సాక్షి, విజయవాడ: ప్రేమకు భాష అడ్డంకి కాకూడదని.. అందుకే తాను హిందీలో మాట్లాడుతున్నానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మీ అభిమానానికి ధన్యవాదాలు అంటూ ముర్ము తెలుగులో మాట్లాడారు. మీ సాదర స్వాగతానికి కృతజ్ఞతలు. వేంకటేశ్వరస్వామి కొలువైన ఈ పవిత్ర భూమికి రావడం సంతోషంగా ఉందని రాష్ట్రపతి అన్నారు.
‘‘కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉంటాయి. కూచిపూడి పేరుతో ప్రారంభమైన నాట్యకళ ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. దేశ భాషలందు తెలుగు లెస్స’’ అని రాష్ట్రపతి అన్నారు. కన్కాశుల్కం లాంటి గొప్ప నాటకాలకు ఏపీ చిరునామాగా నిలిచింది. ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఏపీ నుంచే వచ్చారు. సీఎం జగన్ సారథ్యంలో ఏపీ అభివృద్ధి చెందుతోందని రాష్ట్రపతి ముర్ము అన్నారు.
చదవండి: ముర్ము ఎదిగిన తీరు ప్రతీ మహిళకూ ఆదర్శనీయం: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment