hate speech
-
అది విద్వేష ప్రసంగమే.. ప్రధానిపై చర్య తీసుకోండి: కాంగ్రెస్
న్యూఢిల్లీ: రాజస్తాన్‌లోని బర్మేర్‌లో బుధవారం ఎన్నికల ప్రచారంలో విద్వేష పూరిత ప్రసంగం చేసిన ప్రధాని మోదీపై చర్య తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘం(ఈసీ)ని కోరింది. కాంగ్రెస్‌కు మరణ శాసనం లిఖించేందుకు కమలం బటన్‌పై నొక్కాలంటూ ఓటర్లకు పిలుపునిచ్చారని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ తెలిపారు. ప్రధాని అహంకారానికి ప్రజలు తగు గుణపాఠం చెబుతారన్నారు. ‘కాంగ్రెస్ నేతలను మోదీ ఎంతగా ద్వేషిస్తున్నారో ఆయన ప్రసంగాన్ని చూస్తేనే తెలుస్తుంది. ప్రధానమంత్రి వంటి బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తి ఇటువంటివి మాట్లాడొచ్చా? ఆయన ప్రజాస్వామ్యం గొంతు పిసికేస్తున్నారు. ఇది కచ్చితంగా విద్వేష ప్రసంగమే’అని జైరాం రమేశ్ గురువారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ప్రధానిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. బీజేపీ ఎన్నికల గుర్తు కమలం అన్న విషయం తెలిసిందే. -
కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌పై కేసు: మంత్రి కౌంటర్ ట్వీట్
కేరళ వరుస పేలుళ్ల నేపథ్యంలో వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించేలా ప్రకటనలు చేశారన్న ఆరోపణలపై కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌పై కేసు నమోదైంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌పై మంగళవారం (అక్టోబర్ 31న) కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) డిజిటల్ మీడియా సెల్ కన్వీనర్ సరిన్ పి ఈ ఫిర్యాదులు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సెక్షన్ 153 (ఉద్దేశంతో రెచ్చగొట్టడం) కింద ఎర్నాకుళం సెంట్రల్ పోలీస్ స్టేషన్లో మంత్రిపై రెండు ఎఫ్ఐఆర్లను దాఖలు చేశారు. పాలస్తీనాకు సీపీఎంతో మద్దతుతో కలమసేరి పేలుళ్లను ముడిపెట్టి, ద్వేషాన్ని వ్యాప్తి చేశారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన మర్నాడు ఈ పరిణామం చోటు చేసుకుంది. అటు పినరయి విజయన్ ప్రభుత్వం చర్యను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఈ కేసును రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటామని పేర్కొంది. విచ్ఛిన్నకర, అతివాద శక్తులను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీజేపీ కేరళ చీఫ్ కె సురేంద్రన్ ఆరోపించారు. దేశాన్ని ప్రేమించే వారిని కాదని, దేశానికి వ్యతిరేకంగా ఉన్నవారిని ప్రసన్నం చేసుకునేందుకే కేంద్ర మంత్రిపై కేసు నమోదు చేశారని బీజేపీ నేత ఆరోపించారు. కేసుతో బెదిరించాలని చూస్తున్నారు అటు తనపై నమోదైన కేసుపై రాజీవ్ చంద్రశేఖర్ ట్విటర్ ద్వారా స్పందించారు. రాహుల్ గాంధీ, ఇండియా కూటమి ఏకమై తనపై కేసు నమోదు చేశారని మండిపడ్డారు. హమాస్‌పై వారి వైఖరిని బహిర్గతం చేసినందుకే ఈ కేసుతో బెదిరించాలని చూస్తున్నారన్నారు. SDPI, PFI,హమాస్ వంటి విషపూరిత రాడికల్ హింసాత్మక సంస్థలకు నిర్లజ్జగా మద్దతిస్తున్నాయనీ, వీరి బుజ్జగింపుల కారణంగా కొన్ని దశాబ్దాలుగా జమ్మూ కశ్మీర్, పంజాబ్ నుంచి కేరళ వరకు తీవ్రవాదానికి కారణమయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా అనేక మంది అమాయక ప్రజలు, భద్రతా దళాలు బలయ్యారంటూ ట్వీట్ చేశారు. So the two INDI alliance partners @RahulGandhi and @PinarayiVijayan have jointly filed a "case" against me Two of biggest appeasers in Indian politics who shamelessly appease poisonous radical violent organizations like SDPI, PFI and Hamas, whose politics have caused… pic.twitter.com/rTOLCULeDT — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) October 31, 2023 కాగా ఆదివారం నాటి వరుస పేలుళ్లపై స్పందించిన రాజీవ్ చంద్రశేఖర్ సోషల్ మీడియా ద్వారా కేరళ సీఏంపై తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన ముఖ్యమంత్రి పినరయి నీచ సిగ్గుమాలిన బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారన్నారు.ఢిల్లీలో కూర్చొని ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూ జిహాద్ కోసం బహిరంగ పిలుపులిస్తున్నటెర్రరిస్ట్ హమాస్ కేరళలో అమాయక క్రైస్తవులపై దాడులు, బాంబు పేలుళ్లకు కారణమవుతున్నారని ట్వీట్ చేశారు. దీంతో కేరళ సీఎం, కేంద్ర మంత్రి మధ్య మాటల యుద్ధం జరిగింది. పచ్చి అబద్దాల కోరు, తీవ్రమైన విషం చిమ్ముతున్నాడంటూ ముఖ్యమంత్రి రాజీవ్‌పై ధ్వజమెత్తారు. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర మంత్రులు అనే తేడా లేకుండా చట్టాన్ని వ్యతిరేకంగా, విద్వేషంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని సీఎం చెప్పారు. -
విద్వేష ప్రసంగాలు చేస్తే సుమోటోగా కేసులు పెట్టండి
విద్వేష ప్రసంగాలు చేస్తే సుమోటోగా కేసులు పెట్టండి-సుప్రీంకోర్టు -
విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు కన్నెర్ర
న్యూఢిల్లీ: విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు కన్నెర్రజేసింది. రాజకీయ నాయకులు మతాన్ని రాజకీయాలకు వాడుకోవడం ఆపినప్పుడే వాటికి అడ్డుకట్ట పడుతుందని పేర్కొంది. ‘‘దేశం ఎటు పోతోంది? విద్వేష ప్రసంగాలు ఓ విషవలయం. రాజకీయాలను మతంలో కలపడం పెను సమస్యకు దారి తీస్తోంది. విచ్ఛిన్న శక్తులే ఇందుకు పాల్పడుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. దీన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం తక్షణం ఓ మార్గం చూడాలి’’ అని న్యాయమూర్తులు కె.ఎం.జోసెఫ్, బి.వి.నాగరత్న ధర్మాసనం బుధవారం అభిప్రాయపడింది. ఇటీవలి తీర్పులోనూ సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని నొక్కిచెప్పిందని గుర్తు చేసింది. ‘‘టీవీల్లో, మీడియాలో, బహిరంగ వేదికలపై రోజూ ఇలాంటి శక్తులు ఇతరులపై విద్వేష వ్యాఖ్యలకు పాల్పడుతూనే ఉన్నాయి. ఎంతమందిపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టగలం? తోటివారిపై, సామాజిక వర్గాలపై విద్వేష వ్యాఖ్యలు చేయబోమని ప్రజలే ప్రతినబూనితే బాగుంటుంది’’ అని సూచించింది. దివంగత ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజ్‌పేయి వంటివారి ప్రసంగాలు ఎంతో హుందాగా ఉండేవంటూ గుర్తు చేసింది. వాడీవేడి వాదనలు.. ‘‘విద్వేష ప్రసంగాలపై సకాలంలో చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నిస్తేజంగా మారాయి. అందుకే కోర్టులకు పని పడుతోంది’’ అంటూ ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇలా మౌనంగా ఉండే పక్షంలో ప్రభుత్వాల ఉనికికి అర్థమేముందని ప్రశ్నించింది? రాష్ట్రాల సంగతేమో గానీ ఈ వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వానికి వర్తించవని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. కేరళ, తమిళనాడుల్లో నేతల విద్వేష ప్రసంగాల ఉదంతాలను కూడా ఈ పిటిషన్‌తో కలిపి విచారించాలని కోరారు. వాటికి సంబంధించిన వీడియో క్లిప్‌ల ప్రదర్శనకు అనుమతించాలని కోరడంతో దీన్నో డ్రామాగా మార్చొద్దని ధర్మాసనం పేర్కొంది. ‘‘దేనికైనా ఓ పద్ధతుంటుంది. మేం వీడియో క్లిప్‌లు చూడాలని మీరు భావిస్తే దాన్ని మీ పిటిషన్లో చేర్చండి’’ అని సూచించింది. విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేసింది. -
విద్వేష ప్రసంగంపై ప్రశాంత్ కిశోర్ ట్వీట్.. ఎన్టీకే నేత సీమన్పై కేసు
చెన్నై: ఉత్తరాది రాష్ట్రాల వలస కార్మికులను ఉద్దేశించి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన నామ్ తమిళర్ కచ్చి(ఎన్టీకే) నేత సెంథామిళన్ సీమన్పై తమిళనాడు ఈరోడ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ట్వీట్ అనంతరం ఈమేరకు చర్యలు తీసుకున్నారు. ఫిబ్రవరి 13న ఓ పబ్లిక్ ర్యాలీలో సీమన్ మాట్లాడుతూ.. తమిళనాడులో హిందీలో మాట్లాడేవారిని కొడతానని, ఈ దెబ్బతో వాళ్లు బ్యాగులు సర్దుకుని పారిపోతారని వ్యాఖ్యానించారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రశాంత్ కిషోర్ ఈ విషయాన్ని లేవనెత్తారు. సీమన్ విద్వేష ప్రసంగాన్ని ట్విట్టర్లో షేర్ చేసి.. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోరా? అని ప్రశ్నించారు. ఫేక్ వీడియోలతో హింస, విద్వేషం సృష్టించే వారిపై చర్యలు తీసుకున్నట్లే.. ప్రజలను రెచ్చగొట్టే ఇలాంటి వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఈ రోడ్ పోలీసులు సీమన్పై కేసు నమోదు చేశారు. All those who used fake videos to incite hate & violence must be dealt with as per the law. But this doesn’t absolve those who’re openly calling for violence against #Hindi speaking people in #TN Why no action against likes of @SeemanOfficial for their vitriolic utterances? pic.twitter.com/vyu2EkjBQu — Prashant Kishor (@PrashantKishor) March 10, 2023 కాగా.. తమిళనాడులో ఉత్తరాది నుంచి వచ్చిన వలసకార్మికులపై దాడులు జరుగుతున్నాయని, ఈ ఘటనల్లో ఇద్దరు చనిపోయారని వార్తలు వ్యాప్తి చెందాయి. దీంతో బిహార్ సీఎం ఈవిషయంపై విచారణకు నిజనిర్ధరణ కమిటీ కూడా వేశారు. అయితే ఇందులో వాస్తవం లేదని, ఉత్తరాది రాష్ట్రాల కార్మికులు తమకు సోదరులతో సమానమని సీఎం ఎంకే స్టాలిన్ చెప్పారు. వారికి ఎలాంటి హాని ఉండదని హామీ ఇచ్చారు. చదవండి: ఇదేం ధమ్కీరా నాయనా.. అండ్రాయిడ్ ఫోన్ ఫ్రీగా ఇచ్చి తెలివిగా రూ.లక్షలు కాజేశారు.. -
Imran Khan: విద్వేష ప్రసంగం కేసు.. తాత్కాలిక ఊరట
ఇస్లామాబాద్: పాక్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్‌కు తాత్కాలిక ఊరట లభించింది. తాజా విద్వేషపూరిత ప్రసంగం కేసులో క్వెట్టా స్థానిక కోర్టు ఒకటి ఆయన మీద అరెస్ట్ వారెంట్ జారీ చేయగా.. దానిని రెండు వారాల పాటు నిలిపివేయాలంటూ బెలూచిస్తాన్ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. విద్వేషపూరిత ప్రసంగం కేసుకు గానూ సదరు స్థానిక కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలో.. క్వెట్టా పోలీసుల బృందం ఒకటి ఖాన్‌ను అరెస్ట్ చేసేందుకు లాహోర్‌కు కూడా చేరుకుంది. అయితే ఈలోపే బెలూచిస్తాన్ హైకోర్టు ఆయనకు తాత్కాలిక ఊరట ఇవ్వడం విశేషం. ఇదిలా ఉంటే.. గత ఆదివారం లాహోర్‌లోని ఆయన నివాసం జమాన్ పార్క్ వద్ద భారీ హైడ్రామా నడిచింది. తోషాఖానా కేసులో కోర్టు విచారణకు గైర్హాజరు అవుతుండడంతో ఆయన్ని అరెస్ట్ చేయాలంటూ కోర్టు ఆదేశించడంతో.. పోలీసులు అక్కడి చేరుకున్నారు. అయితే పీటీఐ కార్యకర్తల నిరసన ప్రదర్శనలతో పోలీసులు వెనక్కి తగ్గారు. ఆ సమయంలోనే పీటీఐ కార్యకర్తలను, జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఖాన్.. పాక్ సర్కార్‌ను, దర్యాప్తు సంస్థలను, పోలీసులను తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ సంస్థలను విమర్శిస్తూ సంచలన ఆరోపణలు చేసినందుకుగానూ బిజిల్ ఘర్ పోలీస్ స్టేషన్లో ఖాన్‌పై ఓ కేసు నమోదు అయ్యింది. దీంతో క్వెట్టా స్థానిక కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆ వెంటనే ఖాన్ బెలూచిస్తాన్ హైకోర్టును ఆశ్రయించారు. ఖాన్ ప్రసంగించిన చోటుకి.. బిజిల్ఘర్ స్టేషన్ పరిధికి సంబంధం లేదంటూ ఖాన్ తరపు న్యాయవాది వాదించగా.. కోర్టు ఆ వాదనతో ఏకీభవించింది. లోకల్ కోర్టు జారీ చేసిన వారెంట్‌ను రెండు వారాలపాటు సస్పెండ్ చేస్తూ(విచారణ రెండు వారాలు వాయిదా వేసింది).. బెలూచిస్తాన్ ఎస్పీకి, బిజిల్ పోలీస్ స్టేషన్ అధికారులకు సమన్లు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ వ్యాప్తంగా ఇప్పటివరకు 37 కేసులు నమోదు అయ్యియి. వీటిల్లో నేరుగా ఆయన పేరును నిందితుడిగా పేర్కొనడం గమనార్హం. -
ఆజంఖాన్ ఖాన్‌కు షాక్.. శాసనసభ్యత్వం రద్దు
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ నేత, రాంపూర్ సదర్ ఎమ్మెల్యే ఆజంఖాన్ శాసనసభ్యత్వం రద్దయింది. యూపీ అసెంబ్లీ సెక్రటేరియట్ శుక్రవారం ఈ మేరకు ప్రకటించింది. విద్వేష ప్రసంగం కేసులో ఆజంఖాన్‌కు కోర్టు గురువారం మూడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఫలితంగా రాంపూర్ సదర్ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించింది. రెండేళ్లు, అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడిన ఎమ్మెల్యే శాసనసభ్యత్వం రద్దవుతుంది. శిక్ష పూర్తయిన తర్వాత ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులవుతారు. చదవండి: ఎన్నికల వేళ బీజేపీకి ఊహించని షాక్! -
