sagara samgamam
-
సగర సంఘం అధ్యక్షుడిగా నర్సింహ ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సగర(ఉప్పర) సంఘం అధ్యక్షుడిగా బంగారు నర్సింహ సగర, ప్రధాన కార్యదర్శిగా ఉప్పరి శేఖర్ సగర ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. సోమవారం నాంపల్లిలోని తెలంగాణ గెజిటెడ్ భవన్లో సంఘం ఎన్నికలు జరిగాయి. సంఘం కోశాధికారిగా వరంగల్‌కు చెందిన కె.సదానందం సగరలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నర్సింహ మాట్లాడుతూ గత 3 ఏళ్లుగా అధ్యక్షుడిగా ఉంటూ సగర ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో ఈఎండీలు లేకుండా టెండర్లలో పాల్గొనే వీలుగా జీవో 29ను సాధించామన్నారు. సగర జాతి సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్లో సగర ఫెడరేషన్‌కు రూ.6.30 కోట్లు కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ఒప్పించామన్నారు. సగరల బతుకులు మారాలంటే బీసీ ‘డీ’నుంచి ‘ఏ’లో చేర్చాల్సిన అవసరం ఉందని ప్రధానకార్యదర్శి శేఖర్ అన్నారు. కార్యక్రమంలో జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, మాజీ రాష్ట్ర కమిటీ సలహాదారులు, మాజీ స్టీరింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సగరులను బీసీ–ఏలో చేర్చండి సాక్షి, హైదరాబాద్: సగరులను బీసీ–డీ నుంచి బీసీ–ఏకు మార్చాలని, సగర ఫెడరేషన్లకు రూ.250 కోట్ల బడ్జెట్ కేటాయించాలని సగర సంఘం డిమాండ్ చేసింది. సగర సంఘం నూతన అధ్యక్షుడు ముత్యాల హరికిషన్ సాగర్ నేతృ త్వంలోని కమిటీ సభ్యులు సోమవారం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని కలిసి సగరుల సమస్యలపై వినతిపత్రం అందచేశారు. భగీరథుని విగ్రహం ట్యాంక్‌బండ్‌పై నెలకొల్పాలని, ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు. సగరల డిమాండ్లను పరిష్కరిస్తామని కడియం హామీ ఇచ్చారు. -
సర్వపాపహరణం.. సాగరసంగమ స్నానం
కోడూరు : గంగను సైతం పునీతం చేసిన పవిత్ర కృష్ణా, సాగరసంగమ ప్రదేశంలో పుణ్యస్నానం ఆచరిస్తే సర్వపాపాలు దూరమవుతాయని కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి తన శిష్యబృందానికి ఉపదేశించారు. రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి విజయేంద్ర స్వామి గురువారం సూర్యోదయం వేళ హంసలదీవి సమీపంలోని సాగరసంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు. స్వామివారు నదీ, సాగర సంగమ విశిష్టత గురించి తన శిష్యులకు వివరించారు. సంగమ ప్రాంతంలో ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో ఒక్కసారైనా స్నానం చేసి, ముక్తి పొందాలన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలు భావితారాల వారికి తెలిపే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు నిచ్చారు. తన శిష్యబృందంతో కలిసి కృష్ణమ్మకు పసుపు, కుంకుమతో ప్రత్యేక పూజలు చేసి, సారె సమర్పించి హారతులిచ్చారు. వేణుగోపాలుడికి ప్రత్యేక పూజలు హంసలదీవి గ్రామంలోని శ్రీరుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి వారికి విజయేంద్ర స్వామిజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేశారు. ఆలయ విశిష్టతను, వేణుగోపాలుడి లీలామానష విగ్రహ ప్రత్యేకతలను స్వామికి బుద్ధప్రసాద్ వివరించారు. కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ ముద్దినేని చంద్రరరావు, హైందవ సంఘం అధ్యక్షుడు మోపిదేవి చక్రవర్తి, మోపిదేవి సుబ్రమణ్యేశ్వర స్వామివారి దేవాలయ ప్రధాన అర్చకుడు పవ¯ŒSకుమార్‌శర్మ, సర్పంచి కొక్కిలిగడ్డ సముద్రాలు తదితరులు పాల్గొన్నారు.