India vs England
-
షమీకి విశ్రాంతి.. టీమిండియా రీ ఎంట్రీ అప్పుడే!
టీమిండియా పేసర్ మహ్మద్ షమీ మరికొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడు. ఈ క్రమంలో విజయ్ హజారే ట్రోఫీ 2024-25 సీజన్లో తొలి మ్యాచ్‌కు ఈ బెంగాల్ బౌలర్ దూరం కానున్నాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న షమీ.. దాదాపు ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు.మోకాలు ఉబ్బిపోయింది!ఇటీవల జరిగిన దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్ తరఫున షమీ బరిలోకి దిగాడు. ఈ టోర్నీలో మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన ఈ రైటార్మ్ పేసర్ పదకొండు వికెట్ల తీశాడు. అయితే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా షమీ మరోసారి గాయపడినట్లు సమాచారం. అతడి మోకాలు ఉబ్బిపోయినట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు.అందుకే షమీని హడావుడిగా తిరిగి జట్టులోకి చేర్చుకునే పరిస్థితి లేదని.. ఆస్ట్రేలియా పర్యటనకు అతడు మొత్తంగా దూరమయ్యాడనే సంకేతాలు ఇచ్చాడు. అందుకు తగ్గట్లుగానే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్‌కు ప్రకటించిన బెంగాల్ జట్టులో షమీ పేరు కనిపించింది.విశ్రాంతినిచ్చాంఇక డిసెంబరు 21 నుంచి మొదలుకానున్న ఈ టోర్నీలో బెంగాల్ తొలుత ఢిల్లీ జట్టుతో తలపడనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో జరుగనున్న ఈ మ్యాచ్‌కు షమీ దూరంగా ఉండనున్నాడు. ‘‘విజయ్ హజారే ట్రోఫీలో మా తొలి మ్యాచ్‌కు షమీ అందుబాటులో ఉండడు. ఈ టీమిండియా వెటరన్ బౌలర్‌కు విశ్రాంతినిచ్చాం’’ అని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ పేర్కొంది.చాంపియన్స్ ట్రోఫీకి సన్నద్ధంఈ పరిణామాల నేపథ్యంలో షమీ ఆస్ట్రేలియా పర్యటనకు పూర్తిగా దూరమైనట్లు తెలుస్తోంది. టెస్టు క్రికెట్ ఆడేందుకు అతడు ఫిట్ లేని కారణంగా.. టీమిండియా మేనేజ్మెంట్ మరికొన్నాళ్లపాటు అతడిని పక్కన పెట్టనుందట.ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 జరుగనున్న విషయం తెలిసిందే. అయితే, అంతకంటే ముందు టీమిండియా ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడుతుంది. అప్పుడే షమీ.. భారత జట్టులో పునరాగమనం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన టీమిండియా మూడు టెస్టులు ముగిసే సరికి 1-1తో సమంగా ఉంది. తదుపరి మెల్బోర్న్, సిడ్నీల్లో భారత్- ఆసీస్ మధ్య మిగిలిన రెండు టెస్టులు జరుగనున్నాయి.చదవండి: భారత్‌తో టెస్టులకు ఆసీస్ జట్టు ప్రకటన.. అతడిపై వేటు.. ‘జూనియర్’ పాంటింగ్‌కు చోటు -
ధోనిని చిన్న పిల్లాడిలా మార్చిన విజయం..!
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి మిస్టర్ కూల్ కెప్టెన్ అన్న బిరుదు ఉంది. ధోని ఆన్ ఫీల్డ్ ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా చాలా నింపాదిగా కనిపించేవాడు. టెన్షన్ అన్నది అతని ముఖంలో కనపడేది కాదు. విజయాలకు ఉప్పొంగిపోవడం.. ఓటములకు ఢీలా పడిపోవడం ధోనికి తెలీదు. అలాంటి ధోని ఒకానొక సందర్భంలో చిన్న పిల్లాడిలా మారిపోయాడు. ఎగిరెగిరి గంతులేశాడు. ఆ సందర్భం 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ నాటిది.2013, జూన్ 23న ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన ఫైనల్లో భారత్.. ఆతిథ్య ఇంగ్లండ్‌పై 5 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొంది, రెండో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆ మ్యాచ్‌లో గెలుపు ఖరారైన వెంటనే మిస్టర్ కూల్ కెప్టెన్ మిస్టర్ జాలీ కెప్టెన్‌గా మారిపోయాడు. ఆ విజయం ధోనికి, అటూ టీమిండియాకు చాలా సంతృప్తినిచ్చింది. అందుకే ధోని తన శైలికి భిన్నంగా ప్రవర్తించాడు.Relive @ashwinravi99's magical ball in #CT13 🪄He bowled 4 overs, gave 15 runs including a maiden and took key wickets of Joe Root & Jonathan Trott in the final 👌pic.twitter.com/zBr1VkBVy8— CricTracker (@Cricketracker) September 17, 2024ధోని వరల్డ్‌కప్‌లు గెలిచినప్పుడు కూడా అంత ఎగ్జైట్ కాలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ధోనికి అంత తృప్తినిచ్చింది. ఈ విషయాన్ని ధోని స్వయంగా పలు సందర్భాల్లో చెప్పాడు. ఫైనల్లో భారత్ గెలిచిన తీరు.. నాటి మ్యాచ్‌లో టీమిండియా ప్రదర్శన అద్భుతంగా ఉన్నాయి. అందుకే భారత్‌కు అది చిరస్మరణీయ విజయంగా మిగిలిపోయింది. ముఖ్యంగా ధోని కెరీర్లో హైలైట్‌గా నిలిచిపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపుతో మూడు ఐసీసీ టైటిల్స్ (టీ20, వన్డే వరల్డ్‌కప్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీ) గెలిచిన తొలి కెప్టెన్‌గా ధోని చరిత్ర సృష్టించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. వన్డే ఫార్మాట్లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వర్షం కారణంగా టీ20 మ్యాచ్‌గా మార్చబడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి 43, రవీంద్ర జడేజా 33 నాటౌట్, శిఖర్ ధవన్ 31 పరుగులు చేశారు. రోహిత్ శర్మ 9, దినేశ్ కార్తీక్ 6, సురేశ్ రైనా 1, ధోని 0, అశ్విన్ 1 పరుగుకు ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో రవి బొపారా 3, ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ట్రెడ్‌వెల్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్.. భారత బౌలర్లు కలిసి కట్టుగా రాణించడంతో 5 పరుగుల స్వల్ప తేడాతో పరాజయంపాలైంది. రవిచంద్రన్ అశ్విన్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. తన కోటా నాలుగు ఓవర్లు వేసి ఓ మెయిడిన్ సహా రెండు కీలక వికెట్లు తీశాడు. మ్యాచ్ చివరి ఓవర్లో అశ్విన్ 15 పరుగులను విజయవంతంగా కాపాడుకుని భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అశ్విన్ వేసిన మ్యాచ్ చివరి బంతిని మ్యాజిక్ డెలివరీగా ఇప్పటికీ చెప్పుకుంటారు.భారత విజయంలో అశ్విన్‌తో పాటు రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, ధోని కూడా కీలక భూమికలు పోషించారు. ఇషాంత్, జడ్డూ చెరో 4 ఓవర్లు వేసి తలో 2 వికెట్లు తీయగా.. ధోని రెండు కీలకమైన స్టంపౌట్లు, ఓ రనౌట్ చేశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఇయాన్ మోర్గన్ (33), రవి బొపారా (30), జోనాథన్ ట్రాట్ (20), ఇయాన్ బెల్ (13) రెండంకెల స్కోర్లు చేశారు. కుక్ (2), రూట్ (7), బట్లర్ (0), బ్రేస్నెన్ (2) దారుణంగా విఫలమయ్యారు. ఈ గెలుపు అనంతరం భారత సంబురాలు అంబరాన్నంటాయి. ధోనితో పాటు అంతర్జాతీయ క్రికెట్లో అప్పుడప్పుడే షైన్ అవుతున్న కోహ్లి ఈ విజయాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తున్నారు.భారత క్రికెట్ అభిమానులకు ఈ విజయం చిరకాలం గుర్తుండిపోతుంది. మినీ వరల్డ్‌కప్‌గా చెప్పుకునే ఈ టైటిల్‌ను గెలిచిన అనంతరం భారత్ 11 ఏళ్ల పాటు ఒక్క ఐసీసీ టైటిల్‌ను కూడా సాధించలేకపోయింది. చివరికి 2024లో టీమిండియా కల సాకారమైంది. భారత్ 2024 టీ20 వరల్డ్‌కప్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఈసారి రోహిత్ శర్మ టీమిండియాకు టైటిల్‌ను అందించాడు. భారత్ మొత్తంగా రెండు వన్డే వరల్డ్‌కప్‌లు (1983, 2011), రెండు టీ20 ప్రపంచకప్‌లు (2007, 2024), రెండు ఛాంపియన్స్ ట్రోఫీలు (2002, 2013) గెలిచింది. -
ఇండియా, ఇంగ్లండ్ సిరీస్‌లో స్వల్ప మార్పులు
వచ్చే ఏడాది భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ సిరీస్‌లోని తొలి టీ20 చెన్నైలో, రెండో టీ20 కోల్‌కతాలో జరగాల్సి ఉన్నాయి. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్‌ల వేదికలు తారుమారు కానున్నాయి. తొలి టీ20 కోల్‌కతాలో, రెండో టీ20 చెన్నైలో జరుగనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అలాగే ఈ ఏడాది బంగ్లాదేశ్‌తో జరిగే ఓ టీ20 మ్యాచ్ వేదిక కూడా మారనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో భారత్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్‌ల్లోని తొలి టీ20 ముందుగా ప్రకటించిన ధర్మశాల వేదికగా కాకుండా గ్వాలియర్‌లో జరుగనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. -
ఇంగ్లండ్‌తో సెమీఫైనల్.. టీమిండియా గెలుపుకు పునాది వేసిన అక్షర్
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఇంగ్లండ్‌తో నిన్న (జూన్ 27) జరిగిన రెండో సెమీఫైనల్లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రోహిత్ శర్మ (39 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 23, ఫోర్, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కష్టతరమైన పిచ్‌పై ఈ స్కోర్ ఫైటింగ్ స్కోర్‌గా చెప్పవచ్చు. ఈ స్కోర్‌ను ఛేదించే క్రమంలో దూకుడుగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్‌కు టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ కళ్లెం వేశాడు. 20 పరుగుల వ్యవధిలో మూడు కీలకమైన వికెట్లు (బట్లర్, మొయిన్ అలీ, బెయిర్‌స్టో) తీసి టీమిండియా గెలుపుకు పునాది వేశాడు.అక్షర్ రెచ్చిపోవడంతో డిఫెన్స్‌లో పడిపోయిన ఇంగ్లండ్.. ఆతర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. అక్షర్‌తో పాటు మరో ఎండ్‌లో కుల్దీప్ యాదవ్ (4-0-19-3), బుమ్రా (2.4-0-12-2) కూడా చెలరేగడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఆ జట్టు 16.4 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటై ఘెర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ గెలుపుతో టీమిండియా 2022 ఎడిషన్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. మూడు కీలకమైన వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనానికి పునాది వేసిన అక్షర్ పటేల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.కాగా, భారతకాలమానం రేపు (జూన్ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
Shivam Dube: ఐపీఎల్లో హీరో.. ఇండియా తరఫున జీరో
ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ 2024లో టీమిండియా ఆటగాడు శివమ్ దూబే వరుసగా విఫలమవుతున్నాడు. మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం 106 పరుగులు మాత్రమే చేశాడు. దూబే వరుస వైఫల్యాల నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దూబేను తక్షణమే జట్టు నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దూబే స్థానంలో రింకూ సింగ్, సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్‌లలో ఎవరో ఒకరికి అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఆల్‌రౌండర్ కోటాలో జట్టులోకి తీసుకుంటే కనీసం బ్యాటింగ్కైనా న్యాయం చేయలేకపోతున్నాడని మండిపడుతున్నారు. ఐపీఎల్ 2024 ఫామ్‌ను (14 మ్యాచ్‌ల్లో 162.30 స్ట్రయిక్‌రేట్‌తో 396 పరుగులు, 3 అర్దసెంచరీలు) చూసి హార్దిక్‌తో పోల్చి తప్పు చేశామని బాధపడుతున్నారు. ఐపీఎల్లో హీరో ఇండియా తరఫున జీరో అంటూ ధ్వజమెత్తుతున్నారు. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో గోల్డెన్ డకౌట్ కావడంతో దూబేపై అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కొందరు అభిమానులు దూబేపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. కీలకమైన మ్యాచ్‌లో కీలక సమయంలో బ్యాటింగ్‌కు దిగి తొలి బంతికే ఔట్ కావడాన్ని అభిమానులు సహించలేకున్నారు. వరుసగా విఫలమవుతున్నా దూబేకు అవకాశాలు ఇస్తున్నందుకు కెప్టెన్ రోహిత్ శర్మను తప్పుబడుతున్నారు. ఇచ్చిన అవకాశాలు చాలు ఫైనల్లో దూబేని తప్పించి ఇతరులకు అవకాశం ఇవ్వాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నారు.కాగా, ఇంగ్లండ్‌తో నిన్న (జూన్ 27) జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్స్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో దూబే విఫలమైనా టీమిండియా తొలుత బ్యాటింగ్ చేస్తూ 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.రోహిత్ శర్మ (39 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 23, ఫోర్, 2 సిక్సర్లు) రాణించగా.. కోహ్లి (9), దూబే (0), పంత్ (4) నిరాశపరిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డన్ 3 వికెట్లు పడగొట్టగా.. రీస్ టాప్లీ, జోఫ్రా ఆర్చర్, సామ్ కర్రన్, ఆదిల్ రషీద్ తలో దక్కించుకున్నారు.అనంతరం 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (4-0-19-3), అక్షర్ పటేల్ (4-0-23-3), బుమ్రా (2.4-0-12-2) ధాటికి 16.4 ఓవర్లలో 103 పరుగులకే చాపచుట్టేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జోస్ బట్లర్ (23), హ్యారీ బ్రూక్ (25), జోఫ్రా ఆర్చర్ (21), లివింగ్‌స్టోన్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కాగా, భారతకాలమానం రేపు (జూన్ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
'పర్ఫెక్ట్ రివెంజ్' అంటే ఇదే.. ఇంగ్లండ్ లెక్క సరి చేసిన టీమిండియా
టీ20 వరల్డ్‌కప్ 2024 రెండో సెమీఫైనల్లో టీమిండియా ఇంగ్లండ్‌ను 68 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో టీమిండియా 2022 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. గత వరల్డ్‌కప్ సెమీస్‌లో ఇంగ్లండ్ టీమిండియాను 10 వికెట్ల తేడాతో ఓడించింది. ఇందుకు ప్రతిగా టీమిండియా ప్రస్తుత ప్రపంచకప్ సెమీస్‌లో ఇంగ్లండ్ 10 వికెట్లు పడగొట్టి చిత్తు చేసింది. టీమిండియా ఇంగ్లండ్ లెక్క సరి చేయడంతో భారత క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 'పర్ఫెక్ట్ రివెంజ్' అంటే ఇదే అంటూ కామెంట్లు చేస్తున్నారు.THE WINNING CELEBRATION OF TEAM INDIA. 🇮🇳- History will be rewritten tomorrow. 🏆pic.twitter.com/atRTQyA1ZA— Mufaddal Vohra (@mufaddal_vohra) June 28, 20242022 ప్రపంచకప్ సెమీస్‌లో టీమిండియాను ఓడించి ఫైనల్స్‌కు చేరిన ఇంగ్లండ్.. తుది సమరంలో పాకిస్తాన్‌ను ఓడించి రెండోసారి జగజ్జేతగా నిలిచింది. ప్రస్తుత వరల్డ్‌కప్ సెమీస్‌లో ఇంగ్లండ్‌కు ఓడించి ఫైనల్స్‌కు చేరని భారత్.. తుది సమరంలో సౌతాఫ్రికాను ఓడించి రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరిస్తుందని భారత క్రికెట్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.INDIA TOOK A PERFECT REVENGE OF 2022 SEMIS. 🇮🇳- England defeated India by 10 wickets in the 2022 Semi Final.- India took all 10 wickets of England in the 2024 Semi Final. pic.twitter.com/7OKz2yvrsT— Mufaddal Vohra (@mufaddal_vohra) June 27, 2024కాగా, నిన్న (జూన్ 27) జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై విజయం సాధించిన టీమిండియా మూడోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రోహిత్ శర్మ (39 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 23, ఫోర్, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కోహ్లి (9), దూబే (0) మరోసారి విఫలం కాగా.. పంత్ (4) నిరాశపరిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డన్ 3 వికెట్లు పడగొట్టగా.. రీస్ టాప్లీ, జోఫ్రా ఆర్చర్, సామ్ కర్రన్, ఆదిల్ రషీద్ తలో దక్కించుకున్నారు.అనంతరం 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (4-0-19-3), అక్షర్ పటేల్ (4-0-23-3), బుమ్రా (2.4-0-12-2) ధాటికి 16.4 ఓవర్లలో 103 పరుగులకే చాపచుట్టేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జోస్ బట్లర్ (23), హ్యారీ బ్రూక్ (25), జోఫ్రా ఆర్చర్ (21), లివింగ్‌స్టోన్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కాగా, భారతకాలమానం రేపు (జూన్ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
T20 World Cup 2024: ఫైనల్లో టీమిండియా.. హిట్‌మ్యాన్ భావోద్వేగం
టీమిండియా రోహిత్ శర్మ తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు. ఎప్పుడూ నవ్వుతూ, ఇతరులను ఆటపట్టిస్తూ సరదాగా కనిపించే రోహిత్.. టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై విజయానంతరం ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. ఫైనల్స్‌కు చేరామన్న సంతోషంలో ఉబికి వస్తున్న ఆనందభాష్పాలు ఆపుకునే ప్రయత్నం చేశాడు. చేతిని అడ్డుపెట్టుకుని తన భావోద్వేగాన్ని కవర్ చేసుకున్నాడు. అప్పుడే డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చిన విరాట్ అతని భుజం తట్టాడు. రోహిత్, కోహ్లి ఒకే ఫ్రేమ్‌లో ఉన్న చిత్రం సోషల్‌మీడియాలో వైరలవుతుంది.Rohit Sharma got emotional on the Semis Finals victory. 🥹- Virat Kohli confronted him! ❤️ pic.twitter.com/JMVT2qFx2q— Mufaddal Vohra (@mufaddal_vohra) June 27, 2024కాగా, నిన్న (జూన్ 27) జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2024 రెండో సెమీఫైనల్లో టీమిండియా ఇంగ్లండ్‌ను 68 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి, మూడోసారి ఫైనల్స్‌కు (టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో) చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. రోహిత్ శర్మ (39 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 23, ఫోర్, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కోహ్లి (9), దూబే (0) మరోసారి విఫలం కాగా.. పంత్ (4) నిరాశపరిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డన్ 3 వికెట్లు పడగొట్టగా.. రీస్ టాప్లీ, జోఫ్రా ఆర్చర్, సామ్ కర్రన్, ఆదిల్ రషీద్ తలో దక్కించుకున్నారు.అనంతరం 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (4-0-19-3), అక్షర్ పటేల్ (4-0-23-3), బుమ్రా (2.4-0-12-2) ధాటికి 16.4 ఓవర్లలో 103 పరుగులకే చాపచుట్టేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జోస్ బట్లర్ (23), హ్యారీ బ్రూక్ (25), జోఫ్రా ఆర్చర్ (21), లివింగ్‌స్టోన్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కాగా, భారతకాలమానం రేపు (జూన్ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
కోహ్లి ఫైనల్లో ఫామ్‌లోకి వస్తాడు.. టైటిల్ గెలిచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాం: రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. సహచర ఓపెనర్, భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఫామ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో కోహ్లి వరుసగా విఫలమవుతున్న నేపథ్యంలో హిట్‌మ్యాన్ సహచరుడిని వెనకేసుకొచ్చాడు. కోహ్లి నాణ్యమైన ప్లేయర్ అని రోహిత్ కితాబునిచ్చాడు. కోహ్లి ప్రాముఖ్యత గురించి అందరికీ తెలుసని అన్నాడు. ఫామ్ కోల్పోవడం తాత్కాలికమని తెలిపాడు. 15 ఏళ్లకు పైగా క్రికెట్ ఆడిన వ్యక్తికి ఫామ్‌ను తిరిగి దొరకబుచ్చుకోవడం పెద్ద సమస్య కాదని అన్నాడు. ఫైనల్ కోసం కోహ్లి తన ఫామ్‌ను దాచిపెట్టుకున్నాడని పేర్కొన్నాడు.ఇంగ్లండ్‌ను మట్టికరిపించి ఫైనల్‌కు అర్హత సాధించిన అనంతరం రోహిత్ మరిన్ని విషయాలు షేర్ చేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఈ గెలుపు చాలా సంతృప్తినిచ్చింది. ఈ మ్యాచ్‌ను ఇలా (ఏకపక్షంగా) గెలవడానికి ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. ఛాలెంజింగ్‌గా ఉన్న పరిస్థితులను మేము స్వీకరించాము. టోర్నీ ఆరంభం నుంచి ఇదే మా విజయ రహస్యం. బౌలర్లు, బ్యాటర్లు పరిస్థితులను సరిగ్గా అంచనా వేసి అందుకు అనుగుణంగా ఆడారు. ఓ దశలో 140-150 స్కోర్‌కే పరిమితమవుతానుకున్నాం. నేను, సూర్య మంచి భాగస్వామ్యం నెలకొల్పడంతో 170 పరుగుల మార్కును తాకగలిగాం. ఈ పిచ్‌పై ఇది చాలా మంచి స్కోర్. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అక్షర్, కుల్దీప్ మా గన్ స్పిన్నర్స్. వీరిద్దరు ప్రత్యర్దిపై ఒత్తిడి తెచ్చారు. బుమ్రా గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా అతను మా మ్యాచ్ విన్నర్. మ్యాచ్ మొత్తంలో మేము చాలా కామ్‌గా ఉన్నాం.ఇలా ఉంటే మంచి నిర్ణయాలు తీసుకోగలం. మేమె ఏ దశలోనూ ఆందోళన చెందలేదు. ఇదే మమ్మల్ని గెలిపించింది. ఫైనల్లో ఇదే తరహాలో నాణ్యమైన క్రికెట్ ఆడాలని అనుకుంటున్నాం. అందు కోసం శాయశక్తులా ప్రయత్నిస్తాం. ప్రస్తుతం జట్టు మంచి షేప్‌లో ఉంది. అందరూ బాగా ఆడుతున్నారు. ఫైనల్లోనూ ఇదే కొనసాగుతుందని భావిస్తున్నానని రోహిత్ అన్నాడు.కాగా, ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మూడోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఇంగ్లండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటైంది. రోహిత్ శర్మ (57), సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కుల్దీప్ యాదవ్ (4-0-19-3), అక్షర్ పటేల్ (4-0-23-3), బుమ్రా (2.4-0-12-2) భారత విజయంలో కీలకపాత్రలు పోషించారు. భారతకాలమానం రేపు (జూన్ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన రో'హిట్'మ్యాన్ శర్మ.. రికార్డులు బద్దలు
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఇంగ్లండ్‌తో నిన్న (జూన్ 27) జరిగిన రెండో సెమీఫైనల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో తాను చేసిన 57 పరుగుల్లో 6 ఫోర్లు బాదిన హిట్‌మ్యాన్.. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక బౌండరీలు బాదిన (43 మ్యాచ్‌ల్లో 113) ఆటగాడిగా శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్దనే (111) రికార్డును బద్దలు కొట్టాడు. ఇదే మ్యాచ్‌లో రెండు సిక్సర్లు కూడా బాదిన రోహిత్.. క్రిస్ గేల్ (63) తర్వాత టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో 50 సిక్సర్లు మార్కు తాకిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ మరో రెండు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక సిక్సర్లు (22) బాదిన ఆటగాడిగా.. భారత కెప్టెన్‌గా 5000 పరుగుల మైలురాయిని దాటిన ఐదో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక సిక్సర్లుక్రిస్ గేల్- 63రోహిత్ శర్మ- 50జోస్ బట్లర్- 43డేవిడ్ వార్నర్- 40యువరాజ్ సింగ్- 33విరాట్ కోహ్లి- 33టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక బౌండరీలురోహిత్ శర్మ- 113జయవర్దనే- 111విరాట్- 105వార్నర్- 103తిలకరత్నే దిల్షన్- 101భారత కెప్టెన్‌గా అత్యధిక పరుగులువిరాట్- 12883ధోని- 11207అజహారుద్దీన్- 8095గంగూలీ- 7643రోహిత్- 5012ఐసీసీ నాకౌట్స్‌లో అత్యధిక సిక్సర్లురోహిత్ శర్మ- 22క్రిస్ గేల్- 21ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మూడోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఇంగ్లండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటైంది. రోహిత్ శర్మ (57), సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కుల్దీప్ యాదవ్ (4-0-19-3), అక్షర్ పటేల్ (4-0-23-3), బుమ్రా (2.4-0-12-2) భారత విజయంలో కీలకపాత్రలు పోషించారు. భారతకాలమానం రేపు (జూన్ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
T20 World Cup 2024: ఇలా జరిగితే ఫైనల్స్‌కు టీమిండియా..!
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా గయానా వేదికగా రేపు (భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు) జరగాల్సిన భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచ్‌కు వరుణ గండం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మ్యాచ్ జరిగే సమయానికి 88 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వెదర్ ఫోర్‌క్యాస్ట్ పేర్కొంది. ఈ నేపథ్యంలో రేపటి మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే పరిస్థితి ఏంటి..?షెడ్యూల్ ప్రకారం భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే (ఒక్క బంతి కూడా పడకుండా) సూపర్-8 దశలో గ్రూప్ (గ్రూప్-1) టాపర్‌గా ఉన్న కారణంగా టీమిండియా ఫైనల్ చేరుతుంది.ఒకవేళ భారత్-ఇంగ్లండ్ సెమీస్ మ్యాచ్‌కు వర్షం కారణంగా పాక్షికంగా అంతరాయం కలిగితే.. ఫలితం తేలేందుకు 250 నిమిషాల అదనపు సమయం ఉంటుంది. ఇక్కడ కూడా ఫలితం తేలకపోతే డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఫలితాన్ని నిర్దారిస్తారు.తొలి సెమీఫైనల్‌కు రిజర్వ్ డేమరోవైపు సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ట్రినిడాడ్ వేదికగా రేపు ఉదయం 6 గంటలకు ప్రారంభంకావాల్సిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉండటంతో వంద శాతం ఫలితం తేలే అవకాశం ఉంది. -
T20 World Cup 2024: సెమీస్‌లో టీమిండియా ప్రత్యర్ధి ఇంగ్లండ్..!
టీ20 వరల్డ్‌కప్ 2024 గ్రూప్-2 సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. ఈ గ్రూప్ నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సెమీస్‌కు చేరుకున్నాయి. గ్రూప్-1 సెమీస్ బెర్త్‌లు నేడు (జూన్ 24) జరుగబోయే మ్యాచ్‌లతో ఖరారవుతాయి. ఇవాళ రాత్రి (భారతకాలమానం ప్రకారం) జరిగే భారత్-ఆసీస్ మ్యాచ్ ఫలితంతో గ్రూప్-1 సెమీస్ బెర్త్‌లపై క్లారిటీ వస్తుంది. ఏ కారణాల చేతైనా ఈ మ్యాచ్ ఫలితంతో క్లారిటీ రాకపోతే రేపు ఉదయం జరిగే బంగ్లాదేశ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ వరకు ఆగాల్సి ఉంటుంది.కాగా, గ్రూప్-2 నుంచి సెమీస్ బెర్త్‌లు ఖరారు కావడంతో సెమీఫైనల్లో ఏయే జట్లు తలపడతాయనే అంశంపై అంచనాలు మొదలయ్యాయి. నేడు ఆసీస్‌తో జరుగబోయే మ్యాచ్‌లో భారత్ గెలిచినా లేక ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనా సెమీస్‌లో టీమిండియా.. ఇంగ్లండ్‌తో తలపడాల్సి ఉంటుంది. ఎందుకంటే.. టీమిండియా ఆసీస్‌పై గెలిచినా లేక ఈ మ్యాచ్ రద్దైనా గ్రూప్-1లో టీమిండియా అగ్రస్థానంలో ఉంటుంది. అప్పుడు షెడ్యూల్ ప్రకారం గ్రూప్-1 టాపర్.. గ్రూప్-2లో రెండో స్థానంలో ఉన్న జట్టుతో సెమీస్‌లో తలపడాల్సి ఉంటుంది. అలాగే గ్రూప్-1లో రెండో స్థానంలో నిలిచే జట్టు.. గ్రూప్-2 టాపర్‌ను ఢీకొట్టాల్సి ఉంటుంది. గ్రూప్-2లో సౌతాఫ్రికా అగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ రెండో స్థానంలో నిలిచిందిసెమీస్లో తమ ప్రత్యర్ధిగా ఎవరుండాలని ఎంచుకుని సౌలభ్యం ప్రస్తుతం టీమిండియాకు దొరికింది. ఆసీస్‌పై గెలిస్తే ఇంగ్లండ్.. ఆసీస్ చేతిలో ఓడితే సౌతాఫ్రికాను టీమిండియా ఢీకొట్టాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే, గ్రూప్-2కు సంబంధించి యూఎస్ఏపై గెలుపుతో ఇంగ్లండ్.. వెస్టిండీస్‌ను చిత్తు చేసి సౌతాఫ్రికా సెమీస్‌ఫైనల్స్ చేరిన విషయం తెలిసిందే. -
వన్డేల్లో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన కేదార్ జాదవ్.. కోహ్లితో కలిసి..!
టీమిండియా బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ఇవాళ (జూన్ 3) ప్రకటించాడు. వైవిధ్యభరితమైన ఆటగాడిగా పేరున్న కేదార్.. టీమిండియా తరఫున పలు మరపురాని ఇన్నింగ్స్‌లు ఆడి గుర్తింపు తెచ్చుకున్నాడు. కేదార్ రిటైర్మెంట్ నేపథ్యంలో అతనాడిన ఓ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌పై ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతుంది.2017లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేదార్ చేసిన మెరుపు శతకాన్ని జనాలు గుర్తు చేసుకుంటున్నారు. భారత ఫుల్ టైమ్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లికి అది తొలి మ్యాచ్. పూణే వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో కేదార్ సొంత అభిమానుల (కేదార్ స్వస్థలం పూణే) మధ్యలో పేట్రేగిపోయాడు. కేవలం 65 బంతుల్లోనే శతక్కొట్టి టీమిండియా విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో 351 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా 63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ సమయంలో బరిలోకి దిగిన లోకల్ బాయ్ కేదార్.. ఎవరూ ఊహించని రీతిలో చెలరేగిపోయాడు. 76 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 120 పరుగులు చేశాడు. కేదార్‌కు జతగా మరో ఎండ్‌లో కోహ్లి కూడా శివాలెత్తిపోయాడు. కోహ్లి 105 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 122 పరుగులు చేశాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 200 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి టీమిండియాను విజయపు అంచుల వరకు తీసుకెళ్లారు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (40 నాటౌట్) లాంఛనంగా మ్యాచ్‌ను ముగించాడు. కేదార్, కోహ్లి చెలరేగడంతో ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో భారత్ 3 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. ఈ మ్యాచ్‌లో కేదార్ ఆడిన ఇన్నింగ్స్ వన్డే క్రికెట్లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచిపోయింది. కేదార్, కోహ్లి శతక్కొట్టుడు ముందు 351 పరుగుల భారీ లక్ష్యం చిన్నబోయింది. కేదార్ ఆడిన ఆ చిరస్మరణీయ ఇన్నింగ్స్ నెటిజన్లు ప్రస్తుతం గుర్తు చేసుకుంటున్నారు.కేదార్ కెరీర్లో ఈ ఇన్నింగ్స్‌తో పాటు మరో మరపురాని ఇన్నింగ్స్ కూడా ఉంది. 2018 ఐపీఎల్లో సీఎస్కేకు ప్రాతినిథ్యం వహించిన కేదార్.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన సీజన్ తొలి మ్యాచ్‌లో గాయంతో బాధపడుతూనే ఆఖర్లో వచ్చి తన జట్టుకు అద్భుత విజయాన్నందించాడు. ఆ మ్యాచ్‌లో గాయం బారిన పడిన కేదార్.. సీఎస్కే 9 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగి మ్యాచ్‌ను ముగించాడు. కేదార్ దేశవాలీ కెరీర్లో సైతం ఇలాంటి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు చాలా ఉన్నాయి.39 ఏళ్ల కేదార్.. టీమిండియా తరఫున 73 వన్డేలు, 9 టీ20లు ఆడి 2 సెంచరీలు (వన్డేల్లో), 7 అర్దసెంచరీల సాయంతో 1611 పరుగులు చేశాడు. కేదార్ ఖాతాలో 27 వన్డే వికెట్లు కూడా ఉన్నాయి.ఐపీఎల్లో 2010 నుంచి 2023 సీజన్ వరకు వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించిన కేదార్.. తన కెరీర్లో 95 మ్యాచ్‌లు ఆడి 123.1 స్ట్రయిక్‌రేట్‌తో 4 అర్ద సెంచరీల సాయంతో 1208 పరుగులు చేశాడు.కేదార్ దేశవాలీ ట్రాక్ రికార్డు విషయానికొస్తే.. పూణేలో పుట్టి మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహించే కేదార్.. ఆ జట్టు తరఫున 87 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 186 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 163 టీ20లు ఆడాడు. ఇందులో 27 సెంచరీలు, 56 అర్ద సెంచరీల సాయంతో 14 వేల పైచిలుకు పరుగులు సాధించి, 65 వికెట్లు పడగొట్టాడు. -
సర్ఫరాజ్ ఖాన్ తండ్రికి సర్ప్రైజ్ గిఫ్ట్! వీడియో
టీమిండియా తరఫున అరంగేట్రంలోనే అదరగొట్టిన బ్యాటర్లలో ఒకడిగా పేరొందాడు సర్ఫరాజ్ ఖాన్. రంజీల్లో పరుగుల వరద పారించినా.. భారత జట్టులో చోటు కోసం మాత్రం సుదీర్ఘకాలం ఎదురుచూడాల్సి వచ్చింది ఈ ముంబై ప్లేయర్‌కి! అయితేనేం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సత్తా చాటాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సర్ఫరాజ్.. మెరుపు అర్ధ శతకం సాధించాడు. తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి తానేంటో నిరూపించుకున్నాడు. ఇక సర్ఫరాజ్ ఖాన్‌కు తన తండ్రి నౌషద్ ఖాన్ కోచ్, మెంటార్ అన్న విషయం తెలిసిందే. అరంగేట్రం సందర్భంగా టీమిండియా క్యాప్‌ను ముద్దాడి పుత్రోత్సాహంతో పొంగిపోయాడు నౌషద్. కుమారుడి కోసం తాను చేసిన త్యాగాలు ఫలించినందుకు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంత గొప్ప వ్యక్తికి బహుమతిగా ఈ దృశ్యాలు ప్రతి ఒక్కరి మనసును మెలిపెట్టగా.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర సైతం ఉద్వేగానికి లోనయ్యారు. ‘‘ఎప్పుడూ ధైర్యం కోల్పోకూడదు. కఠిన శ్రమ, ఓపిక ఉండాలి. తండ్రి కంటే తన పిల్లలను ఇంత బాగా ఇన్స్పైర్ చేయగల వ్యక్తి ఎవరు ఉంటారు? అలాంటి గొప్ప వ్యక్తి నౌషద్ ఖాన్.. ఆయన గనుక ఒప్పుకొంటే.. మహీంద్రా థార్‌తో సత్కరించాలనుకుంటున్నా’’ అని బహుమతి ప్రకటించారు. తాజాగా తన మాట నిలబెట్టుకున్నారు ఆనంద్ మహీంద్ర. సర్ఫరాజ్ ఖాన్ టెస్టు అరంగేట్రం సందర్భంగా చెప్పినట్లుగా నౌషద్ ఖాన్‌కు మహీంద్రా కారును అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు టీమిండియా తరఫున మూడు టెస్టులు ఆడిన సర్ఫరాజ్ ఖాన్ 200 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక సర్ఫరాజ్ ప్రతిభను గుర్తించిన బీసీసీఐ ఇటీవలే అతడికి సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో చేర్చింది. గ్రేడ్- సీ ప్లేయర్‌గా సర్ఫరాజ్ ఖాన్‌కు అవకాశమిచ్చింది. చదవండి: #Kohli: ఇలాంటి ప్రవర్తన అస్సలు ఊహించలేదు.. నీ స్థాయికి ఇది తగునా కోహ్లి? Anand Mahindra fulfilled his promise and gifted a Mahindra Thar to Sarfaraz Khan's father, Naushad. Mahindra had promised to give the gift following Sarfaraz's Test debut. His father played a key role in Sarfaraz's success and coached him right from childhood. pic.twitter.com/Ktf070Qf5U — Sanjay Kishore (@saintkishore) March 23, 2024 -
సర్ఫరాజ్ తండ్రితో కలిసి ఆడాను: రోహిత్ శర్మ
స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 4-1 తేడాతో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కోహ్లి, మహ్మద్ షమీ, రాహుల్ వంటి స్టార్ క్రికెటర్లు లేకుండానే ఇంగ్లండ్‌ను రోహిత్ సారథ్యంలోని యంగ్ ఇండియా చిత్తు చేసింది. కాగా ఈ టెస్టు సిరీస్‌తో నలుగురు యువ క్రికెటర్లు భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. అందులో ఒకడు ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్. భారత జట్టులో చోటు కోసం చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న సర్ఫరాజ్‌కు రాజ్‌కోట్ టెస్టు ముందు సెలక్టర్లు పిలుపునిచ్చారు. కేఎల్ రాహుల్ గాయం కారణంగా దూరం కావడంతో సర్ఫరాజ్‌కు భారత జట్టులో చోటు దక్కింది. జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ రాజ్‌కోట్ టెస్టుతో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. దీంతో భారత జట్టు ప్రాతినిథ్యం వహించాలన్న అతడి కల నేరవేరింది. కాగా ఇది సర్ఫరాజ్ ఒక్కడి కల మాత్రమే కాదు తన తండ్రి నౌషాద్ ఖాన్‌ది కూడా. సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషాద్ ఖాన్ కూడా క్రికెటరే. అతడు భారత జట్టు తరపున ఆడాలని కలలు కన్నాడు. కానీ అతడి కలను తన కొడుకు రూపంలో నేరవేర్చుకున్నాడు. సర్ఫరాజ్ టెస్టు క్యాప్‌ను అందుకునే సమయంలో నౌషాద్ ఖాన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. నౌషాద్ ఖాన్ చిన్న కొడుకు ముషీర్ ఖాన్ కూడా దేశీవాళీ క్రికెట్లో దుమ్ములేపుతున్నాడు. ఇక తాజాగా రోహిత్ శర్మ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా "టీమ్ రో" మాట్లాడుతూ.. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన కుర్రాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. "యువ క్రికెటర్లతో కలిసి ఆడటాన్ని ఎంజాయ్ చేశాను. వారంతా చాలా అల్లరి చేసే వారు. నాకు వారిలో చాలా మంది తెలుసు. వారి బలాలు ఏంటో, వాళ్లు ఎలా ఆడాలనుకుంటారో తెలుసు. వారికి అంతర్జాతీయ స్ధాయిలో అనుభవం లేకపోయినప్పటికి దేశీవాళీ క్రికెట్లో ఎలా ఆడారో నాకు తెలుసు. కాబట్టి వారి గత ఇన్నింగ్స్‌లను గుర్తు చేస్తూ ఆత్మవిశ్వాసం నింపడమే నా పని. కుర్రాళ్లు కూడా నా నమ్మకాన్ని వమ్ముచేయలేదు. అద్బుతంగా రాణించారు. అరంగేట్రంలోనే అదరగొట్టారు. వారి డెబ్యూ సమయంలో తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నారు. ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. వారు ప్రదర్శన పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను. సర్ఫరాజ్ కుటంబంతో నాకు మంచి అనుబంధం ఉంది. నేను నా చిన్నతనంలో కంగా లీగ్‌లో సర్ఫరాజ్ ఖాన్ తండ్రితో కలిసి ఆడాను. అతని తండ్రి ఎడమచేతి బ్యాటర్. ఆయన దూకుడుగా ఉండేవాడు. సర్ఫరాజ్ భారత్‌కు ప్రాతినిథ్యం వహించడం వెనక అతడి తండ్రి కృషి ఎంతో ఉందని" హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు. -
అప్పటికే అప్పుల్లో కూరుకుపోయాం.. బాకీలన్నీ తీర్చేసా!
ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన క్రికెటర్లలో ధ్రువ్ జురెల్ ఒకడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను ఐపీఎల్-2022 వేలంలో రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. రూ. 20 లక్షల కనీస ధరకు అతడిని సొంతం చేసుకుంది. అయితే, ఆ ఏడాది మాత్రం ధ్రువ్ జురెల్‌కు తుదిజట్టులో చోటు దక్కలేదు. బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయినప్పటికీ సానుకూల దృక్పథంతో వేచి చూసి..గతేడాది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. ఐపీఎల్-2023 సీజన్లో 11 ఇన్నింగ్స్ ఆడిన ధ్రువ్ 152 పరుగులు చేశాడు. ఇక దేశవాళీ క్రికెట్లోనూ రాణించిన ఈ యూపీ వికెట్ కీపర్ బ్యాటర్.. ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసి.. తనదైన ముద్ర వేయగలిగాడు. ముఖ్యంగా రాంచిలో జరిగిన నాలుగో టెస్టులో విలువైన ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించి సత్తా చాటాడు. అయితే, చాలా మంది క్రికెటర్లలాగే ధ్రువ్ జురెల్ కూడా అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చాడు. అతడి తండ్రి కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు. తనలాగే కొడుకును కూడా సైనికుడిని చేయాలని భావించారు. కానీ జురెల్ మాత్రం క్రికెటర్ అవుతానని పట్టుబట్టాడు. ఈ క్రమంలో అతడి తల్లి అండగా నిలిచి.. తన వద్ద ఉన్న చిన్నపాటి బంగారు వస్తువులు కూడా అమ్మేసి కిట్ కొనేందుకు డబ్బులిచ్చారు. ఎల్లవేళలా కొడుకుకు మద్దతుగా నిలిచారు. తండ్రి కూడా అర్థం చేసుకుని బాసటగా నిలవడంతో ధ్రువ్ జురెల్ తన కలలు నెరవేర్చుకున్నాడు. ఇక ఇప్పుడు ఐపీఎల్-2024లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో గతాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘‘నాకు మొట్టమొదటిసారి ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కిన సమయంలో నా తల్లిదండ్రులు పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు. నేను ఆ బాకీలన్నీ తీర్చేశాను. మా అమ్మ కోసం కొన్ని నగలు కూడా కొన్నాను’’ అని ధ్రువ్ జురెల్ ఉద్వేగానికి లోనయ్యాడు. తల్లిదండ్రులు తనకోసం పడిన కష్టం వెలకట్టలేనిదని పేర్కొన్నాడు. కాగా మార్చి 22న ఐపీఎల్ తాజా సీజన్ మొదలుకానుండగా.. రాజస్తాన్ మార్చి 24న లక్నో సూపర్ జెయింట్స్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. -
రోహిత్ భయ్యా తిడతాడు కానీ... టీమిండియా నయా స్టార్
Seeing Rohit Sharma "Pyaar Sa Aata Hai": ‘‘రోహిత్ భాయ్ కెప్టెన్సీలో ఆడటాన్ని పూర్తిగా ఆస్వాదిస్తాను. చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతున్నాను. ఐపీఎల్‌లోనూ తొమ్మిది- పదేళ్ల పాటు ఆడాను. దేశవాళీ క్రికెట్లో ఇప్పటికీ ఆడుతూనే ఉన్నా. అయితే, అన్నింటితో పోలిస్తే రోహిత్ భయ్యా కెప్టెన్సీలో ఆడటం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆయన మంచి కప్టెన్. ఆయన పట్ల నాకు ఆరాధనా భావం ఉంది. జట్టులో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తాడు. టీమ్ మీటింగ్ జరుగుతున్నపుడు రోహిత్ భయ్యా మాట్లాడటం చూస్తుంటే నాకు ఆమిర్ ఖాన్ సినిమా ‘లగాన్’ గుర్తుకువస్తూ ఉంటుంది’’ అని టీమిండియా నయా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అన్నాడు. ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్ సందర్భంగా ముంబై స్టార్ సర్ఫరాజ్ భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. రాజ్‌కోట్ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన ఈ రంజీ వీరుడు.. మెరుపు అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాతి మ్యాచ్‌లలోనూ భాగమై మరో రెండు హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మతో తన అనుబంధం, నాయకుడిగా అతడు వ్యవహారశైలి గురించి తాజాగా ఆజ్‌తక్‌తో మాట్లాడాడు సర్ఫరాజ్ ఖాన్. ‘‘రోహిత్ భయ్యా మమ్మల్ని మరీ ఎక్కువగా ఏం తిట్టడు. కాకపోతే సరైన సమయంలో సరైన విధంగా ఆడేలా కాస్త గట్టిగానే హెచ్చరిస్తాడు. మాట్లాడటంలో ప్రతి ఒక్కరికి తమదైన స్టైల్ ఉంటుంది. రోహిత్ భయ్యా సరాదాగా అన్న మాటల్ని కూడా కొందరు వేరే విధంగా అనుకుంటారు. నాకైతే ఆయన మమ్మల్ని తిట్టినట్లు అనిపించదు. ముంబైవాళ్లంతా అలాగే మాట్లాడతారు. ఆటగాళ్లతో రోహిత్ భయ్యా ఎంతో కలుపుగోలుగా ఉంటారు. తను సీనియర్, కెప్టెన్ అన్నట్లుగా వ్యవహరించరు’’ అని సర్ఫరాజ్ ఖాన్ చెప్పుకొచ్చాడు. కాగా గత ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సర్ఫరాజ్‌ను ఆ ఫ్రాంఛైజీ విడిచిపెట్టగా.. వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. చదవండి: IPL 2024: అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. బీసీసీఐ కీలక నిర్ణయం? -
నన్ను క్షమించండి సన్నీ సార్.. మరోసారి అలా చేయను: సర్ఫరాజ్
టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తన అరంగేట్ర టెస్టు సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. రాజ్‌కోట్ వేదికగా జరిగిన ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టు ద్వారా డెబ్యూ చేసిన సర్ఫరాజ్.. తన బ్యాటింగ్ స్కిల్స్‌తో అందరని అకట్టుకున్నాడు. సర్ఫరాజ్ తన అరంగేట్ర టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలోనూ హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. అదేవిధంగా ధర్మశాల వేదికగా ఐదో టెస్టులోనూ ఈ ముంబైకర్ సత్తాచాటాడు. అయితే ఆఖరి టెస్టులో మంచి టచ్‌లో కన్పించిన సర్ఫరాజ్ ఓ చెత్త షాట్ ఆడి తన వికెట్‌ను కోల్పోయాడు. టీ బ్రేక్ అనంతరం ఎదుర్కొన్న తొలి బంతికే సర్ఫరాజ్ పెవిలియన్‌కు చేరాడు. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో బంతిని తప్పుగా అంచనా వేసిన సర్ఫరాజ్.. లేట్ కట్ షాట్ ఆడి స్లిప్‌లో జో రూట్ చేతికి చిక్కాడు. మొత్తంగా 60 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ ఖాన్ 8 ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 56 పరుగులు చేశాడు. కాగా సర్ఫరాజ్ ఔటైన వెంటనే భారత బ్యాటర్లు వరుస క్రమంలో పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ సమయంలో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్.. సర్ఫరాజ్ ఔటైన తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. "బంతి ఒక్కసారిగా పైకి పిచ్ అయ్యింది. అది షాట్ ఆడాల్సిన బాల్ కాదు. అయినా ఆడేందుకు వెళ్లి మూల్యం చెల్లించుకున్నాడు. టీ బ్రేక్ తర్వాత తొలి బంతినే ఆవిధంగా ఆడాల్సిన అవసరం లేదు. కాస్త దృష్టి పెట్టి ఆడాల్సింది. ఇటువంటి సమయంలో దిగ్గజ ఆటగాడు డాన్ బ్రాడ్‌మాన్ మాటలను గుర్తు చేసుకోవాలి. తాను 200 పరుగులు సాధించినా సరే ఎదుర్కొనే తర్వాత బంతిని సున్నా స్కోరు పై ఉన్నాను అని అనుకుని ఆడేవాడినని చెప్పేవారు. కానీ సర్ఫరాజ్ టీ విరామం తర్వాత తొలి బంతికే చెత్త షాట్ ఆడి ఔటయ్యాడని" సన్నీ కాస్త సీరియస్ అయ్యాడు. అయితే గవాస్కర్ అంతలా సీరియస్ అవ్వడానికి ఓ కారణముంది. ఎందుకంటే మ్యాచ్‌కు ముందు షాట్ల ఎంపికపై దాదాపు గంట సేపు సర్ఫరాజ్‌కు గవాస్కర్ కీలక సూచనలు చేశాడు. కానీ సర్ఫరాజ్ మాత్రం చెత్త షాట్ ఆడి ఔట్ కావడంతో లిటిల్ మాస్టర్‌కు కోపం వచ్చింది. అయితే గవాస్కర్ సీరియస్ కావడంతో సర్ఫరాజ్ ఖాన్ బాధపడ్డాడని, ఆయనకు క్షమాపణలు కూడా చెప్పాడని ప్రముఖ వ్యాపారవేత్త శ్యామ్ భాటియా తెలిపారు. ఈయన గవాస్కర్‌కు అత్యంత సన్నిహితుడు. ‘సన్నీ సార్‌కు నేను క్షమాపణలు చెబుతున్నా. నేను తప్పు చేశా. మరోసారి అలాంటి తప్పిదం పునరావృతం కాదు’ అని యువ ఆటగాడు అన్నాడు’’ అని శ్యామ్ భాటియా చెప్పుకొచ్చారు. చదవండి: Ind vs Eng: పుజారాను వద్దని.. వాళ్ల కోసం రోహిత్, ద్రవిడ్‌లను ఒప్పించి మరీ.. -
అంతా అతడే చేశాడు.. వాళ్ల కోసం రోహిత్, ద్రవిడ్‌లను ఒప్పించి..
విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి సీనియర్లు జట్టుతో లేకున్నా.. యువ జట్టుతోనే ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్ గెలిచాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. వీరిద్దరి గైర్హాజరీ.. మధ్యలో ఓ మ్యాచ్‌కు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి, బ్యాటర్‌గా కేఎస్ భరత్ వైఫల్యం.. ఫలితంగా ఏకంగా ఐదుగురు క్రికెటర్ల అరంగేట్రం. రెండో టెస్టుతో రజత్ పాటిదార్, మూడో టెస్టుతో సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, నాలుగో టెస్టుతో ఆకాశ్ దీప్, ఐదో టెస్టుతో దేవ్‌దత్ పడిక్కల్ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. వీరిలో రజత్ తప్ప అందరూ తమను తామను నిరూపించుకున్నారు. అయితే, ధ్రువ్ జురెల్, పడిక్కల్‌ల అరంగేట్రం గురించి తాజాగా ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. వీరిద్దరిని తుదిజట్టులో ఆడించేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌లను ఒప్పించేందుకు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ స్వయంగా రంగంలోకి దిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం 15 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన జురెల్‌ను కేఎస్ భరత్ స్థానంలో వికెట్ కీపర్‌గా ఎంపిక చేయడం, ఛతేశ్వర్ పుజారాను పూర్తిగా పక్కనపెట్టి పడిక్కల్‌ను ఆడించడంలో అగార్కర్‌దే ప్రధాన పాత్ర అని తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు హిందుస్తాన్ టైమ్స్ వెల్లడించింది. ‘‘జట్టు యాజమాన్యం జురెల్‌పై పూర్తి విశ్వాసంతో లేనపుడు అగార్కర్ ఒక్కడే అతడి పేరును బలపరిచాడు. నిజానికి రెడ్ బాల్ క్రికెట్లో తగినంత అనుభవం లేని కుర్రాణ్ణి.. అదీ ఇంగ్లండ్ వంటి జట్టుతో కీలక సిరీస్‌లో అరంగేట్రం చేయించడం అంటే సాహసంతో కూడుకున్న నిర్ణయం. అయితే, అగార్కర్ మాత్రం అతడిపై పూర్తి నమ్మకం ఉంచాడు. ఇక జట్టులో సీనియర్ల గైర్హాజరీలో ఛతేశ్వర్ పుజారాను తిరిగి తీసుకువద్దామా అనే చర్చ కూడా నడిచింది. రంజీ ట్రోఫీలో పరుగులు చేస్తున్న పుజారాకు పిలుపునివ్వాలని భావించినపుడు.. అగార్కర్ మాత్రం పడిక్కల్ వైపే మొగ్గు చూపాడు. రంజీ ట్రోఫీ టోర్నీలో అద్బుత శతకం(150)తో సత్తా చాటిన పడిక్కల్ వంటి మంచి హైట్ ఉన్న ఆటగాడు.. అంతగా అనుభవం లేని ఇంగ్లండ్ స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోగలడని విశ్వసించాడు’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. కాగా నాలుగో టెస్టులో టీమిండియా విజయానికి ధ్రువ్ జురెల్ ఇన్నింగ్సే ప్రధాన కారణమన్న విషయం తెలిసిందే. అదే విధంగా.. నామమాత్రపు ఐదో టెస్టులో పడిక్కల్ అద్భుత అర్ధ శతకం(65)తో చెలరేగాడు. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్.. స్పందించిన రోహిత్ -
సత్తాచాటిన రోహిత్ శర్మ, జైశ్వాల్.. టాప్ 10 లోకి
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన భారత ఆటగాళ్లు.. ఇప్పుడు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ సత్తాచాటాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ టాప్ 10లోకి దూసుకొచ్చారు. హిట్‌మ్యాన్ ఏకంగా ఐదు స్ధానాలు ఎగబాకి ఆరో ర్యాంక్‌కు చేరుకోగా..జైస్వాల్ రెండు స్థానాలు మెరుగుపరుచుకొని ఎనిమిదో స్థానంలో నిలిచాడు. వీరిద్దరితో పాటు ధర్మశాల టెస్టులో సెంచరీతో చెలరేగిన శుబ్‌మన్ గిల్ సైతం తన కెరీర్లో బెస్ట్ ర్యాంక్‌ను పొందాడు. 11 స్ధానాలు ఎగబాకి 20వ ర్యాంక్‌కు గిల్ చేరుకున్నాడు. ఇక టెస్టుల్లో నెంబర్ వన్ బ్యాటర్‌గా న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్, పాకిస్తాన్ స్టార్ బాబర్ ఆజం వరుసగా రెండు మూడు స్దానాల్లో నిలిచారు. ఇక ఇది ఇలా ఉండగా.. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్ధానంలో నిలిచాడు. బుమ్రాను వెనుక్కి నెట్టి అశ్విన్ టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. చదవండి: #David Miller: మూడు మ్యాచ్‌లకు రూ.1.25 కోట్లు.. పెళ్లినే వాయిదా వేసుకున్న స్టార్ క్రికెటర్ -
యశస్వీ జైశ్వాల్‌కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు..
టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ తొలిసారి ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అత్యుత్తమ ప్రదర్శనకు గాను జైశ్వాల్‌కు ఈ అవార్డు దక్కింది. స్వదేశలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో జైశ్వాల్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. గత నెలలో ఇంగ్లండ్‌తో మూడు టెస్టులు ఆడిన యశస్వీ 112 సగటుతో ఏకంగా 560 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఏకంగా రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి. వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో 209 పరుగులు చేసిన జైశ్వాల్.. రాజ్‌కోట్ టెస్టులో 214 పరుగులతో చెలరేగాడు. ఓవరాల్‌గా ఇంగ్లండ్ సిరీస్‌లో జైశ్వాల్ ఏకంగా 712 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా ఈ అవార్డు కోసం జైశ్వాల్‌తో పాటు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్, శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంక పోటీపడ్డారు. కానీ ఐసీసీ మాత్రం ఎక్కువ ఓట్లు వచ్చిన జైశ్వాల్‌నే ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపిక చేసింది. మరో వైపు ఫిబ్రవరి నెల మహిళల ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ అన్నాబెల్ సదర్లాండ్ ఎంపికైంది. గత నెలలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సదర్లాండ్ అద్భుతంగా రాణించింది. చదవండి: వరల్డ్‌కప్ జట్టులో కోహ్లికి నో ఛాన్స్.. కఠిన నిర్ణయం తీసుకోనున్న బీసీసీఐ Presenting the ICC Player of the Month for February 🙌 Congratulations, Yashasvi Jaiswal 👏👏 🗣️🗣️ Hear from the #TeamIndia batter on receiving the award@ybj_19 pic.twitter.com/tl1tJepdFJ — BCCI (@BCCI) March 12, 2024 -
Rohit Sharma: క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్క మొనగాడు
టీమిండియా కెప్టెన్ రోహిత్ క్రికెట్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యంకాని ఓ గొప్ప రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్ట్‌లో సెంచరీతో (103) కదంతొక్కిన హిట్‌మ్యాన్.. తన టెస్ట్ కెరీర్లో 12వ శతకాన్ని నమోదు చేశాడు. రోహిత్‌తో పాటు శుభ్‌మన్ గిల్ (110), అశ్విన్ (9 వికెట్లు), కుల్దీప్ యాదవ్ (7 వికెట్లు) చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా, రోహిత్ శర్మ తన టెస్ట్ కెరీర్లో సెంచరీ చేసిన ప్రతి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. రోహిత్ తన కెరీర్లో చేసిన 12 టెస్ట్ సెంచరీలు టీమిండియా విజయానికి దోహదపడ్డాయి. ఇలా ఓ ఆటగాడు చేసిన తన తొలి 12 టెస్ట్ సెంచరీలు జట్టు విజయానికి దోహదపడటం క్రికెట్ చరిత్రలో ఇదే ప్రధమం. ఇన్నేళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో రోహిత్ తప్ప ఈ ఘనతను ఎవరూ సాధించలేకపోయారు. లేటు వయసులో టెస్ట్ ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన రోహిత్.. వయసు మీద పడుతున్నా ఏమాత్రం తగ్గకుండా ఎవరికీ సాధ్యంకాని ఈ గొప్ప రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో భీకర ఫామ్‌లో ఉండిన హిట్‌మ్యాన్ ఈ సిరీస్‌లో ఆడిన 9 ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు, అర్దసెంచరీ సాయంతో 44.44 సగటున 400 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో హిట్‌మ్యాన్ నాలుగో లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. సిరీస్ ఆధ్యాంతం రోహిత్‌తో పాటు యువ ఆటగాళ్లు సత్తా చాటడంతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. తొలి టెస్ట్ కోల్పోయిన టీమిండియా.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి, సిరీస్ ఎగరేసుకుపోయింది. -
మురళీథరన్ రికార్డు బద్దలు కొట్టిన అశ్విన్
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్ట్‌లో 9 వికెట్లు తీసి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించిన రవిచంద్రన్ అశ్విన్.. ఈ ప్రదర్శనతో దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీథరన్ పేరిట ఉన్న పలు రికార్డులను బద్దలుకొట్టాడు. ఇందులో ఓ రికార్డు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ టెస్ట్ సిరీస్‌లో 25 అంతకంటే ఎక్కువ వికెట్లు అత్యధిక సార్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. మురళీథరన్ పేరిట ఉండిన ఈ రికార్డును అశ్విన్ బద్దలుకొట్టాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు (800) సాధించిన మురళీ తన టెస్ట్ కెరీర్లో (ఓ టెస్ట్ సిరీస్‌లో) 25 అంతకంటే ఎక్కువ వికెట్ల ఘనతను ఆరు సార్లు నమోదు చేయగా.. అశ్విన్ ఏడు సందర్భాల్లో ఈ ఘనత సాధించాడు. కేవలం 100 టెస్ట్‌ల్లోనే 516 వికెట్లు (36 ఐదు వికెట్ల ఘనతలు) తీసిన అశ్విన్.. మరో 285 వికెట్లు తీస్తే మురళీథరన్ పేరిట ఉన్న అత్యధిక వికెట్ల రికార్డును బద్దలు కొడతాడు. కాగా, ధర్మశాల వేదికగా జరిగిన టెస్ట్‌లో ఇంగ్లండ్‌పై ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. తొలి టెస్ట్ కోల్పోయిన టీమిండియా.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ సిరీస్‌లో 5 మ్యాచ్‌ల్లో 26 వికెట్లు పడగొట్టిన అశ్విన్ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లో యాష్ రెండు ఐదు వికెట్ల ఘనతలు, ఓ నాలుగు వికెట్ల ఘనత నమోదు చేశాడు. -
పవర్ హిట్టర్.. వన్డేల్లోనూ అరంగేట్రం చేయిస్తే!
ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు టీమిండియా యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్. టెస్టుల్లో తనదైన ముద్ర వేస్తూ ఓపెనర్‌గా జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ముఖ్యంగా ఇటీవల సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో యశస్వి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఐదు మ్యాచ్‌లలో కలిపి (తొమ్మిది ఇన్నింగ్స్‌లో) ఏకంగా సగటు 89తో.. 712 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా రెండు డబుల్ సెంచరీలు ఉండటం విశేషం. ఈ క్రమంలో.. టీమిండియా 4-1తో సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కైవసం చేసుకున్నాడు యశస్వి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్.. యశస్వి జైస్వాల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘జైస్వాల్‌ను ఎన్నో ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. రంజీ ట్రోఫీ, ఐపీఎల్‌లోనూ తన ఆట తీరును గమనిస్తూనే ఉన్నాం. అతడో అసాధారణ ఆటగాడు. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనలతో రాణించి టీ20లలోనూ అడుగుపెట్టాడు. అయితే, ఇంతవరకు వన్డేల్లో మాత్రం అతడికి అవకాశం రాలేదు. 50 ఓవర్ల ఫార్మాట్ క్రికెట్లోనూ యశస్వితో అరంగేట్రం చేయిస్తే మంచిది. అప్పుడు అతడు.. టెస్టు, టీ20, వన్డే ఇలా మూడు ఫార్మాట్ల ప్లేయర్‌గా జట్టుకు ఉపయోగపడతాడు. బ్యాటర్‌గా డిఫెన్సివ్‌గా.. అదే సమయంలో దూకుడుగా ఎలా ఉండాలో తెలిసిన ఆటగాడు. ఆండర్సన్ బౌలింగ్‌లో మూడు బంతుల్లో మూడు సిక్సర్లు బాదిన విధానం అతడి పవర్ హిట్టింగ్ నైపుణ్యాలకు నిదర్శనం’’ అని మహ్మద్ కైఫ్ స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ముంబై బ్యాటర్ యశస్వి జైస్వాల్ 26 సిక్సర్లు బాదారు. ముఖ్యంగా రాజ్‌కోట్ టెస్టులో ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్స్‌లు కొట్టడం హైలైట్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే.. ముంబై బ్యాటర్ యశస్వి జైస్వాల్ 2023లో వెస్టిండీస్ పర్యటన సందర్భంగా టెస్టు, అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేశాడు. చదవండి: శార్దూల్ ఏమన్నాడో విన్నాను: డొమెస్టిక్ క్రికెట్‌పై ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు 𝙃𝙖𝙩-𝙩𝙧𝙞𝙘𝙠 𝙤𝙛 𝙎𝙄𝙓𝙀𝙎! 🔥 🔥 Yashasvi Jaiswal is smacking 'em all around the park! 💥💥💥 Follow the match ▶️ https://t.co/FM0hVG5pje#TeamIndia | #INDvENG | @ybj_19 | @IDFCFIRSTBank pic.twitter.com/OjJjt8bOsx — BCCI (@BCCI) February 18, 2024 -
టీమిండియా నయా సంచలనాలు...
India vs England Test Series 2024: ఒకరు ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొడితే.. మరొకరు నిలకడగా ఆడుతూ ‘హీరో’ అయ్యారు.. ఇంకొకరు వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థిని బెంబేలెత్తిస్తే.. ఆఖరిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన ఎంపిక సరైందే అని నిరూపించుకున్న ఆటగాడు మరొకరు. అవును... మీరు ఊహించిన పేర్లు నిజమే.. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ సందర్భంగా తళుక్కున మెరిసిన భారత నయా క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, ఆకాశ్ దీప్, దేవ్‌దత్ పడిక్కల్ గురించే ఈ పరిచయ వాక్యాలు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో తాజా సిరీస్ సందర్భంగా రెండో టెస్టులో మధ్యప్రదేశ్ రజత్ పాటిదార్(టెస్టుల్లో), మూడో టెస్టులో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ఉత్తరప్రదేశ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్, నాలుగో టెస్టులో బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్.. ఐదో టెస్టులో దేవ్‌దత్ పడిక్కల్ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. వీరిలో 30 ఏళ్ల రజత్ పాటిదార్ మినహా మిగతా నలుగురు సత్తా చాటి.. టీమిండియాకు దొరికిన ఆణిముత్యాలంటూ కితాబులు అందుకున్నారు. మరి ఈ సిరీస్‌లో వీరి ప్రదర్శన ఎలా ఉందో గమనిద్దాం! సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan).. సంచలనం రంజీల్లో పరుగుల వరద పారించి.. త్రిశతక వీరుడిగా పేరొందిన ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సుదీర్ఘ నిరీక్షణ అనంతరం రాజ్‌కోట్ టెస్టు ద్వారా అరంగేట్రం చేశాడు. తండ్రి నౌషద్ ఖాన్, భార్య రొమానా జహూర్ సమక్షంలో.. స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే చేతుల మీదుగా టీమిండియా క్యాప్ అందుకున్నాడు. తన తొలి మ్యాచ్‌లోనే మెరుపు అర్ధ శతకం(62) సాధించాడు. 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కు అందుకున్న సర్ఫరాజ్ ఖాన్.. దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. అయితే, అదే మ్యాచ్‌లో మరోసారి అర్ధ శతకం(68)తో అజేయంగా నిలిచి సత్తా చాటాడు. తదుపరి మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన(14,0) సర్ఫరాజ్ ఖాన్ ఐదో టెస్టులో మరోసారి ఫిఫ్టీ(56)అదరగొట్టాడు. ఇప్పటి వరకు మూడు టెస్టుల్లో కలిపి 200 పరుగులు సాధించాడు. ఇందులో 24 ఫోర్లు, 5 సిక్సర్లు ఉండటం విశేషం. 𝙎𝙖𝙧𝙛𝙖𝙧𝙖𝙯 - Apna time a̶y̶e̶g̶a̶ aa gaya! 🗣️ He brings up a 48-balls half century on Test debut 💪🔥#INDvENG #BazBowled #JioCinemaSports #TeamIndia #IDFCFirstBankTestSeries pic.twitter.com/kyJYhVkGFv — JioCinema (@JioCinema) February 15, 2024 ధ్రువ్ జురెల్(Dhruv Jurel).. మెరుపులు రాజ్‌కోట్ టెస్టు సందర్భంగా అరంగేట్రం చేసిన మరో ఆటగాడు ధ్రువ్ జురెల్. ఈ మ్యాచ్‌లో వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకోవడంతో పాటు.. 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే, రాంచిలో జరిగిన నాలుగో టెస్టులో మాత్రం జురెల్ విశ్వరూపం ప్రదర్శించాడు ఈ 23 ఏళ్ల బ్యాటర్. టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వేళ మొదటి ఇన్నింగ్స్‌లో అత్యంత విలువైన 90 పరుగులు సాధించాడు. అంతేకాదు.. రెండో ఇన్నింగ్స్‌లో 39 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. A fantastic victory in Ranchi for #TeamIndia 😎 India clinch the series 3⃣-1⃣ with the final Test to be played in Dharamsala 👏👏 Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/5I7rENrl5d — BCCI (@BCCI) February 26, 2024 మరో టెస్టు మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆఖరిదైన ఐదో టెస్టులో మాత్రం 15 పరుగులకే పరిమితమైనా.. వికెట్ కీపర్‌గా తన వంతు బాధ్యతను నెరవేర్చాడు. ఆకాశ్ దీప్(Akash Deep).. ఆకాశమే హద్దుగా రాంచిలో జరిగిన నాలుగో టెస్టు ద్వారా బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ అంతర్జాతీయ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు. 27 ఏళ్ల వయసులో హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతుల మీదుగా క్యాప్ అందుకున్నాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే.. అదీ ఒకే ఓవర్లో.. ఇంగ్లండ్ స్టార్లు బెన్ డకెట్, ఒలీ పోప్ రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చాడు. ఆ తర్వాత జాక్ క్రాలేను కూడా అవుట్ చేసి ఇంగ్లండ్ టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. తద్వారా జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. Drama on debut for Akash Deep! 🤯😓 A wicket denied by the dreaded No-ball hooter🚨#IDFCFirstBankTestSeries #BazBowled #INDvENG #JioCinemaSports pic.twitter.com/uQ3jVnTQgW — JioCinema (@JioCinema) February 23, 2024 The Moment Devdutt Padikkal completed his Maiden Test Fifty with a SIX. - Devdutt, The future! ⭐ pic.twitter.com/btIMOnG5Eq — CricketMAN2 (@ImTanujSingh) March 8, 2024 దేవ్‌దత్ పడిక్కల్(Devdutt Padikkal).. జోరుగా హుషారుగా ధర్మశాలలో జరిగిన ఐదో టెస్టు ద్వారా ఎంట్రీ ఇచ్చాడు కర్ణాటక బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్. కేరళలో జన్మించిన 23 ఏళ్ల ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. అరంగేట్రంలో 65 పరుగులతో దుమ్ములేపాడు. ఇక వీరికంటే ముందే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన యశస్వి జైస్వాల్.. ఈ సిరీస్‌లో వరుస డబుల్ సెంచరీలతో విరుచుకుపడ్డ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సిరీస్‌లో మొత్తంగా తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి 712 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన యశస్వి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఓపెనర్‌గా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఉపఖండ పిచ్‌లపై తాము సైతం అంటూ.. ఈ టీమిండియా యువ సంచలనాలతో పాటు ఈ సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన ఇంగ్లండ్ స్పిన్నర్లు టామ్ హార్లే, షోయబ్ బషీర్ కూడా తమదైన ముద్ర వేయగలిగారు. షోయబ్ బషీర్ ఆడిన మూడు టెస్టుల్లో కలిపి 17 వికెట్లు తీయగా.. టామ్ హార్లే 22 వికెట్లతో సత్తా చాటాడు. -
‘బజ్‌బాల్’ బెడిసికొట్టి.. అవమానభారంతో ఇలా!..
భారత గడ్డపై టెస్టు సిరీస్‌ను గెలిచి తమ 12 ఏళ్ల నీరిక్షణకు తెరదించాలని భావించిన ఇంగ్లండ్ జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. సిరీస్ విజయమే లక్ష్యంగా భారత గడ్డపై అడుగు పెట్టిన ఇంగ్లండ్ కనీస పోటీ ఇవ్వకుండా టీమిండియా ముందు మోకారిళ్లింది. బజ్‌బాల్ అంటూ వరల్డ్ క్లాస్ జట్లను గడగడలాంచిన ఇంగ్లండ్.. భారత్ దెబ్బకు పసికూనలా వణకిపోయింది. అసలైన టెస్టు క్రికెట్ మజా ఎలా ఉంటుందో ఇంగ్లండ్ జట్టుకు రోహిత్ సేన చూపించింది. ఘన విజయంతో భారత్ టూర్‌ను ముగించాలని భావించిన స్టోక్స్ సేన.. ఆఖరికి ఘోర పరాభావంతో తమ దేశానికి తిరుగు పయనమైంది. ధర్మశాల వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. భారత గడ్డపై ఇంగ్లండ్ ఘోర ఓటమికి గల ఐదు కారణాలను పరిశీలిద్దాం. బెడిసి కొట్టిన బజ్ బాల్.. ఇంగ్లండ్ ఓటమికి ప్రధాన కారణం వారి బ్యాటింగ్ వైఫల్యమే. వారు అవలంభిస్తున్న బజ్‌బాల్ విధానమే వారి కొంపముంచింది. సాధరణంగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఏ బ్యాటరైనా ఆచతూచి ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాలని ప్రయత్నిస్తాడు. కానీ ఇంగ్లండ్ జట్టుది మాత్రం వేరే లెక్క. వచ్చామా ఫోరో, సిక్స్ కొట్టి ఔటయ్యామా అన్నట్లు ఇంగ్లండ్ బ్యాటర్ల ఆట కొనసాగింది. ఆఖరి వరల్డ్ క్లాస్ బ్యాటర్ జో రూట్ సైతం అదే తీరును కనబరిచాడు. పరుగులు వేగంగా సాధించాలనే ఉద్దేశ్యంతో తనకు రాని షాట్లను ఆడి పెవిలియన్‌కు చేరిన సందర్భాలు ఉన్నాయి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రత్యర్థి బౌలర్లపై దాడికి ప్రయత్నించి వికెట్లను కోల్పవడం సంప్రదాయ క్రికెట్ ఉద్దేశ్యం కాదు కద. ఈ సిరీస్‌లో భారత 9వ నెంబర్ ఆటగాడు కుల్దీప్ యాదవ్ ఎదుర్కొన్న బంతులు కూడా ఏ ఇంగ్లండ్ ఆటగాడు ఎదుర్కోలేకపోయాడు. టెస్టు క్రికెట్ అంటే కనీస ఓపికతో బ్యాటింగ్ చేయాలనే కామన్ సెన్స్ ఇంగ్లండ్ బ్యాటర్లలో కొరవడింది. బజ్‌బాల్ అంటూ టెస్టు క్రికెట్ రూపు రేఖలను మార్చేసిన ఇంగ్లండ్‌కు భారత్ మాత్రం సరైన గుణపాఠం చెప్పిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఇంగ్లండ్ ఘోర పరభావానికి మరో కారణం ఓవర్ కాన్ఫిడెన్స్. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లండ్.. ఇక తమకు తిరుగులేదని, ఏకంగా సిరీస్ వైట్ వాష్ చేసినట్లు బిల్డప్ ఇచ్చింది. కానీ అక్కడ ప్రత్యర్ధి భారత్ అన్న విషయం బహుశా ఇంగ్లండ్ మార్చిపోయిందేమో. ఆ తర్వాత వైజాగ్ టెస్టులో దెబ్బతిన్న సింహంలా భారత్ పంజా విసిరింది. ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. అప్పటికి ఇంగ్లండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం ఏమాత్రం పోలేదు. ఇంకా మూడు టెస్టులు ఉన్నాయి కదా చూసుకోవచ్చులా అన్నట్లు ఇంగ్లండ్ థీమా వ్యక్తం చేసింది. ఈ క్రమంలో వైజాగ్ టెస్టు అనంతరం భారత్ నుంచి దుబాయ్ వేకేషన్‌కు ఇంగ్లండ్ జట్టు వెళ్లిపోయింది. అక్కడికి వెళ్లిన ఇంగ్లండ్ ఆటను మర్చిపోయి ఎంజాయ్ చేస్తూ దాదాపు వారం రోజులు గడిపింది. ఆ తర్వాత రాజ్‌కోట్‌కు చేరుకున్న ఇంగ్లండ్ ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా మూడో టెస్టులో బరిలోకి దిగింది. రాజ్‌కోట్‌లో కూడా ఇంగ్లండ్ తీరు ఏ మాత్రం మారలేదు. మరోసారి ఇంగ్లండ్‌ను టీమిండియా చిత్తు చేసింది. ఏకంగా 434 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. అయితే అప్పటికి ఇంగ్లండ్ మాత్రం సిరీస్ తామే గెలుస్తామన్న థీమాగా కన్పించింది. ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్సీ, కోచ్ మెకల్లమ్ ఆఖరి రెండు టెస్టుల్లో భారత్‌ను చిత్తు చేస్తామని గొప్పలు పలికారు. కానీ భారత్ ముందు ఇంగ్లండ్ ఎత్తులు చిత్తు అయ్యాయి. ఆఖరి రెండు టెస్టుల్లోనూ భారత్ విజయ భేరి మ్రోగించింది. బౌలింగ్ వైఫల్యం. స్పిన్నర్లు కాస్తో కూస్త అకట్టుకున్నప్పటికి ఫాస్ట్ బౌలర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు. జేమ్స్ ఆండర్సన్, వుడ్ వంటి వరల్డ్ క్లాస్ పేసర్లు సైతం భారత బ్యాటర్లు ముందు దాసోహం అయ్యారు. ఆండర్సన్‌ను అయితే భారత యువ ఓపెనర్ జైశ్వాల్ ఊచకోత కోశాడు. స్పిన్నర్ల ప్రదర్శన కూడా అంతంతమాత్రమే. ఇంగ్లండ్ బౌలింగ్‌లో ఎటాక్‌లో స్పష్టంగా అనుభవం లేమి కన్పించింది. జాక్ లీచ్ వంటి స్టార్ స్పిన్నర్ తొలి టెస్టు తర్వాత జట్టు నుంచి తప్పుకోవడం ఇంగ్లండ్‌ను బాగా దెబ్బతీసింది. టామ్ హార్లీ, బషీర్ వంటి యువ స్పిన్నర్లు ఆడపదడప వికెట్లు తీసినప్పటికి పరుగులు మాత్రం భారీ సమర్పించుకున్నారు. స్టోక్సీ మిస్ ఫైర్.. తన కెప్టెన్సీతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న బెన్ స్టోక్స్.. భారత్‌లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. ఈ సిరీస్‌లో బెన్ స్టోక్స్ దారుణంగా విఫలమయ్యాడు. అస్సలు ఈ సిరీస్‌లో అతడి వ్యూహం ఎవరికీ అర్ధం కాలేదు. కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్‌లో కూడా నిరాశపరిచాడు. బౌలర్లను సరిగ్గా ఉపయోగించడంలో కూడా స్టోక్సీ ఫెయిల్ అయ్యాడు. సిరీస్ మొత్తంగా 5 టెస్టుల్లో 199 పరుగులు స్టోక్స్ చేశాడు. ఇది కూడా ఇంగ్లండ్ ఓటమికి ఓ కారణం. కుర్రాళ్లు కొట్టిపాడేశారు..? కోహ్లి, రాహుల్ వంటి స్టార్ ఆటగాళ్లు దూరం కావడంతో జట్టులోకి వచ్చిన యువ క్రికెటర్లను ఇంగ్లండ్ తక్కువగా అంచనా వేసింది. వారికి పెద్దగా అనుభవం లేనందన తమ బౌలర్లు పై చేయి సాధిస్తారని ఇంగ్లండ్ మేనెజ్మెంట్ భావించింది. కోహ్లిని ఎలా ఔట్ చేయాలి? రాహుల్‌ను ఎలా ఔట్ చేయాలని ప్రణాళికలు రచించిన ఇంగ్లండ్.. యువ ఆటగాళ్లు విషయంలో మాత్రం ఎటువంటి ఆలోచన చేయలేదు. అదే వారి కొంపముంచింది. జైశ్వాల్, సర్ఫరాజ్, ధ్రవ్ జురల్ యువ సంచలనాలు ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. జైశ్వాల్ అయితే ఏకంగా రెండు డబుల్ సెంచరీలు బాదేశాడు. 𝐑𝐨𝐡𝐢𝐭 & 𝐂𝐨. conquered the series with ease💪#IDFCFirstBankTestSeries #INDvENG #JioCinemaSports #BazBowled pic.twitter.com/a6HsT0Ikbe — JioCinema (@JioCinema) March 9, 2024