పవన్ కల్యాణ్ ద్వేషపూరిత భాష
-
దేశం ప్రమాదకర పరిస్థితిలో ఉంది: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పట్ల బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపిస్తోందని, దేశంలో విద్వేష రాజకీయాలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆక్షేపించారు. గురువారం నాడు తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా పబ్లిక్ గార్డెన్స్‌లో జెండా ఆవిష్కరించి ఆయన ప్రసంగించారు. ‘‘ఇప్పుడు దేశం ప్రమాదకరస్థితిలో ఉంది. విద్వేష రాజకీయాల్లో చిక్కి దేశం విలవిల్లాడుతోంది. దేశంలో మత పిచ్చి తప్పవేరే చర్చ లేదు. విచ్ఛిన్నకర శక్తులు ఇలాగే పేట్రేగిపోతే.. సమాజ ఐక్యతకు ప్రమాదం ఏర్పడుతుంది. అశాంతి ఇలాగే ఉంటే అంతర్జాతీయ పెట్టుబడులు రావు. దేశం కోలుకోవడానికి మరో వందేళ్లు పట్టినా ఆశ్చర్యం లేదు. దేశ ప్రజలకు కావాల్సింది.. కరెంట్, మంచినీళ్లు, ప్రాజెక్టులు, ఉద్యోగాలు, ఉపాధి. ప్రగతి పథంలో దేశం పరుగులు పెట్టాలంటే.. నూతన వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక విధానాలు కావాలి. కొత్త సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎజెండా కోసం దారులు వెతకాలి. దేశానికి ఒక సామూహిక లక్ష్యం లేకుండా పోయింది. దేశాన్ని నడిపించడంలో వైఫల్యం ఎవరిది?. కాఐదేళ్లకొకసారి జరిగే అధికార మార్పిడి ముఖ్యం కాదు.. సమస్యలకు పరిష్కారం చూపే ప్రగతిశీల ఎజెండా కావాలి. దేశానికి నూతన గమ్యాన్నినిర్వహించాలి.. గుణాత్మక మార్పు రావాలి అని ఉద్ఘాటించారు తెలంగాణ సీఎం కేసీఆర్. తెలంగాణకు వివక్ష తప్పడం లేదు! రాష్ట్ర హక్కుల సాధన కోసం కేంద్రంతో పోరాడాల్సి వస్తోంది. ప్రగతి శీల రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించడం లేదు. నిధులు కేటాయించాలని ప్రధాని మోదీని కోరినా ప్రయోజనం శూన్యం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నిధులు ఇవ్వడం లేదు. పన్ను మినహాయింపు లాంటి ప్రోత్సహాకాలు కూడా ఇవ్వడం లేదని అన్నారాయన. ఆఖరికి అత్యంత క్లిష్టమైన కరోనా సమయంలోనూ రాష్ట్రానికి కేంద్రం నయా పైసా సాయం అందించలేదని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని అంశాలను బుట్ట దాఖలు చేయడంతో పాటు ఐటిఐఆర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారంటూ సంచలన ఆరోపణలకు దిగారు సీఎం కేసీఆర్. న్యాయంగా రావాల్సిన నిధుల్లోనూ కేంద్రం కోత విధించిందని, ధాన్యం కొనుగోలు విషయంలోనూ కేంద్రం అన్యాయం చేసిందని అన్నారు. కేంద్రం తీరుకు నిరసనగా ఢిల్లీలో నిరసన దీక్ష చేశాం. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని అవహేళన చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల హృదయాలను తీవ్రంగా గాయపరిచాయి. రైతులను నిర్లక్ష్యం చేస్తే.. రోడ్డుపైకి వస్తారు. దేశవ్యాప్తంగా ఒకేవిధమైన కొనుగోలు విధానం ఉండాలి. రైతులతో చెలగాటమాడొద్దని కేంద్రానికి హితవు పలుకుతున్నా అన్నారు సీఎం కేసీఆర్. చదవండి: అటు తమిళసై.. ఇటు కేసీఆర్!! -
విద్వేష ప్రసంగాలను ఖండించాల్సిందే!
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఇటీవల జరిగిన ఓ ధర్మ సంసద్‌లో మైనారిటీలపై జరిగాయంటున్న విద్వేష ప్రసంగాలను ఆరెస్సెస్ ఖండించింది. అలాంటి విడదీసే, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఎంత పెద్దవారైనా, ఏ పార్టీ వారైనా చట్టప్రకారం కఠినంగా శిక్షించాల్సిందేనని ఆరెస్సెస్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఇంద్రేశ్ కుమార్ బుధవారం అన్నారు. మహాత్మాగాంధీని ఓ హిందూత్వవాది కాల్చి చంపాడన్న కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ కామెంట్లూ విద్వేష ప్రసంగం కిందకే వస్తాయన్నారు. సంఘ్ అనుబంధ సంస్థలైన ముస్లిం, క్రిస్టియన్ రాష్ట్రీయ మంచ్లకు ఇంద్రేశే వ్యవస్థాపకుడు. -
విభజనవాద శక్తులను కట్టడి చేయండి
న్యూఢిల్లీ: దేశంలో విభజనవాద శక్తులను కట్టడి చేయాలని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)బెంగళూరు, అహ్మదాబాద్‌లకు చెందిన విద్యార్థులు, బోధనాసిబ్బంది ప్రధాని మోదీకి లేఖ రాశారు. ప్రధాని మౌనం దాల్చడం విద్వేషాలను రెచ్చగొట్టే వారికి ధైర్యాన్నిస్తోందని పేర్కొన్నారు. దేశంలో మైనారిటీలపై దాడుల ఘటనలు, విద్వేష పూరిత ప్రసంగాల నేపథ్యంలో రాసిన ఈ లేఖపై 180 మందికి పైగా సంతకాలు చేశారు. ‘మిశ్రమ సంస్కృతులకు గౌరవించే మీరు.. దేశంలో పెరుగుతున్న అసహనంపై మౌనంగా ఉండటం మమ్మల్ని బాధిస్తోంది. మీ మౌనం విద్వేషపూరిత గొంతుకలకు బలాన్నిస్తోంది’ అని లేఖలో పేర్కొన్నారు. -
హరిద్వార్ ధర్మసంసద్ ప్రసంగాలపై కేసు నమోదు
డెహ్రాడూన్: మైనారిటీలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన వసీం రజ్వీ అలియాస్ జితేంద్ర నారాయణ్ త్యాగి, తదితరులపై కేసు నమోదైంది. వారిపై ఐపీసీ 153 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు హరిద్వార్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రకీందర్‌సింగ్ తెలిపారు. అదేవిధంగా, గత వారం హరిద్వార్‌లో ధర్మసంసద్ నిర్వహించి న, ప్రసంగించిన వారిపై చర్యలు తీసుకోవా లని టీఎంసీ ప్రతినిది సాకేత్ గోఖలే జ్వాలాపూర్లో ఫిర్యాదు చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు గర్హనీయం హిందుత్వవాదం పేరుతో కొందరు చేస్తున్న ద్వేషపూరిత వ్యాఖ్యల ద్వారా హింస జరుగుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. దానికి అన్ని మతాలు మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. హింసను ప్రేరేపిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. మాజీ ప్రధానిని హత్య చేయాలని పిలుపునివ్వడం, వివిధ మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర చేయడం హీనమైన చర్యన్నారు. రాజ్యాంగాన్ని ధిక్కరించేలా ఆ వ్యాఖ్యలున్నాయని ఆమె ట్వీట్ చేశారు. -
ఫేస్బుక్ నెత్తిన మరో పిడుగు..!
New Whistleblower Accuses Facebook Of Promoting Hate Speech Misinformation: గత కొద్దిరోజుల నుంచి ఫేస్‌బుక్‌కు కంటిమీద కునుకులేకుండా పోయింది. వరుస ఆరోపణలు ఫేస్‌బుక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అమెరికన్ మీడియా సంస్ధ వాల్‌స్ట్రీట్ జనరల్ ఫేస్‌బుక్‌పై దుమ్మెతిపోసిన విషయం తెలిసిందే. చివరికి మాజీ ఉద్యోగిని ఫ్రాన్సెన్స్ హాగెన్ కూడా ఫేస్‌బుక్‌పై తీవ్ర ఆరోపణలను చేసింది. తాజాగా మరో విజిల్‌బ్లోయర్ కూడా ఫేస్‌బుక్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫేస్బుక్లో సమస్యలు ఇప్పుడే ముగిసేలా కన్పించడం లేదు. కొద్దిరోజుల క్రితం మాజీ ఉద్యోగి రూపంలో ఫేస్‌బుక్‌పై పిడుగు పడితే...ఇప్పుడు మరో విజిల్‌బ్లోయర్ కంపెనీ చీకటి నిజాలను బయటపెట్టారు. ఇంటిగ్రీటి టీమ్ మాజీ సభ్యుడు ఫేస్‌బుక్‌పై మరిన్ని ఆరోపణలను చేశారు. పలుదేశాల్లో ద్వేషపూరిత ప్రసంగాలను, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ఫేస్బుక్ ప్రోత్సహించిందని పేర్కొన్నారు. విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలను అరికట్టడంలో ఫేస్బుక్ తీవ్రంగా విఫలమైందని వెల్లడించారు. కంపెనీ ఎప్పుడు లాభాల కోసమే పాకులాడదనే ఫ్రాన్సెస్ హాగెన్ చేసిన వ్యాఖ్యలను బలపరుస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలను గుప్పించారు. చదవండి: మొబైల్ యూజర్లకు షాకింగ్ న్యూస్...! ఫేస్బుక్ ఇంటిగ్రీటి టీమ్‌లో భాగమైన ఈ కొత్త విజిల్‌బ్లోయర్ తన ఆరోపణలను అమెరికన్ మీడియా వాషింగ్టన్ పోస్ట్‌తో పంచుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఫేస్‌బుక్‌పై అమెరికాలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదులో అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు భయపడి భద్రతా నియమాలను అమలు చేయడానికి ఫేస్బుక్ నిరాకరించిందని ఆరోపించారు. కొత్త విజిల్‌బ్లోయర్ చేసిన ఆరోపణలు ఫ్రాన్సిస్ హుగెన్ చేసిన ఆరోపణలను ప్రతిధ్వనించాయి. చదవండి: హైదరాబాద్‌లో ఇవి కూడానా? ఓపెన్ కొరియన్ మెనూ! -
ఎయిర్‌పోర్టులో పాతబస్తీ అబూఫైజల్ అరెస్ట్
శంషాబాద్: యూట్యూబ్ ద్వారా విద్వేష పూరిత వీడియోలు చేసి విద్వేషాలకు ఆజ్యం పోస్తున్న పాతబస్తీవాసి అబూఫైజల్ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. పాతబస్తీ బార్కాస్‌కు చెందిన అబుఫైసల్పై 2020లో సైబర్‌క్రైమ్ పోలీసులు సమోటోగా కేసు నమోదు చేశారు. కొంతకాలంగా దుబాయిలో ఉంటున్న అతడిపై సైబర్ క్రైమ్ పోలీసులు దేశంలోని అన్ని విమానాశ్రయాలకు లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం దుబాయి నుంచి వచ్చిన అబూఫైజల్ను ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు. అతడిని అక్కడి నుంచి నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. -
ఫేక్ న్యూస్ : సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తలు, విద్వేషపూరిత ప్రసంగాలకు ఆయా సంస్థలనే బాధ్యులుగా చేయాలన్న విషయంలో అభిప్రాయం తెలపాల్సిందిగా సుప్రీంకోర్టు సోమవారం కేంద్రం, సంబంధిత వర్గాలకు నోటీసులు ఇచ్చింది. ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ వి.రామ సుబ్రమణియన్‌ల ధర్మాసనం విచారించింది. ఈ పిటిషన్‌ను, మీడియా, చానెళ్లు, నెట్‌వర్క్‌లపై వచ్చే ఫిర్యాదులపై విచారణ చేపట్టేందుకు ప్రత్యేకంగా మీడియా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలంటూ గతంలో దాఖలైన పిల్‌తో కలిపి విచారణ చేపడతామని తెలిపింది. మీడియా, చానెళ్లు, నెట్‌వర్క్‌లపై వచ్చే ఫిర్యాదులను విచారించేందుకు ప్రత్యేకంగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిల్‌ను జనవరి 25వ తేదీన విచారించిన ధర్మాసనం.. కేంద్రంతోపాటు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్లకు నోటీసులు జారీ చేసింది. -
ఫేస్బుక్ ఉన్నతాధికారికి బెదిరింపులు
సాక్షి, న్యూఢిల్లీ : హింసను ప్రేరేపించేలా విద్వేష ప్రసంగాలు, పోస్టులను బీజేపీ నేతలు షేర్ చేసేందుకు ఫేస్బుక్ అనుమతిస్తోందనే వార్తల నేపథ్యంలో ఫేస్బుక్ ఉన్నతోద్యోగి ఒకరు తనపై ఎఫ్బీ, ట్విటర్లలో బెదిరింపులు వస్తున్నాయని వెల్లడించారు. తనను చంపుతామని బెదిరించడంతో పాటు కొందరు తనపై అభ్యంతరకర సందేశాలు పోస్ట్ చేస్తున్నారని ఫేస్బుక్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ (భారత్, దక్షిణ మధ్య ఆసియా) అంఖి దాస్ ఢిల్లీ పోలీస్ సైబర్ విభాగంలో ఫిర్యాదు చేశారు. ఆగస్ట్ 14 తర్వాత తనకు ఈ తరహా బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్న బాధితురాలు ఐదారుగురు వ్యక్తుల పేర్లను తన ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈ వ్యవహారంపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భారత్‌లో ఫేస్బుక్ పక్షపాత ధోరణితో పనిచేస్తోందని అమెరిన్ దినపత్రిక వాల్‌స్ట్రీట్ జర్నల్ శుక్రవారం కథనం ప్రచురించిన అనంతరం ఈ వివాదం మొదలైంది. ఫేస్బుక్ తన హేట్ స్పీచ్ పాలసీని పక్కనపెట్టి తన డిజిటల్ వేదికపై బీజేపీ నేతలను విద్వేషపూరిత ప్రకటనలు, మేసేజ్‌లను పోస్ట్ చేసేందుకు అనుమతిస్తోందని వాల్‌స్ట్రీట్ పేర్కొంది. భారత్‌లో బీజేపీ ప్రభుత్వంతో మంచి సంబంధాలను కొనసాగించేందుకే ఫేస్బుక్ ఇలా చేస్తోందని ఆరోపించింది. భారత రాజకీయాలతో కుమ్మక్కైన ఫేస్బుక్ హేట్ స్పీచ్ నిబంధనలనే పేరుతో ఈ వ్యాసాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ షేర్ చేశారు. భారత్‌లో ఫేస్బుక్, వాట్సాప్‌లను పాలక బీజేపీ, ఆరెస్సెస్‌లు నియంత్రిస్తున్నాయని కూడా రాహుల్ ఆరోపించారు. కాగా రాజకీయ నేతల స్ధాయితో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా హింసను ప్రేరేపించే కంటెంట్‌ను కంపెనీ నిషేధించిందని ఫేస్బుక్ ప్రతినిధి వివరణ ఇచ్చారు. చదవండి : బీజేపీకి వత్తాసు : ఎఫ్బీ క్లారిటీ -
సోనియా, రాహుల్‌లపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలు విద్వేషపూరిత ఉపన్యాసాలు చేశారని, వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో గురువారం పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఢిల్లీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ముంబై మాజీ ఏఐఎంఐఎం ఎమ్మెల్యే వరీస్ పఠాన్లు విద్వేషపూరిత ఉపన్యాసాలు చేశారని, వారిపైనా ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలంటూ ‘లాయర్స్ వాయిస్’ తరఫున గురువారం పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను హైకోర్టు శుక్రవారం విచారించనుంది. ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) నేతలు అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ విద్వేషపూరిత ఉపన్యాసాలు చేశారని, వారిపైనా కేసులు నమోదు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో హిందూసేన పిటిషన్ వేసింది. -
‘రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు’
హైదరాబాద్ : కరీంనగర్లో తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఎవరినీ రెచ్చగొట్టేలా చేసినవి కాదని ఏఐఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వివరణ ఇచ్చారు. తాను ఎలాంటి చట్టవిరుద్ధ ప్రకటన చేయలేదని, ఏ ఒక్కరి మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడలేదని చెప్పారు. అక్బరుద్దీన్ బుధవారం కరీంనగర్లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘నేను ఎన్ని రోజులు బతుకుతానో నాకు తెలియదు. నేను భయపడేది నా గురించి కాదు.. రాబోయే తరాల గురించి నా భయం. కరీంనగర్లో ఎంఐఎం నేత డిప్యూటీ మేయర్‌గా ఉన్నప్పుడు స్థానికంగా బీజేపీ అడ్రస్ కూడా లేదు. కానీ ఇప్పుడు ఏకంగా కరీంనగర్ ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. మజ్లిస్ గెలవలేదని బాధలేదు. బీజేపీ గెలిచిందని ఆవేదనగా ఉంది. మూక దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారు నేరుగా స్వర్గానికి వెళ్తారు. ఎవరైతే భయపెడతారో వారినే భయపెట్టిస్తారు. మజ్లిస్ మతతత్వ పార్టీ అని దుష్ప్రచారం చేస్తున్నారు. అలా చేసేవారు ఎవరో కాదు. గాడ్సేని పొగిడినవాళ్లే. గమ్యాన్ని ముద్దాడే భావోద్వేగాలంటే నాకు ఇష్టం’అంటూ అక్బరుద్దీన్ ప్రసంగించారు. దేశంలోని ముస్లింలను ఆర్ఎస్ఎస్ హతమారుస్తోందని ఆరోపించారు. 2013లో తాను చేసిన ‘15 నిమిషాల’ ప్రసంగంపై ఆర్ఎస్ఎస్ ఇంకా ఉలిక్కిపడుతోందని వ్యాఖ్యానించారు. 2013లో అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు 15 నిమిషాల పాటు పక్కకు తప్పుకుంటే ముస్లింలు 100 కోట్ల మంది హిందువులను మట్టుబెడతారని అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కాగా కరీంనగర్లో అక్బరుద్దీన్ ప్రసంగంపై బీజేపీ, సీపీఐ సహా పలు రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు అక్బరుద్దీన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. -
ప్రజలకు ఫేస్బుక్ క్షమాపణ
శాన్ఫ్రాన్సిస్కో: విద్వేష ప్రసంగాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలను తొలగించడంలో విఫలమైనట్లు ఓ విచారణలో తేలడంతో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ప్రజలకు క్షమాపణలు చెప్పింది. తమ సేవల్ని మరింతగా మెరుగుపర్చుకుంటామని వెల్లడించింది. క్రౌడ్ సోర్సింగ్ సాయంతో ఈ విచారణను చేపట్టినట్లు అమెరికాకు చెందిన స్వచ్ఛంద దర్యాప్తు సంస్థ ‘ప్రో పబ్లికా’ తెలిపింది. ఇందులో భాగంగా ఫేస్బుక్లో విద్వేషపూరితమైన 900 పోస్టుల్ని పరిశీలించినట్లు వెల్లడించింది. ఈ పోస్టుల్లో విద్వేషపూరిత వ్యాఖ్యలు ఉన్నప్పటికీ ఫేస్‌బుక్‌లోని సెన్సర్లు, కంటెంట్ రివ్యూయర్లు అన్నింటినీ తొలగించలేదంది. అభ్యంతరకర, రెచ్చగొట్టే వ్యాఖ్యలను గుర్తించడంలో సెన్సర్లు ఫేస్బుక్ మార్గదర్శకాలను ఉల్లంఘించాయని పేర్కొంది. ఇలా 49 పోస్టుల తొలగింపులో నిబంధనలు ఎందుకు పాటించలేదో తెలపాలని ప్రోపబ్లికా ఫేస్‌బుక్‌ను కోరింది. దీంతో దాదాపు 22 ఘటనల్లో విద్వేష ప్రసంగాలు, వ్యాఖ్యలు తొలగించడంలో విఫలమయ్యామనీ.. ఇందుకు క్షమాపణలు కోరుతున్నట్లు ఫేస్బుక్ ఉపాధ్యక్షుడు జస్టిన్ ఒసొఫ్స్కై తెలిపారు. తమ సేవల్ని మరింత మెరుగుపర్చుకోవడంలో భాగంగా 2018లో ఈ విభాగంలో 20 వేల మంది కంటెంట్ రివ్యూయర్లు, ఇతర ఉద్యోగులను తీసుకుంటామన్నారు. -
ఎట్టకేలకు భారత్‌కు క్షమాపణలు
లండన్: భారత్ ను రెచ్చగొట్టేలా ట్వీట్లు చేసిన పాకిస్థాన్ సంతతికి చెందిన లండన్ వాసి, టీవీ నటుడు మార్క్ అన్వర్ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పాడు. తాను చేసిన ట్వీట్లతో ఎవరూ అంగీకరించకపోగా.. భారతీయలు మనసులు గాయపడిన నేపథ్యంలో తాను ప్రతి మాటను వెనక్కి తీసుకుంటానని ఓ వీడియో ద్వారా క్షమాపణలు చెబుతూ యూట్యూబ్ లో పెట్టాడు. భారత జాతిని కించపరిచేలా అన్వర్ అసభ్య పదజాలంతో జమ్ముకశ్మీర్ ఆందోళనలు ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై లండన్ లో పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు దర్యాప్తు కూడా ప్రారంభించారు. ఒక జాతిని కించపరిచేవిధంగా మాట్లాడిన అన్వర్ పై కేసు నమోదుకు ఫిర్యాదు అందిందని పోలీసులు కూడా చెప్పారు. దీంతో తాము దర్యాప్తును ప్రారంభించామని చెప్పారు. ఒకరిని కించపరిచేలా చేసే చర్యలు తమ వద్ద ఏమాత్రం అంగీకరించబోమని వారు చెప్పారు. మరోపక్క, తాను చేసిన వ్యాఖ్యలపట్ల క్షమాపణలు చెబుతూనే కశ్మీర్ ప్రజలపట్ల నా మనసులో భావాలు మాత్రం వాస్తవమైనవని అన్నాడు. అయితే, తాను చేసిన పొరపాటును ప్రతిఒక్కరు పెద్ద మనసుతో క్షమిస్తారని భావిస్తున్నానంటూ వెల్లడించాడు. కశ్మీర్లో కొన్ని ఫొటోలు, వీడియోలు చూసి ఆవేశంతో తాను అలా చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చాడు. కశ్మీర్ అల్లర్ల నేపథ్యంలో భారతీయులను తిడుతూ అన్వర్ తొలుత అసభ్య పదజాలం వాడుతూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. దీనిపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో ఎట్టకేలకు క్షమాపణలు చెప్పాడు. -
ఎవ్వరిని ఉగ్రవాదం వైపు వెళ్లమనలేదు
-
ఎవ్వరిని ఉగ్రవాదం వైపు వెళ్లమనలేదు: జకీర్
సౌదీ అరేబియా: ఉగ్రవాదాన్ని తాను ఏ మాత్రం సమర్థించబోనని వివాదాస్పద ఇస్లాం మత ప్రబోధకుడు జకీర్ నాయక్ చెప్పారు. ఇస్లాం శాంతి కోరుకుంటుందని అన్నారు. ఫ్రాన్స్ లో జరిగిన దాడులను తాను ఖండిస్తున్నాని చెప్పారు. అమాయకులపై దాడులు సరికాదని అన్నారు. ఏ ఒక్క ఉగ్రదాడిలో కూడా తన పాత్ర లేదని వివరించాడు. దేశంలో ముస్లింలను రెచ్చగొట్టేలా జకీర్ నాయక్ ప్రసంగాలు చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలకు స్కైప్ ద్వారా వివరణ ఇస్తానని చెప్పిన ఆయన సౌదీ నుంచి స్కైప్ ద్వారా శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదం వైపు ముస్లింలు వెళ్లాలని తాను చెప్పలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. తాను ఎప్పుడూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేయలేదని వివరణ ఇచ్చారు. -
మీడియా కథనాలు చూసి షాక్ తిన్నాను!
న్యూఢిల్లీ: విద్వేష ప్రసంగాలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇస్లామిక్ మత ప్రబోధకుడు జకీర్ నాయక్ ఎట్టకేలకు స్పందించారు. హింస, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని తాను సమర్థించబోనని ఆయన చెప్పారు. ఏ ఉగ్రవాద సంస్థకు తాను ఎన్నడూ మద్దతునివ్వలేదని చెప్పారు. తాను చేసిన ప్రకటనలను సందర్భానుసారం తీసుకోకుండా హింస కోసం ఎవరైనా ఉపయోగించుకుంటే దానిని తాను ఖండిస్తానని అన్నారు. ఢాకా ఉగ్రవాద పేలుళ్ల విషయంలో తనపై విచారణల జరుపుతున్న మీడియా తీరును చూసి షాక్ తిన్నానని ఆయన చెప్పారు. ఈ విషయంలో భారతీయ దర్యాప్తు ఏజెన్సీలకు సహకరించేందుకు సిద్ధమని, ఎలాంటి సమాచారం కావాలన్నా ఇస్తానని తెలిపారు. ఇంతవరకు భారత అధికారులు తనను సంప్రదించలేదని చెప్పారు. వీలు చిక్కితే తనపై వచ్చిన ఆరోపణలన్నింటికీ సమాధానమిస్తూ ఓ వీడియో తీసి దానిని మీడియాకు ఇస్తానని తెలిపారు. ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉన్న జకీర్ సోమవారం ముంబైకి రావాల్సి ఉండగా... ఆయన తన రాకను అర్ధంతరంగా వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ముంబైలో నిర్వహించాల్సిన ఆయన మీడియా సమావేశం రద్దయింది. గతవారం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో 22మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాద దాడులకు జకీర్ నాయక్ విద్వేషపూరిత ప్రసంగాలు ప్రేరణనిచ్చాయని వెలుగుచూడటంతో ఆయనపై పోలీసులు నజర్ పెట్టిన సంగతి తెలిసిందే. -
పోలీసులు నజర్ పెట్టడంతో వెనక్కి తగ్గాడా?
ముంబై రాకను క్యాన్సిల్ చేసుకున్న జకీర్ ముంబై: వివాదాస్పద ఇస్లామిక్ మత ప్రబోధకుడు జకీర్ సోమవారం సౌదీ అరేబియా నుంచి ముంబైకి రావాల్సి ఉండగా... ఆయన తన రాకను అర్ధంతరంగా వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. తన పర్యటన వాయిదాపై సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ లో క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశముందని పోలీసు వర్గాలు తెలిపాయి. గతవారం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో 22మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాద దాడులకు జకీర్ నాయక్ విద్వేషపూరిత ప్రసంగాలు ప్రేరణనిచ్చాయని వెలుగుచూడటంతో ఆయనపై పోలీసులు నజర్ పెట్టిన సంగతి తెలిసిందే. సౌదీ అరేబియా నుంచి ముంబయికి తిరిగి రాగానే ఆయనను పోలీసులు పిలిపించుకొని విచారించనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు విషయంలో ప్రత్యేక టీంను ఏర్పాటుచేసిన పోలీసులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఇప్పటికే నగరంలో కట్టుదిట్ట భద్రతను కూడా ఏర్పాటుచేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణను తప్పించుకొనేందుకు జకీర్ తన ముంబై పర్యటనను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. జకీర్ విద్వేష పూరిత మతప్రసంగాల కారణంగానే ఢాకాలో ఉగ్రదాడులు జరిగినట్టు వార్తలు వచ్చిన క్రమంలో ఆయన నడిపిస్తున్న 'పీస్' చానెల్ పై బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. -
జకీర్ నాయిక్ వస్తున్నాడు
న్యూఢిల్లీ: రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసిన ముస్లిం మత పెద్ద జకీర్ నాయక్‌ను నేడు ముంబయి పోలీసులు విచారించే అవకాశం ఉంది. సౌదీ అరేబియా నుంచి నేడు ముంబయికి వస్తున్న ఆయనను పోలీసులు పిలిపించుకొని విచారించనున్నట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియాలో ఓ టీవీ చానెల్ ద్వారా మాట్లాడుతూ విద్వేషపూరిత ప్రసంగం చేసిన విషయం తెలిసిందే. ఢాకా పేలుళ్ల నేపథ్యంలో ఆయన ఈ ప్రసంగం చేసి దేశం నివ్వెర పోయేలా చేశాడు. దీంతో ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు విషయంలో ప్రత్యేక టీంను ఏర్పాటుచేసిన పోలీసులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఇప్పటికే నగరంలో కట్టుదిట్ట భద్రతను కూడా ఏర్పాటుచేశారు. మరోపక్క, జకీర్ ఆస్తులు, ఆయన చేస్తున్న కార్యకలాపాలు, కొనసాగిస్తున్న సంబంధాలపై కూడా పోలీసులు ఆరా మొదలు పెట్టినట్లు సమాచారం. -
జకీర్ నాయక్ పై చర్యలు ఉంటాయ్
-
జకీర్ నాయక్ పై చర్యలు ఉంటాయ్: వెంకయ్య
న్యూఢిల్లీ: రెచ్చగొట్టేలా మాట్లాడిన జకీర్ నాయక్ పై తన వైపు నుంచి ఉన్న అధికారాల మేరకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఇప్పుడిప్పుడే ఇలాంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. టెలివిజన్ నియమనిబంధనలు ఉల్లంఘించి మరి కొంతమంది సంఘవిద్రోహ కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, రెచ్చగొట్టేలా ఉన్న ప్రసంగాలను ప్రచారం చేస్తున్నారని, దిగుమతి చేసుకుంటున్నారని ఇప్పుడిప్పుడే తెలుస్తోందని, చట్ట ప్రకారం వారిపై అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. 2008లో ఓ టీవీ చానెల్ ప్రారంభించేందుకు దరఖాస్తు చేసుకున్నారని, అది 2009లో తిరస్కరణకు గురైందని ఆయన చెప్పారు. కేంద్ర ప్రసారశాఖ బాధ్యతలు కొత్తగా జరిగిన కేంద్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి చేతికి వచ్చిన విషయం తెలిసిందే. కశ్మీర్ అల్లర్లపై వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. పొరుగుదేశం నుంచి స్పూర్తి పొందిన కొంతమంది దేశంలో అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తున్నారన్నారు. అయితే పాకిస్తాన్ ఎత్తుగడలు ఎట్టిపరిస్థితుల్లోనూ పారవని ఆయన స్పష్టం చేశారు. -
మానవ జాతి అంతరించిందన్న జకీర్ నాయక్
-
మానవ జాతి అంతరించిందన్న జకీర్ నాయక్
న్యూఢిల్లీ: కొందరు సినిమాలు చూసి, మరికొందరు పుస్తకాలు చదివి దోపిడీలు చేసిన వారు ఉన్నారు. హత్యలు చేసిన వారున్నారు. అందుకు వారిని శిక్షిస్తున్నాం తప్ప, వారికి స్ఫూర్తినిచ్చిన సినిమాలనుగానీ, పుస్తకాలనుగానీ శిక్షించడం లేదు. వాటిని నిషేధించడం లేదు. ఢాకా పేలుళ్లకు స్ఫూర్తినిచ్చాడని భావిస్తున్న ప్రముఖ ఇస్లామిక్ స్కాలర్, టెలీ మత బోధకుడు జకీర్ నాయక్ విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. ఢాకా పేలుళ్లకు పరోక్షంగా కారణమైన నాయక్‌ను శిక్షించాలని, ఆయన్ని, ఆయన నడుపుతున్న ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను నిషేధించాలని ఆరెస్సెస్ డిమాండ్ చేస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహిస్తోంది. దీనికి స్పందించిన భారత కేంద్ర హోం శాఖ జకీర్ నాయక్ ప్రవచనాలపై, ఆయన నడుపుతున్న సంస్థకు వస్తున్న ఆర్థిక సహాయంపై దర్యాప్తునకు ఆదేశించింది. ఎవరైనా తప్పు చేస్తే చట్ట ప్రకారం వారినే శిక్షించాలి తప్ప అందుకు స్ఫూర్తినిచ్చారంటూ ఎవరినో శిక్షించడం తప్పవుతుంది. దొంగతనాలు, హత్యలకు స్ఫూర్తినిచ్చాయని సినిమాలను, పుస్తకాలను నిషేధించలేం గదా! సమాజంలో నేరం చేసిన వారికి సరైన నడవడి నేర్పలేదన్న కారణంగా వారి తల్లిదండ్రులనో, ఉపాధ్యాయులనో శిక్షించలేముగదా! అచ్చంగా జకీర్ నాయక్ అంశానికి కూడా అదే వర్తిస్తుంది. జకీర్ నాయక్ నిజంగా మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారనుకుంటే చట్టాల ప్రకారమే ఆయన్ని విచారించి చర్య తీసుకోవాలి. ఢాకా పేలుళ్లకు తమకూ జకీర్ హుస్సేన్ ప్రవచనాలు స్ఫూర్తినిచ్చాయంటూ అక్కడ పేలుళ్లకు బాధ్యులు చెప్పారంటూ ఇక్కడ భారత్‌లో ఆయనపై చర్య తీసుకుంటే అసలుకే మోసం వస్తుంది. ప్రస్తుతం ఎక్కువగా బంగ్లాదేశ్, కొంతభాగం కాశ్మీర్‌కు పరిమితమైన ఆయన అభిమానులు రేపు భారత్ అంతా విస్తరించే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే ఆయనకు ఆరెస్సెస్ లాంటి హిందూ సంస్థలు అనవసరమైన ప్రచారాన్ని కల్పించాయి. నిషేధం లాంటి చర్యలను ఆశ్రయించడం కన్నా జకీర్ నాయక్‌తో సైద్ధాంతికంగా పోరాడి ప్రజల్లో ఆయన ఆనవాళ్లను తుడిచేయడమే ఉత్తమమైన మార్గం. జకీర్ నాయక్‌ను సైద్ధాంతికంగా ఎదుర్కోవడం చాలా సులభం కూడా. ఆయన స్కాలర్‌నని చెప్పుకుంటున్నప్పటికీ, ఆయన మెడిసిన్ చదివినప్పటికీ ఆయనకు ఏ సబ్జెక్టుపైనా పెద్దగా పట్టు, అంతగా అవగాహనా లేదని చెప్పవచ్చు. ఆయన ఉపన్యాసాలను గమనిస్తేనే ఎన్నో తప్పులు కనిపిస్తాయి. డార్విన్ థియరీ గురించి ఆయన చెప్పిన మాటల్లో ఎన్నో పొరపాట్లు ఉన్నాయి. ‘హోమో సెపియన్స్’ ఐదు లక్షల ఏళ్ల క్రితమే భూమిపైనా అంతరించి పోయాయని ఆయన ఓ టెలివిజన్ ఉపన్యాసంలో చెప్పారు. ఆయనతో సహా మానవ జాతి ఇప్పటికీ బతికే ఉంది. హోమో సాపియన్స్ అనే పదం లాటిన్ భాష నుంచి వచ్చింది. హోమో అంటే మనిషి అని అర్థం. సోపియన్స్ అంటే జాతి లేదా ఉపజాతి. మొత్తం పదానికి మానవ జాతి అని అర్థం. స్వీడన్‌కు చెందిన ప్రముఖ వృక్ష, జంతు, భౌతిక శాస్త్రవేత్త కార్ల్ లిన్నాయిస్ 1758లో ఈ పదాన్ని కాయిన్ చేశారు. ఈ విషయం స్కాలరైన జకీర్ నాయక్‌కు తెలియక పోవడం దారుణం. ఆయన ఉపయోగించే పదాల్లో ఎన్నో పొరపాట్లు కనిపిస్తాయి. గాలపాగోస్ దీవులను కెలోట్రపస్ దీవులని చెబుతారు. ఇలా ఎన్నో.... -
బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీకి కోర్టు నోటీసులు
లక్నో (యూపీ): బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీకి పిలిభిత్ జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. 2009 ఎన్నికల సందర్భంగా ఆయన రెచ్చగొట్టే ప్రసంగం చేశారని దాఖలైన కేసు గురువారం కోర్టులో విచారణకు వచ్చింది. అయితే వరుణ్ ఈ కేసు విచారణకు గైర్హాజరు కావడంతో జిల్లా కోర్టు జడ్జి కౌటిల్య కుమార్ నోటీసులు జారీ చేశారు. సెప్టెంబర్ 30న కోర్టు ఎదుట హాజరు కావాలని నోటీసులలో పేర్కొన్నారు. వరుణ్ 2009లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని కొన్ని వర్గాల ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారని ఆరోపణలున్నాయి. కార్యకర్త అసద్ హయత్ ఈ విషాయంపై జిల్లా కోర్టులో పిల్ దాఖలు చేశారు. 2009 లోక్ సభ ఎన్నికలలో పిలిభిత్ ప్రాంతంలో వరుణ్ గాంధీ చేసిన ప్రసంగం ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని అసద్ పేర్కొన్నారు. 2009 మార్చి8న చేసిన ప్రసంగం విషయంలో ఆ నెల 17న బార్ఖేరా పీఎస్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అదే విధంగా దాల్చండ్ లో కూడా మత విద్వేష ప్రసంగాలు చేయగా మార్చి 18న సర్దార్ కొత్వాలీ పీఎస్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే. వరుణ్ ఈ కేసు విచారణకు హాజరుకాలేదని అసద్ తరఫు న్యాయవాది ఖాద్రీ షాకిర్ పేర్కొన్నారు. -
ఢిల్లీలో హాట్‌హాట్‌గా పాలిటిక్స్
న్యూ ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల సందర్భంగా గురువారం దేశ రాజధానిలో రాజకీయాలు వేడెక్కాయి. కేంద్ర సహాయ మంత్రి రామ్ శంకర్ కటారియా ఆగ్రాలో ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వెలుపల గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి కటారియాపై రాజద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేశారు. కాగా రామ్ శంకర్ కటారియా మాత్రం ఆగ్రాలో తాను ఎవరినీ కించపరిచేలా మాట్లాడలేదని, విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. హిందువులంతా సమైక్యంగా ఉండాలని మాత్రమే తాను అన్నారని ఆయన తెలిపారు. మరోవైపు ప్రధాన పార్టీలు సభలో ప్రత్యర్థులను ఇరుకున పెట్టేందుకు వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పార్టీ సీనియర్ నాయకులతో సమావేశం నిర్వహించారు. రాజీవ్ హత్యకేసు నిందితులను విడుదల చేయాలంటూ కేంద్రానికి తమిళనాడు ప్రభుత్వం రాసిన లేఖపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్లో అనుసరించాల్సిన విధానాలపై కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. -
ఎఫ్ఐఆర్ లో కేంద్ర మంత్రి పేరు
ఆగ్రా: వీహెచ్‌పీ నేత హత్య నేపథ్యంలో ఆగ్రాలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన నలుగురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ నేత, కార్పొరేటర్ కుందనిక శర్మ, మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల హత్యకు గురైన వీహెచ్‌పీ నేత అరుణ్ సంస్మరణసభలో కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి రాంశంకర్ కఠేరియా, భాజపా ఎంపీ బాబూలాల్, సాధ్వి ప్రాచి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. వీరిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో స్పందించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో వీరు పేర్లు కూడా ఉన్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్యే పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చినట్టు తెలిపాయి. అయితే కేంద్రమంత్రి పేరు ఎఫ్ఐఆర్ లో లేదని అంతకుముందు వార్తలు వచ్చాయి. తాను విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయలేదని చేయలేదని కఠేరియా పేర్కొన్నారు. -
'సుబ్రహ్మణ్యం పుస్తకం మతవిద్వేషపూరితం'
న్యూఢిల్లీ: అధికార బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి రాసిన ఓ పుస్తకానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించింది. ఆయన రాసిన పుస్తకం దేశంలో హిందూ, ముస్లింల మధ్య మతవిద్వేషాన్ని రెచ్చగొట్టేవిధంగా ఉందని నివేదించింది. 2006లో సుబ్రహ్మణ్యస్వామి ప్రచురించిన 'టెర్రరిజం ఇన్ ఇండియా' (భారత్‌లో ఉగ్రవాదం) పుస్తకానికి వ్యతిరేకంగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ మంగళవారం అఫిడవిట్‌ను సుప్రీంకోర్టుకు సమర్పించింది. విద్వేష ప్రసంగాలకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించేవిధంగా ఈ పుస్తకం ఉందని పేర్కొంది. భారతంలోని ఓ వర్గం ప్రజలకు వ్యతిరేకంగా పుస్తకం సుబ్రహ్మణ్యస్వామి విద్వేష ప్రసంగాలు చేశారని, ఈ పుస్తకంలోని ఇతివృత్తం, భాష, ఉపమానాలు అన్ని రెచ్చగొట్టేవిధంగా ఉన్నాయని అఫిడవిట్లో పేర్కొంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలను చేస్తున్న బీజేపీ నేతలను, మంత్రులను పార్టీ అధిష్ఠానం నియంత్రించలేకపోతున్నదని, దేశంలో మతపరమైన అసహనం పెరిగిపోతున్నదని అన్నివైపుల నుంచి కేంద్ర ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేయడం గమనార్హం. అంతేకాకుండా విద్వేష ప్రసంగాలకు నిరోధానికి భారతా శిక్షాస్మృతిలోని కఠిన నిబంధనలు కొనసాగించాలన్న సుప్రీంకోర్టు నిర్ణయానికి కేంద్రం మద్దతు తెలిపింది. హిందూ, ముస్లింల మధ్య విద్వేషాన్ని పెంచేవిధంగా ప్రవర్తిస్తున్న బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామిపై విచారణ జరుపడానికి మద్దతు పలికింది. -
'సాధ్విని మంత్రి పదవి నుంచి తొలగించాలి'
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి వ్యాఖ్యలపై పార్లమెంట్ ఉభయ సభల్లో దుమారం చెలరేగింది. సాధ్విని మంత్రి పదవి నుంచి తొలగించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. రాజ్యసభ జీరో అవర్‌లో ఈ విషయాన్ని విపక్షాలు ప్రస్తావించాయి. గందరగోళం నెలకొనడంతో రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. తప్పుచేశానని సాధ్వి అంగీకరించారని, ఆమె పదవి నుంచి తప్పుకోవాలని సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లికార్జున ఖర్గే కూడా సాధ్వి రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు జోక్యం చేసుకుంటూ సాధ్వి క్షమాపణలు చెప్పినందున రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా సాధ్వి రాజీనామా చేసి తీరాల్సిందేనని విపక్షాలు డిమాండ్ చేయడంతో ఉభయ సభల్లో గందరగోళం ఏర్పడింది. సాధ్వి ఇటీవల ఢిల్లీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. 'ఢిల్లీలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సింది రాముడి సంతానమా? లేక అక్రమ సంతానమా?.. తేల్చాల్సింది మీరే' అని ప్రసంగించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. -
రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఆపరా?
న్యూఢిల్లీ: దుష్ప్రచారం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న వారిని నిలువరించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ప్రముఖ న్యాయనిపుణుడు ఎస్ నారిమన్ ఆరోపించారు. మైనారిటీలపై కొందరు నాయకులు చేస్తున్న వివాదస్పద వ్యాఖ్యలను కట్టడిచేసేందుకు మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు ఏమీ చేయడం లేదని విమర్శించారు. ఈ విషయంలో జాతీయ మైనారిటీ కమిషన్(ఎన్సీఎం) తనంతట తానే చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్సీఎంతో ఏడవ స్మారకోపన్యాసం చేస్తూ నారిమన్ ఈ మాటలన్నారు. -
'గిరిరాజ్ తప్పించుకు తిరిగితే, ఆస్తులను జప్తు చేస్తాం'
పాట్నా: కోర్టు ఆదేశాలతో బీహార్, జార్ఖండ్ పోలీసులు బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ ను అరెస్ట్ చేసేందుకు నివాసంపై సోదాలు నిర్వహించారు. వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో గిరిరాజ్ పై బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గురువారం తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో బొకారో, పాట్నా పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే దాడుల నిర్వహించిన సమయంలో గిరిరాజ్ ఆచూకీ లభ్యం కాలేదని పాట్నా సిటి సూపరింటెండెంట్ పోలీస్ జయకాంత్ తెలిపారు. జార్ఖండ్ పోలీసులు నగరంలో ఉన్నారని.. పాట్నా పోలీసుల బృందం సహకారంతో గిరిరాజ్ అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని జయకాంత్ తెలిపారు. గిరిరాజు లొంగుబాటుకు ముందే అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ ఆయన తప్పించుకు తిరిగితే.. కోర్టు సహాయంతో గిరిరాజ్ ఆస్తులను జప్తు చేసేందుకు ప్రయత్నిస్తామని పోలీసులు తెలిపారు. -
ఆజంఖాన్ ఏమన్నారో చెప్పండి: ఈసీ
ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ చేసిన ప్రసంగం వివరాలు ఇవ్వాలంటూ ఎన్నికల కమిషన్ ఆదేశించింది. కార్గిల్ విజయానికి కేవలం ముస్లిం సైనికులను మాత్రమే ఆయన కీర్తించడం భారత సైన్యానికి అవమానం అని బీజేపీ ఆరోపించింది. కార్గిల్ శిఖరాన్ని హిందూ సైనికులు గెలుచుకురాలేదని, ముస్లింలు మాత్రమే గెలుచుకొచ్చారని ఆజంఖాన్ వ్యాఖ్యానించినట్లు ఆరోపణలున్నాయి. ఘజియాబాద్‌లో ఎన్నికల ర్యాలీలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి నాహిద్ హసన్ తరఫున ఆయన ప్రచారం చేశారు. ఆజంఖాన్ ఇలా మాట్లాడటం భారత సైన్యానికి తీరని అవమానమని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేదీ అన్నారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం లౌకికవాద పార్టీలు అని చెప్పుకొనేవాళ్లు ఇలా చేస్తున్నారని విమర్శించారు. ఘజియాబాద్ నుంచి లోక్‌సభకు బీజేపీ తరఫున భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ పోటీ చేస్తున్నారు. -
రాహుల్ గాంధీపై విద్వేష ప్రసంగం కేసు
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై విద్వేష ప్రసంగం కేసు నమోదైంది. ఈనెల ఆరోతేదీన మహారాష్ట్రలో నిర్వహించిన ఓ ర్యాలీలో మహాత్మా గాంధీని హతమార్చింది ఆర్ఎస్ఎస్ విధానాలేనని ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరి జిల్లాలో ఓ కేసు నమోదైంది. న్యాయవాది, పీపుల్ ఫర్ లీగల్ ఎయిడ్ సొసైటీ కన్వీనర్ అయిన సాను శుక్లా అనే వ్యక్తి ఈ కేసు దాఖలు చేశారు. మహాత్మా గాంధీ హత్యలో ఆర్ఎస్ఎస్కు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి పాత్ర లేదని నిఘా సంస్థలతో పాటు కపూర్ కమిషన్ కూడా క్లీన్ చిట్ ఇచ్చాయని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కేవలం తనను బాధించడమే కాక, పూర్తిగా వాస్తవ విరుద్ధాలని, సంఘ్ పరివార్ పరువు ప్రతిష్ఠలకు తీవ్ర భంగకరమని శుక్లా ఈ సందర్భంగా చెప్పారు.