WC 2023: టీమిండియా పేసర్ల దెబ్బ.. 302 పరుగుల తేడాతో లంకపై జయభేరి | WC 2023 Ind Vs SL Match 33 Updates And Highlights - Sakshi
Sakshi News home page

WC 2023: టీమిండియా పేసర్ల దెబ్బ.. 302 పరుగుల తేడాతో లంకపై జయభేరి

Published Thu, Nov 2 2023 2:08 PM | Last Updated on Thu, Nov 2 2023 8:39 PM

WC 2023 Ind Vs SL 33rd Match Updates And Highlights - Sakshi

ICC Cricket World Cup 2023- India vs Sri Lanka Updates: వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో టీమిండియా- శ్రీలంక మధ్య గురువారం నాటికి మ్యాచ్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌..

302 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం
మధుషాంక వికెట్‌ తీసి రవీంద్ర జడేజా టీమిండియా విజయ లాంఛనం పూర్తి చేశాడు.
తొమ్మిదో వికెట్‌ డౌన్‌
17.6: షమీ బౌలింగ్‌లో కసున్‌ రజిత(14) పెవిలియన్‌ చేరడంతో శ్రీలంక తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. స్కోరు: 49/9(18)
శ్రీలంక ఓటమికి చేరువైంది. 29 పరుగులకే శ్రీలంక 8 వికెట్లు కోల్పోయింది. మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో మాథ్యూస్‌ క్లీన్‌ బౌల్డయ్యాడు. 

22 పరుగులకే 7 వికెట్లు..
శ్రీలంక 22 పరుగులకే 7 వికెట్లు కోల్పో‍యింది. మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో చమీరా పెవిలియన్‌కు చేరాడు. 

11 ఓవర్లలో లంక స్కోరు: 21/6
ఏంజెలో మాథ్యూస్‌ 10, దుష్మంత చమీర సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు.

పవర్‌ ప్లేలో శ్రీలంక స్కోరు: 14/6 (10)

షాకుల మీద షాకులు.. ఆరో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక
9.4: హేమంత డకౌట్‌
9.3: షమీ బౌలింగ్‌లో అసలంక(1) అవుట్‌.

8 ఓవర్లలో శ్రీలంక స్కోరు: 12/4
ఏంజెలో మాథ్యూస్‌ 6, చరిత్‌ అసలంక 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.

3.1: సిరాజ్‌ బౌలింగ్‌లో కుశాల్‌ మెండిస్‌ బౌల్డ్‌
కెప్టెన్‌ కుశాల్‌ మెండిస్‌ రూపంలో శ్రీలంక నాలుగో వికెట్‌ కోల్పోయింది. సిరాజ్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు మెండిస్‌(1).

మూడో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక
టీమిండియా పేసర్లు బుమ్రా, సిరాజ్‌ దెబ్బకు శ్రీలంక టాపార్డర్‌ కుదేలైంది. రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది.

రెండో వికెట్‌ డౌన్‌..
2 పరుగుల వద్ద శ్రీలంక రెండో వికెట్‌ కోల్పోయింది. సిరాజ్‌ బౌలింగ్‌లో ఓపెనర్‌ కరుణ రత్నే ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.

తొలి వికెట్‌ కోల్పోయిన శ్రీలంక.. 
358 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మొదటి బంతికే వికెట్‌ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో నిస్సాంక గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి కెప్టెన్‌ కుశాల్‌ మెండిస్‌ వచ్చాడు.

ఐదేసిన మధుషాంక.. శ్రీలంక లక్ష్యం 358 రన్స్‌
శ్రీలంకతో మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు శుబ్‌మన్‌ గిల్‌(92), విరాట్‌ కోహ్లి(88), శ్రేయస్‌ అ‍య్యర్‌(82) పరుగులతో అదరగొట్టారు. వీరి ముగ్గురి అద్భుతమైన అర్ధ శతకాలతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో  8 వికెట్ల నష్టానికి 357 పరుగులు సాధించింది.

లంక బౌలర్లలో పేసర్‌ మధుషాంక అత్యధికంగా 5 వికెట్లు తీయగా.. దుష్మంత చమీరకు ఒక వికెట్‌ దక్కింది. రనౌట్ల రూపంలో లంకు రెండు వికెట్లు లభించాయి.


49.6: జడేజా రనౌట్‌
49.3: షమీ రనౌట్‌

శ్రేయస్‌ అ‍య్యర్‌ అవుట్‌
47.3: 56 బంతుల్లో 82 పరుగులతో జోరు మీదున్న శ్రేయస్‌ అ‍య్యర్‌ ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. మధుషాంక బౌలింగ్‌లో తీక్షణకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

ఐదో వికెట్‌ డౌన్‌..
టీమిండియా ఐదో వికెట్‌ కోల్పోయింది. 12 పరుగులు చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌.. మధుశంక బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 42 ఓవర్లకు టీమిండియా స్కోర్‌: 279/5

నాలుగో వికెట్‌ కోల్పోయిన టీమిండియా..
కేఎల్‌ రాహుల్‌ రూపంలో టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. 21 పరుగులు చేసిన రాహుల్‌.. చమీరా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి సూర్యకుమార్‌ యాదవ్‌ వచ్చాడు. 40 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 264/4

37 ఓవర్లలో టీమిండియా స్కోరు: 240-3
శ్రేయస్‌ అ‍య్యర్‌ 27, కేఎల్‌ రాహుల్‌ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు.

31.3: కోహ్లి అవుట్‌.. మూడో వికెట్‌ డౌన్‌
సెంచరీ చేస్తాడని భావించిన కోహ్లి 88 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. దీంతో టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. కాగా రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌ వికెట్లు తీసిన లంక పేసర్‌ మధుషాంక కోహ్లిని సైతం అవుట్‌ చేసి మూడో వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

సెంచరీ మిస్‌ అయిన గిల్‌
వరల్డ్‌కప్‌లో తొలి శతకం బాదే అవకాశాన్ని టీమిండియా యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ మిస్సయ్యాడు. దూకుడుగా ఆడుతూ 92 పరుగులు పూర్తి చేసుకున్న ఈ రైట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌ 30వ ఓవర్‌ ఆఖరి బంతికి మధుషాంక బౌలింగ్‌లో కీపర్‌ కుశాల్‌ మెండిస్‌కు క్యాచ్‌ ఇచ్చి నిరాశగా పెవిలియన్‌ చేరాడు.

దీంతో టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. స్కోరు: 193-2. కోహ్లి 87, శ్రేయస్‌ అ‍య్యర్‌ క్రీజులో ఉన్నారు.

29 ఓవర్లలో టీమిండియా స్కోరు: 185/1.
కోహ్లి 86, గిల్‌ 86 పరుగులతో క్రీజులో ఉన్నారు.

26 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు:162-1
కోహ్లి 82, గిల్‌ 67 పరుగులతో క్రీజులో ఉన్నారు.

21 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 126-1
కోహ్లి 58, గిల్‌ 55 పరుగులతో ఉన్నారు.

18.3: వన్డే వరల్డ్‌కప్‌-2023లో రెండో హాఫ్‌ సెంచరీ సాధించిన గిల్‌
కోహ్లి 52, గిల్‌ 52 పరుగులతో క్రీజులో ఉన్నారు. 19 ఓవర్లలో టీమిండియా స్కోరు: 119-1

16.1: హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి
హేమంత బౌలింగ్‌లో రెండు పరుగులు రాబట్టి  కోహ్లి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.

అర్థ శతకానికి చేరువలో కోహ్లి
15 ఓవర్లు ముగిసే సరికి కోహ్లి 41 పరుగులు, గిల్‌ 35 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు:  88-1

13 ఓవర్లలో టీమిండియా స్కోరు: 82/1
కోహ్లి 37, గిల్‌ 33 పరుగులతో క్రీజులో ఉన్నారు.

నిలకడగా ఆడుతున్న కోహ్లి, గిల్‌.. పవర్‌ ప్లేలో ముగిసేసరికి
ఆరంభంలోనే రోహిత్‌ శర్మ అవుటైన నేపథ్యంలో టీమిండియా వన్‌డౌన్‌ బ్యాటర్‌ కోహ్లి, మరో  ఓపెనర్‌ గిల్‌ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపిస్తున్నారు. పది ఓవర్లు ముగిసే సరికి కోహ్లి 28, గిల్‌ 22 పరుగులతో ‍క్రీజులో ఉన్నారు. స్కోరు: 60-1

6 ఓవర్లలో టీమిండియా స్కోరు: 33/1
చమీర బౌలిం‍గ్‌లో కోహ్లి రెండు ఫోర్లు బాదాడు. ప్రస్తుతం కోహ్లి 18, గిల్‌ 9 పరుగులతో క్రీజులో ఉ‍న్నారు.

5 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 25/1
కోహ్లి 10, గిల్‌ 9 పరుగులతో క్రీజులో ఉ‍న్నారు.

టీమిండియాకు ఊహించని షాక్‌
భారత ఇన్నింగ్స్‌ రెండో బంతికే లంక శ్రీలంక పేసర్‌ దిల్షాన్‌ మధుషాంక ఊహించని షాకిచ్చాడు. అద్భుతమైన బంతితో టీమిండియా సారథి రోహిత్‌ శర్మను బౌల్డ్‌ చేశాడు. ఈ క్రమంలో నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ పెవిలియన్‌ చేరాడు. శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి క్రీజులో ఉ‍న్నారు.

టాస్‌ గెలిచిన శ్రీలంక.. తొలుత బౌలింగ్‌
►టాస్‌ గెలిచిన శ్రీలంక ఆహ్వానం మేరకు రోహిత్‌ సేన తొలుత బ్యాటింగ్‌కు దిగింది.

తుదిజట్లు
టీమిండియా
రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్‌కీపర్‌), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్‌ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

శ్రీలంక:
పాతుమ్ నిసాంక, దిముత్ కరుణరత్నే, కుశాల్ మెండిస్(కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, దుషన్ హేమంత, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దుష్మంత చమీర, దిల్షన్ మధుషంక

చదవండి: World Cup 2023: వరల్డ్‌ నెంబర్‌ 1 బౌలర్‌గా షాహిన్‌ అఫ్రిది..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement