
గంభీర్ సేనకు బ్రహ్మరథం
ఈడెన్‌లో జరిగిన సన్మాన కార్యక్రమంలో షారుఖ్ అభిమానులను ఉత్తేజపరిచాడు. ట్రోఫీని చేతపట్టిన కెప్టెన్ గంభీర్‌తో పాటు జట్టు ఆటగాళ్లు ఎనిమిది వాహనాల్లో స్టేడియం చుట్టూ విజయయాత్ర చేస్తూ అక్కడికి వచ్చిన వారిని విష్ చేశారు. షారుఖ్, జూహీ చావ్లా, జయ్ మెహతాతో పాటు మమత కేక్ కట్ చేశారు.
ఆటగాళ్లకు, సహాయక సిబ్బందికి 10గ్రాముల బంగారు రింగులను బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడు దాల్మియా ప్రదానం చేశారు. ప్రపంచంలో ఏ దేశం, రాష్ట్రం కానీ ఈస్థాయిలో ఓ జట్టుపై ఆదరణ చూపించదని కొనియాడాడు.