Uber
-
ఉబర్ ఆటో బుకింగ్.. ఇక ఓన్లీ క్యాష్ పేమెంట్!
ఉబెర్, ఓలా, రాపిడో వంటి రైడ్ హెయిలింగ్ సర్వీస్ ద్వారా ఆటో బుక్ చేసినప్పుడు పేమెంట్ ఆయా రైడ్ యాప్‌లకు కాకుండా నేరుగా తమకే క్యాష్ రూపంలో ఇవ్వాలని డ్రైవర్లు పట్టుబడుతూ ఉంటారు. ఈ విషయంలో అటు డ్రైవర్లకు, ఇటు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్ సంస్థ ఉబర్ (Uber) కీలక నిర్ణయం తీసుకుంది.ఉబర్ (Uber) ఆటో రైడ్లకు పేమెంట్ విషయంలో కీలక మార్పులు చేసింది. తమ యాప్ ద్వారా ఆటోలు బుక్ చేశాక ఇకపై నేరుగా డ్రైవర్‌కే చెల్లింపులు చేయాలని, ఆటో డ్రైవర్‌కు, ప్రయాణికుడికి మధ్య జరిగే లావాదేవీల విషయంలో ఉబర్ ఎటువంటి జోక్యం చేసుకోదని పేర్కొంది. ‘సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్’ (SaaS) విధానానికి మారుతున్న క్రమంలో ఉబర్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త విధానాన్ని ఫిబ్రవరి 18 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఉబెర్ తన అధికారిక బ్లాగ్ పోస్ట్‌లో ఈ మార్పును వివరించింది. తన కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, డ్రైవర్లు, ప్రయాణికుల మధ్య ఘర్షణను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది.కొత్త మార్పులు ఇవే.. ప్రయాణికులను సమీపంలోని ఆటో డ్రైవర్లతో అనుసంధానించే పని మాత్రమే ఉబర్ చేస్తుంది. ఇంతకు ముందు మాదిరి ఉబర్‌కు డిజిటల్ చెల్లింపులు ఇక ఉండవు. నేరుగా డ్రైవర్‌కే నగదు రూపంలో లేదా యూపీఐ (UPI) రూపంలో ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుంది. ఆటో ట్రిప్‌లకు ఉబర్ క్రెడిట్స్, ప్రమోషన్ ఆఫర్లు వర్తించవు. డ్రైవర్ల నుంచి ఉబర్ ఎటువంటి కమీషన్ తీసుకోదు. కేవలం ప్లాట్‌ఫామ్‌ను మాత్రమే అందిస్తుంది. ఎటువంటి క్యాన్సిలేషన్ ఛార్జీలు ఉండవు. ఉబర్ కేవలం ఛార్జీని సూచిస్తుంది. కానీ తుది మొత్తాన్ని డ్రైవర్, ప్రయాణికులే పరస్పరం నిర్ణయించుకోవాలి. కానీ భద్రత విషయంలో మాత్రం ఉబర్ ప్రమేయం ఉంటుంది. -
యాపిల్.. ఓలా.. ఉబర్‌లకు సీసీపీఏ నోటీసులు
సాఫ్ట్వేర్ పనితీరు, ధరల వ్యత్యాసాలపై వినియోగదారుల ఫిర్యాదుల నేపథ్యంలో టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్, ఆన్లైన్ క్యాబ్ సర్వీస్ సంస్థలు ఓలా, ఉబర్‌కు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) నోటీసులు జారీ చేసింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. వినియోగదారులపై దోపిడీని ప్రభుత్వం సహించబోదని మంత్రి తెలిపారు.యాపిల్‌పై ఆరోపణలు..యాపిల్ తాజా సాఫ్ట్వేర్ అప్డేట్ ఐఓఎస్ 18.2.1తో ఐఫోన్ యూజర్లు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదు చేశారు. లోకల్ సర్కిల్స్ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం ఐఫోన్ వినియోగదారుల్లో 60% మంది లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌తో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఇందులో కాల్ వైఫల్యాలు అత్యంత సాధారణ సమస్యగా ఉన్నాయి. బగ్స్, భద్రతా పరమైన సమస్యలను పరిష్కరించడానికి ఉద్దేశించిన ఐఓఎస్ 18.0.1, ఐఓఎస్ 18.2.1తో సహా ఇటీవల ఐఓఎస్ అప్డేట్స్ ఈ సమస్యలకు కారణమని చాలా మంది వినియోగదారులు పేర్కొన్నారు.ఓలా, ఉబర్ సంస్థలు..యూజర్ల మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా విభిన్న ప్రైసింగ్ విధానాలు అనుసరిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఓలా, ఉబర్‌లకు విడివిడిగా సీసీపీఏ నోటీసులు జారీ చేసింది. ఇలా విభిన్న ప్రైసింగ్ విధానంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇది అన్యాయమైన వాణిజ్య పద్ధతి అని, వినియోగదారుల హక్కులను నిర్దాక్షిణ్యంగా విస్మరించడమేనని మంత్రి జోషి పేర్కొన్నారు.ఇదీ చదవండి: నేడే హల్వా వేడుక.. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ఈ ఆరోపణలపై ఉబర్ స్పందిస్తూ.. ‘రైడర్ ఫోన్ కంపెనీ ఆధారంగా మేం ధరలను నిర్ణయించం. ఏవైనా అపోహలను తొలగించడం కోసం సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపింది. యాపిల్, ఓలా సంస్థలు నోటీసులపై స్పందించలేదు. -
ఒక్కో ఫోన్లో ఒక్కోలా.. రైడ్ సంస్థల మాయాజాలం!
ఫుడ్, ట్రావెల్, కిరణా.. ఇలా అన్నింటికీ ఇప్పుడు ఆన్లైన్ యాప్‌లనే చాలా మంది వినియోగిస్తున్నారు. ముఖ్యంగా రవాణా కోసం అనేక రైడ్ హెయిలింగ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటి ధరలు ఒక్కో ఫోన్లో ఒక్కో రకంగా ఉంటున్నాయని, వేరు ధరలతో వినియోగదారులను మోసగిస్తున్నాయన్న ఆందోళనలు ఇటీవల అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీకి చెందిన ఒక ఎంట్రప్రెన్యూర్ ఉబర్ (Uber) ధరల అల్గారిథమ్‌పై చేసిన ప్రయోగం రైడ్-హెయిలింగ్ సేవల్లో పారదర్శకత, నైతికత గురించి ఆన్లైన్లో చర్చకు దారితీసింది.టెక్కీలకు ప్లేస్మెంట్ సర్వీసులు అందించే ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ అయిన ఇంజనీర్‌హబ్ వ్యవస్థాపకుడు రిషబ్ సింగ్ వివిధ ఫోన్లలో, వేరు వేరు బ్యాటరీ స్థాయిలలో ఉబర్ చార్జీలపై ధరలను పరీక్షించి ఆ ఫలితాలను స్క్రీన్ షాట్లతో సహా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పంచుకున్నారు. ఉబర్ ధరల వ్యత్యాసాన్ని పరీక్షించేందుకు రిషబ్ సింగ్ రెండు ఆండ్రాయిడ్ ఫోన్లు, రెండు ఐఫోన్లు వినియోగించారు. అన్నింటిలోనూ ఒకే ఉబర్ ఖాతాలోకి లాగిన్ అయ్యారు.ఒకే సమయంలో ఒకే విధమైన రైడ్లకు ఛార్జీలు ఎలా మారుతున్నాయో రిషబ్ సింగ్ గమనించారు.ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఫోన్లలో ఛార్జీల వ్యత్యాసాలను రిషబ్ సింగ్ గమనించారు. డిస్కౌంట్లలోనూ తేడాలు కనిపించాయి. ఒక దాంట్లో 13% తగ్గింపు అని మరో దాంట్లో "50% తగ్గింపు"ను కంపెనీ పేర్కొంది. దీన్నిబట్టి పరికర ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఉబర్ ధర భిన్నంగా ఉండవచ్చని తెలుస్తోంది. అయితే ఒకే ఖాతా, లొకేషన్, సమయం ఒకే విధమైన షరతులు ఉన్నప్పటికీ ధరలు మారుతూ కనిపించాయని రిషబ్ సింగ్ పేర్కొన్నారు.బ్యాటరీ శాతం ప్రభావంపూర్తిగా ఛార్జ్ చేసిన ఫోన్లతో పోలిస్తే చార్జింగ్ తక్కువగా ఉన్న ఫోన్లో ఎక్కువ ఛార్జీలు కనిపించాయి. ఇది ప్రవర్తనా వ్యూహమని, అత్యవసర పరిస్థితుల్లో వినియోగదారులు ఎక్కువ ఛార్జీలు చెల్లించే అవకాశం ఉంటుందని రిషబ్ వివరించారు. తక్కువ బ్యాటరీలు ఉన్న వినియోగదారులు అత్యవసరం కారణంగా అధిక ధరలను అంగీకరించే అవకాశం ఎక్కువగా ఉందని భావించే సిద్ధాంతానికి ఇది అనుగుణంగా ఉందని రాసుకొచ్చారు. దీనినే "బిహేవియరల్ ఎకనామిక్స్" అంటారని, బ్యాటరీ డేటాను తెలుసుకోవడం ద్వారా, ధరల అల్గారిథమ్‌లు వినియోగదారు పరిస్థితులను ఉపయోగించుకుంటాయని వివరించారు.ఈ ప్రయోగం ద్వారా రైడ్ కంపెనీల చార్జీల పారదర్శకత గురించి ఆందోళనలను ఆయన లేవనెత్తారు. ఛార్జీలను సర్దుబాటు చేయడానికి ఉబర్ అల్గారిథమ్‌లు ఫోన్ల రకం, బ్యాటరీ స్థాయి వంటి వినియోగదారు డేటాను ఉపయోగించుకుంటాయా అని ప్రశ్నించారు. దీనిపై సోషల్ మీడియా వినియోగదారులు కూడా ప్రతిస్పందించారు. రిషబ్ సింగ్ చేసిన ప్రయత్నాన్ని అభినందించారు. -
డాక్టర్ చేసిన పనికి.. దిగొచ్చిన ఉబర్!
ఉబర్, ఓలా వంటి క్యాబ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చిన తరువాత.. ఎప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా, క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోతున్నారు. క్యాబ్ బుక్ చేసుకున్న నిమిషాల్లో డ్రైవర్లు మన ముందు వాలిపోతుంటారు. అయితే కొంతమంది డ్రైవర్లు చేసే నిర్లక్ష్యం వల్ల వినియోగదారులు ఇబ్బందులకు గురవుతూ ఉంటారు.ఒక డాక్టర్ (Doctor) తెల్లవారుజామున 3.15 గంటలకు ఉబర్ రైడ్(Uber Ride) బుక్ చేసాడు. కానీ డ్రైవర్ ఎంతసేపటికీ రాకపోవడమే కాకుండా.. ఏ మాత్రం స్పందించలేదు. ఈ విషయాన్ని ఉబర్ కస్టమర్ సపోర్ట్‌కు తెలియజేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో మరో క్యాబ్ బుక్ చేసుకుని ఆ డాక్టర్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అయితే ఆయన ప్రయాణించాల్సిన ఫ్లైట్ అప్పటికే వెళ్లిపోయింది.తాను వెళ్లాల్సిన ఫ్లైట్ మిస్ అవ్వడంతో.. మరో ఫ్లైట్‌కు టికెట్ బుక్ చేసుకుని గమ్యాన్ని చేరుకున్నాడు. అయితే తనకు కలిగిన అసౌకర్యానికి.. డాక్టర్ జిల్లా వినియోగదారుల కమిషన్‌లో కేసు దాఖలు చేశాడు. అయితే ఈ కేసు విచారణకు ఉబర్ ఇండియా హాజరు కాలేదు. చివరికి ఉబర్ ఇండియా వల్ల కలిగిన అసౌకర్యానికి కోర్టు.. డాక్టరుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పు రావడానికి మూడేళ్ళ సమయం పట్టింది.ఇదీ చదవండి: ఫోన్ మారితే ఉబర్ ఛార్జ్ మారుతోంది - ఫోటోలు వైరల్జిల్లా వినియోగదారుల కమిషన్ ఇచ్చిన తీర్పును తప్పుపడుతూ.. ఉబర్ ఇండియా ఢిల్లీ స్టేట్ కమీషన్ ముందు అప్పీల్ దాఖలు చేసింది. ఢిల్లీ స్టేట్ కన్స్యూమర్ కమిషన్ కూడా జిల్లా వినియోగదారుల కమిషన్ తీర్పును సమర్థిస్తూ.. ఉబర్ ఇండియా (Uber India) 45 రోజుల్లో 54,100 రూపాయలు డాక్టరుకు చెల్లించాలని ఆదేశించింది. ఈ డబ్బు చెల్లించడంలో ఆలస్యమైతే 6 శాతం వడ్డీ చెల్లించాలని వెల్లడించింది. ఇందులో రూ. 24100 అదనంగా టికెట్ కొనుగోలు చేసినందుకు, అతని మానసిక ఒత్తిడికి రూ. 30,000 అని తెలిపింది. -
ట్యాక్సీ సేవల యాప్స్‌పై విచారణకు ఆదేశం
ట్యాక్సీ, ఆటో సేవల యాప్‌లు చార్జీల విషయంలో ఒక్కో రకంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలపై విచారణ(inquiry) జరపాలంటూ వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ సీసీపీఏ(CCPA)ను ఆదేశించినట్లు కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషి తెలిపారు. ఆండ్రాయిడ్, యాపిల్(Apple) డివైజ్‌లపై ఒకే తరహా రైడ్‌కి సంబంధించి వేర్వేరు రేట్లు చూపిస్తుండటం అసమంజసమైన వాణిజ్య విధానమే అవుతుందని వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి అయిన జోషి పేర్కొన్నారు. ఇది వినియోగదారులకు లభించాల్సిన పారదర్శకత హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఫుడ్ డెలివరీ, టికెట్ బుకింగ్ యాప్స్ తదితర రంగాలకు కూడా దీని పరిధిని విస్తరించనున్నట్లు వివరించారు.ఇదీ చదవండి: ఆర్థిక దార్శనికుడు.. మన్మోహనుడుఉబర్, ఓలా వంటి క్యాబ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చిన తరువాత ఎక్కడికెళ్లాలన్నా వెహికల్ బుక్ చేసుకుని గమ్యాన్ని చేరుకుంటున్నారు. అయితే క్యాబ్ లేదా ఆటో ఛార్జీలు మాత్రం మనం బుక్ చేసుకోవడానికి ఉపయోగించే మొబైల్ ఫోన్లను బట్టి మారుతూ ఉంటున్నాయి. ఇది వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. దీనికి సంబంధించిన ఒక ట్వీట్(Tweet), ఫోటో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోను గమనిస్తే.. రెండు వేరువేరు మొబైల్ ఫోన్లలో రెండు వేర్వేరు ధరలను చూడవచ్చు. నిజానికి పికప్ పాయింట్, డ్రాపింగ్ పాయింట్ రెండూ ఒకటే. చేరుకోవడానికి పట్టే సమయం కూడా ఒకటే. కానీ ఆండ్రాయిడ్ ఫోన్లో బుక్ చేస్తే.. ఉబెర్ (Uber) ఆటో రైడ్‌కు రూ.290.79 చూపించింది. యాపిల్ ఐఫోన్లో (Apple iPhone) అదే రైడ్‌కు రూ.342.47 చూపించింది.Same pickup point, destination & time but 2 different phones get 2 different rates. It happens with me as I always get higher rates on my Uber as compared to my daughter’s phone. So most of the time, I request her to book my Uber. Does this happen with you also? What is the hack? pic.twitter.com/bFqMT0zZpW— SUDHIR (@seriousfunnyguy) December 23, 2024 -
ఫోన్ మారితే ఉబర్ ఛార్జ్ మారుతోంది - ఫోటోలు వైరల్
ఉబర్, ఓలా వంటి క్యాబ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చిన తరువాత.. ఎక్కడికెళ్లాలన్నా వెహికల్ బుక్ చేసుకుని గమ్యాన్ని చేరుకుంటున్నాము. అయితే క్యాబ్ లేదా ఆటో ఛార్జీలు మాత్రం మనం బుక్ చేసుకోవడానికి ఉపయోగించే మొబైల్ ఫోన్లను బట్టి మారుతూ ఉంటాయి. ఇది వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. దీనికి సంబంధించిన ఒక ట్వీట్, ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోను గమనిస్తే.. రెండు వేరువేరు మొబైల్ ఫోన్లలో రెండు వేర్వేరు ధరలను చూడవచ్చు. నిజానికి పికప్ పాయింట్, డ్రాపింగ్ పాయింట్ రెండూ ఒకటే. చేరుకోవడానికి పట్టే సమయం కూడా ఒకటే. కానీ ఆండ్రాయిడ్ ఫోన్లో బుక్ చేస్తే.. ఉబెర్ (Uber) ఆటో రైడ్‌కు రూ.290.79 చూపించింది. యాపిల్ ఐఫోన్లో (Apple iPhone) అదే రైడ్‌కు రూ.342.47 చూపించింది.దీనికి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ.. నా కుమార్తె ఆండ్రాయిడ్ ఫోన్లో కంటే.. నా యాపిల్ ఐఫోన్లో రైడ్ ధర ఎక్కువగా చూపిస్తోందని 'సుధీర్' అనే ఎక్స్ (Twitter) యూజర్ పేర్కొన్నాడు. బుక్ చేసుకునే టైమ్, దూరం, డిమాండ్ వంటి వాటిని బట్టి ధరలలో మార్పు ఉంటుంది. కానీ బుక్ చేసుకునే మొబైల్ ఫోన్‌ను బట్టి ఛార్జీలు ఉండవని ఉబర్ వెల్లడించింది.Same pickup point, destination & time but 2 different phones get 2 different rates. It happens with me as I always get higher rates on my Uber as compared to my daughter’s phone. So most of the time, I request her to book my Uber. Does this happen with you also? What is the hack? pic.twitter.com/bFqMT0zZpW— SUDHIR (@seriousfunnyguy) December 23, 2024మొబైల్ ఛార్జ్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ రేటుగతంలో ఉబర్ క్యాబ్స్ మొబైల్ బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు ఒక ఛార్జ్, ఎక్కువగా ఉన్నప్పుడు ఒక ఛార్జ్ వసూలు చేస్తున్నట్లు ఒక పరిశోధన ద్వారా వెల్లడైంది. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చూపించారు. డెర్నియర్ హ్యూర్ బ్రస్సెల్స్‌లోని వారి ఆఫీస్ నుంచి సిటీ సెంటర్లోకి వెళ్లడానికి రెండు ఐఫోన్ మొబైల్స్ ద్వారా టాక్సీ బుక్ చేసింది.ఒక ఐఫోన్లో 84 శాతం ఛార్జ్ ఉన్నప్పుడు 16.6 యూరోలు (రూ.1,498), 12 శాతం బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్‌కు 17.56 యూరోలు (రూ.1,585) చూపించింది. మొబైల్ ఛార్జ్‌లో ఉన్న తేడా ట్రిప్ ఛార్జ్‌పై ప్రభావం చూపిస్తుందని ఈ విధంగా నిరూపించింది. బ్యాటరీ లెవెల్స్ ఎలా ఉన్నా ధరల మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండదని, మొబైల్ ఛార్జ్‌కి ధరలకు ఎటువంటి సంబంధం లేదని ఉబెర్ తిరస్కరించింది.ఇదీ చదవండి: జనవరి 1 నుంచి కొత్త రూల్స్.. ఇవన్నీ మారుతున్నాయ్!ఈ కామర్స్ సైట్లలో..సాధారణంగా ఒక ప్రొడక్ట్ విలువ ఒక్కో యాప్‌లో.. ఒక్కో విధంగా ఉండొచ్చు. కానీ ఒకే యాప్‌లో ఒక ప్రొడక్ట్ ధర రెండు ఫోన్లలో వేరువేరు చూపిస్తే? ఇదెలా సాధ్యం, ఎక్కడైనా జరుగుతుందా.. అనుకోవచ్చు. కానీ సౌరభ్ శర్మ అనే ఐఓఎస్ యూజర్.. ఐఫోన్‌లోని ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో ఓ చిన్న క్యాబిన్ సూట్‌కేస్ కొనుగోలు చేయాలని చూసారు. అయితే దాని ధర రూ.4,799 అని చూపిస్తోంది. అదే ఉత్పత్తిని ఆండ్రాయిడ్ యాప్‌లో చూస్తే.. దాని ధర 4,119 రూపాయలుగా చూపిస్తోంది. ఈ రెండింటినీ సౌరభ్ స్క్రీన్ షాట్ తీసి, తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.Android vs iOS - different prices on @Flipkart App??same @my_mokobara cabin suitcase costs 4119₹ on FK Android App vs 4799₹ on iOS App.Apple charges 30% commission on subscriptions etc, so different pricing for iOS makes sense there.But for ecommerce? Very shady & unfair. pic.twitter.com/YmIq8nhuXO— Saurabh Sharma (@randomusements) October 30, 2024 -
నెలకు రూ.80,000.. ఇదేదో సాఫ్ట్వేర్ జీతం కాదు!
నెలకు రూ.85,000 వరకు వేతనం.. ఇదేదో సాఫ్ట్వేర్ ఉద్యోగి జీతం అనుకుంటే పొరపడినట్లే.. ఇది ఓ బైక్ ట్యాక్సీ డ్రైవర్ సంపాదన! అవునండి.. దాదాపు రోజుకు 13 గంటలపాటు విభిన్న ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి బెంగళూరులోని ఓ బైక్ ట్యాక్సీ డ్రైవర్ సంపాదిస్తున్న మొత్తం అది. తన సంపాదనకు సంబంధించిన వివరాలను వెల్లడించిన ఓ వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.బైక్ ట్యాక్సీలు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రజాదరణ పొందాయి. చాలామంది డ్రైవర్లకు, స్వయం ఉపాధి పొందాలనుకునేవారికి మంచి అవకాశాలను అందిస్తున్నాయి. ఉబర్, రాపిడో, ఓలా.. వంటి కంపెనీలు ప్రస్తుతం ఈ సేవలు అందుబాటులో ఉంచాయి. బెంగళూరుకు చెందిన ఓ బైక్ ట్యాక్సీ డ్రైవర్ ఉబర్, రాపిడోలో వచ్చిన రైడ్లను పూర్తి చేస్తూ, రోజుకు 13 గంటల పాటు పనిచేస్తూ నెలకు రూ.80,000-రూ.85,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ మేరకు అప్లోడ్ చేసిన వీడియో చూసినవారు బైక్ ట్యాక్సీ డ్రైవర్‌గా ఉంటూ అంతమొత్తంలో ఆర్జించడంపట్ల ఆశ్చర్య పోతున్నారు.A classic Bengaluru moment was observed in the city when a man proudly claimed that he earns more than ₹80,000 per month working as a rider for Uber and Rapido. The man highlighted how his earnings, driven by his hard work and dedication, have allowed him to achieve financial… pic.twitter.com/4W79QQiHye— Karnataka Portfolio (@karnatakaportf) December 4, 2024ఇదీ చదవండి: నిలిచిన రైల్వే ఈ-టికెట్ సేవలు..!ఇటీవల @karnatakaportf పోస్ట్ చేసిన ఈ వీడియోకు మూడు వేలకు పైగా లైకులు, ఆరు లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై వీక్షకులు విభిన్నంగా కామెంట్ చేస్తున్నారు. కొందరు డ్రైవర్ అంకితభావం, కృషిని ప్రశంసిస్తున్నారు. ‘మేము కూడా అంత సంపాదించడం లేదు భయ్యా!’ అని మరొకరు కామెంట్ చేశారు. 13 గంటల పాటు రోడ్డుపై డ్రైవింగ్ చేయడం చాలా కష్టమని మరోవ్యక్తి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. -
ఇక ఉబర్‌లో ‘శికారా’ల బుకింగ్!
ఆన్లైన్ రవాణా సేవలందిస్తున్న ఉబర్ కొత్తగా జల రవాణా సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు రోడ్లపై వాహనాలను బుక్ చేసుకున్నట్లే, ఇకపై నీటిలో బోట్లను బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఇందులో భాగంగా ఆసియాలో తొలిసారిగా జల రవాణా సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది.శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో శికారా(సంప్రదాయ చెక్క పడవలు) బుకింగ్‌ను పరిచయం చేసింది. శ్రీనగర్‌లోని ప్రముఖ దాల్ సరస్సులో ప్రయాణించే ఈ శికారా పడవలను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ సరస్సు చుట్టుపక్కల ప్రదేశాలను చూసేందుకు పర్యాటకులు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. శతాబ్దాలుగా సరస్సులో రవాణా, విశ్రాంతి కోసం శికారాలను ఉపయోగిస్తున్నారు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఇళ్ల ధరల పెరుగుదల‘సాంకేతికత, సంప్రదాయాన్ని మిళితం చేసి ప్రయాణికులకు ఆన్లైన్ ద్వారా శికారా రైడ్ అందించి వారికి మరుపురాని అనుభవాన్ని సొంతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. కశ్మీర్‌లోని ఉత్కంఠభరిత ప్రకృతి దృశ్యాన్ని మరింత మందికి చేరువ చేయడం, పర్యాటకాన్ని మెరుగుపరిచే ఈ ఐకానిక్ అనుభవాన్ని సృష్టించడం గర్వకారణం’ అని ఊబర్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్ ప్రభ్‌జీత్ సింగ్ తెలిపారు. ఉబర్ వినియోగదారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఈ సేవలను పొందవచ్చని కంపెనీ తెలిపింది. శికారా రైడ్‌ను ఉదయం 10 నుంచి సాయంత్రం 5 మధ్య బుక్ చేసుకోవచ్చు. ఉబర్ వేదికగా 15 రోజుల ముందు నుంచి బుక్ చేసుకునే వీలుంది. దాల్ లేక్‌లో దాదాపు 4,000 శికారాలు ఉన్నట్లు అంచనా. -
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ : దేవుడా..ప్యాక్ చూసి షాక్!
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసినపుడు ఒకటికి బదులు ఒకటి రావడం, లేదంటే ఆహారంలో పురుగులు, సిగరెట్ పీకలు రావడం లాంటి ఘటనలు గతంలో చాలా చూశాం. తాజాగా అమెరికాలోని ఒక మహిళకు మరో వింత అనుభవం ఎదురైంది. తను ఆర్డర్ చేసిన ప్యాకేజీ ఓపెన్ చేసి, చూసి షాకయ్యింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. స్టోరీ ఏంటంటే..!న్యూజెర్సీలో డ్రైవర్‌గా పని చేసే ఒక మహిళ ఉబెర్ ఈట్స్నుంచి బురిటో(షావర్మా) లాంటిది ఆర్డర్ చేసింది. ఉబెర్ ఈట్స్ డెలివరీ అందుకొని ఓపెన్ చేసి, తిందామని ఏంతో ఆతృతగా ఫాయిల్ రేపర్ విప్పి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అందులో బురిటోకు బదులుగా గంజాయి ప్యాక్ చేసి ఉంది. ఘటన వాషింగ్టన్ టౌన్షిప్, క్యామ్‌డెన్ కౌంటీలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ విషయంపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అయితే తన డెలివరీ ప్యాకేజీలో బురిటోకు బుదులుగా ఏదో తేడా వాసన వచ్చినట్టుగా అనిపించిందని బాధితురాలు తెలిపిందని వాషింగ్టన్ టౌన్షిప్ పోలీస్ చీఫ్ పాట్రిక్ గుర్సిక్ ఒక ప్రకటనలో తెలిపారు. అది ఒక ఔన్స్ గంజాయి అని తేలిందని ఆయన వెల్లడించారు. డ్రగ్స్, ఆల్కహాల్ లేదా మందులను రవాణాపై నిషేధం ఉన్న నేపథ్యంలో ఉబెర్ ఈట్స్‌లో ప్యాకేజీ డెలివరీ ఫీచర్‌ను ఎవరైనా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించి ఉంటారని అనుమానిస్తున్నారు.ఉబెర్ ఈట్స్ స్పందనదీనిపై ఉబెర్ ఈట్స్ కూడా స్పందించింది. ఈ ఘటన తీవ్రంగా కలపర్చేదేనని ఉబెర్ ప్రతినిధి వ్యాఖ్యానించారు. స్థానిక అధికారులను వెంటనే అప్రమత్తం చేసినందుకు ఆమెను అభినందించారు. ఇలాంటి అనుమానాస్పద డెలివరీలపై వెంటనే రిపోర్ట్ చేయాలని ఇతర డ్రైవర్లను కూడా కోరారు.ఇదీ చదవండి : వయసు 28, తులసి పంట రారాజు ఫిలిప్పో సక్సెస్ స్టోరీ, ఆదాయం ఎంతో తెలుసా? -
ఒక్క ఇంటర్వ్యూ కోసం ఏడు నెలల కష్టం.. చివరికి ఏమైందంటే?
బెంగళూరు : మంచి కంపెనీ. సంస్థ పేరుకు తగ్గట్లు ప్యాకేజీ. అందుకే ఓ టెక్కీ ఆ ఆ భారీ మొత్తాన్ని సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. కేవలం నాలుగు రౌండ్లు జరిగే ఒక్క ఇంటర్వ్యూ కోసమే ఏడు నెలలు కష్టపడ్డాడు. అలా అని సదరు టెక్కీ.. క్ బెంచ్ స్టూడెంటా అంటే అదీ కాదు. చదువులో టాపర్. ఎంఎన్ఎన్ఐటీ అలహాబాద్ పూర్వ విద్యార్థి. మరి ఒక్క ఇంటర్వ్యూ కోసం ఏడు నెలలు ఎందుకు కష్టపడాల్సి వచ్చిందని అడిగితే.. సదరు టెక్కీ ఏం చెప్పారంటే?ఉత్తరప్రదేశ్ వారణాసి జిల్లాకు చెందిన చిత్రాంశ ఆనంద్. భారత్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో ఒరాకిల్‌లో కంపెనీలో రెండేళ్ల పాటు పనిచేశాడు. ఏడాదికి రూ.40 లక్షలు ప్యాకేజీ. మంచి శాలరీ, అనుభవం కోసం మరో కంపెనీలో చేరేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం గట్టి ప్రయత్నాలే చేశాడు. చివరికి ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్‌లో తన అనుభవానికి తగ్గట్లు ఉద్యోగం ఉందని తెలుసుకుని అప్లయి చేశాడు.అనంతరం తన ఇంటర్వ్యూల కోసం ఏడు నెలల రీసెర్చ్ చేశాడు. రేయింబవళ్లు ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యాడు. ఇందుకోసం లీట్‌కోడ్ ఫ్లాట్‌ఫామ్‌ను ఎంచుకున్నాడు. ఇందులో పెద్ద పెద్ద టెక్ కంపెనీల్లో నిర్వహించే టెక్నికల్ రౌండ్‌ను ఎలా చేధించవచ్చో తెలుసుకోవచ్చు. అలా ఏడు నెలల అనంతరం ఉబెర్ ఇంట్వ్యూకి అటెండ్ అయ్యాడు. నాలుగు రౌండ్ల ఇంటర్వ్యూలో బోర్డ్ సభ్యులు అడిగిన రెండు ప్రశ్నలకు నేను చదవిన చదువుకు.. సంబంధం లేదు. అయినప్పటికీ వాటికి ఆన్సర్ ఇచ్చాడు. ఇంటర్వ్యూ క్రాక్ చేశాడు. రూ.60లక్షలు ఇచ్చేందుకు ఉబర్ ముందుకు రావడంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు.ఈ సందర్భంగా ఆనంద్ ఒరాకిల్,ఉబర్‌లో ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడాడు. ఒరాకిల్‌లో ఐదు రోజులకు మూడురోజులు ఆఫీసు నుండి పని చేయాల్సి వచ్చింది. ఉబర్‌లో వారానికి రెండు రోజులు మాత్రమే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. పైగా ఎక్కువ గంటలు పనిచేయాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఒకవేళ అవసరమైతే ఎక్కువ గంటలు పనిచేస్తా. అందులో నాకెలాంటి అభ్యంతరం లేదు. నా కెరియర్ ప్రారంభంలో ఉంది కాబట్టి ఆఫీస్- పర్సనల్ లైఫ్ విషయాల్లో ఎలాంటి ఆందోళన చెందడం లేదు. నేను అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. కష్టపడి పనిచేయాలి. ఆ తర్వాత లైఫ్ బ్యాలెన్స్ విషయాలపై దృష్టిసారిస్తా అని చెప్పుకొచ్చాడు. -
అదర్‌సైడ్ .. నువ్వు విజిలేస్తే...
ప్రతి సంవత్సరం మన దేశంలో నిమజ్జనోత్సవాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రకరకాల వేషాల్లో వినాయకుడు సరదాగా ఉన్నాడు. లడ్డూ వేలాలు కోట్లకు చేరుకుంటు న్నాయి. ఇన్ని జరుగుతున్నా, ఇన్ని మారుతున్నా ఒక్కటి మాత్రం మారలేదు – నిమజ్జనం లాంటి సమయాల్లో పోగైన జనాల మధ్యనుంచి స్త్రీలని వేధించే పోకిరీ వేషాలు.నిమజ్జనాలు మొదలైన మూడో రోజు అనుకుంటా. ఒక మీటింగ్ ముగించుకుని ఊబర్ బైక్‌పై ఇంటికొస్తున్నాను. ట్రాఫిక్ మెల్లగా కదుల్తోంది. మా బైక్‌కి కొంచెం ముందు ఒక చిన్న ట్రాలీ ఆటోలో ఒక బుజ్జి వినాయకుడు. క్యూట్‌గా ఉన్నాడు. వినాయకుడి విగ్రహం కంటే చుట్టూ పెట్టిన సౌండ్ సిస్టం పెద్దదిగా ఉంది. డుబ్ డుబ్ అని డీజే సౌండ్లతో మారుమోగిపొతోంది రోడ్డంతా. ట్రాలీలో ఒక పదిమందికి పైగానే కుర్రాళ్ళు ఫుల్ డాన్స్ చేస్తున్నారు. అంతా బావుంది అనుకుంటుండగా ఆ గుంపులో ఒకడు నన్ను చూసి కన్ను కొట్టాడు. అప్పటివరకూ నేనూ సరదాగా చూస్తున్న ఆ దృశ్యం వికృతంగా మారింది.అంతటితో అయినపోలేదు. నా వైపు చూసి కన్ను కొట్టినోడు, పక్కనున్న మరొకడి చెవిలో ఏదో చెప్పడు. వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఏమో గట్టిగా నవ్వుకుంటూ అప్పటిదాకా నిలబడి చూస్తున్న వీళ్లిద్దరూ డాన్స్ చేస్తున్న కుర్రాళ్లతో కలిసి అదో రకంగా స్టెప్స్ వేయడం మొదలుపెట్టారు. మామూలుగా అయితే నేను మొహం తిప్పేసుకోవడమో లేదా మొబైల్ చూసుకోవడమో చేసేదాన్ని. కానీ ఆ రోజు మాత్రం వాళ్లవైపే గుడ్లురుమి చూస్తుండిపోయాను. ఎంత కోపంగా చూస్తే అంత రెచ్చిపోతున్నారు. ట్రాఫిక్ కదలడం లేదు. కాసేపటికి నేనే తల తిప్పుకున్నాను. ట్రాఫిక్ కొంచెం మూవ్ అయింది. మా ఊబర్ డ్రైవర్ ఒక కారు వెనక ఆగిపోయాడు. ఆ ట్రాలీ ఆటో ముందుకు వెళ్లిపోయింది. పాట మారింది. అప్పుడే మమ్మల్ని దాటుకొని ఒక స్కూటీ వెళ్లింది. ఆ స్కూటీ నడుపుతున్న అమ్మాయి మీదకి మారింది ఆ కుర్రాళ్ల చూపు. ఆ అమ్మాయిని చూసి కూడా అవే కోతలు, అవే కేకలు, అవే కుప్పి గంతులు. ఆ అమ్మాయి చున్నీ సర్దుకోవడం నాకు కనిపించింది. ఆ అమ్మాయి ఆ ట్రాలీని కూడా దాటుకొని ఫాస్ట్ గా అక్కడి నుండి వెళ్లిపోయింది. ఓయ్ ఓయ్ అని తరిమాయి ఆ పిల్లని ఈ గాలి మాటలు.ఆ కుర్రాళ్లు ఆ రాత్రికెప్పుడో నిమజ్జనం పూర్తి చేసుకుని, ఏ అర్ధరాత్రో ఇంటికి చేరుకుని హాయిగా నిద్రపోయుంటారు. కానీ వాళ్ల చేసిన అల్లరికి ఎంతమంది అమ్మాయిలకు ఆ రాత్రి నిద్రపట్టకుండా చేసుంటారో, వాళ్లలో ఎంత భయాందోళనలు కలుగచేసి ఉంటారో వాళ్లకి తెలిసుండదు.ఏదో దార్లో ఆమ్మాయి కనిపిస్తే జస్ట్ విజిలేసా, అంతే అని మగాళ్లకి అనిపించవచ్చు. అదేం పెద్ద విషయం కాదని మన సినిమాలు నార్మలైజ్ చేసుండొచ్చు. కానీ ఈ రకమైన వేధింపులు స్త్రీలకు తీవ్రమైన మానసిక, శారీరక ఇబ్బందులను కలుగచేస్తాయనేది ఇప్పటికైనా అందరూ తెలుసుకోవాల్సిన విషయం.ఇదో పెద్ద సమస్యా అని తీసిపారేసే విషయం కాదు. 2014లో న్యూయార్క్ లో సొషానా రాబర్ట్స్ అనే మహిళ 10 గంటల పాటు నడిచినప్పుడు దాదాపు 100 సార్లు ఇలాంటి వేధింపులకు గురైంది. ఆమె ఈ అనుభవాన్ని వీడియోగా చిత్రీకరించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో వైరల్ అయి, ప్రపంచవ్యాప్తంగా క్యాట్ కాలింగ్‌పై చర్చకు తెరలేపింది.అంటే ఒకమ్మాయి రోడ్డు మీద గంటసేపు నడిస్తే కనీసం పదిసార్లు ఎవరో ఒకరు ఆమెను అదోలా చూడడమో, ఏదో ఒకటి అనడమో జరుగుతుంది. ఒక్కసారి ఆలోచిస్తే భయంగా లేదా?సరే ఇది ఒక వైపైతే, నిమజ్జనం చివరి రోజు ఆ జనాల మధ్య ఎంతమంది మగాళ్లు ఆడవాళ్లని తాకరాని చోట తాకుతూ ఎంత హింసకు గురిచేస్తారో, ఈ దేశంలోని ప్రతి మహిళ ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి అనుభవానికి గురయ్యే ఉంటారు. ఇది కేవలం నిమజ్జనానికి సంబంధించిన విషయం కాదు. ఎక్కడ ఎప్పుడు జనాలు గుమిగూడినా జరిగే విషయమే.ఒక్క ఖైరతాబాద్ గణేష్ మండపం దగ్గర, కేవలం వారం రోజుల్లో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న 285 మందిని అరెస్ట్ చేశారంటే ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఆలోచించండి.లైంగిక వేధింపు అనేది కేవలం స్త్రీల సమస్య కాదు, ఇది మన సమాజం మొత్తం ఎదుర్కొంటున్న సమస్య. ఈసారి ఎదురుగా వస్తున్న అమ్మాయిని చూసి ఏదైనా అనాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా అక్కడ మీ అమ్మో, అక్కో, చెల్లో ఉంటే ఏం చేస్తారు అని ఒక్కసారి ఆలోచించమని మై డియర్ మగాళ్లను రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతేకాదు ఈ సమస్య బయట వేరేవరో కాదు మీ అక్క, మీ చెల్లి కూడా ఎదుర్కొంటున్నారని ఆలోచించమంటున్నాను. -
ఉబర్‌కు షాక్.. రూ. 2,718 కోట్లు ఫైన్
-
డ్రైవర్ల డేటా అమెరికాకి.. ‘రూ. 2,718 కోట్లు ఫైన్ కట్టండి’
ప్రముఖ అమెరికన్ మల్టీ నేషనల్ రవాణా సంస్థ ఉబెర్‌పై నెదర్లాండ్స్ కొరడా ఝుళిపించింది. యూరోపియన్ డ్రైవర్ల వ్యక్తిగత డేటాను అమెరికా సర్వర్లకు చేరవేయడంపై డచ్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ (డీటీఏ) 290 మిలియన్ యూరోలు (సుమారు రూ. 2,718 కోట్లు) భారీ జరిమానా విధించింది.డ్రైవర్ సమాచారాన్ని రక్షించడంలో ఉబెర్ విఫలమైందని, ఇలా డ్రైవర్ల సమాచారాన్ని చేరవేయడం యూరోపియన్ యూనియన్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (జీడీపీఆర్) ప్రకారం "తీవ్రమైన ఉల్లంఘన" అని డీటీఏ పేర్కొంది. "యూఎస్‌కు డేటా బదిలీకి సంబంధించి ఉబెర్ జీడీపీఆర్ నిబంధనలు పాటించలేదు. ఇది చాలా తీవ్రమైనది" అని డచ్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ ఛైర్మన్ అలీడ్ వోల్ఫ్సెన్ ఒక ప్రకటనలో తెలిపారు.యూరోపియన్ డ్రైవర్లకు సంబంధించిన టాక్సీ లైసెన్స్‌లు, లొకేషన్ డేటా, ఫోటోలు, చెల్లింపు వివరాలు, గుర్తింపు పత్రాలతోపాటు కొన్ని సందర్భాల్లో డ్రైవర్ల క్రిమినల్, మెడికల్ డేటాను సైతం ఉబెర్ సేకరించిందని డీపీఏ తెలిపింది. సరైన నిబంధనలు పాటించకుండా రెండేళ్ల వ్యవధిలో ఉబెర్ ఈ సమాచారాన్ని తమ యూఎస్ ప్రధాన కార్యాలయానికి చేరవేసిందని ఆరోపించింది. అయితే ఈ జరిమానాపై అప్పీల్ చేస్తామని ఉబెర్ తెలిపింది. "ఇది లోపభూయిష్ట నిర్ణయం. అసాధారణ జరిమానా పూర్తిగా అన్యాయమైనది" అని ఉబెర్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. -
వైరల్ వీడియో.. ఉబర్ డ్రైవర్‌పై పెప్పర్ స్ప్రేతో యువతి దాడి
ఉబర్ డ్రైవర్‌పై ఓ యువతి పెప్పర్ స్ప్రేతో విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికాలోని మన్హట్టన్లో అర్ధరాత్రి సమయంలో పెప్పర్ స్ప్రేతో డ్రైవర్‌పై దాడికి దిగింది. కారులో నుంచి తప్పించుకుని పారిపోదామని ప్రయత్నించినా వదలకుండా ఆ మహిళ పెప్పర్ స్ప్రే కొట్టింది. దాడి చేయొద్దంటూ బాధితుడు వేడుకున్న కానీ ఆ మహిళ వినలేదు. చివరికి అక్కడి నుంచి తప్పించుకుని బయటపడ్డాడు. దాడి సమయంలో యువతితో పాటు మరో మహిళ కూడా కారులో ఉంది.నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. థర్డ్ డిగ్రీ నేరంగా పరిగణించి కేసు నమోదు చేశారు. అయితే.. డ్రైవర్‌పై ఎందుకు దాడి చేసిందన్నది మాత్రం తెలియలేదు. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.అయితే ఈ దాడి ఘటన తర్వాత ఉబర్ ఆ యువతిపై నిషేధం విధించింది. భవిష్యత్‌లో ఎప్పుడూ మళ్లీ తమ సర్వీస్‌లను వినియోగించుకోడానికి వీల్లేకుండా బ్యాన్ చేసింది. డ్రైవర్‌పై దాడి చేసిన తీరు ఆందోళనకరం.. ఇది సరికాదు. హింసను సహించం. ఉబర్ ప్లాట్‌ఫామ్ నుంచి ఆ యువతిని బ్యాన్ చేస్తున్నట్లు ఉబర్ వెల్లడించింది.NYCWoman randomly maces Uber driver ‘because he's brown’ pic.twitter.com/GKHBkBvESr— The Daily Sneed™ (@Tr00peRR) August 2, 2024 -
తప్పు చేశాం.. కప్పు కాఫీ తాగండి..!
మైక్రోసాఫ్ట్ విండోస్‌లో ఇటీవల తలెత్తిన్న అంతరాయానికి కారణమైన క్రౌడ్‌స్ట్రైక్ తన వినియోగదారులకు ఉబర్ ఈట్స్ కూపన్కార్డు ఇచ్చి క్షమాపణలు కోరింది. విండోస్ యూజర్లకు ఇటీవల ‘బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్’ మేసేజ్ రావడంతో వారి విధులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతర్జాతీయ విమానరంగం, ఆరోగ్య సంరక్షణ రంగంతో పాటు అత్యవసర సేవలకు తీవ్ర ఆటంకం కలిగింది. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 85 లక్షల కంప్యూటర్లు క్రాష్ అయినట్లు అంచనా. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు సెక్యూరిటీ సేవలందించే క్రౌడ్‌స్ట్రైక్ సంస్థ ఈ ఘటన వల్ల ప్రభావితమైన యూజర్లకు 10 డాలర్ల (రూ.830) విలువ చేసే ఉబర్ ఈట్స్ కూపన్‌ను ఇచ్చి క్షమాపణలు కోరింది. ఈ మేరకు ఈమెయిల్లో కూపన్ వివరాలు పంపించింది.క్రౌడ్‌స్ట్రైక్ పంపించిన ఈమెయిల్లో..‘జులై 19న ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సర్వీసుల్లో కలిగిన అంతరాయానికి చింతిస్తున్నాం. వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం. సాంకేతిక సమస్యను గుర్తించి దాన్ని పరిష్కరించేలా సహకరించినందుకు ధన్యవాదాలు. ఓ కప్పు కాఫీ లేదా స్నాక్స్‌తో మీకు కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నాం. కూపన్ కోడ్‌ని ఉపయోగించడం ద్వారా ఉబర్ ఈట్స్ క్రెడిట్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు’ అని తెలిపింది. ఇదిలాఉండగా, వోచర్‌ను రెడీమ్ చేయడంలో కొందరు వినియోగదారులు సమస్యలను ఎదుర్కొంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.ఇదీ చదవండి: జీఎస్టీ శ్లాబులు తగ్గింపు..?మైక్రోసాఫ్ట్ అంతరాయం వెనుక ఉన్న సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్‌స్ట్రైక్ భారీ నష్టాన్నే మూటకట్టుకుంది. విండోస్‌కు సెక్యూరిటీ సేవలు అందించే ఈ సంస్థ చేసిన ఫాల్కన్ సెన్సార్ సాఫ్ట్వేర్ అప్డేట్లో లోపం కారణంగా చాలా దేశాల్లోని కంప్యూటర్లలో అంతరాయం ఏర్పడింది. దీంతో పలు విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థలు సహా రైల్వే, టీవీ, రేడియో, ఆస్పత్రి సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. -
ఢిల్లీ రోడ్లపైకి ఉబెర్ ఏసీ బస్సులు
దేశరాజధాని ఢిల్లీలో త్వరలో ఉబెర్ బస్సులు తిరగనున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం ప్రయాణికుల కోసం ఒక వినూత్న పథకాన్ని అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీని కింద ఆగస్టు నుండి ఢిల్లీవాసులు ప్రైవేట్ కంపెనీలకు చెందిన ఎయిర్ కండిషన్డ్ బస్సుల్లో సీట్లు బుక్ చేసుకునే అవకాశం ఏర్పడనుంది.గత ఏడాది ఢిల్లీ ప్రభుత్వం నోటిఫై చేసిన ‘ఢిల్లీ మోటార్ వెహికల్ లైసెన్సింగ్ అగ్రిగేటర్ (ప్రీమియం బస్సులు) పథకం’ కింద లగ్జరీ బస్సు సర్వీసులను ప్రారంభించనుంది. నగరంలో ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గించడం, కాలుష్యాన్ని అరికట్టడం ఈ పథకంలోని ప్రధాన లక్ష్యం. ఈ పథకం కింద ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో రెండు అగ్రిగేటర్లు.. ఉబెర్, అవేగ్ బస్సులను నడపడానికి లైసెన్స్‌లను మంజూరు చేసింది. ఈ బస్సులు ఏఏ మార్గాల్లో సేవలను ప్రారంభించాలనేది ఖరారు చేస్తున్నట్లు రవాణా శాఖ అధికారి తెలిపారు.త్వరలో డిల్లీ రోడ్లపై తిరిగే ఈ ప్రీమియం బస్సులు తొమ్మిది మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యాన్ని కలిగివుంటాయి. ఈ బస్సులలో వైఫై సదుపాయం ఉంటుంది. అలాగే జీపీఎస్, సీసీటీవీ కూడా ఉంటుంది. ఈ నెలాఖరు లేదా ఆగస్టు మొదటి వారంలోగా ఈ బస్సులు ఢిల్లీ రోడ్లపై తిరగనున్నాయని సమాచారం. -
ఏసీ ఆన్ చేయమంటే క్యాబ్ డ్రైవర్ ఏం చేశాడో తెలుసా..?
ఉబర్ క్యాబ్ బుక్ చేసి ఎక్కాక ఏసీ ఆన్ చేయమన్న పాపానికి ఓ వినియోగదారుడికి డ్రైవర్ నుంచి వింత అనుభవం ఎదురైంది. దీనికి సంబంధించిన వివరాలను రెడ్డిట్‌లో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఇంతకీ తాను ఏం పోస్ట్ చేశాడు.. అసలేం జరిగిందో తెలుసుకుందాం.రెడ్డిట్లోని ‘నెర్డి-ఒజెడ్-బెంగళూరు’ అనే ఐడీలో వినియోగదారుడు తెలిపిన వివరాల ప్రకారం..‘ఉబర్ క్యాబ్ బుక్ చేశాను. కారులో ఎక్కిన కాసేపటికి ఏసీ ఆన్ చేయమని డ్రైవర్‌ను అభ్యర్థించాను. అతడు కన్నడలో ‘ఎందుకు ఏసీ, మీరు రైడ్‌ను రద్దు చేసుకోండి’ అన్నాడు. మరింత మర్యాదగా..దయచేసి పక్కన ఆపండి. నాకు మీ కారులో రావడం ఇష్టం లేదు అన్నాను. దాంతో డ్రైవర్ కోపంగా వెంటనే ఏసీ ఆన్ చేశాడు. కానీ పిచ్చివాడిలా కారు నడపడం ప్రారంభించాడు. సడన్ బ్రేక్‌లు వేయడం, సడన్ యాక్సిలరేషన్‌తో ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. నాకు ‘వెర్టిగో’ సమస్య ఉంది. ఇలాంటి సడన్ జర్క్లకు మైకం కమ్ముతుందని చెప్పాను. కానీ నా మాటలు పట్టించుకోకుండా డ్రైవర్ అలాగే వ్యవహరించాడు. దాంతో వెంటనే ఉబర్ సేఫ్టీకి కాల్ చేశాను. కాల్ సెంటర్ వ్యక్తి నన్ను సురక్షితమైన ప్రదేశంలో దిగమని సలహా ఇచ్చాడు. కానీ డ్రైవర్ ఎక్కడా ఆపలేదు. తనపై నేను ఫిర్యాదు చేశానని డ్రైవర్‌కు అర్థమైంది. అతను నా పేరు, చిరునామా వివరాలను కాగితంపై రాసి, పికప్ లొకేషన్ తనకు తెలుసని తర్వాత తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించాడు’ అని తెలిపారు.ఈ పోస్ట్ వైరల్‌గా మారడంతో ఇంటర్నెట్ వినియోగదారులు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘నేను కూడా ఇలాంటి ఒక డ్రైవర్ చేతిలో మోసపోయాను. ప్రజలను వేధించడానికి వారికి సాకు కావాలి’ అని ఒకరు రిప్లై ఇచ్చారు. ‘డ్రైవర్ మిమ్మల్ని బెదిరించాడని ఉబెర్‌కు ట్వీట్ చేయండి. ఈ వ్యవహారంపై ధ్రువీకరణ కోరుతూ వారికి ఈమెయిల్ పెట్టండి. దాన్ని ఎలా ఎదుర్కోవాలో వారికి తెలుస్తుంది. డ్రైవర్‌కు మీ వివరాలు తెలుసని రాశారు కదా.. జాగ్రత్తగా ఉండండి. ఏదైనా జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి’ అంటూ మరో యూజర్ రాసుకొచ్చారు.ఇదీ చదవండి: ఫిన్‌టెక్ కంపెనీలకు ఆర్బీఐ ఆదేశాలుఇదిలాఉండగా, ఏ కంపెనీ అయినా తన కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందిస్తే దాన్ని ఎవరైనా ఆదరిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఉబర్ వంటి ఆన్లైన్ క్యాబ్ సర్వీసులు అందిస్తున్న కంపెనీలు గ్రౌండ్ లెవల్లో వినియోగదారులకు నేరుగా సేవలందిస్తున్నవారికి కచ్చితమైన మార్గదర్శకాలు విడుదల చేసి వాటిని పాటించేలా చూడాలని సూచిస్తున్నారు. దాంతో కంపెనీకి మేలు జరుగుతుందని చెబుతున్నారు. -
ఖుషీ చాలా స్మార్ట్ : క్యాబ్ ఖర్చుతోనే హెలికాప్టర్ రైడ్, వైరల్ స్టోరీ
న్యూయార్క్ సిటీలో ఇండో అమెరికన్ మహిళ చేసిన పని వార్తల్లో నిలిచింది. న్యూయార్క్ సిటీ ట్రాఫిక్‌ను అధిగమించడానికి ఉబెర్ ట్రిప్‌లో కాకుండా తెలివిగా హెలికాప్టర్ రైడ్ ఎంచుకుంది. ఇందుకైన ఖర్చు కూడా పెద్దగా లేకపోవడంతో తెలివిగా వ్యవహరించింది. దీనికి సంబంధించిన వివరాలను ఎక్స్ పోస్ట్ చేయగా ఇది వైరల్‌గా మారింది. విషయం ఏమిటంటే..క్లీనర్ పెర్కిన్స్‌లో ఉద్యోగి అయిన ఖుషీ సూరి మాన్హాటన్ నుంmr క్వీన్స్‌లోని జాన్ ఎఫ్. కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లాలని ప్లాన్ చేసుకుంది. ఇందుకు ఉబెర్‌లో వెళ్లాలని ప్రయత్నించింది. ఇందుకు పట్టే సమయం 60 నిమిషాలు చూపించింది. అమ్మో...అంత టైమా అనుకుని హెలికాప్టర్ రైడ్‌కి ఎంత సమయం పడుతుందా అని ఒకసారి చెక్ చేసింది. కేవలం 5 నిమిషాల్లో వెళ్లిపోవచ్చని చూపించింది. పైగా ఈరెండింటిమధ్య ఖర్చుకు పెద్ద తేడాలేదు. కేవలం 30 డాలర్లు మాత్రమే డిఫరెన్స్ చూపించింది. అంతే క్షణం ఆలస్యం చేయకుండా హెలికాప్టర్ బుక్ చేసుకుంది. ధరల స్క్రీన్షాట్లతో పాటు బ్లేడ్ ఎయిర్ మొబిలిటీని ట్యాగ్ చేసింది. ఎక్స్‌లో ఆమె షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం ఉబెర్ క్యాబ్ ఖర్చు రూ. 11,000. సమయం 60 నిమిషాలు. అదే బ్లేడ్ హెలికాప్టర్ రైడ్‌కు 5 నిమిషాలు. పైగా ఖర్చు సుమారు రూ. 13,765. అందుకే ఎచక్కా హెలికాప్టర్ ఎంచుకుంది. దీంతో ట్రాఫిక్ గందరగోళాన్ని తప్పించుకోవడంతోపాటు, హెలికాప్టర్ రైడ్‌ను కూడా ఎంజాయ్ చేయవచ్చు. అదన్నమాట ప్లాన్. దీంతో నెటిజనులు ఆమెపై ప్రశంసలు కురిపించారు. జూన్ 17న షేర్ అయిన ఈ వీడియోను 40.3 లక్షల మందికి పైగా వీక్షించారు.కాగా న్యూయార్క్ నగరంలో ఉన్న బ్లేడ్ ఎయిర్ మొబిలిటీ, హెలికాప్టర్ల సేవలందిస్తోంది. ప్రధానంగా మాన్హాటన్-జాన్ ఎఫ్. కెన్నెడీ విమానాశ్రయంక మధ్య హెలికాప్టర్ సేవలను అందిస్తుంది. -
బస్ సర్వీస్ ప్రారభించనున్న ఉబర్.. మొదట ఆ నగరంలోనే..
ప్రముఖ క్యాబ్ సర్వీస్ కంపెనీ ఉబర్.. బస్సులను నడపడానికి సిద్ధమైంది. ప్రీమియం బస్ స్కీమ్ కింద ఈ సర్వీసు ప్రారభించనున్నట్లు సమాచారం. అయితే మొదట ఈ సేవను దేశ రాజధాని నగరం ఢిల్లీలో ప్రారంభించనుంది.ఉబెర్కి బస్సులను నడపడానికి ఢిల్లీ రవాణా శాఖ అగ్రిగేటర్ లైసెన్స్ మంజూరు చేసింది. యాప్‌లో 'ఉబర్ షటిల్' ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా ప్రయాణికులు ఒక వారం ముందుగానే సీట్లను బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న తరువాత లైవ్ లొకేషన్, రూట్‌ని ట్రాక్ చేయవచ్చు.ఉబర్ బస్సులో ఒకసారికి 19 నుంచి 50 మంది ప్రయాణికులు పయనించవచ్చు. రోజు వారీ ప్రయాణాలను కూడా ఈ సర్వీసును ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ సర్వీసును మొదటి ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో పరీక్షించారు. ఇక త్వరలోనే ఈ సర్వీసును అధికారికంగా ప్రారంభించనున్నారు. ఆ తరువాత కోల్‌కతాలో ప్రారంభించే అవకాశం ఉంది.బస్సు సర్వీస్ కోసం లైసెన్స్ పొందిన మొదటి కంపెనీగా ఉబెర్ అవతరించింది. ఢిల్లీ ప్రభుత్వం ప్రజా రవాణా సేవలను మెరుగుపరచడానికి కట్టుబడి ఉందని ఢిల్లీ ప్రభుత్వంలోని రవాణా శాఖ అధికారి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ సర్వీస్ ఇతర ప్రధాన నగరాలకు కూడా వ్యాపించే అవకాశం ఉందని తెలుస్తోంది. -
భారత్‌లో 10 లక్షలు దాటిన ఉబర్ డ్రైవర్ల సంఖ్య
భారతదేశంలో ఉబర్ డ్రైవర్ల సంఖ్య ఏకంగా 1 మిలియన్ (10 లక్షలు) కంటే ఎక్కువ ఉన్నట్లు సంస్థ సీఈఓ దారా ఖోస్రోషాహి ప్రకటించారు. ఈ ఏడాది మార్చి త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. 10 లక్షల డ్రైవర్ల మార్కును దాటిన అమెరిక, బ్రెజిల్ తర్వాత మూడో దేశంగా భారత్ నిలిచిందని ఆయన స్పష్టం చేశారు.ఉబర్ సేవలు దేశంలో కొత్త ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయి. దీంతో మునుపటి కంటే డ్రైవర్ల సంఖ్య పెరిగిందని ఖోస్రోషాహి అన్నారు. మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా సర్వీస్ భారీగా పెరిగిందని ఖోస్రోషాహి అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత మార్కెట్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది.బుకింగ్‌లు, లావాదేవీల పరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారతదేశం ఒకటి. పెద్ద మార్కెట్లు నెమ్మదిగా వృద్ధి చెందుతున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం ఓఎన్డీసీతో అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు ఉబెర్ ప్రకటించింది. రాబోయే రోజుల్లో కంపెనీ మరింత వృద్ధి చెందుతుందని, డ్రైవర్ల సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. -
ఫేక్ ఉబర్ డ్రైవర్ల హల్ చల్..
అమెరికాలో అత్యంత రద్దీగా ఉండే అట్లాంటా ఎయిర్పోర్ట్ దగ్గర ఉబర్, లిఫ్ట్ వంటి రైడ్ షేర్ల పేరుతో ఫేక్ రైడ్ డ్రైవర్లు హల్చల్ చేస్తున్నారు. వీరు ప్రయాణికులను మోసగిస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రైడ్‌షేర్ డ్రైవర్ల ముసుగులో ప్రయాణికులను మోసగిస్తున్న ఫేక్ రైడ్ డ్రైవర్లను స్థానిక వార్తా సంస్థ 11అలైవ్ గుర్తించింది. ఈ మోసగాళ్లు తక్కువ రేట్లను రైడ్లను అందిస్తారు. వివిధ చెల్లింపు పద్ధతులను అంగీకరిస్తారు. అయితే వారికి డబ్బు కంటే కూడా మానవ అక్రమ రవాణా వంటి వేరే అక్రమ ఉద్దేశాలు ఉండవచ్చు. ఈ వ్యవహారంపై అట్లాంటా పోలీస్ డిపార్ట్మెంట్ రహస్య ఆపరేషన్ చేపట్టింది. ప్రయాణికులను మోసగిస్తున్న పలువురు ఫేక్ డ్రైవర్లను అరెస్టు చేసింది. అయినప్పటికీ వీరి ఆగడాలు తగ్గడం లేదు. తొందరలో ఉండే ప్రయాణికులే లక్ష్యంగా వీళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అధికారిక యాప్‌ల ద్వారా తమ రైడ్‌షేర్ ఏర్పాట్లను నిర్ధారించుకోవాలని, నిర్దేశించిన ప్రాంతాల్లో మాత్రమే డ్రైవర్లను కలవాలని అధికారులు ప్రయాణికులకు సూచిస్తున్నారు. దీంతోపాటు పికప్ చేసుకునేందుకు వచ్చిన వ్యక్తి పేరు తెలుసుకుని నిర్ధారించుకోవాలని సలహా ఇస్తున్నారు. -
‘ఉబర్’ రైడ్‌కు కోట్లలో బిల్లు..! షాక్ అయిన కస్టమర్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని నోయిడాలో దీపక్ తెంగురియా అనే వ్యక్తి రొటీన్‌గా తాను వెళ్లే రూట్లో ఉబర్ ఆటో రైడ్ బుక్ చేశాడు. రైడ్ తక్కువ దూరమే అయినందున రూ.62 బిల్లు చూపించింది. మామూలే కదా అని ఆటో ఎక్కి డెస్టినేషన్‌లో దిగి బిల్లు పే చేద్దామనుకునే సరికి దీపక్ అవాక్కయ్యాడు. ఏకంగా రూ.7.66 కోట్లు పే చేయాలని బిల్లు చూపించింది. దీంతో ఆశ్చర్యపోవడం దీపక్ వంతైంది. దీపక్‌కు ఇంత భారీ బిల్లు రావడానికి సంబంధించిన వీడియోను ఆయన స్నేహితుడు ఆశిష్ ఎక్స్(ట్విటర్)లో షేర్ చేశాడు. దీనిపై వీడియోలో స్నేహితులిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. చంద్రయాన్‌కు రైడ్ బుక్ చేసుకున్నా ఇంత బిల్లు రాదని ఇద్దరు స్నేహితులు జోకులు వేసుకున్నారు. सुबह-सुबह @Uber_India ने @TenguriyaDeepak को इतना अमीर बना दिया कि Uber की फ्रैंचाइजी लेने की सोच रहा है अगला. मस्त बात है कि अभी ट्रिप कैंसल भी नहीं हुई है. 62 रुपये में ऑटो बुक करके तुरंत बनें करोडपति कर्ज़दार. pic.twitter.com/UgbHVcg60t — Ashish Mishra (@ktakshish) March 29, 2024 అయితే అతి తక్కువ దూరం ఆటో రైడ్‌కు కోట్లలో బిల్లు రావడంపై ఉబర్ స్పందించింది. ‘భారీ బిల్లు ఇచ్చి ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణలు. మాకు కొంత సమయమిస్తే దీనిపై అప్డేట్ ఇస్తాం’అని ఉబర్ సందేశం పంపింది. ఇదీ చదవండి.. వీల్ చైర్లో వచ్చాడు.. విల్ పవర్ చూపాడు -
ట్యాక్సీ డ్రైవర్లకు రూ.1,470 కోట్లు చెల్లించనున్న ప్రముఖ కంపెనీ.. ఎందుకంటే..
ప్రముఖ ఆన్లైన్ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ తన ట్యాక్సీ డ్రైవర్లకు ఏకంగా రూ.1,470 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. ఆస్ట్రేలియాలో చాలాకాలంగా కొనసాగుతున్న న్యాయ వివాదానికి పరిష్కారం లభించింది. ఉబర్ తమ దేశంలోకి ప్రవేశించడంతో ఉపాధి కోల్పోయామంటూ దాదాపు 8,000 మంది ట్యాక్సీ డ్రైవర్లు కోర్టును ఆశ్రయించారు. దీనిపై కొంతకాలంగా విచారణ కొనసాగుతోంది. పరిహారం చెల్లించడానికి కంపెనీ నిరాకరిస్తూ వచ్చింది. తాజాగా ఈ కేసు విక్టోరియా సుప్రీంకోర్టులో విచారణకు రావాల్సి ఉంది. కానీ, అప్పటికే ఉబర్ డ్రైవర్లతో పరిహార ఒప్పందం కుదుర్చుకుంది. ఉబర్ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సేవలందిస్తోంది. 2012లో ఆస్ట్రేలియాలోకి ప్రవేశించిన ఉబర్ వేగంగా సేవలను విస్తరించినట్లు న్యాయవాది మైఖేల్ తెలిపారు. దీనివల్ల అప్పటికే స్థానికంగా అద్దె ట్యాక్సీలను నడిపే చాలా మంది ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు. వారికి పరిహారం చెల్లించాలని అనేకసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ.. ఉబర్ నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. దీంతో కోర్టును ఆశ్రయించామని తెలిపారు. డ్రైవర్ల డిమాండ్‌కు సామాన్య పౌరులు సైతం మద్దతు తెలిపినట్లు చెప్పారు. ఈ వ్యవహారంపై ఉబర్ స్పందిస్తూ ప్రపంచంలో కంపెనీ ఉబర్ సేవలు ప్రారంభించినపుడు ఆయా దేశాల్లో నియంత్రణ నిబంధనలులేవు. ఆస్ట్రేలియాలో ఉబర్ కార్యకలాపాల వల్ల అక్కడి రవాణా వ్యవస్థలు మెరుగైన మార్పులు వచ్చాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. దాంతో స్థానికంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు దొరికాయని చెప్పారు. ఆదేశ నిబంధనల ప్రకారం..2018 నుంచి వివిధ ప్రాంతాల్లోని వారితో పరిహార ఒప్పందాలు చేసుకుంటున్నామన్నారు. ఇదీ చదవండి: మరో ‘కేజీఎఫ్’ ఆనవాలు.. ఎక్కడో తెలుసా..? -
8.8 కి.మీ క్యాబ్ రైడ్ ధర చూసి షాక్.. చివరికి ఏమైందంటే..
ప్రముఖ ఆన్లైన్ క్యాబ్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ఉబర్ తాజాగా వినియోగదారుడికి రూ.10వేలు పరిహారం చెల్లించాలంటూ చండీగఢ్ కన్జూమర్ ఫోరమ్ తీర్పు చెప్పింది. తక్కువ దూరాలకు సంబంధించిన రైడ్లకు ఉబర్ అధికమొత్తంలో ఛార్జీ వసూలు చేస్తుండడంతో అతడు కమిషన్‌ను ఆశ్రయించాడు. పూర్వాపరాలు విచారించిన కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. మీడియా కథనాల్లోని వివరాల ప్రకారం.. ఆగస్టు 6, 2021న చండీగఢ్‌కు చెందిన అశ్వనీ ప్రశార్ తను ఉన్న ప్రదేశం నుంచి వేరేచోటుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తాను వెళ్లాలనుకునే ప్రదేశం గూగుల్ మ్యాప్స్‌లో 8.83 కిలోమీటర్లుగా చూపించింది. దాంతో ఉబర్ బుక్ చేయాలనుకున్నారు. తాను ఎంచుకున్న రైడ్‌కు ముందస్తు ఛార్జీలు రూ.359గా చూపించింది. వెంటనే రైడ్ కన్ఫర్మ్ చేశారు. అయితే రైడ్ ముగిసి క్యాబ్ దిగేప్పుడు ముందస్తు ఛార్జీలతో పోలిస్తే అదనంగా రూ.1,334 రైడ్ ఛార్జీలు చూపించాయి. దాంతో చేసేదేమిలేక ఆ మొత్తాన్ని చెల్లించారు. తర్వాత అశ్వనీ ప్రశార్ కస్టమర్ చాట్, ఈమెయిల్ల ద్వారా కంపెనీకి సమస్యను వివరించారు. ఎంత ప్రయత్నించినా ఎలాంటి పరిష్కారం లభించలేదు. దాంతో పూర్తివివరాలతో కన్జూమర్ ఫోరమ్‌ను ఆశ్రయించారు. సమగ్ర విచారణ జరిపించిన కోర్టు తాజాగా ఉబర్ కంపెనీ రూ.10,000 పరిహారంతో పాటు చట్టపరమైన ఖర్చుల కోసం అదనంగా మరో రూ.10,000లను ప్రయాణికుడికి చెల్లించాలంటూ తీర్పు చెప్పింది. ఇదీ చదవండి: గతేడాదితో పోలిస్తే అధికంగా విమానయానం.. ఎందరో తెలుసా.. విచారణ సమయంలో ఉబర్ ఇండియా ఛార్జీల పెంపును సమర్థించింది. అందుకు అనేక రూట్ డివియేషన్స్ కారణమని పేర్కొంది. ఏది ఏమైనప్పటికీ ముందస్తు ఛార్జీలు, వాస్తవ ఛార్జీల మధ్య భారీ వ్యత్యాసం అన్యాయమని ఫోరమ్ తేల్చి చెప్పింది. -
మనుషుల్లేకుండా ఫుడ్ డెలివరీ.. వీడియో వైరల్
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో రోబోల వాడకం ఎక్కువవుతోంది. మనుషులు వెళ్లలేని ప్రదేశాలకు అవి వెళ్తున్నాయి.. చేయలేని పనులు చేస్తున్నాయి. భవిష్యత్తులో మానవులు నేరుగా చేసే పనుల స్థానాల్లో క్రమంగా రోబోల సంఖ్య పెరుగుతుంది. జపాన్ వంటి కొన్ని దేశాల్లో కార్మికుల కొరత అధికమవుతోంది. వారిస్థానాలను భర్తీ చేసేలా రోబోలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఉబర్ ఈట్స్ సంస్థ ఫుడ్ డెలివరీ చేయడానికి జపాన్‌లో రోబోలను వినియోగిస్తోంది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ ఉబర్ ఈట్స్ జపాన్‌లో ఫుడ్ డెలివరీ కోసం రోబోలను రంగంలోకి దించింది. డెలివరీ బాయ్స్‌కు బదులుగా రోబోల ద్వారా ఫుడ్ డెలివరీ చేసే సర్వీసులను ఇటీవల ప్రారంభించింది. దేశం ఎదుర్కొంటున్న కార్మికుల కొరత సమస్యను ఇది తీరుస్తుందని సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఈ రోబోల సేవలను టోక్యోలోని రెండు స్టోర్లకు మాత్రమే పరిమితం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో వీటిని మరిన్ని స్టోర్లకు విస్తరిస్తామని చెప్పారు. కెమెరాల ద్వారా ట్రాఫిక్‌ను తప్పించుకుంటూ గంటకు 6 కిలోమీటర్ల వేగంతో ఇవి ప్రయాణిస్తాయి. 27 లీటర్ల పానీయాలు, 27 కేజీల ఆహారాన్ని ఏకకాలంలో తీసుకుపోయే సామర్థ్యం వీటిటి ఉందని కంపెనీ వివరించింది. ఇదీ చదవండి: ప్రపంచం వాడుతున్న జర్మన్ ఆవిష్కరణలు ఉబర్ ఈట్స్ సంస్థ కార్ట్కెన్ అండ్ మిసుబుషి ఎలక్ట్రిక్ కంపెనీతో కలిసి టోక్యోలో ఈ రోబోలను వినియోగిస్తుంది. ఇవి ‘మోడల్ సీ’ రోబోలుగా ప్రసిద్ధి చెందాయి. స్టార్‌షిప్ టెక్నాలజీస్ అమెరికాలోని జార్జ్ మాసన్ యూనివర్సిటీలో మొదట రోబోల ద్వారా ఫుడ్ డెలివరీ చేసి రికార్డుల్లో నిలిచింది. డెలివరీ రోబోట్లను ఫుడ్ డెలివరీ, ప్యాకేజీ డెలివరీ, హాస్పిటల్ డెలివరీ, రూమ్ సర్వీస్ వంటి విభిన్న అవసరాలకు వాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 食品宅配サービスを手掛けるウーバーイーツジャパン(東京)は5日、自律走行ロボットによる配送を東京・日本橋エリアで6日に始めると発表しました。記事→https://t.co/jbVVrbcb22 #ウーバーイーツ #ロボット配送 #ubereats pic.twitter.com/oWbYjRGrn0 — 時事通信映像ニュース (@jiji_images) March 5, 2024 -
ఉబర్ సీఈఓను పొగడ్తలతో ముంచేసిన 'ఆనంద్ మహీంద్రా' - ట్వీట్ వైరల్
భారతదేశ పర్యటనలో ఉన్న ఉబెర్ సీఈఓ 'దారా ఖోస్రోషాహి'ని మహీంద్రా గ్రూప్ చైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' ఇటీవల కలిశారు. ఈ సందర్భంగా అతని నాయకత్వంలో రైడ్-హెయిలింగ్ యాప్ కంపెనీ ఎలా అభివృద్ధి చెందిందనే విషయాన్నీ వెల్లడిస్తూ ప్రశంసలు కురిపించారు. దారా ఖోస్రోషాహి ఉబర్ సీఈఓగా నియమితులైన తొలి రోజుల్లో ఎన్నో సందేహాలు కలిగాయని, ఆ తరువాత దావోస్‌లో కలిసినట్లు ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. ఆ సమయంలోనే కష్టాల్లో ఉన్న ఉబర్ గట్టెక్కుతుందా అనిపించిందని, కాబట్టి ఆయన ఎక్కువ రోజులు సీఈఓగా ఉండలేరని ఆనంద్ మహీంద్రా ఊహించనట్లు కూడా ఈ సందర్భంగా పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న ఉబర్ ఈ రోజు లాభాల బాట పట్టిందంట ఖచ్చితంగా దారా ఖోస్రోషాహి కృషి అని ఆనంద్ మహీంద్రా అన్నారు. నిజమైన నాయకుల గొప్ప లక్షణమే సంస్థ అభివృద్ధికి కారణమవుతుందని వెల్లడించారు. నేడు ఉబర్ 170 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటల్‌తో లాభాలను ఆర్జిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఇది లక్నో విమానాశ్రయమేనా? ఆశ్చర్యపోతున్న ఆనంద్ మహీంద్రా.. I first met @dkhos in Davos shortly after he had taken the helm at @Uber I must confess that I wondered how long he would stay at the company & indeed, how long Uber would survive. Today, the company is solidly profitable, its corporate culture is disciplined and no-frills, &… pic.twitter.com/hHwFPCq7P9 — anand mahindra (@anandmahindra) February 24, 2024 -
ఉబర్ సీఈఓతో గౌతమ్ అదానీ.. అసలేం జరుగుతోంది!
ప్రముఖ పారిశ్రామిక వేత్త 'గౌతమ్ అదానీ' శనివారం ఉబర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'దారా ఖోస్రోవ్షాహి'తో సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను అదానీ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. భారతదేశంలో గ్రీన్, పునరుత్పాదక ఇంధన రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో.. ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను కూడా వేగవంతం చేయడానికి చేయడానికి, ఉబెర్‌తో భవిష్యత్ సహకారాల కోసం ఈ సమావేశం జరిగింది. ఫొటోలను షేర్ చేస్తూ.. భారతదేశంలో ఉబర్ విస్తరణకు సంబంధిచి దారా ఖోస్రోవ్షాహి విజన్ ప్రశంసించదగ్గదని కొనియాడారు. ప్రత్యేకించి భారతీయ డ్రైవర్ల గౌరవాన్ని పెంచడంలో అతనికున్న నిబద్ధత స్ఫూర్తిదాయకమని ఎక్స్(ట్విటర్)లో ట్వీట్ చేశారు. అదానీ గ్రూప్ రాబోయే 10 సంవత్సరాలలో భారతదేశం యొక్క గ్రీన్ ఎనర్జీ పరివర్తనలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి కట్టుబడి ఉంది. దేశంలో పునరుత్పాదక ఇంధనంలో ప్రపంచ అగ్రగామిగా నిలువడానికి సంస్థ కృషి చేస్తోంది. ఇదీ చదవండి: జూన్ 4 నుంచి 'గూగుల్ పే' బంద్!.. మరో యాప్‌లోనే అన్నీ.. ఇక ఉబర్ విషయానికి వస్తే.. ఈ సంస్థ భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తమ ఫ్లీట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే వినియోగించడానికి సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం ఉబర్ గ్రీన్ అని పిలువబడే ఈవీ సర్వీస్ ఢిల్లీలో అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో దేశంలోని మరిన్ని నగరాలను ఈ సర్వీస్ విస్తరించనున్నట్లు సమాచారం. Absolutely captivating chat with @dkhos, CEO of @Uber. His vision for Uber's expansion in India is truly inspiring, especially his commitment to uplifting Indian drivers and their dignity. Excited for future collaborations with Dara and his team! #UberIndia pic.twitter.com/xkHkoNyu5s — Gautam Adani (@gautam_adani) February 24, 2024 -
డెలివరీ బాయ్‌గా దిగ్గజ కంపెనీ సీఈఓ!
కరోనా... రెండు సంవత్సరాల పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. ఎన్నో కోట్ల కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. ముఖ్యంగా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో ప్రజలు అనుభవించిన నరకం మాటల్లో చెప్పలేం. అయినవారి ప్రాణాలు కాపాడుకునేందుకు ఎన్నో కుటుంబాలు రూ.కోట్లు కుమ్మరించడం, చికిత్స కోసం ఆస్తులు అమ్ముకున్న ఘటనలు కోకొల్లలు. అప్పటి పరిస్థితులను గుర్తుచేసుకుంటే ఇప్పటికీ చాలామంది భయంతో వణికిపోతుంటారు. కరోనా సోకిన వారి కుటుంబాలు ఎంతటి మానసిక క్షోభ అనుభవించాయో తలుచుకుంటేనే గుండె బరువెక్కిపోతోంది. అలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఉబర్ సీఈఓ దారా ఖోస్రోషాహి డెలివరీ బాయ్‌గా పనిచేసినట్లు చెప్పారు. భారత పర్యటనలో ఉన్న ఆయన ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నందన్ నిలేకనితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఖస్రోషాహి ఆ చీకటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉండి పిచ్చెక్కిపోయేది. అందుకే నేను ఇంటి నుండి బయటకు వెళ్లాలని అనుకున్నాను. వెంటనే ఈబైక్ సాయంతో ఉబర్ ఈట్స్ లో డెలివరీగా బాయ్‌గా చేరాను. ఫుడ్ డెలివరీ చేయడం, కస్టమర్లను రేటింగ్స్ అడిగినట్లు చెప్పారు. మాస్క్ పెట్టుకుని విధులు నిర్వహించడంతో తాను డెలివరీ డెలివరీ బాయ్‌గా పనిచేయడం మరింత సులభమైందని అన్నారు. View this post on Instagram A post shared by CNBC-TV18 (@cnbctv18india) కోవిడ్ ముగిసిన తర్వాత టెస్లా కారు ఉబెర్ డ్రైవర్ గా పనిచేశారంటూ నందన్ నిలేకనితో తన అనుభవాల్ని పంచుకున్నారు. కాగా, ఉబర సీఈఓ భారత్ లో తమ సర్వీస్‌లను విస్తరించేందుకు ప్రభుత్వ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఓఎన్డీసీలో ఉబర్ చేరింది. -
‘ఇండియాలో ఆసక్తి కలిగించిన అంశం అదే..’ ఉబర్ సీఈఓ కీలక వ్యాఖ్యలు
చిన్న, మధ్య స్థాయి సంస్థలకూ ఇ-కామర్స్ విపణిలో సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) ఇటీవలే తెలిపింది. ప్రస్తుతం నిత్యావసరాలు, ఆహార పదార్థాలు, ఫ్యాషన్ సంస్థలు ఎక్కువగా ఓఎన్డీసీ వేదికను వినియోగించుకుంటుండగా, కొత్తగా రవాణా రంగ సంస్థలూ ఈ వేదికపైకి వస్తున్నాయి. తాజాగా తమ సర్వీస్‌లను విస్తరించేందుకు ప్రభుత్వ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఓఎన్డీసీలో ఉబర్ చేరింది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా భారతదేశంలో ఇంటర్సిటీ బస్సు, మెట్రో రైలు టిక్కెట్ బుకింగ్‌ల వంటి ఆఫర్లను ఉబెర్ కల్పించనుంది. ఈ కంపెనీ గ్లోబల్ సీఈఓ డారా ఖోష్క్రోవ్సహి ‘పెద్ద మొత్తంలో టెక్నాలజీని నిర్మించడం’ అనే అంశంపై ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నిలేకనితో గురువారం చర్చించారు. ఇండియా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి కంపెనీలు, ప్రభుత్వాలు చాలా నేర్చుకోవాలని తెలిపారు. టెక్నాలజీ కంపెనీగా ఓపెన్ సోర్స్ సాంకేతికతలను అందిపుచ్చుకునేందుకు ఉబర్ ఎప్పుడూ ముందుంటుందని డారా చెప్పారు. ఉబర్‌కు ఇండియాలో ఆసక్తి కలిగించిన అంశం ఏమిటని నందన్ నిలేకని అడగగా, ఇండియా అత్యంత క్లిష్టమైన మార్కెట్ అని డారా అన్నారు. ఇండియన్ కస్టమర్లు ఎక్కువగా దేనికీ డబ్బు చెల్లించడానికి ఇష్టపడరని, ఇక్కడ సక్సెస్ అయ్యామంటే ఎక్కడైనా విజయం సాధిస్తామని ఆయన పేర్కొన్నారు. లో–కాస్ట్ సర్వీస్‌లను విస్తరిస్తామని డారా చెప్పారు. ఏమిటీ ఓఎన్డీసీ? దేశీయ ఇ-కామర్స్ విపణిలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌దే హవా. కొవిడ్ పరిణామాలతో నిత్యావసరాల కోసం కూడా ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వడం పెరిగింది. దీంతో కిరాణ షాపుల భవితవ్యం అనిశ్చితిలో పడుతోందని గుర్తించిన కేంద్రం.. చిన్న దుకాణదారులు కూడా ఆన్లైన్లో విక్రయాలు నిర్వహించడానికి వీలుగా ఓ వేదిక ఉండాలని సంకల్పించింది. ప్రధాని మోదీ సూచన మేరకు నందన్ నిలేకని, నేషనల్ హెల్త్ అథారిటీ సీఈఓ ఆర్ఎస్ శర్మతో సహా 9 మంది సభ్యుల సలహా సంఘం ఓఎన్డీసీ పేరిట లాభాపేక్షలేని ఈ ఫ్లాట్‌ఫాంను రూపొందించారు. ఇదీ చదవండి: మొబైల్ రంగాన్ని శాసించనున్న ఏఐ.. ప్రభుత్వ ఆధ్వర్యంలో లాభాపేక్ష రహితంగా పనిచేసే ఈ ప్లాట్‌ఫాంను ట్రేడర్లు, వినియోగదార్లు వినియోగించుకోవచ్చు. సబ్బు నుంచి విమాన టికెట్ల వరకు ఏదైనా విక్రయించుకోవచ్చు, కొనుగోలు చేయవచ్చు. -
టెస్టింగ్ దశలో కొత్త ఫీచర్.. నచ్చిన ధరకే ఉబర్ రైడ్!
చాలామంది తమ నిత్యజీవితంలో ఎక్కడ ఏం కొనాలన్నా కొంత బేరమాడుతూ ఉంటారు, ఇక ఆటోలో ప్రయాణించాలంటే మాత్రం డ్రైవర్‌తో కొంత బేరమాడకుండా ఉండలేరు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ క్యాబ్ సర్వీస్ కంపెనీ 'ఉబర్' ఓ కొత్త ఫీచర్ తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు క్యాబ్ బుక్ చేసుకోవాలంటే సంస్థ యాప్‌లో ఎంత రేటు చూపిస్తే అంత చెల్లించాల్సి వచ్చేది, దీంతో బేరమాడే అవకాశం లేకుండా పోయింది. ఉబర్ పరిచయం చేయనున్న కొత్త ఫీచర్ 'ఉబర్ ఫ్లెక్స్’లో మనకు నచ్చిన రేటుకే క్యాబ్ ఎంచుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలోనే ఉంది. త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఉబర్ పరిచయం చేయనున్న కొత్త ఫీచర్ ఒక రేటును కాకుండా.. యూజర్ ప్రయాణించే దూరం, సమయం వంటి వాటిని ఆధారంగా తీసుకుని తొమ్మిది ధరలను చూపిస్తుంది. ఇందులో వింభియోగదారుడు తనకు నచ్చిన రేటుని ఎంచుకోవచ్చు, అయితే ఆ రేటు డ్రైవర్‌కి నచ్చితే యాక్సెప్ట్ చేయొచ్చు, లేదా రిజెక్ట్ చేయొచ్చు. ఇదీ చదవండి: చైనాను దాటేసిన భారత్.. త్వరలో అమెరికా! - ఆనంద్ మహీంద్రా ట్వీట్ ఒకే రేటు దగ్గర నిలిచిపోకుండా.. కస్టమర్ తనకు నచ్చిన రేటును ఎంచుకునే అవకాశాన్ని ఉబర్ కల్పిస్తోంది. ఇది వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది, అదే సమయంలో తక్కువ ధరకే ప్రయాణం చేసే వెసులుబాటుని పొందవచ్చు. ఈ ఫీచర్‌ను ఉబర్ కంపెనీ భారతదేశంలో ఔరంగాబాద్, ఆజ్మీర్, బరేలీ, చండీగఢ్, కోయంబత్తూర్, దేహ్రాదూన్, గ్వాలియర్, ఇందౌర్, జోధ్‌పుర్, సూరత్ ప్రాంతాల్లో టెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. భారత్ మాత్రమే కాకుండా లాటిన్ అమెరికా, కెన్యా దేశాల్లో కూడా సంస్థ ఈ ఫీచర్‌ను అమలుచేసే అవకాశం ఉంది. -
నైట్‌లో ముంబయి మొదటిస్థానం.. వీకెండ్లో..
ట్యాక్సీ సర్వీసులను అందించే ఉబర్ సంస్థ 2023లో చేసిన పర్యటనలకు సంబంధించి ఆసక్తికర విషయాలను విడుదల చేసింది. ఈ ఏడాది దిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) బెంగళూరు, హైదరాబాద్, ముంబై, కోల్‌కతా, పుణెల్లో ఎక్కువ మంది రైడ్ బుక్ చేసినట్లు సంస్థ వెల్లడించింది. రాత్రి సమయంలో వచ్చిన బుకింగ్‌ల విషయానికొస్తే.. ముంబయి మొదటిస్థానంలో నిలిచింది. వీకెండ్లో మాత్రం కోల్‌కతాలోని ప్రజలు ఎక్కువగా బుక్ చేసుకున్నారు. 2023 సంవత్సరానికిగాను ఉబర్ రైడ్స్ రికార్డు స్థాయిలో 6800 కోట్ల కిలోమీటర్లలో సేవలందించిందని తెలిపింది. ఇది దేశంలోని మొత్తం రోడ్ నెట్‌వర్క్‌లో వెయ్యి రెట్లు అని కంపెనీ పేర్కొంది. ఇదీ చదవండి: టెస్లా యూనిట్‌కు సర్వం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం..? ఉబెర్ వెల్లడించిన ఆసక్తికరమైన విషయాలు రైడ్స్‌లో ఎక్కువ భాగం సాయంత్రం 6-7 గంటల మధ్య షెడ్యూల్ చేస్తున్నవే. శనివారం ఉబెర్ ఫేవరెట్ డే. ఆ రోజే అధికంగా బుకింగ్స్ వస్తున్నాయి. రైడ్ బుక్ చేసిన ట్రిప్‌ల సంఖ్య పరంగా దసరా, క్రిస్మస్ అత్యంత ప్రజాదరణ పొందిన రోజులు. ఒక్క డిసెంబర్లోనే అత్యధిక సంఖ్యలో రైడ్లు బుక్ అయినట్లు సంస్థ తెలిపింది. విమానాశ్రయాలకు అధిక సంఖ్యలో ఉబర్ ట్రిప్‌లు ఉదయం 4-5 గంటల మధ్య బుక్ అయ్యాయి. -
సాదాసీదా క్యాబ్ డ్రైవరే కావొచ్చు.. ఓలా, ఉబెర్‌లకు గట్టిపోటీ ఇస్తున్నాడు!
ఓ సాదాసీదా క్యాబ్ డ్రైవర్ దేశీయ దిగ్గజ రైడ్ షేరింగ్ సంస్థలు ఓలా, ఉబెర్ గుత్తాదిపత్యానికి చెక్ పెడుతున్నాడు. చాపకింద నీరులా రైడ్ షేరింగ్ మార్కెట్‌ని శాసించే దిశగా వడిఒడిగా అడుగులు వేస్తున్నాడు. ఇంతకీ ఆ క్యాబ్ డ్రైవర్ ఎవరు? ఓలా, ఉబెర్ మార్కెట్‌ను తనవైపుకి ఎలా తిప్పుకుంటున్నాడు? చేతిలో వెహికల్ లేదు. అత్యవసరంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలి. ఆ సమయంలో మనం ఏం చేస్తాం. ఫోన్ తీసి వెంటే ఓలా, ఉబెర్‌తో పాటు ఇతర రైడ్ షేరింగ్ యాప్స్ ఓపెన్ చేసి అవసరానికి తగ్గట్లు బైక్, ఆటో, కారు ఇలా ఏదో ఒకటి బుక్ చేసుకుంటాం. సెకన్లు, నిమిషాల వ్యవధిలో సదరు క్యాబ్ డ్రైవర్ వచ్చి మనల్ని కోరుకున్న గమ్యానికి సురక్షితంగా వెళుతుంటారు. అలాంటి ఓ క్యాబ్ డ్రైవర్ సొంతంగా రైడ్ షేరింగ్ సంస్థను స్థాపించాడు. మార్కెట్లో కింగ్ మేకర్‌గా ఓలా, ఉబెర్‌లకు గట్టి పోటీ ఇస్తున్నాడు. Peak Bengaluru: Mr Lokesh my uber cab driver informed me that he has launched his own app to compete with uber and ola and already has more than 600 drivers on his app. Moreover, today they launched their IOS version for apple too. #Bengaluru #peakbengaluru@peakbengaluru pic.twitter.com/IGdiWItPG4 — The Bengaluru Man (@BetterBengaluro) December 20, 2023 600 మందికి పైగా డ్రైవర్లతో బెంగళూరు కేంద్రంగా ఒకప్పటి ఓలా, ఉబెర్‌లలో క్యాబ్ డ్రైవర్‌గా పని చేసిన లోకేష్ ‘నానో ట్రావెల్స్’ పేరుతో సొంతంగా స్టార్టప్‌ను ప్రారంభిచాడు. ఇప్పటికే ఆ సంస్థతో సుమారు 600పైగా డ్రైవర్లు భాగస్వామ్యమైనట్లు తెలుస్తోంది. డ్రైవర్ని కాదు.. ఓ కంపెనీకి బాస్‌ని ఈ తరుణంలో లోకేష్ నడుపుతున్న క్యాబ్‌ను బెంగళూరుకు చెందిన ఓ కస్టమర్ ప్రయాణించాడు. ప్రయాణించే సమయంలో కస్టమర్, నానో ట్రావెల్స్ ఓనర్ లోకేష్‌లు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అప్పుడే తాను క్యాబ్ డ్రైవర్ని కాదని, ఓలా,ఉబెర్ల తరహాలో నానో ట్రావెల్స్ పేరుతో ఓ స్టార్టప్‌ను ప్రారంభించినట్లు చెప్పాడు. అంతేకాదు నేటినుంచి యాపిల్ ఐఓఎస్ యూజర్లకు తమ సంస్థ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని, ఆ యాప్స్‌ను సొంతంగా డెవలప్ చేసింది తానేనని చెప్పడంతో ఆశ్చర్యపోవడం సదరు కష్టమర్ వంతైంది. అవసరం అయితే ఫోన్ చేయండి ఎయిర్‌పోర్ట్‌తో పాటు ఇతర అత్యవసర సమయాల్లో క్యాబ్ కావాల్సి ఉంటే ఫోన్ చేయమని కోరుతూ ఇరువురి ఒకరికొకరు ఇచ్చుపుచ్చుకున్నారు. లోకేష్ జరిపిన సంభాషణను కస్టమర్ ఎక్స్. కామ్‌లో ట్వీట్ చేయడం నెట్టింట్లో వైరల్‌గా మారింది. డ్రైవర్ నుంచి ఆంత్రప్రెన్యూర్‌గా ఆ ట్వీట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఒక డ్రైవర్ నుంచి ఆంత్రప్రెన్యూర్‌గా ఎదుగుతున్నందుకు శుభాకాంక్షలు చెబుతుంటే రైడ్ షేరింగ్ మార్కెట్లో గట్టి పోటీ నెలకొంది. నిలబడడం కష్టమేనని అంటున్నారు. కొత్త సంస్థలు పుట్టుకు రావడం మంచిదే మరికొందరు ఉబెర్, ఓలా వంటి దిగ్గజ సంస్థ కొన్ని సార్లు ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సమర్ధవంతమైన ప్రయాణాల్ని అందించలేవు. రైడ్ ధరలు ఎక్కువగా ఉండడంతో పాటు ఆ క్యాబ్ కోసం ఎదురు చూసే సమయం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయాల్లో నానో ట్రావెల్స్ ఉపయోగం ఎక్కువగా ఉంటుందంటూ రిప్లయి ఇస్తున్నారు. చదవండి👉 రెండక్షరాల పేరు కోసం 254 కోట్లు చెల్లించిన ముఖేష్ అంబానీ! -
ఐటీ జాబ్ పోయి ఉబెర్ డ్రైవర్‌గా మారిన ఇండియన్ - వీడియో వైరల్
కరోనా మహమ్మారి ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలను ముప్పుతిప్పలు పెట్టి ఆర్థికమాంద్యంలోకి నెట్టివేసింది. ఈ ప్రభావం చాలామంది జీవితాల మీద పడింది. ఇప్పటికి కూడా కొన్నిదేశాల్లోని దిగ్గజ కంపెనీలు సైతం ఆర్థిక మాంద్యం తట్టుకోలేక తమ ఉద్యోగులను తీసేస్తున్నాయి. ఒకవైపు చదువు కోసం విదేశాలకు వెళ్లిన చాలా మంది భారతీయులు సమస్యలను ఎదుర్కొంటుంటే.. మరికొందరు ఉద్యోగాలు కోల్పోయి అగచాట్లు పడుతున్నారు. కెనడాలో ఉంటున్న ఒక భారతీయుడు ఉద్యోగం కోల్పోయి ఉబెర్ డ్రైవర్‌గా పనిచేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఉద్యోగం కోల్పోయిన తర్వాత, యూట్యూబ్ ఛానెల్ కలిగి ఉన్న టెకీ తన టెస్లాను డ్రైవ్ చేస్తూ నిత్యావసర వస్తువులను డెలివరీ చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనీష్ మావెలిక్కర తన యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేసిన వీడియోలో.. తాను ఐటీ ఉద్యోగం కోల్పోయినట్లు, కొత్త ఉద్యోగం కోసం వెతుక్కున్నట్లు.. ఇందులో భాగంగానే కొన్ని ఇంటర్వ్యూలకు హాజరైనట్లు, దానికి సంబంధించిన రిజల్ట్ ఇంకా రాలేదని వెల్లడించాడు. ఇదీ చదవండి: రెజ్యూమ్ ఇలా క్రియేట్ చేస్తే.. జాబ్ రావాల్సిందే! ఉద్యోగం వచ్చే వరకు పార్ట్ టైమ్ ఉద్యోగంగా కిరాణా సామాగ్రిని ఇంటింటికి డెలివరీ చేస్తున్నట్లు కూడా వీడియోలో తెలిపాడు. ప్రతి రోజూ తన పని తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రారంభమవుతుందని, తన టెస్లా కారుని ఉబెర్‌తో నడుపుతున్నట్లు స్పష్టం చేసాడు. ఒకవేళా ఉద్యోగం లభించకపోతే తన టెస్లా కారుని రోజంతా డ్రైవ్ చేయాల్సి ఉంటుందని తెలియజేస్తూ.. విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల జీవితం ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ వీడియో ఓ చిన్న ఉదాహరణగా వివరించాడు. -
క్యాబ్‌లలో ఈ స్ట్రాటజీ గురించి తెలుసా? ఇలా చేస్తే డబ్బులు బాగా సంపాదించవచ్చు!
అదనపు ఆదాయం కోసం మన దేశంలో ఆయా రైడ్ హైరింగ్ సంస్థల్లో పార్ట్‌టైం, లేదంటే ఫుల్ టైం డ్రైవర్‌గా విధులు నిర్వహించే ఉద్యోగులు ఎంత సంపాదిస్తుంటారు? ఇలా ఎప్పుడైనా తెలుసుకోవాలని అనిపించిందా? రైడ్ షేరింగ్ సర్వీసులు అందించే ఉబర్ సంస్థ 2013 ఆగస్ట్ నెలలో భారత్‌లో తన కార్యకలాపాల్ని ప్రారంభించింది. 2023 ఆగస్ట్ నెలలో 10 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం.. గడిచిన పదేళ్లలో ఉబర్ కంపెనీలో ఫుల్‌టైం, పార్ట్‌టైం విధులు నిర్వహిస్తున్న డ్రైవర్లు 2013 ఆగస్ట్ నుంచి 2023 ఆగస్ట్ వరకు మొత్తం 3,300 కోట్ల కిలోమీటర్ల మేర ప్రయాణించి కస్టమర్లను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చారు. ఫలితంగా ఈ పదేళ్ల కాలంలో దేశీయంగా ఉన్న ఉబర్ డ్రైవర్ల మొత్తం సంపాదన సుమారు రూ.50 వేలకోట్లు సంపాదించారు. ఆ మొత్తంలో కస్టమర్ల ఉబర్ డ్రైవర్లకు టిప్కింద ఇచ్చిన మొత్తం రూ.300 కోట్లు సంపాదించినట్లు ఉబర్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. పైన పేర్కొన్న డేటా అంతా ఉబర్ అధికారికంగా విడుదల చేస్తే.. రైడ్ హైరింగ్ సంస్థల్లో డ్రైవర్లుగా పనిచేస్తున్న వారు కాస్త తెలివి తేటలు ఉపయోగించి ఏడాదిలో భారీ మొత్తంలో సంపాదించవచ్చని అంటున్నాడు అమెరికాకు చెందిన ఓ ఉబర్ క్యాబ్ డ్రైవర్. ఆ స్ట్రాటజీతో అమెరికాలో అంత సంపాదిస్తే.. దేశీయ ఉబర్ డ్రైవర్లు ఆదాయం పెంచుకునే అవకాశం ఉందా? క్యాబ్ డ్రైవర్ సంపాదన రూ.23లక్షలు అమెరికాలోని నార్త్ కరోలినా ప్రాంతానికి చెందిన 70 ఏళ్ల ‘బిల్’ అనే ఉబర్ డ్రైవర్ 2022లో ఏడాది మొత్తం సంపాదించింది అక్షరాల రూ.23లక్షలు ఇది వినడానికి నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ ఇది అక్షరాల నిజం. ఎందుకంటే! ఆరేళ్ల క్రితం రిటైరైన బిల్కి ప్రయాణాలు చేయడం అంటే మహా ఇష్టం. డబ్బుకు డబ్బుకు.. ప్రయాణం చేస్తున్నామన్న సంతృప్తితో ఉబర్‌లో పార్ట్‌టైం డ్రైవర్‌గా చేరాడు. వారానికి 40 గంటల పని చేస్తూ కొన్ని సింపుల్ టెక్నిక్స్‌ని ఉపయోగించి తన ఆదాయాన్ని మరింత పెంచుకోవడం మొదలు పెట్టాడు. అదెలానో వివరించాడు. స్ట్రాటజీ ఇందుకోసం ఉబర్ డ్రైవర్ బిల్ ఈ కొత్త స్ట్రాటజీని అప్లయి చేశాడు. ముందుగా రద్దీగా ఉండే ప్రాంతాలైన ఎయిర్‌పోర్ట్‌లు, శనివారం, ఆదివారం రెస్టారెంట్లు, బార్లను సెలక్ట్ చేసుకున్నాడు. ఈ ఏరియాల్లో రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 2.30 వరకు కిటకిటలాడుతుంటాయి. పీక్ అవర్స్ కాబట్టి కస్టమర్లు అధిక మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని అదునుగా చేసుకుని లాంగ్ రైడ్లు కాకుండా, స్థానిక ఏరియాల్లో మాత్రమే ప్రయాణికుల్ని ఎక్కించుకుంటాడు. కస్టమర్లు ఎన్ని కిలోమీటర్లు వెళతారో తెలుసుకుని తనకు ఏమాత్రం లాభం లేదనిపిస్తే ఆ రైడ్లను క్యాన్సిల్ చేస్తాడు. కస్టమర్ల డిమాండే ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ ల్యాండ్ అయినప్పుడు ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి రైడ్ ధరల్ని స్వయంగా తానే నిర్ణయించినట్లు ఓ మీడియా సంస్థకు తెలిపాడు. ఎయిర్ పోర్ట్ ప్రాంతాల్లో సాధారణంగా 20 నిమిషాల రైడ్‌కి ఉబర్ 10 నుంచి 30 డాలర్లు వరకు ఉంటుంది. కానీ బిల్ మాత్రం కస్టమర్ల రైడ్లను క్యాన్సిల్ చేసి 50 నుంచి 60 డాలర్లు ఛార్జీలు విధించాడు. రైడ్ రిక్వెస్ట్‌లో 10 శాతం కంటే తక్కువ రైడ్స్ మాత్రమే యాక్సెప్ట్ చేసి..వాటిలో 30 శాతానికి పైగా రద్దు చేసి తద్వారా ఆర్థికంగా ఎక్కువ మొత్తంలో చెల్లించే రైడ్లను పొందాడు. ఇలా గత ఏడాది సుమారు 1,500 ఉబర్ ట్రిప్‌ల నుంచి సుమారు 28,000 డాలర్ల (దాదాపు రూ.23 లక్షలు) మనీ సంపాదించినట్లు చెప్పాడు. ఇబ్బందులు తప్పవ్ రైడ్ క్యాన్సిల్ చేస్తే సదరు డ్రైవర్లు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని బిల్ చెప్పాడు. ఉబర్ రైడ్‌ను క్యాన్సిల్ చేస్తే అకౌంట్‌ను కోల్పోవడంతో పాటు 10 శాతం కంటే ఎక్కువ రైడ్లను క్యాన్సిల్ చేసిన డ్రైవర్లకు నిర్ధిష్ట పెట్రోల్ బంకుల్లో లభించే డిస్కౌంట్లు, ఇతర ప్రోత్సాహకాలు కోల్పోతారని అన్నాడు. అయినప్పటికీ, బిల్ ప్రస్తుతానికి తన బిల్ స్ట్రాటజీకి కట్టుబడి ఉన్నానని, అది లాభదాయకంగా ఉందని అంటూనే.. డ్రైవర్‌గా పనిచేస్తున్న నాకు ఇప్పుడు డబ్బు అవసరం లేదు. ఎందుకంటే నాకు డ్రైవింగ్ చేయడం అంటే ఇష్టమని మనసుల మాటని బయట పెట్టాడు. చదవండి👉🏻 అమ్మ, నాన్న కోసమే.. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఎమోషనల్ -
300 కోట్ల ట్రిప్పులు.. సంపాదన ఎన్ని కోట్లో తెలిస్తే అవాక్కవుతారు!
భారతదేశంలో ఉబర్ సర్వీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కస్టమర్లు ఎప్పుడు ఎక్కడికి వెళ్లాలన్న కారుని బుక్ చేసుకుని గమ్యస్థానాలు చేరుకుంటున్నారు. ఇంతలా పాపులర్ అయిన ఉబర్ ఇప్పటికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉబర్ ప్రారంభమైనప్పటి నుంచి డ్రైవర్లు ఇప్పటి వరకు ఏకంగా 300 కోట్ల ట్రిప్పులు తిరిగి రూ. 50,000 కోట్లకు పైగా సంపాదించినట్లు నివేదికలు చెబుతున్నాయి. మనషి నిత్యజీవితంలో ఒక భాగమైపోయిన రవాణాలో ఉబర్ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుండటం చాలా గర్వంగా ఉందని ఉబెర్ ఇండియా ప్రెసిడెంట్ 'ప్రభ్‌జీత్ సింగ్' తెలిపారు. ఇదీ చదవండి: నితిన్ గడ్కరీ ఆవిష్కరించిన ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారు.. ఇది చాలా స్పెషల్! భూమి నుంచి చంద్రునికి 86,000 సార్లు.. ఇప్పటి వరకు ఉబర్ ప్రయాణించిన దూరం 'భూమి నుంచి చంద్రునికి' దాదాపు 86,000 సార్లు ప్రయాణించడంతో సమానమని కంపెనీ చెబుతోంది. సుమారు 30 లక్షల మంది డ్రైవర్లు ఉబర్ ద్వారా డ్రైవర్ భాగస్వాములుగా ఉన్నారు. కంపెనీ భారతదేశం అంతటా 125 నగరాల్లో తమ కార్య కలాపాలను నిర్వహిస్తోంది. ఆధునిక కాలంలో ఎక్కువ మంది ఇప్పుడు తమ గమ్యస్థానాలను ఉబర్ సర్వీస్ ద్వారా సురక్షితంగా చేరుకుంటున్నారు. చాలామంది ఉబర్ వినియోగించుకోవడానికి ప్రధాన కారణం కారు మెయింటెనెన్స్ & డ్రైవర్ జీతం నుంచి తప్పించుకోవడమే అని తెలుస్తోంది. ఈ సర్వీసుల వల్ల మరికొందరు సొంత వాహనాలు కొనుగోలు కూడా వాయిదా వేసుకుంటున్నారు. -
ఉబెర్ 'గ్రూప్ రైడ్స్' ఫీచర్: ఎగిరి గంతేస్తున్న రైడర్లు
Uber Group Rides feature క్యాబ్‌సేవల సంస్థ ఉబెర్ తనయూజర్ల కోసంకొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. 'గ్రూప్ రైడ్స్' అనే కొత్త ఫీచర్‌ను (ఆగస్టు 22న) ఇండియాలో ప్రారంభించింది. దీని ప్రకారం ఒకే చోటుకు వెళ్లాల్సిన వేరు వేరు స్థానాల్లో ఉన్న యూజర్లకు ప్రయోజనం లభించనుంది. దీని ద్వారా గరిష్టంగా మరో ముగ్గురు వ్యక్తులతో ట్రిప్ షేరింగ్ ఆప్షన్ కల్పిస్తోంది. అంతేకాదు ఈ ఫీచర్ రోడ్లపై ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కూడా తోడ్పడనుందని ఉబెర్ వెల్లడించింది. గ్రూప్ రైడ్స్ ఫీచర్ ఈ 'గ్రూప్ రైడ్స్' ఫీచర్‌ను ఉపయోగించే రైడర్లు తమ ఛార్జీలపై 30 శాతం వరకు ఆదా చేసుకునే అవకాశం ఉందని యాప్ ఆధారిత క్యాబ్ సర్వీస్ కంపెనీ తెలిపింది. (ఖచ్చితమైన తగ్గింపు వారు ఎంత మంది వ్యక్తులతో ఛార్జీలను పంచుకుంటారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది.) తమ ట్రిప్ వివరాలను మెసేజింగ్ యాప్‌ల ద్వారా పోస్ట్ చేయడం ద్వారా రైడ్ కోసం స్నేహితులను కూడా ఆహ్వానించవచ్చు. వీరు ట్రిప్‌లో చేరిన తర్వాత వారి స్వంత పికప్ స్థానాలను యాడ్ చేయవచ్చు. ఆ స్థానాలు రైడ్ రూట్లో అప్డేట్ చేసుకోవచ్చని ఉబెర్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడంతో పాటు, మరింత డబ్బు ఆదాతో పాటు, ఇబ్బంది లేని ప్రయాణాన్నిఅందించేలా ఈ ఫీచర్ కస్టమర్లకు అవకాశాన్ని కల్పిస్తుందని ఉబెర్ ఇండియా సెంట్రల్ ఆపరేషన్స్ డైరెక్టర్ నితీష్ భూషణ్ తెలిపారు. తద్వారా రోడ్డుపై వాహనాలను తగ్గించే అవకాశం రైడర్లకు కలుగుతుందన్నారు. ఈ ఫీచర్ ఎలా వాడాలి? ఉబర్ యాప్‌ను అప్డేట్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసి 'Services' ట్యాబ్‌ను ఎంచుకొని అందులో 'Group Rides' పై క్లిక్ చేయాలి. ఇక్కడ పికప్ లొకేషన్ ఎంటర్ చేయాలి. ఆ తరువాత నిర్దేశిత రైడర్లను (స్నేహితులను) ఎంచుకొని రైడ్‌లో జాయిన్ అవ్వమని వాట్సాప్ లింక్ సెండ్ చేస్తే చాలు. యాడ్ అయిన లొకేషన్ వివరాలు రైడ్‌లో యాడ్ అవ్వడంతోపాటు, ఈ సమాచారం డ్రైవర్‌కు కూడా అందుతుంది. -
ఏం ఐడియా గురూ! డ్రైవర్ క్రియేటివిటీకి ఫిదా అవుతున్న ప్యాసింజర్లు..
ఆధునిక కాలంలో ఓలా, ఉబర్ ఎక్కువగా వినియోగంలో ఉన్నాయన్న సంగతి అందరికి తెలిసిందే.. కావున ఎక్కడికి వెళ్లాలన్నా నిమిషంలో క్యాబ్ బుక్ చేసుకుంటున్నారు.. గమ్యాన్ని చేరుతున్నారు. అయితే ప్రయాణంలో బోర్ ఫీల్ కాకుండా ప్యాసింజర్లు మొబైల్ వినియోగించడం వంటివి చేస్తారు. కానీ ఇటీవల ఒక ఉబర్ డ్రైవర్ టెక్నాలజీ ఉపయోగించి ప్రయాణికులకు బోర్ ఫీల్ కాకుండా చేస్తున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎక్స్ (ట్విటర్) వేదికగా విడుదలైన వీడియోలో ఉబర్ డ్రైవర్ ప్రయాణికుల కోసం వెనుక ఉన్న వారికోసం ముందు సీటు వెనుక భాగంలో గేమ్ ఆడుకోవడానికి అనుకూలంగా ఒక స్క్రీన్ అమర్చాడు. దీంతో ఆ ట్యాక్సీ ఎక్కిన ప్యాసింజర్లకు విసుగు రాకుండా ఉంటుంది. ఈ ఐడియా చాలామందిని ఫిదా చేస్తోంది. ఇదీ చదవండి: ఆశ్చర్యపరుస్తున్న రూపాయి చరిత్ర - 1947 నుంచి 2023 వరకు.. జర్నీలో వీడియో గేమ్ ఆడుకుంటూ సమయం తెలియాకుండానే ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని ఇప్పటి వరకు 1.7 మిలియన్ల మంది వీక్షించారు, కొంతమంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్లు కూడా చేస్తున్నారు. మొత్తానికి ప్రయాణికులను ఎంటర్టైన్ చేయడానికి ఉబర్ డ్రైవర్ కొత్తగా ఆలోచించి అందరిని ఆకట్టుకుంటున్నాడు. -
‘ఉబర్ సీఈవో తిక్క కుదిరింది’
రైడ్ హెయిలింగ్ కంపెనీ ఉబర్ కస్టమర్లపై అదనపు ఛార్జీలు వసూలు చేస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. గతంలో క్యాబ్ బుక్ చేసుకున్న కస్టమర్ల ఫోన్లో ఛార్జింగ్ తక్కువ ఉంటే వారి నుంచి ఎక్కువ ఛార్జీ విధిస్తుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఈ అదనపు ఛార్జీల బాదుడు సెగ కస్టమర్లకే కాదు ఉబర్ సీఈవో ఖోస్రోషాహికి తగలింది. ఎలా అంటారా? మ్యాగజైన్ సంస్థ వైర్డ్ ఎడిటర్ స్టీవెన్ లెవీ ఉబర్ సీఈవోని ఇంటర్వ్యూ చేసేందుకు ఉబర్ క్యాబ్‌నే బుక్ చేసుకున్నారు. ఇంటర్వ్యూ కోసం న్యూయార్క్‌లోని డౌన్‌టౌన్ సిటీ నుంచి నాలుగున్న కిలోమీటర్ల దూరంలో వెస్ట్‌సైడ్ ఉబర్ ఆఫీస్‌కి వెళ్లారు. అక్కడే 2.95 మైళ్ల ఉబెర్ రైడ్ ఛార్జీ ఎంత అయ్యింటుందో చెప్పాలని స్టీవెన్ లెవీ.. ఖోస్రాషాహిని అడిగారు. అందుకు ఉబర్ సీఈవో ఇరవై డాలర్లు ఉంటుందని అంచనా వేశారు. కానీ అనూహ్యంగా డ్రైవర్ టిప్‌తో కలిపి ఉబర్ రైడ్‌కి 51.69 డాలర్లు ఛార్జీ పడిందని అన్నారు. వైర్డ్ ఎడిటర్ ఊహించని దానికంటే ఎక్కువ చెల్లించడంపై ఉబర్ సీఈవో సైతం షాక్ తిన్నారు. ‘ఓ మై గాడ్’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేవలం ఐదు నిమిషాల ముందు 20 డాలర్ల కంటే ఎక్కువగా ఉందని జర్నలిస్ట్ సీఈవోకి చెప్పారు. అంతేకాదు ఉబర్ రైడ్‌లో ఈ ధరల వ్యత్యాసం గురించి ప్రశ్నించారు. బదులుగా ఖోస్రోషాహి ద్రవ్యోల్బణం, రైడ్ సమయం పెరిగిపోతున్న కొద్ది ఛార్జీల విధింపు, కార్మికుల చెల్లించే వేతనాలే కారణమని తెలిపారు. ఇలా భారీగా ఉన్న ఉబర్ క్యాబ్ ధరలపై జర్నలిస్ట్ ఖోస్రోషాహిని ప్రశ్నించడం, సంభాషణల మధ్యలో ఉబర్ విధిస్తున్న ఛార్జీల్ని సీఈవో సమర్ధించడం.. అందుకు జర్నలిస్ట్ వ్యతిరేకించడం వంటి అంశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చాకు దారి తీశాయి. దీంతో పలువురు నెటిజన్లు ఉబర్ క్యాబ్ ధరలు ఎక్కువగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు ఉబర్ సీఈవో సమాధానం చెప్పలేకపోయారు. తిక్క కుదిరింది అంటూ సమర్ధిస్తున్నారు. కాగా, ఫోర్బ్స్ నివేదిక ప్రకారం..అమెరికాలో ఉబర్ ధరలు 2018 నుండి 2022 వరకు ద్రవ్యోల్బణం రేటు కంటే నాలుగు రెట్లు పెరిగాయని, దాదాపు నాలుగు సంవత్సరాలలో మొత్తం 83శాతం ధరలు పెరిగాయని వెల్లడించింది. -
మ్యారేజ్ డే ఏమోగానీ, 24 లక్షల ఉబెర్ బిల్లు చూసి గుడ్లు తేలేసిన జంట
గ్వాటెమాలాలో విహారయాత్రకు వెళ్లిన అమెరికాకు చెందిన ఓ జంటకు ఉబెర్ చుక్కలు చూపించింది తమరైడ్కు ఏకంగా 24 లక్షలు వసూలు చేయడం చూసి పాపం గుడ్లు తేలేసారు. ఎంతో ఆనందంగా తమ వివాహ ఐదో వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి వెళ్లిన జంటకు ఈ చేదు అనుభవం ఎదురైంది. వివరాలను పరిశీలిస్తే.. బిజినెస్ ఇన్సైడర్ కథనం ప్రకారం ఆస్ట్రేలియన్ జంట డగ్లస్ ఆర్డోనెజ్ డొమినిక్ ఆడమ్స్ గ్వాటెమాలాకు తమ వివాహ వార్షికోత్సవం సందర్బంగా సుందరమైన పర్యాటక ప్రాంతం గ్వాటెమాలా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీనికి నిర్దేశిత బిల్లు 55 డాలర్లు (దాదాపు రూ. 4,500) దీనికి దాదాపు 600 శాతం ఎక్కువగా 29,994 డాలర్ల (సుమారు రూ. 24 లక్షలు) వసూలు చేసింది. దీంతో ఏకంగా అకౌంట్మొత్తం ఖాళీ అయిపోయింది. (AI Anchor Lisa: అదరగొట్టేస్తున్న యాంకరమ్మ: దిమ్మతిరిగే వీడియో హల్చల్) ఈ విషయాన్ని డెబిట్ కార్డ్‌తో కొనుగోలు చేయడానికి ప్రయత్నించినప్పుడు నో సఫీషియంట్ ఫండ్స్ అని మెసేజ్ వచ్చినపుడు గానీ గమనించలేదు. అకౌంట్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేసుకుని 24 లక్షల రూపాయలు ఖతం కావడంతో లబోదిబోమన్నారు. ఇది తమ ఉత్సాహాన్ని నీరు గార్చేసిందని డగ్లస్ ఆర్డోనెజ్ వాపోయాడు. అయితే కొన్ని రోజుల తరువాత అదృష్టవశాత్తూ మొత్తం రీయింబర్స్మెంట్ అయినప్పటికీ, ఎంతో ఆనందంగా గడపాల్సిన క్షణాలు ఆందోళనలో మునిగి పోయాయని సంస్థ కస్టమర్ సర్వీస్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది ఆడమ్స్. (గడువు సమీపిస్తోంది! ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ జాగ్రత్తలు, లాభాలు) ఈ ఎర్రర్‌ను గుర్తించి, రీయింబర్స్మెంట్ చేశామని ఉబెర్ ప్రతినిధి తెలిపారు. బ్యాంక్ లోపం కారణంగా పొరపాటుగా కాలన్లలో కాకుండా డాలర్లలో ఫీజు వచ్చిందని తెలిపింది. కస్టమర్లు ఫిర్యాదును సీరియస్‌గా తీసుకుంటామని, స్వీకరించిన, వారి సమస్యను తమ టీం త్వరగా సరిదిద్దిందని వెల్లడించారు. నిర్దిష్ట బ్యాంకుల విధానాల ఆధారంగా రీఫండ్ సమయం మారుతుందని ప్రతినిధి పేర్కొన్నారు. -
అక్రమాలకు పాల్పడున్న భారతీయ అమెరికన్‌కు జైలు.. వివరాలివే..
న్యూయార్క్: అక్రమాలకు పాల్పడుతున్న 49 ఏళ్ల భారతీయ అమెరికన్‌కు అమెరికా కోర్టు జైలు శిక్ష విధించింది. అతను అక్రమంగా భారతీయ పౌరులను ఉబెర్ సాయంతో కెనడా నుంచి అమెరికా సరిహద్దులలోకి ప్రవేశించేందుకు అవకాశం కల్పించడం, అలాగే వారిని మిడ్వెస్ట్, అక్కడి కన్నా ముందుకు తీసుకురావడం చేస్తున్నాడన్న ఆరోపణలతో అతనికి మూడేళ్లకు పైబడిన జైలు శిక్ష విధించింది. మనీలాండరింగ్‌కు పాల్పడుతూ.. కాలిఫోర్నియాకు చెందిన ఎల్మ్గ్రోవ్ నివాసి రాజిందర్ పాల్ సింగ్ ఉరఫ్ జస్పాల్ గిల్ మనీలాండరింగ్‌కు పాల్పడుతూ విదేశీయులను అక్రమంగా రవాణా చేయడం, వారికి ఆశ్రయం కల్పించడం చేస్తున్నాడన్న ఆరోపణలు రుజువు కావడంతో సియెటల్ జిల్లా కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది. అక్రమంగా సరిహద్దులలోకి ప్రజలను తరలించేందుకు ఉబెర్‌ను ఉపయోగించిన స్మగ్లింగ్ రింగ్‌లో కీలక సభ్యుడైన రాజిందర్ సింగ్ తాను అర మిలియన్ డాలర్లకు పైగా మొత్తాన్ని అందుకున్నట్లు గత ఫిబ్రవరిలో నేరాన్ని అంగీకరించాడు. సరిహద్దులు దాటించేందుకు ఉబెర్.. తీర్పు సందర్భంగా యూఎస్ తాత్కాలిక అటార్నీ టెస్సా ఎం. గోర్మాన్ మాట్లాడుతూ ‘నాలుగేళ్ల వ్యవధిలో సింగ్ 800 మందికి పైగా ప్రజలను ఉత్తర సరిహద్దుల గుండా యునైటెడ్ స్టేట్స్‌లోని వాషింగ్టన్ రాష్ట్రంలోకి అక్రమంగా ప్రవేశించేలా అవకాశం కల్పించాడన్నారు. 2018 జూలై ప్రారంభంలో సింగ్, అతని సహచరులు కెనడా నుండి సియెటల్ ప్రాంతానికి ప్రజలను అక్రమంగా సరిహద్దులు దాటించేందుకు ఉబెర్‌ను ఉపయోగించారని’ తెలిపారు. 2018 నుండి 2022 మే మధ్యకాలంలో భారతీయ పౌరులను యునైటెడ్ స్టేట్స్కు అక్రమంగా పంపేందుకు సింగ్ 600 ఉబెర్ ట్రిప్పులను ఏర్పాటు చేశాడు. ఇలా వారిని యూఎస్‌లోకి అక్రమంగా తరలించిన తర్వాత సింగ్ తన సహచరుల సాయంతో వాషింగ్టన్ రాష్ట్రం వెలుపలి నుంచి వారిని గమ్యస్థానాలకు తరలించేందుకు ప్లాన్ చేసిన మార్గాలకు ఒక్కొక్కటి చొప్పున పలు వాహనాలను అద్దెకు తీసుకున్నాడు. సింగ్, అతని సహచరులు నల్ల ధనాన్ని వైట్‌గా మార్చేందుకు అధునాతన పద్ధతులను ఉపయోగించారని రుజువయ్యింది. మహమ్మారి తర్వాత వేగవంతం.. వీరి అక్రమ రవాణా వ్యవహారాలు 2018 నుండి కొనసాగుతున్నాయని న్యాయవాద కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మహమ్మారి సమయంలో వీరి అక్రమ కార్యకలాపాలు మందగించాయి. మహమ్మారి పరిమితులు ఎత్తివేసిన తరువాత వారు తిరిగి తమ అక్రమ కార్యకలాపాలను వేగవంతం చేశారు. జూలై 2018- ఏప్రిల్ 2022 మధ్య ఈ స్మగ్లింగ్ రింగ్‌తో లింక్ అయిన 17 ఉబెర్ ఖాతాల ద్వారా $80,000కు పైగా మొత్తాన్ని ఖర్చు చేసినట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది. ఇది కూడా చదవండి: గుడ్లను యూరిన్‌లో ఉడికించి, ఉప్పుకారం జల్లి.. -
కిడ్నాప్ అనుమానంతో డ్రైవర్‌పై కాల్పులు
టెక్సాస్: ఉబర్ డ్రైవర్ తనను కిడ్నాప్ చేస్తున్నాడన్న అనుమానంతో అమెరికాకు చెందిన ఒక మహిళ దారుణానికి దిగింది. మెక్సికోకు తనను తీసుకువెళుతున్నాడని భయపడి డ్రైవర్‌పై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ఆస్పత్రిలో మృతిచెందాడు. టెక్సాస్‌కు చెంది ఫోబె కోపాస్ (48) తన ప్రియుడి దగ్గరికెళ్లేందుకు ఉబర్ క్యాబ్ బుక్ చేసుకుంది. కారు ఎక్కాక ఫోన్లో ఏదో మాటల్లో పడిపోయిన ఆమె ఆ తర్వాత హఠాత్తుగా పరిసరాలను చూసి తనను మెక్సికోకి తీసుకువెళుతున్నారని అనుమానపడింది. వెంటనే తన బ్యాగ్‌లో ఉన్న తుపాకీతో డ్రైవర్ డేనియల్ పియేడ్రాపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో మెడకు తీవ్ర గాయాలైన అతను రక్తపు మడుగులో పడిపోయాడు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా పోలీసులకు సమాచారం ఇచి్చంది. పోలీసుల విచారణలో ఆ డ్రైవర్ కిడ్నాప్ చేయడానికి ప్రయతి్నంచినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదు. అందుకే ఆమెపై హత్య కేసు నమోదు చేశారు. ఉబర్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఇలాంటి హింసను సహించలేమంటూ ఫోబె మళ్లీ ఉబర్ సేవలు వినియోగించుకోకుండా నిషేధం విధించింది. -
అమెరికాలో అంబానీ, మహీంద్ర ఉబెర్ కష్టాలు: మిలియన్ డాలర్ల సెల్ఫీ వైరల్
భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యక్తులు ఉబెర్ కోసం ప్రయత్నించారంటే నమ్ముతారా? కానీ ఇటీవల అమెరికాలో అదే జరిగింది. ఈ సందర్భంగా బిలియనీర్ ముఖేష్ అంబానీ, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఎపిక్ సెల్ఫీవైరల్గా మారింది. ఏమీ అర్థం కాలేదు కదా? అసలేం జరిగిందో తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. (రెస్టారెంట్ టూ స్టార్టప్ ఫండింగ్: సురేష్ రైనా నెట్‌వర్త్ తెలిస్తే షాకవుతారు) మహీంద్రా గ్రూప్ చైర్మన్ , రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఇద్దరూ వైట్‌హౌస్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గౌరవార్థం ఏర్పాటు చేసిన డిన్నర్‌కి హాజరైన సంగతి తెలిసిందే. స్టేట్ డిన్నర్ తర్వాత, ఇండియా యుఎస్ మధ్య జరిగిన హైటెక్ హ్యాండ్‌షేక్ సమావేశానికి కూడా వీరు హాజరయ్యారు. వీరితోపాటు ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మాన్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, యాపిల్ సీఈవో టిమ్ కుక్ తదితర దిగ్గజాలు కూడా ఈ మీటింగ్‌నకు హాజరైనారు. అయితే అంబానీ ఆనంద్ మహీంద్రా యూఎస్ సెక్రటరీ ఆఫ్ కామర్స్ గినా రైమోండో 3rdiTech సహ వ్యవస్థాపకురాలు బృందా కపూర్‌తో మాటల్లో పడి , తర్వాతి లంచ్ అపాయింట్‌మెంట్‌కి వెళ్లాలన్న విషయాన్ని మర్చిపోవడంతో వీరిందరినీ అక్కడికి చేర్చాల్సిన గ్రూపు షటిల్‌ను మిస్ అయిపోయారు. చివరికి ఉబెర్ కోసంప్రయత్నిస్తుండగా హై-టెక్ హ్యాండ్‌షేక్ కాన్ఫరెన్స్‌కు హాజరైన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ ని కలిశారు. (సింగిల్ బ్రాండ్‌తో 100 కోట్ల డీల్ కుదుర్చుకున్న తొలి ఇండియన్ క్రికెటర్ ఎవరో తెలుసా? ) ఈ సందర్భాన్ని ట్విటర్లో అభిమానులతో పంచుకున్న ఆనంద్ మహీంద్ర బహుశా దీన్ని వాషింగ్టన్ మూమెంట్ అంటారేమో. ఇదే శక్తివంతమైన సెల్ఫీకి దారితీసింది అంటూ అంబానీ, సునీతా విలియమ్స్, బృందా కపూర్లతో ఉన్న సెల్ఫీని ట్వీట్ చేశారు. ఉబెర్కి కాల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ ఉబర్‌కు బదులుగా సునీతా స్పేస్ షటిల్లో వెళదామా అని సునీతాని అడిగామంటూ వెల్లడించారు. ఈ సెల్ఫీపై పలువురు నెటిజన్లు సంతోషంగా స్పందించారు. ఇది 10 లక్షలకు పైగా వ్యూస్, 40 వేలకు పైగా లైక్స్‌తో వైరలైంది. (వైట్‌హౌస్ స్టేట్ డిన్నర్: నీతా అంబానీ చీరల విశేషాలేంటో తెలుసా?) చాలా అరుదుగా కలుసుకున్నప్పుడు సాధారణంగా ఏం మాట్లాడుకుంటారు నిజంగా తెలుసుకోవాలని ఉంది..వ్యాపారం, ప్రయాణం, ఈవెంట్ ఏదైనా.. ఎలాంటి జోకులు వేసుకుంటారంటూ జేకే జ్యుయలర్ల్ వినీత్ చమత్కరించారు. గొప్ప వక్తులు.. ఒకే ఫ్రేమ్‌లో.. ప్రైడ్ ఆఫ్ ఇండియా అంటూ మరొకరు కామెంట్ చేయడం విశేషం. I suppose this was what they would call a ‘Washington moment.’ After the tech handshake meeting yesterday, Mukesh Ambani, Vrinda Kapoor & I were continuing a conversation with the Secretary of Commerce & missed the group shuttle bus to the next lunch engagement. We were trying… pic.twitter.com/gP1pZl9VcI — anand mahindra (@anandmahindra) June 25, 2023 -
ఉబెర్ మరోసారి ఉద్యోగాల కోత: 200మందికి ఉద్వాసన
క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ ఉద్యోగాల కోతకు నిర్ణయించింది. ఖర్చులను క్రమబద్ధీకరించే ప్రణాళికల నడుము మరోసారి కంపెనీ తన రిక్రూట్మెంట్ విభాగంలో 200 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఉబెర్ టెక్నాలజీస్ వెల్లడించింది. ఇదీ చదవండి: అమ్మ ఆశీస్సులతో రూ. 22000 కోట్ల కంపెనీ,అంతేనా..! రిక్రూట్మెంట్ విభాగంల 200 ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు బుధవారం తెలిపింది. 32,700 గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 1శౠతం కంటే తక్కువ మందిని ఇది ప్రభావితం చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ సంవత్సరం ప్రారంభంలో దాని సరుకు రవాణా సేవల విభాగంలో 150 మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ఇటీవలి నెలల్లో ప్రధాన ప్రత్యర్థి లిఫ్ట్ కంటే చిన్న కోతలను అమలు చేసింది. అయితే 2020 కోవిడ్ మహమ్మారి సంక్షోభంలో సిబ్బంది సంఖ్యను 17శాతం సిబ్బందిని తొలగించింది. 🔵 Uber Technologies said on Wednesday it was cutting 200 jobs in its recruitment division amid plans to keep the staff count flat through the year and streamline costs.Full Story → https://t.co/XaDmqpELDF pic.twitter.com/5la7M80Fln— PiQ (@PriapusIQ) June 21, 2023 -
ఉబర్, ర్యాపిడోలకు సుప్రీంకోర్టు బిగ్ షాక్
-
ర్యాపిడో, ఊబర్లకు షాక్.. అప్పటి వరకు సర్వీసులు బంద్!
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో బైక్-ట్యాక్సీ సేవలు అందిస్తున్న ప్రముఖ సంస్థలు ర్యాపిడో, ఉబర్‌లకు సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఈ సంస్థలు అందించే సేవలను నిషేదిస్తూ ఢిల్లీ ప్రభుత్వంఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ర్యాపిడో,ఉబర్ సంస్థలు హైకోర్టుకు వెళ్లగా.. వీటి సర్వీసులను అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఢిల్లీ హైకోర్టు ఉత్వర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. వివరాల్లోకి వెళితే.. ర్యాపిడో, ఉబెర్‌లు మోటార్ వాహనాల చట్టం-1988ను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంటూ ఢిల్లీ ప్రభుత్వం గత ఫిబ్రవరిలో బైక్-ట్యాక్సీ సేవలను నిషేధించింది. ద్విచక్ర వాహనాలేతర రవాణాపై పరిపాలన ద్వారా తుది విధానాన్ని ప్రకటించే వరకు బైక్-ట్యాక్సీ అగ్రిగేటర్లు, ర్యాపిడో, ఉబర్లను దేశ రాజధానిలో తమ సర్వీసులు నిలిపివేయాలని తెలిపింది. [BREAKING] Supreme Court stays bike taxi operations of Rapido, Uber in DelhiRead more here: https://t.co/NdU2GfNFWI pic.twitter.com/FCcmpELJif— Bar & Bench (@barandbench) June 12, 2023 అయితే ఎలాంటి నిర్బంధ చర్యలు తీసుకోవద్దని కోరుతూ ఢిల్లీ హైకోర్టు మే 26న ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఢిల్లీ సర్కార్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఆప్ ప్రభుత్వం ఈ అంశంపై.. జులై ఆఖరికల్లా కొత్త విధానాన్ని తీసుకొస్తామని తమ వాదనను వినిపించగా... జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రాజేశ్ బిందల్ ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. చదవండి: Cyclone Biparjoy Updates: అత్యంత తీవ్ర తుపానుగా బలపడిన బిపర్జోయ్ -
ఉబర్‌లో సరికొత్త సేవలు.. తొలుత ఆ మూడు నగరాల్లో ప్రారంభం
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల, సుస్థిర వ్యాపార విధానానికి మద్దతుగా ఉబర్ గ్రీన్ పేరుతో కొత్త సేవలకు రైడ్ హెయిలింగ్ యాప్ ఉబర్ శ్రీకారం చుట్టింది. ప్రయాణం కోసం ఉబర్ యాప్‌లో కస్టమర్లు ఎలక్ట్రిక్ కారును ప్రత్యేకంగా కోరవచ్చు. జూన్ నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తొలుత ఢిల్లీ, ముంబై, బెంగళూరులో ప్రారంభం కానున్నాయి. దశలవారీగా ఇతర నగరాలకు ఈ సేవలను విస్తరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 15 దేశాల్లోని 100కుపైగా నగరాల్లో ఉబర్ గ్రీన్ ఆన్ డిమాండ్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయని సంస్థ ప్రకటించింది. 2040 నాటికి పూర్తిగా.. ‘ఈవీల వాడకం ఊపందుకోవడంతో భారత మార్కెట్ కంపెనీకి ప్రాధాన్యతగా నిలిచింది. 2040 నాటికి సంస్థ వేదికగా ప్రతి రైడ్ ఎలక్ట్రిక్ వాహనం ఆధారంగా ఉండాలన్నదే మా లక్ష్యం’ అని ఉబర్ మొబిలిటీ, బిజినెస్ ఆపరేషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ తెలిపారు. దేశవ్యాప్తంగా 8 లక్షల పైచిలుకు యాక్టివ్ డ్రైవర్ పార్ట్నర్స్ ఉన్నట్టు చెప్పారు. బుకింగ్స్ పరంగా ప్రపంచవ్యాప్తంగా సంస్థకు భారత్ మూడవ స్థానంలో ఉందన్నారు. భవిష్యత్ వృద్ధిని నడిపించడానికి పెట్టుబడులను కొనసాగిస్తామని వివరించారు. భారత్‌లో 125 నగరాల్లో ఉబర్ సేవలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల్లోని 10,000 నగరాల్లో ఉబర్ వాహనాలు పరుగెడుతున్నాయి. పెద్ద ఎత్తున భాగస్వామ్యం.. ఉబర్ భారత్‌లో ఎలక్ట్రిక్ రైడ్ చేస్తోంది. తాజాగా పలు ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలు, ఇతర సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా వచ్చే రెండేళ్లలో కొత్తగా 25,000 ఎలక్ట్రిక్ కార్లను తన వేదికపై జోడించనుంది. ఉబర్ చేతులు కలిపిన కంపెనీల్లో లిథియం అర్బన్ టెక్నాలజీస్, ఎవరెస్ట్ ఫ్లీట్, మూవ్ ఉన్నాయి. అలాగే 2024 నాటికి ఢిల్లీ నగరంలో 10,000 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ప్రవేశపెట్టేందుకు జిప్ ఎలక్ట్రిక్‌తోనూ ఒప్పందం చేసుకుంది. ఉబర్ ఈవీల ఫాస్ట్ చార్జింగ్ కోసం జియో–బీపీ, జీఎంఆర్ గ్రీన్ ఎనర్జీతోనూ ఒప్పందం చేసుకున్నట్టు ప్రకటించింది. రుణ సౌకర్యం కోసం.. డ్రైవర్ పార్ట్నర్స్, ఇతర భాగస్వాములకు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు కావాల్సిన రుణ సౌకర్యం కల్పించేందుకు సిడ్బీతో రూ.1,000 కోట్ల డీల్ కుదుర్చుకుంది. పూర్తిగా ఈవీలకు మళ్లడం ఒక సవాల్. ఈవీలకు మారే ప్రక్రియలో ఆర్థిక భారం డ్రైవర్లపై పడకూడదు అని ఉబర్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్ ప్రభజీత్ సింగ్ అన్నారు. ‘ఈవీ రంగంలోని ప్రముఖ కంపెనీలతో భాగస్వామ్యం ద్వారా రైడ్–షేరింగ్ పరిశ్రమలో డ్రైవర్లు వేగంగా ఎలక్ట్రిక్‌కు మారేందుకు సాయం చేస్తున్నాం. 2030 నాటికి యూరప్, ఉత్తర అమెరికాలో సున్నా ఉద్గార స్థాయికి చేరాలని లక్ష్యంగా చేసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా 2040 నాటికి ఈ లక్ష్యానికి చేరుకుంటాం’ అని వివరించారు. ఇదీ చదవండి: భారీగా పడిపోయిన ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలు.. కారణం ఇదే.. -
షాకింగ్ రిపోర్ట్..! మొబైల్ ఛార్జ్ తక్కువున్నప్పుడు ఉబర్ ఛార్జ్ ఎక్కువవుతుందా?
ఓలా, ఉబర్ వంటి ట్యాక్సీ సర్వీసులు అందుబాటులోకి వచ్చిన తరువాత ఎక్కడికెళ్లాలన్న చిటికెలో బుక్ చేసుకుని గమ్యాలను చేరుకుంటున్నారు. అయితే ఈ ట్యాక్సీ సర్వీసులలోని చెల్లింపుల గురించి కొంత సందేహాలు ఒకప్పటి నుంచి ఉన్నాయి. ఈ సమస్యపైన బెల్జియన్ వార్తాపత్రిక ఇటీవల కొన్ని నిజాలను బయటపెట్టింది. ఉబర్ క్యాబ్స్ మొబైల్ బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు ఒక ఛార్జ్, ఎక్కువగా ఉన్నప్పుడు ఒక ఛార్జ్ వసూలు చేస్తున్నట్లు ఒక పరిశోధన ద్వారా వెల్లడించింది. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చూపించింది. డెర్నియర్ హ్యూర్ బ్రస్సెల్స్‌లోని వారి ఆఫీస్ నుంచి సిటీ సెంటర్లోకి వెళ్లడానికి రెండు ఐఫోన్ మొబైల్స్ ద్వారా టాక్సీ బుక్ చేసింది. ఒక ఐఫోన్లో 84 శాతం ఛార్జ్ ఉన్నప్పుడు 16.6 యూరోలు (రూ. 1498), 12 శాతం బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్‌కు 17.56 యూరోలు (రూ. 1,585) చూపించింది. మొబైల్ ఛార్జ్‌లో ఉన్న తేడా ట్రిప్ ఛార్జ్‌పై ప్రభావం చూపిస్తుందని ఈ విధంగా నిరూపించింది. బ్యాటరీ లెవెల్స్ ఎలా ఉన్నా ధరల మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండదని, మొబైల్ ఛార్జ్‌కి ధరలకు ఎటువంటి సంబంధం లేదని ఉబెర్ తిరస్కరించింది. (ఇదీ చదవండి: KTM 390 Adventure X: తక్కువ ధరలో కెటిఎమ్ బైక్ లాంచ్ - పూర్తి వివరాలు) గతంలో కూడా ఉబర్ సంస్థ మీద ఇలాంటి ఆరోపణలే వెలుగులోకి వచ్చాయి. అప్పుడు ఉబెర్ మాజీ ఎకనామిక్ రీసెర్చ్ హెడ్, కీత్ చెన్ ఫోన్ బ్యాటరీ తక్కువగా ఉన్న సమయంలో యూజర్లు ఎక్కువ మొత్తం చెల్లించేందుకు సుముఖంగా ఉన్నట్లు కంపెనీ గుర్తించిదని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఉబర్ మాత్రం ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ ఆధారంగా డబ్బు వసూలు చేయడంలేదని స్పష్టం చేశారు. -
ఉబర్ డ్రైవర్ ఔదార్యం! అపరిచిత ప్రయాణికుడి కోసం..
మనకు తెలియని వ్యక్తి కనీసం రూ. 10 ఇవ్వాలన్న ఆలోచిస్తాం. అలాంటి ఎవరో తెలియని వ్యక్తికి ఏకంగా ఒక అవయవాన్నే దానం చేయడం అంటే వామ్మో అని పిస్తుంది కదా. ఔను ఇక్కడొక ఉబర్ డ్రైవర్ అలానే చేశాడు. ఆ వ్యక్తి డ్రైవర్‌కి తెలియదు. తను డ్రాప్ చేయాల్సిన కస్టమర్ మాత్రమే. వివరాల్లోకెళ్తే..యూఎస్‌కి చెందిన బిల్ సుమీల్ అనే వ్యక్తి డయాలసిస్ సెంటర్‌కి వెళ్లాలని ఉబర్ బుక్ చేసుకున్నాడు. ఇంతలో తనని పికప్ చేసుకునేందుకు కారు వచ్చింది. బిల్ సుమీల్ ఆ కారులో ప్రయాణిస్తూ డ్రైవర్ టిమ్ లెట్స్తో మాటలు కలిపాడు. తన గురించి, తన అనారోగ్యం గురించి డ్రైవర్‌తో పంచుకున్నాడు. ఆ తర్వాత ప్రయాణం ముగిసి గమ్యస్థానానికి చేరుకోగానే.. సదరు ఉబర్ డ్రైవర్ టిమ్ తన కిడ్నిని సుమీల్‌కి దానం చేసేందుకు రెడీ అయ్యాడు. విచిత్రంగా అతడి కిడ్నీ సుమీల్‌కి సూట్ అయ్యింది. బహుశా దేవుడు ఇందుకోసమే మిమ్మల్ని నా కారులో వచ్చేలా చేశాడని డ్రైవర్ టిమ్ సుమీల్‌కి చెప్పాడు కూడా. కిడ్నీ బదిలీ కోసం సుమీల్‌కి ఆపరేషన్ చేశారు. అది విజయవంతమయ్యింది. ఆ తర్వాత నుంచి ఇద్దరూ ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. అయితే సుమీల్ డెలావేర్ యూనివర్సిటీ మూత్రపిండ పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్నాడు. ఉబర్ డ్రైవర్ టిమ్ లైట్స్ జర్మనీలో నివశిస్తున్నాడు. అయితే ఇద్దరూ టచ్‌లోనే ఉన్నారని తమ స్నేహాన్ని కొనసాగిస్తుండటం విశేషం. అందుకు సంబంధించిన కథనాన్ని ఇన్‌స్టాగ్రాంలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆ ఉబర్ డ్రైవర్ ఔదార్యానికి ఫిదా అవుతూ పోస్ట్‌లు పెట్టారు. View this post on Instagram A post shared by Good News Movement (@goodnews_movement) (చదవండి: విమానంలో అనౌన్సర్‌గా బీజేపీ ఎంపీ..షాక్‌లో ప్రయాణికులు) -
Bug in Uber: ఉబర్‌లో ఫ్రీ రైడింగ్ సర్వీస్.. ఇండియన్ హ్యాకర్‌కి రూ.4.6 లక్షల రివార్డ్!
ప్రముఖ ట్యాక్సీ సర్వీస్ 'ఉబర్' (Uber) గురించి దాదాపు అందరికి తెలుసు. ఈ రోజు మన ప్రయాణాలను మరింత సుగమనం చేయడానికి ఈ సర్వీస్ ఎంతగానో ఉపయోగపడుతోంది. అయితే ఈ యాప్‌లో కంపెనీ కూడా గుర్తించని ఒక బగ్ ఒక ఇండియన్ గుర్తించి సంస్థ నుంచి భారీ నజరానా పొందాడు. నివేదికల ప్రకారం.. ఉబర్ యాప్‌లో ఫ్రీ రైడింగ్‌కి సంబంధించిన ఒక బగ్ ఉన్నట్లు భారతీయ ఎథికల్ హ్యాకర్ 'ఆనంద్ ప్రకాశ్' కనిపెట్టాడు. ఈ విషయాన్నీ స్వయంగా కంపెనీ దృష్టికి తీసుకెళ్లాడు. దీనికి కంపెనీ అతనికి రూ. 4.5 లక్షలు బహుమతిగా అందించింది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉబర్‌లో కనిపించిన ఈ కొత్త బగ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ఫ్రీ రైడింగ్ చేసుకోవడానికి అవకాశం ఉండేది, అప్పుడు కంపెనీ ఎక్కువ నష్టాలను భరించాల్సి వచ్చేది. కానీ ఎట్టకేలకు ఇది హ్యాకర్ కంటపడి కంపెనీ దృష్టికి చేరటం వల్ల ఆ ప్రమాదం తప్పింది. దీని గురించి ఒక వ్యక్తి చెప్పే వరకు కంపెనీ గుర్తించకపోవడం గమనార్హం. (ఇదీ చదవండి: ఒకే రోజు 400 కార్లు డెలివరీ చేసిన మహీంద్రా.. బుక్ చేసుకున్న వారికి పండగే!) ప్రకాష్ 2017లో ఈ కనుగొన్నట్లు, 2019లో దీని గురించి కంపెనీకి వివరించినట్లు సమాచారం. కంపెనీకే తెలియని విషయం చెప్పిన ఇతనికి సంస్థ జీవితాంతం ఫ్రీ రైడింగ్ అవకాశం కల్పించింది. అయితే ఇటీవల ఆనంద్ ప్రకాశ్ ఈ బగ్ గురించి వివరంగా తన లింక్డ్ఇన్ పోస్ట్ ద్వారా వివరించారు. -
Uber Ride: 90 రోజుల ముందే ఉబర్ రైడ్ బుక్ చేసుకోండి!
ప్రముఖ ట్యాక్సీ సర్వీస్ కంపెనీ 'ఉబర్' (Uber) వినియోగదారుల కోసం మరో గుడ్ న్యూస్ తీసుకువచ్చింది. ఇది తప్పకుండా ప్రయాణికులకు ఉపయోగపడుతుంది. ఇకపై ఉబర్ సర్వీస్ కోసం 90 రోజులకు ముందే బుక్ చేసుకోవచ్చు. తద్వారా ప్రయాణికులకు ట్రాన్స్‌పోర్ట్‌కి సంబంధించిన టెన్షన్ దూరమవుతుంది. (ఇదీ చదవండి: Reset SBI ATM PIN: ఇంటినుంచే ఏటీఎమ్ పిన్ మార్చుకోండి) ఎయిర్ పోర్ట్‌కి వెళ్లేవారు లేదా వచ్చేవారికి ఇప్పటికే ప్రధాన ఎయిర్ పోర్టులలో ఉబర్ ట్యాక్సీ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక పికప్ పాయింట్స్, పార్కింగ్ ఏరియాలను కలిగి ఉండటం వల్ల వినియోగదారుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ ప్రయాణం పూర్తి చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మూడు నెలలకు ముందే (90 రోజులు) బుక్ చేసుకునే సదుపాయం కల్పించడం వల్ల మరింత ఉపయోగకరంగా ఉంటుందనే చెప్పాలి. కేవలం ఎయిర్ పోర్ట్ ప్రయాణాలకు మాత్రమే కాకుండా, ఇతర ప్రయాణాలకు కూడా ఈ సర్వీస్ ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా బుక్ చేసుకుంటే ఉబర్ డ్రైవర్లు కూడా ముందుగానే బుకింగ్ ప్లాన్ సిద్ధం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. మనదేశంలో కొన్ని ఎయిర్ పోర్టులలో ఉబర్ సర్వీస్ మరింత సులువుగా ఉంటుంది. దీని ద్వారా స్టెప్ బై స్టెప్ గైడెన్స్‌ను ఒక యాప్ ద్వారా పొందవచ్చు. ప్రస్తుతానికి అలాంటి సదుపాయం దేశంలోని 13 ప్రధాన విమానాశ్రయాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. -
కస్టమర్‌కు షాకిచ్చిన ఉబర్..
ఇటీవల ఢిల్లీలో ఓ కస్టమర్‌కు ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ షాక్ ఇచ్చింది. 21 కిలోమీటర్ల రైడ్‌కి రూ.1,500 లకుపైగా వసూలు చేసింది. కస్టమర్ ఫిర్యాదు చేయడంతో తప్పిదం గ్రహించిన కంపెనీ అధికంగా వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించింది. ఇదీ చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేవారికి గుడ్ న్యూస్! ఈ బ్యాంకులో వడ్డీరేట్లు పెరిగాయ్.. టైమ్స్‌నౌ కథనం ప్రకారం.. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చిత్తరంజన్ పార్క్ వద్ద ఉన్న తన నివాసానికి ఓ మహిళ రైడ్ బుక్ చేసుకున్నారు. ఆమె ప్రయాణం పూర్తయి గమ్య స్థానం చేరుకోగానే ఉబర్ యాప్‌లో చూపిన ప్రారంభ మొత్తం నుంచి రూ.1,525కి మారింది. ఆ మొత్తాన్ని చెల్లించేసిన ఆమె తర్వాత కంపెనీని సంప్రదించి దీనిపై ఫిర్యాదు చేశారు. జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్‌లో లోపం వల్లే ఇలా ఎక్కువ మొత్తంలో బిల్లు వచ్చిందని ఉబర్ ప్రతినిధి ఆమెకు తెలిపారు. ఆమె సరిహద్దు దాటనప్పటికీ ఉత్తరప్రదేశ్ అంతర్రాష్ట్ర ఛార్జీ వసూలు చేసినట్లు తేలింది. బిల్లులో మున్సిపల్ కార్పొరేషన్ పన్ను కూడా రెండుసార్లు చేరింది. దీంతో ఇంత మొత్తంలో బిల్లు వచ్చింది. బిల్లింగ్‌లో లోపాన్ని గుర్తించిన కంపెనీ బాధితురాలికి డబ్బును తిరిగి చెల్లించింది. ఉబెర్ క్యాష్ వాలెట్లో రూ.900 రీఫండ్ చేసింది. ఇదీ చదవండి: Byju’s: మాస్టారు మామూలోడు కాదు.. సీక్రెట్ బయటపెట్టిన బైజూస్ రవీంద్రన్! మరోవైపు ఎయిర్‌పోర్ట్‌లకు ప్రయాణించేవారి కోసం ఉబర్ తమ సేవల్ని మెరుగుపర్చింది. ఉబర్ రిజర్, పికప్ డైరెక్షన్స్, వాకింగ్ ఈటీఏస్ వంటి సౌకర్యాలు కల్పిస్తోంది. ఉబర్‌లో కస్టమర్లు ఇప్పుడు 90 రోజుల ముందుగానే రైడ్ బుక్ చేసుకునే వెసులుబాటును కల్పించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: New IT Rules: ఏప్రిల్ 1 నుంచి మారుతున్న ఐటీ రూల్స్ ఇవే.. -
ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఉబర్ ఆగ్రహం?
ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై క్యాబ్స్ అగ్రిగేటర్ ఉబర్ టెక్నాలజీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పొల్యూషన్‌ను తగ్గించేలా ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగంపై ఢిల్లీ ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఢిల్లీ నగర పరిధిలో ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే ట్యాక్సీలుగా అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ నిర్ణయాన్ని క్యాబ్ సర్వీస్ కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వ నిర్ణయంపై క్యాబ్స్ అగ్రిగేటర్ ఉబర్ అసంతృప్తి వ్యక్తం చేసింది. కేవలం ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను మాత్రమే ట్యాక్సీలుగా వాడాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయిస్తే లక్ష మందికి పైగా డ్రైవర్ల జీవనోపాధి దెబ్బ తింటుందని పేర్కొంది. అంతేకాదు లక్షలాది మంది రవాణా అవసరాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈవీను మాత్రమే ట్యాక్సీలు వాడాలన్న ఢిల్లీ సర్కార్ అమలు చేయడం అసాధ్యమని, కావాలంటే దీనిపై సంబంధిత పరిశ్రమ వర్గాలతో సంప్రదింపులు జరపాలని ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కార్‌ను కోరింది. మరోవైపు ఉబర్ సంస్థ 2040 నాటికి క్యాబ్ ట్యాక్సీలుగా వాడే వాహనాలన్నీ కర్భన రహితంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నది. వచ్చే మూడేండ్లలో 25 వేల ఈవీలను క్యాబ్ సర్వీసులుగా వాడనున్నట్లు ఉబర్ ప్రకటించింది. -
ఉబెర్ కొత్త డిజైన్: రైడర్లకు కొత్త ఫీచర్లు...ఇకపై ఈజీగా!
ముంబై: రైడ్ షేరింగ్ కంపెనీ ఉబర్ మరింత మెరుగ్గా యాప్‌ను తీర్చిదిద్దింది. రైడ్ సమయంలో యాప్‌ను ప్రతీసారి తెరవకుండానే లాక్ స్క్రీన్‌పైనే లైవ్ యాక్టివిటీతో రైడ్, వాహన వివరాలు, ట్రిప్ స్టేటస్‌ను చూడవచ్చు. తన హోమ్స్క్రీన్, కొత్త ఫీచర్ల రీడిజైన్ చేసింది. కస్టమర్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని తొలిసారి ఇలాంటి మార్పులు ప్రకటించింది. యాప్‌ను మునుపెన్నడూ లేనంత సులభంగా, స్పష్టంగా , పర్సనలైజ్డ్గా తీసుకొస్తున్నామని ఉడెర్ హెడ్ జెన్ యు అన్నారు. తద్వారా క్యాబ్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్ రైడ్ ట్రాకింగ్ ఈజీగా ఉండేలా ఇంటర్ఫేస్ని రూపొందించింది. సో నెక్ట్స్ రైడ్ లేదా ఆర్డర్ ఫుడ్ బుక్ చేస్తే, యాప్ కొద్దిగా భిన్నంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఐవోఎస్ ఉపకరణాలకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. త్వరలో ఆండ్రాయిడ్ డివైసెస్‌కు విస్తరించనున్నట్టు కంపెన ప్రకటించింది. సర్వీసెస్ ట్యాబ్ సైతం పొందు పరిచింది. శరవేగంగా లైఫ్ గడిచిపోతున్న ప్రస్తుత తరుణంలో కొన్ని, సెకన్లలో యాప్ ద్వారా నావిగేట్ చేయగలిగే అవసరాన్ని అర్థం చేసుకున్నామని ఉబర్ ఇండియా దక్షిణాసియా సెంట్రల్ ఆపరేషన్స్ డైరెక్టర్ నితీష్ భూషణ్ అన్నారు. తక్కువ ట్యాప్‌లతో ప్రయాణాలను మరింత సులభంగా బుక్ చేసుకునేందుకు రైడర్లకు సహాయ పడేందుకు హోమ్‌స్క్రీన్‌ను అనుభవాన్ని కూడా మెరుగ్గా అందించనుంది. ఇందుకోసం 'సర్వీసెస్' ట్యాబ్‌ను జోడించింది. దీని ద్వారా కొత్త యాప్‌లో సమీపంలోని మోటో నుండి ఆటో, ఇంటర్సిటీ, అద్దెలు, ఇతర వాటితో పాటు నగరంలోని రైడర్లకు అందుబాటులో ఉన్న అన్ని ఉత్పత్తులను కనుగొనడానికి ఒక-స్టాప్ షాప్‌గా కూడా ఉపయోగపడనుంది. అలాగే కొత్తగా యాడ్ చేసిన 'యాక్టివిటీ హబ్' గత రాబోయే రైడ్లను ఒకే చోట ట్రాక్ చేయడంలో సహాయపడుతుందని ఉబెర్ తెలిపింది. -
టాటా మోటార్స్–ఉబర్ భారీ డీల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వెహికిల్స్ రంగంలో భారీ డీల్‌కు వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్, రైడ్ షేరింగ్ యాప్ ఉబర్ తెరలేపాయి. ఇరు సంస్థల మధ్య సోమవారం ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా 25,000 యూనిట్ల ఎక్స్‌ప్రెస్–టి ఎలక్ట్రిక్ సెడాన్ వాహనాలను ఉబర్‌కు టాటా మోటార్స్ సరఫరా చేయనుంది. ఎక్స్‌ప్రెస్–టి ఈవీలను ప్రీమియం సేవల కింద ఉపయోగించనున్నట్టు ఉబర్ వెల్లడించింది. హైదరాబాద్‌సహా ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, కోల్‌కత, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ నగరాల్లో ఈ నెల నుంచే వీటిని నడుపుతామని తెలిపింది. దశలవారీగా డెలివరీలు.. ‘ఎలక్ట్రిక్ వెహికల్స్ సరఫరా విషయంలో వాహన తయారీ కంపెనీ, రైడ్ షేరింగ్ సంస్థ మధ్య దేశంలో ఈ స్థాయి డీల్ కుదరడం ఇదే తొలిసారి. ఫిబ్రవరి నుంచే దశలవారీగా ఉబర్ ఫ్లీట్ పార్ట్నర్స్కు డెలివరీలను టాటా మోటార్స్ ప్రారంభించనుంది. దేశంలో పర్యావరణ, స్వచ్ఛ వాహనాల వినియోగం పెరిగేందుకు ఈ డీల్ దోహదం చేస్తుందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎండీ శైలేశ్ చంద్ర అన్నారు. ట్యాక్సీల కోసం ప్రత్యేకంగా ఎక్స్‌ప్రెస్ బ్రాండ్‌ను టాటా మోటార్స్ 2021 జూలైలో తెచ్చింది. ఈ బ్రాండ్ కింద ఎక్స్‌ప్రెస్–టి తొలి ఉత్పాదన. ఫేమ్ సబ్సిడీ పోను హైదరాబాద్ ఎక్స్‌షోరూం ధర.. ఎక్స్‌ప్రెస్–టి ఎక్స్ఎమ్ ప్లస్ రూ.13.04 లక్షలు, ఎక్స్‌టీ ప్లస్ రూ.13.54 లక్షలు ఉంది. -
ఓలా, ఉబర్, రాపిడోలకు భారీ షాక్, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
న్యూఢిల్లీ: ఆన్లైన్ బైక్ సర్వీస్ అగ్రిగేటర్లకు దేశ రాజధానిలో భారీ షాక్ తగిలింది. ఓలా, ఉబర్, రాపిడో బైక్ సర్వీసులను నిలిపివేస్తూ ఢిల్లీ రవాణాశాఖ ఆదశాలు జారీ చేసింది. వాటి కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని కోరింది. అంతేకాదు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇప్పటికే మహారాష్ట్ర నిషేధాన్ని ఎదుర్కొంటున్న క్యాబ్ సేవల సంస్థలు ఓలా, ఉబెర్, ర్యాపిడో మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. రైడ్ షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌లైన ఓలా, ఉబర్, రాపిడోలు తమ బైక్ ట్యాక్సీ సేవలను తక్షణమే నిలిపివేయాలని ఢిల్లీ రవాణా శాఖ ఫిబ్రవరి 20న పబ్లిక్ నోటీసును జారీ చేసింది.రవాణాయేతర (ప్రైవేట్) రిజిస్ట్రేషన్ గుర్తు/నంబర్లు కలిగిన ద్విచక్ర వాహనాలు ప్రయాణీకులను తీసుకువెళ్లేందుకు ఉపయోగిస్తున్నారని, ఇది పూర్తిగా వాణిజ్య కార్యకలాపాలు, మోటారు వాహన చట్టం, 1988ని ఉల్లంఘించినట్టేననని రవాణా శాఖ తెలిపింది. ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే మొదటి నేరానికి రూ. 5వేలు జరిమానా, రెండు, తదుపరి నేరానికి రూ. 10,000 జరిమానా, జైలు శిక్ష విధించబడుతుందని రవాణా శాఖ హెచ్చరించింది. అంతేకాదు, డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ కనీసం మూడు సంవత్సరాల పాటు సస్పెండ్ చేస్తామని తాజా నోటీసులో పేర్కొంది. -
ఉబర్‌లో ప్రయాణిస్తుంటారా? అయితే ఇది మీకోసమే
ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ ప్రయాణికులకోసం సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది.ముఖ్యంగా ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఈ ఫీచర్లను యూజర్లకు పరిచయం చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. బుక్ చేసుకున్న ప్రయాణికులు ఉబర్ క్యాబ్ ఎక్కిన వెంటనే డ్రైవర్ ఫోన్ నుంచి వారికి సీటు బెల్టు పెట్టుకోండి అంటూ ఓ పుష్ నోటిఫికేషన్ వస్తుంది. అలాగే, మీరు ఎక్కడ ఉన్నారనేది తెలిపిలా లైవ్ లొకేషన్ సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందేలా ఎస్ఓఎస్ ఇంటిగ్రేషన్‌ను ప్రారంభించింది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. ఇక డ్రైవర్‌తో ఏదైనా సమస్య, వెహికల్స్‌లో అసౌకర్యంగా ఉంటే వెంటనే కస్టమర్‌కేర్‌తో మాట్లాడేందుకు సేఫ్టీలైన్ వినియోగంలోకి తెచ్చింది. దీంతో పాటు భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఉబర్ యాప్ ద్వారా 88006 88666 నంబర్‌కు డయల్ చేయొచ్చని కంపెనీ తెలిపింది. 30 సెకన్లలోపే కంపెనీ ప్రతినిధి అందుబాటులోకి వస్తారని పేర్కొంది. -
ఓలా, ఉబర్, రాపిడోలకు హైకోర్టులో ఊరట
బెంగళూరు: యాప్ ఆధారిత క్యాబ్ సేవలు అందించే సంస్థలైన ఓలా, ఉబర్, రాపిడోలకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆటో సర్వీసులపై విధించిన నిషేధంపై మధ్యంతర స్టే విధిస్తూ తీర్పు వెలువరించింది. సంబంధిత చట్టాల ప్రకారం ఆటో సర్వీసు ధరలను నిర్ణయించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదనపు ఛార్జీల వసూళ్లపై 10-15 రోజుల్లో నివేదిక సమర్పించాలని, అప్పటి వరకు రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్‌లైన ఓలా, ఉబర్, ర్యాపిడోలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అధికారులకు సూచించింది. తదుపరి విచారణను 2022, నవంబర్ 7కు వాయిదా వేసింది. అధికారులు ధరలు నిర్ణయించే వరకు ఆటో సేవలపై కనీస ఛార్జీలపై 10 శాతం అదనపు ధరతో పాటు 5 శాతం జీఎస్టీ విధించుకోవచ్చని యాప్ అగ్రిగేటర్స్‌కు అనుమతులిచ్చింది. గతంలో గతంలో ఆటో అగ్రిగేటర్లు ఒక్కో రైడ్‌కు 40 కన్వీనియన్స్ ఫీజుగా వసూలు చేసేవారు. కోర్టు ఆదేశాలను తాము స్వాగతిస్తున్నామని, దీని ద్వారా యాప్ ఆధారితంగా ఆటో డ్రైవర్లు సేవలందించేందుకు వీలు కలుగుతుందని ఉబర్ ఓ ప్రకటన చేసింది. ఉబర్ వంటి యాప్ ఆధారిత సంస్థలు తమ సేవలకు ఛార్జీలు వసూలు చేస్తాయనేదానికి గుర్తింపు లభిస్తుందని పేర్కొంది.మరోవైపు.. బెంగళూరులో సేవలను నిలిపిసేన బైక్ టాక్సీ అగ్రిగేటర్ రాపిడో ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదు. కర్ణాటక ప్రభుత్వం అక్టోబర్ 6 ఇచ్చిన నోటీసులు ఆటో డ్రైవర్స్ హక్కులను కాలరాస్తున్నాయని ఓలా, ఉబర్ న్యాయ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇదీ చదవండి: సంచలనం: ఓలా, ఉబెర్, ర్యాపిడో ఆటో సర్వీసులపై నిషేధం -
కస్టమర్‌కు ‘ఉబర్’ షాక్..15 నిమిషాల రైడ్‌కు రూ.32 లక్షలు
ఇంగ్లాండ్: యాప్ ఆధారిత క్యాబ్ సేవలను అందిస్తున్న ఉబర్.. చాలా మందికి సుపరిచితమే. ఏ చిన్న జర్నీ ఉన్నా ఉబర్‌ను చాలా మంది ఉపయోగించి క్యాబ్ బుక్ చేసుకుంటారు. ఛార్జీలు వందల నుంచి వేల వరకు ఉండొచ్చు. కానీ, లక్షల్లో ఉంటుందని మీరెప్పుడైనా ఊహించారా?. ఓ బ్రిటిష్ వ్యక్తికి కేవలం 15 నిమిషాల రైడ్‌కు ఏకంగా రూ.32 లక్షల ఛార్జ్ చేసి ఊహించని షాకిచ్చింది ఉబర్. క్యాబ్ సంస్థ నుంచి వచ్చిన మెసేజ్ చూసుకుని బాధితుడు ఒక్క క్షణం దిగ్భ్రాంతికి లోనైనట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. 15 నిమిషాల రైడ్‌కు 38,317 డాలర్లు అంటే భారత కరెన్సీలో ఏకంగా 32 లక్షల రూపాయలు ఉబర్ ఛార్జ్ చేసినట్లు తెలిపింది. ఇంగ్లాండ్, మాంచెస్టర్‌లోని బక్స్టన్ ఇన్ ప్రాంతంలో తన పని ముగించుకుని రైడ్ షేర్ యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకున్నారు ఒలివర్ కల్పన్(22). తాను పని చేసే బార్ నుంచి నాలుగు మైళ్ల దూరంలోని విచ్వుడ్లో తన స్నేహితుడిని కలవాలనుకున్నారు. ఉబర్ భారీ మొత్తంలో ఛార్జ్ చేయటంపై బాధితుడు కల్పన్ సౌత్ వెస్ట్ న్యూస్ సర్వీస్‌కు వివరించాడు. ‘చాలా సార్లు ఉబర్ మాదిరి యాప్‌ల ద్వారా క్యాబ్ బుక్ చేసుకున్నాను. ఎప్పుడూ ఎలాంటి సమస్య రాలేదు. ఎప్పుడైనా 11-12 డాలర్లు(రూ.900-1000) ఛార్జ్ చేసేవారు. ఈసారి ఉబర్‌లో కారు బుక్ చేసుకోగా.. కేవలం 15 నిమిషాల జర్నీ చేశాను. ఆ తర్వాతి రోజు ఉబర్ నుంచి మెసేజ్ రావటంతో షాక్ అయ్యా. మొత్తం 35,427 పౌండ్లు(39,317 డాలర్లు) ఛార్జ్ చేసినట్లు తెలిసింది.’ అని బాధితుడు కల్పన్ తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న బాధితుడు కల్పన్.. వెంటనే ఉబర్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకున్నాడు. తన బ్యాంకు ఖాతాలో అంత డబ్బు లేకపోవటంతో వారు తీసుకోలేకపోయారని పేర్కొన్నాడు. తొలుత ఛార్జ్ అమౌంట్ చూసి ఉబర్ కస్టమర్ కేర్ వాళ్లు సైతం తికమక పడ్డారు. అయితే.. కల్పన్ రైడ్ గమ్య స్థానం ఆస్ట్రేలియాగా నమోదు కావటంతో భారీ స్థాయిలో ఛార్జ్ చేయాల్సి వచ్చినట్లు గుర్తించారు. ఇంగ్లాండ్‌లోని విచ్‌వుడ్ కాకుండా.. ఆస్ట్రేలియా, విక్టోరియాలోని విచ్వుడ్గా నమోదైనట్లు తేలింది. బ్యాంకులో సరైన నిధులు లేకపోవటంతో ఉబర్ విత్‌డ్రా చేయలేకపోయింది. ఒకవేళ నగదు ఉండి ఉంటే.. తిరిగి తీసుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చేదన్నారు కల్పన్. ఇదీ చదవండి: Hong Kong టూరిస్టులకు పండగే: రూ.2వేల కోట్ల విలువైన టికెట్లు ఫ్రీ -
'మా వాటా మేం అమ్మేస్తున్నాం'..జొమాటోకు మరో షాక్!
ప్రముఖ రైడ్ షేరింగ్ సంస్థ ఉబర్..దేశీయ ఫుడ్ ఆగ్రిగ్రేటర్ జొమాటోకు భారీ షాకిచ్చింది. ఆ సంస్థలో ఉన్న 7.8శాతం స్టేక్‌ను అమ్మేందుకు ఉబర్ సిద్ధమైంది. 7.8 శాతం వాటాల అమ్మకంతో ఉబర్‌కు రూ.3,305 కోట్ల వస్తాయని అంచనా వేస్తుంది. తక్కువలో తక్కువ డీల్ పరిమాణం రూ.2,938.6 కోట్లు ఉండనుంది. భారత్‌లో ఉబర్ తన ఫుడ్ డెలివరీ విభాగమైన ఉబెర్ ఈట్స్‌ను జొమాటోకు అమ్మేసింది. ఆ సమయంలో ఉబర్..జొమాటోలో వాటాను కొనుగోలు చేసింది. ఆ సమయంలో స్టాక్ లావాదేవీ డీల్ విలువ రూ.1,376 కోట్లుగా ఉంది. ఇప్పుడు ఆ స్టేక్‌ను ఉబర్ అమ్మేయడంతో ఉబర్‌కు కనీసం 2.5శాతం లాభం పొందవచ్చని భావిస్తోంది. పోటీ పడుతున్న అమెరికన్ కంపెనీలు జొమాటోలో ఉన్న తన వాటాను ఆగస్ట్ 5కి క్లోజ్ చేయాలని ఉబర్ భావిస్తుంది. ఈ తరుణంలో జొమాటోలోని తన షేర్లను ఉబర్ ఎవరికి అమ్మేస్తుందని అంశంపై టర్మ్ షీట్లో వెల్లడించలేదు. అయినప్పటికీ ఉబర్ అమ్మే 7.8% వాటాను కొనుగోలు చేసేందుకు అమెరికాకు చెందిన అనేక మంది సంస్థాగత పెట్టుబడిదారులు పోటీ పడుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. వెయ్యి కోట్లు లాస్ జొమాటో ప్రీ-ఐపీవో వాటాదారులకు ఒక సంవత్సరం లాక్ ఇన్ పీరియడ్ జులై 23న ముగిసింది. లాక్ ఇన్ పీరియడ్ ముగిసిన వారం తర్వాత ఉబర్ తన జొమాటోలోని తన వాటాల్ని అమ్మేందుకు సిద్ధమైనట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు లాక్ ఇన్ పీరియడ్ ముగిసిన తర్వాత మార్కెట్ ప్రారంభమైన జులై 25 ఒక్కరోజే జొమాటో సుమారు వెయ్యి కోట్లు నష్టపోయిన విషయం తెలిసిందే. -
భారత్‌కు ఉబర్ గుడ్‌బై.. స్పందించిన సీఈవో
ప్రముఖ రైడ్ షేరింగ్ సంస్థ ఓలా, ఉబర్లు మెర్జ్ అవుతున్నాయా?ఊబర్ ఇండియాలో తన కార్యకలాపాల్ని నిలిపివేస్తున్నాయా? అంటే అవుననే అంటున్నాయి తాజాగా వెలుగులోకి వచ్చిన నివేదికలు. పలు నివేదికల ప్రకారం.. ఓలా- ఉబర్లు మెర్జ్ అవుతున్నాయని, ఇందులో భాగంగా ఓలా సీఈవో భవీష్ అగర్వాల్..అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలో ఉబర్‌కు చెందిన టాప్ ఎగ్జిక్యూటీవ్‌లతో మంతనాలు జరిపారని నివేదికల సారాంశం. అయితే ఆ వార్తల్ని భవిష్ అగర్వాల్ కొట్టి పారేశారు. "అబ్సిల్యూట్ రబిష్" ఓలా లాభాల్ని గడిస్తుంది. అదే సమయంలో వృద్ధి సాధిస్తుంది. కావాలనుకుంటే విదేశీ కంపెనీలు దేశం నుంచి నిష్క్రమించాలనుకుంటే వారికి స్వాగతం! మెర్జ్ అయ్యే అవకాశం లేదని ఖండించారు. భారత్ నుంచి బెర్ అవుట్ మరో రైడ్ షేరింగ్ సంస్థ ఉబర్ భారత్‌లో తన కార్యకలాల్ని నిలిపివేస్తున్నట్లు బ్లూం బెర్గ్ తన కథనంలో పేర్కొంది. ఈ కథంపై ఉబర్ సీఈవో డార ఖోస్రోషి స్పందించారు. భారత్‌లో రైడ్ షేరింగ్ మార్కెట్ ఎలా ఉందో మాకు బాగా తెలుసు. భారత్ నుంచి మేం వెళ్లి పోవడం లేదని, కార్యకలాపాల్ని కొనసాగిస్తున్నట్లు బ్లూం బెర్గ్‌కు ఇప్పటికే చెప్పామని అన్నారు. బ్లూం బెర్గ్ ఏం రాసిందంటే ఈ ఏడాది జూన్‌లో ఓలా, ఉబెర్ల గురించి బ్లూం బెర్గ్ ఓ కథనాన్ని ప్రచురించింది. పెరిగిపోతున్న ధరల కారణంగా ఆ సంస్థలు అభివృద్ధితో పాటు లాభాల్ని గడించడంలో ఇబ్బందులు పడుతున్నాయని హైలెట్ చేసింది. అందుకే భారత్ మార్కెట్ నుంచి ఉబర్ నిష్క్రమించవచ్చని సూచించింది. అయితే భవిష్యత్తులో ఉబెర్ భారత్‌లో కార్యకలాపాల్ని కొనసాగించేందుకు దేశీయంగా మరో రైడ్ షేరింగ్ సంస్థతో జతకట్టవచ్చని వెల్లడించింది. అందుకు ఉబర్ చైనాలో దీదీ గ్లోబల్‌తో, ఆగ్నేయాసియాలో గ్రాబ్ హోల్డింగ్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందాల్ని ఉదహరించింది. -
విలీనమా.. నో వే!...కావాలంటే వారు వెళ్లిపోవచ్చు!
సాక్షి, ముంబై: క్యాబ్ సేవల సంస్థలు, ఈ బిజినెస్‌లో ప్రధాన ప్రత్యర్థలు ఓలా, ఉబెర్ విలీనవుతున్నాయంటూ పలు రిపోర్టులు బిజినెస్ వర్గాల్లో సంచలనం రేపాయి. ఓలా ఉబర్ సంస్థల విలీనం గురించి ఇప్పటికే చర్చలు ప్రారంభించాయంటూ వార్తలు హల్చల్ చేశాయి. దేశీయ అతిపెద్ద రైడ్-హెయిలింగ్ కంపెనీ ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా తీవ్రంగా ఖండించారు. రబ్బిష్.. పూర్తిగా పుకార్లే అంటూ ఆయన ట్వీట్ చేశారు. దేశంలో తమ వ్యాపారం చాలా లాభదాయకంగా ఉందనీ, పురోగతి సాధిస్తున్నామని ఈ క్రమంలో విలీనమనే సమస్య లేదని స్పష్టం చేశారు. అంతేకాదు కావాలనుకుంటే విదేశీ కంపెనీలు దేశంనుంచి నిష్క్రమించాలనుకుంటే వారికి స్వాగతం! అంతేకానీ తాము ఎప్పటికీ విలీనం కామంటూ అమెరికా కంపెనీ ఉబెర్‌కు వ్యంగ్యంగా చురకలేశారు. ఈ మేరకు అగర్వాల్ వార్తా నివేదికలను ఉటంకిస్తూ ట్వీట్ చేశారు. బలమైన బ్యాలెన్స్ షీట్‌తో ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన రైడ్ హెయిలింగ్ కంపెనీలలో ఒకటిగా, అందులోనూ భారతదేశంలో మార్కెట్ లీడర్‌గా ఉన్నామని ఓలా ప్రకటించింది. కాగా రైడ్ హెయిలింగ్ దిగ్గజాలు ఓలా, ఉబెర్ విలీనమార్గంలో ఇప్పటికే చర్చలు ప్రారంభించాయనీ, సీఈఓ అగర్వాల్ అమెరికాలో ఉబెర్ కీలక అధికారులతో భేటీ కానున్నారంటూ పలు వార్తలు వెలువడ్డాయి. రెండు కంపెనీలు ఇంతకు ముందు కూడా విలీన అవకాశాలపై చర్చించాయని, అయితే ఒప్పందం కార్యరూపం దాల్చలేదని నివేదిక పేర్కొంది. అయితే ఓలా తన క్విక్ ఫుడ్ డెలివరీ, యూజ్డ్ కార్ బిజినెస్‌ను మూసివేయడం, ఈ వారంలో దాదాపు 300-350 మంది ఉద్యోగులను తొలగించిన నేపథ్యంలో ఈ ఊహగానాలు వెలువడటం గమనార్హం. చదవండి: ట్విటర్ డీల్ వివాదం: మస్క్ మరో కీలక నిర్ణయం Absolute rubbish. We’re very profitable and growing well. If some other companies want to exit their business from India they are welcome to! We will never merge. https://t.co/X3wC9HDrnr — Bhavish Aggarwal (@bhash) July 29, 2022 -
భారత్‌లో నైజీరియా స్టార్టప్ ఎంట్రీ.. ఆ మూడు నగరాలే టార్గెట్!
న్యూఢిల్లీ: వాహన రుణ రంగంలో ఉన్న నైజీరియా స్టార్టప్ మూవ్ తాజాగా భారత విపణిలోకి ప్రవేశించింది. హైదరాబాద్, ముంబై, బెంగళూరులో కార్యకలాపాలను ప్రారంభించినట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. మొబిలిటీ ఎంటర్ప్రైసెస్కు రెవెన్యూ ఆధారిత రుణాన్ని కంపెనీ అందిస్తోంది. యూరప్, మధ్యప్రాచ్య, ఆఫ్రికాలో ఉబర్‌కు వాహనాల సరఫరా భాగస్వామిగా ఉంది. ఉబర్ డ్రైవర్ పార్ట్నర్లకు ప్రత్యేకంగా రుణం సమకూరుస్తోంది. రుణం అందిస్తున్న వాహనాల్లో 60 శాతం హైబ్రిడ్ లేదా ఎలక్ట్రిక్ మోడళ్లు ఉండాలన్నది కంపెనీ లక్ష్యం. 13 దేశాల్లో కార్యకలాపాలను మూవ్ సాగిస్తోంది. డ్రైవర్ పార్ట్నర్లు 50 లక్షల ట్రిప్‌లను పూర్తి చేశారని కంపెనీ తెలిపింది. సంస్థ ఇప్పటి వరకు రూ.1,600 కోట్లు సమీకరించింది. చదవండి: Karur Vysya Bank: అదరగొట్టిన కరూర్ వైశ్యా.. డబులైంది! -
టెక్నాలజీ వినియోగంతో మరింత భద్రత
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు భద్రత కల్పించేందుకు రాష్ట్ర పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని, అదే విధంగా సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడం వల్ల మరింత పటిష్టంగా భద్రతా చర్యలు చేపట్టడానికి వీలవుతుందని డీజీపీ మహేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. సోమవారం ఉబెర్ యాప్ సంస్థతో కలసి లైవ్ లింక్ షేర్ టూల్‌ను ఆయన పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రారంభించారు. కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకోవడం వల్ల రియల్ టైమ్ లొకేషన్‌తో పాటు యూజర్ వివరాలు త్వరితగతిన తెలుస్తాయని, దీని వల్ల ప్రమాదాల్లో ఉన్న వారిని రక్షించడం సులభమవుతుందన్నారు. భద్రత కోసమే: ఉబెర్ ఆపరేషన్స్ డైరెక్టర్ శైలేంద్రన్ ప్రజలకు మరింత భద్రత కల్పించేందుకు తాము సేఫ్టీ టూల్ కిట్ ద్వారా లైవ్ లొకేషన్ పోలీస్ విభాగానికి చేరేలా ప్రత్యేక వ్యవస్థ రూపొందించామని ఉబెర్ సంస్థ ఆపరేషన్స్ డైరెక్టర్ శైలేంద్రన్ వెల్లడించారు. ఇప్పటికే తమ యాప్‌లో అనేక భద్రతా అంశాలున్నాయని పేర్కొన్నారు. ఈ లైవ్ లింక్ టూల్ కిట్ సోమవారం నుంచి పోలీస్ శాఖకు లింకు అవుతుందని తెలిపారు. మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ స్వాతిలక్రా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న స్వాతిలక్రా తదితరులు సేఫ్టీ టూల్ కిట్ పని ఇలా.. డ్రైవర్ భద్రతతో పాటు ప్రయాణికుల సేఫ్టీకి ఉబెర్ సంస్థ యాప్ లైవ్ లొకేషన్, పోలీస్ కంట్రోల్ సెంటర్, డయల్ 100కి చేరిపోయేలా ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉబెర్ యాప్‌లోని సేఫ్టీ టూల్ కిట్‌లో బ్లూ షీల్డ్ క్లిక్ చేయగానే వాహనం నంబర్, డ్రైవర్ పేరుతో పాటు ప్రతీ నాలుగు సెకండ్లకు ఒకసారి వాహనం లైవ్ లొకేషన్ పోలీస్ విభాగానికి చేరిపోతుంది. ప్రయాణికులు సైతం ఈ లింక్‌తో షేర్ ఆప్షన్ క్లిక్ చేయవచ్చు. ఒకవేళ షేర్ వద్దనుకుంటే ఉబెర్ యాప్‌లోని ఎస్ఓఎస్ ఉపయోగించుకోవచ్చు. ప్రమాద సమయంలో ఎస్ఓఎస్ వల్ల పోలీస్ కంట్రోల్ రూమ్‌కు క్షణాల్లో కాల్ వెళ్తుంది. దీని వల్ల అటు ప్రయాణికులు, ఇటు వాహన డ్రైవర్లకు ఎలాంటి ప్రమాదం ఉన్నా దగ్గరలోని పెట్రోలింగ్ వాహనం సంఘటన స్థలికి చేరుకుంటుంది. -
సంచలనం: అడ్డదారిలో ఉబర్ క్యాబ్,వేల కోట్ల డాలర్ల నిధులు మళ్లింపు!
యాప్ ఆధారిత చౌక ట్యాక్సీ సేవల పేరుతో దశాబ్ద కాలం క్రితం (2009లో) కార్యకలాపాలు ప్రారంభించిన ఉబర్ .. అతి తక్కువ కాలంలోనే అత్యంత వేగంగా 30 పైచిలుకు దేశాల్లో వ్యాపారాన్ని విస్తరించింది. ఈ క్రమంలో వ్యవస్థలను, రాజకీయ నేతలను మేనేజ్ చేసింది. డ్రైవర్లను వాడుకుంది. కార్మిక, ట్యాక్సీ చట్టాలను తనకు అనుకూలంగా మల్చుకునేందుకు వేల కోట్ల డాలర్లు వెచ్చించి నేతలతో లాబీయింగ్ చేయడం మొదలుకుని, పన్నుల ఊసు ఉండని దేశాలకు లాభాలను మళ్లించడం, డ్రైవర్లను బలిపశువులను చేయడం వరకూ అన్ని అడ్డదారులూ తొక్కింది. ఇలా ఉబర్ పాటించిన తప్పుడు విధానాలను రుజువు చేసే డాక్యుమెంట్స్ లీకవడం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. టెక్ట్స్ మెసేజీలు, ఈమెయిల్స్ రూపంలో ఉన్న వీటిని ఉబర్ ఫైల్స్ పేరిట అంతర్జాతీయంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుల కన్సార్టియం అయిన ఐసీఐజే బైటపెట్టింది. గతంలో ప్రముఖుల అక్రమాస్తులను పనామా పేపర్స్ పేరిట బైటపెట్టి సంచలనం సృష్టించినది కూడా ఈ ఐసీఐజేనే కావడం గమనార్హం. 1,24,000 పైచిలుకు డాక్యుమెంట్స్ లీక్ కాగా వీటిలో 83,000 పైచిలుకు ఈమెసేజీలు, వాట్సాప్ మెసేజీలు ఉన్నాయి. ఉబర్ సహ–వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో ట్రావిస్ కలానిక్ సారథ్యంలో 2013–2017 మధ్య కాలంలో ఉబర్ విస్తరణ గురించిన వివరాలు వీటిలో ఉన్నాయి. లింగ వివక్ష, లైంగిక వేధింపుల ఆరోపణలతో 2017లో కలానిక్ బలవంతంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఈ డాక్యుమెంట్లు తొలుత బ్రిటిష్ న్యూస్‌పేపర్ ది గార్డియన్‌కు, అక్కణ్నుంచి ఐసీఐజేకి అందాయి. యూరప్‌లో ఉబర్ తరఫున లాబీయిస్టుగా పనిచేసిన మార్క్ మెక్‌గాన్.. ఈ అక్రమాలను బైటపెట్టడంలో కీలకమైన ప్రజావేగుగా వ్యవహరించారు. యధేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన.. రైడ్ షేరింగ్ యాప్ ద్వారా చౌకగా ట్యాక్సీ సేవలను అందించే క్రమంలో ఉబర్ విప్లవాత్మకమైన మార్పులు తెచ్చినట్లు అనిపించినప్పటికీ.. వాస్తవానికి వ్యాపార విస్తరణ కోసం నిబంధనలన్నింటినీ ఉల్లంఘించినట్లు ఉబర్ ఫైల్స్ ద్వారా వెల్లడైంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు సన్నిహితులైన వ్యక్తులు ఉబర్‌కు లాబీయిస్టులుగా పనిచేశారు. కంపెనీ మీద వస్తున్న ఆరోపణలపై విచారణ నిలిపివేయాలంటూ దర్యాప్తు సంస్థలను, కార్మిక .. ట్యాక్సీ చట్టాలను సవరించాలంటూ, డ్రైవర్ల బ్యాగ్రౌండ్ ధ్రువీకరణ నిబంధనలను సడలించాలంటూ అధికారులపై వారు ఒత్తిడి తెచ్చారు. యూరప్ తదితర మార్కెట్లలోనూ ఉబర్ ఇదే తరహా ధోరణిలో విస్తరించింది. అప్పటి ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి ఎమాన్యుయెల్ మాక్రాన్ (ప్రస్తుత అధ్యక్షుడు), యూరోపియన్ కమిషన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ నీలీ క్రోయెస్ వంటి వారు ఇందుకు సహకరించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇక, మిగతా మార్గాలేవీ పనిచేయనప్పుడు విచారణ జరిపే దర్యాప్తు సంస్థలకు వివరాలను దొరకనియ్యకుండా చేసేందుకు ఉబర్ ‘‘కిల్ స్విచ్’’అనే స్టెల్త్ టెక్నాలజీని ఉపయోగించింది. సోదాల్లో కీలక ఆధారాలు అధికారులకు చిక్కకుండా ఇది ఆటోమేటిక్‌గా ఉబర్ సర్వర్లకు యాక్సెస్ నిలిపివేసేది. ఉబర్ ఇలా కనీసం ఆరు దేశాల్లో చేసింది. అలాగే, మిలియన్ల కొద్దీ డాలర్ల పన్నులను ఎగ్గొట్టేందుకు ఉబర్ తనకు వచ్చే లాభాలను బెర్ముడా తదితర ట్యాక్స్ హేవెన్స్కు (పన్నుల భారం ఉండని దేశాలు) మళ్లించింది. ఔను తప్పే.. కానీ ఇప్పుడు మారాము.. తాజా పరిణామాలపై ఉబర్ స్పందించింది. గతంలో తప్పిదాలు జరిగిన సంగతి వాస్తవమేనని.. వాటిని సమర్థించుకోబోమని పేర్కొంది. ఆ తప్పిదాల ఫలితంగా పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించినట్లు ఉబర్ తెలిపింది. కొత్త సీఈవో దారా ఖుస్రోవ్షాహీ వచ్చాక గత అయిదేళ్లలో కంపెనీ పనితీరు పూర్తిగా మారిపోయిందని వివరించింది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో 90 శాతం మంది .. దారా సీఈవోగా వచ్చాక చేరినవారేనని పేర్కొంది. పోటీ సంస్థలతో పాటు లేబర్ యూనియన్లు, ట్యాక్సీ కంపెనీలు మొదలైన వర్గాలతో చర్చలు జరిపేందుకు కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు ఉబర్ వివరించింది. -
ప్రయాణికులకు భారీ షాక్, పెరిగిన క్యాబ్ ఛార్జీలు!
ప్రయాణికుల జేబుకు చిల్లు పెట్టేందుకు రైడ్ షేరింగ్ సంస్థ సిద్ధమైంది. ఉబెర్ కార్ సర్వీస్ ఛార్జీల ధరల్ని పెంచుతున్నట్లు ఉబర్ ఇండియా సెంట్రల్ ఆపరేషన్ డైర్టకర్ నితీష్ భూషణ్ బ్లాగ్‌లో తెలిపారు. "పెరుగుతున్న ఇంధన ధరలు అందరిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ఇబ్బందులు పడుతున్నట్లు ఉబర్ డ్రైవర్లు కౌన్సిల్ సభ్యులకు చెప్పినట్లు తెలిపారు. సంస్థ కోసం కష్టపడుతున్న డ్రైవర్ల ఆచరణీయమైన, ఆకర్షణీయంగా ఉండేందుకు కృషి చేస్తాం. అందుకే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు భూషణ్ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. కొత్త ఫీచర్లను యాడ్ చేసింది రైడ్ క్యాన్సిలేషన్ అనేది ప్రయాణికుల్లో ప్రధాన సమస్య. అందుకే డ్రైవర్లు ప్రయాణికుల రైడ్‌ను అంగీకరించేందుకు వాళ్లు ఎక్కడ ఉన్నారనే విషయాల్ని చూపించేలా ఉబెర్ కొత్త ఫీచర్‌ను యాడ్ చేసింది అని ఉబెర్ పేర్కొంది. సీపీపీఏ వార్నింగ్‌తో ఇటీవల సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అధారిటీ (సీపీపీఏ) రైడ్ షేరింగ్ సంస్థలకు హెచ్చరికలు జారీ చేసింది. రైడ్ క్యాన్సిలేషన్, క్యాన్సిలేషన్ ఛార్జీలు,ర్యాండమ్‌గా పెరుగుతున్న ధర, ప్రయాణికులు క్యాబ్ కోసం ఎదురు చూడటం, డ్రైవర్లు ట్రిప్పులను రద్దు చేయమని ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టడం' వంటి ప్రయాణికులకు తలెత్తున్న సమస్యల్ని పరిష్కరించాలని హెచ్చరించింది. అదే సమయంలో క్యాబ్ అగ్రిగేటర్లను రైడ్ క్యాన్సిలేషన్లు, డీ ఫాల్ట్‌గా (యాధృచ్చికంగా) పెరుగుతున్న ఛార్జీలకు సంబంధించిన అల్గారిథమ్‌ల మార్చాలని తెలిపింది. కస్టమర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ఉబెర్, ఓలాతో సహా ఇతర రైడ్ షేరింగ్‌లకు సంబంధించిన అల్గారింథమ్లను మార్చేందుకు 30రోజుల సమయం ఇచ్చింది. -
ఉమన్ బైక్ ట్యాక్సీ రైడర్
నాన్న, అన్నయ్య, భర్త, కాకుండా ఎంతో దగ్గరి స్నేహితుడైతేనే అమ్మాయిలు ఇతరుల టూవీలర్ ఎక్కుతారు. అటువంటిది తన స్కూటర్ మీద ఎంతోమందిని ఎక్కించుకుని వివిధ ప్రాంతాల్లో దించుతూ వచ్చిన సంపాదనతో కుటుంబానికి ఆసరాగా నిలుస్తోంది మౌతుషి బసు. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు మౌతుషి ఊబెర్ టూవీలర్ రైడర్‌గా మారింది. కరోనా కారణంగా లక్షలాదిమంది ఉద్యోగాలు పోయి రోడ్డున పడిన సంగతి తెలిసిందే. ఆకలికి ఉద్యోగం ఉందా ఊడిందా అనేది తెలియదు. అందుకే ఎంతోమంది తమ అర్హతలకు సరిపోని ఉద్యోగాల్లో చేరి మరీ కుటుంబాలను లాక్కొస్తున్నారు. ఈ కోవకు చెందిన 30 ఏళ్ల అమ్మాయే మౌతుషి. కరోనాకు ముందు పానాసోనిక్ కంపెనీలో ఉద్యోగం చేసేది. కరోనాతో ఉద్యోగం నుంచి తీసేశారు. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే. దీంతో ఉద్యోగాల కోసం తీవ్రంగా వెతికింది. కానీ ఎక్కడా తనకు సరిపోయే జాబ్ దొరకలేదు. అయినా ఏ మాత్రం నిరాశపడకుండా వెతుకుతూనే ఉంది. చివరికి ఊబెర్లో టూవీలర్ రైడర్‌గా చేరింది. అంతకుముందు రైడింగ్‌లో ఎటువంటి అనుభవం లేకపోయినప్పటికీ.. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రైడర్‌గా పనిచేస్తోంది. అనుకోకుండా రణవీర్ భట్టాచార్య అనే రైటర్ ఇటీవల మౌతుషి టూవీలర్ ఎక్కాడు. డ్రైవర్ అమ్మాయని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. తర్వాత మౌతుషితో మాట్లాడి ఆమె గురించి తెలుసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ పోస్టు చూసిన వారంతా ‘సిస్టర్ నువ్వు ఎంతోమందికి ప్రేరణ’ అని అభినందిస్తున్నారు. అంతేగాక రణవీర్‌ని కూడా తెగపొగిడేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇతని పోస్టు వేలసంఖ్యలో లైక్‌లతో తెగ వైరల్ అవుతోంది. కుటుంబం కోసం తన శాయశక్తులా కృషిచేస్తోన్న మౌతుషి ఎంతోమంది యువతరానికి ప్రేరణగా నిలుస్తోంది. -
ఉబర్‌లో మరో 500 నియామకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రయాణ సేవలు అందిస్తున్న ఉబర్ టెక్నాలజీస్ ఈ ఏడాది డిసెంబర్ నాటికి కొత్తగా 500 మంది సాంకేతిక నిపుణులను నియమించుకోనుంది. హైదరాబాద్, బెంగళూరులోని సంస్థ కార్యాలయాల్లో ఇప్పటికే 1,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 2021లో 250 మందిని చేర్చుకున్నట్టు కంపెనీ ప్రకటించింది. భారత్ పట్ల సంస్థ నిబద్ధతను, దేశంలోని ఇంజనీరింగ్ ప్రతిభను గుర్తించడాన్ని ఈ నియామక ప్రణాళిక నొక్కి చెబుతుందని ఉబర్ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: క్యాబ్ అగ్రిగేటర్లపై కేంద్రం సీరియస్ -
క్యాబ్ అగ్రిగేటర్లపై కేంద్రం సీరియస్
న్యూఢిల్లీ: ఓలా, ఉబెర్ తదితర ట్యాక్సీ సర్వీసుల సంస్థలపై (క్యాబ్ అగ్రిగేటర్స్) ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ అంశంపై సీరియస్‌గా దృష్టి సారించింది. ఆయా సంస్థల ప్రతినిధులతో మంగళవారం సమావేశమైంది. సిస్టమ్‌లను సత్వరం మెరుగుపర్చుకోవాలని, వినియోగదారుల ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలని ఆదేశించింది. తమ విధానాలు మార్చుకోకపోతే కఠిన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరించింది. ‘వారి ప్లాట్‌ఫామ్‌లపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయన్న సంగతి వారికి చెప్పాం. గణాంకాలు కూడా చూపించాము. సిస్టమ్‌లను సరిచేసుకోవాలని, ఫిర్యాదులను పరిష్కరించాలని సూచించాము. లేకపోతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశాము‘ అని సమావేశం అనంతరం వినియోగదారుల వ్యవహారాల విభాగం కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. క్యాబ్ అగ్రిగేటర్స్‌పై తీవ్ర అసంతృప్తి నెలకొందని ఆయన చెప్పారు. ట్యాక్సీ సేవల సంస్థలు సత్వరం పరిష్కార మార్గాలతో ముందుకు రావాలని సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) చీఫ్ కమిషనర్ నిధి ఖరే పేర్కొన్నారు. వినియోగదారుల హక్కులకు భంగం కలిగేలా క్యాబ్ అగ్రిగేటర్లు అనుచిత వ్యాపార విధానాలు పాటించకుండా త్వరలోనే ఆదేశాలు జారీ చేయనున్నట్లు వివరించారు. తప్పుడు విధానాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదంటూ ప్రభుత్వం ఇప్పటికే వారికి స్పష్టం చేసినట్లు ఖరే పేర్కొన్నారు. మరోవైపు, సమావేశంలో లేవనెత్తిన సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా చర్యలు తీసుకుంటామని క్యాబ్ అగ్రిగేటర్లు పేర్కొన్నారు. క్యాన్సిలేషన్ చార్జీల విషయానికొస్తే, ఆర్డరు రద్దవడం వల్ల డ్రైవరు నష్టపోకుండా పరిహారం చెల్లించేందుకే సదరు చార్జీలు విధిస్తున్నట్లు తెలిపారు. ఓలా, ఉబెర్, మేరు, రాపిడో, జుగ్ను ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. వివాదాస్పద అంశాల పరిష్కారంపై వినియోగదారుల వ్యవహారాల విభాగంతో కలిసి పని చేస్తున్నామని ఉబెర్ ఇండియా సెంట్రల్ ఆపరేషన్స్ విభాగం హెడ్ నితీష్ భూషణ్ తెలిపారు. ఫిర్యాదులు ఇలా..: చార్జీలు, ట్రిప్‌ల రద్దు విషయాల్లో క్యాబ్ అగ్రిగేటర్లపై భారీగా ఫిర్యాదులు ఉంటున్నాయి. వివిధ కారణాల వల్ల ట్రిప్‌లను అంగీకరించడానికి ఇష్టపడని డ్రైవర్లు వాటిని రద్దు చేసుకోవాలంటూ వినియోగదారులపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే, ట్రిప్ క్యాన్సిల్ చేస్తే అగ్రిగేటర్ సంస్థ పెనాల్టీలు విధిస్తోంది. అలాగే, అసలు ఏ ప్రాతిపదికన ప్రయాణ చార్జీలను నిర్ణయిస్తున్నారన్న అంశంపై పారదర్శకత లోపించింది. ఈ నేపథ్యంలో క్యాబ్ అగ్రిగేటర్లు అనుసరిస్తున్న అల్గోరిథమ్‌లు, ఇతరత్రా విధానాలను కూడా తెలుసుకోవాలని భావిస్తున్నట్లు ఖరే పేర్కొన్నారు. ట్రావెల్, ఫుడ్ అగ్రిగేటర్లపై ఎఫ్హెచ్ఆర్ఏఐ ఫిర్యాదు.. ఆన్లైన్ ట్రావెల్ (ఓటీఏ), ఫుడ్ అగ్రిగేటర్లు (ఎఫ్ఎస్ఏ) పోటీని దెబ్బతీసే విధంగా అనుచిత వ్యాపార విధానాలు అమలు చేస్తున్నాయంటూ ఆతిథ్య రంగ సంస్థల సమాఖ్య ఎఫ్హెచ్ఆర్ఏఐ తాజాగా ఆర్థిక అంశాలపై పార్లమెంటరీ స్థాయీ సంఘం కమిటీ చైర్మన్ జయంత్ సిన్హాకు లేఖ రాసింది. కొన్ని ఓటీఏ, ఎఫ్‌ఎస్‌ఏలు విధ్వంసం సృష్టిస్తున్నాయని ఫిర్యాదు చేశాయి. ఫిర్యాదుల పరిష్కారానికి ఆయా సంస్థల్లో ఎలాంటి వ్యవస్థా లేకపోవడంతో వినియోగదారులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఎఫ్హెచ్ఆర్ఏఐ వైస్ ప్రెసిడెంట్ గుర్బక్షీష్ సింగ్ కోహ్లి పేర్కొన్నారు. ఓటీఏలు, ఎఫ్‌ఎస్‌ఏలు.. కస్టమర్లకు సర్వీసులు అందించడంలో విఫలమవుతుండటం వల్ల ఇటు కస్టమర్లు అటు సర్వీస్ ప్రొవైడర్లు సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తోందని వివరించారు. పైగా తమకు సంబంధం లేని చార్జీలను వివిధ పేర్లు, సాకులతో రెట్టింపు స్థాయిలో విధిస్తున్నాయన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లే వీటిని విధిస్తున్నాయనే భావనలో కస్టమర్లు ఉంటున్నారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఓటీఏ, ఎఫ్‌ఎస్‌ఏల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు. -
క్యాబ్స్‌లో ప్రయాణించే వారికి గట్టిషాకిచ్చిన ఉబర్ !
ప్రముఖ మొబిలిటీ ప్లాట్‌ఫాం ఉబర్ తాజాగా క్యాబ్ సర్వీసుల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఛార్జీలను పెంచుతున్నట్లు ఉబర్ ప్రకటించింది. సీఎన్జీ ధరల పెంపు..! దేశ రాజధాని ఢిల్లీలో సీఎన్జీ క్యాబ్ సర్వీసులు అధిక సంఖ్యలో నడుస్తాయి. రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో నేచురల్ గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ప్రయాణ ఛార్జీలను 12 శాతం మేర పెంచుతున్నట్లు ఉబర్ ఒక ప్రకటనలో తెలిపింది.కొద్ది రోజల క్రితమే ముంబై, హైదరాబాద్‌లో క్యాబ్ సర్వీసుల ధరలను 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఆయా నగరాల్లోని క్యాబ్ డ్రైవర్లు ధరలను పెంచాలని నిరసనలు కూడా చేపట్టారు. ఇక రానున్న రోజుల్లో బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో ఆయా క్యాబ్ సంస్థలు ధరలను పెంచే అవకాశం ఉంది. ఇలాగే ఇంధన ధరలు పెరిగితే క్యాబ్ సర్వీసుల ధరలు పెంపు అనివార్యమని తెలుస్తోంది. ఏసీ ఆన్ చేస్తే వాతే..! ఇంధన ధరల పెంపుతో క్యాబ్ డ్రైవర్లు భారీగా ప్రభావితమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో క్యాబ్స్‌లో ప్రయాణికులు ఏసీని ఆన్ చేయమని కోరితే దానికి అదనంగా వసూలు చేస్తామని డ్రైవర్లు నిర్ణయించుకున్నారు. కాగా ఈ నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది. వాహనాల్లో ఎసీను స్విచ్ ఆన్ చేయాలంటే అదనంగా చెల్లించాలనే బోర్డులను ఆయా క్యాబ్ సంస్థల డ్రైవర్లు ఏర్పాటు చేశారు. ఏసీలను ఆన్ చేసినందుకుగాను రూ. 50 నుంచి రూ. 100 మేర అదనపు ఛార్జీలను వసూలు చేస్తామనే స్టికర్స్‌ను క్యాబ్ సంస్థల డ్రైవర్లు కారులో ఏర్పరిచారు. చదవండి: క్యాబ్స్‌లో ఏసీ ఆన్ చేస్తే వాతే..! డ్రైవర్ల నిర్ణయం..! -
క్యాబ్ డ్రైవర్‌గా మారిన దిగ్గజ కంపెనీ సీఈఓ.. ఎందుకో తెలుసా?
ఇప్పుడిప్పుడే వర్క్ ఫ్రం ఆఫీస్ హడావుడి మొదలవుతుంది. రెండేళ్ల తర్వాత మళ్లీ ఉరుకుల పరుగుల జీవితం తిరిగొచ్చింది. క్యాబ్ దొరుకుతుందా? లేదా? దొరికితే సమయానికి ఆఫీసుకు వెళతామా? అన్న సందేహాలతో గుండెల్లో అలజడి మళ్లీ మొదలయ్యింది. ఈ పరిస్థితుల్లో.. క్యాబ్ ఎక్కిన తర్వాత.. డ్రైవర్ ఓ దిగ్గజ కంపెనీకి సీఈఓ అని తెలిస్తే?వెంటనే మీరు ఏమి ఆలోచిస్తారు. ఈ కథనం చదువుతున్నవారు మొదట అలాంటి సంఘటనలు చోటు చేసుకోవాలి కదా అని ఆలోచిస్తారు. కానీ, ఇటీవల అనుభవమే న్యూఢిల్లీ ప్రజలకు ఎదురైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉబెర్ ఇండియా, దక్షిణాసియా సీఈఓ ప్రభజీత్ సింగ్ సంస్థ చేపట్టిన ఓ పరిశోధనలో భాగంగా ఇటీవలే కొన్ని గంటల పాటు డ్రైవర్ అవతారం ఎత్తారు. సాధారణ క్యాబ్ డ్రైవర్ లాగానే ఢిల్లీ వీధుల్లో ప్రయాణికులను ఎక్కించుకున్నారు. వారితో కొంతసేపు ముచ్చటించి గమ్యస్థానాలకు చేర్చారు. ఈ విషయాలను క్యాబ్‌లో ఎక్కిన ప్రయాణికులు తమ సామాజిక మాధ్యమాల్లో వెల్లిడించారు. అనన్యా ద్వివేదీ(లింక్డిన్ యూజర్) ఈ విషయంపై తన అనుభవాలను పంచుకుంది. "చాలా రోజుల తర్వాత వర్క్ ఫ్రం ఆఫీస్ కోసం బయటకొచ్చి నేను క్యాబ్ బుక్ చేశాను. డ్రైవర్ ఎవరో తెలుసా? ఉబెర్ ఇండియా బాస్.. ప్రభజీత్ సింగ్! ఓ రీసెర్చ్'లో భాగంగాడ్రైవర్గా మారారంటా. తొలుత నాకు ఏదో సదేహంగా అనిపించి ఆయన గురించి గూగుల్ చేశాను. ఫొటోలు చూసిన తర్వాతే నేను నమ్మాను. ఇది నిజమే!. సమస్యలను అర్థం చేసుకునేందుకు.. ఇలా డ్రైవర్ అవతారం ఎత్తడమనేది చాలా గొప్ప విషయం" అని ఆమె రాసుకొచ్చింది. మరో లింక్డిన్ యూజర్ సౌరభ్ కుమార్ వర్మ కూడా ఉబెర్ ఇండియా సీఈఓపై ప్రశంసలు కురిపించారు. ప్రభజీత్ సింగ్ ఉబెర్ సంస్థ సేవలను మరింత మెరుగుపరించేందుకు పరిశోధనలో భాగంగా డ్రైవర్ అవతారం ఎత్తారు. "ఓ పెద్ద కంపెనీకి సీఈఓ మన క్యాబ్ డ్రైవర్‌గా మారితే మనకు ఎంతో విలువనిస్తున్నట్టే కదా! మనం మరింత భద్రంగా ఉన్నట్టే కదా. ప్రయాణికులను మరింతగా అర్థంచేసుకునేందుకు ప్రభజీత్ సింగ్ ప్రయత్నిస్తున్నారు. అందుకే వారితో మాట్లాడుతున్నారు. వారిని పిక్ చేసుకుని, కావాల్సిన చోట దింపుతున్నారు. కుడోస్" అని అన్నారు. ఇలా చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఈ అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. (చదవండి: Gold Demand: తగ్గేదే లే.. భారత్‌లో పసిడికి తగ్గని డిమాండ్..!) -
హైదరాబాద్‌లో ఓలా, ఉబెర్.. ఇకపై ఆ ఆటోలకు ఎంట్రీ లేదు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌లో నమోదైన ఆటో రిక్షాలను మాత్రమే ఓలా, ఉబెర్‌లలో అనుమతించనున్నట్లు ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. బయటి ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ అయిన ఆటోలు నగరంలో తిరగడానికి అనుమతించబోమన్నారు. ఇతర ప్రాంతాల్లో నమోదైన ఆటోరిక్షాలు ఓలా, ఉబెర్ సంస్థలతో అనుసంధానమై నగరంలో విచ్చలవిడిగా తిరుగుతున్నాయని, దీంతో తమ ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయంటూ ఆటో కార్మిక సంఘాలు చేసిన విజ్ఞప్తి మేరకు నగర ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శనివారం ఓలా, ఉబెర్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు రవాణాశాఖలో టీఎస్ 09 నుంచి టీఎస్ 13 వరకు గ్రేటర్ పరిధిలో నమోదైన ఆటోలను మాత్రమే నడపాలని అధికారులు సూచించారు. ఈ సిరీస్ ఆటోలు మినహాయించి మిగతా సిరీస్‌లో కనిపించే ఆటోలకు అనుమతి ఉండబోదని చెప్పారు. అలాంటి ఆటోలపై జరిమానాలు విధించనున్నట్లు చెప్పారు. మరోవైపు ప్రైవేట్ ద్విచక్ర వాహనాలను కూడా ఓలా, ఉబెర్‌లకు అనుసంధానమై నడిపేందుకు అనుమతించడంపై అధికారులు అభ్యంతరం తెలిపారు. ఏ నిబంధనల మేరకు వాటిని అనుమతించారో స్పష్టం చేయాలని ఆయా సంస్థల ప్రతినిధులను కోరారు. ఇలాంటి ప్రైవేట్ ద్విచక్ర వాహనాలపైన సమగ్రమైన అధ్యయనం చేసి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. మరోవైపు వాహనాల వేగ నియంత్రణపైనా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఆర్టీఏ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఆర్అండ్బీ అధికారులు పాల్గొన్నారు. -
ఉబర్ రైడ్ చేసే కస్టమర్లకు గుడ్ న్యూస్..!
ప్రముఖ మొబిలిటీ ప్లాట్ ఫామ్ ఉబర్ కస్టమర్స్ కోసం సరికొత్త ఫీచర్లతో ముందుకు వచ్చింది. దీంతో కస్టమర్లు తమ రేటింగ్స్ ను తెలుసుకునే అవకాశం కలగనుంది. కొత్త అప్డేట్... సాధారణంగా ఉబర్ లో ఆయా కస్టమర్ ప్రయానించినప్పుడు సదరు ట్రిప్ పై డ్రైవర్ కు రేటింగ్ ఇస్తూ ఉంటారు. ఐతే సదరు డ్రైవర్ కూడా రైడ్ పూర్తిచేసిన వారికి కూడా రేటింగ్ ఇస్తారు. ఇది ఆయా కస్టమర్స్ కు కనిపించదు. కాగా ఉబర్ ఇప్పుడు తాజాగా తెచ్చిన ఫీచర్ తో ఇకపై సదరు డ్రైవర్ కస్టమర్ కు ఇచ్చిన రేటింగ్ కనిపించనుంది. రైడర్లు తమ డ్రైవర్ల నుంచి ఎన్ని ఫైవ్-స్టార్ రేటింగ్‌లు లేదా వన్-స్టార్ రేటింగ్‌లు అందుకున్నారో ఇప్పుడు చూడగలుగుతారని ఉబర్ బుధవారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తోంది. అటు డ్రైవర్లకు కస్టమర్స్ కు... డ్రైవర్లకు, కస్టమర్లకు దృష్టిలో వుంచుకుని ఉబర్ ఈ ఫీచర్ ను తెచ్చింది. డ్రైవర్ల నుంచి సదరు రైడర్ వారు అందుకున్నా రేటింగ్ గల కారణాన్ని కూడా చూడవచ్చు. కాగా ఉబర్‌లో ప్రయాణించేటప్పుడు సదరు వాహనాన్ని శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత కస్టమర్ది. ఉబర్ రైడర్లు, డ్రైవర్లు ఒకరికొకరు అభిప్రాయాన్ని తెలియజేసుకోవడానికి సంవత్సరాలుగా కొత్త మార్గాలపై కంపెనీ పని చేస్తోంది. ఇక 2017లో డ్రైవర్ ప్రవర్తనపై ఫీడ్‌బ్యాక్‌ను అందించే వీలును ఉబర్ కస్టమర్లకు అందించింది. -
ఈ యాప్స్ వాడుతున్నారా.. అయితే, మీ మొత్తం డేటా కంపెనీల చేతుల్లోకి!
ఇప్పుడు మనం చెప్పుకోబోయే యాప్స్ తెగ వాడేస్తున్నారా? అయితే, మీకు సంబంధించిన విస్తృతమైన సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఉబెర్, ఓలా, రాపిడో వంటి రైడ్-హైలింగ్ యాప్స్ వారి వినియోగదారులకు సంబంధించిన విస్తృతమైన సమాచారాన్ని సేకరిస్తున్నాయి. సైబర్ సెక్యూరిటీ కంపెనీ సర్ఫ్ షార్క్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. ఈ డేటాను "తృతీయపక్ష ప్రకటనల" కోసం ఉపయోగిస్తున్నారు. సర్ఫ్ షార్క్ డేటా సెన్సిటివిటీ ఇండెక్స్ అనేది రైడ్-హైలింగ్ యాప్స్ అనేవి వారి వినియోగదారుల నుంచి ఏ రకమైన డేటా సేకరిస్తున్నాయో తెలియజేస్తుంది. గ్రాబ్ టాక్సీ, యాండెక్స్ గో, ఉబెర్ కంపెనీల యాప్స్ ప్రపంచంలో అత్యంత ఎక్కువ డేటా సేకరిస్తున్న టాక్సీ యాప్స్'గా నిలిచాయి. వినియోగదారుల నుంచి డేటా సేకరిస్తున్న పరంగా స్వదేశీ రైడ్-షేరింగ్ యాప్ ఓలా 6వ స్థానంలో నిలిచింది. బెంగళూరుకు చెందిన రాపిడో ప్రముఖ గ్రాబ్ టాక్సీ యాప్ కంటే దాదాపు పది రెట్లు తక్కువ డేటాను సేకరిస్తుంది. వినియోగదారులకు సేవలను అందించడానికి యూజర్ పేరు, ఫోన్ నంబర్, స్థానాన్ని మాత్రమే సేకరిస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. 3 అంశాల ఆధారంగా ఈ డేటా సేకరిస్తున్నట్లు సర్ఫ్ షార్క్ తెలిపింది. గ్రాబ్ టాక్సీ కాంటాక్ట్, ఫైనాన్షియల్, లొకేషన్ సమాచారం, యూజర్ కంటెంట్ వంటి వివరాలు కూడా సేకరస్తున్నట్లు ఇందులో తేలింది. ఉబెర్, లిఫ్ట్ కలిసి 7వ స్థానంలో నిలిచాయి. జాతి, జాతి, లైంగిక దృక్పథం, గర్భధారణ, ప్రసవ సమాచారం, బయోమెట్రిక్ డేటా వంటి సున్నితమైన సమాచారాన్ని సేకరించే ఏకైక రైడ్-హైలింగ్ యాప్ గా లిఫ్ట్ నిలిచింది. (చదవండి: ప్రపంచంలో మరో వింత.. అంతరిక్షంలో ఫిల్మ్ స్టూడియో) -
కొత్త సంవత్సరంలో జీఎస్టీ మోత, వేటి మీద ఎంతంటే..
న్యూయర్ ప్రారంభం నుంచి కస్టమర్లకు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ షాకిచ్చాయి. నేటి నుంచి (జనవరి1) నుంచి ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టే ప్రతి కస్టమర్ నుంచి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ 5శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నాయి. దీంతో ఫుడ్ ఆర్డర్ పెట్టే కస్టమర్లకు ఫుడ్ డెలివరీ యాప్స్ విధిస్తున్న జీఎస్టీ మరింత భారం కానుంది. గతంలో ఆన్లైన్లో ఆర్డర్ చేసేటప్పుడు రెస్టారెంట్లు 5 శాతం చొప్పున జీఎస్టీని వసూలు చేసేవి. స్విగ్గీ, జొమాటో కేవలం తమ సేవలకు వినియోగదారుల నుంచి కొంత మొత్తం వసూలు చేసేవి. ఈ విధానం వల్ల కొన్ని గుర్తింపు లేని రెస్టారెంట్ల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ నేపథ్యలో జీఎస్టీ చెల్లించాల్సిన బాధ్యతను ఈ ఫుడ్ డెలివరీ యాప్‌లకే అప్పజెప్పాలని, డెలివరీలపై 5 శాతం జీఎస్టీని విధించాలని జీఎస్టీ కౌన్సిల్లో నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఓలా,ఊబర్ వంటి రైడ్ షేరింగ్ సర్వీసుల్లో సైతం జీఎస్టీని విధించాయి. జనవరి 1నుంచి బైక్, ఆటో బుక్ చేసుకున్న ప్రయాణికులు ప్రతి రైడ్ పై అదనంగా మరో 5శాతం జీఎస్టీని కట్టాల్సి ఉంటుంది. అయితే ఈ జీఎస్టీ సాధారణంగా నడిచే షేర్, ఇతర ఆటోలు కాకుండా కేవలం రైడ్ షేరింగ్ కంపెనీలైన ఓలా, ఊబర్ సంస్థల సేవలందించే ఆటోల్లో ప్రయాణించే వారికి జీఎస్టీ వర్తిస్తుందని తెలిపింది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం ఈ నెల 18నే ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. ఈ కొత్త జీఎస్టీ నిబంధనలు జనవరి అమల్లోకి వచ్చాయి. కాగా, ఇప్పటి వరకు ఈ కామర్స్ ఆటో రిక్షా బుకింగ్ పై జీఎస్టీ మినహాయింపు ఉండేది. దాన్ని ఇప్పుడు కేంద్రం ఉప సంహరించుకుంది. ఇక వీటితో పాటు ధరలతో సంబంధం లేకుండా ఫుట్ వేర్ పై నేటి నుండి 12 శాతం జీఎస్టీని కట్టాల్సి ఉంటుంది. చదవండి: కోల్గేట్ పేస్ట్ ఎగబడి కొంటున్నారు! ఎందుకంటే.. -
ఓలా, ఉబెర్.. మరీ ఇంత వరెస్టా?
Ola And Uber Down In Fairwork India Rankings 2021: దేశంలోనే యాప్ యూజర్లకు ప్రయాణ సౌకర్యాలు అందించే అతిపెద్ద ప్లాట్‌ఫామ్‌లుగా ఓలా, ఉబెర్‌లకు పేరుంది. అయితే చాలాసార్లు యూజర్లను ఇవి ముప్పుతిప్పలు పెడుతున్నాయనే ఫిర్యాదులు అందుతుంటాయి. అయితే ఇప్పుడు ఉద్యోగుల వెర్షన్లోనూ ఈ రెండింటికి ఎదురుదెబ్బ తగిలింది. ఫెయిర్‌వర్క్2021 ర్యాంకింగ్స్‌లో ఈ రెండు స్టార్టప్‌ల రేంజ్ సున్నాకి పడిపోయింది. కిందటి ఏడాది ఫెయిర్‌వర్క్2021లో ఓలాకు రెండు, ఉబెర్‌కు ఒక పాయింట్ రేటింగ్ దక్కింది. ఈ ఏడాది ఏకంగా ఈ రెండూ జీరోకి చేరుకోవడం విశేషం. గిగ్ ఎంప్లాయిస్ పట్ల ఈ కంపెనీలు వ్యవహరిస్తున్న తీరుకు నిదర్శనమే ఈ రేటింగ్. అందుకే ఈ ఎదురుదెబ్బ తగిలింది. చాలామంది కంపెనీలు తమకు అందిస్తున్న కమిషన్, బెనిఫిట్స్, ఇతర సౌకర్యాలపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు ఫెయిర్‌వర్క్ నివేదిక వెల్లడించింది. కొన్నిచోట్ల కనీసం వాళ్లను మనుషుల్లా చూడట్లేదన్న ఫీడ్‌బ్యాక్ ఎదురైందని తెలిపింది. ఇక ఈ లిస్ట్‌లో ఫ్లిప్‌కార్ట్ ఏడు పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. కిందటి ఏడాది 8 పాయింట్లతో టాప్‌లో నిలిచిన అర్బన్ కంపెనీ.. ఉద్యోగులకు(భాగస్వాములతో) నష్టం చేకూర్చే నిర్ణయం, వాళ్లను రోడ్డుకు ఎక్కించడం, నోటీసులు పంపడం లాంటి చేష్టలతో 5 పాయింట్లతో రెండో స్థానానికి దిగజారింది. ఇక స్విగ్గీ(కిందటి ఏడాది 1) ఈ వియంలో 3 పాయింట్లు మెరుగుపడి ఏకంగా 4 పాయింట్లు దక్కించుకుంది. జొమాటో(కిందటి ఏడాది 1) రెండు పాయింట్లు మెరుగుపర్చుకుని 3 పాయింట్ల రేటింగ్ దక్కించుకుంది. ఫ్లిప్‌కార్ట్, ఉబెర్, ఒలా, జొమాటో, స్విగ్గీ.. ఇలాంటి డిజిటల్-స్టార్టప్ బేస్డ్ కంపెనీల్లో పని చేసే వాళ్లను గిగ్ వర్కర్స్‌గా గుర్తిస్తారు. వీళ్లలో కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఉండొచ్చు. వీళ్లకు ఆయా కంపెనీలు ఎలా పట్టించుకుంటున్నాయే స్కేలింగ్ ఆధారంగా లేబర్ స్టాండర్డ్స్ ఆధారిత వెబ్సైట్ ఫెయిర్ డాట్ వర్క్ ప్రతీ సంవత్సరం రేటింగ్ ఇస్తుంటుంది. ఈ స్కేలింగ్ పదిపాయింట్లకు ఉంటుంది. ఈ లిస్ట్‌లో డెలివరీ యాప్ కంపెనీ డుంజో కిందకి దిగజారగా.. అమెజాన్ 2 పాయింట్ల నుంచి 1 పాయింట్‌కు దిగజారింది. అందుతున్న జీతాలు.. ఇతర బెనిఫిట్స్, పని పరిస్థితులు, కాంట్రాక్ట్‌లు, మేనేజ్మెంట్ తీరు, ప్రాతినిధ్యాలు, ఇతర సౌకర్యాలు.. వీటి ఆధారంగా ఈ స్కేలింగ్‌ను నిర్వహిస్తారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా గిగ్ ఉద్యోగులు 50 లక్షల మందికి పైనే ఉన్నట్లు ఒక అంచనా. ఆయా కంపెనీల నుంచి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ కలిగించాలంటూ గిగ్ ఎంప్లాయిస్ యూనియన్లు తరచూ కోర్టు మెట్లు ఎక్కుతున్నా.. ఫలితం లేకుండా పోతోంది. చదవండి: మీరు పార్ట్నర్స్.. మీరే లొల్లి చేయడమేంది? -
జనవరి 1 నుంచి ఆటో ఎక్కితే మోత మోగాల్సిందే..!
కొత్త ఏడాదిలో కేంద్రం ప్రయాణికులకు మరో షాక్ ఇచ్చేందుకు సిద్దం అవుతుంది. ఓలా..ఉబర్ వంటి యాప్ అగ్రిగేటర్ల ద్వారా బుక్ చేసుకునే ఆటో రిక్షా రైడ్లు కూడా కొత్త సంవత్సరంలో మరింత ఖరీదైనవిగా మారనున్నాయి. జనవరి 1 నుంచి ఆన్లైన్లో బుక్ చేసుకునే ఆటో రైడ్లపై 5% జీఎస్టీని విధించనున్నట్లు గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ కామర్స్ ఆటో రిక్షా బుకింగ్ పై జీఎస్టీ మినహాయింపు ఉండేది. దాన్ని ఇప్పుడు కేంద్రం ఉప సంహరించుకుంది. వీధులలో తిరిగే ఆటో రైడ్ల మీద ఎలాంటి జీఎస్టీ విధించరు. యాప్ ఆధారిత అగ్రిగేటర్లు ఉబర్, ఓలా, రాపిడో వంటివి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరుతూ ప్రకటనలు విడుదల చేశారు. ఈ విషయం మీద తెలంగాణ ఆటో డ్రైవర్ల సంక్షేమ ప్రధాన కార్యదర్శి ఏ.సత్తిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆటో డ్రైవర్లకు వచ్చే బుకింగ్ రైడ్లు తగ్గుతాయని అన్నారు. ఇప్పటికే, ఈ మహమ్మారి వల్ల ఆటోరిక్షాలు మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం విధించే ఆంక్షల వల్ల ఆటోలో ప్రయాణీకుల సంఖ్య తగ్గినట్లు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ఆటో డ్రైవర్ల, ప్రయాణీకుల సమస్యలు మరింత పెరగనున్నట్లు వివరించారు. (చదవండి: ఆన్లైన్లో ప్రెషర్ కుక్కర్ కొంటున్నారా?.. అయితే, జర జాగ్రత్త!) -
అంతరిక్షానికీ ఫుడ్ డెలివరీ..
ఇంతకుముందు ఆకలైతే వంటగదిలోకి వెళ్లి ఏదో ఒకటి వండుకోవడమో.. లేక వండినది రెడీగా ఉంటే అది తినడమో చేసేవాళ్లం. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆకలైతే మొబైల్ ఫోన్ తీసుకొని నచ్చిన ఫుడ్‌ను ఆర్డర్ చేస్తాం. 30 నిమిషాల్లో వేడివేడి ఆహారం మన ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ రోజుల్లో నగరంలోనైనా.. మారుమూల ప్రాంతమైనా ఇలా ఫుడ్ డెలివరీ అవుతోంది. ఈ టెక్ యుగంలో ఇలాంటిది రోజూ మనకు అనుభవమే. అయితే, భూమ్మీదనే కాదు అంతరిక్షానికీ ఫుడ్ డెలివరీ అవుతోంది. నమ్మలేకపోతున్నారా? అయితే ఎలాగో తెలుసుకుందాం..! భూమ్మీదనే డెలివరీ చేయాలా? అంతరిక్షానికి డెలివరీ చేయకూడదా అని జపాన్‌లోని ఉబర్ ఈట్స్ కంపెనీ ఆలోచన చేసింది. అనుకున్నదే తడవు గా ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉండే వ్యోమగాములకు మొదటిసారి ఫుడ్ డెలివరీ చేసింది. అయితే, దీనికోసం సాధారణ డెలివరీ బాయ్ వెళ్లలేదు. ఏకంగా జపాన్ వ్యాపార దిగ్గజం, బిలియనీర్ యుసాకు మేజవాను కంపెనీ రంగంలోకి దింపింది. ఆయన టీషర్ట్, టోపీ ధరించి డెలివరీ బాయ్ వేషంలో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. వ్యోమగాములు ఆర్డర్ ఇచ్చిన ఫుడ్‌ను సురక్షితంగా తీసుకెళ్లారు. గోధుమ రంగులో ప్యాక్ చేసిన ఆహారాన్ని ఐఎస్ఎస్ కమాండర్ ఆంటోన్ స్కప్లెరోవ్ చేతికందించారు. అంతరిక్షంలోకి కూడా ఆహారాన్ని డెలివరీ చేసినందుకు అందరూ ఆశ్చర్యపోయారు. ♦మేజవా స్కప్లెరోవ్ జపాన్ వంటకాలతో సోయుజ్ స్పేస్‌క్రాఫ్ట్‌లో భూమి నుంచి అంతరిక్షానికి ఎగిరారు. 8 గంటల 34 నిమిషాలపాటు 248 మైళ్ల దూరం ప్రయాణించి ఐఎస్ఎస్ చేరుకున్నారు. అయితే, డెలివరీకి 30 నిమిషాలు ఆలస్యమైంది అని అన్నారాయన. ఇంతకీ ఆయన తీసుకెళ్లిన పార్సిల్లో ఏమున్నాయంటే.. చికెన్, బాంబూ షూట్స్, జపనీస్ బీఫ్ బౌల్, సబా మిసోని, ఇతర జపాన్ వంటకాలు. మేజవా 12 రోజులపాటు ఐఎస్ఎస్లో గడిపారు. ఫుడ్ డెలివరీ చేశారు కదా ఆయనకు అక్కడేం పని అనుకుంటున్నారా? ఆయనకు అంతరిక్ష యాత్ర చేయడమంటే మహా సరదాలెండి. తనకు మొదటి ఫుడ్ డెలివరీ బాధ్యతను అప్పగించినందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఆయన సోమవారం అంతరిక్షం నుంచి భూమ్మీదకు సురక్షితంగా చేరారు. –సాక్షి, సెంట్రల్ డెస్క్ -
కోట్లకు అధిపతి.. కానీ డెలివరీ బాయ్‌గా మారాడు
గతంలో తినాలంటే ఇంట్లో చేసిన ఫుడ్ లేదా బయట హాటల్‌కి వెళ్లి కడుపునిండా ఆరగించేవాళ్లం. టెక్నాలజీ పుణ్యమా అని పుడ్ కూడా డెలివరీ యాప్స్ ద్వారా మన గడప వద్దకే వస్తోంది. ఇంకేముంది కదలకుండానే నచ్చిన ఆహారాన్ని లాగించేస్తున్నాం. ఇదంతా నిత్య జీవితంలో భాగమైపోయింది. అయితే ఇటీవల జరిగిన ఓ ఘటన చాలా అరుదు అని చెప్పాలి. ఎందుకంటే పుడ్ డెలివరీ అంటే 10 లేదా 20 కిలోమీటర్లు డెలివరీ చేస్తారు. కానీ ఓ వ్యక్తి ఏకంగా 400 కిలోమీటర్ల దూరంలోని వ్యక్తికి డెలివరీ చేశాడు. అది డెలివరీ చేసిన బాయ్ కూడా మామూలు వ్యక్తి కాదు.. ఆయనో బిలినియర్ అవ్వడం విశేషం. ఇలా చేయడం అసాధ్యమే కానీ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ఉబర్ పుడ్ డెలివరీ సంస్థ. వివరాల ప్రకారం.. అంతరిక్ష కేంద్రంలో ఉంటున్న ఓ వ్యోమగామికి ఉబెర్ ఈట్స్ ఫుడ్‌ను డెలివరి చేసింది. ఆ డెలివరీ ఇచ్చింది జపాన్‌కి చెందిన బిలినియర్ మెజ్వానా. డిసెంబర్ 11న ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకోసం ఆయన దాదాపు 12 రోజులపాటు అంతరిక్ష కేంద్రంలోని కక్ష్యలో ప్రయాణం చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Uber Eats のデリバリーは、進化し続けています。 今、配達していない場所へ、次々と。@yousuck2020 さん、配達ありがとうございます🚀#宇宙へデリバリー #UberEats pic.twitter.com/Sh0PsXXwMX — Uber Eats Japan(ウーバーイーツ) (@UberEats_JP) December 14, 2021 -
ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ఫ్లైయింగ్ కార్లు వచ్చేస్తున్నాయ్!
హ్యుందాయ్ మోటార్స్, ఉబర్ సంయుక్తంగా ఫ్లైయింగ్ కార్ల తయారీపై దృష్టిసారించాయి. వీరి భాగస్వామ్యంతో ఫ్లైయింగ్ కార్ల ఉత్పత్తి మరింత వేగం పుంజుకోనుంది. 2025లోపు ఎయిర్ టాక్సీలను మొదలు పెట్టాలని ఇరు కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేశాయి. ఫైయింగ్ కార్లలో భాగంగా హ్యుందాయ్ ఎస్-ఏ1 ఎయిర్ టాక్సీలను సీఈఎస్-2020 కాన్ఫరెన్స్‌లో ఇప్పటికే రిలీజ్ చేసింది. కాగా, ఈ ఫ్లైయింగ్ కార్లు హైబ్రిడ్ ఇంజన్ కాన్సెప్ట్‌తో పనిచేయనున్నాయి. ఫ్లైయింగ్ కార్ల రాకతో ట్రాఫిక్ జామ్స్‌కు చెక్‌పెట్టవచ్చునని ఇరు కంపెనీలు భావిస్తున్నాయి. 2028 నాటికి తన మొదటి వాణిజ్య విమానాన్ని మార్కెట్లోకి లాంచ్ చేయలని లక్ష్యంగా చేసుకుంది. హ్యుందాయ్ యూరోపియన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మైఖేల్ కోల్ ఈ దశాబ్దం చివరినాటికి ఎగిరే కార్లు వాస్తవ రూపం దాల్చుతాయి అని తాను నమ్ముతున్నానని గతంలో తెలియజేశారు. "ఇవి భవిష్యత్తులో మన జీవితంలో భాగం కానున్నట్లు మేము నమ్ముతున్నాము" అని అతను చెప్పారు. హ్యుందాయ్ ఇప్పటికే ఎస్-ఎ1 కాన్సెప్ట్ అభివృద్ధిపై పనిచేయడానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇది గంటకు 300 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్లే విధంగా రూపొందిస్తున్నారు. అలాగే, 600 మీటర్ల వరకు వెళ్లగలదు. ఫ్లైయింగ్ కార్లపై ఇప్పటికే ప్రముఖ స్టార్టప్ కంపెనీలతోపాటు, దిగ్గజ ఆటోమోబైల్ కంపెనీలు టయోటా మోటార్, డైమ్లెర్ ఏజీ, చైనాకు చెందిన గీలీ మోటార్ కంపెనీలు దృష్టిసారించాయి. (చదవండి: భారత్ భారీ ప్లాన్.. చైనాకు గట్టి ఎదురుదెబ్బ!) -
ఇకపై వాట్సాప్ నుంచి క్యాబ్ బుక్ చేసుకోవచ్చు.. ఎలా అంటే?
వాహన ప్రయాణికులకు శుభవార్త. చేతిలో ఊబెర్ షేరింగ్ యాప్ లేకపోయినా వాట్సాప్ ఆన్‌లో ఉంటే చాలు ఇకపై ఊబెర్ క్యాబ్స్‌ను బుక్ చేసుకోవచ్చని' ఊబెర్ ప్రతినిధులు తెలిపారు. ప్రపంచంలోనే తొలిసారి మనదేశంలో ఈ తరహా క్యాబ్ సర్వీసుల్ని ఊబెర్ అందించనుంది. ఇందుకోసం వాట్సాప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. రైడ్ షేరింగ్ సంస్థ ఊబెర్ సరికొత్త రైడ్ షేరింగ్ సర్వీసుల్ని అందుబాటులోకి తెచ్చింది. ఊబెర్ యాప్ లేకుండా ఊబెర్ లోని చాట్ బోట్‌తో కనెక్టై సులభంగా క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ సేవలు పైలెట్ ప్రాజెక్టుగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో లోనే ప్రారంభించారు. త్వరలో దేశం మొత్తం విస్తరించేందుకు ఊబెర్ ప్రతినిధులు ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. వాట్సాప్‌తో క్యాబ్ ఎలా బుక్ చేసుకోవాలి వాట్సాప్ యూజర్లు మొత్తం మూడు మార్గాల ద్వారా ఉబెర్ క్యాబ్‌ను బుక్ చేసుకోవచ్చు. లేదంటే క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి ఉబెర్ వాట్సాప్ చాట్ లింక్‌పై క్లిక్ చేస్తే బుకింగ్ ఓపెన్ అవుతుంది. అక్కడే పికప్, డ్రాప్ లొకేషన్‌తో పాటు ఫేర్ ప్రైస్, క్యాబ్ ఎప్పుడు అందుబాటులో ఉంటుందనే వివరాలు డిస్ప్లే అవుతాయి. ఫైనల్‌గా మీరు ‘బుక్ ఎ రైడ్’ పై క్లిక్ చేసి క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. చదవండి: ‘ఆధార్ కార్డు’ మోడల్..! ప్రపంచ వ్యాప్తంగా...!