ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ చేసిన ప్రసంగం వివరాలు ఇవ్వాలంటూ ఎన్నికల కమిషన్ ఆదేశించింది. కార్గిల్ విజయానికి కేవలం ముస్లిం సైనికులను మాత్రమే ఆయన కీర్తించడం భారత సైన్యానికి అవమానం అని బీజేపీ ఆరోపించింది.
ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ చేసిన ప్రసంగం వివరాలు ఇవ్వాలంటూ ఎన్నికల కమిషన్ ఆదేశించింది. కార్గిల్ విజయానికి కేవలం ముస్లిం సైనికులను మాత్రమే ఆయన కీర్తించడం భారత సైన్యానికి అవమానం అని బీజేపీ ఆరోపించింది. కార్గిల్ శిఖరాన్ని హిందూ సైనికులు గెలుచుకురాలేదని, ముస్లింలు మాత్రమే గెలుచుకొచ్చారని ఆజంఖాన్ వ్యాఖ్యానించినట్లు ఆరోపణలున్నాయి.
ఘజియాబాద్లో ఎన్నికల ర్యాలీలో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి నాహిద్ హసన్ తరఫున ఆయన ప్రచారం చేశారు. ఆజంఖాన్ ఇలా మాట్లాడటం భారత సైన్యానికి తీరని అవమానమని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేదీ అన్నారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం లౌకికవాద పార్టీలు అని చెప్పుకొనేవాళ్లు ఇలా చేస్తున్నారని విమర్శించారు. ఘజియాబాద్ నుంచి లోక్సభకు బీజేపీ తరఫున భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ పోటీ చేస్తున్నారు.