ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌ను 3-1 తేడాతో టీమిండియా కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రధానంగా బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే పదేళ్ల తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియాకు భారత్ సమర్పించుకుంది. ఈ సిరీస్‌లో టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ సైతం తీవ్ర నిరాశపరిచాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 18.60 సగటుతో కేవలం 93 పరుగులు మాత్రమే చేశాడు.
అందులో 31 పరుగులు అతడి అత్యధిక స్కోర్‌గా ఉంది. సొంతగడ్డపై బ్యాట్ ఝూలిపించే శబ్‌మన్.. విదేశాల్లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. 2021లో అరంగేట్రం చేసినప్పటి నుంచి దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్‌లలో 18 ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే ఈ ఇన్నింగ్స్‌లలో అతడి అత్యధిక స్కోర్ కేవలం 36 పరుగులు మాత్రమే కావడం గమానర్హం.
ఈ క్రమంలో గిల్‌పై భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు. గిల్ ఒక ఓవర్‌రేటెడ్ క్రికెటర్ అని శ్రీకాంత్ ఫైరయ్యాడు.
"శుబ్‌మన్ గిల్ ఒక ఓవర్‌రేటెడ్ క్రికెటర్. అతడిపై ఎక్కువగా అంచనాలు పెట్టుకోవద్దని నేను ముందు నుంచి చెబుతునే ఉన్నా. కానీ ఎవరూ నా మాట వినలేదు. అతడిని ఆకాశానికెత్తేశారు. గిల్‌కు చాలా అవకాశాలు లభిస్తున్నాయి.
పది ఛాన్స్‌లలో వరుసగా తొమ్మిది మ్యాచ్‌ల్లో విఫలమై ఆఖరి మ్యాచ్‌లో పరుగులు సాధిస్తున్నాడు. దీంతో అతడు జట్టులో తన స్ధానాన్ని పదిలం చేసుకుంటున్నాడు. అంతే తప్ప స్పెషల్ టాలెంట్ ఏమీ లేదు.
భారత పిచ్‌లపై ఎవరైనా పరుగులు సాధిస్తారు. సేనా దేశాల్లో పరుగులు సాధించడం గొప్ప విషయం. ఈ విషయంలో కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు తమను తాము నిరూపించుకున్నారు అని ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ పేర్కొన్నాడు.
చదవండి: ఆసీస్ గడ్డపై ఎంతో నేర్చుకున్నాను.. మళ్లీ బలంగా పైకి లేస్తాం: జైస్వాల్
Comments
Please login to add a commentAdd a comment