T20 WC 2nd Semis: ఇంగ్లండ్‌పై భారత్‌ గెలుపు | T20 WC 2026 2nd Semis IND vs ENG: Toss Update Both Playing XIs | Sakshi
Sakshi News home page

T20 WC 2nd Semis: ఇంగ్లండ్‌పై భారత్‌ గెలుపు

Mar 5 2026 6:33 PM | Updated on Mar 5 2026 10:59 PM

T20 WC 2026 2nd Semis IND vs ENG: Toss Update Both Playing XIs

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో కీలక పోరు... రెండో సెమీ ఫైనల్లో భారత్‌- ఇంగ్లండ్‌ అమీతుమీ... ముంబైలోని వాంఖడే వేదికగా టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బౌలింగ్‌... ఫలితంగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.

భారత్‌ భారీ స్కోరు
నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 253  పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఓపెనర్‌ సంజూ శాంసన్‌ భారీ హాఫ్‌ సెంచరీ (42 బంతుల్లో 89) బాదగా.. ఇషాన్‌ కిషన్‌ (18 బంతుల్లో 39), శివం దూబే (25 బంతుల్లో 43), తిలక్‌ వర్మ (7 బంతుల్లో 21),హార్దిక్‌ పాండ్యా (12 బంతుల్లో 27) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించారు.


UPDATES: 

ఇంగ్లండ్‌పై భారత్‌ గెలుపు
లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ పై టీమిండియా 7 పరుగుల తేడాతో గెలుపొందింది. సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి.. టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. గత ఎడిషన్‌లో విజేతగా నిలిచిన భారత్‌.. ఈసారి కూడా ఫైనల్‌కు చేరి సత్తా చాటింది.

ఏడో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
దూబే బౌలింగ్‌లో బెతల్‌ రన్‌ ఔట్‌ (105) అయ్యాడు.

పదిహేడు ఓవర్లలో ఇంగ్లండ్‌ స్కోరు:  209-5
15 ఓవర్లలో ఇంగ్లండ్‌ స్కోరు: 185-5
కర్రాన్‌ 5, బెతెల్‌ 81 పరుగులతో ఉ‍న్నారు.

13.6: ఐదో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో జాక్స్‌ (35) ఇచ్చిన క్యాచ్‌ను అద్భుతంగా పట్టిన శివం దూబే.
పదమూడు ఓవర్లలో ఇంగ్లండ్‌ స్కోరు: 160-4
విజయానికి 42 బంతుల్లో 94 పరుగులు కావాలి. బెతెల్‌ 65, విల్‌ జాక్స్‌ 35 పరుగులతో ఉన్నారు.
పది ఓవర్లలో ఇంగ్లండ్‌ స్కోరు:  119-4

నాలుగో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
7.3: అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో టామ్‌ బాంటన్‌ (5 బంతుల్లో 17) బౌల్డ్‌. క్రీజులోకి విల్‌ జాక్స్‌. స్కోరు: 95-4(7.3).బెతెల్‌ 39 పరుగులతో ఉన్నాడు. విజయానికి 75 బంతుల్లో 159 పరుగులు కావాలి.

మూడో వికెట్‌ డౌన్‌
5.5: వరుణ్‌ చక్రవర్తి అద్భుత రీతిలో బట్లర్‌ (25)ను బౌల్డ్‌ చేశాడు. స్కోరు: 64-3(5.5). బెతెల్‌ 26 పరుగులతో ఉన్నాడు.

రెండో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
4.1: బుమ్రా బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్‌ (7) ఇచ్చిన క్యాచ్‌ను అక్షర్‌పటేల్‌ అద్భుత రీతిలో అందుకున్నాడు. ఫలింగా ఇంగ్లండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. జేకబ్‌ బెతెల్‌ క్రీజులోకి రాగా.. బట్లర్‌ 25 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 38-2(4.2).

తొలి వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
1.1: హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో ఫిల్‌ సాల్ట్‌ (5) అక్షర్‌ పటేల్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌. క్రీజులోకి బ్రూక్‌. బట్లర్‌ ఎనిమిది పరుగులతో ఉన్నాడు. స్కోరు: 14-1(1.2)

భారత్‌ స్కోరు: 253-7
ఏడో వికెట్‌ డౌన్‌
19.5: ఆఖరి ఓవర్‌ఐదో బంతికి పాండ్యా రనౌట్‌ (12 బంతుల్లో 27). వరుణ్‌ చక్రవర్తి క్రీజులోకి రాగా.. అక్షర్‌ పటేల్‌ 2 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఆరో వికెట్‌ కోల్పోయిన భారత్‌
18.5: తిలక్‌ వర్మ రూపంలో ఆరో వికెట్‌ కోల్పోయిన భారత్‌. ఆర్చర్‌ బౌలింగ్‌లో తిలక్‌ బౌల్డ్‌ (7 బంతుల్లో 21). అక్షర్‌ క్రీజులోకి రాగా.. పాండ్యా 14 రన్స్‌తో ఉన్నాడు. స్కోరు: 237-6(19)

ఐదో వికెట్‌ కోల్పోయిన భారత్‌
17.3: సామ్‌ కర్రాన్‌ బౌలింగ్‌లో సింగిల్‌కు యత్నించి.. హార్దిక్‌ పాండ్యాతో సమన్వయ లోపం కారణంగా దూబే (25 బంతుల్లో 43) రనౌట్‌. తిలక్‌ వర్మ క్రీజులోకి వచ్చాడు.

నాలుగో వికెట్‌ డౌన్‌
15.4: ఆదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ స్టంపౌట్‌. స్కోరు: 190-4 (16). హార్దిక్‌ పాండ్యా క్రీజులోకి వచ్చాడు. దూబే35 పరుగులతో ఉన్నాడు.

15 ఓవర్లలో టీమిండియా స్కోరు: 177-3
సూర్య 5, దూబే 28 పరుగులతో ఉన్నారు.

సంజూ శాంసన్‌ అవుట్‌
13.1: సంజూ శాంసన్‌ మరోసారి సెంచరీ మిస్సయ్యాడు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 97 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌.. ఇంగ్లండ్‌తో సెమీస్‌లో 89 పరుగుల వద్ద పెవిలియన్‌ చేరాడు. 

విల్‌ జాక్స్‌బౌలింగ్‌లో తొందరపడి షాట్‌కు యత్నించి.. ఫిల్‌ సాల్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. మొత్తంగా 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు కొట్టి 89 పరుగులు రాబట్టాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ క్రీజులోకి వచ్చాడు. దూబే 18 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 160-3(13.1)

రెండో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
9.3: మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించిన ఇషాన్‌ కిషన్‌.. ఆదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో విల్‌ జాక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. 18 బంతుల్లో 39 పరుగులు చేసి నిష్క్రమించాడు. శివం దూబే క్రీజులో వచ్చాడు. సంజూ 66 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 117-2(9.3). 

8.3: వంద పరుగులు పూర్తి చేసుకున్న టీమిండియా

సంజూ హాఫ్‌ సెంచరీ
వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో భారీ హాఫ్‌ సెంచరీ బాదిన సంజూ.. తాజా మ్యాచ్‌లోనూ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 26 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. డాసన్‌ బౌలింగ్‌లో సిక్స్‌ బాది మరీ ఈ మైలురాయి చేరుకున్నాడు.

పవర్‌ ప్లేలో భారత్‌ స్కోరు: 67-1(6)
సంజూ 20 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 41 పరుగులతో ఉండగా.. ఇషాన్‌ కిషన్‌ 9 బంతుల్లో 16 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

తొలి వికెట్‌ డౌన్‌
1.6: విల్‌ జాక్స్‌ బౌలింగ్‌లో ఫిల్‌ సాల్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి అభిషేక్‌ శర్మ (7 బంతుల్లో 9) అవుట్‌. సంజూ 11 పరుగులతో ఉండగా.. ఇషాన్‌ కిషన్‌ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 20-1(2)

సైలెంట్‌ చేసేస్తాం
టాస్‌ సందర్భంగా ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ మాట్లాడుతూ.. ‘‘పిచ్‌ బాగుంది. వికెట్‌ పాతబడే కొద్దీ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని అనుకుంటున్నాం. అందుకే మేము ముందుగా బౌలింగ్‌ ఎంచుకున్నాము.

ఒక మార్పుతో బరిలోకి
టీమిండియాకు ఈ పిచ్‌పై ఆడిన అనుభవం మాకంటే ఎక్కువే. అయితే, టీ20 క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేము. టీమిండియా మద్దతుదారులు నిశ్శబ్దంగా ఉండేలా చేస్తాం. రెహాన్‌ అహ్మద్‌ స్థానంలో ఓవర్టన్‌ జట్టులోకి వచ్చాడు’’ అని తెలిపాడు.

అదే జట్టు..
ఇక టీమిండియా సారథి సూర్యకుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ‘‘సెమీ ఫైనల్‌. బిగ్‌ గేమ్‌. మేము ముందుగా బ్యాటింగ్‌ చేయాలనే అనుకున్నాం. ఇక్కడ అంతగా డ్యూ ఉంటుందని అనుకోవడం లేదు. పిచ్‌ బాగుంది. క్యూరేటర్లు, గ్రౌండ్స్‌మెన్‌కు ధన్యవాదాలు. గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే కొనసాగిస్తున్నాం’’ అని పేర్కొన్నాడు.

భారత్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ తుదిజట్లు
భారత్‌
అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

ఇంగ్లండ్‌
ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్‌ కీపర్‌), హ్యారీ బ్రూక్(కెప్టెన్‌), జేకబ్ బెతెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.

చదవండి: T20 WC 2026: జింబాబ్వే జట్టుకు భారీ ఊరట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement