RSS
-
వర్సిటీలపై ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని రుద్దే కుట్ర
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) విడుదల చేసిన నూతన మార్గదర్శకాలు దేశ సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేలా ఉన్నాయని మేధావులు ఆందోళన వ్యక్తంచేశారు. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వర్సిటీలపై రుద్దే కుట్రలో భాగంగానే ఈ మార్గదర్శకాలను రూపొందించారని ఆరోపించారు. రాష్ట్ర విద్యా కమిషన్ నేతృత్వంలో ‘యూనివర్సిటీ రెగ్యులేషన్స్ – రాష్ట్ర యూనివర్సిటీల్లో జోక్యం’ అనే అంశంపై గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, ప్రొఫెసర్లు హరగోపాల్, శాంతాసిన్హా, రాం మెల్కొటే, డి.నర్సింహారెడ్డి, తిరుపతిరావు, మురళీ మనోహర్, ఎస్.సత్యనారాయణ, అమీర్ ఉల్లాఖాన్, కె.లక్ష్మీనారాయణ, పద్మాషా, డాక్టర్ చరకొండ వెంకటేశ్ తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. యూజీసీ మార్గదర్శకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. ఆర్ఎస్ఎస్ భావజాల వ్యాప్తికే: మురళి విశ్వవిద్యాలయాల అధికారాలను తన గుప్పిట్లో పెట్టుకోవడానికే యూజీసీ కొత్త మార్గదర్శకాలను తెచ్చిందని ఆకునూరి మురళి విమర్శించారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు. బోదన, బోధనేతర సిబ్బంది నియామకాలన్నీ కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవాలని చూస్తోందని ఆరోపించారు. యూనివర్సిటీకి వైస్ చాన్స్‌లర్‌గా నియమించాలంటే పీహెచ్డీ చేసి, పదేళ్లు ప్రొఫెసర్‌గా పనిచేసి ఉండాలనే నిబంధనను యూజీసీ ముసాయిదా మార్గదర్శకాల్లో పూర్తిగా మార్చేశారని తెలిపారు. పరిశ్రమలు, అకడమిక్ అడ్మినిస్ట్రేటర్ , పబ్లిక్ సెక్టార్లో.. ఇలా నచ్చిన వారిని ఎలాంటి నిబంధనలు లేకుండా నియమించుకునే అధికారం కేంద్రం తన చేతుల్లోకి తీసుకునేలా మార్గదర్శకాలు ఉన్నా యని చెప్పారు. మితిమీరిన జోక్యం: ప్రొఫెసర్ కోదండరాం విశ్వవిద్యాలయాలపై కేంద్రం మితిమీరిన జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. రాజకీయాలకు అతీతంగా యూనివర్సిటీలు ఉండేలా చూ సేందుకు ఏర్పాటుచేసిన యూజీసీనే ఇప్పుడు రాజకీయం చేయడం దారుణమన్నారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. వర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాపాడేందుకు అన్నివర్గాలు సమైక్యంగా గళమెత్తాలన్నారు. వీసీలను నియమించే అధికారం ఇప్పటికే గవర్నర్ చేతుల్లో ఉందని, ఆ గవర్నర్‌ను కేంద్రమే తన ప్రతినిధిగా నియమిస్తుందని గుర్తుచేశారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై కూడా ఈ తరహా చర్చలు ఎందుకు పెట్టడం లేదని ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్స్ అసోసియేషన్ నేత ఆజాద్ సదస్సులో ప్రశ్నించారు. -
మన రాజ్యాంగం బలమైనదేనా?
మీకు తెలుసా? ప్రపంచ దేశాలన్నింటి రాజ్యాంగాల సగటు ఆయుష్షు 19 ఏళ్లు మాత్రమేనని! భారతదేశం మాత్రం 75 ఏళ్ల పాటు తన రాజ్యాంగాన్ని కాపాడుకుంది. దీనికి సంతోషపడదాం. గర్వంగా ఫీల్ అవుదాం. దేశ చరిత్రలోనే కీలకమైన ఈ ఘట్టాన్ని గత వారమే చూశాం. అయితే, సమీక్షకు తగిన సమయం కూడా ఇదే! డెబ్ఫై ఐదేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో భారత రాజ్యాంగం ఎదుర్కొన్న సవాళ్లు, ప్రశ్నలేమిటన్నది చూద్దాం.మన రాజ్యాంగం వలసవాదులదని చాలామంది మేధావులు విమర్శిస్తూంటారు. భారతీయ మూలాలు ఉన్నది కాదని ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యానిస్తూ ఉండేది. అలాంటప్పుడు ఇది ఏ విధంగా మనకు మంచిది?ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని అందించిందనేది ఒక సమాధానం. అలాగే ఏకకాలంలో అర్హులందరికీ ఓటుహక్కు కల్పించిన రాజ్యాంగం కూడా మనదే. కానీ దీనివల్ల అందరూ సమానంగా లాభ పడ్డారా? లేక... ముస్లింలు, ఆదివాసీలు, దళిత మహిళలు లాభ పడలేదా? డెబ్భై ఏళ్ల ప్రయాణంలో మన రాజ్యాంగం ఇప్పటివరకూ 106 సార్లు మార్పులకు గురైంది. ఇది మన శక్తికి ప్రతీకా? ఎందుకంటే, అవసరమైనప్పుడు తగు విధంగా మార్పులు, చేర్పులు చేసుకునే వీలుతో రాజ్యాంగం ఉంది. లేదా ఇది బలహీనతా? అగ్రరాజ్యం అమెరికాలో 1789 నుంచి జరిగిన సవరణలు కేవలం 27 మాత్రమే.శాసనాలు చేసే ప్రజా ప్రతినిధుల వ్యవస్థ కంటే కార్యనిర్వాహక వర్గాన్ని రాజ్యాంగం ఎక్కువ బలోపేతం చేసిందని చెబుతారు. అసెంబ్లీ స్పీకర్ల పనితీరు, రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ఈ పరి స్థితిని మరింత దిగజార్చాయి. ఫలితంగా ఎంపీలు పార్టీ నాయకత్వా నికి సబార్డినేట్లుగా మారిపోయారు. స్పీకర్లకు హౌస్ ఆఫ్ కామన్ ్స (యూకే) మాదిరిగా వారిపై అధికారం ఏదీ ఉండదు. ఈ విమర్శను ఇప్పటివరకూ ఎవరూ సవాలు చేయలేదు కూడా! అయితే దీని వెనుక ఏముందన్నది నిశితంగా పరిశీలించాల్సిన అంశం. ‘‘భారతీయ రాజ్యాంగం అడ్డుగోడలు నిర్మించకుండా... కార్యనిర్వాహక వర్గానికి ఎక్కువ అధికారాలు ఇచ్చింది. అంతేకాకుండా ఈ వర్గం తన అధికారాన్ని పూర్తిస్థాయిలో చలాయిస్తుందని విశ్వసించింది’’ అంటారు గౌతమ్ భాటియా. పాలకులందరూ మంచివారనీ, రాజ్యాంగాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తారని రాజ్యాంగ నిర్మాతలు భావించారా? ఊహూ, అలా అనుకోలేదని స్పష్టంగా చెప్పవచ్చు. ఒక ఉదాహరణ – ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితి. ఇది రాజ్యాంగాన్ని సుప్తచేతనావస్థలో పెట్టడం వల్లనో, రాజ్యాంగా నికి అతీతంగా పోవడం వల్లనో అమలు కాలేదు. దాంట్లో భాగమైన వ్యవస్థలతోనే జరిగింది. ఇది మన రాజ్యాంగం బలహీనత లేదా లోపాన్ని ఎత్తిచూపింది. రాజ్యాంగ పరమైన నైతికత లేని విషయాన్ని ఎమర్జెన్సీ పరిస్థితి ఎత్తి చూపిందని చెప్పవచ్చు. ఈ నైతికత అనేది రాజ్యాంగ స్ఫూర్తితోనే వ్యవస్థలు పనిచేస్తాయా, లేదా అన్నదాన్ని నిర్ణయిస్తుంది. గవర్నర్లు, ఎన్నికల కమిషనర్లు తరచూ ఈ రాజ్యాంగ నైతికతను తప్పుతుంటారని మనకు తెలుసు. కానీ వాటిపై వ్యాఖ్యా నించడం కంటే ఎక్కువేమీ చేయలేము – ఈ అంశాలపై మనఆందోళన, విమర్శ ఎంత స్థాయిలో ఉన్నప్పటికీ! రాజ్యాంగంలో ఉన్న మరో లోటు ఇదేనా?రాజ్యాంగం సమాఖ్య నిర్మాణానికి ఏర్పాటు చేసింది. కానీ ఆర్థికాంశాలతో పాటు పరిపాలనకు సంబంధించిన విషయాల్లోనూ రాష్ట్రాలపై పెత్తనం చలాయించే అధికారం కేంద్రానికి కట్టబెట్టింది. సమాఖ్య స్వరూపాన్ని మార్చే అధికారం, శక్తి కూడా కేంద్రానిదే. స్వాతంత్య్రం లభించిన సమయంలో దేశం బలహీనంగా, ముక్కలు ముక్కలుగా విడిపోయింది కాబట్టి... ఆ పరిస్థితుల్లో ఇలాంటి ఏర్పాట్లు చేశారని అనుకున్నా మూడు సిల్వర్ జూబ్లీల కాలం గడచిన ఈ తరుణంలోనైనా మార్పులు చేయడం అనవసరమా? భారతీయ పౌరులకు రాజ్యాంగం బోలెడన్ని ప్రాథమిక హక్కు లను కల్పించింది. అయితే భావ ప్రకటన, వ్యక్తీకరణపై పూర్తిస్థాయి స్వాతంత్య్రం మాత్రం లేకుండా పోయింది. నిజానికి ఈ ‘ఫ్రీ స్పీచ్’ను నైతికత, పరువునష్టం వంటి రెండు సందర్భాల్లో మాత్రమే నియంత్రించాల్సి ఉంటుంది. మహా అయితే... విదేశాలతో మన సంబంధాలు దెబ్బతినే పరిస్థితులకూ పొడిగించవచ్చు. కానీ... మనకున్న నియంత్రణలు చాలా ఎక్కువగా లేవూ?1973లో రాజ్యాంగంపు మౌలిక స్వరూపాన్ని కాపాడే లక్ష్యంతో సుప్రీంకోర్టు కొన్ని విధి విధానాలను సిద్ధం చేసింది. ఇదో చారిత్రక నిర్ణయం. అయితే దాదాపుగా అదే సమయంలో జబల్పూర్ అడిష నల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఎమర్జెన్సీ విషయంలో శాసనకర్తల ఒత్తిడికి లొంగిపోయారు. అయోధ్య విషయంలోనూ ఇదే జరిగిందన్నది చాలామంది అభిప్రాయం. అలాగే జమ్మూ–కశ్మీర్‌కు ఉన్న రాష్ట్ర హోదాను కూడా రాజ్యాంగం కాపాడలేకపోయింది. కాబట్టి... రాజ్యాంగ సంరక్షణ చేయాల్సిన న్యాయస్థానాలు తమ నిర్ణయాల్లో అసందిగ్ధతతో వ్యవహరిస్తున్నాయి. లేదంటే అవసరమైనంత చేయడం లేదు. రాజ్యాంగం మనకు ఎన్నికల కమిషన్ , కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్), ఇన్ఫర్మేషన్ కమిషన్ వంటి ఎన్నో వ్యవస్థలను కల్పించింది. కానీ... ఇవి పాలకవర్గానికి అతీతంగా స్వతంత్రంగా పని చేసేలా మాత్రం చేయలేకపోయింది. ఆ యా సంస్థల ఉన్నతాధి కారుల నియామకాల విషయంలో ఇది మరింత సత్యమని చాలా మంది చెబుతారు. చివరగా... రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన రాజకీయ నేతలు, సంస్థల అధినేతలు ఆ పని ఎంత వరకూ సక్రమంగా నిర్వర్తించారు? అలాగే రాజ్యాంగ సంరక్షణ బాధ్యతను న్యాయమూర్తులు ఎంత సమర్థంగా నిర్వహించారు? సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకూర్‌ను ఇదే ప్రశ్న అడిగితే... ‘‘భారత్‌కు మంచి రాజ్యాంగం ఉంది. కీలక సందర్భాల్లో రాజకీయ నేతలు, న్యాయమూర్తులు దీని ప్రతిష్ఠను దిగజార్చారు. పాలకవర్గం మాత్రమే కాదు... పార్లమెంటు కూడా ఇందులో భాగస్వామే’’ అన్నారు. ఇందులో అంగీకరించక పోయేందుకు ఏమీ లేదన్నది నా అభిప్రాయం!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
రాహుల్ గాంధీపై పాలవ్యాపారి కేసు
కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ రాహుల్‌గాంధీపై బీహార్‌లో ఓ కేసు నమోదు అయ్యింది. ఓ పాలవ్యాపారి తనకు రూ.250 నష్టం వాటిల్లిందని, అందుకే రాహుల్ తాజాగా చేసిన వ్యాఖ్యలే కారణమని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) తాజాగా ఢిల్లీ కోటా రోడ్డులో కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ఆరెస్సెస్, బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ఆయన మాటలతో దిగ్భ్రాంతికి లోనైన ముకేష్ కుమార్ చౌదరి అనే వ్యక్తి.. తన చేతిలో ఉన్న పాలబకెట్ను వదిలేశాడట. దీంతో పాలన్నీ నేలపాలై.. అతనికి నష్టం వాటిల్లిందట!.ఈ షాక్ నుంచి తేరుకుని అతను నేరుగా సమస్తిపూర్(Samastipur) పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రాహుల్‌గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాహుల్ మాటలతో నేను షాక్‌కి లోనయ్యా. నా చేతిలో ఉన్న బకెట్‌ను వదిలేశా. లీటర్ పాలు రూ.50.. మొత్తం రూ.250 నష్టం కలిగింది. రాహుల్ అలా మాట్లాడతారని అనుకోలేదు. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడినందుకు ఆయనపై కేసు పెడుతున్నట్లు చెప్పాడతను. దీంతో ఈసారి షాక్ తినడం పోలీసుల వంతు అయ్యింది. చేసేదిలేక.. బీఎన్ఎస్లో పలు సెక్షన్ల ప్రకారం రాహుల్‌పై కేసు నమోదు చేశారు.జనవరి 15న ఢిల్లీలోని కోట్లా రోడ్డులో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రధాన కార్యాలయం ప్రారంభమైంది. ఈ సందర్భంలో రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో ఉన్న ప్రతీ సంస్థలను బీజేపీ(BJP), ఆర్ఎస్ఎస్(RSS)లు స్వాధీనం చేసుకున్నాయి. కాంగ్రెస్ ఇప్పుడు ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్తోపాటు దేశంతో పోరాడాల్సి వస్తోంది’’ అని అన్నారు. అయితే..‘దేశంతో పోరాటం’ అని వ్యాఖ్యపై దేశం నలుమూలల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడగా.. ఆయన దేశంలోని వాస్తవ పరిస్థితిని చెప్పే ప్రయత్నం చేశారంటూ కాంగ్రెస్ సమర్థించింది.ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే అసోం(Assam) రాజధాని గౌహతిలో మోంజిత్ చెటియా అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దేశంలో అశాంతి, వేర్పాటువాద భావాలను రాహుల్ గాంధీ రేకిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతను ప్రమాదంలో పడేసే చర్యలకు ఆయన పాల్పడినట్లు అందులో ఆరోపించారు. దీంతో పలు సెక్షన్ల కింద పాన్ బజార్ పోలీస్ స్టేషన్లో రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. -
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ రాహుల గాంధీ
-
మనుస్మృతి మద్దతుదారులు!
న్యూఢిల్లీ: ‘‘బీజేపీకి, ఆరెస్సెస్‌కు రాజ్యాంగంపై విశ్వాసం లేదు. అవి కేవలం మనుస్మృతినే చట్టంగా భావిస్తున్నాయి. దానికే మద్దతిస్తున్నాయి’’ అని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కానీ మన దేశం రాజ్యాంగం ఆధారంగానే నడుస్తుంది తప్ప మనుస్మృతి ప్రకారం కాదని తేలి్చచెప్పారు. ‘‘పాలక పక్షానికి సుప్రీం నేత అయిన వినాయక్ దామోదర్ సావర్కర్ రాజ్యాంగాన్ని విమర్శించారు. అందులో భారతీయతే లేదన్నారు. మనుస్మృతి ప్రకారమే దేశం నడవాలని కోరుకున్నారు. ఇప్పుడు బీజేపీ పెద్దలు రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడడం ద్వారా వారి సుప్రీం లీడర్‌ను నవ్వులపాలు చేస్తున్నారు’’ అంటూ ఎద్దేవా చేశారు. రాజ్యాంగ వజ్రోత్సవాలపై లోక్‌సభలో జరుగుతున్న ప్రత్యేక చర్చలో రెండో రోజు శనివారం రాహుల్ పాల్గొన్నారు. బీజేపీ తీరుపై నిప్పులు చెరిగారు. పేదలను కాపాడుతున్న రాజ్యాంగంపై బీజేపీ నిత్యం దాడులు చేస్తోందని ధ్వజమెత్తారు. బ్రిటిషర్లతో రాజీపడ్డ సావర్కర్ బీజేపీ సుప్రీం లీడర్ సావర్కర్ మాటలతోనే ప్రసంగం ప్రారంభిస్తానని రాహుల్ అన్నారు. ‘‘వేదాల తర్వాత అత్యంత ఆరాధనీయ గ్రంథం మనుస్మృతి అని సావర్కర్ చెప్పారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు, అలవాట్లు, ఆలోచనలకు మనుస్మృతే ఆధారమన్నారు. మన ఆధ్యాతి్మక, దైవిక మార్గాన్ని అది నిర్దేశించిందని చెప్పారు. మను స్మృతి ఆధారంగానే దేశం నడుచుకోవాలంటూ రచనలు, పోరాటం చేశారు. ఇప్పుడు మీరేమో (బీజేపీ) రాజ్యాంగాన్ని కాపాడాలని మాట్లాడు తున్నారు. అంటే మీ నాయకుని బోధలకు మద్దతిస్తున్నట్టా, లేదా? మీరు రాజ్యాంగ రక్షణ గురించి మాట్లాడటమంటే సావర్కర్‌ను మీరు అవమానిస్తున్నట్లే. హేళన చేస్తున్నట్టే. కించపరుస్తున్నట్టే. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ కూడా సావర్కర్‌ను ప్రశంసించారంటూ బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజానికి సావర్కర్ బ్రిటిషర్లతో రాజీపడ్డారని ఇందిర ఆరోపించారు. గాం«దీజీ, నెహ్రూ స్వాతంత్య్ర పోరాటంలో జైలుకెళ్తే సావర్కర్ మాత్రం బ్రిటిషర్లకు క్షమాపణ లేఖ రాసి మరీ జైలు నుంచి బయటపడ్డారని అప్పట్లో ఇందిర విమర్శించారు’’ అని చెప్పారు. ప్రతి రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం కురుక్షేత్ర యుద్ధంలో మాదిరిగా నేడు దేశంలో రెండు పక్షాలు ఇరువైపులా మోహరించాయని రాహుల్ అభిప్రాయపడ్డారు. ‘‘ఒకటి రాజ్యాంగాన్ని కాపాడే పక్షం. మరొకటి దాన్ని ధ్వంసం చేయాలనుకుంటున్న పక్షం. మేం ప్రతి రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం. మాకు తమిళనాడులో పెరియార్, కర్ణాటకలో బసవన్న, మహారాష్ట్రలో పూలే, అంబేడ్కర్, గుజరాత్లో గాంధీ ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లో హథ్రాస్‌ను సందర్శించా. సామూహిక అత్యాచారానికి, హత్యకు గురైన యువతి కుటుంబాన్ని పరామర్శించా. బాధిత కుటుంబం అవమానంతో ఇంటికి పరిమితమైతే నిందితులేమో యథేచ్ఛగా తిరుగుతున్నారు. బాధిత కుటుంబం ఇంటికే పరిమితం కావాలని రాజ్యాంగంలో రాసుందా? అది కేవలం మీ (బీజేపీ) పుస్తకంలోనే రాసుంది. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం సురక్షితమైన చోటికి మార్చకపోతే మేమే ఆ పని చేస్తాం. సంభాల్ హింసాకాండలో ఐదుగురు అమాయకులు బలయ్యారు. సమాజంలో బీజేపీ విద్వేషాలు రెచ్చగొడుతోంది’’ అంటూ దుయ్యబట్టారు. కులం, మతం, వర్గం పేరిట ప్రజలను విడగొట్టాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు.బలహీన వర్గాల బొటనవేళ్లు నరికేస్తున్నారు ‘‘ఏకలవ్యుడు గురుదక్షిణ కింద బొటనవేలు నరికి ద్రోణాచార్యుడికి సమరి్పంచాడు. నేడు మోదీ ప్రభుత్వం యువత, కార్మికులు, వెనుకబడిన తరగతులు, పేదల బొటన వేళ్లను నిస్సిగ్గుగా నరికేస్తోంది. వారి నైపుణ్యాలను, జీవనోపాధిని దెబ్బతీస్తోంది’’ అంటూ రాహుల్ దుయ్యబట్టారు. ‘‘అగి్నపథ్ తెచ్చారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న రైతులపై బాష్పవాయువు ప్రయోగిస్తున్నారు. పదవుల భర్తీకి లేటరల్ ఎంట్రీ విధానం తెచ్చారు. పేపర్ లీకేజీలు కొనసాగిస్తున్నారు. ఇలా అన్ని వర్గాల ఉసురు పోసుకుంటున్నారు’’ అని ఆరోపించారు. మోదీ దన్నుతో అదానీ సామ్రాజ్యం దేశంలో కీలక రంగాల్లోకి విస్తరించిందన్నారు. ‘‘మేం అధికారంలోకి వస్తే దేశమంతటా కులగణన నిర్వహిస్తాం. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగిస్తాం’’ అని పునరుద్ఘాటించారు. -
సుప్రీమ్ కదిపిన తేనెతుట్టె
ప్రతి మసీదు కింద శివలింగాన్ని వెతికే పని పెట్టుకోవద్దని స్వయంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. అయినా సంభల్ మసీదు, అజ్మీర్ దర్గాలను భౌతిక సర్వే చేయాలంటూ కేసులు నమోదయ్యాయి. అంటే, ప్రార్థనా స్థలాల చట్టం ఇప్పుడు పనికిరాకుండా పోయిందా? ఇది కాగితాలకే పరిమితమైన చట్టమా? 1947 ఆగస్ట్ 15 నాటికి ఉన్నవి ఉన్నట్టుగా ప్రార్థనాలయాల స్వభావాన్ని కాపాడటం కోసం తెచ్చిన ఈ చట్టంలో, కేవలం అయోధ్యనే మినహాయించారు. అయినప్పటికీ జ్ఞానవాపి మసీదు సర్వేకు అనుమతించడం ద్వారా అత్యున్నత న్యాయస్థానం దిగువ కోర్టులకు పూర్తి మిశ్రమ సందేశం పంపింది. నిర్దిష్ట ప్రార్థనా స్థలాల స్వభావాన్ని పునర్నిర్ణయించాలంటూ వచ్చే కాపీ కేసులతో ఇప్పుడు అసలు ప్రమాదం దాగివుంది.ప్రతి మసీదు కింద శివలింగాన్ని వెతకడాన్ని వ్యతిరేకించినవారు ఎవరో కాదు, సాక్షాత్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్. అయినా మనం ఈ పరిస్థితికి చేరుకున్నాం.సంభల్‌లోని మసీదు సర్వేకు ట్రయల్ కోర్టు అనుమతించిన తర్వాత పోలీసులకూ, నిరసనకారులకూ మధ్య ఘర్షణలు చెలరేగడంతో నలుగురు వ్యక్తులు ఎలా మరణించారు అనే దానిపై ఉత్తరప్రదేశ్‌లోని జ్యుడీషియల్ ప్యానెల్ దర్యాప్తు చేస్తోంది. రాజస్థాన్‌లో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీకి చెందిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అజ్మీర్ దర్గా ఒకప్పుడు శివాలయంగా ఉండేదని వాదిస్తూ తనముందుకు వచ్చిన పిటిషన్ ను స్వీకరించిన తర్వాత స్థానిక కోర్టు పలువురు అధికారులకు నోటీసులు జారీ చేసింది. దర్గాను భౌతిక సర్వే చేయాలని పిటిషనర్ కోరారు. అయోధ్యకే మినహాయింపుఇది ఎక్కడ ముగుస్తుంది? ప్రార్థనా స్థలాల చట్టం ఇప్పుడు నిరర్థకంగా మారిందా? ఇది కేవలం కాగితాలకే పరిమితమైన చట్టమా? దిగువ కోర్టులకు ఇలా పరస్పర విరుద్ధమైన సందేశం పంపడానికి సుప్రీంకోర్టు బాధ్యత వహిస్తుందా? అసలు నేటి రాజకీయ–మత చర్చకు కేంద్రంగా ఉన్న ఈ చట్టం ఏమిటి? 1991 సెప్టెంబరులో, పీవీ నరసింహారావు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు, ‘1947 ఆగస్టు 15న ఉన్న ఏ ప్రార్థనా స్థలంలోనైనా యథాతథ మతపరమైన స్వభావాన్ని కొనసాగించడం కోసం’ పార్లమెంటు చట్టం చేసింది.అయోధ్య కోసం మాత్రం చట్టంలోనే దీనికి మినహాయింపు ప్రత్యేకంగా ఇచ్చారు. ‘ఈ చట్టంలో ఉన్న ఏదీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో ఉన్న రామజన్మభూమి–బాబ్రీ మసీదుగా సాధారణంగా పిలవబడే ప్రార్థనా స్థలానికి వర్తించదు. ఇక్కడ పేర్కొన్న స్థలం లేదా ప్రార్థనా స్థలానికి సంబంధించిన దావా, అప్పీల్ లేదా ఇతర విచారణ వర్తించబడదు’ అని అందులో పేర్కొన్నారు. ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం అయోధ్య తీర్పును ప్రకటించినప్పుడు బెంచ్‌లో ఇద్దరు మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్ కూడా ఉన్నారు. ఈ చట్టం ఉద్దేశ్యం ’రాజ్యాంగ ప్రాథమిక విలువలను రక్షించడం, భద్ర పరచడం’ అని నొక్కిచెప్పడానికి ఈ ప్రత్యేక చట్టాన్ని అమలు చేసినట్లు వీరు చెప్పారు. కీలకమైన విషయం ఏమిటంటే, సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రార్థనా స్థలాల చట్టాన్ని, అది రక్షించే విలువలను రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో ఉంచింది. ఇది కేవలం విద్యా పరమైన లేదా రహస్య వివరాలకు చెందినది మాత్రమే కాదు. ఇది ముఖ్యమైనది. ఎందుకంటే, కేశవానంద భారతి కేసు తీర్పులో, రాజ్యాంగ మౌలిక స్వరూపం మారరాదు అని స్పష్టం చేసింది. ఏదైనా చట్టాన్ని రూపొందించడానికి/సవరించడానికి మాత్రమే పార్లమెంటుకు స్వేచ్ఛ ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. బాధ్యతాయుత చట్టంపార్టీలకు అతీతంగా విస్తృతంగా ప్రశంసలు పొందిన అయోధ్య తీర్పు ఈ చట్టం గురించి ఇలా పేర్కొంది: ‘భారత రాజ్యాంగం ప్రకారం లౌకికవాదం పట్ల మన నిబద్ధతను అమలు చేసే దిశగా ప్రార్థనా స్థలాల చట్టం ఒక కించపరచని బాధ్యతను విధిస్తుంది.అందువల్ల చట్టం రూపొందించిన శాసన సాధనం రాజ్యాంగ ప్రాథమిక లక్షణాలలో ఒకటైన భారత రాజకీయాల లౌకిక లక్షణాలను రక్షించడానికే ఉంది. తిరోగమించకపోవడం అనేది ప్రాథమిక రాజ్యాంగ సూత్రాల మౌలిక లక్షణం. దీనిలో లౌకికవాదం ప్రధాన అంశం. ఆ విధంగా ప్రార్థనా స్థలాల చట్టం అనేది మనలౌకిక విలువల నుంచి తిరోగమించకుండా కాపాడే శాసనపరమైన జోక్యం’.అయితే, అయోధ్య తీర్పు రచయితలలో ఒకరైన జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్ 2023 ఆగస్ట్‌లో జ్ఞానవాపి మసీదు 17వ శతాబ్దపు నిర్మాణాన్ని ముందుగా ఉన్న ఆలయంపై నిర్మించారా లేదా అని నిర్ధారించడానికి సర్వేను అనుమతించారు. సర్వేను అనుమతించిన హైకోర్టు ఉత్తర్వులపై ఏదైనా స్టే విధించడానికి నిరాకరించారు. ఈ నిర్ణయం ప్రార్థనా స్థలాల చట్టాన్ని ఉల్లంఘించడమే నన్న వాదనను జస్టిస్ చంద్రచూడ్ తిరస్కరించారు. ‘మేము నిర్మా ణాన్ని పరిరక్షిస్తాం. మేము మీ ప్రయోజనాలను కాపాడుతాం’ అని పేర్కొన్నారు.వెనక్కి వెళ్లగలమా?ఇప్పుడు నేను జ్ఞానవాపిపై చారిత్రక, మతపరమైన చర్చకు చెందిన యోగ్యత లేదా లోపాల జోలికి వెళ్లడం లేదు. ఫైజాన్ ముస్తఫా వంటి పండితులు జ్ఞానవాపి కేసు ముస్లిం సమాజానికి అయోధ్య కంటే బలహీనమైన కేసు అని పేర్కొన్నారు. ఇదే మసీదు ఆవరణలో హిందూ భక్తులకు నిశ్శబ్దంగా ప్రార్థన చేసుకొనే వీలు కల్పించాలని గతంలో ముస్లిం సంఘాల నేతలను ఆయన కోరారు. ప్రతీ వివాదంపై న్యాయవ్యవస్థను ఆశ్రయించడంలోని పరిమితులను ఆయన ఎత్తిచూపారు. అయితే ఇవన్నీ మత పెద్దలు, పౌర సమాజంలోని సభ్యుల నేతృత్వంలో జరగాల్సిన చర్చలు.నిర్దిష్ట ప్రార్థనా స్థలాల స్వభావాన్ని పునర్నిర్ణయించాలంటూ పేరుతో వచ్చే కాపీ కేసులతోనే ఇప్పుడు అసలు ప్రమాదం దాగివుంది. అయితే, సంభల్ మసీదు కమిటీ వేసిన పిటిషన్ విషయంలో, చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు, ట్రయల్ కోర్టు ఎలాంటి చర్యా తీసుకోకుండా నిలుపుదల చేసింది. ఆ సర్వేను అను మతించిన స్థానిక కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా పై కోర్టును సంప్ర దించాలని పిటిషనర్లకు సూచించింది. సర్వేకు సంబంధించిన కమి షనర్ నివేదికను గోప్యంగా ఉంచాలని కూడా ఆదేశించింది.ఏమైనా, తేనె తుట్టెను ఇప్పటికే సుప్రీంకోర్టు కదిపి ఉండొచ్చు. ఇప్పుడు, మళ్లీ యథాతథ స్థితిని నెలకొల్పడం అనుకున్నదానికంటే కష్టం కావచ్చు.బర్ఖా దత్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయురాలు, రచయిత్రి(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ధర్మం పేరిట అధర్మాచరణ: ఆర్ఎస్ఎస్ చీఫ్
సాక్షి, హైదరాబాద్/మాదాపూర్: నేటి సమాజంలో ధర్మం పేరిట అధర్మాన్ని అనుసరిస్తున్నామని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్‌భాగవత్ అన్నారు. మనిషిలో స్వార్థం పెరిగి.. ధర్మానికి, అధర్మానికి అర్థంలో మార్పులు చేసుకుంటూ అనుసరించే ప్రయత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం శిల్పకళావేదికలో జరిగిన లోక్ మంథన్ ముగింపు వేడుకల్లో ఆయన ప్రసంగించారు. ‘మానవుడు సంతోషం కోసం అన్వేషిస్తున్నాడు. మన పూర్వీకులు సంతోషం గురించి ఎంతో చక్కగా వివరించారు. ఇది ఎక్కడో దొరికే వస్తువు కాదు. సంతోషం అనేది మనలోనే దొరుకుతుంది. దాన్ని వదిలేసి వస్తు రూపంలో దొరికే సంతోషానికి సంబరపడిపోతున్నాడు. భారత్ సనాతన దేశం. రుషులు, మునిపుంగవుల ఆలోచనతో ఏర్పడిందే సనాతన ధర్మం. ఎన్నో ప్రాంతాలు పర్యటించి సాధించిన అనుభవాలతో శాస్త్రాలు, ధర్మాలు రాశారు. అలాంటి వాటిని అనుసంచాల్సిన మనం.. కేవలం అనుకూలమైనవాటిని ఆచరిస్తూ అదే ధర్మమార్గం అని భ్రమపడుతున్నాం. ప్రపంచంలోని అన్ని దేశాలు సాధించిన మంచిని మనం నేర్చుకోవాలి. జ్ఞానాన్ని ఆర్జించే ప్రక్రియ ఒక దగ్గర ఆగిపోకూడదు. మనమంతా సంస్కృతి, ధర్మంవైపు అడుగులు వేయాలి. కానీ వికృతి దిశగా వెళ్తూ సృష్టి ధర్మాన్ని విస్మరిస్తున్నాం. విజ్ఞానం ధర్మానికి వ్యతిరేకం కాదు. విజ్ఞానాన్ని ఉపయోగించే తీరులోనే ధర్మం నిలుస్తుంది. సనాతన ధర్మం మూలాల్లోకి వెళ్లి, దానిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది’అని పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. వనవాసి, నగరవాసి, గ్రామవాసి అందరూ భారతీయులేనని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఘనంగా ముగిసిన ఉత్సవాలు లోక్‌మంథన్ భాగ్యగనర్–24 ఉత్సవాలు దిగ్విజయంగా ముగిశాయి. నాలుగు రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకొనే ఆవశ్యకతను వక్తలు వివరించారు. వివిధ రంగాలకు చెందిన కళాకారుల ప్రతిభను ప్రతిబింబించేలా 210 ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. శిల్పారామంలో మూడు వేదికల్లో 12 దేశాలకు చెందిన సుమారు వంద మంది ప్రముఖులు ఉపన్యాసాలు, బోధనలు అందించారు. సుమారు 1,500 మంది కళాకారులు వివిధ రకాల కళలను ప్రదర్శించారు. లోక్ మంథన్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్, ఆహార ధాన్యాలు, ఔషధ మొక్కల స్టాల్స్, గిన్నిస్ రికార్డు అందుకున్న భారీ పెన్ను వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముగింపు ఉత్సవాల్లో అభినయ కూచిపూడి కళాక్షేత్రం ఆధ్వర్యంలో మహాన్ భారతోహం పేరుతో నృత్య ప్రదర్శన నిర్వహించారు. నాలుగు రోజుల్లో సుమారు 2.10 లక్షల మందికిపైగా లోక్ మంథన్‌లో పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. -
యూపీలో ఇంటింటికీ బీజేపీ–ఆర్ఎస్ఎస్!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్ భారీ ఎదురుదెబ్బ నుంచి బీజేపీ పాఠం నేర్చుకుంది. 9 అసెంబ్లీ స్థానాలకు అక్కడ జరుగుతున్న ఉప ఎన్నికల్లో మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ఎస్‌తో సమన్వయంతో పనిచేస్తోంది. ఇండియా కూటమి కులాధారిత సామాజిక న్యాయ రాజకీయాన్ని హిందూత్వ కార్డుతో ఢీ కొట్టనుంది. ‘ఏక్ హై తో సేఫ్ హై ’ (ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం) నినాదాన్ని వచ్చే ఐదు రోజులు విస్తృతంగా ఇంటింటికీ తీసుకెళ్లాలని ప్రయాగ్‌రాజ్‌లో బీజేపీ–ఆర్ఎస్ఎస్ కీలక భేటీలో నిర్ణయించారు. సమాజ్‌వాదీ పార్టీ తెరపైకి తెచ్చిన పీడీఏ (పీడిత్, దళిత్, ఆదివాసీ) ఫార్ములాను ఎదుర్కొనే వ్యూహాలపై భేటీ చర్చించింది. హిందూత్వ అజెండాకు పదును పెట్టాలని సంఘ్ నొక్కి చెప్పింది. ‘బటేంగేతో కటేంగే’ (విడిపోతే చెల్లాచెదురవుతాం) అన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. పార్టీ, సంఘ్ మధ్య సమన్వయ లోపం లేకుండా చూసుకోవాల్సిందిగా పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దళిత, ఓబీసీ ఓటర్ల మధ్య విభజనకు యత్నాలకు చెక్ పెట్టాలని బీజేపీకి ఆర్ఎస్ఎస్ సూచించింది. -
మహారాష్ట్ర ఎన్నికలు: ఆర్ఎస్ఎస్ సర్వేలో ఏం తేలింది?
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే పనిలో అన్ని పార్టీలు బిజీగా ఉన్నాయి. ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. మహాయుతికి చెందిన పార్టీలు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశాయి. ఉద్ధవ్ వర్గం 65 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. బీజేపీ విజయావకాశాలను తెలుసుకునేందుకు ఆర్ఎస్ఎస్ అంతర్గత సర్వే నిర్వహించింది. దీనిలో మహాయుతికి 160 సీట్లు వస్తాయని వెల్లడయ్యింది.ఆర్ఎస్ఎస్ సర్వే ప్రకారం లోక్‌సభ ఎన్నికల్లో కాషాయ కూటమికి వ్యతిరేకంగా వచ్చిన ట్రెండ్ అసెంబ్లీలో కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికి పూర్తి మెజారిటీ రానుంది. సంఘ్ వర్గాలు రహస్యంగా అంతర్గత సర్వే నిర్వహించి, ఆ నివేదిక ఆధారంగా ఎన్నికలకు వ్యూహరచన చేస్తున్నాయి. అక్టోబర్ రెండో వారంలో మొత్తం 288 సీట్లపై సంఘ్ సర్వే నిర్వహించింది. సంఘ్ సర్వేలో మహాయుతికి ఎన్నికల్లో 160కి పైగా సీట్లు వస్తాయని తేలింది.బీజేపీకి 90 నుంచి 95 సీట్లు, షిండే సేనకు 40-50 సీట్లు, అజిత్ పవార్ ఎన్సీపీకి 25-30 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. యూపీ, రాజస్థాన్, బెంగాల్‌లలో ఆ పార్టీ ఘోరంగా ఓటమి పాలయ్యింది. బీజేపీ వరుసగా సొంతంగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. అయితే ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. -
శతాబ్ది స్ఫూర్తి కొనసాగించేలా స్మృతి మందిరం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్)ను 1925 విజయదశమి రోజున నాగ్‌పూర్‌లో డాక్టర్ కేశవరామ్ బలిరామ్పంత్ హెడ్గేవార్ ప్రారంభించారు. హెడ్గేవార్ తాత నరహరిశాస్త్రి సరిగ్గా 168 సంవత్సరాల క్రితం నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి నుంచి వేదపండితులకు ప్రాధాన్యం ఇచ్చే భోంస్లే సంస్థానమైన నాగ్‌పూర్‌కు వలస వెళ్లారు. ఈ క్రమంలోనే కందకుర్తిలో స్మృతిమందిరంగా ఉన్న వారి ఇంటి వద్ద ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో 1989 నుంచి శ్రీ కేశవ శిశు విద్యామందిర్ పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భరతమాత విగ్రహం, హెడ్గేవార్ కులదైవమైన చెన్నకేశవనాథ్ విగ్రహం, హెడ్గేవార్ విగ్రహం ప్రతిష్టించారు. కేశవ సేవాసమితి ఆధ్వర్యంలో గోదావరి హారతి కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. ఆర్ఎస్ఎస్ 100వ ఏట అడుగు పెట్టిన నేపథ్యంలో హెడ్గేవార్ పూరీ్వకుల ఇంటి స్థానంలో రూ.12 కోట్ల వ్యయంతో భారీ స్మృతి మందిరం నిర్మిస్తున్నారు. వచ్చే ఉగాదికి దీని నిర్మాణం పూర్తి చేస్తారు. దీని వద్దనే గోదావరి ఒడ్డున మరో 10 ఎకరాల్లో కేశవ స్ఫూర్తి కేంద్రం, పాఠశాల, వసతిగృహం, భరతమాత ఆలయం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. పేద పిల్లలు, రైతులు, మహిళలకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయించారు. శ్రీ కేశవ శిశు విద్యామందిర్‌లో ముస్లిం విద్యార్థులు సైతం విద్యనభ్యసిస్తుండడం గమనార్హం. కేశవ సేవాసమితి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్న కందకుర్తి గ్రామాన్ని ఇప్పటికే పలువురు సర్సంఘ్ చాలక్ (ఆర్ఎస్ఎస్ చీఫ్)లు సందర్శించారు. ప్రస్తుతం నిర్మిస్తున్న భారీ స్మృతిమందిరం ప్రారంభానికి ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్‌జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం హాజరు కానున్నట్టు తెలుస్తోంది. రెంజల్ మండలంలో అక్షరాస్యత పెంచడంలో కేశవ సేవాసమితి కీలకపాత్ర 1989లో శ్రీ కేశవ శిశు విద్యామందిర్ ప్రారంభం కాగా, 2004లో పాఠశాల నూతన భవనాన్ని శ్రీరాంబావ్ హల్దేకర్ జీ ప్రారంభించారు. 2013 నుంచి కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ ల్యాబ్, ఈ–తరగతులు, ఎల్ఈడీ టీవీ సౌకర్యం కలి ్పంచారు. ఉపాధ్యాయులకు స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు నిర్వహిస్తున్నారు. మరోవైపు కందకుర్తి చుట్టుపక్కల గ్రామాల యువతీయువకులకు ఎండాకాలంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు నిర్వహించి సరి్టఫికెట్లు అందిస్తున్నారు. కందకుర్తి గ్రామం నుంచి మొదటి సైనికుడిగా ఎంపికైన జుబెర్ బాషా, రెంజల్ మండలం నుంచి మొదటిసారిగా నావికాదళానికి ఎంపికైన శశివర్ధన్ ఈ పాఠశాలలోనే విద్యనభ్యసించారు. ఇక కేశవ సేవాసమితి పాఠశాలతో పాటు వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతోంది. చుట్టుపక్కల 19 గ్రామాల్లో బాలబాలికలలో సంస్కారం, చదువుకు బాల సంస్కార కేంద్రాలు, బాలికలకు కిషోరి వికాస్ కేంద్రాలు, ట్యూషన్ సెంటర్లు, పెద్దవారికి భజన మండళ్లు, గృహిణులకు మాతృమండళ్లు, యువకులకు క్రీడాకేంద్రం, గ్రంథాలయం, నారాయణ సేవ లాంటి కార్యక్రమాలు కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు. వీటి వల్ల రెంజల్ మండలంలో అక్షరాస్యత గణనీయంగా పెరిగింది. పేద కుటుంబాల యువతకు చేతివృత్తుల్లో శిక్షణ ఇస్తున్నారు. త్రివేణి సంగమం వద్ద..... తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నడుమ కందకుర్తి వద్ద గోదావరి, మంజీర, హరిద్ర నదుల సంగమం ఉంది. ఈ ప్రాంత ప్రజలు తెలుగు, కన్నడ, మరాఠీ, హిందీ, ఉర్దూ భాషలు మాట్లాడతారు. భిన్న సంస్కృతులకు నిలయంగా ఈ ప్రాంతం మారింది. త్రివేణి సంగమ ప్రాంతానికి కొన్ని అడుగుల దూరంలోనే కందకుర్తి (తెలంగాణ)–బెల్లూర్ (మహారాష్ట్ర)లను అనుసంధానం చేసే వంతెనను 1992లో నిర్మించారు. ఇక్కడికి 15 కిలోమీటర్ల దిగువన బాసర పుణ్యక్షేత్రం ఉంది. కందకుర్తిలో ఉన్న రామాలయానికి సైతం గొప్ప ప్రాశస్త్యం ఉంది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ, ఆయన గురువు సమర్ధ రామదాసు ఈ ఆలయాన్ని సందర్శించారు. గతంలో ఇక్కడ ప్రాచీన స్కంధ (కుమారస్వామి) మందిరం ఉండేది. మూడు నదులు కలిసే కూడలి కావడంతో కూడతి అనేవారు. కాలక్రమంలో కందకుర్తి పేరు వచి్చనట్టు చరిత్రకారులు చెబుతున్నారు. పూర్తిగా కూలిపోయిన స్కంధ మందిరం స్థానంలో కొత్త మందిర నిర్మాణం చేస్తున్నారు. త్రేతాయుగంలో ఇక్కడ శ్రీరాముడు శివాలయాన్ని నిర్మించినట్టు చెబుతున్నారు. దీన్ని తర్వాత రాణి అహల్యాబాయి మందిరాన్ని పునరుద్ధరించారు. -
విజయదశమి రోజున ప్రారంభమై.. విజయదశమి నాడే 100వ ఏట ప్రవేశం!
RSS: హైందవాన్ని ఒక మతంగా కాక ఒక జీవన విధానంగా, భారత ప్రజలను భారతమాత రూపంగా భావించి, భారతదేశాన్ని తమ మాతృభూమిగా భావించే ప్రజల ప్రయోజనాలను రక్షించటం ఆశయంగా డాక్టర్ కేశవ బలిరాం హెడ్గేవార్ (డాక్టర్ జీ) 1925లో విజయ దశమి రోజున రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్)ను నాగపూర్‌లో స్థాపించారు. ఆ సంస్థ ఈ విజయదశమి రోజున 100వ ఏట ప్రవేశిస్తోంది. ఎటువంటి సభ్యత్వ నమోదు, ఐడెంటిటీ కార్డులు వంటివి లేకుండా ఒక సంస్థను వందేళ్లు దిగ్విజయంగా నడపడం మాటలు కాదు. దాదాపు 80 లక్షల మంది స్వయం సేవకులు కలిగిన 45 లక్షల సంఘస్థాన్ శాఖలు నడుపుతూ ఎటువంటి అంతర్గత కలహాలకూ తావు లేకుండా కొనసాగుతోంది ఆరెస్సెస్.నాటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న డాక్టర్ హెడ్గే వార్ని 1921లో విదర్భలోని అకోలా జైలులో ఒక సంవత్సరం రోజులు నిర్బంధించారు. నాడు జైలులోని దేశభక్తుల మధ్య జరిగిన చర్చోపచర్చలలో డాక్టర్ హెడ్గేవార్ మదిలో పురుడు పోసుకున్నదే ఆరెస్సెస్. 1925 నుంచి 1940 వరకు డాక్టర్ హెడ్గేవార్, 1940 నుండి 1973 వరకు మాధవ సదాశివ గోల్వాల్కర్ (గురూజీ), 1973 నుంచి 1993 వరకు మధుకర్ దత్తాత్రేయ దేవరస్లు సర్ సంఘ చాలకులుగా పనిచేసి ఆర్ఎస్ఎస్ను ఒక మహా వృక్షం మాదిరిగా యావత్ భారతదేశం అంతటా విస్తరించడానికి తమ జీవితాలను ధారపోశారు. ఆరెస్సెస్ సంఘ శాఖలలో మొదటగా ధ్వజారోహణము, ఆసనములు, యోగ, క్రీడలు, ఆటలు, కర్రసాము, సమాజ హిత సూచనలు, భారతీయ చరిత్ర–సంస్కృతి–సంప్రదాయాలను తెలియజేసే ప్రసంగాలు, ఒకరితో ఒకరు సత్సంబంధాలు పెంచుకోవడం వంటి కార్యక్రమాలు ఉంటాయి. చివరగా ప్రార్థన వంటి విషయాలు నిత్యం జరుగుతూ ఉంటాయి.సమాజంలోని రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, న్యాయవాదులు, డాక్టర్లు, వెనుకబడిన, అణగారిన వర్గాలకు ప్రాతి నిధ్యం వహించే విధంగా భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, అఖిల భారతీయ రాష్ట్రీయ సైక్షిక్ మహాసంఘ్, ఆరోగ్య భారతి, విద్యా భారతి, స్వదేశీ జాగరణ మంచ్, వనవాసి కళ్యాణ ఆశ్రమం, సంస్కార భారతి, భారతీయ జనతా పార్టీ, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, రాష్ట్రీయ సేవికా సమితి వంటి అనుబంధ సంస్థలను కలిపి ‘సంఘ్ పరివార్’గా భావిస్తారు. ఈ సంస్థలు అన్నీ కూడా స్వయం ప్రతిపత్తి కలిగి ఆయా రంగాలలో అవి పని చేసుకుని పోతున్నప్పటికీ అవసరమైన సందర్భాలలో ఆర్ఎస్ ఎస్ నుంచి సలహాలు, సూచనలు ప్రేరణ అందుతాయి.చదవండి: చేగువేరా టు సనాతని హిందూ!1947– 48 మధ్య దేశ విభజన సమయంలో, 1962లో భారత్ – చైనా యుద్ధ సమయంలో, 1972లో భారత్ – పాకిస్తాన్ యుద్ధ సమయంలో, భూకంపం, తుపానులు, కరోనా వంటి విపత్తులు, రైలు ప్రమాదాలు, కరవు కాట కాలు, కరోనా వంటి విపత్తుల సమయంలో ఆరెస్సెస్ చేపట్టిన సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. భారత్ – చైనా యుద్ధ సమయంలో ఆరెస్సెస్ సేవలను గుర్తించిన నాటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ 1963లో రిపబ్లిక్ డే కవాతులో ఆరెస్సెస్‌ను పాల్గొనమని ఆహ్వానించడం గమనార్హం. దాదాపు 4 వేల మంది ఆరెస్సెస్ ప్రచారకులుగా (పూర్తి సమయ కార్యకర్తలుగా) కుటుంబ బంధాలకు దూరంగా దేశ, విదేశాల్లో పనిచేస్తూ తమ త్యాగ నిరతిని చాటుతున్నారు.– ఆచార్య వైవి రామిరెడ్డిశ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి (నేడు ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం) -
నా ఆటోను కాల్చేశారు: గడ్కరీ
శంభాజీనగర్:కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుత రాజకీయాలన్నీ పవర్ పాలిటిక్సేనని తేల్చేశారు.రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఛత్రపతి శంభాజీనగర్‌లో శుక్రవారం(సెప్టెంబర్27) జరిగిన రాజస్థాన్ గవర్నర్ హరిభౌ కిసన్‌రావ్ బగాడే సన్మాన కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడారు.ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేసిన సమయంలో ఎన్నో సమస్యలొచ్చాయన్నారు. పార్టీ కార్యకర్తగా 20 ఏళ్లు విదర్భలో పనిచేసినట్లు చెప్పారు. ఆ రోజుల్లో తాము నిర్వహించే ర్యాలీలపై ప్రజలు రాళ్లు వేసేవారని గడ్కరీ గుర్తుచేసుకున్నారు. ఎమర్జెన్సీ తర్వాతి రోజుల్లో తాను ప్రసంగాలు చేయడానికి వాడే ఆటోను కొందరు తగలబెట్టారని చెప్పారు. ఇప్పుడు తనకు వచ్చిన గుర్తింపు తనది కాదని, హరిభౌకిసన్రావ్ బగాడే లాంటి వాళ్ల కారణంగా వచ్చిందేనన్నారు. కాగా, తనకు ప్రధానమంత్రి పదవి ఆఫర్ వచ్చిందని ఇటీవలే గడ్కరీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. -
దేశ ద్రోహులకు ఆర్ఎస్ఎస్ అర్థం కాదు: రాహుల్‌కు బీజేపీ కౌంటర్
కేంద్రం ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. టెక్సాస్‌లోని యూనివర్సిటీలో ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తూ ప్రధాని మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్పై విమర్శలు గుప్పించారు.అయితే రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఇతర దేశాల్లో భారతదేశాన్ని అవమానించే అలవాటు గాంధీకి ముందు నుంచే ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. దేశ ద్రోహులు ఆర్ఎస్ఎస్ గురించి అర్థం చేసుకోలేరని మండిపడ్డారు. భారతదేశం పరువు తీసేందుకే రాహుల్ విదేశీ పర్యటనలకు వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆర్ఎస్ఎస్ విధానాల గురించి తెలుసుకోవాలంటే రాహుల్ లాంటి వారికి ఎన్నో జన్మలు ఎత్తాల్సివస్తోందని అన్నారు. విదేశాలకు వెళ్లి దేశాన్ని విమర్శించే వారికి ఆర్ఎస్ఎస్ విధానాల గురించి తెలుసుకోలేరు. రాహుల్ ఎప్పటికీ ఆ వ్యవస్థ విధానాలను అర్థం చేసుకోలేరు. ఆరెస్సెస్ భారతదేశ విలువలు, సంస్కృతి నుంచి పుట్టిందని గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు.కాగా అంతకముందు రాహుల్ మాట్లాడుతూ.. భారత్ అంటే ఒకే ఆలోచన, భావజాలం అని ఆర్ఎస్ఎస్ నమ్ముతుందని, మహిళలు కేవలం ఇంటి పనికి, వంట పనికి మాత్రమే పరిమితమని భావిస్తుందని మండిపడ్డారు. మహిళలు అన్నిరంగాల్లో ముందుకువెళ్లాలని, భారత్ అంటే భిన్న భావజాలం అని తాము విశ్వసిస్తున్నట్లు చెప్పారు.భారత్‌లో బీజేపీ, ప్రధాని మోదీకి ఎవరూ భయపడరనే విషయాన్ని ఇటీవల జరిగిన ఎన్నికలు నిరూపించాయన్నారు. భారత సంప్రదాయాలు, భాషలపై బీజేపీ దాడి చేస్తోందని ఆరోపించారు. మన రాజ్యాంగంపై ప్రధాని మోదీ దాడి చేస్తున్నారని ప్రజలు గ్రహించారని, మోదీ, బీజేపీకి ఎవరూ భయపడటం లేదని అన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అనంతరం దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్పై వ్యతిరేక పోరాటం స్పష్టంగా కనిపించిందని రాహుల్ విమర్శించారు. -
ప్రజలకు మోదీ భయం పోయింది: రాహుల్ గాంధీ
న్యూయార్క్: లోక్ సభ ఎన్నికల ఫలితాలు విడుదలైన అనంతరం ప్రజల్లో బీజేపీపై ఉన్న భయం పోయిందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌లో ప్రసంగించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్పై విరుచుకుపడ్డారు. భారత దేశం అంటే ఒకే సిద్ధాంతం అనే ఆలోచనతో ఆర్ఎస్ఎస్ ఉంది. కానీ, భారత్ సిద్ధాంత బహుళత్వంగా కాంగ్రెస్ భావిస్తుందని అన్నారు. దానిపైనే తాము పోరాటం చేస్తున్నామని తెలిపారు. భారతీయ రాజకాల్లో ప్రేమ, గౌరవం తగ్గిపోయాయని అన్నారు.‘‘లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మెజార్టీ స్థానాలు దక్కించుకోలేదు. దీంతో అప్పటి వరకు ప్రజల్లో ఉన్న బీజేపీ, నరేంద్రమోదీపై భయం పోయింది. ఇది రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సాధించిన విజయం కాదు. రాజ్యాంగంపై దాడిని అంగీకరించబోమని గ్రహించిన భారత దేశ ప్రజలు విజయం. అదేవిధంగా మహిళల పట్ల వైఖరిపై కూడా బీజేపీ, ప్రతిపక్షాల మధ్య సైద్ధాంతిక తేడాలు ఉన్నాయి. వాటిపై కూడా మేము పోరాటం చేస్తున్నాం. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మహిళలు కొన్ని ప్రత్యేకమైన పనులకు మాత్రమే పరిమితం కావాలని నమ్ముతారు. కానీ మేము అలా కాదు. మహిళలు ఏమి చేయాలని కోరుకున్నా అనుమతించాలని నమ్ముతున్నాం. భారత్ నిరుద్యోగ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చాలా దేశాల్లో ఈ సమస్య లేదు. పెరుగు దేశం చైనా కూడా నిరుద్యోగ సమస్య లేదు’ అని అన్నారు.#WATCH | Texas, USA: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, "The RSS believes that India is one idea and we believe that India is a multiplicity of ideas. We believe that everybody should be allowed to participate, allowed to dream, and should be given space regardless… pic.twitter.com/uHULrGwa6X— ANI (@ANI) September 9, 2024రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ‘చైనా కమ్యూనిస్ట్ పార్టీతో తనకున్న ఒప్పందం వల్ల రాహుల్ చైనా కోసం బ్యాటింగ్ చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. విభజించు, పాలించడమే రాహుల్ స్ట్రాటజీ. భారత సిద్ధాంతాలుపై విమర్శలు చేయటం రాహుల్‌కు అలవాటుగా మారింది. ఆయన బెయిల్‌పై ఉన్నందున భారత న్యాయ వ్యవస్థపై దాడి చేస్తాడు’ అని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ మండిపడ్డారు. -
కులగణన సన్నితమైన అంశం, రాజకీయాలకు వాడొద్దు: ఆర్ఎస్ఎస్
దేశంలో కులగణనపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కీలక వ్యాఖ్యలు చేసింది. కులగణన సున్నితమైన అంశమని పేర్కొంది. అయితే దీనిని ఎన్నికల ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని తెలిపింది. ఈ మేరకు కేరళలోని పాలక్కడ్‌లో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ జాతీయ స్థాయి సమన్వయ సమావేశాల్లో సంస్థ ప్రతినిధి సునీల్ అంబేకర్ మాట్లాడుతూ.. కులగణ జాతీయ ఐక్యత, సమగ్రతకు చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు.‘కుల గణన అనేది చాలా సున్నితమైన అంశం. దీనిని చాలా తీవ్రంగా పరిగణించాలి. కొన్నిసార్లు ప్రభుత్వాలు డేటా అవసరం కోసం దీనిని చేపట్టవచ్చు. అయితే ఇదికేవలం ఆ వర్గాలు కులాల సంక్షేమం కోసం మాత్రమే ఉండాలి. కానీ.. కుల గణనలను ఎన్నికల ప్రచారాల కోసం వినియోగించకూడదు’ అని అన్నారు.ఈ అంశంపై తీవ్రమైన చర్చల మధ్య, కుల గణనపై ఆర్ఎస్ఎస్ తన వైఖరిని స్పష్టం చేసింది. ప్రభుత్వం దేశవ్యాప్తంగా కసరత్తును నిర్వహించడాన్ని తాము వ్యతిరేకించడం లేదని పేర్కొంది. ‘ఇటీవల కాలంలో కులగణన అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. దీనిని పూర్తిగా సమాజహితానికే వాడతారని భావిస్తున్నాం. వీటిని నిర్వహించే క్రమంలో అన్నిపక్షాలు సామాజిక సమగ్రత దెబ్బతినకుండా చూసుకోవాలి’ అని పేర్కొన్నారు. -
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు సెక్యూరిటీ పెంపు
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ భద్రతను కేంద్ర ప్రభుత్వం మరింత పెంచింది. దీంతో ఆయనకు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు కల్పిస్తున్న తరహాలో భద్రత లభించనుంది.హోం మంత్రిత్వ శాఖ మోహన్ భగవత్ భద్రతను జెడ్ ప్లస్ నుంచి నుండి ఎఎస్ఎల్(అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్)స్థాయికి పెంచింది. ఆర్ఎస్ఎస్ చీఫ్‌కు ఇంతవరకూ జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉండేది. మోహన్ భగవత్‌కు క్పల్పించిన భద్రత సరిపోదని గుర్తించిన ప్రభుత్వం అతని కోసం క్తొత భద్రతా ప్రోటోకాల్ రూపొందించింది. పలు భారత వ్యతిరేక సంస్థలు ఆయనను టార్గెట్ చేస్తున్నాయనే నిఘావర్గాల సమాచారం మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.నూతన భద్రతా ఏర్పాట్ల ప్రకారం మోహన్ భగవత్ సందర్శించే ప్రదేశంలో సీఐఎస్ఎఫ్ బృందాలు ఉంటాయి. ఆయనకు 2015, జూన్ లో జెడ్ ప్లస్ భద్రత కల్పించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆయనకు జెడ్ ప్లస్ భద్రత కల్పించాలని ఆదేశించింది. అయితే ఆ సమయంలో సిబ్బంది, వాహనాల కొరత కారణంగా జెడ్ ప్లస్ భద్రత కల్పించలేదు. ఈ తరహా భద్రతలో 55 మంది కమాండోలు మోహన్ భగవత్ కోసం 24 గంటలపాటు విధులు నిర్వహిస్తుంటారు.ఏఎస్ఎల్ కేటగిరీ భద్రతలో సంబంధిత జిల్లా పరిపాలన, పోలీసు, ఆరోగ్యం, ఇతర విభాగాలు వంటి స్థానిక ఏజెన్సీలు పాలుపంచుకుంటాయి. మోహన్ భగవత్ ఏదైనా కార్యక్రమానికి వెళ్లే సందర్భంలో ఆ స్థలాన్ని పరిశీలించడానికి అధికారుల బృందం వెళ్తుంది. వారు క్లాలిటీ ఇచ్చిన తరువాతనే మోహన్ భగవత్ ఆ కార్యక్రమానికి వెళతారు. -
UP By Election : సంఘ్ చేతికి బీజేపీ ఉప ఎన్నికల బాధ్యతలు
మొన్నటి యూపీ లోక్‌సభ ఎన్నికల్లో నిరాశాజనక ఫలితాల తర్వాత బీజేపీలో అంతర్గత పోరు చోటుచేసుకుంది. ఇప్పుడు దీనిని ఆపేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సంఘ్ నేత అరుణ్‌కుమార్‌ల సమక్షంలో సమావేశం జరిగింది.ప్రభుత్వం- సంఘ్ మధ్య మెరుగైన సమన్వయంతో పాటు ఉప ఎన్నికల వ్యూహం, పార్టీ ప్రతినిధుల నియామకం తదితర పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. రాబోయే ఉప ఎన్నికల సన్నాహాల్లో బీజేపీతో పాటు సంఘ్ కార్యకర్తలను కూడా భాగస్వాములను చేయాలని సమావేశంలో నిర్ణయించారు.దాదాపు రెండున్నర గంటల పాటు సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో.. పార్టీలో పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు బీజేపీ నష్టపోవాల్సి వస్తుందని సంఘ్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ముందస్తు ఎన్నికలతో పాటు ప్రభుత్వం, సంఘ్ మధ్య పరస్పర సమన్వయంపై చర్చ జరిగింది. రాబోయే ఉప ఎన్నికల్లో కీలక బాధ్యతలను సంఘ్‌కు అప్పగించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ఉపముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ ధరంపాల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
సిద్ధాంతానికీ, అధికారానికీ స్పర్థ?
ఏ సంస్థకైనా, పార్టీకైనా స్థాపించినపుడు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. అధికారానికి వచ్చినట్లయితే ఆ సిద్ధాంతానికి భిన్నమైన లక్ష్యాలు ఏర్పడతాయి. అది క్రమంగా ఒక వైరుద్ధ్యంగా మారుతుంది. అధికార పరిష్వంగంలోకి వెళ్లినవారు ఎంత నిష్ఠాగరిష్ఠులైనా, దాని ఆకర్షణలకు లొంగకుండా ఉండటం చాలా అరుదు. వారికి తమ లక్ష్యాల సాధనకు సిద్ధాంతం ఒక పెద్ద ఆటంకంగా తోస్తుంది. అపుడు దానిని అనివార్యంగా ధిక్కరిస్తారు. ప్రస్తుతం ఆరెస్సెస్, మోదీ మధ్య జరుగుతున్నది అదే. స్వాతంత్య్రానంతరం గాంధీ ఆదర్శాల దారి ఏమిటో, కాంగ్రెస్‌వాదుల అధికార పోకడలు ఏ విధంగా ఉన్నాయో చూసిందే. మార్క్సిజానికి త్రికరణ శుద్ధిగా కట్టుబడినామనే కమ్యూనిస్ట్ పార్టీలలో సైతం ఈ వైరుద్ధ్యాలు చోటు చేసుకున్నాయి.ఆరెస్సెస్ సైద్ధాంతికతకూ, బీజేపీ అధికార కాంక్షకూ మధ్య ఒక స్పర్థ ఏర్పడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ సూచనలు గతంలోనూ ఉండేవిగానీ, ఇటీవలి ఎన్నికల తర్వాత అందుకు స్పష్టత ఏర్పడుతున్నది. ఎన్నిక లలో బీజేపీ అంతిమంగా అధికారానికి వచ్చినా అనుకోని విధంగా కొన్ని ఎదురుదెబ్బలు తిన్నది. ఆ వెంటనే ఆరెస్సెస్ సర్ సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్... ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై, బీజేపీపై విమర్శలు చేశారు. ఆరెస్సెస్ అధికార పత్రిక ‘ఆర్గనైజర్’ కూడా మరికొన్ని విమర్శలతో ఒక వ్యాసాన్ని ప్రచురించింది. ఇదంతా జూన్ ప్రథమార్థంలో జరిగిన విషయం. ఆ విధమైన విమర్శలు బీజేపీ ప్రత్య ర్థుల నుంచి వచ్చి ఉంటే అందులో విశేషం లేదు. కానీ ఆ పని చేసింది బీజేపీ మాతృ సంస్థ కావటం, ఆ విమర్శలు కూడా బహిరంగంగా చేయటం సంచలనాన్ని సృష్టించింది. అటువంటి ఎదురు దెబ్బలు, సంచలనాత్మక విమర్శల దృష్ట్యా మోదీ తీరు, బీజేపీ పద్ధతులు కొంతైనా మారగలవని అనేకులు అభిప్రాయపడ్డారు. కానీ, ఆ జూన్ ప్రథమార్థం నుంచి ఇప్పటికి గడిచిన రెండు మాసాల కాలంలో మనకు ఎటువంటి మార్పులు కనిపించటం లేదు. ఇందుకు రెండు తాజా ఉదాహరణలలో ఒకటి, లవ్ జిహాద్ కేసులలో జీవిత ఖైదు విధించే చట్టం చేయగలమన్న అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి ప్రకటన కాగా, రెండవది మోదీ ప్రభుత్వం వక్ఫ్ ఆస్తుల బిల్లును ప్రతిపాదించటం.ఈ వివరాలలోకి వెళ్లే ముందు ఒక విషయం చెప్పుకోవాలి. ఆరెస్సెస్ ఒక సైద్ధాంతిక సంస్థ. ఆ సిద్ధాంతంతో ఎవరైనా ఏకీభవించ కపోవచ్చుగాక. కానీ వారికి తమ సిద్ధాంతాలు ఉన్నాయి. సంస్థ వయస్సు వందేళ్లు. దాని నాయకత్వాన ఇతర ప్రధాన సంస్థలు, ఉప సంస్థలు కలసి కొన్ని డజన్లు ఉన్నాయి. అన్నింటిని కలిపి సంఘ్ పరివార్ అంటున్నారు. వీటిలో భారతీయ జనసంఘ్ (1951) మొదటి రాజకీయ పార్టీ. తర్వాత అది బీజేపీ (1980)గా రూపాంతరం చెందింది. ఆరెస్సెస్ సిద్ధాంతం 1951 వరకు కూడా హిందూ రాజ్య స్థాపన కోసం సాంస్కృతిక రంగంలో, మతపరంగా కృషి చేయటం తప్ప రాజకీయాలలోకి అసలు ప్రవేశించరాదన్నది! తర్వాత కొన్ని పరిస్థితులలో మొదట జనసంఘ్, తర్వాత బీజేపీ ఏర్పాటుకు సమ్మ తించినా, ఆ పార్టీలు పూర్తిగా ఆరెస్సెస్ నిర్దేశాలకు లోబడి పనిచేస్తూ పోయాయి. బీజేపీ అధికారానికి వచ్చిన రాష్ట్రాలలోగానీ, వాజ్‌పేయి నాయకత్వాన కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పరచినపుడుగానీ, ముఖ్యమైన పరిపాలనా విధానాలకు కూడా ఆరెస్సెస్‌తో చర్చలు జరుగుతుండేవి. అపుడపుడు భిన్నాభిప్రాయాలు తలెత్తినా చర్చల ద్వారా ఏకాభిప్రా యానికి వచ్చేవారు. ఆరెస్సెస్‌ను బీజేపీ నాయకత్వం ధిక్కరించటం జరిగేది కాదు. మోదీ నాయకత్వాన అది మొదటిసారిగా జరుగుతుండటమన్నది గమనించవలసిన విశేషం. మోదీ ధిక్కార ధోరణి వాస్తవా నికి ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండిన (2001–14) కాలంలోనే మొదలై ఇప్పటికీ కొనసాగుతున్నది. జూన్ ప్రథమార్థం నాటి భాగవత్, ఆర్గనైజర్ల బహిరంగ విమర్శలను ఆయన లెక్క చేయక వ్యవహరించటం ఇందుకు కొనసాగింపు మాత్రమే.ఇప్పుడు అసలు చర్చలోకి వెళదాము. ఏ సంస్థకైనా, లేక పార్టీ కైనా వాటిని స్థాపించినపుడు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. తర్వాత అవి అధికారానికి వచ్చినట్లయితే ఆ సిద్ధాంతానికి భిన్నమైన లక్ష్యాలు ఏర్పడతాయి. పూర్తి భిన్నం కాకున్నా పరిస్థితులను బట్టి వేర్వేరు స్థాయిలలో ఏర్పడుతాయి. అటువంటపుడు ఆ సిద్ధాంతాలకు, అధి కార లక్ష్యాలకు మధ్యగల భిన్నత్వం క్రమంగా ఒక వైరుద్ధ్యంగా మారు తుంది. లక్ష్యాల స్వభావాన్ని బట్టి, ఆ వ్యక్తుల స్వభావాన్ని బట్టి వైరుధ్య తీవ్రత ఉంటుంది. మరికొద్ది ఉదాహరణలను కూడా చెప్పు కొని ఆరెస్సెస్, బీజేపీల విషయానికి మళ్లీ వద్దాము.కాంగ్రెస్ పార్టీ 1885లో ఏర్పడింది. ఆ పార్టీ 1923లో చీలి కాంగ్రెస్ స్వరాజ్ పార్టీ ఆవిర్భవించింది. ఎన్నికలలో పాల్గొనేందుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాగా, పాల్గొనాలన్నది స్వరాజిస్టుల వాదన. అప్పటినుంచి 1947లో స్వాతంత్య్రం లభించే వరకు, దేశ విభజన విషయంలో సైతం పార్టీలో పలువురు ప్రముఖులు గాంధీజీని వ్యతి రేకిస్తూ పోయారు. బ్రిటిష్ వారి హయాంలోనే ప్రభుత్వాలలోనూ చేరారు. ఆ వివరాలలోకి ఇక్కడ వెళ్లలేముగానీ, గుర్తించవలసింది సిద్ధాంతానికీ, అధికార కాంక్షలకూ మధ్య వైరుద్ధ్యాలు ఏర్పడటం. ఇక స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ సిద్ధాంతాలు, గాంధీ ఆదర్శాల దారి ఏమిటో, కాంగ్రెస్‌వాదుల అధికార పోకడలు ఏ విధంగా ఉన్నాయో చూస్తున్నదే. చివరకు మార్క్సిజానికి త్రికరణ శుద్ధిగా కట్టుబడినామనే కమ్యూనిస్ట్ పార్టీలలో సైతం ఈ వైరుధ్యాలు చోటు చేసుకున్నాయి. వారు స్వయంగా అధికారాలు నెరపిన దేశాలలోనూ, భారతదేశంలోని రాష్ట్రాలనూ చూసినపుడు ఇది స్పష్టంగా తెలుస్తుంది. వారి అధికార పతనాలకు గల ప్రధాన కారణాలలో ఇది కూడా ఒకటి. అధికారం నిజంగానే ప్రజల మేలు కోసం పరిమితమయితే ఈ పరిస్థితి తలెత్తదు. కానీ విషాదకరమైన వాస్తవం ఏమంటే, అధికార పరిష్వంగంలోకి వెళ్లినవారు ఎంత నిష్టాగరిష్ఠులైనా, దాని ఆకర్షణలకు లొంగకుండా ఉండటం చాలా అరుదు. వారికి తమ లక్ష్యాల సాధనకు సిద్ధాంతం ఒక పెద్ద ఆటంకంగా తోస్తుంది. అపుడు దానిని అనివార్యంగా ధిక్కరి స్తారు. ప్రస్తుతం ఆరెస్సెస్, మోదీల మధ్య జరుగుతున్నది అదే.ఇటువంటి పరిస్థితులలో సర్వసాధారణంగా జరిగే క్రమం ఒకటు న్నది. ఒక సైద్ధాంతిక సంస్థకు అనుబంధంగా ఉండే కొందరు ఒక రాజకీయ పార్టీని నెలకొల్పడమంటే అధికార సాధన కోసం మాత్రమే. అటువంటపుడు ఒకవైపు తమ సిద్ధాంతంతో సంబంధం ఉన్నవారిని, లేనివారిని కూడా వీలైనంత విస్తృతంగా పార్టీలో చేర్చుకోవలసి ఉంటుంది. వారి ప్రయోజనాల కోసం కూడా పని చేయవలసి ఉంటుంది. మరొకవైపు ఆ క్రమంలో తాము అనేక అధికార ప్రయోజ నాల ఆకర్షణకు లోనవుతారు. ఈ రెండింటి ప్రభావం వారిని తమ సైద్ధాంతికతకు దూరం చేస్తుంది. సిద్ధాంతాలు గుర్తు చేసేవారిని ధిక్కరించేట్లు చేస్తుంది. కాంగ్రెస్, సోషలిస్టులు, కుల పార్టీలు, ప్రాంతీయ పార్టీల వంటివే కాదు... కమ్యూనిస్టులు, మతవాద పార్టీల వంటి నిష్టాగరిష్ఠత గల సైద్ధాంతిక, కేడర్ పునాది పార్టీలకు సైతం ఈ మాట వర్తిస్తుంది. అది మనం ప్రత్యక్షంగా చూస్తున్నదే. మరొక మాటలో చెప్పాలంటే ఇవన్నీ సైద్ధాంతిక పతనాలు. సిద్ధాంతానికీ, అధికారానికీ మధ్య స్పర్థ. మనం చూసినంతవరకు ఇందులో అధికా రానిదే పైచేయి అవుతూ వస్తున్నది. అధికారానికి వచ్చినవారు భరించ లేకుండా తయారై, ప్రజల తీవ్ర ఆగ్రహాలకు గురై, వారి చేత పరా భవం పొంది, తిరిగి ప్రజలు సిద్ధాంతాల వైపు మళ్లితే తప్ప, పరిస్థి తులు ఈ విధంగానే ఉంటాయి.అయితే ఆరెస్సెస్‌కు సంబంధించిన అభిప్రాయాలు కొన్ని ఉన్నాయి. పార్టీ ఏర్పాటును 1951 వరకు వ్యతిరేకించిన వారు జన సంఘ్ స్థాపనకు, తర్వాత బీజేపీ అవతరణకు ఎందువల్ల సమ్మతించినట్లు? రాజకీయ శక్తిగా మారి అధికారం కూడా సాధించినట్లయితే దానిని ఉపయోగించుకుని హిందూ రాష్ట్ర స్థాపన లక్ష్యాన్ని ముందుకు తీసుకు పోవచ్చునన్నది ఆలోచన. యథాతథంగా అది మంచి వ్యూహమే కావచ్చు. కానీ పైన చెప్పుకున్నట్లు, రాజకీయ శక్తులు, వారి ప్రయోజనాల వలలో చిక్కుకుని అది దారి తప్పింది. ఆరెస్సెస్ నాయ కత్వం స్వయంగా బలహీన పడుతుండటంతో రాజకీయ నాయకత్వం బలం పెరిగింది. ఇంతేకాదు, సాక్షాత్తూ సంఘ్ పరివార్‌లోని కొన్ని వర్గాలు కూడా అధికార ఆకర్షణలకు లోబడటం మొదలైందనే మాటలు కొంత కాలంగా వినవస్తున్నాయి. ఇటువంటి పరిణామాల మధ్య జరిగేదేమిటి? మోదీ, బీజేపీల అధికార ఆయుధానికి పదను పెరుగుతుంది. ఆరెస్సెస్ సైద్ధాంతిక నిష్ఠ క్రమంగా మొద్దుబారుతుంది. ఈ స్పర్థలో మొగ్గు ఎవరిదో కనిపిస్తున్నదే.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
నిషేధాలే గానీ సేవలు గుర్తుండవా?
58 ఏళ్ల కిందట నాటి ఇందిరా గాంధీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలలో పాల్గొననకుండా ప్రభుత్వోద్యోగులపై నిషేధం విధించింది. ఆ నిషేధాన్ని మొన్న జూలై 9న కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. దానితో ప్రతిపక్ష నేతలు గగ్గోలు పెడుతున్నారు. సంస్థ భావజాలం, కార్యకలాపాలు నచ్చితేనే ఎవరైనా చేరడమో లేదా పరోక్షంగా మద్దతు ఇవ్వడమో చేస్తారు. చైనాతో జరిగిన యుద్ధంలో భారత సైన్యానికి తోడుగా ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషించింది. ప్రకృతి వైపరీత్యాల కాలాల్లో సేవలు అందించింది. గాంధీ హత్య ఘటనలో పోలీసుల దర్యాప్తు, కోర్టు విచారణ అనంతరం ఆర్ఎస్ఎస్పై వచ్చిన ఆరోప ణలన్నీ సత్యదూరమని తేలిపోయింది. అయినాకూడా ఆర్ఎస్ఎస్ను ఇప్పటికీ మహాత్మగాంధీ హత్యతో ముడిపెట్టడం ఎంత దారుణమో ఆలోచించాలి.గోవధను వ్యతిరేకిస్తూ లక్షలాది ప్రజల మద్దతును కూడగట్టిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను నిలువరించేందుకు 1966 నవంబర్ 30న, అంటే 58 ఏళ్ల కిందట నాటి ఇందిరా గాంధీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలలో పాల్గొననకుండా ప్రభుత్వోద్యోగులపై నిషేధం విధించింది. ఆ నిషేధాన్ని మొన్న జూలై 9న కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. దానితో ప్రతిపక్ష నేతలు గగ్గోలు పెడుతున్నారు. ఆర్ఎస్ఎస్ మీద విధించిన నిషేధాల గురించే తప్ప... ఆ నిషేధాల ఎత్తివేత గురించి గానీ, పాకిస్తాన్, చైనా మన దేశం పైన యుద్ధం చేసిన సమయాల్లో, ప్రకృతి వైపరీత్యాల కాలాల్లో సామాన్య ప్రజలకు స్వయంసేవకులు అందించిన సేవలను మరిచిపోయారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పినట్టు... మహాత్మా గాంధీ హత్యానంతరం 1948 ఫిబ్రవరి 4న ఆర్ఎస్ఎస్పై పటేల్ విధించిన నిషేధాన్ని 18 నెలల తర్వాత ఆయనే హోంమంత్రి హోదాలో ఎత్తివేశారు. గాంధీ హత్య ఘటనలో పోలీసుల దర్యాప్తు, కోర్టు విచారణ అనంతరం ఆర్ఎస్ఎస్పై వచ్చిన ఆరోపణలన్నీ సత్య దూరమని తేలిపోయింది. అప్పుడు ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్గా ఉన్న గురూజీ (ఎంఎస్ గోల్వాల్కర్)కి పటేల్ రాసిన లేఖలో సంఘ్ సేవలను ప్రశంసించడమే గాక, స్వయంసేవకులు కాంగ్రెస్‌లో చేరి సేవలను కొనసాగించాలని ఆహ్వానించారు. 1948 సెప్టెంబర్ 11న సర్దార్ పటేల్ రాసిన ఈ లేఖ ‘జస్టిస్ ఆన్ ట్రయల్’ పుస్తకంలో ఉంది. ఆర్ఎస్ఎస్ శాఖను మహాత్మా గాంధీ సందర్శించిన సంఘటనను మనం గుర్తు చేసుకోవాలి. గాంధీజీ 1936లో వార్ధాకు దగ్గరలో జరిగిన సంఘ్ శిబిరాన్ని సందర్శించారు. ఆ తరువాతి రోజు ఆయన్ని కలుసు కోవడానికి డా. హెడ్గేవార్ వారి నివాసానికి వెళ్లారు. అక్కడ వారితో జరిపిన సుదీర్ఘమైన సంభాషణ వివరాలు పుస్తకరూపంలో లభిస్తు న్నాయి. దేశ విభజన సమయంలో ఢిల్లీలోని తన నివాసానికి దగ్గరగా ఉన్న సంఘ్ శాఖకు గాంధీజీ మరోసారి వచ్చారు. స్వయంసేవకులతో మాట్లాడారు. ఈ వివరాలు 1947 సెప్టెంబర్ 27 నాటి ‘హరిజన్’ పత్రికలో ప్రచురితమయ్యాయి. స్వయంసేవకుల క్రమశిక్షణాయుత, కులభేదాలకు అతీతమైన వ్యవహారశైలిని ఆయన మెచ్చుకున్నారు. 1939 మే 12న పూనా నగరంలో జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తల శిబిరానికి సంఘ్ కార్యకర్తల ఆహ్వానం మేరకు బాబాసాహెబ్ అంబే డ్కర్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్సంస్థాపకులు డా.కేశవరావు హెడ్గేవార్, ఇతర ఆర్ఎస్ఎస్ స్థానిక ప్రముఖులు, అంబేడ్కర్ అనుయాయి బాలాసాహెబ్ సాలుంకే ఉన్నారు. వీరు 1957–62 మధ్య లోక్‌సభ సభ్యులు. వీరి ఆత్మకథలో ఈ ఘటనను పేర్కొన్నారు. 1957 ఏప్రిల్ 1 ఉగాది రోజున పూనాలో జరిగిన ఆర్ఎస్ఎస్ ఉత్సవంలో ఈ ఘటనను వారు బహిరంగ సభలో తెలియజేశారు. ఆర్ఎస్ఎస్ను అంబేడ్కర్ ఎక్కడా విమర్శించినసందర్భాలే లేవు.చైనాతో జరిగిన యుద్ధంలో భారత సైన్యానికి తోడుగా ఆర్ఎస్ఎస్ ఎంతో కీలక పాత్ర పోషించింది. అది చూసిన నాటి ప్రధాని నెహ్రూ ఎంతో ప్రభావితం అయ్యారు. ఆర్ఎస్ఎస్లోని ఒక దళం పూర్తి యూనిఫాం, బ్యాండ్‌తో 1963 గణతంత్ర దినోత్సవ పెరేడ్లో పాల్గొనేందుకు ఆహ్వానించారు. 1965 నాటి ఇండో–పాక్ యుద్ధ కాలంలో కూడా భారత సైన్యానికి ఆర్ఎస్ఎస్ అందించిన సేవలను గుర్తించి నాటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి అప్పటి ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ ఎం.ఎస్.గోల్వాల్కర్‌ను ప్రశంసించారు.ఇందిరా గాంధీ ప్రభుత్వం 1975లో విధించిన అత్యవసర పరిస్థితి సందర్భంలో ఒకసారి... అనంతరం 1992లో బాబ్రీ మసీదు ఘటన సందర్భంలో మరోసారి ఆర్ఎస్ఎస్పై నిషేధాలు విధించడం... వివిధ ప్రభుత్వ శాఖల దర్యాప్తులు, న్యాయస్థానాల విచారణల అనంతరం ఎత్తివేయడం జరిగింది. సంఘ్ మీద ఏ సందర్భంలో నిషేధం విధించినా అవన్నీ రాజకీయ కారణాల వల్ల అప్పటి ప్రభు త్వాలు విధించినవే తప్ప ఒక్క ఆరోపణ కూడా కోర్టు విచారణల్లో రుజువు కాలేదు. ఇందిర సర్కారు నిషేధం విధించడానికి ముందే ఈ అంశంపై కోర్టు తీర్పులను పరిశీలిస్తే... పంజాబ్ ఉద్యోగి రాంపాల్ అనే వ్యక్తి ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలలో పాల్గొంటున్నాడనే కారణంతో ఉద్యోగం నుంచి తొలగించగా... ఆర్ఎస్ఎస్ రాజకీయ పార్టీ కాదంటూపంజాబ్ – హరియాణా కోర్టు అతని తొలగింపు సమర్థనీయం కాదని తీర్పునిచ్చింది. మరో సంఘటన కర్ణాటకలోని రాయచూర్ జిల్లాకు సంబంధించినది. 1966లో అక్కడ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా ఉన్న రంగనటచార్ అనే వ్యక్తి ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొంటు న్నాడనే కారణంతో ఆయన పదోన్నతికి ఆటంకం కలుగగా... ఆర్ఎస్ఎస్ రాజకీయ సంస్థ కాదనీ, హిందువేతరులకు అది వ్యతిరేకం కాదనీ 1966 జూలై 6న మైసూర్ హైకోర్టు తీర్పునిచ్చింది.ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలలో పాల్గొనే విషయంలో ప్రభుత్వో ద్యోగులపై నిషేధం ఉన్నా, లేకపోయినా.. సంస్థ సిద్ధాంతం, భావ జాలం, కార్యకలాపాలు తమకు నచ్చితేనే ఎవరైనా చేరడమో లేదా పరోక్షంగా మద్దతు ఇవ్వడమో చేస్తారు తప్ప, నిషేధం ఎత్తివేసినంత మాత్రాన దేశంలోని ప్రభుత్వోద్యోగులందరూ మూకుమ్మడిగా ఏసంస్థ కార్యకలాపాల్లోనూ పాల్గొనరు గదా? అందువల్ల ప్రభుత్వోద్యో గులపై ఇన్నేళ్లు ఉన్న నిషేధాన్ని ఎత్తివేసినందుకు ఏదో జరిగిపోతుందన్నట్టు గగ్గోలు పెట్టడంలో అర్థం లేదు.కాంగ్రెస్‌లో ఒకప్పటి అగ్రనేత, ఆ పార్టీ సర్కారులో కేంద్రమంత్రి, దేశ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2018లో ఆర్ఎస్ఎస్ స్వయంసేవకుల తృతీయ వర్ష ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాటి కాంగ్రెస్ వర్గాలు ఎంత వ్యతిరేకించినా ప్రణబ్ ఈ వేడుకలో భాగస్వామి అయ్యారు. ‘నేను ఈ రోజున భరతమాత గొప్ప సంతానమైన డా. కేశవ బలిరామ్ హెడ్గేవార్‌కు అంజలి సమర్పించ డానికి వచ్చాను’ అని రాశారు. అదే ఏడాది కేరళలోని కొట్టాయంలో డిసెంబర్ 31న జరిగిన ఆర్ఎస్ఎస్ ప్రాథమిక శిక్షవర్గ ముగింపు కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ థామస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘భారత్‌లో ప్రజలు ఎందుకు సురక్షితంగా ఉన్నారని ఎవరైనా నన్ను అడిగితే – మొదట రాజ్యాంగం,రెండవది ప్రజాస్వామ్య వ్యవస్థ, మూడు సైన్యం, నాలుగు ఆర్ఎస్ఎస్ వల్ల అని జవాబు చెపుతాను’ అన్నారు. వీరేగాక లోకమాన్య జయ ప్రకాశ్ నారాయణ్, శాస్త్రవేత్తలైన జి.మాధవన్ నాయర్, కె. రాధాకృష్ణన్, కె.కస్తూరి రంగన్ వంటి పెద్దలు సైతం సంఘ్ కార్యకలాపాలను ప్రశంసించారు.ఆర్ఎస్ఎస్ పైన నిషేధాన్ని ఎత్తివేసిన రెండు దశాబ్దాల తరువాత ఇందిరాగాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం మహాత్మగాంధీ హత్యకు జరి గిన కుట్రపై విచారణ జరిపేందుకు ఒక కొత్త జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జె.జె. కపూర్‌ను చైర్మన్‌గా నియమించారు. ఆ కమిషన్ దాదాపు వందకు పైగా సాక్షులను విచా రించి 1969లో నివేదిక సమర్పించింది. ‘నేరస్థులు ఆర్ఎస్ఎస్ సభ్యు లన్న విషయం ఎక్కడా రుజువు కాలేదు. ఆ సంస్థకు హత్యలో భాగం ఉందని నిరూపితం కాలేదు’ అని కపూర్ కమిషన్ (సంపుటి –1, పేజీ–186) స్పష్టీకరించింది. దేశ విదేశాలలో కోట్లాదిమంది స్వయం సేవకులు ప్రతిరోజూ ప్రాతఃస్మరణంలో గాంధీజీ పేరును తలుచుకుంటారు. అయినప్పటికీ ఆర్ఎస్ఎస్ను మహాత్మాగాంధీ హత్యతో ముడి పెట్టడం ఎంత దారుణమో ఆలోచించాలి. ఈ నిరాధారమైన ఆరో పణలు చేసేవారిని శిక్షార్హులుగా ప్రకటించి చట్టపరమైన చర్యలు తీసు కోవాల్సిన సమయం ఆసన్నమైంది. - వ్యాసకర్త మహారాష్ట్ర మాజీ గవర్నర్- చెన్నమనేని విద్యాసాగరరావు -
రాజ్యాంగ రక్షణే అత్యవసరం
పదవిని కాపాడుకోవడం కోసం ప్రతిపక్ష నాయకులను ఇందిరాగాంధీ అరెస్టు చేశారు. మీడియా మీద ఆంక్షలు విధించారు. అందుకే ఎమర్జెన్సీ ఎత్తివేయగానే దేశంలో ఒక పౌరహక్కుల ఉద్యమం ముందుకొచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు దేశంలో పౌరహక్కులను కాపాడవలసిన అవసరముందని మాట్లాడాయి. ఆ ఒక్క దశలోనే బీజేపీ నాయకులు కూడా పౌరహక్కుల ఉద్యమాన్ని బలపర్చారు. కానీ ఎమర్జెన్సీ కంటే రాజ్యాంగపు తిరగరాత మరింత ప్రమాదకరమైనది. 2024 ఎన్నికలు దేశ ప్రజాస్వామ్యాన్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడాయి. అయితే ఈ రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం అప్పుడే పూర్తిగా తొలగిపోలేదు. దేశం మొత్తంగా ఇప్పుడున్న రాజ్యాంగాన్ని రక్షించుకునే చైతన్యం పెరగాలి.18వ లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘అబ్ కీ బార్ 400 పార్’ అని, ఈ ఎన్నికల్లో ఎన్డీఏ 400 సీట్లు గెలవాలని నినాదమిచ్చారు. దాని తరువాత ఆయన మోదీ గ్యారెంటీ నినాదమిచ్చారు. ప్రపంచ ఎన్నికల చరిత్రలో పార్టీని పక్కకు పెట్టి వ్యక్తి గ్యారెంటీ మ్యానిఫెస్టో రాయించారు. ఇది మామూలు విషయం కాదు. ఆ వెనువెంటనే ఆరెస్సెస్, బీజేపీ లీడర్లు కొంతమంది 400 సీట్లు రాగానే దేశ రాజ్యాంగాన్ని తిరగ రాస్తామని ప్రకటనలు ఇవ్వడం మొదలు పెట్టారు. అలా తిరగరాత సిద్ధాంతం ఉన్న ఆరెస్సెస్ నాయకులెవరు ఇటువంటి ప్రకటనలను ఖండించలేదు. ఆనాటికి గానీ, ఇప్పుడు గానీ ఎన్డీఏలో ఉన్న పార్టీలవారికి... అనుకున్న 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని తిరగరాసే ప్రక్రియను ఎదుర్కొనే శక్తి లేదు. వారికి అధికారం తప్ప బలమైన సిద్ధాంతం కూడా లేదు. వాళ్ళ పార్టీ అధికారం తప్ప దేశం ఎటుపోయినా ఫర్వాలేదు. ఈ స్థితిలో ఇండియా కూటమి ఎన్నికల్లో రాజ్యాంగ పరిరక్షణను ప్రధాన అంశాన్ని చేసింది. ఎన్నికల తర్వాత పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ రాజ్యాంగం కాపీని, అంబేడ్కర్ బొమ్మనీ బహిరంగ సభల్లో చూపిస్తూ తిరిగారు. ఎన్నికల పోరాటమంతా రాజ్యాంగం చుట్టూ తిరిగే స్థితి మొదటిసారి వచ్చింది. ప్రపంచ పత్రికలు కూడా ఒక దేశం రాజ్యాంగ రక్షణ అంశం ఇంత పెద్దఎత్తున ఏ దేశ ఎన్నికల్లో కూడా చర్చనీయాంశం కాలేదని రాశాయి. టీవీలు, సోషల్ మీడియా మాట్లాడాయి. ఐతే ఎన్నికల సమయంలో ఒక మోదీ తప్ప ఆరెస్సెస్ ప్రధాన నాయకుడైన మోహన్ భాగవత్ సహా రాజ్యంగాన్ని తిరగరాసే ఆలోచన లేదని చెప్పలేదు. మోదీ మాత్రం మేమే ఈ రాజ్యాంగ రక్షకులమని కొన్ని సభల్లో మాట్లాడారు. కానీ ఆరెస్సెస్, బీజేపీ నాయకులంతా సైలెంట్‌గా ఉన్నారు. దానికి ప్రధాన కారణమేమిటంటే, ఈ రాజ్యాంగం పరిధిలో పార్లమెంట్, ఇతర సంస్థలపై సంపూర్ణ పట్టు సాధించి తరువాత ఈ రాజ్యాంగాన్ని మార్చాలనేది వారి ఆలోచన. ఈ ఆలోచన ఇప్పటిది కాదు. ఇప్పుడున్న రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుండే దాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. దీనికి మనుధర్మ శాస్త్ర లక్షణాలు ఏ మాత్రం లేవనేది వారి ప్రధాన వాదన. వాళ్ళ అవగాహనలో భారతీయ చట్ట సంస్కృతి అంటే మనుధర్మ శాస్త్ర చట్ట సంస్కృతి. దాంట్లో ప్రధానమైన వర్ణ–కుల వ్యవస్థనీ, స్త్రీ అసమాన జీవితాన్నీ కాపాడటం. సమాజ అసమానతలు భారతీయ సంస్కృతిలో భాగం అని వారి భావన. అదృష్టవశాత్తు బీజేపీకి 240 సీట్లు మాత్రమే రావడం, దానికి రాజ్యాంగ రక్షణ డిబేట్ దోహదపడటం జరిగింది. అయితే రాజ్యాంగ పర చర్చ ప్రజల జీవనంలోకి చొచ్చుకుని పోకుండా ఉండటానికి ఆరెస్సెస్, బీజేపీ ఒక ఎత్తుగడ వేశాయి. అది 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ సమస్యను ముందుకు తేవడం! ఎమర్జెన్సీలో చాలా అట్రాసిటీలు, అరాచకాలు జరిగిన మాట నిజమే కానీ అది మొత్తం రాజ్యాంగాన్ని మార్చేటటువంటి ప్రమాద ఘట్టం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాకు తెలిసి ఎంతోమంది యువకులు ఎమర్జెన్సీలో ఎదురు కాల్పుల పేరిట చంపబడ్డారు. ఐతే రాజ్యాంగానికి వచ్చేవరకు ఆ కాలంలో చేసిన రెండు సవరణలు: ప్రియాంబుల్‌లో ‘సోషలిజం’ అనే పదం చేర్చడం; రెండవది ఫండమెంటల్ రైట్స్‌కు కొంత అఘాతం కలిగించే ఫండమెంటల్ డ్యూటీస్‌ని రాజ్యాంగంలో చేర్చడం. ఆరెస్సెస్, బీజేపీ సోషలిజం అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చడాన్ని వ్యతిరేకించాయి. కానీ ఫండమెంటల్ డ్యూటీస్‌ని రాజ్యాంగంలో చేర్చడాన్ని బలపర్చాయి. బంగ్లాదేశ్‌ను పాకిస్తాన్ నుంచి విడగొట్టి, పాకిస్తాన్‌ను యుద్ధంలో ఓడించినందుకు ఇందిరాగాంధీని దుర్గాదేవిగా వర్ణించిన వారిలో ఆరెస్సెస్, బీజేపీ వారు ఉన్నారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో గరీబీ హఠావో, బ్యాంకుల జాతీయీకరణ, రాజ భరణాల రద్దు వంటి ఆమె నిర్ణయాలను వ్యతిరేకించారు. ఈ మూడు సిద్ధాంతకర మార్పులు సోషలిస్టు సిద్ధాంత ప్రభావంతో ఇందిరాగాంధీ చేస్తున్నారని వాజ్‌పేయి, ఎల్‌కె అద్వానీ వంటి నాయకులు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే గరీబీ హఠావో, బ్యాంకుల జాతీయీకరణ, రాజ భరణాల రద్దు... శ్రమ జీవులకు, ఉత్పత్తి కులాలకు మేలు చేశాయి. ఈ క్రమంలో ఆమె భూ సంస్కరణల చట్టం చెయ్యడానికి శ్రీకారం చుట్టారు. 1972లో దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక బలమైన భూ సంస్కరణల చట్టం వచ్చింది. ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి 27 ఎకరాల తరి, 57 ఎకరాల ఖుశ్కి భూమి కంటే ఎక్కువ ఉండటానికి వీలు లేదని చట్టం తెచ్చింది ఆమెనే. ఆ చట్టాన్ని ఎమర్జెన్సీలో భూస్వాములపై ఒత్తిడి తెచ్చి కొంత అమలు చేశారు. నేను 1980లో ఈ చట్టం అమలుపై ఎంఫిల్ «థీసిస్ కోసం చాలా గ్రామాల్లో ల్యాండ్ రిఫామ్ ఎలా జరిగిందో పరిశీలించాను. భూస్వాములు భూములను బినామీ పేర్లమీద మార్చి చాలావరకు కాపాడుకున్నప్పటికీ ఎమర్జెన్సీలో కొంత భూమి పంచబడింది. ఆ కాలంలో తన పదవి కాపాడుకోవడం కోసం ప్రతిపక్ష నాయకులను ఇందిర అరెస్టు చేశారు. మీడియా మీద ఆంక్షలు విధించారు. నిజమే. అందుకే ఎమర్జెన్సీ ఎత్తివేయగానే దేశంలో ఒక పౌరహక్కుల ఉద్యమం ముందుకొచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు దేశంలో పౌరహక్కులను కాపాడవలసిన అవసరముందని మాట్లాడాయి. ఆ ఒక్క దశలోనే బీజేపీ నాయకులు కూడా పౌరహక్కుల ఉద్యమాన్ని బలపర్చారు. తర్వాత వాళ్లు పౌరహక్కుల రక్షణ జోలికి పోలేదు. కనుక ఎమర్జెన్సీ అనేది రెండువైపుల పదునున్న కత్తిలా పని చేసింది. కానీ ఆరెస్సెస్, బీజేపీ ఈ రాజ్యాంగాన్ని మార్చి కొత్త రాజ్యాంగాన్ని నిర్మించాలనుకున్న ఆలోచనలో శూద్రుల, దళితుల, ఆదివాసుల పక్షపాత ఆలోచనలు ఉండే అవకాశం ఏమాత్రం లేదు. వాళ్లు అనుకున్నట్టు నిజంగానే 400 సీట్లు వచ్చి ఉంటే వాళ్లు కొత్త కాన్స్టిట్యుయెంట్ అసెంబ్లీని స్థాపిస్తే దాంట్లో ఎటువంటి మేధావి వర్గం ఉండేవారు? ఆ రాజ్యాంగ పరిషత్ కుల అసమానతలను, అంటరానితనాన్ని, బీదరికాన్ని తొలగించే గట్టి ప్రతిపాదనలు చేసే అవకాశం ఉండేదా! నిజానికి బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దుపై చర్చ జరుగుతున్నప్పుడు ఆరెస్సెస్, బీజేపీ నాయకుల వాదనలు; రాజరిక వ్యవస్థ పట్ల జమీందారీ హక్కుల పట్ల వాళ్లు ఎంత అనుకూలంగా ఉన్నారో తిరిగి చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు రాజ్యాంగంలోని ప్రియాంబుల్‌లో ఉన్న ‘సోషలిజం’ అనే పదాన్ని వాళ్లు తొలగించాలనుకునేది భారతీయ కష్ట జీవుల పక్షాన ఉండటానికా? పెట్టుబడిదారుల పక్షాన ఉండటానికా?2024 ఎన్నికలు దేశ ప్రజాస్వామ్యాన్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడాయి. ఐతే ఈ రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం అప్పుడే పూర్తిగా తొలగిపోలేదు. చంద్రబాబు, నితీష్‌కుమార్ వంటి సిద్ధాంత రహిత ప్రాంతీయ నాయకులు కూడా ఈ భవిష్యత్ ప్రమాదం నుండి దేశాన్ని కాపాడలేరు. దేశం మొత్తంగా ఇప్పుడున్న రాజ్యాంగాన్ని రక్షించుకునే చైతన్యం పెరగాలి. ఓటు రాజ్యాంగ రక్షణ ఆయుధాలలో కీలకమైంది. ఐతే దాన్ని ప్రజలు, ముఖ్యంగా యువకులు నిరంతరం ఇప్పుడున్న రాజ్యాంగంతో ముడేసి చూడాలి. ఈ ఎన్నికల్లో రాజ్యంగం పట్ల కలిగిన కొత్త చైతన్యాన్ని తగ్గించేందుకు ఆరెస్సెస్, బీజేపీలు ఎమర్జెన్సీ అంశాన్ని ముందు పెట్టి చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాయి. జూన్ 25న వి.పి. సింగ్ జయంతి సభ ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్లో జరిగింది. మాట్లాడటానికి నేను ముఖ్య అతిథిగా వెళ్ళాను. అందులోనే చాలా పెద్ద హాలులో రైట్‌వింగ్ ఆలోచనాపరులు ఎమర్జెన్సీలో జె.పి. మూమెంట్‌పై మీటింగ్ పెట్టారు. ఎందుకో తెలుసా? రాజ్యాంగ మార్పు కంటే ఎమర్జెన్సీ ప్రమాదకరమని చెప్పడానికి!ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
చిత్తశుద్ధి కావాలి!
ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ ఇటీవల బహిరంగంగా ఇచ్చిన సలహా వల్ల అయితేనేం, స్వీయజ్ఞానంతో అయితేనేం... మొత్తానికి మణిపూర్ భద్రతా వ్యవహారాలపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా చాలాకాలం తర్వాత ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిపారు. ఈశాన్య రాష్ట్రంలో ఇటీవల మళ్ళీ హింసాత్మక సంఘటనలు చెలరేగడంతో షా సారథ్యంలో సోమవారం జరిగిన ఈ భేటీ సహజంగానే ఆసక్తి రేపింది. భేటీ ముగిసిన అనంతరం కేంద్రం ఎప్పటిలానే తాము మణిపుర్ ప్రజల రక్షణ, భద్రతలకు కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. రాష్ట్రంలోని మెయితీ, కుకీ వర్గాలు రెంటితోనూ చర్చలు జరిపి, జాతుల మధ్య వైమనస్యాలు తొలగించేందుకు సత్వరమే కృషి చేస్తామంటూ హోమ్‌మంత్రి పాతపాటే పాడారు. విపరీతంగా జాప్యమైనా, మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఈ సమస్య గురించి మళ్ళీ కనీసం ఆలోచన చేసినందుకు సంతోషించాలి. కానీ గంటకు పైగా సాగిన భేటీలో మణిపుర్ సీఎం బీరేన్‌సింగ్ కనిపించకపోవడమే విచిత్రం.రాష్ట్రంలో అశాంతిని కట్టడి చేయడంలో తమ ప్రభుత్వం విఫలమైందని లోక్‌సభ ఎన్నికల తర్వాత సాక్షాత్తూ బీరేన్సింగే ఒప్పుకున్నారు. ఆలస్యంగానైనా వైఫల్యాన్ని అంగీకరించారు. తప్పొప్పుల బాధ్యత తలకెత్తుకున్నారు. మణిపుర్లో మెజారిటీ వర్గమైన మెయితీలకు షెడ్యూల్డ్ తెగల హోదా ఇవ్వాలన్న డిమాండ్ ఈ సుదీర్ఘ ఘర్షణలకు దారి తీసింది. ఆ డిమాండ్‌కు నిరసనగా రాష్ట్రంలోని పర్వతప్రాంత జిల్లాల్లో గిరిజన సంఘీభావ యాత్ర చేపట్టేసరికి గడచిన 2023 మే 3న జాతుల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. ఇప్పటికీ చల్లారని ఈ చిచ్చుకు ఏడాది దాటిపోయింది. ఈ పదమూడు నెలల్లో 220 మందికి పైగా మరణించగా, 60 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. వేలాది చిన్నారులు చదువుకు దూరమయ్యారు. మయన్మార్ నుంచి ‘అక్రమంగా’ వలసవచ్చిన బయటివారే ఘర్షణలకు బాధ్యులని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు మొండిగా వాదిస్తూ వచ్చాయి. మణిపుర్‌లోని పర్వతప్రాంతాల్లో నివసించే కుకీ–జోలు, ఈ మయన్మార్ వలసదారులు ఒకే తెగ వారు గనక రాష్ట్రంలో ఘర్షణలకూ, మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారానికీ వారే కారణమనేది సర్కారు వారి మాట. సమస్య మూలాల్లోకి వెళ్ళకుండా పక్షపాత ధోరణితో రాజకీయంగా వ్యవహరిస్తే, ఇలాగే ఉంటుంది. అసలు 1990లలో ఈశాన్య రాష్ట్రాల్లోకెల్లా అత్యధిక తలసరి ఆదాయం ఘనత మణిపుర్దే. అలాంటి రాష్ట్రం ఇప్పుడు దేశంలోనే అత్యల్ప తలసరి ఆదాయమున్న మూడో రాష్ట్రంగా మారింది. విద్య, వైద్యం మొదలు ఉపాధి, ప్రాథమిక వసతి కల్పన దాకా అన్నింటా వెనకబడింది. ఈ పరిస్థితులు రాష్ట్రంలోని వివిధ జాతుల మధ్య ఉద్రిక్తతలు పెంచాయి. అయినవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో అన్న ధోరణి వనరుల కేటాయింపు, పరిపాలనల్లో సాగుతోందంటూ ఆరోపణలు వచ్చాయి. క్రమంగా అది వర్గాల మధ్య విభేదాలు పెంచి, ఘర్షణల దాకా తీసుకొచ్చింది. అయితే ఇటీవలి దాకా అశాంతి, అస్థిరతలకు దూరంగా, విభిన్న వర్గాల సమ్మిశ్రిత ఆవాసమైన జీరీబామ్ లాంటి జిల్లాలకూ తాజాగా ఘర్షణలు పాకిపోవడం మరింత ఆందోళన రేపుతోంది. అసోమ్‌ను ఆనుకొని ఉండే జీరీబామ్ జిల్లాలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి అడ్వాన్స్ సెక్యూరిటీ కాన్వాయ్‌పైనే ఈ జూన్ 10న దాడులు జరగడం రాష్ట్రంలోని అరాచక పరిస్థితులకు అద్దం పడుతోంది. ఇటీవలి ఘర్షణలతో ఆ జిల్లా నుంచి వేలాది జనం అసోమ్‌కు పారిపోయారు. రాష్ట్రంలో ఇప్పటికి ఏడాదిగా కొన్ని వేలమంది తమ ఇళ్ళకు దూరంగా నిర్వాసితుల శిబిరాల్లోనో, బంధుమిత్రుల ఇళ్ళల్లోనో తలదాచుకొని, కాలం గడుపుతున్నారు. జీవనోపాధి మాత్రమే కాదు... చివరకు సాధారణ జీవితమే ప్రజలకు దూరమైంది. రాష్ట్రం రావణకాష్ఠంగా మారినా ప్రభుత్వాలు గాలికి వదిలేశాయి. మాటలకే తప్ప చిత్తశుద్ధితో చేతలకు దిగలేదు. గత ఏడాది కాలంలో ప్రధాని మోదీ అనేక పర్యాయాలు ఈశాన్య రాష్ట్రాలను సందర్శించారు కానీ ఒక్కసారైనా మణిపుర్‌కు పోలేదు. మాటల్లోనైనా దాని ఊసెత్తలేదు. చివరకు ఆ మధ్య ఓ ఎన్నికల ప్రసంగంలో మణిపుర్ మాటెత్తినా, అక్కడ రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు, కేంద్రం జోక్యంతో పరిస్థితి మెరుగు పడిందన్నారు. వాస్తవానికి పరిస్థితి మరింత దిగజారిందనేది జగమెరిగిన సత్యం. మణిపుర్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారశైలిని నిరసిస్తూ, మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలోని రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ఇక, సీఎం సైతం మెయితీల వర్గానికి కొమ్ము కాస్తూ, తప్పంతా గిరిజన కుకీలదే అన్నట్టు వ్యవహరిస్తున్న తీరు ఆది నుంచీ తీవ్ర విమర్శల పాలైంది. గతంలో గుజరాత్, హర్యానాల్లో చిన్న కారణాలకే సీఎంలను మార్చేసిన బీజేపీ అధిష్ఠానం ఇంత జరుగుతున్నా మణిపుర్లో మాత్రం బీరేన్‌ను ఏడాదిగా అలాగే కొనసాగించడం పెను వింత. కనీసం అంతకు ముందు దశాబ్దకాలంగా ప్రశాంతంగా ఉన్న మణిపుర్లో ఇవాళ ఇలా తయారైందంటే తప్పెవరిది? సాయుధ మూకలు తుపాకులు ధరించి, చివరకు సైనిక వాహనాలను సైతం అడ్డగిస్తున్న పరిస్థితి ఉందంటే, ఏమనాలి? సోషల్ మీడియాలో దేశమంతటా తిరుగుతున్న ఈ దృశ్యాలు పాలకులకే సిగ్గు చేటు. ఏ ఒక్క వర్గాన్నో కాదు... మొత్తం రాష్ట్రాన్నే మంటల్లో పడేసిన ప్రస్తుత పరిస్థితి మారాలంటే ప్రభుత్వాలు త్రికరణశుద్ధిగా కార్యాచరణకు దిగాలి. జాతి, మతం, రాజకీయాలతో ఎవరు చట్టాన్ని ఉల్లంఘించినా కఠిన చర్యలు చేపట్టాలి. మాటలు, సమీక్షల కన్నా సత్వర చర్యలు ముఖ్యం. రాజకీయ జోక్యం మాని, ఉన్మాద చర్యల్ని ఉక్కుపాదంతో అణచివేసేలా భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛనివ్వాలి. అన్ని వర్గాల మధ్య సామరస్యం నెలకొనే నిరంతర రాజకీయ కృషి సాగాలి. నిష్పాక్షికంగా, నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తేనే మణిపుర్ మళ్ళీ మామూలవుతుంది. లేదంటే, మణిపురే కాదు... మానవ చరిత్ర కూడా మనల్ని క్షమించదు. -
బీజేపీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆర్ఎస్ఎస్ నేత యూ టర్న్!
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. ఆరెస్సెస్ నేత ఇంద్రేష్ కుమార్ లోక్‌సభ బీజేపీపై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో ఆయన యూ టర్న్ తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి అహం పెరిగిపోవడం వల్లే సరైన ఫలితం రాలేదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పేరు ప్రస్తావించకుండా ప్రతిపక్ష కూటిమిపై విమర్శలు గుప్పించారు. ఇక.. ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదం రేపటంతో క్లారిటీ ఇచ్చారు.‘‘ప్రస్తుతం దేశంలోని పరిస్థితులు చాలా స్పష్టంగా ఉన్నాయి. రాముడిని వ్యతిరేకించిన వాళ్లు అధికారంలో లేరు. రాముడిని గౌరవించాలనే సంకల్పం ఉన్నవాళ్లు ప్రస్తుతం అధికారంలోకి వచ్చారు. అదే విధంగా నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది’’ అని ఇంద్రేష్ కుమార్ స్పష్టం చేశారు.జైపూర్(రాజస్థాన్) కనోటాలో గురువారం సాయంత్రం జరిగిన ఓ కార్యక్రమంలో ఇంద్రేష్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘రాముడ్ని పూజించేవాళ్లలో అహం పెరిగిపోయింది. వాళ్లు తమను తాము అతిపెద్ద పార్టీగా ప్రకటించుకున్నారు. కానీ, చివరికి ఏం జరిగింది. వాళ్లు అనుకున్నది జరగలేదు. రాముడు కూడా వాళ్లను 241 దగ్గరే ఆపేశాడు’’ అని అన్నారు.మరోవైపు.. ప్రతిపక్ష ఇండియా కూటమిపై కూడా విమర్శలు గుప్పించారు.మరోవైపు.. కూటమి పేరును కూడా ప్రస్తావించకుండా .. ‘‘ఎవరైతే రాముడి మీద విశ్వాసం లేకుండా పోయారో.. వాళ్లను కూడా 234 దగ్గరే ఆయన ఆపేశాడు’’ అని అన్నారు. ఇటీవల ఆఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. నిజమైన సేవకుడు ఎప్పుడూ చేసిన సేవను చెప్పుకోడు, ప్రజా సేవకులకు అహంకారం ఉండరాదని వ్యాఖ్యానించారు. -
మందలింపు మాటలు
పెంచి, పోషించిన పెద్దవాళ్ళకు పిల్లలను మందలించే హక్కు ఎప్పుడూ ఉంటుంది. రెక్కలొచ్చిన పిల్లలు పెద్దల మాట వింటారా, లేదా అన్నది మాత్రం వేరే విషయం. గడచిన పదేళ్ళుగా దేశాన్ని ఏలుతున్న బీజేపీకి సైద్ధాంతిక తల్లివేరు లాంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ప్రభుత్వ పెద్దలపై తాజాగా చేసిన వ్యాఖ్యలను చూసినప్పుడు ఆ పోలికే గుర్తుకువస్తోంది. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సాగిన భీకర విద్వేష ప్రచారాన్ని ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ సోమవారం ఘాటుగా విమర్శించారు. మత ప్రాతిపదికన సమాజంలో చీలికలు తీసుకువచ్చేలా మాట్లాడడాన్ని తప్పుపడుతూ అధికార, ప్రతిపక్షాలు రెంటికీ తలంటి పోశారు. ఎన్నికలనేవి పోటీయే తప్ప యుద్ధం కాదంటూ హితవు పలికారు. అలాగే, కల్లోలిత రాష్ట్రం మణిపుర్‌లోని పరిస్థితిని ప్రస్తావిస్తూ, ప్రాధాన్యతా అంశంగా ఆ సమస్యను పరిష్కరించాల్సిన అవసరాన్ని ఎత్తిచూపారు. గత వారం ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆరెస్సెస్ ఛీఫ్ తొలిసారిగా చేసిన బహిరంగ వ్యాఖ్యలు ఇవే కావడం గమనార్హం. అదే సమయంలో ఆరెస్సెస్ అనుబంధ పత్రిక ‘ఆర్గనైజర్’ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఎన్నికల ఫలితాలలో బోర్లాపడ్డందున బీజేపీ నేతలు ఇప్పటికైనా వాస్తవాలు గుర్తెరగాలని రాయడం విశేషం. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. భాగవత్ నేరుగా మోదీ పేరు ప్రస్తావించకున్నా, ఆ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నవో అర్థం చేసుకోవచ్చు. అలాగే, క్షేత్రస్థాయిలోని జనం మాట వినకుండా, గాలి బుడగలో ఆనందంగా గడిపేయడమే బీజేపీ స్వయంగా మెజారిటీ సాధించలేని దుఃస్థితికి కారణమంటూ ‘ఆర్గనైజర్’ వ్యాసంలో ఆరెస్సెస్ జీవితకాల సభ్యుడు రతన్ శారద పేర్కొన్నారు. జనంలో రాకుండా, సోషల్ మీడియాలో పోస్టులు పంచుకుంటూ, సమస్తం మోదీ పేరుతో జరిగిపోతుందని భావించారన్న ఆయన చురకలు బీజేపీకి పెద్దగా రుచించని ఘాటైన మాటలే! నిజానికి, తాజా ఎన్నికల్లో విజయానంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ, తమ పార్టీ ఆరెస్సెస్‌ను మించి ఎదిగిందనీ, వ్యవహారాలు నడపడానికి దానిపై ఇక ఎంత మాత్రమూ ఆధారపడి లేమనీ అనడం ఆశ్చర్యకరం. బహుశా దానికి పరోక్షంగా ప్రతిస్పందనే భాగవత్ మాటలు, ‘ఆర్గనైజర్’లో వ్యాసమూ అయినా కావచ్చు. మోదీ సైతం ఒకప్పుడు ఆరెస్సెస్ ప్రచారకుడిగా ప్రజాజీవితం ప్రారంభించిన వారే. ఆ భావజాలంతో ఎదిగినవారే. ఆయన ఎదుగుదలలో, సైద్ధాంతిక అజెండాలో, గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ పైన దేశ ప్రధానిగా ఆయన ముందుకు నడవడంలో ఆ మాతృసంస్థ పాత్రను విస్మరించలేం. రాజకీయ పార్టీ బీజేపీ అయినా, దానికి పునాది స్థాయిలో పట్టు నిలిపి, గుట్టుమట్లు తెలిపినది ఆరెస్సెస్ అనేదీ జగమెరిగిన సత్యమే. ఇప్పుడు పునాదిని మరిచి, పై మాటలు మాట్లాడడం హాస్యాస్పదం. భాగవత్ చేసిన మణిపుర్ ప్రస్తావన కూడా సరైన సమయానికే వచ్చింది. ఎన్నికల కోసం దేశమంతటా కాళ్ళకు బలపం కట్టుకొని తిరిగిన ప్రధాని సందర్శించనిది మణిపురే. ఏడాది గడిచినా చల్లారని మంటలతో ఆ రాష్ట్రంలో పరిస్థితి ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులానే ఉంది. గత వారం జిరిబామ్‌లో జరిగిన హింసాకాండ, రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాన్వాయ్‌పై తాజాగా జరిగిన దాడి అందుకు నిదర్శనాలు. పరస్పరం నమ్మకం కోల్పోయిన మెజారిటీ మెయితీలు, మైనారిటీ కుకీల మధ్య ఘర్షణను నివారించడానికి భారీ ఎత్తున భద్రతా బలగాలను దింపడం తప్ప, అసలైన రాజకీయ పరిష్కారం కోసం బీజేపీ ప్రయత్నించలేదన్నది నిష్ఠురసత్యం. ఒక వర్గానికి కొమ్ముకాస్తూ, తానే సమస్యగా మారినప్పటికీ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌ను ఆ పార్టీ కదపనే లేదు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అఖండ విజయం సాధించి పెట్టిన బీరేన్‌ను స్థానికంగా పార్టీ పట్టు నిలిపే నేతగా అది భావిస్తూ ఉండివుండవచ్చు. కానీ, రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’కు ఇంఫాల్ నుంచి అనుమతి నిరాకరణ సహా రాష్ట్రంలో మారని పరిస్థితుల వల్ల మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలోని రెండు లోక్‌సభా స్థానాలనూ కాంగ్రెస్‌కే కోల్పోవాల్సి వచ్చింది. అందుకే, ఇది బీజేపీ చెవి ఒగ్గి వినాల్సిన పాఠం. ఇక, ఎన్నికల ప్రచార వేళ ఇష్టారాజ్యపు వ్యాఖ్యలతో సమాజంలో విభజన తెస్తే, భవిష్యత్తులో దేశాన్ని నడపడమెలా అన్న భాగవత్ ప్రశ్న సహేతుకమైనదే. కచ్చితంగా అన్ని పక్షాలూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సినదే. కానీ, కొంతకాలంగా అదుపులేని మాటలు అనేకం అధికార పార్టీ నుంచి వస్తున్నా ఉపేక్షించడం, ఆరెస్సెస్ సంఘ్సేవక్లను పక్కనబెట్టి బీజేపీ సొంత కార్యకర్తలతో ఎన్నికల పోరు సాగించిన తర్వాత... అదీ పార్టీకి సొంత మెజారిటీ రానప్పుడే ఈపాటి వివేకం మేల్కొనడమే ఒకింత విడ్డూరం. బీజేపీ, ఆరెస్సెస్‌ల మధ్య సఖ్యత తగ్గిందన్న వాదనకు ఇది ఊతం. అయితే, గతంలో 1998, 2004ల్లో వాజ్‌పేయ్ ఎన్డీఏ ప్రభుత్వాలకు సారథ్యం వహించినప్పుడూ అనేక విధానాలపై రెంటి మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నమాట మర్చిపోలేం. మిత్రపక్షాలపై ఆధారపడి పాలన సాగించాల్సిన సంకీర్ణాల కాలంలో నలువైపుల నుంచి అభిప్రాయాలు రావడం సహజం. వాటిలో మంచిచెడులను గుర్తించి నడుచుకోవడం సుస్థిర సర్కారుకు తొలి మెట్టు. మైనారిటీలకు వ్యతిరేకంగా కమలనాథుల వ్యాఖ్యలను ఎన్నికల సంఘమే పెద్దగా పట్టించుకోకున్నా, మాతృసంస్థ ఆలస్యంగానైనా మేల్కొని సుద్దులు చెప్పడమే తటస్థులకు కాస్తంత ఊరట. గత పదేళ్ళలో మోదీ మేనియాలో నోరు విప్పే వీలు లేకుండాపోయిన పలువురు ఇకపై గొంతు సవరించుకుంటారు. సొంత ఇంటి భాగవత్ మొదలు ఎవరు మాట్లాడినా గాయపడ్డ బీజేపీకి పుండు మీద కారం రాసినట్టే ఉండవచ్చు. కానీ గాయం మానాలంటే... మందు చేదుగా, ఘాటుగా ఉందని అనడం సరికాదేమో! -
మణిపూర్‌లో సమస్యకు గన్ పరిష్కారం కాదు: సుప్రియా సూలే
ముంబై: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్.. మణిపూర్‌లో చోటు చేసుకుంటున్న పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) ఎంపీ సుప్రియా సూలే స్వాగతించారు. మణిపూర్‌లోని ప్రజలు పడుతున్న ఇబ్బందులు తనను తీవ్రంగా కలచివేస్తున్నాయని అన్నారామె.‘‘ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మణిపూర్‌పై చేసిన వ్యాఖ్యలను పూర్తిగా స్వాగతిస్తున్నా. ఎందుకంటే మణిపూర్ భారత్‌లో భాగం. అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనందరినీ చాలా తీవ్రంగా కలచివేస్తోంది. మణిపూర్ విషయంపై చర్చ జరగాలి. మణిపూర్‌లో నెలకొన్న అశాంతిపై చర్చ జరపాలని ఇండియా కూటమి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది’’ అని అన్నారు.#WATCH | Pune, Maharashtra: On RSS chief Mohan Bhagwat's statement, NCP-SCP MP Supriya Sule says, "I welcome his statement because Manipur is part of India. And when we see our people suffering so much, it is extremely disturbing for all of us. This is something we have been… pic.twitter.com/JgRvnDET6y— ANI (@ANI) June 11, 2024 ‘‘ ఇప్పటికైనా అన్ని పార్టీల నేతలతో ఒక మంచి కమిటీ ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ ద్వారా మణిపూర్ ప్రజలకు పూర్తి విశ్వాసాన్ని కలిగించాలి. ప్రతి సమస్యకు గన్‌తో పరిష్కారం లభించదు’’ అని సుప్రియా సూలే అన్నారు. మణిపూర్‌లో శాంతి, ఎన్నికలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన అనంతరం ఆయన ఓ కార్యక్రమంలో తొలిసారి మాట్లాడారు. మాటల చాతుర్యంతో ఎన్నికల్లో గెలిచిన అనంతరం మణిపూర్‌లో చోటు చేసుకుంటున్న ఘర్షణల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ‘‘మణిపూర్‌లో అల్లర్లు చెలరేగి ఏడాది అవుతోంది. అయినా అక్కడ శాంతి నెలకొనటం లేదు. గత పదేళ్లలో శాంతంగా ఉన్న మణిపూర్‌లో ఒక్కసారిగా గన్ కల్చర్ పెరిగిపోయింది. ఇక్కడి సమస్యను పరిష్కరించటమే తొలి ప్రాన్యంగా భావించాలి. ఎన్నికల్లో చూపించిన మాటల చాతుర్యం వదిలేసి.. దేశంలోని సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలి’’ అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.‘‘ ఎన్నికల ఫలితాల కంటే ప్రజాస్వామ్యానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రపంచవ్యాప్తంగా సమాజం మారుతోంది. అదే ప్రజాస్వామ్యానికి నిదర్శనం. ఎన్నికల ప్రచారంలో ఎకరినొకరు దూషించుకోవటం, సాంకేతికతను తప్పుదారి పట్టించటం, నకిలీ వార్తలు సృష్టించటం సరికాదు. ఎన్నికలు, ఫలితాలు వాటి నుంచి బయటకువచ్చి దేశ సమస్యలపై దృష్టి పెట్టాలి’’ అని మోహన్ భగవత్ అన్నారు. -
బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై లైంగిక వేధింపుల ఆరోపణలు
బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై కాంగ్రెస్ నేత సుప్రీయా శ్రీనటె సంచలన వ్యాఖ్యలు చేశారు. మాల్వియా మహిళలపై లైంగిక వేదింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇందుకోసం పశ్చిమ బెంగాల్‌లోని ఫైవ్ స్టార్ హోటెల్స్తో పాటు బీజేపీ కార్యాలయాల్ని వినియోగించారని.. ఇదే విషయాన్ని ఆర్ఎస్ఎస్కు చెందిన శంతను సిన్హా తనతో చెప్పినట్లు సుప్రీయా శ్రీనటె తెలిపారు. తక్షణమే మాల్వియాపై చర్యలు తీసుకోవాలని బీజేపీ అధినాయకత్వాన్ని సుప్రీయా శ్రీనటె డిమాండ్ చేశారు. सवाल यह है कि- BJP की IT सेल है या दरिंदों का जमावड़ामहिलाओं के खिलाफ होने वाले अपराध में हर बार आरोपी BJP का नेता ही क्यों होता है?• BJP के पदाधिकारी पर गंभीर आरोप लगे हैं, लेकिन पूरी BJP चुप है।• ऐसे आरोपों पर खामोशी का सच क्या है, आखिर इस पदाधिकारी को क्यों और किसके… pic.twitter.com/rzwDsOPBjp— Congress (@INCIndia) June 10, 2024 ‘మేం బీజేపీని మహిళలకు న్యాయం చేయమని కోరుతున్నాం. మోదీ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోపే బీజేపీ ఐటీ సెల్ చీఫ్ మాల్వియాపై ఆరోపణలు వచ్చాయి. వెంటనే మాల్వియాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నానమి అన్నారు.కాగా, ఈ ఆరోపణల్ని అమిత్ మాల్వియా ఖండించారు. తనపై శంతను సిన్హా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. తన పరువుకు నష్టం వాటిల్లేలా వ్యవహరిస్తున్న పరువునష్టం దావా వేస్తున్నట్లు సూచించారు. -
మోదీకి ప్రత్యామ్నాయం అన్వేషిస్తున్న ఆర్ఎస్ఎస్: రౌత్
ముంబై: నరేంద్ర మోదీ బలవంతంగా మూడోసారి ప్రధానమంత్రి కావడానికి ప్రయతి్నస్తే ఆయన ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉండబోదని శివసేన(ఉద్ధవ్) సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ చెప్పారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడిని తెరపైకి తీసుకురావడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యాచరణ ప్రారంభించిందని అన్నారు. 2014, 2019లో బీజేపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచి్చన తర్వాత ఆర్ఎస్ఎస్ను బానిసగా మార్చుకోవడానికి నరేంద్ర మోదీ, అమిత్ షా ప్రయతి్నంచారని ఆరోపించారు. ఇప్పుడు వారిద్దరి బలం తగ్గిపోయిందని పేర్కొన్నారు. మోదీని ఇంటికి సాగనంపే స్థితిలో ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ ఉందన్నారు. -
రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రిజర్వేషన్లపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదని అన్నారు. రిజర్వేషన్ల విషయంలో ఆర్ఎస్ఎస్పై స్వార్థంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ ప్రచారం అంతా అసత్యం, అబద్దమని పేర్కొన్నారు.రిజర్వేషన్లను ఆర్ఎస్స్ పూర్తిగా సమర్తిస్తుందని, ఎవరికోసం అయితే కేటాయించబడ్డాయో వారి అభివృద్ది జరిగే వరకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనని తెలిపారు. రిజర్వేషన్లపై వివాదం సృష్టించి లబ్ది పొందాలని అనుకుంటున్నారని, వాటితో తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.ఇక... 2025 నాటికి రిజర్వేషన్ రహిత దేశంగా మార్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వరుసగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు కోసం 2025 నాటి కల్లా రిజర్వేషన్లు సమూలంగా రద్దు చేసేందుకు ప్రధాని మోదీ, అమిత్ షాలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్పై వస్తున్న ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. -
పశ్చిమ బెంగాల్లో హై అలర్ట్!
పశ్చిమ బెంగాల్లో నేడు(బుధవారం) జరిగే శ్రీరామనవమి వేడుకల్లో ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. హిందూ జాగరణ్ మంచ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సుమారు ఐదువేల శోభాయాత్రలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కోల్‌కతాలోని బరాసత్, సిలిగురి బరాబజార్‌లలో కూడా భారీ ఊరేగింపులు నిర్వహించే సన్నాహాల్లో ఉంది. మీడియాకు అందిన వివరాల ప్రకారం గతంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ నేపధ్యంలో ఇప్పుడు హూగ్లీ, హౌరా, ఉత్తర,దక్షిణ దినాజ్‌పూర్, అసన్సోల్, బరాక్పూర్లలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎవరైనా శాంతిభద్రతలను ఉల్లంఘించినట్లు కనిపిస్తే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఒక ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ నేటి ఊరేగింపులో ఆయుధాల బహిరంగ ప్రదర్శనకు అనుమతించబోమని, ఊరేగింపులను వీడియోగ్రాఫ్ చేయనున్నామన్నారు. గత ఏడాది మార్చి 30న హౌరాలో జరిగిన శోభాయాత్రలో పరిస్థితి అదుపు తప్పింది. ఆ తర్వాత జరిగిన హింసాకాండ రెండు జిల్లాలకు వ్యాపించింది. పలు ఘటనల్లో పది మంది గాయపడ్డారు. తాజాగా కలకత్తా హైకోర్టు .. విశ్వహిందూ పరిషత్, అంజనీ పుత్ర సేనకు కొన్ని షరతులు విధిస్తూ హౌరాలో రామనవమి శోభా యాత్రను నిర్వహించేందుకు అనుమతినిచ్చింది. నేడు (బుధవారం) జరిగే శ్రీరామనవమి శోభాయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని హిందూ జాగరణ్ మంచ్ తెలిపింది. హిందూ జాగరణ్ మంచ్ సభ్యుడు సుభాజిత్ రాయ్ మంచ్ మీడియాతో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. -
ఆ రెండు పార్టీలు విషం లాంటివి: ఖర్గే కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: దేశంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన ఇండియా కూటమి బహిరంగసభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ పార్టీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో బీజేపీ నియంత పాలన సాగిస్తోంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రెండూ విషం లాంటివి. ఆ విషాన్ని రుచి చూస్తే.. ప్రాణాలు కోల్పోవడం ఖాయమని అన్నారు. బీజేపీ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయకూడదనే ఉద్దేశ్యంతో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. మీకు ప్రజాస్వామ్య పాలన కావాలా? నియంతృత్వ పాలన కావాలా.. మీరే తేల్చుకోవాలి. నియంతృత్వానికి మద్దతిచ్చే బీజేపీ పార్టీని దేశం నుంచి తరిమి కొట్టాలి అని ఖర్గే అన్నారు. సభలో మాట్లాడుతూ ప్రజాస్వామ్యం కోరుకునే వారు చేతులెత్తండి.. అనగానే అంతా చేతులెత్తారు. #WATCH | Delhi: Addressing the INDIA alliance rally at Ramlila Maidan, Congress President Mallikarjun Kharge says, "You have to decide if you want democracy or dictatorship... Those who support dictatorship need to be kicked out of the country... BJP and RSS are like poison. You… pic.twitter.com/wdisE7HQpU — ANI (@ANI) March 31, 2024 -
ఆర్ఎస్ఎస్ పురిటి గడ్డలో బీజేపీ గెలిచింది మూడుసార్లే!
మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాల్లో నాగ్‌పూర్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. నాగ్‌పూర్ విదర్భ ప్రాంతం పరిధిలోకి వస్తుంది. నాగ్‌పూర్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు పురిటి గడ్డగా చెబుతారు. మహారాష్ట్రలోని ఐదు కీలక స్థానాలకు ఏప్రిల్ 19న మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో నాగ్‌పూర్ కూడా ఉంది. ప్రస్తుతం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ నాగ్‌పూర్ స్థానానికి ఎంపీగా ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి సాధారణ ఎన్నికలు 1952లో జరిగాయి. నాడు కాంగ్రెస్ అభ్యర్థి అనసూయాబాయి కాలే ఇక్కడి నుంచి గెలిచారు. నాగ్‌పూర్ సీటు కొన్నాళ్లు కాంగ్రెస్ ఖాతాలోనే ఉంది. 1996లో బీజేపీ తొలిసారి ఇక్కడ నుంచి గెలుపొందింది. నాగ్‌పూర్ ఎన్నికల చరిత్రలో ఎన్నో మలుపులు ఉన్నాయి. 1952లో మొదటి సాధారణ ఎన్నికల్లో నాగ్‌పూర్ స్థానం కాంగ్రెస్‌కు దక్కింది. 1962లో రాజకీయ నేత మాధవ్ శ్రీహరి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. 1967లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ఆర్ దేవ్ఘరే విజయం సాధించారు. 1971లో నాగ్‌పూర్‌లో కాంగ్రెస్‌కు తొలి పరాజయం ఎదురైంది. ఈసారి సుభాష్ చంద్రబోస్ పార్టీ ఫార్వర్డ్ బ్లాక్ నాగ్‌పూర్ స్థానాన్ని కైవసం చేసుకోగా, భోటే జంబువంతరావు ఎంపీ అయ్యారు. 1977లో కాంగ్రెస్ ఇక్కడ తిరిగి అధికారం చేజిక్కించుకుంది. 1980 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత భోటే జంబువంతరావు విజయం సాధించారు. 1984లో కాంగ్రెస్ నేత బన్వరీలాల్ భగవాన్‌దాస్ విజయం సాధించారు. బన్వరీలాల్ 1989 సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపించారు. 1991 సార్వత్రిక ఎన్నికల్లో బన్వరీలాల్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. అయితే ఈసారి బన్వరీలాల్ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి దత్తాజీ రఘోబ్జీ మేఘే ఎంపీగా ఎన్నికయ్యారు. 1996లో బీజేపీ మరోసారి బన్వరీలాల్‌కు టికెట్ ఇచ్చింది. అప్పుడు తొలిసారిగా నాగ్‌పూర్ స్థానంలో బీజేపీ విజయం సాధించింది. 1998లో కాంగ్రెస్ పార్టీ నాగ్‌పూర్ సీటును సొంతం చేసుకుంది. విలాస్ ముత్తెంవార్ ఎంపీ అయ్యారు. ఆ తర్వాత 1999, 2004, 2009లలో వరుసగా మూడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 2014లో మోదీ వేవ్ కారణంగా చాలా విరామం తర్వాత బీజేపీ తిరిగి నాగ్‌పూర్ సీటును సొంతం చేసుకుంది. ఈసారి నితిన్ గడ్కరీ ఎంపీ అయ్యారు. నితిన్ గడ్కరీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా గెలిచి తిరిగి తన ఎంపీ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం నితిన్ గడ్కరీ నాగ్‌పూర్ స్థానం నుండి ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రిగా ఉన్నారు. సంఘ్‌కు బలమైన కోటగా ఉన్నప్పటికీ నాగ్‌పూర్‌లో బీజేపీ మూడు లోక్‌సభ ఎన్నికల్లో(1996,2014,2019) మాత్రమే విజయం సాధించగలిగింది. -
నిటాషా వివాదం: ‘అందుకే భారత్‌లోకి రానివ్వలేదు’
భారత సంతతికి చెందిన యూకే ప్రొఫెసర్, రచయిత నిటాషా కౌల్‌ను భారత్‌లోకి అడుగుపెట్టకుండా అడుకున్న ఘటన వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆమె కర్ణాటక రాష్ట్రంలో జరిగే ఓ సెమినార్‌కు రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానంపై భారత్‌కు వచ్చారు. అయితే అనూహ్యంగా నిటాషాను బెంగళూరు ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఆమెకు భారత్‌లోకి అనుమతి లేదని వెనక్కి పంపించారు. దీంతో ఈ ఘటన బీజేపీ, కాంగ్రెస్ మధ్య వివాదంగా మారింది. తమ రాష్ట్రంలోకి వచ్చే విదేశియురాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కావాలనే అడ్డుకుంటుందోని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. తాజాగా నిటాషాను భారత్‌లోకి రాకుండా నిరాకరించినందుకు భారత విదేశి వ్యవహారాల శాఖ వివరణ ఇచ్చింది. ‘ఆమె యూకే దేశానికి చెందిన పౌరురాలు. ఒక విదేశి పౌరుడు/పౌరురాలును దేశంలోకి ప్రవేశం కల్పించటమనేది.. పూర్తిగా భారత దేశ సార్వభౌమాధికారిక నిర్ణయం’ అని విదేశి వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ వెల్లడించారు. తనను భారత్‌లోకి రానివ్వలేదని..ఎయిర్‌పోర్టులో కూడా తనను 24 గంటల పాటు ఎయిర్‌పోర్టులోనే ఉంచారని తెలిపారు. గతంలో తాను ఎన్నొసార్లు భారత్‌కి ఇలా జరగలేదని అన్నారు. అయితే ఆమె గతంలో ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా పలు ఆర్టికల్స్ రాశారు. దీంతో ఆమె ఉగ్రవాద సానుభూతిపరురాలు అంటూ బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. భారత వ్యతిరేకతను నిటాషా ప్రచారం చేస్తుందని కూడా మండిపడ్డారు. -
ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో పిన్ బాంబు లభ్యం
మధ్యప్రదేశ్‌లోని భింద్‌లో గల రాష్ట్రీయ స్వయం సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యాలయంలో శనివారం రాత్రి పిన్ బాంబు కనిపించడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ బాంబు చూసేందుకు గ్రెనేడ్ బాంబును పోలివుంది. రాత్రి 12 గంటల సమయంలో వాలంటీర్ రామ్ మోహన్ అందించిన సమాచారం మేరకు ఎస్పీ అసిత్ యాదవ్ తన బృందంతో సహా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అధికారులు బాంబును స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయ ఆవరణలో జెండా ఎగురవేసే స్థలంలో వాలంటీర్ రామ్మోహన్ ఈ బాంబును గుర్తించారు. అక్కడున్న పిల్లలు ఆ బాంబును రామ్ మోహన్‌కు చూపించారు. వెంటనే అతను పోలీసులకు సమాచారం అందించారు. కాగా విషయం తెలుసుకున్న బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర సింగ్ కుషా, ఎస్పీ అసిత్ యాదవ్, టీఐ కొత్వాలి ప్రవీణ్ చౌహాన్ డాగ్ స్క్వాడ్‌తో కలిసి ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులు బాంబును తమ వెంట తీసుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ బాంబు చాలా ఏళ్ల క్రితం నాటిది. ఈ ప్రాంతంలో 30 ఏళ్ల క్రితం ఫైరింగ్ రేంజ్ ఏరియా ఉండేది. అప్పట్లో ఈ బాంబు మట్టిలో పడి ఉండొచ్చని పేర్కొన్నారు. కాగా ఈ విషయంపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. -
Rahul Gandhi: ప్రేమ మన డీఎన్ఏలోనే ఉంది
రాయ్‌గఢ్: మన దేశ డీఎన్ఏలోనే ప్రేమ ఉందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మాత్రం దేశంలో విద్వేషం వ్యాప్తి చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఆయన భారత్ జోడో న్యాయ్ యాత్ర రెండు రోజుల విరామం తర్వాత ఆదివారం ఛత్తీస్‌గఢ్‌లో మొదలైంది. రాయ్‌గఢ్ ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. ‘‘భారత్‌లో భిన్న మతాలు, భిన్న సంప్రదాయాల ప్రజలు పరస్పరం ప్రేమతో శాంతియుతంగా జీవిస్తున్నారు. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ విద్వేష రాజకీయాల వల్ల ప్రతి ప్రాంతంలో విద్వేషం, హింస పెరిగిపో తున్నాయి. భాష ఆధారంగా కొందరు, రాష్ట్రాన్ని బట్టి ఇంకొందరు ఇతరులను ద్వేషిస్తామంటున్నారు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. విద్వేషం, హింసకు తావులేని హిందుస్తాన్‌ను భవిష్యత్ తరానికి అందించడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. -
TS: బీజేపీ నేతలపై ఆర్ఎస్ఎస్ అసంతృప్తి !
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతలపై సంఘ్ పరివార్(ఆర్ఎస్ఎస్) నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో జాతీయ స్థాయిలో బీజేపీ పరిస్థితిపై పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సంఘ్ పరివార్ నేతలకు వివరించారు. ఈ ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు గెలవాలంటే దక్షిణాదిలో ఎన్ని సీట్లు గెలవాలనే దానిపై ఈ సమావేశంలో ఆర్ఎస్ఎస్ నేతలకు బీజేపీ నాయకులు ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణలో ఈసారి పదికిపైగా స్థానాలు గెలిస్తేనే టార్గెట్ రీచ్ అవుతామని బీజేపీ నేతలు చెప్పారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లోనూ బీజేపీ ఎంపీలు గెలిచే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ నేతల తీరు, వ్యవహారంపై సంఘ్ పరివార్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. బీజేపీ నేతల మధ్య విభేదాలపై పరివార్ నేతలు గట్టిగానే అడిగినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందున్న మంచి వాతావరణాన్ని ఎన్నికల సమయానికి చెడగొట్టుకున్నారని మొట్టికాయలు వేశారు. ఇప్పటికైనా సమన్వయంతో పనిచేయాలని బీజేపీ నేతలకు ఆర్ఎస్ఎస్ నేతలు స్పష్టం చేసినట్లు తెలిసింది. అభ్యర్థులను ముందే ప్రకటించాలని సూచించారు. నోటిఫికేషన్‌కు ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని ఈ సందర్భంగా బీజేపీ నేతలు సమాధానమిచ్చారు. ఈ సమావేశానికి ఆర్ఎస్ఎస్ నుంచి సంఘ్ జాతీయ సహ ప్రధాన కార్యదర్శులు ముకుంద, అరుణ్ కుమార్, బీజేపీ నుంచి సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌సంతోష్, సహ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఇదీ.. చదవండి.. కేసీఆర్ వ్యాఖ్యలకు భట్టి కౌంటర్ -
రాజ్యాంగ విలువలకు తిలోదకాలేనా?
సుప్రసిద్ధ మహాకవి సి. నారాయణ రెడ్డి మూడు దశా బ్దాల నాడే కొందరు భావి పాలకులు దేశ రాజ్యాంగాన్ని పక్కకు తోసేసి, ‘రాచరిక పాలన’ను అభిలషిస్తూ ప్రవర్తించే అవకాశాలు ఎలా ఉన్నాయో ‘ప్రపంచ పదులు’ కవిత ద్వారా పాఠకులకు అందించారు. ‘నడమంత్రపు బుద్ధి దూకుడు’ ఎలా ఉంటుందో ఆ కవితలో నిరూపించారు: ‘‘గాలిలోన ఎగిరిపడే గడ్డిపరక ఊపిరెంత? ఏటిలోన తుళ్లిపడే నీటి బుడగ ఉనికి ఎంత? అబ్బో దశ పట్టిందని ఉబ్బిపోతె ఏం లాభం? కడలిలోన మిడిసిపడే కప్పపిల్ల పాకుడెంత? నడమంత్రపు సిరినేర్పిన దుడుకుబుద్ధి దూకుడెంత?’’ పాలకుల ఈ ‘దుడుకు బుద్ధి’ వల్ల దేశానికి రాబో తున్న అనర్థాల గురించి అడుగడుగునా నిశితమైన పరిశీలనలో ఉన్నారు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్. పదవిని అధిష్ఠించిన రోజు నుంచీ దేశ ప్రజలకు ముందస్తు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ పాలకులు ఎత్తుకున్న ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ నినాదం దేశ ఫెడరల్ వ్యవస్థ స్వరూప, స్వభావాలకు విరుద్ధం. దేశంలో ‘రాచరికం’ ఉంది గాని 75 ఏళ్లలో దేశ ప్రజలు నిర్మించుకున్న సెక్యులర్ రాజ్యాంగ వ్యవస్థ లేదని వర్తమాన పరిస్థితులు చెబుతున్నాయి. కనుకనే కాలానికి లొంగిపోని కర్మయోగులు నేడు మేలుకోవలసి ఉంది. ఎందుకంటే: ‘‘కలవరపడి వెనుతిరిగితే కాలం ఎగబడుతుంది కదనుతొక్కితే కాలం భయపడుతుంది కనురెప్పలు మూతపడితే కాలం జోకొడుతుంది కంఠమెత్తి తిరగబడితే కాలం జేకొడుతుంది!’’ కాబట్టి ప్రతిపాదిత ‘ఒక దేశం, ఒక ఎన్నిక’ విధా నాన్ని బుద్ధిజీవులు అందరూ వ్యతిరేకించాలి. పటిష్ఠ మైన ప్రజాస్వామ్య పునాదులను గౌరవించాలనీ, ప్రస్తుత పాలకుల కనుసన్నలలోనే ఎదిగిన మాజీ రాష్ట్రపతి కోవింద్ అధ్యక్షతన ‘ప్రజాస్వామ్య రక్షణ’ పేరిట మరో ‘తైనాతీ’ కమిటీ ఏర్పాటు తగదనీ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. పాలకుల చేతిలో కోవింద్ కీలు బొమ్మగా వ్యవహరించరాదనీ ఆయన సలహా ఇచ్చారు. అసలు విచిత్రమేమంటే, కేంద్ర, రాష్ట్రాలకు కలిపి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా దేశాని కయ్యే అపారమైన ఖర్చును ఆదా చేయవచ్చునని కేంద్ర ఎన్నికల సంఘం సలహా ఇవ్వబోవడం! ఈ చర్య రాజ్యాంగాన్నీ, పార్లమెంటరీ వ్యవస్థనూ అవ మానపరచడమే! అంతేగాదు, మత విశ్వాసాలను కూడా రాజకీయ లబ్ధి కోసం బీజేపీ–ఆరెస్సెస్ పాలకులు వాడుకోవడం ఓటర్లను దగా చేయడమే! ఈ రాజకీయమే వేల ఏళ్ల నాటి బాబ్రీమసీదు కట్టడాన్ని బలవంతంగా కూల్చి వేసి, దాని స్థానే రామమందిర నిర్మాణానికి కారణ మయ్యింది. నిజానికి సాధారణ ముస్లిం పౌరులు హిందువులకు ఎప్పుడూ వ్యతిరేకం కాదు. హిందువులు పవిత్రంగా భావించే రామా యణాన్ని స్థానిక ‘అవధి’ భాషలో రచించి ఖ్యాతి వహించిన తులసీదాస్‌ను హిందీలో రాయనందుకు శిక్షించడానికి ప్రయత్నం జరిగింది. ఆ సమయంలో ఆయననూ, ఆయన రామాయణాన్నీ ఓ స్థానిక ముస్లిం కాపాడాడు. ఈ వాస్తవాన్ని ఈ రోజుకీ గుర్తించ నిరాకరిస్తున్న ముఠా... మహాత్మాగాంధీ పేరిట కంటి తుడుపు ఉత్సవాలు చేస్తున్నా రని గమనించాలి. లాహోర్ కుట్ర కేసులో నిందితులుగా, ముద్దా యిలుగా ఉన్న భగత్‌సింగ్, సుఖదేవ్‌లు ఉరిశిక్షను ఎదుర్కొంటున్నప్పుడు భగత్‌సింగ్ ఒక సందర్భంలో మాట్లాడుతూ ‘‘తన కాలంలో మార్క్స్ కొత్త తరహాగా ఆలోచించబట్టే కాల చక్రాన్ని తన పద్ధతుల్లో త్వరిత గతిన ముందుకు నడిపించగలిగారు. అలాగే మన దేశంలో సామ్యవాద సిద్ధాంతాన్ని (సోషలిజం) నేను గాని, నువ్వు గాని (సుఖదేవ్తో సంభాషణ) ఆరంభించలేదు. నిజానికి కాలం, పరిస్థితులు కల్పించిన ప్రభావ ఫలితం అది. ఇంత కష్టమైన బాధ్యతను మనం చేపట్టినప్పుడు దాన్ని కొనసాగిస్తూ ముందుకు తీసుకుపోవాలే గాని కష్టాలు ఎదురయ్యాయని చెప్పి, ఆత్మహత్య చేసుకుంటే అది ప్రజలకు మార్గదర్శకం కాజాలదు.’’ ఈ మాటలు భగత్‌సింగ్ ఏ సందర్భంలో అన్నాడు? ఉవ్వెత్తున ప్రజాందోళన వల్ల మన ఉరిశిక్షలు ఆగిపోయి, యావజ్జీవ కారాగార శిక్షగా మారిపోవచ్చు. కానీ, 14 ఏళ్లపాటు ద్వీపాంతరవాస శిక్ష అనుభవించాక మనం జీవచ్ఛవాలుగా మారిపోతాం. అలాంటప్పుడు బతకడం కన్నా ఆత్మహత్య చేసుకోవడం మేలు కదా... ఇలా ఆలోచిస్తూ సుఖదేవ్ తన అభిప్రాయాల్ని భగత్‌సింగ్‌కు ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరానికి జవాబుగా భగత్‌సింగ్ రాసిన ఆశావహమైన లేఖే ‘కాలం అవసరం నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళం’ అన్న ప్రత్యుత్తరం. కాగా, నేటి తరం పాలకులకు రాజ్యాంగ విలువలూ తెలియవు. కనుకనే పాలనా వ్యవస్థల నుంచి, విద్యా వ్యవస్థలు, ప్రజాస్వామ్య వ్యవస్థల దాకా ఇష్టం వచ్చినట్లు మార్చడానికి ప్రయత్ని స్తున్నారు. అందుకే బహుశా, ‘ఒడువని ముచ్చట’ అనే కవితలో కందుకూరి అంజయ్య ఆవేదనను మనమూ పంచుకుందాం: శంకరా! ఇప్పుడు మనుషులను కూడగట్టే మానిసి లేడు మంచి చెడ్డలను విప్పిచెప్పే సాత్వికుడూ లేడు అంతా... వడ్లూ – పెరుగూ కలిసినట్టుంది ఈనగాస్తే నక్కలపాలయింది అంతా మొదటికొచ్చింది ఒడువని ముచ్చటై కూసుంది!! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
బీజేపీది ‘ఢిల్లీ’ పాలన: రాహుల్
నార్త్ లఖీంపూర్ (అసోం): దేశాన్ని ఢిల్లీ నుంచి మాత్రమే కేంద్రీకృత విధానంలో పాలించాలన్న భావజాలం బీజేపీ, ఆరెస్సెస్‌ల నరనరాన నిండిపోయిందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. కాంగ్రెస్‌కు మాత్రం అన్ని రాష్ట్రాలకు, అన్ని ప్రాంతాలకు సమప్రాధాన్యం లభించే స్థానిక స్వపరిపాలనే మూలమంత్రమని చెప్పారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా శుక్రవారం అసోంలోని గోగాముఖ్ వద్ద బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈశాన్య రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాలతో సమ ప్రాధాన్యముందని చాటేందుకే యాత్రను మణిపూర్ నుంచి మొదలు పెట్టానని చెప్పారు. ‘‘దేశ చరిత్రలో తొలిసారిగా ఒక రాష్ట్రంలో అంతర్యుద్ధ పరిస్థితులు నెలకొన్నా ప్రధాని మోదీకి అక్కడ పర్యటించే తీరిక లేదు’’ అన్నారు. -
Rahul Gandi: హాజరవడం కష్టమే
చిఫొబొజౌ(నాగాలాండ్): అయోధ్యలో రామ మందిరం ప్రాణప్రతిష్ఠ క్రతువు ఎన్నికల రంగులద్దుకుని ‘నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్–బీజేపీ’ ఫంక్షన్‌గా ముస్తాబవుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. సోమవారం సాయంత్రం నాగాలాండ్‌లోకి అడుగుపెట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర మంగళవారం సైతం వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారుల నడుమ కొనసాగింది. యాత్రను ముందుండి నడిపిస్తున్న రాహుల్ గాంధీ మంగళవారం రాష్ట్ర రాజధాని కోహిమాలో కాంగ్రెస్ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అందిన ఆహా్వనాన్ని తమ పార్టీ అగ్రనేతలు సున్నితంగా తిరస్కరించడాన్ని ఆయన గట్టిగా సమరి్థంచారు. ‘‘ మందిరం ప్రారం¿ోత్సవానికి కాంగ్రెస్, విపక్షాల ‘ఇండియా’ కూటమి పారీ్టల నేతలు ఎవరు వెళ్లినా నేను మనసారా స్వాగతిస్తా. కానీ ఇప్పుడు ఆ కార్యక్రమం మొత్తం మోదీ, ఆర్ఎస్ఎస్ కేంద్రంగా తయారైంది. చక్కని వేడుకను ఆర్ఎస్ఎస్, బీజేపీలు రాజకీయ వేడుకగా మార్చేశాయి. అందుకే ఈ కార్యక్రమానికి వెళ్లొద్దని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, సోనియా గాం«దీ భావించి ఉంటారు. కాంగ్రెస్ పారీ్టకి అన్ని మతాలు, సంప్రదాయాలు సమానమే. 22న అయోధ్య జరిగే కార్యక్రమం.. రాజకీయ ఉత్సవంలా మారిందని స్వయంగా కొందరు హిందూ మత పెద్దలే బహిరంగంగా విమర్శించారు. ఇలా కొత్తరూపును సంతరించుకున్న ఈ కార్యక్రమానికి మేం వెళ్లడం కష్టం. అసాధ్యం కూడా’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. ‘‘ఇండియా కూటమి బలంగా ఉంది, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తుంది. తృణమూల్ కాంగ్రెస్ పారీ్టతో సీట్ల పంపకం విషయంలో నెలకొన్న విభేదాలు సమసి పోతాయి’’ అని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. -
కుల నిర్మూలన ఇలాగేనా?
ఆర్ఎస్ఎస్ నాయకులు కుల నిర్మూలన గురించి మాట్లాడటం మంచిదే. అదే సమయంలో దానికి గల మార్గాలను కూడా వారు వివరించాలి. ప్రస్తుత మాంసాహారం వర్సెస్ శాకాహారం వివాదం కులతత్వంతో కూడుకున్నది. ఇది కుల నిర్మూలనకు సహాయం చేయకపోగా, పౌర సమాజంలో, విశ్వ విద్యాలయాల్లో కులతత్వాన్ని ప్రోత్సహిస్తుంది. వివాహం, గౌరవప్రదమైన కులాంతర భోజనాలు అనే ఈ రెండు సామాజిక వ్యవస్థలు తీవ్రమైన కుల నిర్మూలనా శక్తిని కలిగి ఉన్నాయి. అందుకే తాము హిందువులని ఆర్ఎస్ఎస్ భావించే అన్ని కులాలకూ దేవాలయాలలో అర్చకత్వ హక్కులు కల్పించాలి. దేశం, సమాజం, కుటుంబం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మంచిదని ప్రచారం చేయడం ద్వారా కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి. జాతీయ స్థాయిలో కుల గణనను డిమాండ్ చేస్తూ, ద్విజ ఆధిపత్యం కలిగిన సమాజంలో తమ చారిత్రక స్థానం పట్ల స్పృహను ప్రదర్శిస్తూ, తమ సంఖ్య గురించి శూద్ర/ఓబీసీలు చైతన్యాన్ని చూపుతున్న నేపథ్యంలో– ఎట్టకేలకు, ఆర్ఎస్ఎస్ బహిరంగ వేదికలపై కుల నిర్మూలన గురించి మాట్లాడుతోంది. కుల నిర్మూలన కోసం దత్తాత్రేయ çహొసబలే, ఇతర నాయకులు దళితులు, శూద్రులకు ఆలయ ప్రవేశాన్ని, నీటి హక్కు లను గురించి ప్రస్తావిస్తున్నారు. ఈ రెండు అంశాలూ కాలం చెల్లినవి మాత్రమే కాదు, ఇవి సామాజిక వివక్షను తొలగించే అవకాశం లేదు. రెండు సామాజిక వ్యవస్థల శక్తి మాంసాహారం వర్సెస్ శాకాహారం వివాదం కులతత్వంతో కూడుకున్నది. ఇది కుల నిర్మూలనకు సహాయం చేయకపోగా, పౌర సమాజంలో, విశ్వవిద్యాలయాల వంటి ప్రభుత్వ సంస్థలలో కుల తత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది ఆహార సాంస్కృతిక ఘర్షణలకు దారి తీస్తుంది. కులాల మధ్య విభజితమైన ఆహార సంస్కృతి కూడా కులాంతర వివాహాలకు అడ్డుగోడగా నిలుస్తో్తంది. వివాహం, గౌరవప్రదమైన కులాంతర భోజనాలు అనే ఈ రెండు సామాజిక వ్యవస్థలు తీవ్రమైన కుల నిర్మూలనా శక్తిని కలిగి ఉన్నాయి. వివాహం, ఆహార సాంస్కృతిక కండిషనింగ్ అనేవి, సామాజిక బృందాలను ఏకం చేయగలవు లేదా విభజించగలవు కాబట్టి వాటిని నేను ఉద్దేశపూర్వకంగానే శక్తి అని పిలుస్తాను. కుల వివాహ వ్యవస్థ, సామా జికంగా వేర్పాటుతో కూడిన ఆహార సాంస్కృతిక పరంపర అనేవి వేయి సంవత్సరాలుగా దేశంలో కుల అంతరాలను కొనసాగించాయి. కుల కేంద్రకమైన వివాహ వ్యవస్థ అనేది వ్యక్తుల డీఎన్ఏను కుల ప్రాతిపదికన విభజించడానికి ఉద్దేశించబడింది. గత వందేళ్ల ఆర్ఎస్ఎస్ ఉనికిని చూసినట్లయితే, కుల నిర్మూలన కోసం కులాంతర వివాహాలను అది ప్రోత్సహిస్తుందనడానికి వారి రచనల్లో గానీ, నాయకుల ప్రసంగాల్లో గానీ ఎలాంటి ఆధారాలు లేవు. కులాంతర వివాహం వివిధ వృత్తులు కలిగిన రెండు వేరు వేరు వర్గాల మధ్య రక్త సంబంధాలను మార్పిడి చేస్తుందని డా. బి.ఆర్ అంబేడ్కర్ సూచించారు. ఇది ఇద్దరు భాగస్వాముల కులాన్ని బలహీనపరచడమే కాకుండా, వారి సంతానపు మానసిక, శారీరక సామర్థ్యాలను మెరుగు పరుస్తుంది. బహుశా అలాంటి కులాంతర వివాహాన్ని రుజువు చేయడానికి ఆయన సవితా అంబేడ్కర్‌ను వివాహం చేసుకున్నారు. ఆమె బ్రాహ్మణ కుటుంబ నేపథ్యం నుండి వచ్చారు. సాధారణంగా పాశ్చాత్య సంస్కృతితో మాంసాహారం తినే దళితుడు, భారతీయ వాతావరణంలో మాత్రమే పెరిగిన బ్రాహ్మణ స్త్రీ తమ వైవాహిక జీవి తంలో ఎలాంటి సర్దుబాట్లు చేసుకున్నారు అనే సమాచారం మన వద్ద లేదు. అంబేడ్కర్, సవిత తమ ఆహారాన్ని పూర్తి శాకాహారంగా గానీ, మిశ్రమ ఆహారంగా గానీ మార్చుకుని ఉండొచ్చు. లేదా ఎదుటివారి ఆహార ఎంపికను మరొకరు గౌరవించి ఉండొచ్చు. ప్రస్తుత వ్యవస్థలో కులాంతర వివాహం అన్ని కులాలకు చెందిన భారతీయ యువత ఉన్నత విద్యను అభ్యసిస్తున్నందున కులాంతర వివాహాల పరిధి పెరుగుతోంది. అవి జరుగుతున్నాయి కూడా. కానీ కులాంతర వివాహాలను సాధారణంగా తల్లిదండ్రులు అంగీకరించరు. ఎందుకంటే ఇది సామాజిక కళంకాన్ని తీసుకొస్తుంది. అనేక సందర్భాల్లో, ముఖ్యంగా ఒక భాగస్వామి దళి తుడు, మరొకరు దళితేతరులు అయినప్పుడు అలాంటి వివాహితు లను చంపడం ఇప్పుడు పెద్ద సమస్య అయిపోయింది. అధికారంలో ఉన్న బీజేపీకి మార్గదర్శకంగానూ, భారతదేశంలోని అతిపెద్ద సామాజిక సంస్థగానూ ఉన్న ఆర్ఎస్ఎస్ ఈ సమస్యతో ఎలా వ్యవహరిస్తుందో సమాజానికి తెలియదు. ఈ సంస్థ నాయకులు సనా తన ధర్మం లేదా హిందూ సంప్రదాయం గురించి నిరంతరం మాట్లాడుతుంటారు. కులాంతర వివాహాలు సనాతన ధర్మంలో లేక హిందూ సంప్రదాయంలో భాగమేనా అన్నది వాళ్లు స్పష్టం చేయాలి. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి కుల నిర్మూలన ఒక క్లిష్టమైన యత్నం. కుల నిర్మూలన గురించి మాట్లాడటం మంచిదే. అదే సమయంలో దానికి గల మార్గాలను, సాధనాలను వివరించాలి. కులాలు, మాంసాహారం, శుద్ధ శాకాహారులు కుల వ్యవస్థ భారతీయుల మధ్య భోజనాన్ని ప్రధాన సమస్యగా మార్చింది. శతాబ్దాలుగా దేశంలోని వివిధ కులాల ప్రజలు పక్క పక్కనే కూర్చుని భోంచేయడం లేదు. పట్టణ ప్రాంతాల్లో ఆధునిక రెస్టారెంట్ వ్యవస్థలు కుల రహితంగా తినే వీలును కల్పించాయి. కానీ గ్రామాల్లో ఇప్పటికీ ఇది పెద్ద సమస్య. అనేక పాఠశాలల్లో దళితులు వండిన ఆహారాన్ని దళితేతరులు తినడం లేదు. ఈ పరంపరకు వ్యతి రేకంగా ఆర్ఎస్ఎస్ స్పష్టమైన వైఖరిని తీసుకోలేదు. శాకాహారం, మాంసాహారం అనే సమస్య ప్రస్తుతం చాలా ఐఐటీలు, ఇతర కేంద్ర విద్యా సంస్థల్లో తీవ్రమైన సమస్యగా మారింది. కొంతమంది కేంద్ర మంత్రులు ఆర్ఎస్ఎస్ శాకాహార సంస్కృతిలో భాగమయ్యారు. పైగా వారు పూర్తి శాకాహార మెనూని అవలంబించాలని ఆయా సంస్థలను కోరుతున్నారు. కేంద్ర విద్యాసంస్థల్లో, విశ్వ విద్యాలయాలలో శాకాహారం మాత్రమే అందించాలని ఆదేశాలను పంపిన మొదటి విద్యా మంత్రి స్మృతి ఇరానీ. ముంబై ఐఐటీతో సహా ఇతర ఐఐటీల అధిపతులు శాకాహారం, మాంసాహారం తినేవారికి వేర్వేరు వసతి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీటన్నింటికీ కారణం సనాతన ధర్మాచరణకు చెందిన శాకాహార భావజాలమే. ముస్లింలను, క్రైస్తవులను విడిచిపెట్టండి... శూద్రులు, దళితులు, ఆదివాసీలు భారతదేశంలో ప్రధానంగా మాంసాన్ని, లభ్యత ఆధారంగా శాకాహారాన్ని తినడం ద్వారా జీవిస్తున్నారు. కానీ పండుగ సందర్భాలలో వారికి ఇష్టమైనది మాంసాహారమే. ఆహార సాంస్కృతిక పరంపరలో స్పష్టమైన కుల వర్ణ విభజన ఉంది. ఆర్ఎస్ఎస్ తన స్వచ్ఛమైన శాకాహార సంస్కృతిని వదులుకుంటుందా? బహిరంగ, వ్యక్తిగత ప్రదేశాలలో ప్రజలు తమకు నచ్చిన ఆహారాన్ని తినడం గురించి ఏ వైఖరిని తీసుకుంటుంది? హిందూ లేదా హిందూత్వ ఆహార సంస్కృతి ఏమిటి? ఇది స్వచ్ఛమైన శాకాహారమా లేదా వ్యక్తిగత ఎంపిక ఆధారంగా మిశ్రమ ఆహారమా? వ్యక్తిగత ప్రాధాన్యాల ఆధారంగా ఆహార సంస్కృతిని ప్రజా స్వామ్యీకరించడం కుల నిర్మూలన చర్యల్లో ఒకటి. కానీ ఆర్ఎస్ఎస్ నాయకులు కుటుంబాల ఆహార స్వేచ్ఛ గురించి ఎప్పుడూ మాట్లాడ లేదు. ఉదాహరణకు దక్షిణ భారతదేశంలో శూద్రులు, దళితులు, ఆదివాసీలందరూ మాంసాహారాన్ని తింటుంటారు. బ్రాహ్మణులు, వైశ్యులు కులపరంగా శాకాహారులు. వారి పిల్లలకు అలాగే తినేలా శిక్షణ ఇస్తారు. ఈ పద్ధతులను ప్రస్తావించకుండా ఆర్ఎస్ఎస్ కులాన్ని ఎలా నిర్మూలిస్తుంది? కుల నిర్మూలనకు దశలవారీగా ఉపయోగపడే నాలుగు సామాజిక సాధనాలను నేను గుర్తించాను. వాటి గురించి ఈ సంస్థ మౌనంగా ఉంది. 1) తాము హిందువులని ఆర్ఎస్ఎస్ భావించే అన్ని కులాలకు దేవాలయాలలో అర్చకత్వ హక్కులు కల్పించాలి. దళితులు, ఆదివాసీలు, శూద్రులతో సహా అన్ని కులాల కోసం వాటిల్లో ప్రవేశానికి హక్కు కల్పించేలా ధార్మిక పాఠశాలలను, కళాశాలలను తెరవాలి. 2) చర్మశుద్ధి నుండి కుండల తయారీ వరకు అన్ని వృత్తుల గౌరవం పెరిగేలా బోధనా సామగ్రిని రూపొందించాలి. 3) దేశం, సమాజం, కుటుంబం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మంచిదని ప్రచారం చేయడం ద్వారా కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి. 4) మాంసాహారం, శాకాహారంతో సంబంధం లేకుండా ఇతరుల ఆహార ఎంపికను గౌరవిస్తూ కలిసి భోంచేసేలా చూడాలి. ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సుతో సహా, శుద్ధ శాకాహారమే హిందూ లేదా భారతీయ ఆహార సంస్కృతిగా జరుగుతున్న ప్రచారాన్ని నిలిపివేయాలి. కుల నిర్మూలన గురించి ఆర్ఎస్ఎస్కు చిత్తశుద్ధి ఉంటే ఈ అంశాలపై తన వైఖరిని స్పష్టంగా తెలియ జేయాలి. కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ఆర్ఎస్ఎస్ విజయదశమి వేడుకలు
ఈరోజు (మంగళవారం) విజయదశమి సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) దసరా ర్యాలీ నిర్వహించింది. సంఘ్ సభ్యులు నాగ్‌పూర్‌లో ‘పథ సంచాలన్’ (రూట్ మార్చ్) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, గాయకుడు శంకర్ మహదేవన్ పాల్గొన్నారు. #WATCH | Maharashtra | RSS chief Mohan Bhagwat paid tribute to the founder of the organisation K. B. Hedgewar in Nagpur, at the RSS Vijayadashami Utsav event. Singer-composer Shankar Mahadevan who is the chief guest of the function is also with him. pic.twitter.com/joytMQ3aN6 — ANI (@ANI) October 24, 2023 సంఘ్ ప్రధాన కార్యాలయంలో భగవత్ గాయకుడు మహదేవన్‌కు స్వాగతం పలికారు. ఆర్ఎస్ఎస్ నిర్వహించిన ఈ దసరా వేడుకల కార్యక్రమానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా హాజరయ్యారు. ఇరువురు నేతలు ఆర్ఎస్ఎస్ సంప్రదాయ వేషధారణలో హాజరయ్యారు. విజయదశమి సందర్భంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేబీ హెగ్రేవాల్‌కు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నివాళులర్పించారు. -
ఢిల్లీ వర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ జయకేతనం
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (డీయూఎస్‌యూ) ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సత్తా చాటింది. అధ్యక్ష పదవి సహా మూడు సెంట్రల్ ప్యానెల్ పదవులను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్యూఐ) ఒక సెంట్రల్ ప్యానెల్ పదవిని చేజిక్కించుకుంది. నాలుగేళ్ల తర్వాత శుక్రవారం డీయూఎస్‌యూ ఎన్నికలు జరిగాయి. శనివారం ఫలితాలు వెలువడ్డాయి. ఏబీవీపీకి చెందిన తుషార్ దేధా అధ్యక్ష పదవి, అపరాజిత కార్యదర్శి పదవి, సచిన్ బైస్లా జాయింట్ సెక్రెటరీ పదవిని సొంతం చేసుకున్నారు. తుషార్ దేధా ఎన్ఎస్యూఐ అభ్యర్థి హితేశ్ గులియాపై 3,115 ఓట్ల మెజారీ్టతో విజయం సాధించారు. ఎన్ఎస్యూఐకి చెందిన అభీ దహియా ఉపాధ్యక్ష పదవికి ఎంపికయ్యారు. డీయూఎస్‌యూ ఎన్నికల్లో ఏబీవీపీ విజయం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేసే సిద్ధాంతం పట్ల యువత విశ్వాసాన్ని ఈ విజయం ప్రతిబింబిస్తోందని అన్నారు. ఏబీవీపీ కార్యకర్తలకు అమిత్ షాతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభినందనలు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి సంఘాలైన ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఏ కూడా పోటీలో నిలిచినప్పటికీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. విజయం తర్వాత తుషార్ దేధా, సచిన్ బైస్లా, అపరాజిత తదితరుల అభివాదం -
రిజర్వేషన్లపై ఆరెస్సెస్ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాగ్‌పూర్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. రిజర్వేషన్లపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో వివక్ష ఉన్నంతకాలం రిజర్వేషన్లు కొనసాగాల్సిందేనని అభిప్రాయపడ్డారాయన. బుధవారం నాగ్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు ఆరెస్సెస్ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. వ్యవస్థలో మనం.. తోటి మనుషులను(కొన్ని వర్గాలను) చాలా ఏండ్లు వెనుకే ఉంచుతూ వచ్చాం. దాదాపు 2 వేల ఏళ్లుగా ఇది కొనసాగింది. ఎప్పుడైతే సమానత్వం లాంటివి ప్రత్యేకాంశాలను వాళ్లకు కల్పించామో.. ప్రత్యేకించి రిజర్వేషన్లలాంటివి వాళ్లకు ఎంతో మేలు చేస్తున్నాయి. వెనకబడిన వర్గాలకు పూర్తిస్థాయిలో మనతో సమానావకాశాలు దొరికేవరకు.. రిజర్వేషన్లలాంటి ప్రత్యేక చర్యలు అవసరమే. అందుచేత.. వివక్ష ఉన్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగించాల్సిందే. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు అన్ని విధాలా ఆరెస్సెస్ మద్దతు ఉంటుంది అని ప్రకటించారాయన. దాదాపు 2 వేల సంవత్సరాలపాటు కొన్ని వర్గాలు సంఘంలో నిర్లక్ష్యానికి గురయ్యాయన్న ఆయన.. వివక్ష ఎదుర్కొని వర్గాలు కనీసం 200 ఏండ్లైనా సరే కొంత ఇబ్బంది ఎదురైనా అంగీకరించాల్సిందేనని తెలిపారు. ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలో మరాఠా కమ్యూనిటీ రిజర్వేషన్ల ఉద్యమం మరోసారి ఉపందుకుంటున్న వేళ.. భగవత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇదీ చదవండి: భారత్ మూలాలపై రిషి సునాక్ భావోద్వేగం -
హింసా సంస్కృతి ఏ సందేశానికి?
డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు మన దేశంలో కొత్తవి కావు. 1967 వరకు అన్ని రాష్ట్రాల్లోనూ డబుల్ ఇంజన్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. గట్టి ప్రత్యర్థులను, ముఖ్యంగా యువతీ యువకులను చంపడం, వారిని ప్రమాదకరమైన నక్సలైట్లుగా ముద్ర వేయడం ఆ రోజుల్లో ఆనవాయితీగా ఉండేది. అదృష్టవశాత్తూ దేశం ఆ పీడకల రోజులను అధిగమించింది. అయితే ఆనాటి క్రూరమైన ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కూడా మణిపుర్ ఘటనలో లాగా మహిళలను నగ్నంగా ఊరేగించడం ఎప్పుడూ చూడలేదు. బహుశా అప్పటి రాజకీయ నిర్మాణంలో మూడో ఇంజన్ ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు ప్రజలను మతపరమైన మార్గాల్లో విభజించడానికి మార్గాలను రూపొందించే అత్యంత క్లిష్టమైన ఒక మూడో ఇంజన్ శక్తిమంతంగా పనిచేస్తోంది. ప్రముఖ తెలుగు దినపత్రిక ‘సాక్షి’ సంపాదకులు వర్ధెల్లి మురళి ‘నా దేశం నగ్న దేహమా?’ శీర్షికతో 2023 జూలై 23న ఘాటైన వ్యాసం రాశారు. బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు డబుల్ ఇంజన్‌తో, అంటే రెండో ఇంజన్ అయిన కేంద్ర మద్దతుతో నడుస్తున్నాయని ప్రధాని మోదీ నిరంతరం మాట్లాడుతున్నారని మురళి అన్నారు. వాస్తవానికి మణిపుర్లో మూడు ఇంజన్లు పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు. కుకీ క్రైస్తవ మహిళలను నగ్నంగా ఊరేగించి, వారిలో ఒకరిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణమైన ఘటన గురించి రాస్తూ, ఏ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా ‘ట్రిపుల్ ఇంజన్’ పవర్‌తో ప్రభుత్వాలు నడుస్తున్నాయని అన్నారు. ఆ మూడో ఇంజన్ – ఆరెస్సెస్. మూడవ ఇంజన్ క్రమపద్ధతిలో ప్రతి రాష్ట్రంలోనూ ప్రజలను మెజారిటీలు, మైనారిటీలుగా విభజిస్తుంది. ఇది ప్రజలను మత పర మైన మార్గాల్లో విభజించడానికి మార్గాలను రూపొందించే అత్యంత క్లిష్టమైన ఇంజన్. 1999లో బీజేపీ, ఆరెస్సెస్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి వారు ఎన్నికల ప్రయోజనాల కోసం యంత్రాంగాన్ని ఉపయోగించడం ప్రారంభించారు. మరీ ముఖ్యంగా 2014 ఎన్నికల నుండి దేశవ్యాప్తంగా మైనారిటీ వ్యతిరేక ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ప్రధానంగా ముస్లింలను, క్రైస్తవులను లక్ష్యంగా చేసుకున్నారు. వ్యవస్థీకృతమైన హిందుత్వ శక్తులు వారిపై దాడి చేసేందుకు అన్ని రకాల వ్యూహాలను ప్రయోగిస్తూనే ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో క్రైస్తవులు లేదా క్రైస్తవేతరులు అనే ప్రాతిపదికన సమూ హాలను విభజించడం చాలా కాలంగా జరుగుతోందని పుకార్లు ఉన్నాయి. 2014 ఎన్నికల తర్వాత ఆరెస్సెస్–బీజేపీ స్థానిక రాష్ట్ర యంత్రాంగంపై నియంత్రణను సాధించింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, మణిపుర్లో దాదాపు 53 శాతం జనాభా మైతేయిలు కాగా, మిగిలిన వారిలో కుకీలు, నాగాలు ఉన్నారు. కుకీలు, నాగాలలో దాదాపు 95 శాతం మంది క్రైస్తవులు; మైతేయిలలో 2–3 శాతం మంది క్రైస్తవులు. మైతేయిలలో కూడా క్రైస్తవ ప్రభావం పెరుగుతోందని హిందుత్వ శక్తులు భావించిట్లు కనిపిస్తోంది. కాబట్టి వారు మతపరమైన పరి వర్తనకు అడ్డుకట్ట వేయాలని కోరుకున్నారు. మైతేయిలను బలమైన హిందూ శక్తిగా అవతరింపజేయడం ద్వారా వారు తమ ప్రయత్నాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో రాష్ట్రంలోని కుకీలు, నాగాలు విశ్వాసపాత్రులైన క్రైస్తవులుగా ఉండిపోయారు, లేదా ‘ఘర్ వాపసీ’ అయ్యారు. ఇంకొక ప్రధాన ఆలోచన ఏమిటంటే, హిందూ మైతేయిలను ఎస్టీలుగా గుర్తించడం వలన వారికి భూమి హక్కులు, ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయి. ఇది ఈశాన్య ప్రాంతాలను క్రైస్తవీ కరణ నుంచి మార్చే హిందుత్వ ప్యాకేజీ. ఇది దీర్ఘకాలిక ప్రాజెక్ట్. వ్యవస్థీకృత హిందూ మైతేయిలకు ఆ పనిని చేయడానికి అనుమతించే కార్యాన్ని మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌కు అప్పగించినట్లు కనిపిస్తోంది. రాజకీయ చర్చల నుండి అత్యంత శక్తిమంతమైన మూడో ఇంజ న్ను మినహాయించి, ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఏం జరుగు తున్నదో దానికి బాధ్యత వహించాల్సింది మోదీయేనని ప్రతిపక్షాలు మాట్లాడటం తప్పు. వాజ్‌పేయి కంటే ఎక్కువ అధికారంతో మోదీ రెండో ఇంజన్ ను నడుపుతున్నారనేది వాస్తవం. కానీ మూడో ఇంజన్ అయిన ఆరెస్సెస్ ప్రమేయం లేకుండా... మణిపుర్లో లాగా హిందుత్వ యంత్రాంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించుకోలేవు. ముఖ్యమంత్రులకు ఏం చేయాలో, ఏం చేయకూడదో చెప్పేది థర్డ్ ఇంజన్. స్త్రీలను నగ్నంగా నడిచేలా చేసిన పురుషుల ప్రవర్తన కనికరం లేకుండా ఉండటానికి ఎంతో శిక్షణ అవసరం. వారిలో ఒకరిపై దారు ణంగా అత్యాచారం చేశారు. ఆ దృశ్యానికి సంబంధించిన వీడియోలు ప్రపంచాన్ని కంపింపజేయడంతో ప్రధాని ఈ ఘటనను ఖండించారు. అయితే ఆ క్రూరత్వానికి వ్యతిరేకంగా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మణిపుర్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పాలని ఈ సంస్థ గతంలో ఒక సాధారణ ప్రకటన మాత్రం విడుదల చేసింది. అయితే ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో నేపథ్యంలో ఆయన ఓ ప్రకటన చేశారు. ‘‘చాలాసార్లు ప్రతికూల చర్చలే వినిపిస్తున్నాయి. అయితే మనం దేశమంతా తిరిగి చూసినప్పుడు, జరుగుతున్న మంచి విషయాల గురించి 40 రెట్లు ఎక్కువ చర్చలు సాగుతున్నాయని మనకు తెలుస్తుంది’’. ఆ ఘటనలోని మహిళా వ్యతిరేక స్వభావాన్ని ఖండించకుండా ‘40 రెట్లు ఎక్కువ మంచి విషయాలు’ అంటూ సర్సంఘ్ చాలక్ మాట్లాడుతున్నారు. మణిపుర్లో మూడు ఇంజన్లు సమన్వయంతో పనిచేశాయి కాబట్టి, ఆ చర్యలో పాల్గొన్న హిందుత్వ శక్తులు ఆ మహిళలను ఘర్ వాపసీ చేయాలనుకుంటున్నాయా? బాధితులకు ఉరిశిక్ష పడేలా తమ ప్రభుత్వం చూస్తుందని మణిపుర్ ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే బిల్కిస్ బానో అత్యాచారం కేసులో 11 మంది దోషుల వలె వారిని తరువాత విడుదల చేయవచ్చు! నియంతృత్వం ఆసన్నమైందనే భయం కారణంగానే చాలా మంది ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితిని ఎదిరించారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ మద్దతు కలిగిన డబుల్ ఇంజన్ సర్కారు. ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు పూర్తిగా ఆయిల్ నింపిన ఆ ఇంజన్‌కు రాష్ట్ర స్థాయి నిర్వాహకులు. గట్టి ప్రత్యర్థులను, ముఖ్యంగా యువతీ యువకులను చంపడం, వారిని ప్రమాదకరమైన నక్సలైట్లుగా ముద్ర వేయడం ఆ రోజుల్లో ఆనవా యితీగా ఉండేది. ఏ పోలీసు కూడా అలాంటి వారికి రక్షణ కల్పించ లేదు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి అధికారీ పతకం సాధించేందుకు, మరింత మందిని చంపేందుకు పోటీ పడ్డారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు మనకు కొత్తవి కావు. 1967 వరకు అన్ని రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. అయితే ఆనాటి క్రూరమైన ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కూడా మహిళలను ఊరేగించడం ఎప్పుడూ చూడలేదు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఇంజన్‌కు ఒక మహిళ నాయకత్వం వహిస్తున్నందున, ఆనాడు అలాంటి ఆపరేషన్ ను అనుమతించలేదు. అదృష్టవశాత్తూ దేశం ఆ పీడకల రోజులను అధిగమించింది. బహుశా ఆ రాజకీయ నిర్మాణంలో ఆ కాలంలో థర్డ్ ఇంజన్ ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు మణిపుర్లో కానీ దేశంలో కానీ బహిరంగంగా ప్రకటించినటువంటి ఎమర్జెన్సీ లేదు. అయినా ఇక్కడ ప్రజలను కేవలం వ్యక్తిగత ఎన్ కౌంటర్లలో చంపడం లేదు. వారి సొంత ఇళ్లల్లో, బయట సజీవ దహనం చేస్తున్నారు. మణిపూర్ ఘటన ఉద్దేశపూర్వకంగా ప్రేరేపించిన హింసాత్మక సంస్కృతి తాలూకు చివరి చర్య. ఈ హింసను, ఈ అనాగరక సంస్కృతిని ప్రపంచం ఎలా అర్థం చేసు కోవాలి? ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
అమెరికాలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ పై రాహుల్ గాంధీ విమర్శలు
-
ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేస్తే.. కాంగ్రెస్ బూడిదవుతుంది: బీజేపీ హెచ్చరిక
కర్ణాటకలో ఎన్నికలు ముగిసినా రాజకీయ రగడ మాత్రం చల్లారడం లేదు. తాము అధికారంలో వస్తే ఆర్ఎస్ఎస్, బజ్రంగ్ దళ్ సంస్థలను బ్యాన్ చేస్తామంటూ కాంగ్రెస్ తమ మెనిఫెస్టోలో ఇచ్చిన హామీ వివాదం నేటీకి కొనసాగుతోంది. నిజంగానే కర్ణాటక ప్రభుత్వం బజ్రంగ్ దళ్‌ని బ్యాన్ చేస్తుందా అనే దానిపై.. ఇటీవల కాంగ్రెస్ మంత్రి ప్రియాంక ఖర్గే మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తే ఏ సంస్థనైనా సహించేది లేదన్నారు. అది పీటీఐ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ అయినా సరే చర్యలు తప్పవన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఆ సంస్థల్ని నిషేధించడానికి కూడా వెనకాడమన్నారు. ఇదే విషయంపై ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దమ్ముంటే కాంగ్రెస్ బజరంగ్ దళ్‌ను బ్యాన్ చేయాలని సవాల్ విసురుతోంది కాషాయ పార్టీ. తాజాగా ఈ వివాదంపై కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ స్పందించారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొడితే ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేస్తామంటూ మంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేసేందుకు ప్రయత్నిస్తే కాంగ్రెస్‌ను బూడిద చేసేస్తామని హెచ్చరించారు. చదవండి: మీడియా ముందుకు ముగ్గురు సీఎంలు.. ఏమన్నారంటే? "ఆర్ఎస్ బ్యాన్ చేస్తామని ప్రియాంక్ ఖర్గే మాట్లాడారు. ప్రధాని నరేంర మోదీ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్త. ఇప్పుడు ఆయన కేంద్రంలో అత్యున్నత పదవిలో ఉన్నారు. మేమంతా ఆ స్వయం సేవక్ సంఘ్ నుంచి వచ్చిన వాళ్లమే. అప్పట్లో జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, పీవీ నర్సింహరావు ప్రభుత్వాలు కూడా ఆర్ఎస్ఎస్నుని బ్యాన్ చేయాలని చూశాయి. కానీ.. వాళ్ల వల్ల కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ అదే ప్రయత్నం చేస్తోంది. ఇదే జరిగితే కాంగ్రెస్‌ని కాల్చి బూడిద చేస్తాం. ప్రియాంక్ ఖర్గే ఈ దేశ చరిత్ర ఏంటో తెలుసుకుంటే మంచిది. తన నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి" అని నళిన్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు. #WATCH | When asked about RSS in the wake of Congress' stand on a ban on PFI and Bajrang Dal in the state, Karnataka Minister Priyank Kharge says, "Any organisation, either religious, political or social, who are going to sow seeds of discontent & disharmony in Karnataka will not… pic.twitter.com/a6H4pDSWIT — ANI (@ANI) May 25, 2023 -
‘పాక్‌లో హైటెన్షన్.. బీజేపీ, ఆరెస్సెస్‌ల పనేనంట!’
ఇస్లామాబాద్: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌తో పాకిస్తాన్ ఒక్కసారిగా అగ్ని గుండంగా మారింది. ఖాన్ అరెస్ట్‌ను ఖండిస్తూ ఆందోళన చేపట్టిన.. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ కార్యకర్తలు విధ్వంసకాండకు తెగబడ్డారు. మంగళవారం సాయంత్రం మొదలైన ఈ పర్వం.. ఇంకా కొనసాగుతూనే ఉంది. భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టంవైపు అడుగులేస్తోంది పీటీఐ శ్రేణుల ఆందోళన. అయితే ఈ హింసపై పాక్ అధికారిక వర్గాలు మాత్రం వింత వాదనకు దిగాయి. పాక్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులకు.. పీటీఐ కార్యకర్తలు కారణం కాదంట. ఆ కల్లోలం వెనుక భారత్‌లోని బీజేపీ, ఆరెస్సెస్ ఉందంటూ వాదిస్తోంది. పాక్ ప్రధాని షెహ్బాష్ షరీఫ్ వ్యక్తిగత కార్యదర్శి అట్టా తరార్ ఈ విచిత్రమైన వాదనను లెవనెత్తాడు. పాక్‌లో విధ్వంసకాండకు, అల్లర్లకు కారణం ఇక్కడి వాళ్లు కారు. భారత్ నుంచి ఆరెస్సెస్, బీజేపీలు అందుకోసం అక్కడి నుంచి కిరాయి మనుషుల్ని పాక్‌కు పంపారు అంటూ బుధవారం మీడియా ముందు పేర్కొన్నాడు తరార్. నిరసనల పేరిట విధ్వంసానికి దిగిన వాళ్లు బీజేపీ, ఆరెస్సెస్ మనుషులే. అంతెందుకు వాళ్లు నిన్నటి (మంగళవారం ఖాన్ అరెస్ట్.. తదనంతరం అల్లర్లు) పరిణామం తర్వాత భారత్‌లో సంబురాలు కూడా చేసుకున్నారు. ఇదంతా ఆరెస్సెస్ ఆదేశాలతో జరిగింది’ అని తరార్ పాక్ మీడియా ఎదుట ప్రకటన చేశాడు. ఇదీ చదవండి: బాత్రూంకు కూడా పోనివ్వకుండా టార్చర్ పెట్టారు! -
Defamation Case: రాహుల్‌కి పరువు నష్టం కేసులో ఉపశమనం!
ఓ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మహారాష్ట్రలోని భివండీ కోర్టు ఉపశమనం కల్పించింది. ఈ మేరకు భివండీ కోర్టు రాహుల్‌కి విచారణకు హాజరుకాకుండా ఉండేలా శాశ్వత మినహాయింపు ఇచ్చింది. రాహుల్ తరుఫు న్యాయవాది దాఖలు చేసిన దరఖాస్తును పరిశీలించిన కోర్టు ఆయన శాశ్వత మినహాయింపుకు అర్హుడని పేర్కొంది. అంతేగాదు పరువు నష్టం కేసులో సాక్ష్యాధారాలను నమోదు చేయడానికి ఈ కేసును జూన్ 3కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. మహాత్మ గాంధీ హత్యను ఆర్ఎస్ఎస్కి ముడిపెడుతూ.. రాహుల్ పలు ఆరోపణలు చేశారు. దీంతో థానే జిల్లాలోని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆ వ్యాఖ్యలు తమ ప్రతిష్టను కించపరిచేలా ఉందని పేర్కొంటూ.. రాహుల్‌పై రాజేష్ కుంతే అనే ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్త 2014లో భివండీ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విషయమై 2018 జూన్‌లో రాహుల్ కోర్టు ముందు హాజరయ్యారు కూడా. తాను ఢిల్లీ వాసినని, లోక్‌సభ సభ్యుడిగా తన నియోజకవర్గంలో పర్యటనలు చేయాల్సి ఉంటుందన పేర్కొంటూ కోర్టులో హాజరు నుంచి మినహాయింపు కోరారు. అలాగే అవసరమైనప్పుడూ విచారణలో బదులుగా తన తరుఫున న్యాయవాదిని అనుమతించాలని కోరారు. ఈ క్రమంలోనే భివాండీ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు నిందితుడు(రాహుల్ గాంధీ)కి కోర్టులో హజరు నుంచి మినహాయింపు ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. విచారణ తేదీల్లో రాహుల్ తరుఫు న్యాయవాది క్రమం తప్పకుండా హాజరు కావాలని, కోర్టు ఆదేశించినప్పుడూ నిందితుడు(రాహుల్) కూడా హాజరు కావాలని షరతులు విధించింది. కాగా, ఇటీవలే సూరత్ కోర్టులో 2019లో నమోదైన పరువు నష్టం కేసులో రాహుల్‌ని దోషిగా నిర్ధారిస్తూ..రెండేళ్లు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన లోక్‌సభ ఎంపీగా అనర్హత వేటుకి గురయ్యారు. (చదవండి: కర్ణాటక ఎన్నికలు: ఏం మాట్లాడతారో?.. రాహుల్ గాంధీ కోలార్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి) -
ఆర్ఎస్ఎస్ ర్యాలీకి నిబందనలు
సాక్షి, చైన్నె : ఆర్ఎస్ఎస్ ర్యాలీకి 12 రకాల నిబంధనలు విధించారు. రాష్ట్రంలో సుప్రీంకోర్టు నుంచి అనుమతి పొంది మరో ర్యాలీ నిర్వహించేందుకు ఆర్ఎస్ఎస్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ మేరకు ఈనెల 16న 45 చోట్ల ర్యాలీ నిర్వహించేందుకు ఆర్ఎస్ఎస్ నిర్ణయించింది. ఇందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. చైన్నెలో రెండు చోట్ల ఈ ర్యాలీ జరగనుంది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఆర్ఎస్ఎస్ ర్యాలీకి అనేక నిబంధనలు విధించారు. డీజీపీ శైలేంద్రబాబు ఆదేశాల మేరకు అన్ని జిల్లాల ఎస్పీలకు 12 కట్టుబాట్లు తప్పనిసరిగా అమలయ్యే విధంగా శుక్రవారం ఆదేశాలు వెళ్లాయి. ర్యాలీ, సభలో వ్యక్తిగతం, కులమతాలకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. దేశ పరువుకు భంగం కలిగించే చర్యలకు పాల్పడరాదు. ప్రజలకు, వాహనదారులకు ఇబ్బంది కలిగించకుండా ర్యాలీ నిర్వహించాలి. ర్యాలీలో పాల్గొనే వారు ఆయుధాలు, కర్రలు చేతబట్టి ముందుకు వెళ్లేందుకు వీలు లేదు. ర్యాలీలో పాల్గొనే వారి కోసం తాగునీరు, కెమెరాలు, అగ్నినిరోధక పరికరాలు, ఇలా అన్ని రకాల ఏర్పాట్లను నిర్వాహకులు చేసుకోవాలి. ఎంపిక చేసిన , అనుమతి ఇచ్చిన మార్గాలలో ఎడమ వైపు మాత్రమే ర్యాలీ జరగాలి. అనుమతి ఇచ్చిన రహదారిలోని నాలుగు భాగాలలో ఓ భాగం మాత్రమే ర్యాలీకి ఉపయోగించుకోవాలి. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ర్యాలీలో ఉన్న వారిని పర్యవేక్షించేందుకు స్వచ్ఛంద సేవకులను నియమించుకోవాలని సూచించారు. -
సుప్రీంకోర్టులో సీఎం స్టాలిన్‌కు షాక్.. ఆర్ఎస్ఎస్ ర్యాలీకి లైన్ క్లియర్..
న్యూఢిల్లీ: తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ ర్యాలీలకు అనుమతి ఇస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సవాల్ చేయగా.. సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. హైకోర్టు తీర్పును సమర్థించింది. తమిళనాడు వ్యాప్తంగా రూట్ మార్చ్‌లు నిర్వహించాలనుకున్న ఆర్ఎస్ఎస్కు స్టాలిన్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఈ ర్యాలీలపై నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) దాడులకు పాల్పడే అవకాశం ఉందని, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని కారణంగా పేర్కొంది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆర్ఎస్ఎస్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. పిబ్రవరి 10న ర్యాలీలకు అనుమతి ఇస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును స్టాలిన్ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. అక్కడ కూడా నిరాశే ఎదురైంది. సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం ఇచ్చిన తీర్పుతో తమిళనాడు వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించేందుకు ఆర్ఎస్ఎస్ సిద్ధమవుతోంది. చదవండి: జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే.. ఓ రాజకీయ పార్టీకి ఎలాంటి అర్హతలుండాలి? -
చరిత్ర పుస్తకాల్లో ‘గాంధీ, ఆరెస్సెస్’ తొలగింపు
న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్య్రం రాగానే హిందూ, ముస్లింల మధ్య గొడవలు, సయోధ్య కోసం గాంధీ విఫలయత్నం, ఆయన హత్య తర్వాత ఆరెస్సెస్‌పై నిషేధం, గోధ్రా అల్లర్ల తర్వాత ఘటనలు తదితరాలను పన్నెండో తరగతి చరిత్ర పాఠ్య పుస్తకాల నుంచి ఎన్సీఈఆర్టీ తొలగించింది. హేతుబద్ధీకరణలో భాగంగా ఏయే అంశాలను తొలగించబోతున్నదీ తెలుపుతూ మండలి గత జూన్‌లో విడుదల చేసిన బుక్‌లెట్‌లో వీటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. హిందూ అతివాదంపై గాంధీ అభిప్రాయాలు వంటి అంశాలను తొలగించడం భావితరాలకు వాస్తవాలు తెలియకుండా చేసే కుటిల యత్నమని ఆరోపించింది. బీజేపీ, ఆరెస్సెస్ ఎంత ప్రయత్నించినా చరిత్రను మార్చలేవని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. విషయ నిపుణుల సూచన మేరకే వాటిని తొలగించినట్టు ఎన్సీఈఆర్టీ చీఫ్ దినేశ్ సాక్లానీ చెప్పారు. ఈ విషయంలో రాద్ధాంతం అనవసరమని అభిప్రాయపడ్డారు. -
కర్ణాటకలో కాంగ్రెస్ చేతిలో బీజేపీ చిత్తు.. ఈసారి 70 సీట్లే.. ఫేక్ సర్వే వైరల్
బెంగళూరు: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో బీజేపీకి ఘోర పరాభవం తప్పదని ఆర్ఎస్ఎస్ సర్వేలో తేలిందని ఓ వార్త జోరుగా వ్యాప్తి చెందుతోంది. కమలం పార్టీ ఈసారి కేవలం 65-70 సీట్లకే పరిమితం అవుతుందని, కాంగ్రెస్ 115-120 సీట్లు కైవసం చేసుకుని అధికారంలోకి వస్తుందని ఈ సర్వే పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఆర్టికల్ కర్ణాటక దినపత్రిక కన్నడ ప్రభలో ప్రచురితమైందని, ఓ ఫొటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది ఆర్ఎస్ఎస్ నిర్వహించిన అంతర్గత సర్వే అని విస్తృత ప్రచారం జరుగుతోంది. అయితే ఇది గతంలో నిర్వహించిన పాత సర్వే అని తెలుస్తోంది. తన సొంత సామాజిక వర్గంలో బీఎస్ యడియూరప్ప పాపులారిటీ పడిపోయిందని ఈ సర్వేలో ఉంది. రెడ్డి సోదరులను బీజేపీలోకి తీసుకురావాలనే యడ్డీ నిర్ణయం బ్యాక్‌ఫైర్ అయిందని సర్వే పేర్కొంది. దీంతో ఈ సర్వే ఇప్పటిది కాదని స్పష్టమవుతోంది. యడియూరప్ప ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఇప్పటికే ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. మరోవైపు కన్నడ ప్రభ కూడా ఈ వార్త తాము ఇప్పుడు ప్రచురించలేదని అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆర్ఎస్ఎస్ అంతర్గత సర్వే పేరుతో జరుగుతున్న ప్రచారం ఫేక్ అని తేలిపోయింది. ఈ సర్వేలో బీజేపీకి 65-70, కాంగ్రెస్‌కు 115-120, జేడీఎస్‌కు 29-34 సీట్లు వస్తాయని ఉంది. కాంగ్రెస్ పనే.. ఈ ఫేక్ సర్వేపై బీజేపీ నేత, కర్ణాటక ఆరోగ్యమంత్రి డాక్టర్ సుధాకర్ తీవ్రంగా స్పందించారు. బీజేపీకి రాష్ట్రంలో ప్రజల నుంచి వస్తున్నమద్దతు చూసి కాంగ్రెసే ఓర్వలేక ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఓటమి తథ్యం అని, దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలా చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాగా.. కర్ణాటకలో ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో కాంగ్రెసే విజయం సాధిస్తుందని తేలింది. మొత్తం 224 స్థానాలకు గానూ ఆ పార్టీకి 39-42 శాతం ఓట్లతో 116-122 సీట్లు వస్తాయని ఈ సర్వే పేర్కొంది. బీజేపీకి 33-36 శాతం ఓట్లతో 77-83 సీట్లు వస్తాయని చెప్పింది. చదవండి: అధికార డీఎంకేలో భగ్గుమన్న వర్గపోరు.. మంత్రి కళ్లెదుటే ఎంపీ ఇళ్లు, కారు ధ్వంసం -
దేశ ‘కనెక్టింగ్ ఫ్యాక్టర్’ హిందుత్వం
పేరు ప్రఖ్యాతులు కావాలని ఆరెస్సెస్ పాటుపడదనీ, సమాజాన్ని సాధికారత దిశగా నడిపించడానికి కావాల్సిన శక్తియుక్తులను అందించడానికి వీలుగా వ్యక్తులను కలిపి పనిచేయించడమే ఆరెస్సెస్ లక్ష్యమనీ ఆ సంస్థ ప్రచార్ ప్రముఖ్ (మీడియా రిలేషన్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్) సునీల్ అంబేకర్ అన్నారు. ఆయన ఇంగ్లీషులో రాసిన ‘ద ఆరెస్సెస్: రోడ్‌మ్యాప్స్ ఫర్ ద 21 సెంచరీ’ పుస్తకానికి తెలుగు అనువాదం ‘అరెస్సెస్ ప్రణాళిక 21వ శతాబ్దం కోసం’ ఆవిష్కరణకు ఇటీవల విజయవాడ వచ్చిన సందర్భంగా ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఇవీ. ఈ పుస్తకం రాయాలన్న ఆలోచన ఎందుకొచ్చింది? ఈ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని దేశంలో చాలామంది ఆకాంక్ష. యువతలో అది ఇంకా బలీయంగా ఉంది. నేను విశ్వవిద్యాలయాలు, ప్రముఖ విద్యాసంస్థలను సందర్శిస్తున్న సమ యంలో దేశాభివృద్ధి గురించి యువత ప్రశ్నించేది. కాలక్రమంలో ప్రశ్న అడిగే తీరులో మార్పును గమనించాను. దేశ ప్రగతికి సంబం ధించి యువత నుంచి ప్రతికూల ప్రశ్నలు కాకుండా సానుకూల ప్రశ్నలు రావడం మొదలైంది. దేశాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు ఎలా తీసుకెళ్లాలి? అని విభిన్న కోణాల నుంచి వస్తున్న ప్రశ్నలకు జవాబులు చెప్పేవాడిని. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో సమాజంలో అందరి భాగస్వామ్యం ఉండాలి. ఈ యజ్ఞంలో భాగమైన సంఘ కార్యంలో(ఆరెస్సెస్ కార్యక్రమాల్లో) అందరికీ భాగస్వామ్యం ఉండాలని ఆరెస్సెస్ భావిస్తోంది. ఆరెస్సెస్‌ను మరింత బాగా అర్థం చేసుకోవడానికీ, సంఘ పరిచయం లేని వ్యక్తులు కూడా ఆరెస్సెస్ తీరును అవగతం చేసుకోవడానికీ పుస్తకం రాయాలన్న ప్రతిపాదన నా వద్దకు వచ్చింది. దానికి అంగీకరించాను. ఈ పుస్తకంలో ప్రధానంగా చర్చించిన అంశాలు ఏమిటి? 1. దేశం అభివృద్ధి చెందాలని సామాన్యులు కూడా బలంగా ఆకాంక్షిస్తున్నారు. బాధ్యత తీసుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. సంఘం(ఆరెస్సెస్) విస్తరణకు సామాన్యుల త్యాగాలు, వారి విజయ గాథలే మూలాధారం. ఈ విషయాన్ని ప్రధానంగా చెప్ప దలుచుకున్నాను. సంఘ కార్యంలో అందరి భాగస్వా మ్యాన్ని అభిలషిస్తున్నాం. 2. ఈ దేశ సంస్కృతి, వారసత్వం, హిందుత్వం... మనం గర్వించాల్సిన అంశాలే తప్ప, న్యూనత చెందాల్సిన అంశాలు కాదు. సర్వమానవ హితానికి అవి అత్యంత రమణీయమైన అంశాలు. అయితే ఈ విషయాల పట్ల కొంత మందికి అనుమానాలు, అపోహలు ఉన్నాయి. వాటిని దూరం చెయ్యాలి. 3. ప్రజలంతా దేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. వర్త మానంలో దేశానికి ఉన్న శక్తి ఆధారంగా భవిష్యత్‌ను నిర్మించుకోవాలి. 4. హిందుత్వం అంటే అందరినీ కలి పేది. అందరి బాగు కోరుకోవడమే హిందుత్వం. దేశంలోని అన్ని వర్గాల ప్రజలను కలిపి ఉంచే ‘కనెక్టింగ్ ఫ్యాక్టర్’ హిందుత్వం. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. దేశంలో ప్రస్తుతం ఉన్న సమస్యలు, సవాళ్లకు సమాధానం బయటి నుంచి లభించదు. మనకు మనమే పరిష్కారాలను అన్వేషించాలి. స్వాతంత్య్ర పోరాటం కూడా కేవలం ఆంగ్లేయులను వెళ్లగొట్టడం కోసమే కాకుండా, స్వపాలన, స్వదేశీ, స్వభాష.. ఇలా ‘స్వ’(సొంత) సాధన లక్ష్యంగా సాగింది. ఇప్పుడు కూడా ‘స్వ’ ఆధారంగా మన ప్రణాళికలు ఉండాలి. ప్రతి నిర్ణయం స్వావలంబన సాధించే దిశగా ఉండాలి. సమాజంలోని ప్రతి ఒక్కరిని అందులో భాగస్వాములను చేయాలి. సంఘం (ఆరెస్సెస్) చెప్పేది ఇదే. ఈ పుస్తకం ఎవరిని ఉద్దేశించి రాశారు? స్వయం సేవకులకా, స్వయం సేవకులు కావాలనుకుంటున్న వారికా? అందరికీనా? అందరికీ ఉద్దేశించింది. ఆరెస్సెస్‌ను అర్థం చేసుకోవాలనుకొనే వారికి ఉపయుక్తం. స్వయం సేవక్‌లే కాదు, అందరూ చదవాలి. పుస్తకం చదివిన తర్వాత ఎలాంటి ఫీల్ కలిగినా ఫర్వాలేదు. ఆరెస్సెస్‌ను వ్యతిరేకించేవారైనా పుస్తకం చదవాలి. 2025 నాటికి ఆరెస్సెస్ ఏర్పాటై వందేళ్లు పూర్తవుతుంది. ఇప్పటికీ ఆరెస్సెస్ పనితీరు, అంతర్గత వ్యవహారాల గురించి ప్రజలకు పెద్దగా తెలియదు. వందేళ్ల తర్వాత అయినా ఆరెస్సెస్ అంతర్గత వ్యవహారాలు సామాన్యులకు తెలిసేలా పారదర్శకంగా పనిచేస్తుందా? ఆరెస్సెస్ ఏర్పాటయిన తొలి రోజు నుంచి తెరిచిన పుస్తకమే. సంఘం యాజమాన్య హక్కులు ఎవరి(వ్యక్తుల) సొంతం కాదు. ఆరెస్సెస్ యాజమాన్యం ప్రజలదే. ప్రజల భాషలో చెప్పాలంటే పబ్లిక్ కంపెనీ. భారతమాత కోసం పనిచేస్తున్నామనే భావనతో ప్రతి స్వయం సేవక్ పనిచేస్తారు. సమాజాన్ని సాధికారత దిశగా నడిపించడమే ‘సంఘ’ లక్ష్యం. ఆరెస్సెస్‌ను బలోపేతం చేయడం కాదు... సమాజాన్ని, దేశాన్ని సాధికారత దిశగా నడిపించడమే లక్ష్యంగా ఆరెస్సెస్ పనిచేస్తుంది. అందుకే ఎవరైనా ఆరెస్సెస్‌లో పనిచేయడానికి ‘ఫిట్’ అవుతారు. మంచి కోసం ప్రజలతో కలిసి పనిచేస్తాడు స్వయం సేవక్. సమాజానికి ఉప యోగపడే ఏ పని చేద్దామన్న ఆసక్తి ఉన్నా, ఏ రంగంలో చేయాలనుకున్నా ఆరెస్సెస్ తోడుగా నిలుస్తుంది. అరెస్సెస్ ప్రయాణం తెరిచిన పుస్త కమే... అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ! ఇక మీద ఆరెస్సెస్ విస్తరణ మీద దృష్టి పెడతారా? సిద్ధాంతాన్ని బలోపేతం చేయడం మీద దృష్టి పెడతారా? పేరు, ప్రఖ్యాతుల కోసం ‘ఆరెస్సెస్’ పని చేయడం లేదు. సిద్ధాంతం ఆధారంగా పనిచేసుకుంటూ ముందడుగు వేస్తుంటుంది. వ్యక్తులు, వ్యవస్థలను ‘నెట్ వర్కింగ్’ చేయడమే సంఘం పని. సామాన్యులను సాధికారత దిశగా నడిపించడానికి నెట్వర్కింగ్ చేస్తుంది. మరింత ఎక్కువ మందిని కలిపి పనిచేయించడం ద్వారా సాధికారత సాధించడమే తప్ప... అది ఆరెస్సెస్ విస్తరణ కాదు. రెండో అంశం, సిద్ధాంతం గురించి అడి గారు... అరెస్సెస్ సిద్ధాంతం చాలా సింపుల్. అందరూ గర్వపడే విధంగా దేశాన్ని తయారు చేయడం, హిందుత్వాన్ని చూసి గర్వ పడటం, ప్రపంచ మానవాళి సంక్షేమాన్ని కోరుకోవడం... ఇది కేవలం ఆరెస్సెస్ లైన్ మాత్రమే కాదు... వేల సంవత్సరాలుగా ఈ దేశ అంతరాత్మ ఇదే. దేశానికి సేవ సేయడమే ఆరెస్సెస్ సిద్ధాంతం. యాంటీ–నేషనల్స్ అని పదాన్ని ఆరెస్సెస్ ఈ మధ్య ఎక్కువగా ఉప యోగిస్తోంది. మీ దృష్టిలో దీని నిర్వచనం ఏమిటి? స్వయం సేవక్‌లు నడిపే ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వారు ‘యాంటీ–నేషనల్స్’ అనా? ఎంతమాత్రం కాదు. ప్రభుత్వాలను విమర్శించడం, వ్యతిరేకించడం ప్రజాస్వామ్యంలో భాగం. పార్లమెంట్‌లోనే విమర్శిస్తున్నారు కదా! వారిని యాంటీ–నేషనల్స్ అని ఎవరూ అనడం లేదు. ఆ పదంలోనే దాని అర్థం ఉంది, దేశానికి వ్యతిరేకం అని. దేశ హితాన్ని కాంక్షించని వారంతా యాంటీ–నేషనల్స్. ఇది ఆరెస్సెస్ సృష్టించిన పదం కాదు. చరిత్రను చూసే దృష్టికోణం మారాలంటున్నారు కదా! ఎందుకు మారాలి? దేశాన్ని చాలా శతాబ్దాల పాటు విదేశీయులు పాలించారు. వారి ఆలోచనలకు అనుగుణంగా చరిత్ర తయారయింది. వారి ప్రయో జనాల పరిరక్షణకు వీలుగా చరిత్రను రూపొందించారు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు, మహాపురుషులు, రుషులు, సమర్థ పాల కుల చరిత్ర మరుగున పడిపోయింది. మన వారసత్వాన్ని గర్వంగా చెప్పుకొనే పరిస్థితి లేకుండా చేశారు. ఒక కుటుంబ చరిత్ర, ఒక వంశ పాలన చరిత్ర కాదు. ఈ దేశ నిర్మాణంలో గ్రామీణులు, కొండకోనల్లో నివసించేవారు, పేదలు, ధనికులు, పాలకులు... అందరి పాత్రా ఉంది. దాన్ని విస్మరించారు. ఆర్యులు వెలుపలి నుంచి వచ్చారనే సిద్ధాంతం తప్పని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కూడా చెప్పారు. విదేశీ దృష్టి కోణం మారాలి. మన దేశం దృష్టి కోణం నుంచి చరిత్రను చూడాలి. సరికొత్త కోణంలో చరిత్రను ఆవిష్కరించి ప్రజల ముందు ఉంచాలి. – ఎం. విశ్వనాథ రెడ్డి -
‘నా శవం కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్తో వెళ్లదు’
బెంగళూరు: కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధారామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, జేడీఎస్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఆయన.. ఏది ఏమైనా తాను కాషాయం పార్టీతో కలిసే ప్రసక్తే ఉండబోదని తేల్చేశారు. బీజేపీ, జేడీఎస్‌లకు సిద్ధాంతాలు లేవు. హేతుబద్ధత లేదు. ఒకవేళ బీజేపీ వాళ్లు నన్ను రాష్ట్రపతిని చేసినా.. ప్రధానిని చేసినా.. వాళ్లతో కలిసే వెళ్లే ప్రసక్తే ఉండదు. బీజేపీ, ఆరెస్సెస్‌లకు నేను దూరం. కనీసం నా శవం కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్తో వెళ్లదు అని పేర్కొన్నారు. సోమవారం రామనగర జిల్లా మగడిలో జరిగిన ఓ పార్టీ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జనతా దళ్(సెక్యులర్), ఇతరులు.. అధికారం కోసం బీజేపీతో కలిసి వెళ్తారన్న సిద్ధారామయ్య.. జేడీఎస్ కూడా సిద్ధాంతాలు లేని పార్టీనే అని తేల్చేశారు. అధికారం కోసం వాళ్లు ఎవరితో అయినా అంటకాగుతారని విమర్శించారు. అలాంటి వాళ్లకు ఆత్మ గౌరవం అనేది ఉంటుందా? అని నిలదీశారాయన. ‘‘బీజేపీ నేను హిందూ వ్యతిరేకినంటూ ప్రచారం చేస్తోంది. బీజేపీ నేత రవి నన్ను సిద్ధారాముల్లా ఖాన్ అంటూ ఎగతాళి చేస్తున్నారు. కానీ, గాంధీజీనే నిజమైన హిందువు. అలాంటి గాంధీని చంపిన గాడ్సేను ఆరాధించే హిందువులు వాళ్లు’’ అంటూ వ్యాఖ్యానించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రజలకు ఆహార భద్రత ఉండేదని, కానీ, బీజేపీ పాలనలో అది కనిపించడం లేదని ఆరోపించారాయన. -
ఆరెస్సెస్ వారి నేతాజీ జయంతి వేడుకలు
కోల్‌కతా: స్వాతంత్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్(ఐఎన్ఏ) వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆరెస్సెస్ సన్నద్ధమవుతోంది. ఈ తరుణంలో.. నేతాజీ కూతురు అనితా బోస్(80) స్పందించారు. జనవరి 23వ తేదీన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. ఈ సందర్భంగా.. కోల్‌కతాలోని షాహిద్ మినార్ గ్రౌండ్లో జయంతి వేడుకల నిర్వహణకు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరు కానున్నారు. అయితే.. ఈ పరిణామంపై నేతాజీ కూతురు అనిత ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు.. తన తండ్రి పేరును ఆరెస్సెస్, బీజేపీలు పాక్షికంగా వాడుకోవాలని యత్నిస్తున్నాయేమో అని అన్నారామె. ఆర్ఎస్ఎస్ భావజాలం.. జాతీయవాద నాయకుడైన తన తండ్రి(నేతాజీ) లౌకికవాదం, సమగ్రత ఆలోచనలు.. పరస్పర విజాతి ధృవాలను, అవి ఏనాడూ కలవవని ఆమె అన్నారు. సిద్ధాంతాల విషయానికొస్తే.. దేశంలోని ఇతర పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీకి, నేతాజీకి చాలా ఎక్కువ సారూప్యతలు ఉన్నాయన్నారామె. అన్నింటికి మించి ఆయన లెఫ్టిస్ట్ అనే విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఆరెస్సెస్, బీజేపీలు ఆయన వైఖరిని ప్రతిబింబించలేవు. వాళ్లు అతివాదులు, నేతాజీది వామపక్ష భావజాలం అని ఫోన్ ద్వారా జర్మనీ నుంచి ఇక్కడి మీడియాతో ఆమె మాట్లాడారు. విభిన్న సమూహాలు నేతాజీ జన్మదినాన్ని వివిధ మార్గాల్లో జరుపుకోవాలని కోరుకుంటాయి. వారిలో చాలా మంది తప్పనిసరిగా ఆయన ఆలోచనలతో ఏకీభవిస్తున్నారు. అయితే.. నేతాజీ ఆశయాలను, ఆలోచనలను స్వీకరించాలని ఆర్ఎస్ఎస్ భావిస్తే అది ఖచ్చితంగా బాగుంటుంది అని అనిత బోస్ వెల్లడించారు. నేతాజీ.. ఆరెస్సెస్ విమర్శకుడా? అనే ప్రశ్నకు.. ఆ విషయంపై తనకు స్పష్టత లేదని ఆమె బదులిచ్చారు. అయితే.. ఆరెస్సెస్ గురించి, నేతాజీ భావజాలం గురించి మాత్రం తనకు స్పష్టత ఉందని, ఈ రెండు పొసగని విషయాలని ఆమె అన్నారు. ముఖ్యంగా నేతాజీ సెక్యులరిజం అనేది ఆరెస్సెస్‌కు సరిపోని అంశమని పేర్కొన్నారామె. ఇదిలా ఉంటే.. 2021లో తృణమూల్ కాంగ్రెస్-బీజేపీలు నేతాజీ 125వ జయంతి వేడుకల కోసం పోటాపోటీ పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల తరుణంలోనే ఆ రెండు పార్టీలు అలాంటి చర్యలకు దిగడం గమనార్హం. -
‘సంతోష్‌ను ఇరికించి సర్కార్ ఆరెస్సెస్‌తో పెట్టుకుంది’
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణలో ఒక యుద్ధవాతా వరణం మాదిరి పరిస్థితుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు సమష్టిగా కృషి చేయాలి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సమర్థంగా ఎదుర్కొని ఆరెస్సెస్ అనుకూల శక్తులు విజయం సాధించేందుకు ఇప్పటినుంచే కార్యరంగంలోకి దిగాలి. ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి (ఆరెస్సెస్ నేత) బీఎల్ సంతోష్‌ను ఇరికించి, నోటీసులివ్వడం ద్వారా కేసీఆర్ సర్కార్ ఆరెస్సెస్‌తో పెట్టుకుంది. ఇందుకు రాజకీయంగా తగిన గుణపాఠం చెప్పాలి..’ అని అన్ని పరివార, అనుబంధ సంఘాలకు సంఘ్ పరివార్ పిలుపునిచ్చింది. తెలంగాణ సెంటిమెంట్, ప్రత్యేక రాష్ట్ర వాదంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ఏర్పాటుతో బలహీనపడడంతో పాటు ప్రజలెవరూ విశ్వసించని స్థితికి చేరుకున్నందున ఈ అవకాశాన్ని జారవిడుచుకోవద్దని చెప్పినట్టు తెలిసింది. ఆదివారం నగర శివార్లలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో.. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాలి్సన వ్యూహంపై సంఘ్ పరివార్, పరివార సంస్థలు, అనుబంధ విభాగాలతో ఆరెస్సెస్ జాతీయ నేతలు సమాలోచనలు జరిపారు. అధికారమే లక్ష్యంగా కృషి చేయాలి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణ, పార్టీపరంగా ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, ఇంకా బీజేపీ నాయకత్వం దృష్టికి రాని అంశాలు, పార్టీపరంగా లోటుపాట్లు, ఇతర అంశాలను వివిధ విభాగాలు ప్రస్తావించినట్టు సమాచారం. ఆరెస్సెస్, పరివార సంస్థలు, అనుబంధ విభాగాల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా పక్కా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడమే ధ్యేయంగా పూర్తిస్థాయిలో కృషి చేయాలని సూచించినట్లు సమాచారం. ఆరెస్సెస్ జాతీయ సర్ కార్యవాహ (జాయింట్ జనరల్ సెక్రటరీ) ముకుంద్ ఈ మేరకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. కాగా తొలుత వీహేచ్‌పీ, భజరంగ్‌దళ్, బీఎంఎస్, ఏబీవీపీ, స్వదేశీ జాగరణ్ మంచ్, వనవాసి కళ్యాణ్ ఇతర క్షేత్రాల సమన్వయ సమావేశం జరిగింది. ఆ తర్వాత ఆదివారం రాత్రి దాకా ఆరెస్సెస్ ముఖ్యులు, సంఘ్‌పరివార్ అనుబంధ విభాగాల ముఖ్యులతో విడివిడిగా జరిగిన సమావేశాల్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్‌చుగ్, సునీల్ బన్సల్, సహ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) శివప్రకాష్, జాతీయ కార్యదర్శి, రాష్ట్రపార్టీ సహ ఇన్చార్జి అర్వింద్ మీనన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, మధ్యప్రదేశ్ ఇన్చార్జి పి.మురళీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ ప్రయత్నాలు గట్టిగా ఎదుర్కోవాలి విశ్వసనీయ సమాచారం మేరకు.. ‘కేవలం మైనారిటీ వర్గ సంతుష్టీకర విధానాలతోనే మళ్లీ అధికారంలోకి రావాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నందున, అలాంటి వాటిని గట్టిగా ఎదుర్కోవాలి. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడినందున దానికి ఎట్టిపరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదు. వామపక్షాల ముఖ్యనేతలు అనుసరిస్తున్న స్వార్థ రాజకీయాలతో ప్రజలు ఆ పార్టీలను నమ్మే పరిస్థితి లేదు. అందువల్ల వాటికి మద్దతు తెలిపే కార్యకర్తలు, వర్గాలను కూడా అనుకూలంగా మలుచుకోవాలి. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీలో సమన్వయ లోపం వల్లనే ఓటమి చవిచూడాల్సి వచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా పరివార్ అనుబంధ సంస్థలు తమ వంతు పాత్రను సమర్థవంతంగా పోషించాలి..’అని సమావేశం సూచించింది. -
అమృతోత్సవ దీక్షకు ఫలితం?!
