సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ సంస్థ ఉబర్‌తో హైదరాబాద్ మెట్రోరైలు అవగాహన ఒప్పందానికి డ్రైవర్ షాక్ తగిలింది. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఉబెర్ డ్రైవర్లు ఆందోళనకు దిగడంతో గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా తమకు జీతాలు పెంచాలంటూ డ్రైవర్లు నినదించారు. అలవెన్సులు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని విమర్శించారు. సుమారు17మంది డ్రైవర్లు డ్యూటీలో ఉండగా ప్రాణాలు కోల్పోతే ఉబెర్ యాజమాన్యం పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో పరిస్తితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో సమావేశం మధ్యలోనుంచే ఉబెర్ సీవోవో బార్నీ హర్ఫర్డ్ నిష్క్రమించారు.
మెట్రోరైలు ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా లాస్ట్‌మైల్ కనెక్టివిటీలో భాగంగా ఇప్పటికే ఓలా, తదితర కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న హెచ్‌ఎమ్మార్ గురువారం ఉబెర్‌తో కూడా ఎంఓయూ కుదుర్చుకునే కార్యక్రమాన్ని తలపెట్టింది. అయితే ఉబెర్ సీవోవో మధ్యలోనే లేచి వెళ్లిపోవడంతో దీనికి బ్రేక్ పడిందా లేక ఒప్పందం జరిగిందా అనేది క్లారిటీ రాలేదు. ఈ కార్యక్రమానికి రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి సహా, ఐటీ సెక్రెటరీ జయేశ్‌రంజన్, హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఉబెర్ ఇండియా, సౌత్ ఆఫ్రికా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మధుకన్నన్, ప్రెసిడెంట్ అమిత్‌జైన్ తదితరులు హాజరైనారు.
Comments
Please login to add a commentAdd a comment