
తిరువనంతపురం : స్వాతంత్య్ర సమరయోధుడు, జాతిపిత మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీని అరెస్ట్ చేయాలని అటు ఆర్‌ఎస్‌ఎస్, ఇటు బీజేపీ డిమాండ్ చేస్తుంది. అరెస్ట్‌తో సరిపెట్టడం కాదు. తప్పని సరిగా తమకు క్షమాపణలు చెప్పాల్సిందేనని భీష్మిస్తున్నాయి.
తుషార్ గాంధీ ఇటీవల కేరళ రాజధాని తిరువనంతపురంలోని నెయ్యంట్టికరలో గాంధీ సిద్ధాంతవాది పి.గోపీనాథన్ నాయకర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై విమర్శలు గుప్పించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ రెండూ సమాజానికి ప్రమాదకరం, శత్రులని అభివర్ణించారు. ఆర్‌ఎస్‌ఎస్ నిలువెల్లా విషం నింపుకుందని ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. స్థానిక బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ వాదులు తుషార్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు.
అయితే,ఇదే అంశంపై తుషార్ గాంధీ ప్రస్తావించారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడుతున్నట్లు చెప్పారు. చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవడం, క్షమాపణలు చెప్పబోమని అన్నారు. ఈ సంఘటన నా సంకల్పాన్ని మరింత బలపరచిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment