
File photo
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ఆక్టోబర్ 8న చెన్నైవేదికగా తలపడేందుకు టీమిండియా సన్నద్దమవుతోంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు భారత జట్టు మరో బిగ్‌షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చేతి వేలికి గాయమైనట్లు తెలుస్తోంది. రేవ్‌స్పోర్ట్స్ రిపోర్ట్ ప్రకారం.. నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా పాండ్యా కుడి చేతి వేలికి గాయమైనట్లు సమాచారం.
అతడు తీవ్రనొప్పితో బాధపడుతూ.. తర్వాత బ్యాటింగ్ కూడా మరి చేయలేదని రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఆసీస్‌తో మ్యాచ్ సమయానికి హార్దిక్ కోలుకోకపోతే టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఇప్పటికే స్టార్ ఓపెనర్ శబ్‌మన్ గిల్ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాడు. అతడి తొలి మ్యాచ్‌కు అందుబాటుపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం చెన్నైలో ఉన్న భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా చెమటడ్చుతోంది.
చదవండి: Asian Games 2023: నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరి బంతికి బంగ్లాదేశ్ గెలుపు! పాక్‌కు బిగ్ షాక్