Rahul Tripathi
-
SRH Vs KKR: పాపం రాహుల్ త్రిపాఠి.. షాక్‌లో కావ్య మారన్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-1లో సనరైజర్స్ హైదరాబాద్ ఆటగాడు రాహుల్ త్రిపాఠి ఇన్నింగ్స్ ఆడాడు. విధ్వంసకర ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శరక్మ విఫలమైన చోట.. త్రిపాఠి తన బ్యాట్‌కు పనిచెప్పాడు. ఐదో వికెట్‌కు క్లాసెన్‌తో కలిసి 62 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఓవరాల్‌గా 35 బంతులు ఎదుర్కొన్న త్రిపాఠి 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 55 పరుగులు చేశాడు.అయ్యో రాహుల్..అయితే ఈ మ్యాచ్‌లో మంచి టచ్‌లో కన్పించిన త్రిపాఠిని దురదృష్టం వెంటాడింది. అనూహ్య రీతిలో త్రిపాఠి రనౌటయ్యాడు. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ 14 ఓవర్ వేసిన సునీల్ నరైన్ బౌలింగ్‌లో తొలి బంతిని సమద్ భారీ సిక్స్ మలిచాడు. అదే ఓవర్లో రెండో బంతిని సమద్ పాయింట్ దిశగా షాట్ ఆడాడు. పాయింట్లో ఉన్న రస్సెల్ అద్బుతంగా డైవ్ చేస్తూ బంతిని ఆపాడు. అయితే షాట్ ఆడిన వెంటనే సమద్ నాన్‌స్ట్రైక్‌లో ఉన్న రాహుల్ త్రిపాఠితో ఎటువంటి సమన్వయం లేకుండా సింగిల్ కోసం ప్రయత్నించాడు. త్రిపాఠి మాత్రం బంతిని చూస్తూ మిడిల్ పిచ్‌లోనే ఉండిపోయాడు. ఈ క్రమంలో రస్సెల్ బంతిని వికెట్ కీపర్ గుర్బాజ్ అందజేయగా.. అతడు స్టంప్స్‌ను గిరాటేశాడు. కాగా ఔటైన అనంతరం త్రిపాఠి భావోద్వేగానికి లోనయ్యాడు. పెవిలియన్‌కు వెళ్లే క్రమంలో మెట్లపై కూర్చోని కన్నీరు పెట్టుకున్నాడు. ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్యా మారన్ సైతం షాక్‌కు గురైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Dre-Russ produces a piece of magic 🔥💜#IPLonJioCinema #TATAIPL #KKRvSRH #TATAIPLPlayoffs #AndreRussell pic.twitter.com/eaZRQNkes5— JioCinema (@JioCinema) May 21, 2024 -
IPL 2024: టెస్టు మ్యాచ్‌లా ఆడాడు.. ఎస్ఆర్హెచ్ కొంపముంచాడు! ఎవరంటే?
ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలిపించింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్ హెన్రిస్ క్లాసెన్ 63 పరుగులతో విరోచిత పోరాటం చేసినప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు. 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఆటగాడు రాహుల్ త్రిపాఠి దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. త్రిపాఠి తన ఆట తీరుతో పరోక్షంగా ఎస్ఆర్హెచ్ ఓటమికి కారణమయ్యాడు. 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ మంచి అరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అగర్వాల్ ఔటయ్యాక క్రీజులోకి రాహుల్ త్రిపాఠి వచ్చాడు. క్రీజులోకి వచ్చినప్పటినుంచే ప్రత్యర్ధి బౌలర్లను ఎదుర్కోవడానికి రాహుల్ కష్టపడ్డాడు. ఓ వైపు కావాల్సిన రన్‌రేట్(రిక్వైడ్ రన్ రేట్) పెరుగుతూ ఉంటే త్రిపాఠి డిఫెన్స్ ఆడుతూ విసుగు తెప్పించాడు. టెస్టు కంటే దారుణంగా త్రిపాఠి ఇన్నింగ్స్ కొనసాగింది. అతడు రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకునప్పటికి తన ఇన్నింగ్స్‌ను మాత్రం ఎక్కువ సమయం కొనసాగించలేకపోయాడు. సరిగ్గా 20 బంతుల్లో 1 సిక్సర్‌తో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో అతడిపై ఎస్ఆర్హెచ్ అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. టెస్టు మ్యాచ్‌లా ఆడి ఎస్ఆర్హెచ్ కొంపముంచాడని పోస్ట్‌లు పెడుతున్నారు. Rahul Tripathi started the IPL 2024 from where left last season. Scored 20 off 20 in 209 runs chase at batting paradise Edens🥵🔥 #KKRvSRH pic.twitter.com/pXwjrLuHsA — TukTuk Academy (@TukTuk_Academy) March 23, 2024 -
ప్రియాంక్ పాంచల్ సుడిగాలి ఇన్నింగ్స్.. సిక్సర్ల మోత, 99 నాటౌట్
దియోదర్ ట్రోఫీ-2023లో భాగంగా ఇవాళ (జులై 24) జరిగిన రెండో మ్యాచ్‌లో వెస్ట్ జోన్ ఓపెనర్, ఆ జట్టు కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ (69 బంతుల్లో 99 నాటౌట్; 7 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతనికి మరో ఓపెనర్, వికెట్‌కీపర్ హార్విక్ దేశాయి (71 బంతుల్లో 85; 14 ఫోర్లు) సహకరించడంతో నార్త్ ఈస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్ట్ జోన్ ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. నార్త్ ఈస్ట్ జోన్ నిర్ధేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని వెస్ట్ జోన్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి మరో 149 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఫలితంగా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పంచల్, రాహుల్ త్రిపాఠి (11 బంతుల్లో 13 నాటౌట్; 2 ఫోర్లు) వెస్ట్ జోన్‌ను విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ ఈస్ట్ జోన్.. సగ్వస్వల్లా (3/31), షమ్స్ ములానీ (2/37), శివమ్ దూబే (2/36), చింతన్ గజా (1/25), సేథ్ (1/38), పార్థ్ భట్ (1/34) ధాటికి 47 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. నార్త్ ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్‌లో తొమ్మిదో నంబర్ ఆటగాడు టాప్ స్కోరర్‌గా (38) నిలవడం విశేషం. పాంచల్ సుడిగాలి ఇన్నింగ్స్ తన సహజసిద్ధమైన ఆటకు భిన్నంగా ఆడిన ప్రియాంక్ పాంచల్.. నార్త్ ఈస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. కేవలం 69 బంతుల్లోనే 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేశాడు. పాంచల్‌కు లిస్ట్-ఏ క్రికెట్లో ఇది 20వ అర్ధశతకం. లిస్ట్-ఏ క్రికెట్లో ఇప్పటివరకు 87 మ్యాచ్‌లు ఆడిన పంచల్.. 40కి పైగా సగటుతో 3378 పరుగులు చేశాడు. ఇందులో 20 ఫిఫ్టీలు, 7 శతకాలు ఉన్నాయి. ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్‌జోన్‌పై 95 పరుగులు చేసిన పాంచల్ తన ఫామ్‌ను కొనసాగించాడు. -
నిమిషాల్లో అంతా తారుమారైంది.. వాళ్ల వల్లే గెలిచాం.. అయితే: మార్కరమ్
IPL 2023 RR Vs SRH: ‘‘నిమిషాల్లో అంతా తారుమారైంది. ఉత్కంఠ పోరులో విజయం మా వైపు నిలిచింది. భావోద్వేగాలు పెల్లుబికాయి. 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అంత సులువేమీ కాదు. భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసే క్రమంలో జట్టు సమష్టిగా పోరాడింది. ఊహించనదాని కంటే ఎక్కువే స్కోరు చేస్తామని అనుకున్నాం. అదే నిజమైంది. వాస్తవానికి ముందు నుంచే మేము కాస్త దూకుడు ప్రదర్శించాల్సింది’’ అని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ అన్నాడు. బ్యాటర్ల సమష్టి ప్రదర్శనతోనే గెలుపు వరించిందని సంతోషం వ్యక్తం చేశాడు. నాడు ఘోర పరాభవం ఐపీఎల్-2023లో తమ తొలి మ్యాచ్‌లో ఉప్పల్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో తలపడిన సన్‌రైజర్స్‌కు చేదు అనుభవం మిగిలిన విషయం తెలిసిందే. సొంతమైదానంలో ఏకంగా 72 పరుగుల భారీ తేడాతో ఓడి ఐపీఎల్ పదహారో ఎడిష్ను ఓటమితో ఆరంభించింది. ఈ క్రమంలో ఆదివారం (మే 7) నాటి మ్యాచ్‌లో రాజస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. మరోసారి బట్లర్ విశ్వరూరం జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. యశస్వి జైశ్వాల్ (18 బంతుల్లో 35 పరుగులు) మెరుగ్గా రాణించగా.. మరో ఓపెనర్ జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 59 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో ఏకంగా 95 పరుగులు సాధించాడు. ఇక కెప్టెన్ సంజూ శాంసన్(38 బంతుల్లో 66 పరుగులు) ఆఖర్లో మెరుపులు మెరిపించాడు. అభిషేక్, త్రిపాఠి కలిసి ఈ నేపథ్యంలో నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు నష్టపోయి రాజస్తాన్ 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన రైజర్స్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 52 పరుగులు చేయగలిగింది. ఈ క్రమంలో ఓపెనర్ అభిషేక్ శర్మ(55 పరుగులు)కు తోడైన రాహుల్ త్రిపాఠి అతడితో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. అయితే, 13వ ఓవర్లో అశ్విన్ బౌలింగ్‌లో సిక్స్ బాదిన అభిషేక్.. మరోసారి భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్ చేరడంతో రైజర్స్ రెండో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన క్లాసెన్ 12 బంతుల్లో 26 పరుగులు సాధించి 16వ ఓవర్ ఐదో బంతికి పెవిలియన్ చేరాడు. ఫిలిప్స్ అద్భుతం చేశాడు.. 6,6,6,4 ఆ తర్వాత కాసేపటికే త్రిపాఠి(29 బంతుల్లో 47 పరుగులు)ని చహల్ పెవిలియన్‌కు పంపాడు. దీంతో క్రీజులో(18వ ఓవర్ మూడో బంతి)కి వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ తొలుత రెండు పరుగులు, ఆ తర్వాత ఒక పరుగు మాత్రమే తీశాడు. ఇంతలోనే మరో ఎండ్‌లో ఉన్న మార్కరమ్(6)ను చహల్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. నో బాల్ వల్ల అదృష్టం దీంతో రైజర్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న తరుణంలో ఫిలిప్స్ అద్భుతం చేశాడు. కుల్దిప్ యాదవ్ బౌలింగ్‌లో వరుసగా 6,6,6, 4 బాది మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. ఇక ఆఖరి బంతికి హైడ్రామా నెలకొనగా.. సందీప్ శర్మ నోబాల్ కారణంగా రైజర్స్‌కు అదృష్టం కలిసి వచ్చింది. రాజస్తాన్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచిందన్న స్టేట్మెంట్ నిమిషాల్లో తారుమారైంది. ప్రేక్షకులను మునివేళ్ల మీద నిలబెట్టిన మ్యాచ్‌లో రైజర్స్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందడంతో ఆరెంజ్ ఆర్మీ సంబరాలు అంబరాన్నంటాయి. వాళ్ల వల్లే గెలిచాం ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మార్కరమ్ మాట్లాడుతూ.. ‘‘అభిషేక్ మాకు శుభారంభం అందించాడు. త్రిపాఠి అతడికి తోడుగా నిలబడ్డాడు. ఆ తర్వాత ఫిలిప్స్, క్లాసీ అద్భుత పాత్ర పోషించారు. సమద్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఒత్తిడి పెరిగినపుడు సరైన టెక్నిక్‌ను ఉపయోగిస్తే ఇలాంటి ఫలితం వస్తుంది’’ అని తమ బ్యాటర్ల ఆట తీరు పట్ల హర్షం వ్యక్తం చేశాడు. చదవండి: ఇన్నాళ్లు ఎక్కడున్నావ్ ఫిలిప్స్.. బ్రూక్‌కు వదిలేసి మంచి పని చేసింది..! సాహో సాహా.. టెస్ట్ జట్టులో చోటు కన్ఫర్మ్.. రహానే లాగే..! WHAT. A. GAME 😱😱 Abdul Samad wins it for the @SunRisers as he hits a maximum off the final delivery. #SRH win by 4 wickets. Scorecard - https://t.co/1EMWKvcgh9 #TATAIPL #RRvSRH #IPL2023 pic.twitter.com/yh0WVMEbOz — IndianPremierLeague (@IPL) May 7, 2023 -
SRH: ఏదో పొడిచేస్తాడనుకుంటే!.. అతడొక్కడేనా?! నాకు నమ్మకం ఉంది!
IPL 2023 DC Vs SRH: వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌కు ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ హేమంగ్ బదాని మద్దతుగా నిలిచాడు. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా నిలవగల సత్తా ఉన్న ఆటగాడంటూ కొనియాడాడు. ప్రస్తుతం తన ఆట తీరు బాగా లేకపోయినా.. త్వరలోనే తిరిగి పుంజుకుంటాడని ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్-2023 వేలంలో 13.25 కోట్ల భారీ ధరకు సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ గడ్డపై టెస్టుల్లో సెంచరీలు బాదిన ఈ 24 ఏళ్ల రైట్ హ్యాండర్ బ్యాటర్‌పై అదే స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అంచనాలు అందుకోలేక కానీ బ్రూక్ మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకచతికిలపడ్డాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో 55 బంతుల్లో అజేయ సెంచరీతో మెరిసిన బ్రూక్.. మిగతా మ్యాచ్‌లలో మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. ఫ్రాంఛైజీ తనపై వెచ్చించిన భారీ మొత్తానికి న్యాయం చేయలేకపోతున్నాడు. ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన ఈ టాపార్డర్ బ్యాటర్ మొత్తంగా సాధించిన పరుగులు 163. ఏదో పొడిచేస్తాడనుకుంటే.. ఇందులో ఓ శతకం. ఈ గణాంకాలను బట్టి అతడి ప్రదర్శన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో హ్యారీ బ్రూక్ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో డకౌట్ అయిన బ్రూక్‌పై ఆరెంజ్ ఆర్మీ అభిమానులు సైతం గుర్రుగా ఉన్నారు. ఏదో పొడిచేస్తాడనుకుంటే.. సెంచరీతో మురిపించి రోజురోజుకూ దిగజారి పోతున్నాడంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్‌గా.. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై సన్‌రైజర్స్ విజయానంతరం కోచ్ హేమంగ్ బదాని మాట్లాడుతూ తమ బ్యాటర్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘మమ్మల్ని మేము ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. లోపాలు సరిచేసుకోవాల్సి ఉంది. ఒక్క ఇన్నింగ్స్ చాలు తిరిగి పుంజుకోవడానికి. కచ్చితంగా మా ఆటగాళ్లు ఫామ్‌లోకి వస్తారని నమ్మకం ఉంది. ముఖ్యంగా హ్యారీ బ్రూక్... తను ప్రపంచంలోని ఉత్తమ క్రికెటర్లలో ఒకడిగా ఎదుగుతాడని నేను గట్టిగా నమ్ముతున్నాను’’ అని బదాని పేర్కొన్నాడు. అదే విధంగా మయాంక్ అగర్వాల్ ప్రస్తుతం గడ్డుకాలం ఎదుర్కొంటున్నాడని.. టచ్‌లోకి వస్తే అతడిని ఆపడం ఎవరితరం కాదని చెప్పుకొచ్చాడు. కాగా ఢిల్లీ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 9 పరుగుల తేడాతో గెలుపొంది ఈ సీజన్లో మూడో విజయం నమోదు చేసింది. అతడొక్కడేనా! వాళ్లు కూడా ఇక బ్రూక్‌తో పాటు రాహుల్ త్రిపాఠి(8 మ్యాచ్‌లలో 170 పరుగులు), మయాంక్ అగర్వాల్ (8 మ్యాచ్‌లలో 169 పరుగులు) కూడా స్థాయికి తగ్గట్లు రాణించలేక విమర్శలు మూటగట్టుకుంటున్నారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ మాత్రం ఆడిన 5 ఇన్నింగ్స్‌లో 153 పరుగులతో మెరిశాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో కీలక సమయంలో విలువైన అజేయ అర్ధ శతకం(53) సాధించాడు. చదవండి: ఏంటి బ్రో టెస్టు మ్యాచ్ అనుకున్నావా.. జట్టులో ఇంకా ఎవరూ లేరా? సిక్సర్ల వర్షం.. ఆట కట్టించిన అకీల్! కొంచెం కూడా తెలివి లేదు! The Delhi Capitals came close to the target but it's @SunRisers who emerge victorious in Delhi 👏🏻👏🏻#SRH register a 9-run victory over #DC 👌🏻👌🏻 Scorecard ▶️ https://t.co/iOYYyw2zca #TATAIPL | #DCvSRH pic.twitter.com/S5METD41pF — IndianPremierLeague (@IPL) April 29, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కేకేఆర్ వద్దన్నోడిని ఎస్ఆర్హెచ్ హత్తుకుంది.. ప్రతీకారం తీర్చుకునేనా?
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ తొలి విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠి(48 బంతుల్లో 74 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించి ఎస్ఆర్హెచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఇవాళ(శుక్రవారం) ఈడెన్ గార్డెన్స్ వేదివగా కేకేఆర్‌తో ఎస్ఆర్హెచ్ తలపడనుంది. అయితే ఇదే రాహుల్ త్రిపాఠి 2020 మెగావేలంలో కేకేఆర్ రూ.60 లక్షల కనీస ధరకే కొనుగోలు చేసింది. ఆ తర్వాత రెండేళ్ల పాటు కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక 2022లో మెగావేలానికి ముందు రాహుల్ త్రిపాఠిని వదిలేసింది. దీంతో వేలంలో ఎస్ఆర్హెచ్ రూ. 8.5 కోట్లు పెట్టి మరీ కొనుగోలు చేసింది. అయితే గత సీజన్లో రాహుల్ త్రిపాఠి అంతంత మాత్రంగానే ఆడాడు. అయితే తనపై నమ్మకముంచిన ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది. తాజాగా తనను వద్దనుకున్న కేకేఆర్‌తో ఇవాళ రాహుల్ త్రిపాఠి మ్యాచ్ ఆడబోతున్నాడు. ఎస్ఆర్హెచ్ను గెలిపించి ఫామ్ మీదున్న రాహుల్ త్రిపాఠి తన ప్రతీకారం తీర్చుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారంది. ఇక రాహుల్ త్రిపాఠి ఇప్పటివరకు ఐపీఎల్లో 79 మ్యాచ్‌లాడి 1906 పరుగులు చేశాడు. ఇందులో 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 93గా ఉంది. ఇక టీమిండియా తరపున 5 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడిన రాహుల్ త్రిపాఠి 97 పరుగులు చేశాడు. -
సరైన నిర్ణయం కాదు.. కానీ ప్రయోగం ఫలించింది
-
సరైన నిర్ణయం కాదు.. కానీ ప్రయోగం ఫలించింది
-
SRH Vs PBKS: అద్భుత ఇన్నింగ్స్.. త్రిపాఠి- మార్కరమ్ అరుదైన ఘనత..
Sunrisers Hyderabad vs Punjab Kings: ఐపీఎల్-2023లో ఆరెంజ్ ఆర్మీకి ఎట్టకేలకు ‘సన్‌రైజ్’ అయింది. హైదరాబాద్ జట్టు విన్‌రైజర్స్‌గా నిలిచి తాజా ఎడిషన్‌లో తొలి విజయం నమోదు చేసింది. సమిష్టి ప్రదర్శనతో సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చేసి అభిమానులను ఖుషీ చేసింది. ఉప్పల్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ శుభారంభం అందించాడు. తొలి బంతికే పంజాబ్ ఓపెనర్ ప్రబ్‌సిమ్రన్ సింగ్‌ను పెవిలియన్‌కు పంపాడు. చెలరేగిన మార్కండే ఈ క్రమంలో మార్కో జాన్సెన్ రెండు వికెట్లు తీయగా.. దేశీ స్పిన్నర్ మయాంక్ మార్కండే నాలుగు వికెట్లతో చెలరేగాడు. కశ్మీర్ స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్ రెండు వికెట్లతో మెరిశాడు. రైజర్స్ బౌలర్ల విజృంభణతో పంజాబ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టినప్పటికీ కెప్టెన్ శిఖర్ ధావన్ అద్భుత ఇన్నింగ్స్ (66 బంతుల్లో 99 పరుగులు)ఆడాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ధావన్ సేన 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు హ్యారీ బ్రూక్(14 బంతుల్లో 13 పరుగులు), మయాంక్ అగర్వాల్ (20 బంతుల్లో 21 పరుగులు) నిరాశపరిచారు. త్రిపాఠి, మార్కరమ్ వల్లే ఇలా.. అరుదైన ఘనత ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి(48 బంతుల్లో 74 పరుగులు నాటౌట్), కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ (21 బంతుల్లో 37 పరుగులు నాటౌట్)బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు. వరుస బౌండరీలతో విరుచుకుపడిన త్రిపాఠి 35 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. నాథన్ ఎలిస్ ఓవర్లో మార్కరమ్ నాలుగు ఫోర్లు బాది రైజర్స్ విజయం ఖరారు చేశాడు. వీరిద్దరి అద్భుత భాగస్వామ్యంతో సన్‌రైజర్స్ ఖాతాలో తొలి గెలుపు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో త్రిపాఠి, మార్కరమ్ అరుదైన ఘనత అందుకున్నారు. ఎస్ఆర్హెచ్ తరఫున మూడో వికెట్‌కు వంద పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన ఐదో జోడీగా నిలిచారు. ఎస్ఆర్హెచ్ తరఫున మూడో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం ►మనీశ్ పాండే- విజయ్ శంకర్ -2021- దుబాయ్‌లో- రాజస్తాన్ రాయల్స్ మీద- 140 పరుగులు ►కేన్ విలియమ్సన్- మనీశ్ పాండే- 2018- బెంగళూరలో- ఆర్సీబీతో మ్యాచ్‌లో- 135 పరుగులు ►డేవిడ్ వార్నర్- విజయ్ శంకర్- 2017- గుజరాత్ లయన్స్ మీద- కాన్పూర్‌లో- 133 పరుగులు ►కేఎల్ రాహుల్- డేవిడ్ వార్నర్- 2014లో- ముంబై ఇండియన్స్ మీద- దుబాయ్‌లో- 111 పరుగులు ►రాహుల్ త్రిపాఠి- ఎయిడెన్ మార్కరమ్- 2023లో- పంజాబ్ కింగ్స్ మీద- హైదరాబాద్‌లో- 100 పరుగులు అదే విధంగా ఈ గెలుపుతో సొంతగడ్డపై హైదరాబాద్ జట్టు 31వ విజయం నమోదు చేసింది. ఇప్పటివరకు ఆడిన 46 మ్యాచ్‌లలో 31 గెలిచి.. 15 ఓడిపోయింది. చదవండి: అలా చేయడం సరికాదని తెలుసు.. కానీ తప్పలేదు.. అయితే: మార్కరమ్ #KavyaMaran: 'చల్ హట్ రే'.. నీకు నేనే దొరికానా! 𝗪𝗛𝗔𝗧 𝗔 𝗪𝗜𝗡!👌 👌 1⃣st victory of the #TATAIPL 2023 for @SunRisers as they beat #PBKS by 8⃣ wickets in Hyderabad 👏 👏 Scorecard 👉 https://t.co/Di3djWhVcZ #TATAIPL | #SRHvPBKS pic.twitter.com/DoAFIkaMgb — IndianPremierLeague (@IPL) April 9, 2023 -
అలా చేయడం సరికాదని తెలుసు.. కానీ తప్పలేదు.. అయితే: మార్కరమ్
ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి విజయం నమోదు చేసింది. ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించింది. బౌలింగ్ బ్యాటింగ్‌లో అదరగొట్టిన ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్‌ను చిత్తు చేసింది. 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ రెండు వికెట్లు కోల్పోయి 17.1 ఓవర్లలో ఛేదించింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో రాహుల్ త్రిపాఠి(74 నాటౌట్) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ మార్కరమ్(37నాటౌట్) రాణించాడు. అంతకుముందు బౌలింగ్‌లో స్పిన్నర్ మయాంక్ మార్కండే నాలుగు వికెట్లతో పంజాబ్‌ను దెబ్బ తీశాడు. ఇక ఈ ఘన విజయంపై మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ స్పందించాడు. ఈ విజయం చాలా ప్రత్యేకమైనది మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. "ఈ విజయం మాకు చాలా స్పెషల్. ఛేజింగ్ ఆరంభంలో మాకు కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ.. ఆఖరికి విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. మా జట్టుకు అద్భుతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇంతమంది అభిమానుల మధ్య మా తొలి విజయాన్ని నమోదు చేయడం ఆనందంగా ఉంది. అది సరైన నిర్ణయం కాదని తెలుసు.. అయితే ప్రయోగం ఫలించింది ఇక ఈ మ్యాచ్‌లో అదిల్ రషీద్ వంటి స్టార్ స్పిన్నర్‌ను పక్కన పెట్టి మయాంక్ మార్కండేను ఆడించడం సరైన నిర్ణయం కాదని నాకు తెలుసు. కానీ నేను ప్రయోగం చేయాలనుకున్నాను. నేను చేసిన ప్రయోగం ఫలించింది. మార్కండే అద్భుతంగా రాణించాడు. అదే విధంగా రాహుల్ త్రిపాఠి గురుంచి ఎంత చెప్పినా తక్కువే. అతడు కొంచెం కూడా ఒత్తిడి లేకుండా ఆడాడు. రాహుల్ తన క్లాస్ ఏంటో మరోసారి చూపించాడు. ఇది మాకు తొలి విజయం. తర్వాతి మ్యాచ్‌ల్లో కూడా ఇదే జోరును కొనసాగిస్తాం" అని మార్కరమ్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: మరి నువ్వు మారవా బ్రో.. 13 కోట్లు తీసుకున్నావు! ఇదేనా ఆట? 𝗪𝗛𝗔𝗧 𝗔 𝗪𝗜𝗡!👌 👌 1⃣st victory of the #TATAIPL 2023 for @SunRisers as they beat #PBKS by 8⃣ wickets in Hyderabad 👏 👏 Scorecard 👉 https://t.co/Di3djWhVcZ #TATAIPL | #SRHvPBKS pic.twitter.com/DoAFIkaMgb — IndianPremierLeague (@IPL) April 9, 2023 -
ఉప్పల్‌లో మ్యాచ్.. పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ గెలుపు (ఫొటోలు)
-
స్టన్నింగ్ క్యాచ్.. చెత్త రివ్యూతో పరువు తీసుకున్న బ్యాటర్
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ఎస్ఆర్హెచ్, రాజస్తాన్ మ్యాచ్‌లో స్టన్నింగ్ క్యాచ్ నమోదైంది. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఇది చోటుచేసుకుంది. బౌల్డ్ వేసిన ఔట్ స్వింగర్‌ను అవనసరంగా గెలుక్కున్న రాహుల్ త్రిపాఠి మూల్యం చెల్లించుకున్నాడు. బంతి బ్యాట్ ఎడ్జ్ తాకింది. కీపర్‌కు, స్లిప్ ఫీల్డర్‌కు మధ్య గ్యాప్‌లో వెళ్తున్న బంతిని జేసన్ హోల్డర్ ఎడమవైపుకు డైవ్ చేస్తూ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. అయితే త్రిపాఠి రివ్యూకు వెళ్లి చేతులు కాల్చుకున్నాడు. బ్యాట్‌కు బంతి క్లియర్‌గా తగిలిందని తెలుస్తున్నా అనవసరంగా రివ్యూకు వెళ్లి పరువు తీసుకున్నాడు. బౌల్ట్ వేసిన బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తాకి బౌన్స్ అయినప్పటికి.. అయితే బంతి బ్యాట్‌ను తగల్లేదనే ఉద్దేశంతో త్రిపాఠి రివ్యూకు వెళ్లి ఉంటాడు. ఇక జేసన్ హోల్డర్ క్యాచ్ సీజన్ ఆఫ్ ది క్యాచ్‌గా నమోదైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. Trent Boult is a beast in the Powerplay. pic.twitter.com/0nRX2295wc — Mufaddal Vohra (@mufaddal_vohra) April 2, 2023 చదవండి: ఇంతలా చెలరేగుతున్నా మనసు కరగడం లేదా! -
విరాట్ కోహ్లి స్థానాన్ని భర్తీ చేసే అర్హత అతడికే ఉంది: డీకే
Virat Kohli's First-Choice Replacement By DK: ‘‘నేను కేవలం ఆ ఒక్క వ్యక్తి భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించడం లేదు. క్రికెట్‌ను ప్రేమించే, ఆటలో ప్రతి అంశాన్ని సునిశితంగా పరిశీలించే అభిమానుల కోణం నుంచి ఈ మాట చెబుతున్నా.. సమీప భవిష్యత్తులో విరాట్ కోహ్లి స్థానాన్ని భర్తీ చేయగలిగే ఆటగాడు రాహుల్ త్రిపాఠి’’ అని టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ అన్నాడు. అరంగేట్రంలోనే నిరాశ ఇటీవల శ్రీలంకతో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌తో రాహుల్ త్రిపాఠి అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కోహ్లి గైర్హాజరీ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు కేవలం 5 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. లంకతో రెండో మ్యాచ్‌లోనూ అదే స్కోరు. రాహుల్ త్రిపాఠి అయితే, ఆఖరి టీ20లో మాత్రం 31 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ ప్రభావం చూపగలిగాడు. 16 బంతుల్లో 35 పరుగులతో త్రిపాఠి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక న్యూజిలాండ్‌తో పొట్టి సిరీస్‌లోనూ ఇదే జోష్ కొనసాగిస్తాడని ఆశగా ఎదురుచూస్తే తొలి మ్యాచ్‌లోనే డకౌట్‌గా వెనుదిరిగాడు. కీలక సమయంలో మాత్రం అదుర్స్ ఆ తర్వాతి మ్యాచ్‌లో 13 పరుగులు చేసిన త్రిపాఠి.. సిరీస్ ఫలితాన్ని తేల్చే అహ్మదాబాద్ టీ20లో మాత్రం అదరగొట్టాడు. 22 బంతుల్లో 44 పరుగులతో ఉత్తమంగా రాణించాడు. తద్వారా టీమిండియా భారీ స్కోరు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఆరంభంలో ‘‘కోహ్లి స్థానాన్ని కట్టబెడితే ఇలాగేనా చేసేది’’ అంటూ విమర్శించిన వాళ్లే.. ‘‘పర్లేదు.. పనికొస్తాడు’’ అంటూ ప్రశంసిచేలా చేసుకున్నాడు. వేరే వాళ్లు వద్దు.. అతడే అర్హుడు ఈ నేపథ్యంలో క్రిక్‌బజ్ షోలో పాల్గొన్న దినేశ్ కార్తిక్ రాహుల్ త్రిపాఠిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఐపీఎల్లో అతడితో కేకేఆర్‌కు ఆడిన అనుభవం నాకుంది. తనని దగ్గరగా పరిశీలించాను. జట్టు ప్రయోజనాల కోసం నిస్వార్థంగా ఆడే గుణం ఉంది. రానున్న ఐపీఎల్లో అతడు అదరగొట్టొచ్చు. అలా జరగకనూపోవచ్చు. అయినప్పటికీ టీమిండియాలో మూడో స్థానానికి అతడు పూర్తి అర్హుడని నేను భావిస్తున్నా. ఒకవేళ విరాట్ కోహ్లి ఆడాలనుకుంటే ఓకే.. లేదు తను తప్పుకోవాలని అనుకుంటే మాత్రం అతడి స్థానంలో రాహుల్ త్రిపాఠికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. వేరే స్థానాల్లో ఆడుతున్న వాళ్లను ప్రమోట్ చేయడం వంటివి చేయకుండా త్రిపాఠికి అవకాశం ఇవ్వాలి. అతడు 40 లేదంటే 30 పరుగులకే చేశాడనే గణాంకాలతో పనిలేదు. కీలక సమయంలో అతడు రాణించగలడు. దయచేసి ఈ విషయాన్ని ఎవరూ మర్చిపోవద్దు’’ అని డీకే సూచించాడు. రోహిత్ వారసుడు గిల్.. మరి? కాగా ఫార్మాట్లకు అతీతంగా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ అద్భుతంగా రాణిస్తున్న నేపథ్యంలో రోహిత్ శర్మ వారసుడు దొరికేశాడని, మరి కోహ్లి స్థానాన్ని భర్తీ చేసేదెవరంటూ క్రీడా వర్గాల్లో చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ త్రిపాఠిని ఉద్దేశించి డీకే చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. దినేశ్ కార్తిక్ వ్యాఖ్యలపై త్రిపాఠి ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: MICT Vs DSG: నిరాశపరిచిన బేబీ ఏబీడీ.. రెచ్చిపోయిన డికాక్.. ఎంఐపై సూపర్ జెయింట్స్ గెలుపు ILT 20 2023: ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు.. పఠాన్‌ను ఉతికారేసిన విండీస్ స్టార్ This is best and most beautiful tribute to @tripathirahul52 anyone can give . One of the most selfless player in the circuit who always keep him team above him every single time . Bro u r a joy to watch ♥️♥️ and @DineshKarthik thank you for saying this . pic.twitter.com/o8wBiM6EZc — Raazi (@Rg86037221) February 1, 2023 -
సూపర్ సిక్సర్.. సూర్యను గుర్తు చేసిన రాహుల్ త్రిపాఠి! కానీ..
India vs New Zealand, 3rd T20I- Viral Video: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా ఎట్టకేలకు టీమిండియా వన్‌డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి తన ముద్ర వేయగలిగాడు. అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్‌లో రాణించి సత్తా చాటాడు. మొత్తంగా 22 బంతులు ఎదుర్కొన్న త్రిపాఠి 4 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 44 పరుగులు చేసి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ అద్భుత అజేయ సెంచరీ(126- నాటౌట్)తో మెరిసిన వేళ.. టీమిండియా భారీ స్కోరు చేయడంతో తన వంతు పాత్ర పోషించాడు త్రిపాఠి. అయితే, అర్ధ శతకానికి ఆరు పరుగుల దూరంలో నిలిచిపోవడం తనను నిరాశపరిచింది. ఇంకొన్ని రన్స్ తీసి ఉంటే బాగుండేది ఈ విషయం గురించి రాహుల్ త్రిపాఠి మాట్లాడుతూ.. ‘‘ఇంకొన్ని రన్స్ తీసి ఉంటే నేను మరింత సంతోషంగా ఉండేవాడిని. రాహుల్ సర్ సహా ప్రతి ఒక్కరు.. నాదైన శైలిలో నన్ను ఆడమని ప్రోత్సహించారు. పవర్‌ప్లేలో వీలైనన్ని పరుగులు రాబట్టమని చెప్పారు. నేను అలాగే చేశాను. కానీ.. మరికొన్ని పరుగులు చేస్తే ఇంకా బాగుండేది. ఏదేమైనా.. అహ్మదాబాద్ స్టేడియంలో అద్భుతమైన ప్రేక్షకుల నడుమ ఆడటం.. మేము సిరీస్ గెలవడం సంతోషంగా ఉంది’’ అని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో మూడు సిక్సర్లతో రాణించిన రాహుల్ త్రిపాఠి మొదట కొట్టిన సిక్స్ మాత్రం హైలైట్‌గా నిలిచింది. సూర్యను గుర్తు చేసిన త్రిపాఠి ఇండియా ఇన్నింగ్స్‌లో ఆరో ఓవర్ మూడో బంతిని ఆఫ్ స్టంప్ దిశగా వేశాడు కివీస్ బౌలర్ లాకీ ఫెర్గూసన్. ఈ బాల్‌ను ఫైన్‌లెగ్ మీదుగా సిక్సర్‌గా మలిచిన త్రిపాఠి.. టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్‌ను గుర్తు చేశాడు. త్రిపాఠి స్కూప్ షాట్‌కు సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. కాగా హాఫ్ సెంచరీకి చేరువైన తరుణంలో మరో భారీ షాట్‌కు యత్నించిన త్రిపాఠి ఇష్ సోధి బౌలింగ్‌లో ఫెర్గూసన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇదిలా ఉంటే.. తొలి టీ20లో డకౌట్ అయిన రాహుల్ త్రిపాఠి.. రెండో మ్యాచ్‌లో 13 పరుగులు మాత్రమే చేసి విమర్శలపాలైన సంగతి తెలిసిందే. చదవండి: Shubman Gill Century: అప్పుడు 7, 11.. ఇప్పుడేమో ఏకంగా 126.. ప్రతి మ్యాచ్‌కు సచిన్ రావాల్సిందే! SA Vs Eng: అన్నా.. ఏందన్నా ఇది! ఇలాంటి షాట్ ఎవరూ ట్రై చేసి ఉండరు! వైరల్ That SIX by Rahul Tripathi tho! 😍#INDvNZ pic.twitter.com/yXiBJuKLu2 — Punjab Kings (@PunjabKingsIPL) February 1, 2023 -
రాహుల్ త్రిపాఠి మెరుపు ఇన్నింగ్స్.. ఔటయ్యాక బాధ వర్ణణాతీతం
న్యూజిలాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టీ20లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి మెప్పించిన టీమిండియా వన్‌డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి (22 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు)పై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నది కొద్దిసేపే అయినా త్రిపాఠి ఆడిన ఇన్నింగ్స్‌ను జనాలు మెచ్చుకోలేక ఉండలేకపోతున్నారు. అయితే త్రిపాఠి వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేద్దామనే తొందరలో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ఐష్ సోధీ బౌలింగ్‌లో ఫెర్గూసన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించిన త్రిపాఠి ఔటైన అనంతరం చాలా బాధపడ్డాడు. ఫెర్గూసన్ క్యాచ్ పట్టగానే అతను కోపం కట్టలు తెంచుకుంది. బౌండరీ లైన్ క్లియర్ చేయలేనందుకు తనను తానే దూషించుకన్నాడు. బ్యాట్‌ను పలు మార్లు నేలకేసి కొట్టేలా కనిపించాడు. భారీ ఇన్నింగ్స్ ఆడదామనుకున్న కలలు కల్లలుగానే మిగిలిపోవడంతో త్రిపాఠి బాధ వర్ణణాతీతంగా ఉండింది. ఈ సందర్భంగా అతను ప్రదర్శించిన హావభావాలు, అతని మనసులోని బాధను టీమిండియా అభిమానులు అర్ధం చేసుకుని మద్దతుగా నిలిచారు. కాగా, 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టీ20లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఒక్క పరుగుకే ఇషాన్ కిషన్ ఔట్ కాగా.. త్రిపాఠి మెచ్చుకోదగ్గ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. గిల్ (36 బంతుల్లో 51; 7 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్ (11 బంతుల్లో 18; ఫోర్, సిక్స్) మెరుపులు మెరిపిస్తున్నారు. 12 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 118/2గా ఉంది. -
న్యూజిలాండ్‌తో రెండో టీ20.. టీమిండియాలో రెండు మార్పులు..? అర్షదీప్‌తో పాటు..!
లక్నో వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 29) జరుగనున్న రెండో టీ20 మ్యాచ్ టీమిండియాకు అత్యంత కీలకంగా మారింది. తొలి టీ20లో పర్యాటక జట్టు చేతిలో ఎదురైన పరాభవం నేపథ్యంలో సిరీస్‌పై ఆశలు సజీవంగా నిలవాలంటే టీమిండియా నేటి మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకోసం టీమ్ మేనేజ్మెంట్ తుది జట్టులో పలు మార్పులు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాంచీ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో ధారాళంగా పరుగులు సమర్పించుకుని జట్టు ఓటమికి పరోక్ష కారణమైన అర్షదీప్‌పై వేటు దాదాపుగా ఖరారైంది. అతని స్థానంలో బీహార్ పేసర్ ముకేశ్ కుమార్ అరంగేట్రం చేయడం లంఛనమేనని తెలుస్తోంది. ఇకపోతే, నేటి మ్యాచ్‌లో టీమిండియాలో మరో మార్పు కూడా జరిగే అవకాశం ఉందని సమాచారం. రాహుల్ త్రిపాఠి స్థానంలో యువ ఆటగాడు పృథ్వీ షాను ఆడించాలన్నది కోచ్ ద్రవిడ్ ఆలోచనగా తెలుస్తోంది. ఇదే జరిగితే గిల్‌తో పాటు ఎవరు ఓపెనింగ్ చేస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారుతుంది. లెఫ్ అండ్ రైట్ కాంబినేషన్‌ను పరిగణలోకి తీసుకుంటే ఇషాన్ కిషన్.. లేకుంటే పృథ్వీ షా గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు. ఈ రెండు మార్పులు మినహా తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టే యధాతథంగా బరిలోకి దిగే అవకాశం ఉంది. బెంచ్‌పై ఆప్షన్స్ లేకపోవడం, అలాగే తొలి మ్యాచ్‌లో అందరూ తమతమ పాత్రలకు కొద్దో గొప్పో న్యాయం చేయడంతో తుది జట్టులో ఇంతకుమించి మార్పులకు ఆస్కారం ఉండకపోవచ్చు. రెండో టీ20కి భారత తుది జట్టు (అంచనా).. శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావీ, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్ -
'కోహ్లి స్థానాన్ని అప్పగించాం.. ఇలాగేనా ఔటయ్యేది'
టీమిండియా వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్ చేయగానే అభిమానులు పొగడ్తల వర్షం కురిపించారు. అలా వన్డే సిరీస్ ముగిసి ఇలా టి20 సిరీస్ ప్రారంభం కాగానే భారత్ ఓటమిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రికెట్లో ఆటగాళ్లకు, అభిమానులకు ఇది సాధారణమే. ఒక్క మ్యాచ్ ఓడిపోగానే టీమిండియాపై ఎక్కడలేని కోపాన్ని చూపిస్తారు అభిమానులు. ఆరోజు మ్యాచ్‌లో ఎవరి ప్రదర్శనైతే బాగుండదో వారికి సోషల్ మీడియాలో మూడినట్లే. అర్ష్‌దీప్ సింగ్ అత్యంత చెత్త బౌలింగ్‌తో ఇప్పటికే విమర్శలు మూటగట్టుకోగా.. తాజాగా రాహుల్ త్రిపాఠిని కూడా నెటిజన్లు ఆడేసుకున్నారు. మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇషాన్ కిషన్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన త్రిపాఠి ఆరు బంతులెదుర్కొని ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. పైగా జాకబ్ డఫీ బౌలింగ్‌లో నిర్లక్ష్యంగా షాట్ ఆడి కీపర్ కాన్వేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇన్నాళ్లు టి20ల్లో మూడో స్థానంలో విరాట్ కోహ్లి వచ్చేవాడు. అతని బ్యాటింగ్‌తో టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు. తాజాగా కోహ్లి టి20లకు క్రమంగా దూరమవుతున్న వేళ సూర్యకుమార్ ఆ స్థానాన్ని తీసుకున్నాడు. కానీ కివీస్‌తో తొలి టి20లో సూర్య నాలుగో స్థానంలో వస్తేనే కరెక్టని.. కోహ్లి స్థానంలో రాహుల్ త్రిపాఠిని పంపించారు. కానీ కష్టాల్లో ఉన్న టీమిండియాను గట్టెక్కించాల్సిన బాధ్యతను పక్కనబెట్టి నిర్లక్ష్యమైన షాట్ ఆడి డకౌట్ అవ్వడం అభిమానులను బాగా హర్ట్ చేసింది. అయితే ఇటీవలే శ్రీలంకతో సిరీస్‌లో త్రిపాఠి మూడో స్థానంలోనే వచ్చి బ్యాటింగ్‌లో మెరిశాడు. దీంతో త్రిపాఠిని టీమిండియా ఫ్యాన్స్ తమదైన శైలిలో ట్రోల్ చేశారు. ''కోహ్లి స్థానాన్ని అప్పగిస్తే ఇలాగేనా ఔటయ్యేది''.. ''త్రిపాఠిలో ఒక బ్యాటర్ కాకుండా జోకర్ కనబడుతున్నాడు''.. ''అతను తన టాలెంట్‌ను ఐపీఎల్ కోసం దాచుకుంటున్నట్లున్నాడు''.. అంటూ కామెంట్స్ చేశారు. అయితే మరికొందరు మాత్రం త్రిపాఠికి మద్దుతు తెలిపారు. ''లంకతో సిరీస్‌లో రాణించాడు కాబట్టే జట్టులో ఉన్నాడు.. ఇది అతనికి మూడో మ్యాచ్ మాత్రమే. వచ్చే మ్యాచ్‌లో రాణించే అవకాశం ఉంది.. ఒక్క మ్యాచ్‌కే తప్పు బట్టడం సరికాదు'' అంటూ పేర్కొన్నారు. Nothing just Rahul Tripathi is saving his batting talent for IPL and @SunRisers 😬 — Sanam Patel (@patelsanam) January 27, 2023 Rahul tripathi fanbois be like pic.twitter.com/wgsrdD3Az2 — Manu (@Manu_k333) January 27, 2023 Rahul Tripathi the way he played compelled us to think that , Is he a batsman or a joker ? Same way Arshdeep is also a joker Who has got nothing to do with bowling.. — Dharam (@Dharram03) January 27, 2023 చదవండి: రెండేళ్ల తర్వాత పునరాగమనం.. వన్డే కెరీర్లో చెత్త రికార్డు ఒకే ఓవర్లో 27 పరుగులు; అర్ష్‌దీప్ ఖాతాలో అత్యంత చెత్త రికార్డు -
Ind Vs SL: వైరల్.. అవుటా? సిక్సరా? ఏంటిది?.. పాపం అక్షర్ పటేల్!
India vs Sri Lanka, 2nd T20I - Rahul Tripathi: అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాలన్న భారత బ్యాటర్ రాహుల్ త్రిపాఠి కల 31 ఏళ్ల వయసులో నెరవేరింది. స్వదేశంలో శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ఎంపికైన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్... గురువారం నాటి రెండో మ్యాచ్ సందర్భంగా అరంగేట్రం చేశాడు. గత కొన్నాళ్లుగా వివిధ సిరీస్‌లకు ఎంపికైనప్పటికీ పుణె వేదికగా లంకతో జరిగిన మ్యాచ్‌లో తుది జట్టులో అతడు చోటు దక్కించుకోగలిగాడు. సంజూ శాంసన్ మోకాలి గాయంతో దూరం కావడంతో త్రిపాఠి అరంగేట్రానికి లైన్ క్లియర్ అయింది. Congratulations to Rahul Tripathi who is all set to make his T20I debut for #TeamIndia 🇮🇳👏#INDvSL @mastercardindia pic.twitter.com/VX1y83nOsD — BCCI (@BCCI) January 5, 2023 విఫలమైన త్రిపాఠి అయితే, ఈ మ్యాచ్‌లో భారీ లక్ష్యంతో మైదానంలో దిగిన టీమిండియా ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన వేళ వన్‌డౌన్ బ్యాటర్‌గా త్రిపాఠి ఎంట్రీ ఇచ్చాడు. ఎదుర్కొన్న రెండో బంతినే ఫోర్‌గా మలిచిన అతడు.. ఆ తర్వాత ఒక్క పరుగు మాత్రమే తీసి పెవిలియన్ చేరాడు. దిల్షాన్ మధుషంక బౌలింగ్‌లో వికెట్ కీపర్ కుశాల్ మెండిస్‌కు సులువైన క్యాచ్ ఇచ్చి 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. దీంతో రాక రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడంటూ అతడి ఫ్యాన్స్ ఉసూరుమంటున్నారు. అద్భుత క్యాచ్ ఇదిలా ఉంటే.. అరంగేట్ర మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠి అందుకున్న క్యాచ్ మ్యాచ్ హైలైట్స్‌లో ఒకటిగా నిలిచింది. లంక ఇన్నింగ్స్‌లో 12వ ఓవర్ వేసిన టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్.. ఓపెనర్ పాతుమ్ నిసాంకకు షార్ట్‌బాల్ సంధించాడు. ఈ బంతిని ఎదుర్కొన్న నిసాంక డీప్ మిడ్‌వికెట్ మీదుగా షాట్ బాదాడు. దీంతో అక్కడే ఉన్న త్రిపాఠి అద్భుత క్యాచ్ అందుకున్నాడు. అయితే, ఈ క్రమంలో బ్యాలెన్స్ కోల్పోయి అతడు కిందపడటంతో కాస్త గందరగోళం నెలకొంది. నిశిత పరిశీలన తర్వాత ఎట్టకేలకు థర్డ్ అంపైర్ నిర్ణయం భారత్‌కు అనుకూలంగా రావడంతో నిసాంక నిరాశగా వెనుదిరిగాడు. అయితే, క్యాచ్ పట్టిన తర్వాత త్రిపాఠి చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బంతిని చేతిలో పట్టుకుని.. సిక్సర్ సిగ్నల్ చూపిస్తూ అతడు సెలబ్రేట్ చేసుకున్నాడు. అవుటా? సిక్సరా? ఏంటిది? దీంతో కాస్త తికమకపడ్డ బౌలర్ అక్షర్.. త్రిపాఠిని అనుకరిస్తూ.. ‘సిక్స్ అంటున్నాడేంటి’’ అన్నట్లుగా నవ్వుతూ సహచరులకు సైగ చేయడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘హే రాహుల్.. భయపెట్టావు. అసలే అది అవుటో కాదో అని కంగారు పడుతుంటే.. నువ్వేమో సిక్సర్ అన్నావు. ఏదేమైనా తొలి మ్యాచ్‌లో మంచి క్యాచ్ అందుకున్నావు’’ అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో భాంగ్రా స్టెప్‌తో త్రిపాఠి సెలబ్రేట్ చేసుకుంటూ ఇటు బౌలర్.. అటు అంపైర్‌ను కన్ఫ్యూజ్ చేశాడని అంటున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో ఓడిన టీమిండియా 1-1తో సిరీస్ సమం కావడంతో మూడో టీ20లో చావోరేవో తేల్చుకోవాల్సి ఉంది. కాగా రెండో టీ20లో 2 వికెట్లు తీయడం సమా 65 పరుగులతో అక్షర్ పటేల్ అద్భుత ప్రదర్శన చేశాడు. చదవండి: Ind Vs SL: చెత్త బౌలింగ్‌తో విమర్శల పాలు; ‘నెట్స్‌లో నేను సిక్స్‌లు బాదడం చూసే ఉంటారు!’ IND VS SL 2nd T20: అలా చేయడం పెద్ద నేరం, అందువల్లే ఓడాం..హార్ధిక్ Rahul Tripathi Signalling SIX after Taking a Catch 😂#INDvsSL #RahulTripathi #IndianCricketTeam pic.twitter.com/lN6x43rnNe — Tanay (@tanay_chawda1) January 5, 2023 #RahulTripathi 🔥 debut #IndianCricketTeam #INDvsSL #INDvSL #UmranMalik #HardikPandya #Cricket pic.twitter.com/JeYJDiFLh7 — Indresh kumar 🇮🇳 (@TheIndresh_IND) January 5, 2023 -
శ్రీలంకతో రెండో టీ20.. రాహుల్ త్రిపాఠి అరంగేట్రం
పుణే వేదికగా శ్రీలంకతో రెండో టీ20లో టీమిండియా తలపడేందుకు సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అదే విధంగా రాహుల్ త్రిపాఠి ఈ మ్యాచ్‌తో భారత్ తరపున అరంగేట్రం చేయనున్నాడు. మరోవైపు తొలి టీ20కు దూరమైన భారత యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ రెండో టీ20కు జట్టులోకి వచ్చాడు. అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి రావడంతో హర్షల్ పటేల్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక శ్రీలంక మాత్రం తొలి టీ20 జట్టుతోనే బరిలోకి దిగింది. తుది జట్లు: శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షన్ మధుశంక భారత్: ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శుభమాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ చదవండి: Abhimanyu Easwaran: తండ్రి కట్టిన స్టేడియంలోనే తనయుడు సెంచరీ! శభాష్ అభిమన్యు -
శ్రీలంకతో రెండో టీ20.. టీమిండియాలో జరుగబోయే మార్పులు ఏవంటే..?
IND VS SL 2nd T20: పూణే వేదికగా రేపు (జనవరి 5) శ్రీలంకతో జరుగబోయే రెండో టీ20లో టీమిండియా ఒక్క మార్పుతో బరిలోకి దిగే ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. వాంఖడేలో జరిగిన తొలి మ్యాచ్‌లో సంజూ శాంసన్ గాయపడ్డాడని, అతని స్థానంలో రాహుల్ త్రిపాఠి అరంగేట్రం చేస్తాడని ఓ ప్రముఖ వెబ్సైట్ పేర్కొంది. ఓపెనింగ్ బెర్తులకు అవకాశం లేకపోవడంతో రుతురాజ్ గైక్వాడ్ పేరును పరిశీలించరని, అందుకే రాహుల్ త్రిపాఠిని ప్రయోగించే ఛాన్స్ ఉంటుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. తొలి మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ (7) విఫలమైనప్పటికీ.. అతడిని తొలిగించే అవకాశం లేదు. గత కొంతకాలంగా గిల్ ప్రదర్శన నేపథ్యంలో ఒక్క మ్యాచ్‌కే అతడిని పక్కకు పెట్టే సాహసం టీమిండియా యాజమాన్యం చేయకపోవచ్చు. మరోవైపు బౌలింగ్ విభాగంలోనూ రెండు మార్పులు ఆస్కారం ఉంటుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. తొలి టీ20లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న హర్షల్ పటేల్ స్థానంలో జ్వరం నుంచి కోలుకున్న అర్షదీప్ సింగ్‌కు ఛాన్స్ ఇచ్చే ఆస్కారం ఉందని తెలుస్తోంది. అలాగే తొలి మ్యాచ్‌లో 2 ఓవర్లు వేసి 26 పరుగులు సమర్పించుకున్న స్పెషలిస్ట్ స్పిన్నర్ చహల్ స్థానంలో బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం ఇవ్వాలని నెటిజన్లు కోరుతున్నారు. పై పేర్కొన్న ఒక్క మార్పుతో (సంజూ స్థానంలో త్రిపాఠి) పాటు ఈ రెండు మార్పులు మినహా టీమిండియా మరో మార్పు చేసేందుకు సాహసించకపోవచ్చు. ప్రస్తుత భారత జట్టులో రాహుల్ త్రిపాఠి, అర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్, ముకేశ్ కుమార్ మాత్రమే బెంచ్‌పై ఉన్నారు. ఇదిలా ఉంటే, లంకతో జరిగిన తొలి టీ20లో టీమిండియా బ్యాటింగ్‌లో కాస్త తడబడినా బౌలింగ్‌లో పర్వాలేదనిపించి. అరంగేట్ర కుర్రాడు శివమ్ మావి (4/22), కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ (2/27) చెలరేగగా, హర్షల్ పటేల్ (2/41) ఓకే అనిపించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దీపక్ హుడా (41 నాటౌట్, ఆఖరి ఓవర్లో రెండు రనౌట్లు) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. బ్యాట్‌తో పర్వాలేదనిపించిన (31 నాటౌట్) అక్షర్ పటేల్.. కీలక సమయంలో (ఆఖరి ఓవర్) బంతినందుకుని ఓకే అనిపించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఇషాన్ కిషన్ (37), హార్ధిక్ (29), దీపక్ హుడా (41 నాటౌట్), అక్షర్ పటేల్ (31 నాటౌట్) రెండంకెల స్కోర్లు సాధించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఛేదనలో తడబడిన శ్రీలంక 20 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటై, 2 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. -
అతడు ఏం పాపం చేశాడు.. డ్రింక్స్ అందించడానికా సెలక్ట్ చేశారు?
టీమిండియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్న రాహుల్ త్రిపాఠికి మరోసారి నిరాశే ఎదురైంది. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు త్రిపాఠికి ఎంపికైనప్పటికీ.. తొలి టీ20 తుది జట్టులో చోటు దక్కలేదు. కాగా ఐర్లాండ్ సిరీస్ నుంచి భారత జట్టుకు ఎంపిక అవుతున్నప్పటికీ.. ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం చోటు దక్కడం లేదు. సీనియర్ ఆటగాళ్లు దూరం కావడంతో కనీసం లంకతో సిరీస్‌లోనైనా చోటు దక్కుతుంది అని అభిమానులు భావించారు. అయితే మరోసారి త్రిపాఠి బెంచ్‌కే పరిమితం కావడంతో జట్టు మేనేజెమెంట్పై అభిమానులు తీవ్ర విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. జట్టులో చోటు ఇవ్వనప్పుడు ఎందుకు ఎంపిక చేస్తున్నారని ట్విటర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. "డ్రింక్స్ అందించడానికా త్రిపాఠిని సెలక్ట్ చేశారు" అంటూ ఓ అభిమాని ట్విట్ చేశారు. మరి కొంత మంది అయితే కావాలనే జట్టు మేనేజ్మెంట్ ఇలా చేస్తుందిని పోస్టులు పెడుతున్నారు. కాగా ఐపీఎల్‌తో పాటు దేశీవాళీ క్రికెట్లో కూడా ఈ ముంబైకర్‌కు మంచి రికార్డు ఉంది. ఐపీఎల్లో సన్‌రైజర్స్ జట్టులో కీలక ఆటగాడిగా త్రిపాఠి ఉన్నాడు. ప్రతీ సీజన్లోనూ రాహుల్ మెరుగ్గా రాణిస్తున్నాడు. చదవండి: IND vs SL 1st T20: శ్రీలంకతో తొలి టీ20.. గిల్, మావి అరంగేట్రం -
బంగ్లాదేశ్‌తో రెండో వన్డే.. రాహుల్ త్రిపాఠి అరంగేట్రం! తుది జట్టు ఇదే?
బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో ఓటమిపాలైన టీమిండియా.. ఇప్పుడు అదే వేదికపై రెండో వన్డేలో తలపడేందుకు సిద్దమైంది. ఈ మ్యాచ్ ఢాకా వేదికగా బుధవారం మధ్యాహ్నం 12: 30 గంటలకు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో బౌలింగ్ పరంగా అద్భుతంగా రాణించినప్పటికీ.. బ్యాటింగ్ పరంగా మాత్రం దారుణంగా విఫలమైంది. ఇక కీలకమైన రెండో వన్డేలో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని రోహిత్ సేన భావిస్తోంది. రెండో వన్డేలో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. తొలి వన్డేల్లో మోకాలి నొప్పితో బాధపడిన శార్ధూల్ ఠాకూర్‌కు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. అతడి స్థానంలో యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. రాహుల్ త్రిపాఠి అరంగేట్రం! అదే విధంగా ఆల్‌రౌండర్ షబాజ్ ఆహ్మద్ స్థానంలో రాహుల్ త్రిపాఠి జట్టులోకి తీసుకోవాలని మేనేజేమెంట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. కాగా గత కొన్ని సిరీస్‌లను త్రిపాఠి జట్టుకు ఎంపిక అవుతున్నప్పటికీ.. అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు. ఈ మ్యాచ్‌తో త్రిపాఠి వన్డేల్లో డెబ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా పార్ట్ టైమ్ బౌలర్‌గా కూడా రాణించే సత్తా త్రిపాఠికి ఉంది. ఇక తొలి మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్న యువ పేసర్ కుల్దీప్ సేన్‌ను రెండో వన్డేలో కూడా కొనసాగించే సూచనలు కన్పిస్తున్నాయి. మరోవైపు వెన్ను నొప్పితో బాధపడుతున్న అక్షర్ పటేల్ రెండో వన్డే జట్టు సెలక్షన్‌కు కూడా దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. భారత తుది జట్టు(అంచనా) రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రాహుల్ త్రిపాఠి వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ సేన్ -
ఒకే రోజు 15 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు.. పరుగుల ప్రవాహం
VHT 2022: విజయ్ హజారే ట్రోఫీ-2022 సీజన్లో భాగంగా నవంబర్ 21 జరిగిన మ్యాచ్‌ల్లో పరుగుల వరద పారింది. ఈ ఒక్క రోజే ఏకంగా 15 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. తమిళనాడు ఆటగాడు నారాయణ్ జగదీశన్ (141 బంతుల్లో 277; 25 ఫోర్లు, 15 సిక్సర్లు) రికార్డు డబుల్ సెంచరీ హవాలో పై పేర్కొన్న గణాంకాలను ఎవ్వరూ పట్టించుకోలేదు. కేరళ ఆటగాడు రోహన్ కున్నుమ్మల్ (107 నాటౌట్), మధ్యప్రదేశ్ ఓపెనర్ యశ్ దూబే (195 నాటౌట్), హిమాచల్ ప్రదేశ్ ఏకాంత్ సేన్ (116), చండీఘడ్ అర్స్‌లన్ ఖాన్ (107), ఒడిశా ఆటగాడు కార్తీక్ బిశ్వాల్ (107 నాటౌట్), గుజరాత్ ఆటగాడు కథన్ పటేల్ (109), హైదరాబాద్ ఆటగాడు రోహిత్ రాయుడు (109), తమిళనాడు ఆటగాళ్లు నారాయణ్ జగదీశన్ (277), సాయ్ సుదర్శన్ (154), ఆంధ్రప్రదేశ్ రికీ భుయ్ (112 నాటౌట్), జార్ఖండ్ ఆటగాడు విక్రమ్ సింగ్ (116 నాటౌట్), బెంగాల్ ఆటగాళ్లు సుదీప్ ఘరామీ (162), అభిమన్యు ఈశ్వరన్ (122), రాజస్తాన్ ఆటగాడు ఆదిత్య గర్హ్వాల్ (149 నాటౌట్), మహారాష్ట్ర ఆటగాడు రాహుల్ త్రిపాఠి (107) సెంచరీలు బాదగా.. మరో 36 మంది హాఫ్ సెంచరీలు సాధించారు. -
మ్యాచ్‌ను గెలిపించలేకపోయిన జైశ్వాల్ వీరొచిత సెంచరీ
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా గురువారం ముంబై, మహారాష్ట్ర మధ్య జరిగిన మ్యాచ్‌లో భారీస్కోర్లు నమోదయ్యాయి. ఇక మ్యాచ్‌లో మహారాష్ట్ర 21 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ముంబై ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (135 బంతుల్లో 142, 14 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరోచిత ఇన్నింగ్స్ ఆడినప్పటికి లాభం లేకుండా పోయింది. జైశ్వాల్ మినహా మిగతావారు విఫలం కావడంతో 49 ఓవర్లలో 321 పరుగులకు ఆలౌటైంది. ఆర్మాన్ జాఫర్ 36, అజింక్యా రహానే 31 పరుగులు చేశారు. మహారాష్ట్ర బౌలర్లలో సత్యజిత్ బచావ్ ఆరు వికెట్లతో చెలరేగగా.. షామ్షుజ్మా రెండు వికెట్లు తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ రాహుల్ త్రిపాఠి(137 బంతుల్లో 156 నాటౌట్) అజేయ శతకంతో మెరవగా.. పవన్ షా 84 పరుగులు చేశాడు. చివర్లో అజిమ్ కాజీ 32 బంతుల్లో 50 పరుగులు నాటౌట్ రాణించాడు. -
Ind A vs NZ A: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.. ఏకంగా..
India A vs New Zealand A, 1st unofficial ODI: న్యూజిలాండ్- ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో సంజూ శాంసన్ సేన పర్యాటక కివీస్‌పై గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్‌ల అనధికారిక వన్డే సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. చెన్నైలోని చెపాక్(చిదంబరం స్టేడియం) వేదికగా భారత్- ఏ జట్టు న్యూజిలాండ్‌తో తలపడింది. టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ సేన్ కివీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. శార్దూల్ 4, కుల్దీప్ సేన్ 3 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. కుల్దీప్ యాదవ్‌కు ఒక వికెట్ దక్కింది. స్వల్ప లక్ష్యం.. అలవోకగా.. భారత బౌలర్ల విజృంభణతో న్యూజిలాండ్ 40.2 ఓవర్లలో 167 పరుగులు చేసి ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఆదిలోనే ఓపెనర్ పృథ్వీ షా(17 పరుగులు) వికెట్ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 41 పరుగులతో రాణించాడు. వన్‌డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి సైతం 31 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్ సంజూ శాంసన్ 29, రజత్ పాటిదార్ 45 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో 31.5 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 170 పరుగులు చేసిన.. భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చదవండి: Ind Vs Aus 3rd T20: మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయండి! అప్పుడే వాళ్లకు తెలిసివస్తుంది! -
Ind Vs Zim: అలాంటప్పుడు ఎందుకు ఎంపిక చేశారు? ఇది నిజంగా అన్యాయం!
India tour of Zimbabwe, 2022- 3rd ODI: టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, మహారాష్ట్ర బ్యాటర్ రాహుల్ త్రిపాఠికి మరోసారి నిరాశే ఎదురైంది. జింబాబ్వేతో సిరీస్‌తోనైనా అంతర్జాతీయ వన్డేల్లో అడుగుపెట్టాలనుకున్న రుతు.. టీమిండియా తరఫున అరంగేట్రం చేయాలనుకున్న రాహుల్ ఆశలు ఈసారి కూడా నెరవేరలేదు. కాగా జింబాబ్వే పర్యటనలో భాగంగా కేఎల్ రాహుల్ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. రెండు మ్యాచ్‌లలో ఓపెనర్లుగా ఆ ముగ్గురు మొదటి వన్డేలో 10 వికెట్లు, రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలి మ్యాచ్‌లో ఓపెనర్లుగా వెటరన్ క్రికెటర్ శిఖర్ ధావన్, యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్‌కు అవకాశం దక్కింది. వీరిద్దరు కలిసి వరుసగా 81,82 పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌కు రికార్డు విజయం అందించారు. ఇక రెండో వన్డేలో ధావన్‌తో కలిసి ఈ సిరీస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. దీంతో ఓపెనింగ్ స్థానంలో ఆడే రుతురాజ్‌కు అవకాశం దక్కలేదు. అదే విధంగా మిడిలార్డర్లో ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సంజూ శాంసన్ బరిలోకి దిగడంతో త్రిపాఠికి మొండిచేయి ఎదురైంది. రాహుల్ త్రిపాఠి- రుతురాజ్ గైక్వాడ్(PC: BCCI) కనీసం ఇప్పుడైనా ఛాన్స్ ఇవ్వాలి కదా! అన్యాయం.. అయితే, ఇప్పటికే సిరీస్ భారత్ కైవసమైన నేపథ్యంలో వీరిద్దరికి అరంగేట్రం చేసే అవకాశం ఉంటుందని అభిమానులు భావించారు. కానీ.. నామమాత్రపు మూడో వన్డేలో కూడా రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠికి తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘‘కనీసం ఈ మ్యాచ్‌లోనైనా వీరికి ఛాన్స్ ఇవ్వాల్సింది.. ఇది నిజంగా అన్యాయం’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అవకాశం ఇవ్వకూడదని ఫిక్స్ అయినపుడు జట్టుకు ఎంపిక చేయడం ఎందుంటూ బీసీసీఐపై ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా విఫలమైనా ఇషాన్ కిషన్‌కు వరుస అవకాశాలు ఇస్తున్నారని.. కానీ త్రిపాఠి విషయంలో ఇలా చేయడం సరికాదని హితవు పలుకుతున్నారు. కాగా టీమిండియా వెటరన్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప సైతం మూడో వన్డేకు ముందు మాట్లాడుతూ ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఆఖరి నిమిషంలో బీసీసీఐ నుంచి పిలుపు అందుకున్న షాబాజ్ అహ్మద్‌ను కూడా మేనేజ్మెంట్ పరిగణనలోకి తీసుకోలేదు. ఇక హరారే వేదికగా జరుగుతున్న ఆఖరి వన్డేలో భారత జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. పేసర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ స్థానాలను దీపక్ చహర్, ఆవేశ్ ఖాన్‌లతో భర్తీ చేశారు. జింబాబ్వేతో మూడో వన్డే- భారత తుది జట్టు: శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సంజూ శాంసన్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్, కుల్దీప్ యాదవ్, ఆవేశ్ ఖాన్. Again another series where Rahul Tripathi made the squad but didn’t get to play, why you select him if you don’t even play him against Zimbabwe when INDIA have already won the series? — Prantik (@Pran__07) August 22, 2022 He deserved a chance 💔#INDvsZIM #Rahultripathi #IndianCricketTeam pic.twitter.com/kbbSbn8L8G — i.Robiee (@Cricgallery1) August 22, 2022 #rahultripathi unlucky and should have they given chances to others not played #bcci #indvszim — Sdev (@Rsdev6) August 22, 2022 చదవండి: WI Vs NZ 3rd ODI: ఓ సెంచరీ, కెప్టెన్ స్కోరు 91, మరో అర్ధ శతకం.. అయినా పాపం విండీస్! మా ఓటమికి కారణం అదే! Ned Vs Pak 3rd ODI: పాపం.. జస్ట్ మిస్! ఆ తొమ్మిది పరుగులు చేసి ఉంటే! కనీసం.. -
Ind Vs Zim: ఆఖరి వన్డేలోనైనా వాళ్లిద్దరికీ అవకాశం ఇవ్వకపోతే అన్యాయం చేసినట్లే!
India tour of Zimbabwe, 2022- 3rd ODI: అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం కోసం రాహుల్ త్రిపాఠి... వన్డేల్లో టీమిండియా తరఫున ఎంట్రీ ఇచ్చేందుకు యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 31 ఏళ్ల రాహుల్ త్రిపాఠి తొలిసారి ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌తో జాతీయ జట్టుకు ఎంపికైనా తుది జట్టులో మాత్రం స్థానం దక్కించుకోలేకపోయాడు. ప్చ్.. రుతురాజ్ కూడా! ఇక గతేడాది శ్రీలంక పర్యటనలో భాగంగా టీమిండియా తరఫున టీ20 ఫార్మాట్‌తో ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టిన రుతు.. వన్డేల్లో ఆడే అవకాశం కోసం వేచి చూస్తున్నాడు. గతేడాది టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా వన్డే జట్టుకు ఎంపికైనప్పటికీ.. అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు. కాగా టీమిండియా జింబాబ్వే పర్యటన నేపథ్యంలో వీరిద్దరికి బీసీసీఐ నుంచి పిలుపు రావడంతో ఇరు ఆటగాళ్ల అభిమానులు సంబరపడ్డారు. రాహుల్ త్రిపాఠి- రుతురాజ్ గైక్వాడ్(PC: BCCI) కానీ, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌లలో వీరిద్దరికీ నిరాశే ఎదురైంది. ఓపెనర్ల విభాగంలో కెప్టెన్ కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లు అందుబాటులో ఉండటంతో రుతురాజ్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. అవకాశం దక్కుతుందా! అదే విధంగా సంజూ శాంసన్, దీపక్ హుడా వంటి బ్యాటర్లు ఫామ్‌లో ఉన్న నేపథ్యంలో రాహుల్ త్రిపాఠిని పరిగణనలోకి తీసుకునే అవసరమే రాలేదు. అయితే, ఇప్పటికే మొదటి, రెండు వన్డేల్లో వరుసగా 10 వికెట్లు, ఐదు వికెట్ల తేడాతో జింబాబ్వే మీద రాహుల్ సేన గెలుపొందిన విషయం తెలిసిందే. తద్వారా సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న నేపథ్యంలో నామమాత్రపు మూడో వన్డేలోనైనా వీరికి అవకాశం దక్కుతుందేమోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. రాబిన్ ఊతప్ప(PC: BCCI) ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ వికెట్‌కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మూడో వన్డేలో రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠికి తుది జట్టులో చోటు ఇవ్వకపోవడం అన్యాయమే అవుతుందని వ్యాఖ్యానించాడు. టీమిండియా- జింబాబ్వే మధ్య ఆఖరి వన్డేకు ముందు ఈ మేరకు సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ షోలో రాబిన్ ఊతప్ప తన అభిప్రాయాలు పంచుకున్నాడు. అన్యాయం చేసినట్లే! ‘‘మూడో వన్డేలో భాగంగా దీపక్ చహర్ తిరిగి జట్టులోకి వస్తాడు. ప్రసిద్ కృష్ణకు విశ్రాంతినిస్తే.. ఆవేశ్ ఖాన్ జట్టులోకి రావొచ్చు. సిరాజ్‌కు కూడా బ్రేక్ ఇచ్చి శార్దూల్‌ను ఆడించొచ్చు. ఫాస్ట్‌బౌలర్లను రొటేషన్ విధానంలో ఆడించేందుకు వాళ్లు సిద్ధమయ్యారు కాబట్టి మనం ఈ మార్పులు చూడొచ్చు. ఇక బ్యాటింగ్ విభాగానికొస్తే... నాకు తెలిసి మేనేజ్మెంట్ మరీ ఎక్కువ మార్పులు చేయకపోవచ్చు. బౌలింగ్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్‌కు అరంగేట్రం చేసే అవకాశం రావొచ్చు. ఇక రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి సైతం అరంగేట్రం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ వాళ్లిద్దరికీ అవకాశం రాలేదంటే అన్యాం జరిగినట్లే!’’ అని ఊతప్ప పేర్కొన్నాడు. ఈ పర్యటన తర్వాత.. ఇదిలా ఉంటే.. వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో షాబాజ్ అహ్మద్‌తో అతడి స్థానాన్ని భర్తీ చేసింది బీసీసీఐ. కాగా హరారే వేదికగా సోమవారం(ఆగష్టు 22) టీమిండియా- జింబాబ్వే మధ్య ఆఖరిదైన మూడో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్‌తో భారత జట్టు జింబాబ్వే పర్యటన ముగుస్తుంది. ఆ తర్వాత ఆసియా కప్-2022 టోర్నీలో ఆగష్టు 28న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది. చదవండి: Sanju Samson: అతడు ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినా అంతే! నాకైతే గొప్పగా అనిపిస్తోంది! -
Ind VS Zim: ఓపెనర్లుగా వాళ్లిద్దరే! ఇషాన్‌కు నో ఛాన్స్! అతడి అరంగేట్రం!
Ind Vs Zim 1st ODI- Aakash Chopra's India Probable XI: కేఎల్ రాహుల్ సారథ్యంలోని టీమిండియా జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో గురువారం(ఆగష్టు 18) హరారే వేదికగా తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా మొదటి వన్డేకు తన జట్టును ప్రకటించాడు. ఇషాన్‌కు నో ఛాన్స్! కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ జట్టులో ఉన్న నేపథ్యంలో శుబ్‌మన్ గిల్‌కు ఓపెనర్‌గా అవకాశం రాదని అంచనా వేసిన ఆకాశ్.. ఇషాన్ కిషన్‌కు తుది జట్టులో అసలు చోటు దక్కదని అభిప్రాయపడ్డాడు. ఇక ఈ మ్యాచ్‌తో 31 ఏళ్ల రాహుల్ త్రిపాఠి అరంగేట్రం చేసే ఛాన్స్ ఉందని పేర్కొన్నాడు. మిడిలార్డర్లో సంజూ శాంసన్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి ఉంటే ఉపయోగకరంగా ఉంటుందని ఆకాశ్ అంచనా వేశాడు. అదే విధంగా.. జింబాబ్వేతో మొదటి మ్యాచ్‌లో ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు సీమర్లతో బరిలోకి దిగితే బాగుంటుందని చెప్పుకొచ్చాడు. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్.. పేస్ బౌలర్లు దీపక్ చహర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణకు తన జట్టులో చోటిచ్చాడు ఈ కామెంటేటర్. ఓపెనర్లుగా వాళ్లిద్దరే! ఈ మేరకు ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘వెస్టిండీస్ పర్యటనలో వన్డే సిరీస్‌లో శుబ్‌మన్ గిల్ అద్భుతంగా రాణించాడు. అయితే, ఇప్పుడు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా జట్టులోకి వచ్చాడు. అతడితో పాటు శిఖర్ ధావన్ కూడా ఉన్నాడు. లెఫ్ట్- రైట్ కాంబినేషన్‌తో వెళ్లాలనుకుంటే కచ్చితంగా వీళ్లిద్దరే ఓపెనర్లుగా వస్తారు. అయితే, రాహుల్ విలక్షణమైన బ్యాటర్.. ఏ స్థానంలోనైనా అతడు సత్తా చాటగలడు. కానీ.. ఐపీఎల్-2022 తర్వాత అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఏదేమైనా ఎప్పటిలాగే అతడు ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశాలే ఎక్కువ. ఇక మూడో స్థానంలో శుబ్‌మన్ గిల్ ఉండనే ఉన్నాడు. త్రిపాఠి అరంగేట్రం! నేనైతే సంజూ శాంసన్‌ను నాలుగో స్థానానికి ఎంపిక చేస్తాను. దీపక్ హుడా ఐదు, ఆ తర్వాతి స్థానంలో రాహుల్ త్రిపాఠి. నిజానికి త్రిపాఠి కూడా ఏ స్థానంలోకి బరిలోకి దిగినా తనను తాను నిరూపించుకోగలడు. రుతురాజ్, ఇషాన్ లోయర్ ఆర్డర్లో ఆడరు కాబట్టి అతడు ఈసారి అరంగేట్రం చేసే అవకాశం ఉంది’’ అని బ్యాటింగ్ ఆర్డర్ గురించి అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా రాహుల్ త్రిపాఠి ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైనా తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే. జింబాబ్వేతో మొదటి వన్డేకు ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత జట్టు: కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శుబ్‌మన్ గిల్, సంజూ శాంసన్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, అక్షర్ పటేల్, దీపక్ చహర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ. చదవండి: Ind Vs Zim ODI 2022: జింబాబ్వే పర్యటనలో టీమిండియా.. పూర్తి షెడ్యూల్, జట్ల వివరాలు.. తాజా అప్డేట్లు! Ned Vs Pak 1st ODI: పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన ‘పసికూన’! వామ్మో.. బాబర్ ఏమన్నాడంటే! -
IND Vs IRE: రాహుల్ త్రిపాఠికి ఛాన్స్.. అర్ష్‌దీప్ ఎంట్రీ!
India Vs Ireland T20 Series 2022: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ గెలిచిన టీమిండియా రెండో విజయంపై దృష్టి సారించింది. తమ పర్యటనలో భాగంగా పాండ్యా సేన ఆఖరి టీ20 గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది. మొదటి మ్యాచ్ ఫలితాన్ని పునరావృతం చేసి సంపూర్ణ విజయంతో స్వదేశానికి తిరిగి రావాలని పట్టుదలగా ఉంది. అయితే, ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని జట్టులో ప్రయోగాలు చేసేందుకు మేనేజ్మెంట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా డబ్లిన్ వేదికగా మంగళవారం(జూన్ 28) జరుగనున్న రెండో టీ20లో రాహుల్ త్రిపాఠి అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు రాలేదన్న సంగతి తెలిసిందే. అతడి స్థానంలో మిడిలార్డర్ బ్యాటర్ దీపక్ హుడా ఇషన్ కిషన్‌తో కలిసి ఓపెనింగ్ చేశాడు. అయితే, ఓపెనర్‌గా రాణించగల సత్తా ఉన్న వెంకటేశ్ అయ్యర్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవడంతో హుడా ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. కాగా రెండో మ్యాచ్‌లో కూడా అయ్యర్‌ను పక్కన పెట్టే అవకాశాలు ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రైట్- లెఫ్ట్ ఓపెనింగ్ కాంబినేషన్‌తో వెళ్లాలని పాండ్యా భావిస్తే.. రాహుల్ త్రిపాఠి తుది జట్టులో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది. త్రిపాఠి లేదంటే అనువజ్ఞుడైన సంజూ శాంసన్ ఇషాన్‌కు జోడీగా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇటీవలి కాలంలో ముఖ్యంగా ఐపీఎల్-2022లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన శాంసన్ అదరగొట్టిన విషయం తెలిసిందే. దీంతో అతడికి అవకాశం వస్తే మిడిలార్డర్లో ఆడించే అవకాశం ఉంది. ఇక బౌలింగ్ విభాగంలో ఆవేశ్ ఖాన్ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం లేకపోలేదు. కాగా ఐపీఎల్-2022లో సన్‌రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన రాహుల్ త్రిపాఠి 14 మ్యాచ్‌లలో మొత్తంగా 413 పరుగులతో సత్తా చాటాడు. ఇక పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ 14 ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టాడు. ఐర్లాండ్‌తో రెండో టీ20 మ్యాచ్‌కు భారత తుది జట్టు(అంచనా) ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తిక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యజువేంద్ర చహల్. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ ప్రసారం? రాత్రి గం.9 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్–3, 4లలో ప్రత్యక్ష ప్రసారం మ్యాచ్ వేదిక: ది విలేజ్, డబ్లిన్. చదవండి: Rohit Sharma Daughter: నాన్న రూమ్‌లో రెస్ట్ తీసుకుంటున్నాడు.. ఇంకా నెల రోజులు IND Vs IRE 1st T20: ‘గంటకు 208 కి.మీ. వేగం’.. వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన భువీ?! అక్తర్ ఎవరు? -
Ind Vs Ire: అతడు క్రీజులో ఉంటే స్కోరు బోర్డు పరుగెడుతుంది: రవిశాస్త్రి
India Vs Ireland T20I Series: మహారాష్ట్ర బ్యాటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు రాహుల్ త్రిపాఠిపై టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. అతడు క్రీజులో ఉంటే స్కోరు బోర్డు పరిగెడుతూనే ఉంటుందంటూ కొనియాడాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విరుచుకుపడతాంటూ ఆకాశానికెత్తాడు. కాలం కలిసి రాలేదు! కానీ ఇప్పుడు.. కాగా ఐపీఎల్-2022లో సన్‌రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన రాహుల్ త్రిపాఠి 14 మ్యాచ్‌లలో కలిపి 413 పరుగులు చేశాడు. సగటు 37.5. స్ట్రైక్ రేటు 158.23. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్‌కు ఎంపికవుతాడనే విశ్లేషణలు వినిపించినా సెలక్టర్లు అతడికి మొండిచేయి చూపారు. అయితే, టీమిండియా ఐర్లాండ్ పర్యటన రూపంలో రాహుల్ త్రిపాఠికి అదృష్టం కలిసి వచ్చింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఐర్లాండ్‌తో ఆడనున్న రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అతడు ఎంపికయ్యాడు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత్ తరఫున అరంగేట్రం చేయనున్నాడు. అతడు క్రీజులో ఉన్నాడంటే చాలు! ఈ నేపథ్యంలో రవిశాస్త్రి ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘అతడు క్రీజులో ఉంటే స్కోరు బోర్డులో అంకెలు మారుతూనే ఉంటాయి. బంతిని సరిగ్గా అంచనా వేసి షాట్ సెలక్షన్ విషయంలో పక్కాగా ఉంటాడు. ప్రత్యర్థి జట్టుకు గానీ, బౌలర్లకు గానీ ఏమాత్రం ఛాన్స్ ఇవ్వడు. ముఖ్యంగా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ఇన్నింగ్స్ ఆడే విధానం చూడముచ్చటగా ఉంటుంది’’ అని రాహుల్ త్రిపాఠిపై ప్రశంసలు కురిపించాడు. ఇదిలా ఉంటే.. భారత జట్టుకు ఎంపికైన సందర్భంగా 31 ఏళ్ల రాహుల్ త్రిపాఠి.. ‘‘నాకు దక్కిన గొప్ప అవకాశం. ఇన్నాళ్లకు కల నిజమైంది. నా హార్డ్‌వర్క్‌ను గుర్తించి సెలక్టర్లు ఈ ఛాన్స్ ఇచ్చారు. తుది జట్టులో ఆడే అవకాశం వస్తే కచ్చితంగా నా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు శాయశక్తులా కృషి చేస్తాను’’ అని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. చదవండి: India Vs Ireland T20I Series Details: ఐర్లాండ్‌తో భారత్ టీ 20 సిరీస్.. ఇరు జట్లు, షెడ్యూల్.. పూర్తి వివరాలు! That feeling when your first series as a #TeamIndia player begins in 3️⃣ days 🧡@tripathirahul52 | #OrangeArmy pic.twitter.com/BBXMKH58Oc — SunRisers Hyderabad (@SunRisers) June 23, 2022 -
'ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. ఆ ఇద్దరు ఆటగాళ్లకి భారత తుది జట్టులో నో ఛాన్స్'
ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బుధవారం(జూన్15) బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున రాణించిన రాహుల్ త్రిపాఠి తొలి సారి భారత జట్టుకు ఎంపిక కగా.. సంజు శాంసన్ తిరిగి మళ్లీ జట్టులోకి వచ్చాడు. అయితే ఐర్లాండ్‌తో టీ20లకు భారత తుది జట్టులో రాహుల్ త్రిపాఠి,శాంసన్‌కు చోటు దక్కదని భారత మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. తుది జట్టలో చోటు కోసం వీరిద్దరి కంటే ముందు దీపక్ హుడా అర్హుడని చోప్రా తెలిపాడు. "పంత్ ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. కాబట్టి నాలుగో స్థానంలో ఎవరు బ్యాటింగ్‌కు వస్తారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. పంత్ స్థానంలో దీపక్ హుడా అర్హుడని నేను భావిస్తున్నాను. ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నారు. మూడో స్థానానికి సుర్యకుమార్ యాదవ్ సిద్దంగా ఉన్నాడు. ఇక ఐదో స్థానంలో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా బ్యాటింగ్‌కు రానున్నాడు. కాబట్టి రాహుల్ త్రిపాఠి,శాంసన్‌కు ప్లేయింగ్ ఎలవెన్‌లో చోటు దక్కే అవకాశం లేదు. కేవలం రెండు టీ20లు మాత్రమే భారత్ ఆడనుంది. రెండు టీ20లకు టీమిండియా తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఒక వేళ వీరిద్దరిలో ఎవరికైనా తుది జట్టులో చోటు దక్కి, హుడాకి దక్కకపోతే అతడు తీవ్రంగా నిరాశ చెందుతాడు. ఎందుకంటే దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ఎంపికైన అతడు గత మూడు మ్యాచ్‌ల్లో బెంచ్‌కే పరిమితమయ్యాడు" అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. చదవండి: Ranji Trophy 2022 : హ్యాట్రిక్ సెంచరీలతో చెలరేగిన యశస్వి జైస్వాల్ -
"అతడికి అంతర్జాతీయ క్రికెట్ ఆడే సత్తా ఉంది.. త్వరలోనే టీమిండియాలోకి వస్తాడు"
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు రాహుల్ త్రిపాఠిపై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ప్రశంసలు వర్షం కురిపించాడు. ఐపీఎల్-2022లో రాహుల్ త్రిపాఠి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్లో మూడు అర్ధసెంచరీలు సాధించాడు. ఇక మంగళవారం (మే 17) ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో త్రిపాఠి సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 44 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఈ క్రమంలో త్వరలోనే భారత జట్టు తరపున త్రిపాఠి అరంగేట్రం చేస్తాడని హేడెన్ అభిప్రాయపడ్డాడు. కాగా త్వరలో దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్‌కు త్రిపాఠి ఎంపికయ్యే అవకాశం ఉంది. "రాహుల్ త్రిపాఠి అద్భుతంగా ఆడుతున్నాడు. అతడు ధాటిగా బ్యాటింగ్ చేసే విధానం నన్ను ఎంత గానే ఆకట్టుకుంది. అతడు విధ్వంసకర ఆటగాడు. బంతిని మైదానంలో అన్ని వైపులా కొట్టగలడు. ముఖ్యంగా షార్ట్ పిచ్ బౌలింగ్‌కు త్రిపాఠి అద్భుతంగా ఆడగలడు. అతడు త్వరలో భారత జట్టులోకి వస్తాడని నేను అశిస్తున్నాను. ఆస్ట్రేలియా వంటి బౌన్సీ పిచ్‌లపై ఆడే సత్తా త్రిపాఠికి ఉంది" అని హేడెన్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: అతడి వల్లే సన్‌రైజర్స్‌కు విజయాలు.. బుమ్రా బౌలింగ్‌నూ చితక్కొట్టేస్తాడు! టీ20 సిరీస్‌కు ఎంపిక చేయండి! -
అతడి వల్లే సన్‌రైజర్స్‌కు విజయాలు.. బుమ్రా బౌలింగ్‌నూ చితక్కొట్టేస్తాడు!
IPL 2022 SRH Vs MI: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు రాహుల్ త్రిపాఠిపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. అతడి వల్లే రైజర్స్ జట్టుకు విజయాలు సాధ్యమవుతాయని కొనియాడాడు. ప్రత్యర్థి బౌలర్ బుమ్రా అయినా, ఇంకెవరైనా అతడి ఆట తీరులో మార్పు ఉండదని, అద్భుతమైన షాట్లతో ఆకట్టుకోవడం మాత్రమే తనకు తెలుసునంటూ ప్రశంసించాడు. తనకు అత్యంత ఇష్టమైన అన్క్యాప్డ్ ప్లేయర్ రాహుల్ త్రిపాఠి అంటూ ఈ 31 ఏళ్ల ఆటగాడిని ఆకాశానికెత్తాడు. కాగా ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఐపీఎల్-2022లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మంగళవారం(మే 17) నాటి మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది విలియమ్సన్ బృందం. రాహుల్ త్రిపాఠి(76)కు తోడు ప్రియమ్ గార్గ్(42) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 193 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించలేక ముంబై మూడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సన్‌రైజర్స్ గెలుపులో కీలక పాత్ర పోషించిన రాహుల్ త్రిపాఠి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఫలితాన్ని విశ్లేషించిన ఆకాశ్ చోప్రా రాహుల్ త్రిపాఠి ఆట తీరుకు తాను ఫిదా అయినట్లు పేర్కొన్నాడు. ‘‘రాహుల్ త్రిపాఠి.. 44 బంతుల్లో మూడు సిక్సర్లు, తొమ్మిది ఫోర్ల సాయంతో 76 పరుగులు చేశాడు. స్ట్రైక్‌రేటు 172. సన్‌రైజర్స్ ఎప్పుడు గెలిచినా అది త్రిపాఠి వల్లే. తను తొందరగా అవుట్ అయితే, జట్టు కూడా అంతే తొందరగా అవుట్ అవుతుంది. భారత్‌లోని అన్క్యాప్డ్ ప్లేయర్లలో నా ఫేవరెట్ రాహుల్ త్రిపాఠి. తను ఐపీఎల్ ఆడటం మొదలుపెట్టినప్పటి నుంచి చూస్తున్నా.. స్పిన్నర్, పాస్ట్ బౌలర్.. ఎదురుగా ఎవరున్నా తను లెక్కచేయడు. బుమ్రానో.. మరొకరినో తీసుకురండి.. త్రిపాఠి ఆట తీరులో మార్పు ఉండదు’’ అని ఆకాశ్ చోప్రా త్రిపాఠిపై ప్రశంసలు కురిపించాడు. ఇక దక్షిణాఫ్రికాతో టీమిండియా టీ20 సిరీస్ నేపథ్యంలో.. ‘‘సూర్యకుమార్ యాదవ్ అందుబాటులో లేడు కాబట్టి.. రాహుల్ త్రిపాఠిని దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎందుకు ఎంపిక చేయకూడుదు? ఒకవేళ అతడికి అవకాశం దొరికితే.. తనను తాను నిరూపించుకోగలడు. టీమిండియాలో టీ20 రెగ్యులర్ ప్లేయర్ కాగలడు’’ అంటూ సెలక్టర్లు రాహుల్ త్రిపాఠి పేరును పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుందని ఆకాశ్ చోప్రా సూచించాడు. That's that from Match 65#MumbaiIndians fought hard, but fell short in the end as @SunRisers win by 3 runs. Scorecard - https://t.co/U2W5UAx6di #MIvSRH #TATAIPL pic.twitter.com/43SRO9X85o — IndianPremierLeague (@IPL) May 17, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'కేకేఆర్‌పై ఇటువంటి ఇన్నింగ్స్ ఆడడం సంతోషంగా ఉంది'
ఐపీఎల్-2022లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు రాహుల్ త్రిపాఠి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 176 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ ఆదిలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో కేకేఆర్ బౌలర్లపై రాహుల్ త్రిపాఠి ఎదురుదాడికి దిగాడు. త్రిపాఠి 37 బంతుల్లో 71 పరుగులు చేసి ఎస్ఆర్హెచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అదే విధంగా అద్భుతమైన ప్రదర్శన చేసిన త్రిపాఠి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ క్రమంలో పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో త్రిపాఠి మాట్లాడాడు. "కేకేఆర్‌పై ఇటువంటి ఇన్నింగ్స్ ఆడడం సంతోషంగా ఉంది. నాకు చాలా సార్లు కఠినమైన పరిస్థితులు ఎదరయ్యాయి. కానీ నేను కష్టపడి పని చేయడం వలన ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు వెళ్లే ముందు, నేను కొంచెం ఒత్తిడిలో ఉన్నాను. కానీ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడినందుకు ఆనందంగా ఉంది" అని త్రిపాఠి పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఎస్ఆర్హెచ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చదవండి: IPL 2022: 'అతడు అద్భుతమైన ఆటగాడు.. భారత జట్టులో చూడాలనుకుంటున్నాం' -
'అతడు అద్భుతమైన ఆటగాడు.. భారత జట్టులో చూడాలనుకుంటున్నాం'
ఐపీఎల్-2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 37 బంతుల్లో 71 పరుగులు సాధించి ఎస్ఆర్హెచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో నెటిజన్లు త్రిపాఠిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారత్ తరపున ఆడేందుకు త్రిపాఠి అర్హుడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. Rahul Tripathi is 💎 Cricketer. Humble Request Selectors please look at him how good he is. We want to see him For Indian team as Soon as Possible. @tripathirahul52 #KKRvsSRH pic.twitter.com/Fpbjov6GgC — Ayush Ranjan (@AyushRa15743279) April 15, 2022 ఐపీఎల్-2022 సీజన్ ముగిశాక అతడికి భారత్ జట్టులో చోటు కల్పించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు."త్రిపాఠి అద్భుతమైన క్రికెటర్. సెలెక్టర్లు అతడి ఆట తీరును పరిగణనలోకి తీసుకోవాలి. వీలైనంత త్వరగా అతడిని భారత జట్టులో చూడాలనుకుంటున్నాం" అని ఓ యాజర్ కామెంట్ చేశాడు. కాగా ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన త్రిపాఠి.. 171 పరుగులు సాధించాడు. ఇక ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో హ్యాట్రిక్ విజయం సాధించింది. కేకేఆర్‌పై 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ ఘన విజయం సాధించింది. చదవండి: IPL 2022: ఐపీఎల్లో ఆరోన్ ఫించ్ అరుదైన రికార్డు.. తొలి ఆటగాడిగా! Excellent innings Rahul Tripathi! 🤌🤌 It's sad how the most flexible and selfless T20 batsman in the country is neither in selectors plans nor in armchair experts! ☹️☹️ — Cricketjeevi (@wildcardgyan) April 15, 2022 -
కేకేఆర్‌తో మ్యాచ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్ న్యూస్!
ఐపీఎల్-2022లో భాగంగా ఏప్రిల్ 11న గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు రాహుల్ త్రిపాఠి గాయపడిన సంగతి తెలిసిందే. రాహుల్ తెవాటియా బౌలింగ్‌లో తొలి బంతికే అద్భుతమైన సిక్స్ బాదిన త్రిపాఠి.. తరువాత తొడ కండరాలు పట్టేయడంతో అతడు ఫీల్డ్ నుంచి వైదొలగాడు. అయితే ఈ మ్యాచ్‌లో 11 బంతుల్లో 17 పరుగులు చేసి మంచి టచ్‌లో త్రిపాఠి కనిపించాడు. ఈ క్రమంలో కేకేఆర్‌తో జరగబోయే ఎస్ఆర్హెచ్ తదుపరి మ్యాచ్‌కు త్రిపాఠి అందుబాటులో ఉంటాడా లేదా అన్న సందేహం అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ .. త్రిపాఠి గాయంపై అప్డేట్ ఇచ్చాడు. తమ తదపరి మ్యాచ్‌కు త్రిపాఠి కోలుకుంటాడని విలియమ్సన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. "అదృష్టవశాత్తు త్రిపాఠికి పెద్ద గాయం కాలేదు. అతడు త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నాను. అతడు కేకేఆర్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడాని నేను భావిస్తున్నాను. మరోవైపు దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్‌కి కూడా గాయమైంది. అతడి గాయం తీవ్రమైనది కాబట్టి తదుపరి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. అతడు దూరం కావడం మా జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ" అని విలియమ్సన్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: జోరు మీదున్న సన్‌రైజర్స్‌కు భారీ షాక్! కీలక ఆటగాడు దూరం! -
రాహుల్ త్రిపాఠి ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్
ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు సంచలన క్యాచ్‌తో మెరిశాడు. గుజరాత్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో భువనేశ్వర్ కుమార్ వేసిన ఆఫ్‌సైడ్ బంతిని శుభ్‌మాన్ గిల్ కవర్ రీజియన్ ద్వారా బౌండరీ బాదడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో షార్ట్ ఎక్స్ట్రా కవర్ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న రాహుల్ త్రిపాఠి డైవ్ చేస్తూ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో గిల్‌తో పాటు మైదానంలో ఉన్న ప్రేక్షకులు ఒక్క సారిగా ఆశ్చర్యపోయారు. త్రిపాఠి క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా అద్భుతమైన క్యాచ్ అందుకున్న త్రిపాఠి.. 19 ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఈజీ క్యాచ్‌ను వదిలేయడం గమనార్హం. చదవండి: IPL 2022: సూర్యకుమార్ యాదవ్ నమస్తే సెలబ్రేషన్స్.. కారణం ఎంటో తెలుసా..? Rahul tripathi stunning catch... #GTvsSRH #SRHvGT pic.twitter.com/UA0focDkgi — Chinthakindhi Ramudu (O- Negitive) (@RAMURAVANA) April 11, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సెంచరీల మోత మోగిస్తున్న రుతురాజ్ గైక్వాడ్
సీఎస్కే స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ వరుస సెంచరీలతో దుమ్మురేపుతున్నాడు. దేశవాలీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర జట్టుకు నాయకత్వం వహిస్తున్న రుతురాజ్ వరుసగా మూడో సెంచరీ సాధించాడు. కేరళతో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రుతురాజ్ 110 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 129 పరుగులు చేసిన రుతురాజ్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. రుతురాజ్‌కు తోడుగా రాహుల్ త్రిపాఠి(108 బంతుల్లో 99 పరుగులు , 11 ఫోర్లు) రాణించడంతో మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. కేరళ ముందు 292 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కాగా రుతురాజ్ ఇంతకముందు మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో (112 బంతుల్లో 136 పరుగులు), చత్తీస్‌ఘర్‌తో మ్యాచ్‌లో (143 బంతుల్లో 154 పరుగులు నాటౌట్) మెరిశాడు. చదవండి: Vijay Hazare Trophy: సెంచరీలతో చెలరేగిన రుతురాజ్, వెంకటేశ్ అయ్యర్ కాగా రుతురాజ్ ఇంతకముందు మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో (112 బంతుల్లో 136 పరుగులు), చత్తీస్‌ఘర్‌తో మ్యాచ్‌లో (143 బంతుల్లో 154 పరుగులు నాటౌట్) మెరిశాడు. ఇక ఐపీఎల్ 2021 సీజన్లో 635 పరుగులతో రుతురాజ్ టాప్ స్కోరర్‌గా నిలిచి సీఎస్కే టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్ మెగావేలానికి ముందు సీఎస్కే తన రిటైన్ జాబితాలో జడేజా, ధోని, మొయిన్ అలీలతో పాటు రుతురాజ్‌ను అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే. చదవండి: Alex Carey: డెబ్యూ మ్యాచ్‌లోనే ఇరగదీశాడు.. పంత్ సహా ఐదుగురి రికార్డు బద్దలు -
Ruturaj Gaikwad: బ్యాటింగ్ సంచలనం రుతురాజ్‌కు బంపర్ ఆఫర్.. ఏకంగా
Ruturaj Gaikwad: చెన్నై సూపర్‌కింగ్స్ స్టార్ ఓపెనర్, బ్యాటింగ్ యువ సంచలనం రుతురాజ్ గైక్వాడ్‌కు బంపర్ ఆఫర్ వచ్చింది. ఐపీఎల్-2021 సీజన్లో అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుని ఆరెంజ్ క్యాప్ అందుకున్న అతడికి మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కీలక బాధ్యతలు అప్పజెప్పింది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ నేపథ్యంలో 24 ఏళ్ల రుతురాజ్‌ను మహారాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా నియమించింది. కాగా ఈ దేశవాళీ టీ20 లీగ్ నవంబరు 4 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఎలైట్ గ్రూపు-ఏలో ఉన్న మహారాష్ట్ర లీగ్ స్టేజ్‌లో లక్నోలో మ్యాచ్‌లు ఆడనుంది. తమిళనాడు జరిగే మ్యాచ్‌తో టోర్నీ ప్రయాణాన్ని ఆరంభించనుంది. ఈ నేపథ్యంలో రుతురాజ్ జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఇక నౌషద్ షేక్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరోవైపు.. ఐపీఎల్-2021 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా గాయపడిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు రాహుల్ త్రిపాఠి ఇంకా కోలుకోలేదు. దీంతో అతడు జట్టుకు దూరమయ్యాడు. ఈ విషయాల గురించి మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రియాజ్ బాగ్బన్ మాట్లాడుతూ... ‘‘రాహుల్ త్రిపాఠి, సిద్దేశ్ వీర్, రాజ్వర్ధన్ స్థానాలను స్వప్నిల్ గుగాలే, పవన్ షా, జగదీశ్ జోపేతో భర్తీ చేశాం. వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాల్సిన త్రిపాఠి గాయం నుంచి కోలుకోకపోవడంతో నౌషద్ షేక్ ఆ బాధ్యతలు నిర్వర్తిస్తాడు’’ అని పేర్కొన్నారు. ఇక రుతురాజ్ విషయానికొస్తే... చెన్నై సూపర్‌కింగ్స్ నాలుగో సారి ఐపీఎల్ చాంపియన్‌గా నిలవడంలో రుతురాజ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2021 సీజన్లో 16 మ్యాచ్‌లలో 16 ఇన్నింగ్స్ ఆడిన ఈ ఓపెనర్.. మొత్తంగా 635 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 4 అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు.. 101 నాటౌట్. ఇక అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రుతురాజ్ గైక్వాడ్ ఆరెంజ్ క్యాప్ అందుకున్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర జట్టు: రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), నౌషద్ షేక్(వైస్ కెప్టెన్), కేదార్ జాదవ్, యశ్ నహర్, అజీమ్ కాజీ, రంజీత్ నికామ్, సత్యజీత్ బచ్చవ్, తరంజిత్‌సింగ్ ధిల్లాన్, ముకేశ్ చౌదరి, ఆశయ్ పాల్కర్, మనోజ్ ఇంగ్లే, ప్రదీప్ దాఢే, షంషుజమా కాజీ, స్వప్నిల్ ఫల్పాగర్, దివ్యాంగ్, సునీల్ యాదవ్, ధనరాజ్సింగ్ పరదేశి, స్వప్నిల్ గుగాలే, పవన్ షా, జగదీష్ జోపే. చదవండి: T20 World Cup Pak Vs NZ: 24 టీ20లలో తలపడిన పాక్- కివీస్.. ఎవరిది పైచేయి అంటే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'సిక్స్ కొడతానని ఊహించలేదు'
Rahul Tripathi after the match-winning six: ఐపీఎల్ 2021లో భాగంగా బుధవారం జరిగిన క్వాలిఫయర్–2 మ్యాచ్‌లో కేకేఆర్ 3 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. అయితే చివరి వరకు ఉత్కంఠ భరితంగా జరగిన ఈ మ్యాచ్‌లో అఖరి 2 బంతుల్లో 6 పరుగులు కావాల్సిన నేపథ్యంలో సిక్స్ కొట్టి రాహుల్ త్రిపాఠి కోల్‌కతాను విజయతీరాలకు చేర్చాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన త్రిపాఠి.. ఆ సమయంలో తనపై తనకు జట్టును గెలిపించగలనన్న నమ్మకం ఉందని తెలిపాడు. "జట్టు విజయం చాలా ముఖ్యం. ఒకటి లేదా రెండు కఠినమైన ఓవర్లు మా ఇన్నింగ్స్‌లో ఉన్నాయి. కానీ చివరికి టార్గెట్ అంత కష్టంగా మారుతుందని నేను అనుకోలేదు. అఖరికి మేము మ్యాచ్ గెలిచినందుకు సంతోషంగా ఉంది. 18 వ ఓవర్ రబాడా చాలా కఠినంగా బౌలింగ్ చేశాడు. స్పిన్నర్లో ఒకరని టార్గెట్ చేయాలని అనుకున్నాను. అదే పని నేను చేశాను. మేము ప్లాన్ చేసుకున్నాము. చివరి రెండు బంతులల్లో సాధ్యమైనంత వరకు పరగులు చేయాలని నిర్ణయించుకున్నాము. కానీ రెండు బంతులే మిగిలి ఉండడంతో గెలుపు సాధ్యం కాదని అనుకున్నా.. ఆ సమయంలో ఒక పెద్ద హిట్ కావాలని భావించా.. అయితే సిక్స్‌తో ముగిస్తానని మాత్రం ఊహించలేదు' అని త్రిపాఠి పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ ముందు ఉంచింది. అయితే 136 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు ఓపెనర్లు శుభమన్ గిల్, వెంకటేష్ అయ్యర్ 96 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తరువాత కేవలం 7పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కేకేఆర్ పీకల్లోతు కష్టాల్లో పడింది. అఖరి ఓవర్లో 7 పరుగుల కాల్సిన నేపథ్యంలో మెదటి 4 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు ఆశ్విన్ పడగొట్టాడు. ఇక ఢిల్లీ విజయం లాంఛనమే అనుకున్న సమయంలో.. క్రీజులో ఉన్న రాహుల్ త్రిపాఠి ఐదో బంతికి సిక్స్ కొట్టి కేకేఆర్‌ను ఫైనల్‌కు చేర్చాడు. చదవండి: Rishab Pant Emotioanl: ఓటమి జీర్ణించుకోలేకపోతున్నా.. పంత్ భావోద్వేగం -
రాహుల్‌ది క్లియర్‌గా ఔట్.. అదొక చెత్త నిర్ణయం.. మండిపడ్డ గంభీర్!
Gautam Gambhir And Graeme Swann Rage At 3rd umpire Decision: ఐపీఎల్లో 2021లో నిష్క్రమణ చేరువగా వచ్చిన దశలో పంజాబ్ కింగ్స్‌కు కీలక విజయం దక్కింది. శుక్రవారం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 5 వికెట్ల తేడాతో కోల్‌కతాపై విజయం సాధించింది. దీంతో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. కాగా, పంజాబ్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో కేఎల్ రాహుల్ భారీ షాట్‌కు ప్రయత్నించగా అది మిస్ టైమ్ అయ్యింది. దీంతో రాహుల్ త్రిపాఠి పరిగెత్తుతూ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. అయితే ఫీల్ఢ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ నాటౌట్‌గా ప్రకటించి థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. ఈ క్రమంలో ఒకే కోణంలో పరిశీలించిన థర్డ్ అంపైర్ ఫీల్ఢ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ ఆధారంగా నాటౌట్ ప్రకటించాడు. అయితే రీప్లేలో బాల్ కింద త్రిపాఠి చేతివేళ్లు ఉన్నట్టు క్లియర్‌గా కనిపించింది. దీంతో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. అది క్లియర్‌గా ఔట్ అని తెలిసినా.. ఇవ్వలేదని సీనియర్ క్రికెటర్ల దగ్గర నుంచి నెటిజెన్ల వరకు అందరూ మండిపడుతున్నారు. ఈ విషయంపై భారత మాజీ ఆటగాడు గౌతం గంభీర్, ఇంగ్గండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ఘాటుగా స్పందించారు. థర్డ్ అంపైర్ నిర్ణయం షాక్‌కు గురి చేసిందిని గంభీర్ తెలిపాడు. "అది నిజంగా ఒక షాకింగ్ నిర్ణయం. అది క్లియర్‌గా ఔట్. అతడు ఒకటి కంటే ఎక్కువసార్లు రీప్లేని కూడా చూడాల్సిన అవసరం లేదు. స్లో-మోషన్ కూడా అవసరం లేదు. ఎందుకంటే.. అది క్లియర్‌గా కనిపిస్తుంది. చివరి ఓవర్లలో పంజాబ్ కాస్త ఒత్తిడికి గురి అవుతున్నట్లు కనిపించింది. ముఖ్యంగా ఐపీఎల్ లాంటి మేజర్ లీగ్‌లో ఇలా జరగకూడదు. ఇది ఆటగాడికి మాత్రమే కాకుండా మొత్తం ఫ్రాంచైజీకి నష్టం కలిగించవచ్చు " అని గంభీర్ స్టార్ స్పోర్ట్స్ షోలో చెప్పాడు. అదే విధంగా గ్రేమ్ స్వాన్ మాట్లడూతూ.. ఇప్పటి వరకు తను చూసిన థర్డ్ అంపైరింగ్ చెత్త నిర్ణయాల్లో ఇది ఒకటి అని అతడు విమర్శించాడు. "నేను నా జీవితంలో చూసిన అత్యంత దారుణమైన థర్డ్ అంపైరింగ్ నిర్ణయాల్లో ఇది ఒకటి. అది క్లియర్‌గా ఔట్ అని తెలుస్తోంది. త్రిపాఠి అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ తీసుకున్నాడు." అని స్వాన్ పేర్కొన్నాడు. కాగా కెప్టెన్ కేఎల్ రాహుల్ (67), మయాంక్ అగర్వాల్ (40) రాణించడంతో కోల్‌కతా నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 19.3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చదవండి: Virender Sehwag: ‘ఇక చాలు... ఈసారి ముంబై అస్సలు పైకి రావొద్దు’ -
రాహుల్ త్రిపాఠికి మందలింపు
అబుదాబి: కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు రాహుల్ త్రిపాఠి ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంతో అతన్ని తీవ్రంగా మందలించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో త్రిపాఠి నియమావళిని అతిక్రమించాడు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో భాగంగా లెవల్-1 నియమావళిలో 2.3 నిబంధనను ఉల్లంఘించాడు. అయితే త్రిపాఠి చేసిన తప్పిదం ఏమిటనే దానిపై స్పష్టత లేదు. నిన్నటి మ్యాచ్‌లో త్రిపాఠి ఓపెనర్‌గా వచ్చి 23 పరుగులు చేశాడు. 16 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో ఈ పరుగులు చేసి నటరాజన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.(ఆర్సీబీ వదులుకుంది.. ఢిల్లీ తీసుకుంది) సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. సూపర్ ఓవర్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ రెండు పరుగులే చేసింది. తొలి మూడు బంతులకు రెండు పరుగులే చేసి రెండు వికెట్లు కోల్పోవడంతో సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ ముగిసింది. సూపర్ ఓవర్లో రెండు వికెట్లు పడితే అక్కడితో ఒక జట్టు ఇన్నింగ్స్‌కు తెరపడుతుంది. కేకేఆర్ పేసర్ ఫెర్గ్యూసన్ తొలి బంతికి వార్నర్‌ను ఔట్ చేయగా, రెండో బంతికి రెండు పరుగులు ఇచ్చాడు. మూడో బంతికి అబ్దుల్ సామద్‌ను బౌల్డ్ చేశాడు. దాంతో కేకేఆర్‌కు మూడు పరుగుల టార్గెట్‌ను మాత్రమే ఎస్ఆర్హెచ్ నిర్దేశించింది. కేకేఆర్ సూపర్ ఓవర్లో మోర్గాన్-కార్తీక్‌లు దిగి జట్టుకు విజయాన్ని అందించారు. రషీద్ ఖాన్ వేసిన ఆ సూపర్ ఓవర్ నాల్గో బంతికి లెగ్ బైస్ రూపంలో రెండు పరుగులు రావడంతో కేకేఆర్ విజయం సాధించింది. రషీద్ వేసిన రెండో బంతికి పరుగు రాగా, మూడో బంతికి పరుగు రాలేదు. నాల్గో బంతికి దినేశ్ కార్తీక్ లెగ్ బై రూపంలో రెండు పరుగులు తీయడంతో కేకేఆర్ విక్టరీ నమోదు చేసింది. -
‘రాహుల్ పేరు వినే ఉంటారు కదా...’ : షారుఖ్
అబుదాబి: చెన్నైపై అద్భుత ప్రదర్శనతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను గెలిపించిన రాహుల్ త్రిపాఠిపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే అన్నింటికి మించి టీమ్ యజమాని, బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ప్రోత్సాహం త్రిపాఠి ఆనందాన్ని రెట్టింపు చేసింది. రాహుల్ బ్యాటింగ్ సమయంలో ఆద్యంతం అతడిని ఉత్సాహపరచిన షారుఖ్... ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకునే సమయంలో కూడా తన అత్యంత పాపులర్ డైలాగ్ (దిల్‌తో పాగల్ హై... సినిమా క్లైమాక్స్ సీన్)తో అతడిని అభినందించాడు. ‘రాహుల్... నామ్‌తో సునాహీ హోగా (రాహుల్...ఈ పేరు వినే ఉంటారు కదా’) అని షారుఖ్ గట్టిగా అరవడంతో నవ్వులు విరబూశాయి. దీనిపై హర్ష భోగ్లే అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ‘షారుఖ్ ముందు ఇంతటి మంచి ప్రదర్శన ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. నా కల నిజమైనట్లు అనిపిస్తోంది’ అని త్రిపాఠి వ్యాఖ్యానించాడు. కేకేఆర్ అఫీషియల్ ట్విట్టర్లో కూడా రెండు చేతులూ వెడల్పుగా చాచిన షారుఖ్ పోజులో రాహుల్ త్రిపాఠి తన బహుమతులను ప్రదర్శిస్తుండగా ‘ఏ సినిమాలో రాహుల్ ఉంటాడో అది కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది’ అని వ్యాఖ్య పెట్టింది. షారుఖ్ సినిమాల్లో ఎక్కువ సార్లు అతని పాత్రకు రాహుల్ పేరు ఉండటంతో అది బాగా పాపులర్ అయింది. (ఆ క్షణం ఎంతో మధురం...) -
ఏడుగురు క్రీజులోకి దిగినా..
ముందు చెన్నై, తర్వాత కోల్‌కతా... ఇరు జట్లను బౌలర్లే మలుపు తిప్పారు. కోల్‌కతా భారీస్కోరు చేయకుండా సూపర్‌కింగ్స్ బౌలర్లు అడ్డుకట్ట వేస్తే... లక్ష్యాన్ని ఛేదించకుండా నైట్‌రైడర్స్ బౌలర్లు ఆపేశారు. టి20లంటే బ్యాట్స్‌మెన్ మెరుపులే కాదు... బౌలర్ల మలుపులు కూడా ఉంటాయని, సిక్సర్లే కాదు... అనూహ్య వికెట్లతో కూడా విజయం చేతులు మారుతుందని ఈ మ్యాచ్‌లో బౌలర్లు నిరూపించారు. అబుదాబి: గత మ్యాచ్‌లో కొండంత లక్ష్యాన్ని చెన్నై ఓపెనర్లిద్దరే పిండి... పిండి చేశారు. కానీ ఈ మ్యాచ్‌లో మోస్తరు లక్ష్యాన్ని ఏడుగురు క్రీజులోకి దిగినా ఛేదించలేకపోయారు. కోల్‌కతా బౌలర్లకు తలవంచారు. దీంతో బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 10 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రాహుల్ త్రిపాఠి (51 బంతుల్లో 81; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. డ్వేన్ బ్రేవోకు 3 వికెట్లు దక్కాయి. తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులే చేయగలిగింది. వాట్సన్ (40 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. చెన్నై జట్టులో పీయూష్ చావ్లా స్థానంలో కరణ్ శర్మను తీసుకోగా... కోల్‌కతా మార్పుల్లేకుండా బరిలోకి దిగింది. అందరు బ్యాట్లెత్తారు... రాహుల్ త్రిపాఠితో ఆట ప్రారంభించిన శుబ్‌మన్ గిల్ (11), వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ నితీశ్ రాణా (9), మోర్గాన్ (7), రసెల్ (2), కెప్టెన్ దినేశ్ కార్తీక్ (12) ఇలా స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ చెన్నై బౌలింగ్‌కు బెంబేలెత్తారు. ఒక్కడు మినహా ఇంకెవరూ పట్టుమని 12 బంతులను మించి ఆడలేకపోయారు. మరోవైపు చెన్నై బౌలర్లలో ఒకే ఒక్క బౌలర్ (దీపక్ చహర్) తప్ప బౌలింగ్‌కు దిగిన ప్రతీ ఒక్కరు ప్రత్యర్థిపై ప్రతాపం చూపినవారే! స్యామ్ కరన్, శార్దుల్ ఠాకూర్, కరణ్ శర్మ తలా 2 వికెట్లు తీసి కోల్‌కతాను కట్టడి చేశారు. బ్రేవో అయితే టెయిలెండర్లు కమలేశ్(0), శివమ్ మావి (0)లను ఖాతానే తెరువనీయలేదు. ఆఖరి ఓవర్లో వాళ్లిద్దరిని ఔట్ చేశాడు. వరుణ్ చక్రవర్తి రనౌట్ కావడంతో బ్రేవో ఇన్నింగ్స్ 20వ ఓవర్లో 3 పరుగులే ఇచ్చాడు. రాణించిన వాట్సన్... ఆరంభంలో వాట్సన్, డుప్లెసిస్ చకాచకా బౌండరీలు బాదేశారు. కానీ ఈ బాదుడుకు అంతలోనే చుక్కెదురైంది. డుప్లెసిస్ (10 బంతుల్లో 17; 3 ఫోర్లు) వేగానికి శివమ్ మావి కళ్లెం వేశాడు. తర్వాత రాయుడు జతకాగా... ఇద్దరు కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు శ్రమించారు. ఫోర్... లేదంటే ఒకట్రెండు పరుగులతో చెన్నైని నడిపించారు. రెండో వికెట్‌కు 69 పరుగులు జోడించాక రాయుడు (27 బంతుల్లో 30; 3 ఫోర్లు) ఔటయ్యాడు. దీంతో ధోని కాస్త ముందుగా బ్యాటింగ్‌కు దిగాడు. లక్ష్యందిశగా సాగుతున్నట్లు కనిపించిన సూపర్‌కింగ్స్‌ను నరైన్ ఓవర్ కలవరపెట్టింది. మరో ఓవర్ ధారాళంగా పరుగులిచ్చింది. అతని వరుస ఓవర్లు మ్యాచ్ అంచనాలను మార్చేశాయి. చాలా ఆలస్యంగా (ఇన్నింగ్స్ 12వ) బౌలింగ్‌కు దిగిన నరైన్ మొదటి ఓవర్లో 5 పరుగులిచ్చాడు. వాట్సన్ 39 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత కాసేపటికే అతన్ని నరైన్ ఎల్బీడబ్ల్యూ చేయడంతో కోల్‌కతా ఉత్సాహం రెట్టింపైంది. కానీ నరైన్ తర్వాతి ఓవర్‌ను స్యామ్ కరన్ తేలిగ్గా ఆడేశాడు. 6, 4తో కలిపి మొత్తం 14 పరుగులు రావడంతో చెన్నై శిబిరాన్ని ఆశల్లో నిలిపింది. ధోని ఔట్ కాగానే... యువ ఆటగాడు స్యామ్ కరన్ జోరు మీదున్నా... ధోని క్రీజులో ఉన్నా విజయ సమీకరణం అంత సులువుగా ఏమీ లేదు. ఆఖరి 24 బంతుల్లో 44 పరుగులు చేయాల్సిన తరుణంలో ధోని (11) భారీషాట్లపై దృష్టిపెట్టాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన చెన్నై సారథి మరో షాట్‌కు ప్రయత్నించి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. స్యామ్ (17)ను రసెల్ ఔట్ చేయడంతో చెన్నై లక్ష్యానికి దూరమైంది. చివరి 12 బంతుల్లో 36 పరుగులు చేయాలి. జడేజా (8 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), కేదార్ జాదవ్ (7 నాటౌట్) క్రీజులో ఉండగా... 19వ ఓవర్ వేసిన నరైన్ 10 పరుగులిచ్చాడు. ఇక మిగతా 6 బంతుల్లో 26 పరుగులు ఆ ఇద్దరి వల్లా కాలేదు. రసెల్ చివరి ఓవర్లో జడేజా వరుసగా 6, 4, 4 కొట్టగా 15 పరుగులొచ్చాయి. అతనొక్కడే 81 ఓపెనర్ త్రిపాఠి అత్యంత విలువైన ఇన్నింగ్స్‌తో కోల్‌కతాను ఆదుకున్నాడు. చెన్నై బౌలర్లతో ఆడుకున్నాడు. అన్నీతానై ఇన్నింగ్స్‌ను నడిపించాడు. నైట్‌రైడర్స్ స్కోరు 167. ప్రతీ ఒక్కరు బ్యాటింగ్ చేశారు. ఎక్స్‌ట్రాలు 10 పరుగులు తీసేస్తే సగం కంటే ఎక్కువ స్కోరు రాహుల్ త్రిపాఠిదే! రెండో ఉత్తమం 17 పరుగులు. నరైన్, కమిన్స్ ఆ స్కోరు చేశారు. 81 పరుగులు చేసిన ఓపెనర్ జోరుకు మిగతా బ్యాట్స్‌మెన్ బేజారుకు అసలు ఏమాత్రం పొంతనే లేదు. బౌండరీతో ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టిన త్రిపాఠి... దీపక్ చహర్ బౌలింగ్‌లో బౌండరీలతో దూకుడు పెంచాడు. చూడచక్కని సిక్సర్లతో అలరించాడు. దీంతో కోల్‌కతా స్కోరు సగటున 9 పరుగుల రన్‌రేట్‌తో సాగిపోయింది. గిల్, రాణా, నరైన్‌లు ఔటైనా ఈ రన్‌రేట్ మాత్రం తగ్గలేదంటే దానికి కారణం త్రిపాఠినే. 31 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్న ఈ ఓపెనర్ క్రీజులో పాతుకుపోయాడు. ఆఖరిదాకా ఉంటే సెంచరీ చేసే ఊపుమీదున్న త్రిపాఠిని ఎట్టకేలకు బ్రేవో ఔట్ చేశాడు. అతను ఔటయ్యాక 3.1 ఓవర్లు ఆడిన కోల్‌కతా కేవలం 27 పరుగులు చేసి 4 వికెట్లను కోల్పోయింది. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: రాహుల్ త్రిపాఠి (సి) వాట్సన్ (బి) బ్రేవో 81; గిల్ (సి) ధోని (బి) శార్దుల్ 11; నితీశ్ రాణా (సి) జడేజా (బి) కరణ్ శర్మ 9; నరైన్ (సి) డుప్లెసిస్ (బి) కరణ్ శర్మ 17; మోర్గాన్ (సి) డుప్లెసిస్ (బి) స్యామ్ కరన్ 7; రసెల్ (సి) ధోని (బి) శార్దుల్ 2; కార్తీక్ (సి) శార్దుల్ (బి) స్యామ్ కరన్ 12; కమిన్స్ (నాటౌట్) 17; కమలేశ్ (సి) డుప్లెసిస్ (బి) బ్రేవో 0; శివమ్ మావి (సి) ధోని (బి) బ్రేవో 0; వరుణ్ (రనౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 167. వికెట్ల పతనం: 1–37, 2–70, 3–98, 4–114, 5–128, 6–140, 7–162, 8–163, 9–166, 10–167. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–47–0, స్యామ్ కరన్ 4–0–26–2, శార్దుల్ 4–0–28–2, కరణ్ శర్మ 4–0–25–2, బ్రేవో 4–0–37–3. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: వాట్సన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) నరైన్ 50; డుప్లెసిస్ (సి) కార్తీక్ (బి) శివమ్ మావి 17; రాయుడు (సి) గిల్ (బి) కమలేశ్ 30; ధోని (బి) వరుణ్ 11; స్యామ్ కరన్ (సి) మోర్గాన్ (బి) రసెల్ 17; కేదార్ జాదవ్ (నాటౌట్) 7; రవీంద్ర జడేజా (నాటౌట్) 21; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–30, 2–99, 3–101, 4–129, 5–129. బౌలింగ్: కమిన్స్ 4–0–25–0, శివమ్ మావి 3–0–32–1, వరుణ్ చక్రవర్తి 4–0–28–1, కమలేశ్ 3–0–21–1, నరైన్ 4–0–31–1, రసెల్ 2–0–18–1. ► ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడం 2015 తర్వాత ఇదే తొలిసారి. ► కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై లక్ష్యఛేదనలో ఓడిపోవడం చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకిదే మొదటిసారి. కోల్‌కతాపై ఛేజింగ్ చేస్తూ చెన్నై గతంలో ఎనిమిదిసార్లూ గెలిచింది. -
కేకేఆర్ ఆలౌట్.. సీఎస్కే టార్గెట్ ఎంతంటే
అబుదాబి : ఐపీఎల్ 13వ సీజన్లో భాగంగా కేకేఆర్ .. చెన్నై సూపర్ కింగ్స్‌కు 168 పరుగుల టార్గెట్ నిర్ధేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ సునీల్ నరైన్ స్థానంలో రాహుల్ త్రిపాఠిని ఓపెనర్‌గా పంపించింది. ఈ సందర్భంగా త్రిపాఠి ఓపెనర్‌గా మంచి షాట్స్ ఆడుతూ తన విలువేంటో చూపించాడు. సహచరులంతా తక్కువ స్కోరుకే వెనుదిరిగినా తాను మాత్రం ఇన్నింగ్స్ ఆసాంతం మెరుపులు మెరిపించాడు. త్రిపాఠి 51 బంతుల్లో 81 పరుగులు సాధించగా.. ఇందులో 8ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. మిగిలిన వారిలో ఎవరు చెప్పుకోదగ్గ ప్రదర్శన నమోదు చేయలేదు. కాగా నిర్ణీత ఓవర్లలో 20 ఓవర్లలో కేకేఆర్ 167 పరుగులకు ఆలౌట్ అయింది.(చదవండి : 'నచ్చినవారిని వదిలిరావడం ఎంతో కష్టం') అంతకముందు రాహుల్ త్రిపాఠి శుబ్‌మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. కాగా స్కోరు 37 పరుగులకు చేరగానే కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ వేసిన నాలుగో ఓవర్ రెండో బంతికి శుబ్‌మన్ గిల్ క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన నితీష్ రాణా సహకారంతో త్రిపాఠి మాత్రం బౌండరీలతో విరుచుకుపడ్డాడు. దీంతో కేకేఆర్ స్కోరుబోర్డు ఉరకలెత్తింది. ఈ దశలో 8వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన కరణ్ శర్మ తను వేసిన మొదటిబంతికే వికెట్ తీసుకున్నాడు. భారీ షాట్‌కు యత్నించిన నితీష్ రాణా రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి అవుట్‌గా వెనుదిరిగాడు. (చదవండి : 'ఈ సమయంలో గేల్ చాలా అవసరం') తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన సునీల్ నరైన్‌తో కలిసి ఇన్నింగ్స్ కొనసాగించిన త్రిపాఠి 31 బంతుల్లో 50 రన్స్ సాధించాడు. ఇందులో 5 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. కాగా కేకేఆర్ తొలి 10 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. నాలుగో స్థానంలో వచ్చిన సునీల్ నరైన్ 17 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కాగా నరైన్ అవుటైన తర్వాత బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా వచ్చిన ఇయాన్ మోర్గాన్ పూర్తిగా నిరాశపరిచాడు. తర్వాత వచ్చిన రసెల్, కమిన్స్, కార్తీక్ ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయారు. కాగా రాహుల్ త్రిపాఠి 81 పరుగుల వద్ద బ్రేవో బౌలింగ్‌లో వెనుదిరిగాడు. కాగా చెన్నై బౌలర్లలో బ్రేవో 3, శార్దూల్ ఠాకూర్, కరణ్ శర్మ,శామ్ కర్జన్ తలా రెండు వికెట్లు తీశారు. -
త్రిపాఠి జోరు.. కేకేఆర్ స్కోరెంతంటే
అబుదాబి : సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న కోల్‌కత ఇన్నింగ్స్‌ను నిలకడగా ఆడుతోంది. కాగా అందరూ ఊహించినట్టుగానే ఈ మ్యాచ్‌లో సునీల్ నరైన్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన రాహుల్ త్రిపాఠి.. శుబ్‌మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. కాగా స్కోరు 37 పరుగులకు చేరగానే కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ వేసిన నాలుగో ఓవర్ రెండో బంతికి శుబ్‌మన్ గిల్ క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన నితీష్ రాణా సహకారంతో త్రిపాఠి మాత్రం బౌండరీలతో విరుచుకుపడ్డాడు. దీంతో కేకేఆర్ స్కోరుబోర్డు ఉరకలెత్తింది. (చదవండి : పొలార్డ్‌ను అనుసరించిన దినేష్ కార్తీక్) ఈ దశలో 8వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన కరణ్ శర్మ తను వేసిన మొదటిబంతికే వికెట్ తీసుకున్నాడు. భారీ షాట్‌కు యత్నించిన నితీష్ రాణా రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి అవుట్‌గా వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన సునీల్ నరైన్‌తో కలిసి ఇన్నింగ్స్ కొనసాగించిన త్రిపాఠి 31 బంతుల్లో 50 రన్స్ సాధించాడు. ఇందులో 6 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. కాగా కేకేఆర్ తొలి 10 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. క్రీజులో త్రిపాఠి 52 పరుగులు, నరైన్ 13 పరుగులతో ఉన్నారు. -
ఐపీఎల్: సింగిల్ హ్యాండ్ చావ్లా
కోల్‌కతా : ఐపీఎల్-11 సీజన్లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పిన్నర్ పీయూష్ చావ్లా సింగిల్ హ్యాండ్ క్యాచ్‌తో అదరగొట్టాడు. క్రీజులో పాతుకుపోతున్న ఓపెనర్, కీలక బ్యాట్స్‌మన్ రాహుల్ త్రిపాఠి వికెట్ పడగొట్టాడు. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఓపెనర్లు అజింక్యా రహానే, రాహుల్ త్రిపాఠిలు ఇన్నింగ్స్‌ను దాటిగా ఆరంభించారు. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడిని చావ్లా అద్భుత బంతితో విడదీశాడు. చావ్లా వేసిన 5 ఓవర్ తొలిబంతిని త్రిపాఠి డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి అనూహ్యంగా గాల్లోకి లేచింది. అంతే వేగంతో చావ్లా ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. దీంతో రిటర్న్ క్యాచ్ త్రిపాఠి(20: 13 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) పెవిలియన్ చేరాడు. ఇక బెంగళూరుతో జరిగిన కీలక మ్యాచ్‌లో త్రిపాఠి హాఫ్ సెంచరీతో రాణించిన విషయం తెలిసిందే. -
చావ్లా సింగిల్ హ్యాండ్ క్యాచ్‌తో అదరగొట్టాడు
-
రాజస్తాన్ గోపాల... గోపాల... బెంగళూరు గోవింద... గోవింద...
కనుచూపు మేరలో ప్లే ఆఫ్స్ బెర్త్... ఎదురుగా మరింత తేలికైన లక్ష్యం... ప్రత్యర్థి కూడా ప్రమాదకరమేమీ కాదు... పైగా జట్టు వరుస విజయాల ఊపులో ఉంది... అయినా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓడింది! కాదుకాదు బ్యాట్స్‌మెన్ ‘ముందుకొచ్చి’ ఓడించారు! ఒకరా ఇద్దరా...? కెప్టెన్ కోహ్లి నుంచి మన్దీప్ సింగ్ వరకు ఏకంగా నలుగురు ఇలాగే ఆడి ముంచేశారు! తదుపరి దశకు వెళ్లే సువర్ణావకాశాన్ని కాలదన్నుకున్నారు! రాహుల్ త్రిపాఠి అజేయ బ్యాటింగ్, శ్రేయస్ గోపాల్ స్పిన్ కనికట్టు, క్లాసెన్ కీపింగ్ నైపుణ్యంతో రాజస్తాన్ రాయల్స్ చక్కటి విజయాన్ని నమోదు చేసుకొని ప్లే ఆఫ్ ఆశలు నిలబెట్టుకుంది. జైపూర్: విధ్వంసక ఇన్నింగ్స్‌లతో ఈ సీజన్లో జట్టును నిలబెట్టిన ఓపెనర్ జాస్ బట్లర్, అంతో ఇంతో ఆడిన ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ లేకున్నా రాజస్తాన్ రాయల్స్ అద్భుతం చేసింది. బ్యాటింగ్‌లో మోస్తరుగానే ఆడినా... ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లెగ్ స్పిన్నర్ శ్రేయస్ గోపాల్ (4/16) బౌలింగ్ మాయాజాలంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును చుట్టేసింది. రెండు జట్ల మధ్య శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్తాన్... ఓపెనర్ రాహుల్ త్రిపాఠి (58 బంతుల్లో 80 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ ఇన్నింగ్స్‌కు కెప్టెన్ అజింక్య రహానే (31 బంతుల్లో 33; 3 ఫోర్లు), హెన్రిచ్ క్లాసెన్ (21 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలవడంతో నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. పేసర్ ఉమేశ్ (3/25) చక్కటి ప్రదర్శన కనబరిచాడు. ఛేదనలో డివిలియర్స్ (35 బంతుల్లో 53; 7 ఫోర్లు), ఓపెనర్ పార్థివ్ (21 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా మరే బ్యాట్స్‌మెన్ ప్రతిఘటన చూపకపోవడంతో బెంగ ళూరు 19.2 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. 30 పరుగులతో ఓడి లీగ్ నుంచి నిష్క్రమించింది. త్రిపాఠినే ఘనాపాటి... రాజస్తాన్ ఇన్నింగ్స్‌కు రాహుల్ త్రిపాఠి ఆసాంతం ఇరుసులా నిలిచాడు. పరిస్థితుల రీత్యా అతడితో పాటు ఓపెనింగ్‌కు దిగిన జోఫ్రా ఆర్చర్ (0) ఉమేశ్ ధాటికి ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన రహానే... త్రిపాఠికి సహకారం అందించాడు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి స్కోరు 45/1. చూడచక్కని షాట్లు కొట్టిన త్రిపాఠి 38 బంతుల్లో అర్ధశతకం అందుకున్నాడు. రెండో వికెట్‌కు 99 పరుగులు జోడించి సంయమనంతో సాగుతున్న ఈ జోడీని... రహానేను ఎల్బీగా అవుట్ చేయడం ద్వారా ఉమేశ్ విడదీశాడు. మరుసటి బంతికే సంజు శామ్సన్ (0)నూ ఔట్ చేశాడు. దీంతో రాయల్స్ ఒక్కసారిగా కష్టాల్లో పడి ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. బ్యాట్స్‌మెన్ ముంచేశారు... తక్కువ లక్ష్యాన్ని బెంగళూరు అలవోకగా ఛేదించేస్తుందని అందరు అనుకుంటుండగా... అందుకు భిన్నంగా ఆడిందా జట్టు. ఆర్చర్ బౌలింగ్‌లో అప్పర్ కట్లతో పార్థివ్ రెండు చక్కటి సిక్స్‌లు కొట్టడంతో ఆ జట్టు ఇన్నింగ్స్ ఆశావహంగానే ప్రారంభమైంది. అవతలి ఎండ్‌లో గౌతమ్ బౌలింగ్‌లో పలుసార్లు బీట్ అయిన కోహ్లి (4)... ముందుకొచ్చి ఆడబోయి బౌల్డయ్యాడు. పవర్ ప్లే అనంతరం ఆర్సీబీ 55/1తో గెలుపు దిశగా ఉన్నట్లు కనిపించింది. అయితే, గోపాల్ బంతిని పుల్ చేయబోయిన పార్థివ్... క్లాసెన్ మెరుపు కీపింగ్‌కు స్టంపౌటయ్యాడు. మొయిన్ అలీ (1) అతడికే రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. మన్దీప్ సింగ్ (3)నూ గోపాల్–క్లాసెన్ ద్వయమే స్టంపౌట్‌తో పెవిలియన్ పంపించింది. మరోవైపు ఏబీ 31 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకోగా, గ్రాండ్‌హోమ్ (2) స్లిప్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చాడు. జట్టు ఒక్కసారిగా 96/5కు పడిపోయింది. ఆ తర్వాత డివిలియర్స్ కూడా క్రీజు వదిలి ముందుకురావడం... క్లాసెన్ వికెట్లను గిరాటేసేయడంతో ఆర్సీబీ పనైపోయింది. మూడు జట్ల ‘రేసు’వత్తరం హైదరాబాద్‌పై విజయంతో కోల్‌కతా ప్లే ఆఫ్స్ మూడో బెర్త్ ఎగరేసుకుపోయింది. మిగిలింది ఒక్క స్థానం. దీనికోసం ముంబై, రాజస్తాన్, పంజాబ్ పోటీపడుతున్నాయి. బెంగళూరుపై విజయంతో రాజస్తాన్ ఖాతాలో 14 పాయింట్లున్నాయి. ఆదివారం ఢిల్లీపై ముంబై, చెన్నై మీద పంజాబ్ నెగ్గితే మూడు జట్ల పాయింట్లు సమమవుతాయి. అయినా, రన్‌రేట్‌లో పైచేయిగా ఉన్నందున ముంబైనే ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఢిల్లీ చేతిలో ఓడితే మాత్రం ఇంటి బాట పడుతుంది. అప్పుడు రాజస్తాన్‌ను వెనక్కు నెట్టేలా రన్‌రేట్ లెక్కలను సరిచూసుకుంటూ చెన్నైపై పంజాబ్ గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ పంజాబ్ ఓడితే రాయల్స్‌కు ప్లే ఆఫ్‌కు దారిచ్చినట్లవుతుంది. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: రాహుల్ త్రిపాఠి నాటౌట్ 80; ఆర్చర్ (సి) పార్థివ్ (బి) ఉమేశ్ 0; రహానే ఎల్బీడబ్ల్యూ (బి) ఉమేశ్ 33; శామ్సన్ (సి) మొయిన్ అలీ (బి) ఉమేశ్ 0; క్లాసెన్ (సి) మొయిన్ అలీ (బి) సిరాజ్ 32; కృష్ణప్ప గౌతమ్ రనౌట్ 14; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–2, 2–101, 3–101, 4–149, 5–164. బౌలింగ్: చహల్ 4–0–26–0, ఉమేశ్ 4–1–25–3, మొయిన్ అలీ 2–0–19–0, సౌతీ 4–0–37–0, సిరాజ్ 4–0–33–1, గ్రాండ్‌హోమ్ 2–0–23–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (బి) గౌతమ్ 4; పార్థివ్ (స్టంప్డ్) క్లాసెన్ (బి) శ్రేయస్ గోపాల్ 33; డివిలియర్స్ (స్టంప్డ్) క్లాసెన్ (బి) గోపాల్ 53; మొయిన్ అలీ (సి అండ్ బి) గోపాల్ 1; మన్దీప్ సింగ్ (స్టంప్డ్) క్లాసెన్ (బి) గోపాల్ 3; గ్రాండ్‌హోమ్ (సి) రహానే (బి) సోధి 2; సర్ఫరాజ్ (సి) క్లాసెన్ (బి) లాలిన్ 7; సౌతీ (సి) గౌతమ్ (బి) ఉనాద్కట్ 14; ఉమేశ్ (బి) లాలిన్ 0; సిరాజ్ (సి) గౌతమ్ (బి) ఉనాద్కట్ 14; చహల్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (19.2 ఓవర్లలో ఆలౌట్) 134. వికెట్ల పతనం: 1–20, 2–75, 3–77, 4–85, 5–96, 6–98, 7–108, 8–108, 9–128, 10–134. బౌలింగ్: గౌతమ్ 2–0–6–1, ఆర్చర్ 4–0–37–0, లాలిన్ 2–0–15–2, ఉనాద్కట్ 3.2–0–27–2, గోపాల్ 4–0–16–4, సోధి 4–0–31–1. -
'తుదిపోరులో సత్తాచాటుతా'
హైదరాబాద్: ముంబై ఇండియన్స్ తో జరిగిన క్వాలిఫయర్ -1లో నిరాశపరిచిన రైజింగ్ పుణె సూపర్ జెయింట్ ఓపెనర్ రాహుల్ త్రిపాఠి తుది పోరులో మాత్రం సత్తాచాటుతానని ధీమా వ్యక్తం చేశాడు. ఆ మ్యాచ్ లో మెక్లీన్ గన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయిన త్రిపాఠి.. టైటిల్ పోరులో ఎటువంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వనని అంటున్నాడు. 'నిజానికి అపజయాలే గెలుపుకు సోపానాలు. ఈ విషయాన్ని నేను బలంగా నమ్ముతా. ఓటుములతో నిరాశ చెందకుండా, మరింత కష్టపడి ముందుకు సాగాలి. ఇప్పటివరకూ నా ఐపీఎల్ ప్రయాణం సంతృప్తికరంగానే సాగింది. అదే స్ఫూర్తితో ఫైనల్లో కూడా రాణిస్తా. దిగ్గజ క్రికెటర్లతో కలిసి ఆడటం నా అదృష్టం. మహేంద్ర సింగ్ ధోని, స్టీవ్ స్మిత్ లాంటి మేటి గాళ్ల సలహాలు నాకు ఎంతో ఉపకరిస్తున్నాయి' అని రాహుల్ త్రిపాఠి తెలిపాడు. రేపు(ఆదివారం) హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో రైజింగ్ పుణె- ముంబై ఇండియన్స్ జట్ల మధ్య టైటిల్ పోరు జరుగనుంది. -
‘సెంచరీ చేయనందుకు బాధ లేదు’
కోల్‌కతా: సెంచరీ చేయడం కంటే జట్టును గెలిపించడమే ముఖ్యమని రైజింగ్ పుణే సూపర్ జెయింట్ బ్యాట్స్‌మన్ రాహుల్ త్రిపాఠి అన్నాడు. చివరి వరకు క్రీజ్‌లో ఉండి జట్టును గెలిపించడం తనకు ఇష్టమని తెలిపాడు. ఏడు పరుగుల తేడాతో ఐపీఎల్లో తొలి సెంచరీ చేజారడం పట్ల తనకు ఎటువంటి విచారం లేదన్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో త్రిపాఠి 52 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లతో 93 పరుగులు చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడుతూ.. ‘ఈ రోజు బాగా ఆడాను. చివరి వరకు క్రీజ్‌లో ఉండాలనుకున్నాడు. సెంచరీ కోల్పోయినందుకు నాకు ఎటువంటి బాధ లేదు. మ్యాచ్ గెలవడం అన్నిటికంటే ముఖ్యం. ఎటువంటి ప్రణాళికలు వేసుకోకుండానే బ్యాటింగ్‌కు దిగాను. ఎంఎస్ ధోని, స్టీవ్ స్మిత్ లాంటి స్టార్ ఆటగాళ్లతో ఆడడం నాకెంతో ఉపకరించింది. రహానేతో ఓపెనింగ్‌కు రావడం అద్బుతమైన అనుభవం. రహానే నన్ను ఎంతగానో ప్రోత్సహించాడు. మైదానం వెలుపల కూడా సహచర ఆటగాళ్లు ఎంకరేజ్ చేశార’ని త్రిపాఠి వెల్లడించాడు. -
ఐపీఎల్: కొత్త స్టార్ వెలుగులోకొచ్చాడు!
కోల్ కతా: ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో మరో యువకెరటం వెలుగులోకి వచ్చింది. అద్భుతమైన పోరాటపటిమతో రూర్కీ కుర్రాడు రాహుల్ త్రిపాఠి పుణెను విజయతీరాలకు చేర్చాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. 52 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లతో 93 పరుగులు చేసి.. తన జట్టుకు ఒంటిచేత్తో విజయాన్నందించాడు. బుధవారమిక్కడ జరిగిన మ్యాచ్ లో రాహుల్ సూపర్ షోతో కోల్ కతా నైట్ రైడర్స్ పై రైజింగ్ పుణె జెయింట్స్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. రాహుల్ త్రిపాఠి సత్తాతో ఉబ్బితబ్బిబైన పుణె కెప్టెన్ స్టీవ్ స్మిత్ అతన్ని ప్రశంసల్లో ముంచెత్తాడు. 'రాహుల్ త్రిపాఠి అంటే ఏమిటో మాకు ఈ మ్యాచ్ తెలిసేలా చేసింది. మ్యాచ్ లో రానురాను వికెట్ స్లోడౌన్ అవుతుందని మేం భావించాం. అందుకే ఆరంభ పవర్ ప్లేలోనే ఎక్కువ పరుగులు సాధించేందుకు ప్రయత్నించాం. త్రిపాఠి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. దురదృష్టవశాత్తు అతను సెంచరీ చేయలేదు. సెంచరీకి అతను ఎంతో అర్హుడు' అని స్మిత్ అన్నాడు. పుణె విజయపరంపర కొనసాగుతుండటంపై స్మిత్ హర్షం వ్యక్తం చేశాడు. గడిచిన ఏడు మ్యాచులలో ఆరింటిలో గెలుపొందడం ఆనందంగా ఉందని చెప్పాడు. మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతాను 155/8 పరుగులకు పరిమితం చేసిన పుణె బౌలర్లను కూడా ఆయన కొనియాడాడు. -
త్రిపాఠి తడాఖా
⇒ 52 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లతో 93 ⇒ కోల్‌కతాపై రైజింగ్ పుణే విజయం కోల్‌కతా: రాహుల్ త్రిపాఠి (52 బంతుల్లో 93; 9 ఫోర్లు, 7 సిక్సర్లు) సూపర్ షోకు కోల్‌కతా చెదిరింది. రైజింగ్ పుణే సూపర్ జెయింట్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. జట్టులో మేటి బ్యాట్స్‌మెన్ స్మిత్, స్టోక్స్, ధోనిలు విఫలమైన చోట అతనొక్కడే అంతా తానై నడిపించాడు. సెంచరీని చేజార్చుకున్నా... అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు త్రిపాఠి. బుధవారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేపట్టిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన రైజింగ్ పుణే సూపర్ జెయింట్ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసి గెలిచింది. చివరి ఓవర్లో పుణే విజయానికి 5 పరుగులు అవసరమయ్యాయి. గ్రాండ్‌హోమ్ వేసిన ఈ ఓవర్ తొలి బంతికి సుందర్ సింగిల్ తీయగా... రెండో బంతిని ఆడిన క్రిస్టియాన్ సిక్సర్‌గా మలిచి పుణే విజయాన్ని ఖాయం చేశాడు. త్రిపాఠికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. కోల్‌కతాకిది వరుసగా రెండో పరాజయం కాగా... రైజింగ్ పుణేకు ‘హ్యాట్రిక్’ విజయం. విరుచుకుపడిన త్రిపాఠి: ఊరించే లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పుణే జట్టును ఓపెనర్ రాహుల్ త్రిపాఠి ముందుండి నడిపించాడు. మరో ఓపెనర్ రహానే (11), కెప్టెన్ స్మిత్ (9), మనోజ్ తివారి (8) విఫలమైనా... ఆ ప్రభావమేమీ పడకుండా జట్టు లక్ష్యం చేరిందంటే... అది త్రిపాఠి మెరుపుల వల్లే! ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన కూల్టర్‌నీల్ బౌలింగ్‌లో 3 ఫోర్లు, ఒక భారీ సిక్సర్‌తో 19 పరుగులు పిండుకున్నాడు. 23 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన త్రిపాఠి చూడచక్కని బౌండరీలు, చుక్కల్ని తలపించే సిక్సర్లతో అలరించాడు. దీంతో పుణే ఎలాంటి తడబాటు లేకుండా లక్ష్యాన్ని అధిగమించింది. స్టోక్స్ చేసింది 14 పరుగులే అయినా... కాసేపు త్రిపాఠికి అండగా నిలిచాడు. ధోని (5) విఫలం కాగా... కోల్‌కతా బౌలర్లలో వోక్స్ 3, ఉమేశ్ యాదవ్, సునీల్ నరైన్, కుల్దీప్ తలో వికెట్ తీశారు. తడబడిన నైట్‌రైడర్స్: అంతకుముందు తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టును పుణే పేసర్లు వణికించారు. ఓపెనర్ నరైన్ (0)ను ఉనాద్కట్ రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చగా, వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ జాక్సన్ (10) వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. ఇది మొదలు వరుస విరామాల్లో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో నైట్‌రైడర్స్ పరుగుల వేగం తగ్గింది. మనీశ్ చేసిన 37 (32 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్) పరుగులే ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్! గంభీర్ (19 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా సుందర్ బౌలింగ్‌లోనే నిష్క్రమించగా, యూసుఫ్ పఠాన్ (4) నిరాశ పరిచాడు. అతను ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోవడంతో కోల్‌కతా 55 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో గ్రాండ్‌హోమ్ (19 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), మనీశ్ పాండే (32 బంతుల్లో 37; 4 ఫోర్లు, 1 సిక్స్) ఐదో వికెట్‌కు 48 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో పాండే వరుసగా మూడు ఫోర్లు బాదగా, వరుసటి ఓవర్ వేసిన తాహిర్ బౌలింగ్‌లో గ్రాండ్‌హోమ్ రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. చివర్లో సూర్యకుమార్ యాదవ్ (16 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) బ్యాట్ ఝళిపించడంతో జట్టు స్కోరు 150 పరుగులు దాటింది. ఉనాద్కట్, సుందర్ చెరో 2 వికెట్లు తీశారు. -
కోహ్లి సెన్సేషనల్ క్యాచ్!
బెంగళూరు: ఐపీఎల్లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌తో ఆదివారం చినస్వామి మైదానంలో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లి పట్టిన క్యాచ్ హైలెట్ గా నిలిచింది. కోహ్లి పట్టిన సెన్సేషనల్ క్యాచ్ అభిమానులతో సహా పుణె ఆటగాళ్లను విస్మయానికి గురిచేసింది. ఊహించని రీతిలో బంతిని అందుకుని దూకుడుమీదున్న పుణె ఓపెనర్ రాహుల్ త్రిపాఠిని పెవిలియన్ దారి పట్టించాడు. 9వ ఓవర్ లో పవన్ నేగి బౌలింగ్ లో త్రిపాఠి కొట్టిన బంతిని ఎడమవైపుకు డైవ్ చేసి కోహ్లి ఒంటిచేత్తో క్యాచ్ పట్టాడు. బ్యాట్స్ మన్ అలా షాట్ కొట్టాడో లేదో ఆర్సీబీ కెప్టెన్ క్యాచ్ పట్టడం, వెంటనే బంతిని గాల్లోకి విసిరేయడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. కష్టసాధ్యమైన క్యాచ్ ను ఊహించనిరీతిలో పట్టడంతో త్రిపాఠి కొద్ది నిమిషాల పాటు విస్మయానికి గురయ్యాడు. ఆశ్చర్యంగా చూస్తూనే పెవిలియన్ కు చేరాడు. మ్యాచ్ ఓడినప్పటికీ తనదైన ఆటతీరుతో అభిమానులకు కోహ్లి వినోదం పంచాడు. ‘నేను పట్టిన అరుదైన క్యాచుల్లో ఇది కూడా ఒకటి. ట్రైనింగ్ లో నేను తీసుకున్న శిక్షణ ఇక్కడ ప్రతిఫలించింద’ని మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లి అన్నాడు.