
ICC Cricket World Cup 2023- Ind Vs Aus: వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా ఆరంభ మ్యాచ్‌కు శుబ్‌మన్ గిల్ అందుబాటులో ఉండే అవకాశం లేదని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ మాటలను బట్టి ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఇప్పటికే జట్టుకు దూరమయ్యాడని అర్ధం చేసుకోవచ్చన్నాడు.
కాగా సొంతగడ్డపై పుష్కరకాలం తర్వాత భారత జట్టు ఐసీసీ ఈవెంట్‌కు సిద్ధమైన విషయం తెలిసిందే. చెన్నై వేదికగా అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో మ్యాచ్‌తో వరల్డ్‌కప్ జర్నీ మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ డెంగ్యూ బారిన పడటం ఆందోళనకరంగా మారింది.
రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే!
ఆసీస్‌తో మ్యాచ్ నాటికి అతడు కోలుకుంటాడో లేదోనన్న సందేహాల నడుమ రాహుల్ ద్రవిడ్ శుక్రవారం అప్‌డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. వైద్యబృందం పర్యవేక్షణలో ఉన్న గిల్ ఇప్పుడే జట్టుకు దూరమయ్యాడని చెప్పలేమని పేర్కొన్నాడు.
ఈ విషయంపై స్పందించిన కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. ‘‘శుబ్‌మన్ గిల్ ఆరోగ్యం ప్రస్తుతం బాగాలేదు. ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో రాహుల్ ద్రవిడ్ మాత్రం.. గిల్ పరిస్థితి మరీ అంత అధ్వానంగా లేదని.. అతడు జట్టుతో చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పాడు.
రోహిత్‌కు జోడీగా ఇషాన్ ఫిక్స్
నిజానికి రాహుల్ ద్రవిడ్ ఎప్పుడైతే ఇలా చెప్తాడో.. అలాంటి సందర్భాల్లో సదరు ఆటగాళ్లు దూరమవడం దాదాపు ఖాయమైపోయినట్లే లెక్క! నాకు తెలిసి రోహిత్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు’’ అని అభిప్రాయపడ్డాడు.
చేదువార్తే కదా!
ఏదేమైనా రోహిత్‌తో కలిసి అద్భుతమైన ఓపెనింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పగల గిల్ దూరం కావడం భారత జట్టుకు బ్యాడ్ న్యూసే అవుతుందని ఈ మాజీ ఓపెనర్ విచారం వ్యక్తం చేశాడు.
వరల్డ్‌కప్ వంటి మెగా ఈవెంట్లో అటాకింగ్ మోడ్‌లో ఉన్న గిల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తే ఆది నుంచే ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టే అవకాశం ఉండేదని ఆకాశ్ పేర్కొన్నాడు. కాగా ప్రపంచకప్‌నకు ముందు ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో శుబ్ మన్ గిల్ వరుసగా 74, 104 పరుగులు సాధించిన విషయం తెలిసిందే.
చదవండి: అతడు అద్భుతం.. కాస్త ఏమరపాటుగా ఉన్నా అంతే! నాకు అనుభవం: ఏబీడీ