rain effect
-
IND vs SA 2nd T20: టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్..
ఆదివారం గెబేహా వేదికగా జరగనున్న రెండో టీ20లో భారత్-దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. తొలి టీ20లో సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా ఇప్పుడు రెండో టీ20లో కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు మొదటి టీ20లో ఓటమి చవిచూసిన సఫారీ జట్టు.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా టీమిండియాను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని యోచిస్తోంది.అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశముంది. ఆక్యూవెదర్ రిపోర్ట్ ప్రకారం.. మ్యాచ్ ప్రారంభ సమయానికి గెబేహాలో 50 శాతం వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వర్షం కారణంగా టాస్ కూడా ఆలస్యమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. కాగా ఈ మ్యాచ్ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. అంటే భారత కాలమానం ప్రకారం మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలు కానుంది. అదే విధంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో కూడా వరుణుడు ఇబ్బంది కలిగించే అస్కారం ఉన్నట్లు స్ధానిక వాతవారణ శాఖ కూడా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఒకవేళ పూర్తి స్థాయిలో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే.. కనీసం 5 ఓవర్ల గేమ్‌నైనా ఆడిస్తారు. అలా కూడా కుదరకపోతే మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేస్తారు.తుది జట్లు(అంచనా)దక్షిణాఫ్రికా: ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, పాట్రిక్ క్రూగర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, ఒట్నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కోయెట్జీభారత్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, అవేష్ ఖాన్చదవండి: CK Nayudu Trophy: ఊచకోత.. ఒకే ఇన్నింగ్స్‌లో 426 పరుగులు! 46 ఫోర్లు, 8 సిక్స్‌లతో -
భారత్-కివీస్ తొలి టెస్టు: అభిమానులకు బ్యాడ్‌న్యూస్!
క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. భారత్, న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచి (అక్టోబర్ 16) ప్రారంభం కాబోయే తొలి టెస్ట్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగులుతాడని వాతావరణ శాఖ హెచ్చరించింది. మ్యాచ్‌కు వేదిక అయిన బెంగళూరులో ఇవాల్టి నుంచే వర్షం ప్రారంభమైంది. వర్షం కారణంగా ఇవాళ జరగాల్సిన ప్రాక్టీస్ సెషన్ పూర్తిగా రద్దైపోయింది. మ్యాచ్ జరిగే ఐదు రోజులు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ ఫోర్‌కాస్ట్‌లో తెలిసింది.ITS RAINING IN CHINNASWAMY STADIUM 👀- Bad news for IND vs NZ Test...!!!pic.twitter.com/y3G0poVr8U— Johns. (@CricCrazyJohns) October 15, 2024కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగనుంది. రెండో టెస్ట్ పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో.. మూడో మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగనున్నాయి.Rain predicted for all 5 days at the Chinnaswamy Stadium for the 1st Test between India and New Zealand. 🌧️ pic.twitter.com/D8Af2HARvR— Mufaddal Vohra (@mufaddal_vohra) October 15, 2024న్యూజిలాండ్‌తో టెస్టులకు భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.రిజర్వ్ ఆటగాళ్లు: హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.భారత్‌తో టెస్టు సిరీస్‌కు న్యూజిలాండ్ టీమ్డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, మార్క్ చాప్మన్, విల్ యంగ్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర, టామ్ బ్లండెల్, అజాజ్ పటేల్, బెన్ సియర్స్, మాట్ హెన్రీ, టిమ్ సౌథీ, విలియం ఓ రూర్కే.చదవండి: Ind vs NZ 2024: షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
IND VS BAN: మూడో టీ20కి వర్షం ముప్పు..?
భారత్, బంగ్లాదేశ్ మధ్య హైదరాబాద్ వేదికగా ఇవాళ (అక్టోబర్ 12) జరగాల్సిన మూడో టీ20కి వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఇవాళ సాయంత్రం తర్వాత వాతావరణంలో మార్పులు సంభవించవచ్చని వారు పేర్కొన్నారు. నగరంలో ఇవాళ సాయంత్రం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడవచ్చని అంచనా.నిన్న సాయంత్రం కూడా నగరంలో భారీ వర్షం కురిసింది. నిన్నటి నుంచి మైదానం మొత్తాన్ని కవర్లతో కప్పి ఉంచారు. ఈ మ్యాచ్ రద్దైనా టీమిండియాకు ఎలాంటి నష్టం జరగనప్పటికీ.. హైదరాబాద్ అభిమానులు మాత్రం చాలా నిరాశ చెందుతారు. ఈ మ్యాచ్ కోసం నగర వాసులు చాలా రోజుల నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. గ్వాలియర్‌లో జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో నెగ్గిన భారత్.. న్యూఢిల్లీ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో 86 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. వర్షం నుంచి ఎలాంటి అవాంతరాలు ఎదురు కాకుంటే ఈ మ్యాచ్‌ను కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది. చదవండి: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్.. భారత జట్టు ప్రకటన -
బంగాళాఖాతంలో మరో తుఫాన్
-
Pakistan Vs Bangladesh 2nd Test: తొలి రోజు ఆట రద్దు
రావల్పిండి వేదికగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య ఇవాళ (ఆగస్ట్ 30) మొదలుకావాల్సిన రెండో టెస్ట్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. భారీ వర్షానికి రావల్పిండి మైదానం తడిసి ముద్ద కావడంతో అంపైర్లు తొలి సెషన్ వరకు చూసి ఆతర్వాత తొలి రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మ్యాచ్ ఐదు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని తెలుస్తుంది.కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు పాకిస్తాన్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బంగ్లా ఆటగాళ్లు అన్ని విభాగాల్లో సత్తా చాటి పాక్‌ను వారి సొంతగడ్డపై 10 వికెట్ల తేడాతో మట్టికరిపించారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 565 పరుగులు చేసి ఆలౌటైంది.సెకెండ్ ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్లు చెలరేగడంతో పాక్ 146 పరుగులకే ఆలౌటైంది. -
వర్షాల ఎఫెక్ట్.. గాలి నాణ్యతలో ఢిల్లీ సరికొత్త రికార్డు
ఢిల్లీ: నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీకి ఉపశమనం లభించింది. గురువారం(ఆగస్టు 8) రాజధానివాసులు గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంత స్వచ్ఛమైన గాలి పీల్చుకున్నారు. ఢిల్లీలో గాలి నాణ్యత గత ఆరేళ్లలో ఎప్పుడూ లేనంత స్థాయిలో పెరిగి ఆగస్టు 8న సాయంత్రం 4 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ)లో 53గా నమోదైంది. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్(సీఏక్యూఎమ్) ఒక ట్వీట్లో తెలిపింది. భారీ వర్షాల కారణంగానే ఢిల్లీలో గాలి నాణ్యత పెరిగినట్లు వెల్లడించింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 0 నుంచి 50 మధ్య ఉంటే గుడ్, 50 నుంచి 100 మధ్య ఉంటే సంతృప్తికరం, 101 నుంచి 200 ఉండే ఓ మోస్తరు, 201 నుంచి 300 ఉంటే పూర్, 301నుంచి 400 ఉంటే వెరీ పూర్‌గా పరిగణిస్తారు. -
TS రెడ్ అలర్ట్.. బలపడిన అల్పపీడనం.. రాష్ట్రవ్యాప్తంగా అతి భారీ వర్షాలు
-
రాబోయే 5 రోజులూ ఏపీలో హై అలెర్ట్
-
T20 WC 2024: ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. రద్దైతే విజేత ఎవరంటే..?
టీ20 వరల్డ్‌కప్-2024లో తుది సమరానికి సమయం అసన్నమైంది. శనివారం(జూన్ 29)న బార్బడోస్ వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో భారత్-దక్షిణాఫ్రికా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.ఈ ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే ఈ తుది పోరుకు వర్షం వర్షం ముప్పు పొంచి ఉంది. శనివారం మ్యాచ్ జరగనున్న బార్బడోస్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అక్యూ వెదర్ రిపోర్ట్ ప్రకారం.. జూన్ 29న బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో 78 శాతం వర్షం పడే అవకాశం ఉంది. స్ధానిక కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 10:30 ప్రారంభం కానుంది. మ్యాచ్ జరిగే రోజు బార్బోడస్‌లో ఉదయం 3 గంటల నుండి వర్షం మొదలు కానున్నట్లు అక్కడ వాతవారణ శాఖసైతం వెల్లడించింది. ఈ క్రమంలో ఇరు జట్లు అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఏంటి పరిస్థితి అని చర్చించుకుంటున్నారు.రిజర్వ్ డే..ఈ ఫైనల్ మ్యాచ్‌కు ఐసీసీ రిజర్వ్ డే కేటాయించింది. శనివారం (జూన్ 29) నాడు వర్షం కారణంగా పూర్తిగా మ్యాచ్ మొదులు కాకపోతే రిజర్వ్ డే అయిన ఆదివారం మ్యాచ్‌ను నిర్వహిస్తారు.ఒకవేళ మ్యాచ్ ప్రారంభమై ఆగిపోతే.. శనివారం ఎక్కడైతే మ్యాచ్ ఆగిందో అక్కడి నుంచే ఆటను కొనసాగిస్తారు. మరోవైపు శనివారం టాస్ పడ్డాక.. వర్షం అటంకం కలిగించి మ్యాచ్ ప్రారంభం కాకపోతే, మళ్లీ తాజాగా రిజర్వ్‌డే ఆదివారం రోజు టాస్ నిర్వహిస్తారు. మ్యాచ్ రద్దు అయితే?కాగా ఈ మ్యాచ్ ఫలితాన్ని ఎలాగైనా తేల్చేందుకు ఐసీసీ అదనంగా 190 నిమిషాలు సమయం కేటాయించింది. ఈ ఎక్స్ట్రా సమయం మ్యాచ్డేతో పాటు రిజర్వ్‌డేకు కూడా వర్తిస్తోంది. అయితే రిజర్వ్‌డే రోజు కూడా ఆటసాధ్య పడకపోతే.. రెండు జట్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు. దక్షిణాఫ్రికా, భారత్ రెండు జట్లు ట్రోఫీని సంయుక్తంగా పంచుకుంటున్నాయి. కాగా డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో విజేతను నిర్ణయించాల్సి వస్తే ఇరు జట్లు కనీసం 10 ఓవర్ల చొప్పున అయిన బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. -
T20 World Cup 2024: వర్షం ఎఫెక్ట్.. భారత్-కెనడా మ్యాచ్ రద్దు
టీ20 వరల్డ్‌కప్-2024లో మరో మ్యాచ్ వర్షార్పణమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఫ్లోరిడా వేదికగా శనివారం భారత్-కెనడా మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. భారీ వర్షం కారణంగా స్టేడియం ఔట్ ఫీల్డ్ మొత్తం చిత్తడిగా మారింది. పలుమార్లు పిచ్‌ను పరిశీలించిన అంపైర్లు ఆటగాళ్లు భద్రత(గాయాల బారిన పడకుండా) దృష్ట్యా.. చివరికి మ్యాచ్‌ను రద్దు చేశారు. టాస్ పడకుండానే ఈ మ్యాచ్‌ను అంపైర్లు రద్దుచేశారు.దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. కాగా ఇదే స్టేడియంలో శుక్రవారం అమెరికా-ఐర్లాండ్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఇక ఈ మెగా టోర్నీలో ఇప్పటికే టీమిండియా సూపర్-8లో అడుగుపెట్టింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో భారత్ అద్భుత విజయాలు నమోదు చేసింది. ఇక సూపర్-8లో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్‌లో బార్బోడస్ వేదికగా జూన్ 20న తలపడనుంది. మరోవైపు కెనడా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. -
హైదరాబాద్ లో భారీ వర్షం
-
టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్.. అభిమానులకు బ్యాడ్ న్యూస్!?
టీ20 వరల్డ్‌కప్-2024లో హై వోల్టేజ్ క్రికెట్ సమరానికి రంగం సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా జూన్ 9 న్యూయర్క్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ చిరకాల ప్రత్యర్థుల పోరును వీక్షించేందుకు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే ఛాన్స్ ఉంది. ఆదివారం మ్యాచ్ జరిగే సమయంలో న్యూయర్క్‌లో వర్షం పడే అవకాశం ఉందని ‘అక్యూ వెదర్’ రిపోర్ట్ ప్రకటించింది. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలు) ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ సమయంలో 40 శాతం నుంచి 50 శాతం వరకు వర్షం పడే అవకాశం ఉందని అక్యూ వెదర్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది.వర్ష సూచన మధ్యాహ్నం 1 గంట సమయానికి 10 శాతానికి తగ్గి.. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ 40 శాతానికి పెరగనుందని అంచనా వేసింది. ఒక వేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తోంది. -
వర్షం బీభత్సం.. నిలిచిపోయిన ట్రాఫిక్
-
ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)
-
కుండపోత వర్షం హైదరాబాద్ జలమయం
-
తెలంగాణకు చల్లని కబురు
-
Telangana : గుడ్ న్యూస్.. రేపటి నుంచి వర్షాలు
-
కోస్తా తీరంలో వర్షాలు
-
వర్ష బీభత్సం ! ఒక్కసారిగా మారిన వాతావరణం
-
ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. భారత్-ఇంగ్లండ్ ఐదో టెస్టుపై నీలినీడలు
ధర్మశాల వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడేందుకు సిద్దమవుతున్నాయి. మార్చి 7 నుంచి ఇరు జట్ల మధ్య ఈ ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత జట్టు ఆఖరి మ్యాచ్‌లో కూడా ప్రత్యర్ధిని చిత్తు చేయాలని భావిస్తుంటే.. ఇంగ్లండ్ మాత్రం భారత టూర్ విజయంతో ముగించాలని వ్యూహాలు రచిస్తోంది. ఇంగ్లండ్ జట్టు ఇప్పటికే ధర్మశాలకు చేరుకోగా.. టీమిండియా సోమవారం చేరుకునే ఛాన్స్ ఉంది. నీలినీడలు.. అయితే ఈ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆఖరి టెస్టు సజావుగా జరిగే సూచనలు కన్పించడం లేదు. ధర్మశాల వాతావరణమే ఇందుకు కారణం. ఐదో టెస్టు మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశమున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఆదివారం(మార్చి 3) అయితే ఎడతెరిపి లేకుండా వర్షం కురిసినట్లు తెలుస్తోంది. రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.అంతేకాకుండా అక్కడ చాలా చల్లని వాతావరణం ఆటగాళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ది టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం.. "ధర్మశాలలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. అంతేకాకుండా వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గరిష్ట ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెల్సియస్‌గానూ, కనిష్ట ఉష్ణోగ్రత -4 డిగ్రీల కంటే తక్కువగానూ ఉండే ఛాన్స్ ఉంది. వర్షంతో పాటు హిమపాతం కూడా మ్యాచ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని" నివేదిక పేర్కొంది. -
లంక, జింబాబ్వే వన్డే రద్దు..
కొలంబో: శ్రీలంక, జింబాబ్వే మధ్య శనివారం జరిగిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దయింది. ముందుగా లంక 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. చరిత్ అసలంక (95 బంతుల్లో 101; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ సాధించగా...కుశాల్ మెండిస్ (46), సమరవిక్రమ (41) రాణించారు. అనంతరం జింబాబ్వే 4 ఓవర్లలో 2 వికెట్లకు 12 పరుగులు చేసింది. వర్షం రాగా మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే జనవరి 8న కొలంబో వేదికగా జనవరి 8న జరగనుంది. చదవండి: T20 WC: రోహిత్ ఒక్కడే రీఎంట్రీ.. కోహ్లికి నో ఛాన్స్? అగార్కర్ అంతటి సాహసం చేస్తాడా? -
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు.. టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!
వన్డే వరల్డ్‌కప్-2023లో ఓటమి తర్వాత తొలిసారి టీమిండియా సాంప్రాదాయ క్రికెట్లో ఆడనుంది. దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌లో తలపడేందుకు భారత జట్టు సిద్దమైంది. సఫారీ గడ్డపై ఇప్పటివరకు టెస్టు సిరీస్ గెలవని భారత జట్టు.. ఈసారి ఎలాగైనా సొంతం రెడ్ బాల్ సిరీస్‌ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాలని పట్టుదలగా ఉంది. ఈ సిరీస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు మ్యాచ్ డిసెంబర్ 26న ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ తొలి రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది. సోమవారం(డిసెంబర్ 25)న ఉదయం నుంచి సెంచూరియన్‌లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. వర్షం కారణంగా టీమిండియా తమ ఆఖరి ప్రాక్టీస్ సెషన్‌కు దూరమైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మ్యాచ్ జరిగే సమయంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అక్కడ వాతావరణ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ క్రమంలో తొలి రోజు ఆట పూర్తిగా రద్దు అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. గూగుల్ వెదర్ రిపోర్ట్ ప్రకారం.. రెండో రోజు కూడా 70 శాతం వర్షం కురిసే అస్కారం ఉంది. చదవండి: IPL 2024: పాండ్యా కోసం రూ. 100 కోట్లు చెల్లించిన ముంబై? బంగారు బాతు కదా! -
IND vs SA: దక్షిణాఫ్రికాతో తొలి వన్డే.. టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!?
జోహన్నెస్‌బర్గ్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ప్రోటీస్‌తో టీ20 సిరీస్‌ను సమం చేసిన భారత జట్టు.. వన్డే సిరీస్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ సిరీస్‌లో భారత జట్టు కెప్టెన్‌గా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నాడు. ఇప్పటికే జోహన్నెస్‌బర్గ్‌కు చేరుకున్న రాహుల్ సేన తొలి మ్యాచ్ కోసం తీవ్రంగా శ్రమించింది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది. ఆదివారం మ్యాచ్ జరిగే జోహన్నెస్‌బర్గ్ తెలికపాటి జల్లు కురిసే అవకాశముందని అక్కడ వాతావారణ శాఖ తెలిపింది. వర్షం పడటానికి 51 శాతం ఆస్కారం ఉందని వాతావారణ శాఖ వెల్లడించింది. అయితే కాగా సెకెండ్ ఇన్నింగ్స్ సమయానికి పెద్దగా వర్ష సూచనలు లేవు. కాగా టీ20 సిరీస్‌లో కూడా తొలి రెండు మ్యాచ్‌లకు వర్షం ఆటంకం కలిగించిన సంగతి తెలిసిందే. మొదటి టీ20 వర్షం కారణంగా పూర్తిగా రద్దు కాగా.. రెండో టీ20 డక్‌వర్త్ లూయిస్ పద్దతి ద్వారా ఫలితం తేలింది. కాగా ఈ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, జడేజా, బుమ్రా వంటి స్టార్ ఆటగాళ్లు దూరమయ్యారు. తొలి వన్డేకు భారత తుది జట్టు(అంచనా) రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కెప్టెన్), సంజు శాంసన్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్ చదవండి: ENG vs WI: ఎస్ఆర్హెచ్ వదిలేసింది.. అక్కడ విధ్వంసం సృష్టించాడు! కేవలం 7 బంతుల్లోనే -
ప్రపంచంలో ఇప్పటివరకు వర్షం కురవని ఊరు!ఎక్కడ ఉందంటే..
ఈ భూమ్మీద ఒక్కో చోట ఒక్కో వాతావరణం కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఎండలు మండిపోతే, మరికొన్ని చోట్ల నెలల తరబడి వర్షం కురుస్తుంది. ఇంకొన్ని చోట్ల అయితే విపరీతంగా చలి కమ్మేస్తుంది. ఇలా ఒక్కో ప్రాంతంలో వాతవరణ పరిస్థితి ఒక్కోలా ఉంటుంది. కానీ అసలు వర్షమే కురవని గ్రామం ఈ భూమ్మీద ఉంటుందని మీకు తెలుసా? మరి ఆ గ్రామం ఎక్కడ ఉంది? అన్నది తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి. వర్షం మానవాళి మనుగడకు ఎంతో ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏది ఎక్కువైనా, ఏది తక్కువైనా కష్టమే. కానీ ఈ ఊర్లో మాత్రం ఇప్పటివరకు అసలు వర్షం ఊసే లేదు. ప్రపంచంలో వర్షం పడని ప్రాంతం ఇదే. ఆ గ్రామం పేరు ‘అల్-హుతైబ్’. ఇది యెమెన్ రాజధాని సనాకు పశ్చిమాన ఉంది. భూ ఉపరితలానికి 3,200 మీటర్ల ఎత్తులో ఎర్రటి రాతి కొండపై ఉంది. ఈ గ్రామం ఉంది. ఇక్కడ ఉదయం సూర్యుడు ఉదయించగానే వాతావరణం వేడుక్కిపోతుంది. సాయంత్రం కాగానే విపరీతమైన చలి కమ్మేస్తుంది. ఈ ఊర్లో అసలు ఎప్పుడూ వర్షం పడకపోవడానికి కారణం.. గ్రామం మేఘాలు పేరుకుపోని ఎత్తులో ఉండడమే. సాధారణంగా ఘాలు భూమి నుంచి రెండు కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి. ఈ ఊరు ఏకంగా భూమికి మూడు కిలో మీటర్ల ఎత్తులో ఉంటుంది. మేఘాల కన్నా ఎత్తులో ఈ గ్రామం ఉంది కాబట్టే ఇక్కడ ఎప్పుడూ వర్షం కురవదు.అందుకే ప్రపంచంలోనే ‘డ్రై సిటీ’గా దీనికి పేరుంది. ఇక్కడ అల్ బోహ్రా ( అల్ ముఖర్మ ) తెగలకు చెందిన ప్రజలు ఎక్కువగా ఉంటారు. వీరిని యెమెన్ కమ్యూనిటీస్‌గా పిలుస్తారు. మరి వర్షం లేకుండా అక్కడి ప్రజలు ఎలా బతుకున్నారు అని సందేహమా? ఇక్కడి నీటి సమస్యలు తీర్చడానికి మొబైల్ ట్యాంకర్లతో ప్రతిరోజూ నీటిని సరఫరా చేస్తారట. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ ప్రాంతానికి ఎక్కువగా టూరిస్టులు వస్తుంటారు. మేఘాల కంటే ఎత్తులో ఉండటంతో ఈ వింతైన గ్రామం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. కొండ కింది భాగంలో చిన్న చిన్న జలపాతాలు కూడా ఎంతో ఆకట్టుకుంటాయి. చేతికి తాకే దూరంలో మేఘాలు, ఇక్కడి ప్రజల లైఫ్‌స్టైల్ టూరిస్టులను ఆకట్టుకుంటున్నారు. అంతేకాకుండా అల్ హుతైబ్ కొండపై ‘క్వాట్’ అనే ఆకర్షణీయమైన మొక్కలను ఎక్కువగా పండిస్తారు. Hutaib village in Haraz. Some of the best #Yemen coffee made here. Sipping on hot cup to the sound of birds and literally being above the clouds..priceless. So much to lose, and next to nothing to gain by current ugly war. Need cooler heads and compromise for any chance of peace. pic.twitter.com/264McKUgaF — Hisham Al-Omeisy هشام العميسي (@omeisy) September 18, 2019 -
CWC 2023 AUS VS SA 2nd Semis: అభిమానులకు బ్యాడ్‌న్యూస్
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇవాళ (నవంబర్ 16) జరగాల్సిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని తెలుస్తుంది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతానికి ఈడెన్ గార్డెన్స్‌లో వర్షం పడనప్పటికీ.. స్టేడియం మొత్తాన్ని కవర్లతో కప్పేశారు. The covers are on at the Eden Gardens. pic.twitter.com/X3gMgFTAFw — Mufaddal Vohra (@mufaddal_vohra) November 16, 2023 ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే కూడా ఉంది కాబట్టి, మ్యాచ్ ఇవాళ రద్దైనా రేపు జరుగుతుంది. వాతవరణం అప్డేట్ తెలిసి క్రికెట్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఆస్ట్రేలియా అభిమానులు మరింత కలవరపడుతున్నారు. ఒకవేళ ఏ కారణంగా అయినా మ్యాచ్ రద్దైతే మెరుగైన రన్‌రేట్ ఉన్న కారణంగా సౌతాఫ్రికా ఫైనల్స్‌కు చేరుకుంటుంది. మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగలకూడదని ఆసీస్ అభిమానులు కోరుకుంటున్నారు. కాగా, న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) అద్బుత శతకాలతో పాటు మొహమ్మద్ షమీ (9.5-0-57-7) సూపర్ బౌలింగ్‌తో మెరవడంతో భారత్ తిరుగలేని విజయం సాధించి, నాలుగోసారి ఫైనల్స్‌కు చేరింది. -
ఆస్ట్రేలియాతో రెండో వన్డే.. టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!
వన్డే ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియాతో జరగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా బోణీ కొట్టింది. ఈ సిరీస్‌లో భాగంగా మొహాలీ వేదికగా జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో టీమిండియా అదరగొట్టింది. ఈ విజయంతో వన్డేల్లో నెం1 జట్టుగా భారత్ అవతరించింది. ఇక ఈ సిరీస్‌లో భాగంగా రెండో వన్డే ఆదివారం(సెప్టెంబర్ 24) ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. అయితే టీమిండియా ఆశలపై వరుణుడు నీళ్లు జల్లే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ జరిగే సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని అక్కడ వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం రోజు మొత్తం ఆకాశం మేఘావృతమై ఉంటుందని పలు నివేదికలు వెల్లడించాయి. తుది జట్లు(అంచనా) భారత్: శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ప్రసిద్ద్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషేన్, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్, పాట్ కమ్మిన్స్(కెప్టెన్), సీన్ అబాట్, ఆడమ్ జంపా చదవండి: ICC Rankings: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే రెండో జట్టుగా -
ఖమ్మంలో ఉగ్రరూపం దాల్చిన మున్నేరు
-
చివరి క్షణంలో ఇంగ్లాండ్ కు షాక్ ఇచ్చిన వర్షం..
-
Ind Vs WI 2nd Test Day 5: వదలని వాన... రెండో టెస్టు డ్రా! సిరీస్ భారత్‌దే
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: భారత్ గెలుపు ఆశలపై వరుణదేవుడు నీళ్లు చల్లాడు! కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న మ్యాచ్ ‘డ్రా’ కావడంతో టీమిండియా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో కీలక పాయింట్లు కోల్పోయింది. క్వీన్స్ పార్క్ ఓవల్‌లో భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టెస్టులో వాన కారణంగా ఫలితం తేలకుండా పోయింది. భారీ వర్షంతో మ్యాచ్ చివరి రోజు సోమవారం ఒక్క బంతి కూడా సాధ్యం కాలేదు. పలుమార్లు వాన రావడం, తగ్గడం, మళ్లీ రావడం జరిగాయి. ఆట ఆరంభమవుతుందని అనిపించడం, పిచ్‌ను సిద్ధం చేసే ప్రయత్నం చేయడం, అంతలోనే చినుకులతో పరిస్థితి మారిపోవడం తరచుగా జరిగింది. చివరకు స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం గం. 2:50కు అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తొలి టెస్టు గెలిచిన భారత్ సిరీస్‌ను 1–0తో సొంతం చేసుకుంది. గత మ్యాచ్‌లో 12 పాయింట్లు సాధించిన టీమిండియా ఖాతాలో ఈ ‘డ్రా’ కారణంగా 4 పాయింట్లే చేరాయి. అంతకు ముందు నాలుగో రోజు 365 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. బ్రాత్‌వైట్ (28), చందర్‌పాల్ (24 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. ఆఖరి రోజు ఆట సాగితే మిగిలిన ఎనిమిది వికెట్లు తీయడం భారత్‌కు కష్టం కాకపోయేది. కానీ వానతో లెక్క మారిపోయింది. నాలుగో రోజు చివరి సెషన్లో భారత్ దూకుడైన బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చింది. ఈ సెషన్లో ఆడిన 9 ఓవర్లలోనే టీమిండియా 63 పరుగులు చేసింది. రోచ్ ఓవర్లో ఇషాన్ ‘సింగిల్ హ్యాండ్’తో వరుసగా రెండు భారీ సిక్సర్లు బాది 33 బంతుల్లోనే కెరీర్లో తొలి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో బంతి తర్వాత భారత్ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి విండీస్‌కు 365 పరుగుల లక్ష్యాన్ని విధించింది. భారీ ఛేదనలో విండీస్‌కు సరైన ఆరంభం లభించలేదు. బ్రాత్‌వైట్ పరుగులు జోడించేందుకు ప్రయతి్నంచగా, చందర్‌పాల్ పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితమయ్యాడు. ఒకదశలో అతను 50 బంతుల్లో 3 పరుగులే చేశాడు. అశి్వన్ ఈ జోడీని విడదీసి భారత్‌కు తొలి వికెట్ అందించాడు. స్వీప్ చేయబోయిన బ్రాత్‌వైట్ ఫైన్‌లెగ్‌లో క్యాచ్ ఇచ్చాడు. అశి్వన్ తన తర్వాతి ఓవర్లోనే మెకన్జీ (0)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత చందర్‌పాల్, బ్లాక్‌వుడ్ (20 నాటౌట్) వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి రోజును ముగించారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 438; వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 255; భారత్ రెండో ఇన్నింగ్స్: యశస్వి (సి) సిల్వ (బి) వారికాన్ 38; రోహిత్ (సి) జోసెఫ్ (బి) గాబ్రియెల్ 57; గిల్ (నాటౌట్) 29; ఇషాన్ కిషన్ (నాటౌట్) 52; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (24 ఓవర్లలో 2 వికెట్లకు) 181 డిక్లేర్డ్. వికెట్ల పతనం: 1–98, 2–202. బౌలింగ్: రోచ్ 4–0–46–0, జోసెఫ్ 4–0–37–0, హోల్డర్ 4–0–26–0, గాబ్రియెల్ 6–0–33–1, వారికాన్ 6–0–36–1. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: బ్రాత్‌వైట్ (సి) ఉనాద్కట్ (బి) అశి్వన్ 28; చందర్‌పాల్ (నాటౌట్) 24; మెకెన్జీ (ఎల్బీ) (బి) అశి్వన్ 0; బ్లాక్‌వుడ్ (నాటౌట్) 20; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (32 ఓవర్లలో 2 వికెట్లకు) 76. వికెట్ల పతనం: 1–38, 2–44. బౌలింగ్: సిరాజ్ 8–2–24–0, ముకేశ్ 5–4–5–0, ఉనాద్కట్ 3–2–1–0, అశ్విన్ 11–2–33–2, జడేజా 5–1–10–0. -
ఇంగ్లండ్ యాషెస్ అవకాశాలను నీరుగారుస్తున్న వరుణుడు
5 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-2తో వెనుకపడినప్పటికీ అద్భుతమైన పోరాటపటిమ కనబరుస్తూ.. యాషెస్‌ను కైవసం చేసుకునే దిశగా పయనిస్తున్న ఇంగ్లండ్‌కు వరుణుడు అడ్డు తగులుతున్నాడు. విజయానికి కేవలం 5 వికెట్ల దూరంలో ఉన్న ఇంగ్లండ్ పాలిట వర్షం విలన్లా మారింది. నాలుగో టెస్ట్ తొలి మూడు రోజులు ఏమాత్రం ఇబ్బంది పెట్టని వర్షం నాలుగో రోజు నుంచి ఇంగ్లండ్‌కు సినిమా చూపిస్తుంది. Spot the irony ☔️#Ashes pic.twitter.com/Tb2QGYjAws — England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) July 23, 2023 నిన్న పూర్తి ఆట సాగి ఉంటే నిన్ననే ఇంగ్లండ్ మ్యాచ్ గెలిచి, సిరీస్ సమం చేసుకుని ఉండేది. నిన్న ఆఖరి సెషన్లో ఇంగ్లండ్‌పై జాలి చూపించిన వర్షం కాసేపు ఎడతెరిపినిచ్చింది. వరుణుడు కరుణించినా లబూషేన్ (111) కనికరించకపోవడంతో నాలుగో రోజు ఇంగ్లండ్ కేవలం ఒక్క వికెట్‌తోనే సరిపెట్టుకుంది. నిన్న జరిగిన 27 ఓవర్ల ఆటలో ఆసీస్ 101 పరుగులు స్కోర్ చేసి, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఐదో రోజైనా వరుణుడు కరుణిస్తాడని గంపెడాశలు పెట్టుకున్న ఇంగ్లీష్ టీమ్‌కు మరోసారి ఆశాభంగం కలిగింది. వర్షం కారణంగా ఐదో రోజు తొలి సెషన్ మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. లంచ్ సమయం తర్వాత కూడా వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. ఇదే పరిస్థితి మరో 2 గంటలు కొనసాగితే మ్యాచ్ జరిగడం దాదాపుగా అసంభవమని అక్కడి వారు చెబుతున్నారు. మరి ఈ మధ్యలో వరుణుడు ఇంగ్లండ్‌ను కరుణిస్తాడో లేక కనికరం లేకుండా వ్యవహరిస్తాడో వేచి చూడాలి. లంచ్ తర్వాత మైదాన ప్రాంతంలో కుంభవృష్టి కురుస్తున్నట్లు స్థానిక ప్రజలు సోషల్‌మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఆసీస్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 61 పరుగులు వెనుకపడి ఉంది. కనీసం 30 ఓవర్ల ఆట సాధ్యపడినా ఇంగ్లండ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంది. -
వానోస్తే బురదమయం.. ఇబ్బందులు పడుతున్న ప్రజలు
చెన్నూర్: జిల్లాలోని పలు మున్సిపాల్టీల్లో అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. వానొస్తే బురదమయంగా మారి ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలో డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షాలకు మురికి నీరంతా రోడ్లపై పారుతోంది. చినుకు పడితే రోడ్లు చిత్తడిగా మారి పలు కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వైపు మట్టి రోడ్డు ఉంది. వర్షం పడినప్పుడు బురదగా మారుతుండడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు. ఇందిరానగర్ కాలనీకి వెళ్లే దారిలో కల్వర్టు పూర్తి కాకపోవడంతో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఎన్‌పీవాడ, దుబ్బాగూడెంలకు వెళ్లే దారిలో సిమెంట్ రోడ్డు శిథిలావస్థకు చేరింది. దీంతో వర్షపు నీరు నిలిచి నడక నరకప్రాయంగా మారింది. గాంధీచౌక్ నుంచి పద్మశాలి వీధికి వేళ్లే రోడ్డు మధ్యలో నీరు నిలుస్తోంది. పెద్దగూడెం, మారెమ్మవాడలలో రహదారుల పరిస్థితి దారుణంగా తయారైంది. వర్షాలకు బురదమయంగా మారుతున్న రోడ్లను గుర్తించి అధికారులు కొత్త రోడ్ల నిర్మాణాలకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
ENG VS AUS Ashes 1st Test: ఆఖరి రోజు ఆటకు వర్షం ముప్పు
యాషెస్ సిరీస్ 2023 తొలి టెస్ట్ ఆఖరి రోజు ఆటకు వర్షం ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. ఎడ్జ్‌బాస్టన్ వాతావరణ శాఖ ఫోర్కాస్ట్ నివేదిక ప్రకారం.. ఇవాళ ఉదయం ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తుందని సమాచారం. అయితే మ్యాచ్ ఆరంభ సమయానికి వరుణుడు శాంతివచ్చని అధికారులు నివేదికలో పొందుపర్చారు. తిరిగి 11 గంటల సమయంలో వర్షం పడేందుకు 84 శాతం అవకాశాలు ఉన్నాయని.. అది మధ్యాహ్న సమయానికి 50-40 శాతానికి పడిపోవచ్చని సమాచారం. మొత్తంగా చూస్తే కీలకమైన చివరి రోజు ఆటకు వరుణుడు ఆటంకం కలిగించక మానడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, యాషెస్ సిరీస్ తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతుంది. చివరి రోజు ఆటలో ఇంగ్లండ్ గెలవాలంటే 7 వికెట్లు, ఆసీస్ గెలవాలంటే 174 పరుగులు చేయాల్సి ఉంది. బజ్‌బాల్ అప్రోచ్ అని ఇంగ్లండ్ ఓవరాక్షన్ చేయకపోయుంటే ఈ మ్యాచ్‌లో ఆ జట్టే పైచేయి సాధించి ఉండేది. ఏదో పొడిచేద్దామని ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను మరో 2 వికెట్లు మిగిలుండగానే తొలి రోజే డిక్లేర్ చేసి చేతులు కాల్చుకుంది. ప్రస్తుతం పరిస్థితి (విజయావకాశాలు) ఫిఫ్టి-ఫిఫ్టిగా ఉంది. ఆఖరి రోజు ఆసీస్ సైతం బజ్‌బాల్ అంటూ ఎదురుదాడికి దిగి విజయం సాధిస్తుందా లేక ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగి విజయాన్ని సాధిస్తారా అన్నది తేలాలంటే మరి కొద్ది గంటలు వేచి చూడాల్సిందే. -
WTC Final Day 5: క్రికెట్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్
క్రికెట్ అభిమానులకు ఇది నిజంగా చేదు వార్త. భారత్-ఆస్ట్రేలియా మధ్య రసవత్తరంగా సాగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ మ్యాచ్ చివరి రోజు ఆటకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ విషయాన్ని యూకే వాతావరణ శాఖ వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్లు సమాచారం. ఐదో రోజు ఆట ప్రారంభ సమయానికి వర్షం నుంచి ఎలాంటి ముప్పు ఉండదని, మధ్యాహ్న సమయంలో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నివేదికలో పేర్కొన్నట్లు తెలస్తోంది. ఇదే జరిగితే ఛేజింగ్ చేస్తున్న టీమిండియా లయ తప్పే ప్రమాదం ఉంది. ఆసీస్ వర్షం అంతరాయాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని టీమిండియాపై పైచేయి సాధించవచ్చు. ఒకవేళ వర్షం అంతరాయం కలిగించినా.. ఎలాగూ రిజర్వ్ డే కూడా ఉంది కాబట్టి ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం ఖాయం. అయితే ఈ పరిస్థితి ఆసీస్‌కు అనుకూలంగా, టీమిండియాకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే టీమిండియా అభిమానులు వర్షం రాకూడదని కోరుకుంటున్నారు. కాగా, 444 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన భారత్.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కోహ్లి (60 బంతుల్లో 44 బ్యాటింగ్; 7 ఫోర్లు), రహానే (59 బంతుల్లో 20 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. టీమిండియా విజయం సాధించాలంటే, ఆఖరి రోజు మరో 280 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. అంతకుముందు ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌ను 8 వికెట్లకు 270 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అలెక్స్ క్యారీ (105 బంతుల్లో 66 నాటౌట్; 8 ఫోర్లు), మిచెల్ స్టార్క్ (57 బంతుల్లో 41; 7 ఫోర్లు) ఏడో వికెట్‌కు 93 పరుగులు జోడించి ఆసీస్‌కు భారీ ఆధిక్యాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులు, భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌటైంది. చదవండి: ఐదో రోజు ఆట ముందు కోహ్లీ క్రిప్టిక్ పోస్ట్.. ఎందుకు చేశాడో తెలియక! -
IND VS AUS 2nd ODI: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
విశాఖ వేదికగా ఇవాళ (మార్చి 19) మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభంకావాల్సిన భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోతుందేమోనని ఆందోళన చెందిన అభిమానులకు శుభవార్త. విశాఖలో ఈ తెల్లవారు జామున నుంచి ఎడితెరిపి లేకుండా కురిసిన వర్షం కొద్దిసేపటి క్రితం ఆగిపోయింది. వరుణుడు శాంతించడంతో పాటు మైదానం పరిసర ప్రాంతాల్లో ఎండ కూడా కాయడంతో ఢీలా పడిపోయిన అభిమానుల్లో జోష్ నెలకొంది. Covers getting removed.. full sunshine in #Vizag . Probably match will start On time because Vizag have brilliant drinage system & staff #INDvsAUS pic.twitter.com/uRKW9p6L6V — Vizag Weatherman (@VizagWeather247) March 19, 2023 స్టేడియం సిబ్బంది పిచ్‌పై నుంచి కవర్స్ పూర్తిగా తొలగించి, యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్నారు. స్టేడియంలో అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ ఉండటంతో పనులు కూడా వేగవంతంగా సాగుతున్నాయి. మళ్లీ వర్షం పడితే తప్ప, మ్యాచ్ వంద శాతం సజావుగా సాగేందుకు ఆస్కారం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పూర్తి మ్యాచ్ జరగాలని కోరుకున్న ఫ్యాన్స్‌కు ఇది నిజంగానే శుభవార్త. ఈ మ్యాచ్ కోసం చాలా రోజులుగా కళ్లుకాయలు కాచేలా ఎదురుచూసిన అభిమానులు వర్షం దెబ్బతో ఢీలా పడిపోయారు. అయితే, తాజా పరిస్ధితులను చూసి వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. కాగా, సాయంత్రం సమయంలో వరుణుడు మరోసారి విజృంభించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని అలర్ట్ ఉన్నప్పటికీ.. అభిమానులు మాత్రం వరుణ దేవుడు కురుణిస్తాడని ఆశిస్తున్నారు. 3 వన్డేల ఈ సిరీస్‌లో తొలి వన్డేలో నెగ్గిన భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
విశాఖ చేరుకున్న క్రికెటర్లు; వర్షం నేపథ్యంలో అభిమానుల్లో ఆందోళన
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం(మార్చి 19న) విశాఖపట్నం వేదికగా రెండో వన్డే జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి వన్డేలో విజయం సాధించిన టీమిండియా అదే జోష్‌తో రెండో వన్డేలో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తుంది. ఇప్పటికే టీమిండియా, ఆసీస్ క్రికెటర్లు విశాఖకు చేరుకున్నారు. ఆటగాళ్లందరిని విశాఖలోని నోవాటెల్ హోటల్‌కు తరలించారు. మ్యాచ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. మ్యాచ్ టికెట్లు కూడా పూర్తిగా అమ్ముడయ్యాయి. వర్షం నేపథ్యంలో అభిమానుల్లో ఆందోళన అయితే మ్యాచ్ సంగతి పక్కనబెడితే ఒక విషయమై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఉపరితల ద్రోని ప్రభావంతో విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా రేపు మ్యాచ్ జరుగుతుందా లేదా అన్నది అనుమానంగా మారింది. నేటి ఉదయం నుంచే విశాఖలో భారీ వర్షం కురుస్తోంది. వచ్చే 24 గంటల పాటు వర్షం కురిసే చాన్స్ ఉందని వాతావరణ విభాగం తెలిపింది. ప్రస్తుతం విశాఖలోని క్రికెట్ స్టేడియంను సిబ్బంది పూర్తి కవర్లతో కప్పి ఉంచారు. అయితే ఎంత భారీ వర్షం పడినా స్టేడియంలో ఉన్న ఆధునాతన డ్రైనేజీ వ్యవస్థ వల్ల మ్యాచ్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని విశాఖ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. అయితే రోజంతా వర్షం పడే అవకాశం ఉండడంతో మ్యాచ్ జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు ►ఆదివారం భారత్, ఆసీస్ వన్డే మ్యాచ్ సందర్భంగా విశాఖ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. విశాఖ సిటీ నుంచి క్రికెట్ స్టేడియం కి వెళ్ళే వీఐ పి, వివిఐపి పాస్ వాహనాలకు బి స్టేడియంతో పాటు వైజాగ్ కన్వెన్షన్ సెంటర్ వద్ద పార్కింగ్ కేటాయించారు. ►విశాఖ నుంచి వచ్చే వాహనాలకు సాంకేతిక కాలేజీ వద్ద పార్కింగ్ సదుపాయం ►ఆన్ లైన్ లో టికెట్లు మార్చుకునేందుకు సాంకేతిక కాలేజీ వద్ద కౌంటర్ ఏర్పాటు ►ఆనంద పురం నుంచి వచ్చేవారి కోసం సాంకేతిక కాలేజీ వద్ద..ఎం.వి.వి సిటీ వద్ద పార్కింగ్ సౌకర్యం ►మ్యాచ్ సందర్భంగా ఆదివారం విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్లే బస్ లు..గూడ్స్ వాహనాలు హనుమంత వాక..అడవి వరం మీదుగా మళ్లించనున్నారు. ►విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు వెళ్ళే కార్లు, టూ వీలర్లను హనుమంత వాక నుంచి విశాలాక్షి నగర్ , బీచ్ రోడ్ మీదుగా మళ్లించనున్నారు ►శ్రీకాకుళం నుంచి వచ్చే బస్ లు మారిక వలస నుంచి బీచ్ రోడ్డు మీదుగా తెన్నేటి పార్క్...విశాలాక్షి నగర్ మీదుగా నగరంలోకి అనుమతి ►శ్రీకాకుళం నుంచి అనకాపల్లి అటు ఇటు వెళ్లే భారీ వాహనాలు ఆనంద పురం..పెందుర్తి వైపుగా మళ్లింపు చదవండి: చరిత్రలో నిలిచిపోయే రనౌట్.. అమ్మమ్మ ఇలాకాలో రోహిత్ మెరిసేనా?.. సిరీస్ విజయంపై గురి -
ఆస్ట్రేలియాతో రెండో వన్డే.. టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్!
ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు విశాఖపట్నం వేదికగా రెండో వన్డేలో అదే జట్టుతో అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత జట్టు భావిస్తుంటే.. ఆసీస్ మాత్రం తొలి వన్డే ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. మార్చి 18 నుంచి 20 వరకు మూడు రోజుల పాటు విశాఖలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం మ్యాచ్ జరిగే సమయంలో ఉరుములు, ఈదురు గాలులతో భారీ వర్షం పడే ఛాన్స్ ఉంది ఉందని భారత వాతావరణ విభాగం (IMD) ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు వర్షం పడితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు.. స్టేడియం నిర్వాహకులు తెలిపారు. వర్షం నుంచి మైదానాన్ని రక్షించేందుకు అవసరమైన అత్యంత తేలికైన పిచ్ కవర్లు తమ వద్ద ఉన్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. తుది జట్లు(అంచనా) భారత్: శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లాబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా. చదవండి: IND Vs AUS: ఏంటి హార్దిక్ ఇది.. సీనియర్లకు ఇచ్చే విలువ ఇదేనా? పాపం కోహ్లి! వీడియో వైరల్ -
PAK Vs ENG: ఇంగ్లండ్- పాక్ ఫైనల్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దు అయితే?
టీ20 ప్రపంచకప్-2022 తుది సమరానికి సమయం అసన్నమైంది. ఆదివారం(నవంబర్ 13)న మెల్బోర్న్ వేదికగా ఫైనల్ పోరులో పాకిస్తాన్- ఇంగ్లండ్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి పాక్ ఫైనల్లో అడుగు పెట్టగా.. రెండో సెమీఫైనల్లో భారత్‌పై ఘన విజయం సాధించి ఇంగ్లండ్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశం ఉంది. మ్యాచ్ జరిగే సమయంలో 95 శాతం కురిసే అవకాశం ఉందని బ్యూరో ఆఫ్ మెట్రాలజీ వెల్లడించింది. "ఆదివారం మేఘావృతమై ఉంటుంది. మ్యాచ్ జరిగే సమయంలో 95 శాతం భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఉదయం సమయంలో గంటకు 25 నుంచి 40 కిమీ వేగంతో గాలులు వీస్తాయి" అని బ్యూరో ఆఫ్ మెట్రాలజీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఫైనల్ రద్దు అయితే? కాగా సెమీఫైనల్‌కు,ఫైనల్‌కు రిజర్వ్‌డేను ఐసీసీ కేటాయించింది. కాబట్టి ఒక వేళ ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించి, ఆదివారం ఆట సాధ్యపడకపోతే.. మ్యాచ్ నిలిచిపోయిన దగ్గరి నుంచి రిజర్వ్ డే(సోమవారం)లో కొనసాగిస్తారు. ఒకవేళ రిజర్వ్ డేలో కూడా వర్షం కారణంగా ఆట సాధ్యపడకపోతే మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లను విజేతగా ప్రకటిస్తారు. చదవండి: Kohli Emotional Post: మా కల నేరవేరలేదు.. చాలా బాధగా ఉంది! కోహ్లి భావోద్వేగం -
Telangana: రోడ్లకు రోగం.. పరిస్థితి అధ్వానం!
ఇది యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి నుంచి ఆత్మకూర్ (ఎం) మండలం రాయిపల్లికి వెళ్లే రోడ్డు దుస్థితి. సుమారు 5కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డు ఎక్కితే చాలు అంతా దుమ్మే. కొంత దూరంలో ఏముందో కూడా కనబడని పరిస్థితి. ప్రయాణికులతో పాటు రోడ్డుకు సమీ పంలోని ఇళ్లలో ఉంటున్నవారు దుమ్ముతో అనారోగ్యం పాలవుతున్నారు. వానలకు రోడ్డు గుంతలు పడటంతో ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు, వాహనాలు దెబ్బతింటున్నాయి. రెండేళ్ల కిందే రోడ్డు పనులను మొదలుపెట్టినా ఇప్పటికీ పూర్తిచేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇటీవల కాటే పల్లికి చెందిన రాంరెడ్డి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆస్పత్రికి వెళితే వైద్యులు పరీక్షించి దుమ్ము వల్లే సమస్య అని చెప్పారు. రాంరెడ్డి ఇల్లు రోడ్డు పక్కనే ఉంటుంది. ఇప్పుడాయన కుటుంబం రాత్రిపగలు ఇంటి తలుపులు, కిటికీలు పెట్టుకునే ఉంటోంది. ఇక వాహనాల నుంచి వస్తున్న దుమ్ముతో పిల్లలు తరచూ దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారని, మాస్కులు పెట్టుకుని ఉంటున్నామని కాటేపల్లికి చెందిన పచ్చిమట్ల ప్రమీల వాపోయారు. పిల్లలను బయట ఆడు కోనిచ్చే పరిస్థితి లేదన్నారు. – సాక్షి, యాదాద్రి సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. ఇటీవలి వర్షాల కారణంగా దాదాపు అన్ని జిల్లాల్లో స్థానిక రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. గుంతలు పడి ప్రమాదకరంగా మారాయి. పలుచోట్ల రాష్ట్ర రహదారులు కూడా దెబ్బతి న్నాయి. దీంతో ఓ వైపు ప్రయాణికులు తీవ్రంగా అవస్థలు పడు తుంటే.. మరోవైపు ప్రమాదాలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 24,245 కి.మీల రహదారులు రోడ్లు–భవనాల శాఖ పరిధిలో ఉన్నాయి. ఇందులో 3,152 కి.మీ. రాష్ట్ర రహదారులు, 12,079 కి.మీ ప్రధాన జిల్లాలను కలిపే రహదారులు కాగా.. 9,014 కి.మీ ఇతర జిల్లాలను, పట్టణాలను కలిపే రోడ్లు. ఇటీవలి వర్షాల నష్టం నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా రహదారుల పరిస్థితిని ఆర్అండ్బీ అధికారులు పరిశీలించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో సగటున ప్రతీ నియోజకవర్గంలో 25 కిలోమీటర్ల మేర రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టాల్సిన అవసరముందని గుర్తించారు. మొత్తంగా 2,975కి.మీ.ల మేర రహదారులకు మరమ్మతులు అవ సరమని అంచనా వేశారు. అన్ని వివరాల మదింపునకు మరో పదిరోజులు పట్టవచ్చని అధికారులు చెప్తున్నారు. ఇక వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి చాలాచోట్ల కల్వర్టులు, కాజ్‌వేలు దెబ్బతి న్నాయి. వాటికి మరమ్మ తులు చేయ డం, కొత్తగా నిర్మించడం, అవస రమైన చోట బ్రిడ్జీల నిర్మా ణం చేపట్టడంపై అధికారులు దృష్టి సారించారు. రూ.714 కోట్లు అవసరం! సగటున ప్రతి నియోజకవర్గంలో రోడ్ల తక్షణ మరమ్మతుల కోసం కనీసం రూ.6 కోట్లు కావాలని అధికారులు చెప్తున్నారు. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా కలిపి రూ.714 కోట్లకుపైగా నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. వీటికి పరిపాలనా పరమైన అనుమతులు రాగానే ప్రభుత్వం జీవో విడుదల చేసి, నిధులు విడుదల చేస్తుందని అధికారులు చెప్తున్నారు. ఇక కుంగిన, కూలిన బ్రిడ్జీ లు, కల్వర్టుల కోసం ప్రత్యేకంగా నిధులు అవసరమని అంటున్నారు. చాలాచోట్ల ఇదే దుస్థితి.. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొండా పూర్ వద్ద కాజ్వే వరదలకు కొట్టుకుపోయింది. తాత్కాలికంగా మట్టిరోడ్డు వేసి రాకపోకలు ప్రారంభించారు. వంతెన నిర్మాణం కోసం రూ.5.1 కోట్లు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరదల వల్ల ఆర్అండ్ బీ రోడ్లు 109.3కి.మీ. మేర దెబ్బతిన్నాయని, రూ.123 కోట్లకుపైగా నష్టం జరిగిందని అధికారు లు గుర్తించారు. తక్షణ మరమ్మతుల కోసం రూ.22 కోట్లు విడుదల చేసి పనులు చేపట్టినట్టు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్అండ్బీ పరిధిలో 54 పెద్ద రోడ్లు, వందకుపైగా చిన్నరోడ్లు దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు.ఆర్మూర్, బాల్కొండ, బోధన్, నిజామాబాద్ రూరల్, అర్బన్ సబ్ డివి జన్ల పరిధిలో రూ.22 కోట్ల అంచనాలతో మర మ్మతుల ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. ఖమ్మం–భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దు వద్ద ప్రధాన రహదారి దుస్థితి ఇది. ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం అక్కినాపురంతండా వద్ద తల్లాడ–కొత్తగూడెం ప్రధాన రహదారి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వినోభానగర్–కొమ్ముగూడెం రోడ్డు కూడా దెబ్బతిని గుంతలు పడటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పెద్దవాగు బ్రిడ్జిలో ప్రజల ఇబ్బందులు ఆదిలాబాద్ జిల్లాలో కుప్పకూలిన అందెవెల్లి పెద్ద వాగు బ్రిడ్జి, దీనివల్ల రాకపోకల కోసం వాగులో తిప్పలుపడుతున్న ప్రజల చిత్రాలివి. భారీ వర్షా లతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలాచోట్ల రోడ్లు, కల్వర్టులు, వంతెనలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా వెంకేపల్లి– చర్లగూడెం మధ్య ప్రధాన రహదారిపై కుంగిపోయిన కల్వర్టు ఇది. అధికారులు ఎన్నికల నేపథ్యంలో కంటి తుడుపు చర్యగా మట్టి పోసి చేతులు దులుపుకొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లె వాగుపై ఉన్న బ్రిడ్జి దుస్థితి ఇది. నల్లగొండ జిల్లాలోని చందంపేట, దేవరకొండ మండలాలకు వెళ్లే రోడ్డుపై ఉన్న ఈ బ్రిడ్జి వరదల వల్ల బాగా దెబ్బతిన్నది. ఇప్పటికీ మరమ్మతులు చేపట్టలేదు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రానికి, వేచరేణి గ్రామానికి మధ్య రోడ్డు ఇది. భారీ వర్షాలకు రోడ్డు పూర్తిగా తెగిపోయింది. వేచరేణి గ్రామస్తులు చుట్టూ తిరిగి చేర్యాలకు వెళ్లాల్సి వస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహము త్తారం మండలం యత్నారం– సింగంపల్లి గ్రామాల మధ్య దెబ్బతిన్న కల్వర్టు ఇది. ఫలితంగా సింగంపల్లి, మోదేడు, కొత్తపల్లి గ్రామాల ప్రజలు కాలినడకనే మండల కేంద్రానికి రావాలి. వాహనాల్లో వెళ్లాలంటే చుట్టూ 40 కిలోమీటర్లు తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది. -
IND VS ENG: సెమీస్ మ్యాచ్‌కు వర్షం ముప్పు..? రద్దయితే ఫైనల్‌కు టీమిండియా
టీ20 వరల్డ్‌కప్-2022లో భాగంగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య అడిలైడ్ వేదికగా ఇవాళ (నవంబర్ 10) రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగనుంది. మధ్యాహ్నం 1: 30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ఈ కీలక మ్యాచ్‌కు వర్షం ముంపు పొంచి ఉందని స్థానిక వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అడిలైడ్, పరిసర ప్రాంతాల్లో నిన్న రాత్రి వర్షం కురిసిందని, ఇవాళ ఉదయం కూడా ఉరుములు, మెరుపులతో 40 శాతం మేరకు వర్షం పడే అవకాశాలు ఉన్నాయని అడిలైడ్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వార్త తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఇంగ్లండ్ అభిమానులకు ఈ వార్త అస్సలు సహించడం లేదు. ఎందుకంటే.. ఒక వేళ వర్షం కారణంగా ఈ రోజు మ్యాచ్ రద్దైతే, రిజ్వర్ డేలో మ్యాచ్‌ను కొనసాగించాల్సి ఉంటుంది. వర్షం కారణంగా మ్యాచ్ అప్పుడు కూడా సాధ్యపడకపోతే.. గ్రూప్ దశలో టాపర్‌గా ఉన్న జట్టును (భారత్) విజేతగా ప్రకటిస్తారు. ఇప్పుడు ఇదే అంశం ఇంగ్లండ్ జట్టును, ఆ దేశ అభిమానులను కలవరపెడుతుంది. ఇదిలా ఉంటే, నిన్న జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్.. న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొంది, ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఒకవేళ వర్షం పడకుండా ఇవాల్టి మ్యాచ్ సజావుగా సాగితే.. ఈ మ్యాచ్ విజేత నవంబర్ 13న పాకిస్తాన్‌తో టైటిల్ పోరులో తలపడనుంది. -
T20 WC 2022: వర్షం కారణంగా సెమీస్ రద్దయితే.. టీమిండియానే విజేత!
టీ20 వరల్డ్‌కప్-2022 సెమీఫైనల్ మ్యాచ్‌లకు సర్వం సిద్ధమైంది. నవంబర్ 9న సిడ్నీ వేదికగా జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్-పాకిస్తాన్, ఆ మరుసటి రోజు (నవంబర్ 10) అడిలైడ్ వేదికగా జరిగే రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ రెండు మ్యాచ్‌లకు వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదని తెలుస్తోంది. ఒకవేళ సెమీస్ మ్యాచ్‌లు జరిగే సమయంలో అకస్మాత్తుగా వర్షం పడితే పరిస్థితి ఏంటన్న డౌట్ అభిమానుల మదిలో మెదలడం ప్రారంభమైంది. దీనికి సమాధానం.. ఐసీసీ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లతో పాటు మెల్బోర్న్ వేదికగా నవంబర్ 13న జరిగే ఫైనల్ మ్యాచ్‌కు కూడా రిజ్వర్ డే ఉంది. ఒకవేళ సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించి, ఆ రోజు ఆట సాధ్యపడకపోతే.. మ్యాచ్ నిలిచిపోయిన దగ్గరి నుంచి (స్కోర్లు) రిజర్వ్ డేలో ఆటను కొనసాగిస్తారు. ఒకవేళ రిజర్వ్ డేలో కూడా వర్షం కారణంగా ఆట సాధ్యపడకపోతే (సెమీస్) మాత్రం గ్రూప్‌లో టేబుల్ టాపర్‌గా ఉన్న జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అంటే.. తొలి సెమీస్‌లో న్యూజిలాండ్, రెండో సెమీస్‌లో భారత్ ఫైనల్‌కు చేరతాయి. అదే ఫైనల్ విషయానికొస్తే.. టైటిల్ డిసైడర్ మ్యాచ్ షెడ్యూలైన రోజు వర్షం పడితే రిజర్వ్ డేలో, ఆ రోజు కూడా ఆట సాధ్యపడకపోతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. -
భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. ఆట రద్దు అయితే?
టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్‌కు టీమిండియా సన్నద్దం అవుతోంది. ఆడిలైడ్ వేదికగా బుధవారం బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించి తమ సెమీ అవకాశాలను మరింత పదిలం చేసుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. అయితే భారత్ ఆశలపై వరుణుడు నీళ్లు జల్లే అవకాశం ఉంది. ఈ కీలక మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉన్నట్లు అక్కడ వాతావరణ శాఖ తెలిపింది. గత రెండు రోజుల నుంచి ఆడిలైడ్‌లో తేలికపాటి జల్లులు కురుసున్నాయి. మంగళవారం కూడా అక్కడ వర్షం కురుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ వాఖ్యాత హర్ష భోగ్లే ట్విటర్ వేదికగా తెలిపారు. "అదృష్టవశాత్తూ.. ఈ రోజు ఆడిలైడ్‌లో ఎటువంటి మ్యాచ్ లేదు. ప్రస్తుతం ఇక్కడ వాతావారం చాలా కూల్‌గా ఉంది. చిన్న చిన్న జల్లులు కురుస్తున్నాయి. అయితే రేపు(బుధవారం) ఇక్కడ వాతావారణం కొంచెం మెరుగ్గా ఉండే అవకాశం ఉంది" బోగ్లే ట్విటర్లో పేర్కొన్నారు. కాగా భారత ఆటగాళ్లు తమ ప్రాక్టీస్ సెషన్ రద్దు చేసుకుని హోటల్ గదులకే పరిమితమైనట్లు తెలుస్తోంది. కాగా గ్రూపు-2 నుంచి పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్థానంలో ఉంది. ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా భారత్ నేరుగా సెమీస్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లలో తప్పక విజయం సాధించాలి. భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్ రద్దు అయితే? ఒక వేళ దురదృష్టవశాత్తూ భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. అప్పుడు భారత్ ఐదు పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఈ క్రమంలో జింబాబ్వేతో జరగబోయే మ్యాచ్‌లో టీమిండియా ఖచ్చితంగా విజయం సాధించాలి. అప్పడు భారత్ ఖాతాలో రెండు పాయింట్లు చేరడంతో మొత్తంగా 7 పాయింట్లు అవుతాయి. ఒక వేళ పాకిస్తాన్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన ఇంటిముఖం పట్టక తప్పదు. ఎందుకంటే రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే పాక్ ఖాతాలో నాలుగు పాయింట్లు వచ్చి చేరుతాయి. అప్పుడు ఓవరాల్‌గా పాకిస్తాన్‌కు ఆరు పాయింట్లు ఉంటాయి. అయితే భారత్ ఖాతాలో ఏడు పాయింట్లు ఉంటాయి కాబట్టి పాక్‌తో ఎటువంటి సమస్య లేదు. ఒక వేళ తమ చివరి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్ విజయం సాధిస్తే.. రెండు పాయింట్లు బంగ్లా ఖాతాలో చేరుతాయి. అప్పుడు భారత్, బంగ్లాదేశ్ 7 పాయింట్లతో సమం అవుతాయి. అయితే బంగ్లాదేశ్ కంటే భారత్ రన్‌రేట్ మెరుగ్గా ఉంది కాబట్టి సెమీస్‌లో అడుగు పెడుతోంది. మరోవైపు జింబాబ్వే వరుసగా పాకిస్తాన్, భారత్‌పై విజయం సాధిస్తే ఏడు పాయింట్లతో సెమీస్‌కు చేరుకుంటుంది. ఇక ఐదు పాయింట్లతో అగ్ర స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా సెమీస్‌కు చేరడం దాదాపు ఖాయమైనట్లే. ఎందుకంటే ప్రోటీస్ తమ తదుపరి రెండు మ్యాచ్‌ల్లో ఒక విజయం సాధించినా చాలు. చదవండి: T20 World Cup 2022: శ్రీలంకతో మ్యాచ్.. ఆఫ్గాన్‌కు భారీ షాక్! -
ప్రపంచకప్‌ను వెంటాడుతున్న వరుణుడు.. మరో మ్యాచ్ రద్దు
టీ20 ప్రపంచకప్-2022ను వరుణుడు వెంటాడుతూనే ఉన్నాడు. గ్రూప్-1లో భాగంగా మెల్బోర్న్ వేదికగా ఐర్లాండ్, ఆప్ఘనిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయ్యింది. ఒక బంతి కూడా పడకుండానే అంపైర్లు ఈ మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో ఈ మెగా టోర్నీలో వరుణుడి ఖాతాలో మూడు మ్యాచ్‌లు చేరాయి. ఇక ఈ మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో గ్రూప్-1 నుంచి ఐర్లాండ్ 3 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది. ఇక వర్షం కారణంగా మ్యాచ్ ఆఫ్గానిస్తాన్‌కు ఇది రెండో సారి కావడం గమనార్హం. కాగా అంతకుముందు దక్షిణాఫ్రికా- జింబాబ్వే, ఆఫ్గానిస్తాన్-న్యూజిలాండ్ మ్యాచ్‌లు కూడా వర్షం కారణంగానే రద్దు అయ్యాయి. ఇక ఇదే వేదికగా శుక్రవారం(ఆక్టోబర్ 28) జరగాల్సిన ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మ్యాచ్‌పై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: Ind Vs Ned: నాటి వరల్డ్‌కప్‌లో తండ్రి సచిన్ వంటి దిగ్గజాల వికెట్లు తీసి.. నేడు కొడుకు మాత్రం.. -
ఢిల్లీలో భారీ వర్షాలు.. మూడో వన్డే జరిగేనా?
న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ మంగళవారం మధ్యహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. కాగా మూడో వన్డే సిరీస్ డిసైడ్ చేసే మ్యాచ్ కావడంతో అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచుస్తున్నారు. అయితే ఈ కీలక పోరుకు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశం ఉంది. కాగా గత మూడు రోజుల నుంచి దేశ రాజధాని న్యూ ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం మ్యాచ్ జరిగే సమయంలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అని అక్యూ వెదర్ పేర్కొంది. అక్యూ వెదర్ రిపోర్ట్ ప్రకారం.. మంగళవారం ఆకాశం మేఘావృతమై ఉంటుందని, 40 శాతం వర్షంపడే అవకాశం ఉంది. అదే విధంగా ఉష్ణోగ్రత కూడా 21 నుంచి 29 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండే ఛాన్స్ ఉంది అని అక్యూ వెదర్ తెలిపింది. ఇక రాంఛీ వేదికగా జరిగిన రెండో వన్డేలో ప్రోటీస్ జట్టుపై ఘన విజయం సాధించిన భారత్.. మూడు వన్డేల సిరీస్‌ను1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. తుది జట్లు(అంచనా): భారత్: శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్, మహ్మద్ సిరాజ్ దక్షిణాఫ్రికా: జన్నెమన్ మలన్, క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, జోర్న్ ఫోర్టుయిన్, కగిసో రబాడ, అన్రిచ్ నోర్ట్జే చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో మూడో వన్డే.. డిన్నర్‌కు వెళ్లిన భారత ఆటగాళ్లు -
Ind vs SA : రెండో వన్డేకు వర్షం ముప్పు.. మ్యాచ్ జరిగేనా?
లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో ఓటమిపాలైన టీమిండియా.. ఇప్పుడు కీలక పోరుకు సిద్దమైంది. ఆదివారం రాంఛీ వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో భారత్ తలపడనుంది. సిరీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా టీమిండియా విజయం సాధించాలి. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది. ఆదివారం మ్యాచ్ జరిగే సమయంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అని అక్యూవెదర్ తెలిపింది. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం రావడానికి 55 శాతం కంటే ఎక్కువ ఆస్కారం ఉంది అని అక్యూవెదర్ పేర్కొంది. అదే విధంగా తేమ కూడా 72 శాతం ఉంటుంది అని అక్యూవెదర్ వెల్లడించింది. కాగా లక్నో వేదికగా జరిగిన తొలి వన్డేకు కూడా వర్షం అంతరాయం కలిగించిన సంగతి తెలిసిందే. దీంతో మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. ఇక రెండో వన్డే కూడా ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తుది జట్లు(అంచనా) టీమిండియా: శిఖర్ ధావన్(కెప్టెన్), శుభమన్ గిల్, రజిత్ పటిదార్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్(వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, అవేష్ ఖాన్ దక్షిణాఫ్రికా: జన్నెమన్ మలన్, క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి, తబ్రైజ్ షమ్సీ చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో రెండో వన్డే.. రుత్‌రాజ్‌కు నో ఛాన్స్! పటిదార్ అరంగేట్రం! -
తుది సమరానికి వరుణుడి ఆటంకం..!
బెంగళూరు వేదికగా అఖరి టీ20లో తాడో పేడో తేల్చుకోవడానికి దక్షిణాప్రికా, భారత జట్లు సిద్దమయ్యాయి. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు 2-2తో సమంగా నిలిచాయి. అయితే ఈ తుదిపోరుకు వరుణుడు ఆటంకి కలిగించే అవకాశం ఉంది. గత వారం రోజులుగా బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ మధ్య జరిగిన పలు రంజీ మ్యాచ్‌లకు కూడా వర్షం ఆటంకి కలిగించింది. అక్యూవెదర్ ప్రకారం.. ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం బెంగళూరులో ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 84 శాతంగా రికార్డయింది. అదే విధంగా మ్యాచ్ సమయంలో తేమ 92 శాతం నుంచి 93 శాతం వరకు నమోదు అయ్యే ఛాన్స్ ఉంది. చదవండి: Former Cricketer Salil Ankola: దిగ్గజ క్రికెటర్‌తో పాటే అరంగేట్రం.. క్రికెట్‌పై అసూయ పెంచుకొని -
యాదాద్రి అతలాకుతలం
సాక్షి, యాదాద్రి/యాదగిరిగుట్ట రూరల్: ఆలయ ఉద్ఘాటన తర్వాత తొలిసారిగా కురిసిన భారీ వర్షంతో యాదాద్రి క్షేత్రం అతలాకుతలమైంది. బుధవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి గంటన్నరపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కురిసిన వర్షంతో పలుచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. ఘాట్రోడ్ల వద్ద మట్టి కుంగింది. కొండపైన ఆలయం, క్యూకాంప్లెక్స్, పరిసర ప్రాంతాల్లో నీరు చేరింది. దీనితో భక్తులు ఇబ్బందిపడ్డారు. ఇంజనీరింగ్ లోపాలు, నాసిరకం పనుల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న ఆరోపణలు వస్తున్నాయి. కుంగిన ఘాట్ రోడ్డు.. కూరుకుపోయిన బస్సులు.. కొత్తగా నిర్మించిన మూడో ఘాట్‌రోడ్డు ప్రారంభంలో వాననీటి ధాటికి కుంగిపోయి పెద్ద గొయ్యి పడింది. దీనితో ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. రెండోఘాట్ రోడ్డుకు అనుబంధంగా వీఐపీల కోసం నిర్మించిన ఈ ఘాట్‌రోడ్డును ఆలయ ఉద్ఘాటనకు కొద్దిరోజుల ముందే ప్రారంభించడం గమనార్హం. సీఎం కేసీఆర్‌తోపాటు ప్రెసిడెన్షియల్ సూట్ నుంచి వచ్చే ప్రముఖులు, ఆర్టీసీ బస్సుల కోసం మాత్రమే ఈ మార్గాన్ని వినియోగిస్తున్నారు. ఇక వాననీటి ధాటికి మట్టికొట్టుకు వచ్చి మొదటి ఘాట్‌రోడ్డు బురద మయంగా మారింది. ఉదయం కొండపైకి భక్తులతో వెళ్తున్న రెండు బస్సులు ఈ బురదలో దిగబడ్డాయి. భక్తులే దిగి బస్సులను బురదలోంచి తోశారు. బస్సులు కూరుకుపోవడంతో కొండపైకి వెళ్లే ఇతర బస్సులూ ఆగిపోయాయి. చాలామంది భక్తులు మెట్ల మార్గంలో కొండపైకి వెళ్లారు. రింగ్‌రోడ్డులో యాద గిరిపల్లి సమీపంలో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది. కొండ కింద మూడవ ఘాట్ రోడ్డు వద్ద కొట్టుకుపోయిన రోడ్డు ప్రధానాలయంలోకీ నీరు ప్రధానాలయంలో పంచతల రాజగోపురం నుంచి ధ్వజ స్తంభం వరకు వాన నీరు చేరింది. దేవస్థానం సిబ్బంది బకెట్లతో నీటిని తొలగించి శుభ్రం చేశారు. ఇందుకోసం గంటకుపైగా దర్శనాలు నిలిపివేశారు. అష్టభుజి మండపాలు, ప్రాకార మండపాలు, లిఫ్ట్ మార్గంలో పలుచోట్ల వాన నీరు లీకైంది. కొండపై బస్టాండు పక్కన క్యూకాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల గదుల్లో నీళ్లు నిలిచాయి. లడ్డూలు తడిసిపోయినట్టు సిబ్బంది పేర్కొన్నారు. భక్తులు ఇబ్బందిపడుతూనే దర్శనాలకు వెళ్లారు. క్యూకాంప్లెక్స్ పక్కన కార్యాలయంలో ఉన్న సామగ్రి, కంప్యూటర్లు, స్టోరేజీ రూమ్ జలమయం అయ్యా యి. ప్రధానాలయం బయట వాన నీరు నిండి చిన్నపాటి చెరువును తలపించింది. బంగారు వర్ణంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ లైట్లు కూలిపడ్డాయి. కొండపై బస్టాండ్, శివాలయం, ఇతర చోట్ల ఏర్పా టు చేసిన చలువ పందిళ్లు ఈదురుగాలుల ధాటికి కూలిపోయాయి. కొండ కింద వాహన పూజలు నిర్వహించేచోట భారీ వేప చెట్టు విరిగిపడింది. వెంటనే పునరుద్ధరిస్తాం: దేవాదాయ కమిషనర్ భారీ వర్షం కారణంగా దెబ్బతిన్న రోడ్లు, ఇతర పనులను వెంటనే పునరుద్ధరిస్తామని దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ చెప్పారు. బుధవారం ఆయన యాదాద్రి ఆలయాన్ని సందర్శించి.. కూలిన పందిళ్లు, వాననీటి లీకేజీలు, ఇతర నష్టాలను పరిశీలించారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపడతామని.. కొండపై పార్కింగ్ ఫీజులో అదనంగా గంటకు రూ.100 వసూలును భక్తుల కోరిక మేరకు తొలగిస్తున్నట్టు ప్రకటించారు. కుండపోత పడితే ఎలా? ‘ఇంజనీరింగ్’ నిర్లక్ష్యంతోనే సమస్య అనే ఆరోపణలు తాజా వానతో యాదాద్రి క్షేత్రంలో రోడ్లు దెబ్బతినడం, ఎక్కడిక్కడ నీళ్లు నిలవడం, ఆలయంలోకీ నీరు చేరడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. యాదాద్రిని ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ రూ.1,300 కోట్ల వరకు ఖర్చుచేసి పునర్నిర్మాణం చేపట్టినా.. ఇంజనీరింగ్ లోపాల వల్లే ఈ దుస్థితి ఏర్పడిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొండపైన, దిగువన మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు కాకుండానే ఆలయ ఉద్ఘాటన చేసిన విషయం తెలిసిందే. ప్రధానాలయం శిల్పాల పనుల నుంచి కొండ దిగువన నిర్మాణాల వరకు 14 మంది కాంట్రాక్టర్లు పనిచేశారు. ప్రభుత్వపరంగా ఉన్న స్థానిక ఇంజనీర్లను కాదని.. కాంట్రాక్టు సంస్థల సైట్ ఇంజనీర్లతోనే పనులన్నీ చేపట్టారని అధికారవర్గాలు చెప్తున్నాయి. వైటీడీఏ, సీఎంవో కార్యాలయం, దేవస్థానం ఉన్నతాధికారుల అండదండలతోనే సదరు కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పను లు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొండ చుట్టూ నిర్మాణాలు చేస్తున్నప్పుడు స్థానిక ఇంజనీర్లను సంప్రదించకుండానే పనులు చేశారని.. వర్షాలు పడినప్పుడు ఎటు నుంచి నీరు వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది గుర్తించలేక ఇలా రోడ్డు కోతపడిందని అధికారవర్గాలు అంటున్నాయి. ఈ వానకే ఇంత నష్టం జరిగితే.. కుండపోత వర్షం కురిస్తే పరిస్థితి ఏమిటని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
తొలి టీ20కి వర్ష గండం?
కొలంబో: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభంకానున్న తొలి టీ20కి వరుణ గండం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మ్యాచ్ ప్రారంభ సమాయానికి వర్షం నుంచి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా, మధ్యలో మాత్రం ఆటంకం కలిగించే ఆస్కారముందని సమాచారమందుతోంది. కొలొంబోలో గత కొద్ది రోజులుగా సాయంత్రం వేళల్లో వర్షం కురుస్తుండడం ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తోంది. ఈ వార్త ఇరు జట్ల అభిమానులను కలవరపెడుతుంది. వరుణుడి ఆటంకం లేకుండా 20 ఓవర్ల పాటు మ్యాచ్ సజావుగా సాగాలని క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్ ముందు జరుగుతున్న ఆఖరి సిరీస్ కావడంతో ఇరు జట్లు ఈ సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. ఆఖరి వన్డేలో 6 మార్పులు చేసి మూల్యం చెల్లించుకున్న భారత్.. ఈ మ్యాచ్‌లో పకడ్బందీగా బరిలోకి దిగనుంది. ఓపెనర్లుగా శిఖర్ ధవన్, పృథ్వీ షా బరిలోకి దిగనుండగా, వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. వన్డే సిరీస్‌లో దారుణంగా విఫలమైన మనీశ్ పాండే స్థానంలో సంజూ శాంసన్‌కు అవకాశం దక్కనుంది. మరోవైపు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలకు తుది జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తోంది. స్పిన్నర్ కోటాలో చహల్‌ను ఆడిస్తారా? లేక రాహుల్ చాహర్‌కు అవకాశమిస్తారా? అనేది చివరి నిమిషంలో తేలనుంది. ఇక ప్రధాన పేసర్లుగా దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్ జట్టులోకి తిరిగిరానుండగా వరుణ్ చక్రవర్తి అంతర్జాతీయ అరంగేట్రం ఖాయమేనని తెలుస్తోంది. మరోవైపు తొలి రెండు వన్డేల్లో ఓడిన శ్రీలంక.. ఆఖరి మ్యాచ్‌లో మాత్రం అదరగొట్టింది. సొంతగడ్డపై భారత్ చేతిలో 10 ఓటముల తర్వాత గెలుపొందింది. ఈ విజయంతో రెట్టించిన ఉత్సాహంలో తొలి టీ20 బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌కు దూరమైన హసరంగా ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశాలున్నాయి. హసరంగా జట్టులోకి వస్తే జయవిక్రమ బెంచ్‌కు పరిమితం కానున్నాడు. టీ20 స్పెషలిస్ట్ అయిన ఇసురు ఉడానాకు కూడా చోటు దక్కే అవకాశాలున్నాయి. మూడో వన్డేలో ఆల్‌రౌండ్ షో కనబర్చిన లంక జట్టు తొలి టీ20లోనూ అదే తరహాలో రాణించాలని ఆశిస్తోంది. తుది జట్లు: (అంచనా) భారత్: పృథ్వీ షా, శిఖర్ ధవన్(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి, చహల్/రాహుల్ చాహర్ శ్రీలంక: అవిష్క ఫెర్నాండో, మినోద్ భానుక(కీపర్), భానుక రాజపక్స, ధనుంజయ డి సిల్వా, చరిత అసలంక, డసన్ షనక(కెప్టెన్), చమిక కరుణరత్నే, వానిందు హసరంగ/ ప్రవీణ్ జయవిక్రమ, ఇసురు ఉడానా, దుష్మంత చమీరా, అకిలా ధనుంజయ -
వానతో విరామం...
ప్రధాన బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ అవుట్... తర్వాతి 37 బంతుల్లో వచ్చినవి 2 పరుగులే... మరింత ఉత్సాహంతో ఆసీస్ కనిపిస్తుండగా ఒత్తిడిలో భారత జట్టు... మూడో సెషన్లో పట్టుదలగా నిలవాల్సిన పరిస్థితి... ఇన్నింగ్స్ కొనసాగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో గానీ వర్షం రాకతో మ్యాచ్‌లో అనూహ్య విరామం వచ్చేసింది. మైదానం అనుకూలంగా లేకపోవడంతో మూడో సెషన్లో ఒక్క బంతి కూడా వేయకుండానే ఆటను రద్దు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతానికి మరో 307 పరుగులు వెనుకబడి ఉన్న టీమిండియా ఆదివారం ఎలా పుంజుకుంటుందో చూడాలి. అంతకుముందు కనీసం 400 పరుగుల చేయాలనే లక్ష్యంతో ఆట కొనసాగించిన ఆస్ట్రేలియాను అంతకంటే చాలా ముందుగా నిలిపివేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. బ్రిస్బేన్: బోర్డర్–గావస్కర్ ట్రోఫీ విజేతను తేల్చే పోరుకు వాన ఆటంకంగా మారింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ రెండో రోజు శనివారం మొత్తంగా 54.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 26 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. చతేశ్వర్ పుజారా (8 బ్యాటింగ్), కెప్టెన్ అజింక్య రహానే (2 బ్యాటింగ్) ప్రస్తుతం క్రీజ్‌లో ఉండగా... దూకుడుగా ఆడబోయిన రోహిత్ శర్మ (74 బంతుల్లో 44; 6 ఫోర్లు) పెవిలియన్ చేరాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 274/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా మరో 95 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయి 369 పరుగులవద్ద ఆలౌటైంది. కెప్టెన్ టిమ్ పైన్ (104 బంతుల్లో 50; 6 ఫోర్లు), కామెరాన్ గ్రీన్ (107 బంతుల్లో 47; 6 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో నటరాజన్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్ తలా 3 వికెట్లు తీశారు. 4 పరుగులకు 3 వికెట్లు... శుక్రవారం సాధ్యమైనంత త్వరగా ఆస్ట్రేలియా ఆట ముగిద్దామని భావించిన భారత్ సఫలం కాలేకపోయింది. ఆసీస్ లోయర్ ఆర్డర్ మరోసారి చెప్పుకోదగ్గ పోరాట పటిమ కనబర్చింది. ఆరో వికెట్‌కు 98 పరుగులు జోడించిన అనంతరం పైన్‌ను అవుట్ చేసి భారత్ రెండో రోజు తొలి వికెట్ సాధించింది. 102 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే ఆసీస్ కెప్టెన్ వెనుదిరిగాడు. మరో రెండు పరుగుల వ్యవధిలోనే గ్రీన్, కమిన్స్ (2) కూడా పెవిలియన్ చేరడంతో ప్రత్యర్థిని ఆలౌట్ చేసేందుకు భారత్‌కు మంచి అవకాశం లభించింది. అయితే మిషెల్ స్టార్క్ (20 నాటౌట్), కెరీర్లో 100వ టెస్టు ఆడుతున్న నాథన్ లయన్ (24) దీనికి అడ్డు పడ్డారు. కొన్ని చక్కటి షాట్లు ఆడిన వీరిద్దరు తొమ్మిదో వికెట్‌కు 39 పరుగులు జోడించారు. ఆ తర్వాత హాజల్‌వుడ్ (11) సహకారంతో స్టార్క్ తమ జట్టుకు మరికొన్ని పరుగులు అందించాడు. గిల్ విఫలం... భారత జట్టుకు ఈసారి చెప్పుకోదగ్గ ఆరంభం అందించడంలో ఓపెనింగ్ జోడి విఫలమైంది. కమిన్స్ తన తొలి ఓవర్లోనే శుబ్‌మన్ గిల్ (7)ను అవుట్ చేసి దెబ్బ కొట్టాడు. అయితే రోహిత్ శర్మ చక్కటి షాట్లతో చకచకా పరుగులు రాబట్టాడు. కమిన్స్ బౌలింగ్‌లోనే రోహిత్ మూడు ఫోర్లు కొట్టగా... గ్రీన్ బౌలింగ్‌లో కొట్టిన స్క్వేర్ డ్రైవ్ బౌండరీ హైలైట్‌గా నిలిచింది. ఇదే జోరులో లయన్ బౌలింగ్‌లో ముందుకు దూసుకొచ్చి కొట్టిన షాట్‌తో రోహిత్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. రెండో సెషన్లో మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన పుజారా, రహానే 6.1 ఓవర్లలో 2 పరుగులే జోడించారు. టీ విరామం సమయంలో వచ్చిన వర్షం కారణంగా ఆపై ఆట సాధ్యం కాలేదు. ఆస్ట్రేలియా అసంతృప్తి వర్షం పూర్తిగా ఆగిపోయి దాదాపు గంట అయింది. బ్రిస్బేన్ మైదానంలోని అత్యుత్తమ డ్రైనేజీ వ్యవస్థ వల్ల అవుట్ ఫీల్డ్‌లో నీరు మొత్తం తోడేశారు. కవర్లు కూడా తొలగించారు. ఇక కొద్ది సేపట్లో ఆట జరగడం ఖాయమని భావించిన ఆసీస్ ఆటగాళ్లు వార్మప్ కూడా చేస్తున్నారు... ఈ దశలో అనూహ్యంగా అంపైర్లు రెండో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అక్కడక్కడా తడి ఉండటంతో గ్రౌండ్ అనుకూలంగా లేదని వారు భావించారు. అయితే అంపైర్ల నిర్ణయం ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్‌ను అసంతృప్తికి గురి చేసింది. స్థానిక సమయం ప్రకారం ఆట నిర్దేశిత ముగింపు సమయంలో మరో 45 నిమిషాలు మిగిలి ఉన్నాయి. కనీసం 10 ఓవర్లు లేదంటే అరగంట ఆటైనా జరగవచ్చని ఆస్ట్రేలియా ఆశించింది. ఒత్తిడిలో ఉన్న భారత్‌ను మరింతగా ఇబ్బంది పెట్టి మరో వికెట్ సాధించగలిగినా కంగారూలకు పట్టు చిక్కినట్లే. పైగా రోహిత్‌ను అవుట్ చేసి లయన్ అప్పుడే లయ అందుకున్నాడు. ఈ సమయంలో ఆటను నిలిపివేయడంతో నిరాశకు గురైన పైన్... అంపైర్ పాల్ విల్సన్‌తో వాదించడం కనిపించింది. వాన కారణంగా కోల్పోయిన సమయాన్ని పూడ్చేందుకు మిగిలిన మూడు రోజుల్లో ప్రతీ రోజు ఆట నిర్ణీత సమయంకంటే అర గంట ముందుగా ప్రారంభమవుతుంది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: వార్నర్ (సి) రోహిత్ శర్మ (బి) సిరాజ్ 1; హారిస్ (సి) సుందర్ (బి) శార్దుల్ 5; లబ్‌షేన్ (సి) పంత్ (బి) నటరాజన్ 108; స్మిత్ (సి) రోహిత్ (బి) సుందర్ 36; వేడ్ (సి) శార్దుల్ (బి) నటరాజన్ 45; గ్రీన్ (బి) సుందర్ 47; పైన్ (సి) రోహిత్ (బి) శార్దుల్ 50; కమిన్స్ (ఎల్బీ) (బి) శార్దుల్ 2; స్టార్క్ (నాటౌట్) 20; లయన్ (బి) సుందర్ 24; హాజల్‌వుడ్ (బి) నటరాజన్ 11; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (115.2 ఓవర్లలో ఆలౌట్) 369 వికెట్ల పతనం: 1–4, 2–17, 3–87, 4–200, 5–213, 6–311, 7–313, 8–315, 9–354, 10–369. బౌలింగ్: సిరాజ్ 28–10–77–1, నటరాజన్ 24.2–3–78–3, శార్దుల్ 24–6–94–3, సైనీ 7.5–2–21–0, సుందర్ 31–6–89–3, రోహిత్ 0.1–0–1–0. భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (సి) స్టార్క్ (బి) లయన్ 44, శుబ్‌మన్ గిల్ (సి) స్మిత్ (బి) కమిన్స్ 7, పుజారా (బ్యాటింగ్) 8, రహానే (బ్యాటింగ్) 2, ఎక్స్‌ట్రాలు 1, మొత్తం (26 ఓవర్లలో 2 వికెట్లకు) 62. వికెట్ల పతనం: 1–11, 2–60. బౌలింగ్: స్టార్క్ 3–1–8–0, హాజల్‌వుడ్ 8–4–11–0, కమిన్స్ 6–1–22–1, గ్రీన్ 3–0–11–0, నాథన్ లయన్ 6–2–10–1. -
తొలిరోజు చేజారింది..
వర్షం...విల్ పకోవ్‌స్కీ... వికెట్ కీపర్ వైఫల్యం...సంక్షిప్తంగా సిడ్నీ టెస్టు తొలి రోజు ఆట ఇది! గత రెండు టెస్టులకు భిన్నంగా ఆస్ట్రేలియా ఈ సారి కాస్త ఆత్మవిశ్వాసంతో ఆడగా... మన బౌలింగ్ వైఫల్యం, పంత్ క్యాచ్‌లు వదిలేయడం వెరసి ప్రత్యర్థిదే పైచేయిగా మారింది. వాన కారణంగా 55 ఓవర్లకే పరిమితమైన ఆటను రెండు అర్ధ సెంచరీలు ప్లస్ ఒక శతక భాగస్వామ్యంతో ఆతిథ్య జట్టు సంతృప్తిగా ముగించింది. ఇదే జోరుతో రెండో రోజు ఆ జట్టు భారీ స్కోరుపై దృష్టి పెట్టింది. అన్నింటికి మించి సొంత మైదానంలో స్మిత్ ఫామ్‌లోకి రావడం ఇప్పుడు భారత్‌ను కాస్త ఆందోళన పెట్టే అంశం. సిడ్నీ: మూడో టెస్టులో కూడా భారత్‌కు శుభారంభం దక్కినా... రెండు క్యాచ్‌లు నేలపాలు కావడంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ పుంజుకునేందుకు అవకాశం దక్కింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. గురువారం టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 55 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. అరంగేట్ర ఓపెనర్ విల్ పకోవ్‌స్కీ (62; 4 ఫోర్లు), మార్నస్ లబ్‌షేన్ (67 బ్యాటింగ్; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్న లబ్‌షేన్, స్టీవ్ స్మిత్ (31 బ్యాటింగ్; 5 ఫోర్లు) కలిసి మూడో వికెట్‌కు అభేద్యంగా 60 పరుగులు జోడించారు. వార్నర్ విఫలం గాయంనుంచి కోలుకున్న వార్నర్‌ను ఆడించడం ద్వారా ప్రత్యర్థిపై అదనపు ఒత్తిడిని పెంచాలనుకున్న వ్యూహం ఆసీస్‌కు బెడిసికొట్టింది. టెస్టు ఆడే స్థాయి ఫిట్నెస్ లేకపోయినా బరిలోకి దిగిన డాషింగ్ బ్యాట్స్‌మన్ వార్నర్ (5)ను సిరాజ్ తన రెండో ఓవర్లోనే (ఇన్నింగ్ 4వ) పెవిలియన్ చేర్చాడు. ఆఫ్ స్టంప్‌పై నుంచి వేగంగా దూసుకొచ్చిన బంతి వార్నర్ బ్యాట్ అంచును తాకుతూ నేరుగా స్లిప్‌లో ఉన్న పుజారా చేతుల్లో పడింది. తర్వాత లబ్‌షేన్ వచ్చాడు. ఆ వెంటే వాన కూడా వచ్చింది. విరామం తర్వాత తిరిగి మొదలైన ఆట ఆస్ట్రేలియాకే అనుకూలంగా సాగింది. ఇటు లబ్‌షేన్ కుదురుగా ఆడుతుండగా... అటు పంత్ పుణ్యమా అని రెండు లైఫ్‌లు పొందిన ఓపెనర్ పకోవ్‌స్కీ అర్ధ సెంచరీతో రాణించాడు. జట్టు స్కోరు 100 పరుగులు దాటాక ఎట్టకేలకు పకోవ్‌స్కీని సైనీ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. లబ్‌షేన్ అర్ధసెంచరీ స్టీవ్ స్మిత్ వచ్చాక ఆసీస్ ఇన్నింగ్స్ సాఫీగా సాగిపోయింది. గత మ్యాచ్‌ల వైఫల్యాల దృష్ట్యా ఈ మ్యాచ్‌లో అతను పట్టుదలగా ఆడాడు. భారత బౌలర్లు సంధించిన వైవిధ్యమైన బంతులను చక్కగానే ఆకళింపు చేసుకొని సమర్థంగా ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా అశ్విన్ బౌలింగ్‌లో తడబాటును అధిగమించి క్రీజులో పాతుకుపోయాడు. లబ్‌షేన్ కూడా స్మిత్ అండతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖరి సెషన్లో ఈ జోడీని విడగొట్టేందుకు భారత కెప్టెన్ రహానే చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. క్రీజులో ఆత్మవిశ్వాసంతో ఆడిన స్మిత్ చూడచక్కని బౌండరీలతో ఆకట్టుకున్నాడు. లబ్‌షేన్ కూడా ఫోర్లతో అదరగొట్టాడు. ఆట నిలిచే సమయానికి వీరిద్దరు అభేధ్యమైన మూడో వికెట్‌కు 60 పరుగులు జోడించారు. వానొచ్చే... ఆట ఆగే! మ్యాచ్ టైమ్‌కే మొదలైంది కానీ... కాసేపటికే ముసిరిన వానతో టైమ్ అంతా గడిచిపోయింది. షెడ్యూలు ప్రకారం ఉదయం 10.30 గంటలకు (స్థానిక కాలమానం) ఆట ఆరంభమైంది. ఇంకేం ఆటకు ఢోకా లేదనుకునేంత లోపే పిడుగులా వచ్చి పడింది వాన. ఎనిమిదో ఓవర్లో కురిసిన వాన తొలి సెషన్‌పై నీళ్లు చల్లింది. తెరిపినివ్వలేకపోవడంతో ఆ వానలోనే లంచ్‌బ్రేక్ ముగిసింది. ఇక రెండో సెషన్‌ను అయినా వరుణుడు కరుణిస్తాడేమో అనుకుంటే అంత తేలిగ్గా చినుకులు ఆగలేదు. ఆట మొదలవలేదు. చాలాసేపటికి తెరిపినివ్వడంతో మధ్యాహ్నం 3 గంటలకు (స్థానిక కాలమానం) పునఃప్రారంభమైంది. ఓ విధంగా చెప్పాలంటే ఉదయం 11.05 నిమిషాలకు మొదలైన 8వ ఓవర్ మధ్యాహ్నం 3.10 నిమిషాలకు ముగిసిందన్నమాట. మళ్లీ సరిగ్గా టీ బ్రేక్ సమయంలో చినుకులు కురిసినా నిమిషాల వ్యవధిలోనే ఆగడంతో ఆట కోసం మళ్లీ నిరీక్షించాల్సిన పని లేకపోయింది. పంత్ పదేపదే... వృద్ధిమాన్ సాహా టెస్టుల్లో మంచి వికెట్ కీపర్. సంప్రదాయ ఫార్మాట్లో వికెట్ల వెనుక అతని చురుకుదనం అందరికీ తెలుసు. అయితే బ్యాటింగ్‌లో సాహాకంటే మెరుగంటూ పంత్‌కు తుది జట్టులో చోటు లభిస్తోంది. బలమైన ప్రత్యర్థి, కీలకమైన మ్యాచ్‌లో అప్రమత్తంగా ఉండాల్సిన రిషభ్ పంత్ మూడు ఓవర్ల వ్యవధిలోనే రెండు క్యాచ్‌ల్ని చేజార్చడం తొలి రోజు భారత్‌కు సమస్యగా మారింది. 22వ ఓవర్లో అశ్విన్ బౌలింగ్ చేస్తుండగా... పకోవ్‌స్కీ 26 పరుగుల వద్దే ఉన్నాడు. మెలికలు తిరిగిన ఆఖరి బంతి అతని బ్యాట్ అంచును తాకి గాల్లోకి లేచింది. సునాయాసమైన ఈ క్యాచ్‌ను పంత్ నేలపాలు చేశాడు. దీంతో అశ్విన్ తీవ్ర నిరాశను వ్యక్తం చేశాడు. మళ్లీ 25వ ఓవర్ సిరాజ్ వేయగా.. పకోవ్‌స్కీ గ్లౌజ్‌ను తాకుతూ వెళ్లిన బంతిని క్యాచ్ అందుకునేందుకు రెండు సార్లు డైవ్‌చేసి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటికీ అతని స్కోరు 32 పరుగులే!.. ఇలా లైఫ్ పొందిన పకోవ్‌స్కీ ఎట్టకేలకు అర్ధసెంచరీ పూర్తి చేసుకుని అరంగేట్రంలో మెరుగైన ప్రదర్శన కనబరిచి అందరి చేతా అభినందనలు అందుకుంటున్నాడు. నవదీప్ సైనీ బౌలింగ్‌లో అతడు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ► భారత్ తరఫున టెస్టుల్లో ఆడిన 299వ ఆటగాడిగా నవదీప్ సైనీ నిలిచాడు. పేసర్ బుమ్రా చేతుల మీదుగా అతను ‘టెస్టు క్యాప్’ను అందుకున్నాడు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: పకోవ్‌స్కీ (ఎల్బీడబ్ల్యూ) (బి) సైనీ 62; వార్నర్ (సి) పుజారా (బి) సిరాజ్ 5; లబ్‌షేన్ బ్యాటింగ్ 67; స్మిత్ బ్యాటింగ్ 31; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (55 ఓవర్లలో 2 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–6, 2–106. బౌలింగ్: బుమ్రా 14–3–30–0, సిరాజ్ 14–3–46–1, అశ్విన్17–1–56–0, నవ్‌దీప్ సైనీ 7–0–32–1, జడేజా 3–2–2–0. -
ఇప్పటివరకు రూ.387.90 కోట్లు పంపిణీ
సాక్షి,హైదరాబాద్: నగరంలో వరదలతో నష్టపోయి ఇప్పటి వరకు నగదు సహాయం అందని బాధిత కుటుంబాలకు వారి ఇంటివద్దే నగదు పంపిణీని చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత కుటుంబాలకు నగదు పంపిణీపై ఆదివారం బి.ఆర్.కె.ఆర్.భవన్లో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్‌లతో ఆయన సమీక్ష నిర్వహించారు. చదవండి: ఎగసిపడ్డ జ్వాల.. తిరగబడ్డ వరద బిడ్డ వరద బాధితులకు ఇప్పటివరకు రూ.387.90 కోట్లను పంపిణీ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం మున్సిపల్ శాఖకు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస, ఆర్థికసాయం కోసం రూ.550 కోట్లను మంజూరు చేయగా ఇప్పటివరకు వరదలతో నష్టపోయిన 3.87లక్షల కుటుంబాలకు నగదు పంపిణీ చేసినట్లు వివరించారు. చదవండి: హైదరాబాద్ మెట్రో క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఇలా.. -
వరద బాధితులకు ఉచితంగా నిత్యావసరాలు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయనుంది. వారానికిపైగా వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో ఈ సరుకులు పంపిణీ చేయనున్నారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళా దుంపలు ఇవ్వాలని ఆదేశించింది. కాగా వాయుగుండం ప్రభావంతో ఇటీవల రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు అనేక ప్రాంతాలు నీటి మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చదవండి: శాంతించిన తమ్మిలేరు, ఏలేరు -
ఆడొచ్చు...అవాంతరం లేకుండా!
ఆట కంటే వర్షమే ఎక్కువ చర్చనీయాంశమైంది తొలి వన్డేలో. ఆ పరిస్థితి మళ్లీ తలెత్తకుండా ఉండాలని కోరుకుంటూ రెండో వన్డేకు సిద్ధమయ్యాయి భారత్, వెస్టిండీస్. ఇరు జట్లు ఈ మ్యాచ్ ద్వారా ప్రపంచ కప్ నైరాశ్యం నుంచి బయటపడాలని భావిస్తున్నాయి. కూర్పులో మార్పుల్లేకుండానే బరిలో దిగే ఆలోచనలో ఉన్నాయి. విండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌కు ఇది 300వ వన్డే కావడం ఆతిథ్య జట్టుకు ప్రత్యేకతగా మారింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వర్షం కారణంగా రద్దయినప్పటికీ... ఆట సాగినంత సేపు తొలి మ్యాచ్‌లో టీమిండియాదే పైచేయిగా కనిపించింది. అదే ఉత్సాహంతో కోహ్లి సేన ఆదివారం పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్‌పార్క్ ఓవల్ మైదానంలో జరిగే రెండో వన్డేలో వెస్టిండీస్‌తో తలపడనుంది. గురువారం నాటి మ్యాచ్ పూర్తిగా జరగనందున ఇరు జట్లు మార్పుల్లేకుండానే దిగే వీలుంది. విజయం సాధించిన జట్టు మూడు వన్డేల సిరీస్‌ను కోల్పోని స్థితిలో నిలుస్తుంది కాబట్టి నేటి మ్యాచ్‌లో ఆసక్తికి లోటు ఉండకపోవచ్చు. అయితే... అందరి కళ్లు క్రిస్ గేల్‌పైనే ఉన్నాయి. కొంతకాలంగా అతడిని విండీస్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచే రికార్డు ఊరిస్తోంది. ఒకప్పటి గేల్ అయి ఉంటే ఆ రికార్డు ఎప్పుడో అతడి వశం అయ్యేది. కానీ, ఫామ్ లేమితో ఇబ్బంది పడుతు న్న అతడు కనీస సంఖ్యలో పరుగులు చేయలేకపోతున్నాడు. ఆదివారం వాటిని అందుకుంటే ఈ మ్యాచ్ కొంత విశిష్టత సంతరించుకుంటుంది. అటుఇటు వారే... యువ పేసర్ ఖలీల్ అహ్మద్‌ను ఆడించాలా? లేదా? అనేది ఒక్కటే తుది జట్టుపై టీమిండియాకు ఉన్న సందిగ్ధత. తొలి వన్డేలో అతడు విండీస్ ఓపెనర్ ఎవిన్ లూయిస్‌కు అడ్డంగా దొరికిపోయాడు. పదేపదే లెగ్‌సైడ్ బంతులు వేసి లూయిస్ ఫామ్‌లోకి వచ్చేలా చేశాడు. ఖలీల్‌ను తప్పించినా, భువనేశ్వర్‌కు విశ్రాంతినిచ్చినా నవదీప్ సైనీకి అరంగేట్రం అవకాశం దక్కొచ్చు. పిచ్ అనుకూలిస్తుందని భావిస్తే మణికట్టు స్పిన్నర్ చహల్‌ను తీసుకునే వీలుంది. ఓవరాల్‌గా చూస్తే... మార్పుల్లేని జట్టును దింపడమే మేలని టీం మేనేజ్మెంట్ ప్రాథమిక ఉద్దేశంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో నంబరు స్థానంలో శ్రేయస్ అయ్యర్ పరుగులు చేస్తే చూడాలనేది అభిమానుల కోరిక. సొంతగడ్డ పైనే అయినా.. షమీ, భువీ పేస్‌ను తట్టుకోవడం ఎంత కష్టమో తొలి వన్డేలో విండీస్‌కు తెలిసొచ్చింది. ఏడో నంబరు వరకు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ప్రత్యర్థిని కట్టడి చేయాలంటే పేసర్లతో పాటు స్పిన్నర్లు జడేజా, కుల్దీప్ తమ వంతు పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఓపెనర్ లూయిస్ పరుగులు సాధించ డం విండీస్‌కు ఊరటనిచ్చినా... గేల్ ఫామ్ ఆందోళన పరుస్తోంది. ఓపెనర్లు విఫలమైనా హోప్, పూరన్, హెట్‌మైర్, చేజ్ రూపంలో విండీస్‌కు నాణ్యమైన బ్యాట్స్‌మెన్ ఉన్నారు. లోయరార్డర్లో కెప్టెన్ హోల్డర్, బ్రాత్‌వైట్ రాణించగలరు. రోచ్, కాట్రెల్‌కు తోడు మూడో పేసర్‌గానూ వీరు బాధ్యత తీసుకుంటారు. బౌలింగ్‌లో కొంత బలహీనంగా ఉన్న కరీబియన్లు భారత బ్యాట్స్‌మెన్‌ను నిలువరిస్తేనే గెలుపు అవకాశాలుంటాయి. పిచ్, వాతావరణం క్వీన్స్‌పార్క్ ఓవల్ మైదానం స్పిన్నర్లకు సహకరించే వీలుంది. ఇక్కడ 2010 నుంచి స్పిన్నర్ల సగటు 27.40 కాగా, పేసర్ల సగటు 32.12. ఈ మైదానంలో జరిగిన చివరి ఐదు వన్డేల్లో నాలుగు వర్షం ప్రభావానికి గురయ్యాయి. నేటి మ్యాచ్‌కు మాత్రం వాన ముప్పు లేదు. పాక్షికంగా మేఘావృతమై... 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వాతావరణం ఆటకు అన్ని విధాల అనుకూలంగా ఉండనుంది. గేల్ @ 300 విండీస్ విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ ఈ మ్యాచ్‌తో 300 వన్డేలు ఆడిన 21వ ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు. అంతేకాక లారా (299 వన్డేలు)ను అధిగమించి ఆ జట్టు తరఫున ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ కానున్నాడు. మరో 9 పరుగులు చేస్తే వన్డేల్లో లారా (10,405) అత్యధిక పరుగుల రికార్డును కూడా అతడు దాటే వీలుంది. గేల్ ప్రస్తుతం 10,397 పరుగులతో ఉన్నాడు. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్, ధావన్, కోహ్లి, అయ్యర్, జాదవ్, పంత్, జడేజా, కుల్దీప్, భువనేశ్వర్, షమీ, ఖలీల్. వెస్టిండీస్: గేల్, లూయిస్, హోప్, పూరన్, హెట్‌మైర్, చేజ్, హోల్డర్ (కెప్టెన్), అలెన్, బ్రాత్‌వైట్, రోచ్, కాట్రెల్. -
భారత్-పాక్ మ్యాచ్.. వర్షం ముంచెత్తుతోంది!
మాంచెస్టర్: భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా..! సగటు అభిమానిని ఇప్పుడు పీడిస్తున్న ధర్మ సందేహమిది. జట్లు, బలాబలాల సంగతులు ఎలా ఉన్నా ఈ వరల్డ్‌కప్ ఫలితాలను వర్షం కూడా శాసిస్తోంది. వాన కారణంగా రద్దయిన నాలుగు మ్యాచ్‌లలో భారత్ మ్యాచ్ కూడా ఉంది. కివీస్‌తో మ్యాచ్ పోయినా పెద్దగా పట్టించుకోలేదు కానీ పాకిస్తాన్‌తో మ్యాచ్ మాత్రం కచ్చితంగా జరగాలని అంతా కోరుకుంటున్నారు. అయితే మాంచెస్టర్‌లో పరిస్థితి మాత్రం అంత ఆశాజనకంగా లేదు. ఇంగ్లండ్‌లో వాతావరణం గురించి దాదాపు కచ్చితమైన సమాచారం అందించే ఏజెన్సీలు అన్నీ ఆదివారం వర్షం పడుతుందనే చెబుతున్నాయి. ఇందులో మరో మాట కూడా తేడా లేదు. మ్యాచ్ జరిగే సమయంలోనే వానకు అవకాశం ఉందని, మధ్యాహ్నం తర్వాత ఎక్కువ కావచ్చని కూడా తెలుస్తోంది. నిజానికి శనివారం రోజంతా వాతావరణం బాగానే ఉంది. కొద్ది సేపు ఎండ కూడా కాయడంతో అభిమానులు సంతోషించారు. అయితే భారత జట్టు ప్రాక్టీస్ ముగించిన పది నిమిషాల తర్వాత చినుకులు మొదలయ్యాయి. సాయంత్రానికి వర్షం జోరు పెరిగింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటల సమయంలో కూడా అక్కడ భారీ వర్షం కురుస్తోంది. పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచినా ఔట్‌ఫీల్డ్ పనితీరుపైనే సందేహాలు ఉన్నాయి. చిన్న జల్లులకే సాయంత్రం మైదానంలో వేర్వేరు చోట్ల నీళ్లు నిలిచిపోయాయి. ఇలాంటి స్థితిలో మ్యాచ్ కోసం గ్రౌండ్‌ను ఎలా సిద్ధం చేస్తారో చూడాలి. ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానం ఈ వరల్డ్‌కప్‌లో ఒక సెమీఫైనల్ సహా ఆరు మ్యాచ్‌లకు వేదిక కాగా, ఇదే తొలి మ్యాచ్. చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ చూసేందుకు అభిమానులు పెద్ద మొత్తం వెచ్చించారు. అదృష్టవశాత్తూ టికెట్ దక్కించుకున్నవారు ఎప్పుడెప్పుడు మైదానంలో అడుగు పెడదామా అని చూస్తుంటే... మరికొందరు దీనిని మంచి ఆదాయమార్గంగా భావించారు. ‘వియాగోగో’ అనే వెబ్సైట్ ద్వారా తమ వద్ద ఉన్న టికెట్లను అధిక ధరకు ‘రీసేల్’ చేసేందుకు సిద్ధమయ్యారు. రీసేల్‌లో ఒక్కో టికెట్ ధర భారత కరెన్సీలో కనీసం రూ. 20 వేలు పలుకుతోంది. గరిష్టంగా ఇది రూ. 62 వేలకు వరకు వెళ్లటం విశేషం. నిజంగా వానతో మ్యాచ్ రద్దయితే వీరి గుండె బద్దలవడం ఖాయం! -
వర్షార్పణం..!
వజ్రపుకొత్తూరు రూరల్ శ్రీకాకుళం : నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వందలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. ఓవైపు వరద నీటితో నువ్వలరేవు ఉప్పుటేరు పొంగుతుంటే, మరో వైపు గెడ్డలు సైతం ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో వజ్రపుకొత్తూరు మండలంలోని వజ్రపుకొత్తూరు, బెండి, నగరంపల్లి, తాడివాడ, కిడిసింగి, గుళ్లలపాడు, సీతాపురం, పెద్దబొడ్డపాడుతో పాటు మరో 10 గ్రామాల్లో సుమారు 800 ఎకరాల్లో వరి పంట వర్షార్పణమైంది. కళ్లముందే పంటంతా నీటిలో మునిగి కుళ్లిపోతుంటే ఏంచేయాలో తోచక రైతులు ఆందోళన చెంందుతునన్నారు. నువ్వలరేవు, పరిసర ప్రాంతాల్లో పంట పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తమకు సష్ట పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. రైతుల సంక్షేమం పట్టదా? నువ్వలరేవులో ఏర్పడిన పొగురుతో వేలాది ఎకరాల్లో పంట నీట మునుగుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా పాలకులు పట్టించుకోకపోవడం శోచనీయమని వైఎస్సార్ సీపీ పలాస నియోజకవర్గ సమన్వయకర్త సీదిరి అప్పలరాజు అన్నారు. మండలంలో వజ్రపుకొత్తూరు వద్ద ముంపునకు గురైన పంట పొలాలను మంగళవారం ఆయన పరిశీలించి ఆరా తీశారు. తక్షణమే సమస్య పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు వైఎస్ఆర్ సీపీ మండల అధ్యక్షోఉడు పి.గుర్రయ్యనాయుడు, పీఏసీఎస్ అధ్యక్షుడు డి.మధుకేశ్వరరావు, నాయకులు మర డ భాస్కరరావు, బి.మోహన్‌రావు, శ్యాం, భీమారావు, రఘు, పురుషోత్తం తదితరులు ఉన్నారు. -
తెలుగు రాష్ట్రాలకు జలకళ
గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. దీంతో ప్రాజెక్టుల్లో నీటి మట్టం పెరిగి జలకళ సంతరించుకుంది. నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉన్నందున నీటిని దిగువకు విడుదల చేయాల్సి వస్తోంది. తూర్పుగోదావరి : జిల్లాలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం అంతకంతకి పెరుగుతోంది. 3లక్షల 69వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వచ్చిచేరుతోంది. నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉన్నందున 3లక్షల 67వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. భద్రాద్రి : కిన్నెరసాని ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరటంతో నీటి మట్టం అమాంతం పెరిగిపోయింది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో రెండు గేట్లు ఎత్తి 12వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కర్నూలు : తుంగభద్రా జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. ఇన్‌ఫ్లో 69717క్యూసెక్కులు కాగా ప్రస్తుత నీటి మట్టం 77986టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 100టీఎంసీలు. నిర్మల్ : కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరగటంతో అధికారులు గోదావరి పరిసర ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రాజెక్టులోకి 9600 క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతోంది. ప్రస్తుత నీటి మట్టం 698అడుగులు కాగా పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు. -
వర్షంలోనే దూసుకెళ్లిన గేల్ సిక్స్.!
-
వర్షంలోనే దూసుకెళ్లిన గేల్ సిక్స్.!
కోల్‌కతా : కింగ్స్ పంజాబ్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్ పంజాబ్‌కు ఓపెనర్లు క్రిస్‌గేల్, కేఎల్ రాహుల్‌లు మంచి శుభారంబాన్ని అందించారు. 8.2 ఓవర్లు సాగిన ఆటలో పంజాబ్ వికెట్ నష్టపోకుండా 96 పరుగులు చేసింది. విధ్వంసకర బ్యాట్స్‌మన్ గేల్ మరోసారి అర్థసెంచరీకి చేరువయ్యాడు. 27 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్సులతో 49 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 23 బంతుల్లో 7 ఫోర్లు 1 సిక్సుతో 43 పరుగులు పూర్తి చేసుకున్నాడు. చావ్లా వేసిన 9 ఓవర్ రెండో బంతిని గేల్ భారీ షాట్ ఆడాడు. ఇక బంతి గాల్లో ఉండగానే వర్షం ప్రారంభమైంది. విచిత్రంగా గేల్ సిక్సుకే వర్షం వచ్చినట్లైంది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపి వేశారు. -
వర్షం కారణంగా మహిళల టీ20 రద్దు
సెంచూరియన్ : దక్షిణాఫ్రికా-భారత్ మహిళల మధ్య జరుగుతున్న నాలుగో టీ20 వర్షం కారణంగా రద్దైంది. వర్షం తగ్గినా.. అవుట్ ఫీల్డ్ పచ్చిగా ఉండడం, మరి కొద్ది గంటల్లో పురుషుల మ్యాచ్ ఉండటంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇదే భారత మహిళల టీ20 చరిత్రలో రద్దైన తొలి మ్యాచ్‌కావడం విశేషం. దీంతో హర్మన్ ప్రీత్ సేన నిర్ణయాత్మక ఐదో టీ20 ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత మహిళలు చివరి మ్యాచ్ గెలిస్తే సిరీస్ వశం అవుతోంది. లేకుంటే డ్రాగా ముగుస్తోంది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు మ్యాచ్ నిలిచే సమయానికి 15.3 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. ఓపెనర్లు కెప్టెన్ నికెర్క్(55: 47 బంతులు, 6 ఫోర్లు, 2 సిక్సులు), లిజెల్లే లీ(59: 39 బంతులు,2ఫోర్లు, 5 సిక్సర్లు, నౌటౌట్)లు రాణించారు. పురుషుల మ్యాచ్ కోసం మైదాన సిబ్బంది కృషి చేస్తున్నారు. -
ప్రజాధనం నీళ్ల పాలు
యూనివర్సిటీక్యాంపస్: ఎస్వీయూ స్టేడియంలో ఈనెల 2వ తేదీ నుంచి నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి హస్తకళా ప్రదర్శన ఆదివారం రాత్రితో ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రోజుల పాటు నిర్వహిం చిన హస్తకళాప్రదర్శనకు దాదాపు రూ.3కోట్లు విని యోగించింది. కార్యక్రమం ముందు రోజు నుంచి వర్షం కురవడంతో ప్రజల ఆదరణ లేకుండా పోయింది. కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిన పర్యటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియతోపాటు ఇతర మంత్రులెవ్వరూ హాజరుకాలేదు. శనివారం ∙సీఎం చంద్రబాబు సందర్శన కార్యక్రమం ఉన్నా, రద్దు చేసుకున్నారు. రాష్ట్ర పర్యాటకశాఖ ఈ ప్రద ర్శనను సరైన సమయంలో నిర్వహించకపోవడం, వర్షాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ప్రజాధనం నీళ్లపాలైందని విమర్శలు వెల్లువెత్తాయి. వ్యాపారం సైతం జరగలేదని స్టాళ్ల నిర్వాహకులు వాపోవడం కనిపించింది. హస్తకళలకు ప్రోత్సాహం: మంత్రి సునీత హస్తకళ, చేనేత కళాకారులను ప్రోత్సహిస్తామని మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. హస్తకళల ప్రదర్శనను ఆదివారం రాత్రి ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి కుటుం బం రూ.10 వేల ఆదా యం సంపాదించేలా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. స్టాల్స్‌ను సందర్శించారు. చీరను కొనుగోలు చేశారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు స్టేడియంలో ఆదివారం రాత్రి నిర్వహించిన సాం స్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గాయని సునీ త విభావరి ఓలలాడించింది. వర్షం వల్ల ఆటంకం ఏర్పడినా సాంస్కృతిక కార్యక్రమాలను కొనసాగించారు. మృదుల, కౌశిక్ యాంకరింగ్ చేశారు. ఆనంద్ బృందం కామెడీ స్కిట్ చేశారు. కోల్‌కతా చెందిన శ్రావణ్ ఆధ్వర్యంలో మోడల్స్ చేనేత వస్త్రాలు ధరిం చి క్యాట్‌వాక్ చేశారు. సినీతారలు మనారాచోప్రా, శుబ్ర అయ్యప్ప హాజరయ్యారు. కలెక్టర్ ప్రద్యుమ్న, సబ్‌కలెక్టర్ నిషాంత్‌కుమార్, పరిశ్రమలశాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజు, తిరుపతి కమిషనర్ హరికిరణ్, జిల్లా జడ్జి రాంగోపాల్ తిలకించారు. -
సాగు సగమే!
5.72 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ పంటలు 4.17 లక్షల హెక్టార్లకు చేరిన వేరుశనగ 62 వేల హెక్టార్లలో కంది, 36 వేల హెక్టార్లలో పత్తి ప్రత్యామ్నాయ పంటలపై తేలని కచ్చితమైన లెక్కలు అనంతపురం అగ్రికల్చర్: గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ సారి ఖరీఫ్ అతికష్టమ్మీద ‘సాగు’తోంది. సీజన్ ముగుస్తున్నా కచ్చితమైన సాగు విస్తీర్ణం అందుబాటులోకి రాని పరిస్థితి నెలకొంది. అందులోనూ ప్రత్యామ్నాయ పంటల సాగు అంచనాలు కొలిక్కిరావడం లేదు. వ్యవసాయశాఖ తాజాగా తయారు చేసిన నివేదిక ప్రకారం 8.01 లక్షల హెక్టార్ల సాధారణ సాగుకు గానూ 5.72 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలోనే అన్ని పంటలు సాగులోకి వచ్చాయి. అందులో ప్రధానపంట వేరుశనగ 6.04 లక్షల హెక్టార్లకు గానూ ఎట్టకేలకు 4.17 లక్షల హెక్టార్లకు చేరుకుంది. అన్ని పంటలు కలిపి 71 శాతం విస్తీర్ణంలో వేయగా వేరుశనగ 69 శాతం విస్తీర్ణంలో సాగైంది. వేరుశనగ, కంది, ఆముదం, పత్తి లాంటి ప్రధాన పంటల విస్తీర్ణం పెరిగే అవకాశం లేదు. ప్రత్యామ్నాయ పంటల సాగు విస్తీర్ణం మరికొంత పెరిగే పరిస్థితి ఉందంటున్నారు. రైతులు ప్రత్యామ్నాయ సాగుకు విత్తనాలు తీసుకెళ్లినా అనుకున్నంత విస్తీర్ణంలో పంట వేయలేదని తెలుస్తోంది. దెబ్బతీసిన జూలై జూలై నెలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఖరీఫ్ పడుతూ లేస్తూ సాగింది. విత్తుకునేందుకు కీలకమైన జూలైలో 67.4 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా... 31 మి.మీ అది కూడా అడపాదడపా అక్కడక్కడా కురవడంతో రైతులు అరతేమలోనే పంట విత్తుకున్నారు. జూన్ మొదటి పక్షంలో వర్షాలు బాగానే వచ్చినా రెండో పక్షంలో వరుణుడు మొహం చాడేయడంతో పంటల సాగు పడకేసింది. జూన్‌లో 63.9 మి.మీ గానూ 59.4 మి.మీ వర్షం కురిసింది. జూన్, జూలై నెలలు ముగిసేనాటికి కురవాల్సిన వర్షం కన్నా 32 శాతం లోటు ఏర్పడింది. అయితే ఆగస్టు 5వ తేదీ నుంచి వర్షాలు కురవడం ప్రారంభమయ్యాయి. ఇక సెప్టెంబర్‌లో విస్తారంగా వర్షాలు పడటంతో వేసిన పంటలు బాగానే ఉండగా, అనుకున్న స్థాయిలో ప్రత్యామ్నాయ పంటలు వేయలేదు. కంది, సజ్జ పంటలు సాధారణ సాగు కన్నా ఎక్కువ విస్తీర్ణంలో వేశారు. మిగతా పంటలన్నీ 50 నుంచి 70 శాతం విస్తీర్ణంలో వచ్చాయి. ఐదారు మండలాల్లో సాధారణ విస్తీర్ణంలో పంటలు వేయగా 40 మండలాల్లో 60 శాతం పైబడి విస్తీర్ణం పంటలు సాగులోకి వచ్చాయి. నెలాఖరుకు పంట విస్తీర్ణం లెక్కలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు జేడీఏ కార్యాలయ వర్గాలు తెలిపాయి. సగమే! -
ముంబై వరదలతో రైళ్లు ఆలస్యం
గుంతకల్లు: ముంబైలో కురుస్తున్న భారీ వర్షం, వరదల ధాటికి పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని గుంతకల్లు రైల్వే డివిజన్ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ముంబై – చెన్నై మార్గంలో గుంతకల్లు రైల్వే జంక్షన్ మీదుగా నడిచే అన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయన్నారు. వర్ష ప్రభావం మరో రెండు రోజులుండటం వల్ల రైళ్ల సమయాలు చెప్పలేమని అధికారులు పేర్కొన్నారు. -
ఏజెన్సీ మండలాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంగా జిల్లాలో బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు తదితర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి, జనజీవనానికి విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతో ముందుగానే అప్రమత్తమై జిల్లా యంత్రాంగం కంట్రోలు రూంలను ఏర్పాటు చేసినట్లు కలెక్టరు కాటంనేని భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం జిల్లా అంతటా చెదురుమదురు జల్లులతో వర్షం కురుస్తున్నదని రేపటికి వర్షపు నీరు పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యగా వీఆర్ఓలను, వీఏఓలను, ఆయా ప్రాంతాల్లోని ఉపాధ్యాయులు అందుబాటులో ఉండాలని, ఇతర సిబ్బందిని అవసరమైతే ఆ ప్రాంతాలలో ఉండి వరద నివారణ చర్యలు తక్షణం తీసుకోవాలని, సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వారికి నిత్యావసర వస్తువులు కూడా సిద్ధం చేసుకోవాలన్నారు. మండలాల్లో కంట్రోల్ రూంలు ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు సిబ్బంది షిప్టులు వారీగా 24 గంటలూ వరద నిరోధక చర్యలు చేపడతారని కలెక్టరు చెప్పారు. కంట్రోల్ రూమ్ నెంబర్లు: జీలుగుమిల్లి తహశీల్దార్ కార్యాలయం సెల్ నెంబర్లు 9959967184, 8464840551, బుట్టాయిగూడెం తహశీల్దార్ కార్యాలయం సెల్ నెంబర్లు 809627466, 9912759993, కుక్కునూరు తహశీల్దార్ కార్యాలయం సెల్‌నెంబర్ 9492362623, వేలేరుపాడు తహశీల్దార్ కార్యాలయం సెల్‌నెంబర్ 9492360603. వర్షపాతం వివరాలు... జిల్లాలో గత 24 గంటల్లో ఆచంట మండలంలో అత్యధికంగా 53.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా వీరవాసరంలో 52.6, జీలుగుమిల్లి 21.6, బుట్టాయగూడెం 24.0, పోలవరం 32.8, తాళ్ళపూడి 35.6, గోపాలపురం 27.2, కొయ్యలగూడెం 36.4, జంగారెడ్డిగూడెం 24.6, కుక్కునూరు 14, వేలేరుపాడు 41.8, టీ.నర్సాపురం 39.6, చింతలపూడి 31.4, లింగపాలెం 25.6, కామవరపుకోట 41.2, ద్వారకాతిరుమల 18.2, నల్లజర్ల 20.8, దేవరపల్లి 26.8, చాగల్లు 19.2, కొవ్వూరు 22.2, నిడదవోలు 23.8, తాడేపల్లిగూడెం 22, ఉంగుటూరు 41, భీమడోలు 37 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
వర్షాల కారణంగా పలు రైళ్ల రద్దు
ఒడిశా: ఒడిశా, ఏపీలో కురుస్తున్న వర్షాల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఒడిశాలోని సంబల్పూర్ డివిజన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సింగాపూర్-తెరువలి మార్గంలో వరద ప్రవాహం ప్రమాదస్థాయిని మించి ఉండటంతో నాందేడ్-సంబల్పూర్ నాగావళి ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు. బిలాస్పూర్-తిరుపతి ఎక్స్‌ప్రెస్, ఈ నెల 20న తిరుపతి-బిలాస్పూర్, రాయగడ- జునాగఢ్ రోడ్ -రాయగడ మధ్య రైళ్ల సేవలు రద్దు చేశారు. తిరుపతి-బిలాస్పూర్ మెయిల్ ఎక్స్‌ప్రెస్ విజయనగరం మీదుగా మళ్లించారు. అలప్పుజా-ధన్‌బాద్ బొకారో ఎక్స్‌ప్రెస్ విజయనగరం మీదుగా మళ్లించారు. హజ్రత్ నిజాముద్దీన్- విశాఖ సమతా ఎక్స్‌ప్రెస్ టిట్లాగఢ్ మీదుగా మళ్లింపు, విశాఖ- ముంబయి ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్ విజయనగరం మీదుగా దారి మళ్లించారు. -
విత్తుకోని ఆశలు!
జిల్లాలో తగ్గుతోన్న వేరుశనగ సాగు - పెట్టుబడి సమస్యతో రైతుల అవస్థలు - ఇప్పటికీ అందని ఇన్పుట్ సబ్సిడీ, ఇనూరెన్స్ - కరువు, ఆర్థిక ఇక్కట్లతో ఉక్కిరిబిక్కిరి - ఖాళీగా దర్శనమిస్తున్న విత్తన కేంద్రాలు - తొమ్మిదేళ్లలో తగ్గిన 2.70లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం - ప్రత్యామ్నాయం వైపు రైతుల చూపు ‘అనంత’ రైతులు ఖరీఫ్‌కు సిద్ధమయ్యేలోపు ఇన్పుట్ సబ్సిడీని వారి ఖాతాల్లో జమ చేస్తాం. సాగుకు అయ్యే పెట్టుబడి ఖర్చుకు ఇబ్బంది లేకుండా చూస్తాం.’ – గత ఏప్రిల్ 20న పామిడిలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు ఇది పూట్లూరు వ్యవసాయశాఖ కార్యాలయం. రైతులకు వేరుశనగ విత్తనాలను ఇక్కడే పంపిణీ చేస్తున్నారు. బుధవారం చింతరపల్లికి చెందిన కుళ్లాయప్ప అనే రైతు మాత్రమే నాలుగు బస్తాలు వేరుశనగ విత్తనకాయలు తీసుకున్నారు. అధికారులు సాయంత్రం వరకు అక్కడే నిరీక్షించినా ఇతర రైతుల జాడ లేకపోయింది. ఇక్కడే కాదు.. జిల్లాలోని అన్ని పంపిణీ కేంద్రాల్లో 15 రోజులుగా ఇదే పరిస్థితి. అలాగని పంట సాగుకు రైతులు ఆసక్తి చూపడం లేదనుకుంటే పొరపాటు. పెట్టుబడికి డబ్బులు లేకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం : దేశంలోనే అత్యధికంగా వేరుశనగ సాగు చేసే ప్రాంతం అనంతపురం. 2008లో ఇక్కడ 8.70లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగయింది. గతేడాది 6.02లక్షల హెక్టార్లకు సాగు విస్తీర్ణం తగ్గింది. ఈ ఏడాది 6.02లక్షల హెక్టార్లలో పంట సాగువుతుందని వ్యవసాయశాఖ అధికారుల అంచనా. జిల్లాలో పరిస్థితి చూస్తుంటే 5–5.50లక్షల హెక్టార్లలోపు పంట మాత్రమే సాగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వరుస కరువుతో పంట నష్టపోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు రైతులను ఉక్కరిబిక్కిరి చేశాయి. ఇదే సమయంలో ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ప్రభుత్వ తోడ్పాటు లేకపోవడంతో పంట సాగుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది ఆర్థిక ఇబ్బందులతో విత్తనాలు కూడా కొనలేకపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా విత్తన పంపిణీ కేంద్రాలు రైతులు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటి వరకూ 35వేల హెక్టార్లలోనే వేరుశనగ సాగు గతేడాది జూన్‌లో 1.72లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగయింది. ఈ ఏడాది ఇప్పటి వరకూ 35వేల హెక్టార్లకే పరిమితమైంది. ఇందుకు వర్షాభావంతో పాటు ఆర్థిక ఇబ్బందులు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుత సీజన్‌కు 4.01లక్షల క్వింటాళ్ల విత్తనాలను అధికారులు సేకరించారు. అవసరమైతే అదనంగా మరో 50వేల క్వింటాళ్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో 3.19లక్షల క్వింటాళ్లు మాత్రమే పంపిణీ చేశారు. తక్కిన విత్తన కాయల కొనుగోలుకు రైతులు ముందుకు రావడం లేదు. పంపిణీ చేసిన విత్తనాల్లో కూడా కొనుగోలు చేసిన రైతుల సంఖ్య తక్కువే. ఏటా మూడు బస్తాలు పంపిణీ చేస్తే ఈ ఏడాది 4బస్తాలు పంపిణీ చేశారు. దీంతో 3.19లక్షల క్వింటాళ్ల సంఖ్య కన్పిస్తోంది. వీటిని కొనుగోలు చేసిన రైతులు మాత్రం తక్కువే కావడం గమనార్హం. నాలుగేళ్లుగా వరుస కరువుతో రైతాంగం అల్లాడుతోంది. కరువు మండలాలను ప్రకటిస్తున్నా.. హక్కుగా దక్కాల్సిన ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ అందని పరిస్థితి. ఈ ఏడాది ఖరీఫ్‌లోపు ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ రైతుల ఖాతాల్లో జమ చేస్తామని గత ఏప్రిల్ 20న జిల్లా పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు రూపాయి పరిహారం కూడా రైతులకు అందించలేకపోయారు. బీమా పరిహారం నిబంధనల మేరకు గతేడాది అక్టోబర్‌కే రైతుల ఖాతాల్లో జమకావాల్సి ఉన్నా ఇప్పటి వరకు అతీగతీ లేదు. దీంతో పెట్టుబడికి రైతుల వద్ద డబ్బుల్లేని పరిస్థితి. బ్యాంకు రుణాలు కూడా రైతులకు పెట్టుబడికి సరిపడా అందడం లేదు. ఈ ఏడాది రూ.4,264కోట్లు పంపిణీ చేయాలనేది లక్ష్యం కాగా.. బ్యాంకర్లు రూ.3,400కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. ఇందులో కూడా గతేడాది రుణాలకు వడ్డీలు చెల్లించి రెన్యూవల్ చేసుకోవడం మినహా రైతుల చేతికి డబ్బులు వచ్చింది లేకపోవడం గమనార్హం. వర్షపాతమూ కారణమే.. విత్తనాల కొనుగోలుకు ఆర్థిక ఇబ్బందులు కారణమైతే, కొనుగోలు చేసిన రైతులు పంట సాగుకు ఉపక్రమించకపోవడానికి వర్షపాతమూ కారణమే. జూన్‌లో 63.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉంటే, 59 మిల్లీమీటర్లకే పరిమితమైంది. ఈ నెల 6న మాత్రమే ఓ మోస్తరు వర్షం కురిసింది. తక్కిన రోజుల్లో పదునుకు సరిపడా వర్షం లేదు. రైతులు పంటసాగు చేయకపోవడానికి ఇదీ ఓ కారణమే. అయితే గతేడాది జూన్‌తో పోలిస్తే ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. అయితే జూలై ఆఖరు వరకూ విత్తనం వేసేందుకు అవకాశం ఉండటంతే సాగు విస్తీర్ణం ఏ మేరకు పెరుగుతుందనేది చూడాలి. సాగుభూమి కూడా తగ్గుతోందా? గత తొమ్మిదేళ్లతో పోలిస్తే ఇటీవల జిల్లాలో విండ్‌పవర్ కోసం రైతుల నుంచి భూముల కొనుగోలు భారీగా పెరిగింది. ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాప్తాడు, గుంతకల్లుతో పాటు పలు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ రైతులు విండ్‌పవర్ కంపెనీలకు భూములను విక్రయిస్తున్నారు. ఇది కూడా సాగు విస్తీర్ణం తగ్గేందుకు కారణం. అటవీ ప్రాంతాల్లో పంటసాగు చేస్తే పందులు, జింకల బెడద తీవ్రంగా ఉంది. దీంతో పాటు ఏటా పంటసాగుకు ఉపక్రమిస్తున్నా రైతులను నష్టాలు వెక్కిరిస్తున్నాయి. పెట్టుబడి కోసం చేసిన అప్పులు చెల్లించలేక రైతులు ఆత్మహత్యలకు ఉపక్రమిస్తున్నారు. 2014లో టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత 187 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో దాదాపు అంతా వేరుశనగ సాగు చేసే రైతులే. దీంతో వేరుశనగ సాగుపై రైతుల్లో కూడా ఆసక్తి తగ్గినట్లు కన్పిస్తోంది. పండ్ల తోటలతో పాటు పత్తి, కంది, పెసర లాంటి ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. గత ఏడేళ్లలో వర్షపాతం వివరాలు ఇలా.. –––––––––––––––––––––––––––––––– సంవత్సరం వర్షపాతం(మిల్లీమీటర్లలో) భూగర్భ జలమట్టం(మీటర్లలో) –––––––––––––––––––––––––––––––––––– 2009–10 615.6 13.04 2010–11 722.4 12.01 2011–12 495.4 14.65 2012–13 455.6 16.23 2013–14 538.7 18.59 2014–15 404.3 21.87 2015–16 503 22.32 2016–17 284 23.50 –––––––––––––––––––––––––––––––––––– ఏడేళ్లుగా అనంతపురం జిల్లాలో ఖరీఫ్ పంట నష్టం(అధికారిక లెక్కల ప్రకారం): ––––––––––––––––––––––––––––––––––– సంవత్సరం పంట నష్టం(రూ.కోట్లలో) ––––––––––––––––––––––––––––––––––––––– 2009 2,150 2010 2,300 2011 1,950 2012 2,225 2013 2,650 2014 3,100 2015 3,400 2016 3,700 -
వర్షం ఎఫెక్ట్: ఆసీస్-కివీస్ మ్యాచ్‌కు ఓవర్ల కుదింపు
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్-కివీస్ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలగించడంతో అంపైర్లు ఆసీస్ ఇన్నింగ్స్‌ను 33 ఓవర్లకు కుదించారు. ఆస్ట్రేలియాకు డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 33 ఓవర్లలో 235 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించారు. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 45 ఓవర్లలో 295 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ విలియమ్సన్ అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇన్నింగ్స్ మధ్యలో వర్షం అంతారయం కలిగించడంతో ఇన్నింగ్స్‌ను 46 ఓవర్లకు కుదించారు. -
వెంటాడిన వర్షాభావం
- ఖరీఫ్, రబీ దెబ్బతీసిన వరుణుడు - ఈ ఏడాది 42 శాతం తక్కువగా వర్షపాతం నమోదు - గుమ్మగట్ట, రాప్తాడు నియోజక వర్గంలో మరీ ఘోరం అనంతపురం అగ్రికల్చర్ : వరుణుడు మొహం చాటేయడంతో మునుపెన్నడూ లేనంతగా ఈ సారి తీవ్ర వర్షాభావ పరిస్థితులు ‘అనంత’ను వెంటాడాయి. అటు నైరుతీ ఇటు ఈశాన్యం రెండు సీజన్లలో రుతుపవనాలు చేతులెత్తేయడంతో ఖరీఫ్, రబీ పంటలు అత్యంత దారుణంగా దెబ్బతిన్నాయి. నెలల కొద్దీ వర్షం జాడ లేకపోవడంతో వర్షపాత విరామాలు (డ్రైస్పెల్స్) అధికంగా నమోదయ్యాయి. 22 లక్షల ఎకరాల్లో సాగైన ఖరీఫ్, రబీ పంటల నుంచి కనీసం పెట్టుబడుల్లో సగం కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. పెట్టుబడులు, దిగుబడుల రూపంలో జిల్లా రైతులకు రూ.5 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఫలితంగా రైతులు, కూలీలు, పేద వర్గాలు పొట్ట చేతబూని ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సిన దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకుండా కుప్పలు తెప్పలుగా అప్పులు మిగిలిపోవడంతో తీర్చేదారి లేక బలవణ్మరణాలకు పాల్పడుతున్నారు. వెంటాడిన వర్షాభావం : ఈ స్థాయి కరువు పరిస్థితులు ఏర్పడటానికి ప్రధాన కారణం వర్షాలు. అసలే అత్యల్ప వర్షపాతం కలిగిన జిల్లాలో వార్షిక వర్షపాతం కేవలం 553 మి.మీ. అది కూడా కురవకపోవడంతో కరువు దరువేస్తోంది. గత జూన్ నుంచి ఇప్పటి వరకు 505.1 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సివుండగా కేవలం 293.7 మి.మీ కురిసింది. అంటే 42 శాతం తక్కువగా వర్షాలు కురిశాయి. అందులో కీలకమైన ఖరీఫ్‌కు సంబంధించి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 338.4 మి.మీ గానూ 24 శాతం తక్కువగా 257.3 మి.మీ కురిసింది. అది కూడా జూన్, జూలైలో మాత్రమే వర్షం పడగా, ఆగస్టు, సెప్టెంబర్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పంటలన్నీ నాశనమయ్యాయి. రైతుల ఆశలన్నీ ఆగస్టు, సెప్టెంబర్ వర్షాలు నేలకూల్చాయి. రబీలోనైనా గట్టెక్కుదామనుకున్న రైతులు మరింత ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు రబీకి సంబంధించి 155.3 మి.మీ గానూ 82.9 శాతం తక్కువగా కేవలం 26.5 మి.మీ వర్షం పడింది. దీంతో ఆదిలోనే రబీ గల్లంతైంది. ఇలా రెండు సీజన్లు రైతులను వరుణుడు నిలువునా మోసం చేయడంతో కోలుకోలేనంత కష్టాలు మూటగట్టుకున్నాడు. జిల్లాలో నెలకొన్న వర్షాభావం వల్ల ఖరీఫ్, రబీ పంటలతో పాటు 10 లక్షల సంఖ్యలో ఉన్న పశుసంపద, 45 లక్షలున్న జీవాలకు గడ్డి, నీటి కొరత ఏర్పడింది. అలాగే 30 వేల ఎకరాల్లో ఉన్న మల్బరీ, 1.71 లక్షల హెక్టార్లలో విస్తరించిన పండ్లతోటలు ఎండుముఖం పట్టాయి. అధికారికంగా ఇప్పటికే 7 వేల ఎకరాల్లో పట్టు, 5 వేల ఎకరాల్లో పండ్లతోటలు ఎండిపోవడంతో రైతులకు రూ.కోట్ల నష్టం వాటిల్లింది. ఈ నష్టం మరింత పెరిగే సూచనలు స్పష్టంగా గోచరిస్తుండటంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గుమ్మగట్టలో 78 శాతం తక్కువగా వర్షం : ఈ సారి జిల్లా అంతటా 42 శాతం తక్కువగా వర్షపాతం నమోదు కాగా.. అందులో గుమ్మగట్ట మండలంలో మరీ దారుణంగా 78 శాతం తక్కువగా వర్షాలు కురిశాయి. గుమ్మగట్టలో 460.9 మి.మీ వర్షం పడాల్సి ఉండగా కేవలం 90.1 మి.మీ నమోదైంది. రామగిరి 65 శాతం, రాప్తాడు 63 శాతం, కనగానపల్లి 60 శాతం, అమరాపురం 60 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. అలాగే బుక్కపట్నం, బెళుగుప్ప 59 శాతం, రొళ్ల 58 శాతం, హిందూపురం 55 శాతం, కదిరి 54 శాతం, నల్లచెరువు, తనకల్లు 53 శాతం, పుట్టపర్తి, బొమ్మనహాల్ 52 శాతం, అమడగూరు, పరిగి 51 శాతం, అలాగే బ్రహ్మసముద్రం, విడపనకల్, యాడికి, పెద్దపప్పూరు, పామిడి, గార్లదిన్నె, ఉరవకొండ, రాయదుర్గం, కుందుర్పి, కళ్యాణదుర్గం, అనంతపురం, నార్పల, బత్తలపల్లి, గాండ్లపెంట, ఓడీ చెరువు, కొత్తచెరువు, పెనుకొండ, రొద్దం, చిలమత్తూరు మండలాల్లో 40 నుంచి 50 శాతం తక్కువగా వర్షాలు కురిశాయి. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా కేవలం ఆత్మకూరు మండలంలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదు కాగా మిగతా 62 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. నెల వారీ వర్షపాతం వివరాలిలా... -
రబీ ఆశలపై నీళ్లు
- కేవలం 35 శాతం విస్తీర్ణంతో ముగిసిన రబీ అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్‌ను కకావికలం చేసిన వరుణుడు రబీలోనూ కరుణించకపోవడంతో మరింత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆగస్టు, సెప్టెంబర్‌లో వర్షాలు రాకపోవడంతో 7.62 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ పంటలు నిలువునా ఎండిపోయాయి. అక్టోబర్‌లోనూ వరుణుడు ముఖం చాటేయడంతో ప్రస్తుత రబీ సీజనూ రైతన్నలను చావు దెబ్బ తీసింది. రెండు సీజన్లలోనూ వర్షాలు లేకపోవడంతో ‘అనంత’ అన్నదాతలకు కోలుకోలేని నష్టం వాటిల్లింది. మునుపెన్నడూ లేని విధంగా జిల్లా చరిత్రలో ఖరీఫ్, రబీలు దెబ్బమీద దెబ్బ కొట్టడంతో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. పడిపోయిన విస్తీర్ణం సీజన్ ముగుస్తున్నా రబీ పంటల విస్తీర్ణం 35 శాతానికి మించలేదు. ఈ రబీలో అన్ని పంటలు కలిపి 1.31 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగవ్వాల్సి ఉండగా, 44 వేల హెక్టార్లకే పరిమితమయ్యాయి. 77,564 హెక్టార్లలో సాగులోకి వస్తుందనుకున్న ప్రధానపంట పప్పుశనగ 23 వేల హెక్టార్లు, 20 వేల హెక్టార్లలో వేయాల్సిన వేరుశనగ 12,500 హెక్టార్లలోనే సాగైంది. జొన్న 6.672 హెక్టార్ల సాధారణ సాగుకు గానూ 2,500 హెక్టార్లు, మొక్కజొన్న 6 వేల హెక్టార్లకు గానూ 3 వేల హెక్టార్లు, పొద్దుతిరుగుడు 4,673 హెక్టార్లకు గానూ 1,200 హెక్టార్లు, ఉలవ 3,855 హెక్టార్లకుగానూ కేవలం 180 హెక్టార్లకు పరిమితమయ్యాయి. వర్షాల్లేక భూగర్భజలాలు అడుగంటిపోవడం వల్ల బోర్లలో నీటి లభ్యత గణనీయంగా పడిపోయింది. దీంతో వరి 10 వేల హెక్టార్ల సాధారణ సాగుకు గానూ ప్రస్తుతానికి 1,400 హెక్టార్లలోనే సాగవుతోంది. సజ్జ, రాగి, మినుము, అలసంద, పెసర, కుసుమ, ధనియాలు, పత్తి తదితర అన్ని పంటల సాగు విస్తీర్ణమూ గణనీయంగా పడిపోయింది. వేసిన పప్పుశెనగ కూడా వర్షాలు లేక ఎండిపోవడంతో ఎకరాకు 50 కిలోలు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదంటున్నారు. పెట్టుబడుల్లో సగం కూడా దక్కడం కష్టమనే ఆందోళన వ్యక్తమవుతోంది. వెంటాడిన వర్షాభావం వర్షాభావ పరిస్థితులు రబీని కూడా వెంటాడటంతో సాగు విస్తీర్ణం పడిపోయింది. కీలకమైన అక్టోబర్, నవంబర్‌లో వర్షాలు పూర్తిగా మొహం చాటేయడంతో అరకొర తేమలో అక్కడక్కడ పంటలు సాగు చేశారు. సాగైన పంటలు కూడా దిగుబడులు లేక దయనీయంగా తయారయ్యాయి. అక్టోబర్‌లో 110.7 మి.మీ. భారీ వర్షపాతం నమోదు కావాల్సివుండగా కేవలం 7.1 మి.మీ. వర్షమే పడింది. నవంబర్లోనూ 34.7 మి.మీ. గానూ కేవలం 1.7 మి.మీ. కురిసింది. రెండు మూడు తుఫాన్లు వచ్చినా జిల్లాపై కనీస ప్రభావం చూపలేకపోవడంతో రబీ ఆశలు గల్లంతయ్యాయి. మొత్తమ్మీద రబీలో 155.5 మి.మీ. వర్షం పడాల్సి ఉండగా కేవలం 26.6 మి.మీ. కురిసింది. మొత్తమ్మీద ఈ సంవత్సరం ఇప్పటివరకు 495 మి.మీ.గానూ 283 మి.మీ. వర్షం కురిసింది. అంటే 43 శాతం తక్కువగా వర్షాలు పడ్డాయి. కనీసం ఒక్క మండలంలోనూ సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. గుమ్మగట్ట, రామగిరి, కగానపల్లి లాంటి కొన్ని మండలాల్లో 60 నుంచి 80 శాతం తక్కువగానూ, మరో 30 మండలాల్లో 40 నుంచి 60 శాతం తక్కువగానూ నమోదైంది. వరుసగా 45 రోజులు, 52 రోజుల పాటు వర్షం పడని విరామం (డ్రైస్పెల్స్) నమోదు కావడంతో భూగర్భజలాలు రికార్డుస్థాయిలో పాతాళానికి పడిపోయాయి. బోర్లలో నీళ్లు రావడం గగనంగా మారింది. ప్రస్తుతం భూగర్భజలమట్టం 22.40 మీటర్లుగా ఉంది. -
ముగిసిన ఖేలో ఇండియా క్రీడా పోటీలు
వర్షం కారణంగా ఆగిన అండర్–14, 17 ఫుట్‌బాల్ బాలుర పోటీలు అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఖేలో ఇండియా క్రీడా పోటీలు శనివారం ముగిశాయి. వర్షం కారణంగా అండర్–14, 17 ఫుట్‌బాల్ బాలుర పోటీలు ఆగిపోయాయి. తిరిగి ఆదివారం నిర్వహించనున్నట్లు డీఎస్డీఓ బాషామోహిద్దీన్ తెలిపారు. శనివారం స్థానిక ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో హాకీ, ఫుట్‌బాల్, తైక్వాండో క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో 14 నియోజకవర్గాల క్రీడాకారులు పాల్గొన్నారు. అట్టహాసంగా సాగిన క్రీడా పోటీలు శనివారంతో ముగియాల్సి ఉండగా వర్షం వల్ల అర్ధంతరంగా ముగిశాయి. ఆల్‌రౌండ్ ప్రతిభలో ఉరవకొండ, రాప్తాడు నియోజకవర్గాల క్రీడాకారులు జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభను కనబరిచారు. ఈ క్రీడా పోటీలు కబడ్డీ, అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్, ఖో–ఖో, ఆర్చరీ, వాలీబాల్, బాక్సింగ్, ఫుట్‌బాల్, హాకీ, తైక్వాండో పోటీలను నిర్వహించారు. మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను నియోజకవర్గ స్థాయికి, నియోజకవర్గాలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక చేశారు. జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక చేశారు. గతంలో జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసే విధానం ఉండేది. ఈ ఏడాది జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన జట్లను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. రాష్ట్రస్థాయి క్రీడా పోటీల తేది, పోటీలు జరిగే ప్రదేశాలను ఎంపిక ప్రక్రియ జరగలేదు. వాటిని త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు డీఎస్డీఓ బాషామోహిద్దీన్ తెలిపారు. అనంతపురం, రాప్తాడు నియోజకవర్గాల హాకీ జట్టు విషయంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఆర్డీటీ అకాడమీ క్రీడాకారులు అనంతపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించడంతో పీఈటీలు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. డీఎస్డీఓ అక్కడికి చేరుకొని సమస్య పరిష్కరించారు. మూడో రోజు విజేతలు వీరే అండర్–14 బాలురు 18 కేజీల విభాగం–రాజీవ్లోచన్ (అనంతపురం), గౌతంకృష్ణారెడ్డి(అనంతపురం), ఙానశ్రీపతి (తాడిపత్రి) 21–సుజీత్ చౌదరి (తాడిపత్రి), శ్రావణ్ (అనంతపురం), రవికాంత్‌రెడ్డి (శింగనమల). 23–కార్తీక్(రాప్తాడు), నందకిషోర్ (గుంతకల్), గైబుబాషా(తాడిపత్రి). 25–నందకిషోర్ (తాడిపత్రి), జునేద్అహమ్మద్ (శింగనమల), మాలిక్‌బాషా (శింగనమల). 27–కౌశిక్(తాడిపత్రి), మోక్షిత్రామ్ (అనంతపురం), యర్రంకిరెడ్డి(శింగనమల). బాలికలు 16–సర్తాజ్బేగం (శింగనమల). 18–నిహారిక (శింగనమల), రుక్సాన (శింగనమల), సాయివినోదిని (తాడిపత్రి). 20–నీతుశ్రీసాయి (అనంతపురం), చరిత (శింగనమల), సాయిశ్రీ(రాప్తాడు). 22–జోత్స్న (అనంతపురం), పూజిత(శింగనమల), డీ.పూజిత(శింగనమల). 24–వెన్నెల (అనంతపురం), గౌతమి (శింగనమల), లాశ్రీరెడ్డి(శింగనమల). అండర్–17 బాలురు 35–మహర్షి (అనంతపురం). 41–ఫిరోజ్ (తాడిపత్రి), దస్తగిరి (గుంతకల్), మహేష్ (గుంతకల్). 44–నాగగుర్రప్ప (అనంతపురం), అమీర్ (అనంతపురం), పవన్‌కళ్యాణ్ (తాడిపత్రి). 48–రూపేష్ (పెనుకొండ), శాంతకుమార్ (రాయదుర్గం), మోహమ్మద్ జునేద్ (గుంతకల్). బాలికలు 32–అశ్విని (గుంతకల్). 35–దుర్గ (అనంతపురం). 38–సాయిదీప్తి (రాప్తాడు), కళ్యాణి (గుంతకల్), చాముండేశ్వరి(గుంతకల్). 41–స్రవంతి (అనంతపురం), రామాంజినమ్మ(గుంతకల్),ప్రశాంతి(గుంతకల్). 44–యశశ్విణి (అనంతపురం), మాధురి (తాడిపత్రి), హేమ(అనంతపురం). ఫుట్‌బాల్ అండర్–14 బాలికలు రాప్తాడు–1, కళ్యాణదుర్గం–2, రాయదుర్గం–3. అండర్–17 బాలికలు ఉరవకొండ–1, కళ్యాణదుర్గం–2, ధర్మవరం–3. హాకీ అండర్–14 బాలురు ధర్మవరం–1, ఉరవకొండ–2, రాప్తాడు–3. బాలికలు రాప్తాడు–1, ధర్మవరం–2, పుట్టపర్తి–3. అండర్–17 బాలురు రాప్తాడు–1, ధర్మవరం–2, పుట్టపర్తి–3. బాలికలు రాప్తాడు–1, ధర్మవరం–2, ఉరవకొండ–3 -
దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతు
ఎల్లారెడ్డిపేట : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వివిధ రూట్లలో రోడ్లు దెబ్బతిన్నాయి. వీటి మరమ్మతును శుక్రవారం చేపట్టారు. ఎల్లారెడ్డిపేట– మర్రిమడ్ల ప్రధాన మార్గంలో ఐదుచోట్ల రోడ్డు తెగిపోగా మరమ్మతు కొనసాగిస్తున్నారు. జెడ్పీటీసీ తోట ఆగయ్య, ఆర్అండ్బీ అ«ధికారులను అప్రమత్తం చేసి రోడ్డు మరమ్మతు చేపట్టారు. ఏఈ శ్రీనివాస్, నాయకులు బుర్క బాబ్జీ, రాధారపు శంకర్, నాగేల్లి ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏజెన్సీలో వర్ష బీభత్సం
ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు నీటమునిగిన పంటలు పలుచోట్ల రోడ్లు, చెరువులకు గండ్లు కొత్తగూడ : కొత్తగూడ ఏజెన్సీలో వర్షం బీభత్సం సృష్టించింది. మంగళవారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి వాగులు వంకలు పొంగి ప్రవహించాయి. సమీపంలో ఉన్న వందలాది ఎకరాల్లో పత్తి, మక్కజొన్న, మిర్చి, వరి పంటలు దెబ్బతిన్నాయి. వాగుల వద్ద రైతులు ఏర్పాటు చేసుకున్న కరెంట్ మోటార్లు నీటమునిగి కాలిపోయాయి. కొన్ని మోటార్లు వాగులో కొట్టుకుపోయాయి. చెరువుముందుతండా, వేలుబెల్లి, కొత్తపల్లి, రౌతుగూడెం, లక్ష్మీపురం, దుర్గారం, ఎదుళ్లపల్లి గ్రామాల్లో వాగులను ఆనుకుని ఉన్న పంట పొలాలు వరద ఉధృతికి దెబ్బతిన్నాయి. చెరువుముందుతండా సమీపంలోని లొద్దికుంట మత్తడి గోడ పక్కన గండిపడి నీరంతా వృథాగా పోతోంది. వేలుబెల్లి గ్రామ సమీపంలోని వాగు పొంగి ప్రవహించడంలో మధ్యాహ్నం వరకు గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా పలు చెరువులు జల కళ సంతరించుకుని మత్తడి పోస్తున్నాయి. 90.2ఎంఎం వర్షపాతం నమోదు అయినట్లు తహసీల్దార్ ఉప్పలయ్య తెలిపారు. రాక పోకల సమయంలో వాగుల వద్ద తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 21ఎంయూఎల్701:కొత్తపల్లి-కొత్తగూడ మధ్య రోడ్డుపై ఉధృతంగా ప్రవహిస్తున్న వరద -
సినిమాల్లో...రెయిన్ ఎఫెక్ట్
హీరోయిన్ పరిగెడుతూ ఉంది. వెనుక విలన్ కత్తితో వెంటాడుతున్నాడు. ఆ సీన్ అలాగే తీస్తే ఒక ఎఫెక్ట్ ఉంటుంది. కాని ఆ సమయంలోనే వాన పడితే? ఆ ఎఫెక్ట్ రెట్టింపు అవుతుంది. తనను అరెస్ట్ చేసిన ఎస్ఐ మీద పగ తీర్చుకోవడానికి రౌడీ ఎస్ఐ ఇంటి మీదకు అర్ధరాత్రి వచ్చాడు. ఎస్.ఐ భార్య ఒంటరిగా ఉంది. అప్పుడే వాన మొదలయ్యింది. ఇక ప్రేక్ష కుల మనసు రోమాంచితం అవుతుంది. హీరో ఒక శ్మశానంలోకి అడుగు పెట్టాడు. వెంటనే వాన మొదలయ్యింది. సమాధి మీద శిలువ తడవడం మొదలుపెట్టింది. ఇది సృష్టించే ఎఫెక్ట్ చిన్నది కాదు. వాన... సినిమాలో చాలా మేజిక్ చేస్తుంది. గిమ్మిక్ సృష్టిస్తుంది. ప్రేక్షకులను ఒక క్షణంలో రొమాంటిక్ మూడ్‌లోకి అంతలోనే బీభత్సమైన వాతావరణంలోకి తీసుకువెళుతుంది. సినిమాను కనిపెట్టిన హాలీవుడ్ వాళ్లు సినిమాలో రెయిన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో కూడా ముందే కనిపెట్టారు. అందుకే 1952లోనే ‘సింగింగ్ ఇన్ ది రెయిన్’ వంటి సినిమాలు తీసి హిట్ చేసుకున్నారు. హిందీలో రాజ్‌కపూర్ ‘బర్సాత్’ తీసినా ‘శ్రీ420’లోని ‘ప్యార్ హువా’ పాటలోనే రెయిన్ ఎఫెక్ట్‌ను గొప్పగా ఉపయోగించి ఆ పాట వల్లే కోట్లు సంపాదించలిగాడు. తెలుగులో ‘ఆత్మబలం’లో ‘చిటపట చినుకులు’... ఇప్పటికీ నిలిచి ఉందంటే అందులో వాన... ఆ వానకు హీరో అక్కినేని, తలకు స్కార్ఫ్ కట్టుకున్న హీరోయిన్ బి.సరోజా కలిసి తడుస్తూ వేసిన స్టెప్సే కారణం. దేవదాసు క్లయిమాక్స్ పాతరోజుల్లో వానను ఒక క్లయిమాక్స్‌కు వాడి గొప్ప ఫలితాన్ని సాధించిన సినిమా దేవదాసు. ఆ సినిమా క్లయిమాక్స్‌లో పార్వతి ఉన్న ఊళ్లో దిగుతాడు దేవదాసు. జట్కాలు ఉండవు. ఎడ్ల బండి కట్టించుకంటాడు. కాని ఆకాశం మీద మబ్బులు మూసుకొని వస్తాయి. మబ్బులా అవి? కాదు... దేవదాసును కబళించడానికి వస్తున్న మృత్యుమేఘాలు. ఆ వాన... దేవదాసు అనారోగ్యం... ఆ క్లయిమాక్స్ చూసిన ప్రేక్షకుడి మనసును వికలం చేసేస్తాయి. శోభన్‌బాబు ‘బలిపీఠం’ క్లయిమాక్స్ కూడా ఈ వాన వల్లే భీతావహంగా మారుతుంది. తను చేసిన తప్పును తెలుసుకున్న శారద ఇద్దరు పిల్లలతో అర్ధరాత్రి వానలో భర్తను వెతుక్కుంటూ బయలుదేరుతుంది. ఇల్లెక్కడో తెలియదు. తీవ్రమైన వాన. తడుస్తున్న పిల్లలు. పైగా తన అనారోగ్యం. ఆ భీతావహ సన్నివేశం చూసేవాళ్లను కరిగి ముద్ద చేసేస్తుంది. తడిసిన బట్టలను ఆరేసుకున్నంత సులభంగా ఆ సన్నివేశాన్నైతే మర్చిపోలేరు. ఎన్టీఆర్ ‘భలే తమ్ముడు’ సినిమాలో కెఆర్ విజయ, ఎన్టీఆర్ వెళుతున్న కారు వానలో ఆగిపోతుంది. కావాలనే ఎన్టీఆర్ ఈ పని చేశాడని కెఆర్ విజయ అనుమానిస్తుంది. దాంతో పౌరుషంగా కిందకు దిగిన ఎన్టీఆర్ వానలో తడుస్తూ కారు బయట ఉండిపోతాడు. ఈలోపు దొంగలు కెఆర్ విజయ మీద దాడి చేస్తే ఆమెను కాపాడి నిజాయితీని నిరూపించుకుని తద్వారా ప్రేమను గెలుచుకుంటాడు. ఈ సన్నివేశాన్ని కె.రాఘవేంద్రరావు ‘వేటగాడు’లో తిరిగి ఉపయోగించారు. శ్రీదేవి, ఎన్టీఆర్ పాడుకునే సూపర్‌హిట్ పాట ‘ఆకుచాటు పిందె తడిసె’కు ఈ సన్నివేశమే లీడ్. గాలివానలో వాన నీటిలో... తర్వాతి తరంలో చిరంజీవి వంటి నటులకు వాన సన్నివేశాల దక్కకపోయినా వాన పాటలు ఎక్కువ తారసపడ్డాయి. ‘ఇంటిగుట్టు’ సినిమాలో ‘లేత లేత చీకటి’ అంటూ నళినితో చిరంజీవి రెయిన్ సాంగ్ పాడుకుంటాడు. ఇదే సమయంలో హిందీలో సూపర్ హిట్ అయిన ‘నమక్ హలాల్’ను తెలుగులో ‘భలే రాముడు’గా రీమేక్ చేస్తే హిందీలో హిట్ అయిన ‘ఆజ్ రపట్ జాయేతో’ను తెలుగులో మోహన్‌బాబు- మాధవి ‘చినుకు చినుకు నీకు నాకు వలపు చిచ్చు పెట్టెనే’ అని పాడుకున్నారు. ఇదే మోహన్‌బాబుకు ‘రంగూన్‌రౌడీ’లో ‘వానొచ్చే వరదొచ్చే ఉరకలేక చావొచ్చే’ హిట్ పాట బోనస్‌గా దొరికింది. ఇక శోభన్‌బాబు ‘స్వయంవరం’లో పాడుకున్న ‘గాలివానలో వాన నీటిలో’ పాట ఇప్పటికీ హిట్ పాటగా నిలిచి ఉంది. నూరవరోజు.... తెలుగు కథలు ఈ ధోరణిలో ఉండగా మరోవైపు తమిళ సినిమాలు వానను ఒక ప్రధాన క్యారెక్టర్‌గా తీసుకోవడం ప్రారంభించాయి. మణివణ్ణన్ దర్శకత్వంలో వచ్చిన ‘నూరవరోజు’ సినిమా ప్రారంభంలోనే వానలో ఒక ముసుగు మనిషి ఒక ఆడపిల్ల శవాన్ని బంగ్లాకు తీసుకొచ్చి గోడలో పెట్టి ప్లాస్టర్ చేసే సీన్‌తో ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తుంది. ఈ సినిమా క్లయిమాక్స్ కూడా వానలోనే. మణిరత్నం వచ్చి ‘మౌనరాగం’ సినిమాతో ఇదే వానను హీరోయిన్ స్వేచ్ఛా స్వభావాన్ని చూపించాడానికి వాడుకున్నాడు. అజిత్ నటించిన ‘ఆశ.. ఆశ.. ఆశ’ సినిమా అంతటా వాన ఒక బ్యాక్డ్రాప్లా ఉంటుంది. ఇక అజిత్, దేవయాని నటించిన ‘ప్రేమలేఖ’ సినిమా క్లయిమాక్స్ అంతా భారీ వర్షం. కేవలం మనసులతో మాత్రమే ప్రేమించుకుని ముఖాలు చూసుకోకుండా ఉన్న ఆ జంటలో హీరోయిన్ హీరో కోసం వానలో వెతుక్కుంటూ తిరిగే సన్నివేశం గొప్పగా పండింది. కన్నడంలో కేవలం వానను ఒక కేరక్టర్‌గా తీసుకుని తీసిన ‘ముంగారు మలె’ సినిమా 80 లక్షల ఖర్చుకు 80 కోట్లు సంపాదించి చరిత్ర సృష్టించింది. గొడుగుల హత్య... 1985లో రాహుల్ రావైల్ దర్శకత్వంలో సన్నిడియోల్ హీరోగా వచ్చిన ‘అర్జున్’ సినిమాలో గొడుగుల హత్య సీన్ పెద్ద సంచలనం సృష్టించింది. అందులో సన్నిడియోల్ స్నేహితుడిని గుండాలు వానలో చంపుతారు. భోరున కురిసే వానలో వందలాడి గొడుగులను చీల్చుకుంటూ స్నేహితుడు పరిగెడుతుంటే వెనుక కరవాలాలు పట్టుకుని గూండాలు పరిగెత్తే సన్నివేశం ఆ తర్వాతి కాలంలో ఎందరో దర్శకులకు స్ఫూర్తిగా నిలిచింది. శివ ఫైట్... రామ్‌గోపాల్ వర్మ వచ్చాక వానను ఒక ఫైట్‌కు రోమాంచితం చేయడానికి ఉపయోగించడం ‘శివ’లో కనిపిస్తుంది. శివ గ్యాంగు మీద భవానీ గ్యాంగ్ అటాక్ చేయాలని వచ్చినప్పుడు అర్ధరాత్రి రెండు టీములూ ఎదురూ బొదురూ వచ్చాక హటాత్తుగా వాన మొదలవుతుంది. ఆ సన్నివేశం తర్వాతే శివ తడిసిన బట్టల్లో ఒక గూండాను భుజాన వేసుకొని భవానీ ఇంటికి వెళతాడు. ‘క్షణక్షణం’లో అడవిలో వాన పడుతుంటే వెంకటేశ్, శ్రీదేవిలతో పరేశ్ రావెల్ వానకు తడవ్వొద్దని సలహా ఇస్తూనే ‘నేను వంద రూపాయలకు కూడా మర్డర్ చేసిన రోజులున్నాయి’ అని చెప్పడం ప్రేక్షకులు మర్చిపోలేరు. తర్వాతి కాలంలో ‘మనసంతా నువ్వే’లో ప్రేమలో విఫలమైన ఉదయ్ కిరణ్‌ని ‘వాన వెలిసే లోపల మనసారా ఏడ్వరా... ఎవరికీ తెలీదు’ అని సునీల్ చెప్పే సన్నివేశం చాలామందికి నచ్చింది. ఇక ‘వర్షం’ సినిమాకు మూలమే వర్షం. వానలో తడుస్తూ పాడుతున్న త్రిషను విలన్ గోపిచంద్ మొదటిసారిగా చూడకపోతే కథే లేదు. జులాయి... లాయి... ఇటీవల వచ్చిన తెలుగు సినిమాల్లో వానను ఎఫెక్టివ్‌గా వాడుకున్న సినిమా ‘జులాయి’. ఈ సినిమా మొదలే వానతో మొదలై బ్రహ్మాండమైన మూడ్‌ని సెట్ చేస్తుంది. ఇటీవలి సినిమాలు అనేకం వానను ఉపయోగిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే సినిమా ఉన్నంత కాలం వాన ఉంటుంది. లేదా వాన ఉన్నంత కాలంలో సినిమాలో అది కురుస్తుంది.బయట వానగా ఉందా? అయితే మంచి సినిమాకెళ్లి కూచుంటే పోలా? - సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి -
ఒక్క వర్షం.. పుష్కరరోడ్డు ధ్వంసం
సంగమం ఘాట్‌కు వెళ్లే రోడ్డు మార్జిన్ ముక్కలు ముందే ట్రాన్స్ఫార్మర్ తొలగించడంతో తప్పిన ముప్పు ఇబ్రహీంపట్నం : పుష్కర పనుల్లోని డొల్లతనం ఒక్క వర్షంతో బైటపడింది. పవిత్ర సంగమం పుష్కర ఘాట్‌కు వెళ్లేందుకు రోడ్లు– భవనాలు (ఆర్అండ్బీ) శాఖ నూతనంగా నిర్మించిన రెండులైన్ల రహదారి మార్జిన్ వర్షంతో నిలువునా జారిపోయింది. రోడ్డు మార్జిన్ కూలి పోవటమే కాక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కోసం ఏర్పాటు చేసిన సిమెంటు దిమ్మెసైతం అయిదడుగుల కిందకు ఒరిగిపోయింది. ఈ ప్రాంతంలోనే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుచేసిన విద్యుత్ శాఖ అధికారులు బీటీ రోడ్డు వద్ద మార్జిన్ నెర్రెలిచ్చడం గమనించారు. మార్జిన్ కుంగిపోతుందని ఊహించి ముందుగానే అక్కడున్న ట్రాన్స్ఫార్మర్ను తొలగించారు. వారు ఊహించినట్లుగానే సోమవారం తెల్లవారు జామున వర్షం దెబ్బకు అదే జరిగింది. అక్కడ ట్రాన్స్‌ఫార్మరే ఉండి ఉంటే భారీ ప్రమాదమే జరిగి ఉండేది. రూ.6.50 కోట్ల పనులు డొల్లే ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఐరన్ బారి కేడ్లు సైతం బుడమేరు కాలువలోకి జారిపోయాయి. హడావుడిగా చేసిన పుష్కరాల పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని గతంలోనే సాక్షిలో వరుస కథనాలు వచ్చాయి. అప్పట్లో వర్షంలోనే బీటీ రోడ్డు, మార్జిన్ పనులు చేశారు. పుష్కరాల నేపథ్యంలో సుమారు రూ.6.50 కోట్లతో ఈరోడ్డును ఆర్అండ్బీ శాఖ నిర్మించింది. అధికారుల నిర్లక్ష్యం, అవినీతి కారణంగా విలువైన ప్రజాధనం నీళ్లపాలు అయిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కుంగిపోయిన ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. రిటైనింగ్ వాల్ లేనందునే: డీఈ మోహనరావు భారీవర్షాలు పడితే బుడమేరు కాలువ వైపున రోడ్డు అంతా జారిపోయే ప్రమాదం పొంచిఉంది. పేదల నివాసాలు తొలగించిన ప్రాంతంలో రోడ్డును నిర్మిస్తూ అక్కడున్న నల్లమట్టిని పైపైన చదును చేశారనే ఆరోపణలు అప్పట్లో బలంగా వినిపించాయి. ఆర్అండ్బీ డీఈ మోహనరావును సంప్రదించగా.... రోడ్డుకు తూర్పువైపు ఉన్న బుడమేరు కాలువకు రిటైనింగ్ వాల్ లేనందున మార్జిన్ కిందికి జారిందన్నారు. నీటి ప్రవాహం కూడా ఓ కారణం అన్నారు. రోడ్డుభధ్రతను దృష్టిలో ఉంచుకుని కాలువ వైపున రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మార్జిన్ ఏర్పాటుకు పటిష్టమైన చర్యలు చేపడతామని తెలిపారు. -
ఎస్సై సామర్థ్య పరీక్షలకు వర్షం ఎఫెక్ట్
కరీంనగర్: చిరుజల్లులు ఎస్సై సామర్థ్య పరీక్షకు అడ్డంకిగా నిలిచాయి. ఎడతెరపి లేకుండా వర్షం పడడంతో మంగళవారం నిర్వహించాల్సిన పరీక్ష వాయిదా పడింది. జిల్లా కేంద్రంలో ఉదయం నుంచి వర్షం కురవడంతో రన్నింగ్ ట్రాక్ మొత్తం బురదమయంగా మారింది. మంగళవారం ఉదయం గంటపాటు సోమవారం మిగిలిపోయిన 20 మంది అభ్యర్థులకు శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. ట్రాక్ ఇబ్బందిగా మారడంతో మంగళవారం పరీక్షలు నిర్వహించాల్సిన వారికి వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేశారు. నేడు నిర్వహించాల్సిన అభ్యర్థులకు యథావిధిగా సామర్థ్యం పరీక్షలుంటాయని పోలీసు అధికారులు తెలిపారు. ఒకవేళ వర్షం సహకరించకపోతే వాయిదా వేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మంగళవారం వర్షంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు ఇబ్బందులుపడ్డారు. అధికారులు వాయిదా విషయంపై సకాలంలో ప్రకటించకపోవడంతో అభ్యర్థులు అయోమయానికి గురయ్యారు. -
వందల కోట్లు ఖర్చవుతున్నా..
30 నాలాలున్నా వివరాల్లేవు.. గ్రేటర్‌లోని రహదారుల కింద వివిధ ప్రాంతాల్లో దాదాపు 30 పెద్ద నాలాలున్నట్లు అంచనా. ఇవి 60 కి.మీ.ల మేర ఉన్నాయనే అంచనాలు తప్ప కచ్చితంగా ఎక్కడున్నాయో తెలియదు. ఆయా నాలాల వల్ల సమీప రహదారులకు ప్రమాదం పొంచి ఉంది.. ఎప్పటికప్పుడు తగిన తనిఖీలు, అవసరమైన చర్యల్లేనందువల్లే రెండే ళ్లక్రితం నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి వద్ద, నెక్లెస్‌రోడ్డు మార్గాల్లో రహదారులు కుంగిపోయాయి. మోడల్‌హౌస్ వద్ద రోడ్డు కుంగడానికి వరదనీటి కాలువలో డైనేజీ నీరు పొంగి ప్రవహించడమే కారణమని అప్పట్లో భావించారు.సివరేజీకి చాలినన్ని లైన్లు లేకపోవడంతో చాలావరకు సివరేజి కూడా వరదనీటికాలువల్లో కలుస్తోందని తెలిసినప్పటికీ, ఇటు జీహెచ్ఎంసీ కానీ.. అటు వాటర్‌బోర్డు కానీ తగిన చర్యలు తీసుకోలేదు. రెండింటి మధ్య సమన్వయం అసలే లేదు. రోడ్లదీ అదే దుస్థితి .. నగరంలో ఎన్ని బీటీ రోడ్లున్నాయి.. ఏ రోడ్డు బలమెంత..? అంటే వెంటనే సమాధానం చెప్పగలిగే స్థితిలో జీహెచ్ఎంసీ ఇంజినీర్లు లేరు. ఈ పరిస్థితిని నివారించేందుకు రోడ్ నెట్వర్క్ డేటాబేస్ తయారీకి సిద్ధమైనప్పటికీ అనంతరం ఆ అంశంపై అశ్రద్ధ కనబరిచారు. జీహెచ్ఎంసీ పరిధిలో 6వేల కిలోమీటర్లకు పైగా రహదారులుండగా, తొలిదశలో వెయ్యి కిలోమీటర్ల మేర డేటాబేస్ రూపకల్పనకు సిద్ధమయ్యారు. అందుకు నియమించిన ప్రైవేట్ కన్సల్టెంట్ నివేదికనిచ్చినప్పటికీ, తదుపరి చర్యలపై తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తున్నారు. హామీల అమలులో కమిషనర్లు విఫలం.. వర్షం నీరు సాఫీగా వెళ్లేందుకు నాలాలను విస్తరించడమే శరణ్యం. నగరంలోని నాలాలు చాలావరకు కబ్జాలకు గురయ్యాయి. 30 అడుగుల వెడల్పు ఉండాల్సిన నాలాలు 7 అడుగులకు కుంచించించుకుపోయాయి. వీటి ఆధునీకరణ కోసం జేఎన్ఎన్యూఆర్ఎం ద్వారా రూ. 266 కోట్లు మంజూరై ఏడేళ్లు దాటినా 25 శాతం పనులు కూడా జరగలేదు. నాలాలను ప్రాధాన్యత క్రమంలో ఆధునీకరిస్తామని పలువురు కమిషనర్లు ప్రకటించినప్పటికీ, అమలులో విఫలమయ్యారు. ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏం చెప్పారంటే.. 2007లో.. కిర్లోస్కర్, వాయంట్స్ కమిటీల నివేదికల కనుగుణ ంగా నాలాలా ఆధునీకరణ (విస్తరణ) పనులు ఏడాదిలోగా పూర్తి చేస్తామని అప్పటి కమిషనర్ సీవీఎస్కే శర్మ హామీ ఇచ్చారు. 2010లో.. ఆరు నెలల్లోగా నాలాలను ఆక్రమించిన వారిని ఖాళీ చేయించి ఆధునీకరణ పనులు పూర్తిచేస్తామని అప్పటి కమిషనర్ సమీర్‌శర్మ ప్రకటించారు. 2011లో.. నాలాలే నా తొలి ప్రాధాన్యం. నాలాల ఆధునీకరణ పనులకు తొలి ప్రాధాన్యమిచ్చి పూర్తిచేస్తానని జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన రోజున ఎంటీ కృష్ణబాబు చెప్పారు. వందల కోట్లు ఖర్చవుతున్నా.. నగరంలో రోడ్లు త్వరితంగా దెబ్బతినేందుకు ప్రధాన కారణం వర్షపునీరు వెళ్లే మార్గాల్లేకపోవడం. దాంతో నీరు చాలాసేపు రోడ్లపై నిలుస్తుండటంతో త్వరితంగా దెబ్బతింటున్నాయి. పైప్లైన్పనులు, కేబుల్‌పనులు వంటివి చేసినప్పుడు వెంటనే పూడ్చివేయకపోవడం. రోడ్ల ప్యాచ్వర్క్పనులు, పాట్‌హోల్స్ మరమ్మతులు ఏడాది పొడవునా ఎప్పటికప్పుడు చేయాలి. తద్వారా ఖర్చు తగ్గుతుంది. కానీ అది జరగడం లేదు. రోడ్లపై నీరు నిల్వలేకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోనంత వరకు ఏంచేసినా ప్రయోజనం ఉండదు. దీంతో, ఏటా రూ. 250- రూ. 300 కోట్ల వరకు రోడ్ల కోసం ఖర్చు చేస్తున్నా ప్రజల ఇబ్బందులు తగ్గడం లేవు. రోడ్లపై నీటి నిల్వకు కారణం వచ్చే వరదనీటిని తట్టుకునే సామర్ధ్యం నగరంలో నాలాలకు లేకపోవడం. వీటి ఆధునీకరణ పనులకు నిధులు మంజూరైనా ఏడేళ్లుగా పనులు ముందుకు సాగడం లేవు. నాలాల విస్తరణ జరగనిదే, వరదనీరు సాఫీగా వెళ్లనిదే ఏ చర్యలు తీసుకున్నా నిష్ర్పయోజమని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే మేలు.. ! ఢిల్లీ, ముంబై, తదితర నగరాల్లో ఏవైనా రహదారులు వేయాలంటే ముందుగా అక్కడి ఐఐటీకి లేఖ రాస్తారు. వారిచ్చిన సలహాలు, సూచనల మేరకు తగిన విధంగా రోడ్లు వేస్తారు. మన దగ్గర సైతం జేఎన్టీయూ, ఉస్మానియా విశ్వవిద్యాలయాలున్నప్పటికీ వారిని క్వాలిటీ పరీక్షలకు థర్డ్‌పార్టీగా తప్ప రోడ్డు వేసే ముందే సూచనలు తీసుకోవడం లేరు. బీటీ రోడ్లు వేయాల్సిన ప్రాంతాల్ని, అక్కడి ట్రాఫిక్ రద్దీని, వాహన భారాన్ని, భూగర్భంలోని పరిస్థితుల్ని, తదితర పలు అంశాలు పరిశీలించి ఎంత లోతునుంచి రోడ్డు వేయాలన్నది నిర్ణయిస్తారు.దాన్ని బట్టే డీబీఎం, బీసీ, ఎస్డీబీసీలను వేస్తారు. వీటిల్లో డీబీఎం(డెన్స్ బిటుమినస్) బాగా ధృఢమైనది కాగా, మిగతా రెండు వరుసగా దానికంటే తక్కువ ధృఢమైనవి. బీటీరోడ్లు వేశాక రెండేళ్ల తర్వాత నిర్ణీత వ్యవధుల్లో సామర్ధ్య పరీక్షలు నిర్వహించాలి. అందుకుగాను బింకిల్మ్యాన్స్ బీమ్ డిఫ్లెక్షన్ టెస్ట్‌లు వంటివి చేయాలి. రోడ్లు వేసే ముందే ట్రాఫిక్ భారం.. డ్రైనేజీ లైన్లు, కేబుల్స్ కోసం తవ్వకాలు.. తదితర అంశాలన్నింటినీ అంచనా వేసి, అందుకనుగుణండా రహదారులు నిర్మించాలి.నగరంలో ఏ ఒక్క రహదారినీ సంపూర్ణంగా వేసింది లేదు. ప్యాచ్‌వర్క్‌లు తప్ప దేన్నీ సరైన పద్ధతిలో వేయడం లేరు.రోడ్డు నిర్మాణంతోపాటే వరదనీటి కాలువలు, రోడ్డుపై నీరు నిల్వలేకుండా తగిన కేంబర్ (నీరు రోడ్డునుంచి పక్కకు దిగిపోయేలా)తో వేయాలి. కానీ, నగరంలో అది జరగడం లేదు. కాంట్రాక్టర్లకే వదిలిపెడుతున్నారు. వాటర్‌లాగింగ్ పాయింట్లలో కొన్ని.. రేతిఫైలి బస్టేషన్ ఒలిఫెంటా బ్రిడ్జి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 న్యాక్ రోడ్డు సారథి స్టుడియో ఖైరతాబాద్ పెట్రోట్బంక్ చింతల్‌బస్తీ విల్లా మేరీ కాలేజ్, తెలుగు అకాడమి, హిమాయత్‌నగర్ విక్టరీ ప్లేగ్రౌండ్ మెట్రోకేఫ్, ముషీరాబాద్ బస్‌భవన్ ఆజామాబాద్ జంక్షన్ గ్రామర్ స్కూల్, ఆబిడ్స్ మాసాబ్‌ట్యాంక్ ఫ్లై ఓవర్ తెలుగుతల్లి జంక్షన్ (మెడిసిటీ వైపు) -
జిల్లాలో 3.38 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
సాక్షి, కొత్తగూడెం : అకాల వర్షం అన్నదాతలకు గుండె కోత మిగిల్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం జిల్లాలోని పంటలపై తీవ్రంగా పడింది. వారం రోజుల పాటు కురిసిన వర్షంతో జిల్లా వ్యాప్తంగా 3.38 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఇందులో అత్యధికంగా 2.54 లక్షల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం జరిగింది. ‘న్యూస్‌లైన్’ క్షేత్ర స్థాయిలో చేసిన పరిశీలన ప్రకారం జిల్లా వ్యాప్తంగా రూ. 310.72 కోట్ల మేర రైతులు నష్టపోయినట్లు అంచనా. దెబ్బతిన్న పంటలు చూసి మనోవేదనకు గురైన రైతుల గుండెలు ఆగిపోతున్నాయి. జిల్లాలో ఈనెల 21 నుంచి కురిసిన వర్షాలతో పత్తి 2.54 లక్షల ఎకరాలు, వరి 28 వేలు, మిర్చి 15 వేలు, మొక్కజొన్న 21,775 ఎకరాలు, పొగాకు, వేరుశనగ, ఇతర కూరగాయల పంటలు 18 వేల ఎకరాల్లో దెబ్బతిన్నాయి. ఇందులో పత్తిదే సింహభాగం కావడం గమనార్హం. ప్రధానంగా వైరా నియోజకవర్గంలో 70 వేల ఎకరాల్లో, మధిరలో 59 వేలు, పాలేరులో 30 వేల ఎకరాల్లో పత్తి పంటలు దెబ్బతినడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల పరిధిలో వరి నేలవాలడంతో పాటు పనలు పూర్తిగా నీట మునిగాయి. ఇల్లెందు నియోజకవర్గ పరిధిలోని బయ్యారంలో మొక్కజొన్న సాగు చేసిన రైతులు నష్టపోయారు. అశ్వారావుపేటలో వేరుశనగ, పొగాకు పంటలకు కూడా నష్టం వాటిల్లింది. ఈ ఆకాల వర్షం రైతులను నిండా ముంచినా జిల్లా యంత్రాంగం మాత్రం ఇంకా నిద్రావస్థలోనే ఉంది. కాగా, గతంలో మాదిరిగానే 50 శాతం లోపే నష్టాన్ని చూపించి రైతులకు పరిహారం ఇవ్వకుండా చూసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతుండడం బాధితులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఆగిపోతున్న రైతుల గుండెలు.. రూ. వేలకు వేలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన పంటలు కళ్ల ముందే వర్షార్పాణం అవుతుంటే మనోవేదనకు గురైన రైతులు గుండెపోటుతో మరణిస్తున్నారు. సింగరేణి (కారేపల్లి) మండలం పేరుపల్లి గ్రామానికి చెందిన గద్దికొప్పుల రామయ్య (40) పత్తి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతిచెందాడు. అలాగే కొత్తగూడెం మండలం బేతంపూడిలో శనివారం పత్తి చేలో నీరు తొలగించేందుకు వెళ్లి నష్టపోయిన పంటను చూసి తేజావాత్ రాజు అనే రైతు సొమ్మసిల్లి పడిపోయాడు. పెనుబల్లి మండలం బయన్నగూడెం గ్రామానికి చెందిన బొప్పిశెట్టి చెన్నారావు నాలుగు ఎకరాలలో పత్తి సాగు చేశారు. వర్షాలకు పంట దెబ్బతినడంతో మనోవేదనకు గురై గుండెపోటుతో శనివారం మృతి చెందారు. గతంలో జల్, లైలా, నీలం తుపాన్లతో రైతులు తీవ్రంగా నష్టపోయినా జిల్లా యంత్రాంగం కాకి లెక్కలు వేసిందని, 50 శాతం లోపు నష్టపోయిన పంటలను కూడా పరిగణలోకి తీసుకోవాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
నష్టాలకు తెరిపేదీ?
అమలాపురం, న్యూస్‌లైన్ :కసి పట్టినట్టు చినుకులనే బాణాలుగా దూసి, తేరుకోలేని దెబ్బ తీసిన వరుణుడు వారం తర్వాత శాంతించాడు. ఆదివారం తెల్లవారుజాము వరకు భారీగా కురిసిన వర్షాలు ఉదయం నుంచి తెరిపినిచ్చాయి. అయితే ఆరురోజుల ముసురుకు శనివారం అర్ధరాత్రి నుంచి కురిసిన జడివాన తోడవడంతో అటు చేలు, ఇటు పల్లపు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకునే ఉన్నాయి. శనివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఆదివారం ఉదయం ఎనిమిది గంటల వరకు జిల్లాలో సగటున 62 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఏజెన్సీలోని వై.రామవరం మండలంలో 155.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇప్పటి వరకు మెట్ట, డెల్టాలకు పరిమితమైన వర్షం ఏజెన్సీపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది. వర్షాలకు కాకినాడ, రాజమండ్రి, అమలాపు రం, మండపేట, పెద్దాపురం, తుని, పిఠాపురం పట్టణాల్లో లోతట్టు కాలనీలు, గొల్లప్రోలు, తొండం గి, అన్నవరం తదితర మండలాల్లో పలు గ్రామా లు ముంపుబారిన పడ్డాయి. ముంపు తీవ్రత ఎక్కువగా ఉండడం తో కాకినాడలోని దుమ్ములపేట, పరలోవపేట, ట్రెజరీ కాలనీ, గొల్లప్రోలు ఈబీసీ కాలనీ, అమలాపురంలో కార్మికనగర్, అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారంలోని ప్రభాకరరావునగర్ వంటి ప్రాంతాల్లో ప్రజలు తాగునీటికి సైతం కొరతతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అపారిశుద్ధ్యంతో అంటురోగాలబారిన పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉధృతంగా తాండవ, సుద్దగెడ్డ శుక్ర, శనివారాల్లో కురిసిన వర్షాలతో మెట్ట ప్రాంతం అతలాకుతలమైంది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షం వల్ల వరి, పత్తి, ఇతర పం టలు మరింత ముంపుబారిన పడ్డాయి. తాం డవ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. తాండవ ప్రాజెక్టు నుంచి ఐదు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గొల్లప్రోలు మండలంలో సుద్దగెడ్డ వాగు ఉధృతి కొనసాగుతోంది. ఈబీ సీ కాలనీతోపాటు పలు కాలనీలు ఇంకా ముం పులోనే ఉన్నాయి. కోరుకొండ మండలంలో బురదకాలువ ఉధృతి తగ్గినా శ్రీరంగపట్నంలో ముంపు తగ్గ లేదు. ఇక్కడ 500 కుటుంబాల వారు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. పంపా వరద ఉధృతి కూడా చాలా వరకు తగ్గింది. పంపా నీటితో ముంపుబారిన పడిన 16వ నంబరు జాతీయ రహదారిపై వరద తగ్గడంతో రాకపోకలు మొదలయ్యాయి. అన్నదాతలకు అంతటా నష్టమే.. ముసురుతో ముంపు తీయక పంట నష్టం పెరుగుతోంది. డెల్టాలో ఇంత వరకు ఆలమూరు, కాజులూరు, రామచంద్రపురం, అనపర్తి సబ్ డి విజన్లలో మాత్రమే వరికి ఎక్కువగా నష్టం వా టిల్లగా తాజాగా పెద్దాపురం, కరప, కాకినాడ, జగ్గంపేట, ఏలేశ్వరం, ముమ్మిడివరం సబ్ డివి జన్లలో సైతం నష్టం పెరుగుతోంది. సుమారు రెండు లక్షల ఎకరాల్లో వరి చేలు ముంపుబారిన పడగా, వీటిలో 70 వేల ఎకరాల్లో చేలు కోతలకు సిద్ధంగా ఉన్నాయి. నీట నాని ధాన్యం మొలక వస్తుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వర్షాలు తగ్గినా తూర్పుడెల్టా లో టేకితోపాటు ప్రధాన డ్రైన్లు పొంగి పొర్లుతుండడంతో మరో రెండు, మూడు రోజులు చే లు ముంపులోనే ఉండే అవకాశముంది. దీని వల్ల దిగుబడి తగ్గడం, ధాన్యం రంగుమారి ధర వచ్చే అవకాశం లేకపోవడం వంటి కారణాల వ ల్ల ఎకరాకు రూ.12 వేల చొప్పున రూ.84 కోట్ల మేర నష్టం వాటిల్లుతుందని రైతులు అంచనా వేస్తున్నారు. కోనసీమలో చేలు ఇంకా నాలుగై దు రోజులు జలదిగ్బంధంలో ఉండే అవకాశముంది. సగం దిగుబడి కోల్పోయినట్టేనని రైతు లు ఆందోళన చెందుతున్నారు. 70 శా తం చేలు ఇప్పుడిప్పుడే పాలు పోసుకుంటుండం వల్ల ముంపుబారిన పడినా పెద్దగా నష్టముండదని అధికారులంటున్నా ఈ చేలల్లో దుబ్బుకుళ్లు వ్యాధి వచ్చే అవకాశముందని, ఎకరాకు ఐదు బస్తాల చొప్పున దిగుబడి కోల్పోతామని రైతులు చెబుతున్నారు. ఒక్క వరికే వర్షాల వల్ల రూ.100 కోట్ల నష్టం వచ్చినట్టు రైతులు చెబుతున్నారు. మెట్టలో 20 వేల ఎకరాల్లో పత్తి దెబ్బతింది. ఎకరాకు రూ.20 వేల మేర నష్టం వచ్చిం దని రైతులు చెబుతున్నా రు. ఇప్పటికే రైతులు ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.35 వేల వర కు పెట్టుబడిగా పెట్టారు. పత్తితోపాటు ఏజెన్సీ, మెట్టల్లో మొక్కజొ న్న, ఉల్లి, దుంప, వేరుశనగ, చెరకు, కాయగూర పంటలు కలిపి మరో రూ.50 కోట్ల నష్టం వాటిల్లిందని చెబుతున్నా రు. మొత్తమ్మీద ముసురు డెల్టా, మెట్ట, ఏజెన్సీ తేడా లేకుండా రైతుల ఆశలను ముంచేసింది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఇవీ నష్టాలు.. కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌లైన్ : భారీ వర్షాల కారణంగా జిల్లాలో రూ.రెండు కోట్ల 14 లక్ష ల 20 వేలు నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 67,216 హె క్టార్లలో వరి, ఉద్యానవన పంటలు ముంపునకు గురయ్యాయని ఒక ప్రకటనలో తెలిపా రు. లోతట్టు ప్రాంతాల్లోని 22,603 మందిని 42 పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారం, మంచినీటి ప్యాకెట్లను అందించినట్టు తెలిపారు. 102 పక్కా ఇళ్లు, 149 క చ్చా ఇళ్లు పూర్తిగా, 65 పక్కా ఇళ్లు, 486 కచ్చా ఇళ్లు తీవ్రంగా, 683 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్టు తెలిపారు. 607 గుడిసెలు దెబ్బతి న్నాయన్నారు. ఇళ్లకు రూ.46,93,200 నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు. వివిధ కాలువలకు ఏర్పడిన గండ్ల వల్ల రూ.20 లక్షలు, ఆర్అండ్బీ రహదారులకు రూ. 20.48 లక్షలు నష్టం జరిగినట్టు పేర్కొన్నారు. -
హైదరాబాద్ శివారు ప్రాంతాలును ముంచెత్తిన వరద
-
చివరి యాషెస్ టెస్ట్ కు వర్షం గండం
లండన్: చివరి యాషెస్ టెస్ట్ కు వర్షం గండం ఎదురైంది. ఐదవ, చివరి యాషెస్ టెస్ట్‌లో నాలుగో రోజు వర్షం కారణంగా ఆట ప్రారంభం కాలేదు. క్రితం రోజు ఆట నిలిచే సమాయానికి ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ఈ టెస్ట్ మ్యాచ్ లో రూట్ 60 పరుగులు చేయగా, పీటర్సన్ 50 పరుగులు చేయడం విశేషం. అంతకు ముందు ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 492 పరుగుల భారీ స్కోరు చేసి ఈ టెస్టుపై పట్టు సాధించింది. అయితే వర్ష ప్రభావం ఈ టెస్టు పడటంతో ఇంగ్లాండ్ డ్రా కోసమే ప్రయత్నించే చాన్స్ వుంది. ఇప్పటికే 5 టెస్ట్‌ల సిరీస్‌ను ఇంగ్లాండ్ 3-0 తేడాతో గెలిచింది. -
రైతుకు దిగుబడి దిగులు
మోర్తాడ్, న్యూస్‌లైన్ : భారీ వర్షాల వల్ల భూగర్భ జలాలు వేగంగా అభివృద్ధి చెందినా రైతులు మాత్రం దిగులుతోనే ఉన్నారు. అతివృష్టి వల్ల పసుపు, మొక్కజొన్న, సోయా పంటల దిగుబడి తగ్గిపోనుందని రైతులు చెబుతున్నారు. జిల్లాలో సాధారణ వర్షపాతం గడచిన జూలై వరకు 168 మిల్లీమీటర్లు కాగా 215 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సాధారణానికి మించి 47 మిల్లీ మీటర్ల వర్షం అధికంగా కురిసింది. అనేక చోట్ల వర్షం నీటి నిల్వతో పంట పొలాలు మురిగిపోయాయి. పసుపు పంటకు దుంపకుళ్లు సోకుతుండగా, మొక్కజొన్న, సోయా పంటలకు నీరెక్కి దిగుబడి తగ్గడానికి అవకాశం ఏర్పడింది. వరి పంటకు మాత్రం వర్షం మేలు చేసింది. వరి పంటకు నీటిని పారించాల్సిన పనిలేకుండా పోయింది. జిల్లాలో దాదాపు 40 వేల ఎకరాల్లో పసుపు, 70 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 80 వేల ఎకరాలకు పైగా సోయా పంటలను రైతులు సాగుచేస్తున్నారు. సోయా, మొక్కజొన్న పంటలకు తక్కువ పరిమాణంలోనే అవసరం అయితే నీరు ఎక్కువగా పంట పొలాల్లో నిలిచి ఉంటోంది. దీంతో దిగుబడి 30 నుంచి 40 శాతం తగ్గనుందని రైతులు చెబుతున్నారు. పసుపు పంటకు దుంపకుళ్లు సోకి దిగుబడి తగ్గనుంది. గత సంవత్సరం వర్షాలు తక్కువగా కురియడంతో పంటల సాగుకు నీరు అందించడం కష్టం అయ్యింది. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా తయారయ్యింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల అనేక చోట్ల పంటలు నీట మునుగుతున్నా పంట నష్టంపై అంచనా వేసేందుకు అధికారులు ముందుకు రావడం లేదు. బీమా నిబంధనలు ఒక్కో పంటకు ఒక విధంగా ఉండటంతో పరిహారం అందే అవకాశం కనిపించడంలేదు. పసుపు పంటకు రుణం తీసుకున్న రైతు నుంచి రూ.లక్ష రుణానికి రూ.6 వేల ప్రీమియంను బ్యాంకర్లు మినహాయించుకుంటున్నారు. సోయా, మొక్కజొన్న పంటలకు ప్రీమియం తక్కువగానే ఉంటుంది. వాణిజ్య బ్యాంకులలో ఖచ్చితంగా పంటల బీమాకు ప్రీమియం వసూలు చేస్తున్నా రు. సహకార బ్యాంకులలో మాత్రం బీమాపై ఎలాంటి ఒత్తిడి లేదు. పంటల బీమా నిబంధనలు రైతులకు మేలు చేసేవిధంగా లేవని అందువల్ల రైతు ఇష్టాఇష్టాలతోనే బీమా చేసేందుకు అవకాశం కల్పించాలని రైతు నాయకులు డిమాం డ్ చేస్తున్నారు. జిల్లాలో అనావృష్టి, అతివృష్టిల వల్ల నష్టపోయిన పంటలకు పరిహారం అందిన దాఖలాలు లేవు. అందువల్ల పంటల బీమా రైతు ఇష్ట ప్రకారం చేసే అవకాశం కల్పిం చాలని నాయకులు గతంలో కోరారు. అయితే వాణిజ్య బ్యాం కులు మాత్రం పంటల బీమాను తప్పనిసరి చేశాయి. ఈసారి అతివృష్టి వల్ల పంటల దిగుబడి తగ్గిపోనుండటంతో దీనిపై అంచనా వేసి పరిహారం అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు. అనేక చోట్ల నీట మునిగిన పంటలకు బీమా పరి హారం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. నీటి మునిగిన ఆశలు గాంధారి : అధిక వర్షాలకు గాంధారి మండలంలో మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం కలుగుతోంది. పంట భూముల్లో నీటి నిల్వల ఏర్పడి మొక్కజొన్న పైర్లు ఎర్రబారి పోయాయి. ఫలితంగా పైర్లు పెరగలేదు. దీంతో కనీసం పెట్టుబడులకు సరిపోను దిగుబడులు వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో 13,168 హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేశారు. భూమి దుక్కి దున్నడం, విత్తనాలు, రసాయన ఎరువులు, పురుగు మందులు తదితర ఖర్చులు మొత్తం ఎకరానికి రూ.12 నుంచి 15 వేలు పెట్టుబడి పెట్టామని రైతులు పేర్కొంటున్నారు. -
జలదిగ్బంధంలో గోదావరి లంక గ్రామాలు
న్యూస్‌లైన్ నెట్వర్క్ : గోదావరి నదిలో వరద తీవ్రత కొనసాగుతోంది. ఖమ్మం జిల్లా భద్రాచలం ఏజెన్సీలో, ముంపు బారిన పడిన గోదావరి లంక గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో నీటిమట్టం 17.90 అడుగుల వద్ద ఉండగా, 19.53లక్షల క్యూసెక్కులు నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. గోదావరి పరివాహక ప్రాంతాలను ఆనుకుని ఉన్న16 మండలాలపై వరద తీవ్ర ప్రభావం చూపుతోంది. 59 గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. వరద వల్ల 1.45 లక్షల మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. లంకవాసులు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. పక్షం రోజుల్లో 12 రోజులకు పైబడి ఈ గ్రామాలు ముంపున ఉండడంతో ఇళ్లు, పంట నష్టం తీవ్రత ఇంకా పెరుగుతోంది. వరదలకు తోడు ఆదివారం రాత్రి నుంచి వర్షం కురవడంతో లంకవాసుల పరిస్థితి దుర్భరంగా ఉంది. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలంలో సోమవారం వరద నీటిలో ఓ నాటు పడవ మునిగిపోయింది. అయితే, పది మంది ఒకరినొకరు పట్టుకుని సురక్షితంగా బయటపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా గోష్పాద క్షేత్రంలో ఆరడుగుల వరద నీరు ప్రవహిస్తోంది. కడెమ్మ స్లూయిజ్ వద్ద వరద ఉధృతంగా ఉండడంతో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తాళ్లపూడి రేవులోని పలు ఆలయాలతోపాటు వేగేశ్వరపురంలోని మేరిమాత ఆలయం ఇంకా వరద ముంపులోనే ఉంది. కొవ్వూరు మండలంలో వందలాది ఎకరాల లంక భూముల్లోని పంటలు నీట మునిగాయి. ఖమ్మం జిల్లా భద్రాచలం ఏజెన్సీ గోదావరి వరదలతో అతలాకుతలమైంది. భద్రాచలం వద్ద అత్యధికంగా 62 అడుగుల నీటిమట్టంతో ఉగ్రరూపం దాల్చిన గోదావరి సోమవారం సాయంత్రం 7గంటలకు 53 అడుగులకు చేరుకుంది. అల్పపీడనం కారణంగా సోమవారం రోజంతా విస్తారంగా వర్షం కురవడంతో ఏజెన్సీలోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో మళ్లీ వరద స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు నుంచి 19 గేట్లను 6 అడుగుల మేర ఎత్తి 73 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. వాజేడు మండలం చీకుపల్లి వాగుకు అవతల ఉన్న 32 గ్రామాలకు ఎటూ దారిలేకుండాపోయింది. భద్రాచలం నుంచి కూనవరం రహదారిలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ప్రాంతాల్లోని వేలాది ఎకరాల్లో పత్తి, మిరప పంటలు నీట మునిగాయి. పదిహేను రోజుల వ్యవధిలో రెండుసార్లు వరదలు ముంచెత్తడంతో పరివాహక ప్రాంతంలో సుమారు 35వేల ఎకరాలకు పైగా పంటకు నష్టం వాటిల్లింది. భద్రాచలం రామాలయం చుట్టూ ఉన్న ఇళ్లు ఇంకా ముంపులోనే ఉన్నాయి. చింతూరు మండలంలో శబరి నదిలో పడి పొన్నాడ ప్రసాద్(30) సోమవారం మృతి చెందాడు. ముంపు గ్రామాల్లో ఎటువంటి పునరావాసం లేక బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 573 గ్రామాలకు విద్యుత్ సరఫరా లేకపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూరాలలో 28 క్రస్టుగేట్ల ఎత్తివేత ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో సోమవారం మరింత పెరిగిందని పీజేపీ అధికారులు కృష్ణయ్య తెలిపారు. దీంతో మొత్తం 28గేట్ల ద్వారా 2.32 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 2.70లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, మొత్తం 34 క్రస్టుగేట్ల ద్వారా 2.11లక్షల క్యూసెక్కులు, ఆల్మట్టి ప్రాజెక్టుకు 2.20లక్షల ఇన్‌ఫ్లో ఉండగా, 26 క్రస్టుగేట్ల ద్వారా 2.70లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నిండుకుండలా శ్రీరాంసాగర్ శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి సోమవారం సాయంత్రం వరద నీరు పెరగడంతో రెండు వరద గేట్లను ఎత్తి 5,500 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. ప్రాజెక్ట్‌కు ఎగువ ప్రాంతాల నుంచి 16 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులతో నిండుకుండలా ఉందని అధికారులు తెలిపారు. రోడ్డు పక్కనే అంతిమ సంస్కారం తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలంలోని ముక్తేశ్వరం వృద్ధ గౌతమి శ్మశాన వాటిక ముంపునకు గురవడంతో అంతిమ సంస్కారాలు, పిండ ప్రదానం చేయడానికి నానా ఇబ్బందు లు పడాల్సి వస్తోంది. కే జగన్నాథపురానికి చెందిన సంసాని నాగేశ్వరరావు (55) అనారోగ్యంతో సోమవారం మృతిచెందారు. ఆయన మృతదే హాన్ని శ్మశాన వాటికకు తీసుకువచ్చినా అక్కడ వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో రోడ్డు పక్కనే అంతిమ సంస్కారం జరిపారు. వరదలపై సీఎం కిరణ్ సమీక్ష రాష్ట్రవ్యాప్తంగా భారీ వరదలకు గురైన ప్రాంతాల స్థితిగతులను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మొహంతి, విపత్తుల నిర్వహణ విభాగం అధికారులతో మాట్లాడారు. ఇప్పటివరకూ వరదల కారణంగా 47 మంది మృతి చెందారని, 21,384 వేల ఇళ్లు దెబ్బతిన్నాయని సీఎంకు చెప్పారు. ఎనిమిది జిల్లాల్లో 73వేల హెక్టార్లలో పంట, 43వేల ఎకరాల్లో పత్తి, 3వేలకు పైగా ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అధికారులు వివరించారు.ఇప్పటివరకూ వరద బాధిత ప్రాంతాల్లో 158 సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశామని... ఖమ్మం, తూర్పుగోదావరి, అదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో మరో 119 సహాయ పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు.