Holy bath
-
Mahakumbh: స్నానపు దృశ్యాలు అప్లోడ్ చేసిన వారిపై చర్యలు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. త్రివేణి సంగమంలో లక్షలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. అయితే మహా కుంభమేళాలో స్నానం చేస్తున్న మహిళలు, బట్టలు మార్చుకుంటున్న మహిళలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఉదంతం వెలుగుచూసింది దీనిని గమనించిన యూపీ పోలీసులు రంగంలోకి దిగి, నిందితులపై చర్యలకు ఉపక్రమించారు.ఉత్తరప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రశాంత్ కుమార్ ఆదేశాల మేరకు.. సోషల్ మీడియాలో మహా కుంభమేళాకు సంబంధించిన అభ్యంతరకరమైన పోస్టులు, వదంతులను వ్యాప్తి చేసే వారిపై నిరంతరం పోలీసులు దృష్టిసారిస్తున్నారు. అలాంటివారిని గుర్తించి, చర్యలు చేపడుతున్నారు. మహాకుంభ్‌లో మహిళలు స్నానం చేస్తున్నప్పుడు, దుస్తులు మార్చుకుంటున్నప్పుడు కొందరు వీడియోలు తీసి, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అప్లోడ్ చేస్తున్నారని పోలీసులకు తెలియవచ్చింది. ఇది మహిళల గోప్యత, గౌరవాన్ని ఉల్లంఘించడమేనంటూ పోలీసులు ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై కొరఢా ఝుళిపిస్తున్నారు.యూపీ పోలీసుల ఈ తరహాలోని రెండు ఉదంతాలను గుర్తించి కేసులు నమోదు చేశారు. ఫిబ్రవరి 2న @neha1224872024 అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాపై పోలీసులు కేసు నమోదు చేశారు. కుంభమేళాకు వచ్చిన మహిళలు స్నానం చేస్తూ, బట్టలు మార్చుకుంటున్న వీడియోలను ఈ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ ఖాతాను నిర్వహిస్తున్న వారిని గుర్తించేందుకు యూపీ పోలీసులు మెటా కంపెనీ నుండి సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. ఇదేవిధంగా ఫిబ్రవరి 19న టెలిగ్రామ్ ఛానెల్లోని ఒక ఖాతాపై కేసు నమోదయ్యింది. మహా కుంభోత్సవంలో మహిళలు స్నానం చేస్తున్న వీడియోలను అందుబాటులో ఉంచుతామని టెలిగ్రామ్ ఛానల్ CCTV CHANNEL 11 పేర్కొంది. దీంతో దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు.ఇది కూడా చదవండి: Delhi: సీఎంగా రేఖా గుప్తా ఎంపికతో హర్యానాలో సంబరాలు -
మహాకుంభమేళాలో తదుపరి పవిత్ర స్నానం ఎప్పుడు?
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఈరోజు (బుధవారం) భక్తులు మాఘపౌర్ణమి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈరోజు ఉదయం 10 గంటల నాటికి 1.20 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. మాఘపౌర్ణమి పుణ్య స్నానాల సందర్భంగా కుంభమేళా అధికారులు హెలికాప్టర్లో భక్తులపై పుష్పవర్షం కురిపించారు. ప్రస్తుతం త్రివేణీ సంగమంలో పవిత్రస్నానాలు ఆచరించేందుకు భక్తులు బారులు తీరారు. ఈరోజు సుమారు రెండు కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మహాకుంభమేళా ప్రారంభమైనది మొదలు ఇప్పటివరకూ మూడు అమృత స్నానాలు పూర్తయ్యాయి. దీంతో తదుపరి పుణ్య స్నానం ఎప్పుడనే సందేహం చాలామందిలో ఉంది. #WATCH | 'Pushp varsha' or showering of flower petals being done on devotees and ascetics as they take holy dip in Sangam waters on the auspicious occasion of Maghi Purnima during the ongoing #MahaKumbh2025 in Prayagraj. #KumbhOfTogetherness pic.twitter.com/FC1C2uetnb— ANI (@ANI) February 12, 2025కుంభమేళా నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 26న తదుపరి పవిత్ర స్నానాలు ఉండనున్నాయి. ఆరోజు మహాశివరాత్రి కావడం విశేషం. శివుని భక్తులు ఆరోజును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అదేరోజున కుంభమేళాలో పవిత్ర స్నానం చేసేందుకు శివభక్తులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో శివరాత్రి రోజున కుంభమేళాకు లెక్కకుమించినంతమంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది కూడా చదవండి: అక్షరాలు దిద్దుతున్న కుంభమేళా మోనాలిసా -
సంగమంలో ముర్ము పవిత్ర స్నానం
మహాకుంభ్ నగర్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. గంగా నదికి పూజలు చేసి, సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించారు. అనంతరం అక్షయవత్, బడే హనుమాన్ ఆలయాల్లో పూజలు చేశారు. అంతకు ముందు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం ఆదిత్యనాథ్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి ముర్ము, సీఎం ఆదిత్యనాథ్ పడవలో త్రివేణీ సంగమానికి వెళ్లారు. డిజిటల్ మహాకుంభ్ ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ఆమె సందర్శించారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము ‘మహా కుంభ్‌కు తరలివస్తున్న జన సమూహం భారత దేశ గొప్ప వారసత్వానికి, నమ్మకానికి, విశ్వాసానికి సజీవ చిహ్నం అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ్ వేళ గంగ, యమున, అంతర్వాహిని సరస్వతీనదుల పవి త్ర సంగమ్లో స్నానమాచరించే భాగ్యం తనకు దక్కిందని తెలిపారు. గంగా మాత ఆశీస్సులు అందరికీ దక్కాలని, అందరి జీవితాల్లోనూ సుఖశాంతులు నింపాలని ప్రారి్థంచానన్నారు. -
Maha Kumbh Mela అద్భుతమైన అనుభవం: నీనా గుప్తా ప్రశంసలు
మహా కుంభమేళా 2025 (Maha KumbhMela2025) ఉత్తర ప్రదేశ్‌లోని మహాకుంభమేళా అత్యంత ఉత్సాహంగా కొనసాగుతోంది. దేశ,విదేశాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలి వస్తున్నారు. పవిత్ర త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాల ఆచరిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ప్రముఖులతో సహా పలువురు రాజకీయ నాయకులు, క్రీడా, సినీరంగ ప్రముఖులు కూడా కుటుంబ సమేతంగా ప్రయాగరాజ్‌కు తరలి వెడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతర రాజకీయ నాయకులు కూడా పవిత్ర స్నానం ఆచరించారు. గవర్నర్ ఆనందిబెన్ పటేల్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెఖావత్ , అర్జున్ రామ్ మేఘ్వాల్ వంటి అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. ఇంకా నటి హేమా మాలిని, అనుపమ్ ఖేర్, భాగ్యశ్రీ, మిలింద్ సోమన్ వంటి నటులు, కవి కుమార్ విశ్వాస్, క్రికెటర్ సురేష్ రైనా, రెజ్లర్ ది గ్రేట్ ఖలీతో పాటు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కోవలో ఇపుడు బాలీవుడ్ నటి నీనా గుప్తా (Neena Gupta) చేరారు.బాలీవుడ్ స్టార్స్ నీనా గుప్తా , సంజయ్ మిశ్రా మహా కుంభమేళాను సందర్శించి సంగంలో పవిత్ర స్నానం చేశారు. 2022 చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న వారి ప్రాజెక్ట్ వాధ్ 2 కోసం ఇద్దరూ ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. ఈ సందర్బంగా నీనా గుప్తా తన అనుభవాన్ని పంచుకున్నారు. తొలి సారి కుంభమేళాను సందర్శించాననీ, తనకు ఇంత తన జీవితంలో ఇంత పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించడం చాలా సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ఇది తనకు చాలా ప్రత్యేకమైన అనుభవాన్నిచ్చిందని పేర్కొన్నారు. చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న కల ఇప్పటికి నెరవేరిందనీ, ఇది "విశిష్ట అనుభవం" అని అభివర్ణించారు."నేను చాలా సంవత్సరాలుగా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను. ఇది ఒక ప్రత్యేకమైన అనుభవం... చివరకు, ఈ రోజు పుణ్య కుంభ స్నానం చేసాను" అని చెప్పారు. అంతేకాదు ప్రభుత్వం ఇంత బాగా నిర్వహించడం కూడా తనకు చాలా నచ్చిందని చెప్పుకొచ్చింది.#WATCH | Prayagraj, UP | At #MahaKumbhMela2025, actor Neena Gupta says, "I have been wanting to come here for years... It was a unique experience... Finally, I took a dip today... The atmosphere here is crazy. I have never seen a bigger gathering in my life... I am impressed by… pic.twitter.com/kLHwVCbAL9— ANI (@ANI) February 7, 2025మరోవైపు చక్కటి వ్యవస్థీకృత ఏర్పాట్లు, భద్రత, పారిశుధ్యం. సౌకర్యాలు అన్నీ చాలా బావున్నాయి అంటూ నటుడు సంజయ్ మిశ్రా ప్రశంసించారు. రద్దీ తక్కువగా ఉంటుంది అనుకున్నాను..కానీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉందంటూ తన అనుభవాన్ని పంచు కున్నారు. గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం వద్ద జరిగే మహా కుంభమేళా అత్యంత ముఖ్యమైందిగా భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల పాపాలు తొలగి పోతాయని, మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభ్2025 ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. ఈ విశిష్ట కార్యక్రమం మరికొన్ని రోజుల్లో ముగియనున్న కారణంగా భక్తులసంఖ్య గణనీయంగా పెరుగుతుందని అంచనాకాగా ఇటీవల పంచావత్ సిరీస్‌తో నటిగాతానేంటో నిరూపించుకున్ననటి నీనా గుప్తా. తనదైన నటనతో అనేక సినిమాల్లో ఆకట్టుకుంది. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ ద్వారా కుమార్తె మసాబాకు జన్మనిచ్చింది. ఒంటరిగానే ఆమెను పెంచి పెద్దదాన్ని చేసింది. ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తున్న మసాబా రెండో పెళ్లి చేసుకుని ఇటీవల ఒక బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. -
Mahakumbh: వసంత పంచమి అమృత స్నానాలు ప్రారంభం
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ఈరోజు(సోమవారం) వసంతపంచమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే త్రివేణీ సంగమంలో అమృత స్నానాలు మొదలయ్యాయి. నాగ సాధువులు ఈరోజు తొలిస్నానం ఆచరిస్తున్నారు. #WATCH | #MahaKumbh2025 | Prayagraj, Uttar Pradesh: The Juna Akhada reaches for the 'Amrit Snan' on the occassion of Basant Panchami. pic.twitter.com/CSVam6KdGJ— ANI (@ANI) February 3, 2025మహాకుంభమేళా ప్రాంతంలో వసంత పంచమి సందర్భంగా మూడవ అమృత స్నానానికి వేలాది మంది భక్తులు సిద్ధమయ్యారు. దీంతో త్రివేణి సంగమం భక్తులతో కిటకిటలాడుతోంది.Millions of pilgrims, saints, yogis, and visitors from around the world gathered at the sacred Triveni Sangam—the confluence of Maa Ganga, Yamuna, and Saraswati—seeking spiritual purification. They took a holy dip in the sacred waters during the Amrit Snan on the auspicious… pic.twitter.com/FahoAvrb0O— Mahakumbh (@MahaKumbh_2025) February 2, 2025గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమమైన త్రివేణి సంగమంలో నిరంజని అఖాఢా అధిపతి కైలాశానంద గిరి మహారాజ్, నిరంజని అఖాఢాకు చెందిన ఇతర సాధువులు పవిత్ర స్నానాలు చేశారు. మహంత్ రవీంద్ర పూరి మాట్లాడుతూ తమ స్నానం ఎంతో సంతోషంగా జరిగిందని, అందరూ చాలా ఆనందంగా ఉన్నారన్నారు. పవిత్ర స్నానాలు చేయడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారన్నారు.#WATCH | #MahaKumbh2025 | Prayagraj: Avigail from Austria says, "It is unbelievable and amazing. This is once in a lifetime experience...I have started understanding the people of India...I have never seen anything like this..." pic.twitter.com/3wXVj392J2— ANI (@ANI) February 3, 2025రష్యాకు చెందిన మహానిర్వాణి అఖాడాకు చెందిన మీనాక్షి గిరి మాట్లాడుతూ ‘ఇది నా జీవితంలో చాలా పవిత్రమైన క్షణం. నేను గత 17 సంవత్సరాలుగా సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నాను’ అని అన్నారు.#WATCH | Prayagraj, UP | #MahaKumbhMela2025 | Drone visuals of Maha Kumbh Mela Kshetra, Triveni Sangam, as thousands of devotees gather for the third Amrit Snan on the occassion of Basant Panchami. pic.twitter.com/LtLjC083QP— ANI (@ANI) February 3, 2025నాగ అఖాడాలన్నింటిలో అతిపెద్దదైన జునా అఖాఢా సాధువులు అమృత స్నానం కోసం వేచిచూస్తున్నారు. ఇదేవిధంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఘాట్ వద్దకు చేరుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ సమాచార శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు(వసంత పంచమి)ఇప్పటివరకు 16.58 లక్షలకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు.VIDEO | Maha Kumbh 2025: Juna Akhara prepares to leave for Basant Panchami Amrit Snan. #MahaKumbh2025 #MahaKumbhWithPTI pic.twitter.com/c2Mq1AXipQ— Press Trust of India (@PTI_News) February 2, 2025వసంత పంచమి అమృత స్నానాల వేళ నాగ సాధువులు మాత్రమే కాకుండా అదృశ్య ఋషులు కూడా స్నానం చేయడానికి వస్తారని చెబుతుంటారు. ఈ రోజున స్నానం చేయడం వల్ల ఆధ్యాత్మిక శక్తి లభిస్తుందని అఖాఢా మహానిర్వాణికి చెందిన ఒక సాధువు తెలిపారు.నిరంజని అఖాడా ఆచార్య మహామండలేశ్వర్, నిరంజన్ పీఠాధీశ్వర్ స్వామి కైలాసానంద గిరి మహారాజ్ మాట్లాడుతూ ‘నేడు వసంత పంచమి. ఈరోజు సనాతనీయులంతా సరస్వతి మాతను పూజిస్తారని అన్నారు.VIDEO | Maha Kumbh 2025: A seer from Panchayati Akhara Mahanirvani speaks on the importance of Basant Panchami Amrit Snan and praises the administration for the arrangements. #MahaKumbh2025 #MahaKumbhWithPTI pic.twitter.com/dwaspnZrrC— Press Trust of India (@PTI_News) February 2, 2025శ్రీ పంచాయితీ అఖాడ మహానిర్వాణి 'అమృత స్నానం' కోసం త్రివేణి సంగమానికి చేరుకున్నారు. అఖిల భారతీయ అఖాడ పరిషత్ అధ్యక్షుడు మహంత్ రవీంద్ర పురి మాట్లాడుతూ ‘ఈరోజు వసంత పంచమి సందర్భంగా అమృత స్నానం చేశాక, తాము తిరిగి వారణాసికి బయలుదేరుతామన్నారు. భక్తులంతా సంయమనం పాటిస్తూ అమృతస్నానం చేయాలి’ అని అన్నారు. #WATCH | #MahaKumbh2025 | Prayagraj, UP | Akhadas head towards Triveni Sangam with their deities for the Amrit Snan on the occasion of Basant Panchami. pic.twitter.com/5pbNqS2eTa— ANI (@ANI) February 2, 2025ఇది కూడా చదవండి: కుంభమేళా మోనాలిసా.. మరో వీడియో వైరల్ -
Mahakumbh: వసంత పంచమికి ముమ్మర ఏర్పాట్లు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గల త్రివేణీ సంగమంలో కుంభమేళా పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఆదివారం(ఫిబ్రవరి 2) కావడంతో ఉదయం నుంచే పవిత్ర స్నానాలకు భక్తులు పోటెత్తారు. సోమవారం వసంత పంచమి. ఆరోజు అమృత స్నానాలు ఆచరించేందుకు నాలుగు కోట్ల మంది భక్తులు వస్తారనే అంచనాలున్నాయి.వసంతపంచమి(Vasanta Panchami) నాడు స్నానాలు ఆచరించేందుకు రెండురోజుల ముందుగానే భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటున్నారు. ప్రస్తుతం త్రివేణీ సంగమంనకు దారితీసే అన్ని మార్గాలు భక్తుల వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. అలాగే ఎక్కడ చూసినా రోడ్లపై జనసమూహం కనిపిస్తోంది. దీనిని గుర్తించిన అధికారులు ఎటుంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.జనవరి 29 మౌని అమావాస్య రోజున దాదాపు ఎనిమిది కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. మరుసటి రోజు కూడా ఇదే తీరు కనిపించింది. తరువాత శుక్ర, శనివారాల్లో రద్దీ కాస్త తగ్గినట్లు కనిపించింది. అయితే ఈరోజు (ఆదివారం) ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య మరింతగా పెరిగింది. సోమవారం వసంత పంచమి. ఆరోజు అమృత స్నానాలు ఆచరించేందుకు భారీగా భక్తులు వస్తారనే అంచనాలున్నాయి. ఈ నేపధ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కాళీ మార్గ్, ఆనకట్ట, సంగమం వైపు వెళ్లే రహదారులలో భద్రతను మరింత కట్టిదిట్టం చేశారు. మరోవైపు మౌని అమావాస్య స్నానోత్సవంలో జరిగిన ప్రమాదం తర్వాత, ప్రభుత్వం నిఘాను మరింతగా పెంచింది.వసంత పంచమి రోజున సంగమ ఘాట్(Sangam Ghat) వద్ద జనం గుమిగూడకుండా చూసుకోవాలని పోలీసులకు, సైనికులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భక్తులు స్నానం చేసిన వెంటనే ఘాట్ నుంచి బయటకు వెళ్లేలా చూడాలని అధికారులు వారిని ఆదేశించారు. వసంత పంచమినాడు ఎవరూ కూడా బారికేడ్లను బద్దలు కొట్టకుండా చూసేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేశారు. భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ బారికేడ్లు దాటవద్దని పోలీసు ఉన్నతాధికారులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది కూడా చదవండి: కుంభమేళా మోనాలిసా.. మరో వీడియో వైరల్ -
Mahakumbh-2025: నేడు మరో సరికొత్త రికార్డు..
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళాలో ఇప్పటివరకు 30 కోట్లకు పైగా భక్తులు స్నానాలు చేశారు. ఈ సంఖ్య పలు రికార్డులను నెలకొల్పుతోంది. ప్రపంచంలోని 195 దేశాలలోని 192 దేశాల జనాభా 30 కోట్ల కంటే తక్కువగా ఉంది. అంటే ఆ 192 దేశాలకు మించినంతటి జనాభా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారని గణాంకాలు చెబుతున్నాయి. జనాభా పరంగా చూస్తే ప్రపంచంలోని నాల్గవ, ఐదవ అతిపెద్ద దేశాలైన ఇండోనేషియా, పాకిస్తాన్లలో కూడా 30 కోట్ల కంటే తక్కువ జనాభా ఉంది. దీనిప్రకారం చూస్తే కేవలం 19 రోజుల్లో పాకిస్తాన్, ఇండోనేషియా జనాభాకు మించిన భక్తులు త్రివేణీ సంగమంలో స్నానమాచరించారు. ఇండోనేషియా జనాభా(Indonesian population) 28 కోట్లు కాగా, పాక్ జనాభా 25.35 కోట్లు. కుంభమేళాకు వస్తున్న భక్తుల సంఖ్యను చూస్తే వసంత పంచమి(ఫిబ్రవరి 3) నాటికి సంగమంలో పుణ్య స్నానాలు చేసే వారి సంఖ్య 35 కోట్లకు చేరుకుంటుందనే అంచనాలున్నాయి.మహా కుంభమేళా ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకూ 91,690 మంది విమాన ప్రయాణం(Air travel) ద్వారా ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. 650 కి పైగా విమానాలు ఇక్కడకు రాకపోకలు సాగించాయి. ఇప్పుడు ఫిబ్రవరి ఒకటిన ఇక్కడికి వచ్చే విమానాలు, ప్రయాణికుల సంఖ్య గరిష్టంగా ఉండవచ్చనే అంచనాలున్నాయి. ఫిబ్రవరి ఒకటి నుండి, తొలిసారిగా ప్రయాగ్‌రాజ్ నుండి చెన్నైతో సహా అనేక ప్రధాన నగరాలకు నేరుగా విమానాల రాకపోకలు ప్రారంభంకానున్నాయి. వీటిలో ఢిల్లీకి 10 విమానాలు, ముంబైకి ఏడు విమానాలు ఉన్నాయి. ఇది సరికొత్త రికార్డు కానుంది. ఇది కూడా చదవండి: Jharkhand: జేఎంఎంలోకి తిరిగి సీతా సోరెన్? -
కుంభమేళాలో అమిత్ షా పుణ్యస్నానం
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా అత్యంత వైభవంగా జరగుతోంది. ఈరోజు (సోమవారం) కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ఇప్పటివరకూ 13.21 కోట్ల మంది పుణ్యస్నానాలు చేశారని గణాంకాలు చెబుతున్నాయి. #WATCH | Union Home Minister Amit Shah arrives in Prayagraj. Uttar Pradesh CM Yogi Adityanath, along with his cabinet ministers, receives him at the airport. The HM will take a holy dip at #MahaKumbh2025 today. pic.twitter.com/pU6Xk9wByc— ANI (@ANI) January 27, 2025తొలుత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరైల్ ఘాట్‌కు చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆయన మంత్రివర్గ మంత్రులు అమిత్‌షాకు ఘన స్వాగతం పలికారు.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: ఏడాదిన్నరగా పరారై.. పుణ్యస్నానం చేస్తూ పోలీసులకు చిక్కి..#WATCH | #MahaKumbh2025 | Union Home Minister Amit Shah arrives at Selfie Point Arail Ghat in Uttar Pradesh. He will take a holy dip at #MahaKumbh2025 in Prayagraj shortly.CM Yogi Adityanath, Deputy CMs KP Maurya and Brajesh Pathak, and others are with him. pic.twitter.com/cSiFJNvTMY— ANI (@ANI) January 27, 2025 -
మహా కుంభమేళాకు తరలివస్తున్న అశేష జనవాహిని.. రెండ్రోజుల్లో రెండున్నర కోట్ల మంది పుణ్యస్నానాలు
-
నాగా సాధువులు కుంభమేళాలోనే ఎందుకు కనిపిస్తారు? కారణమిదే..
హిందువులు ఎంతో పవిత్రమైనదిగా భావించే కుంభమేళా 2025, జనవరి 13 నుంచి యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభం కానుంది. కుంభమేళా సమయంలో నాగా సాధువులు తప్పనిసరిగా కనిపిస్తారు. ఇంతకీ నాగా సాధువుల ప్రత్యేకత ఏమిటి? వారి జీవనశైలి ఎలా ఉంటుంది? కుంభమేళాకు ఎందుకు తరలివస్తారు?నాగా సాధువులు హిందూ ధర్మంలోని సాధువుల తరగతికి చెందినవారు. వీరిని తపోధనులని కూడా అంటారు. వీరు నగ్నంగా జీవనం సాగిస్తారు. వీరు యుద్ధ కళలో ప్రవీణులుగా గుర్తింపు పొందారు. కఠినమైన తపస్సు, పరిత్యాగం, ఆధ్యాత్మిక సాధనలతో వీరు నిత్య జీవనం సాగిస్తుంటారు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళాకు వీరు తరలివస్తుంటారు. వీరిని చూసేందుకు, ఆశీర్వాదం తీసుకునేందుకు భక్తులు పరితపిస్తుంటారు. సమాజానికి దూరంగా ఉంటామని ప్రమాణంనాగా సాధువులు నిత్యం ధాన్యంలో ఉంటూ, సమాజానికి దూరంగా ఉంటామని భగవంతుని ముందు ప్రమాణం చేస్తారు. అందుకే వారు జనావాసాలకు దూరంగా ఏకాంతంగా జీవిస్తుంటారు. కుంభమేళా వంటి ప్రత్యేక సందర్భాలలో మాత్రమే వారు బయటకు వస్తుంటారు. ఈ సందర్భంగా నాగా సాధువులు వారిలో వారు కలుసుంటారు. తమ అనుభవాలను, ఆలోచనలను పరిస్పరం పంచుకుంటారు. దీనికి వారు కుంభమేళాను వేదికగా చేసుకుంటారు. కుంభమేళా సందర్భంగా నాగా సాధువులు గంగానదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. అలాగే వారు భక్తులకు జ్ఞానబోధ చేస్తారు. తమ తపఃశక్తులను ప్రదర్శిస్తుంటారు.ఆకాశమే తమ దుస్తులుగా భావిస్తూ..నాగా సాధువులు నగ్నంగా ఉంటారు. ఆకాశామే తమ దుస్తులుగా భావిస్తారు. కత్తి, త్రిశూలం తదితర ఆయుధాలను ఎలా ఉపయోగించాలో నాగా సాధువులకు బాగా తెలుసు. చల్లని నీటితో స్నానం చేస్తుంటారు. నిరాహారులుగా ఉంటూ కఠినమైన తపస్సు ఆచరిస్తారు. శివుణ్ణి ఆరాధిస్తుంటారు. వారికి జునా అఖారా, నిరంజని అఖారా మొదలైన అఖారాలతో సంబంధం ఉంటుంది. కుంభమేళా తర్వాత వీరు తిరిగి తమ నివాసస్థానాలైన అడవులు, కొండలకు చేరుకుంటారు.మహాకుంభమేళాకు పురాతన చరిత్రకుంభమేళా సందర్భంగా గంగా, యమున సరస్వతి సంగమ ప్రదేశంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇందుకోసం సుదూర తీరాల నుంచి ఇక్కడికి చేరుకుంటారు. మహాకుంభమేళా పురాణకాలం నాటిదని చెబుతారు. అమృత కలశం కోసం దేవతలు- రాక్షసుల మధ్య యుద్ధం జరిగినప్పుడు, నాలుగు అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయని, ఆ నాలుగు ప్రదేశాలలో కుంభమేళా జరుగుతుందని భక్తులు నమ్ముతారు. ఇక్కడ పుణ్యస్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి, మోక్షప్రాప్తి కలుగుతుందని పెద్దలు చెబుతుంటారు. అలాగే సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని కూడా అంటారు.మహాకుంభమేళా జరిగే పుణ్యదినాలుమొదటి పుణ్య స్నానం- జనవరి 13(పుష్య పూర్ణిమ)రెండవది- జనవరి 14 (మకర సంక్రాంతి మూడవది- జనవరి 29(మౌని అమావాస్య) నాల్గవది- ఫిబ్రవరి 3(వసంత పంచమి) ఐదవది-ఫిబ్రవరి 12 ( మాఘ పూర్ణిమ) చివరిది- ఫిబ్రవరి 26(మహాశివరాత్రి)ఇది కూడా చదవండి: నేడు గీతా జయంతి: రూపాయికే భగవద్గీతను అందిస్తూ.. గీతాప్రెస్ వందేళ్ల ఘన చరిత్ర -
వైజాగ్ బీచ్ లో భక్తుల పుణ్య స్నానాలు
-
కాలుష్య కోరల్లో యమునా నది
-
సినిమా సెట్టింగో.. స్పెషల్ ఎఫెక్టో అనుకుంటున్నారా..!
న్యూఢిల్లీ: దేశ రాజధాని కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతుంది. వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీ వాసులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వీటికి తోడు జల కాలుష్యం కూడా తీవ్ర స్థాయికి చేరింది. పరిశ్రమల నుంచి విడుదలయిన వ్యర్థాలు యమునా నదిలో కలిసి.. దాన్ని గరళంగా మార్చేశాయి. నది పైన తెల్లని నురగ ఏర్పడింది. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో జనాలు నదీ స్నానాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రమంలో పలువురు ఢిల్లీ మహిళలు కాలుష్య కాసారంగా మారిన యమునా నదిలో స్నానాలు ఆచరించారు. రసాయనాలతో కలుషితమై నురగలు కక్కుతున్నప్పటికి జనాలు.. దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా స్నానాలు చేశారు. సడెన్‌గా చూస్తే.. ఇదేదో సినిమా సెట్టింగో లేక స్పెషల్ ఎఫెక్ట్లానే అనిపిస్తుంది. (చదవండి: ప్రమాదకర స్థాయికి ఢిల్లీలో వాయు కాలుష్యం) ఇక ప్రతి ఏటా శీతాకాలంలో ఢిల్లీలో వాతావరణం చాలా దారుణంగా ఉంటుంది. పొగ ఆవరించి.. ఎదురుగా వచ్చే వారిని గుర్తించడం కష్టం అవుతుంది. దానికి తోడు వాయు కాలుష్యం కూడా చేరి.. పరిస్థితి మరింత దిగజారిపోతుంది. ఇక గత మూడు రోజులుగా ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. మరో 2 రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతోందని అధికారులు తెలిపారు. తీవ్రమైన వాయు కాలుష్యంగా కారణంగా జనాలు గొంతులో మంట, కళ్ల నుంచి నీరు కారడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. చదవండి: ఊపిరి.. ఉక్కిరిబిక్కిరి.. -
సర్వపాపహరణం.. సాగరసంగమ స్నానం
కోడూరు : గంగను సైతం పునీతం చేసిన పవిత్ర కృష్ణా, సాగరసంగమ ప్రదేశంలో పుణ్యస్నానం ఆచరిస్తే సర్వపాపాలు దూరమవుతాయని కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి తన శిష్యబృందానికి ఉపదేశించారు. రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి విజయేంద్ర స్వామి గురువారం సూర్యోదయం వేళ హంసలదీవి సమీపంలోని సాగరసంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు. స్వామివారు నదీ, సాగర సంగమ విశిష్టత గురించి తన శిష్యులకు వివరించారు. సంగమ ప్రాంతంలో ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో ఒక్కసారైనా స్నానం చేసి, ముక్తి పొందాలన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలు భావితారాల వారికి తెలిపే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు నిచ్చారు. తన శిష్యబృందంతో కలిసి కృష్ణమ్మకు పసుపు, కుంకుమతో ప్రత్యేక పూజలు చేసి, సారె సమర్పించి హారతులిచ్చారు. వేణుగోపాలుడికి ప్రత్యేక పూజలు హంసలదీవి గ్రామంలోని శ్రీరుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి వారికి విజయేంద్ర స్వామిజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేశారు. ఆలయ విశిష్టతను, వేణుగోపాలుడి లీలామానష విగ్రహ ప్రత్యేకతలను స్వామికి బుద్ధప్రసాద్ వివరించారు. కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ ముద్దినేని చంద్రరరావు, హైందవ సంఘం అధ్యక్షుడు మోపిదేవి చక్రవర్తి, మోపిదేవి సుబ్రమణ్యేశ్వర స్వామివారి దేవాలయ ప్రధాన అర్చకుడు పవ¯ŒSకుమార్‌శర్మ, సర్పంచి కొక్కిలిగడ్డ సముద్రాలు తదితరులు పాల్గొన్నారు. -
సంగమేశ్వరం..భక్తిపారవశ్యం
కనుల పండువగా పుష్కర హారతి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు 12 రోజుల్లో 3లక్షమంది పుణ్యస్నానాలు ఆత్మకూరు: కృష్ణానది చెంత సప్తనదుల సంగమేశ్వర క్షేత్రంలో 12 రోజులుగా సాగిన పుష్కరాలు హారతులతో మంగళవారం ఘనంగా ముగిశాయి. వేకువజాము నుంచే క్షేత్రానికి భక్తులు తరలివచ్చారు. పుణ్యస్నానమనంతరం పితృదేవతలకు పిండప్రదానాలు చేసి ఉమామహేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్షేత్రంలో 12 రోజులపాటు 3లక్షల మందికి పైగా భక్తులు పుష్కర స్నానమాచరించారు. తొలి రోజు స్వల్పంగా పుష్కర స్నానాలకు వచ్చిన భక్తులు మూడో రోజు నుంచి పోటెత్తారు. పదో రోజు 59,049 మంది, 11 వ రోజు కూడా 42,162 మంది భక్తులు పుష్కరస్నాన మాచరించారు. భక్తుల సందడి చివరి రోజు సంగమేశ్వర క్షేత్రంలో భక్తుల సందడి జోరుగా కనిపించింది. ఉదయం నుంచి భక్తులు రాక ప్రారంభమై మధ్యాహ్నానికి కిక్కిరిసింది. సాయంత్రం వరకు భక్తులు పుణ్య స్నానమాచరించారు. స్థానిక ప్రాంత వాసులే కాకుండా కడప, అనంతపురం జిల్లాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో సంగమేశ్వరం క్షేత్రంలో పుష్కరస్నానమాచరించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. చాలినన్ని వస్త్ర మార్పిడి గదుల్లేకపోవడంతో మహిళలు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ సమస్య అధికారులకు కునుకు లేకుండా చేసింది. పారిశుద్ధ్య సిబ్బంది, వలంటీర్లు, పోలీస్ సేవలతో ఇబ్బందుల్లేకుండా భక్తులు పుష్కర స్నానమాచరించేందుకు వీలు కలిగింది. పుష్కరాలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బోటు షికారుతో ఆదాయం పుష్కరాల సందర్భంగా బ్యాక్ వాటర్‌లో బోటు షికారు చేసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆసక్తి చూపారు. ఫలితంగా ఏపీ టూరిజం సంస్థకు రూ. 5 లక్షలు ఆదాయం చేకూరింది. ఈనెల 20న ఒక్కరోజే రూ.2లక్షలు ఆదాయం వచ్చింది. స్పీడు బోట్లు చాలకపోవడంతో శ్రీశైలం నుంచి పెద్ద పడవను రప్పించడంతో మరింత ఆదాయం సమకూరినటై ్లంది. తెలంగాణ భక్తులు ఇంజన్బోటుల ద్వారా సంగమేశ్వర క్షేత్రానికి చేరుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా వాసులు స్వామి సన్నిధిలో పుష్కర స్నానమాచరించి పునీతులయ్యారు. మరో రెండు పుష్కరాలు.. క్షేత్రంలో ఆది పుష్కరాలు మంగళవారంతో ముగియగా.. మరో ఆరు నెలలకు మధ్య పుష్కరాలు నిర్వహించనున్నారు. ఏడాది చివరిలో అంతిమ పుష్కరాలు కూడా జరుగనున్నాయి. సప్త నదులు కలిసే సంగమం కావడం వల్ల ఇక్కడ స్నాన మాచరిస్తే ఎంతో పుణ్య ఫలం దక్కుతుందనే నమ్మకంతో భక్తులు ఇక్కడికి వేలాదిగా తరలివచ్చారు. పుష్కరస్నానమాచరించి పునీతులయ్యారు. -
బస్సు బోల్తా: 20 మందికి గాయాలు
-
బస్సు బోల్తా: 20 మందికి గాయాలు
మహబూబ్‌నగర్: జడ్చర్ల సమీపంలో మంగళవారం ఉదయం జాతీయ రహదారి-44 పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలు అయినట్టు తెలుస్తోంది. భక్తులు ప్రయాణిస్తున్న బస్సు పుష్కర స్నానానికి వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
విజయవాడలో భక్తుల పుణ్యస్నానాలు
-
పుష్కర స్నానం చేసిన శివచేన ఎంపీ భావన
-
పుష్కర స్నానం చేసిన చిరంజీవి
-
ఖమ్మంలో 30 లక్షలమంది భక్తుల పుణ్యస్నానాలు
భద్రాచలం : గోదావరి పుష్కరాల్లో భాగంగా ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు సుమారు 30లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి అన్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలం ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కుంభమేళా తరహాలో పుష్కరాలు నిర్వహిస్తోందన్నారు. బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం పుష్కర ఘాట్లలో ఇప్పటివరకు 3.40కోట్ల మంది స్నానాలు ఆచరించారన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అన్ని హక్కులు, నిధుల కేటాయింపుపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించి చర్చకు తీసుకొచ్చే విధంగా పోరాడతామన్నారు. హైకోర్టు విభజనపై కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని, దీనిపై పార్లమెంట్లో ప్రస్తావిస్తామన్నారు. కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేసిన రూ.12వేల కోట్ల నిధులు విడుదల చేయలేదని వేణుగోపాలచారి తెలిపారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మా నాన్న పేరు నిలబెడతాం..
రాజమండ్రి : సినీ పరిశ్రమలో తండ్రి ఈవీవీ సత్యనారాయణ సముపార్జించిన పేరును నిలబెట్టేలా తాను, సోదరుడు నరేష్ కృషిచేస్తామని హీరో, నిర్మాత ఆర్యన్ రాజేష్ తెలిపారు. శనివారం ఆయన భార్య సుభాషిణి, తల్లి సరస్వతితో కలిసి వి.ఐ.పి. ఘాట్‌లో పుష్కరస్నానం ఆచరించి తండ్రి ఈవీవీ సత్యనారాయణకి పిండప్రదానం చేశారు. అనంతరం విలేకరులతో అర్యన్ రాజేష్ మట్లాడారు. ఇటీవలే వివాహమైన తన సోదరుడు నరేష్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని తెలిపారు. జులై 21న నరేష్ హైదరాబాద్ వస్తాడని చెప్పారు. నరేష్ అవకాశాన్ని బట్టి పుష్కరస్నానం చేస్తాడని అర్యన్ రాజేష్ పేర్కొన్నారు. -
పుణ్యస్నానానికి ముందు ఈ మంత్రం పఠించాలి
పిప్పలాదాత్సముత్పన్న కృత్యే లోక భయంకరి మృత్తికాంతే మయాదత్తా మహారార్థం ప్రకల్పయ గోదావరి పుష్కరస్నానం చేసే భక్తులు స్నానం చేసే ముందు ఈ మంత్రాన్ని పఠించి, నది ఒడ్డు నుంచి తీసుకెళ్లిన మట్టిని నదిలోకి వదిలేయూలని పురాణాలు చెబుతున్నాయి. దీంతో పలు వ్యాపార సంస్థలు భక్తుల కోసం స్నానఘట్టాల వద్ద మంత్రంతో కూడిన బోర్డులను ఏర్పాటు చేశారు. -భద్రాచలం నుంచి సాక్షి బృందం -
‘వా’ నరుల పుష్కర స్నానం
నిర్మల్ అర్బన్ : గోదావరి పుష్కరాలకు నరులతోపాటు వానరాలు కూడా పుణ్యస్నానాలు ఆచరించేందుకు తరలివచ్చాయి. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ మండలంలోని మాదాపూర్ పుష్కర ఘాట్ వద్ద పెద్ద సంఖ్యలో కోతులు వచ్చి గోదావరి తీరంలో ఈదుతూ మట్టికట్టలపైకి చేరాయి. వీటిని చూసిన వారంతా గోదావరి పుష్కర స్నానాలకు వచ్చాయంటూ ఆశ్చర్యంగా తిలకించారు. వాటి చేష్టలు అక్కడి వారిని మంత్రముగ్ధులను చేశాయి. -
మాతా... నమస్తుతే
పుష్కర సంరంభం వైభవంగా కొనసాగుతోంది. గోదారమ్మ తీరం భక్తజన సందడితో పులకించి పోతోంది. వివిధ పుష్కర క్షేత్రాలలో బుధవారం వేలాది మంది పవిత్ర స్నానాలను ఆచరించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. రెండవ రోజు 92,448 - గోదారమ్మ చెంత భక్తుల పరవశం - రెండో రోజూ పుష్కర స్నానాలు - పోచంపాడ్‌లో మంత్రి ఐకేరెడ్డి పూజలు - మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జోగు రామన్న కూడా - పిండ ప్రదానం చేసిన ఎంపీ కేశవరావు - తుంగినిలో ఇన్చార్జి డీఐజీ గంగాధర్ దంపతుల పవిత్రస్నానం - సౌకర్యాలను పర్యవేక్షించిన కలెక్టర్ - కందకుర్తిలో నీరులేక ఇబ్బందులు - పోచంపాడ్‌లో పెరుగుతున్న రద్దీ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: గోదావరి పుష్కరాల సందర్భంగా రెం డోరోజు బుధవారం కూడా పవిత్రస్నానాల కోసం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. మం త్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతిని ధులు, అధికారులు ఘాట్లను సందర్శించారు. దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పో చంపాడ్లో పుష్కరస్నానాలు చేశారు. ఎంపీ కె. కేశవరావు పుష్కరస్నానంతో పాటు పిండప్రధానం చేశారు. నిజామాబాద్ రేంజ్ ఇన్చార్జ్ డీఐజీ ఎడ్ల గంగాధర్ తుంగినిలో కుటుంబసభ్యులతో పుష్కరస్నానం చేశారు. వీవీఐపీలు, వీఐపీలు, భక్తుల తాకిడి నేపథ్యంలో కలెక్టర్ రొ నాల్డ్‌రోస్ పోచంపాడ్, కందకుర్తి, తడపాకల్, గుమ్మిర్యాల్ తదితర పుష్కరఘాట్లలో సౌకర్యాలను పర్యవేక్షించేందుకు సుడిగాలి పర్యటన చేశారు. పోచంపాడ్, తడపాకల్‌లో కలెక్టర్, కందకుర్తిలో జేసీ ఎ.రవీందర్‌రెడ్డిలు పుష్కరస్నానం, పూజలు చేశారు. ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి పుష్కరఘాట్లను సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించా రు. రెండోరోజూ కూడ హైదరాబా ద్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్,మహారాష్ట్ర,కర్ణాటకల నుం చి భక్తులు పెద్ద సంఖ్యలో జిల్లాకు చేరుకుని పుష్కరస్నానాలు చేశారు. కందకుర్తిలో తప్పని నీటి ఇబ్బందులు త్రివేణి సంగమ వేదిక కందకుర్తిలో భక్తులు నీటి సమస్యను ఎదుర్కున్నారు. భక్తుల సందడితో కందకుర్తి పులకరించింది కానీ, కరుణించని వరుణుడు, ప్రవహించని గోదారమ్మ చెంత జల్లుల స్నానాలు తప్పలేదు. మంగళవారం ‘తలపై చల్లుకునే మాత్రం నీళ్లున్నా ఫరవాలేదు’ అంటూ భక్తులు సెంటిమెంట్ కోసం కందకుర్తికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆ ఒక్కరోజే 65 వేల మందికి భక్తులు హాజరైనట్లు అధికారులు అంచనా వేశారు. అయితే,బుధవారం భక్తులు వచ్చినా కందకుర్తి వద్ద గోదావరి లో పూర్తిగా నీరు లేకపోవడం, మురికిగా మారిన నీటిలో స్నానం చేయలేక ఇబ్బంది పడ్డారు. చేసేది లేక జల్లు స్నానం (షవర్‌బాత్) కేంద్రాల వద్దనే పుష్కరస్నానాలు చేశారు. భక్తుల ద్వారా ఈ సమాచారం తెలుసుకున్న చాలామంది కందకుర్తికి ప్రత్యామ్నాయంగా పోచంపాడ్, తడపాకల్, ఉమ్మెడ, తుంగిని తదితర పుష్కరఘాట్లను ఎంచుకున్నారు. దీంతో కందకుర్తికి భక్తుల రద్దీ తగ్గగా.. పోచంపాడ్‌కు తాకిడి పెరిగింది. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, దేవాదాయశాఖ కమీషనర్ కేశవ్ తదితరులు పోచంపాడ్లోనే పుష్కరస్నానాలు చేశారు. హైదరాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలకు చెందిన చా లా మంది భక్తులు కూడ పోచంపాడ్ దారి పట్టడంతో అక్కడ రద్దీ పెరిగింది. శుక్రవారం, శనివారం, ఆదివారాలలో మరింత భక్తులు పెరిగే అవకాశం ఉందని, ఈ దిశ లో ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. పుష్కరఘాట్లలో సమస్యల నివేదన సుమారు 50 లక్షల మంది భక్తుల కోసం జిల్లాలోని 11 ప్రాంతాలలోని 18 ఘాట్లలో ఏర్పాట్లు చేశారు. ఆ మేరకు భక్తులు లేకపోగా, శుక్రవారం నుంచి భక్తుల రద్దీ పె రుగుతుందని భావిస్తున్నారు. ప్రధానంగా అధికార యంత్రాంగం కందకుర్తిపై దృష్టి సారించి అక్కడ భారీ ఏర్పాట్లు చేసింది. అయితే మహారాష్ర్టలోని గైక్వాడ్, విష్ణుపు రి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు అక్కడి ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసింది. దీనికి తోడు వర్షాలు, వరదలు లేక గోదారి బోయిబోయింది.దీంతో కందకుర్తికి చేరు కున్న భక్తులు నీటి వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. పొక్లయినర్లతో గోదావరిలో ఉన్న నీరంతా ఒకేచోటకు చేర్చే ప్రయత్నం చేసినా భక్తుల రద్దీకి అది సరిపోలేదు. పోచంపాడ్, దాని కింది భాగంలోని ఘాట్లకు ప్రాజెక్టు నీటిని వదులుతున్నందున ప్రజలు అక్కడికి వెళ్లాలని కలెక్టర్ రోస్ భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఐదు పుష్కర ప్రాంతా లను పర్యటించి వివరాలను, ఏర్పాట్లను పరిశీలించి, ఘాట్ల వద్ద నీటి ప్రవాహం వచ్చేలా, మురికి నీరు నిలువ ఉండకుండా చూడాలని,తద్వారా భక్తులు శుభ్రమైన నీటి స్నానాలు ఆచరించడానికి వీలు కలుగుతుందని సూచించారు. ఘాట్ల ప్రక్కన గల మట్టిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. పోచంపాడ్ ఘాట్ల వద్ద నిలిచి ఉన్న వాహనాలను చూసి వెంటనే వాటిని పార్కింగ్ స్థలానికి తరలించాలని, ఎట్టి పరిస్థితుల్లో ఘాట్ల వద్ద వాహనాలు నిలుపడానికి వీలు లేదని అధికారులను ఆదేశించారు. విఐపీలు, ఎస్కారు వాహనాలు మినహా ఏవీ ఉండడానికి వీలు లేదని, వికలాంగులు, వద్దులను ఘాట్ల వద్ద వదిలి వాహనాలు వెనకకు వెళ్లాల్సిందేనన్నారు. -
షవర్ల కిందే పుష్కర స్నానాలు..
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు, తడపాకల్, ఉమ్మెడ, తుంగిని పుష్కర ఘాట్ల వద్ద భారీ సంఖ్యలో యాత్రికులు పుష్కర స్నానాలు ఆచరించారు. కందకుర్తి, తాడ్ బిలోలిలో నీళ్లు లేక షవర్ల కిందే స్నానాలు చేస్తున్నారు. ఈ ఘాట్లలో అన్ని చోట్ల భద్రత పెంచడంతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గోదావరి పుష్కరాల కోసం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతూనే ఉంది. రెండో రోజు కూడా భక్తులు నీళ్లు లేకపోవడంతో పుష్కర స్నానాలు ఆచరించడానికి ఇబ్బందులు పడుతున్నారు. -
కొవ్వూరులో వైఎస్ జగన్ పుష్కరస్నానం
-
కొవ్వూరులో వైఎస్ జగన్ పుష్కరస్నానం
ఆల్కాట్‌తోట (రాజమండ్రి) : వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో వీఐపీ ఘాట్‌లో పుష్కరస్నానం ఆచరించారు. పుష్కర స్నానం ఆచరించడానికి ఆయన బుధవారం ఉదయం రాజమండ్రి నుంచి బయలుదేరి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు చేరుకుని, అక్కడి గోష్పాదక్షేత్రానికి విచ్చేశారు. గోష్పాదక్షేత్రంలో గోదావరి మాతకు ఆయన పూజలు చేశారు. పుష్కర ఘాట్ వద్ద తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి వైఎస్ జగన్ పిండ ప్రదానం చేశారు. రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాటలో మరణించినవారి ఆత్మకు శాంతి చేకూరాలని జగన్ ప్రార్థించారు. వైఎస్ జగన్ తిరిగి రాజమండ్రి చేరుకుని అయ్యప్పస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత ఉమామార్కేండేయేశ్వరస్వామివారి ఆలయంలో స్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న పుష్కర సేవా కార్యక్రమాలను ఆయన పరిశీలిస్తారు. మధ్యాహ్నం కోటిలింగాల ఘాట్‌ను సందర్శించి పూజ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం మధురపూడి విమానాశ్రయం నుంచి హైదరాబాద్ బయల్దేరతారు. -
పుణ్యస్నానం చేద్దామని వచ్చి...
-
పుణ్యస్నానం చేద్దామని వచ్చి...
రాజమండ్రి : పుణ్యస్నానం చేద్దామని గోదావరి తీరానికి వచ్చిన భక్తులు పుణ్యలోకాలకు చేరిపోయారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి కోటగుమ్మం పుష్కరఘాట్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో 27 మంది కన్నుమూశారు. అనేక మంది గాయపడ్డారు. భక్తిభావంతో కళకళలాడాల్సిన పుష్కరఘాట్లలో...ఓవైపు ఏడుపులు, మరోవైపు తమవారి జాడ కోసం...అయినవారి ఆర్తనాదాలతో ఇప్పుడు భీకర వాతావరణం నెలకొంది. రాజమండ్రి కోటగుమ్మం పుష్కర ఘాట్‌కు తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.. అయితే విఐపీల కోసం గేట్లన్నీ మూసి వుంచారు.. వీఐపీలు వెళ్లిపోయాక ఒక్కసారిగా గేటు తెరవటంతో తొక్కిసలాట జరిగింది.. ఇప్పటి వరకు వున్న సమాచారం ప్రకారం 25 మంది చనిపోయారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు, వృద్ధులే ఎక్కువ మంది వున్నారు. తొక్కిసలాటతో అక్కడ భయానక వాతావరణ ఏర్పడింది.. ప్రాణాలు దక్కించుకునేందుకు భక్తులు అక్కడ వున్న వాహనాలు, దేవాలయం గోపురాలు, గోడలపైకి ఎక్కారు. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
సూర్యప్రభలో శ్రీవారి దివ్యదర్శనం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి రథ సప్తమి వేడుక అశేష భక్తజనం మధ్య గురువారం వైభవంగా జరిగింది. వేకువజామున ఆలయంలో సుప్రభాతం, తోమాల, అర్చన, ఇతర వైదిక సేవల అనంతరం ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనం ప్రారంభించి 9.30 గంటలకు పూర్తిచేశారు. తర్వాత వరుసగా చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలపై స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం 2.20 గంటలకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం శాస్త్రోకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేశారు. రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీవారు మాడవీధుల్లో ఊరేగడంతో రథసప్తమి మహోత్సవం ముగిసింది. ఉత్సవమూర్తిని భక్తులు దర్శించుకునే సమయంలో పలుచోట్ల తోపులాటలు చోటుచేసుకున్నాయి. కాగా, ఉదయం 6.58 గంటలకు దినకరుని తొలి కిరణాలు దేవదేవుని పాద పద్మాలను తాకాయి. భానుడి కిరణాలు తొలుత సూర్యప్రభను, ఆ తర్వాత స్వామి కిరీటం, ముఖతేజస్సు, కంఠాభర ణాలు, వక్షస్థలం, ఉదర భాగాల నుంచి పాద పద్మాలను తాకుతూ స్వర్ణకాంతులతో స్వామిని అభిషేకించాయి.