కోరేగావ్ దళిత మహాసభ ఉద్దేశాన్ని వక్రంగా చిత్రించి, ఆ సభకు హాజరైన కొందరు వామపక్ష›సభ్యులు పాలకుల్ని హత్య చేయడానికి కుట్ర పన్నారన్న మిషపైన దేశవ్యాప్తంగా కొందరు పౌర హక్కుల నాయకుల్ని నిష్కారణంగా అరెస్టులు చేసి వేధింపులకు గురిచేశారు. గూఢచర్య ‘పెగసస్’తో భారతదేశ పౌర సమాజంపై పాలక పక్షం విరుచుకుపడింది. ఆఖరికి చిన్న దేశమైన భూటాన్ కరెన్సీతో ఇండియా రూపాయి సమానమైంది. ఇలా గడిచిన ఏడాది ఎన్నో పరిణామాల్ని భారతీయ సమాజం చవిచూసింది. భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ పాలకులు, పాలితులు మిగిలిన పాఠాలను స్మరించు కోవలసి ఉంది. గడిచిన 75 ఏళ్ల చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకోవలసి ఉంది. భారత స్వాతంత్య్రానికి 75 ఏళ్లు నిండిన వేళ దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ దేశ న్యాయ స్థానాలకూ, పాలక వర్గానికీ, పౌర సమాజానికీ బాధ్యతా యుతమైన కర్తవ్యాన్ని (30 డిసెంబర్ 2022) నిర్దేశించారు. రాబోయే రోజుల్లో దేశ న్యాయ వ్యవస్థలో మహిళలదే ప్రధాన పాత్ర కాబోతున్నదనీ, వలసవాద ఆలోచనా విధానాల నుంచి న్యాయ వ్యవస్థను రక్షించవలసిన సమయం వచ్చిందనీ అన్నారు. వ్యక్తులను అకారణంగా అరెస్టులు చేసి, జైళ్లలో పెట్టడం వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనంటూ పలువురు పౌరుల విడుదలకు మార్గాన్ని సుగమం చేశారు. కోరేగావ్ దళిత మహాసభ ఉద్దేశాన్ని వక్రంగా చిత్రించి, ఆ సభకు హాజరైన కొందరు వామపక్షాల సభ్యులు పాలకుల్ని హత్య చేయ డానికి కుట్ర పన్నారన్న మిషపైన దేశవ్యాప్తంగా కొందరు పౌర హక్కుల నాయకుల్ని నిష్కారణంగా అరెస్టులు చేసి వేధింపులకు గురి చేస్తూ వచ్చారు. కోరేగావ్ దళితుల సభలో స్వయంగా పాల్గొన్న న్యాయమూర్తులు ఈ అరెస్టులను, వేధింపులను నిరసించినా పాల కుల కుట్రపూరిత వైఖరి కొనసాగుతూనే వచ్చింది. కాగా జస్టిస్ చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా పదవిని స్వీకరించిన తర్వాత ఈ వేధింపుల విషయంలో కూడా స్పష్టమైన వైఖరి తీసుకున్నారు. అరెస్టయినవాళ్లు జైళ్లలో నిరవధికంగా విచారణ లేకుండా మగ్గడాన్ని గమనించి, నిష్కారణ పరిణామానికి ఫుల్స్టాప్ పెట్టడానికి నిర్ణయిం చారు. విచారణను త్వరితం చేసి, డిటెన్యూల విడుదలకు క్రమంగా చర్యలు తీసుకోవడం హర్షించదగిన పరిణామం. ఫాదర్ స్టాన్ స్వామి అరెస్టు ఉదంతం పాలక వర్గాల అత్యంత నీచమైన చర్య. భారత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) సేకరించానని ప్రకటించిన ‘సాక్ష్యం’ ఫాదర్ స్టాన్ స్వామి, తదితర నిందితుల కంప్యూటర్లలోకి పనిగట్టుకొని చొప్పించిన దొంగ సాక్ష్యాలే నని ప్రసిద్ధ అమెరికన్ డిజిటల్ ఫోరెన్సిక్ కంపెనీ ‘ఆర్సెనల్ కన్సల్టెన్సీ’ విడుదల చేసిన నివేదికలో (10 డిసెంబర్ 2021) పేర్కొంది. విచిత్రమేమంటే, ఏ ఇజ్రాయిల్ స్పైవేర్ ‘పెగసస్’ను భారత పాల కులు ఉపయోగించారో, దాని సంస్థతో ఎన్ఐఏ కూడా సంబంధాలు పెట్టుకుంది. అయితే సుప్రీంకోర్టు (27 అక్టోబర్ 2021) విచారణ కోసం ఒక సాంకేతిక సంఘాన్ని నియమించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్.వి. రవీంద్రన్ అధ్యక్షులుగా ఉన్న ఈ కమి టీలో ప్రొఫెసర్ పి. ప్రభాకరన్, ప్రొఫెసర్ అశ్వన్ గుమస్తే సభ్యులుగా ఉన్నారు. నిందితుల ఫోన్లను ఇజ్రాయిల్ పెగసస్ స్పైవేర్ ట్యాంపర్ చేస్తున్న విషయం నిజమా? కాదా? అని తేల్చాలని ఈ కమిటీ ఎన్ఐఏను ఆదేశించింది. కానీ, ఇంతవరకూ ఆ విషయాన్ని ఎన్ఐఏ తేల్చకుండా దాటవేసిందని వార్తలు. ఈ ‘కప్పదాట్లు’ అంతటితో ఆగ లేదు. ‘పెగసస్’తో భారతదేశ పౌర సమాజంపై పాలక పక్షం విరుచుకుపడేంతవరకు కొనసాగుతూనే వచ్చింది. అంతేగాదు, కాంగ్రెస్ పాలకుల ‘బోఫోర్స్’ కొనుగోళ్ల వల్ల దేశం నష్టపోయింది రూ. 70 కోట్లు కాగా, బీజేపీ–ఆరెస్సెస్ పాలకుల రఫేల్ (ఫ్రెంచి) విమానాల కొనుగోళ్ల వల్ల దేశం కోల్పోయింది రూ. 70 వేల కోట్లని తేలినా నిగ్గతీయగల చైతన్యాన్ని ప్రతిపక్షాలూ కోల్పోయాయి. ఆ మాటకొస్తే, 2002లో గుజరాత్లో ఏమైంది? పాలకుల అధికారిక దౌర్జన్యాలను, ఆగడాలను ఎండగట్టి, వారు శిక్షార్హులేనని సుప్రీంకోర్టు ప్రత్యేక సలహాదారుగా విచారణకు నియమితులైన ‘ఎమి కస్ క్యూరీ’ ప్రసిద్ధ న్యాయవాది రాజు రామచంద్రన్ సమర్పించిన నివేదికను కూడా పాలకులు తొక్కిపట్టిన ఉదంతాన్ని దేశం మరచి పోలేదు. ఇన్ని రకాల దారుణాలకు, పాలక పక్షాలు ఒడిగట్టిన దేశంలో – స్వాతంత్య్ర దినోత్సవ అమృతోత్సవాలు ముగిసిన వేళలో పాల కులకు, పాలితులకు మిగిలిన గుణపాఠాన్ని స్మరించుకోవలసిన సమయమిది. దేశ స్వాతంత్య్రం కోసం సకల వ్యక్తిగత సౌకర్యాలను గడ్డిపోచగా భావించి ప్రాణాలు సహా సర్వస్వాన్ని త్యాగం చేసిన లక్షలాదిమంది దేశభక్తులను ఒక్కసారి తలచుకోవలసిన సమయం ఇదే. గడిచిన 75 ఏళ్ల పరిణామాల నుంచి గుణపాఠాలు తీసు కోవలసిన ఘడియ కూడా ఇదే! అంతేగాదు, ఈ 75 ఏళ్లలోనే క్రమంగా పత్రికా రంగంలో కూడా జాతీయ ప్రయోజనాల పరిరక్షణ స్పృహకన్నా కార్పొరేట్ ఇండియాలో భాగంగా కార్పొరేట్ మీడియా బలిసింది. పత్రికా రంగంలో ప్రయివేట్ రంగ ప్రయోజనాల ప్రాధాన్యం పెరిగింది. తద్వారా జర్నలిజం స్వరూప స్వభావాలనే అది తారుమారు చేస్తూ వచ్చింది. 1955 నాటికే వర్కింగ్ జర్నలిస్టుల, తదితర వార్తా పత్రికా ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుతూ ప్రత్యేక చట్టమే వచ్చింది. ఫలితంగా ఇతర సంస్థలలో పనిచేసే వివిధ వృత్తిదారుల ప్రయోజ నాలను కూడా రక్షించే నిబంధనలు అందులో పొందు పర్చడం జరిగింది. ఇది లేబర్ కోర్టుల ద్వారా ఉద్యోగుల సమస్యల సామరస్య పరిష్కారానికి తోడ్పడింది. తొల్లింటి ప్రయివేట్ మీడియాను జైన్లు, బిర్లాలు, గోయెంకా లాంటి జూట్ వ్యాపారులు నిర్వహించగా, ఇప్పుడు ఆ స్థానాన్ని నడమంత్రపు ‘సిరి’ పారిశ్రామికవేత్తలు భర్తీ చేశారు. వీళ్లపైన భారత రాజ్యాంగ నిబంధనల ఆజమాయిషీ బొత్తిగా మృగ్యమై పోవడం కూడా కాంగ్రెస్, బీజేపీ–ఆరెస్సెస్ పాలనల ‘పుణ్యమే’. కాబట్టి ఈ సమీక్ష అనివార్యమవుతోంది. చివరికి మన కరెన్సీ కూడా ఈ 75 ఏళ్లలో ఏ స్థాయికి దిగజారి పోయిందో, ఆ దిగజారుడులో కాంగ్రెస్ పాలకులు కూడా భాగ స్వాములయినా ఒక ఆలోచనాపరురాలిగా, కాంగ్రెస్ వాదిగా భావికా కపూర్ నిర్మొహమాటంగా ఇలా వర్ణించారు: మన ప్రగతి ‘వేగం’ ఇప్పుడు ఏ స్థాయిలో ఉందంటే – ‘‘భూటాన్ కరెన్సీ ఇప్పుడు ఇండియా కరెన్సీతో సమానం. ఒక భూటానీస్ గుల్ట్రమ్ (కరెన్సీ) ఒక రూపాయితో సమానమైంది. భూటాన్ ఒక్కటే కాదు, అఫ్గానిస్తాన్ రూపాయి కూడా ఇండియా రూపాయితో సమానమై కూర్చుంది. అంటే, మనమిప్పుడు తాలిబన్ల రాజ్యానికి సమానమన్నమాట. వావ్ మోదీజీ.. వావ్!’’ (30 డిసెంబర్ 2022) ఏది ఏమైనా, 75 ఏళ్ల భారత అమృతోత్సవాలు ముగిసిన వేళలో ఒక మహాకవి, స్వతంత్ర భారత మానవుడిని తలచుకుని అతని నేటి దుఃస్థితికి స్పందించిన తీరును మరొక్కసారి గుర్తు చేసుకుందాం: ‘‘ఆ మానవమూర్తి ముఖం మీద ఎప్పుడూ ఉండే పసిపాప నవ్వులేదు! స్వతంత్ర భరతవర్ష వాస్తవ్యుడా మానవుడు అర్ధనగ్నంగా ఆకాశాన్నే కప్పుకొని నిండని కడుపుతో మండుతూన్న కళ్లతో ఇలా ఎంతకాలం ఇంకా నిలబడతాడా ప్రాణి? అందుకే అతణ్ణి జాగ్రత్తగా చూడండి స్వతంత్ర భారత పౌరుడు అతని బాధ్యత వహిస్తామని అందరూ హామీ ఇవ్వండి అతని యోగ క్షేమాలకు / అందరూ పూచీపడండి అతికించండి మళ్లీ / అతని ముఖానికి నవ్వు! స్వాతంత్య్రం ఒక చాలా సున్నితమైన పువ్వు,చాలా వాడైన కత్తి, విలువైన వజ్రం స్వాతంత్య్రం తెచ్చేవెన్నెన్నో బాధ్యతలు సామర్థ్యంతో నిర్వహిస్తామని / సంకల్పం చెప్పుకుందాం’’ ఇంతకీ మహాకవి ఆశించిన ఆ ‘సామర్థ్యం, సంకల్పం’ మనలో ఏది? అది మనలో కరువయింది కాబట్టే పాలకుల పాలనా సామ ర్థ్యాన్ని గత సుమారు రెండు దశాబ్దాలుగా బొడ్లో చేయివేసి ప్రశ్నిస్తున్న ‘ఏడీఆర్’(అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్) నిరంతర నివే దికలు కూడా ‘బుట్టదాఖలు’ అవుతున్నాయి. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
బీజేపీ, RSS నా గురువులు: రాహుల్ గాంధీ
-
బీజేపీని ఓడిస్తేనే.. దేశం భద్రం
సాక్షి, హైదరాబాద్: బీజేపీని ఓడించకపోతే దేశానికి భద్రత లేదని త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశాన్ని రక్షించడా నికి ఎస్ఎఫ్ఐ నాయకత్వంలో విద్యార్థులు శంఖారావం పూరించాలని పిలుపునిచ్చారు. వినాశకరమైన నూతన విద్యా విధానాన్ని రద్దు చేసేలా పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు. బలీయమైన జాతీయ ఉద్యమాన్ని నిర్మించి కొత్త విద్యా విధానాన్ని తిప్పి కొట్టాలని సూచించారు. ఎస్ఎఫ్ఐ జాతీయ మహా సభలు మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మాణిక్ సర్కార్ మాట్లాడారు. అన్ని రంగాలూ దుర్భర స్థితిలోనే..: ‘దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో, దిగజారుతున్న దశలో ఉంది. విద్య సహా అన్ని రంగాలు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఆర్ఎస్ఎస్, బీజేపీ నియంతృత్వ కూటమి ప్రజా ప్రయోజనాలను దెబ్బతీస్తోంది. కేంద్రం విద్యారంగాన్ని ధ్వంసం చేస్తోంది. ప్రైవేటుపరం చేస్తోంది. పేద, మధ్య తరగతిని దెబ్బతీసేలా జాతీయ విద్యా విధానాన్ని తెచ్చింది. జాతీయ విద్యా విధానం బలహీన వర్గా లు, గిరిజనులు, దళితులు, మైనారిటీల ప్రయోజనాలకు తూట్లు పొడుస్తుంది. సంపన్న వర్గాల చేతుల్లోకి పోతుంది. మంగళవారం నెక్లెస్ రోడ్డులో ఎస్ఎఫ్ఐ కార్యకర్తల ర్యాలీ పేదలకు దూరం అవుతుంది. అలాగే పాఠ్యాంశాలను, సిలబస్‌ను మార్పు చేయాలని బీజేపీపై ఆర్ఎస్ఎస్ ఒత్తిడి తెస్తోంది. విద్య మౌలిక లక్ష్యం కష్టాల్లో ఉన్నవారికి తోడ్పాటునివ్వడం, శాస్త్రీయ థృక్పథాన్ని తీసుకురావడం. అందుకు విరుద్ధంగా విద్యా విధానం తెస్తున్నారు. నూతన విద్యా విధానంలో విభజన తత్వాన్ని నూరిపోస్తున్నారు. మూఢ నమ్మకాలను, సనాతనత్వాన్ని, సంప్రదాయాలను ప్రవేశపెడుతున్నారు. ఏ కోణంలో చూసినా పాఠ్యాంశాలను కలుషితం చేస్తున్నారు. స్వాతంత్య్ర పోరాటాలను వక్రీకరిస్తున్నారు..’అని మాణిక్ సర్కార్ విమర్శించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి? ‘దేశంలో కోట్లాదిమంది ఉద్యోగాల కోసం పరితపిస్తున్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ 2014లో వాగ్దానం చేశారు. అలా ఇప్పటివరకు 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఇవ్వలేదు. కొత్తవి సృష్టించకపోగా ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు. నియామకాల పద్ధతినే మార్చేశారు. తాత్కాలికంగా నియమిస్తున్నారు. దీనితో నిరుద్యోగం ఎన్నడూ లేనంతగా పెరిగింది. సైన్యంలోనూ తాత్కాలిక పద్ధతిలో అగ్నిపథ్‌ను తీసుకొచ్చారు. నాలుగేళ్లు వాడుకొని వదిలేసేలా మార్చారు. దాన్ని వ్యతిరేకించాలి. పారిశ్రామిక, వ్యవసాయ రంగాలూ అలానే ఉన్నాయి. కార్మికులకు జీతాలు, హక్కులు లేవు. కార్మికుల 42 హక్కులను కాలరాశారు..’అని చెప్పారు. మతాల మధ్య చిచ్చు... ‘బీజేపీ ప్రభుత్వం హిందువులు, ముస్లింలు, క్రైస్తవుల మధ్య వైషమ్యాలను పెంచుతోంది. ప్రజాస్వామ్య, పౌర హక్కులను కాలరాస్తోంది. రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తోంది. వ్యవస్థను భగ్నం చేసే కుట్రకు పాల్పడుతోంది. ప్రజల మీద దాడులు చేస్తోంది. రాజ్యాంగాన్ని, న్యాయవ్యస్థను, ఎన్నికల కమిషన్‌ను తన గుప్పిట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కాలరాయాలని చూస్తోంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులే దేశాన్ని కాపాడుకోవాలి..’మాణిక్ సర్కార్ పిలుపునిచ్చారు. రైతులు, కార్మికులు, దళితులు ఇలా అన్ని వర్గాల ప్రజల కోసం విద్యార్థులు పోరాడాలన్నారు. ఎస్ఎఫ్ఐ మహాసభల్లో ఈ అంశాలపై చర్చించాలని సూచించారు. -
Bharat Jodo Yatra: వారివి రాముని ఆదర్శాలు కావు: రాహుల్
అగర్ మాల్వా(మధ్యప్రదేశ్): ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు శ్రీరాముడి నైతిక జీవనాన్ని అనుకరించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా శుక్రవారం ఆయన అగర్‌మాల్వాలో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. ‘మహాత్మాగాంధీ తరచూ ఉచ్ఛరించే ‘హే రామ్’అంటే ఒక జీవన విధానమని అర్థం. ప్రేమ, సోదరభావం, గౌరవం, తపస్సు అర్థాన్ని ప్రపంచానికి నేర్పింది’ అని ఒక సాధువు తనకు చెప్పారని రాహుల్ చెప్పారు. అదేవిధంగా, జై సియా రామ్ అర్థం సీత, రాముడు ఒక్కరేనని, శ్రీరాముడు సీత గౌరవం కోసం పోరాడారని ఆ సాధువు చెప్పారని పేర్కొన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు మాత్రం శ్రీరాముని అడుగుజాడల్లో నడవడం లేదని, ఆయన ఆదర్శాలను పాటించడం లేదని విమర్శించారు. మహిళలకు గౌరవం కల్పించేందుకు బీజేపీ నేతలు పాటుపడటం లేదని అన్నారు. -
లవ్ జిహాద్‌ను వ్యతిరేకిస్తూ వీహెచ్‌పీ పోరు
న్యూఢిల్లీ: అక్రమ మతమార్పిడి, లవ్ జిహాద్‌లను తీవ్రంగా ఖండిస్తూ విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) కొత్త ప్రజా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అనైతిక మత మార్పిడి, లవ్ జిహాద్‌లను అంతం చేసేందుకు మహిళలు, అమ్మాయిలు, యువతతో ‘శక్తివంత సేన’ ఏర్పాటే లక్ష్యంగా నెల రోజులపాటు దేశవ్యాప్తంగా ‘జన్ జాగ్రణ్ అభియాన్’ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించింది. ఇందులోభాగంగా వీహెచ్‌పీ యువజన విభాగమైన బజ్రంగ్ దళ్ పదో తేదీ దాకా బ్లాక్ స్థాయిలో ‘శౌర్య యాత్ర’ కొనసాగించనుందని వీహెచ్‌పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ చెప్పారు. వీహెచ్‌పీ ఆధ్వర్యంలో డిసెంబర్ 21 నుంచి 31 దాకా ధర్మ రక్షా అభియాన్ నిర్వహిస్తారు. మతమార్పిడి వలలో పడకుండా అవగాహన కల్పించేందుకు వీహెచ్‌పీ మహిళా విభాగం దుర్గావాహిని సైతం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననుంది. ఈ సందర్భంగా జైన్ మాట్లాడారు. అక్రమ మతమార్పిడిని నిరోధించేలా కేంద్రం చట్టం తెచ్చేలా మద్దతు కూడగట్టేందుకు ఈ కార్యక్రమాన్ని వీహెచ్‌పీ ఉపయోగించుకోనుంది. -
RSS March: ఆరెస్సెస్‌కు భారీ ఊరట
చెన్నై: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. తమిళనాడు వ్యాప్తంగా నవంబర్ 6వ తేదీన తలపెట్టిన కవాతులకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అంతకు ముందు తమిళనాడు ప్రభుత్వం ఈ ఊరేగింపులకు అనుమతి ఇవ్వలేదు. తొలుత మొత్తం 50 ప్రదేశాల్లో కవాతులను నిర్వహించాలని ఆరెస్సెస్ భావించింది. అయితే స్టాలిన్ సర్కార్ మాత్రం కేవలం మూడు ప్రదేశాల్లో మాత్రమే ఊరేగింపులకు అనుమతి ఇచ్చింది. దీంతో ఆరెస్సెస్, హైకోర్టును ఆశ్రయించగా.. షరతులతో కూడిన అనుమతులు జారీ చేసింది హైకోర్టు. సున్నిత ప్రాంతాలుగా పేరున్న కొయంబత్తూర్, పొల్లాచ్చి, నాగర్‌కోయిల్‌తో పాటు మరో మూడు ప్రాంతాల్లో కవాతులకు అనుమతి ఇవ్వలేదు. ఊరేగింపులు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని లేనితరుణంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరెస్సెస్‌కు ముందస్తుగా తెలిపింది మద్రాస్ హైకోర్టు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నివేదికలలో మార్చ్ నిర్వహణలకు ప్రతికూలంగా ఏమీ లేదని తేల్చిచెప్పిన కోర్టు.. రెండు నెలల తర్వాత ఆ ఆరు ప్రదేశాల్లోనూ మార్చ్ నిర్వహించుకోవచ్చని ఆర్ఎస్ఎస్కు తెలిపింది. వాస్తవానికి.. అక్టోబరు 2న ఊరేగింపులకు కోర్టు అనుమతించినప్పటికీ తమిళనాడు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేసింది. మరోవైపు కొయంబత్తూర్‌లో ఇటీవలె కారు పేలుడు ఘటన.. ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు ఓ ఇస్లామిక్ రాజకీయ సంస్థపై కేంద్ర ప్రభుత్వం నిషేధం కూడా విధించింది. వీటికి కారణాలుగా చూపుతూ.. శాంతి భద్రతలకు విఘాతం కలగవచ్చనే ఆందోళన హైకోర్టులో వ్యక్తం చేసింది తమిళనాడు ప్రభుత్వం. ఇదీ చదవండి: పట్టపగలే శివసేన నేత దారుణ హత్య -
Munugodu bypoll: మునుగోడు ఉప ఎన్నికపై సర్వే.. ఆర్ఎస్ఎస్ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఎలాంటి సర్వే చేయలేదని ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యవాహ కాచం రమేశ్ స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ సర్వే రిపోర్టు పేరిట ఒక అజ్ఞాత వ్యక్తి నకిలీ పత్రంతో సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ తప్పుడు ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆర్ఎస్ఎస్ సంస్థాగతంగా రాజకీయాలతోగాని, రాజకీయ సర్వేలలోగాని పాల్గొనదని వెల్లడించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు కీలకమైన అంశం కనుక ప్రజలందరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. చదవండి: (Munugode Bypoll: ఆఖరి అస్త్రాలు సందిస్తున్నారు.. పోటాపోటీగా పంపకాలు!) -
వైఫల్యాలు ఏమార్చేందుకే కొత్త ఎత్తులు: మాయావతి
లక్నో: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే ఆర్ఎస్ఎస్ కొత్త అంశాలను తెరపైకి తెస్తోందని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి ఆరోపించారు. లక్నోలో బీఎస్పీ పథాధికారులతో భేటీ సందర్భంగా మాయావతి ప్రసంగించారు. ‘ దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, హింస నెలకొన్నాయి. ఈ అంశాలపై ఆర్ఎస్ఎస్ మౌనమునిగా మారింది. మోదీ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు మాత్రం ఆర్ఎస్ఎస్ ముందువరసలో నిల్చుంటుంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆర్ఎస్ఎస్ మరో కుట్రకు తెరతీసింది. మతమార్పిడి, అధిక జనాభా అంటూ కొత్త విషయాలకు ప్రాధాన్యతనిస్తోంది. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలొచ్చినా బీజేపీకి ఆర్ఎస్ఎస్ మద్దతుపలుకుతుంది. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలపై కనీసం ఒక్కసారైనా ఆర్ఎస్ఎస్ మాట్లాడలేదు. ఆర్ఎస్ఎస్ మౌనం విచారకరం, అంతేకాదు దేశానికి హానికరం ’ అని అన్నారు. మతమార్పిడి, బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల కారణంగా అధిక జనాభా సమస్య తలెత్తుతోందని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబళె బుధవారం వ్యాఖ్యానించిన నేపథ్యంలో మాయావతి స్పందించారు. -
వామపక్ష ఐక్యతే తక్షణ కర్తవ్యం
సాక్షి, అమరావతి: దేశానికి ఆర్ఎస్ఎస్, బీజేపీ వంటి విచ్ఛిన్నకర శక్తుల నుంచి ప్రమాదం తీవ్రమవుతోందని, ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు వామపక్ష, ప్రజాస్వామ్య, లౌకిక శక్తుల ఐక్యతే తక్షణ కర్తవ్యమని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఉద్ఘాటించారు. విజయవాడలో నిర్వహిస్తున్న సీపీఐ 24వ జాతీయ మహాసభల్లో భాగంగా శనివారం గురుదాస్ దాస్‌గుప్తా నగర్(ఎస్ఎస్ కన్వెన్షన్ హాలు)లో ప్రతినిధుల సభ ప్రారంభమైంది. ఈ సందర్భంగా డి.రాజా ప్రారంభోపన్యాసం చేశారు. ‘విజయవాడలో జరుగుతున్న జాతీయ మహాసభలకు ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు, శ్రామిక పార్టీల ప్రతినిధులు, భారతదేశంలోని వామపక్ష పార్టీల నాయకులు, దేశం నలుమూలల నుంచి పార్టీ ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలిరావడం మన ఐక్యతను చాటుతోంది. దేశంలోనే మూడోసారి సీపీఐ జాతీయ మహాసభలకు ఆతిథ్యం ఇస్తున్న ఏకైక నగరం విజయవాడ కావడం గర్వకారణం. అటువంటి మహత్తర గడ్డపై జరుగుతున్న మహాసభలు. వామపక్ష, ప్రజాస్వామ్య, లౌకిక శక్తుల ఐక్యతను సాధించేందుకు వేదికగా నిలుస్తాయని భావిస్తున్నాను. ప్రపంచ వ్యాప్తంగా నయా ఉదారవాదం, మత ఛాందసవాదం, విద్వేషం, వివక్ష వంటి వాటికి వ్యతిరేకంగా వామపక్షాలు పోరాడుతున్నాయి. ఇదే స్ఫూర్తితో మార్క్సిస్ట్–లెనినిస్ట్ భావజాలంతో అంతర్జాతీయంగా లోతైన బంధాలను పెంపొందించుకోవడం ద్వారా మానవాళికి మంచి భవిష్యత్ కోసం ముందుకు సాగుదాం’ అని పిలుపునిచ్చారు. మెరుగైన భారతదేశం కోసం ముందుకు సాగుదాం.. సీపీఐ జాతీయ మహాసభలకు సౌహార్థ్ర ప్రతినిధులుగా సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు దేవరాజన్ హాజరై సందేశాలు ఇచ్చారు. ఏచూరి మాట్లాడుతూ లౌకిక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంతోపాటు ప్రజలకు మేలు చేసే మెరుగైన భారతదేశం కోసం ఐక్యంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తుల ఫాసిస్ట్ చర్యలను తిప్పికొట్టేందుకు కార్మికులు, రైతులు, కూలీలను సమన్వయం చేసుకుని ఐక్య ఉద్యమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. దీపాంకర్ భట్టాచార్య మాట్లాడుతూ సామాజిక, రాజకీయ, ఆర్థిక విపత్తుల నుంచి దేశాన్ని రక్షించేందుకు శక్తివంతమైన, లోతైన ప్రజాస్వామ్య పునాదుల ఆధారంగా భారతదేశాన్ని పునర్నిర్మించాల్సిన బాధ్యత కమ్యూనిస్టులపై ఉందన్నారు. దేవరాజన్ మాట్లాడుతూ దేశంలో వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తుల పునరేకీకరణ బాధ్యతను సీపీఐ, సీపీఎం తీసుకోవాలని కోరారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆహ్వాన సంఘం తరఫున ప్రతినిధులకు స్వాగతం పలికి సందేశం ఇచ్చారు. సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం నేతలు పి.మధు, వి.శ్రీనివాసరావు, వివిధ రాష్ట్రాల సీపీఐ ప్రతినిధులు, విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. తొలుత జాతీయ పతాకాన్ని స్వాతంత్య్ర సమరయోధుడు ఏటుకూరి కృష్ణమూర్తి, కమ్యూనిస్టు పార్టీ పతాకాన్ని సురవరం సుధాకర్‌రెడ్డి, అమరవీరుల స్మారక స్తూపాన్ని సీపీఐ కంట్రోల్ కమిషన్ మాజీ చైర్మన్ ఈడ్పుగంటి నాగేశ్వరరావు ఆవిష్కరించారు. -
బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలం దేశాన్ని ముక్కలు చేస్తోంది
బెంగళూరు: బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలం దేశాన్ని ముక్కలు చేస్తోందని ధ్వజమెత్తారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్రలో భాగంగా కర్ణాటక కాంగ్రెస్ భళ్లారిలో శనివారం నిర్వహించిన భారీ ర్యాలీకి ఆయన హాజరయ్యారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ల సిద్దాంతం దేశాన్ని విడదీస్తోందని వేల మంది భావిస్తున్నారని, అందుకే తాను కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన పాదయత్రకు భారత్ జోడో(దేశాన్ని ఏకం చేయడం) పేరు పెట్టినట్లు రాహుల్ చెప్పారు. భారత్ జోడో యాత్రను సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభించారు రాహుల్ గాంధీ. 3500కిలోమీటర్లకు పైగా 150 రోజులపాటు సాగనున్న ఈ యాత్ర కశ్మీర్లో ముగియనుంది. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా రాహుల్ ఈ యాత్రకు నడుం బిగించారు. ప్రస్తుతం 1,000 కిలోమీటర్లు పూర్తయింది. కర్ణాటక బళ్లారిలో కొనసాగుతోంది. చదవండి: ‘కులం’ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన బీజేపీ -
Bharat Jodo Yatra: కన్నడ భాషపై దాడి చేస్తే ప్రతిఘటిస్తాం
సాక్షి, బళ్లారి/చిత్రదుర్గ: కర్ణాటక ప్రజలపై, కన్నడ భాషపై దాడి చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని బీజేపీ, ఆర్ఎస్ఎస్ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఆయన గురువారం కర్నాటకలోని మొళకాల్మూరులో పాదయాత్ర నిర్వహించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రల్లో భాగంగానే కన్నడ భాషపై దాడి జరుగుతోందని మండిపడ్డారు. కన్నడ ప్రజల, భాష జోలికి రావొద్దన్నారు. అవి ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచించారు. రాహుల్ యాత్ర శుక్రవారం ఉదయం బళ్లారి జిల్లాలోకి ప్రవేశించనుంది. -
RSS చీఫ్ ను విమర్శించే అర్హత కేటీఆర్ కు లేదు : ఎంపీ లక్ష్మణ్
-
ఆరెస్సెస్ చరిత్రలోనే తొలిసారిగా.. ఎవరామె?
నాగ్‌పూర్: తన సంప్రదాయంలో మార్పును సూచిస్తూ.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఓ పని చేసింది. పర్వతారోహ దిగ్గజం సంతోష్ యాదవ్ రూపంలో ఒక మహిళను బుధవారం జరిగిన RSS విజయదశమి వేడుకలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆధ్వర్యంలో నాగ్‌పూర్‌లో ఈ ఈవెంట్ జరిగింది. ఎవరెస్ట్ శిఖరాన్ని రెండుసార్లు అధిరోహించిన ప్రపంచంలోనే తొలి మహిళగా ప్రపంచ రికార్డు సృష్టించారు సంతోష్ యాదవ్. ఈ సందర్భంగా ఆరెస్సెస్ చీఫ్ భగవత్ మాట్లాడుతూ.. అన్ని ప్రదేశాలలో మహిళలకు సమాన హక్కులు కల్పించాలని సూచించారు. ‘‘స్త్రీని తల్లిగా భావించడం మంచిది. కానీ, తలుపులు బంధించి వాళ్లను పరిమితం చేయడం మంచిది కాదు. అన్ని చోట్లా నిర్ణయాలు తీసుకునేలా మహిళలకు సమాన హక్కులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని అభిప్రాయపడ్డారాయన. ఒక మగవాడు చేయలేని పనులను చేయగలిగే సామర్థ్యం స్త్రీ శక్తికి ఉంది. అందువల్ల వాళ్లకు సాధికారత కల్పించడం, పని చేసే స్వేచ్ఛను ఇవ్వడం, పనిలో సమాన భాగస్వామ్యం ఇవ్వడం చాలా అవసరం” అని ఆయన అన్నారు. శాంతికి పునాది శక్తి. మహిళా ముఖ్య అతిథి హాజరు గురించి చాలా కాలంగా చర్చించుకుంటున్నాం అని ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ తెలిపారు. ఆరెస్సెస్ సీనియర్ కార్యకర్త దత్తాత్రేయ హోసబలే సంఘీ కార్యకలాపాల్లో మహిళలకు ప్రాధాన్యం లేకపోవడంపై ఓ సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారట. ఆరెస్సెస్ అంటే మగవాళ్లకు మాత్రమే అని ముద్ర చెరిపేయాలని ఆయన కోరారట. ఈ తరుణంలో ఆయన అభ్యర్థనను పరిశీలనలకు తీసుకుని.. ఇప్పుడు సంతోష్ యాదవ్‌ను ఇలా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. సంతోష్ యాదవ్.. హర్యానాలోని రేవారీ జిల్లాలోని ఓ కుగ్రామంలో జన్మించారు. పర్వతారోహణలో ఆమె ఒక దిగ్గజం. ఎవరెస్ట్ పర్వతాన్ని రెండుసార్లు (1992, 1993లో) అధిరోహించిన తొలి మహిళగా ఈమె పేరిట ఒక రికార్డు ఉంది. అంతేకాదు కఠినమైన కాంగ్షుంగ్ ముఖం నుండి ఈమె ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన మహిళగా గుర్తింపు దక్కించుకున్నారు. ఆరుగురు తోబుట్టువుల్లో ఆమె ఒక్కతే ఆడపిల్ల కావడంతో ఆమె పోరాటం ప్రత్యేకంగా నిలిచింది. ఆమె ధైర్యసాహసాలు, ఇతరులకు సహాయం చేసే ఆమె మంచి మనసు కూడా చర్చించుకునే అంశమే. డిగ్రీ చదివే రోజుల్లో తన హాస్టల్ రూం నుంచి ఆరావళి పర్వతాలను అధిరోహిస్తున్న పర్వతారోహకులను చూసి ఆమె స్ఫూర్తిని పొందారు. 1992లో.. తన తోటి పర్వతారోహకుడైన మోహన్ సింగ్‌తో ఆక్సిజన్‌ను పంచుకోవడం ద్వారా ఆమె ఆయన ప్రాణాలను కాపాడగలిగారు. ఎవరెస్ట్‌ను అధిరోహించేనాటికి ఆమె వయసు 20 సంవత్సరాలు మాత్రమే. అతిచిన్న వయసులో ఎవరెస్ట్ సాహసం చేసిన ఘనత కూడా ఆమెదే. 2013లో మాలవత్ పూర్ణ పదమూడేళ్ల వయసులో ఎవరెస్ట్‌ను అధిరోహించే వరకు ఆ రికార్డు సంతోష్ యాదవ్ పేరిట పదిలంగా ఉండిపోయింది. 2000 సంవత్సరంలో భారత ప్రభుత్వం సంతోష్ యాదవ్‌ను పద్మ శ్రీ పురస్కారం అందించి గౌరవించింది. -
నాగపూర్ లో ఆర్ఎస్ఎస్ దసరా ర్యాలీ
-
Bharat Jodo Yatra: మహిళలను వస్తువుల్లా... చూస్తున్న బీజేపీ
మలప్పురం: మహిళలను ఒక వస్తువుగా చూసే బీజేపీ, ఆర్ఎస్ఎస్ల భావజాలం ఉత్తరాఖండ్‌లో రిసెప్షనిస్ట్ హత్య ఘటనతో తేటతెల్లమైందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారత్ జోడో యాత్ర 20వ రోజు మంగళవారం మలప్పురం జిల్లాలో ప్రవేశించింది. తచ్చింగనాదం హైస్కూల్ వద్ద ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా అంకితకు నివాళులర్పిస్తూ మౌనం పాటించారు. రిసెప్షనిస్ట్ అంకితా భండారి హత్యోదంతంతో బీజేపీ నేత కుమారుడికి సంబంధముందన్న ఆరోపణలపై రాహుల్ స్పందించారు. ‘చెప్పినట్లు వినలేదనే అంకితను చంపేశారు. మహిళలకు బీజేపీ ఇచ్చే గౌరవమిదే. ఆర్ఎస్ఎస్, బీజేపీ మహిళలను వస్తువులుగా రెండో తరగతి పౌరులుగా చూస్తున్నాయి. ఇది సిగ్గుచేటు. మహిళలను గౌరవించని, సాధికారిత కల్పించని దేశం ఏమీ సాధించలేదు’ అని ఆయన అన్నారు. ‘బీజేపీ నాయకులకు కావాల్సింది అధికారం. అధికారం దక్కాక, దానిని నిలుపుకునేందుకు ఏదైనా చేస్తారు. ఆ క్రమంలోనే అంకిత హత్యకు గురైంది’అని రాహుల్ వ్యాఖ్యానించారు. మహిళలను చిన్నచూపు చూడటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వబోమనే హెచ్చరికను బీజేపీకి పంపాలని కోరారు. ‘జస్టిస్ ఫర్ అంకిత, జస్టిస్ ఫర్ ఇండియన్ ఉమెన్, బీజేపీ సే బేటీ బచావో’ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. -
ఢిల్లీలో మసీదును సందర్శించిన RSS చీఫ్
-
లైట్ తీసుకుందాం! మనం నిక్కర్ నుండి ప్యాంటులోకి వచ్చి చాలా కాలమయింది!
లైట్ తీసుకుందాం! మనం నిక్కర్ నుండి ప్యాంటులోకి వచ్చి చాలా కాలమయింది! -
కాంగ్రెస్ షేర్ చేసిన ఆర్ఎస్ఎస్ నిక్కర్ ఫోటోపై తీవ్ర దుమారం
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ జోడో యాత్ర ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆర్ఎస్ఎస్ ధరించే ఖాకీ నిక్కర్ కాలిపోతున్న ఫోటోను షేర్ చేసింది. విద్వేష సంకెళ్ల నుంచి దేశానికి విముక్తి కల్పించి ఆర్ఎస్ఎస్-బీజేపీ చేస్తున్న నష్టాన్ని నివారించేందుకు దశల వారీగా తమ లక్ష్యాన్ని చేరుకుంటామని పేర్కొంది. దీనికి భారత్ జోడో యాత్ర ట్యాగ్‌ను జత చేసింది. To free the country from shackles of hate and undo the damage done by BJP-RSS. Step by step, we will reach our goal.#BharatJodoYatra 🇮🇳 pic.twitter.com/MuoDZuCHJ2 — Congress (@INCIndia) September 12, 2022 సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఫోటోపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఈ ఫోటోను వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. రాహుల్ గాంధీ.. మీరు దేశంలో హింసను కోరుకుంటున్నారా? అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. రాహుల్ చేపట్టింది భారత్ జోడో యాత్ర కాదు భారత్ తోడో, ఆగ్ లగావో యాత్ర అని సెటైర్లు వేశారు. బెంగళూరు ఎంపీ, బీజేపీ యువనేత తేజస్వీ సూర్య.. ఈ ఫోటో కాంగ్రెస్ రాజకీయాలకు ప్రతీక అని ధ్వజమెత్తారు. 'కాంగ్రెస్ రాజేసిన నిప్పు 1984లో ఢిల్లీని తగలబెట్టింది. 2002లో 59 మంది కరసేవకులను సజీవదహనం చేసింది. మరోసారి ఆ పార్టీ హింసనే ప్రేరెేపిస్తోంది. రాహుల్ గాంధీ భారత్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే... రాజ్యాంగంపై నమ్మకంతో కాంగ్రెస్ రాజకీయపార్టీగా నిలిచిపోయింది. గతంలో కాంగ్రెస్ రాజేసిన అగ్గి దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఆ పార్టీ ఉనికి కోల్పోయేలా చేసింది. ఇక అధికారం మిగిలున్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కూడా ఆ పార్టీ నామరూపాల్లేకుండా పోతుంది' అని తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7న భారత్ జోడో యాత్రను తమిళనాడులోని కన్యాకుమారిలో మొదలుపెట్టారు. 150 రోజుల పాటు సాగనున్న ఈ యాత్ర దేశంలో 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తూ 3,570కిలోమీటర్లు సాగనుంది. ఐదు రోజులు పూర్తి చేసుకున్న ఈ యాత్ర ప్రస్తుతం కేరళలో కొనసాగుతోంది. కశ్మీర్లో ముగుస్తుంది. చదవండి: జ్ఞానవాపి మసీదుపై వారణాసి కోర్టు సంచలన తీర్పు -
కచ్చితంగా ఆ రోజు కూడా వస్తుంది: బిహార్ సీఎం
న్యూఢిల్లీ: స్వాతంత్రోద్యమాన్ని తిరగరాయడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) బయలుదేరిందంటూ బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విమర్శల దాడి చేశారు. స్వాతంత్య్ర వేడుకల పేరుతో బీజేపీ-ఆర్ఎస్ఎస్లు ముసుగు వేసుకున్నాయని దుయ్యబట్టారు. పాట్నాలోని జనతాదళ్ యునైటెడ్ నేషనల్ సమావేశంలో నితీష్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్ఎస్ఎస్, బీజేపీల పాత్ర లేదని, ఇప్పుడు దాన్ని కూడా తిరగరాస్తారని ఎద్దేవా చేశారు. ఆజాది కా అమృత్ మహోత్సవ్ వేడుకుల గురించి ప్రస్తావిస్తూ ....స్వాతంత్య్ర ఉద్యమానికి నాయకుడు ఎవరు? అని ప్రశ్నించారు. జాతిపిత బాపూజీ సారథ్యంలో జరిగిన స్వాతంత్య్ర ఉద్యమానికి కొత్త అర్థాలను తెచ్చిపెట్టారంటూ బీజేపీపై ఘాటైన విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆ ఉత్సవాలను బాపు మహోత్సవ్‌గా ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. అసలు బాపూజీ హత్య ఎందుకు జరిగిందో అందరికీ తెలుసన్నారు. కేవలం గాంధీజీ హిందువులను ముస్లీంలను ఏకం చేస్తున్నందుకే అనే విషయాన్ని గ్రహించండి అన్నారు. అవసరమనుకుంటే బీజేపీ స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రను తుడిచి పెట్టి మరీ కొత్త విషయాలు రాసేవారంటూ ఎద్దేవా చేశారు. జాతి పిత గాంధీని సైతం పక్కన పెట్టే రోజు వస్తుందని తెలుసుకోండి అని చెప్పారు. గాంధీజీని హత్య చేసినవాడి కోసం ఏం చేస్తున్నారో కూడా గమనించండి అని పిలుపునిచ్చారు. తాను బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ అలాంటి విషయాల్లో దూరంగా ఉన్నానని కుమార్ స్పష్టం చేశారు. తాను ఆ సమయంలో వారితో పనిచేస్తున్నాను కాబట్టే ఏం మాట్లడలేదని, పైగా ఇలాంటి అర్థం పర్థం లేని వాటికి ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు జూన్‌లో కేంద్ర హోంమంత్రి ముఖ్యమంత్రుల సమావేశానికి పిలిచినప్పుడూ తాను దానిని దాటవేసి, అప్పటి డిప్యూటీ మంత్రి తార కిషోర్ ప్రసాద్‌ని పంపించినట్లు తెలిపారు. నితీష్ గత నెలలో ఆర్జేడియూతో జతకట్టి సంకీర్ణ ప్రుభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తదనంతరం నితీష్ పెద్ద ఎత్తున్న బీజేపీ పై విమర్శలు గుప్పించారు. అంతేకాదు ఆయన 2024 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షాన్ని సృష్టించే లక్ష్యంతో వివిధ నేతలను కలుసుకున్నారు కూడా. ఇప్పటికే నితీష్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తోపాటు వామపక్ష నేతలను కలిశారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శరద్ పవార్ తదితరులను కూడా నితీష్ కలవనున్నారు. (చదవండి: ప్రధాని పదవిపై వ్యామోహం లేదు.. తేల్చేసిన నితీశ్ కుమార్) -
ఆరెస్సెస్‌కు సపోర్టుగా దీదీ వ్యాఖ్యలు.. ఒవైసీ గరం!
బెంగాల్ రాజకీయాలు అనగానే బీజేపీ వర్సెస్ సీఎం మమతా బెనర్జీ అన్నట్టుగా ఉంటాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి రెండు పార్టీల మధ్య ఉద్రిక్తకర పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. అయితే, ఈ క్రమంలో సీఎం మమత.. ఆరెస్సెస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆమె వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ మమతకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. అయితే, సీఎం మమతా బెనర్జీ ఇటీవల ఆరెస్సెస్‌పై మాట్లాడుతూ గతంలో ఉన్నంత చెడ్డగా లేదని అన్నారు. కాగా, ఆమె వ్యాఖ్యలపై తాజాగా ఎంఐఎం చీఫ్ అసద్దుద్దీన్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. అసద్ స్పందిస్తూ.. ఆరెస్సెస్ హిందూ రాజ్యాన్ని కాంక్షిస్తుందన్నారు. ఆరెస్సెస్ చరిత్రంతా ముస్లిం వ్యతిరేకతే కనిపిస్తుందన్నారు. ఆరెస్సెస్‌పై వ్యాఖ్యలపై మమతా బెనర్జీ నిజాయితీని, నిలకడ ధోరణిని టీఎంసీ ముస్లిం నేతలు ప్రశంసిస్తారని పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే మమత 2003లో ఆరెస్సెస్‌పై చేసిన వ్యాఖ్యలను సైతం గుర్తు చేశారు. 2003లో ఆరెస్సెస్‌ను దేశభక్తులుగా కీర్తించారని, ఆరెస్సెస్‌లో ఇప్పటికీ చాలా మంది మంచివారున్నారని, వారు బీజేపీకి మద్దతివ్వబోరని మమత చెప్పినట్టు ఒవైసీ తెలిపారు. దీంతో, ఆరెస్సెస్ మమతా బెనర్జీని దుర్గగా అభివర్ణించారని చెప్పుకొచ్చారు. ఇక, మమత వ్యాఖ్యలపై బెంగాల్ ఇమాం అసోసియేషనన్ చీఫ్ మహ్మద్ యాహ్య కూడా స్పందిస్తూ 20 కోట్ల మంది ముస్లింలు మమతా బెనర్జీని సెక్యులర్ నేతగా భావిస్తున్నరని తెలిపారు. కానీ, అనూహ్యంగా ఆమె ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని స్పష్టం చేశారు. In 2003 too Mamata had called RSS “patriots”. In turn RSS had called her “Durga”. RSS wants Hindu Rashtra. Its history is full of anti-Muslim hate crime. She’d defended BJP govt in Parliament after Gujarat pogrom. Hope TMC’s “Muslim faces” praise her for her honesty & consistency https://t.co/45LKZ7aI4s — Asaduddin Owaisi (@asadowaisi) September 1, 2022 ఇది కూడా చదవండి: బీజేపీ హై కమాండ్‌కు రాజాసింగ్ భార్య లేఖ.. ఏమన్నారంటే? -
కర్ణాటక సీఎం అసమర్థుడు.. ఆర్ఎస్ఎస్ చేతిలో కీలుబొమ్మ
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అసమర్థుడని తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య. ఆయన ఆర్ఎస్ఎస్ చేతిలో కీలుబొమ్మ అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీజేపీ ఆపరేషన్ కమలం ద్వారా అక్రమంగా అధికారంలోకి వచ్చిందని, ప్రజలు ఎన్నుకోలేదని ఆరోపించారు. మైసూరులో మీడియా సమావేశం నిర్వహించి బీజేపీ ప్రభుత్వంపై విమర్శలకు ఎక్కుపెట్టారు ప్రతిపక్షనేత సిద్ధరామయ్య. రాష్ట్రంలో ప్రభుత్వం, పాలన లేవని దుయ్యబట్టారు. ఈ విషయాన్ని స్వయంగా అధికార పార్టీ మంత్రి మధుస్వామే చెప్పారని పేర్కొన్నారు. ప్రభుత్వం 40శాతం కమీషన్ అడుగుతోందని రాష్ట్ర కాంట్రాక్టర్ల సమాఖ్య ఆరోపించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఆరోపణలపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బాధ్యాతాయుతంగా వ్యవహరించకపోతే ప్రజలే బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారన్నారు. మంత్రి మధుస్వామి టెలిఫోనిక్ సంభాషణ ఇటీవలే లీకైంది. రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేయడం లేదని, ఏదో తామే అలా నెట్టుకొట్టుస్తున్నామని ఆయన అన్నారు. ఇది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అధికార బీజేపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. చదవండి: బీజేపీలో చేరుతారనే ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన గులాం నబీ ఆజాద్ -
ఆరెస్సెస్‌పై త్వరలో సినిమా: విజయేంద్ర ప్రసాద్
సాక్షి, అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై త్వరలో సినిమాతోపాటు వెబ్ సిరీస్ కూడా చిత్రీకరించనున్నట్టు రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ కథా రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఆర్ఎస్ఎస్ జాతీయ సమాఖ్య సభ్యుడు రామ్‌మాధవ్ రచించిన ‘ది హిందూత్వ పారడైమ్’ పుస్తక పరిచయ కార్యక్రమం విజయవాడలోని కేవీఎస్ఆర్ సిద్ధార్థ ఫార్మాస్యూటికల్ సైన్స్ కళాశాలలో మంగళవారం జరిగింది. సాహితీ సుధా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కొన్నేళ్ల క్రితం వరకూ ఆర్ఎస్ఎస్పై తనకున్న భావన వేరని, దానిపై చిత్రాన్ని తీసేందుకు కథను అందించాల్సిందిగా కోరడంతో నాగ్‌పూర్ వెళ్లి వాస్తవాలను తెలుసుకున్నాక తన అభిప్రాయం తప్పని తెలుసుకున్నానని వివరించారు. ఇదీ చదవండి: ఫైట్ మాస్టర్ కణల్ కన్నన్ అరెస్ట్ -
భిన్నత్వంలో ఏకత్వమే రక్ష!
నేటితో భారత్ స్వతంత్రమై 75 ఏళ్ళు పూర్తవుతాయి. ఈ సందర్భంగా అమృత మహోత్సవాలు చాలా ముందే ప్రారంభమయ్యాయి. సమధికోత్సాహంతో అంతటా ఉత్సవాలు సాగుతున్నాయి. అంతమాత్రాన మన దేశంలో సమస్యలన్నీ తీరిపోయాయని కాదు. పాత సమస్యలు కొన్ని తీరితే, కొన్ని ఇంకా మిగిలి ఉన్నాయి, వాటికితోడు మరికొన్ని కొత్త సమస్యలు కూడా వచ్చాయి. బానిసత్వం ఎక్కువ కాలం కొనసాగడంతో స్వాతంత్య్రం కోసం సంఘర్షణ చాలాకాలం సాగించాల్సి వచ్చింది. ఆ ప్రయత్నాలన్నీ ఫలించి, చివరికి 1947 ఆగస్ట్ 15న ఈ దేశాన్ని మనకు కావలసిన రీతిలో, మనకు ఇష్టమైన పద్ధతిలో, మన ప్రజల ద్వారానే నడుపుకొనే స్థితిని సాధించాం. బ్రిటిష్ పాలకులను పంపివేసి, మన దేశపు పాలనా పగ్గాలను మనమే చేపట్టాం. ఈ సుదీర్ఘ పోరాటంలో తమ కఠోర పరిశ్రమ, త్యాగాల ద్వారా మనకు స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టిన వీరులను గుర్తుచేసుకోవాలి. విదేశీ పాలన ఎంత బాగున్నప్పటికీ దేశ ప్రజానీకపు ఆశలు, ఆకాంక్షలు నెరవేరవు. ‘స్వ’ అభివ్యక్తీకరణ స్వాతంత్య్ర సాధనకు ప్రేరణ అవుతుంది. వ్యక్తి స్వతంత్ర జీవనంలోనే సురాజ్యాన్ని అనుభూతి చెందగలుగుతాడు. మరోవిధంగా అది సాధ్యం కాదు. స్వాతంత్య్ర సాధన కోసం ప్రజలను జాగృతం చేసినవారు ఆ లక్ష్యాన్ని గురించి వివిధ రకాలుగా వివరించారు. రవీంద్రనాథ్ టాగూర్ ‘చిత్త్ జేథా భయశూన్య ఉన్నత్ జతో శిర్’ అనే తన కవితలో స్వతంత్ర భారతాన్ని సాధించడానికి కావలసిన పరిస్థితులను వర్ణించారు. స్వాతంత్య్రం సిద్ధించినప్పుడు భారత్ ఉదాత్త, ఉత్తమ, ఉన్నత దేశంగా అవతరిస్తుందని వీర సావర్కర్ ‘స్వతంత్రతా దేవి ఆరతి’ అనే తన కవితలో ఆకాంక్షించారు. తన ‘హింద్ స్వరాజ్’లో గాంధీజీ స్వతంత్ర భారతదేశపు కల్పనను వర్ణించారు. భారత్ తన సనాతన దృష్టి, చింతన, సంస్కృతి, ఆచరణ ద్వారా ప్రపంచం ముందు సందేశాలను ఉంచింది. ఒకటిగా నిలవడానికి ఒకే విధంగా ఉండాల్సిన అవసరం లేదు. అందరినీ ఒకేలా ఉండేట్లు చేయడం, తమ మూలాల నుండి వేరుచేయడం వల్ల ఘర్షణ ఏర్పడుతుంది. తమ తమ ప్రత్యేకతలను కాపాడుకుంటూ, ఇతరుల ప్రత్యేకతలను గుర్తిస్తూ అందరూ కలిసి సాగినప్పుడే సంఘటిత సమాజం ఏర్పడుతుంది. కాల ప్రవాహంలో సమాజంలో వచ్చిన జాతి, మత, భాషా, ప్రాంతీయతా విభేదాలు; కీర్తి కాంక్ష, ధన కాంక్ష వంటి దోషాల వల్ల వచ్చే క్షుద్ర స్వార్థ ఆలోచనలను... మనస్సు, మాట, కర్మల నుండి పూర్తిగా తొలగించాలి. సమతతో కూడిన, శోషణ లేని సమాజం వల్లనే మనం ఈ స్వాతంత్య్రాన్ని కాపాడుకోగలం. సమాజంలో అనేక అపోహలు కల్పిస్తూ, ఉద్రిక్తతలు రెచ్చగొడుతూ, కలహాలను పెంచుతూ తమ స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకునే, ద్వేషాన్ని వెళ్లగక్కే కుట్రపూరిత శక్తులు దేశంలోనూ, బయట నుంచి పనిచేస్తున్నాయి. సుసంఘటితమైన, సామర్థ్యంతో కూడిన సమాజం మాత్రమే అటువంటి శక్తులకు ఏ విధమైన అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగగలుగుతుంది. ఇలా సమాజం మొత్తం యోగ్యమైన ధోరణిని, వ్యవహార శైలిని అవలంబించకుండా ఎలాంటి పరివర్తనా సాధ్యపడదు. ‘స్వ’ ఆధారంగా ముందుకు సాగాలంటే ముందు ఆ ‘స్వ’ అంటే ఏమిటో స్పష్టమైన అవగాహన చేసుకోవాలి. విశుద్ధమైన దేశభక్తి, వ్యక్తిగత, సామాజిక అనుశాసనం, ఏకాత్మ భావం అవసరం. అప్పుడే భౌతికమైన విషయ పరిజ్ఞానం, శక్తి సామర్థ్యాలు, పాలనా యంత్రాంగం వంటివి ఉపయోగపడతాయి. కాబట్టి స్వాతంత్య్ర అమృత మహోత్సవ సందర్భంగా... స్వాతంత్య్ర సాధన వెనక ఉన్న పూర్వీకుల కఠోరమైన పరిశ్రమ గుర్తుకురావాలి. రండి... సంఘటిత, సుహృద్భావ భావనతో ఆ తపోమార్గంలో ఉత్సాహపూర్వకంగా, మరింత వేగంగా ముందుకు సాగుదాం. డా. మోహన్ భాగవత్ వ్యాసకర్త సర్ సంఘచాలక్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ -
Azadi Ka Amrit Mahotsav: దేశానికి పండుగొచ్చింది
న్యూఢిల్లీ: దేశానికి పండుగ కళ వచ్చేసింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు త్రివర్ణ పతాక శోభ ఉట్టిపడుతోంది. మువ్వన్నెల రెపరెపలతో ప్రతీ ఇల్లు కళకళలాడుతోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృతోత్సవ్‌లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. దేశంలోని ప్రతీ ఇంటిపై జాతీయ జెండా సమున్నతంగా ఎగరాలన్న ఉద్దేశంతో 13వ తేదీ నుంచి 15 వరకు ప్రతీ ఒక్కరూ ఇళ్లపై జాతీయ జెండాని ఆవిష్కరించాలని కేంద్రం పిలుపునిచ్చింది. ఈ పిలుపునందుకొని రాజకీయ నాయకుల దగ్గర నుంచి సామాన్యుల వరకు ఎంతో ఉత్సాహంగా జాతీయ జెండాని ఆవిష్కృతం చేస్తున్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రొఫైల్ పిక్చర్స్ కింద జాతీయ జెండా ఇమేజ్‌లను ఉంచుతున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన సతీమణితో కలిసి ఢిల్లీలోని తన నివాసంపై మువ్వన్నెల జెండా ఎగురవేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రం మంత్రులు నేతలు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘జాతీయ జెండా మనకి గర్వకారణం. భారతీయులందరినీ సమైక్యంగా ఉంచుతూ స్ఫూర్తి నింపుతుంది. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన త్యాగధనుల్ని అందరం స్మరించుకుందాం’’ అని షా ట్వీట్ చేశారు. గత పది రోజుల్లోనే పోస్టాఫీసుల ద్వారా ఒక కోటి జాతీయ జెండాలను విక్రయించినట్టుగా పోస్టల్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఇక గ్రామాలు, పట్టణాల్లోనూ జాతీయ జెండాకు సేల్స్ విపరీతంగా పెరిగాయి. ఢిల్లీలోని కేజ్రివాల్ ప్రభుత్వం 25 లక్షల జెండాలను విద్యార్థులకు పంపిణీ చేస్తోంది. గుజరాత్లో ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ విద్యార్థులకు జెండాలు పంచారు. ప్రొఫైల్ పిక్చర్‌ని మార్చిన ఆరెస్సెస్ ఎట్టకేలకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సామాజిక మాధ్యమాల్లో తన అకౌంట్లలో ప్రొఫైల్ పిక్చర్లో జాతీయ జెండాను ఉంచింది. ఆజాదీ కా అమృతోత్సవ్ వేడుకల్లో భాగంగా అందరూ జాతీయ జెండాలను ప్రొఫైల్ పిక్‌లుగా ఆగస్టు 2 నుంచి 15వరకు జాతీయ జెండాని ఉంచాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చినప్పటికీ ఆరెస్సెస్ ఇన్నాళ్లూ పట్టించుకోలేదు. కాషాయ రంగు జెండానే ఉంచింది. దీంతో ఆరెస్సెస్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. హర్ ఘర్ కా తిరంగా కార్యక్రమంతో ఆర్సెసెస్ తన ప్రొఫైల్ పిక్‌లో జాతీయ జెండాను ఉంచింది. -
అదంతా ఓ జ్ఞాపకం.. ఆ నలుగురి నియంతృత్వంలో దేశం: రాహుల్ ఫైర్
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యం కనుమరుగైందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఇప్పుడు అది ఒక జ్ఞాపకమేనన్నారు. భారత్‌లో ప్రస్తుతం నియంత పాలన నడుస్తోందని కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోని స్వతంత్ర సంస్థలను ఆర్ఎస్ఎస్ నియంత్రిస్తోందని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై శుక్రవారం దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది కాంగ్రెస్. దీనికి ముందు ఢిల్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన రాహుల్ గాంధీ.. మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. భారత్ నలుగురు వ్యక్తుల నియంతృత్వంలో ఉందని రాహుల్ పేర్కొన్నారు. పార్లమెంటులో ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలను చర్చించడానికి అవకాశం ఇవ్వట్లేదన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలో 144 సెక్షన్ విధించారు. నిబంధనలకు విరుద్దంగా నిరసనలు చేపట్టిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద ఆంక్షలు విధించారు. చదవండి: జుమ్లానామిక్స్‌ను దాచలేరు.. నిర్మలవి అసత్యాలు.. -
ఆర్ఎస్ఎస్ ఆఫీస్‌పై బాంబు దాడి.. లైవ్ వీడియో
కన్నూర్: కేరళ పయ్యనూర్‌లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యాలయంపై మంగళవారం తెల్లవారుజామున ఇద్దరు దుండగులు బాంబు విసిరారు. దీంతో భవనం ప్రధాన ద్వారం తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయి. బాంబు దాడి దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ధ్వంసమైన తలుపులు, కుర్చీలు, టేబుళ్ల ఫోటోలు, బాంబు దాడి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దాడికి కొద్ది సమయం ముందు ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని పరిశీలించినట్లు సీసీటీవీలో నమోదైంది. #WATCH केरल: कन्नूर जिले के पय्यानुर में RSS कार्यालय पर बम फेंका गया। पय्यान्नूर पुलिस के अनुसार घटना आज सुबह हुई है। घटना में इमारत की खिड़की के शीशे टूटे। pic.twitter.com/Ii2uQRDif1 — ANI_HindiNews (@AHindinews) July 12, 2022 బాంబు దాడి జరిగిన సమయంలో ఆర్ఎస్ఎస్ కార్యాలయం మూసి ఉండటం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. 'కన్నూర్ జిల్లా, పయ్యనూర్‌లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. ఈరోజు తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. కిటికి అద్దాలు ధ్వంసమయ్యాయి.' అని పయ్యనూర్ పోలీసులు వెల్లడించారు. మరోవైపు.. దాడి జరిగిన ఆర్ఎస్ఎస్ ఆఫీసు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే ఉండటం గమనార్హం. దాడి నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రత పెంచారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దుండగులను పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. దాడి వెనుక సీపీఎం: బీజేపీ బాంబు దాడి వెనుక సీపీఎం పాత్ర ఉందని ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు ఆరోపించారు. దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. 'ఈ దాడిలో సీపీఎం పాత్ర ఉందని మేము అనుమానిస్తున్నాం. బంగారం స్మగ్లింగ్ వ్యవహారం బహిర్గతమైన తర్వాత అధికార పార్టీ పీకల్లోతు కష్టాల్లోకి జారుకుంది. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలాంటివి చేస్తోంది.' అని బీజేపీ కన్నూర్ జిల్లా అధ్యక్షుడు ఎన్ హరిస్‌దాసన్ పేర్కొన్నారు. ఇదీ చూడండి: Reverse Waterfall: ఆకాశంలోకి ఎగిరే జలపాతాన్ని ఎప్పుడైనా చూశారా?