శుబ్‌మన్ గిల్‌తో రాహుల్ ద్రవిడ్ (PC: BCCI)
ICC Cricket World Cup 2023- Ind Vs Aus- Update On Shubman Gill: టీమిండియా వన్డే వరల్డ్‌కప్-2023 ప్రయాణ ఆరంభానికి కౌంట్‌డౌన్ మొదలైంది. చెన్నైలోని చెపాక్ వేదికగా భారత జట్టు తమ ఆరంభ మ్యాచ్ ఆడనుంది. ఆస్ట్రేలియాతో అక్టోబరు 8న తలపడేందుకు రోహిత్ సేన సన్నద్ధమైంది.
ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ గురించి హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక అప్‌డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం గిల్ ఆరోగ్యం మెరుగ్గా ఉందని.. ఆదివారం నాటి మ్యాచ్‌కు అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటూ అభిమానులకు శుభవార్త అందించాడు.
గిల్ బాగానే ఉన్నాడు
కాగా సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనింగ్ బ్యాటర్ గిల్ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌కు కూడా రాలేకపోయాడు. దీంతో ఆసీస్‌తో మ్యాచ్‌కు అతడు దూరం కానున్నాడనే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘‘ఈరోజు గిల్ కాస్త బెటర్‌గా ఫీల్ అవుతున్నాడు. వైద్య బృందం నిరంతరం అతడిని పర్యవేక్షిస్తోంది.
అప్పుడే క్లారిటీ వస్తుంది
ఇంకా 36 గంటల సమయం ఉంది. ఆ తర్వాతే మేము ఏదైనా నిర్ణయం తీసుకోగలం. ఈరోజైతే తను బాగానే ఉన్నాడు. ఇప్పటివరకైతే మెడికల్ టీమ్ అతడు ఆదివారం నాటికి అందుబాటులోకి వస్తాడనే నమ్మకంతోనే ఉంది. రేపటిలాగే ఈ విషయంపై పూర్తి స్పష్టత వస్తుంది’’ అని శుక్రవారం పేర్కొన్నాడు.
అలా అయితే ఇషాన్‌కు ఛాన్స్
కాగా ఒకవేళ ఫీవర్ తగ్గక శుబ్‌మన్ గిల్ ఆసీస్‌తో మ్యాచ్‌కు దూరమైతే అతడి స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు ఓపెనర్‌గా బంపరాఫర్ దక్కే అవకాశం ఉంది. ఇక సొంతగడ్డపై ఐసీసీ ఈవెంట్లో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్న రోహిత్ సేన.. ఆసీస్‌తో మ్యాచ్‌లో శుభారంభం అందుకోవాలని భావిస్తోంది. మెగా టోర్నీకి ముందు కంగారూలను 2-1తో చిత్తు చేసిన జోష్‌లో ఉన్న భారత్.. ఆరంభ మ్యాచ్‌లో ఎలాంటి అస్త్రశస్త్రాలతో బరిలోకి దిగనుందో చూడాలి!
చదవండి: WC: అప్పుడు తండ్రి టీమిండియాపై.. కొడుకు ఇప్పుడు పాకిస్తాన్‌పై! వన్డే ప్రపంచకప్ చరిత్రలో..
చరిత్ర సృష్టించిన రిజ్వాన్, సౌద్ షకీల్.. ప్రపంచకప్ హిస్టరీలో..!
Comments
Please login to add a commentAdd a comment