పూణే: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో తృటిలో సెంచరీని(106 బంతుల్లో 98; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) చేజార్చుకున్న టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధవన్‌ను మరో అరుదైన రికార్డు ఊరిస్తుంది. రెండో వన్డేలో అతను మరో 94 పరుగులు సాధిస్తే, వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 6వేల పరుగుల మైలురాయిని చేరుకున్న మూడో క్రికెటర్‌గా చరిత్ర పుటల్లోకెక్కానున్నాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ హషీమ్ ఆమ్లా(123 ఇన్నింగ్స్‌లు) అగ్రస్థానంలో ఉండగా, టీమిండియా సారధి విరాట్ కోహ్లి(136 ఇన్నింగ్స్‌లు) రెండో స్థానంలోనూ, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(139 ఇన్నింగ్స్‌లు) మూడో స్థానంలో ఉన్నారు.
35 ఏళ్ల గబ్బర్ ప్రస్తుతం 137 ఇన్నింగ్స్‌ల్లో 45.4 సగటుతో 5,906 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 31 అర్ధసెంచరీలు ఉన్నాయి. శుక్రవారం జరుగబోయే రెండో వన్డేలో అతను మరో 94 పరుగులు చేస్తే, కేన్ విలియమ్సన్‌ను వెనక్కునెట్టి మూడో స్థానానికి చేరుకుంటాడు. దీంతోపాటు అతన్ని మరో రికార్డు సైతం ఊరిస్తుంది. వన్డేల్లో 6000 పరుగులు మార్కును చేరుకుంటే, ఆ ఘనత సాధించిన 10వ భారత క్రికెటర్‌గా ఆయన రికార్డు సాధించనున్నాడు. కాగా, మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 66 పరుగుల తేడాతో విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే రేపు ఇదే వేదికగా జరుగనుంది.
చదవండి: మోదీ.. పాక్ ప్రధానికి చేసిన ట్వీట్ సంతోషానిచ్చింది
Comments
Please login to add a commentAdd a comment