Harry Brook
-
వరుణ్ స్పిన్ మ్యాజిక్.. హ్యారీ బ్రూక్ ఫ్యూజ్‌లు ఔట్
చెపాక్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరోసారి తన స్పిన్ మయాజాలాన్ని ప్రదర్శించాడు. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను అద్బుతమైన బంతితో వరుణ్ బోల్తా కొట్టించాడు. చక్రవర్తి వేసిన బంతికి బ్రూక్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 7వ ఓవర్ వేసిన చక్రవర్తి మూడో బంతిని అద్బుతమైన గూగ్లీగా సంధించాడు.బంతి పిచ్ అయిన వెంటనే షార్ప్‌గా టర్న్ అయింది. బంతి ఎటువైపు తిరుగుతుందో బ్రూక్ అంచనా వేయలేకపోయాడు. ఈ క్రమంలో బంతి హ్యారీ బ్రూక్ బ్యాట్, ప్యాడ్ గ్యాప్‌లో నుంచి వెళ్లి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో బ్రూక్ చేసేదేమి లేక అలా నవ్వుతూ ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.కాగా తొలి టీ20లో ఇదే తరహాలో బ్రూక్‌ను వరుణ్ ఔట్ చేశాడు. ఇక రెండో టీ20లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్(45) టాప్ స్కోరర్‌గా నిలవగా.. బ్రైడన్ కార్సే(31), జేమీ స్మిత్(22) రాణించారు.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించగా.. అర్ష్‌దీప్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ తలా వికెట్ సాధించారు. కాగా తొలి టీ20లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే.చదవండి: BCCI: టీమిండియాకు భారీ షాక్.. ఇంగ్లండ్ సిరీస్ నుంచి ఇద్దరు స్టార్లు ఔట్ Through the gates! 🎯The in-form Varun Chakaravarthy strikes in his very first over ⚡️⚡️Follow The Match ▶️ https://t.co/6RwYIFWg7i#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank | @chakaravarthy29 pic.twitter.com/NddoPmTlDo— BCCI (@BCCI) January 25, 2025 -
భారత్‌తో రెండో టీ20: ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. అతడిపై వేటు
టీమిండియాతో రెండో టీ20కి ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించింది. తొలి టీ20లో ఆడిన జట్టులో ఒక మార్పుతో చెన్నై బరిలో దిగనున్నట్లు తెలిపింది. కాగా కోల్‌కతాలో ధారాళంగా పరుగులు ఇచ్చుకున్న పేస్ బౌలర్ గస్ అట్కిన్సన్పై వేటు వేసిన ఇంగ్లండ్ టీమ్ మేనేజ్మెంట్.. అతడి స్థానాన్ని నాలుగు అంతర్జాతీయ టీ20లు ఆడిన ఓ పేసర్‌తో భర్తీ చేయడం విశేషం.బ్యాటర్ల వైఫల్యంతాజా భారత పర్యటనలో భాగంగా ఇంగ్లండ్ టీమిండియాతో తొలుత ఐదు టీ20లు.. అనంతరం మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తొలి టీ20 జరిగింది. ఇందులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆదిలోనే వికెట్లు కోల్పోయింది.బట్లర్ అర్ధ శతకం చేసినాఓపెనర్లు ఫిల్ సాల్ట్(0) డకౌట్ కాగా.. బెన్ డకెట్(4) కూడా విఫలమయ్యాడు. అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ జోస్ బట్లర్ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. 44 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 68 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, మిగతా వాళ్ల నుంచి అతడికి సహకారం అందలేదు.హ్యారీ బ్రూక్(17), జోఫ్రా ఆర్చర్(12) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేయగా.. లియామ్ లివింగ్‌స్టోన్(0), జాకబ్ బెతెల్(7), జేమీ ఓవర్టన్(2) దారుణంగా విఫలమయ్యారు. ఇక లోయర్ ఆర్డర్లో గస్ అట్కిన్సన్(2), ఆదిల్ రషీద్(8*), మార్క్‌వుడ్(1) కూడా కాసేపైనా క్రీజులో నిలవలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ అయింది.12.5 ఓవర్లలోనే ఖేల్ ఖతంఇక లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా 12.5 ఓవర్లలోనే ఖేల్ ఖతం చేసి.. ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై జయభేరి మోగించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్లలో సంజూ శాంసన్(26) ఫర్వాలేదనిపించగా.. అభిషేక్ శర్మ(34 బంతుల్లో 79) సుడిగాలి ఇన్నింగ్స్‌తో మెరిశాడు. అయితే, కెప్టెన్ సూర్యకుమార్ డకౌట్ కాగా.. తిలక్ వర్మ(19*), హార్దిక్ పాండ్యా(3*) నాటౌట్‌గా నిలిచారు.ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 21 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ఆదిల్ రషీద్ 2 ఓవర్లలో 27 పరుగులిచ్చి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, అట్కిన్సన్ మాత్రం కేవలం రెండు ఓవర్లలోనే ఏకంగా 38 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడిపై వేటు వేసిన యాజమాన్యం.. 29 ఏళ్ల రైటార్మ్ ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్సేకు తుదిజట్టులో చోటు కల్పించింది.కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో శనివారం రెండో టీ20 జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు ఆరంభం అవుతుంది.టీమిండియాతో రెండో టీ20కి ఇంగ్లండ్ తుదిజట్టు:బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెతెల్, జేమీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.చదవండి: అతడొక సూపర్‌స్టార్.. మా ఓటమికి కారణం అదే: బట్లర్ -
తర్వాతి తరం ‘ఫ్యాబ్ ఫోర్’ వీరే!.. టీమిండియా నుంచి ఎవరంటే?
క్రికెట్ ప్రపంచంలో ‘ఫ్యాబ్ ఫోర్’గా విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్లకు పేరుంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ నలుగురు బ్యాటర్లు తమదైన ముద్ర వేశారు. టీమిండియా ముఖ చిత్రమైన కోహ్లి ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించడంతో పాటు.. శతకాల విషయంలో సమకాలీన క్రికెటర్లలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.సెంచరీల మెషీన్వన్డేల్లో అత్యధికంగా 50 సెంచరీలు సాధించిన రన్‌మెషీన్.. ఇప్పటికే సచిన్ టెండుల్కర్(49) రికార్డు బద్దలు కొట్టాడు. వన్డేల్లో అత్యధికసార్లు వంద పరుగులు అందుకున్న క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఇక టీమిండియా తరఫున టెస్టుల్లో 30, టీ20లలో ఒక శతకం సాధించాడు కోహ్లి. కెప్టెన్‌గా భారత్‌కు టెస్టు ఫార్మాట్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు.అద్భుతమైన గణాంకాలుమరోవైపు.. ఆస్ట్రేలియా సారథిగా పనిచేసిన స్టీవ్ స్మిత్.. బ్యాటర్‌గా అద్భుతమైన గణాంకాలు కలిగి ఉన్నాడు. 114 టెస్టుల్లో 34 సెంచరీల సాయంతో 9999, 165 వన్డేల్లో పన్నెండుసార్లు శతక్కొట్టి 5662, 67 టీ20లలో 1094 పరుగులు సాధించాడు.టెస్టుల్లో తనకు తానే సాటి ఇక ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ టెస్టుల్లో తనకు తానే సాటి అని ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఇప్పటి వరకు 152 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రూట్.. 36 సెంచరీల సాయంతో 12972 పరుగులు సాధించాడు. అదే విధంగా 171 వన్డేల్లో 16 శతకాలు నమోదు చేసి 6522 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. 32 అంతర్జాతీయ టీ20లలో 893 రన్స్ చేశాడు.తొలిసారి ఆ ఐసీసీ ట్రోఫీ అందుకున్న నాయకుడుఇదిలా ఉంటే.. న్యూజిలాండ్‌కు తొలిసారి ఐసీసీ ట్రోఫీ అందించిన ఘనత కేన్ విలియమ్సన్‌కే దక్కుతుంది. అతడి కెప్టెన్సీలో 2019-21 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ టైటిల్‌ను కివీస్ జట్టు సొంతం చేసుకుంది. ఇక కేన్ మామ అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటిదాకా 105 టెస్టుల్లో 33 శతకాలు బాది 9276 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 165 వన్డేల్లో 13 సెంచరీలు చేసి 6811 పరుగులు సాధించాడు. 93 టీ20లు ఆడి 2575 రన్స్ చేశాడు.నవతరం ఫ్యాబ్ ఫోర్ వీరేఇలా ఈ నలుగురు ఎంతో ఎత్తుకు ఎదుగుతారని 2013లోనే న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మార్టిన్ క్రోవే ఊహించాడు. అందుకే పుష్కరకాలం క్రితమే విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్లకు ‘ఫ్యాబ్ ఫోర్’(ఫ్యాబ్యులస్ ఫోర్)గా నామకరణం చేశాడు. క్రోవే ఉపయోగించిన ఈ పదం తర్వాతి కాలంలో బాగా పాపులర్ అయింది.తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు నాసిర్ హుసేన్, మైకేల్ ఆర్థర్టన్ నవతరం ‘ఫ్యాబ్ ఫోర్’గా ఓ నలుగురు యువ క్రికెటర్ల పేర్లను చెప్పారు. అయితే, ఇందులో ఇద్దరి విషయంలో మాత్రమే నాసిర్ హుసేన్, ఆర్థర్టన్ ఏకాభిప్రాయానికి వచ్చారు. టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్‌తో పాటు ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్‌లకు ఈ ఇద్దరూ ‘ఫ్యాబ్ ఫోర్’లో స్థానం ఇచ్చారు.నా దృష్టిలో ఆ నలుగురే..యశస్వి జైస్వాల్‌తో పాటు తన ‘ఫ్యాబ్ ఫోర్’లో హ్యారీ బ్రూక్, ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రవిస్ హెడ్, పాకిస్తాన్ యువ తరంగం సయీమ్ ఆయుబ్ ఉంటాడని నాసిర్ హుసేన్ పేర్కొన్నాడు. అయితే, ఆర్థర్టన్ మాత్రం యశస్వి, హ్యారీ బ్రూక్‌లతో పాటు శ్రీలంక సంచలన క్రికెటర్ కమిందు మెండిస్, న్యూజిలాండ్ యంగ్ స్టార్ రచిన్ రవీంద్రలకు తన ‘ఫ్యాబ్ ఫోర్’లో స్థానం ఇచ్చాడు.సూపర్ ఫామ్‌లో ఆ ఆరుగురుకాగా ఈ గతేడాది యశస్వి జైస్వాల్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 1771 పరుగులు సాధించాడు. ఇందులో మూడు శతకాలతో పాటు 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక హ్యారీ బ్రూక్ 2024లో ఐదు సెంచరీలు, ఆరు ఫిఫ్టీల సాయంతో 1575 పరుగలు చేశాడు.ఇక కమిందు మెండిస్ 1458 రన్స్ చేశాడు. ఇందులో ఐదు శతకాలు, ఐదు అర్ధ శతకాలు ఉన్నాయి. మరోవైపు.. ట్రవిస్ హెడ్ 1399, సయీమ్ ఆయుబ్ 1254 పరుగులు సాధించారు. ఇక రచిన్ రవీంద్ర రెండు శతకాలు, ఐదు హాఫ్ సెంచరీల సాయంతో 1079 పరుగులు చేశాడు. టీమిండియాను న్యూజిలాండ్ టెస్టుల్లో 3-0తో క్లీన్‌స్వీస్ చేసి చారిత్రాత్మక విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. -
ఇంగ్లండ్ వైస్ కెప్టెన్‌గా యువ క్రికెటర్.. ప్రకటించిన ఈసీబీ
ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తమ పురుషుల జట్టుకు కొత్త వైస్ కెప్టెన్‌ను ప్రకటించింది. యువ తరంగం హ్యారీ బ్రూక్ ఇకపై పరిమిత ఓవర్ల జట్టుకు ఉప నాయకుడిగా పనిచేస్తాడని మంగళవారం వెల్లడించింది. టీమిండియాతో టీ20 సిరీస్ ఆరంభానికి ముందు బ్రూక్ నియామకానికి సంబంధించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.మూడేళ్ల నుంచి అదరగొడుతున్నాడుకాగా 2022లో వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ సందర్భంగా హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అదే ఏడాది సౌతాఫ్రికాతో సిరీస్‌లో భాగంగా టెస్టుల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఆ మరుసటి ఏడాది వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు.ఇక 25 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇప్పటి వరకు 24 టెస్టులు, 20 వన్డేలు, 39 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అంతర్జాతీయ టీ20లలో అతడి సగటు 30.73.. స్ట్రైక్‌రేటు 146.07. వన్డేల్లో బ్రూక్ సగటు 39.94.. స్ట్రైక్‌రేటు 106.83. మూడేళ్ల ఇంటర్నేషనల్ కెరీర్లో టెస్టుల్లో ఎనిమిది, వన్డేల్లో ఒక శతకం సాధించాడు.బట్లర్ వారసుడిగాఇలా అద్భుత ప్రదర్శనతో మేనేజ్మెంట్ను ఆకట్టుకుంటున్న బ్రూక్‌ను వైస్ కెప్టెన్ పదవి వరించింది. బట్లర్ వారసుడిగా అతడిని చూస్తున్న యాజమాన్యం భవిష్యత్తులో సారథిగా నియమించాలనే యోచనలో ఉన్నట్లు తాజా ప్రకటన స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ విషయమై ఊహాగానాలు రాగా.. బ్రూక్ మాత్రం పెద్దగా స్పందించలేదు.ఐపీఎల్ ద్వారా భారత అభిమానులకు చేరువగా..ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ హ్యారీ బ్రూక్ ఆడుతున్నాడు. 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అతడు క్యాష్ రిచ్ లీగ్‌లో అరంగేట్రం చేశాడు. ఆ సీజన్లో మొత్తంగా 11 మ్యాచ్‌లు ఆడి.. 190 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో హైదరాబాద్ ఫ్రాంఛైజీ అతడిని విడిచిపెట్టింది.ఈ క్రమంలో 2024 ఎడిషన్‌కు గానూ ఢిల్లీ క్యాపిటల్స్ బ్రూక్‌ను కొనుగోలు చేసింది. అయితే, వ్యక్తిగత కారణాల దృష్ట్యా సీజన్ మొత్తానికి అతడు దూరంగానే ఉన్నాడు. అయినప్పటికీ ఢిల్లీ ఫ్రాంఛైజీ అతడిపై మరోసారి నమ్మకం ఉంచింది. 2025 మెగా వేలం సందర్భంగా రూ. 6.25 కోట్లకు హ్యారీ బ్రూక్‌ను సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్ ద్వారా ఇంగ్లండ్‌కు కావాల్సినంత ప్రాక్టీస్ లభించనుంది. జనవరి 22 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆరంభం కానుంది.జనవరి 22, 25, 28, 31, ఫిబ్రవరి 2న పొట్టి ఫార్మాట్లో మ్యాచ్‌లు జరుగనుండగా.. ఫిబ్రవరి 6,9, 12 తేదీల్లో మూడు వన్డేల సిరీస్‌కు షెడ్యూల్ ఖరారైంది. కోల్‌కతా, చెన్నై, రాజ్‌కోట్, పుణె, ముంబై, టీ20లకు.. నాగ్‌పూర్, కటక్, అహ్మదాబాద్ వన్డేలకు ఆతిథ్యం ఇస్తాయి. ఇక ఇప్పటికే ఈ సిరీస్‌ల కోసం భారత్- ఇంగ్లండ్ బోర్డులు తమ జట్లను ఖరారు చేశాయి. చదవండి: Ind vs Eng: భారత తుదిజట్టులో వీరే.. ఆ ప్లేయర్లు బెంచ్‌కే పరిమితం! -
మళ్లీ అగ్రపీఠాన్ని అధిరోహించిన రూట్.. నంబర్ వన్ టీ20 బౌలర్ ఎవరంటే..?
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ నంబర్ వన్ స్థానంలో నిలిచాడు. రూట్.. తన సహచరుడు హ్యారీ బ్రూక్‌ను కిందకు దించి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. గత వారం ర్యాంకింగ్స్‌లో బ్రూక్ నంబర్ వన్ స్థానంలో నిలువగా.. వారం తిరిగే లోపే రూట్ మళ్లీ అగ్రపీఠమెక్కాడు. ప్రస్తుతం రూట్ ఖాతాలో 895 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రూట్.. బ్రూక్ కంటే 19 రేటింగ్ పాయింట్లు ఎక్కువ కలిగి ఉన్నాడు. న్యూజిలాండ్‌తో తాజాగా ముగిసిన మూడో టెస్ట్‌లో రూట్ 32, 54 (రెండు ఇన్నింగ్స్‌ల్లో) పరుగులు చేయగా.. బ్రూక్ రెండు ఇన్నింగ్స్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు (0,1). ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 423 పరుగుల తేడాతో ఓడినప్పటికీ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇదే మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ సెంచరీ చేశాడు. ఈ ప్రదర్శన ఆధారంగా విలియమ్సన్ ర్యాంకింగ్ మెరుగుపడనప్పటికీ, గణనీయంగా రేటింగ్ పాయింట్లు పెంచుకున్నాడు. ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో కేన్ మూడో స్థానంలో ఉన్నాడు. కేన్‌కు రూట్‌కు మధ్య కేవలం 28 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది.నంబర్ వన్ టీ20 బౌలర్ ఎవరంటే..?తాజా టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో విండీస్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అకీల్ హొసేన్ నంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో అద్భుత గణాంకాలు (4-1-13-2) నమోదు చేయడంతో అకీల్ టాప్ ప్లేస్‌కు చేరాడు. అకీల్ మూడు స్థానాలు ఎగబాకి చాలాకాలంగా టాప్ ప్లేస్‌లో ఉన్న ఆదిల్ రషీద్‌కు కిందకు దించాడు. -
ప్రపంచంలో అత్యుత్తమ బ్యాటర్ అతడే: రిక్కీ పాంటింగ్
ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్‌పై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రిక్కీ పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్ అతడేనంటూ బ్రూక్‌ను కొనియాడాడు. స్వదేశంలోనే.. విదేశీ గడ్డపై కూడా అతడు బ్యాట్ ఝులిపించే తీరు చూడముచ్చటగా ఉంటుందని ప్రశంసించాడు.అగ్రపీఠం అధిరోహించిన బ్రూక్కాగా 25 ఏళ్ల హ్యారీ బ్రూక్ వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా అవతరించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్ర స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అద్భుత ఫామ్‌తో పరుగుల వరద పారిస్తున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. తాజా ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ (898 రేటింగ్ పాయింట్లు)గా నిలిచాడు.ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో బ్రూక్ వరుసగా 171, 123, 55 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో నంబర్‌వన్‌గా ఉన్న మరో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ (898)ను వెనక్కి నెట్టి అగ్రపీఠం అధిరోహించాడు. ఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్ హ్యారీ బ్రూక్ గురించి ఐసీసీ రివ్యూ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ప్రపంచంలో అత్యుత్తమ బ్యాటర్ అతడే‘‘ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ టెస్టు బ్యాటర్ అతడే అనుకుంటున్నా. కేవలం సొంతగడ్డ మీద మాత్రమే కాదు.. విదేశాల్లోనూ అద్భుత ఆట తీరుతో అలరిస్తున్నాడు. ప్రత్యర్థి జట్టు దేశాల్లో ఏకంగా ఏడు శతకాలు నమోదు చేశాడు. అతడొక క్లాస్ ప్లేయర్. బ్రూక్ బ్యాటింగ్ చేస్తూ ఉంటే చూడటం నాకు ఎంతో ఇష్టం’’ అని రిక్కీ పాంటింగ్ హ్యారీ బ్రూక్‌ను కొనియాడాడు.ఏడు సెంచరీలు విదేశీ గడ్డపైనే కాగా రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన హ్యారీ బ్రూక్.. ఇప్పటి వరకు టెస్టుల్లో ఎనిమిది శతకాలు బాదాడు . ఇందులో ఏడు సెంచరీలు విదేశీ గడ్డపై చేసినవే. అదే విధంగా అతడి ఖాతాలో ద్విశతకం, ఒక త్రిశతకం కూడా ఉన్నాయి. ఇక వన్డేల్లోనూ హ్యారీ బ్రూక్ పేరిట ఒక సెంచరీ ఉంది.మొత్తంగా ఇప్పటి వరకు తన కెరీర్లో హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్ తరఫున 23 టెస్టులు, 20 వన్డేలు, 39 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 2280, 719, 707 పరుగులు సాధించాడు.మనోళ్ల పరిస్థితి ఏంటి?ఇదిలా ఉంటే.. ఐసీసీ టాప్–10 టెస్టు బ్యాటర్ల జాబితాలో భారత్ నుంచి యశస్వి జైస్వాల్ (4వ స్థానం), రిషభ్ పంత్ (9వ స్థానం) ఉండగా...శుబ్‌మన్ గిల్ 17వ, విరాట్ కోహ్లి 20వ స్థానంలో కొనసాగుతున్నారు. మరోవైపు.. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా (890) తన నంబర్‌వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కగిసో రబాడ (856), హాజల్‌వుడ్ (851) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అశ్విన్ ర్యాంక్ 4 నుంచి 5కు పడిపోగా, జడేజా 6వ స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టు ఆల్రౌండర్లలో జడేజా (415) అగ్ర స్థానం, అశ్విన్ 3వ స్థానం (283) పదిలంగా ఉన్నాయి. చదవండి: యశస్వి జైస్వాల్‌పై రోహిత్ శర్మ ఆగ్రహం.. ఆఖరికి యువ ఓపెనర్ లేకుండానే.. -
అగ్రపీఠాన్ని అధిరోహించిన హ్యారీ బ్రూక్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ సత్తా చాటాడు. బ్రూక్.. వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ జో రూట్‌ను రెండో స్థానానికి నెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో బ్రూక్ సెంచరీ (123), హాఫ్ సెంచరీ (55) చేశాడు. ఈ ప్రదర్శనల ఆధారంగానే బ్రూక్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు. ప్రస్తుతం బ్రూక్ ఖాతాలో 898 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రూట్ రేటింగ్ పాయింట్స్‌కు (897) బ్రూక్ రేటింగ్ పాయింట్లకు మధ్య వ్యత్యాసం కేవలం ఒక్క పాయింట్ మాత్రమే.తాజా ర్యాంకింగ్స్‌లో ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ ట్రవిస్ హెడ్, సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా కూడా సత్తా చాటారు. అడిలైడ్ టెస్ట్‌లో భారత్‌పై సూపర్ సెంచరీ చేసిన హెడ్ ఆరు స్థానాలు మెరుగుపర్చుకుని ఐదో స్థానానికి ఎగబాకగా.. శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో మూడు హాఫ్ సెంచరీలు, సెంచరీ చేసిన బవుమా మూడు స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి చేరుకున్నాడు.20వ స్థానానికి పడిపోయిన కోహ్లిఆసీస్తో రెండో టెస్ట్‌లో దారుణంగా విఫలమైన విరాట్ కోహ్లి ఆరు స్థానాలు కిందకు దిగజారి 20వ స్థానానికి పడిపోయాడు. అదే టెస్ట్‌లో చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయిన రిషబ్ పంత్ సైతం మూడు స్థానాలు కోల్పోయి తొమ్మిదో స్థానానికి పడిపోయాడు. యశస్వి జైస్వాల్ తన నాలుగో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కేన్ విలియమ్సన్ మూడులో, కమిందు మెండిస్ ఆరో స్థానంలో, డారిల్ మిచెల్ ఎనిమిదో ప్లేస్‌లో సౌద్ షకీల్ పదో స్థానంలో ఉన్నారు.టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టాప్-10లో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు. బుమ్రా, రబాడ, హాజిల్‌వుడ్ టాప్-3లో కొనసాగుతుండగా.. కమిన్స్ ఓ స్థానం మెరుగపర్చుకుని నాలుగో స్థానానికి చేరుకున్నాడు. గత వారం నాలుగో స్థానంలో ఉన్న అశ్విన్ ఓ స్థానం కోల్పోయి ఐదో ప్లేస్‌కు పడిపోయాడు. రవీంద్ర జడేజా, నాథన్ లియోన్, ప్రభాత్ జయసూర్య, మ్యాట్ హెన్రీ నౌమన్ అలీ ఆరు నుంచి పది స్థానాల్లో ఉన్నారు. అడిలైడ్ టెస్ట్‌లో భారత్‌పై అద్భుత ప్రదర్శన చేసిన మిచెల్ స్టార్క్ మూడు స్థానాలు మెరుగుపర్చుకుని 11వ స్థానానికి ఎగబాకాడు. -
హ్యారీ బ్రూక్ సూపర్ సెంచరీ.. తొలి రోజు ఇంగ్లండ్‌దే
టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో అద్భుతమైన సెంచరీతో చెలరేగిన బ్రూక్.. ఇప్పుడు రెండో టెస్టులో కూడా దమ్ములేపాడు.క్రైస్ట్ చర్చ్ వేదికగా జరుగుతున్న సెకెండ్ టెస్టులో బ్రూక్ సూపర్ సెంచరీతో మెరిశాడు. వన్డే తరహాలో తన ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బ్రూక్ కేవలం 91 పరుగుల్లోనే తన 8వ టెస్టు సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 115 బంతులు ఎదుర్కొన్న బ్రూక్.. 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 123 పరుగులు చేసి రనౌటయ్యాడు. ఇక అతడి అద్భుత ప్రదర్శన ఫలితంగా ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 280 పరుగులకు ఆలౌటైంది.ఇంగ్లండ్ అతడితో పాటు ఓలీ పోప్(66) హాఫ్ సెంచరీతో రాణించాడు. కివీస్ బౌలర్లలో నాథన్ స్మిత్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. విలియం ఓ రూర్క్ 3, మాట్ హెన్రీ రెండు వికెట్లు సాధించారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్‌కు ఇంగ్లండ్ బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ 5 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. కివీస్ ప్రస్తుతం 194 పరుగుల వెనకంజలో ఉంది. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్సే రెండు వికెట్లు సాధించగా.. వోక్స్, అట్కిన్సన్, స్టోక్స్ తలా వికెట్ పడగొట్టారు. -
జైస్వాల్‌ను వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకిన హ్యారీ బ్రూక్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్ రెండో స్థానానికి ఎగబాకాడు. బ్రూక్.. టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను వెనక్కు నెట్టి ఈ స్థానానికి చేరుకున్నాడు. గడిచిన వారంలో బ్రూక్, జైస్వాల్ ఇద్దరూ మంచి ప్రదర్శనలే చేసినప్పటికీ.. ర్యాంకింగ్స్‌లో మాత్రం బ్రూక్ ముందుకెళ్లాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో యశస్వి 161 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా.. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో బ్రూక్ 171 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. తాజా ర్యాంకింగ్స్‌లో యశస్వి ర్యాంక్ దిగజారినప్పటికీ అతని రేటింగ్ పాయింట్లు మాత్రం మెరుగుపడ్డాయి.మరోవైపు ఆస్ట్రేలియాతోనే జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి సైతం సెంచరీ చేసినప్పటికీ ఓ ర్యాంక్ కోల్పోయి 14వ స్థానానికి పడిపోయాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ చేసిన సౌతాఫ్రికా ఆటగాడు టెంబా బవుమా ఏకంగా 14 స్థానాలు మెరుగపర్చుకుని 10వ స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. లంక ఆటగాడు కమిందు మెండిస్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి చేరుకోగా.. భారత్ తరఫున రిషబ్ పంత్ ఆరో నంబర్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు.బౌలింగ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. రబాడ, హాజిల్‌వుడ్, అశ్విన్ టాప్-4లో ఉన్నారు. తాజా ర్యాంకింగ్స్‌లో కమిన్స్, రవీంద్ర జడేజా, నాథన్ లయోన్ తలో స్థానం మెరుగుపర్చుకుని 5, 6, 7 స్థానాలకు చేరుకోగా.. దక్షిణాఫ్రికా పేసర్ మార్కో జన్సెన్ ఏకంగా 19 స్థానాలు మెరుగుపర్చుకుని 9వ స్థానానికి ఎగబాకాడు. జన్సెన్ ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 10 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. టెస్ట్ ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. రవీంద్ర జడేజా టాప్‌లో కొనసాగుతుండగా.. జన్సెన్ 10 స్థానాలు మెరుగుపర్చుకుని రెండో స్థానానికి ఎగబాకాడు. అశ్విన్ మూడో స్థానానికి పడిపోయాడు. -
శతక్కొట్టిన హ్యారీ బ్రూక్.. సెకెండ్ ఫాస్టెస్ట్ ప్లేయర్‌గా రికార్డు
క్రైస్ట్‌చర్చ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ మిడిలార్డర్ ఆటగాడు హ్యారీ బ్రూక్ సెంచరీతో కదంతొక్కాడు. బ్రూక్ తన కెరీర్లో ఏడో టెస్ట్ సెంచరీని 123 బంతుల్లో పూర్తి చేశాడు. బ్రూక్ సెంచరీ మార్కును బౌండరీతో చేరుకోవడం విశేషం. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన బ్రూక్.. ఓలీ పోప్‌తో (77) కలిసి ఐదో వికెట్‌కు 151 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. అనంతరం బ్రూక్.. బెన్ స్టోక్స్‌తో (32 నాటౌట్) కలిసి ఆరో వికెట్‌కు అజేయమైన 86 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ప్రస్తుతం బ్రూక్ 126 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. 71 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ స్కోర్ 5 వికెట్ల నష్టానికి 309 పరుగులుగా ఉంది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంగ్లండ్ ఇంకా 39 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే 0, బెన్ డకెట్ 46, జాకబ్ బేతెల్ 10, జో రూట్ 0, ఓలీ పోప్ 77 పరుగులు చేసి ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో నాథన్ స్మిత్ 2, టిమ్ సౌథీ, మ్యాట్ హెన్రీ, విలియమ్ ఓరూర్కీ తలో వికెట్ పడగొట్టారు.అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌటైంది. కేన్ విలియమ్సన్ (93) ఏడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (58 నాటౌట్) బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ చేశాడు. టామ్ లాథమ్ (47), రచిన్ రవీంద్ర (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ తలో 4 వికెట్లు పడగొట్టగా.. అట్కిన్సన్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. 2000 పరుగులు పూర్తి చేసుకున్న బ్రూక్ఈ మ్యాచ్‌లో బ్రూక్ 2000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. టెప్ట్ల్లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో బ్రూక్ రెండో స్థానంలో నిలిచాడు. బ్రూక్ 2000 పరుగుల మార్కును తాకేందుకు 2300 బంతులు తీసుకున్నాడు. ఈ జాబితాలో బ్రూక్ సహచరుడు బెన్ డకెట్ టాప్‌లో ఉన్నాడు. డకెట్ 2293 బంతుల్లో 2000 పరుగులు పూర్తి చేశాడు.టెస్ట్‌ల్లో వేగంగా 2000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితా..బెన్ డకెట్-2293హ్యారీ బ్రూక్-2300టిమ్ సౌథీ-2418అడమ్ గిల్‌క్రిస్ట్-2483 -
Eng vs NZ: ఇంగ్లండ్ టెస్టు జట్టు ప్రకటన.. ‘అన్క్యాప్డ్’ ప్లేయర్ ఎంట్రీ
పాకిస్తాన్లో చేదు అనుభవం చవిచూసిన ఇంగ్లండ్ తదుపరి మరో పర్యటనకు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్‌కు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మంగళవారం తమ జట్టును ప్రకటించింది. వికెట్ కీపర్ జేమీ స్మిత్ ఈ టూర్‌కు దూరం కాగా.. అతడి స్థానంలో జాకోబ్ బెతెల్ తొలిసారి టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు.కాగా బెన్ స్టోక్స్ బృందం ఇటీవల పాకిస్తాన్లో మూడు టెస్టులు ఆడిన విషయం తెలిసిందే. పాక్ గడ్డపై జరిగిన ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచిన ఇంగ్లండ్.. రెండు, మూడో టెస్టుల్లో ఊహించని రీతిలో పరాజయం పాలైంది. ‘బజ్‌బాల్’కు కళ్లెం వేసిన పాక్ స్పిన్నర్లు ఇంగ్లండ్ బ్యాటర్లను ఓ ఆట ఆడుకున్నారు. దీంతో 1-2తో ఇంగ్లండ్ పాకిస్తాన్‌కు సిరీస్‌ను కోల్పోయింది.కివీస్‌తో మూడు టెస్టులుఈ క్రమంలో నవంబరు 28 నుంచి ఇంగ్లండ్ న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా మూడు టెస్టులు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఆరంభం కానున్న ఈ సిరీస్‌కు ఇటీవలే తండ్రిగా ప్రమోషన్ పొందిన జేమీ స్మిత్ దూరమయ్యాడు. అతడు పెటర్నిటీ సెలవులో వెళ్లిన కారణంగా.. జోర్డాన్ కాక్స్ వికెట్ కీపర్‌గా వ్యవహరించే అవకాశం ఉంది.మరోవైపు.. ఇటీవల ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లో రాణించిన ఆల్‌రౌండర్ జాకోబ్ బెతెల్ తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 20 మ్యాచ్‌లు ఆడిన జాకోబ్ 738 పరుగులు చేశాడు. అదే విధంగా లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన అతడు ఏడు వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.ఈసారి అరంగేట్రం పక్కామరోవైపు.. కాక్స్ 53 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 3194 పరుగులతో రాణించాడు. దేశవాళీ క్రికెట్లో పరుగులు వరద పారించినప్పటికీ అతడు ఇంతవరకు ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేయలేకపోయాడు. శ్రీలంక సిరీస్ నుంచి జట్టుతోనే ఉన్నా ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. ఈసారి మాత్రం ఈ వికెట్ కీపర్ బ్యాటర్ టెస్టు క్యాప్ అందుకునే సూచనలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక కివీస్‌తో సిరీస్ ఆడే జట్టులో ముగ్గురు స్పిన్నర్లు జాక్ లీచ్, షోయబ్ బషీర్, రేహాన్ అహ్మద్‌లకు కూడా చోటిచ్చారు సెలక్టర్లు. కాగా 2008 తర్వాత ఇంగ్లండ్ ఒక్కసారి కూడా న్యూజిలాండ్ గడ్డపై టెస్టు సిరీస్ గెలవకపోవడం గమనార్హం. ఇక కివీస్ జట్టు ప్రస్తుతం భారత పర్యటనలో ఉంది. టీమిండియాతో మూడు టెస్టుల సిరీస్‌ను ఇప్పటికే 2-0తో కైవసం చేసుకుంది.న్యూజిలాండ్‌తో టెస్టులకు ఇంగ్లండ్ జట్టుబెన్ స్టోక్స్(కెప్టెన్), రేహాన్ అహ్మద్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, జాకోబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, జోర్డాన్ కాక్స్, బెన్ డకెట్, జాక్ క్రాలే, జాక్ లీచ్, ఒలీ పోప్, మాథ్యూ పాట్స్, జో రూట్, ఓలీ స్టోన్, క్రిస్ వోక్స్.చదవండి: Mumbai Pitch: కివీస్‌తో మూడో టెస్టు.. తొలిరోజు వారికే అనుకూలం!? -
రెండో స్థానానికి ఎగబాకిన బ్రూక్.. టాప్ ప్లేస్‌ను సుస్థిరం చేసుకున్న రూట్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్ల హవా కొనసాగింది. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు జో రూట్, హ్యారీ బ్రూక్ తాజా ర్యాంకింగ్స్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఇటీవల పాకిస్తాన్‌తో ముగిసిన తొలి టెస్ట్‌లో హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీ, జో రూట్ డబుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రదర్శనలతో రూట్ కెరీర్ అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు (932) సాధించి టాప్ ర్యాంక్‌ను సుస్థిరం చేసుకున్నాడు. బ్రూక్ ఏకంగా 11 స్థానాలు ఎగబాకి కేన్ విలియమ్సన్తో సహా రెండో స్థానాన్ని ఆక్రమించాడు. రూట్, బ్రూక్ దెబ్బకు భారత ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి చెరో స్థానం కోల్పోయి నాలుగు, ఏడు స్థానాలకు పడిపోయారు. ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీలు చేసిన పాక్ ఆటగాళ్లు అఘా సల్మాన్, షాన్ మసూద్ 11, 12 స్థానాలు మెరుగపర్చుకుని 22, 51వ స్థానాలకు ఎగబాకారు.టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగం టాప్-10లో చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. బుమ్రా, అశ్విన్ టాప్-2లో కొనసాగుతుండగా.. రవీంద్ర జడేజా ఆరు, కుల్దీప్ 16 స్థానాల్లో ఉన్నారు. పాక్‌తో టెస్ట్ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన జాక్ లీచ్ తొమ్మిది స్థానాలు మెరుగుపర్చుకుని 28వ స్థానానికి ఎగబాకాడు. టెస్ట్ ఆల్‌రౌండర్ల విభాగంలో జడేజా, అశ్విన్ టాప్-2లో కొనసాగుతుండగా.. జో రూట్ ఓ స్థానం మెరుగుపర్చుకుని మూడో స్థానానికి చేరాడు. చదవండి: ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో కొత్తగా ముగ్గురి పేర్లు -
పాక్‌తో తొలి టెస్టు.. ఇంగ్లండ్ 823
ముల్తాన్: టెస్టు ఫార్మాట్లో వన్డే తరహా ఆటతీరుతో విజృంభించిన ఇంగ్లండ్ జట్టు పలు రికార్డులను బద్దలు కొట్టింది. పాకిస్తాన్ బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ... హ్యారీ బ్రూక్ (322 బంతుల్లో 317; 29 ఫోర్లు, 3 సిక్సర్లు) ట్రిపుల్ సెంచరీ, జో రూట్ (375 బంతుల్లో 262; 17 ఫోర్లు) డబుల్ సెంచరీతో చెలరేగారు. ఫలితంగా ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 823/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. టెస్టు క్రికెట్ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోరును తమ పేరిట లిఖించుకున్న ఇంగ్లండ్ జట్టు... పలు రికార్డులు ఖాతాలో వేసుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 492/3తో గురువారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ జట్టు... నాలుగో రోజు 49 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి 331 పరుగులు రాబట్టింది. ఈ క్రమంలో రూట్, బ్రూక్ నాలుగో వికెట్‌కు 454 పరుగులు జోడించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. అంతేకాకుండా ఇంగ్లండ్ తరఫున ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం నమోదు చేశారు. మొదట రూట్ డబుల్ సెంచరీ పూర్తి చేసుకోగా... కాసేపటికే బ్రూక్ ద్విశతకం ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత మరింత ధాటిగా ఆడిన బ్రూక్ వరుస బౌండరీలతో రెచ్చిపోయాడు. పాక్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఈ జోడీని విడదీయలేకపోగా... బ్రూక్ 310 బంతుల్లో టెస్టు కెరీర్లో తొలి ట్రిపుల్ సెంచరీ అందుకున్నాడు. గ్రాహం గూచ్ తర్వాత (1990లో; భారత్‌పై) ట్రిపుల్ సెంచరీ బాదిన ఇంగ్లండ్ క్రికెటర్‌గా బ్రూక్ నిలిచాడు. ఓవరాల్‌గా టెస్టు క్రికెట్లో ఇది 20వ అత్యధిక వ్యక్తిగత స్కోరు. పాకిస్తాన్ బౌలర్లలో ఆరుగురు 100 కంటే ఎక్కువ పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. నసీమ్ షా, ఆయూబ్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం 267 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ గురువారం ఆట ముగిసే సమయానికి 37 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. సల్మాన్ (49 బంతుల్లో 41 బ్యాటింగ్; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... షఫీఖ్ (0), షాన్ మసూద్ (11), బాబర్ ఆజమ్ (5), రిజ్వాన్ (10), ఆయూబ్ (25), షకీల్ (29) విఫలమయ్యారు. నేడు ఆటకు ఆఖరి రోజు. చేతిలో నాలుగు వికెట్లు ఉన్న పాకిస్తాన్... ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 115 పరుగులు వెనుకబడి ఉంది. సల్మాన్‌తో పాటు ఆమేర్ జమాల్ (27 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఇవీ రికార్డులు4 టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది (823/7 డిక్లేర్డ్) నాలుగో అత్యధిక టీమ్ స్కోరు. గతంలో శ్రీలంక (1997లో భారత్‌పై 952/6 డిక్లేర్డ్), ఇంగ్లండ్ (1938లో ఆ్రస్టేలియాపై 903/7 డిక్లేర్డ్; 1930లో వెస్టిండీస్‌పై 849) ఎనిమిది వందల పైచిలుకు పరుగులు చేశాయి. 1 పాకిస్తాన్‌పై ఒక జట్టు చేసిన అత్యధిక పరుగులు ఇవే (823/7 డిక్లేర్డ్). 1958లో వెస్టిండీస్ చేసిన 790/3 డిక్లేర్డ్ రెండో స్థానంలో ఉంది. పాకిస్తాన్ గడ్డపై నమోదైన అత్యధిక స్కోరు కూడా ఇదే.454 టెస్టు క్రికెట్లో నాలుగో వికెట్‌కు నమోదైన అత్యధిక భాగస్వామ్యం. 449 పరుగులతో ఆడమ్ వోజెస్, షాన్ మార్‡్ష (ఆస్ట్రేలియా; 2015లో వెస్టిండీస్‌పై) పేరిట ఉన్న రికార్డును రూట్, బ్రూక్ బద్దలు కొట్టారు.2 టెస్టు క్రికెట్ చరిత్రలో బ్రూక్‌ది రెండో వేగ వంతమైన ట్రిపుల్ సెంచరీ. 2008లో దక్షిణాఫ్రికాపై వీరేంద్ర సెహా్వగ్ 278 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ బాదగా... ఇప్పుడు బ్రూక్ 310 బంతుల్లో ట్రిపుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. -
టెస్ట్ క్రికెట్ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోర్
టెస్ట్ క్రికెట్ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోర్ నమోదైంది. ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ 7 వికెట్ల నష్టానికి 823 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. టెస్ట్ క్రికెట్లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు శ్రీలంక పేరిట ఉంది. 1997లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో లంకేయులు 6 వికెట్ల నష్టానికి 952 పరుగులు చేశారు. టెస్ట్‌ల్లో రెండు, మూడు అత్యధిక స్కోర్లు కూడా ఇంగ్లండ్ పేరిటే ఉండటం విశేషం. ఇంగ్లీష్ జట్టు 1938లో ఆస్ట్రేలియాపై, 1930లో వెస్టిండీస్‌పై వరుసగా 903 (7 వికెట్ల నష్టానికి), 849 పరుగులు చేసింది.ఇంగ్లండ్, పాక్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో పాక్ ఓటమి దిశగా సాగుతోంది. నాలుగో రోజు చివరి సెషన్లో పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఈ మ్యాచ్‌లో పాక్ గట్టెక్కాలంటే మరో 130 పరుగులు చేయాలి. చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో మరో రోజు ఆట మిగిలి ఉంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 823/7 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. జో రూట్ (262), హ్యారీ బ్రూక్ (317) డబుల్, ట్రిపుల్ సెంచరీలతో విరుచుకుపడగా.. జాక్ క్రాలే (78), బెన్ డకెట్ (84) అర్ద సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో నసీం షా, సైమ్ అయూబ్ చెరో రెండు వికెట్లు తీయగా.. షాహీన్ అఫ్రిది, ఆమెర్ జమాల్, అఘా సల్మాన్ తలో వికెట్ పడగొట్టారు.267 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ శరవేగంగా వికెట్లు కోల్పోతుంది. పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ 0, సైమ్ అయూబ్ 25, షాన్ మసూద్ 11, బాబర్ ఆజమ్ 5, సౌద్ షకీల్ 29, మొహమ్మద్ రిజ్వాన్ 10 పరుగులు చేసి ఔట్ కాగా.. అఘా సల్మాన్ (36), అమెర్ జమాల్ (21) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ తలో రెండు, క్రిస్ వోక్స్, జాక్ లీచ్ చెరో వికెట్ తీసి పాక్ పుట్టి ముంచారు.చదవండి: బాబర్ ఆజమ్.. ఇక మారవా..? -
టెస్ట్‌ల్లో రెండో వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ చేసిన బ్రూక్
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 322 బంతులు ఎదుర్కొన్న బ్రూక్.. 29 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 317 పరుగులు చేసి ఔటయ్యాడు. టెస్ట్‌ల్లో బ్రూక్ చేసిన ఈ ట్రిపుల్ సెంచరీ రెండో వేగవంతమైనది. బ్రూక్ తన ట్రిపుల్‌ను 310 బంతుల్లో పూర్తి చేశాడు. టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ రికార్డు టీమిండియా ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. సెహ్వాగ్ 2008లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 278 బంతుల్లోనే ట్రిపుల్ కంప్లీట్ చేశాడు.టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ట్రిపుల్ హండ్రెడ్స్- సెహ్వాగ్- 278 బంతులు- బ్రూక్- 310 బంతులు- మాథ్యూ హేడెన్- 362 బంతులు- సెహ్వాగ్- 364 బంతులుకాగా, ఈ మ్యాచ్‌లో బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో చెలరేగగా.. జో రూట్ భారీ డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. రూట్ 375 బంతుల్లో 17 ఫోర్ల సాయంతో 262 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరితో పాటు జాక్ క్రాలే (78), బెన్ డకెట్ (84) అర్ద సెంచరీలతో రాణించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను 823 పరుగుల వద్ద (7 వికెట్ల నష్టానికి) డిక్లేర్ చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే 267 పరుగుల ఆధిక్యంలో ఉంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు. చదవండి: ENG vs PAK: జో రూట్ డబుల్ సెంచరీ.. సచిన్ రికార్డు సమం -
హ్యారీ బ్రూక్ ఊచకోత.. పాక్‌పై ట్రిపుల్ సెంచరీ
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొదటి ఇన్నింగ్స్‌లో బ్రూక్ విధ్వంసకర ట్రిపుల్ సెంచరీతో మెరిశాడు.ముల్తాన్ వికెట్‌పై పాక్ బౌలర్లకు బ్రూక్ చుక్కలు చూపించాడు. అతడని ఆపడం ఎవరి తరం కాలేదు. 310 బంతుల్లో 28 ఫోర్లు, 3 సిక్స్‌లతో బ్రూక్ తన తొలి ట్రిపుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.బ్రూక్ ప్రస్తుతం 305 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడితో పాటు సీనియర్ ఆటగాడు జో రూట్(262) డబుల్ సెంచరీ సాధించాడు. రూట్‌తో కలిసి హ్యారీ బ్రూక్ నాలుగో వికెట్ 454 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇంగ్లండ్ ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో 147 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 795 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ప్రస్తుతం 239 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ దాదాపుగా డ్రా అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. -
పాక్‌కు చుక్కలు.. హ్యారీ బ్రూక్ విధ్వంసకర డబుల్ సెంచరీ
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్లు పరుగులు వరద పారిస్తున్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఇప్పటికే జో రూట్ డబుల్ సెంచరీతో చెలరేగగా.. ఇప్పుడు ఈ జాబితాలోకి స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ చేరాడు. ముల్తాన్ టెస్టులో బ్రూక్ విధ్వంసకర డబుల్ సెంచరీతో మెరిశాడు. బ్యాటింగ్‌కు స్వర్గధామంలా ఉన్న ముల్తాన్ పిచ్‌పై బ్రూక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వన్డేను తలపిస్తూ పాక్ బౌలర్లను ఊతికారేశాడు. ఈ క్రమంలో కేవలం 18 ఫోర్లు, 1 సిక్సర్‌తో బ్రూక్ తొలి డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం 218 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.అది పిచ్ కాదు.. హైవే!తొలి టెస్టుకు సిద్దం చేసిన ముల్తాన్ పిచ్‌పై సర్వాత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వికెట్ ఏ మాత్రం టెస్ట్ క్రికెట్‌కు పనికిరాదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. కనీసం స్వింగ్, టర్న్ లేకుండా హైవేలా ఉందని సెటైర్లు వేస్తున్నారు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఎటువంటి పిచ్ టెస్టు క్రికెట్‌ను నాశనం చేస్తుందని విమర్శలు గుప్పించాడు. ఇంగ్లండ్ ప్రస్తుతం తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 658 పరుగులు చేసింది. క్రీజులో హ్యారీ బ్రూక్(220), జో రూట్(259) ఉన్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 414 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకుముందు పాక్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 556 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లండ్ ప్రస్తుతం 111 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ దాదాపుగా డ్రా అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.చదవండి: IND vs BAN: వారెవ్వా హార్దిక్.. సూపర్ మ్యాన్‌లా డైవ్ చేస్తూ! వీడియో First Test double ton for Harry Brook 💯💯#PAKvENG | #TestAtHome pic.twitter.com/ZjikCyBQpu— Pakistan Cricket (@TheRealPCB) October 10, 2024 -
PAK VS ENG 1st Test: లక్కీ బ్రూక్..!
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ధీటుగా జవాబిస్తుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 492 పరుగులు చేసింది. పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంగ్లండ్ ఇంకా 64 పరుగులే వెనుకపడి ఉంది. జో రూట్ (176), హ్యారీ బ్రూక్ (141) అజేయ శతకాలతో క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (78), బెన్ డకెట్ (84) కూడా అర్ద సెంచరీలతో మెరువగా.. ఓలీ పోప్ డకౌటయ్యాడు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, నసీం షా, ఆమెర్ జమాల్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు.What happened there?! 😲Brook is rendered lucky 🏏#PAKvENG | #TestAtHome pic.twitter.com/qk5dzRKEYn— Pakistan Cricket (@TheRealPCB) October 9, 2024లక్కీ బ్రూక్ఈ మ్యాచ్‌లో బ్రూక్ 75 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నప్పుడు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆమెర్ జమాల్ బౌలింగ్‌లో బ్రూక్ ఆడిన డిఫెన్సివ్ షాట్ వికెట్లకు తాకినప్పటికీ బెయిల్స్ కింద పడలేదు. దీంతో బ్రూక్ బతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. అభిమానులు లక్కీ బ్రూక్ అని కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో బ్రూక్ ఆరో టెస్ట్ సెంచరీని, రూట్ 35వ టెస్ట్ సెంచరీని పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. -
హ్యారీ బ్రూక్ సెంచరీ.. పాక్‌కు ధీటుగా బదులిస్తున్న ఇంగ్లండ్
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్ సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్‌లో బ్రూక్ 118 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. టెస్ట్‌ల్లో బ్రూక్‌కు ఇది ఆరో సెంచరీ. పాక్‌పై కేవలం ఆరు ఇన్నింగ్స్‌ల్లో ఇది నాలుగవది. బ్రూక్‌తో పాటు మరో ఎండ్‌లో జో రూట్ కూడా సెంచరీ పూర్తి చేసుకుని ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. వీరిద్దరు సెంచరీల మోత మోగించడంతో పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంగ్లండ్ ధీటుగా జవాబిస్తుంది. 85.2 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ స్కోర్ 427/3గా ఉంది. రూట్ 146, బ్రూక్ 108 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (78), బెన్ డకెట్ (84) కూడా అర్ద సెంచరీలతో మెరిశారు. అంతకుముందు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది.పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు.చదవండి: జో రూట్ సరికొత్త చరిత్ర.. తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా -
బెన్ డకెట్ సెంచరీ.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..?
బ్రిస్టల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మక ఐదో వన్డేలో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.2 ఓవర్లలో 309 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (91 బంతుల్లో 107; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు సెంచరీతో కదంతొక్కాడు. హ్యారీ (52 బంతుల్లో 72; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), ఫిలిప్ సాల్ట్ (27 బంతుల్లో 45; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్‌లతో అలరించారు. విల్ జాక్స్ (0), జేమీ స్మిత్ (6), లియామ్ లివింగ్‌స్టోన్ (0), జేకబ్ బేథెల్ (13), బ్రైడన్ కార్స్ (9), మాథ్యూ పాట్స్ (6) విఫలం కాగా.. ఆఖర్లో ఆదిల్ రషీద్ అత్యంత కీలకమైన ఇన్నింగ్స్ (25 బంతుల్లో 36; 4 ఫోర్లు) ఆడాడు. రషీద్ ఈ పరుగులు స్కోర్ చేయకుండి ఉంటే ఇంగ్లండ్ 300 పరుగుల మార్కును తాకేది కాదు. ఆసీస్ బౌలర్లలో ట్రవిస్ హెడ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. మ్యాక్స్‌వెల్, ఆరోన్ హార్డీ, ఆడమ్ జంపా తలో రెండో వికెట్లు దక్కించుకున్నారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. చదవండి: ENG VS AUS 5th ODI: జంపాకు చుక్కలు చూపించిన బ్రూక్.. వీడియో -
ENG VS AUS 5th ODI: జంపాకు చుక్కలు చూపించిన బ్రూక్.. వీడియో
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మక ఐదో వన్డేలో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 33 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ స్కోర్ 231/5గా ఉంది. బెన్ డకెట్ (88 బంతుల్లో 101), జాకబ్ బెథెల్ (15 బంతుల్లో 6) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు ఫిలిప్ సాల్ట్ (27 బంతుల్లో 45; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), బెన్ డకెట్ మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 58 పరుగులు జోడించారు. అనంతరం సాల్ట్ ఆరోన్ హార్డీ బౌలింగ్‌లో ఔట్ కాగా.. విల్ జాక్స్ క్రీజ్‌లోకి వచ్చాడు. జాక్స్ వచ్చీ రాగనే హార్డీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో డకెట్‌కు కెప్టెన్ బ్రూక్ జత కలిశాడు. వీరిద్దరు భారీ షాట్లతో చెలరేగి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.Harry Brook toying with Azam Zampa. pic.twitter.com/LFuqt2BTLL— Mufaddal Vohra (@mufaddal_vohra) September 29, 2024జంపాకు చుక్కలు చూపించిన బ్రూక్బ్రూక్ ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపాకు పట్టపగలే చుక్కలు చూపించాడు. బ్రూక్ తన ఇన్నింగ్స్‌లో 52 బంతులు ఎదుర్కొని 72 పరుగులు చేయగా.. అందులో మెజార్టీ శాతం పరుగులు జంపా బౌలింగ్‌లోనే సాధించాడు. బ్రూక్ తన ఇన్నింగ్స్‌లో ఏడు సిక్సర్లు, రెండు బౌండరీలు సాధించగా.. కేవలం జంపా బౌలింగ్‌లోనే ఓ బౌండరీ, ఆరు సిక్సర్లు కొట్టాడు. ఈ ఆరు సిక్సర్లు, ఓ బౌండరీ కేవలం 13 బంతుల వ్యవధిలో సాధించాడు. Harry Brook brings up his fifty with a six!!pic.twitter.com/rHltKptBTz— Mufaddal Vohra (@mufaddal_vohra) September 29, 2024జంపా బౌలింగ్‌లో బ్రూక్ విధ్వంసం ఓ రేంజ్లో సాగింది. మరో ఎండ్‌లో డకెట్ తన వన్డే కెరీర్లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతను టెయిలెండర్ బెథెల్ సహకారంతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. బ్రూక్ ఔటైన అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన జేమీ స్మిత్ (6), లివింగ్‌స్టోన్ (0) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో హార్డీ, జంపా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. మ్యాక్స్‌వెల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.బ్రూక్ ఇన్నింగ్స్‌లో విశేషాలు..బ్రూక్ కేవలం 39 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడుబ్రూక్ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ మార్కును తాకాడుఈ సిరీస్‌లో బ్రూక్‌కు ఇదివరకు మూడో ఫిఫ్టి ప్లస్ స్కోర్ (110, 87, 72)ఆస్ట్రేలియాపై ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ల్లో అత్యధిక పరుగులు (312) చేసిన కెప్టెన్‌గా రికార్డుగతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లి (310) పేరిట ఉండేదిడకెట్ ఇన్నింగ్స్‌లో విశేషాలు..డకెట్‌కు వన్డేల్లో ఇది రెండో సెంచరీడకెట్ తన తొలి సెంచరీని (ఐర్లాండ్) సైతం ఇదే గ్రౌండ్లో (బ్రిస్టల్) చేశాడుఈ సిరీస్‌లో డకెట్‌కు ఇది మూడో ఫిఫ్టి ప్లస్ స్కోర్ (95, 63, 101)చదవండి: రాణించిన హోప్, హెట్‌మైర్.. సరిపోని డుప్లెసిస్ మెరుపులు -
Eng Vs Aus ODI: లివింగ్‌స్టోన్ విధ్వంసం.. 27 బంతుల్లోనే
ఆస్ట్రేలియాతో నాలుగో వన్డేలో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిని ఏకంగా 186 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. కాగా మూడు టీ20లు, ఐదు వన్డేలు ఆడేందుకు ఆస్ట్రేలియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది.ఈ క్రమంలో పొట్టి సిరీస్‌లో ఇరు జట్లు చెరో విజయం సాధించగా.. మూడో మ్యాచ్ వర్షం వల్ల రద్దైంది. దీంతో 1-1తో టీ20 సిరీస్ డ్రాగా ముగిసిపోయింది. ఇక వన్డేల విషయానికొస్తే.. తొలి రెండు మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా విజయం సాధించగా.. మూడో వన్డే నుంచి ఇంగ్లండ్ గెలుపుబాట పట్టింది.39 ఓవర్లకు మ్యాచ్ కుదింపుచెస్టెర్ లీ స్ట్రీట్ వేదికగా డీఎల్ఎస్ పద్ధతిలో ఆసీస్‌ను 46 పరుగుల తేడాతో ఓడించింది. అదే విధంగా.. లార్డ్స్ వేదికగా శుక్రవారం రాత్రి ముగిసిన మ్యాచ్‌లోనూ జయభేరి మోగించింది. లండన్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ బౌలింగ్ ఎంచుకుంది.బౌండరీల వర్షం కురిపించిన బ్రూక్అయితే, వర్షం కారణంగా 39 ఓవర్లకే కుదించిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. టాపార్డర్‌లో ఓపెనర్ బెన్ డకెట్ 62 బంతుల్లో 63 పరుగులు చేయగా.. హ్యారీ బ్రూక్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. Leading from the front 💪Batted, Harry Brook! 👏 🏴 #ENGvAUS 🇦🇺 | @IGcom pic.twitter.com/RGV0rEZeWT— England Cricket (@englandcricket) September 27, 2024నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఫోర్ల వర్షం కురిపించాడు. మొత్తంగా 58 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 87 పరుగుల సాధించాడు. ఆడం జంపా బౌలింగ్‌లో గ్లెన్ మాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇవ్వడంతో బ్రూక్ ధనాధన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఆసీస్ బౌలింగ్‌ను ఊచకోత కోసిన లివింగ్స్టోన్ఇక వికెట్ కీపర్ జేమీ స్మిత్ 28 బంతుల్లో 39 రన్స్ చేయగా.. లియామ్ లివింగ్ స్టోన్ ఆసీస్ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. కేవలం 27 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో చెలరేగి ఏకంగా 62 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ నిర్ణీత 39 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 312 పరుగులు స్కోరు చేసింది.6️⃣▪️6️⃣6️⃣6️⃣4️⃣Incredible final over hitting from Liam Livingstone 💪💥🏴 #ENGvAUS 🇦🇺 | @liaml4893 pic.twitter.com/qfEDxOM88N— England Cricket (@englandcricket) September 27, 2024ఆసీస్ 126 పరుగులకే ఆలౌట్ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా కనీస పోరాటపటిమ ప్రదర్శించలేకపోయింది. 24.4 ఓవర్లలో కేవలం 126 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ ట్రవిస్ హెడ్ 34 పరుగులతో కంగారు జట్టు ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరో ఓపెనర్, కెప్టెన్ మిచెల్ మార్ష్ 28 రన్స్ చేశాడు. స్టీవ్ స్మిత్(5), జోష్ ఇంగ్లిస్(8), మార్నస్ లబుషేన్(4), గ్లెన్ మాక్స్వెల్(2), స్టార్క్(3 నాటౌట్) సింగిల్ డిజిట్లకే పరిమితం కాగా.. ఆడం జంపా, హాజిల్‌వుడ్ డకౌట్ అయ్యారు.మాథ్యూ పాట్స్‌కు నాలుగు వికెట్లుమిగతా వాళ్లలో అలెక్స్ క్యారీ 13, సీన్ అబాట్ 10 పరుగులు రాబట్టారు. ఇంగ్లండ్ బౌలర్లలో మాథ్యూ పాట్స్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్సే మూడు, జోఫ్రా ఆర్చర్ రెండు, ఆదిల్ రషీద్ ఒక వికెట్ దక్కించుకున్నారు. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అలరించిన హ్యారీ బ్రూక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య నిర్ణయాత్మక ఐదో వన్డే ఆదివారం జరుగనుంది. ఇందుకు బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్ వేదిక.చదవండి: జడేజా ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి -
ENG VS AUS 3rd ODI: కుక్ రికార్డు బ్రేక్ చేసిన బ్రూక్
ఇంగ్లండ్ తాత్కాలిక వన్డే జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్ చరిత్ర పుటల్లోకెక్కాడు. వన్డేల్లో ఇంగ్లండ్ తరఫున సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. బ్రూక్ ఈ ఘనతను తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో సాధించాడు. బ్రూక్ 25 ఏళ్ల 215 రోజుల వయసులో ఇంగ్లండ్ కెప్టెన్‌గా సెంచరీ సాధించాడు. గతంలో ఈ రికార్డు అలిస్టర్ కుక్ పేరిట ఉండేది. కుక్ 26 ఏళ్ల 190 రోజుల వయసులో ఇంగ్లండ్ వన్డే జట్టు కెప్టెన్‌గా సెంచరీ చేశాడు. ఈ జాబితాలో బ్రూక్, కుక్ తర్వాత ఇయాన్ మోర్గాన్ (26 ఏళ్ల 358 రోజులు), అలిస్టర్ కుక్ (27 ఏళ్ల 50 రోజులు), అలిస్టర్ కుక్ (27 ఏళ్ల 52 రోజులు) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. 348 రోజుల తర్వాత ఆస్ట్రేలియా ఓ వన్డే మ్యాచ్‌లో ఓడింది. ఆ జట్టు వరుసగా 14 మ్యాచ్‌లు గెలిచిన తర్వాత ఓ మ్యాచ్‌ను కోల్పోయింది. నిన్న (సెప్టెంబర్ 24) చెస్టర్ లీ స్ట్రీట్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 46 పరుగుల తేడాతో ఆసీస్‌పై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (60), అలెక్స్ క్యారీ (77 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. Harry Brook's 15 boundaries Vs Australia. - A match winning hundred by captain Brook. ⭐pic.twitter.com/RDCF37v3c1— Mufaddal Vohra (@mufaddal_vohra) September 25, 2024అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 37.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మొదలై ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్దతిన ఇంగ్లండ్‌ను విజేతగా నిర్దారించారు. బ్రూక్ 94 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. విల్ జాక్స్ 82 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో 84 పరుగులు చేశాడు. లివింగ్‌స్టోన్ (33) బ్రూక్‌కు జతగా అజేయంగా నిలిచాడు. ఈ గెలుపుతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. సిరీస్‌లోని నాలుగో వన్డే సెప్టెంబర్ 27న లార్డ్స్‌లో జరుగుతుంది. చదవండి: హ్యారీ బ్రూక్ మెరుపు సెంచరీ.. ఆసీస్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్ -
హ్యారీ బ్రూక్ మెరుపు సెంచరీ.. ఆసీస్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్
చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో డక్‌వర్త్-లూయిస్ ప్రకారం 46 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో తమ సిరీస్ ఆశలను ఇంగ్లండ్ సజీవంగా ఉంచుకుంది. ఐదు వన్డేల సిరీస్‌లో ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కు ఇంగ్లీష్ జట్టు తగ్గించింది. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కంగారులు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 304 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌కు విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ దూరమైనప్పటకి మిగితా బ్యాటర్లు సత్తాచాటారు. ఆసీస్ బ్యాటర్లలో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(77) టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్టీవ్ స్మిత్(60), గ్రీన్(42), హార్దీ(44) రాణించారు.సెంచరీతో చెలరేగిన బ్రూక్..?అనంతరం 305 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆదిలోనే తడబడింది. మిచిల్ స్టార్క్ దెబ్బకు 11 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఇంగ్లండ్ తాత్కాలిక కెప్టెన్ హ్యారీ బ్రూక్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ బౌలర్లపై బ్రూక్ ఎదురుదాడికి దిగాడు. అద్భుతమైన సెంచరీతో తమ జట్టును ఆదుకున్నాడు. కాగా హ్యారీ బ్రూక్‌కు ఇదే తొలి వన్డే సెంచరీ కావడం గమనార్హం. 94 బంతులు ఎదుర్కొన్న బ్రూక్.. 13 ఫోర్లు,2 సిక్సులతో 110 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు విల్ జాక్స్(84 పరుగులు; 9 ఫోర్లు,1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్ భాగ్యస్వామ్యానికి 156 పరుగులు జోడించారు. అయితే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 37.4 ఓవర్లలో 254-4 వద్ద మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్ ఆగిపోయింది. ఈ క్రమంలో వర్షం ఎంతకీ తగ్గుముఖం పట్టకపోవడంతో డక్‌వర్త్-లూయిస్ పద్ధతి ప్రకారం 46 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించినట్టు అంపైర్లు ప్రకటించారు. ఇక ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే లండన్ వేదికగా శుక్రవారం(సెప్టెంబర్ 27)న జరగనుంది. -
ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్
ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ జోస్ బట్లర్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. బట్లర్ స్థానంలో యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానున్న వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టును ఇవాళ (సెప్టెంబర్ 15) ప్రకటించారు. గాయం కారణంగా 6 అడుగుల 7 అంగుళాల ఫాస్ట్ బౌలర్ జోష్ హల్ కూడా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. మరోవైపు ఆసీస్‌తో రెండో టీ20లో చెలరేగిన లియామ్ లివింగ్‌స్టోన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్25 ఏళ్ల హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్ వన్డే జట్టు కెప్టెన్‌గా తొలిసారి బాధ్యతలు చేపట్టనున్నాడు. 18 నెలల కింద వన్డే అరంగేట్రం చేసిన బ్రూక్.. టెస్ట్, టీ20ల్లో తనను తాను నిరూపించుకున్నప్పటికీ.. వన్డేల్లో చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేకపోయాడు. బ్రూక్ ఇప్పటివరకు 15 వన్డేలు ఆడి 29.1 సగటున 407 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ద సెంచరీలు ఉన్నాయి. బ్రూక్ ఇటీవల ముగిసిన ద హండ్రెడ్ లీగ్‌లో నార్త్రన్ సూపర్ ఛార్జర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు..హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్సే, జోర్డాన్ కాక్స్, బెన్ డకెట్, విల్ జాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, మాథ్యూ పాట్స్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జామీ స్మిత్, ఒల్లీ స్టోన్, రీస్ టోప్లీ, జాన్ టర్నర్ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడుతున్నాయి. ఈ సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌లో గెలిచాయి. మూడో టీ20 ఇవాళ (రాత్రి 7 గంటలకు) జరగాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా ఇప్పటివరకు టాస్ కూడా పడలేదు. టీ20 సిరీస్ ముగిసిన అనంతరం సెప్టెంబర్ 19, 21, 24, 27, 29 తేదీల్లో ఐదు వన్డేలు జరుగనున్నాయి. చదవండి: లివింగ్ స్టోన్ ఊచకోత.. ఆసీస్‌పై ఇంగ్లండ్‌పై ఘన విజయం