వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ డెంగ్యూతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అతడికి డెంగ్యూ పాజిటివ్‌గా తేలినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌కు గిల్ దూరమయ్యే ఛాన్స్ ఉంది.
గిల్ ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం. కాగా గిల్‌కు శుక్రవారం మరోసారి రక్తపరీక్షలు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫలితం బట్టి జట్టు మేనెజ్‌మెంట్ ఓ నిర్ణయం తీసుకుంటుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా గిల్ ప్రస్తుతం అద్బుతమనైన ఫామ్‌లో ఉన్నాడు.
ఫార్మాట్‌తో సంబంధం లేకుండా దుమ్మురేపుతున్నాడు. ఆసియాకప్‌తో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో కూడా గిల్ అదరగొట్టాడు. ఒకవేళ గిల్ తొలి మ్యాచ్‌కు దూరమైతే నిజంగా భారత్‌కు అది గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి.
చదవండి: WC 2023: వారిద్దరే మా ఓటమిని శాసించారు.. చాలా బాధగా ఉంది! కానీ: బట్లర్
Comments
Please login to add a commentAdd a comment