
మహాకుంభ్ నగర్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. గంగా నదికి పూజలు చేసి, సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించారు. అనంతరం అక్షయవత్, బడే హనుమాన్ ఆలయాల్లో పూజలు చేశారు. అంతకు ముందు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం ఆదిత్యనాథ్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి ముర్ము, సీఎం ఆదిత్యనాథ్ పడవలో త్రివేణీ సంగమానికి వెళ్లారు.
డిజిటల్ మహాకుంభ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఆమె సందర్శించారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము ‘మహా కుంభ్‌కు తరలివస్తున్న జన సమూహం భారత దేశ గొప్ప వారసత్వానికి, నమ్మకానికి, విశ్వాసానికి సజీవ చిహ్నం అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ్ వేళ గంగ, యమున, అంతర్వాహిని సరస్వతీనదుల పవి త్ర సంగమ్‌లో స్నానమాచరించే భాగ్యం తనకు దక్కిందని తెలిపారు. గంగా మాత ఆశీస్సులు అందరికీ దక్కాలని, అందరి జీవితాల్లోనూ సుఖశాంతులు నింపాలని ప్రారి్థంచానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment