![Magha Purnima: When is the next Mahakumbh bath? Know the auspicious date and time](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/magba-main.jpg.webp?itok=dYGBGY28)
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఈరోజు (బుధవారం) భక్తులు మాఘపౌర్ణమి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈరోజు ఉదయం 10 గంటల నాటికి 1.20 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. మాఘపౌర్ణమి పుణ్య స్నానాల సందర్భంగా కుంభమేళా అధికారులు హెలికాప్టర్‌లో భక్తులపై పుష్పవర్షం కురిపించారు. ప్రస్తుతం త్రివేణీ సంగమంలో పవిత్రస్నానాలు ఆచరించేందుకు భక్తులు బారులు తీరారు. ఈరోజు సుమారు రెండు కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మహాకుంభమేళా ప్రారంభమైనది మొదలు ఇప్పటివరకూ మూడు అమృత స్నానాలు పూర్తయ్యాయి. దీంతో తదుపరి పుణ్య స్నానం ఎప్పుడనే సందేహం చాలామందిలో ఉంది.
#WATCH | 'Pushp varsha' or showering of flower petals being done on devotees and ascetics as they take holy dip in Sangam waters on the auspicious occasion of Maghi Purnima during the ongoing #MahaKumbh2025 in Prayagraj. #KumbhOfTogetherness pic.twitter.com/FC1C2uetnb
— ANI (@ANI) February 12, 2025
కుంభమేళా నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 26న తదుపరి పవిత్ర స్నానాలు ఉండనున్నాయి. ఆరోజు మహాశివరాత్రి కావడం విశేషం. శివుని భక్తులు ఆరోజును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అదేరోజున కుంభమేళాలో పవిత్ర స్నానం చేసేందుకు శివభక్తులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో శివరాత్రి రోజున కుంభమేళాకు లెక్కకుమించినంతమంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: అక్షరాలు దిద్దుతున్న కుంభమేళా మోనాలిసా
Comments
Please login to add a commentAdd a comment