Honors program
-
స్నేక్ ఐల్యాండ్ విముక్తి కీలక పరిణామం
కీవ్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం 500వ రోజుకు చేరుకున్న వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శనివారం స్నేక్ ఐల్యాండ్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన స్నేక్ ఐల్యాండ్ విముక్తికి పోరాడిన ఉక్రెయిన్ సైనికులను సన్మానించారు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో స్నేక్ ఐల్యాండ్ విముక్తి కీలక పరిణామమన్నారు. ఆక్రమణకు గురైన ప్రతి అంగుళాన్ని తిరిగి స్వా«దీనం చేసుకుంటామనేందుకు ఈ ఘటనే ప్రబల తార్కాణమని వీడియో విడుదల చేశారు. ఈ వీడియో ఏరోజు రికార్డయిందో తెలియలేదు. జెలెన్స్కీ శనివారం తుర్కియేలో ఉన్నారు. గత ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన రష్యా బలగాలు ఈ ఐల్యాండ్‌ను ఆక్రమించుకోగా ఉక్రెయిన్ జూన్ 30న తిరిగి స్వా«దీనం చేసుకుంది. కాగా, లీమాన్ పట్టణంలో శనివారం రష్యా రాకెట్ దాడిలో ఎనిమిది మంది మరణించారని ఉక్రెయిన్ తెలిపింది. -
సీఎం జగన్ సారథ్యంలో ఏపీ అభివృద్ధి చెందుతోంది: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
సాక్షి, విజయవాడ: ప్రేమకు భాష అడ్డంకి కాకూడదని.. అందుకే తాను హిందీలో మాట్లాడుతున్నానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మీ అభిమానానికి ధన్యవాదాలు అంటూ ముర్ము తెలుగులో మాట్లాడారు. మీ సాదర స్వాగతానికి కృతజ్ఞతలు. వేంకటేశ్వరస్వామి కొలువైన ఈ పవిత్ర భూమికి రావడం సంతోషంగా ఉందని రాష్ట్రపతి అన్నారు. ‘‘కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉంటాయి. కూచిపూడి పేరుతో ప్రారంభమైన నాట్యకళ ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. దేశ భాషలందు తెలుగు లెస్స’’ అని రాష్ట్రపతి అన్నారు. కన్కాశుల్కం లాంటి గొప్ప నాటకాలకు ఏపీ చిరునామాగా నిలిచింది. ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఏపీ నుంచే వచ్చారు. సీఎం జగన్ సారథ్యంలో ఏపీ అభివృద్ధి చెందుతోందని రాష్ట్రపతి ముర్ము అన్నారు. చదవండి: ముర్ము ఎదిగిన తీరు ప్రతీ మహిళకూ ఆదర్శనీయం: సీఎం జగన్ -
ముర్ము ఎదిగిన తీరు ప్రతీ మహిళకూ ఆదర్శనీయం: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: గిరిజన మహిళ రాష్ట్రపతి పదవిని చేపట్టడం గొప్ప విషయం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పౌర సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సామాజిక వేత్తగా, ప్రజాస్వామ్యవాదిగా, గొప్ప మహిళగా ద్రౌపది ముర్ము అందరికీ ఆదర్శమన్నారు. దేశ చరిత్రలో ఆమె ఎప్పటికీ నిలిచిపోతారన్నారు. కష్టాలను కూడా చిరునవ్వుతో ఎదుర్కొన్న ముర్ము జీవితం అందరికీ ఆదర్శం. తన గ్రామంలో డిగ్రీ వరకూ చదువుకున్న తొలి మహిళగా ఆమె నిలిచారు. ముర్ము ఎదిగిన తీరు ప్రతీ మహిళకూ ఆదర్శనీయం. మహిళా సాధికారితకు ఆమె ఒక ప్రతిబింబం. రాష్ట్రపతి పదవికి ముర్ము వన్నె తీసుకొస్తారనడంలో ఎలాంటి సందేహం లేదని సీఎం అన్నారు. చదవండి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పౌర సన్మానం -
వీరులకు బ్రహ్మరథం.. విమానాశ్రయంలో రచ్చ
ఒలింపిక్స్ చరిత్రలోనే ఈసారి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత క్రీడాకారులు సోమవారం టోక్యో నుంచి స్వదేశానికి చేరుకున్నారు. ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి పతకం, అదీ స్వర్ణం అందించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా... రజత, కాంస్య పతకాలు సాధించిన రెజ్లర్లు రవి, బజరంగ్.. కాంస్యం నెగ్గిన మహిళా బాక్సర్ లవ్లీనా... 41 ఏళ్ల విరామం తర్వాత విశ్వ క్రీడల్లో పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు... నాలుగో స్థానంలో నిలిచిన భారత మహిళల హాకీ జట్టు సభ్యులకు ఇందిరాగాంధీ విమానాశ్రయంలో అభిమానులు ఘనస్వాగతం పలికారు. సాయంత్రం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వ ర్యంలో పతక విజేతలకు సన్మాన కార్యక్రమం జరిగింది. తాను సాధించిన పతకం తన ఒక్కడిదే కాదని, దేశ ప్రజలందరిదని నీరజ్ చోప్రా అన్నాడు. నీరజ్ చోప్రా, రవి దహియా బజరంగ్, లవ్లీనా ‘మీరంతా నవతరం హీరోలు...’ ► టోక్యో ఒలింపిక్స్ పతక విజేతలపై ప్రశంసల జల్లు ► స్వదేశంలో ఘన స్వాగతం ► కేంద్ర క్రీడా శాఖ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుల ప్రదర్శన... ప్రపంచాన్ని గెలవాలనుకునే భారత కొత్త తరానికి స్ఫూర్తిగా నిలిచిందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. మున్ముందు కూడా అన్ని రకాలుగా క్రీడాకారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన ప్రకటించారు. టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి సోమవారం స్వదేశం చేరుకున్న అథ్లెట్ నీరజ్ చోప్రా, రెజ్లర్లు రవి దహియా, బజరంగ్ పూనియా, మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్‌లతో పాటు భారత పురుషుల హాకీ జట్టు సభ్యులకు సోమవారం కేంద్ర ప్రభుత్వం తరఫున ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ... ‘స్వీయ క్రమశిక్షణ, అంకితభావం ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో భారత అథ్లెట్లు చూపించారు. సన్మాన కార్యక్రమంలో స్వర్ణ పతకంతో నీరజ్ చోప్రా, కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్; రజతం నెగ్గిన రెజ్లర్ రవి దహియాకు జ్ఞాపికను అందజేస్తున్న అనురాగ్ ఠాకూర్, చిత్రంలో న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పతకాలు సాధించే వరకు వారి ప్రయాణం చాలా గొప్పగా సాగింది. నవ భారతంలో వీరంతా నవతరం హీరోలు. ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనపై జాతి యావత్తూ సంబరాలు చేసుకుంది. మన దేశంలో తూర్పు నుంచి పశ్చిమం వరకు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు అందరినీ ఒక్కచోటికి చేర్చే శక్తి క్రీడలకు మాత్రమే ఉంది. క్రీడల్లో మన దేశం మరింత ఘనతలు సాధించేలా సహకారం అందిస్తాం’ అని ఠాకూర్ అన్నారు. ఒలింపిక్ చరిత్రలో భారత్ ఈసారి ఎక్కువ (7) పతకాలు గెలవడం తనకు చాలా సంతోషం కలిగించిందన్న మాజీ క్రీడా శాఖ మంత్రి, ప్రస్తుత న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు... 2024 పారిస్ ఒలింపిక్స్‌లో మన దేశం మరింత బలమైన శక్తిగా ఎదుగుతుందని ఆకాంక్షించారు. టోక్యోలో రజత, కాంస్యాలు సాధించి కొద్ది రోజుల క్రితమే భారత్‌కు వచ్చేసిన మీరాబాయి చాను, పీవీ సింధు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. కేక్ కట్ చేస్తున్న భారత హాకీ జట్టు సభ్యులు విమానాశ్రయంలో రచ్చ... టోక్యో విజేతలకు సోమవారం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. పెద్ద సంఖ్యలో అభిమానులు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, ‘సాయ్’ ఉన్నతాధికారులు అక్కడకు చేరుకొని తమ ఆటగాళ్లకు ‘వెల్కమ్’ చెప్పారు. అయితే ఈ సందర్భంగా పరిస్థితి అంతా గందరగోళంగా మారిపోయింది. అభిమానులు, ఆటగాళ్ల సన్నిహితులతో విమానాశ్రయం నిండిపోవడంతో బాగా రచ్చ జరిగింది. త్రివర్ణ పతాకాలతో ఎయిర్పోర్ట్ వద్ద డప్పు, ఇతర వాయిద్యాలతో ఫ్యాన్స్ పెద్ద శబ్దాలు చేస్తూ హంగామా సృష్టించారు. సెల్ఫీల కోసం మీద పడిపోతున్న వారి నుంచి తప్పించుకొని బయటకు రావడానికి ఆటగాళ్లు బాగా ఇబ్బంది పడ్డారు. నీరజ్ పోలీస్ భద్రత మధ్య బయటకు రాగా... బజరంగ్ పూనియా, రవి దహియాలను అతని మిత్రులు భుజాలపై ఎత్తుకొని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఒలింపిక్ స్వర్ణం సాధించిన తర్వాత రోజు తీవ్రమైన ఒంటి నొప్పులతో బాధపడ్డాను. అయితే నా విజయం ముందు అది చాలా చిన్న విషయం. జావెలిన్ విసిరిన సమయంలో నేను నా వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చానని మాత్రమే అనుకున్నాను. అయితే త్రో ఇంకా చాలా దూరం వెళ్లింది. ఈ పతకం నా ఒక్కడిదే కాదు. భారతదేశ ప్రజలందరిది. ప్రత్యర్థి ఎంత బలమైనవాడైనా సరే మన అత్యుత్తమ ఆట ప్రదర్శించాలని, ప్రత్యర్థి గురించి భయపడవద్దని చెబుతా. అదే బంగారు పతకాన్ని తెచ్చి పెట్టింది. నాకూ పొడవాటి జుట్టు ఉంచడమే ఇష్టం. వేడి వల్ల చెమట పట్టి ఇబ్బంది కావడంతో జుట్టు తగ్గించుకున్నా. – సన్మాన కార్యక్రమంలో నీరజ్ చోప్రా -
బీసీల దమ్ము ఎంతో చూపిస్తాం..
సాక్షి, విజయవాడ: బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారని మంత్రి కొడాలి నాని అన్నారు. సోమవారం కృష్ణా జిల్లాలోని నలుగురు బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, 34 మంది డైరెక్టర్లకు తమ్మలపల్లి కళాక్షేత్రంలో సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, పార్థసారధి, జోగి రమేష్, వసంత కృష్ణప్రసాద్, దూలం నాగేశ్వరరావు, జగన్మోహన్రావు, కైలే అనీల్, కొక్కిలిగడ్డ రక్షణ నిధి, నేతలు బొప్పన భవకుమార్,దేవినేని అవినాష్, పూనూరు గౌతంరెడ్డి పాల్గొన్నారు. (చదవండి: జగన్ సారథ్యంలో రాష్ట్రాభివృద్ధి పరుగులు) ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ‘‘బీసీలకు అండగా నిలిచిన ఎన్టీఆర్‌ని చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. పార్టీని లాక్కొని బీసీలను ఓటు బ్యాంకుగా మార్చేశారు. బీసీలకు ఎన్టీఆర్ లేని లోటును దివంగత మహానేత వైఎస్సార్ తీర్చారు. ఐదేళ్ల పాలనలో అందరి హృదయాల్లో చెరగని ముద్రలా నిలిచారు. తండ్రి లేని లోటుని తనయుడు వైఎస్ జగన్ తీరుస్తున్నారు. బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. బీసీ విద్యార్థుల విద్యోన్నతికి వైఎస్ జగన్ బాటలు వేస్తున్నారు. చైర్మన్లు, డైరెక్టర్లు చిత్తశుద్ధితో పనిచేసి పదవులకు న్యాయం చేయాలి. మరో 30 ఏళ్లు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని’’ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. (చదవండి: గ్రామాల రూపురేఖలు మార్చాం: సీఎం జగన్) అన్ని రంగాల్లో బీసీలకు పెద్దపీట: పెద్దిరెడ్డి బీసీల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృష్ణి చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. 56 బీసీ కార్పొరేషన్లకు ఛైర్మన్లు, 672 మంది డైరెక్టర్లను నియమించాం.బీసీలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు. సచివాలయ వ్యవస్థతో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించామని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతికి బాటలు: మోపిదేవి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గాల అభ్యున్నతికి బాటలు వేశారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. ‘‘ కొన్ని సామాజిక వర్గాలకే పరిమితమైన పదవులను సీఎం జగన్ విస్తృత పరిచారు. చిన్న చిన్న కులాల నుంచి కూడా ప్రతినిధులకు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించారు. కార్పొరేషన్ చైర్మన్లు,డైరెక్టర్లు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బీసీలకు ప్రభుత్వానికి వారధులుగా పనిచేయాలి. బీసీల జీవితాల్లో సీఎం జగన్ వెలిగించిన చిరుజ్యోతి మహోజ్వల జ్యోతిగా మారుతుందని’’ మోపిదేవి పేర్కొన్నారు. బలహీన వర్గాల్లో విప్లవాత్మక మార్పులు: పార్థసారధి బలహీన వర్గాల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. రాజకీయ పార్టీలు ఇప్పటి వరకు కల్లబొల్లి మాటలతో మభ్యపెట్టాయన్నారు. 70 శాతం ఉన్న వెనకబడిన కులాలను ఓటు బ్యాంకుగానే చూశారన్నారు. దివంగత మహానేత వైఎస్సార్ పాలనలో బీసీలకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. బీసీ విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టారని తెలిపారు. ఇంటికో ఇంజనీర్ ఉన్నాడంటే అది వైఎస్సార్ చలువేనన్నారు. ఇప్పుడు అదే తరహాలో ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలు గురించి ఆలోచించారని, బీసీ కులాల సమస్యల పరిష్కారానికి కమిటీ వేసి నివేదికలు తెప్పించుకున్నారన్నారు. బీసీ గర్జనలో చెప్పిన ప్రతీ హామీని నెరవేర్చారని తెలిపారు. సమస్యలు చెప్పేందుకు వెళ్తే బలహీనవర్గాల వారిని తోకలు కత్తిరిస్తా, తోలు తీస్తానన్న వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్లలో యాభై శాతం మహిళలకే కేటాయించిన గొప్ప వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌కు బీసీలు, మహిళలు రుణపడి ఉండాలని పార్థసారధి అన్నారు. బాధ్యతాయుతంగా పనిచేయాలి: మల్లాది విష్ణు బడుగు,బలహీన వర్గాలకు సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బీసీ నేత మోపిదేవి వెంకటరమణకు ఇస్తున్న ప్రాధాన్యతే అందుకు నిదర్శనమని చెప్పారు. కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లు బాధ్యతాయుతంగా పనిచేసి లక్ష్యాలను సాధించాలని విష్ణు పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్ మాట్లాడుతూ బీసీలంటే బ్యాక్ వర్డ్ కాస్ట్ కాదు.. బ్యాక్ బోన్ అని చాటి చెప్పిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలి: జోగి రమేష్ బీసీలలో 2019 ఎన్నికల్లోనే చైతన్యం రగిలిందని ఎమ్మెల్యే జోగి రమేష్ పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో బీసీల దమ్మెంతో చూపిస్తాం. ‘‘139 కులాలు బీసీలో ఉన్నాయని గుర్తించిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్. పాదయాత్రలో చెప్పిన విధంగా బీసీల అభ్యున్నతికి బాటలు వేశారు. అసెంబ్లీ మొదటి సెషన్లోనే బీసీలకు 50 శాతం అవకాశాలకు చట్టం తెచ్చారు. బలహీన వర్గాలకు అండగా నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ బాటలో అడుగులు వేద్దామని’’ ఆయన పిలుపునిచ్చారు. జగనన్న పాలనలో బీసీలకు చట్టసభల్లో కూడా అవకాశాలు పెరుగుతాయన్నారు. బీసీలను చిన్నచూపు చూసిన చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలని జోగి రమేష్ పేర్కొన్నారు. -
ప్రాణం నిలిపేది డాక్టర్ : ఎస్పీ
నల్లగొండ టౌన్ : మనిషికి ప్రాణం పోసేది దేవుడైతే.. ఆ మనిషి ప్రాణాన్ని కాపాడేది డాక్టర్ అని ఎస్పీ ఏవి రంగనాథ్ అన్నారు. సోమవారం స్థానిక కీర్తి ఆస్పత్రిలో అనస్తిటిస్టŠస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. డాక్టర్లు వైద్య సేవలను అందించడంతో పాటు రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. సమాజంలో డాక్టర్స్ వృత్తి ఎంతో పవిత్రమైందని, పోలీసులు కూడా సమాజంలోని రుగ్మతలను తొలగించే పవిత్రమైన వృత్తిలో ఉన్నారని అన్నారు. ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ వసంతకుమారి మాట్లాడుతూ రక్తం అందుబాటులో లేక రోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ చనిపోకూదనే ఉద్దేశంతో ఐఎంఏ ఆధ్వర్యంలో అనేక రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు డాక్టర్లు రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారందరికి ఎస్పీ రంగనాథ్ సర్టిఫికెట్స్ అందజేశారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ గోలి అమరేందర్‌రెడ్డి, డాక్టర్లు వేణు, యాదయ్య, పుల్లారావు, హేమలత, గౌరిశ్రీ, అనితారాణి, సుబ్బారావు, సుధాకర్, రాజశేఖర్‌రెడ్డి, నగేష్, శ్రీను, మూర్తి, లీలావతి, రమేష్, రవీంద్రనాయక్, హరిక్రిష్ణ, రాజేశ్వరి, చిరునోముల చంద్రశేఖర్, విశ్వజ్యోతి, నాగేందర్‌రెడ్డి, ఖదీర్, జగదీశ్, పురుషోత్తం, అంజిబాబు, మషిహా, మల్లేష్, స్వప్న తదతరులు పాల్గొన్నారు. డాక్టర్లకు సన్మానం.. డాక్టర్స్‌డేను పురస్కరించుకుని స్థానిక కీర్తి ఆస్పత్రిలో లయన్స్‌క్లబ్ స్నేహా ఆధ్వర్యంలో ఐఎంఏ డాక్టర్లను సన్మానించారు. కార్యక్రమంలో నాగమణిరెడ్డి, మామిడి పద్మ, గోలి రజిన, చంద్రవతి, పుష్ఫడానియేల్ తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు వారికి సదా రుణపడి ఉంటా..!
వారి మద్దతుతోనే ఎమ్మెల్యేనయ్యా: రూపేశ్ మాత్రే భివండీ, న్యూస్‌లైన్: భివండీ పట్టణం నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడానికి తెలుగువారి మద్దతే కారణమని శివసేనకు చెందిన స్థానిక శాసనసభ్యులు రూపేశ్ మాత్రే పేర్కొన్నారు. తెలుగువారికి సదా రుణపడి ఉంటానని, అలాగే మీరు కూడా నాపై ఆదరాభిమానాలను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అఖిలపక్ష పద్మశాలి సమాజం వారు శనివారం ఇక్కడ ముగ్గురు శాసనసభ్యులకు, పవర్లూమ్ డెవలప్మెంట్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ వైస్ చైర్మన్‌గా ఎన్నికైన వంగ పురుషోత్తంకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రూపేశ్ మాత్రే మాట్లాడుతూ, తెలుగువారికి తన సహకారం ఎల్లవేళలా ఉంటుందని చెప్పారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయలేకపోయానని, ఇప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో కూడా తమ పార్టీ భాగస్వామిగా ఉందని అన్నారు. ఈ ప్రాంతంలో ఓ ఆట స్థలం ఏర్పాటుకు ప్రయత్నిస్తామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను మహిళలకు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే పవర్లూమ్ కార్మికులు కూడా లబ్ధి పొందే రీతిలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే మహేష్ చౌగులే మాట్లాడుతూ, బాల్యం నుంచి ఇప్పటివరకు తెలుగు వారితోనే సహవాసం చేశానని, భాషా బేధాలు లేకుండా వారితో కలిసిపోయానన్నారు. తెలుగువారికి తనవంతుగా అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. అఖిల పద్మశాలి సమాజం అధ్యక్షుడు కముటం శంకర్ మాట్లాడుతూ, ఈ సమాజం స్థాపించినప్పటి నుంచి రాజకీయంగా ఎదుగుతూ వస్తూ గతంలో కార్పొరేషన్లో కూడా ప్రాతినిధ్యం వహించామని చెప్పారు. గతంలో సమాజం తరఫున ఏడుగురు కార్పొరేటర్లు గెలిచారని, ఇప్పుడ ఆ సంఖ్య ఒకటికి చేరిందని అన్నారు. సమైక్యంగా ఉంటే సమాజం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా శివసేన రూరల్ ఎమ్మెల్యే శాంతారామ్ మోరే, అఖిల పద్మశాలి సమాజ్ కార్యాధ్యక్షుడు వేముల నర్సయ్య, సహాయ కార్యదర్శి వంగ పురుషోత్తం, కోశాధికారి పాశికంటి లచ్చయ్య, ఈశ్వర్ ఆడెపుతో పాటు సమాజ పెద్దలు పాల్గొన్నారు. -
గంభీర్ సేనకు బ్రహ్మరథం
ఈడెన్‌లో జరిగిన సన్మాన కార్యక్రమంలో షారుఖ్ అభిమానులను ఉత్తేజపరిచాడు. ట్రోఫీని చేతపట్టిన కెప్టెన్ గంభీర్‌తో పాటు జట్టు ఆటగాళ్లు ఎనిమిది వాహనాల్లో స్టేడియం చుట్టూ విజయయాత్ర చేస్తూ అక్కడికి వచ్చిన వారిని విష్ చేశారు. షారుఖ్, జూహీ చావ్లా, జయ్ మెహతాతో పాటు మమత కేక్ కట్ చేశారు. ఆటగాళ్లకు, సహాయక సిబ్బందికి 10గ్రాముల బంగారు రింగులను బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడు దాల్మియా ప్రదానం చేశారు. ప్రపంచంలో ఏ దేశం, రాష్ట్రం కానీ ఈస్థాయిలో ఓ జట్టుపై ఆదరణ చూపించదని కొనియాడాడు.