Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ తొలి విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠి(48 బంతుల్లో 74 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించి ఎస్‌ఆర్‌హెచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఇవాళ(శుక్రవారం) ఈడెన్ గార్డెన్స్ వేదివగా కేకేఆర్‌తో ఎస్‌ఆర్‌హెచ్ తలపడనుంది.
అయితే ఇదే రాహుల్ త్రిపాఠి 2020 మెగావేలంలో కేకేఆర్ రూ.60 లక్షల కనీస ధరకే కొనుగోలు చేసింది. ఆ తర్వాత రెండేళ్ల పాటు కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక 2022లో మెగావేలానికి ముందు రాహుల్ త్రిపాఠిని వదిలేసింది. దీంతో వేలంలో ఎస్‌ఆర్‌హెచ్ రూ. 8.5 కోట్లు పెట్టి మరీ కొనుగోలు చేసింది. అయితే గత సీజన్‌లో రాహుల్ త్రిపాఠి అంతంత మాత్రంగానే ఆడాడు. అయితే తనపై నమ్మకముంచిన ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది.
తాజాగా తనను వద్దనుకున్న కేకేఆర్‌తో ఇవాళ రాహుల్ త్రిపాఠి మ్యాచ్ ఆడబోతున్నాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ను గెలిపించి ఫామ్ మీదున్న రాహుల్ త్రిపాఠి తన ప్రతీకారం తీర్చుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారంది. ఇక రాహుల్ త్రిపాఠి ఇప్పటివరకు ఐపీఎల్‌లో 79 మ్యాచ్‌లాడి 1906 పరుగులు చేశాడు. ఇందులో 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 93గా ఉంది. ఇక టీమిండియా తరపున 5 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడిన రాహుల్ త్రిపాఠి 97 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment