ఉబర్, ఓలా వంటి క్యాబ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చిన తరువాత.. ఎప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా, క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోతున్నారు. క్యాబ్ బుక్ చేసుకున్న నిమిషాల్లో డ్రైవర్లు మన ముందు వాలిపోతుంటారు. అయితే కొంతమంది డ్రైవర్లు చేసే నిర్లక్ష్యం వల్ల వినియోగదారులు ఇబ్బందులకు గురవుతూ ఉంటారు.
ఒక డాక్టర్ (Doctor) తెల్లవారుజామున 3.15 గంటలకు ఉబర్ రైడ్(Uber Ride) బుక్ చేసాడు. కానీ డ్రైవర్ ఎంతసేపటికీ రాకపోవడమే కాకుండా.. ఏ మాత్రం స్పందించలేదు. ఈ విషయాన్ని ఉబర్ కస్టమర్ సపోర్ట్‌కు తెలియజేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో మరో క్యాబ్ బుక్ చేసుకుని ఆ డాక్టర్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అయితే ఆయన ప్రయాణించాల్సిన ఫ్లైట్ అప్పటికే వెళ్లిపోయింది.
తాను వెళ్లాల్సిన ఫ్లైట్ మిస్ అవ్వడంతో.. మరో ఫ్లైట్‌కు టికెట్ బుక్ చేసుకుని గమ్యాన్ని చేరుకున్నాడు. అయితే తనకు కలిగిన అసౌకర్యానికి.. డాక్టర్ జిల్లా వినియోగదారుల కమిషన్‌లో కేసు దాఖలు చేశాడు. అయితే ఈ కేసు విచారణకు ఉబర్ ఇండియా హాజరు కాలేదు. చివరికి ఉబర్ ఇండియా వల్ల కలిగిన అసౌకర్యానికి కోర్టు.. డాక్టరుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పు రావడానికి మూడేళ్ళ సమయం పట్టింది.
ఇదీ చదవండి: ఫోన్ మారితే ఉబర్ ఛార్జ్ మారుతోంది - ఫోటోలు వైరల్
జిల్లా వినియోగదారుల కమిషన్ ఇచ్చిన తీర్పును తప్పుపడుతూ.. ఉబర్ ఇండియా ఢిల్లీ స్టేట్ కమీషన్ ముందు అప్పీల్ దాఖలు చేసింది. ఢిల్లీ స్టేట్ కన్స్యూమర్ కమిషన్ కూడా జిల్లా వినియోగదారుల కమిషన్ తీర్పును సమర్థిస్తూ.. ఉబర్ ఇండియా (Uber India) 45 రోజుల్లో 54,100 రూపాయలు డాక్టరుకు చెల్లించాలని ఆదేశించింది. ఈ డబ్బు చెల్లించడంలో ఆలస్యమైతే 6 శాతం వడ్డీ చెల్లించాలని వెల్లడించింది. ఇందులో రూ. 24100 అదనంగా టికెట్ కొనుగోలు చేసినందుకు, అతని మానసిక ఒత్తిడికి రూ. 30,000 అని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment