Eden Gardens
-
సంచలన విజయం.. ఐపీఎల్లో రాజస్తాన్ ఆల్‌టైమ్ రికార్డు
#KKRvRR: ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ పైచేయి సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై రెండు వికెట్ల తేడాతో గెలుపొంది ఊపిరి పీల్చుకుంది. ఓపెనర్ జోస్ బట్లర్ అజేయ శతకం(107) కారణంగా ఐపీఎల్-2024లో ఆరో విజయాన్ని అందుకుంది. సొంతమైదానం ఈడెన్ గార్డెన్స్‌లో మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన కేకేఆర్ తొలుత బ్యాటింగ్ చేసింది. సునిల్ నరైన్ విధ్వంసకర ఇన్నింగ్స్(56 బంతుల్లో 109) కారణంగా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 223 పరుగులు సాధించింది కేకేఆర్. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ చివరి బంతి వరకు పట్టుదలగా పోరాడింది. నిజానికి 14 ఓవర్ల తర్వాత రాజస్తాన్ స్కోరు 128/6. గెలవాలంటే చివరి ఆరు ఓవర్లలో 96 పరుగులు కావాలి.. రోవ్‌మన్ పావెల్‌తో కలిసి బట్లర్ ఈ క్లిష్టతర పరిస్థితి నుంచి రాజస్తాన్‌ను గట్టెక్కించాడు. An Impactful Innings 😍 🔝 class effort from a 🔝 player ft. Jos Buttler Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #KKRvRR | @rajasthanroyals pic.twitter.com/5vz2qLIC7Z — IndianPremierLeague (@IPL) April 16, 2024 గెలుపు సమీకరణం 1 బాల్.. 1 రన్ ఉన్న తరుణంలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ బట్లర్ ఏమాత్రం తడబడకుండా ఆవేశ్ ఖాన్ కలిసి సింగిల్ తీసి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఆద్యంతం ఆసక్తి కలిగించిన ఈ మ్యాచ్‌లో ఆఖరికి ఇలా రాజస్తాన్ విజయ దరహాసం చేయగా.. కేకేఆర్ నైరాశ్యంలో మునిగిపోయింది. ఇక ఈ అద్భుతమైన గెలుపుతో రాజస్తాన్ రాయల్స్ ఐపీఎల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. పదిహేడేళ్లుగా ఏ జట్టుకు సాధ్యం కాని ఓ అరుదైన ఘనత సాధించింది. రన్ ఛేజింగ్‌లో ఆరో వికెట్ పడిన తర్వాత అత్యధిక పరుగులు జోడించిన తొలి జట్టుగా ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. అదే విధంగా అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగానూ అవతరించింది. ఛేజింగ్‌లో ఆరో వికెట్ పడిన తర్వాత అత్యధిక పరుగులు జోడించిన జట్లు 1. రాజస్తాన్ రాయల్స్- కేకేఆర్ మీద- 103 రన్స్- 2024, కోల్‌కతా. 2. ఆర్సీబీ- గుజరాత్ లయన్స్ మీద- 91 రన్స్- 2016, బెంగళూరు 3. చెన్నై- ముంబై మీద- 85 రన్స్- 2018, వాంఖడే, ముంబై 4. చెన్నై- సన్‌రైజర్స్ మీద- 78 రన్స్- 2018, వాంఖడే 5. ఢిల్లీ- గుజరాత్ లయన్స్ మీద- 76- 2017, కాన్పూర్. Another Last Over Thriller 🤩 A Jos Buttler special guides @rajasthanroyals over the line and further extends their lead at the 🔝 🙌 🙌 Scorecard ▶️ https://t.co/13s3GZLlAZ #TATAIPL | #KKRvRR pic.twitter.com/d3FECR81X1 — IndianPremierLeague (@IPL) April 16, 2024 కేకేఆర్ వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు: ►టాస్: రాజస్తాన్.. బౌలింగ్ ►కేకేఆర్ స్కోరు: 223/6 (20) ►రాజస్తాన్ స్కోరు: 224/8 (20) ►ఫలితం: రెండు వికెట్ల తేడాతో కేకేఆర్‌పై రాజస్తాన్ గెలుపు. ఇవి కూడా చదవండి: #Pat Cummins: శెభాష్.. ఇది సరైన నిర్ణయం! కమిన్స్ అన్నతో అట్లుంటది మరి.. #T20WorldCup2024: రోహిత్‌తో ద్రవిడ్, అగార్కర్ చర్చలు.. హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024: బట్లర్ విరోచిత సెంచరీ.. కేకేఆర్‌పై రాజస్తాన్ సంచలన విజయం
IPL 2024 KKR vs RR Live Updates: బట్లర్ విరోచిత సెంచరీ.. కేకేఆర్‌పై రాజస్తాన్ సంచలన విజయం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 2 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. 224 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్తాన్ 8 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి చేధించింది. రాజస్తాన్ విజయంలో ఆ జట్టు స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ కీలక పాత్ర పోషించాడు. బట్లర్ విరోచిత సెంచరీతో చెలరేగాడు. 60 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 107 పరుగులతో ఆజేయంగా నిలిచి తన జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించాడు. ఈ సీజన్లో బట్లర్‌కు ఇది రెండో సెంచరీ కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో బట్లర్‌తో పాటు రియాన్ పరాగ్(34), పావెల్(26) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇక కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రానా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోర్ సాధించింది.కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ సునీల్ నరైన్(109) విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 109 బంతులు ఎదుర్కొన్న నరైన్.. 13 ఫోర్లు, 6 సిక్స్‌లతో 109 పరుగులు చేశాడు. అతడితో పాటు రఘువంశీ(30), రింకూ సింగ్(20) పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో అవేష్‌ఖాన్, కుల్దీప్ సేన్ తలా రెండు వికెట్లు సాధించగా.. చాహల్, బౌల్ట్ తలా వికెట్ పడగొట్టారు. ఏడో వికెట్ కోల్పోయిన రాజస్తాన్.. పావెల్ ఔట్ రావ్‌మెన్ పావెల్ రూపంలో రాజస్తాన్ ఏడో వికెట్ కోల్పోయింది. 17 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. క్రీజులో జోస్ బట్లర్(67) పరుగలుతో ఉన్నారు. రాజస్తాన్ విజయానికి 18 బంతుల్లో 46 పరుగులు కావాలి. వరుణ్ స్పిన్ మ్యాజిక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి దెబ్బకు రాజస్తాన్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. రాజస్తాన్ ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన చక్రవర్తి బౌలింగ్‌లో తొలుత అశ్విన్ ఔట్ కాగా.. ఆ తర్వాత హెట్‌మైర్ పెవిలియన్‌కు చేరాడు. 13 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ 6 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. క్రీజులో జోస్ బట్లర్(40), పావెల్(1) పరుగులతో ఉన్నారు. రాజస్తాన్ నాలుగో వికెట్ డౌన్.. జురెల్ ఔట్ రాజస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన ధ్రువ్ జురెల్.. సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ 4 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. క్రీజులో జోస్ బట్లర్(24), రవిచంద్రన్ అశ్విన్(0) పరుగులతో ఉన్నారు. రాజస్తాన్ మూడో వికెట్ డౌన్.. రియాన్ పరాగ్ రూపంలో రాజస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. 34 పరుగులు చేసిన పరాగ్.. హర్షిత్ రానా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి ధ్రువ్ జురెల్ వచ్చాడు. 8 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. క్రీజులో జోస్ బట్లర్(24) పరుగులతో ఉన్నారు. దంచి కొడుతున్న పరాగ్.. 7 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. క్రీజులో రియాన్ పరాగ్(23),జోస్ బట్లర్(23) పరుగులతో ఉన్నారు. రాజస్తాన్ రెండో వికెట్ డౌన్.. శాంసన్ ఔట్ 47 పరుగుల వద్ద రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన సంజూ శాంసన్.. హర్షిత్ రానా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి పరాగ్ వచ్చాడు. 5 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 53/2 రాజస్తాన్ తొలి వికెట్ డౌన్.. జైశ్వాల్ ఔట్ 224 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన యశస్వీ జైశ్వాల్.. వైభవ్ ఆరోరా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 3 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 36/1. క్రీజులో జోస్ బట్లర్(11), సంజూ శాంసన్(3) పరుగులతో ఉన్నారు. నరైన్ సూపర్ సెంచరీ.. రాజస్తాన్ టార్గెట్ 224 పరుగులు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ అదరగొట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోర్ సాధించింది.కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ సునీల్ నరైన్(109) విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 109 బంతులు ఎదుర్కొన్న నరైన్.. 13 ఫోర్లు, 6 సిక్స్‌లతో 109 పరుగులు చేశాడు. అతడితో పాటు రఘువంశీ(30), రింకూ సింగ్(20) పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో అవేష్‌ఖాన్, కుల్దీప్ సేన్ తలా రెండు వికెట్లు సాధించగా.. చాహల్, బౌల్ట్ తలా వికెట్ పడగొట్టారు. కేకేఆర్ ఐదో వికెట్ డౌన్..నరైన్ ఔట్ సునీల్ నరైన్ రూపంలో కేకేఆర్ ఐదో వికెట్ కోల్పోయింది. 109 పరుగులు చేసిన నరైన్.. బౌల్ట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 19 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 198/5 కేకేఆర్ నాలుగో వికెట్ డౌన్.. రస్సెల్ ఔట్ రస్సెల్ రూపంలో కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన రస్సెల్ అవేష్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. సునీల్ నరైన్ సెంచరీ సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. నరైన్‌కు ఇది తొలి ఐపీఎల్ సెంచరీ కావడం గమనార్హం. 16 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 184/3. క్రీజులో సునీల్ నరైన్(100), రస్సెల్(13) పరుగులతో ఉన్నారు. కేకేఆర్ మూడో వికెట్ డౌన్.. శ్రేయస్ అయ్యర్ ఔట్ 133 పరుగుల వద్ద కోల్‌కతా నైట్‌రైడర్స్ మూడో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. యజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రెండో వికెట్ డౌన్.. 106 పరుగుల వద్ద కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన రఘువంశీ.. కుల్దీప్ సేన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. 12 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి కేకేఆర్ 125 పరుగులు చేసింది. క్రీజులో సునీల్ నరైన్(70), శ్రేయస్ అయ్యర్(4) పరుగులతో ఉన్నారు. సునీల్ నరైన్ ఫిప్టీ.. 29 బంతుల్లోనే సునీల్ నరైన్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 29 బంతుల్లో నరైన్ తన అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. క్రీజులో సునీల్ నరైన్(51), రఘువంశీ(30) పరుగులతో ఉన్నారు 7 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 64/1 7 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. క్రీజులో సునీల్ నరైన్(24), రఘు వంశీ(21) ఉన్నారు. కేకేఆర్ తొలి వికెట్ డౌన్.. సాల్ట్ ఔట్ 21 పరుగుల వద్ద కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన ఫిల్ సాల్ట్.. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి రఘువంశీ వచ్చాడు. 3 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 20/0 3 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా నైట్‌రైడర్స్ వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. క్రీజులో సునీల్ నరైన్(6),ఫిల్ సాల్ట్(10) పరుగులతో ఉన్నారు. ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రెండు మార్పులతో బరిలోకి దిగగా.. కేకేఆర్ మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. ఆర్ఆర్ జట్టులోకి జోస్ బట్లర్, అశ్విన్ వచ్చారు. తుది జట్లు రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, కుల్దీప్ సేన్, యుజ్వేంద్ర చాహల్ కోల్‌కతా నైట్ రైడర్స్: ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా -
KKR Vs RR: ఐపీఎల్లో ఇవాళ మరో బిగ్ ఫైట్.. పరుగుల వరద ఖాయం..!
ఐపీఎల్ 2024 సీజన్లో ఇవాళ (ఏప్రిల్ 16) మరో బిగ్ ఫైట్ జరుగనుంది. పటిష్టమైన, పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న రాజస్థాన్, కేకేఆర్ జట్లు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కత్తులు దూసుకోనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటర్లకు అనుకూలించనుండటంతో నేటి మ్యాచ్‌లో బ్యాటర్లు చెలరేగే అవకాశం ఉందని అంచనా. ఈ సీజన్లో ఆరు మ్యాచ్‌లో ఐదింట గెలిచిన రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఐదింట నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన కేకేఆర్ రెండో స్థానంలో ఉంది. హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్లు గతంలో 27 సార్లు ఎదురెదురుపడగా కేకేఆర్ 14, రాయల్స్ 13 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ఈ రెండు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది. ఈడెన్ గార్డెన్స్ విషయానికొస్తే.. ఈ మైదానంలో రాయల్స్‌పై కేకేఆర్‌దే పైచేయిగా ఉంది. ఇక్కడ ఇరు జట్లు 9 మ్యాచ్‌ల్లో తలపడగా.. కేకేఆర్ 6, రాయల్స్ 3 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ప్రస్తుత సీజన్లో ఇరు జట్ల బలాబలాలపై లుక్కేస్తే.. రెండు జట్లు అన్ని విభాగాల్లో సమతూకంగా కనిపిస్తున్నాయి. ఇరు జట్లలో ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని అంచనా వేయడానికి వీల్లేదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అంత పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇరు జట్లు. కేకేఆర్ బ్యాటింగ్‌లో ఫిలిప్ సాల్ట్, సునీల్ నరైన్, రఘువంశీ, శ్రేయస్ అయ్యర్, రింకూ సింగ్, రసెల్ లాంటి విధ్వంసకర వీరులు ఉండగా.. రాయల్స్ బ్యాటింగ్ లైనప్‌లో యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, హెట్‌మైర్, రోవ్‌మన్ పావెల్ లాంటి మెరుపు వీరులు ఉన్నారు. బౌలింగ్ విభాగం విషయానికొస్తే.. కేకేఆర్‌లో స్టార్క్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా లాంటి స్టార్ పేసర్లు ఉండగా.. రాయల్స్‌లో ట్రెంట్ బౌల్ట్, చహల్, అశ్విన్ లాంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమతూకంగా ఉండటంతో నేటి మ్యాచ్‌లో పైచేయి ఎవరిదని చెప్పడం చాలా కష్టం. -
దక్షిణాఫ్రికాతో టీమిండియా పోరు.. ఈ మ్యాచ్‌పై మీ అంచనాలు ఏంటి?
వన్డే ప్రపంచకప్-2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా కోల్‌కతా వేదికగా అద్బుత ఫామ్‌లో ఉన్న దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఇప్పటివరకు టీమిండియా ఆడిన 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. సఫారీలు ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఆరింట గెలుపొందారు. ఈ క్రమంలో ఈ రెండు జట్ల మధ్య పోటీ మాత్రం అభిమానులకు మంచి మజా అందించనుంది. అయితే ఈ రెండు వరల్డ్ క్లాస్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌లో ఎవరు బాగా రాణిస్తారని మీరు భావిస్తున్నారు? Loading… -
దక్షిణాఫ్రికాతో రసవత్తరపోరు.. కోల్‌కతాకు చేరుకున్న టీమిండియా! వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో వరుస విజయాలతో దూసుకు పోతున్న టీమిండియా.. మరో రసవత్తరపోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు శుక్రవారం కోల్‌కతాకు చేరుకుంది. ఎయిర్పోర్ట్ వద్ద రోహిత్ సేనకు ఘన స్వాగతం లభించింది. బెంగాల్ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా శనివారం ప్రాక్టీస్ సెషన్ పాల్గోనుంది. కాగా ఇప్పటికే ఈ మెగా ఈవెంట్లో ఆడిన 7 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన భారత జట్టు.. సెమీఫైనల్లో అడుగుపెట్టింది. కాగా భారత్ తమ చివరి మ్యాచ్‌లో 302 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. 357 పరుగుల లక్ష్య ఛేదనలో లంక.. భారత బౌలర్ల ధాటికి కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఐదు వికెట్లతో చెలరేగగా.. మహ్మద్ సిరాజ్ 3వికెట్లతో సత్తాచాటాడు. చదవండి: ఐపీఎల్-2024 వేలానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడు? ఎక్కడంటే? VIDEO | Indian cricket team arrives in Kolkata ahead of their World Cup match against South Africa scheduled to be played at the Eden Gardens on Sunday, November 5. #ICCWorldCup #INDvsSA #ICCWorldCup2023 pic.twitter.com/5UItfivP2h — Press Trust of India (@PTI_News) November 3, 2023 -
ప్రపంచ కప్ టికెట్ల ధరలు వచ్చేశాయోచ్.. ఎలా ఉన్నాయంటే?
భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2023కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ ఖారారు చేయడంతో.. ఈ టోర్నీలో పాల్గొనే జట్లు తమ వ్యహాలను రచించడం మొదలుపెట్టేశాయి. ఈ మెగా టోర్నీ భారత్‌లోని పది వేదికల్లో అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 వరకు జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా ఆక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. భారత్ విషయానికి వస్తే... అక్టోబర్ 8న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో తలపడనుంది. అనంతరం క్రికెట్ అభిమానుల ఎంతో ఆతృతగా ఎదురు చూసే దాయాదుల పోరు అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో జరగనుంది. ప్రపంచ కప్ టికెట్ల ధరలు వచ్చేశాయోచ్.. ఇక ఈ మెగా ఈవెంట్‌కు అతిథ్యం ఇవ్వనున్న వేదికలలో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఒకటి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఐదు లీగ్ మ్యాచ్‌లతో పాటు సెమీఫైనల్-2 కూడా జరగనుంది. ఈ క్రమంలో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్ ధరలను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) వెల్లడించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా షెడ్యూల్ చేయబడిన అన్ని మ్యాచ్‌ల ధరలు రూ. 650 నుండి రూ. 3000 వరకు ఉంటాయి. బంగ్లాదేశ్ వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్ టిక్కెట్ ధరలు అప్పర్ టైర్స్ రూ.650. D మరియు H బ్లాక్‌లకు రూ.1000. B, C, K, L బ్లాక్‌లకు రూ.1500. ఇంగ్లండ్ vs పాకిస్తాన్ మ్యాచ్ టిక్కెట్ ధరలు అప్పర్ టైర్స్ రూ.800. డి, హెచ్ బ్లాక్‌లు రూ.1200 సి, కె, బ్లాక్‌లు రూ.2000 BL బ్లాక్‌లు రూ.2200 బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్ ధరలు అప్పర్ టైర్స్ రూ.800 డి, హెచ్ బ్లాక్‌లు రూ.1200 సి, కె, బ్లాక్‌లు రూ.2000 BL బ్లాక్‌లు రూ.2200 ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ టిక్కెట్ ధరలు అప్పర్ టైర్స్ రూ. 900. డి, హెచ్ బ్లాక్‌లు రూ.1500 సి, కె, బ్లాక్‌లు రూ.2500 BL బ్లాక్‌లు రూ.3000 సెమీ-ఫైనల్ మ్యాచ్‌ల టిక్కెట్ ధరలు అప్పర్ టైర్స్ రూ. 900. డి, హెచ్ బ్లాక్‌లు రూ.1500. సి, కె, బ్లాక్‌లు రూ.2500. BL బ్లాక్‌లు రూ.3000. చదవండి: TNPL 2023 DD Vs NRK: మరో 'రింకూ సింగ్'.. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో సంచలనం -
బర్త్‌డేకు ఒక్కరోజు ముందు.. ఓపెనర్‌గా డబుల్ సెంచరీ
వన్డేల్లో ఎంఎస్ ధోని అత్యధిక స్కోరు ఎంత అని అడిగితే టక్కున వచ్చే సమాధానం.. శ్రీలంకపై 183* పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్. అంతకముందు పాకిస్తాన్‌పై 148 పరుగుల ఇన్నింగ్స్ ఆడినప్పటికి అంతగా పేరు రాలేదు. కానీ 183 పరుగులు ఇన్నింగ్స్ మాత్రం ధోని కెరీర్లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచిందనడంలో సందేహం అవసరం లేదు. ఇక్కడి నుంచి ధోని కొట్టిన హెలికాప్టర్ షాట్లు బాగా ఫేమస్ అయ్యాయి. అయితే ధోని ఈ రెండు ఇన్నింగ్స్‌లను మిడిలార్డర్లో వచ్చి ఆడినవే. మరి ధోని ఓపెనర్‌గా డబుల్ సెంచరీ బాదాడన్న విషయం మీకు తెలుసా? అవును ఓపెనర్‌గా ధోని డబుల్ సెంచరీ బాదాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్లో కాదు.. దేశవాలీ క్రికెట్లో. తన పుట్టినరోజుకు ఒక్కరోజు ముందు ధోని ఈ అద్బుత ఇన్నింగ్స్‌ను ఆడడం ఇక్కడ మరో విశేషం. జూన్ 6, 2005లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా ధోని షామ్ బజార్ క్లబ్ తరపున 50 ఓవర్ల మ్యాచ్ ఆడాడు. పి-సేన్ టోర్నమెంట్లో భాగంగా జార్జ్ టెలిగ్రాఫ్‌తో షామ్ బజార్ క్లబ్ జట్టు తలపడింది. ఆ మ్యాచ్‌కు వచ్చిన అభిమానులను ధోని నిరాశపరచలేదు. ప్రత్యర్థి జట్టు బౌలర్లను చీల్చి చెండాడుతూ కేవలం 126 బంతుల్లోనే 207 పరుగులు బాదాడు. బ్యాట్‌కు చిల్లుపడిందా అన్నట్లుగా స్టేడియాన్ని సిక్సర్ల వర్షంతో మోతెక్కించాడు. ఆరోజు ధోని ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు ఉండడం విశేషం. ఈ విషయాన్ని టెలిగ్రాఫ్ పత్రిక మరుసటి రోజు పెద్ద హెడ్‌లైన్స్‌తో ప్రచురించింది. ఇప్పటికి ధోని డబుల్ సెంచరీకి 18 ఏళ్ల పూర్తయిన సందర్భం.. ఇవాళ ధోని బర్త్‌డే సందర్భంగా ఆ విషయాన్ని గుర్తుచేసుకుంటూ బెంగాల్ క్రికెట్ అసోసియేష్(CAB) పంచుకుంది. అయితే అంతర్జాతీయ క్రికెట్లో ధోని 2006లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో ఓపెనర్‌గా వచ్చి 106 బంతుల్లో 96 పరుగులు చేసి ఔటయ్యాడు. కేవలం నాలుగు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. వన్డే కెరీర్లో ఓపెనర్‌గా ధోనికిదే అత్యధిక స్కోరు. ఇక ధోనికి వన్డేల్లో డబుల్ సెంచరీ లేకపోయినప్పటికి.. టెస్టుల్లో ఆ ముచ్చటను తీర్చుకున్నాడు. 2012-13లో చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ధోని ఈ ఫీట్ సాధించాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 265 బంతులాడిన ధోని 224 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 24 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. On MS Dhoni's 42nd birthday, I found this report from 7th June 2005. It was about Dhoni hitting 207 off just 126 balls with 10 6s for Shyambazar Club against George Telegraph in the P Sen tournament at the Eden Gardens. pic.twitter.com/HbZNIHTD1o — Joy Bhattacharjya (@joybhattacharj) July 7, 2023 ఇక టీమిండియా కెప్టెన్‌గా ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఎంఎస్ ధోని ఇవాళ(జూలై 7న) 42వ పడిలోకి అడుగుపెట్టాడు. టీమిండియా క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా గుర్తింపు పొందిన ఎంఎస్ ధోని 2007లో టి20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్‌కప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ ఇలా మూడు టైటిల్స్ గెలిచిన ఏకైక భారత కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు.అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి మూడేళ్లు కావొస్తున్నా అతని క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 16వ సీజన్ చాలు ధోని క్రేజ్ ఏంటో చెప్పడానికి. ఇక ఐపీఎల్లో సీఎస్కేను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపి అక్కడా సక్సెస్ఫుల్ కెప్టెన్ అయ్యాడు.2004లో టీమిండియాలో కీపర్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా అరంగేట్రం చేసిన ధోని.. సుమారు 15 సంవత్సరాల పాటు అంతర్జాతీయ కెరీర్లో జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ధోని కెరీర్లో 90 టెస్టుల్లో 4876 పరుగులు, 350 వన్డేల్లో 10,773 పరుగులు, 98 టి20ల్లో 1617 పరుగులు చేశాడు. చదవండి: '30 లక్షలు సంపాదించి రాంచీలో ప్రశాంతంగా బతికేస్తా' ధోనికి వాళ్లంటే ఇష్టం! ‘ఏకైక’ క్రికెటర్‌గా ఎన్నెన్నో ఘనతలు! 42 ఆసక్తికర విషయాలు -
IPL 2023 PBKS Vs KKR: ఉత్కంఠ పోరులో కేకేఆర్ విజయం
ఉత్కంఠ పోరులో కేకేఆర్ విజయం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో 5 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం సాధించింది. ఆఖరి బంతికి ఫోర్ కొట్టి రింకూ సింగ్ కేకేఆర్‌ను విజయతీరాలకు చేర్చాడు. 180 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేకేఆర్ బ్యాటర్లలో కెప్టెన్ నితీష్ రాణా 51 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రస్సెల్ (42), రింకూ సింగ్(21) పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో శిఖర్ ధావన్(57) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరిలో షారుక్ ఖాన్(8 బంతుల్లో 21 పరుగులు), హర్‌ప్రీత్ బ్రార్( 9 బంతుల్లో 17) పరుగులతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా రెండు, సుయాష్ శర్మ, నితీష్ రాణా తలా ఒక్క వికెట్ సాధించారు. నాలుగో వికెట్ డౌన్ 124 పరుగుల వద్ద కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. 51 పరుగులు చేసిన కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణా.. రాహుల్ చాహర్ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన కేకేఆర్ వెంకటేశ్ అయ్యర్ రూపంలో కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన అయ్యర్.. రాహుల్ చాహర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 116/3 11 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 92/2 11 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ రెండు వికెట్లు నష్టానికి 92 పరుగులు చేసింది. క్రీజులో నితీష్ రాణా(30), వెంకటేశ్ అయ్యర్(7) పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్ 64 పరుగులు వద్ద కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 38 పరుగులు చేసిన జాసన్ రాయ్.. హర్‌ప్రీత్ బార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి వెంకటేశ్ అయ్యర్ వచ్చాడు. తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్ 38 పరుగుల వద్ద కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన గుర్బాజ్.. నాథన్ ఎల్లీస్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 2 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 10/1 180 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 2 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. క్రీజులో రాయ్, గర్భాజ్ ఉన్నారు. అదరగొట్టిన పంజాబ్ బ్యాటర్లు.. కేకేఆర్ టార్గెట్ 180 పరుగులు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో శిఖర్ ధావన్(57) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరిలో షారుక్ ఖాన్(8 బంతుల్లో 21 పరుగులు), హర్‌ప్రీత్ బ్రార్( 9 బంతుల్లో 17) పరుగులతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా రెండు, సుయాష్ శర్మ, నితీష్ రాణా తలా ఒక్క వికెట్ సాధించారు. 17 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 139/6 17 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. క్రీజులో షారుక్ ఖాన్, సామ్ కర్రాన్ ఉన్నారు. 11 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 93/3 11 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. క్రీజులో శిఖర్ ధావన్(37), జితేష్ శర్మ(20) పరుగులతో ఉన్నారు. 8 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 70/3 8 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. క్రీజులో శిఖర్ ధావన్(31), జితేష్ శర్మ(4) పరుగులతో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్ లైమ్ లివింగ్ స్టోన్ రూపంలో పంజాబ్ కింగ్స్ మూడో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన లివింగ్ స్టోన్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. రెండో వికెట్ డౌన్ 29 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్‌లో రాజపాక్స డకౌటయ్యాడు. క్రీజులోకి లివింగ్ స్టోన్ వచ్చాడు. 4 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 32/2 తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన ప్రభ్సిమ్రాన్ సింగ్.. హర్షిత్ రాణా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. తొలుత బ్యాటింగ్ చేయనున్న పంజాబ్ ఐపీఎల్-2023లో భాగంగా ఈడెన్ గార్డన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది. షార్ట్ స్థానంలో రాజపాక్స తుది జట్టులోకి వచ్చాడు. కేకేఆర్ మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా ఆడనుంది. తుది జట్లు పంజాబ్ కింగ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ (కెప్టెన్), భానుక రాజపక్స, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సామ్ కర్రాన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్ కోల్‌కతా: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకు సింగ్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి -
కేకేఆర్ వద్దన్నోడిని ఎస్ఆర్హెచ్ హత్తుకుంది.. ప్రతీకారం తీర్చుకునేనా?
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ తొలి విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠి(48 బంతుల్లో 74 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించి ఎస్ఆర్హెచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఇవాళ(శుక్రవారం) ఈడెన్ గార్డెన్స్ వేదివగా కేకేఆర్‌తో ఎస్ఆర్హెచ్ తలపడనుంది. అయితే ఇదే రాహుల్ త్రిపాఠి 2020 మెగావేలంలో కేకేఆర్ రూ.60 లక్షల కనీస ధరకే కొనుగోలు చేసింది. ఆ తర్వాత రెండేళ్ల పాటు కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక 2022లో మెగావేలానికి ముందు రాహుల్ త్రిపాఠిని వదిలేసింది. దీంతో వేలంలో ఎస్ఆర్హెచ్ రూ. 8.5 కోట్లు పెట్టి మరీ కొనుగోలు చేసింది. అయితే గత సీజన్లో రాహుల్ త్రిపాఠి అంతంత మాత్రంగానే ఆడాడు. అయితే తనపై నమ్మకముంచిన ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది. తాజాగా తనను వద్దనుకున్న కేకేఆర్‌తో ఇవాళ రాహుల్ త్రిపాఠి మ్యాచ్ ఆడబోతున్నాడు. ఎస్ఆర్హెచ్ను గెలిపించి ఫామ్ మీదున్న రాహుల్ త్రిపాఠి తన ప్రతీకారం తీర్చుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారంది. ఇక రాహుల్ త్రిపాఠి ఇప్పటివరకు ఐపీఎల్లో 79 మ్యాచ్‌లాడి 1906 పరుగులు చేశాడు. ఇందులో 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 93గా ఉంది. ఇక టీమిండియా తరపున 5 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడిన రాహుల్ త్రిపాఠి 97 పరుగులు చేశాడు. -
ODI WC 2023: బీసీసీఐ కీలక నిర్ణయం.. హైదరాబాద్ స్టేడియానికి మహర్దశ
ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. పుష్కర కాలం తర్వాత టీమిండియాలో జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ కావడంతో బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే టోర్నీ నిర్వహించేందుకు 12 స్టేడియాలను షార్ట్‌లిస్ట్ కూడా చేసింది. అహ్మదాబాద్ సహా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గువాహటి, కోల్‌కతా, లక్నో, ఇండోర్, రాజ్‌కోట్, హైదరాబాద్, ముంబైలు ఈ లిస్టులో ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని స్టేడియాలలో కనీస సౌకర్యాలు కూడా ఉండటం లేదని అభిమానులు ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో మంగళవారం బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో జరగబోయే ఈ మెగా టోర్నీకి ముందే దేశంలోని స్టేడియాలను పూర్తిగా కొత్త లుక్ లో కనిపించేలా చేసేలా కసరత్తులు చేస్తోంది.దీని కోసం రూ.500 కోట్ల ఖర్చుతో ఐదు స్టేడియాలను రెనోవేట్ చేయనుంది. ప్రపంచంలోనే అత్యంత ధనికవంతమైన క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి పేరున్నా దేశంలోని క్రికెట్ స్టేడియాలు మాత్రం దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. వరల్డ్ కప్ కూడా ఇలాంటి స్టేడియాలలో జరిగితే పోయేది బోర్డు పరువే. అందుకే భారీగా ఖర్చు చేసైనా సరే అర్జెంట్ స్టేడియాల రూపురేఖలు మార్చాలని బీసీసీఐ భావించింది. ఆ ఐదు స్టేడియాలకు నిధులు.. ఈసారి వరల్డ్ కప్ కోసం దేశవ్యాప్తంగా 12 వేదికలను ఎంపిక చేసిన బీసీసీఐ అందులో ఐదు స్టేడియాల రూపురేఖలు మార్చేందుకు నిధులు కేటాయించింది. ఢిల్లీతోపాటు హైదరాబాద్, కోల్‌కతా, మొహాలి, ముంబై స్టేడియాల్లో వసతులను మెరుగుపరచనున్నారు. హైదరాబాద్ రాజీవ్‌గాంధీ స్టేడియానికి రూ.117 కోట్లు వన్డే వరల్డ్‌కప్ వేదికల్లో ఈసారి హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియానికి బీసీసీఐ చోటు కల్పించింది. అయితే స్టేడియంలో వసతులు, సౌకర్యాలు మరి నాసిరకంగా ఉన్నాయని అభిమానుల నుంచి ఫిర్యాదులు అందాయి. తాజాగా ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో అభిమానుల నుంచి ఈ ఫిర్యాదులు మరింత ఎక్కువయ్యాయి. దీంతో బీసీసీఐ ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియానికి కొత్త రూపు తీసుకురావడానికి బడ్డెట్లో నిధులు కేటాయించింది. స్టేడియంలో వసతులు మెరుగుపరచడానికి రూ.117.17 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. సీటింగ్ సౌకర్యంతో పాటు ఇతర సౌకర్యాలను మెరుగుపరచనున్నారు. ఇక హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ స్టేడియానికి రూ.100 కోట్లు, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ కోసం రూ.127.47 కోట్లు, మొహాలీలోని పీసీఏ స్టేడియానికి రూ.79.46 కోట్లు, వాంఖడే కోసం రూ.78.82 కోట్లు ఖర్చు కానుంది. ఒకవేళ ఈ స్టేడియాల్లో రూఫ్ పనులు కూడా చేస్తే ఈ ఖర్చు మరింత పెరగనుంది. 2011 వరల్డ్ కప్ ఫైనల్ కు వేదికైన ముంబైలోని వాంఖెడే స్టేడియంలో కనీస వసతులు లేవని ఓ అభిమాని ఫిర్యాదు చేయడంతో ఈ మధ్యే ఇండియా, ఆస్ట్రేలియా వన్డేకు ముందు ఆ స్టేడియాన్ని రెనోవేట్ చేశారు. వరల్డ్ కప్ లో భాగంగా మొత్తం 48 మ్యాచ్ లు జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యమిచ్చే అవకాశం ఉందని బీసీసీఐ తెలిపింది. ఇక 2011లో భారత్‌లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ను ధోని సేన ఎగరేసుకుపోయింది. ఫైనల్లో శ్రీలంకను ఓడించి 28 సంవత్సరాల నిరీక్షణకు తెరదించి రెండోసారి వన్డే ప్రపంచకప్ విజేతగా ఆవిర్భవించింది. చదవండి: నాన్ స్ట్రయికర్ ముందుగా క్రీజ్ వదిలితే 6 పరుగులు పెనాల్టి..! -
శార్దుల్ ధనాధన్...కేకేఆర్ ఘన విజయం
కోల్‌కతా: సొంతగడ్డపై కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) సమష్టి ప్రదర్శనతో గర్జించింది. ఐపీఎల్ టోర్నీలో తొలి విజయం నమోదు చేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుతో ఈడెన్ గార్డెన్స్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 81 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 204 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శార్దుల్ ఠాకూర్ (29 బంతుల్లో 68; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. గుర్బాజ్ (44 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), రింకూ సింగ్ (33 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా దూకుడుగా ఆడారు. ఈ ముగ్గురి బ్యాటింగ్ కారణంగా కోల్‌కతా స్కోరు 200 పరుగులు దాటింది. బెంగళూరు బౌలర్లలో డేవిడ్ విల్లీ, కరణ్ శర్మ రెండు వికెట్ల చొప్పున తీశారు. అనంతరం 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 17.4 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. వరుణ్ చక్రవర్తి (4/15), సునీల్ నరైన్ (2/16), తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ సుయశ్ శర్మ (3/30) తమ స్పిన్ మాయాజాలంతో బెంగళూరు జట్టును దెబ్బతీశారు. ఆ ఇద్దరి దూకుడుతో... తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతాకు శుభారంభం లభించలేదు. డేవిడ్ విల్లీ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో వరుస బంతుల్లో వెంకటేశ్ అయ్యర్, మన్దీప్ బౌల్డ్ అయ్యారు. ఒకవైపు గుర్బాజ్ జోరు కొనసాగించడంతో కోల్‌కతా పవర్‌ప్లేలో రెండు వికెట్లకు 47 పరుగులు చేసింది. ఏడో ఓవర్ తొలి బంతికి కోల్‌కతా కెపె్టన్ నితీశ్ రాణా అవుటయ్యాడు. ఆ తర్వాత రింకూ సింగ్‌తో జత కలిసి గుర్బాజ్ కోల్‌కతా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 11 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా 87/3తో నిలిచింది. కరణ్ శర్మ వేసిన 12వ ఓవర్లో కోల్‌కతాకు దెబ్బ పడింది. వరుస బంతుల్లో గుర్బాజ్, రసెల్ పెవిలియన్ చేరడంతో కోల్‌కతా 89/5తో ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చి న శార్దుల్ ఠాకూర్ చెలరేగిపోయాడు. బెంగళూరు బౌలర్లపై ఫోర్లు, సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. 20 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రింకూ, శార్దుల్ 102 పరుగుల భాగస్వామ్యానికి 19వ ఓవర్ చివరి బంతికి హర్షల్ పటేల్ తెరదించాడు. ఆఖరి ఓవర్లో శార్దుల్‌ను సిరాజ్ అవుట్ చేయగా... చివరి రెండు బంతుల్లో ఉమేశ్ ఆరు పరుగులు స్కోరు చేయడంతో కోల్‌కతా స్కోరు 200 పరుగులు దాటింది. తడబాటు... భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు ఓపెనర్లు కోహ్లి (18 బంతుల్లో 21; 3 ఫోర్లు), డు ప్లెసిస్ (12 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) శుభారంభం ఇచ్చారు. అయితే ఐదో ఓవర్లో నరైన్ బౌలింగ్‌లో కోహ్లి, ఆరో ఓవర్లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో డు ప్లెసిస్ బౌల్డయ్యారు. దాంతో బెంగళూరు ఇన్నింగ్స్ తడబడింది. హిట్టర్లు బ్రేస్‌వెల్, మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్ క్రీజులో నిలదొక్కుకోవడంలో విఫలమయ్యారు. తక్కువ స్కోర్లకే పెవిలియన్ బాట పట్టడంతో బెంగళూరు ఓటమి ఖాయమైంది. కోల్‌కతా జట్టులో వెంకటేశ్ అయ్యర్ స్థానంలో ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగిన లెగ్ స్పిన్నర్, 19 ఏళ్ల సుయశ్ శర్మ మూడు వికెట్లతో ప్రభావం చూపించాడు. మరోవైపు బెంగళూరు ఇన్నింగ్స్‌లో సిరాజ్ స్థానంలో ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగిన అనూజ్ రావత్ కేవలం ఒక పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఐపీఎల్లో నేడు లక్నోVs హైదరాబాద్ (రాత్రి గం. 7:30 నుంచి ) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: రహా్మనుల్లా గుర్బాజ్ (సి) ఆకాశ్‌దీప్ (బి) కరణ్ శర్మ 57; వెంకటేశ్ అయ్యర్ (బి) విల్లీ 3; మన్దీప్ సింగ్ (బి) విల్లీ 0; నితీశ్ రాణా (సి) దినేశ్ కార్తీక్ (బి) బ్రేస్‌వెల్ 1; రింకూ సింగ్ (సి) దినేశ్ కార్తీక్ (బి) హర్షల్ పటేల్ 46; రసెల్ (సి) కోహ్లి (బి) కరణ్ శర్మ 0; శార్దుల్ ఠాకూర్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) సిరాజ్ 68; నరైన్ (నాటౌట్) 0; ఉమేశ్ యాదవ్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 204. వికెట్ల పతనం: 1–26, 2–26, 3–47, 4–89, 5–89, 6–192, 7–198. బౌలింగ్: సిరాజ్ 4–0–44–1, డేవిడ్ విల్లీ 4–1–16–2, ఆకాశ్‌దీప్ 2–0–30–0, బ్రేస్‌వెల్ 3–0–34–1, షహబాజ్ అహ్మద్ 1–0–6–0, కరణ్ శర్మ 3–0–26–2, హర్షల్ పటేల్ 3–0–38–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (బి) నరైన్ 21; డు ప్లెసిస్ (బి) వరుణ్ చక్రవర్తి 23; బ్రేస్‌వెల్ (సి) నితీశ్ రాణా (బి) శార్దుల్ ఠాకూర్ 19, మ్యాక్స్‌వెల్ (బి) వరుణ్ చక్రవర్తి 5; హర్షల్ పటేల్ (బి) వరుణ్ చక్రవర్తి 0; షహబాజ్ అహ్మద్ (సి) శార్దుల్ (బి) నరైన్ 1; దినేశ్ కార్తీక్ (సి) వరుణ్ (బి) సుయశ్ శర్మ 9; అనూజ్ రావత్ (సి) నరైన్ (బి) సుయశ్ శర్మ 1; విల్లీ (నాటౌట్) 20, కరణ్ శర్మ (సి) నితీశ్ రాణా (బి) సుయశ్ శర్మ 1, ఆకాశ్‌దీప్ (సి అండ్ బి) వరుణ్ చక్రవర్తి 17; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (17.4 ఓవర్లలో ఆలౌట్) 123. వికెట్ల పతనం: 1–44, 2–46, 3–54, 4–54, 5–61, 6–61, 7–84, 8–86, 9–96, 10–123. బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 2–0–17–0, టిమ్ సౌతీ 2–0–25–0, సునీల్ నరైన్ 4–0–16–2, వరుణ్ చక్రవర్తి 3.4–0–15–4, సుయశ్ శర్మ 4–0–30–3, శార్దుల్ ఠాకూర్ 2–0–15–1. -
ఈడెన్ గార్డెన్స్ స్టాండ్‌కు ఝులన్ గోస్వామి పేరు!
భారత సీనియర్ పేసర్ ఝులన్ గోస్వామి అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్ మహిళలతో జరిగిన మూడో వన్డేలో తన అఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. కాగా భారత జట్టు ఇంగ్లండ్ మూడు వన్డేల సిరీస్‌కు క్లీన్ స్వీప్ చేసి జూలన్కు ఘనమైన విడ్కోలు ఇచ్చారు. తన అఖరి మ్యాచ్‌లో గో స్వామి రెండు వికెట్లు పడగొట్టింది. దీంతో 355 వికెట్లతో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ఝులన్ తన కెరీర్‌ను ముగించింది. కాగా పశ్చిమబెంగాల్‌కు చెందిన జులన్ 2002లో ఇంగ్లండ్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేయగా.. ఇప్పడు అదే ఇంగ్లీష్ జట్టుపై తన కెరీర్‌ను ముగించడం గమానార్హం. ఇక ఇది ఇలా ఉండగా.. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఒక స్టాండ్‌కు ఝులన్ పేరును పెట్టి ఆమెను గౌరవించాలని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ యోచిస్తోంది. "మేము ఈడెన్ గార్డెన్స్‌లో ఒక స్టాండ్‌కు ఝులన్ గోస్వామి పేరు పెట్టాలని ప్లాన్ చేస్తున్నాము. ఆమె ఒక లెజెండరీ క్రికెటర్. కాబట్టి దిగ్గజ క్రికెటర్లతో పాటుగా ఆమె కూడా పేరు చిరస్మరణీయంగా నిలిచిపోయేలా ఉండాలి అనుకుంటున్నాము. అదే విధంగా ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించాలని భావిస్తున్నాము" అని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో పేర్కొన్నారు. చదవండి: Jhulan Goswami: ఒక శకం ముగిసింది.. బాల్‌గర్ల్ నుంచి స్టార్ క్రికెటర్ దాకా -
చెమటోడుస్తున్న యువీ.. ఇదంతా ఆ మ్యాచ్ కోసమేనా?
టీమిండియా మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ నెట్స్‌లో త్రీవంగా చెమటోడుస్తున్నాడు. యువీ బ్యాటింగ్‌లో శ్రమిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి యువరాజ్ ఇంతకు దేనికోసం ఇంత ప్రాక్టీస్ చేస్తున్నట్లు.. అనే డౌట్ వచ్చిందా. అక్కడికే వస్తున్నాం.భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా బీసీసీఐ ఒక స్పెషల్ మ్యాచ్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇండియా మహారాజాస్ వర్సెస్ వరల్డ్ జెయింట్స్ మధ్య సెప్టెంబర్ 16న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ జట్టుకు గంగూలీ నాయకత్వం వహించనున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్, హర్బజన్ సింగ్, మహ్మద్ కైఫ్, ఇర్ఫాన్ పఠాన్, అజయ్ జడేజా, యూసఫ్ పఠాన్ సహా మరికొంత మంది ఆటగాళ్లు ఈ జట్టులో ఉన్నారు. అయితే, యువీ పేరు ఇటీవల ప్రకటించిన జట్టులో లేనప్పటికీ ఈ మేరకు ఈ మాజీ డాషింగ్ ఆల్కరౌండర్ నెట్స్‌లో శ్రమించడం విశేషం. దీంతో ఆఖరి నిమిషంలోనైనా యువీ ఎంట్రీ ఇవ్వనున్నాడా అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. వరల్డ్ జెయింట్స్‌కు ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ఇయాన్ మోర్గాన్ నాయకత్వం వహించనున్నాడు. కాగా యువరాజ్ ప్రాక్టీస్‌కు ముందు ఒక అభిమాని.. ''మీ కార్లో క్రికెట్ కిట్ ఏం చేస్తోంది'' అని అడిగాడు. యువీ స్పందిస్తూ.. నాకు కొంచెం ప్రాక్టీస్ అవసరం. ఏదైనా మ్యాచ్‌లో బరిలోకి దిగడానికి ప్రాక్టీస్ చేయడం అవసరం. పేర్కొన్నాడు. ఆ తర్వాత యువరాజ్ తన కిట్ ఓపెన్ చేసి తన ప్యాడ్లను చూపిస్తూ ''వారియర్ ఈజ్ బ్యాక్''.. రానున్న జరగబోయే మ్యాచ్‌కోసం నేను మంచి ఉత్సాహంతో ఉన్నా.. నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం వెళ్తున్నా అంటూ తెలిపాడు. ఇక ప్రాక్టీస్ ముగిసిన అనంతరం.. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసి బాగా అలసిపోయా.. కొద్దిసేపు నాకు ఊపిరి తీసుకోవడం కష్టమయింది. ఆల్ ది బెస్ట్.. ఇండియన్ మహరాజాస్ అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇక యువరాజ్ టీమిండియా తరపున గ్రేటెస్ట్ ఆల్రౌండర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. 19 ఏళ్ల పాటు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన యువరాజ్ 2007, 2011 ప్రపంచకప్‌లు గెలవడంలో కీలకపాత్ర పోషించారు. అంతేకాదు 2007 టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి యువరాజ్ చరిత్ర సృష్టించాడు. కాగా జూన్ 10, 2019లో యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 19 ఏళ్ల కెరీర్లో యువరాజ్ టీమిండియా తరపున 40 టెస్టుల్లో 3 సెంచరీలు.. 11 అర్థసెంచరీల సాయంతో 1900 పరుగులు.. 10 వికెట్లు తీశాడు. ఇక 304 వన్డేల్లో 14 సెంచరీలు.. 52 హాఫ్‌సెంచరీలతో కలిపి 8701 పరుగులతో పాటు 111 వికెట్లు పడగొట్టాడు. ఇక 58 టి20ల్లో 8 అర్థసెంచరీల సాయంతో 1177 పరుగులు చేశాడు. Didn’t do too bad, did I? 🤪 Super excited for what’s coming up! pic.twitter.com/MztAU5nyZJ — Yuvraj Singh (@YUVSTRONG12) August 16, 2022 Are you as excited about the special India@75 match between India @IndMaharajasLLC and World @WorldGiantsLLC? Announcing the full squads of #Legends in the next tweet! #LegendsLeagueCricket #AzadiKaAmritMahotsav@Souravganguly @Eoin16 @AmritMahotsav @cabcricket @DasSanjay1812 pic.twitter.com/oUZZQaOUFv — Legends League Cricket (@llct20) August 12, 2022 ఇండియా మహరాజాస్: సౌరవ్ గంగూలీ (కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్, యూసుఫ్ పఠాన్, ఎస్ బద్రీనాథ్, ఇర్ఫాన్ పఠాన్, పార్థివ్ పటేల్, స్టువర్ట్ బిన్నీ, ఎస్ శ్రీశాంత్, హర్భజన్ సింగ్, నమన్ ఓజా, అశోక్ దిండా, ప్రజ్ఞాన్ ఓజా, అజయ్ సింగ్ జడేజా,ఆర్ పీ సింగ్ , జోగిందర్ శర్మ వరల్డ్ జెయింట్స్: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), లెండిల్ సిమన్స్, హెర్షెల్ గిబ్స్, జాక్వెస్ కల్లిస్, సనత్ జయసూర్య, మాట్ ప్రియర్, నాథన్ మెకల్లమ్, జాంటీ రోడ్స్, ముత్తయ్య మురళీధరన్, డేల్ స్టెయిన్, హామిల్టన్ మసకద్జా, మష్రాఫ్ మోర్టాజా, అస్గ్హర్ మోర్టాజా, అస్గ్హర్ట్జాన్ అఫ్ట్సన్, , కెవిన్ ఓ'బ్రియన్, దినేష్ రామ్‌దిన్ చదవండి: ఇండియా మహరాజాస్ కెప్టెన్‌గా గంగూలీ.. పోటీకి సన్నద్ధం! LLC 2022: ఇండియా మహరాజాస్‌తో మ్యాచ్.. సనత్ జయసూర్య అవుట్! షేన్ వాట్సన్ ఇన్ -
Sourav Ganguly: ఇండియా మహరాజాస్ కెప్టెన్‌గా దాదా.. పోటీకి సై!
Sourav Ganguly- September 15th in Legends League Cricket Match: లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022 తాజా సీజన్ ఓ ప్రత్యేక మ్యాచ్‌తో ఆరంభం కానుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (భారత్ 75 ఏళ్ల స్వాతంత్య్ర ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమం)లో భాగంగా ఇండియా మహరాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య మ్యాచ్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్‌లో సెప్టెంబరు 15న జరిగే ఈ మ్యాచ్‌లో సుమారు 10 దేశాలకు చెందిన ఆటగాళ్లు భాగం కానున్నారు. కాగా టీమిండియా మాజీ సారథి, భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ మ్యాచ్‌లో ఆడనున్నాడనే సంగతి తెలిసిందే. అయితే, ఫండ్ రైజింగ్ మ్యాచ్‌లో ఇండియా మహరాజాస్‌కు దాదా కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు నిర్వాహకులు తాజాగా వెల్లడించారు. ఇక వరల్డ్ జెయింట్స్‌కు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సారథ్యం వహించనున్నాడు. దాదా జట్టులో వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్, యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ సహా మొత్తం 17 మంది ఆటగాళ్లు ఉన్నారు. ఇక వరల్డ్ జెయింట్స్‌లో వెస్టిండీస్ దిగ్గజం లెండిల్ సిమన్స్, ప్రొటిస్ మాజీ ప్లేయర్ హర్షల్ గిబ్స్, శ్రీలంక లెజెండ్ సనత్ జయసూర్య వంటి 17 మంది మాజీ క్రికెటర్లకు చోటు దక్కింది. ఇండియా మహరాజాస్ జట్టు: సౌరవ్ గంగూలీ(కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్,యూసఫ్ పఠాన్, సుబ్రహ్మణ్యం బద్రీనాథ్, ఇర్ఫాన్ పఠాన్, పార్థివ్ పటేల్(వికెట్ కీపర్), స్టువర్ట్ బిన్నీ, ఎస్ శ్రీశాంత్, హర్భజన్ సింగ్, నమన్ ఓజా(వికెట్ కీపర్), అక్షశ్ దిండా, ప్రజ్ఞాన్ ఓజా, అజయ్ జడేజా, ఆర్పీ సింగ్, జోగీందర్ శర్మ, రితేందర్ సింగ్ సోధి. వరల్డ్ జెయింట్స్ జట్టు: ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), లెండిల్ సిమన్స్, హర్షల్ గిబ్స్, జాక్వస్ కలిస్, సనత్ జయసూర్య, మాట్ ప్రియర్(వికెట్ కీపర్), నాథన్ మెకల్లమ్, జాంటీ రోడ్స్, ముత్తయ్య మురళీధరన్, డేల్ స్టెయిన్, హోమిల్టన్ మసకజ్ద, మష్రాఫ్ మోర్తజా, అస్గర్ అఫ్గన్, మిచెల్ జాన్సన్, బ్రెట్ లీ, కెవిన్ ఒ బ్రెయిన్, దినేశ్ రామ్‌దిన్(వికెట్ కీపర్). 6 పట్టణాల్లో 22 రోజులు.. 15 మ్యాచ్‌లు ఇండియా మహరాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య మ్యాచ్ తర్వాత సెప్టెంబరు 17 నుంచి అసలు పోటీ ఆరంభం కానుంది. లెజెండ్స్ లీగ్ క్రికెట్ సీజన్-2లో టైటిల్ కోసం నాలుగు జట్లు తలపడబోతున్నాయి. ఈ సీజన్లో మొత్తం 15 మ్యాచ్‌లు ఉంటాయి. ఆరు పట్టణాల్లో 22 రోజుల పాటు అక్టోబరు 8 వరకు లీగ్ సాగనుంది. జట్ల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. ఇక భారత 75వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఈ ఎడిషన్‌ను అంకితమిస్తున్నట్లు లీగ్ కమిషనర్ రవిశాస్త్రి తెలిపాడు.కాగా మొదటి సీజన్‌ను వరల్డ్ జెయింట్స్ గెలిచిన విషయం తెలిసిందే. చదవండి: Asia Cup 2022: టీమిండియాతో తొలి మ్యాచ్.. పాకిస్తాన్‌కు భారీ షాక్! ఇక కష్టమే! View this post on Instagram A post shared by Legends League Cricket (@llct20) -
IND Vs WI: టీ20 సిరీస్‌కు ముందు అభిమానులకు బ్యాడ్‌న్యూస్..
IND VS WI T20 Series: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య కోల్‌కతా వేదికగా రేపటి(ఫిబ్రవరి 16) నుంచి ప్రారంభంకానున్నటీ20 సిరీస్‌కు ముందు భారత అభిమానులకు ఓ చేదు వార్త వినిపించింది. కరోనా కారణంగా రేపు జరగబోయే తొలి టీ20 మ్యాచ్‌కు ప్రేక్షకులను అనమతించేది లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. దేశంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కనీసం 50 శాతం ప్రేక్షకులనైనా అనుమతిస్తారని అభిమానులు భావించినప్పటికీ.. బీసీసీఐ అందుకు విముఖత వ్యక్తం చేసింది. దీంతో ఖాళీ స్టేడియంలోనే తొలి టీ20 మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. కనీసం ఇదే వేదికగా జరగబోయే రెండు, మూడు మ్యాచ్‌లకైనా ప్రేక్షకులను అనుమతించాలని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) కోరగా.. త్వరలోనే తుది నిర్ణయం వెల్లడిస్తామని బీసీసీఐ పేర్కొంది. ఐపీఎల్ ప్రారంభ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎలాంటి రిస్క్‌లు అవసరం లేదని భావిస్తున్న బీసీసీఐ.. అవకాశం ఉన్నా ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు నిర్వహించేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కాగా, అహ్మదాబాద్ వేదికగా విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అవేష్ ఖాన్, యజ్వేంద్ర చహల్, దీపక్ చాహర్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లి, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సిరాజ్, దీపక్ హుడా, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్, జయంత్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్. వెస్టిండీస్ జట్టు: కీరన్ పొలార్డ్ (కెప్టెన్), నికోలస్ పూరన్ (వైస్ కెప్టెన్), ఫాబియన్ అలెన్, డారెన్ బ్రావో, రోస్టన్ చేజ్, షెల్డన్ కాట్రెల్, డొమినిక్ డ్రేక్స్, జాసన్ హోల్డర్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, బ్రాండన్ కింగ్, రోవ్‌మన్ పావెల్ షెపర్డ్, ఓడియన్ స్మిత్, కైల్ మేయర్స్, హేడెన్ వాల్ష్ జూనియర్. చదవండి: Ind Vs Wi T20 Series: పంత్‌కు బంపర్ ఆఫర్.. వైస్ కెప్టెన్‌గా ఛాన్స్ -
'గుర్తుపెట్టుకోండి నా కూతురు పేరు'.. 2016 టి20 వరల్డ్‌కప్ హీరో
2016లో భారత గడ్డపై జరిగిన టి20 ప్రపంచకప్‌ను వెస్టిండీస్ గెలుచుకుంది. ఎవరు ఊహించని రీతిలో ఒకే ఒక్క ఓవర్లో ఆట మొత్తం మారిపోయింది. దానికి కారణం విండీస్ క్రికెటర్ కార్లోస్ బ్రాత్‌వైట్. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిచింది. బెన్‌స్టోక్స్ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్స్‌లు కొట్టి బ్రాత్‌వైట్ తన జట్టుకు టి20 ప్రపంచకప్ అందించాడు. అప్పటివరకు ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని బ్రాత్‌వైట్ పేరు మోర్మోగిపోయింది. ఆ మ్యాచ్‌లో బ్రాత్‌వైట్ 10 బంతుల్లో 4 సిక్సర్లు, ఒక ఫోర్ సాయంతో 34 పరుగులు చేశాడు. గుర్తుంచుకోండి నా పేరు కార్లోస్ బ్రాత్‌వైట్.. అని గర్వంగా చెప్పుకున్నాడు. అంతలా ఇంపాక్ట్ చూపించిన బ్రాత్‌వైట్ తమ దేశానికి ప్రపంచకప్ అందించిన భారత గడ్డపై ప్రత్యేక అభిమానాన్ని పెంచుకున్నాడు. ముఖ్యంగా ఈడెన్ గార్డెన్స్ అంటే తనకు చాలా ఇష్టమని పలు సందర్భాల్లో బ్రాత్‌వైట్ వివరించాడు. చదవండి:అదే ఆఖరు... 19 ఏళ్లకు పైగానే అయింది గెలిచి.. ఈసారి కూడా! తాజాగా ఈడెన్‌పై తనకున్న అభిమానానికి గుర్తుగా పుట్టిన బిడ్డకు 'ఈడెన్' వచ్చేలా పేరు పెట్టుకున్నాడు. ఫిబ్రవరి 6న కార్లోస్ బ్రాత్‌వైట్ దంపతులకు పండంటి ఆడబిడ్డ పుట్టింది. కాగా తన బిడ్డకు ఈడెన్ అని వచ్చేలా పేరు పెట్టినట్లు బ్రాత్‌వైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకొచ్చాడు. '' గుర్తుపెట్టుకోండి నా బిడ్డ పేరు.. ఈడెన్ రోస్ బ్రాత్‌వైట్. పుట్టిన తేదీ 2/6/22.ఈడెన్ గార్డెన్స్‌తో నాకు ప్రత్యేకమైన అనుబంధం. ఇక నా చిట్టితల్లికి ఒక మాట ఇస్తున్నా.. డాడీగా నిన్ను ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటా. థాంక్యూ జెస్సీపర్పుల్.. నా జీవితంలోకి నువ్వు రావడం అదృష్టం. కచ్చితంగా ఈడెన్ రోస్ బ్రాత్వైట్కు మంచి తల్లిగా ఉంటావని భావిస్తున్నా. అంటూ పోస్ట్ చేశాడు. ఇక కార్లోస్ బ్రాత్‌వైట్ ఒక్కడే కాదు.. ఇంతకముందు పలువురు విదేశీ క్రికెటర్లు తమ బిడ్డలకు భారతీయ పేరు వచ్చేలా పెట్టుకున్నారు. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ తన కూతురుకు ఇండియా జియాన్నే రోడ్స్ అని పేరు పెట్టాడు. భారతదేశం అన్ని మతాలతో కూడిన దేశం. ఇక్కడి ఆచారాలు, సంస్కృతి, వారసత్వం అంటే చాలా ఇష్టం. ప్రత్యేకమైన అభిమానంతోనే తన కూతురుకు ఇండియా జియన్నే పేరు పెట్టినట్లు రోడ్స్ గతంలో ఒక ఇంటర్య్వూలో పేర్కొన్నాడు. మరో దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ కూడా తన కూతురుకు ''తాజ్'' అని పేరు పెట్టాడు. ఇండియాలోని తాజ్‌మహల్ అంటే ఏబీకి చాలా ఇష్టం. ఇంకో విషయమేంటంటే.. ఏబీ తన గర్ల్‌ఫ్రెండ్.. ప్రస్తుత భార్యకు తాజ్‌మహల్ వేదికగానే లవ్‌ప్రపోజ్ చేశాడు. ఇక భారత్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉన్న ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు డేవిడ్ వార్నర్ తన చిన్న కూతురుకు ''ఇండీ'' అని పేరు పెట్టాడు. చదవండి: విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు.. సచిన్, ధోని సరసన..! -
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. భారత అభిమానులకు బ్యాడ్ న్యూస్!
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ముందు భారత అభిమానులకు బ్యాడ్ న్యూస్. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్‌తో మూడు టీ20 ల సిరీస్‌ను టీమిండియా ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌లను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోన్నట్లు సమాచారం. కాగా ఇటీవలే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇండోర్ అండ్ అవుట్డోర్ స్పోర్ట్స్ ఈవెంట్ల కోసం 75 శాతం ప్రేక్షకులను అనుమతి ఇస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో స్టేడియంకు వెళ్లి మ్యాచ్‌లను వీక్షించవచ్చు అని భావించిన ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. అయితే దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న కోవిడ్ తీవ్రత దృష్ట్యా బీసీసీఐ ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్దంగా లేనుట్లు తెలుస్తోంది. మేము ఎటువంటి రిస్క్ తీసుకోవడానికి సిద్దంగా లేము. అహ్మదాబాద్‌లో వన్డే మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండానే జరుగుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే టీ20లకు కూడా వర్తింపజేయాలి అని భావిస్తున్నాం అని బీసీసీఐ అధికారి టెలిగ్రాఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ ఫిబ్రవరి 16న జరగనుంది. మరో వైపు విండీస్‌తో తొలి వన్డే ముందు ముగ్గురు ఆటగాళ్లతో పాటు నాలుగురు సహాయక సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఇక విండీస్- భారత్ తొలి వన్డే అహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 6న జరగనుంది. చదవండి: 5 వికెట్లతో చెలరేగాడు.. జట్టును గెలిపించాడు -
మార్పులతో మూడో మ్యాచ్‌కు...
కోల్‌కతా: న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌ను వరుస విజయాలతో గెలుచుకున్న భారత జట్టు క్లీన్‌స్వీప్ లక్ష్యంగా నేడు ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగే చివరి మ్యాచ్ ఆడనుంది. వరల్డ్‌కప్‌లో కనీసం సెమీస్ కూడా చేరని నిరాశను కొంత వరకు తగ్గిస్తూ గత రెండు మ్యాచ్‌లలో చెలరేగిన భారత బృందం అదే జోరు కొనసాగిస్తే గెలుపు అసాధ్యం కాదు. మరోవైపు ప్రపంచకప్ రన్నరప్ న్యూజిలాండ్ మాత్రం పూర్తిగా తేలిపోయింది. కనీసం ఇక్కడైనా గెలిచి పరువు నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉంది. కోల్‌కతా పిచ్‌లో చక్కటి పేస్, బౌన్స్ ఉండటంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. అవేశ్ ఖాన్‌కు చాన్స్! ఈ సిరీస్ ద్వారా ఇద్దరు భారత ఆటగాళ్లు వెంకటేశ్ అయ్యర్, హర్షల్ పటేల్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టారు. మిగిలిన వారిలో ఒక్క పేసర్ అవేశ్ ఖాన్‌కు మాత్రమే ఇంకా అవకాశం దక్కలేదు. ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్ లేదా దీపక్ చహర్‌లలో ఒకరిని తప్పించి మధ్యప్రదేశ్‌కు చెందిన అవేశ్‌ను ఆడించవచ్చు. గత కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తూ ఐపీఎల్‌తో ఆకట్టుకున్న అవేశ్... భారత టెస్టు జట్టు రిజర్వ్ బౌలర్లలో ఒకడిగా ఇటీవల ఇంగ్లండ్ కూడా వెళ్లాడు. శ్రీలంక పర్యటనలో రెండు టి20లు ఆడిన రుతురాజ్ గైక్వాడ్‌ను కూడా సూర్యకుమార్ స్థానంలో బరిలోకి దించే అవకాశం ఉంది. అదే తరహాలో లెగ్‌స్పిన్నర్ యజువేంద్ర చహల్ కూడా తన చాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. టీమ్‌లోని ఇతర సభ్యులందరూ ఫామ్‌లో ఉన్నారు. మార్పుల్లేకుండానే... కివీస్ పరిస్థితి మాత్రం అంత గొప్పగా లేదు. రెండుసార్లు అద్భుత ఆరంభాలు లభించినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఓపెనర్లు అవుట్ కాగానే జట్టు కుప్పకూలిపోతోంది. ఐదుగురు రెగ్యులర్ బ్యాట్స్‌మెన్, ఆల్‌రౌండర్ నీషమ్‌తో బరిలోకి దిగుతున్నప్పటికీ న్యూజిలాండ్ భారీ స్కోరు చేయలేకపోతోంది. బౌలింగ్‌లో ఇద్దరు స్పిన్నర్లు సాన్‌ట్నర్, సోధి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. పేసర్ బౌల్ట్ కూడా నిరాశపరిచాడు. మొత్తంగా భారత్‌ను ఓడించి ఒక విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవా లంటే కివీస్ బృందం రెట్టింపు శ్రమించాల్సి ఉంది. -
ఇంగ్లండ్‌పై అక్షరాస్త్రం
ఇన్నాళ్లూ ‘పింక్ టెస్టు’లను సీమర్లు శాసించారు. ఇప్పటిదాకా డే–నైట్ టెస్టులను గెలిచిన జట్లన్నీ పేసర్ల బలంతో నెగ్గాయి. భారత గడ్డపై జరిగిన ఏకైక పింక్‌బాల్ టెస్టు (ఈడెన్ గార్డెన్స్)లో కూడా టీమిండియా పేస్ దళంతోనే గెలిచింది. కానీ తాజా ‘పింక్’ ఆట స్పిన్నర్ల చేతుల్లోకి వెళ్లింది. తొలి టెస్టులో భారీ తేడాతో జయభేరి మోగించిన పర్యాటక ఇంగ్లండ్ జట్టు మూడో టెస్టులో అక్షర్ పటేల్, అశ్విన్ స్పిన్‌కు తలవంచింది. దీంతో రెండు సెషన్లను కూడా పూర్తిగా ఆడలేకపోయింది. అయితే భారత్ కూడా స్పిన్ వలలో పడి కీలకమైన మూడు వికెట్లను కోల్పోయింది. అహ్మదాబాద్: డే–నైట్ టెస్టును తిప్పేసిన ఘనత కచ్చితంగా మన స్పిన్నర్లదే! ఫాస్ట్ బౌలర్లు చెలరేగే పింక్ బాల్ మ్యాచ్ ఇప్పుడు తిరగబడింది. స్పిన్నర్ల చేతుల్లోకి వచ్చేసింది. మొత్తానికి కొత్త స్టేడియంలో పాత ఆట సాగలేదు. ప్రధాన బౌలర్ కాకపోయినా... అక్షర్ పటేల్ (6/38) ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ పాలిట ప్రమాదకర బౌలరయ్యాడు. దీంతో బుధవారం మొదలైన మూడో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 50 ఓవర్లయినా ఆడలేకపోయింది. 48.4 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ జాక్ క్రాలీ (53; 10 ఫోర్లు) ఒక్కడే భారత్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. మరో స్పిన్నర్ అశ్విన్‌కు 3 వికెట్లు దక్కాయి. 100వ టెస్టు ఆడుతున్న ఇషాంత్‌కు ఒక వికెట్ లభించింది. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆట నిలిచే సమయానికి 33 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (82 బంతుల్లో 57 బ్యాటింగ్; 9 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ 2 వికెట్లు తీశాడు. తిప్పేసి... పడగొట్టేశాడు... వందో టెస్టు ఆడుతున్న ఇషాంత్ శర్మ ఇంగ్లండ్ పతనానికి బీజం వేశాడు. మూడో ఓవర్లోనే సిబ్లీ (0)ని డకౌట్ చేశాడు. స్లిప్‌లో ఉన్న రోహిత్ అతని క్యాచ్‌ను అందుకోగా.... జట్టు స్కోరు 27 పరుగుల వద్ద రెండో వికెట్ పడింది. బెయిర్‌స్టో (0)కూడా ఖాతా తెరవలేదు. ఈ వికెట్‌తోనే అక్షర్ పటేల్ ప్రతాపం మెల్లిగా మొదలైంది. ఓపెనర్ క్రాలే... కెప్టెన్ రూట్ (17) పోరాడేందుకు ప్రయతించాడు. కానీ తొలి సెషన్‌కు ముందే రూట్‌ను అశ్విన్, అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న క్రాలేని అక్షర్ ఔట్ చేశారు. 81/4 వద్ద ఇంగ్లండ్ విరామానికెళ్లింది. రెండో సెషన్ మొదలవగానే అశ్విన్, అక్షర్ చెరో వికెట్ పడగొట్టడంతో అదేస్కోరు (81/6) వద్ద ఇంకో రెండు వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత కూడా స్పిన్నర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో కేవలం 38 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లను ఇంగ్లండ్ కోల్పోయింది. రోహిత్ ఫిఫ్టీ తర్వాత భారత్ ఇన్నింగ్స్ మొదలైనా... స్పిన్‌కు టాప్ ఆర్డర్ కుదేలైంది. 15వ ఓవర్లో గిల్ (11)ను ఆర్చర్ ఔట్ చేస్తే, పుజారాను పరుగైనా చేయకముందే లీచ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కెప్టెన్ కోహ్లి అండతో ఓపెనర్ రోహిత్ శర్మ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇద్దరు మూడో వికెట్‌కు 64 పరుగులు జోడించాక కోహ్లిని చక్కని డెలివరీతో లీచ్ బోల్తా కొట్టించాడు. ► భారత్ తరఫున 100 టెస్టులు ఆడిన 11వ క్రికెటర్‌గా ఇషాంత్ శర్మ గుర్తింపు పొందాడు. కపిల్ దేవ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో పేస్ బౌలర్‌గా ఇషాంత్ నిలిచాడు. ► అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో జహీర్ ఖాన్ (597 వికెట్లు)ను ఐదో స్థానానికి నెట్టి అశ్విన్ (598 వికెట్లు) నాలుగో స్థానానికి ఎగబాకాడు. అనిల్ కుంబ్లే (953), హర్భజన్ సింగ్ (707), కపిల్ దేవ్ (687) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలే (ఎల్బీడబ్ల్యూ) (బి) అక్షర్ పటేల్ 53; సిబ్లీ (సి) రోహిత్ శర్మ (బి) ఇషాంత్ శర్మ 0; బెయిర్‌స్టో (ఎల్బీడబ్ల్యూ) (బి) అక్షర్ పటేల్ 0; రూట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 17; స్టోక్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 6; పోప్ (బి) అశ్విన్ 1; ఫోక్స్ (బి) అక్షర్ పటేల్ 12; ఆర్చర్ (బి) అక్షర్ పటేల్ 11; లీచ్ (సి) పుజారా (బి) అశ్విన్ 3; బ్రాడ్ (సి) బుమ్రా (బి) అక్షర్ పటేల్ 3; అండర్సన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (48.4 ఓవర్లలో ఆలౌట్) 112. వికెట్ల పతనం: 1–2, 2–27, 3–74, 4–80, 5–81, 6–81, 7–93, 8–98, 9–105, 10–112. బౌలింగ్: ఇషాంత్ శర్మ 5–1–26–1; బుమ్రా 6–3–19–0; అక్షర్ పటేల్ 21.4–6–38–6; అశ్విన్ 16–6–26–3. భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (బ్యాటింగ్) 57; గిల్ (సి) క్రాలే (బి) ఆర్చర్ 11; పుజారా (ఎల్బీడబ్ల్యూ) (బి) లీచ్ 0; కోహ్లి (బి) లీచ్ 27; రహానే (బ్యాటింగ్) 1; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (33 ఓవర్లలో మూడు వికెట్లకు) 99. వికెట్ల పతనం: 1–33, 2–34, 3–98. బౌలింగ్: అండర్సన్ 9–6–11–0; బ్రాడ్ 6–1–16–0; ఆర్చర్ 5–2–24–1; లీచ్ 10–1–27–2; స్టోక్స్ 3–0–19–0. -
క్యాబ్ హెడ్ క్వార్టర్స్ మూసివేత
కోల్‌కతా: నగరంలోని ఈడెన్ గార్డెన్ వేదికగా ఉన్న క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) హెడ్ క్వార్టర్ వారం రోజుల పాటు మూతబడనుంది. ఈడెన్ గార్డెన్‌లోని సిబ్బందిలో ఒకరికి కరోనా వైరస్ సోకడంతో క్యాబ్ ఆఫీస్‌ను ఆదివారం మూసేశారు. సుమారు వారం రోజుల పాటు క్యాబ్ హెడ్ క్వార్టర్‌కు తాళాలు వేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈడెన్ గార్డెన్లో కరోనా సోకిన వ్యక్తి తాత్కాలిక ఉద్యోగిగా తేలింది. సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో చందదాస్ అనే అతను తాత్కాలిక సర్వీస్‌పై పని చేయడానికి రాగా కరోనా బారిన పడినట్లు క్యాబ్ ప్రెసిడెంట్ అవిషేక్ దాల్మియా తెలిపారు. (‘గంగూలీ అంటే అసహ్యం పుట్టేది’) అతన్ని చార్నోక్ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అతనితో సాన్నిహిత్యంగా మెలిగిన వారిని సైతం కరోనా పరీక్షలు చేయిస్తున్నారు. ముందు వీరంతా హోమ్ క్వారంటైన్‌కు వెళ్లగా కరోనా టెస్టులు చేయనున్నారు. మొత్తం ఆఫీస్‌ను శానిటైజ్ చేయనున్నట్లు అవిషేక్ దాల్మియా తెలిపారు. పశ్చిమ బెంగాల్లో శనివారం రికార్డు స్థాయిలో 743 కేసులు నమోదు కాగా, కోల్‌కతాలో నగరంలో 242లో కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ దాదాపు ఏడువేల కేసులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నమోదయ్యాయి. (నీ బుగ్గలు ఇష్టం.. వాటిని పట్టుకోనా?) -
ఉంపన్: ‘పెద్ద నష్టమేమి జరగలేదు’
కోల్‌కతా: కరోనా వైరస్‌తో దేశమంతా అల్లాడిపోతున్న ఆపత్కాలంలో పులి మీద పుట్రలా ప్రళయ భీకర ఉంపన్ తుపాను పశ్చిమబెంగాల్‌ను అతలాకుతలం చేసింది. ఈ తుపాను దాటికి పదుల సంఖ్యలో ప్రాణాలు, వేల ఎకరాల్లో పంట నష్టం, భారీగా ఆస్థి నష్టం జరిగింది. అతి తీవ్ర తుపాను ఉంపన్ దాటికి మహానగరం కోల్‌కతా చిగురుటాకులా వణికిపోయింది. అయితే దేశంలోనే ప్రఖ్యాత మైదానంగా పేరుగాంచిన ఈడెన్ గార్డెన్స్ పరిస్థితిపై క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా ఈడెన్ గార్డెన్స్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. ‘ఉంపన్ తుపాన్ ఎలాంటి భీభత్సం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ భీకర తుపానుతో పిచ్, ఔట్ ఫీల్డ్ పూర్తిగా దెబ్బతినడం మినహా పెద్ద నష్టమేమి జరగలేదు. జరగకూడదనే కోరుకుంటున్నాం. వేగంగా వీచిన గాలులకు కొన్ని చోట్ల అద్దాలు పలిగాయి, కొన్ని బ్లాక్‌లు దెబ్బతిన్నాయి. పరిస్థితి చక్కబడ్డాక ఇంజనీర్ వచ్చి ఈడెన్ గార్డెన్స్ మైదానాన్ని పూర్తిగా పరిశీలించి మాకు రిపోర్టు అందిస్తారు. ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. భవిష్యత్‌లో ఎలాంటి తుపానుల వచ్చినా తట్టుకొనే విధంగా పలు నిర్మాణాలను చేపట్టాలనుకుంటున్నాం’ అంటూ అవిషేక్ దాల్మియా పేర్కొన్నాడు. ఉంపన్ తుపాను సృష్టించిన ప్రళయ భీభత్సం చదవండి: ఉంపన్ విపత్తు; కేంద్రంపై బెంగాల్ ఆగ్రహం ‘ఇక్కడ తప్పెవరిదో మీరే చెప్పండి’ -
'ఆ మ్యాచ్‌తోనే హర్భజన్‌కు ఫిదా అయ్యా'
భారత టెస్టు క్రికెట్లో 2001 సంవత్సరం మరిచిపోలేనిది. ఎందుకంటే ఆ సంవత్సరమే భారత టెస్టు క్రికెట్లో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. అప్పటికే 16 వరుస విజయాలతో క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న ఆస్ట్రేలియా జట్టును ఈడెన్‌గార్డెన్స్‌లో భారత్ ఓడించిన తీరు క్రికెట్ ప్రేమికులకు ఎప్పుడు గుర్తుండిపోతుంది. అయితే తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరోసారి ఆ మ్యాచ్ గురించి ప్రస్తావించాడు. ఆ మ్యాచ్‌లో వివిఎస్ లక్ష్మణ్ చారిత్రాత్మక ఇన్నింగ్స్‌తో పాటు ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బౌలింగ్‌ను అందరూ గుర్తు పెట్టుకునే ఉంటారు. కాగా, ఆ మ్యాచ్‌లో మేము గెలవడానికి బ్యాట్సమెన్ సహకారం ఎంత ఉందో బౌలర్ల కృషి కూడా అంతే ఉందని గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఆ మ్యాచ్‌కు సంబంధించి సౌరవ్ గంగూలీ కొన్ని విషయాలు ప్రస్తావిస్తూ..' ఈడెన్ టెస్టు మ్యాచ్‌లో నా సూచనలతో బౌలింగ్‌కు దిగి హర్భజన్ హ్యాట్రిక్‌తో మెరవడం, అదే మ్యాచ్‌లో మొత్తం 13 వికెట్లు పడగొట్టడం చకచకా జరిగిపోయాయి. ఆ మ్యాచ్ తర్వాత హర్భజన్ ప్రదర్శనను చూసి నేను అతని ఆటకు ఫిదా అయిపోయా. ఎందుకంటే అప్పటకే ఆస్ట్రేలియా 15 వరుస విజయాలు సాధించి అప్రతిహాతంగా దూసుకుపోతుంది. స్టీవా నేతృత్వంలో మా గడ్డపై అడుగుపెట్టిన ఆస్ట్రేలియా మొదటి టెస్టును గెలిచి 16వ విజయం తమ ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో ఈడెన్‌లో జరిగిన రెండో టెస్టులో చారిత్రాత్మక విజయంతో పాటు ఆ తర్వాత సిరీస్‌ను గెలుచుకోవడం జరిగింది. ఇక అక్కడి నుంచి హర్భజన్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అంతర్జాతీయ క్రికెట్లో 700 పైగా వికెట్లు సాధించి ఈ దశాబ్దపు అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. సమకాలీన భారత క్రికెట్లో అనిల్ కుంబ్లే, హర్భజన్లు మా జట్టులో ఉండడం మేం చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. ఈ ఇద్దరు కలిసి ఎన్నో టెస్టు మ్యాచ్‌లో భారత జట్టుకు అపూర్వమైన విజయాలు అందించారని' దాదా చెప్పుకొచ్చాడు.అయితే 2001లో కీలకమైన ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌కు దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లేతో పాటు ఫాస్ట్ బౌలర్ జగవల్ శ్రీనాథ్‌లు గాయంతో దూరమయ్యారని గంగూలీ పేర్కొన్నాడు. 'ఇదే సిరీస్‌లో నా కెప్టెన్సీలో హర్భజన్‌కు జోడిగా మూడు టెస్టుల్లో ముగ్గురు వేర్వేరు స్పిన్నర్లతో బరిలోకి దిగాము. మొదటి మ్యాచ్‌లో రాహుల్ సింగ్వీ, రెండో మ్యాచ్‌లో వెంకటపతి రాజు, మూడో మ్యాచ్‌లో నీలేశ్ కులకర్ణిలను ఆడించామని' గంగూలీ గుర్తు చేశాడు. అయితే కుంబ్లే లేని లోటును తెలియకుండా హర్భజన్ ఆ సిరీస్‌లో ఒక చాంపియన్లాగా బౌలింగ్ చేశాడని దాదా ప్రశంసించాడు. ఈడెన్ గార్డెన్లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 441 పరుగులు చేయగా, భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకు ఆలౌటైంది. అనంతరం పాలోఆన్ ఆడిన భారత జట్టు వివిఎస్ లక్ష్మణ్ చారిత్రాత్మక ఇన్నింగ్స్(281 పరుగులు), రాహుల్ ద్రావిడ్ అజేయ శతకంతో తమ రెండో ఇన్నింగ్స్‌లో 657 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను 212 పరుగులకు ఆలౌట్ చేసి 171 పరుగులతో మ్యాచ్‌ను గెలుచుకొని ఆపై సిరీస్‌ను సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లోనే మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ హ్యాట్రిక్‌తో మెరవడం, రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 13 వికెట్లు తీసుకున్నాడు. మొత్తం ఆ సిరీస్‌లో హర్భజన్ మూడు టెస్టుల్లో కలిపి 32 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. -
కోల్‌కతా టెస్టును గుర్తు చేసిన జార్ఖండ్
అగర్తలా : భారత టెస్టు క్రికెట్ తలరాతను మార్చింది 2001లో కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ కాగా, 85 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో అగర్తలా వేదికగా సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన మ్యాచ్ జార్ఖండ్-త్రిపుర జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో జార్ఖండ్ జట్టు సంచలనం సృష్టించింది. దేశవాళీ ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో ఫాలో ఆన్ ఆడి ప్రత్యర్థిని ఓడించిన తొలి జట్టుగా జార్ఖండ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు రంజీ ట్రోఫీలో ఫాలో ఆన్ ఆడి గెలిచిన జట్టు లేకపోవడం గమనార్హం. 153 పరుగుల వెనుకంజలో ఉండి ఫాలో ఆన్ ఆడిన జార్ఖండ్ ఎవ్వరూ ఊహించని రీతిలో పుంజుకొని 54 పరుగుల తేడాతో త్రిపురపై ఘన విజయం సాధించింది. (చదవండి: ‘ఔట్ కాదు.. నేను వెళ్లను’) ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన త్రిపుర తొలి ఇన్నింగ్స్‌లో 289 పరుగులకు ఆలౌటైంది. సారథి మిలింద్(59), హర్మీత్ సింగ్(56) ఫర్వాలేదనిపించారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన జార్ఖండ్.. త్రిపుర బౌలర్లు రానా(4/42), అభిజిత్ (3/43) ధాటికి 136 పరుగులకే ఆలౌటైంది. విరాట్ సింగ్(47) మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేదు. దీంతో 153 పరుగుల వెనుకంజలో ఉన్న జార్ఖండ్‌ను త్రిపుర సారథి మిలింద్ ఫాలో ఆన్ ఆడించాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌ను చేపట్టిన జార్ఖండ్‌కు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. త్రిపుర బౌలర్లు రాణించడంతో 138 పరుగులకే ఐదు ప్రధాన వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో సారథి సౌరబ్ తివారీ(122 బ్యాటింగ్), ఇషాంక్ జగ్గీ(107 బ్యాటింగ్) రాణించడంతో జార్ఖండ్ రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో జార్ఖండ్ జట్టుకు 255 పరుగుల ఆధిక్యం లభించింది. దీంతో 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన త్రిపుర అనూహ్యంగా 211 పరుగులకే కుప్పకూలింది. ఆశీష్ కుమార్(5/67), అజయ్ యాదవ్(2/31) చెలరేగడంతో త్రిపుర ప్రధాన బ్యాట్స్‌మన్ చేతులెత్తేశారు. అయితే మణిశంకర్(103) సెంచరీతో పరుగుల పరంగా ఓటమి అంతరాన్ని తగ్గించాడు కానీ త్రిపురను గట్టెక్కించలేకపోయాడు. 2001లో ప్రపంచ చాంపియన్‌గా హవా కొనసాగుతున్న ఆసీస్‌పై ఫాలో ఆన్ ఆడిన టీమిండియా అనూహ్యంగా ఘన విజయం సాధించింది. దీంతో టీమిండియా టెస్టు క్రికెట్ సమూలంగా మారిపోయింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా 274 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో ఉన్న ఆసీస్ టీమిండియాను ఫాలో ఆన్ ఆడించింది. రెండో ఇన్నింగ్స్‌లో వీవీఎస్ లక్ష్మణ్(281), రాహుల్ ద్రవిడ్(180) అద్వితీయమైన ఇన్నింగ్స్‌తో ఆసీస్ ముందు 384 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో 384 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ను హర్భజన్ సింగ్(6/73), సచిన్(3/31) బెంబేలెత్తించారు. దీంతో 212 పరుగులకే కంగారు జట్టు ఆలౌటైంది. దీంతో టీమిండియా 171 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తర్వాతనే మనం ఎవరినైనా ఓడించగలమనే విశ్వాసం భారత జట్టుకు, క్రికెటర్లకు ఏర్పడింది. -
పింక్‌బాల్.. అడిలైడ్ టూ కోల్‌కతా
ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం టీమిండియా- బంగ్లాదేశ్‌ల మధ్య జరిగే రెండో టెస్టుపైనే దృష్టిని కేంద్రీకరించింది.ఎందుకంటే ఈ మ్యాచ్‌లో టీమిండియా మొదటిసారి పింక్‌బాల్‌తో ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు అభిమానులతో పాటు ఇరుదేశాల క్రికెటర్లు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ 22న ప్రారంభం కానున్న డే- నైట్ టెస్టుకు కోల్‌కతాలోని ఈడెన్ గార్జెన్స్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే.పింక్ బాల్‌కు సంబంధించి మొదటి డై నైట్ టెస్టు మ్యాచ్ 2015లో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ మధ్య అడిలైడ్‌లో జరిగింది. దీంతో అడిలైడ్‌లో మొదలైన పింక్ బాల్ కథ ఇప్పుడు కోల్‌కతాకి చేరింది. అయితే ఇది ఇండియాలోకి అడుగుపెట్టడానికి మాత్రం నాలుగేళ్లు పట్టింది. అయితే ఐసీసీ 2015లోనే డై నైట్ టెస్టులకు అనుమతినిచ్చినా బీసీసీఐ, టీమిండియా వ్యతిరేకించడంతో ఉపఖండంలో పింక్ బాల్ కల నెరవేరలేదు. తాజాగా సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు కావడంతో మరోసారి డే నైట్ టెస్టు ప్రతిపాదన ముందుకు వచ్చింది. కాగా కోహ్లి- గంగూలీ కలిసిన మొదటి భేటీలోనే గంగూలీ డే నైట్ టెస్టును ప్రతిపాదించడం, కోహ్లి అందుకు ఒప్పుకోవడం చకచకా జరిగిపోయింది. అడిలైడ్ టు కోల్‌కతా ఇప్పటివరకు టెస్టు చరిత్రలో 11 డే నైట్ టెస్టులు జరగగా ఆస్ట్రేలియా అత్యధికంగా 5 డే నైట్ టెస్టులు ఆడింది. తర్వాతి స్థానాల్లో శ్రీలంక(3), వెస్టిండీస్(3), శ్రీలంక (3), ఇంగ్లండ్ (3), పాకిస్తాన్(2), దక్షిణాఫ్రికా ( 2), జింబాబ్వే(1)ఘాడాయి. తాజాగా ఇప్పుడు 12వ డే పైట్ టెస్టు టీమిండియా, బంగ్లాదేశ్‌ల మధ్య జరగనుంది. కాగా, 11 డే నైట్ టెస్టులు జరిగిన వేదికలను ఒకసారి చూస్తే.. అడిలైడ్ , దుబాయ్, అడిలైడ్ , బ్రిస్బేన్, బర్మింగ్ హమ్,దుబాయ్, అడిలైడ్, పోర్ట్ ఎలిజెబెత్(సెంట్ జార్జ్ పార్క్), ఆక్లాండ్, బ్రిడ్జ్‌టౌన్, బ్రిస్బేన్ నగరాలు ఆతిథ్యమిచ్చాయి. ఇప్పుడు 12వ డే నైట్ టెస్టుకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమివ్వనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాగా మ్యాచ్‌కు సంబంధించి పలు విశేషాలు ఉన్నాయి. మ్యాచ్‌లో టాస్కు ముందు ఆర్మీ బలగాలు పారాట్రూపర్స్‌లో వచ్చి ఇరు కెప్టెన్లకు రెండు పింక్ బాల్స్‌ను అందజేయనున్నారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో కలిసి ఈడెన్గార్డెన్లోని సంప్రదాయ బెల్‌ను మోగించి మ్యాచ్‌ను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా మ్యాచ్‌కు తరలిరానున్న సచిన్ టెండూల్కర్, ఒలింపియన్ అభినవ్ బింద్రా, టెన్నిస్ స్టార్ సానియా మిర్జా, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, 6 సార్లు మహిళల బాక్సింగ్ చాంపియన్ మేరీకోమ్‌లను ఘనంగా సత్కరించనున్నట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) సెక్రటరీ అవిషేక్ దాల్మియా తెలిపారు. -
దాదా మరో నిర్ణయం: మోదీ, షేక్ హసీనాలకు ఆహ్వానం!
కోల్‌కతా: అన్నీ కుదిరితే భారత ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాలు ఒకే వేదికపై కనిపించే అవకాశం ఉంది. వచ్చే నెలలో బంగ్లాదేశ్ రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్‌లో పర్యటించనుంది. దీనిలో భాగంగా నవంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టుకు కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్‌లో ఆతిథ్యమివ్వనుంది. అయితే చారిత్రాత్మక మైదానమైన ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌కు ఇది తొలి టెస్టు. దీంతో ఈ టెస్టుకు ప్రత్యేకత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలకు ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తున్న ఈ టెస్టును వీక్షించాల్సిందింగా ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లా ప్రధాని షేక్ హసీనాలకు ఆహ్వానం పంపాలని క్రికెట్ అసోషియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నిర్ణయించాడు. దీనిలో భాగంగా క్యాబ్ తరుపున ఇరు దేశాల ప్రధానులను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇక సౌరవ్ గంగూలీ క్యాబ్ అధ్యక్షుడయ్యాక వినూత్న ఆలోచనలతో ఈడెన్ గార్డెన్స్‌ను కొత్త పుంతలు తొక్కిస్తున్నాడు. లార్డ్స్ మాదిరిగా ఈడెన్‌లోను గంట కొట్టి మ్యాచ్ ప్రారంభించే ఆనవాయితీని గంగూలీ ప్రవేశపెట్టాడు. అంతేకాకుండా 2016లో టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా-పాకిస్తాన్ మ్యాచ్‌కు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన క్యాబ్ ఆయన చేత జాతీయ గీతం పాడించింది. ప్రస్తుత పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా క్యాబ్ ఆహ్వానం మేరకు మ్యాచ్‌కు హాజరయ్యాడు. చివరగా మొహాలీ వేదికగా ప్రపంచకప్-2011 సెమీఫైనల్లో భాగంగా భారత్-పాక్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌ను అప్పటి ఇరు దేశాల ప్రధానులు మన్మోహన్ సింగ్, యూసఫ్ రజా గిలానీలు ప్రత్యక్షంగా తిలకించారు.