ఆస్ట్రేలియాతో మూడో వన్డేకు టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్, ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్‌కు జట్టు మేనెజ్‌మెంట్ విశ్రాంతి ఇచ్చింది. వీరిద్దరూ రెండో వన్డే అనంతరం జట్టుతో కలిసి రాజ్‌కోట్‌కు వెళ్లలేదు. వీరిద్దరూ తిరిగి మళ్లీ గౌహతిలో భారత జట్టుతో కలవనున్నారు. సెప్టెంబర్ 30న గౌహతి వేదికగా ఇంగ్లండ్‌తో వరల్డ్‌కప్ వామాప్ మ్యాచ్‌లో భారత్ తలపడనుంది.
ఇక భారత్-ఆసీస్ మధ్య నామమాత్రపు మూడో వన్డే బుధవారం(సెప్టెంబర్ 27) రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌కు భారత రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా అందుబాటులో రానున్నారు. ఇక ఇండోర్ వేదికగా ఆసీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 99 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోర్ చేసింది. శుబ్‌మన్ గిల్(105), శ్రేయస్ అయ్యర్(104) అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు. సూర్యకుమార్ యాదవ్ కూడా తన విశ్వరూపాన్ని చూపించాడు. 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు 72 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. బౌలింగ్‌లో అశ్విన్ మూడు వికెట్లతో రాణించాడు.
చదవండి: KL Rahul: నేను అస్సలు ఊహించలేదు.. అప్పుడప్పుడు అలా జరుగుతుంటుంది
Comments
Please login to add a commentAdd a comment