Ind Vs Aus: Rain may play spoilsport during 2nd ODI in Visakhapatnam - Sakshi
Sakshi News home page

IND vs AUS: ఆస్ట్రేలియాతో రెండో వన్డే.. టీమిండియా అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌! అలా అయితే

Published Sat, Mar 18 2023 12:52 PM | Last Updated on Sat, Mar 18 2023 1:29 PM

Rain may play spoilsport in India vs aus 2nd odi in vizag - Sakshi

ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు విశాఖపట్నం వేదికగా రెండో వన్డేలో అదే జట్టుతో అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత జట్టు భావిస్తుంటే.. ఆసీస్‌ మాత్రం తొలి వన్డే ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని వ్యూహాలు రచిస్తోంది.

అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. మార్చి 18 నుంచి 20 వరకు మూడు రోజుల పాటు విశాఖలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం మ్యాచ్‌ జరిగే సమయంలో ఉరుములు, ఈదురు గాలులతో భారీ వర్షం పడే ఛాన్స్‌ ఉంది ఉందని భారత వాతావరణ విభాగం (IMD) ఓ ప్రకటనలో పేర్కొంది. 

మరోవైపు వర్షం పడితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు.. స్టేడియం నిర్వాహకులు తెలిపారు. వర్షం నుంచి మైదానాన్ని రక్షించేందుకు అవసరమైన అత్యంత తేలికైన పిచ్‌ కవర్లు తమ వద్ద ఉన్నట్లు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కూడా ఓ ప్రకటనలో  వెల్లడించింది. కాగా ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది.

తుది జట్లు(అంచనా)
భారత్‌: శుబ్‌మన్ గిల్, రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్‌ రాహుల్(వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్

ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్‌), మార్నస్ లాబుషేన్‌, జోష్ ఇంగ్లిస్(వికెట్‌ కీపర్‌), కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.

చదవండి: IND Vs AUS: ఏంటి హార్దిక్‌ ఇది.. సీనియర్లకు ఇచ్చే విలువ ఇదేనా? పాపం కోహ్లి! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement