హ్యారీ బ్రూక్ (PC: iplt20.com)
IPL 2023 DC Vs SRH: వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌కు ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ హేమంగ్ బదాని మద్దతుగా నిలిచాడు. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా నిలవగల సత్తా ఉన్న ఆటగాడంటూ కొనియాడాడు. ప్రస్తుతం తన ఆట తీరు బాగా లేకపోయినా.. త్వరలోనే తిరిగి పుంజుకుంటాడని ధీమా వ్యక్తం చేశాడు.
ఐపీఎల్-2023 వేలంలో 13.25 కోట్ల భారీ ధరకు సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ గడ్డపై టెస్టుల్లో సెంచరీలు బాదిన ఈ 24 ఏళ్ల రైట్ హ్యాండర్ బ్యాటర్‌పై అదే స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.
అంచనాలు అందుకోలేక
కానీ బ్రూక్ మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకచతికిలపడ్డాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో 55 బంతుల్లో అజేయ సెంచరీతో మెరిసిన బ్రూక్.. మిగతా మ్యాచ్‌లలో మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. ఫ్రాంఛైజీ తనపై వెచ్చించిన భారీ మొత్తానికి న్యాయం చేయలేకపోతున్నాడు. ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన ఈ టాపార్డర్ బ్యాటర్ మొత్తంగా సాధించిన పరుగులు 163.
ఏదో పొడిచేస్తాడనుకుంటే..
ఇందులో ఓ శతకం. ఈ గణాంకాలను బట్టి అతడి ప్రదర్శన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో హ్యారీ బ్రూక్ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో డకౌట్ అయిన బ్రూక్‌పై ఆరెంజ్ ఆర్మీ అభిమానులు సైతం గుర్రుగా ఉన్నారు. ఏదో పొడిచేస్తాడనుకుంటే.. సెంచరీతో మురిపించి రోజురోజుకూ దిగజారి పోతున్నాడంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు.
ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్‌గా..
ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై సన్‌రైజర్స్ విజయానంతరం కోచ్ హేమంగ్ బదాని మాట్లాడుతూ తమ బ్యాటర్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘మమ్మల్ని మేము ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. లోపాలు సరిచేసుకోవాల్సి ఉంది. ఒక్క ఇన్నింగ్స్ చాలు తిరిగి పుంజుకోవడానికి.
కచ్చితంగా మా ఆటగాళ్లు ఫామ్‌లోకి వస్తారని నమ్మకం ఉంది. ముఖ్యంగా హ్యారీ బ్రూక్... తను ప్రపంచంలోని ఉత్తమ క్రికెటర్లలో ఒకడిగా ఎదుగుతాడని నేను గట్టిగా నమ్ముతున్నాను’’ అని బదాని పేర్కొన్నాడు. అదే విధంగా మయాంక్ అగర్వాల్ ప్రస్తుతం గడ్డుకాలం ఎదుర్కొంటున్నాడని.. టచ్‌లోకి వస్తే అతడిని ఆపడం ఎవరితరం కాదని చెప్పుకొచ్చాడు. కాగా ఢిల్లీ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 9 పరుగుల తేడాతో గెలుపొంది ఈ సీజన్‌లో మూడో విజయం నమోదు చేసింది.
అతడొక్కడేనా! వాళ్లు కూడా
ఇక బ్రూక్‌తో పాటు రాహుల్ త్రిపాఠి(8 మ్యాచ్‌లలో 170 పరుగులు), మయాంక్ అగర్వాల్ (8 మ్యాచ్‌లలో 169 పరుగులు) కూడా స్థాయికి తగ్గట్లు రాణించలేక విమర్శలు మూటగట్టుకుంటున్నారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ మాత్రం ఆడిన 5 ఇన్నింగ్స్‌లో 153 పరుగులతో మెరిశాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో కీలక సమయంలో విలువైన అజేయ అర్ధ శతకం(53) సాధించాడు.
చదవండి: ఏంటి బ్రో టెస్టు మ్యాచ్ అనుకున్నావా.. జట్టులో ఇంకా ఎవరూ లేరా?
సిక్సర్ల వర్షం.. ఆట కట్టించిన అకీల్! కొంచెం కూడా తెలివి లేదు!
The Delhi Capitals came close to the target but it's @SunRisers who emerge victorious in Delhi 👏🏻👏🏻#SRH register a 9-run victory over #DC 👌🏻👌🏻
— IndianPremierLeague (@IPL) April 29, 2023
Scorecard ▶️ https://t.co/iOYYyw2zca #TATAIPL | #DCvSRH pic.twitter.com/S5METD41pF
Comments
Please login to add a commentAdd a comment