one day series
-
రెండో వన్డేలో భారత్ ఘన విజయం
-
'కచ్చితంగా విజయం మాదే.. మొన్న ఏదో అలా జరిగిపోయింది'
వెస్టిండీస్- భారత్ మధ్య సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరిదైన మూడో వన్డేకు రంగం సిద్ధమైంది. ట్రినిడాడ్ వేదికగా మంగళవారం జరగనున్న ఈ కీలక మ్యాచ్‌లో భారత్-విండీస్ జట్టు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఇక రెండో వన్డేలో ప్రయోగాలు చేసి ఓటమిపాలైన భారత జట్టు.. ఆఖరి మ్యాచ్‌లో మాత్రం పూర్తి స్ధాయి జట్టుతోనే బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విండీస్ మాత్రం రెండో వన్డే ఫలితాన్నే పునరావృతం చేసి సిరీస్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఇక సిరీస్ డిసైడర్ మూడో వన్డే నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కీలక వాఖ్యలు చేశాడు. మూడో వన్డేలో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంటమని జడ్డూ థీమా వ్యక్తం చేశాడు. "మేము చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. అందులో ఎటువంటి సందేహం లేదు. మేము గత మ్యాచ్‌లో ఓడిపోయాం. అదేమి పెద్ద సమస్య కాదు. ఎందుకంటే ఆటలో గెలుపు, ఓటములు సహజం. మేము మా జట్టులో కొన్ని ప్రయోగాలు చేశాం. అందుకే ఫలితం మేము ఆశించిన విధంగా రాలేదు. ఆసియాకప్, ప్రపంచకప్కుముందు మేము ఆడుతున్న ఏకైక వన్డే సిరీస్ ఇది. అందుకే జట్టు కాంబనేషన్లో కొన్ని మార్పులు చేశాం. ఇది మా జట్టుపై ఎటువంటి ప్రభావం చూపదు. ఇక విండీస్ యువ ఆటగాళ్లతో కూడిన జట్టు. వారు నేర్చుకోనే స్ధాయిలో ఉన్నారు. అయినప్పటికీ వారు అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. వారు భారత జట్టు నుంచి చాలా విషయాలు నేర్చకుంటున్నారని నేను ఆశిస్తున్నాను. వారిలో అద్భుతమైన టాలెంట్ ఉంది. మేము కచ్చితంగా ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించి, సిరీస్‌ను సొంతం చేసుకుంటామని జడేజా ఓ స్పోర్ట్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. చదవండి: IND vs WI: టీమిండియాతో టీ20 సిరీస్.. విండీస్ జట్టు ప్రకటన! సిక్సర్ల వీరుడు వచ్చేశాడు -
ఆస్ట్రేలియాతో ఓటమి.. వన్డేల్లో అగ్ర స్థానాన్ని కోల్పోయిన భారత్
చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన జరిగిన మూడో వన్డేలో 21 పరుగుల తేడాతో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను 1-2 తేడాతో భారత్ కోల్పోయింది. కాగా గత నాలుగేళ్లలో స్వదేశంలో టీమిండియా సిరీస్‌ను కోల్పోవడం ఇదే తొలి సారి. మార్చి 2019 నుంచి అన్ని ఫార్మాట్లలో వరుసగా 24 సిరీస్‌లలో టీమిండియా విజయం సాధించింది. చివరగా 2019 ఆరంభంలో ఆసీస్‌పైనే భారత్ సిరీస్‌ను కోల్పోయింది. అదే విధంగా రోహిత్ శర్మకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా స్వదేశంలో ఇదే తొలి సిరీస్ ఓటమి కావడం గమానార్హం. ఇక సిరీస్‌లో ఓటమిపాలైన టీమిండియా.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠాన్ని కూడా కోల్పోయింది. ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ రెండో స్థానానికి పడిపోయింది. ఆసీస్‌తో 113 రేటింగ్ పాయింట్లతో టీమిండియా సమంగా ఉన్నప్పటికీ.. మ్యాచ్ విన్నింగ్ శాతం పరంగా కంగారూ జట్టు టాప్ ర్యాంక్‌కు చేరుకుంది. టీమిండియా తరువాతి స్థానంలో 111 రేటింగ్ పాయింట్లతో న్యూజిలాండ్ నిలిచింది. చదవండి: IND Vs AUS: సొంతగడ్డపై బెబ్బులే.. కానీ ఆసీస్‌కు మాత్రం దాసోహం IND vs AUS: అదే మా కొంప ముంచింది.. అస్సలు ఊహించలేదు! క్రెడిట్ మొత్తం వారికే -
సూర్యకుమార్ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా
టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో తన చెత్త ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేల్లో మొదటి బంతికే ఔట్ అయిన సూర్యకుమార్ యాదవ్.. మూడు వన్టేల్లోనూ తొలి బంతికే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. చెన్నై వేదికగా జరిగిన మూడో వన్డేలో ఏడో స్ధానంలో బ్యాటింగ్ వచ్చిన సూర్య.. అష్టన్ అగర్ బౌలింగ్‌లో మొదటి బంతికే పెవిలియన్‌కు చేరాడు. అగర్ వేసిన స్ట్రెయిట్ లెంగ్త్ బాల్‌కు బ్యాక్‌ఫుట్‌పై షాట్ ఆడేందుకు సూర్య ప్రయత్నించాడు. కానీ బంతి మిస్ అయి స్టంప్‌లను తాకింది. దీంతో ఖాతా తెరవకుండానే సూర్య నిరాశతో మైదానాన్ని వీడాడు. అత్యంత చెత్త రికార్డు.. ఇక ఈ మ్యాచ్‌లో గోల్డన్‌డక్‌గా వెనుదిరిగిన సూర్యకుమార్ యాదవ్ అత్యంత చెత్త రికార్డును నెలకొల్పాడు. ఓ వన్డే సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గోల్డెన్ డకౌటైన తొలి బ్యాటర్‌గా సూర్యకుమార్ నిలిచాడు. అదే విధంగా మూడు వన్డేల సిరీస్‌లో మూడు సార్లు డకౌట్ అయిన మొదటి భారత బ్యాటర్ కూడా సూర్యనే. ఇక ఓవరాల్‌గా వన్డేల్లో వరుసగా మూడు సార్లు డకౌటైన ఆరో భారత బ్యాటర్‌గా సూర్య నిలిచాడు. అంతకుముందు సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా వరుసగా మూడు డకౌట్లుగా వెనుదిరిగారు. కానీ వీరంతా తొలి బంతికే ఔట్ కాలేదు. అయితే ప్రపంచ క్రికెట్లో వరుసగా అత్యధిక డకౌట్లు అయిన రికార్డు మాత్రం శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ పేరిట ఉంది. వన్డేల్లో మలింగ వరుసగా నాలుగు సార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు. చదవండి: IND vs AUS: అదే మా కొంప ముంచింది.. అస్సలు ఊహించలేదు! క్రెడిట్ మొత్తం వారికే -
మూడో వన్డేలో టీమిండియా ఓటమి.. సిరీస్ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా
మూడో వన్డేలో టీమిండియా ఓటమి.. సిరీస్ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా చెన్నై వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఓటమిపాలైంది. ఫలితంగా 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 269 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో తడబడిన భారత్ 248 పరుగులకే చాపచుట్టేసింది. ఫలితంగా ఆసీస్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొమ్మిదో వికెట్ డౌన్.. ఓటమి అంచుల్లో భారత్ టీమిండియా 243 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. సిక్సర్, ఫోర్ కొట్టిన అనంతరం షమీ స్టొయినిస్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఎనిమిదో వికెట్ డౌన్.. ఓటమి దిశగా భారత్ 225 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో స్టోయినిస్‌కు క్యాచ్ ఇచ్చి జడేజా (18) ఔటయ్యాడు. టీమిండియా గెలవాలంటే 29 బంతుల్లో 45 పరుగులు చేయాలి. కుల్దీప్ (1), షమీ క్రీజ్‌లో ఉన్నారు. ఏడో వికెట్ కోల్పోయిన భారత్.. హార్ధిక్ ఔట్ 218 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్ కోల్నోయింది. జంపా బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి హార్ధిక్ (40) ఔటయ్యాడు. భారత్ ఈ మ్యాచ్ గెలవాలంటే 38 బంతుల్లో 52 పరుగులు చేయాల్సి ఉంది. వరుస బంతుల్లో వికెట్లు కోల్నోయిన భారత్.. స్కై మరోసారి గోల్డన్ డక్ 185 పరుగుల వద్ద టీమిండియా వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్నోయింది. 36వ ఓవర్ తొలి బంతికి కోహ్లిని (54) ఔట్ చేసిన అగర్, ఆతర్వాతి బంతికే సూర్యకుమార్‌కు (0) క్లీన్ బౌల్డ్ చేశాడు. సూర్యకుమార్‌కు ఇది హ్యాట్రిక్ గోల్డన్ డకౌట్ కావడం విశేషం. హార్ధిక్ (28), జడేజా క్రీజ్‌లో ఉన్నారు. టీమిండియా గెలవాలంటే 88 బంతుల్లో 85 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి. అక్షర్ పటేల్ రనౌట్ 7 బంతుల వ్యవధిలో టీమిండియా 2 వికెట్లు కోల్పోయింది. భారీ షాట్‌కు ప్రయత్నించి తొలుత రాహుల్ ఔట్ కాగా.. ఆతర్వాత అక్షర్ పటేల్ (2) రనౌటయ్యాడు. కోహ్లి (48), హార్ధిక్ పాండ్యా క్రీజ్‌లో ఉన్నారు. మూడో వికెట్ డౌన్.. కేఎల్ రాహుల్ ఔట్ 146 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. జంపా బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి కేఎల్ రాహుల్ (32) ఔటయ్యాడు. విరాట్ కోహ్లి (45), అక్షర్ పటేల్ క్రీజ్‌లో ఉన్నారు. టీమిండియా గెలవాలంటే 22.1 ఓవర్లలో 124 పరుగులు చేయాల్సి ఉంది. నిలకడగా ఆడుతున్న కోహ్లి, రాహుల్ 77 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన భారత్.. ఆతర్వాత మరో వికట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతుంది. 23 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 117/2గా ఉంది. విరాట్ కోహ్లి (33), కేఎల్ రాహుల్ (15) క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన భారత్.. గిల్ (37) ఔట్ 77 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ఆడమ్ జంపా బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ (37) ఎల్బీడబ్యూ ఔట్ అయ్యాడు. కోహ్లి (8), కేఎల్ రాహుల్ క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన భారత్.. రోహిత్ (30) ఔట్ 65 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. సీన్ అబాట్ బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్ క్యాచ్ పట్టడంతో రోహిత్ శర్మ (30) ఔటయ్యాడు. గిల్ (33), విరాట్ కోహ్లి క్రీజ్‌లో ఉన్నారు. 9 ఓవర్లకు భారత్ స్కోర్: 65/0 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. 9 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(30), శుబ్‌మన్ గిల్(33) పరుగులతో ఉన్నారు. రాణించిన ఆసీస్ బ్యాటర్లు.. భారత్ టార్గెట్ 270 పరుగులు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్(47), కారీ(38), హెడ్(33) పరుగులతో రాణించారు. ఇక భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు సాధించగా..అక్షర్ పటేల్, సిరాజ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. 43 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 229/7 43 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. క్రీజులో అగర్(8), అబాట్(18) పరుగులతో ఉన్నారు. ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్ 196 పరుగుల వద్ద ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన స్టోయినిష్.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 28.1: ఐదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా లబుషేన్ రూపంలో ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి లబుషేన్(28) పెవిలియన్ చేరాడు. ఆసీస్ స్కోరు: 138/5 (28.1). స్టొయినిస్, క్యారీ క్రీజులో ఉన్నారు. 26 ఓవర్లలో ఆసీస్ స్కోరు: 128-4 నాలుగో వికెట్ డౌన్ 24.3: కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఆసీస్ స్టార్ డేవిడ్ వార్నర్ అవుటయ్యాడు. 31 బంతులు ఎదుర్కొన్న అతడు 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. లబుషేన్, అలెక్స్ క్యారీ క్రీజులో ఉన్నారు. వారెవ్వా హార్దిక్.. మార్ష్ క్లీన్ బౌల్డ్ ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. 47 పరుగులతో దూకుడుగా ఆడుతోన్న మిచెల్ మార్ష్‌ను హార్దిక్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇప్పటివరకు టీమిండియా సాధించిన మూడు వికెట్లు కూడా హార్దిక్ పడగొట్టినవే కావడం గమనార్హం. 15 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 87/3 రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్.. ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో.. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ డకౌట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి డేవిడ్ వార్నర్ వచ్చాడు. తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్.. హెడ్ ఔట్ 68 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్.. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి స్మిత్ వచ్చాడు. ►5 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు: 39/0 ►రెండు ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. క్రీజులో మార్ష్(9), హెడ్(4) పరుగులతో ఉన్నారు. చెపాక్ వేదికగా సిరీస్‌ను డిసైడ్ చేసే మూడో వన్డేలో తలపడేందుకు భారత్- ఆస్ట్రేలియా జట్లు సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. చెన్నై లోకల్ బాయ్ వాషింగ్టన్ సుందర్‌కు ఈ మ్యాచ్‌లో కూడా చోటు దక్కలేదు ఇక ఆస్ట్రేలియా మాత్రం రెండు మార్పులు చేసింది. తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. ఈ మ్యాచ్‌కు జట్టులోకి వచ్చాడు. అదే విధంగా స్పిన్నర్ అగర్‌కు కూడా తుది జట్టు చోటు దక్కింది. తుది జట్లు భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లాబుషేన్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, అష్టన్ అగర్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా -
అతడు లేకపోవడమే టీమిండియాకు ఓటమి.. లేదంటేనా ఆసీస్‌కు చుక్కలే
ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో విజయం సాధించిన టీమిండియా.. విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో వన్డేలో మాత్రం అన్ని విధాల చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ నిర్ధేశించిన 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని.. ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా చేధించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్(51), మిచెల్ మార్ష్(66) అర్ధశతకాలతో విజృంభించి మ్యాచ్‌ను 11 ఓవర్లలోనే ముగించారు. భారత బ్యాటర్ల దారుణ ప్రదర్శన.. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా దారుణ ప్రదర్శన కనబరిచింది. ఆసీస్ పేసర్ల దాటికి టీమిండియా బ్యాటర్లు వరుస క్రమంలో పెవిలియన్‌కు క్యూ కట్టారు. ముఖ్యంగా ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ దెబ్బకు బ్యాటర్లు విలవిల్లాడారు. తొలి ఓవర్లోనే శుబ్‌మన్ గిల్ వికెట్‌ను కోల్పోయిన టీమిండియా.. అనంతరం ఏ దశలోనూ ఆసీస్ బౌలర్లను ఎదుర్కోలేకపోయింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి 31 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయ్యర్ ఉంటే బాగుండేది.. ఇక ఘోర ఓటమిని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా మిడిలార్డర్ శ్రేయస్ అయ్యర్ ఉంటే బాగుండేది అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మిడిలార్డర్లో అయ్యర్ అద్భుతమైన ఆటగాడని, అతడు ఉండి ఉంటే టీమిండియాకు ఈ పరిస్థితి వచ్చేది కాదని వాపోతున్నారు. ఈ క్రమంలో # శ్రేయస్ అయ్యర్ అనే ట్యాగ్‌ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. కాగా ఈ సిరీస్‌కు వెన్ను గాయం కారణంగా అయ్యర్ దూరమైన సంగతి తెలిసిందే. అయితే అయ్యర్ గత కొంత కాలంగా భారత జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా మిడిలార్డర్లో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడి భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ఆసీస్‌తో రెండో వన్డేలో అయ్యర్ లేని లోటు స్పష్టంగా కన్పించింది. చదవండి: IND vs AUS: మా ఓటమికి ప్రధాన కారణమిదే.. అస్సలు ఊహించలేదు! వారిద్దరూ అద్భుతం -
మా ఓటమికి ప్రధాన కారణమిదే.. అస్సలు ఊహించలేదు! వారిద్దరూ అద్భుతం
విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియాకు ఊహించని పరాభవం ఎదురైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సొంతం చేసుకున్న భారత్ జోరుకు ఆసీస్ బ్రేక్‌లు వేసింది. ఆదివారం సాగరతీరం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియాను 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా జట్టు చిత్తు చేసింది. 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ వికెట్ నష్టపోకుండా కేవలం 11 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ 1-1 సమమైంది. సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరి వన్డే చెన్నై వేదికగా మార్చి22న జరగనుంది. ఇకఈ ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. తమ ఓటమికి కారణం బ్యాటింగ్ వైఫల్యమే అని రోహిత్ అంగీకరించాడు. "ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ పరంగా మేము దారుణంగా విఫలమయ్యాం. స్కోర్ బోర్డుపై తగినంత పరుగులు ఉంచలేకపోయాం. ఇటువంటి మంచి వికెట్‌పై కేవలం 117 పరుగులు మాత్రమే చేస్తామని అస్సలు ఊహించలేదు. వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడం మా జట్టును దెబ్బతీసింది. తొలి ఓవర్లో శుభ్‌మన్ వికెట్‌ను కోల్పోయినప్పుడు.. నేను విరాట్ ఇన్నింగ్స్‌ను కాస్త సెట్ చేశాము. మేమిద్దరం త్వరగా 30 నుంచి 35 పరుగులు రాబట్టాము. అయితే తర్వాత వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయాం. అది మమ్మల్ని మరింత వెనుక్కి నెట్టింది. అటువంటి క్లిష్ట పరిస్థితుల నుంచి మేము తిరిగి కోలుకోలేకపోయాం. ఈ రోజు మాకు పూర్తిగా కలిసి రాలేదు. స్టార్క్ అద్భుతమైన బౌలర్. అతడు కొత్త బంతితో అద్భుతాలు సృష్టిస్తాడు. స్టార్క్ కొత్త బంతిని స్వింగ్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. ఇక మార్ష్ ఒక మంచి పవర్ హిట్టర్ అని మనకు తెలుసు. అతడు సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడు ప్రపంచంలోనే పవర్ హిట్టర్లలో టాప్ 3 లేదా నాలుగో స్థానంలో మార్ష్ ఉంటాడు అని" రోహిత్ పేర్కొన్నాడు. చదవండి: IND vs AUS: టీమిండియాపై ఆసీస్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
టీమిండియాపై ఆసీస్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
తొలి వన్డే ఓటమికి ఆస్ట్రేలియా ప్రతీకారం తీర్చుకుంది. విశాఖపట్నం వేదికగా టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో 10 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం 11 ఓవర్లలోనే ఛేదిచింది. ఆసీస్ ఓపెనర్లు మిచెల్ మార్ష్(66), హెడ్(51) పరుగులతో మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. ఇక 11 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించిన ఆస్ట్రేలియా ఓ అరుదైన ఘనత సాధించింది. టీమిండియాపై వన్డేల్లో ఓవర్ల పరంగా అత్యధిక వేగంగా టార్గెట్ ఛేదించిన జట్టుగా ఆసీస్ నిలిచింది. అంతకుముందు 2019లో హామిల్టన్ వేదికగా జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో భారత్‌పై 93 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 14.4 ఓవర్లలో ఛేదించింది. ఇప్పటివరకు ఇదే అత్యంత వేగమైన ఛేజింగ్ కాగా.. తాజా మ్యాచ్‌తో కివీస్ రికార్డును ఆసీస్ బ్రేక్ చేసింది. ఇక ఓవరాల్‌గా ఓవర్ల పరంగా ఆస్ట్రేలియాకు ఇది మూడో అతి పెద్ద విజయం. అంతకుముందు 2004లో యూఏస్ఏపై 66 పరుగుల లక్ష్యాన్ని కేవలం 7.5 ఓవర్లలోనే ఆసీస్ సాధించింది. ఇక సిరీస్ డిసైడ్ చేసే మూడో వన్డే మార్చి 22న చెన్నై వేదికగా జరగనుంది. చదవండి: AUS vs IND: మిచెల్ మార్ష్ విధ్వంసం.. 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో! ఢిల్లీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ -
ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. రోహిత్ దూరం! ఓపెనర్‌గా కిషన్? తుది జట్టు ఇదే
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ గెలిచి మంచి ఊపుమీద ఉన్న టీమిండియా.. ఇప్పుడు అదే జట్టుతో వన్డే సిరీస్‌లో అమీతుమీ తెల్చుకోవడానికి ఉవ్విళ్లూరుతోంది. టెస్టు సిరీస్ ఫలితాన్నే పునరావృతం చేసి వన్డే సిరీస్‌ను కూడా సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తుంటే.. టెస్టు సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆసీస్ వ్యూహాలు రచిస్తోంది. ముంబై వేదికగా శుక్రవారం(మార్చి17) జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే తొలి వన్డేకు టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో హార్దిక్ పాండ్యా జట్టు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించనున్నాడు. తొలి వన్డేకు రోహిత్ దూరం కావడంతో భారత ఇన్నింగ్స్‌ను శుబ్‌మన్ గిల్‌తో కలిసి ఇషాన్ కిషన్ ప్రారంభించడం దాదాపు ఖాయంగా కన్పిస్తోంది. మరోవైపు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఈ మ్యాచ్‌తో వన్డేల్లో పునరాగమనం చేయనున్నాడు. గాయం నుంచి కోలుకున్నాక తొలి వన్డే జడేజా ఆడనున్నాడు. ఇక జడ్డూ జట్టు సెలక్షన్‌కు అందుబాటులోకి రావడంతో మరో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ బెంచ్‌కే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది. అదే విధంగా స్పిన్నర్లు యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ ఇద్దరిలో ఎవరో ఒక్కరికే చోటు దక్కే అవకాశం ఉంది. చాహల్‌ను కాదని కుల్దీప్‌వైపే జట్టు మెనెజెమెంట్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే.. గాయం కారణంగా ఆఖరి రెండు టెస్టులకు దూరమైన స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తిరిగి జట్టుతో చేరాడు. అదే విధంగా ఈ సిరీస్‌కు ఆసీస్ రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ దూరం కావడంతో స్టీవ్ స్మిత్ సారథ్యం వహించనున్నాడు. తుది జట్లు(అంచనా) భారత్: శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుషేన్, మార్కస్ స్టోయినిస్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్వెల్, సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. సచిన్ ప్రపంచ రికార్డుపై కన్నేసిన కోహ్లి -
టీమిండియాతో వన్డే సిరీస్.. ఆస్ట్రేలియాకు మరో బిగ్ షాక్! ఇక అంతే మరి
టీమిండియాతో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌తో పాటు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా వన్డే సిరీస్‌కు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా తన తల్లి ఆనారోగ్యం బారిన పడటటంతో మూడో టెస్టుకు ముందు ఉన్నపళంగా కమ్మిన్స్ స్వదేశానికి వెళ్లిన సంగతి తెలిసిందే. క్యాన్సర్‌తో బాధపడుతున్న తన తల్లి ఆరోగ్యం కుదటపడకపోవడంతో కమ్మిన్స్ అక్కడే ఉండిపోయాడు. దీంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మిగిలిన రెండు టెస్టులకు అతడు దూరమయ్యాడు. అయితే కమ్మిన్స్ మరి కొన్ని రోజులు తల్లి దగ్గరే ఉండాలని నిర్ణయించుకున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో అతడు వన్డే సిరీస్‌తో పాటు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం. ఇక వార్నర్ విషయానికి వస్తే.. ఢిల్లీ వేదికగా భారత్‌తో జరిగిన రెండో టెస్టులో అతడి మోచేయికి గాయమైంది. దీంతో అతడు వెంటనే స్వదేశానికి వెళ్లిపోయాడు. ఇక వార్నర్ తన చేతి గాయం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నాడు. అయితే అతడు పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించడానికి రెండు నుంచి మూడు వారాల సమయం పట్టనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో అతడు కూడా టీమిండియాతో వన్డే సిరీస్ నుంచి తప్పుకునే సూచనలు కన్పిస్తున్నాయి. ఇక ఇప్పటికే గాయం కారణంగా ఆసీస్ స్టార్ పేసర్ జో రిచర్డ్సన్ కూడా భారత్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. మార్చి 17న ముంబై వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఒక వేళ కమ్మిన్స్ వన్డే సిరీస్‌కు దూరమైతే.. ఆసీస్ జట్టు కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ వ్యవహరించనున్నాడు. -
విశాఖలో భారత్-ఆసీస్ రెండో వన్డే.. అభిమానులకు బిగ్ అలర్ట్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసిన అనంతరం ఆస్ట్రేలియా భారత జట్లు మూడు వన్డేల సిరీస్‌లో తలపడనున్నాయి. ఈ సిరీస్‌లో భాగంగా మార్చి 19న విశాఖపట్నం వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లను శనివారం(మార్చి 10) నుంచి విక్రయించనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసొసియేషన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. మార్చి 10 నుంచి ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఏసీఏ సెక్రటరీ ఎస్ గోపినాథరెడ్డి తెలిపారు. అదే విధంగా 13న ఆఫ్‌లైన్‌లో కూడా టికెట్లను విక్రయించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. టికెట్ల ధరలు రూ.600, రూ.1,500, రూ.2000, రూ.3000, రూ.3,500, రూ.6000గా నిర్ణయించామని గోపినాథరెడ్డి వెల్లడించారు. ఇక మార్చి 17న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. రెండో వన్డేకు విశాఖ.. ఆఖరి వన్డేకు చెన్నైలోని చెపాక్ స్టేడియం అతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే ఆసీస్‌తో తొలి వన్డేకు మాత్రం టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉండనున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు సారథిగా హార్దిక్ పాండ్యా వ్యవహరించనున్నాడు. ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు.. రోహిత్ శర్మ (కెప్టెన్), హార్ధిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, వాషింగ్టన్ సుందర్, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చహల్, శార్ధూల్ ఠాకూర్ -
షకీబ్ ఆల్‌రౌండ్ షో.. ఇంగ్లండ్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్
స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో బంగ్లాదేశ్‌కు ఓదార్పు విజయం లభించింది. ఛటోగ్రామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో 50 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. తద్వారా వైట్‌వాష్ నుంచి బంగ్లా తప్పించుకుంది. 247 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 43.1 ఓవర్లలో కేవలం 196 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ 4 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించగా.. తైజుల్ ఇస్లాం, ఎబాడోత్ హుస్సేన్ చెరో రెండు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జేమ్స్ విన్స్(38) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 48.5 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో షకీబ్ అల్హసన్(75), రహీం(70), షాంటో హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా అర్చర్ మూడు వికెట్లు, సామ్ కుర్రాన్, రషీద్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ఇంగ్లండ్.. మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. కాగా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన షకీబ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికవ్వగా.. ఈ సిరీస్ అసాంతం అద్భుతంగా రాణించిన ఇంగ్లండ్ స్పిన్నర్ అదిల్ రషీద్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు వరించింది. చదవండి: SA vs WI: దక్షిణాఫ్రికా కొత్త కెప్టెన్‌గా స్టార్ క్రికెటర్.. బవుమాపై వేటు! -
ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం.. సిరీస్ సొంతం
బ్లూమ్‌ఫోంటైన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో ప్రొటీస్ సొంతం చేసుకుంది. 343 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 49.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ప్రోటీస్ విజయంలో ఆ జట్టు కెప్టెన్ టెంబా బావుమా కీలక పాత్ర పోషించాడు. 102 బంతులు ఎదుర్కొన్న బావుమా 14 ఫోర్లు, 1 సిక్స్‌తో 109 పరుగులు చేశాడు. అదే విధంగా డెవిడ్ మిల్లర్ కూడా 58 పరుగులతో ఆజేయం నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ స్టోన్, రషీద్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. సామ్ కుర్రాన్ ఒక్క వికెట్ సాధించాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 342 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్(80), జోస్ బట్లర్(94 నాటౌట్), మొయిన్ అలీ(51) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ప్రోటిస్ బౌలర్లలో నోర్జే రెండు వికెట్లు సాధించగా.. పార్నెల్, ఎంగిడీ, మార్క్రమ్, జానెసన్ తలా వికెట్ పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో వన్డే కింబర్లీ వేదికగా ఫిబ్రవరి 1న జరగనుంది. చదవండి: Gongadi Trisha: శెభాష్ బిడ్డా! మ్యాచ్‌ను మలుపు తిప్పిన త్రిష.. భద్రాచలంలో సంబరాలు -
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన! స్టార్ బ్యాటర్ వచ్చేశాడు
ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్ కోసం 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటించింది. ఈ జట్టుకు టెంబా బావుమా సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా ఆల్‌రౌండర్లు మార్కో జాన్సెన్, సిసంద మగలకు వన్డే జట్టులో చోటు దక్కింది. ఇక గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న ప్రోటీస్ స్టార్ బ్యాటర్ వాన్ డెర్ డస్సెన్ ఈ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు. ఇక ఈ సిరీస్‌కు ఎంపికైన ప్రోటీస్ సీనియర్ ఆటగాళ్లు క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, జన్నెమాన్ మలన్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్ ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా ఉన్నారు. అయితే సిరీస్ సమయానికి వీరంతా జట్టుతో కలవనున్నారు. ఇక జనవరి 27న బ్లోమ్‌ఫోంటెయిన్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ఆరంభం కానుంది. కాగా భారత్ వేదికగా ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించాలంటే ఈ సిరీస్ ప్రోటీస్‌కు చాలా కీలకం. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ప్రోటీస్ జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, సిసంద మగలా, కేశవ్ మహరాజ్, జన్నెమాన్ మలన్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నోర్జే, వేన్ పార్నెల్, షమ్సీ, వాన్ డెర్ డస్సెన్ చదవండి: IND vs NZ: నేను అనుకున్నది జరగలేదు.. అతడు మాత్రం భయపెట్టాడు: రోహిత్ శర్మ -
ఇదేం ఆనందం.. బంతిని ఫొటో తీసిన ఫ్యాన్! కోహ్లి రియాక్షన్ వైరల్
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో 317 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. అదేవిధంగా వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లి, శుబ్మాన్ గిల్ అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు. కోహ్లి 110 బంతుల్లో 166 నాటౌట్ (13 ఫోర్లు, 8 సిక్స్‌లు), గిల్ 97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 116 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌తో పాటు సిరీస్ అసాంతం రాణించిన కోహ్లికే ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు దక్కింది. బంతికి ఫోటో తీసిన ఫ్యాన్ కాగా ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ సందర్భంగా ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. భారత ఇన్నింగ్స్‌లో 45 ఓవర్ వేసిన కరుణరత్నే బౌలింగ్‌లో తొలి బంతిని కోహ్లి లాంగ్ ఆన్ దిశగా స్టాండ్స్‌కు తరిలించాడు. ఈ క్రమంలో స్టాండ్స్‌లో ఉన్న అభిమాని బంతిని అందుకున్నాడు. అయితే ఆ ఫ్యాన్ బంతిని తిరిగివ్వకుండా ఫోటో తీసుకుంటూ ఉండి పోయాడు. దీంతో తరువాతి బంతిని ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్న కోహ్లి.. అభిమాని చర్యను చూసి నవ్వుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికి అతడు బంతిని తిరిగి అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IND vs SL: ధోనిని గుర్తు చేసిన కోహ్లి.. హెలికాప్టర్ షాట్‌తో భారీ సిక్స్! వీడియో వైరల్ pic.twitter.com/Vn6k6xPwFT — MINI BUS 2022 (@minibus2022) January 15, 2023 pic.twitter.com/PeolYUFd4T — IPLT20 Fan (@FanIplt20) January 15, 2023 -
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. పాక్ జట్టు ప్రకటన! స్టార్ పేసర్ వచ్చేశాడు
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. ఈ జట్టుకు బాబర్ ఆజం సారథ్యం వహించనున్నాడు. ఇక గాయం కారణంగా న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరమైన పాక్ స్టార్ పేసర్ హరీస్ రౌఫ్ తిరిగి వన్డే జట్టకు ఎంపికయ్యాడు. అదే విధంగా పాక్ మిడిలార్డర్ బ్యాటర్ షాన్ మసూద్, వెటరన్ ఆటగాడు హరీస్ సోహైల్ ఛాన్నాళ్ల తర్వాత తిరిగి వన్డే జట్టులోకి వచ్చారు. మరో వైపు పాకిస్తాన్ వన్డే కప్‌లో అదరగొట్టన టయ్యాబ్ తాహిర్, స్పిన్నర్ ఉస్మా మీర్‌కు తొలి సారి పాక్ జట్టులో చోటు దక్కింది. కాగా జనవరి 9న కరాచీ వేదికగా ఇరు జట్ల మధ్య జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు పాకిస్తాన్ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, హరీస్ సోహైల్, ఇమామ్-ఉల్-హక్, కమ్రాన్ గులామ్, మహ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్, నసీమ్ అలీ అఘా, షానవాజ్ దహానీ, షాన్ మసూద్, తయ్యబ్ తాహిర్, ఉసామా మీర్ -
బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్.. రిషబ్ పంత్ దూరం! బీసీసీఐ కావాలనే తప్పించిందా?
బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ దూరమయ్యాడు. అతడిని వన్డే జట్టును నుంచి విడుదల చేస్తున్నట్లు తొలి వన్డేకు ముందు బీసీసీఐ ప్రకటన చేసింది. "బీసీసీఐ మెడికల్ టీమ్‌తో సంప్రదింపులు జరిపిన తర్వాతే జట్టు నుంచి విడుదల చేశాం. అతడు తిరిగి టెస్టు సిరీస్‌కు భారత జట్టులో చేరుతాడు. అయితే వన్డే సిరీస్‌కు పంత్ ప్రత్యామ్నాయంగా ఎవరినీ ఎంపికచేయలేదు. అదే విధంగా మొదటి వన్డే సెలక్షన్‌కు అక్షర్ పటేల్ అందుబాటులో లేడు" అంటూ బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. పంత్ కు ఏమైందో మాత్రం బీసీసీఐ చెప్పలేదు. ఇక పంత్ దూరం కావడంతో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ బాధ్యతలు చేపట్టాడు. కాగా గత కొంత కాలంగా పంత్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌పై విన్నింగ్ సెంచరీ చేసిన పంత్.. అనంతరం ఒక్క మ్యాచ్‌లో కూడా రాణించలేకపోయాడు. న్యూజిలాండ్‌తో జరిగిన అఖరి వన్డేలో పంత్ వెన్ను నొప్పితో బాధ పడ్డాడు. ఈ క్రమంలోనే పంత్‌ను జట్టు నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. అయితే నెటిజన్లు మాత్రం కావాలనే పంత్‌ను బీసీసీఐ తప్పించింది అంటూ ట్విటర్లో పోస్టులు చేస్తున్నారు. 🚨 UPDATE In consultation with the BCCI Medical Team, Rishabh Pant has been released from the ODI squad. He will join the team ahead of the Test series. No replacement has been sought Axar Patel was not available for selection for the first ODI.#TeamIndia | #BANvIND — BCCI (@BCCI) December 4, 2022 చదవండి: BAN vs IND: 'ప్రపంచకప్‌కు ఇంకా చాలా సమయం ఉంది.. ఇప్పడు మా దృష్టి అంతా దాని పైనే' -
బంగ్లాదేశ్‌తో తొలి వన్డే.. పంత్‌కు నో ఛాన్స్.. అతడి అరంగేట్రం!
న్యూజిలాండ్ పర్యటన ముగిసిన వెంటనే బంగ్లాదేశ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. బంగ్లా పర్యటనలో భాగంగా భారత జట్టు మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఇప్పటికే బంగ్లా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా.. ప్రాక్టీస్ సెషన్స్‌లో బిజీబిజీగా గడుపుతోంది. ఇక మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే డిసెంబర్ 4న ఢాకా వేదికగా జరగనుంది. కాగా న్యూజిలాండ్ పర్యటనకు దూరమైన టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చారు. మరోవైపు ఈ సిరీస్‌కు టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్థానంలో యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఇక తొలి వన్డేలో భారత తరపున రజిత్ పాటిదర్ అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అదే విధంగా వరుసగా విఫలమవుతున్న పంత్ స్థానంలో పాటిదర్ అవకాశం ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. వికెట్ కీపర్ బాధ్యతలు భారత వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. రోహిత్ శర్మ, ధావన్ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నారు. ఇక ఫస్ట్ డౌన్లో విరాట్ కోహ్లి, సెకెండ్ డౌన్లో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌కు వచ్చే ఛాన్స్ ఉంది. బౌలింగ్ విషయానికి వస్తే ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేస్ బౌలర్లతో భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. షమీ స్థానంలో జట్టులోకి వచ్చిన ఉమ్రాన్ మాలిక్‌కు తుది జట్టులో ఛాన్స్ ఉంది. భారత తుది జట్టు (అంచనా) శిఖర్ ధావన్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రజిత్ పాటిదర్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్ చదవండి: IND vs BAN: దీపక్ చాహర్‌కు చేదు అనుభవం.. కనీసం ఫుడ్ కూడా లేదంటూ మండిపాటు -
భారత్‌తో వన్డే సిరీస్.. బంగ్లాదేశ్ జట్టు ప్రకటన! స్టార్ ఆల్‌రౌండర్ వచ్చేశాడు
స్వదేశంలో భారత్‌తో వన్డే సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు వెటరన్ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా యువ పేసర్ షోరిఫుల్ ఇస్లాంతో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మొసద్దెక్ హొస్సేన్‌పై సెలక్టర్లు వేటు వేశారు. గత మరోవైపు జింబాబ్వేతో వైట్ బాల్ సిరీస్‌కు దూరమైన షకీబ్ ఆల్ హసన్ తిరిగి భారత్ సిరీస్‌తో జట్టులోకి వచ్చాడు. ఇక హోం సిరీస్‌లో భాగంగా బంగ్లా జట్టు టీమిండియా మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. డిసెంబర్ 4న ఢాకా వేదికగా జరగనున్న తొలి వన్డేతో భారత పర్యటన ప్రారంభం కానుంది. భారత్‌తో వన్డేలకు బంగ్లా జట్టు: తమీమ్ ఇక్బాల్ (కెప్టెన్), లిట్టన్ కుమార్ దాస్, అనముల్ హక్ బిజోయ్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొస్సేన్, యాసిర్ అలీ చౌదరి, మెహిదీ హసన్ మిరాజ్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్, హసన్ మహ్మద్, ఎబాడోత్ హుస్సేన్, నసుమ్ అహ్మద్,జ్ముల్ హుస్సేన్ శాంటో,మహ్మదుల్లా,నూరుల్ హసన్ సోహన్ చదవండి: IND vs NZ 1st ODI:తొలుత బ్యాటింగ్ చేయనున్న భారత్.. యువ బౌలర్లు ఎంట్రీ! సంజూకి ఛాన్స్ -
బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్.. టీమిండియాకు భారీ షాక్! స్టార్ ఆటగాడు దూరం
బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జట్టు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బంగ్లాతో వన్డే సిరీస్‌తో పాటు టెస్టులకు కూడా దూరమయ్యాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో మోకాలి గాయం బారిన పడిన జడేజా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ క్రమంలోనే బంగ్లాతో వన్డే సిరీస్‌కు జడ్డూ దూరమైనట్లు బీసీసీఐ వెల్లడించింది. అదే విధంగా టెస్టులకు కూడా జడేజా దూరమయ్యే అవకాశం ఉంది. దీంతో అతడి స్థానంలో వన్డేలకు ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్‌ను బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ భర్తీ చేసింది. ఇక యువ పేసర్ యాష్ దయాల్ కూడా వెన్ను నొప్పి కారణంగా బంగ్లాతో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో మరో యువ పేసర్ కుల్దీప్ సేన్ ఎంపికయ్యాడు. మరోవైపు బంగ్లాదేశ్‌తో నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లకు 13 మంది సభ్యలతో కూడిన భారత్-ఏ జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు అభిమన్యు ఈశ్వరన్ సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా భారత వెటరన్ ఆటగాళ్లు ఛెతేశ్వర్ పుజారా, ఉమేష్ యాదవ్ కూడా ఈ జట్టులో చోటు దక్కించకున్నారు. నవంబర్ 29న ఇరుజట్ల మధ్య తొలి నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇక డిసెంబర్ 4న జరగనున్న తొలి వన్డేతో భారత పర్యటన ప్రారంభం కానుంది. బంగ్లాదేశ్ వన్డేలకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్ , వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మొహమ్మద్. సిరాజ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్. తొలి నాలుగు రోజుల మ్యాచ్‌కు భారత-ఏ జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), రోహన్ కున్నుమ్మల్, యశస్వి జైస్వాల్, యశ్ ధుల్, సర్ఫరాజ్ ఖాన్, తిలక్ వర్మ, ఉపేంద్ర యాదవ్ (వికెట్ కీపర్), సౌరభ్ కుమార్, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, అతిత్ షెత్ రెండో నాలుగు రోజుల మ్యాచ్‌కు భారత-ఏ జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), రోహన్ కున్నుమ్మల్, యశస్వి జైస్వాల్, యష్ ధుల్, సర్ఫరాజ్ ఖాన్, ఉపేంద్ర యాదవ్ (వికెట్ కీపర్), సౌరభ్ కుమార్, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, అతిత్ శేథ్, ఛెతేశ్వర్ పుజారా, ఉమేష్ యాదవ్, కేఎస్ భరత్ చదవండి: IPL 2023 Mini Auction: సన్‌రైజర్స్‌లోకి బెన్ స్టోక్స్.. కెప్టెన్ కూడా అతడే..? -
ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా.. సిరీస్ సొంతం
సిడ్నీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో 72 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0తో కైవసం చేసుకుంది. 280 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 38.5 ఓవర్లలో 208 పరుగులకు కుప్పకూలింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచిల్ స్టార్క్, జంపా నాలుగు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను దెబ్బ తీయగా.. హాజిల్ వుడ్ రెండు వికెట్లు సాధించాడు. ఇక ఇంగ్లండ్ బ్యాటర్లలో విన్స్(60), బట్లర్(71) మినహా మిగితా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. కాగా తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 280 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో సీనియర్ ఆటగాడు స్టీవ్ స్మిత్ 94 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు లాబుషేన్(58), మార్ష్(50) అర్ధసెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో అదిల్ రషీద్ మూడు, విల్లీ, వోక్స్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక నామమాత్రపు మూడో వన్డే నవంబర్ 22న మెల్బోర్న్ వేదికగా జరగనుంది. చదవండి: న్యూజిలాండ్‌తో రెండో టీ20.. మళ్లీ అదే బ్యాడ్ న్యూస్..! -
8 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాతో మ్యాచ్.. జట్టును ప్రకటించిన జింబాబ్వే!
ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌కు జింబాబ్వే తమ జట్టును మంగళవారం ప్రకటించింది. స్వదేశంలో బంగ్లాదేశ్, భారత్‌తో జరిగిన సిరీస్‌లకు దూరమైన జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజారబానీ తిరిగి జట్టులోకి వచ్చాడు. కాగా 18 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు జింబాబ్వే వెళ్లనుంది. చివరగా 2003-2004లో ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లింది. అదే విధంగా ఇరు జట్లు ముఖాముఖి తలపడి కూడా దాదాపు 8 ఏళ్ల కావస్తోంది. చివగా 2014లో ఆసీస్-దక్షిణాఫ్రికా జట్లతో ట్రై సిరీస్‌లో జింబాబ్వే తలపడింది. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జింబాబ్వే మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. కాగా ఈ సిరీస్ 2020 ఆగస్టులో జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా రేండేళ్ల పాటు వాయిదా పడింది. టౌన్‌విల్లే వేదికగా ఆగస్టు 28న జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ వన్డే సూపర్ లీగ్‌లో భాగంగానే జరగనుంది. ఇక ఇప్పటికే ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా కూడా తమ జట్టును ప్రకటించింది. జింబాబ్వే జట్టు: రెగిస్ చకబ్వా (కెప్టెన్,), ర్యాన్ బర్ల్, బ్రాడ్ ఎవాన్స్, ల్యూక్ జోంగ్వే, ఇన్నోసెంట్ కైయా, కైటానో, క్లైవ్ మదాండే, వెస్లీ మాధవెరె, తాడివానాషే మారుమాని, టోనీ మున్యోంగా, బ్లెస్సింగ్ ముజారబానీ, రిచర్డ్ నగరవ, విక్టర్ న్యౌచి సికందర్ రజా, సీన్ విలియమ్స్ ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, మార్నస్ లాబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జాంపా చదవండి: IND vs PAK: 'రోహిత్, రాహుల్, కోహ్లి కాదు.. పాకిస్తాన్‌కు చుక్కలు చూపించేది అతడే' -
జింబాబ్వేను చిత్తు చేసిన భారత్.. సిరీస్ సొంతం
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. 162 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 25.4 ఓవర్లలోనే చేధించింది. భారత బ్యాటర్లలో వికెట్ కీపర్ సంజూ శాంసన్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. శిఖర్ ధావన్(33),గిల్(33) పరుగులతో రాణించారు. కాగా స్టాండింగ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రం కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి నిరాశ పరిచాడు. ఇక జింబాబ్వే బౌలర్లలో జాంగ్వే రెండు వికెట్లు పడగొట్టగా.. చివంగా, రజా, న్యాచీ తలా వికెట్ తీశారు. 161 పరుగులకే కుప్పకూలిన జింబాబ్వే ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే భారత బౌలర్లు చేలరేగడంతో 38.1 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో షాన్ విలియమ్స్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక భారత బౌలర్లలో శార్థూల్ ఠాకూర్ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, కుల్ధీప్ యాదవ్, హుడా,ప్రసిద్ధ్ కృష్ణ తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్లు మధ్య అఖరి వన్డే ఆగస్టు 22న హరారే వేదికగా జరగనుంది. చదవండి: IND vs ZIM: టీమిండియాపై జింబాబ్వే అత్యంత చెత్త రికార్డు.. -
వెస్టిండీస్‌తో రెండో వన్డే.. ప్రపంచ రికార్డుకు చేరువలో భారత్..!
వెస్టిండీస్‌తో తొలి వన్డేలో విజయం సాధించిన భారత్‌కు మరో పోరుకు సిద్దమైంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా ఆదివారం జరగనున్న రెండో వన్డేలో భారత్, విండీస్ తలపడనున్నాయి. కాగా ఈ మ్యాచ్‌కు ముందు ఓ అరుదైన రికార్డు భారత్‌ను ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే.. 2-0తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. తద్వారా ఒకే జట్టుపై వరుసగా అత్యధిక ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయాలు సాధించిన జట్టుగా భారత్ నిలుస్తోంది. కాగా ఇప్పటి వరకు విండీస్‌పై వరుసగా 11 వన్డే సిరీస్‌ల్లో భారత్ విజయం సాధించింది. మరో వైపు పాకిస్తాన్ కూడా జింబాబ్వేపై వరుసగా 11 వన్డే సిరీస్‌ల్లో విజయం సాధించి భారత్‌తో సమంగా ఉంది. ఈ సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంటే 12 విజయాలతో పాక్‌ను అధిగమిస్తోంది. భారత తుది జట్టు (అంచనా).. శిఖర్ ధవన్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్ విండీస్ తుది జట్టు(అంచనా) నికోలస్ పూరన్ (కెప్టెన్), షాయ్ హోప్ (వైస్ కెప్టెన్), షమర్ బ్రూక్స్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, రోవ్‌మన్ పావెల్, జేడెన్ సీల్స్,రొమారియో షెపర్డ్ చదవండి: Team India Predicted XI: రెండో వన్డేకు టీమిండియా ఇదే..! -
వెస్టిండీస్‌పై పాకిస్తాన్ ఘన విజయం.. సిరీస్ కైవసం..
ఐసీసీ వరల్డ్‌కప్ సూపర్ లీగ్‌లో భాగంగా ముల్తాన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ 120 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో పాకిస్తాన్ కైవసం చేసుకుంది. పాక్ విజయంలో ఇమామ్-ఉల్-హక్, బాబర్ అజాం,మహ్మద్ నవాజ్ కీలక పాత్ర పోషించారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో ఇమామ్-ఉల్-హక్(72),బాబర్ అజాం(77) పరుగులతో రాణించారు. విండీస్ బౌలర్లలో అకేల్ హోసేన్ మూడు, ఫిలిప్, జోషఫ్ చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక 276 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 155 పరుగులకే కుప్పకూలింది. విండీస్ ఇన్నింగ్స్‌లో షమర్ బ్రూక్స్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. పాక్ బౌలర్లలో మహ్మద్ నవాజ్ నాలుగు వికెట్లు పడగొట్టి విండీస్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు మహ్మద్ వసీం మూడు, షదాబ్ ఖాన్ రెండు, షాహిన్ ఆఫ్రిది ఒక్క వికెట్ సాధించారు. ఇక ఈ సిరీస్‌లో అఖరి వన్డే ఆదివారం జరగనుంది. చదవండి: T20 WC 2022: 'అతడు టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు బెస్ట్ ఫినిషర్ అవుతాడు' One jaffa after another! 🌟 Superstar @mnawaz94 registers his career-best figures of 𝟭𝟬-𝟬-𝟭𝟵-𝟰 🙌#PAKvWI | #KhelAbhiBaqiHai pic.twitter.com/jf8Eg05fwO — Pakistan Cricket (@TheRealPCB) June 10, 2022 -
టీమిండియాకు మరో షాక్.. వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండనని చెప్పిన కోహ్లి!
Virat Kohli set to Miss a ODI series: దక్షిణాఫ్రికాతో త్వరలో జరగనున్న వన్డే సిరీస్‌కు టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి దూరం కానున్నట్లు తెలుస్తోంది. కాగా దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లిని తప్పించి రోహిత్ శర్మకు బీసీసీఐ బాధ్యతలు అప్పజెప్పిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్సీ బాధ్యతలు నుంచి తప్పుకున్న కోహ్లి.. వన్డే, టెస్ట్‌లకు సారధి కొనసాగుతానని తెలిపాడు. ఈ క్రమంలో అనూహ్యంగా బీసీసీఐ తీసుకున్న నిర్ణయం విరాట్‌ను తీవ్ర నిరాశకు గురిచేసినట్లు తెలుస్తోంది. దీంతో సాఫారీ గడ్డపై జరిగే వన్డే సిరీస్‌కు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరో వైపు జనవరిలో తన కుమార్తె వామిక బర్త్‌డే ఉండడంతో.. కోహ్లి తన కుటుంబంతో కలిసి హాలిడే ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. కాగా టెస్ట్ సిరీస్ అనంతరం జనవరి 19 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది. అదే సమయంలో తన గారాల పట్టి వామిక తొలి పుట్టిన రోజు ఉండడంతో కోహ్లి సిరీస్ నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. అంతేగాక ఈ విషయం గురించి బీసీసీఐకి సమాచారం ఇచ్చాడని.. వన్డే సిరీస్‌కు తాను అందుబాటులో ఉండనని చెప్పినట్లు సమాచారం. ఓ నెటిజన్ స్పందిస్తూ.."ఇది నిజంగా వినడానికి చాలా షాకింగ్‌గా ఉంది. టెస్ట్ సిరీస్‌కు రోహిత్ దూరం కాగా, ఇప్పుడు విరాట్ కూడా వన్డే సిరీస్‌కు దూరం కానున్నాడు. విరాట్ తన కుటుంబంతో కలిసి హాలిడే ప్లాన్ చేసుకున్నాడు. జనవరిలో తన కుమార్తె వామికా మెదటి బర్త్‌డే ఉంది. అందుకే కోహ్లి వన్డేలకు దూరం ఉండాలని భావిస్తున్నాడు"అని ట్విటర్లో పేర్కొన్నాడు. కాగా గాయం కారణంగా రోహిత్ శర్మ దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. చదవండి: Trolls On Rohit Sharma: వైస్ కెప్టెన్ కాదు.. ముందు ఫిట్‌గా ఉండు.. కోహ్లితో పెట్టుకున్నావు.. ఇదో గుణపాఠం! అయినా ఆ స్కోర్లేంటి బాబూ! -
దక్షిణాఫ్రికాపై ఘన విజయం.. వన్డే సిరీస్ శ్రీలంకదే
కొలంబో: సిరీస్ విజేతను తేల్చే మూడో వన్డేలో సమష్టి ప్రదర్శన కనబర్చిన శ్రీలంక... దక్షిణాఫ్రికాపై 78 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. తొలుత శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 203 పరుగులు చేసింది. అసలంక (47; 2 ఫోర్లు), దుష్మంత చమీర (29; 3 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. కేశవ్ మహరాజ్ మూడు వికెట్లు తీశాడు. ఛేదనలో దక్షిణాఫ్రికా 30 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. వన్డేల్లో అరంగేట్రం చేసిన ఆఫ్ స్పిన్నర్ మహీశ్ తీక్షణ (4/37)తో దక్షిణాఫ్రికాను పడగొట్టాడు. అతడికి చమీర (2/16), హసరంగ (2/32) సహకరించారు. చమీర ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... అసలంకకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. చదవండి: శిఖర్ ధావన్ విడాకులు -
ముద్దులు తర్వాత, ముందు వికెట్లెలా తీయాలో ఆలోచించు..
Shoaib Akhtar On Afridi: ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న పాకిస్థాన్ జట్టుకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి రెండు వన్డేల్లో ఘోర పరాజయాలను మూటగట్టుకున్న పాక్, ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయింది. ఈ నేపథ్యంలో పాక్ వైఫల్యాలపై ఆ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా పాక్ పేస్ విభాగానికి నాయకత్వం వహిస్తున్న షాహిన్ అఫ్రిదిపై ఆయన నిప్పులు చెరిగారు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి రెండు వన్డేల్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టిన షాహిన్.. వికెట్లు తీయడం కంటే ఫ్లైయింగ్ కిస్లకే ఎక్కువ సమయం కేటాయించాడని చురకలంటించాడు. ముద్దులు, కౌగిలింతలు పక్కకు పెట్టి, ముందు వికెట్లు ఎలా తీయాలో ఆలోచించాలని ఘాటుగా మందలించాడు. ఒక్క వికెట్ పడగొట్టగానే ఫ్లైయింగ్ కిస్‌లు పెట్టడంలో అర్ధం లేదని, ఐదు వికెట్ల ప్రదర్శన తర్వాత ఇలా చేస్తే బాగుంటుందని పంచ్‌ల వర్షం కురిపించాడు. సిరీస్‌కు ముందు సరిపడా సమయం లేదని సాకులు చెప్పి తప్పించుకోవడం సరికాదని హితవు పలికాడు. మ్యాచ్‌కు కేవలం రెండున్నర రోజులు ముందే ఇంగ్లండ్ జట్టు అక్కడికి వచ్చింది. వారు కలిసి జట్టుగా ఆడగలిగినప్పుడు మీకేమైందని నిలదీశాడు. ఇంగ్లండ్ అకాడమీ టీంతో ఓడిపోవడానికి సిగ్గు లేదా అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. ఈ సందర్భంగా ఆయన పాక్ బ్యాటింగ్ లైనప్‌పై కూడా ధ్వజమెత్తాడు. బంతికి ఒక పరుగు చేయాల్సిన స్థితిలోనూ అంత కష్టపడడం ఏంటని ప్రశ్నించాడు. ఇది పాక్ జట్టు అత్యంత పేలవ ప్రదర్శన అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలానే ఆడితే భవిష్యత్తులో పాక్ క్రికెట్ మ్యాచ్‌లు చూసేందుకు అభిమానులుండరన్నాడు. పాక్ పేలవ ప్రదర్శన ఇలానే కొనసాగితే బాబర్ ఆజం సారథ్యంలోని పాక్ జట్టు 3-0తో ఇంగ్లండ్ చేతిలో ఓడడం ఖాయమని జోస్యం చెప్పాడు. ఇదిలా ఉంటే, పాక్ జట్టు తొలి వన్డేలో 9 వికెట్ల తేడాతో, రెండో వన్డేలో 52 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే రేపు బర్మింగ్‌హామ్‌లో జరుగనుంది. -
కరోనా పరీక్షల్లో లంక జట్టంతా పాస్.. రేపటి నుంచి బయోబుడగలోకి
కొలొంబో: లంక బృందంలో వరుసగా కరోనా కేసులు బయటపడుతున్న నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డు ఆటగాళ్లందరికీ మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించింది. ఇందులో ఆటగాళ్లందరికీ నెగిటివ్ రిపోర్టు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భారత్‌తో సిరీస్ నిమిత్తం వీరంతా సోమవారం నుంచి బయోబుడగలోకి వెళ్తారు. మరోవైపు భారత్‌తో జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్‌లను లంక క్రికెట్ బోర్డు రీ షెడ్యూల్ చేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13 నుంచి వన్డే సిరీస్ ప్రారంభంకావాల్సి ఉండింది. అయితే కరోనా దెబ్బకు ఈ సిరీస్ 5 రోజులు ఆలస్యంగా ప్రారంభంకానుంది. ఈ నెల 18 నుంచి నుంచి వన్డే సిరీస్ ప్రారంభమవుతుందని బీసీసీఐ సెక్రటరీ జై షా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ పర్యటన ముగించుకొని స్వదేశానికి చేరుకున్న శ్రీలంక జట్టులో బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్‌తో పాటు డేటా అనలిస్టు నీరోషన్, జట్టు సభ్యుడు, క్రికెటర్ సందున్ వీరక్కోడిలకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో వీరంతా వైద్యుల పర్యవేక్షణలో ఐసోలేషన్‌లో ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ముగ్గురిలో ఎలాంటి లక్షణాలు లేవని లంక యాజమాన్యం ప్రకటించింది. మొత్తంగా లంక ఆటగాళ్లకు కరోనా పరీక్షల్లో నెగిటివ్ రిపోర్టు రావడంతో సిరీస్ సజావుగా సాగే అవకాశాలున్నాయి. ఇరు జట్లు కఠిన నిబంధనలు పాటించి, కొత్త కేసులు రాకుండా జాగ్రత్త పడితే, మరో వారం రోజుల్లో అభిమానులు రసవత్తరమైన సిరీస్‌ను ఆస్వాధించే ఆస్కారం ఉంది. -
హార్ధిక్ తన బ్యాటింగ్ సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసుకున్నాడు..
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో జరిగిన ఆఖరి వన్డేలో అద్భుతమైన అర్ధశతకం(44 బంతుల్లో 64) సాధించి, ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచడంలో కీలకపాత్ర పోషించిన టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాపై మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవల కాలంలో హార్ధిక్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌లా బ్యాటింగ్ చేస్తున్నాడని, అతన్ని బ్యాటింగ్ ఆర్ఢర్లో ప్రమోట్ చేస్తే సెంచరీలు సాధించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. హార్ధిక్ బంతిని అద్భుతంగా మిడిల్ చేస్తున్నాడని, దాంతో పాటు ప్రొఫెషనల్ క్రికెటింగ్ షాట్లు ఆడుతున్నాడని ఆయన కితాబునిచ్చాడు. హార్ధిక్ తన బ్యాటింగ్ సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసుకున్నాడని ఆయన చమత్కరించాడు. 27 ఏళ్ల హార్ధిక్ వన్డేల్లో 7 అర్ధసెంచరీలు సాధించినప్పటికీ, కెరీర్లో సెంచరీ మైలురాయి మాత్రం అతన్ని ఊరిస్తూనే ఉంది. వన్డే కెరీర్లో అతని అత్యుత్తమ స్కోర్ 90 పరుగులుగా ఉంది. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా.. హార్ధిక్ సెంచరీ సాధించడంపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. కాగా, ఆదివారం పూణే వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించి, మూడు వన్డేల సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 329 పరుగలకు ఆలౌట్ కాగా, ఛేదనలో తడబడ్డ ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 322 పరుగులు సాధించి మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఇంగ్లండ్ నవయువ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్(83 బంతుల్లో 95; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుత పోరాట పటిమ కనబర్చాడు. చదవండి: ఆ సిరీస్‌లో పాల్గొన్న మరో క్రికెటర్‌కు కరోనా.. -
ఆ సమయంలో నట్టూ గుండె ఎంత వేగంగా కొట్టుకుందో..
న్యూఢిల్లీ: చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మూడో వన్డేలో భారత్ ఇంగ్లండ్‌పై గ్రాండ్ విక్టరీ సాధించి, 2-1తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. టీమిండియా సాధించిన ఈ విజయానికి రిషబ్ పంత్ అద్భుత బ్యాటింగ్, శార్దూల్ ఠాకూర్ (4/67) బౌలింగ్ గణాంకాలే కారణమని అందరూ మెచ్చుకుంటున్నారు. ఆఖరి వరకు ఒంటరి పోరాటం చేసి, భారత్ శిబిరంలో ఆందోళన రేపిన ఇంగ్లండ్ నవయువ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్‌ను సైతం అందరూ కొనియాడుతున్నారు. అయితే, చివరి ఓవర్ అద్భుతంగా బౌల్ చేసిన టీమిండియా పేసర్ నటరాజన్‌ను మాత్రం ఎవ్వరూ గుర్తించడంలేదని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. 6 బంతుల్లో 14 పరుగులు సాధించాల్సిన తరుణంలో అద్భుతమైన యార్కర్లను సంధించిన నట్టూపై ఆయన ప్రశంసల వర్షం కురిపించాడు. ఒత్తిడిలోనూ నటరాజన్ తన యార్కర్లతో మాయ చేశాడని, ఆఖరి ఓవర్ బౌల్ చేసే సమయంలో అతని గుండె ఎంత వేగంగా కొట్టుకుందో ఊహించడం కష్టమేనని పేర్కొన్నాడు. ఆఖరి ఓవర్లలో తక్కువ ఎత్తులో యార్కర్లు సంధించడం అద్భుతమైన కళ అని, అది నట్టూకు బాగానే ఉందని కొనియాడాడు. సరైన బంతులు విసిరి మ్యాచ్‌ను గెలిపించిన నటరాజన్‌ను ఎంత అభినందించినా తక్కువేనని వెల్లడించాడు. స్లాగ్ ఓవర్లలో యార్కర్లు వేయడంలో ఏమాత్రం పొరపాటు జరిగినా బంతిని స్టాండ్స్‌లో వెతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వివరించాడు. తీవ్ర ఒత్తిడిలో అద్భుతమైన యార్కర్లు సంధించగల ఆటగాళ్లలో లసిత్ మలింగ, బ్రెట్‌లీలు ముందువరుసలో ఉంటారని పేర్కొన్నాడు. చదవండి: ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన శ్రీలంక ఆల్‌రౌండర్ -
సామ్ కర్రన్ ఖాతాలో అరుదైన ప్రపంచ రికార్డు
పూణే: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మూడో వన్డేలో సంచలన ప్రదర్శనతో అందరి మనసులను దోచుకున్న ఇంగ్లండ్ నవయువ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ (83 బంతుల్లో 95 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అరుదైన ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. వన్డేల్లో 8 లేదా ఆ తర్వాత స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగి.. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సామ్ కర్రన్ అగ్రస్థానంలో నిలిచాడు. 2016లో ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి శ్రీలంకపై అజేయమైన 95 పరుగులు చేసినప్పటికీ... సామ్ కర్రన్ తక్కువ బంతుల్లో అదే స్కోర్ చేయడంతో ఈ రికార్డ్ అతని ఖాతాలో చేరింది. విండీస్ విధ్వంసకర యోధుడు ఆండ్రీ రసెల్ 2011లో భారత్‌పై అజేయమైన 92 పరుగులు(9వ స్థానంలో) చేయగా, వెస్టిండీస్‌పై ఆసీస్ ఆటగాడు నాథన్ కౌల్టర్ నైల్ 92 పరుగులు(8వ స్థానంలో) చేశాడు. కాగా, తాజాగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో సామ్ కర్రన్ 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అజేయమైన 95 పరుగులు సాధించాడు. సామ్ కర్రన్ అద్భుత పోరాటం వృధా కావడంతో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. ధవన్ (67), పంత్ (62 బంతుల్లో 78; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్దిక్ (44 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ శతకాలతో చెలరేగారు. ప్రత్యర్థి బౌలర్లలో మార్క్ వుడ్ (3/34), రషీద్ (2/81) రాణించారు. అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 322 పరుగులు చేసింది. సామ్ కర్రన్, డేవిడ్ మలాన్ (50) అర్ధశతకాలు సాధించారు. టీమిండియా బౌలర్లలో శార్దూల్ (4/67), భువనేశ్వర్ (3/42) సత్తాచాటారు. చదవండి: వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన టీమిండియా -
రోహిత్ డబుల్ చేస్తాడనుకున్నా, అందుకే అలా చేశా
పూణే: ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ డబుల్ హండ్రెడ్ సాధిస్తాడని ఊహించి ముందుగా ట్వీట్ చేసిన టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. 37 పరుగుల వద్ద రోహిత్ అవుటవ్వడంతో ఆ ట్వీట్‌ను డిలీట్ చేశాడు. ప్రస్తుత వన్డే సిరీస్‌లో ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా నమోదు చేయని రోహిత్.. ఈ మ్యాచ్‌లో మంచి టచ్‌లో ఉన్నట్టు కనిపించాడు. బంతిని చక్కగా మిడిల్ చేస్తూ చూడచక్కని షాట్లతో(6 ఫోర్లు) అలరించాడు. దీంతో ఈ మ్యాచ్‌లో రోహిత్.. కెరీర్లో నాలుగో డబుల్ సెంచరీని సాధిస్తాడని, టీమిండియా 400 పరుగుల భారీ స్కోర్‌ను నమోదు చేస్తుందని అశ్విన్ ట్వీట్ చేశాడు. అయితే రోహిత్.. అశ్విన్ నమ్మకాన్ని వమ్ము చేస్తూ, ఆదిల్ రషీద్ వేసిన గూగ్లీకి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. కాగా, సిరీస్‌లో వరుసగా మూడోసారి టాస్ ఓడిపోయిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. ప్రత్యర్ధి కెప్టెన్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు అంగీకరించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో నటరాజన్ రంగప్రవేశం చేశాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ, ధవన్ శుభారంభాన్ని అందించి, తొలి వికెట్‌కు 103 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 37 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్‌ను రషీద్ బోల్తా కొట్టించగా, ధవన్(56 బంతుల్లో 67; 10 ఫోర్లు) చూడచక్కని షాట్లతో హాఫ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే వరుస ఓవర్లలో ధవన్, కోహ్లి(10 బంతుల్లో 7), రాహుల్(18 బంతుల్లో 7) వికెట్లు కోల్పోవడంతో టీమిండియా కష్టాల్లో పడింది. ఆతరువాత క్రీజ్‌లో వచ్చిన పంత్(62 బంతుల్లో 78; 5 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు), హార్ధిక్(44 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) లు చెలరేగి ఆడారు. ఆఖర్లో టెయిలెండర్లు వరుసగా వికెట్లు కోల్పోవడంతో టీమిండియా 48.2 ఓవర్లలో 329 పరుగుల వద్ద ఆలౌటైంది. -
గబ్బర్ను ఊరిస్తున్న మరో రికార్డు..
పూణే: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో తృటిలో సెంచరీని(106 బంతుల్లో 98; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) చేజార్చుకున్న టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధవన్‌ను మరో అరుదైన రికార్డు ఊరిస్తుంది. రెండో వన్డేలో అతను మరో 94 పరుగులు సాధిస్తే, వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 6వేల పరుగుల మైలురాయిని చేరుకున్న మూడో క్రికెటర్‌గా చరిత్ర పుటల్లోకెక్కానున్నాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ హషీమ్ ఆమ్లా(123 ఇన్నింగ్స్‌లు) అగ్రస్థానంలో ఉండగా, టీమిండియా సారధి విరాట్ కోహ్లి(136 ఇన్నింగ్స్‌లు) రెండో స్థానంలోనూ, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(139 ఇన్నింగ్స్‌లు) మూడో స్థానంలో ఉన్నారు. 35 ఏళ్ల గబ్బర్ ప్రస్తుతం 137 ఇన్నింగ్స్‌ల్లో 45.4 సగటుతో 5,906 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 31 అర్ధసెంచరీలు ఉన్నాయి. శుక్రవారం జరుగబోయే రెండో వన్డేలో అతను మరో 94 పరుగులు చేస్తే, కేన్ విలియమ్సన్‌ను వెనక్కునెట్టి మూడో స్థానానికి చేరుకుంటాడు. దీంతోపాటు అతన్ని మరో రికార్డు సైతం ఊరిస్తుంది. వన్డేల్లో 6000 పరుగులు మార్కును చేరుకుంటే, ఆ ఘనత సాధించిన 10వ భారత క్రికెటర్‌గా ఆయన రికార్డు సాధించనున్నాడు. కాగా, మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 66 పరుగుల తేడాతో విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే రేపు ఇదే వేదికగా జరుగనుంది. చదవండి: మోదీ.. పాక్ ప్రధానికి చేసిన ట్వీట్ సంతోషానిచ్చింది -
ప్రసిద్ద్ కృష్ణ.. మేడిన్ ఆస్ట్రేలియా
పూణే: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో సంచలన ప్రదర్శన(4/54)తో ఆకట్టుకున్న టీమిండియా నయా పేస్ టాలెంట్ ప్రసిద్ద్ కృష్ణ.. ఆసీస్ లెజెండరీ పేసర్ జెఫ్ థామ్సన్ శిష్యరికంలో రాటు దేలాడు. థామ్సన్ ఇచ్చిన చిట్కాలతో తన పేస్‌కు పదును పెట్టాడు. స్వతహాగా ఆసీస్ మాజీ స్పీడ్‌స్టర్ బ్రెట్ లీ అభిమాని అయిన ఆయన.. ఆస్ట్రేలియా పిచ్‌లపై కఠోర సాధన చేశాడు. అలాగే ఎంఆర్ఎఫ్ అకాడమీలో ఆసీస్ ఆల్ టైమ్ గ్రేట్ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ వద్ద కూడా శిక్షణ తీసుకున్నాడు. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ల సూచనలు, సలహాలతో పాటు కఠోర సాధనకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఈ కర్ణాటక కుర్రాడు.. టీమిండియా భవిష్యత్తు ఆశాకిరణంగా ఉద్భవించాడు. కాగా, పూణేలోని ఎమ్సీఏ మైదానం వేదికగా జరిగిన తొలి వన్డేలో కృనాల్ పాండ్యాతో పాటు వన్డే క్యాప్‌ను అందుకున్న ప్రసిద్ద్.. మ్యాచ్‌ను మలుపు తిప్పే ప్రదర్శనతో అదరగొట్టాడు. కీలక సమయంలో జేసన్ రాయ్ (46), ప్రమాదకర బెన్ స్టోక్స్ (1)ను ఔట్ చేసి ఇంగ్లండ్ పతనాన్ని ప్రారంభించి, ఆతరువాత మిడిల్ ఓవర్లలో సామ్ బిల్లింగ్స్ (18), టామ్ కర్రన్ (11) వికెట్లు తీసి ఇంగ్లండ్ ఓటమిని ఖరారు చేశాడు. మొత్తం 8.1 ఓవర్లు బౌల్ చేసిన ఆయన.. 54 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అతను వన్డే అరంగేట్రంలో ఏ భారత బౌలర్‌కు సాధ్యపడని నాలుగు వికెట్ల ఘనతను సాధించాడు. చదవండి: ఎనిమిదేళ్ల తర్వాత దాయాదుల క్రికెట్ పోరు..? -
నాన్నకు ప్రేమతో.. కృనాల్ ఏం చేశాడో తెలుసా..?
పూణే: ఇంగ్లండ్‌తో తొలి వన్డే ద్వారా వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేసి, అదిరిపోయే ప్రదర్శనతో(31 బంతుల్లో 58 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు, 10 ఓవర్లలో 1/59) ఆకట్టుకున్న కృనాల్ పాండ్యా.. తన తండ్రి పట్ల ఉన్న ఎమోషన్‌ను ఆపుకోలేకపోతున్నాడు. తమ్ముడు హార్ధిక్ నుంచి వన్డే క్యాప్ అందుకునే సమయంలో తొలుత భావోద్వేగానికి లోనైన కృనాల్.. ఆతరువాత ప్రజెంటేషన్ వేదిక వద్ద కన్నీలను ఆపుకోలేకపోయాడు. ఈ సందర్భంగా వ్యాఖ్యాత మాట్లాడే ప్రయత్నం చేసినా.. అతను భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేక కన్నీటిపర్యంతమయ్యాడు. తన ప్రదర్శన తండ్రికి అంకితమంటూ భావోద్వేగ ప్రకటన చేశాడు. ఇదిలా ఉండగా తొలి వన్డేలో విజయం అనంతరం హార్దిక్, తన సోదరుడు కృనాల్‌ను ఇంటర్వ్యూ చేయగా, ఆ వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ఈ సందర్భంగా పాండ్య సోదరులిరువురు మరోసారి భావోద్వేగానికి లోనయ్యారు. తమ తండ్రి తమతో లేకపోయినా ఆయన ధరించాలనుకున్న దుస్తులు తమతో పాటు డ్రస్సింగ్ రూమ్‌లో ఉన్నాయని, తమ తండ్రి మ్యాచ్‌ను చూడలేకపోయినా ఆయన దుస్తులైనా ఆ అనుభూతిని పొందుతాయని వారు సంతోషం వ్యక్తం చేశారు. 💬 Our father was with us in dressing room: Pandya brothers @hardikpandya7 interviews @krunalpandya24 post his emotional knock on ODI debut. This has all our heart 💙- By @RajalArora #TeamIndia #INDvENG @Paytm Watch the full interview 🎥 👇https://t.co/yoDGXVi2aK pic.twitter.com/4JrsxtejgC — BCCI (@BCCI) March 24, 2021 హార్దిక్ నుంచి క్యాప్ అందుకోవడం చూసి నాన్న సంతోషించే ఉంటారని కృనాల్ పేర్కొనగా... "మన జీవిత కాలంలో తొలిసారి నాన్న డ్రస్సింగ్ రూమ్‌లోకి వచ్చారు. ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటారు. మన ఇద్దరి తరఫున నువ్వు అద్భుతంగా ఆడి, నాన్నకు ముందుగానే పుట్టినరోజు కానుక ఇచ్చావంటూ" హార్దిక్ భావోద్వేగం చెందాడు. కాగా, ఈ ఏడాది జనవరి 16న పాండ్యా సోదరుల తండ్రి హిమాన్షు పాండ్యా(71) కార్డియాక్ అరెస్ట్‌తో మృతి చెందాడు. కృనాల్.. తన తండ్రి దుస్తుల సంచీని బరోడా నుంచి పూణేకు తీసుకొచ్చాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో అరంగేట్రం ఆటగాళ్లు(కృనాల్, ప్రసిద్ద్ కృష్ణ(4/54)) అద్భుతంగా రాణించడంతో టీమిండియా 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే శుక్రవారం(మార్చి 26న) జరుగనుంది. చదవండి: భావోద్వేగానికి లోనైన కృనాల్ పాండ్యా -
ముగ్గురు కెప్టెన్లకు గాయాలు.. ఆందోళనలో ఐపీఎల్ ఫ్రాంచైజీలు
పూణే: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో ఏకంగా నలుగురు ఆటగాళ్లు గాయపడ్డారు. టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్, ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్, సామ్ బిల్లింగ్స్ లాంటి కీలక ఆటగాళ్లు ఫీల్డింగ్ చేసే సమయంలో గాయపడటంతో తర్వాతి వన్డేకి అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది. జట్టు విజయావకాశాలను ప్రభావితం చేయగల నలుగురు ఆటగాళ్లు ఒకే మ్యాచ్‌లో గాయపడటంతో ఇరు జట్లు ఆందోళన చెందుతున్నాయి. ఇదిలా ఉండగా ఆటగాళ్ల గాయాల విషయం ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో సైతం గుబులు రేపుతోంది. ఏప్రిల్ 9 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ 14వ సీజన్‌కు ముందు కీలక ఆటగాళ్లు వరుసపెట్టి గాయాలబారిన పడటంపై ఆయా ఫ్రాంచైజీలు విచారం వ్యక్తం చేస్తున్నాయి. గాయాలపాలైన ఆటగాళ్లు వివిధ ఫ్రాంచైజీలకు చెందిన కెప్టెన్లు కావడం.. ఆయా ఫ్రాంచైజీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఢిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్‌కు రోహిత్, గత సీజన్ రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు శ్రేయస్ అయ్యర్, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఇయాన్ మోర్గాన్ సారధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే టీమిండియాతో టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్ మోచేతి గాయం కారణంగా వన్డే సిరీస్‌తో పాటు ఐపీఎల్‌లోని తొలి భాగం మ్యాచ్‌లకు దూరమయ్యాడు. భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ప్రస్తుత వన్డే సిరీస్‌లో ఇరు జట్లలోని చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్ జట్లలో కీలక సభ్యులుగా కొనసాగుతున్నారు. దీంతో ఇరు జట్ల మధ్య జరుగబోయే తదుపరి రెండు వన్డేల్లో ఎవరూ గాయపడకూడదని ఫ్రాంఛైజీలు కోరుకుంటున్నాయి. కాగా, ఐపీఎల్లో పాల్గొనే ఆటగాళ్లందరూ తమ జట్లు ఏర్పాటు చేసిన బయోబబుల్‌లోకి ప్రవేశించాలంటే వారం రోజుల క్వారంటైన్‌ను తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంది. ఏప్రిల్ 9న ప్రారంభంకాబోయే తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. చదవండి: ఇంగ్లండ్‌కు షాక్.. రెండో వన్డేకు ఇద్దరు ఆటగాళ్లు దూరం..! చదవండి: టీమిండియాకు షాక్.. కీలక ఆటగాడు దూరం! -
24 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టిన ప్రసిద్ద్ కృష్ణ
పూణే: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో అరంగేట్రం బౌలర్ ప్రసిద్ద్ కృష్ణ(4/54) అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. మంగళవారం ఎమ్సీఏ మైదానం వేదికగా జరిగిన తొలి వన్డేలో కృనాల్ పాండ్యాతో పాటు వన్డే క్యాప్‌ను అందుకున్న ఈ పాతికేళ్ల కర్ణాటక పేసర్.. మ్యాచ్‌ను మలుపు తిప్పే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కీలక సమయంలో జేసన్ రాయ్ (46), ప్రమాదకర బెన్ స్టోక్స్ (1)ను ఔట్ చేసి ఇంగ్లండ్ పతనాన్ని ప్రారంభించి, ఆతరువాత మిడిల్ ఓవర్లలో సామ్ బిల్లింగ్స్ (18), టామ్ కర్రన్ (11) వికెట్లు తీసి ఇంగ్లండ్ ఓటమిని ఖరారు చేశాడు. మొత్తం 8.1 ఓవర్లు బౌల్ చేసిన ఆయన.. 54 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అతను వన్డే అరంగేట్రంలో ఏ భారత బౌలర్‌కు సాధ్యపడని నాలుగు వికెట్ల ఘనతను సాధించాడు. గతంలో వన్డే అరంగేట్రంలో భారత బౌలర్లు నోయల్ డేవిడ్ (3/21), వరుణ్ అరోణ్ (3/24), హార్దిక్ పాండ్యా (3/31), పీయూస్ చావ్లా (3/37)లు మూడు వికెట్ల ప్రదర్శన చేయగా తాజాగా ప్రసిద్ద్ కృష్ణ ఆ నలుగురు బౌలర్లను వెనక్కునెట్టి నాలుగు వికెట్లు ప్రదర్శనతో అగ్రస్థానంలో నిలిచాడు. వీరిలో స్పిన్నర్ నోయల్ డేవిడ్ 1997లో వెస్టిండీస్‌పై చేసిన ప్రదర్శన ఇప్పటి వరకు టాప్‌లో ఉండింది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో ప్రసిద్ద్ కృష్ణ ఆ రికార్డును సవరించి 24 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. కాగా, మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 66 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోహ్లీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. భారత బౌలర్ల ధాటికి లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 42.1 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ శిఖర్ ధావన్ (98; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం ఇదే వేదికగా రెండో వన్డే జరుగనుంది. చదవండి: అదరగొట్టిన అరంగేట్రం ఆటగాళ్లు.. టీమిండియాదే తొలి వన్డే -
ఇంగ్లండ్‌కు షాక్.. రెండో వన్డేకు ఇద్దరు ఆటగాళ్లు దూరం..!
పూణే: తొలి వన్డేలో టీమిండియా చేతిలో 66 పరుగుల తేడాతో ఘోరపరాభవాన్ని ఎదుర్కొన్న ఇంగ్లీష్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. రెండో వన్డేకు ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, స్టార్ బ్యాట్స్‌మెన్ సామ్ బిల్లింగ్స్ దూరంకానున్నారని తెలుస్తోంది. పూణే వేదికగా మంగళవారం జరిగిన తొలి వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఈ ఇద్దరు ఆటగాళ్లు గాయపడ్డారు. మోర్గాన్‌కు కుడి చేతి బొటనవేలు, చూపుడు వేలు మధ్య గాయం కావడంతో నాలుగు కుట్లు కూడా వేయాల్సి ఉంటుందని వైద్యులు సూచించారు. మరోవైపు బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపే క్రమంలో బిల్లింగ్స్ భుజం పైభాగం(కాలర్‌బోన్)కు గాయమైంది. దీంతో ఈ ఇద్దరు ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించాలని ఇంగ్లండ్ జట్టు మేనేజ్మెంట్ యోచిస్తోంది. ఇదే జరిగితే రెండో వన్డేలో ఇంగ్లండ్ జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆ జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది. అసలే నిలకడలేమితో సతమతమవుతున్న ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలినట్లైంది. కాగా, మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఇదే వేదికగా శుక్రవారం(మార్చి 26) రెండో వన్డే జరుగనుంది. ప్రస్తుతం సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. చదవండి: టీమిండియాకు షాక్.. కీలక ఆటగాడు దూరం! -
Krunal Pandya: అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డు..
పూణే: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో అరంగేట్రం ఆటగాడు కృనాల్ పాండ్యా(31 బంతుల్లో 58 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అదిరిపోయే రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కర్ణాటక పేసర్ ప్రసిద్ద్ కృష్ణతో కలిసి టీమిండియా వన్డే క్యాప్‌ను అందుకున్న ఈ స్పిన్ ఆల్‌రౌండర్.. క్లిష్ట సమయంలో(40.3 ఓవర్లలో 205/5 స్కోర్ వద్ద) క్రీజ్‌లోకి వచ్చి ఇంగ్లండ్ బౌలర్లను చీల్చిచెండాడు. ఈ క్రమంలో అతను ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కేఎల్ రాహుల్‌తో కలిసి ఆరో వికెట్‌కు 112 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసిన ఈ ముంబై ఇండియన్స్ ఆటగాడు.. 26 బంతుల్లోనే అర్ధశతకాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. దీంతో అరంగేట్రంలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు జాన్ మోరిస్(35 బంతుల్లో) పేరిట నమోదై ఉంది. దీంతోపాటు తొలి వన్డే మ్యాచ్‌లోనే అర్ధసెంచరీ నమోదు చేసిన 15వ భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు నమోదు చేశాడు. అలాగే 7వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి హాఫ్ సెంచరీ చేసిన మూడో భారత ఆటగాడిగా రికార్డు పుటల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌లో కృనాల్‌కు తోడుగా మరో ఎండ్‌లో రాహుల్(43 బంతుల్లో 62; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) సైతం భారీ షాట్లతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 317 పరుగుల భారీ స్కోర్‌ను సాధించింది. తొలుత ధవన్(98), కోహ్లి(56) అర్ధశతకాలతో రెచ్చిపోగా, ఆఖర్లో రాహుల్, కృనాల్ ఫోర్లు, సిక్సర్లతో వీరవిహారం చేశారు. కాగా, ఈ మ్యాచ్ ఆరంభంలో తమ్ముడు హార్దిక్ నుంచి వన్డే క్యాప్ అందుకున్న కృనాల్.. తన తండ్రిని గుర్తుచేసుకొని భావోద్వేగానికి లోనయ్యాడు. చదవండి: భావోద్వేగానికి లోనైన కృనాల్ పాండ్యా ధవన్ ఖాతాలో అరుదైన రికార్డు.. -
భావోద్వేగానికి లోనైన కృనాల్ పాండ్యా
పుణే: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య సోదరుడు కృనాల్ పాండ్య వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఇంగ్లాండ్‌తో తొలి వన్డే మ్యాచ్‌లో కృనాల్‌తోపాటు కర్ణాటక పేసర్ ప్రసిద్ద్ కృష్ణ కూడా వన్డే క్యాప్ అందుకున్నారు. ప్రసిద్ద్‌కు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కాగా, కృనాల్ ఇప్పటికే 18 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. Some brotherly love 💙🫂 A moment to cherish for the duo 🧢#TeamIndia #INDvENG @Paytm pic.twitter.com/UYwt5lmlQq — BCCI (@BCCI) March 23, 2021 కాగా, ఈ ఏడాది ఆరంభంలో పాండ్య సోదరులు తమ తండ్రిని కోల్పోయారు. ఈ నేపథ్యంలో తమ్ముడు హార్దిక్ నుంచి క్యాప్ అందుకున్న కృనాల్.. తన తండ్రిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. హార్డిక్.. తన అన్నను హత్తుకొని ఓదార్చే ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. కాగా, పాండ్యా సోదరుల తండ్రి హిమాన్షు పాండ్యా(71) ఈ ఏడాది జనవరి 16న కార్డియాక్ అరెస్ట్‌తో మృతి చెందాడు. ODI debut for @krunalpandya24 👌 International debut for @prasidh43 👍#TeamIndia @Paytm #INDvENG pic.twitter.com/Hm9abtwW0g — BCCI (@BCCI) March 23, 2021 -
ఆఖరి వన్డేలోనూ టీమిండియా మహిళల ఓటమి
లక్నో: కెప్టెన్ మిథాలీ రాజ్(104 బంతుల్లో 79 నాటౌట్; 8 ఫోర్లు, సిక్స్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించినా.. ఇతర బ్యాటర్లు దారుణంగా విఫలమవడంతో దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన ఆఖరి వన్డేలోనూ టీమిండియా మహిళలు 5 వికెట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49.3 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌటైంది. మిథాలీ రాజ్ మినహా.. ప్రియా పూనియా (18), స్మృతి మంధాన (18), పూనమ్ రౌత్ (10), హేమలత (2), సుష్మ వర్మ (0) దారుణంగా విఫలమయ్యారు. హర్మన్‌ప్రీత్ కౌర్ (30) కుదురుగా ఆడుతున్న సమయంలో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగటం టీమిండియాకు భారీ నష్టమే చేకూర్చింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో నదీన్ డి క్లెర్క్ 3, షంగేస్, సేఖుకునే 2, కాప్‌కు ఒక వికెట్ దక్కింది. అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా మహిళలు 48.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసి 10 బంతులు మిగిలుండగానే 5 వికెట్ల తేడాతో సునాయాస విజయాన్నందుకున్నారు. సఫారీ బ్యాటర్లలో డుప్రీజ్ (57), అన్నె బోష్(58), కాప్(36 నాటౌట్) రాణించారు. టీమిండియా బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 3, హేమలత, ప్రత్యూష తలో వికెట్ దక్కించుకున్నారు. అన్నె బోష్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కగా, లిజెల్ లీ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డ్ దక్కించుకుంది. దీంతో 5 వన్డేల సిరీస్‌ను దక్షిణాఫ్రికా మహిళలు 4-1తేడాతో గెలుపొందారు. ఇరు జట్ల మధ్య 3 టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్ ఇదే వేదికగా మార్చి 20న ప్రారంభంకానుంది. -
క్రికెట్ ఎలా కొనసాగాలి!
దుబాయ్: మార్చి 13న సిడ్నీలో ప్రేక్షకులు లేకుండా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ జరిగింది. అంతే... ఆ తర్వాత కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆగిపోయింది. ప్రతిష్టాత్మక ఐపీఎల్ కూడా నిరవధిక వాయిదా పడింది. కొంత ఎక్కువ, కొంత తక్కువగా తేడా ఉన్నా... మొత్తంగా వివిధ క్రికెట్ బోర్డులకు ఆర్థికపరంగా భారీ దెబ్బ పడింది. కోవిడ్–19 తాజా పరిణామాల నేపథ్యంలో క్రికెట్ భవిష్యత్తుకు సంబంధించి చర్చించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక సమావేశం నిర్వహించనుంది. ఆన్లైన్ ద్వారా గురువారం జరిగే ఈ భేటీలో 12 శాశ్వత సభ్య దేశాలు, మూడు అసోసియేట్ బోర్డులకు చెందిన చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొంటారు. అర్ధంతరంగా ఆగిపోయిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ కొనసాగింపు, వివిధ ద్వైపాక్షిక సిరీస్‌లు, ప్రతిపాదిత వన్డే సూపర్ లీగ్‌పై ప్రధానంగా చర్చ జరగనుంది. ఆగిపోయిన వివిధ సిరీస్‌ల కోసం కొత్త తేదీలు ఖరారు చేయడం లేదా రద్దుపై తగిన నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. సిరీస్‌ల రద్దుతో ఆర్థికపరంగా వివిధ బోర్డులను ఆదుకునే విషయంపై కూడా మాట్లాడనున్నట్లు సమాచారం. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి20 ప్రపంచకప్ నిర్వహణ అంశమే ప్రధాన ఎజెండా కావచ్చు. ‘కరోనా నేపథ్యంలో క్రికెట్‌ను కాపాడుకోవడమే ప్రస్తుతం మా అందరి లక్ష్యం. కాబట్టి భేషజాల కోసం, సొంత బోర్డుల ఎజెండా కోసం మాత్రమే కాకుండా మళ్లీ క్రికెట్ జరిగి అందరికీ మేలు జరిగే నిర్ణయాలు తీసుకోవడం కీలకం’ అని ఐసీసీ సీనియర్ అధికారొకరు వెల్లడించారు. -
మూడో వన్డేలో భారత్ ఓటమి
-
ప్చ్.. ఓడిపోయాం!
రాంచీ : ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 32 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే తొలి రెండు వన్డేలు గెలిచిన కోహ్లి సేన మూడో వన్డేలో మాత్రం చతికిలపడింది. ఆసీస్ నిర్దేశించిన 314 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా 281 పరుగులకే కుప్పకూలింది. సారథి విరాట్ కోహ్లి(123) వన్ మ్యాన్ షోతో అదరగొట్టినా విజయాన్ని అందించలేకపోయాడు. చివర్లో విజయ్ శంకర్(32), రవీంద్ర జడేజా(24)లు మెరుపులు మెరిపించడంతో విజయంపై ఆశలు కలిగాయి.. కానీ చివరకు ఆసీస్‌నే విజయాన్ని వరించింది. ఆసీస్ బౌలర్లలో జంపా, కమిన్స్, రిజర్డ్‌సన్‌లు తలో మూడు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించారు. ఓపెనర్లు విఫలం.. నిరాశ పరిచిన రాయుడు 314పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. రోహిత్ శర్మ(14), ధవన్(1)లు వెంటవెంటే ఔట్ అవ్వడంతో.. 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రాయుడు(2) కూడా తీవ్రంగా నిరాశ పరిచాడు. ఈ క్రమంలో జట్టును ఆదుకునే బాధ్యతను ధోని, కోహ్లిలు తీసుకున్నారు. అయితే ఈ జోడి క్రీజులో నిలదొక్కుకున్న అనంతరం.. స్కోర్ పెంచే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో భారీ షాట్లు ఆడే ప్రయత్నంలో ధోని(26) జంపా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. అనంతరం జాదవ్(26) బ్యాట్‌తో మెరుపులు మెరిపించినప్పటికీ క్రీజులో ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో 98 పరుగుల వద్ద కీపర్ క్యారీ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన కోహ్లి అదే ఓవర్లో డీప్ మిడ్‌వికెట్ దిశగా రెండు పరుగులు తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జంపా ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అనంతరం మరో షాట్‌కు ప్రయత్నించి క్లీన్‌బౌల్డ్ కావడంతో కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. -
బౌల్ట్ దెబ్బకు.. భారత్ ప్యాకప్
హామిల్టన్: న్యూజిలాండ్‌తో సిరీస్ అంటే ఎలా ఉంటుందో నాలుగో వన్డేకు గాని టీమిండియాకు తెలిసిరాలేదు. తొలి మూడు వన్డేలు ఆడుతుపాడుతూ గెలిచిన టీమిండియా నాలుగో మ్యాచ్‌లో మాత్రం ఘోరంగా తడబడింది. కివీస్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్(5/21), గ్రాండ్ హోమ్(3/26) పదునైన బౌలింగ్‌కు భారత బ్యాట్స్‌మెన్ విలవిల్లాడారు. కివీస్ బౌలర్ల ధాటికి కనీస గౌరవప్రదమైన స్కోర్ నమోదు చేయకుండానే 30.5 ఓవర్లలో కేవలం 92 పరుగులకే ప్యాకప్ అయింది. పాండ్యా(16) చహల్(18), కుల్దీప్(15)లు చివర్లో రాణించడంతో ఆమాత్రం స్కోరయినా టీమిండియా సాధించగలిగింది. దీంతో తొమ్మిదేళ్ల అనంతరం అత్యల్ప స్కోర్‌కు ఆలౌటై చెత్త రికార్డును నెలకొల్పింది. అది కూడా 2010లో దంబుల్లా వేదికగా న్యూజిలాండ్(88) పైనే ఈ రికార్డు ఉంది. శ్రీలంక(2000)పై 54 పరుగులే భారత్‌కు వన్డేల్లో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. ఓ దశలో క్రికెట్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్‌కే టీమిండియా ఆలౌటవుతుందా అనే అనుమానాన్ని బ్యాట్స్‌మెన్ కలిగించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు తొలి 5 ఓవర్లు మాత్రమే ఆనందాన్ని కలిగించాయి. అనంతరం రోహిత్ సేనకు కివీస్ బౌలర్లు అసలు పేస్ రుచి చూపించారు. టీమిండియాకు ఓపెనర్లు శుభారంభాన్ని అందించలేకపోయారు. కివీస్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ధావన్ (13) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగగా.. రోహిత్ శర్మ(6) రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో 23 పరుగులకే టీమిండియా ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. అనంతరం రాయుడు(0), కార్తీక్(0)లు గ్రాండ్ హోమ్ బౌలింగ్‌లో వెంటవెంటనే ఔటయ్యారు. ఎన్నో అంచనాల మధ్య అరంగేట్రం చేసిన శుబ్‌మన్ గిల్(9) కూడా పూర్తిగా నిరాశ పరిచాడు. కష్టకాలంలో బాధ్యతాయుతంగా ఆడతాడని భావించిన జాదవ్(1) కూడా బౌల్ట్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ ఐదు వికెట్లతో అదరగొట్టగా.. గ్రాండ్ హోమ్ మూడు వికెట్లు సాధించగా.. ఆస్టల్, నీషమ్‌లు తలో వికెట్ పడగొట్టారు. -
కోహ్లి సేనతో జాగ్రత్త.. కివీస్ పోలీసుల హెచ్చరిక
వెల్లింగ్టన్: కోహ్లి సేనతో జాగ్రత్తగా ఉండాలంటూ న్యూజిలాండ్ ప్రజలకు ఆదేశ పోలీసులు సరదా హెచ్చరిక జారీ చేశారు. ‘మన దేశంలో పర్యటిస్తున్న టీమిండియా గత వారం నేపియర్, మౌంట్ మాంగనీలో నిర్దాక్షిణ్యంగా న్యూజిలాండ్ జట్టుపై విరుచుకుపడింది. కావున ఎవరైనా బ్యాట్ లేదా బంతితో బయటకు వెళ్లాలనుకుంటే అదనపు జాగ్రత్తలు తీసుకోండి’ అంటూ కివీస్ పోలీసులు సరదా పోస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసులు చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ఇక ఆస్ట్రేలియాపై కొనసాగించిన జైత్రయాత్రనే న్యూజిలాండ్‌లోనూ టీమిండియా కొనసాగిస్తోంది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి రెండు వన్డేల్లో కోహ్లిసేన ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అటు బ్యాటింగ్‌లోనూ ఇటు బౌలింగ్లోను అదరగొడుతున్న టీమిండియా సోమవారం జరగనున్న మూడో వన్డేలోనే గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని ఆరాటపడుతోంది. రేపటి మ్యాచ్‌లో గెలిచి చివరి రెండు వన్డేలకు రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లకు అవకాశాలివ్వాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. ఇక పేపర్‌పై బలంగా ఉన్న కివీస్ జట్టు.. మైదానంలో తడబాటుకు గల కారణాలను అన్వేషిస్తోంది. ఎలాగైనా చివరి మూడు వన్డేల్లో మంచి ప్రదర్శన కనబర్చాలని కివీస్ ఉవ్విళ్లూరుతోంది. -
అందుకే అతను ప్రత్యేకం
వన్డే సిరీస్‌లో వెస్టిండీస్ జట్టు భారత్‌ను ఆశ్చర్యపరిచింది. మూడో వన్డేలో గెలిచి సిరీస్‌ను రసవత్తరంగా మార్చింది. కెప్టెన్ విరాట్ కోహ్లి వరుసగా మూడో సెంచరీతో అదరగొట్టినా... టీమిండియా లక్ష్యానికి చాలా దూరంలోనే నిలిచిపోయింది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కోహ్లి అగ్రస్థానంలో ఎందుకు ఉన్నా డో ఈ ఇన్నింగ్స్ చూస్తే అర్థమవుతుంది. ఓ వైపు వికెట్లు పడుతున్నా... బెదురులేకుండా బ్యాటింగ్ చేయడమే అతన్ని ఇతర బ్యాట్స్‌మెన్ నుంచి వేరు చేస్తోంది. భారీ లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. కావాల్సిన రన్‌రేట్‌ను దృష్టిలో పెట్టుకొని ఇన్నింగ్స్‌ను నడిపించాల్సి ఉంటుంది. అవతలి ఎండ్‌లో వికెట్లు పడుతుంటే ఇది మరింత కష్టమవుతుంది. అలాంటి సమయంలో ఓ బ్యాట్స్మన్లోని అత్యుత్తమ ఆట బయటకు వస్తుంది. చాలా మంది బ్యాట్స్మెన్లను గమనిస్తే మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వారు చాలా బాగా ఆడతారు. అదే లక్ష్య ఛేదనకు వచ్చేసరికి అంతా మారిపోతుంది. కానీ కోహ్లి తీరు వీరందరికి భి న్నం. ఛేదనలో అతని షాట్ల ఎంపిక చక్కగా ఉంటుంది. మూడో వన్డేలో షై హోప్ చెలరేగడంతో మధ్య ఓవర్లలో విండీస్ పుంజుకుంది. అతనికి కెప్టెన్ హోల్డర్ చక్కటి సహకారం అందించాడు. ఇక చివర్లో నర్స్ చెలరేగిపోయి జట్టుకు మంచి స్కోరు సాధించిపెట్టాడు. ఈ పర్యటనలో విండీస్ కెప్టెన్ రోజు రోజుకూ మెరుగవుతున్నాడు. ఆటగాడిగానే కాక సారథిగానూ ఆకట్టుకుంటున్నాడు. -
వైజాగ్ వన్డే : ఆదిలోనే భారత్‌కు ఎదురు దెబ్బ
సాక్షి, విశాఖపట్నం : ఇక్కడ వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. తొలి మ్యాచ్‌లో సెంచరీతో ఆకట్టుకున్న ఓపెనర్ రోహిత్ శర్మ(4) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగి నిరాశ పరిచాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి మరో ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి ఆచితూచి ఆడుతున్నాడు. ఇక అంతకు ముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లకు కెప్టెన్ కోహ్లి మొగ్గు చూపడంతో పేసర్ కలీల్ అహ్మద్ స్థానంలో కుల్దీప్ తుది జట్టులోకి వచ్చాడు. ఐదు వన్డేల సీరిస్‌లో ఇప్పటికే కోహ్లి సేన తొలి వన్డేలో ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచిన విషయం తెలిసిందే. అదే ఊపుతో అచ్చొచ్చిన వైజాగ్‌లో మరో విజయం నమోదు చేయాలని ఉవ్విళ్లురుతోంది. కాగా తొలి మ్యాచ్‌లో భారీ స్కోర్ సాధించి విజయం చేజార్చుకున్న విండీస్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. వైజాగ్‌లో భారత్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన 7 వన్డేల్లో భారత్ కేవలం ఒక్కటి మాత్రమే ఓడి 6 గెలిచింది. అయితే ఆ ఒక్క ఓటమి కూడా విండీస్‌పైనే కావడం భారత్‌కు ప్రతికూలాంశం. ఇప్పటి వరకు ఇక్కడ టాస్ గెలిచిన జట్లే ప్రతీ సారి విజయం సాధించాయి. దీంతో భారత్‌కు మరో విజయం కాయమని అభిమానులు భావిస్తున్నారు. -
నగరానికి చేరిన క్రికెట్ జట్లు
ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ) : వైఎస్సార్ స్టేడియంలో బుధవారం జరగనున్న రెండో వన్డేలో ఆడే భారత, వెస్టిండీస్ జట్లు సోమవారం విశాఖ చేరుకున్నాయి. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడుమ రెండు జట్ల ఆటగాళ్లు విశాఖ విమానాశ్రయంలో అడుగు పెట్టారు. తమ అభిమాన క్రికెటర్లను చూడడానికి అభిమానులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి తరలివచ్చారు. విమానాశ్రయం నుంచి బస్సు వద్దకు చేరుకున్న భారత క్రికెటర్లను చూసి కేరింతలు కొట్టారు. వారిని సెల్ఫోన్లతో ఫొటోలు తీసి ఉత్సాహపడ్డారు. ప్రత్యేకించి కోహ్లీ, ధోనీ, రోహిత్ శర్మ తదితరులు కనిపించినప్పుడు అభిమానులు తెగ సందడి చేశారు. అనంతరం టీమిండియా ఆటగాళ్లు నోవాటెల్ హోటల్‌కు, వెస్టిండీస్ ఆటగాళ్లు ఫోర్ పాయింట్ హోటల్‌కు వేరువేరు బస్సుల్లో చేరుకున్నారు. -
విండీస్‌తో వన్డే సిరీస్.. టీమిండియాలో చిన్న మార్పు
సాక్షి, ముంబై: వెస్టిండీస్‌పై టెస్ట్ సిరీస్ గెలిచిన ఉత్సాహంతోనే టీమిండియా వన్డే సిరీస్‌కు సన్నద్దమవుతోంది. ఈ నెల 21 నుంచి గువహటి వేదికగా తొలి మ్యాచ్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 14 మంది సభ్యుల జట్టును ప్రకటించిన భారత వన్డే జట్టులో మార్పు చోటుచేసుకుంది. ఉప్పల్ వేదికగా కరేబియన్ జట్టుతో జరిగిన రెండో టెస్టులో గాయపడిన శార్దూల్ ఠాకూర్ స్థానంలో సీనియర్ బౌలర్ ఉమేశ్ యాదవ్‌కు అవకాశం కల్పించారు. వన్డే సిరీస్ మొదలయ్యేసరికి గాయం నుంచి శార్దూల్ కోలుకుంటాడని సెలక్షన్ కమిటీ తొలుత భావించింది. అయితే అతడికి మరింత విశ్రాంతి అవసరమని వైద్యుల సూచన మేరకు వన్డే జట్టు నుంచి తప్పించారు. ఇక ఈ సిరీస్‌కు సీనియర్ క్రికెటర్లకు విశ్రాంతినిచ్చి యువ ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తారని అందరూ భావించారు. అయితే వన్డేల్లో విండీస్ జట్టు బలంగా ఉన్న నేపథ్యంలో.. ప్రయోగాల జోలికి వెళ్లకుండా చిన్న చిన్న మార్పులతో రెండు వన్డేలకు జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఇక ఎన్నో అంచనాల నడుమ వన్డే జట్టులోకి వచ్చిన రిషభ్ పంత్‌పై అందరి దృష్టి నెలకొంది. అయితే సీనియర్ క్రికెటర్, టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనికి విశ్రాంతినిచ్చి కెప్టెన్ విరాట్ కోహ్లి పంత్‌కు అవకాశం కల్పిస్తాడా లేక రెగ్యులర్ బ్యాట్స్‌మన్‌గా జట్టులోకి తీసుకుంటాడో వేచి చూడాలి. -
ఇంగ్లండ్‌తో రెండో వన్డే: టీమిండియా జోరుకు బ్రేక్
లార్డ్స్: టీమిండియా జోరుకు బ్రేక్ పడింది. ఇంగ్లండ్‌తో శనివారం జరిగిన రెండో వన్డేలో 86 పరుగుల తేడాతో కోహ్లి సేన ఘోర ఓటమి చవిచూసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను ఇంగ్లండ్ 1-1తో సమం చేసింది. మొదట బౌలింగ్‌లో ధారళంగా పరుగులిచ్చి.. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. 323 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు సరైన భాగస్వామ్యం అందించలేకపోయారు. తొలి వన్డే సెంచరీ హీరో రోహిత్ శర్మ (15) మార్క్ వుడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్(0) దారుణంగా విఫలమయ్యాడు. ఇక మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 36 (30 బంతుల్లో 6ఫోర్లు) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు. ఈ క్రమంలో కెప్టెన్ విరాట్ కోహ్లి, సురేశ్ రైనా జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిరువురు నాలుగో వికెట్‌కు 80 పరుగులు నమోదు చేసిన తర్వాత కోహ్లి 45(56 బంతుల్లో 2 ఫోర్లు)ని మొయిన్ ఆలీ ఔట్ చేశాడు. అనంతరం రైనా 46 (63 బంతుల్లో 1ఫోర్)కూడా నిష్క్రమించడంతో భారత్ ఓటమి దిశగా పయనించింది. ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటంతో రన్‌రేట్ పెరిగిపోయింది. మరోవైపు ధోని, పాండ్యా పరుగులు చేయడానికి నానాకష్టాలు పడ్డారు. ఒత్తిడికి గురైన పాండ్యా 21(22 బంతుల్లో 1 ఫోర్) ప్లంకెట్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్ డకౌటయ్యాడు . ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 33 పరుగుల వ్యక్తిగత స్కోర్ చేరగానే వన్డేల్లో పదివేల పరుగులు పూర్తి చేశాడు. మరో నాలుగు పరుగులు జోడించిన అనంతరం ధోని 37(59 బంతుల్లో 2ఫోర్లు) ప్లంకెట్ బౌలింగ్‌లో వెనుదిరగడంతో భారత్ ఓటమి ఖరారైంది. ఇక టెయిలెండర్లు కూడా రాణించకపోవడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 236 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో ప్లంకెట్ నాలుగు వికెట్లతో చెలరేగగా, అదిల్ రషీద్, విల్లే చెరో రెండు వికెట్లు.. వుడ్, మెయిన్ అలీ తలో వికెట్ తీశారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మకమైన మూడో మ్యాచ్ మంగళవారం(జులై 17)న జరగనుంది. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్.. బ్యాట్స్‌మెన్ చెలరేగి ఆడటంతో భారీ స్కోర్ సాధించింది. జోయ్ రూట్ 113(116 బంతుల్లో 8ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ మోర్గాన్ 53 (51 బంతుల్లో 4ఫోర్లు, 1 సిక్సర్) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో డేవిడ్ విల్లే 50(31 బంతుల్లో 5ఫోర్లు, 1 సిక్సర్) మెరుపులు మెరిపివ్వడంతో ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీయగా.. చహల్, ఉమేశ్, పాండ్యా తలో వికెట్ పడగొట్టారు. -
రెండో వన్డే అప్డేట్స్: ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జోయ్ రూట్
లార్డ్స్ : ప్రతిష్టాత్మకరమైన లార్డ్స్ మైదానంలో ఇండియా, ఇంగ్లండ్‌ల మధ్య కీలకమైన రెండో వన్డే జరుగుతోంది. కోహ్లి సేనతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇయన్ మోర్గాన్ సేనకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. రెండు జట్లు ఏ విధమైన మార్పులు లేకుండా మొదటి వన్డే ఆడిన టీంతోనే బరిలోకి దిగాయి. మొదటి వన్డేలో కుల్దీప్ విజృంభించి ఇండియాకు విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. మూడు వన్డేల సిరీస్‌లో కోహ్లిసేన వరుసగా రెండో వన్డే గెలిచి కప్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. మ్యాచ్ అప్డేట్స్ ఇవి.. ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మకమైన మూడో వన్డే మంగళవారం(జులై 17)న జరగనుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జోయ్ రూట్ మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసిన ఇంగ్లండ్ 86 పరుగుల తేడాతో టీమిండియా ఘోర ఓటమి వన్డేల్లో పదివేల పరుగుల క్లబ్లో చేరిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా, ఉమేశ్ యాదవ్ డకౌట్ ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా, ప్లంకెట్ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యా(21) కీపర్ క్యాచ్ ఔట్ 35 ఓవర్లలో టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ప్రస్తుతం ధోని(13), పాండ్యా (10) బ్యాటింగ్ చేస్తున్నారు. భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. సురేష్ రైనా 46 వ్యక్తిగత పరుగుల వద్ద వెనుదిరిగాడు. రషీద్ వేసిన 32వ ఓవర్లో తొలి బంతికే బౌల్డ్ అయ్యాడు. 31.1 ఓవర్లకు టీమిండియా స్కోర్ 154/5. టీమిండియా సారధి విరాట్ కోహ్లి 45 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. మొయిన్ అలీ వేసిన 27వ ఓవర్లో చివరి బంతికి ఎల్బీడబ్య్లూగా వెనుదిరిగాడు. ఇండియా 27 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. 38 పరుగులతో సురేష్ రైనా ఆడుతున్నాడు. లక్ష్య ఛేదనలో కోహ్లిసేన 25 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. కోహ్లి, సురేష్ రైనాలు నెమ్మదిగా ఆడుతూ వికెట్ పడకుండా కాపాడుతున్నారు. కోహ్లి 42 పరుగులతో, సురేష్ రైనా 34 పరుగులతో ఆడుతున్నారు. టీమిండియా 21 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 112 పరుగుల చేసింది. విరాట్ కోహ్లి(32), సురేష్ రైనా(23) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. భారత్ 15 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 90 పరుగుల చేసింది. విరాట్ కోహ్లి(19), సురేష్ రైనా(12) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. టీమిండియా 12 ఓవర్లకు మూడు వికెట్లు నష్టపోయి 65 పరుగులు చేసింది. ప్రస్తుతం విరాట్ కోహ్లి(7), సురేష్ రైనాలు(3) క్రీజ్‌లో ఉన్నారు. శిఖర్ ధావన్ ఔట్ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన లోకేష్ రాహుల్ నిరాశ పరిచాడు. లియామ్ ప్లంకెట్ వేసిన 11వ ఓవర్లో ఐదో బంతికి బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 60 పరుగులకే టీమిండియా మూడు వికెట్లు కోల్పోయింది. 57 పరుగులు వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. టీమిండియా 10 ఓవర్లో చివరి బంతికి ధావన్ వికెట్‌ను కోల్పోయింది. డేవిడ్ విల్లే వేసిన బౌలింగ్‌లో స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి ధావన్(36) ఔట్ అయ్యాడు. ప్రస్తుతం కోహ్లి(5), లోకేష్ రాహుల్(0) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీ సేన నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. భారత్ 7 ఓవర్లలో 45 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ రోహిత్ శర్మ 13 పరుగులు, ధావన్ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. జో రూట్ సెంచరీతో చెలరేగడం.. ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన డేవిడ్ విల్లే 31 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 50 పరుగులు చేయడంతో ఇంగ్లండ్ జట్టు భారత్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి.. ఇంగ్లండ్ జట్టు 322 పరుగులు చేసింది. భారత్‌కు 323 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఒక్కడే ఒక మోస్తరుగా రాణించి మూడు వికెట్లు పడగొట్టాడు. ఉమేష్ యాదవ్, యజువేంద్ర చాహల్, హరిక్ పాండ్య తలో వికెట్ తీసుకున్నారు. 8 ఓవర్లు వేసిన సిద్ధార్థ కౌల్ (59 పరుగులు ఇచ్చాడు), రెండు ఓవర్లు వేసిన సురేశ్ రైనా వికెట్ తీయలేకపోయారు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో జాసన్ రాయ్ 40 పరుగులు, జానీ బెయిర్ స్టో 38 పరుగులు, జో రూట్ 113 పరుగులు (నాటౌట్), ఇయాన్ మోర్గాన్ 53 పరుగులు, బెన్ స్టోక్స్ 5 పరుగులు, జోస్ బట్లర్ 4 పరుగులు, మోయిన్ ఆలీ 13 పరుగులు, డేవిడ్ విల్లీ 50 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్ రెండో వన్డేలో ఒంటరి పోరాటం చేశాడు. జో రూట్ 109 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. వచ్చిన ఆటగాళ్లు వరుసగా ఫెవిలియన్ బాట పట్టగా జో రూట్ మ్యాచ్‌ను తన భూజాలపై వేసుకుని ముందుకు నడిపించాడు. 48 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్ 305/6. రోహిత్ చక్కటి డ్రైవ్ కొట్టి అద్భుత క్యాచ్ అందుకున్నాడు. చహల్ వేసిన 42వ ఓవర్లో నాల్గో బంతికి మొయిన్ ఆలీ భారీ షాట్ ఆడబోయి రోహిత్‌కు క్యాచ్ ఇచ్చాడు. 240 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం జో రూట్(88), మొయిన్ అలీ(6) డేవిడ్ విల్లే(0) క్రీజ్‌లో ఉన్నారు. 40 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఇంగ్లండ్ 228 పరుగులు చేసింది. ప్రస్తుతం జో రూట్(78), మొయిన్ అలీ(6) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ 214 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో జాస్ బట్లర్ ధోనికి క్యాచ్ ఇచ్చి ఫెవిలియన్ బాటపట్టాడు. 36.3 ఓవర్ల వద్ద ఇంగ్లండ్ స్కోర్ 214/5. 203 పరుగుల వద్ద ఇంగ్లండ్ మరో వికెట్ కోల్పోయింది. హార్థిక్ పాండ్యా బౌలింగ్‌లో బెన్ స్టోక్స్ కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. స్టోక్స్ ఎనిమిది బంతుల్లో ఐదు పరుగులు చేశాడు. దీంతో 34 ఓఇవర్లలో ఇంగ్లండ్ 203 పరుగులు చేసింది. జో రూట్ (63) , జోస్ బట్లర్ క్రీజ్‌లో ఉన్నారు. 30.3 ఓవర్లో మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్. మోర్గాన్ 53 పరుగుల వద్ద కుల్దీవ్ ఓవర్లో భారీ షాట్ ఆడబోయి ధావన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇంగ్లండ్ స్కోర్: 189/3. తన స్పిన్ మాయతో మూడు వికెట్లు తన ఖాతాలో కుల్దీప్ వేసుకున్నాడు. కుల్దీప్ బౌలింగ్‌లో వరుసగా ఓపెనర్లను కోల్పోయిన ఇంగ్లండ్ జట్టును అనంతరం వచ్చిన జోయ్ రూట్, కెప్టెన్ ఈయాన్ మోర్గాన్ ఆదుకున్నారు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ.. నిలకడగా ఈ ఆడుతున్న ఈ ఇద్దరు.. 28 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ను పటిష్ట స్థితికి తీసుకొచ్చారు. 28 ఓవర్లలో ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు భారత బౌలర్లు శ్రమిస్తున్నారు. రూట్ అర్ధశతకం సాధించగా.. మోర్గాన్ 45 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. మరోసారి స్పిన్ మ్యాజిక్ చూపిన కుల్దీప్. 15 ఓవర్లో కీలక వికెట్ తీశాడు. ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్(40) ఔట్. సిక్స్ బార్డర్లో క్యాచ్ పట్టిన ఉమేష్ యాదవ్. 15 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోర్ 88/2 రంగంలోకి దిగిన చైనామన్ కుల్దీప్, రెండో బంతికే వికెట్. బెయిర్ స్టో (38) ఔట్ పది ఓవర్లలో ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. జాసన్ రాయ్ 30పరుగులతో, బెయిర్ స్టో 38 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఆరో ఓవర్లలో ఇంగ్లండ్ జట్టు వికెట్ కోల్పోకుండా 32 పరుగులు చేసింది. టీమిండియా: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్, సురేశ్ రైనా, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, సిద్దార్థ్ కౌల్, ఉమేశ్ యాదవ్, చాహల్, కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్: ఇయన్ మోర్గాన్(కెప్టెన్), జాసన్ రాయ్, బెయిర్ స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జాస్ బట్లర్, మొయిన్ అలీ, డేవిడ్ విల్లే, లియామ్ ప్లంకెట్, అదిల్ రషీద్, మార్క్ వుడ్ -
పసికూనపై పాక్ భారీ విజయం
బులవాయో: వరుస విజయాలతో దూసకపోతున్న పాకిస్తాన్ మరో ఘన విజయం సాధించింది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా పాక్ తొలి వన్డేలో 201 పరుగుల తేడాతో జింబాబ్వే జట్టును చిత్తుచేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన పాక్‌కు ఓపెనర్లు చక్కటి శుభారంభాన్నందించారు. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ఇమాముల్ హక్ 128(134 బంతుల్లో 11 ఫోర్లు) సెంచరీతో చెలరేగగా.. ఫకర్ జమాన్ 60 (70 బంతుల్లో 7 ఫోర్లు) అర్థసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక మిగతా బ్యాట్స్‌మెన్ కూడా రాణించడంతో పాక్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే ఏ దశలోనూ పోరాటపటిమను ప్రదర్శించలేదు. పాక్ బౌలర్ల ధాటికి 35 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటై భారీ ఓటమిని చవిచూసింది. ఆతిథ్య బ్యాట్స్మెన్లలో ర్యాన్ ముర్రే 32 నాటౌట్(48 బంతుల్లో 1 ఫోర్) టాప్ స్కోరర్ కావడం గమనార్హం. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ నాలుగు వికట్లతో అదరగొట్టగా.. ఆష్రాఫ్, ఉస్మాన్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించారు. -
కుల్దీప్ రికార్డుల మోత..!
నాటింగ్‌హామ్: భారత చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో ఆరు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌కు కొరకరాని కొయ్యగా మిగిలిన కుల్దీప్(6/25) ఆతిథ్య జట్టును మరోసారి దెబ్బతీశాడు. ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలో అదరగొట్టిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా కుల్దీప్ సరికొత్త రికార్డు సృష్టించాడు. వన్డేల్లో ఇంగ్లండ్‌పై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన స్పిన్నర్‌గానూ అరుదైన ఘనత సాధించాడు. వన్డేలో బ్రిటీష్ పిచ్‌లపై ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా కుల్దీప్ సరికొత్త రికార్డు లిఖించాడు. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆసీస్ చైనామన్ బౌలర్ బ్రాడ్ హాగ్ రికార్డును తిరగరాశాడు. టీమిండియా తరుపున బౌలింగ్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన నాలుగో బౌలర్‌గా మరో ఘనత సాధించాడు. గతంలో అనిల్ కుంబ్లే(6/12), అమిత్ మిశ్రా(6/48), మురళీ కార్తీక్(6/27)లు ఈ ఘనత సాధించారు. ఈ ఫీట్ సాధించచిన నలుగురు బౌలర్లు స్పిన్నర్లు కావడం విశేషం. , -
ఇంగ్లండ్ పని పట్టిన కుల్దీప్
నాటింగ్‌హామ్: టీమిండియా మణికట్టు మాంత్రికుడు కుల్దీప్ యాదవ్ మరో సారి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ పనిపట్టాడు. కెరీర్లోనే బెస్ట్ గణాంకాలు కుల్దీప్(6/25) నమోదు చేశాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇంకో బంతి మిగిలిండగానే 268 పరుగులకు ఆలౌటైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 73 పరుగులు జోడించి ప్రమాదకరంగా మారుతున్న రాయ్-బెయిర్ స్టో జోడిని విడదీసి కుల్దీప్ వికెట్ల ఖాతా తెరిచాడు. ఓపెనర్లు జాసన్ రాయ్ 38(35 బంతుల్లో 6ఫోర్లు), బెయిర్ స్టో 38(35 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్సర్), వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ రూట్(3)ను వరుస ఓవర్లలో కుల్దీప్ పెవిలియన్‌కు పంపించాడు. దీంతో 82 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లండ్‌ను కెప్టెన్ మోర్గాన్ ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ చహల్ బౌలింగ్‌లో రైనాకు క్యాచ్ ఇచ్చి మోర్గాన్(19) వెనుదిరిగాడు. ఆదుకున్న స్టోక్స్- బట్లర్ 105 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, ఐపీఎల్ హీరో బట్లర్ ఆదుకున్నారు. ఆరంభం నుంచి స్టోక్స్ నెమ్మదిగా ఆడగా.. బట్లర్ ఎడాపెడా బౌండరీలు బాదాడు. ఐదో వికెట్‌కు ఈ జోడి 93 పరుగులు జోడించి ఇంగ్లండ్‌ను పటిష్టస్థితికి చేర్చారు. మరోసారి కుల్దీప్.. ఇంగ్లండ్‌ను లెఫ్టార్మ్ స్పిన్నర్ కుల్దీప్ మరోసారి దెబ్బతీశాడు. క్రీజులో పాతుకపోయిన స్టోక్స్ 50(103 బంతుల్లో 2ఫోర్లు,1 సిక్సర్), బట్లర్ 53(51 బంతుల్లో 5ఫోర్లు)లను కుల్దీప్ ఔబ్ చేశాడు. చివర్లో మొయిన్ ఆలీ 24(23 బంతుల్లో 2ఫోర్లు, 1 సిక్సర్), అదిల్ రషీద్ 22(16 బంతుల్లో 1ఫోర్, 1 సిక్సర్) ధాటిగా ఆడే ప్రయత్నం చేశారు. వరుస ఓవర్లలో టీమిండియా బౌలర్లు వికెట్లు తీయడంతో ఆతిథ్య జట్టు 268 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో కుల్దీప్ ఆరు వికెట్లతో చెలరేగగా, ఉమేశ్ రెండు వికెట్లు, చహల్ ఒక్క వికెట్ సాధించాడు. అరంగేట్ర మ్యాచ్‌లో సిద్దార్థ్ కౌల్ ధారళంగా పరుగులు ఇచ్చి తీవ్రంగా నిరాశ పరిచాడు. -
ఇంగ్లండ్‌తో వన్డే: సిద్దార్థ్ కౌల్ అరంగేట్రం
నాటింగ్‌హామ్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడి ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా సారథి విరాట్ కోహ్లి ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. గాయం కారణంగా భువనేశ్వర్ కుమార్ దూరం కావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బౌలర్ సిద్దార్థ్ కౌల్ అరంగేట్రం చేశాడు. టీమిండియా మాజీ సారథి, సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని చేతుల మీదుగా క్యాప్ అందుకున్నాడు. ఇంగ్లండ్‌తో వన్డే మ్యాచ్‌లో కోహ్లి ఎక్కువగా ప్రయోగాల జోలికి వెళ్లకుండా టీ20 జట్టునే కోనసాగించాడు. చివరి టీ20 ఆడని కుల్దీప్ యాదవ్‌కు తుదిజట్టులో అవకాశం దక్కింది. కాగా, గాయం కారణంగా హేల్స్ దూరమవ్వగా బెన్ స్టోక్స్ తుది జట్టులోకి వచ్చాడు. పిచ్ పొడిబారి ఉండటంతో బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది. దీంతో పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది. ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలోనే ఇంగ్లండ్ రెండు వరల్డ్ రికార్డు స్కోర్లు (441, 481) సాధించింది. ఇప్పటికే టి20 సిరీస్ గెలుచుకున్న టీమిండియా ఇక్కడా విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. వన్డేల్లో ఇటీవలి తమ ధాటిని కొనసాగించాలని ఇంగ్లండ్ భావిస్తోంది. 2014లో ఇక్కడ ఆడిన తమ చివరి పర్యటనలో భారత్ వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. తుది జట్లు: టీమిండియా: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్, సురేశ్ రైనా, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, సిద్దార్థ్ కౌల్, ఉమేశ్ యాదవ్, చాహల్, కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్: ఇయన్ మోర్గాన్(కెప్టెన్), జాసన్ రాయ్, బెయిర్ స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జాస్ బట్లర్, మొయిన్ అలీ, డేవిడ్ విల్లే, లియామ్ ప్లంకెట్, అదిల్ రషీద్, మార్క్ వుడ్ -
మహిళా క్రికెట్లో అ‘ద్వితీయ’ శతకం
డబ్లిన్: మహిళా క్రికెట్లో మరో సంచలనం నమోదయింది. ఐర్లాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్ క్రీడాకారిణులు రికార్డుల మోత మోగిస్తున్నారు. తొలి వన్డేలో 490 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పగా, తాజాగా నామమాత్రమైన మూడో వన్డేలో అమిలియా కెర్ డబుల్ సెంచరీ(232; 145 బంతుల్లో 31 ఫోర్లు, 2 సిక్సర్లు) సాధించటంతో పలు రికార్డులు తిరగరాశారు. మహిళా క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించడంతో పాటు, అతి చిన్న వయసులోనే(17 సంవత్సరాల 243 రోజులు) ఈ రికార్డు సాధించిన ప్లేయర్‌గా సంచలనం సృష్టించారు. కాగా ఇప్పటివరకు మహిళా క్రికెట్లో ఇది రెండో ద్విశతకం మాత్రమే, మొదటి డబుల్ సెంచరీ ఆస్ట్రేలియా క్రీడాకారిణి బెలిందా క్లార్క్(229) సాధించారు. ఇక ఓవరాల్‌గా అంతర్జాతీయ వన్డే చరిత్రలో డబుల్ సెంచరీ సాధించిన ఏడో వ్యక్తిగా (రోహిత్ శర్మ మూడు డబుల్ సెంచరీలు సాధించాడు) అమిలియా కెర్ ఈ ఘనత సాధించారు. -
వన్డే సిరీస్ భారత్‌దే
నాగ్‌పూర్: భారత మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తేడాతో గెలుచుకుంది. గురువారం విదర్భ స్టేడియంలో జరిగిన నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని 45.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించిన భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్‌ను భారీ స్కోర్ చేయకుండా భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు. దీంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో జేమ్స్(94; 119 బంతుల్లో 7ఫోర్లు, 1సిక్స్) రాణించడంతో ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. భారత బౌలర్లలో గోస్వామి, రాజేశ్వరీ గైక్వాడ్, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్ తలో రెండు వికెట్లు సాధించారు. ఆ తర్వాత 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 23 పరుగులకే రోడ్రిగ్స్, వేదా కృష్ణమూర్తి వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో నిలిచింది. ఈ సమయంలో మరో ఓపెనర్ స్మృతి మంధన (53 రిటైర్డ్ హర్ట్;67 బంతుల్లో 6ఫోర్లు) తో కలిసి కెప్టెన్ మిథాలీ రాజ్(74నాటౌట్; 124 బంతుల్లో 9ఫోర్లు) ఇన్నింగ్స్ చక్కదిద్దింది. మంధన ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ(54నాటౌట్; 61 బంతుల్లో 9ఫోర్లు, 1సిక్స్) మెరుపు బ్యాటింగ్ చేసి భారత్ విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. ఇంగ్లండ్ బౌలర్ ష్రబ్సోల్ రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన దీప్తిశర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్‌లో నిలకడగా రాణించిన స్మృతి మంధన ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గెలుచుకున్నారు. -
భారత్ ఘోర పరాజయం
నాగ్‌పూర్ : ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో అద్భుత ప్రదర్శన చేసి విజయం సాధించిన భారత మహిళల జట్టు రెండో వన్డేలో చతికిలపడింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సోమవారం విదర్భ క్రికెట్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను ఇంగ్లండ్ జట్టు 1-1తో సమం చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత జట్టు.. ఇంగ్లండ్ బౌలర్లు సోఫీ ఎక్లెస్టోన్(4/14), హాజెల్(4/32) ధాటికి 37.2 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. టీమిండియాలో స్మృతి మంధాన (42; 57బంతుల్లో 3ఫోర్లు, 1సిక్సర్), దీప్తి శర్మ (26), దేవికా (11) మినహా ఎవరూ రెండంకెల స్కోరు చేయకపోవడం గమనార్హం. ముగ్గురు ఆటగాళ్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరడంతో భారత్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఆపై 114 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ జట్టుకు ఓపెనర్లు శుభారంభం ఇవ్వడంతో 29 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో డానియెల్ వ్యాట్ (47;43బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు), బీమౌంట్ (39; 85 బంతుల్లో 3ఫోర్లు), కెప్టెన్ హీథర్ నైట్(26నాటౌట్; 42బంతుల్లో 3ఫోర్లు) రాణించి జట్టుకు ఘన విజయాన్ని అందించారు. భారత బౌలర్లలో ఏక్తా బిస్త్ రెండు వికెట్లు సాధించింది. -
ఆస్ట్రేలియా భారీ స్కోర్
వడోదర : మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం భారత మహిళల జట్టుతో జరుగుతున్న నామమాత్రమైన మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా కీపర్ అలైసా హేలీ (133;115బంతుల్లో17 ఫోర్లు, 2సిక్సర్లు) కెరీర్లో తొలి సెంచరీ సాధించింది. ఈ క్రమంలో ఆమె ఆస్ట్రేలియా తరపున భారత్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేసింది. ఆస్ట్రేలియా 64 పరుగులకే నికోల్ బోల్టన్(11), లాన్నింగ్(18) వికెట్లను కోల్పోగా, అలైసా హేలీ-ఎలైస్ పెర్రీ జట్టును కాపాడే ప్రయత్నం చేశారు. ఈ జోడి 79 పరుగులు జోడించిన అనంతరం పెర్రీ (32) మూడో వికెట్‌గా పెవిలియన్‌కు చేరింది. తరువాత వచ్చిన ప్లెయర్స్లో రాచెల్ హేన్స్ (43, 39బంతుల్లో 5ఫోర్లు), యాష్లే గార్డనర్ (35, 20బంతుల్లో 6 ఫోర్లు), మూనీ(34, 19బంతుల్లో 5ఫోర్లు) ధాటిగా ఆడటంతో ఆస్ట్రేలియా మహిళా జట్టు భారీ స్కోర్ సాధించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ రెండు వికెట్లు సాధించగా, దీప్తి శర్మ, శిఖా పాండే, ఏక్తా బిస్త్, పూనం యాదవ్ తలో వికట్ తీశారు. మూడు వన్డేల సిరీస్‌ను 0-2తో భారత మహిళా జట్టు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఎక్తాబిస్త్కు గాయం భారత క్రీడాకారిణి ఏక్తా బిస్త్ బౌలింగ్ చేస్తూ గాయపడటంతో మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడింది. -
ఆఖరి వన్డేలో భారత్ ఘన విజయం
సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. ఆరు వన్డేల సిరీస్‌లో ఐదు వన్డేలను అలవోకగా నెగ్గి, సొంత గడ్డపై ప్రోటీస్‌ను మట్టికరిపించింది. కొహ్లి సెంచరీతో రాణించడంతో ఆరో వన్డేలో 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 205 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టీమిండియా బౌలర్లు విజృంభణకు సఫారీలు కుప్పకూలారు. ఆద్యంతం ఆకట్టుకున్న భారత బౌలర్లు.. దక్షిణాఫ్రికాకు ఏ దశలోనూ అవకాశం ఇవ్వలేదు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో జాండో(54), ఫెహ్లకోహియో(34)లు మినహా మిగతా వారు ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో దక్షిణాఫ్రికా 46.5 ఓవర్లలో 204 పరుగులకే చాపచుట్టేసింది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లు సాధించి అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయగా, చాహల్, బూమ్రాలు చెరో రెండు వికెట్లు తీశారు. పాండ్యా, కుల్దీప్లకు తలో వికెట్ దక్కింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ రెండు వికెట్లు కోల్పోయి 32.1 ఓవర్లలో 206 పరుగులు చేసింది. కోహ్లి 129( 123 బంతుల్లో) రాణించడంతో భారత్ సులువుగా విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కోహ్లికి దక్కింది. -
కోహ్లికి రహానేకి అదే తేడా : గంగూలీ
సాక్షి, స్పోర్ట్స్ : ఆతిథ్య సౌతాఫ్రికాను చిత్తుచేసి మొదటి వన్డేలో టీమిండియా సాధించిన ఘనవిజయంపై మాజీ సారథి సౌరవ్ గంగూలీ ఆసక్తికర కామెంట్లుచేశాడు. 270 పరుగుల లక్ష్యసాధనలో కోహ్లి సాధించిన సెంచరీ అద్భుతమే అయినప్పటికీ రహానే ఇన్నింగ్స్ అంతకంటే విలువైనదని అభిప్రాయపడ్డాడు. ‘ఇప్పుడున్న ఆటగాళ్లందరిలోకి రహానే క్లాస్ ప్లేయర్ అన్నది నిర్వివాదాంశం. సొగసైన బ్యాటింగ్‌తో అలరించే అతను.. తన అర్థసెంచరీలను సెంచరీలుగా మలుచుకోవడంలో ఇబ్బందిపడుతున్నాడు. విరాట్‌ను చూడండి.. ఒక్కసారి సెట్ అయ్యాడంటే సెంచరీ కొట్టకుండా ఊరుకోడు. వాళ్లిద్దరికీ మధ్య అదే తేడా. ఈ విషయంలో కోహ్లి నుంచి రహానే నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సారథితో డైనింగ్ టేబుల్ సంభాషణలు రహానేకి తప్పకుండా ఉపకరిస్తాయి’’ అని ఓ జాతీయ పత్రికకు రాసిన కాలమ్‌లో గంగూలీ పేర్కొన్నాడు. సౌతాఫ్రికా తప్పుచేసిందా! : సఫారీ గడ్డపై తొలిరెండు టెస్టులు దారుణంగా ఓడిపోయిన టీమిండియా.. మూడో టెస్టులో మాత్రం 63 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ ఒక్క విజయమే టీమిండియా యాటిట్యూడ్‌లో మార్పునకు కారణమైందని గంగూలీ అన్నారు. ‘‘మూడో టెస్టు అందించిన విజయంతో టీమిండియా గమనం పూర్తిగా మారింది. అదే ఊపులో మొదటి వన్డేను గెల్చుకుంది. ఇంకా ఐదు వన్డేలు, టీ20 సిరీస్ ఆడాల్సిన తరుణంలో ఈ మార్పు చాలా అవసరమని చెప్పాలి. ఇక దక్షిణాఫ్రికా.. తన తురుపుముక్కలైన డివిల్లీర్స్, స్టెయిన్‌లు లేకుండా బరిలోకి దిగాల్సిరావడం పూడ్చుకోలేని నష్టం. పైగా, టెస్టుల్లో ఇండియన్ బ్యాట్స్మన్లకు సవాలు విసిరిన ఇన్‌గిడి, ఫిలాండర్లను కూడా పక్కనపెట్టడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది’’ అని సౌరవ్ రాసుకొచ్చారు. సౌతాఫ్రికాతో ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం డర్బన్‌లో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండో వన్డే సెంచూరియన్ వేదికగా ఆదివారం(ఫిబ్రవరి 4)న జరుగనుంది. -
గుడ్ వర్క్ బోయ్స్ : సచిన్
సాక్షి, ముంబై : దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరిస్ ఓటమి తర్వాత వన్డే సిరిస్‌లో భాగంగా కింగ్స్‌మీడ్ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ శుభారంభం చేసింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అత్యత్తమ ప్రదర్శన కనబరిచారని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభినందనలతో ముంచెత్తారు. కోహ్లి, రహానేల కీలక భాగస్వామ్యం భారత్‌ను విజయతీరాలకు చేర్పించిందని కొనియాడారు. బౌలింగ్ విభాగంలో కుల్దీప్, చహల్‌లు రాణిస్తే, కోహ్లి, రహానేలు బ్యాటింగ్‌లో సత్తా చాటారని పేర్కొన్నారు. బాగా ఆడారు, ఇలాగే విజయాల పరంపరను కొనసాగించండి అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. Two great partnerships to take India to victory. First, @imkuldeep18 along with @yuzi_chahal and then @imVkohli with @ajinkyarahane88. Great work, boys. Keep up the momentum, #TeamIndia. #INDvSA pic.twitter.com/tQnfETAuco — Sachin Tendulkar (@sachin_rt) 2 February 2018 తొలి మ్యాచ్‌లో భారత్ 6 వికెట్లతో దక్షిణాఫ్రికాని చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. కెప్టెన్ డు ప్లెసిస్ (112 బంతుల్లో 120; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ సాధించాడు. కుల్దీప్ 3, చహల్ 2 వికెట్లు పడగొట్టారు. వీరిద్దరు 20 ఓవర్లలో కేవలం 79 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీయడం సఫారీల పతనాన్ని శాసించింది. అనంతరం భారత్ 45.3 ఓవర్లలో 4 వికెట్లకు 270 పరుగులు చేసి విజయాన్నందుకుంది. కెప్టెన్ కోహ్లి (119 బంతుల్లో 112; 10 ఫోర్లు) వన్డేల్లో 33వ శతకం సాధించగా... అజింక్య రహానే (86 బంతుల్లో 79; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. వన్డే సిరిస్‌లో భారత్ 1–0తో ముందంజలో నిలవగా... ఆదివారం సెంచూరియన్‌లో రెండో వన్డే జరుగుతుంది. -
విజయంతో ముగించారు
పెర్త్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో 0–4తో ఓటమి పాలైన ఇంగ్లండ్, వన్డే సిరీస్‌ను విజయంతో ముగించింది. ఆస్ట్రేలియాతో ఆదివారం హోరాహోరీగా జరిగిన చివరిదైన ఐదో వన్డేలో 12 పరుగులతో విజయం సాధించి 4–1తో సిరీస్ చేజిక్కించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది. జాసన్ రాయ్ (49; 7 ఫోర్లు, 1 సిక్స్), బెయిర్‌స్టో (44; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), అలెక్స్ హేల్స్ (35; 3 ఫోర్లు, 1 సిక్స్), జో రూట్ (62; 2 ఫోర్లు) రాణించారు. ఆసీస్ బౌలర్లో ఆండ్రూ టై ఐదు వికెట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 48.2 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటైంది. స్టొయినిస్ (87; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధాటిగా ఆడగా... మ్యాక్స్‌వెల్ (34; 3 ఫోర్లు, ఒక సిక్స్), పైన్ (34; 2 ఫోర్లు, ఒక సిక్స్) ఫర్వాలేదనిపించారు. ఒక దశలో ఆసీస్ 189/4తో పటిష్టంగా కనిపించినా... ఇంగ్లండ్ పేసర్ కరన్ (5/35) విజృంభించడంతో ఆసీస్ జట్టు 58 పరుగులకే చివరి 6 వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది. మరో బౌలర్ మొయిన్ అలీకి 3 వికెట్లు దక్కాయి. కరన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’... జో రూట్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. -
వన్డేల్లోనూ అదే కథ!
సుదీర్ఘ కాలంగా భారత గడ్డపై టెస్టుల్లో దండయాత్ర చేస్తూ వచ్చినా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయిన శ్రీలంక వన్డేల్లో మాత్రం అక్కడక్కడా కొన్ని గుర్తుంచుకోదగ్గ మ్యాచ్‌లు ఆడింది.అయితే మొత్తంగా చూస్తే సొంతగడ్డపై భారత్ జోరు ముందు ద్వైపాక్షిక సిరీస్‌లలో లంక పూర్తిగా తలవంచింది. తొమ్మిది సార్లు భారత్‌తో తలపడిన ఆ జట్టు ఒక్కసారి సిరీస్‌ను ‘డ్రా’ చేసుకోవడం మినహా ప్రతీసారి ఓడింది. ఇటీవలే తమ దేశంలో కూడా టీమిండియా చేతిలో 0–5తో చిత్తుగా ఓడిన ఆ జట్టు టెస్టు సిరీస్ ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో ఇక్కడైనా పోటీ ఇస్తుందా చూడాలి. సాక్షి క్రీడా విభాగం: భారత జట్టు గత ఏడాదిన్నర కాలంలో ఏడు ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు ఆడితే ఏడింటిలోనూ విజేతగా నిలిచింది. ఇదీ టీమిండియా అద్భుత ఫామ్‌కు సూచన. సరిగ్గా ఇదే సమయంలో శ్రీలంక కూడా ఎనిమిది ద్వైపాక్షిక సిరీస్‌లలో తలపడింది. అయితే వాటిలో ఒక్క ఐర్లాండ్‌పై మినహా మిగిలిన ఏడూ ఓడింది! ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ చేతుల్లో క్లీన్‌స్వీప్ కావడానికి ముందు తమ సొంతగడ్డపై జింబాబ్వే చేతిలో కూడా ఆ జట్టు సిరీస్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో శ్రీలంక తాజా పరిస్థితి టెస్టులకంటే వన్డేల్లో భిన్నంగా ఏమీ లేదని అర్థమవుతోంది. కొన్ని మార్పులతో ఆ జట్టు వన్డే సిరీస్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మరోవైపు సూపర్ స్టార్ విరాట్ కోహ్లి లేకపోయినా భారత జట్టు అంతే బలంగా కనిపిస్తోంది. ఇటీవలే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌పై నెగ్గిన జట్టంతా ఇప్పుడు మరో సిరీస్ విజయానికి సన్నద్ధమైంది. తొలిసారి భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ తనదైన ముద్ర వేయాలని పట్టుదలగా ఉన్నాడు. రేపటి నుంచి జరిగే ఈ మూడు వన్డేల సిరీస్‌లో భారత్ ఆధిపత్యం కొనసాగుతుందా లేక శ్రీలంక కోలుకుంటుందా అనేది ఆసక్తికరం. ►9 భారతగడ్డపై భారత్, శ్రీలంక మధ్య జరిగిన వన్డే సిరీస్‌లు. ఇందులో భారత్ 8 గెలవగా... 1997–98లో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్ మాత్రం 1–1తో డ్రాగా ముగిసింది. ►48 భారత్‌లో ఇరు జట్ల మధ్య మొత్తం 48 వన్డేలు జరిగాయి. ఇందులో భారత్ 34 గెలిచి 11 ఓడింది. మరో 3 మ్యాచ్‌లలో ఫలితం రాలేదు. ►2 ఎనిమిది సిరీస్‌లలో భారత్ 2 సార్లు క్లీన్‌స్వీప్ చేసింది. సరిగ్గా మూడేళ్ల క్రితం 2014లో జరిగిన సిరీస్‌లో భారత్ 5–0తో గెలిచింది. ► 155ఓవరాల్‌గా భారత్, శ్రీలంక 155 వన్డేల్లో తలపడ్డాయి. వీటిలో భారత్ 88 గెలిచి, 55 ఓడింది. మరో 11 మ్యాచ్‌లలో ఫలితం రాలేదు. -
విరాట్ సేన 4-1తో గెలిస్తేనే..!
చెన్నై:ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో కొనసాగుతున్న విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియాను ఇప్పుడు మరొక సువర్ణావకాశం ఊరిస్తోంది. వన్డేల్లో భారత జట్టు టాప్ ర్యాంక్ కు చేరుకోవాలంటే ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ ను 4-1 తేడాతో గెలవాల్సి ఉంది. ప్రస్తుతం టీమిండియా-ఆస్ట్రేలియా జట్లు 117 పాయింట్లతో సమంగా ఉన్నాయి. అయితే ర్యాంకింగ్స్ లో మాత్రం డెసిమల్ పాయింట్ల ఆధారంగా ఆసీస్ రెండో స్థానంలో ఉండగా, భారత్ మూడో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా 119 పాయింట్లతో ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. ఇక్కడ సఫారీలను భారత్ అధిగమించాలంటే తాజా సిరీస్ ను 4-1 తో కైవసం చేసుకోవాల్సి ఉంది. ఒకవేళ భారత్ ఒక మ్యాచ్ ను మాత్రమే కోల్పోతే 120 పాయింట్లతో నంబర్ వన్ ర్యాంకును సాధిస్తుంది. మరొకవైపు ఆసీస్ కూడా 4-1తో సిరీస్ సాధించిన పక్షంలో టాప్ ర్యాంకును సొంతం చేసుకుంటుంది. అప్పుడు భారత్ 114 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలోనే ఉంటుంది. ఒకవేళ ఆసీస్ క్లీన్ స్వీప్ చేస్తే మాత్రం భారత ర్యాంకు నాల్గో స్థానానికి పడిపోతుంది. ప్రస్తుత ఆసీస్-భారత జట్లు రెండు పటిష్టంగా ఉన్న తరుణంలో ఐదు వన్డేల సిరీస్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. అయితే స్వదేశంలో జరిగే సిరీస్ కాబట్టి భారత్‌నే ఫేవరెట్ గా చెప్పుకొవచ్చు. ఇక్కడ ఇరు జట్లకు నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకునేందుకు సమాన అవకాశాలు ఉండటంతో రసవత్తర పోరు ఖాయం. ఈ నెల 17వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ఆరంభం కానుంది. -
భారత్ కు ఆసీస్ క్రికెటర్లు రాక
చెన్నై:భారత్ తో ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడేందుకు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులోని ఏడుగురు ఆటగాళ్లు శుక్రవారం చెన్నైకు చేరుకున్నారు. ఆసీస్ పరిమిత ఓవర్ల స్పెషలిస్టు ఆటగాళ్లు అరోన్ ఫించ్, కౌల్టర్ నైల్, జేమ్స్ ఫల్కనర్, ట్రావిస్ హెడ్, స్టోనిస్, ఆడమ్ జంపా, రిచర్డ్ సన్ లు ముందుగా భారత్ కు చేరుకున్న వారిలో ఉన్నారు. వీరంతా ఆస్ట్రేలియా నుంచి సింగపూర్ మీదుగా చెన్నైకు చేరుకున్నారు. కాగా, ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్‌లు మాత్రం శనివారం సాయంత్రానికి భారత్ కు చేరుకునే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ పర్యటన ముగించుకున్న ఆసీస్ జట్టులోని పలువురి ఆటగాళ్లు భారత్ కు రానున్నారు. భారత్ -ఆసీస్ జట్ల మధ్య సెప్టెంబర్ 17వ తేదీన చెన్నైలోని చెపాక్ స్టేడియంలో తొలి వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్ కు ముందు సెప్టెంబర్ 13 వ తేదీన బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ తో ఆసీస్ జట్టు వార్మప్ వన్డే ఆడనుంది. మొత్తం పర్యటనలో ఐదు వన్డేలతో పాటు, మూడు ట్వంటీ 20 మ్యాచ్ లు జరుగనున్నాయి. -
ప్రపంచకప్ సైన్యం కోసం!
♦ ప్రయోగాల బాటలో భారత్ ♦ ధోనిపైనే అందరి దృష్టి ♦ శ్రీలంకతో నేటి నుంచి ఐదు వన్డేల సిరీస్ ♦ మధ్యాహ్నం గం. 2.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌ను సునాయాసంగా 3–0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత జట్టు ఇప్పుడు వన్డే సిరీస్‌పై దృష్టి పెట్టింది. అయితే భారత్ మాత్రం దీన్ని కేవలం ద్వైపాక్షిక సిరీస్‌గా మాత్రమే చూడటం లేదు. ఎందుకంటే ఇప్పటికే చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తమ ప్రపంచకప్ సన్నాహకాలు ప్రారంభమైనట్టే అని ప్రకటించారు. ఓ ఏడాదిపాటు రొటేషన్ ప్రకారం తమ యువ ఆటగాళ్ల ప్రదర్శనను అంచనా వేయాలని భావిస్తోంది. ఇప్పటి నుంచే తమ వనరులను సరిచూసుకునేందుకు ఇది ఓ అవకాశంగా తీసుకోనుంది. ఇక సీనియర్ బ్యాట్స్‌మన్ ఎంఎస్ ధోనిపై అందరి దృష్టీ నెలకొనడంతో పరిమిత ఓవర్ల మ్యాచ్‌లో తన సత్తా ఏమిటో నిరూపించుకోవాల్సి ఉంది. మరోవైపు ప్రపంచకప్‌కు నేరుగా బెర్త్ దక్కించుకోవాలంటే శ్రీలంక మరో రెండు విజయాలు సాధించాల్సి ఉంది. అసలే ఆత్మవిశ్వాసం అడుగంటిన వేళ ఈ వన్డే సిరీస్‌లో ఆతిథ్య జట్టు ఏమేరకు రాణించగలదో వేచిచూడాలి. దంబుల్లా: టెస్టు సిరీస్‌లో దుమ్మురేపిన టీమిండియా వన్డేల్లోనూ మెరుపులు మెరిపించేందుకు ఆతృతగా ఎదురుచూస్తోంది. శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు స్థానిక రణగిరి దంబుల్లా అంతర్జాతీయ మైదానంలో తొలి మ్యాచ్ జరగనుంది. మూడు టెస్టుల సిరీస్‌లో శ్రీలంకను చితక్కొట్టిన కోహ్లి బృందం ఎనలేని ఆత్మవిశ్వాసంతో ఉంది. అలాగే 2019 వన్డే ప్రపంచకప్ కోసం జట్టును ఇప్పటి నుంచే తయారు చేయాలనే ఆలోచనతో ఉన్న టీమ్ మేనేజిమెంట్ ఆ దిశగా ఈ సిరీస్‌ను ఉపయోగించుకోవాలనుకుంటోంది. బలహీనంగా కనిపిస్తున్న లంకపై యువ ఆటగాళ్లను పరీక్షించనుంది. ఇప్పటికే యువరాజ్ సింగ్‌పై వేటు వేయగా... మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై తాను ప్రపంచ కప్ జట్టులో ఉండాల్సిన ఆటగాడినే అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇక ఈ సిరీస్‌కు ముందు జింబాబ్వేపై అవమానకర రీతిలో 2–3 తేడాతో ఓడిన లంక పటిష్ట భారత్‌ను నిలువరించి పోయిన పరువును దక్కించుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానం (88 పాయింట్లు)లో ఉన్న లంక సెప్టెంబర్ 30 కటాఫ్ తేదీలోపు నేరుగా ప్రపంచకప్ బెర్త్ దక్కించుకోవాలంటే ఈ సిరీస్‌లో కనీసం రెండు మ్యాచ్‌లు గెలవాలి. నాలుగో స్థానంలో రాహుల్... వన్డేల కోసం భారత జట్టు మారినా ఫామ్‌కు మాత్రం ఢోకా లేదు. అన్ని విభాగాల్లో జట్టు పటిష్టంగానే కనిపిస్తోంది. గాయం నుంచి కోలుకున్న అనంతరం టెస్టు సిరీస్‌లో బరిలోకి దిగిన ఓపెనర్ లోకేశ్ రాహుల్ భీకర ఫామ్‌ను చాటుకున్నాడు. అయితే వన్డేల్లో అతడిని నాలుగో స్థానంలో బరిలోకి దించనున్నారు. గతేడాది అరంగేట్రంలోనే శతకం బాదిన అతను గాయాల కారణంగా కేవలం ఆరు వన్డేలు మాత్రమే ఆడగలిగాడు. అన్నింట్లోనూ ఓపెనర్‌గానే బరిలోకి దిగాడు. అయితే ఈసారి ఓపెనింగ్ స్లాట్ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లతో భర్తీ చేస్తారు. ప్రపంచకప్ అంచనాల్లో రాహుల్ కచ్చితంగా ఉంటాడు కాబట్టి అతడిని బెంచ్‌కే పరిమితం చేయలేరు. అందుకే అతడి స్థానాన్ని మిడిలార్డర్‌కు మార్చనున్నారు. అయితే 2015 వరల్డ్ కప్ నుంచి ఇదే స్థానంలో అజింక్య రహానే మెరుగ్గానే ఆడుతున్నాడు. కానీ రహానే ఇప్పుడు మూడో ఓపెనర్‌గానే ఉండే అవకాశం ఉంది. ఐదో స్థానంలో ధోని రావడం ఖాయమే. ఇక మనీష్ పాండే, హార్దిక్ పాండ్యా ఆ తర్వాత స్థానాల్లో దిగనున్నారు. బుమ్రా, భువనేశ్వర్ పేస్ బౌలింగ్ విభాగంలో కీలకం కానున్నారు. స్పిన్‌లో కుల్దీప్తో పాటు అక్షర్ పటేల్, యజువేంద్ర చహల్‌లలో ఒకరికి చాన్స్ దక్కవచ్చు. ఒత్తిడిలో శ్రీలంక... టెస్టుల్లో వైట్‌వాష్ అనంతరం వన్డే సిరీస్ ఆడబోతున్న లంక తీవ్ర ఒత్తిడిలో ఉంది. తమ అభిమానులను తిరిగి ఆకట్టుకోవాలంటే ఈ జట్టు తమ స్థాయికి మించి ప్రదర్శన చేయాల్సిందే. కొత్త కెప్టెన్ ఉపుల్ తరంగ నేతృత్వంలో నూతనోత్తేజంతో బరిలోకి దిగాలని భావిస్తోంది. ఇరు జట్ల మధ్య జరిగిన చివరి వన్డే (చాంపియన్స్ ట్రోఫీ)లో తామే గెలవడం లంకేయులకు కొద్దిగా ఊరటనిచ్చే విషయం.తరంగ, మాథ్యూస్, చండి మాల్ బ్యాటింగ్ ఆర్డర్‌కు వెన్నెముకలా నిల వనున్నారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ పుష్పకుమార అరంగేట్రం ఖాయమే. బౌలింగ్‌లో సీనియర్ పేసర్ లసిత్ మలింగ, ఫెర్నాండోలపై ఎక్కువగా ఆధార పడనుంది. జట్లు: (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రోహిత్, రాహుల్, ధోని, పాండే/జాదవ్, పాండ్యా, కుల్దీప్, భువనేశ్వర్, చహల్, బుమ్రా. శ్రీలంక: తరంగ (కెప్టెన్), గుణతిలక, మెండిస్, డిక్వెలా, మాథ్యూస్, కపుగెడెర, హసరంగా, పెరీరా, ఫెర్నాండో, మలింగ, సందకన్. పిచ్, వాతావరణం ఈ ఏడాది జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఇక్కడ 300కు పైగా పరుగులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లోనూ అలాంటి పరిస్థితే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మధ్యాహ్నం చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. 4 శ్రీలంకతో ఈ మైదానంలో ఆడిన 11 వన్డేల్లో భారత్ నాలుగు మాత్రమే గెలిచింది. 2 ప్రపంచకప్‌లో నేరుగా అర్హత దక్కించుకునేందుకు శ్రీలంక గెలవాల్సిన మ్యాచ్‌లు. -
ఇక వన్డే సిరీస్ కు సిద్ధం
దంబుల్లా: శ్రీలంకతో్ జరిగిన మూడు టెస్టుల సిరీస్ ను 3-0 తో క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు.. ఇప్పుడు వన్డే పోరుకు సిద్ధమైంది. టెస్టుల తర్వాత లభించిన కొద్ది పాటి విరామంతో సేద తీరిన భారత్.. పరిమిత ఓవర్ల క్రికెట్ కోసం జోరుగా ప్రాక్టీస్ చేస్తోంది. ఆదివారం నుంచి ఐదు వన్డేల సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో తొలి వన్డేలో గెలుపుపై భారత్ దృష్టి సారించింది. ఈ మేరకు శుక్రవారం నెట్ ప్రాక్టీస్ లో టీమిండియా క్రికెటర్లు తీవ్రంగా శ్రమించారు. కొద్దిసేపు వార్మప్ తో పాటు ఫుట్ బాల్ ప్రాక్టీస్ చేశారు. ప్రధానంగా శిఖర్ ధావన్, రోహిత్ లు నెట్స్ లో చెమటోడ్చారు. టెస్టు సిరీస్ లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచిన శిఖర్ ధావన్ తన ఫామ్ ను వన్డేల్లో కూడా కొనసాగించాలని యోచిస్తున్నాడు. అదే సమయంలో టెస్టుల్లో చోటు దక్కని రోహిత్ శర్మ ఎలాగైనా వన్డే సిరీస్ లో సత్తాచాటుకోవాలని భావిస్తున్నాడు. కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్ కే పరిమితమైన మహేంద్ర సింగ్ ధోని సైతం జట్టుతో కలిసి ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు పేసర్ బూమ్రాలు రవిశాస్త్రి పర్యవేక్షణలో సాధన చేశారు. తిరుగులేని రికార్డు.. గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే శ్రీలంకపై భారత్ తిరుగులేని రికార్డును కల్గి ఉంది. ధోని సారథిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత లంకతో జరిగిన మూడు వన్డే సిరీస్ లను భారత్ సొంతం చేసుకుంది.. ప్రస్తుత విరాట్ సేన కూడా అదే పునరావృతం చేసేందుకు తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇదిలా ఉంచితే ఇరు జట్ల మధ్య 1985 నుంచి చూస్తే 26 ద్వైపాక్షిక వన్డేలు జరిగాయి. అందులో భారత్ 13 మ్యాచ్ ల్లో విజయం సాధించగా, లంకేయులు 10 వన్డేలు గెలిచారు.మూడు మ్యాచ్ ల్లో ఫలితం తేలలేదు. చివరిసారి 2012లో భారత్-శ్రీలంక జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. శ్రీలంకలో జరిగిన ఆ సిరీస్ ను భారత్ 4-1 తో సొంతం చేసుకుంది. ఈసారి కూడా భారత్ వన్డే సిరీస్ ను 'భారీ' తేడాతో గెలవాలనే యోచనలో్ ఉంది. శ్రీలంక అనుభవలేమిని తమకు వరంగా మార్చుకుని సిరీస్ ను వైట్ వాష్ చేయాలనే భావనలో కోహ్లి అండ్ గ్యాంగ్ ఉంది. ఆదివారం రాంగిరి దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి వన్డే జరుగనుంది. మధ్యాహ్నం గం.2.30 ని.లకు మ్యాచ్ ఆరంభం కానుంది. -
ధోని, రైనాలు సిద్ధం..కానీ!
న్యూఢిల్లీ:శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా భారత వన్డే జట్టును ఆదివారం ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో పాటు సురేశ్ రైనాలు పూర్తి ఫిట్ నెస్ ను సాధించి వన్డే సిరీస్ కు సిద్దమయ్యారు. దీనిలో భాగంగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ అనంతరం సహచరులతో కలిసి దిగిన ఫోటోను ధోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. 'ఎన్సీఏ అన్ని పరీక్షలు అయిపోయాయి. 20 మీటర్ల పరుగును 2.91సెక్లన్లలో ముగించాను. ఇక భారీ భోజనానికి సమయం అయ్యింది'అని ధోని పేర్కొన్నాడు. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత భారత ఆడే పరిమిత ఓవర్ల క్రికెట్ లో ధోనికి కచ్చితంగా స్థానం ఉంటుంది. శ్రీలంకతో వన్డే సిరీస్ కు కూడా ధోని బెర్తు ఖాయం. కాగా, గత కొంత కాలంగా భారత జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న సురేశ్ రైనా ఈసారి భారీ ఆశలతో ఉన్నాడు. కచ్చితంగా టీమిండియా జట్టులో స్థానం దక్కుతుందనే భరోసాతో ఉన్నాడు. 2015లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్ లో రైనా చివరిసారి కనిపించాడు. మరి రేపు జరిగే భారత జట్టు సెలక్షన్లో రైనాకు స్థానం దక్కుతుందో లేదో చూడాలి. ఇదే సమయంలో జడేజా, అశ్విన్, మహ్మద్ షమీలకు వన్డే సిరీస్ కు విశ్రాంతినివ్వాలని సెలక్షన్ కమిటీ యోచిస్తోంది. -
శ్రీలంక పోరాటం
విజయ లక్ష్యం 388 ప్రస్తుతం 170/3 ∙జింబాబ్వేతో టెస్టు కొలంబో: జింబాబ్వేతో ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోయిన శ్రీలంక జట్టు... ఏకైక టెస్టులో విజయం కోసం పోరాడుతోంది. 388 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక నాలుగో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 48 ఓవర్లలో మూడు వికెట్లకు 170 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (85 బంతుల్లో 60 బ్యాటింగ్; 6 ఫోర్లు) కీలక అర్ధ సెంచరీతో అండగా ఉన్నాడు. ఆటకు నేడు (మంగళవారం) చివరి రోజు కాగా విజయానికి ఆతిథ్య జట్టు మరో 218 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఏడు వికెట్లున్నాయి. గతంలో లంక అత్యధిక పరుగుల లక్ష్య ఛేదన 352 మాత్రమే (దక్షిణాఫ్రికాపై). ఓపెనర్ కరుణరత్నే (84 బంతుల్లో 49; 1 ఫోర్) ఫర్వాలేదనిపించాడు. క్రీజులో మెండిస్‌తో పాటు ఏంజెలో మాథ్యూస్ (33 బంతుల్లో 17 బ్యాటింగ్; 1 ఫోర్, 1 సిక్స్) ఉన్నాడు. క్రెమెర్‌కు రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 252/6తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన జింబాబ్వే 107.1 ఓవర్లలో 377 పరుగులకు ఆలౌటయ్యింది. సికిందర్ రజా (205 బంతుల్లో 127; 9 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్లో తొలి శతకం సాధించగా... వాలర్ (98 బంతుల్లో 68; 8 ఫోర్లు) రాణించాడు. లంక బౌలర్లలో హెరాత్‌కు ఆరు, పెరీరాకు మూడు వికెట్లు దక్కాయి. -
జింబాబ్వే జిగేల్
♦ శ్రీలంకపై తొలిసారి వన్డే సిరీస్ కైవసం ♦ 2009 తర్వాత విదేశీగడ్డపై సిరీస్ విజయం హంబన్‌టోటా: అంచనాలకు అందని రీతిలో సంచలన ఆటతీరును ప్రదర్శించిన జింబాబ్వే జట్టు శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను 3–2తో దక్కించుకుంది. సోమవారం జరిగిన ఐదో వన్డేలో ఈ జట్టు 3 వికెట్ల తేడాతో లంకపై నెగ్గింది. దీంతో 2009 అనంతరం జింబాబ్వే విదేశాల్లో వన్డే సిరీస్‌ను గెలిచింది. గత కొన్నేళ్లుగా పేలవ ప్రదర్శనతో కిందిస్థాయికి దిగజారిపోయిన జింబాబ్వేకు లంకపై సిరీస్ గెలుపుతో పునరుజ్జీవం సాధించినట్టయ్యింది. 14 నుంచి ఇరు జట్ల మధ్య కొలంబోలో ఏకైక టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంకను ఆఫ్ స్పిన్నర్ సికిందర్ రజా (3/21) కట్టడి చేయడంతో 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 203 పరుగులు మాత్రమే చేయగలిగింది. పర్యాటక జట్టు బౌలింగ్ ధాటికి గుణరత్నే (59 నాటౌట్; 4 ఫోర్లు), గుణతిలక (52; 5 ఫోర్లు) మాత్రమే అర్ధ సెంచరీలతో రాణించా రు. ఆరుగురు బ్యాట్స్‌మెన్ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. గ్రేమ్ క్రెమెర్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత స్వల్ప లక్ష్యం కోసం బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 38.1 ఓవర్లలో ఏడు వికెట్లకు 204 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్లు మసకద్జా (86 బంతుల్లో 73; 9 ఫోర్లు, 1 సిక్స్), మిరే (32 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్సర్లు)ల మధ్య తొలి వికెట్‌కు 92 పరుగులు జత చేరాయి. ముసకందా (49 బంతుల్లో 37; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. ధనంజయకు నాలుగు వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా సికిందర్ రజా, మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా మసకద్జా నిలిచారు. -
టీమిండియా సరికొత్త మైలురాయి
పోర్ట్ ఆఫ్ స్పెయిన్:వన్డే క్రికెట్ చరిత్రలో భారత జట్టు సరికొత్త మైలురాయిని సొంతం చేసుకుంది. వన్డేల్లో మూడొందల పరుగుల్ని అత్యధికసార్లు సాధించిన జట్టుగా కొత్త చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును వెనక్కునెట్టింది. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా వెస్టిండీస్ తో ఇక్కడ జరిగిన రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 43 ఓవర్లలో 5 వికెట్లకు 310 పరుగులు చేసింది. తద్వారా వన్డే ఫార్మాట్ లో మూడొందలు, అంతకుపైగా స్కోర్లను 96వ సారి భారత సాధించింది. దాంతో ఇప్పటివరకూ ఆస్ట్రేలియా పేరిట ఉన్న రికార్డును భారత్ సవరించింది. ఆస్ట్రేలియా 95 సార్లు మూడొందలకు పైగా స్కోర్లను సాధించి రెండో స్థానానికి పరిమితం కాగా, దక్షిణాఫ్రికా(77) మూడో స్థానంలో ఉంది. ఇక పాకిస్తాన్(69), శ్రీలంక(63), ఇంగ్లండ్(57), న్యూజిలాండ్(51) ఆపై వరుస స్థానాల్లో ఉన్నాయి. ఆదివారం జరిగిన డే అండ్ నైట్ వన్డేలో భారత్ 105 పరుగుల తేడాతో విండీస్ ను చిత్తు చేసింది. ఓపెనర్ అజింక్యా రహానే (104 బంతుల్లో 103; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకంతో చెలరేగగా, ధావన్ (59 బంతుల్లో 63; 10 ఫోర్లు) , కోహ్లీ (66 బంతుల్లో 87; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. భారత్ 43 ఓవర్లలో ఐదు వికెట్లకు 310 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారీ వర్షం కారణంగా మ్యాచ్ ను 43 ఓవర్లకు కుదించారు. ఆపై విండీస్ 43 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసి ఓటమి పాలైంది. -
అది వన్డేలాడే పిచ్‌లా ఉందా?
లార్డ్స్:దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరిగిన మూడో వన్డే పిచ్‌పై ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అసలు ఇది వన్డేలాడే పిచ్‌లా ఉందా అంటూ పిచ్ ను రూపొందించిన క్యూరేటర్లపై అసహనం వ్యక్తం చేశాడు. సోమవారం జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ కు దిగి 30 బంతుల్లో 20 పరుగులిచ్చి ఆరు వికెట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. దాంతో ఇంగ్లండ్ సాధారణ స్కోరుకే పరిమితమై ఘోర ఓటమి పాలైంది. అనంతరం మాట్లాడిన మోర్గాన్.. వన్డే మ్యాచ్ కు ఒక పేలవమైన పిచ్ రూపొందించడాన్ని తప్పుబట్టాడు. ' ఇది వన్డేలాడే పిచ్‌లా ఎంతమాత్రం లేదు. ఇది ఏ జట్టుకు మంచిది కాదు. ఈ తరహా పిచ్ పై ఎవరు ముందుగా బ్యాటింగ్ చేసినా కష్టాలు తప్పవు. ఇంతటి పేలవమైన పిచ్ ను ఎందుకు రూపొందించినట్లు. పిచ్ పై గడ్డి ఎక్కువగా ఉండటంతో పేసర్లకు స్వర్గధామంలా మారింది. సహజసిద్ధమైన గేమ్ ను ఆడటం కూడా కష్టంగా మారిపోయింది'అని మోర్గాన్ విమర్శించాడు.మరొకవైపు తొలి రెండు వన్డేల్లో ఓటమి పాలై సిరీస్ కోల్పోయిన దక్షిణాఫ్రికా తిరిగి తేరుకున్న తీరును మోర్గాన్ అభినందించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లు తమకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయిన విధానం ఆకట్టుకుందన్నాడు. -
టాపర్డర్ విఫలం..ఇంగ్లండ్ ఆలౌట్
►రాణించిన రబడా, పార్నెల్, మహారాజ్ లండన్: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా లార్డ్స్ మైదానంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి మ్యాచ్ లో ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ చేతులెత్తేసింది. దక్షణాఫ్రికా బౌలర్ల దాటికి 31.1 ఓవర్లలో 153 పరుగులకే కుప్పకూలింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 20 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.దక్షిణాఫ్రికా పేసర్లు రబడా, పార్నెల్, మహరాజ్‌లు విజృంభించడంతో ఇంగ్లండ్ టాపార్డర్ వరుస పెట్టి పెవిలియన్ కు క్యూకట్టేసింది. జాసన్ రాయ్(4), అలెక్స్ హేల్స్(1),జో రూట్(2), ఇయాన్ మోర్గాన్(8), బట్లర్(4),ఆదిల్ రషిద్(0)లు ఇలా వచ్చి అలా పెవిలియన్ కు చేరారు. ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ లో బేర్ స్టో (8 ఫోర్లతో 51), విల్లి (26), చివర్లో రోలాండ్ జోన్స్ (5 ఫోర్లతో 37) రాణించడంతో ఇంగ్లండ్ 154 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడాకు(4) వికెట్లు దక్కగా, పార్నెల్, మహరాజ్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. ఇప్పటికే సిరీస్ ను 2-0తో ఇంగ్లండ్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. -
ఐదు ఓవర్లు.. ఆరు వికెట్లు!
లండన్: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా లార్డ్స్ మైదానంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి మ్యాచ్ లో ఇంగ్లండ్ విలవిల్లాడుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 20 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దక్షిణాఫ్రికా పేసర్లు విజృంభించడంతో ఇంగ్లండ్ టాపార్డర్ వరుస పెట్టి పెవిలియన్ కు క్యూకట్టేసింది. జాసన్ రాయ్(4), అలెక్స్ హేల్స్(1),జో రూట్(2), ఇయాన్ మోర్గాన్(8), బట్లర్(4),ఆదిల్ రషిద్(0)లు ఇలా వచ్చి అలా పెవిలియన్ కు చేరారు. ఇంగ్లండ్ కోల్పోయిన ఆరు వికెట్లలో రబడా నాలుగు వికెట్లు సాధించగా, పార్నెల్ రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జాసన్ రాయ్ ను రబడా పెవిలియన్ కు పంపి ఇంగ్లండ్ కు షాకిచ్చాడు. అనంతరం మూడు పరుగుల వ్యవధిలో రూట్ కూడా రబడా బౌలింగ్ లోనే అవుట్ కావడంతో ఇంగ్లండ్ 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆపై మోర్గాన్, హేల్స్, బట్లర్, రషిద్‌లు స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో ఇంగ్లండ్ ఐదు ఓవర్లలోపే ఆరు వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇప్పటికే సిరీస్ ను 2-0తో ఇంగ్లండ్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. -
సఫారీలకు ఇంగ్లండ్ షాక్
హెడింగ్లీ: మూడు వన్డేల సిరీస్ లో దక్షిణాఫ్రికాకు ఇంగ్లండ్ షాకిచ్చింది. బుధవారం రాత్రి ఇక్కడ జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ 72 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 340 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్(61) మంచి ఆరంభానివ్వగా, జో రూట్(37) ఫర్వాలేదనిపించాడు. ఆ తరువాత కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(107;93 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) శతకంతో మెరిసి ఇంగ్లండ్ భారీ స్కోరుకు పునాది వేశాడు. ఇక చివర్లో మొయిన్ అలీ (77 నాటౌట్; 51 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 339 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా 45 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటై ఓటమి పాలైంది. హషీమ్ ఆమ్లా (73), డు ప్లెసిస్(67), ఏబీ డివిలియర్స్(45)లు రాణించినా జట్టుకు గెలిపించలేకపోయారు. వీరి మినహా మిగిలిన బ్యాటింగ్ ఆర్డర్ తీవ్రంగా నిరాశపరచడంతో సఫారీలకు ఓటమి తప్పలేదు. -
బంగ్లాదేశ్ తొలిసారి..
డబ్లిన్: సంచలన విజయాలకు మారుపేరైన బంగ్లాదేశ్ తాజాగా మరో అద్భుత విజయాన్ని సాధించింది. బుధవారం ఇక్కడ జరిగిన వన్డే మ్యాచ్ లో న్యూజిలాండ్ ను బంగ్లాదేశ్ ఐదు వికెట్ల తేడాతో చిత్తు చేసి సరికొత్త ఘనతను సొంతం చేసుకుంది. ఇలా న్యూజిలాండ్ ను విదేశీ గడ్డపై ఓడించడం బంగ్లాదేశ్ కు ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 271 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి ఓటమి పాలైంది. బంగ్లాదేశ్ ఓపెనర్లలో సౌమ్య సర్కార్ డకౌట్ గా అవుటైనప్పటికీ, మరో ఓపెనర్ తమీమ్ ఇక్బాల్(65) రాణించాడు. అతనికి జతగా షబ్బిర్ రెహ్మాన్(65) కూడా హాఫ్ సెంచరీ సాధించడంతో రెండో వికెట్ కు 136 పరుగుల భాగస్వామ్యం లభించింది. ఆపై ముష్పికర్ రహీమ్(45 నాటౌట్), మొహ్మదుల్లా(46)లు రాణించడంతో బంగ్లాదేశ్ 10 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించింది. అంతకుముందు న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. లాథమ్(84), బ్రూమ్(63), రాస్ టేలర్(60 నాటౌట్) హాఫ్ సెంచరీలు సాధించిన జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించారు. -
తొలిసారి వైట్‌వాష్..
బార్బోడాస్: ఇంగ్లండ్ తో స్వదేశంలో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో వెస్టిండీస్ వైట్ వాష్ అయ్యింది. గురువారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో వెస్టిండీస్ 186 పరుగుల తేడాతో ఘోర ఓటమి పాలైంది.దాంతో సిరీస్ ను విండీస్ 0-3 తో కోల్పోయింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ నిర్దేశించిన 329 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ 39.2 ఓవర్లలో142 పరుగులకే చాపచుట్టేసి భారీ ఓటమిని మూటగట్టుకుంది.విండీస్ ఆటగాళ్లలో కార్టర్(46) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టుకు దారుణమైన ఓటమి ఎదురైంది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ వన్డే చరిత్రలో ఐదో 'అతి పెద్ద' విజయాన్ని నమోదు చేసుకుంది. వన్డే క్రికెట్ లో ఇంగ్లండ్ పై స్వదేశంలో కరీబియన్లు వైట్ వాష్ కావడం ఇదే తొలిసారి. అంతకుముందెన్నడూ స్వదేశంలో వెస్టిండీస్ జట్టు ఇంతటి దారుణమైన ఓటమిని మూటగట్టుకోలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50.0 ఓవర్లలో 328 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఆటగాళ్లు జో రూట్(101), హేల్స్(110)లు శతకాలు సాధించి భారీ స్కోరు సాధించడంలో సహకరించారు.