విద్వేష ప్రసంగాలను ఖండించాల్సిందే!  | RSS Indresh Kumar Condemns Haridwar Hate Speech Uttarakhand | Sakshi
Sakshi News home page

విద్వేష ప్రసంగాలను ఖండించాల్సిందే! 

Published Fri, Feb 4 2022 8:30 AM | Last Updated on Fri, Feb 4 2022 8:30 AM

RSS Indresh Kumar Condemns Haridwar Hate Speech Uttarakhand - Sakshi

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఇటీవల జరిగిన ఓ ధర్మ సంసద్‌లో మైనారిటీలపై జరిగాయంటున్న విద్వేష ప్రసంగాలను ఆరెస్సెస్‌ ఖండించింది. అలాంటి విడదీసే, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఎంత పెద్దవారైనా, ఏ పార్టీ వారైనా చట్టప్రకారం కఠినంగా శిక్షించాల్సిందేనని ఆరెస్సెస్‌ నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ ఇంద్రేశ్‌ కుమార్‌ బుధవారం అన్నారు.

మహాత్మాగాంధీని ఓ హిందూత్వవాది కాల్చి చంపాడన్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ కామెంట్లూ విద్వేష ప్రసంగం కిందకే వస్తాయన్నారు. సంఘ్‌ అనుబంధ సంస్థలైన ముస్లిం, క్రిస్టియన్‌ రాష్ట్రీయ మంచ్‌లకు ఇంద్రేశే వ్యవస్థాపకుడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement