రయాణికుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. ప్రతిరోజు 1.50 లక్షల మంది ఎంఎంటీఎస్ రైళ్లలో రాకపోకలు సాగిస్తున్నారు. రెండు రైళ్లు రాకపోకలు సాగించే మార్గాలు వేరు కావడమే ఇందుకు కారణం. ప్రస్తుతం సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల నుంచి హైటెక్‌సిటీకి వెళ్లే ప్రయాణికులకు ఎంఎంటీఎస్ అందుబాటులో ఉంది. హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్లో దిగితే అక్కడి నుంచి రెండు, మూడు కిలోమీటర్ల పరిధిలోనే ఐటీ కార్యాలయాలు ఉండడంతో ఎంఎంటీఎస్‌కు డిమాండ్ ఉంది. అటు లింగంపల్లి నుంచి, ఇటు నాంపల్లి నుంచి హైటెక్‌సిటీకి వెళ్లే వాళ్లకు కూడా ఎంఎంటీఎస్ మాత్రమే సౌకర్యంగా ఉంది. నాగోల్–అమీర్‌పేట్– మియాపూర్ మెట్రో మార్గానికి, ఫలక్‌నుమా–సికింద్రాబాద్–హైటెక్‌సిటీ–లింగంపల్లి ఎంఎంటీఎస్ మార్గానికి ఎలాంటి సంబంధం లేదు. దీంతో ఎంఎంటీఎస్‌పై మెట్రో ప్రభావం చూపలేదు. ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్‌కు, సికింద్రాబాద్ నుంచి హైటెక్‌సిటీ, లింగంపల్లికి ఎక్కువ మంది ప్రయాణికులు ఎంఎంటీఎస్‌లో రాకపోకలు సాగిస్తున్నారు. ఎంఎంటీఎస్ చౌకైన ప్రయాణం మెట్రో చార్జీలతో పోలిస్తే ఎంఎంటీఎస్ టికెట్ ధరలు చాలా తక్కువ. కనిష్ట చార్జీ రూ.5 కాగా గరిష్ట చార్జీ రూ.10 మాత్రమే. మెట్రోలో కనిష్టంగా రూ.10 నుంచి గరిష్టంగా రూ.60 వరకు చార్జీ ఉంది. ఈ నేపథ్యంలో మెట్రో రైళ్లు, సిటీ బస్సుల కంటే కూడా ఎంఎంటీఎస్ ప్రయాణం చాలా చౌకగా ఉంది. ప్రయాణికుల ఆదరణ ఏ మాత్రం తగ్గకపోవడానికి ఈ చౌక చార్జీలు కూడా కారణమయ్యాయి. ఎంఎంటీఎస్‌లో రూ.10 టిక్కెట్‌పై ఏకంగా ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వరకు పయనించవచ్చు. అదే మెట్రోలో ఉప్పల్ నుంచి మియాపూర్ వెళ్లేలంటే రూ.60 ఖర్చవుతుంది. మరోవైపు కేవలం రూ.450 ఎంఎంటీఎస్ పాస్‌పైన నెలంతా పయనించవచ్చు. ప్లాట్‌ఫామ్ టిక్కెట్ ప్రస్తుతం రూ.10 ఉంది, కానీ అంతే ధరతో ఎంఎంటీఎస్ టిక్కెట్‌పై 40 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసే సదుపాయం లభించడం గమనార్హం. అందుకే గ్రేటర్లో అన్ని వర్గాల ప్రయాణికులకు ఎంఎంటీఎస్ ఒక లైఫ్‌లైన్‌గా మారింది. ఉదయం 4 నుంచి రాత్రి 11.30 వరకు కూడా ఈ రైళ్లు అందుబాటులో ఉండడం మరో సదుపాయం. రెండో దశతో మరో 2 లక్షల మందికి సేవలు ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు పూర్తయితే మరో 2 లక్షల మందికి పైగా రవాణా సదుపాయం లభిస్తుంది. ముఖ్యంగా అటు పటాన్చెరు–తెల్లాపూర్ నుంచి ఇటు మేడ్చల్–బొల్లారం–సికింద్రాబాద్ వరకు, ఘట్కేసర్ నుంచి సికింద్రాబాద్ వరకు, ఫలక్‌నుమా నుంచి ఉందానగర్ వరకు నగర శివార్లను కలుపుతూ ఎంఎంటీఎస్ కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది. దీంతో ఇప్పటి వరకు కేవలం సిటీబస్సులు మాత్రమే ఉన్న ప్రాంతాలకు ఎంఎంటీఎస్ రైలు సేవలు అందుబాటులోకి వస్తాయి. కానీ ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి కావలసిన ఈ ప్రాజెక్టు పనులకు నిధుల లేమి గండంగా మారింది. 2012లో ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు ఆరు మార్గాల్లో రూ.812 కోట్లతో అంచనాలను రూపొందించారు. కానీ ప్రస్తుతం ఈ ప్రాజెక్టు మొత్తం రూ.1000 కోట్లు దాటినట్లు అంచనా. రాష్ట్ర ప్రభుత్వం మూడొంతుల నిధులను అందజేయాలి. మిగతా 1/4 వంతు రైల్వే అందజేస్తుంది. కానీ ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి రూ.150 కోట్ల వరకే అందాయి. అన్ని మార్గాల్లో సింగిల్ లైన్ డబ్లింగ్ చేశారు. కొన్ని చోట్ల విద్యుదీకరణ పూర్తయింది. మొత్తం 60 శాతం పనులు పూర్తయ్యాయి. కొత్త రైళ్లు కొనుగోలు చేయాల్సి ఉంది. అల్వాల్, భూదేవినగర్, తదితర ప్రాంతాల్లో రైల్వేస్టేషన్లు నిర్మించాలి. ఇంకా కొన్ని రూట్లలో విద్యుదీకరణ, డబ్లింగ్ పనులు పూర్తి చేయాలి. నిధుల కొరత కారణంగా ఈ పనులన్నీ ఆగిపోయాయి. ఈ డిసెంబర్‌కు బొల్లారం–సికింద్రాబాద్ మధ్య రెండో దశ రైళ్లు నడపాలని భావించారు. అలాగే ఘట్కేసర్–సికింద్రాబాద్, పటాన్చెరు–తెల్లాపూర్ లైన్లను కూడా వినియోగంలోకి తేవాలని లక్ష్యంగా నిర్దేశించారు. కానీ నిధుల లేమి కారణంగా పనులు స్తంభించాయి. మెట్రో రెండో దశ పూర్తయితే.. రెండో దశ ఎంఎంటీఎస్ పనుల పూర్తికి డిసెంబర్ గడువు ముగిసినప్పటికీ పనులు పూర్తి కాలేదు. దీంతో 2018లో పూర్తి చేయాలని తాజాగా నిర్ణయించారు. కానీ వచ్చే జూన్ నాటికి మెట్రో రెండో దశ హైటెక్‌సిటీ–రాయదుర్గం లైన్ పూర్తయితే ఎంఎంటీఎస్‌కు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశముంది. ఎంఎంటీఎస్ ప్రయాణికులు మెట్రో వైపు మళ్లొచ్చని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. నగర శివారును అనుసంధానం చేసే ఎంఎంటీఎస్ రెండో దశను సకాలంలో పూర్తి చేస్తే 2 లక్షల మందికి అతి తక్కువ చార్జీలతో రవాణా సదుపాయం లభిస్తుంది. -
మెట్రో సాకారానికి ఆద్యుడు వైఎస్సార్
ప్రపంచస్థాయిలో నిర్మాణం జరుగుతున్న హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు మొదటగా ప్రోత్సాహం ఇచ్చిందీ, మద్దతు పలికిందీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సారే అని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో సాగునీటి ప్రాజెక్టులు, గ్రామీణాభివృద్థి ప్రాధమ్యాలుగా తీసుకున్నప్పటికీ మెట్రో రైల్ ప్రాజెక్టు గురించి ప్రతిపాదించగానే డబ్బు విషయంలో తనను ఇబ్బంది పెట్టవద్దు కానీ ప్రాజెక్టును మీ సొంత ఆలోచనలతో ముందుకు తీసుకెళ్లాలని భుజం తట్టింది వైస్సారే అని అన్నారు. మెట్రో విషయంలో మీరేం చేయాలంటే అది చేయండి. మీకు ఎంత పవర్ కావాలంటే అంత ఇస్తాను అని ఆయన చెప్పిన తర్వాతే ముందుకు కదిలామంటున్న ఎన్వీఎస్ రెడ్డి అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... హైదరాబాద్‌లో మెట్రోరైలు నిర్మాణం అనే ఆలోచన మీకు ఎలా తట్టింది? మా గురువు శ్రీధరన్ ఢిల్లీలో మెట్రో కడుతున్నప్పుడు హైదరాబాద్‌లో మెట్రో ఎందుకు కట్టకూడదు అనే ఆలోచన వచ్చింది. నేనూ, నా బ్యాచ్‌మేట్ ఎస్పీ సింగ్ ఇద్దరం కలిసి హైదరాబాద్‌లో మనమూ మెట్రో కడదాం అనుకున్నాం. అంతకుముందు ఈ ప్రాజెక్టు ప్రతిపాదనే లేదా? లేదండి. చంద్రబాబు ఏపీ సీఎంగా ఉన్నప్పుడు నేను రాష్ట్రానికి వచ్చాను. ఈ ప్రాజెక్టు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దివాలా ఎత్తుతుందని, రోజుకు కోటి రూపాయల నష్టం వస్తుం దని ఆయనకు అందరూ చెప్పారు. దాంతో సరే చూద్దాం అని బాబు మెట్రో ప్రతిపాదనను అలా పక్కన పెట్టారు. తర్వాత వైఎస్సార్ అధికారంలోకి వచ్చారు. హైదరాబాద్ పెరుగుతున్న నగరం కాబట్టి మెట్రో తప్పకుండా కట్టితీరాలి అని నేనూ, ఎస్పీ సింగ్ నిర్ణయించుకుని వైఎస్‌ని కలిశాం. ‘‘దానిదేముంది. చేయండి.. కానీ నన్ను మాత్రం డబ్బు అడగొద్దు’’ అనేశారు. ‘ఇంత పెద్ద ప్రాజెక్టు కదా. డబ్బు అడగొద్దంటే ఎలా’? అన్నాం. ‘ఈ ప్రాజెక్టుకు కావలసిన డబ్బుకోసం మీ సొంత సృజనాత్మక శక్తిని ఉపయోగించండి. ప్రస్తుతం సాగునీటి ప్రాజెక్టులు, గ్రామీణాభివృద్ధి నా ప్రాధాన్యతలు. మీరేం చేయాలంటే అది చేయండి. మీకు ఎంత పవర్ కావాలంటే అంత ఇస్తాను’ అని వైఎస్సార్ చెప్పారు. అలా ప్రారంభించాం. ప్రారంభంలో సమస్యలు వచ్చాయి. చివరకు 2012లో ప్రాజెక్టు మొదలైంది. మెట్రోకు రూ.30 వేల కోట్లు ఎదురిస్తామని మైటాస్ చెప్పడం వివాదమైంది కదా! వచ్చే 35 ఏళ్లలో అంత మొత్తం ఇస్తామన్నారు. కానీ దాని ప్రస్తుత విలువ రూ. 1,200 కోట్లు మాత్రమే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం ఖర్చుపెట్టాల్సి ఉండగా మాకేమీ వద్దు మేమే పెడతాం అని మైటాస్ ముందుకొచ్చింది. మైటాస్‌తో వైఎస్సార్ ప్రభుత్వానికి ఇబ్బంది ఎదురైందా? ప్రభుత్వం ఏదైనా, ఎవరిదైనా కావచ్చు. ఆ అవకతవకలను సత్యం బోర్డులో ఉన్న నిష్ణాతులైన సభ్యులు కూడా ఊహించలేకపోయారు. ప్రపంచ స్థాయి వ్యక్తులకు కూడా సత్యంలో ఇలా జరుగుతోందని చివరిదాకా తెలీకుండా పోయింది. అప్పుడే ఢిల్లీ మెట్రో ఎండీ శ్రీధరన్ హైదరాబాద్ మెట్రో గురించి విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న మాంటెక్ సింగ్ అహ్లువాలియాను కలిసి పరిస్థితి మొత్తంగా వివరించాను. ఆయన ఒకేమాటన్నారు. మీ ప్రాజెక్టు నమూనాలో ఏ తప్పూ లేదు. దాన్నే కొనసాగిస్తూ పోండన్నారు. మెట్రో ప్రాజెక్టుకు వైఎస్సార్ ఇచ్చిన ప్రోత్సాహం ఏమిటి? మైటాస్ ఫెయిలయిన తర్వాత వైఎస్ఆర్ మమ్మల్ని పిలిచి ‘తదుపరి చర్యలు ఏమిటి’ అని అడిగారు. మెట్రోను ప్రభుత్వమే కట్టాలంటే చాలా వ్యయం అవుతుంది. కానీ మళ్లీ పీపీపీ పద్ధతిలోనే పోవాలని కేంద్రం సూచించినట్లు చెప్పాను. ‘అలాగే ముందుకెళ్లండి’ అన్నారు. వైఎస్సార్‌ది చాలా గొప్ప వ్యక్తిత్వం. ఒక ఆలోచనను నమ్మారంటే దానికే కట్టుబడి ఉంటారు. పైగా అధికార్లను సమర్థించేవారు. అది చాలా గొప్ప విషయం. ఆ సమయంలోనే ఎల్ అండ్ టీ వారు ముందుకొచ్చారు. వారు నిర్మాణానికి ప్రభుత్వం నుంచి చాలా తక్కువగా అంటే పది శాతం మాత్రమే.. అంటే రూ. 1,453 కోట్లు కావాలని అడిగారు. దాంతో వారికే అవకాశం ఇచ్చాం. తర్వాత జరిగింది మీకందరికీ తెలుసు. ఈ ప్రాజెక్టు విధానాలు, ఎల్ అండ్ టీ పెట్టిన షరతుల గురించి చెబుతారా? ఈ ప్రాజెక్టును చాలా జాగ్రత్తగా చేస్తూ వచ్చాం. ప్రజలకు, నగరానికి, నిర్మాణ సంస్థకు కూడా ఉపయోగపడేలా మెట్రో ఉండాలి. పైగా ధర్మకర్తృత్వం కోసం ఎవరూ ఇలాంటి ప్రాజెక్టులు చేయరు కాబట్టి కంపెనీ కూడా నష్టపోలేదు. మా అంచనా ప్రకారం ప్రారంభంలో నాలుగేళ్లపాటు నష్టం వస్తుంది. వారు చెప్పినట్లు నిర్మాణ వ్యయం పెరిగి ఉంటే ఆరు లేక ఏడో సంవత్సరంలో లాభాలు వస్తాయి. ప్రపంచంలో 250 మెట్రో ప్రాజెక్టులు జరుగుతున్నాయి. కాని హైదరాబాద్ మెట్రోకు పెట్టినంత పెట్టుబడి మరెక్కడా పెట్టలేదు. ప్రజలు చెల్లించే పన్నులతో, ప్రభుత్వ ధనంతో కాకుండా ప్రైవేట్ ప్రాతిపదికన చేస్తున్న ప్రాజెక్టు ఇది. 50 శాతం ప్యాసింజర్ల నుంచి, 45 శాతం ప్రాపర్టీ అభివృద్ధి నుంచి ఆదాయం వస్తుందని మా ఆంచనా. అభివృద్ధి చేసిన ప్రాపర్టీని కూడా అమ్మడానికి వీల్లేదు. లీజు ప్రకారం అద్దెలు వస్తాయంతే. మిగిలిన 5 శాతం ఆదాయం ప్రకటనలు ఇతరరూపంలో వస్తుంది. మెట్రో ప్రాజెక్టుకు కేసీఆర్ మద్దతు ఏ స్థాయిలో ఉంది? ఇంత అద్భుతంగా సక్సెస్ అయ్యారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ మమ్మల్ని ప్రశంసించారు. ఒక దశను మొదటినుంచి చివరివరకు పూర్తి చేయండి. ఫలితాలు చూడండి అని సలహా ఇచ్చారాయన. నిజానికి ఆయన చెప్పిందే కరెక్టయింది. మెట్రో ప్రాజెక్టు చక్కగా విజయవంతం కావడానికి ఎండ్ టు ఎండ్ పనులు పూర్తి చేయడమే కారణం. మొదటి దశ పనులను పూర్తి చేస్తే వీలైనంత త్వరగా ఫేస్–2 పనులను కూడా చేద్దాం అని సీఎం ప్రోత్సహించారు. టికెట్ల రేట్లు ఇప్పటికే ఎక్కువంటున్నారు. మరి మెట్రో లాభదాయకమేనా? మెట్రో రేట్లు ఎక్కువ అని అనుకుంటే తప్పు. ముఖ్యంగా మనకు మంచి నాణ్యత కావాలి. పైగా సెంట్రల్ మెట్రో నిబంధనల ప్రకారం నిర్మించిన కంపెనీకి రేట్లు నిర్ణయించే హక్కు ఉంది. పైగా కేంద్రం చెప్పినట్లు సెంట్రల్ మెట్రో యాక్ట్ కిందకు దేశం లోని మెట్రోలన్నీ వస్తే ఏడాదికి 1,450 కోట్లు కేంద్రం ఇస్తుంది కూడా. మిగతా మెట్రో వ్యవస్థలకు అనుగుణంగానే చార్జి చేయమని చెప్పాం. దాన్ని వారు పాటించారు. మెట్రో పట్ల హైదరాబాద్ ప్రజల స్పందన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ప్రారంభంలో అటూ ఇటుగా రోజుకు 50 వేలమంది ప్రయాణిస్తున్నారని అనుకున్నాం. కానీ పని దినాల్లో దాదాపు లక్షమంది ప్రయాణిస్తున్నారు. ఇక శని, ఆదివారాల్లో అయితే దాదాపు రెండు లక్షలమంది ప్రయాణిస్తున్నారు. ఊహించని స్పందన ఇది. ప్రారంభంలో మూడు కోచ్‌లు మాత్రమే నడుపుతున్నాం. తదుపరి దశలో ఆరు కోచ్‌లు పెడితే ప్రతి 2 నిమిషాలకు ఒక ట్రైన్ చొప్పున 2 వేలమంది ఒకేసారి ప్రయాణిస్తారు. అంటే గంటకు 60 వేల మంది ప్రయాణించవచ్చు. 2018 చివరికి తొలి దశ ప్రాజెక్టు పూర్తయితే కనీసం రోజుకు 10 లక్షలమంది మెట్రోలో ప్రయాణించే అవకాశముంది. తదుపరి దశలో 15 లక్షల మంది ప్రయాణించేలా ఏర్పాటు చేస్తాం. కానీ పార్కింగ్, గమ్యస్థానం చేరుకోవడం వంటి సమస్యలు ఉన్నాయి కదా? మెట్రో పార్కింగ్ విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. అంతర్జాతీయ ట్రాఫిక్ నిపుణుల అభిప్రాయం ప్రకారం మెట్రో రైలు వ్యవస్థలో పార్కింగ్ వసతి కల్పించవద్దు. ఎందుకంటే పార్కింగ్ పేరిట రోడ్డు వెడల్పును అనవసరంగా పెంచి, పార్కింగ్ అవకాశం కల్పిస్తే వ్యక్తిగత వాహనాలు మరింత పెరుగుతాయి. దానికి బదులు ప్రజారవాణా వ్యవస్థను పెంచండి. చివరి గమ్యం వరకు రైల్ కనెక్టివిటీని పెంచండి అని సూచించారు. కానీ మన దేశంలో ఇలాంటి పరిస్థితి లేదు కాబట్టి మేం మెట్రోలో పార్కింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం 24 స్టేషన్లలో మొత్తం 12 చోట్ల పార్కింగ్ ప్లేస్ సిద్ధం చేశాము. మిగతా చోట్ల కూడా సిద్ధం చేస్తున్నాం. (ఎన్వీఎస్ రెడ్డితో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://goo.gl/3mvfkc https://goo.gl/Y3KAQF -
గోడను ఢీకొట్టిన మెట్రో రైలు
సాక్షి, ఢిల్లీ: మెట్రో ట్రయిల్ రన్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం చోటు చేసుకుంది. కలింది కుంజ్ డిపో నుంచి మెట్రో రైలు ట్రయల్ రన్‌కు వెళ్తున్న సమయంలో వర్క్ షాపు షెడ్డులోని గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగినపుడు రైలు చాలా తక్కువ వేగంతో ఉన్నట్టు ఓ అధికారి తెలిపారు. ప్రమాదంపై అధికారులు విచారణకు ఆదేశించారు. కాగా, బొటానికల్ - కల్కంజి మందిర్ మార్గంలో నడవనున్న ఈ సర్వీసును ఈ నెల 25న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అత్యంత అధునాతన సదుపాయాలను ఈ మెట్రోలో ఉన్నాయి. -
ఆ అనుభూతి మరిచిపోను..
భూత్పూర్(దేవరకద్ర): చిన్నప్పటినుంచీ ఆకాశంలో ఎగరాలని కలలు కనేదాన్ని.. పైలట్‌గా ఉద్యోగం చేసి విమానం నడపాలని నా కోరిక. ఆ కోరికను నెరవేర్చుకోవడానికి మెట్రో లోకో పైలట్‌గా ఓ అడుగు ముందుకేశాను.. నా చివరి టార్గెట్.. పైలట్.. ఆ లక్ష్యం చేరేదాక కృషి చేస్తూనే ఉంటా.. నని మెట్రో రైల్ లోకో పైలట్ వెన్నెల అన్నారు. సోమవారం స్వగ్రామమైన అమిస్తాపూర్‌కు వచ్చిన సందర్భంగా ‘సాక్షి’ వెన్నెలతో ఇంటర్వ్యూ నిర్వహించింది. చిన్నప్పటినుంచి మా అమ్మానాన్న చదువు విషయంలో ఎంతో ప్రోత్సహించారు. వారి ఆశీస్సులు, అన్న సహకారంతో మెట్రో లోకో పైలట్‌గా ఉద్యోగం సంపాదించాను. క్రిష్టియన్ పల్లిలోని క్రీస్తు జ్యోతి విద్యాలయంలో 10వ తరగతి వరకు చదివాను. అనంతరం డిప్లామాలో ఎలక్ట్రానిక్స్ స్పెషలైజేషన్ కోర్సు చేశాను. పత్రికల్లో చూసి దరఖాస్తు చేశా.. నా పేరు పక్కన మొదటినుంచీ పైలట్ అని ఉండాలని అనుకునేదాన్ని. ఆ కోరికను తీర్చుకోవడానికి ఎలక్ట్రానిక్స్ స్పెషలైజేషన్ కోర్సు పూర్తి చేశాను. తర్వాత ఈసీఐఎల్‌లో అంప్రెంటీస్ చేస్తుండగా ఓ పేపర్లో మెట్రో రైల్ నోటిఫికేషన్ చూశాను. దరఖాస్తు పూర్తిచేసి ఎంట్రెన్స్ రాశాను. ఇంకేముంది మంచి మార్కులు వచ్చాయి.. ట్రెనింగ్‌కు సెలక్టయ్యా ను. ఏడాదిన్నర పాటు శిక్షణ తీసుకున్నాను. ఆ అనుభూతి మరిచిపోను మెట్రో రైల్ ప్రారంభానికి ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఎందరో ప్రముఖులు వచ్చారు. వారిని అంత దగ్గరనుంచి చూడటం చాలా సంతోషం అనిపించింది. వారు వచ్చినప్పుడు నేను లోకో పైలట్ టీం మెంబర్‌గా ఉన్నందుకు ప్రౌడ్‌గా ఫీలయ్యాను. ఆ అనుభూతి మరిచిపోలేను. మా బ్యాచ్‌లో నేనే జూనియర్ లోకో పైలట్ టీంలో ఉన్న సభ్యుల్లో పోలిస్తే అందరిలో నేనే జూనియర్. అయినప్పటికీ మా టీం సభ్యులు నన్ను ఆ భావనతో చూడ లేదు. అన్ని విషయాల్లో ప్రోత్సహించారు. ప్రస్తుతం మెట్రో రైలులో నేను ఒక్కదాన్నే విధులు నిర్వహిస్తున్నా. రోజు నాగోల్ నుంచి అమీర్‌పేట్ వరకు నడుపుతున్నాను. వేలాదిమంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చుతున్నానని సంతోషంగా ఉంది. క్రమశిక్షణే ఈ స్థానానికి చేర్చింది మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: క్రమశిక్షణే వెన్నెలను ఉన్నత స్థానానికి చేర్చిందని జ యప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ కేఎస్ రవికుమార్ అన్నారు. మెట్రో రైలు నడుపుతున్న కళాశాల పూర్వవిద్యార్థి వెన్నెలను సోమవారం కళాశాలలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. కష్టపడే తత్వం, పట్టుదల వంటి లక్షణాలు ప్రతి ఒక్కరినీ జీవితంలో విజయం సాధించేలా చేస్తాయన్నారు. అందుకు నిదర్శనం వెన్నెల అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లింగన్‌గౌడ్ కులకర్ణి, కళా శాల పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, వెన్నెల తల్లిదండ్రులు వీరేశం, ఉమాదేశి, కుటుంబ సభ్యులు మహాదేవమ్మ, వినోద్‌కుమార్, విజయ, మంజుల, రాజశేఖర్ పాల్గొన్నారు. వెన్నెలకు ఘన సన్మానం వెన్నెల స్వగ్రామానికి రావడంతో మహబూబ్‌నగర్ అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వారు సోమవారం ఘనంగా సన్మానించారు. ముందు బొకే ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం షాలువా, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. తెలంగాణ తొలి మెట్రో రైల్‌ను మా ప్రాంతానికి చెందిన యువతి ఆనందంగా ఉందని వారు కొనియాడారు. ఏయిర్‌లైన్ పైలెట్ కావాలన్న వెన్నెల లక్ష్యం నెరవేరాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో సమితి సభ్యులు సీమ నరేందర్, ఎదిర ప్రమోద్ కుమార్, పీఈటీ రమేశ్, సతీష్, రాజశేఖర్, ప్రసాద్, సంజీవ్ ఉన్నారు. -
‘మెట్రో... ఓ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్’
హైదరాబాద్: టోల్‌ప్లాజాల పేరుతో దోపిడీకి పాల్పడుతోన్న రాష్ట్ర ప్రభుత్వం మెట్రో పేరిట మరో దోపిడీకి తెరలేపిందని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఆరోపించారు. మెట్రోలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలన్న డిమాండ్‌తో కార్యాచరణ రూపొందించామని చెప్పారు. తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ అధ్యక్షతన ‘మెట్రో రైలు ప్రాజెక్ట్‌లో ఉపాధి, ఉద్యో గాలు స్థానికులకే దక్కాలి, మెట్రో చార్జీలు తగ్గాలి, మెట్రో రైలు అవినీతిపై సమగ్ర విచారణ జరపాలి’అనే అంశంపై సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో పలువురు వక్తలు మాట్లాడుతూ, మెట్రో ఓ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అని విమర్శించారు. వైఎస్సార్సీపీ పార్టీ ప్రతినిధి దుబ్బాక గోపాలకృష్ణ మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మంజూరైన మెట్రో ప్రారంభోత్సవంలో ఆయన పేరును ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు. -
మెట్రో, ఓలా.. ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: నగరవాసులకు మెట్రో జర్నీతోపాటు చివరి గమ్యం చేర్చేందుకు ప్రముఖ క్యాబ్ సంస్థ ఓలా ముందుకొచ్చింది. ఎల్అండ్టీ మెట్రోరైల్ హైదరాబాద్ లిమిటెడ్, ఓలా సంస్థల మధ్య బుధవారం వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. దీంతో మెట్రో ప్రయాణికులు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారిక యాప్ ‘టీ–సవారీ’ ద్వారా ఓలా క్యాబ్‌లు, ఆటో లు బుక్ చేసుకోవచ్చు. మొబైల్ వాలెట్, ఓలా మనీ సేవలనూ వినియోగించుకోవచ్చు. ఇక మియాపూర్, అమీర్‌పేట్, నాగోల్, కేపీహెచ్‌బీ కాలనీ మెట్రో స్టేషన్ల వద్ద ఓలా ప్రత్యేక కియోస్క్‌లను ఏర్పాటు చేయనున్న ట్లు నిర్వాహకులు తెలిపారు. ఇతర స్టేషన్లలోనూ త్వర లో ఈ కియోస్క్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. మెట్రో స్టేషన్ల సమీపంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఓలా జోన్లు ఏర్పాటు చేయనుండటంతో క్యాబ్‌ల కోసం మెట్రో ప్రయాణికులు నిరీక్షించే అవసరం ఉండదని పేర్కొన్నారు. ఈ ఒప్పందంతో మెట్రో స్మార్ట్‌కార్డులను నేరుగా ఓలా మనీ యాప్ ద్వారా రీచార్జ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇక యాప్ సౌకర్యం లేని మెట్రో ప్రయాణికులు స్టేషన్ల వద్దనున్న ఓలా కియోస్క్‌లను సంప్రదించి అక్కడ ఉండే ప్రతినిధుల సహకారంతో క్యాబ్ బుక్ చేసుకునే అవకాశం ఇస్తున్నారు. ఇక ఓలా జోన్స్ మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ సమస్యకూ పరిష్కారం చూపుతాయన్నారు. ప్రయాణికుల జర్నీ సమయం కూడా గణనీయంగా తగ్గుందన్నారు. మెట్రో తో నగర రవాణా రంగ చరిత్రలో కొత్త శకం ప్రారంభమైందని ఓలా డైరెక్టర్ సౌరభ్ మిశ్రా తెలిపారు. ఓలా సేవలను ఆన్లైన్, ఆన్‌గ్రౌండ్ విధానంలో మెట్రో స్టేషన్ల సమీపంలో అందించడం ఆనందంగా ఉందన్నారు. ఓలా స్మార్ట్ మొబిలిటీ సేవలను రైల్వేస్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, మెట్రో స్టేషన్లతో అనుసంధానిస్తున్నామని తెలిపారు. సులభమైన, సౌకర్యవంతమైన, క్లిష్టతలేని ప్రయాణాన్ని మెట్రో ప్రయాణికులకు అందించేందుకే ఈ భాగస్వామ్యం చేసుకున్నామన్నా రు. నాగోల్–మియాపూర్(30 కి.మీ.) మెట్రో మార్గం 2.4 లక్షల ప్రయాణికుల మార్కును అధిగమించడం ద్వారా విజయవంతమైనట్లు ఎల్అండ్టీ హెచ్ఎంఆర్ఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనిల్‌కుమార్ సైనీ తెలిపారు. ఓలాతో ఒప్పందం ద్వారా ప్రయాణికులకు లాస్ట్‌మైల్ కనెక్టివిటీ తేలికవుతుందన్నారు. ఓలా భద్రతా ఫీచర్లు ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన మొబిలిటీ అనుభవాలను అందిస్తుందన్నారు. ఓలా సంస్థ ఇటీవలే గుర్గావ్, బెంగళూరు మెట్రో రైలు కార్పొరేషన్ లిమిటెడ్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోవడంతోపాటు మెట్రోస్టేషన్లలో ఓలా కియోస్క్‌లు ఏర్పాటు చేసిందన్నారు. -
ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో రైలు
ఊహించినట్లుగానే బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మెట్రో రైలు సౌకర్యాన్ని పొడిగించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. దీర్ఘకాలంగా ఉన్న ఈ డిమాండ్‌కు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోక్షం లభించింది. పథకం సాకారమైతే 30 కిలోమీటర్ల ట్రాఫిక్ కష్టాల నుంచి నగరవాసులకు విముక్తి లభిస్తుంది. నాగవార, హెగ్డే నగర, జక్కూరు మీదుగా ఎయిర్‌పోర్టుకు వెళ్లవచ్చు. సాక్షి, బెంగళూరు: కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వరకూ మెట్రో రైలు సౌకర్యాన్ని పొడిగించడానికి రాష్ట్ర మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన సోమవారం విధానసౌధలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వివరాలను రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్ర మీడియాకు వివరించారు. నాగవార, హెగ్డే నగర, జక్కూరు మీదుగా మెట్రో రైలు మార్గాన్ని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వరకూ నిర్మిస్తామన్నారు. సుమారు 30 కిలోమీటర్ల పొడవైన ఈ రైలు మార్గం నిర్మాణానికి పూర్తి ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను తయారు చేయాల్సిందిగా సంబంధిత శాఖలకు సూచించామని చెప్పారు. ఈ ప్రాజెక్టు వ్యయం మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో పంచుకుంటాయన్నారు. కేంద్రం వాటా సుమారుగా రూ.6 వేల కోట్లు వరకూ ఉంటుందని, ఈ మేరకు ఇప్పటికే కేంద్రానికి నివేదిక అందించామన్నారు. ఈ రైలు మార్గం నిర్మాణం వల్ల బెంగళూరులో ట్రాఫిక్ సమస్య కొంతవరకూ పరిష్కారమవుతుందని తెలిపారు. కేబినెట్ భేటీ నిర్ణయాల్లో ముఖ్యమైనవి ఇలా... ♦ స్మార్ట్ సిటీ పథకంలో ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో రైలు భాగంగా స్మార్ట్‌సిటీ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటుకు అనుమతి. ♦ రాష్ట్రంలో అగ్రికల్ జోన్ల ఏర్పాటుకు అనుమతి ♦ విక్టోరియా ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.30 కోట్లు విడుదల ♦ రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మొదలుకొని జిల్లా ఆసుపత్రుల వరకూ ఆప్తాల్మాలజీ (కంటి విభాగం) ఏర్పాటుకు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.8.06 కోట్లు విడుదల. ♦ రాష్ట్రంలో 500 గ్రామపంచాయతీల్లో వై–ఫై ఏర్పాటుకు అంగీకారం. ♦ మురుగునీటిని సంస్కరించి పునఃవినియోగానికి వీలుగా ప్రత్యేక పాలసీని రూపొందించడానికి అంగీకారం. ♦ రూ.200 కోట్లతో చిన్ననీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో పశ్చిమవాహిని అనే పథకం అమలు. -
న్యూయార్క్‌లో ‘ఉగ్ర’ పేలుడు
న్యూయార్క్: అమెరికా నగరం న్యూయార్క్‌లోని రద్దీగా ఉండే ఓ మెట్రో స్టేషన్లో ఐసిస్ ఉగ్రవాది సోమవారం పేలుడుకు పాల్పడ్డాడు. అదృష్టవ శాత్తూ బాంబు పాక్షికంగానే పేలడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు గాయపడగా వారి ప్రాణాలకేమీ అపాయం లేదని పోలీసులు తెలిపారు. న్యూయా ర్క్‌లోని మన్హటన్ ప్రాంతంలో ఉండే ‘పోర్ట్ అథారిటీ’ బస్ టర్మినల్ ఎప్పుడూ ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక్కడే మెట్రో స్టేషన్ కూడా ఉంది. బంగ్లాదేశ్‌కు చెందిన అకాయెద్ ఉల్లా (27) అనే ఐసిస్ ఉగ్రవాది ఇంట్లోనే పైప్ బాంబు తయారుచేసుకుని వచ్చి ఉదయం 7.15 గంటల ప్రాంతంలో పోర్ట్ అథారిటీలో పేలుడుకు పాల్పడ్డాడు. బాంబు పాక్షికంగా పేలడంతో ఉగ్రవాదికి కూడా గాయాలయ్యాయి. అతణ్ని అరెస్టు చేసిన పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అధ్యక్షుడు ట్రంప్‌కు ఈ ఘటన గురించి సమాచారం అందించారు. పేలుడు వల్ల మెట్రో స్టేషన్లో గందరగోళం నెలకొంది. అమెరికాలోని వివిధ నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. -
ట్రా‘ఫికర్’ తగ్గింది.. ‘స్పీడ్’ పెరిగింది
మెట్రో రైలుతో నగరంలో కాస్త ట్రా‘ఫికర్’ తగ్గింది. వాహనాల సగటు వేగం పెరిగింది. పీక్ అవర్‌లో జనం రయ్..రయ్ అని దూసుకెళ్తున్నారు. గతంలో 12 కేఎంపీహెచ్ ఉన్న వాహన వేగం 20కి పెరిగింది. మరోవైపు ఆర్టీసీలో ఒక శాతం ఆక్యుపెన్సీ తగ్గింది. ఆటోలు, క్యాబ్‌లపైనా మెట్రో ప్రభావం చూపింది. ఇక ఈ రెండు రూట్లలో వ్యక్తిగత వాహనాలు వినియోగించే వారి సంఖ్య దాదాపు 60 వేల వరకు తగ్గినట్లు అంచనా. ఇటీవల మైట్రో రైలు రాకపోకలు ప్రారంభమైన నాగోల్–అమీర్‌పేట, మియాపూర్–అమీర్‌పేట మార్గాల్లో శుక్రవారం ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన జరపగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. సాక్షి, సిటీబ్యూరో/ఉప్పల్/మూసాపేట్: గ్రేటర్‌వాసుల కలల మెట్రో ప్రభావంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ కష్టాలు తొలిగాయి. దీంతో మొన్నటివరకు నత్తనడకన సాగిన వాహనాలు ఇప్పుడు పరుగులు పెడుతున్నాయి. ప్రధానంగా నాగోల్–అమీర్‌పేట్(17 కి.మీ)మార్గంలో ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్‌లో రోడ్డుమార్గంలో ప్రయాణానికి 50 నుంచి 60 నిమిషాల సమయం పట్టేది. ఇప్పుడు ప్రయాణ సమయం 33 నిమిషాలు మాత్రమే. ఇక మియాపూర్–అమీర్‌పేట్ (13 కి.మీమార్గం)లోనూ పీక్అవర్స్లో రోడ్డుమార్గంలో ప్రయాణానికి 50 నిమిషాల సమయం పట్టేది. ఇప్పుడు 30 నిమిషాల్లో గమ్యం చేరుకోవచ్చు. ఇదెలా సాధ్యమైందనుకుంటున్నారా...మెట్రో రాకతో కలల రైళ్లలో ప్రయాణిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ ప్రభావంతో మొత్తంగా కాకపోయినా..మెట్రో రూట్లలో సుమారు 60 వేల వ్యక్తిగత వాహనాల (ద్విచక్రవాహనాలు, కార్లు) వినియోగం తగ్గుముఖం పట్టినట్లు మెట్రో, ట్రాఫిక్ అధికారులు ప్రాథమికంగా అంచనావేస్తున్నారు. ఇక మొన్నటివరకు నగరంలో సగటు వాహనవేగం 12 కేఎంపీహెచ్ ఉండేది. ఇప్పుడు మెట్రో రాకతో సగటు వాహనవేగం 20 కేఎంపీహెచ్‌కు పెరిగిందని చెబుతున్నారు. మెట్రో రూట్లలో రాకపోకలు సాగిస్తున్న ఆర్టీసీకి చెందిన 80 ఫీడర్ బస్సులు, మరో వెయ్యి ఆర్టీసీ రెగ్యులర్ సర్వీసుల్లోనూ సరాసరిన ఒకశాతం ఆక్యుపెన్సీ(ప్రయాణికుల భర్తీశాతం)తగ్గినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతుండడం విశేషం. ఇక ఈ రెండురూట్లలో సుమారు ఐదువేల వరకు ఆటోలు, క్యాబ్‌ల రాకపోకలు కూడా తగ్గినట్లు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ వత్తిడి తగ్గి సిటీజన్లు ఊపిరి పీల్చుకుంటున్నట్లు ‘సాక్షి’ బృందం క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. శుక్రవారం రెండు మెట్రో రూట్లలో పరిశీలించగా ఈ విషయం సుస్పష్టమైంది. ఈ ప్రాంతాల్లో ట్రాఫికర్ బాగా తగ్గింది... ప్రధానంగా సీఎం క్యాంపుకార్యాలయం, అమీర్‌పేట్, మైత్రీవనం, బేగంపేట్, రసూల్‌పురా ప్రాంతాల్లో ట్రాఫికర్ గణనీయంగా తగ్గడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యక్తిగత వాహనాలతోపాటు బస్సులు, కార్లలో వెళ్లే వారు సాఫీగా సాగుతుండడం విశేషం. రూట్–1 నాగోల్–అమీర్‌పేట్ రోడ్డు ప్రయాణం ఇలా.. సమయం: శుక్రవారం ఉదయం 10:17 నిమిషాలు బైక్ ప్రయాణం ప్రారంభం: నాగోల్ మెట్రో స్టేషన్ రూట్: నాగోల్–ఉప్పల్ మెట్రో స్టేషన్ల నుంచి తార్నాక, మెట్టుగూడ, రైల్ నిలయం, బేగంపేట, లైఫ్‌స్టైల్–ప్రకాశ్‌నగర్ మీదుగా అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ చేరడానికి పట్టిన సమయం కేవలం 33 నిమిషాలు. వారం క్రితం 50 నుంచి 60 నిమిషాల సమయం పట్టేది. ఇక మెట్రోరైలులో ఈ రూట్లో ప్రయాణానికి 30–35 నిమిషాల సమయం పడుతోంది. రూట్–2 మార్గం: మియాపూర్–అమీర్‌పేట్ సమయం: ఉదయం 9.00 గంటలు బైక్ ప్రయాణం ప్రారంభం:మియాపూర్ మెట్రో స్టేషన్ మార్గం: మియాపూర్–జేఎన్టీయూ–కెపిహెచ్బి–కూకట్పల్లి–బాలానగర్–మూసాపేట్–భరత్‌నగర్–ఎర్రగడ్డ–ఈఎస్ఐ–ఎస్.ఆర్.నగర్–అమీర్‌పేట్‌కు చేరడానికి 30 నిమిషాల సమయం పట్టింది. అంటే 9.30కు అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు. గతంలో ఇలా: ఈ మార్గంలో ద్విచక్ర వాహనంపై గతంలో ప్రయాణానికి 50 నిమిషాల సమయం పట్టేది.మెట్రో రైలులో 20–23 నిమిషాల సమయం పడుతోంది. మెట్రో రాకతో ఈ రూట్లో బైక్ ప్రయాణం సుమారు 20 నిమిషాలు తగ్గినట్లే. ఇది శుభపరిణామం తొలిదశ మెట్రో ప్రారంభమైన నాగోల్–అమీర్‌పేట్, మియాపూర్–అమీర్‌పేట్ మార్గంలో మొత్తంగా వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గి ట్రాఫిక్ తగ్గుముఖం పట్టడం శుభపరిణామం. ఈ రూట్లలో ప్రధాన రహదారులపై వాహనాల సగటు వేగం గణనీయంగా పెరిగినట్లు మా పరిశీలనలో తేలింది. ఎస్పీరోడ్–బేగంపేట్, అమీర్‌పేట్–పంజగుట్ట మార్గంలో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ తగ్గుముఖం పట్టడంతో సిటీజన్లు ఊపిరిపీల్చుకుంటున్నారు. – ఎన్వీఎస్రెడ్డి, హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ రిలీఫ్‌గా ఉంది... ఉప్పల్ నుంచి మెట్టుగూడ వరకు 40 శాతం ట్రాఫిక్ తగ్గింది. సికింద్రాబాద్ నుంచి అమీర్‌పేట వరకు 20 శాతం ట్రాఫిక్ తగ్గింది. ప్రతి నిత్యం ఉప్పల్ నుంచి హైటెక్‌సిటీ వరకు ద్విచక్ర వాహనంపైనే వెళ్తున్నాను. మెట్రో వచ్చిన నాటి నుంచి ట్రాఫ్రిక్ సమస్య తీరింది. రోజు వారిగా దాదాపుగా 15 నుంచి 20 నిమిషాలు జర్నీ సమయం తగ్గింది. రిలీఫ్‌గా ఉంది. – నూతన్ కుమార్ కంచుపు, సాఫ్ట్వేర్ ఉద్యోగి, సైబర్‌సిటి రోడ్లపై రద్దీ తగ్గింది... దాదాపుగా 25 నుంచి 35 శాతం తార్నాక నుంచి కూకట్పల్లి వరకు ట్రాఫిక్ తగ్గింది. ద్విచక్ర వాహనం ప్రయాణం గతంలో నరకంగా ఉండేది. ప్రస్తుతం అంత ఇబ్బందిగా అనిపించడం లేదు. – భరత్‌రెడ్డి, తార్నాక, హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఉద్యోగి గతంతో పోల్చితే బెటర్ గత నాలుగైదు రోజుల నుంచి రోడ్లపై జాలీగా ఉద్యోగానికి వెల్తున్నాను. ట్రాఫిక్ బాగా తగ్గింది. డ్రైవింగ్ చాలా ఈజీగా ఉంది. వేగం 30 దాటక పోతుండేది. ప్రస్తుతం 60 దాటుతుంది. -రాజేష్, సాప్ట్వేర్ ఇంజనీర్ ఈజీ జర్నీ... తార్నాక నుంచి సికింద్రాబాద్ స్టేషన్‌కు కారులో వెల్తుంటాను. గత నాలుగైదు రోజుల నుండి రోడ్లపై ట్రాఫిక్ కాస్త తగ్గినట్లు అనిపించింది. ముఖ్యంగా మెట్టుగూడ నుండి సిక్రింద్రాబాద్ వరకు ట్రాఫిక్ కదలకుండా ఉండేది. ఇప్పుడు ఈజీగా వెళ్తున్నాం. -జోయల్, రైల్వే ఉద్యోగి మెట్రో జర్నీ బాగుంది... కూకట్పల్లి నుంచి మియాపూర్ వరకు కళాశాలకు వెళ్తుంటాను. గతంలో బైక్, బస్సుపై వెళ్లేవాడిని. కానీ మెట్రో రైలు ప్రారంభం నుంచి రైలులో వెళ్తున్నాను. జర్నీ సూపర్‌గా ఉంది. ట్రాఫిక్ సమస్య లేదు. పొల్యుషనూ లేదు. –గోస్వామి, విద్యార్థి, కూకట్‌పలి -
మెట్రోలో మరదలు మైసమ్మ..!
మారేడుపల్లి: మెట్రోరైలు ఎండీ గొంతు సవరించారు. తనలోని కొత్త కోణాన్ని పరిచయం చేశారు. శుక్రవారం కస్తూర్భా గాంధీ మహిళా జూనియర్ కళాశాల వార్షికోత్సం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్.రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘మెట్రోరైలులో మరదలు మైసమ్మ.. ఏసీలో వచ్చే మరదలు మైసమ్మ.. చెమటలు పట్టేదిలేదు మరదలు మైసమ్మ’.. అంటూ పాటలు పాడి విద్యార్థినులను ఉర్రూతలూగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మెట్రోరైలు రాకతో నగరం గ్లోబల్ సిటీగా మారుతుందన్నారు. 25 వేల కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్ట్ ప్రారంభమైందని, 50 వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి వస్తాయని వివరించారు. ఇంటర్ దశ ఎంతో కీలకమని, ఎన్ని కష్టాలు వచ్చినా శ్రద్ధగా చదివి అనుకున్న గమ్యాన్ని చేరాలని సూచించారు. ఈ సందర్భంగా కాలేజీ టాపర్స్‌కు బహుమతులను ప్రదానం చేశారు. కాగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కస్తూర్భాగాంధీ మహిళా కళాశాల చైర్మన్ ఎన్.వి.ఎన్.చార్యులు, సెక్రటరీ హైదర్, ట్రెజరర్ అజయ్‌కుమార్, ప్రిన్సిపాల్ ప్రతిమారెడ్డి, పలువురు పాల్గొన్నారు. వార్షికోత్సవ సభలో మాట్లాడుతున్న ఎన్వీఎస్ రెడ్డి -
హైదరాబాద్ మెట్రోలో వృద్ధుడి వికృత చర్య
సాక్షి, హైదరాబాద్ : ఆయన వయస్సు సుమారు 65ఏళ్లు ఉండొచ్చు. మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకోవాల్సిన వయసు. కానీ చేసే పనులు తెలిస్తే మాత్రం అసహ్యించుకోకుండా ఉండలేరు. భాగ్యనగరంలో మెట్రో ప్రారంభమైన పదిరోజులకే ఓ 65 ఏళ్ల వృద్ధుడు మెట్రోలో ఎక్కిన మహిళల, యువతుల ఫోటోలను తీస్తూ అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. ఎన్ నరసింహా(65) అనే వృద్ధుడు మెట్రోలో ప్రయాణిస్తున్న మహిళల ఫోటోలను అసభ్యకరంగా మొబైల్ ఫోన్‌తో తీస్తూ షీ టీమ్స్‌కు అడ్డంగా దొరికిపోయాడు. సదరు వ్యక్తి విద్యాశాఖలో రిటైర్డ్ ఉద్యోగి కావడం గమనార్హం. ఉప్పల్ నుంచి నాగోల్ వెళ్తున్న మెట్రోరైలులో తనకు ఎదురుగా కూర్చున్న మహిళల ఫోటోలను దొంగచాటుగా తీస్తూ దొరికిపోయాడు. ఆయనగారి ఫోన్ తనిఖీ చేయగా అప్పటికే ఆ ఫోన్లో చాలా మంది మహిళలు, యువతుల ఫోటోలు బయటపడ్డాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. -
బాలానగర్ మెట్రోస్టేషన్ పేరు మార్పు
సాక్షి, హైదరాబాద్: బాలానగర్ మెట్రోస్టేషన్ పేరు మార్పు చేస్తూ హైదరాబాద్ మెట్రో రైలు(హెచ్ఎంఆర్) గురువారం నిర్ణయం తీసుకుంది. దళితుల ఐక్య వేదిక, పలు ప్రజా సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు బాలానగర్ మెట్రోస్టేషన్ పేరును అంబేద్కర్ మెట్రోస్టేషన్‌గా మారుస్తూ హెచ్ఎంఆర్ మేనేజింగ్ డైరెక్టర్ శివానంద్ నింబార్గి ఉత్తర్వులు జారీ చేశారు. అసలు బాలానగర్ ఉన్న ప్రాంతానికి, మెట్రో స్టేషన్ ప్రస్తుతం కట్టిన దానికి మూడున్నర కిలో మీటర్ల దూరం ఉంది. భవిష్యత్తులో మెట్రోను విస్తరించినపుడు అమోమయానికి గురికాకుండా ఉండేందుకు మెట్రో స్టేషన్ పేరును మారుస్తున్నట్లు హెచ్ఎంఆర్ తెలిపింది.