తొలి వన్డే ఓటమికి ఆస్ట్రేలియా ప్రతీకారం తీర్చుకుంది. విశాఖపట్నం వేదికగా టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో 10 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం 11 ఓవర్లలోనే ఛేదిచింది. ఆసీస్ ఓపెనర్లు మిచెల్ మార్ష్(66), హెడ్(51) పరుగులతో మ్యాచ్‌ను ఫినిష్ చేశారు.
ఇక 11 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించిన ఆస్ట్రేలియా ఓ అరుదైన ఘనత సాధించింది. టీమిండియాపై వన్డేల్లో ఓవర్ల పరంగా అత్యధిక వేగంగా టార్గెట్ ఛేదించిన జట్టుగా ఆసీస్ నిలిచింది. అంతకుముందు 2019లో హామిల్టన్ వేదికగా జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో భారత్‌పై 93 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 14.4 ఓవర్లలో ఛేదించింది.
ఇప్పటివరకు ఇదే అత్యంత వేగమైన ఛేజింగ్ కాగా.. తాజా మ్యాచ్‌తో కివీస్ రికార్డును ఆసీస్ బ్రేక్ చేసింది. ఇక ఓవరాల్‌గా ఓవర్ల పరంగా ఆస్ట్రేలియాకు ఇది మూడో అతి పెద్ద విజయం. అంతకుముందు 2004లో యూఏస్‌ఏపై 66 పరుగుల లక్ష్యాన్ని కేవలం 7.5 ఓవర్లలోనే ఆసీస్ సాధించింది. ఇక సిరీస్ డిసైడ్ చేసే మూడో వన్డే మార్చి 22న చెన్నై వేదికగా జరగనుంది.
చదవండి: AUS vs IND: మిచెల్ మార్ష్ విధ్వంసం.. 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో! ఢిల్లీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
Comments
Please login to add a commentAdd a comment