డకౌట్లుగా వెనుదిరిగిన రోహిత్, ఇషాన్ (PC: Disney+Hotstar)
ICC Cricket World Cup 2023- India vs Australia: వన్డే వరల్డ్‌కప్-2023లో ఆస్ట్రేలియాతో ఆరంభ మ్యాచ్‌లో ఆదిలోనే టీమిండియాకు భారీ షాకులు తగిలాయి. ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ డకౌట్ అయ్యారు. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్ ఎటాక్ ఆరంభించగా.. నాలుగో బంతికే ఇషాన్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. తన మొదటి వన్డే ప్రపంచకప్ టోర్నీ ఆరంభంలోనే చెత్త రికార్డు నమోదు చేశాడు.
ఇషాన్.. నీకు గోల్డెన్ ఛాన్స్ వచ్చినందుకు
అనారోగ్యం కారణంగా శుబ్‌మన్ గిల్ జట్టుకు దూరం కావడంతో.. ఓపెనర్‌గా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దీంతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. గోల్డెన్ డక్ బాయ్ అంటూ మీమర్స్ ఇషాన్‌ను ట్రోల్ చేస్తున్నారు.
ఏంటిది కెప్టెన్! ఆనందం కాసేపేనా?
ఇషాన్ కిషన్ సంగతి ఇలా ఉంటే.. రోహిత్ శర్మ సైతం డకౌట్(సిక్స్ బాల్)గా వెనుదిరగడం టీమిండియా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. 199 పరుగులకే ఆసీస్‌ను ఆలౌట్ చేశామన్న ఆనందం కాసేపు కూడా నిలవనీయకుండా చేశావు కదా కెప్టెన్ అంటూ హిట్‌మ్యాన్ ఆట తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయ్యర్.. నువ్వేం చేశావు?
అనుభవజ్ఞుడైన నువ్వు కూడా ఇలా ఆడితే ఎలా అంటూ విమర్శలు సంధిస్తున్నారు. కాగా రెండో ఓవర్ మూడో బంతికి హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో రోహిత్ లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగాడు. ఓపెనర్ల కథ ఇలా ఉంటే.. నాలుగో స్థానంలో వచ్చిన శ్రేయస్ అయ్యర్ నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకోవడంతో అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది.
199 పరుగులకు ఆలౌట్
కాస్త జాగ్రత్తగా ఆడాల్సిందంటూ అయ్యర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇషాన్, రోహిత్, అయ్యర్(హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి) డకౌట్లుగా వెనుదిరగడంతో 2 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. కాగా చెన్నై వేదికగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను.. టీమిండియా 199 పరుగులకే కట్టడి చేసింది. రవీంద్ర జడేజా మూడు, బుమ్రా రెండు, కుల్దీప్ రెండు, సిరాజ్, హార్దిక్ పాండ్యా, అశ్విన్ ఒక్కో వికెట్ తీశారు.
చదవండి: WC 2023: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన వార్నర్.. ప్రపంచకప్ చరిత్రలో తొలి బ్యాటర్‌గా
Comments
Please login to add a commentAdd a comment