
సర్వపాపహరణం.. సాగరసంగమ స్నానం
కోడూరు : గంగను సైతం పునీతం చేసిన పవిత్ర కృష్ణా, సాగరసంగమ ప్రదేశంలో పుణ్యస్నానం ఆచరిస్తే సర్వపాపాలు దూరమవుతాయని కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి తన శిష్యబృందానికి ఉపదేశించారు. రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి విజయేంద్ర స్వామి గురువారం సూర్యోదయం వేళ హంసలదీవి సమీపంలోని సాగరసంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు. స్వామివారు నదీ, సాగర సంగమ విశిష్టత గురించి తన శిష్యులకు వివరించారు. సంగమ ప్రాంతంలో ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో ఒక్కసారైనా స్నానం చేసి, ముక్తి పొందాలన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలు భావితారాల వారికి తెలిపే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు నిచ్చారు. తన శిష్యబృందంతో కలిసి కృష్ణమ్మకు పసుపు, కుంకుమతో ప్రత్యేక పూజలు చేసి, సారె సమర్పించి హారతులిచ్చారు.
వేణుగోపాలుడికి ప్రత్యేక పూజలు
హంసలదీవి గ్రామంలోని శ్రీరుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి వారికి విజయేంద్ర స్వామిజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేశారు. ఆలయ విశిష్టతను, వేణుగోపాలుడి లీలామానష విగ్రహ ప్రత్యేకతలను స్వామికి బుద్ధప్రసాద్ వివరించారు. కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ ముద్దినేని చంద్రరరావు, హైందవ సంఘం అధ్యక్షుడు మోపిదేవి చక్రవర్తి, మోపిదేవి సుబ్రమణ్యేశ్వర స్వామివారి దేవాలయ ప్రధాన అర్చకుడు పవ¯ŒSకుమార్‌శర్మ, సర్పంచి కొక్కిలిగడ్డ సముద్రాలు తదితరులు పాల్గొన్నారు.