ఆస్ట్రేలియాతో రెండో వన్డే.. టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌! | Ind Vs Aus Indore Weather Report: Rain Likely In Ind Vs Aus 2nd ODI At Holkar Stadium - Sakshi
Sakshi News home page

IND Vs AUS Weather Report: ఆస్ట్రేలియాతో రెండో వన్డే.. టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌!

Published Sat, Sep 23 2023 12:46 PM | Last Updated on Sat, Sep 23 2023 1:30 PM

Rain likely in IND vs AUS 2nd ODI at Holkar Stadium - Sakshi

వన్డే ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియాతో జరగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా బోణీ కొట్టింది. ఈ సిరీస్‌లో భాగంగా మొహాలీ వేదికగా జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షోతో టీమిండియా అదరగొట్టింది. ఈ విజయంతో వన్డేల్లో నెం1 జట్టుగా భారత్‌ అవతరించింది. 

ఇక ఈ సిరీస్‌లో భాగంగా రెండో వన్డే  ఆదివారం(సెప్టెంబర్ 24) ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకోవాలని భారత్‌ భావిస్తోంది. అయితే టీమిండియా ఆశలపై వరుణుడు నీళ్లు జల్లే అవకాశం ఉంది. 

ఈ మ్యాచ్‌ జరిగే సమయంలో  ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్‌ ఉందని అక్కడ వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం రోజు మొత్తం ఆకాశం మేఘావృతమై ఉంటుందని పలు నివేదికలు వెల్లడించాయి.

తుది జట్లు(అంచనా)
భారత్: శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కెప్టెన్‌), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ప్రసిద్ద్‌ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషేన్‌, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్(వికెట్‌ కీపర్‌), మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్, పాట్ కమ్మిన్స్(కెప్టెన్‌), సీన్ అబాట్, ఆడమ్ జంపా
చదవండి: ICC Rankings: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే రెండో జట్టుగా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement