damages
-
డాక్టర్ చేసిన పనికి.. దిగొచ్చిన ఉబర్!
ఉబర్, ఓలా వంటి క్యాబ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చిన తరువాత.. ఎప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా, క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోతున్నారు. క్యాబ్ బుక్ చేసుకున్న నిమిషాల్లో డ్రైవర్లు మన ముందు వాలిపోతుంటారు. అయితే కొంతమంది డ్రైవర్లు చేసే నిర్లక్ష్యం వల్ల వినియోగదారులు ఇబ్బందులకు గురవుతూ ఉంటారు.ఒక డాక్టర్ (Doctor) తెల్లవారుజామున 3.15 గంటలకు ఉబర్ రైడ్(Uber Ride) బుక్ చేసాడు. కానీ డ్రైవర్ ఎంతసేపటికీ రాకపోవడమే కాకుండా.. ఏ మాత్రం స్పందించలేదు. ఈ విషయాన్ని ఉబర్ కస్టమర్ సపోర్ట్‌కు తెలియజేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో మరో క్యాబ్ బుక్ చేసుకుని ఆ డాక్టర్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అయితే ఆయన ప్రయాణించాల్సిన ఫ్లైట్ అప్పటికే వెళ్లిపోయింది.తాను వెళ్లాల్సిన ఫ్లైట్ మిస్ అవ్వడంతో.. మరో ఫ్లైట్‌కు టికెట్ బుక్ చేసుకుని గమ్యాన్ని చేరుకున్నాడు. అయితే తనకు కలిగిన అసౌకర్యానికి.. డాక్టర్ జిల్లా వినియోగదారుల కమిషన్‌లో కేసు దాఖలు చేశాడు. అయితే ఈ కేసు విచారణకు ఉబర్ ఇండియా హాజరు కాలేదు. చివరికి ఉబర్ ఇండియా వల్ల కలిగిన అసౌకర్యానికి కోర్టు.. డాక్టరుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పు రావడానికి మూడేళ్ళ సమయం పట్టింది.ఇదీ చదవండి: ఫోన్ మారితే ఉబర్ ఛార్జ్ మారుతోంది - ఫోటోలు వైరల్జిల్లా వినియోగదారుల కమిషన్ ఇచ్చిన తీర్పును తప్పుపడుతూ.. ఉబర్ ఇండియా ఢిల్లీ స్టేట్ కమీషన్ ముందు అప్పీల్ దాఖలు చేసింది. ఢిల్లీ స్టేట్ కన్స్యూమర్ కమిషన్ కూడా జిల్లా వినియోగదారుల కమిషన్ తీర్పును సమర్థిస్తూ.. ఉబర్ ఇండియా (Uber India) 45 రోజుల్లో 54,100 రూపాయలు డాక్టరుకు చెల్లించాలని ఆదేశించింది. ఈ డబ్బు చెల్లించడంలో ఆలస్యమైతే 6 శాతం వడ్డీ చెల్లించాలని వెల్లడించింది. ఇందులో రూ. 24100 అదనంగా టికెట్ కొనుగోలు చేసినందుకు, అతని మానసిక ఒత్తిడికి రూ. 30,000 అని తెలిపింది. -
అన్నదాతలకు అపార నష్టం
సాక్షి, అమరావతి: కనీవినీ ఎరుగని రీతిలో కురిసిన భారీ వర్షాలకు కృష్ణా నది, బుడమేరుకు పోటెత్తిన వరదలు తోడవటంతో రైతుల ఆశలన్నీ గల్లంతయ్యాయి. గడచిన 10 రోజులుగా లక్షలాది ఎకరాల్లో పంటలన్నీ ముంపు నీటిలో చిక్కుకోవడంతో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు విలవిల్లాడిపోతున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 16 జిల్లాల పరిధిలో 5.03 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. 4,53,845 ఎకరాల్లో వ్యవసాయ, 12 జిల్లాల పరిధిలో 49,340 ఎకరాల్లో ఉద్యాన పంటలు ముంపునకు గురైనట్టు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 365 మండలాల్లో 2,475 గ్రామాల పరిధిలో 2.50 లక్షల మంది రైతులు ముంపు ప్రభావానికి గురైనట్టుగా లెక్కతేల్చారు.వరి పంటకు ఎనలేని నష్టంకృష్ణా నదీ పరివాహక ప్రాంతాలైన ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అత్యధిక విస్తీర్ణంలో పంటలకు అపారమైన నష్టం వాటిల్లినట్టు గుర్తించారు. ఆయా జిల్లాల్లో వరి పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అత్యధికంగా 3.50 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతినగా.. ఆ తర్వాత పత్తి, మొక్కజొన్న, అపరాలు, చిరుధాన్యాలు, మిరప, అరటి, పసుపు, కంద, నిమ్మ, కూరగాయలు, ఉల్లి, ఆయిల్‌పామ్, బొప్పాయి, పూలు, కొబ్బరి తదితర పంటలు దెబ్బతిన్నాయి. ఇసుక మేటలు వేయడం ద్వారా 525 ఎకరాల్లో పంటలు దెబ్బతినగా.. కృష్ణా జిల్లాలో 140 ఎకరాల్లో మల్బరీ తోటలకు నష్టం వాటిల్లింది. పాడి, మత్స్య రైతులకు తీవ్ర నష్టంఓ మత్స్యకారుడు మృతి చెందగా.. 83 బోట్లు పూర్తిగాను, 202 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నట్టు మత్స్య శాఖ గుర్తించింది. 349 మోటర్ బోట్లు పూర్తిగా దెబ్బతినగా.. 2,440 వలలు ధ్వంసమయ్యాయి. 10వేల హెక్టార్లలో ఫిష్ సీడ్ ఫామ్స్, ఇసుక మేటలు వేయడం వల్ల 18 వేల హెక్టార్లలో చేపల చెరువులు దెబ్బతిన్నాయి. పశు సంవర్ధక శాఖకు సంబంధించి 10 జిల్లాల పరిధిలో 116 పశువులు, 340 మేకలు, గొర్రెలు, 5 ఎద్దులు, 32 దూడలతో పాటు 71,639 కోళ్లు చనిపోగా, 92 పశువుల షెడ్లు కూలిపోయినట్టు లెక్కతేల్చారు. అత్యధికంగా కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, ఏలూరు జిల్లాల పరిధిలోని 73 మండలాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ జిల్లాల పరిధిలో 46,826 పశువులపై తీవ్ర ప్రభావం చూపింది. వ్యవసాయ పంటలకు రూ.301.35 కోట్ల నష్టంఎస్డీఆర్ ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్) నిబంధనల ప్రకారం ప్రాథమికంగా వ్యవసాయ పంటలకు రూ.301.35 కోట్లు, ఉద్యాన పంటలకు, రూ.40.97 కోట్లు, మత్స్య శాఖకు రూ.141.90 కోట్లు, సెరీ కల్చర్‌కు రూ.2.68 కోట్లు, పశు సంవర్ధక శాఖకు రూ.66.60 నష్టం వాటిల్లినట్టు లెక్కతేల్చారు. కాగా.. తుది నష్టం అంచనాలకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ నెల 10వ తేదీలోగా పంట నష్టం అంచనాలు రూపొందించి, 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సోషల్ ఆడిట్ కింద రైతు సేవా కేంద్రా(ఆర్బీకే)ల్లో జాబితాలు ప్రదర్శించనున్నారు. 18న తుది అంచనాల జాబితాలను ప్రదర్శిస్తారు. -
టీఎంసీ ఎంపీకి షాక్.. రూ. 50 లక్షలు చెల్లించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత, రాజ్యసభ ఎంపీ సాకేత్ గోఖలేకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ దౌత్యవేత్త లక్ష్మీ పురి దాఖలు చేసిన పరువు నష్టం కేసులో 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సాకేత్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. లక్ష్మీ పురికి క్షమాపణలు చెప్పాలని పేర్కొంది. క్షమాపణలను ప్రముఖ జాతీయ వార్తాపత్రికలో ప్రచురించాలని, ఆరు నెలల పాటు సోషల్ మీడియాలో కూడా ఉంచాలని సూచించింది. ఎనిమిది వారాల్లోగా ఈ ఉత్తర్వును పాటించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.కాగా, 2021 జూన్ 13, 26న సాకేత్ గోఖలే వివాదస్పద ట్వీట్లు పోస్ట్ చేశారు. మాజీ దౌత్యవేత్త లక్ష్మీ పురి తన ఆదాయానికి మించి స్విట్జర్లాండ్‌లో ఆస్తిని కొనుగోలు చేశారని ఆరోపించారు. ఆమె భర్త, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి గురించి కూడా ఆ ట్వీట్లలో ప్రస్తావించారు.ఈ నేపథ్యంలో అదే ఏడాది లక్ష్మీ పురి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలేపై పరువునష్టం దావా వేశారు. ఇరువర్గాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు సోమవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. -
Meloni: డీప్‌ఫేక్ వీడియోలపై దావా వేసిన ఇటలీ ప్రధాని
రోమ్: ఇటలీ ప్రధాని జార్జియా మెలోని డీప్‌ఫేక్ కంటెంట్‌కు వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టారు. స్వయంగా తానే బాధితురాలినంటూ మీడియా ముందుకు వచ్చారామె. అంతేకాదు.. ఆ వీడియోలను అప్లోడ్ చేసిన వ్యక్తులపై లక్ష యూరోలకు పరువు నష్టం దావా వేశారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని పేరిట వీడియోలు అశ్లీల సైట్లలో అప్లోడ్ అయ్యాయి. ఓ పోర్న్‌స్టార్ ముఖానికి మెలోనీ ముఖాన్ని డీప్‌ఫేక్ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి ఆ వీడియోలను అప్లోడ్ చేశారు ఇద్దరు. ఆ వీడియోలను అమెరికాలో గత కొన్ని నెలలుగా కొన్ని లక్షల మంది వీక్షించారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో ఆమె సత్వరమే స్పందించారు. ఆ ఇద్దరిపై లక్ష యూరోల(మన కరెన్సీలో 90 లక్షల రూపాయల దాకా) పరువు నష్టం దావా వేశారామె. ఈ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం జులై 2వ తేదీన ఆమె కోర్టుకు హాజరు కానున్నారు. ఇక.. ప్రధాని లాంటి ఉన్నత పదవిలో ఉన్న తానే డీప్‌ఫేక్‌కు వ్యతిరేకంగా ముందుకు వచ్చానని, బాధితులు ముందుకు వచ్చి ధైర్యంగా పోరాడాలని ఆమె పిలుపు ఇచ్చారు. ఇక ఈ కేసులో నిందితుల నుంచి తీసుకునే పరిహారాన్ని హింసకు గురైన మహిళలకు విరాళంగా మెలోనీ ఇస్తారని ప్రధాని లీగల్ టీం ప్రకటించింది. నిందితులను తండ్రీ కొడుకులుగా(40, 72 ఏళ్లు) గుర్తించిన దర్యాప్తు అధికారులు.. స్మార్ట్ ఫోన్ ద్వారా ఆ వీడియోలను అప్లోడ్ చేసినట్లు నిర్ధారించారు. అయితే.. మెలోనీ ప్రధాని కాకముందే 2022లో ఆ వీడియోలు అప్లోడ్ కావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఇటలీ చట్టాల ప్రకారం ఇలాంటి పరువు నష్టం దావాలు తీవ్రంగా నేరాలుగా పరిగణించబడ్తాయి. బాధితులకు పరిహారం ఇప్పించడంతో పాటు నిందితులకు జైలు శిక్ష విధిస్తారు కూడా. సంబంధిత వార్త: ఇంటర్నెట్ నిండా ఫేక్ ఫొటోలు, అశ్లీల వీడియోలు! -
వాతావరణ మార్పులతో కోట్ల డాలర్ల నష్టం
న్యూఢిల్లీ: వాతావరణంలో వస్తున్న భారీ మార్పులు ప్రపంచ దేశాలను ఆర్థికంగా దెబ్బ తీస్తున్నాయి. ప్రకృతి విపత్తుల కారణంగా ప్రపంచంలోని మౌలిక సదుపాయాల రంగంలో ఏడాదికి సగటున 30,000వేల కోట్ల డాలర్ల నుంచి 33 వేల కోట్ల డాలర్ల వరకు నష్టం వస్తోందని కొయిలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సీడీఆర్ఐ) నివేదిక వెల్లడించింది. ఆరోగ్యం, విద్యా రంగానికి సంబంధించిన భవంతులు ఇతర సదుపాయాలకు జరిగిన నష్టాన్ని కూడా చేరిస్తే 73,200 కోట్ల డాలర్ల నుంచి 84 వేల కోట్ల డాలర్ల వరకు ఉంటుందని అంచనా. 2021–22లో ప్రపంచ స్థూల ఆదాయం పెరుగుదలలో ఈ నష్టం ఏడో వంతు వరకు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. -
వీడియో: ఈవీఎంలను పగలకొట్టి.. కారును పల్టీకొట్టించి..
-
రష్యాపై డ్రోన్ల వర్షం.. మాస్కోకు సమీపంలో విధ్వంసం
కీవ్: డ్రోన్ దాడులతో రష్యా ఉక్కిరిబిక్కిరైంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం దాకా ఎడతెరిపి లేకుండా జరిగిన దాడుల్లో దేశంలో పలుచోట్ల మౌలిక సదుపాయాలకు స్వల్ప నష్టం వాటిల్లింది. ఇంతకాలం ఉక్రెయిన్ సరిహద్దుల సమీపానికే పరిమితమైన దాడులు ఏకంగా రాజధాని మాస్కో సమీపం దాకా చొచ్చుకొచ్చాయి. ఒక డ్రోన్ మాస్కోకు 100 కిలోమీటర్ల దూరంలో విధ్వంసం సృష్టించింది! పలు డ్రోన్లను రష్యా పేల్చేసింది. మరోవైపు హాకింగ్ దెబ్బకు రష్యా టీవీ, రేడియో ప్రసారాలకు చాలాసేపు అంతరాయం కలిగింది. డ్రోన్ల కలకలంతో సెయింట్ పీటర్స్బర్గ్ విమానాశ్రయాన్ని గంటలపాటు మూసేయాల్సి వచ్చింది! ఈ దాడులన్నీ ఉక్రెయిన్ పనేనంటూ రష్యా మండిపడింది. తమపై రష్యా పూర్తిస్థాయి యుద్ధానికి దిగిన నేపథ్యంలో ఎలాంటి దాడులకైనా పాల్పడే హక్కు తమకుందంటూ ఉక్రెయిన్ నర్మగర్భ వ్యాఖ్యలతో సరిపెట్టింది. రష్యా మిత్రదేశమైన బెలారస్లో ఓ వైమానిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడుల్లో రూ.2,737 కోట్ల విలువైన రష్యా నిఘా విమానంతో పాటు మరో సైనిక రవాణా విమానం, పలు వాహనాలు దెబ్బ తిన్నట్టు చెబుతున్నారు. ఇది స్థానిక ఉక్రెయిన్ మద్దుతుదారుల పనేనని అనుమానిస్తున్నారు. -
MP: గిరిజనుడి ఆవేదన.. సర్కార్‌పై పదివేల కోట్లకు దావా
తప్పుడు అభియోగాలతో చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించాడతను. అయితే తనకు జరిగిన అన్యాయంపై ఆ గిరిజనుడు ఊరుకోలేదు. న్యాయపోరాటానికి దిగాడు. ఏకంగా ప్రభుత్వాన్నే కోర్టుకు ఈడ్చాడు. ఫేక్ రేప్ కేసులో ఇరికించారని, జైలు శిక్ష అనుభవించేలా చేసి తన జీవితం నాశనం చేశారంటూ పరిహారం కోసం సర్కార్‌పై పదివేల కోట్ల రూపాయలకు దావావేశాడు. ఇండోర్: మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై ఓ గిరిజనుడు కోర్టుకు ఎక్కాడు. కంతూ అలియాస్ కంతూలాల్ బీల్(35)ను గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడనే ఆరోపణలతో జైలుకు పంపారు పోలీసులు. ఓ వివాహితను మరో ఇద్దరితో కలిసి అత్యాచారం చేశాడనే అభియోగం నమోదు అయ్యింది అతనిపై. అక్టోబర్ 2018లో నమోదు అయిన కేసు అది. డిసెంబర్ 23, 2020 నుంచి రెండేళ్లపాటు శిక్ష అనుభవించాడతను. సుమారు 666 రోజుల శిక్ష తర్వాత.. అతను అమాయకుడని తేలడంతో రిలీజ్ అయ్యాడు.అన్యాయంగా అత్యాచార అభియోగాలతో తనను రెండేళ్లపాటు జైల్లో ఉంచారంటూ ఆ సమయంలో వాపోయాడతను. అయితే.. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొవడం, జైలు శిక్ష తన జీవితాన్ని తలకిందులుగా చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ‘‘దేవుడు ప్రసాదించిన జీవితంలో ఎన్నో విలువైన క్షణాలను దూరం చేసుకున్నా(ఉదాహరణకు శృంగార జీవితం)..’’ అంటూ పిటిషన్లో పేర్కొన్నాడతను. పరిహారంగా రూ. 10,006 కోట్ల రూపాయలకు అతను దావా వేసినట్లు తెలుస్తోంది. -
యుద్ధప్రాతిపదికన మరమ్మతులు
తిరుమల: భారీ వర్షాల వల్ల తిరుమలలో దెబ్బతిన్న రోడ్లు, రక్షణ గోడలకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపడతామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమల, తిరుపతిలో 30 ఏళ్లలో ఏనాడు లేనంత స్థాయిలో ఈ నెల 17వ తేదీ నుంచి 19 వరకు వర్షాలు కురిశాయని పేర్కొన్నారు. వర్షాలకు శేషాచలం కొండల్లోని డ్యాములు, చెక్ డ్యామ్‌లు పొంగి కపిల తీర్థం జలపాతం గుండా తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలను ముంచెత్తినట్టు ఆయన వెల్లడించారు. వర్షాల వల్ల తిరుమలలో రూ.4 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందన్నారు. మొదటి ఘాట్ రోడ్‌లోని అక్కగార్ల గుడి వద్ద రక్షణ గోడ దెబ్బతిందని, ఘాట్ రోడ్‌లోని నాలుగు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయని పేర్కొన్నారు. టీటీడీ సిబ్బంది, అధికారులు యుద్ధ ప్రాతిపదికన వీటిని తొలగించి తాత్కాలిక రక్షణ ఏర్పాట్లతో ట్రాఫిక్‌ను పునరుద్ధరించారని తెలిపారు. రెండవ ఘాట్ రోడ్లలో 13 ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడ్డాయని, ఐదు ప్రాంతాల్లో రక్షణ గోడలు దెబ్బతిన్నాయని, తిరుమల నారాయణగిరి గెస్ట్ హౌస్‌ను ఆనుకుని ఉన్న రక్షణ గోడ పడిపోవడంతో మూడు గదులు దెబ్బతిన్నాయని వెల్లడించారు. శ్రీవారి మెట్టు మార్గంలో కొంతమేరకు రోడ్డు, ఫుట్‌పాత్ దెబ్బతిన్నాయన్నారు. కపిల తీర్థం ఆలయంలో ఒక మండపం వర్షాలకు దెబ్బతిందని, దీని మరమ్మతులకు రూ.70 లక్షలు ఖర్చు కావచ్చని అధికారులు అంచనా వేశారని తెలిపారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చి భారీ వర్షాల కారణంగా తిరుపతిలో ఆగిపోయిన భక్తులకు శ్రీనివాసం, మాధవం, రెండు, మూడో సత్రాల్లో వసతి, ఆహారం ఏర్పాటు చేశామని తెలిపారు. టికెట్లు ఉండి దర్శనానికి రాలేకపోయిన భక్తులను వర్షాలు తగ్గాక దర్శనానికి అనుమతించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. చదవండి: వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే -
వారు బాధ్యత గుర్తించాలి
ఆందోళనకారులు తమ హక్కులు, బాధ్యతలు గుర్తెరిగి ప్రవర్తించాలి. ఆందోళనల్లో గాయపడిన పోలీసులు, సామాన్యులు ఏం తప్పు చేశారు?. ఆర్టికల్ 370 రద్దు, రామజన్మభూమి సమస్య శాంతియుతంగానే పరిష్కారమయ్యాయి. సవాళ్లకే సవాలు విసరడం మా నైజం. దేశంలోని ప్రతి ఒక్కరి గుండెల్లో వాజ్‌పేయి పేరు నిలిచి ఉంటుంది. అటల్ ప్రధానిగా ఉండగా జరిగిన పోఖ్రాన్ అణు పరీక్షలు, కార్గిల్ యుద్ధం అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను శక్తిమంతమైన దేశంగా నిలిపాయి. – ప్రధాని మోదీ లక్నో: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చేసిన పని సరైందా అన్నది వాళ్లు (ఆందోళనకారులు) తమని తాము ప్రశ్నించుకోవాలి. వాళ్లు తగులబెట్టింది ఏదైనా కానీ.. వారి పిల్లలకు ఉపయోగపడేదేగా’ అని ఆయన ధ్వజమెత్తారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 95వ జయంతి సందర్భంగా బుధవారం ప్రధాని మోదీ లక్నోలో 25 అడుగుల ఎత్తైన భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అటల్ పేరుతో ఏర్పాటు కానున్న వైద్య విశ్వవిద్యాలయానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. లక్నోలోని లోక్‌భవన్‌లో ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. ఆందోళనకారులు తమ హక్కులు, బాధ్యతలు గుర్తెరిగి ప్రవర్తించాలని అన్నారు. ఆందోళనల్లో గాయపడ్డ, పోలీసులు, సామాన్యులు ఏం చేశారని ప్రశ్నించారు. ఆర్టికల్ 370 రద్దుతో ఓ పాత జబ్బు శాంతియుతంగా నయమైపోయిందన్నారు. రామజన్మభూమి సమస్య కూడా శాంతియుతంగానే పరిష్కారమైందని అన్నారు. తమ పిల్లల మాన మర్యాదలను కాపాడుకునేందుకు భారత్ వచ్చిన పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ ప్రజలకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ చట్ట సవరణ అనే సమస్యకు 130 కోట్ల మంది భారతీయులు ఒక పరిష్కారాన్ని ఆవిష్కరించారని అన్నారు. ఈ ఆత్మ విశ్వాసంతో భారత్ నవ దశాబ్దంలోకి ప్రవేశిస్తోందని మిగిలిన అన్ని పనులు పూర్తి చేసే లక్ష్యంతో సాగుతోందని అన్నారు. సవాళ్లకే సవాలు విసరడం తమ నైజమని ప్రధాని వ్యాఖ్యానించారు. ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న ఆందోళనల్లో ఇప్పటిదాకా మొత్తం 15 మంది మరణించగా, సుమారు 263 మంది గాయపడ్డారు. ఇదిలా ఉండగా.. హిమాచల్‌ప్రదేశ్‌ను లదాఖ్, జమ్మూకశ్మీర్‌లతో కలిపే రోహ్తంగ్ సొరంగానికి మాజీ ప్రధాని వాజ్‌పేయి పేరు పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇకపై ఈ సొరంగాన్ని అటల్ టన్నెల్‌గా పిలుస్తారని ప్రధాని మోదీ బుధవారం ప్రకటించారు. ఈ సొరంగానికి 2003లో వాజ్‌పేయి శంకుస్థాపన చేశారు. బొట్టు బొట్టు ఒడిసిపట్టాల్సిందే! మెరుగైన సాగుపద్ధతులు పాటించడం, నీటి అవసరం తక్కువ ఉన్న పంటలు పండించడం ద్వారా రైతులు జల సంరక్షణకు పాటుపడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. బుధవారం ఢిల్లీలో భూగర్భ జల సంరక్షణ పథకమైన ‘అటల్ జల్ యోజన’ను మోదీ ప్రారంభించారు. కొత్తగా ప్రారంభించిన ఈ పథకం ఏడు (మహారాష్ట్ర, హరియాణా, రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక) రాష్ట్రాల్లోని 78 జిల్లాలు, 8,300 గ్రామాల్లో భూగర్భ జలాల పెంపునకు కృషి చేస్తుందని చెప్పారు. దేశంలో వ్యవసాయం అధికంగా భూగర్భ జలాలపై ఆధారపడి ఉందని, నీటిని పొలాలకు మళ్లించేందుకు ఇప్పటికీ పాత పద్ధతులను ఉపయోగిస్తున్నారని ప్రధాని తెలిపారు. దీనివల్ల చాలాసార్లు నీరు వృథా అవుతోందని అన్నారు. నీటి అవసరం ఎక్కువగా ఉన్న చెరకు పంట సాగయ్యే ప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటిపోవడాన్ని గమనించామన్నారు. ఈ పరిస్థితులను మెరుగుపరిచేందుకు రైతుల్లో జలసంరక్షణపై అవగాహన మరింత పెరగాలని అన్నారు. దేశంలోని ప్రతి గ్రామం నీటి వాడకానికి సంబంధించి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరు పథకాల ద్వారా అందించే నిధుల సాయంతో జల సంరక్షణ పనులు చేపట్టాలని కోరారు. భూగర్భ జల మట్టాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో రైతులు పరస్పర సహకారంతో నీటి బడ్జెట్లు రూపొందించుకుని తదనుగుణంగా పంటల పెంపకం చేపట్టాలని వివరించారు. ఐదేళ్లలో రూ.3.5 లక్షల కోట్ల ఖర్చు భూగర్భ జల వనరులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో అటల్ జల్ యోజన ద్వారా తాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నామని మోదీ తెలిపారు. గత 70 ఏళ్లలో దేశంలోని మొత్తం 18 కోట్ల గృహాల్లో మూడు కోట్లకు మాత్రమే పైపుల ద్వారా తాగునీటి సౌకర్యం ఒనగూరిందని, తమ ప్రభుత్వం రానున్న ఐదేళ్లలో మిగిలిన 15 కోట్ల కుటుంబాలకు తాగునీటిని చేర్చాలన్న లక్ష్యంతో పనిచేస్తోందని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకోసం ఐదేళ్లలో రూ. 3.5 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నాయని మోదీ తెలిపారు. 25 అడుగుల ఎత్తు వాజ్‌పేయి కాంస్య విగ్రహాన్ని శిల్పి రాజ్‌కుమార్ పండిట్ రూపొందించారు. 25 అడుగుల ఎత్తు, 5 టన్నుల బరువున్న ఈ విగ్రహతయారీకి రూ.89 లక్షలు ఖర్చయింది. పండిట్ నేతృత్వంలోని 65 మంది కళాకారులు ఆరు నెలల పాటు శ్రమించి దీనిని తయారు చేశారు. బిహార్‌కు చెందిన రాజ్‌కుమార్ పండిట్ జైపూర్ కేంద్రంగా కాంస్యం, అల్యూమినియం, ఇత్తడి వంటి లోహాలతో ప్రముఖుల విగ్రహాలను వేలాదిగా తయారు చేశారు. ఈయన తయారుచేసిన అత్యంత ఎత్తైన 47 అడుగుల పాండవవీరుడు అర్జునుడి విగ్రహాన్ని జైపూర్‌లో ప్రతిష్టించారు. ఢిల్లీలోని వాజ్‌పేయి స్మారకం వద్ద నివాళులర్పిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ -
యోగి ప్రతీకారం : రూ. 15 లక్షలు కట్టండి!
లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్నంత పనీ చేసింది. పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా జరిగిన ఆందోళనకు, నష్టానికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పిన యోగీ ప్రభుత్వం ఆందోళన కారులకు నోటీసులు పంపింది. ఈ నిరసన కార్యక్రమంలో చెలరేగిన హింస సందర్భంగా ప్రభుత్వ ఆస్తులకు జరిగిన నష్టానికి రూ .14.86 లక్షలు రికవరీ కోసం దాదాపు 28 మందికి నోటీసులు అందాయి. అంతేకాదు దెబ్బతిన్న పోలీసు హెల్మెట్లు, లాఠీలు, పెలెట్స్ కోసం కూడా పరిహారం చెల్లించాలని కూడా యూపీ సర్కార్ ఆదేశించింది. కాగా గతవారం ఉత్తరప్రదేశ్ రాంపూర్‌లో సీఏఏ నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఈ హింసకు కారణమని ఆరోపిస్తూ 31మందిని ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిని సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించి వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని, వేలం వేస్తామని, తద్వారా నష్టాన్ని భర్తీ చేస్తామని, ప్రతీకారం తీర్చుకుంటామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు రాష్ట్ర పోలీసులు కనీసం 21 గురు మైనర్లను అదుపులోకి తీసుకుని, 48 గంటల పాటు చిత్ర హింసలకు గురిచేశారని హఫింగ్టన్ పోస్ట్ నివేదించింది. స్థానిక పత్రికల కథనాలు, బాధితుల ఇంటర్వ్యూల (విడుదలైన 21 మందిలో ఐదుగురిని) ఆధారంగా బహిరంగ ప్రదర్శనకు ఎప్పుడూ హాజరుకావద్దంటూ వారిని బెదిరించడంతోపాటు తీవ్రంగా కొట్టారని తెలిపింది. చేసింది, అయితే దీనిపై ఉత్తరప్రదేశ్ డీజీపి ఓపీ సింగ్, బిజ్నోర్ జిల్లా కలెక్టర్ రామకాంత్ పాండే , బిజ్నోర్ ఎస్పీ సంజీవ్ త్యాగి ఇంకా స్పందించాల్సి వుందని పేర్కొంది. చదవండి : వాళ్ల ఆస్తులు వేలం వేస్తాం: యూపీ సీఎం -
శిల్పం పడేశారు.. 89 లక్షలు కట్టండి!
కన్సాస్: అమెరికాలోని కన్సాస్‌లో పట్టణంలో ఓ కుటుంబానికి ఇన్సూరెన్స్ కంపెనీ షాకిచ్చింది. ఓ చిన్నారి(5) కారణంగా ఇక్కడి కమ్యూనిటీ సెంటర్లో ఏర్పాటుచేసిన శిల్పం తీవ్రంగా దెబ్బతినడంతో రూ.89 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని అతని కుటుంబానికి నోటీసులు జారీచేసింది. కన్సాస్‌లోని ఓవర్లాండ్ పార్క్‌కు చెందిన సారా గుడ్‌మెన్ కుటుంబం మే 19న స్థానిక కమ్యూనిటీ సెంటర్లో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైంది. ఈ సందర్భంగా సారా కుమారుడు అక్కడ ఏర్పాటుచేసిన గాజు శిల్పాన్ని కదిలించేందుకు యత్నించాడు. దీంతో ఆ శిల్పం కిందపడిపగిలిపోయింది. ఈ ఘటనలో సారా కుమారుడికి కూడా గాయాలయ్యాయి. దీంతో బాలుడి విషయంలో నిర్లక్ష్యం వహించారంటూ ఆ కుటుంబానికి బీమా కంపెనీ నోటీసులు జారీచేసిందన్నారు. నోటీసులు అందుకున్న సారా స్పందిస్తూ.. నిర్వాహకులు ఆ శిల్పానికి తగిన రక్షణ ఏర్పాట్లు చేయకుండా వదిలేశారని ఆరోపించారు. -
ముంపు బాధితులను ఆదుకుంటాం
సీఎం చంద్రబాబు వెల్లడి దాచేపల్లి/గురజాల రూరల్/రెంటచింతల : భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని, రెండు రోజుల్లో నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. గుంటూరు జిల్లాలో ముంపునకు గుైరె న దాచేపల్లి, గురజాల, రెంటచింతలలో ఆదివారం ఆయన పర్యటించారు. నడికుడి సబ్ మార్కెట్ యార్డు కొట్లబజార్‌లోని పలువురు దుకాణాదారులతో మాట్లాడారు. నష్టం వివరాలను తెలుసుకున్నారు. అనంతరం పాతబస్టాండ్ సెంటర్లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.95,200, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.5,200, పూర్తిగా దెబ్బతిన్న పూరిళ్లకు రూ.3,500 నష్టపరిహారం అందించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని, మంగళవారం సాయంత్రంలోగా సర్వేను పూర్తి చేసిన తరువాత పరిహారం అందజేస్తామని చెప్పారు. అనంతరం గురజాలకు చేరుకుని గాడిదల వాగు ఉధృతికి ముంపునకు గురైన పంట పొలాలను సీఎం పరిశీలించారు. ఆయన రైతులనుద్దేశించి మాట్లాడుతూ ‘మెట్ట పంటలు వేసుకోమని 100సార్లు చెప్పినా మీరు వినడం లేదు.. నా గొంతు నెప్పి పుడుతా ఉంది.. మీరు ఇబ్బందుల్లో పడుతూ.. ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెడుతున్నారు’అని తెలిపారు. -
పంట నష్టపరిహారం ఇవ్వాలి
సీపీఐ డిమాండ్ కలెక్టరేట్ ఎదుట ధర్నా అనంతపురం అర్బన్ : వేరుశనగ పంటకు నష్టపరిహారం ఇవ్వాలని సీపీఐ, రైతు సంఘం నాయకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ వేరుశనగ విత్తన కాయ నాసిరకంగా ఉండడంతో ఊడలు దిగలేదన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. నష్టపోయిన రైతులకు ఏకరాకు రూ.10 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సహాయ కార్యదర్శులు సి.జాఫర్, పి.నారాయణస్వామి, రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సి.మల్లికార్జున, ఎ.కాటమయ్య, మహిళ సమాఖ్య జిల్లా కార్యదర్శి పద్మావతి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షురాలు శకుంతలమ్మ, తదితరులు పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి అగ్రిగోల్డ్ మోసానికి గురైన వినియోగదారులు, ఏజెంట్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధితుల సంఘం జిల్లా అధ్యక్షుడు విశ్వనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం వామపక్ష నాయకులతో కలిసి బాధితులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను విక్రయించి బాధితులకు డిపాజిట్ మొత్తాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. సీపీఎం నగర కార్యదర్శి నాగేంద్రకుమార్, ఏఐటీయూసీ నాయకులు పీఎల్ నరసింహులు, తదితరులు పాల్గొన్నారు. -
100 ఇళ్లను ధ్వంసం చేసిన గజరాజు
కోలకతా: ఆ గజరాజుకు కోపం వచ్చిందో, ఆకలి వేసిందో, మరేమైందో తెలియదు గానీ.. ఉన్నట్టుండి జనావాసాల్లోకి ప్రవేశించింది. వచ్చింది వచ్చినట్లు తిన్నగా ఉంటుందా.. ఇళ్లన్నింటినీ ధ్వంసం చేసి వదిలిపెట్టింది. పశ్చిమబెంగాల్ లోని సిలిగురిలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. అది అకస్మాత్తుగా జనావాసాల్లోకి చొచ్చుకురావడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు గానీ... ఆగ్రహంతో చెలరేగిపోయింది. దాదాపు వంద ఇళ్లను ధ్వంసం చేసింది. దీంతో జనం భయంతో పరుగులు తీశారు. ఆందోళన చెందిన స్థానికులు పోలీసులకు, అటవీ అధికారులు సమాచారం అందించారు. అటవీ అధికారులు ఏనుగును బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా అటవీ ప్రాంతంలో చెట్లు నరికేయడం వల్ల తగినంతగా ఆహారం లభించనప్పుడు, లేదా తప్పిపోయిన తమ పిల్లలను వెతుక్కుంటూ మాత్రమే ఏనుగులు ఇలా జనావాసాల్లోకి వస్తాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. మరి ఇది ఎందుకు వచ్చిందన్న విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. -
ఏజెన్సీలో ఏనుగుల బీభత్సం
కురుపాం: విజయనగరం జిల్లా కురుపాం ఏజెన్సీలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. కురుపాం మండలం తిత్తిరి పంచాయతీ పరిధిలోని ఎగువగుండాం, దిగువగుండాం, గిరిశిఖర గ్రామాల్లో నాలుగు ఏనుగులు సంచరిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీ నుంచి ఏనుగులు ఇక్కడకు వచ్చినట్లు గిరిజనులు చెప్పుతున్నారు. వీటి దాడిలో ఇళ్లు, చర్చి పూర్తిగా ధ్వంసమయ్యాయి. కురుపాం అటవీ రేంజి అధికారి మురళీ కృష్ణ మంగళవారం ఉదయం ఇక్కడకు వచ్చి గిరిజనులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు. -
తిరుమలలో పాడైన శ్రీవారి లడ్డూలు
-
లేని పాకలకు నష్టపరిహారం
తుఫాన్‌కు నష్టపోయి కష్టాల్లో ఉన్న బాధితులకు అందాల్సిన సాయాన్నీ తెలుగుతమ్ముళ్లు వదలడం లేదు. హుద్‌హుద్ సాయం నిధులు పూర్తిగా పచ్చచొక్కాల జేబుల్లోకి వెళుతున్నాయి. అనర్హులతో లబ్ధిదారుల జాబితాలు రూపొందించి హుద్‌హుద్ నిధులు కొల్లగొట్టడానికి టీడీపీ వారు బరితెగించేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో కొబ్బరి చెట్లకు పరిహారం నిధులను తమ బొక్కసంలో వేసుకున్నారు. లేని కొబ్బరి చెట్ల పేరున కోట్ల రూపాయాల పరిహారం తమ ఖాతాల్లో జమ చేసుకున్నారు. తాజాగా టీడీపీ నేతల దృష్టి పశువుల పాకల పరిహారం నిధులపై పడింది. మూగజీవాల గూడు కోసం మంజూరైన నిధులను కూడా కొల్లగొట్టడానికి వెనుకాడటం లేదు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మునగపాకలోని ఈ కాలనీ చూశారా!... అంతా స్లాబ్ ఇళ్లతో ఉన్న కాలనీ ఇదీ. ఒక్క పశువుల పాక కూడా లేదు... కానీ ఈ కాలనీలో పశువుల పాకలు హుద్‌హుద్ తుపానుకు కూలిపోయాయని చెప్పి పరిహరం నిధులను ఫలహారం చేయడానికి టీడీపీ తమ్ముళ్లు సిద్ధపడ్డారు. ‘మా దారి అడ్డదారి’అన్నట్లు తయరైంది వీరి పరిస్థితి. తుఫాన్‌కు కూలిపోయిన పశువుల పాకలకు ప్రభుత్వం రూ.10 వేల చొప్పున పరిహారం ప్రకటించింది. దాంతో ఇష్టానుసారంగా పూర్తిగా అనర్హులతో లబ్ధిదారుల జాబితా రూపొందింపచేశారు. మునగపాకలోనీ ఈ కాలనీలో ఒక్క పశువుల పాక కూడా లేదు. అసలు ఆ కాలనీలో ఎవరికీ వ్యవసాయం లేదు... పాడి పశువులూ లేవు. దాంతో పశువుల పాకలు ఉండే అవకాశమే లేదు. కానీ ఆ కాలనీలో 69 పశువుల పాకలు తుపానుకు కూలిపోయాయని జాబితా రూపొందించారు. ఆ మేరకు ఒక్కొక్కరికీ రూ.6.9 లక్షలు పరిహారం చెల్లించేందుకు సిద్ధపడిపోయారు. కానీ ఆ 69 మందిలో కేవలం ఐదుగురికే పశువుల పాకలు ఉండేవి. మిగిలినవారికి ఎవరికీ పాకలు లేనే లేవు. కానీ వారి పేర్లను చేర్చి జాబితా రూపొందించేశారు. ఒకే కుటుంబంలో నలుగురైదుగురి పేర్లను కూడా జాబితాలో చేర్చేయడం గమనార్హం. జాబితాలో ఇంకొన్ని విచిత్రాలు! సీరియల్ నంబర్ 15, 20, 25, 26, 38, 39లలో పేర్కొన్న వారందరూ ఒకే కుటుంబ సభ్యులు. వారెవరికీ పశువుల పాకలు లేవు. కానీ ఆ వారందరి పేర్లను కూడా అర్హుల జాబితాలో చేర్చేశారు. పంచాయతీ వార్డు సభ్యుడు పూడి పరదేశీ రావు పేరును రెండుచోట్ల నమోదు చేశారు. సీరియల్ నంబర్ 43, 47లలో ఆయన పేరునే చేర్చారు. కానీ తెలివిగా ఆయన ఆధార్‌నంబర్ రాయకుండా కనికట్టు చేశారు. సీరియల్ నంబర్లు 6, 7, 8, 9, 49, 66లతో పేర్కొన్న పేర్లన్నీ కూడా ఒకే కుటుంబానికి చెందినవి. పరిహారం చెల్లింపులో అక్రమాలు ‘అధికార పార్టీ నాయకులు తుఫాన్ బాధితుల నమోదులో అక్రమాలకు పాల్పడ్డారు. దళితవాడలో నిజమైన బాధితులను కాదని అనర్హులకు పరిహారం జాబితాల్లో అవకాశం కల్పించడం విచారకరం. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు విచారించి అర్హులకు న్యాయం చేయాలి’ -రాజాన రూపావతి, దళితురాలు, ఎంపీటీసీ సభ్యురాలు టీడీపీ కార్యకర్తలకే ప్రాధాన్యం హుద్‌హూద్ తుఫాన్ బాధితుల నమోదులో అక్రమాలు చోటు చేసుకున్నాయి. నిజమైన బాధితులకు న్యాయం జరగలేదు. దళితవాడలో కేవలం 5 పా కలు మించిలేవు. కాని పరిహారాల జాబితాల్లో అ నర్హులకు చోటు కల్పించారు. కేవలం టీడీపీ కార్యకర్తలకే చోటు కల్పించి నిజమైన బాధితులను విస్మరించారు. అధికారులతో విచారణ జరి పిం చి తగు న్యాయం చేయాలి. - బీలా అప్పలనాయుడు, పంచాయతీ వార్డు సభ్యుడు -
వి’శోక’పట్నం
-
సాయిబాబా విగ్రహంపై దాడి
-
నష్టాలకు తెరిపేదీ?
అమలాపురం, న్యూస్‌లైన్ :కసి పట్టినట్టు చినుకులనే బాణాలుగా దూసి, తేరుకోలేని దెబ్బ తీసిన వరుణుడు వారం తర్వాత శాంతించాడు. ఆదివారం తెల్లవారుజాము వరకు భారీగా కురిసిన వర్షాలు ఉదయం నుంచి తెరిపినిచ్చాయి. అయితే ఆరురోజుల ముసురుకు శనివారం అర్ధరాత్రి నుంచి కురిసిన జడివాన తోడవడంతో అటు చేలు, ఇటు పల్లపు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకునే ఉన్నాయి. శనివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఆదివారం ఉదయం ఎనిమిది గంటల వరకు జిల్లాలో సగటున 62 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఏజెన్సీలోని వై.రామవరం మండలంలో 155.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇప్పటి వరకు మెట్ట, డెల్టాలకు పరిమితమైన వర్షం ఏజెన్సీపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది. వర్షాలకు కాకినాడ, రాజమండ్రి, అమలాపు రం, మండపేట, పెద్దాపురం, తుని, పిఠాపురం పట్టణాల్లో లోతట్టు కాలనీలు, గొల్లప్రోలు, తొండం గి, అన్నవరం తదితర మండలాల్లో పలు గ్రామా లు ముంపుబారిన పడ్డాయి. ముంపు తీవ్రత ఎక్కువగా ఉండడం తో కాకినాడలోని దుమ్ములపేట, పరలోవపేట, ట్రెజరీ కాలనీ, గొల్లప్రోలు ఈబీసీ కాలనీ, అమలాపురంలో కార్మికనగర్, అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారంలోని ప్రభాకరరావునగర్ వంటి ప్రాంతాల్లో ప్రజలు తాగునీటికి సైతం కొరతతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అపారిశుద్ధ్యంతో అంటురోగాలబారిన పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉధృతంగా తాండవ, సుద్దగెడ్డ శుక్ర, శనివారాల్లో కురిసిన వర్షాలతో మెట్ట ప్రాంతం అతలాకుతలమైంది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షం వల్ల వరి, పత్తి, ఇతర పం టలు మరింత ముంపుబారిన పడ్డాయి. తాం డవ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. తాండవ ప్రాజెక్టు నుంచి ఐదు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గొల్లప్రోలు మండలంలో సుద్దగెడ్డ వాగు ఉధృతి కొనసాగుతోంది. ఈబీ సీ కాలనీతోపాటు పలు కాలనీలు ఇంకా ముం పులోనే ఉన్నాయి. కోరుకొండ మండలంలో బురదకాలువ ఉధృతి తగ్గినా శ్రీరంగపట్నంలో ముంపు తగ్గ లేదు. ఇక్కడ 500 కుటుంబాల వారు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. పంపా వరద ఉధృతి కూడా చాలా వరకు తగ్గింది. పంపా నీటితో ముంపుబారిన పడిన 16వ నంబరు జాతీయ రహదారిపై వరద తగ్గడంతో రాకపోకలు మొదలయ్యాయి. అన్నదాతలకు అంతటా నష్టమే.. ముసురుతో ముంపు తీయక పంట నష్టం పెరుగుతోంది. డెల్టాలో ఇంత వరకు ఆలమూరు, కాజులూరు, రామచంద్రపురం, అనపర్తి సబ్ డి విజన్లలో మాత్రమే వరికి ఎక్కువగా నష్టం వా టిల్లగా తాజాగా పెద్దాపురం, కరప, కాకినాడ, జగ్గంపేట, ఏలేశ్వరం, ముమ్మిడివరం సబ్ డివి జన్లలో సైతం నష్టం పెరుగుతోంది. సుమారు రెండు లక్షల ఎకరాల్లో వరి చేలు ముంపుబారిన పడగా, వీటిలో 70 వేల ఎకరాల్లో చేలు కోతలకు సిద్ధంగా ఉన్నాయి. నీట నాని ధాన్యం మొలక వస్తుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వర్షాలు తగ్గినా తూర్పుడెల్టా లో టేకితోపాటు ప్రధాన డ్రైన్లు పొంగి పొర్లుతుండడంతో మరో రెండు, మూడు రోజులు చే లు ముంపులోనే ఉండే అవకాశముంది. దీని వల్ల దిగుబడి తగ్గడం, ధాన్యం రంగుమారి ధర వచ్చే అవకాశం లేకపోవడం వంటి కారణాల వ ల్ల ఎకరాకు రూ.12 వేల చొప్పున రూ.84 కోట్ల మేర నష్టం వాటిల్లుతుందని రైతులు అంచనా వేస్తున్నారు. కోనసీమలో చేలు ఇంకా నాలుగై దు రోజులు జలదిగ్బంధంలో ఉండే అవకాశముంది. సగం దిగుబడి కోల్పోయినట్టేనని రైతు లు ఆందోళన చెందుతున్నారు. 70 శా తం చేలు ఇప్పుడిప్పుడే పాలు పోసుకుంటుండం వల్ల ముంపుబారిన పడినా పెద్దగా నష్టముండదని అధికారులంటున్నా ఈ చేలల్లో దుబ్బుకుళ్లు వ్యాధి వచ్చే అవకాశముందని, ఎకరాకు ఐదు బస్తాల చొప్పున దిగుబడి కోల్పోతామని రైతులు చెబుతున్నారు. ఒక్క వరికే వర్షాల వల్ల రూ.100 కోట్ల నష్టం వచ్చినట్టు రైతులు చెబుతున్నారు. మెట్టలో 20 వేల ఎకరాల్లో పత్తి దెబ్బతింది. ఎకరాకు రూ.20 వేల మేర నష్టం వచ్చిం దని రైతులు చెబుతున్నా రు. ఇప్పటికే రైతులు ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.35 వేల వర కు పెట్టుబడిగా పెట్టారు. పత్తితోపాటు ఏజెన్సీ, మెట్టల్లో మొక్కజొ న్న, ఉల్లి, దుంప, వేరుశనగ, చెరకు, కాయగూర పంటలు కలిపి మరో రూ.50 కోట్ల నష్టం వాటిల్లిందని చెబుతున్నా రు. మొత్తమ్మీద ముసురు డెల్టా, మెట్ట, ఏజెన్సీ తేడా లేకుండా రైతుల ఆశలను ముంచేసింది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఇవీ నష్టాలు.. కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌లైన్ : భారీ వర్షాల కారణంగా జిల్లాలో రూ.రెండు కోట్ల 14 లక్ష ల 20 వేలు నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 67,216 హె క్టార్లలో వరి, ఉద్యానవన పంటలు ముంపునకు గురయ్యాయని ఒక ప్రకటనలో తెలిపా రు. లోతట్టు ప్రాంతాల్లోని 22,603 మందిని 42 పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారం, మంచినీటి ప్యాకెట్లను అందించినట్టు తెలిపారు. 102 పక్కా ఇళ్లు, 149 క చ్చా ఇళ్లు పూర్తిగా, 65 పక్కా ఇళ్లు, 486 కచ్చా ఇళ్లు తీవ్రంగా, 683 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్టు తెలిపారు. 607 గుడిసెలు దెబ్బతి న్నాయన్నారు. ఇళ్లకు రూ.46,93,200 నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు. వివిధ కాలువలకు ఏర్పడిన గండ్ల వల్ల రూ.20 లక్షలు, ఆర్అండ్బీ రహదారులకు రూ. 20.48 లక్షలు నష్టం జరిగినట్టు పేర్కొన్నారు.