నష్టాలకు తెరిపేదీ?
Published Mon, Oct 28 2013 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 12:02 AM
అమలాపురం, న్యూస్‌లైన్ :కసి పట్టినట్టు చినుకులనే బాణాలుగా దూసి, తేరుకోలేని దెబ్బ తీసిన వరుణుడు వారం తర్వాత శాంతించాడు. ఆదివారం తెల్లవారుజాము వరకు భారీగా కురిసిన వర్షాలు ఉదయం నుంచి తెరిపినిచ్చాయి. అయితే ఆరురోజుల ముసురుకు శనివారం అర్ధరాత్రి నుంచి కురిసిన జడివాన తోడవడంతో అటు చేలు, ఇటు పల్లపు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకునే ఉన్నాయి. శనివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఆదివారం ఉదయం ఎనిమిది గంటల వరకు జిల్లాలో సగటున 62 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
అత్యధికంగా ఏజెన్సీలోని వై.రామవరం మండలంలో 155.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇప్పటి వరకు మెట్ట, డెల్టాలకు పరిమితమైన వర్షం ఏజెన్సీపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది. వర్షాలకు కాకినాడ, రాజమండ్రి, అమలాపు రం, మండపేట, పెద్దాపురం, తుని, పిఠాపురం పట్టణాల్లో లోతట్టు కాలనీలు, గొల్లప్రోలు, తొండం గి, అన్నవరం తదితర మండలాల్లో పలు గ్రామా లు ముంపుబారిన పడ్డాయి. ముంపు తీవ్రత ఎక్కువగా ఉండడం తో కాకినాడలోని దుమ్ములపేట, పరలోవపేట, ట్రెజరీ కాలనీ, గొల్లప్రోలు ఈబీసీ కాలనీ, అమలాపురంలో కార్మికనగర్, అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారంలోని ప్రభాకరరావునగర్ వంటి ప్రాంతాల్లో ప్రజలు తాగునీటికి సైతం కొరతతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అపారిశుద్ధ్యంతో అంటురోగాలబారిన పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉధృతంగా తాండవ, సుద్దగెడ్డ
శుక్ర, శనివారాల్లో కురిసిన వర్షాలతో మెట్ట ప్రాంతం అతలాకుతలమైంది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షం వల్ల వరి, పత్తి, ఇతర పం టలు మరింత ముంపుబారిన పడ్డాయి. తాం డవ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. తాండవ ప్రాజెక్టు నుంచి ఐదు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గొల్లప్రోలు మండలంలో సుద్దగెడ్డ వాగు ఉధృతి కొనసాగుతోంది. ఈబీ సీ కాలనీతోపాటు పలు కాలనీలు ఇంకా ముం పులోనే ఉన్నాయి. కోరుకొండ మండలంలో బురదకాలువ ఉధృతి తగ్గినా శ్రీరంగపట్నంలో ముంపు తగ్గ లేదు. ఇక్కడ 500 కుటుంబాల వారు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. పంపా వరద ఉధృతి కూడా చాలా వరకు తగ్గింది. పంపా నీటితో ముంపుబారిన పడిన 16వ నంబరు జాతీయ రహదారిపై వరద తగ్గడంతో రాకపోకలు మొదలయ్యాయి.
అన్నదాతలకు అంతటా నష్టమే..
ముసురుతో ముంపు తీయక పంట నష్టం పెరుగుతోంది. డెల్టాలో ఇంత వరకు ఆలమూరు, కాజులూరు, రామచంద్రపురం, అనపర్తి సబ్ డి విజన్లలో మాత్రమే వరికి ఎక్కువగా నష్టం వా టిల్లగా తాజాగా పెద్దాపురం, కరప, కాకినాడ, జగ్గంపేట, ఏలేశ్వరం, ముమ్మిడివరం సబ్ డివి జన్లలో సైతం నష్టం పెరుగుతోంది. సుమారు రెండు లక్షల ఎకరాల్లో వరి చేలు ముంపుబారిన పడగా, వీటిలో 70 వేల ఎకరాల్లో చేలు కోతలకు సిద్ధంగా ఉన్నాయి. నీట నాని ధాన్యం మొలక వస్తుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వర్షాలు తగ్గినా తూర్పుడెల్టా లో టేకితోపాటు ప్రధాన డ్రైన్లు పొంగి పొర్లుతుండడంతో మరో రెండు, మూడు రోజులు చే లు ముంపులోనే ఉండే అవకాశముంది. దీని వల్ల దిగుబడి తగ్గడం, ధాన్యం రంగుమారి ధర వచ్చే అవకాశం లేకపోవడం వంటి కారణాల వ ల్ల ఎకరాకు రూ.12 వేల చొప్పున రూ.84 కోట్ల మేర నష్టం వాటిల్లుతుందని రైతులు అంచనా వేస్తున్నారు. కోనసీమలో చేలు ఇంకా నాలుగై దు రోజులు జలదిగ్బంధంలో ఉండే అవకాశముంది.
సగం దిగుబడి కోల్పోయినట్టేనని రైతు లు ఆందోళన చెందుతున్నారు. 70 శా తం చేలు ఇప్పుడిప్పుడే పాలు పోసుకుంటుండం వల్ల ముంపుబారిన పడినా పెద్దగా నష్టముండదని అధికారులంటున్నా ఈ చేలల్లో దుబ్బుకుళ్లు వ్యాధి వచ్చే అవకాశముందని, ఎకరాకు ఐదు బస్తాల చొప్పున దిగుబడి కోల్పోతామని రైతులు చెబుతున్నారు. ఒక్క వరికే వర్షాల వల్ల రూ.100 కోట్ల నష్టం వచ్చినట్టు రైతులు చెబుతున్నారు. మెట్టలో 20 వేల ఎకరాల్లో పత్తి దెబ్బతింది. ఎకరాకు రూ.20 వేల మేర నష్టం వచ్చిం దని రైతులు చెబుతున్నా రు. ఇప్పటికే రైతులు ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.35 వేల వర కు పెట్టుబడిగా పెట్టారు. పత్తితోపాటు ఏజెన్సీ, మెట్టల్లో మొక్కజొ న్న, ఉల్లి, దుంప, వేరుశనగ, చెరకు, కాయగూర పంటలు కలిపి మరో రూ.50 కోట్ల నష్టం వాటిల్లిందని చెబుతున్నా రు. మొత్తమ్మీద ముసురు డెల్టా, మెట్ట, ఏజెన్సీ తేడా లేకుండా రైతుల ఆశలను ముంచేసింది.
ప్రాథమిక అంచనాల ప్రకారం ఇవీ నష్టాలు..
కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌లైన్ : భారీ వర్షాల కారణంగా జిల్లాలో రూ.రెండు కోట్ల 14 లక్ష ల 20 వేలు నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 67,216 హె క్టార్లలో వరి, ఉద్యానవన పంటలు ముంపునకు గురయ్యాయని ఒక ప్రకటనలో తెలిపా రు. లోతట్టు ప్రాంతాల్లోని 22,603 మందిని 42 పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారం, మంచినీటి ప్యాకెట్లను అందించినట్టు తెలిపారు. 102 పక్కా ఇళ్లు, 149 క చ్చా ఇళ్లు పూర్తిగా, 65 పక్కా ఇళ్లు, 486 కచ్చా ఇళ్లు తీవ్రంగా, 683 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్టు తెలిపారు. 607 గుడిసెలు దెబ్బతి న్నాయన్నారు. ఇళ్లకు రూ.46,93,200 నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు. వివిధ కాలువలకు ఏర్పడిన గండ్ల వల్ల రూ.20 లక్షలు, ఆర్‌అండ్‌బీ రహదారులకు రూ. 20.48 లక్షలు నష్టం జరిగినట్టు పేర్కొన్నారు.
Advertisement
Advertisement