Shubman Gill Getting Ruled Out of IND vs AFG WC Clash: ‘‘జట్టుకు పెద్దగా నష్టం ఉండకపోవచ్చు. అతడికే ఇది గడ్డుకాలం. ఎందుకంటే మేనేజ్‌మెంట్‌కు కావాల్సినన్ని ఆప్షన్లు ఉన్నాయి. మొదటి మ్యాచ్‌లో ఏం జరిగిందో చూశాం కదా! నిజానికి టీమిండియా పటిష్టంగానే ఉంది.
శుబ్‌మన్ గిల్ లేకున్నా ప్రత్యర్థి జట్లను ఓడించగల సత్తా భారత జట్టుకు ఉంది. కాబట్టి ఇలా జట్టుకు దూరం కావడం గిల్‌ను తీవ్ర నిరాశకు గురిచేసి ఉంటుంది’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు.
డెంగ్యూ బారిన పడిన గిల్..
కాగా సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనింగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్.. వన్డే వరల్డ్‌కప్-2023లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. డెంగ్యూ బారిన పడిన గిల్.. ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదని సమాచారం. ఈ నేపథ్యంలో ఢిల్లీలో అఫ్గనిస్తాన్‌తో తదుపరి మ్యాచ్‌కు కూడా అతడు అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ ప్రకటించింది.
ఈ విషయంపై స్పందించిన కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్.. గిల్ దూరం కావడం టీమిండియాకు ఎదురుదెబ్బేనని పేర్కొన్నాడు. అయితే, అతడు లేకున్నా మేనేజ్‌మెంట్ ఎవరో ఒకరితో ఆ స్థానాన్ని భర్తీ చేస్తుందన్న మంజ్రేకర్.. మెగా టోర్నీ ఆరంభ మ్యాచ్ ఆడలేకపోవడం గిల్‌కు లోటుగా మిగిలిపోతుందన్నాడు.
బ్యాడ్‌టైమ్.. ఫ్యాన్స్‌కు కూడా నచ్చదు.. కానీ
‘‘శుబ్‌మన్ గిల్ ఉంటే జట్టు మరింత పటిష్టమవుతుంది. ప్రస్తుతం అతడు అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. కానీ.. పాపం.. పరిస్థితులు తనకు అనుకూలంగా లేవు. ఇంతకంటే బ్యాడ్‌టైమ్ ఇంకోటి ఉండదు’’ అంటూ స్టార్ స్పోర్ట్స్ షోలో సంజయ్ మంజ్రేకర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. గిల్ లేని మ్యాచ్ చూడటం అభిమానులకు కూడా ఏమాత్రం నచ్చదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు.
గోల్డెన్ డక్‌గా ఇషాన్
కాగా సొంతగడ్డపై ఐసీసీ ఈవెంట్ ఆరంభ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ స్థానంలో ఇషాన్ కిషన్ రోహిత్ శర్మకు జోడీగా ఓపెనర్‌గా వచ్చాడు. కానీ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగి ఘోర పరాభవం మూటగట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. గిల్‌కు బ్యాకప్ ఓపెనర్‌గా రుతురాజ్ గైక్వాడ్ లేదంటే యశస్వి జైశ్వాల్‌లలో ఒకరికి మేనేజ్‌మెంట్ అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: Ind vs Pak: టీమిండియాతో మ్యాచ్‌కు కూడా లేనట్లే! కెరీర్‌కు ఎండ్ కార్డ్ అంటూ..
Comments
Please login to add a commentAdd a comment