kargil war
-
Kargil War: ఎట్టకేలకు అంగీకరించిన పాక్
కార్గిల్ యుద్ధంలో తాము పాల్గొన్నట్లు ఎట్టకేలకు దాయాది దేశం పాక్ అంగీకరించింది. ఈ మేరకు ఆ దేశ సైన్యాధిపతి బహిరంగ ప్రకటన చేశారు. దీంతో.. పాతికేళ్ల తర్వాత పాక్ సైన్యం తమ పాత్రను అంగీకరించినట్లయ్యింది.శుక్రవారం రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యక్రమంలో పాక్ డిఫెన్స్ డే కార్యక్రమం జరిగింది. ఇందులో ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ప్రసంగిస్తూ.. ‘‘భారత్, పాకిస్థాన్ మధ్య 1948, 1965, 1971, కార్గిల్ యుద్ధం, సియాచిన్ ఘర్షణల్లో వేలాది మంది మన సైనికులు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది’’ అని అన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.Pakistan Acknowledges Role in 1999 Kargil War for the First Time#DY365 #Pakistan #KargilWar pic.twitter.com/pW6JcCNqQO— DY365 (@DY365) September 7, 20241999 మే-జులై మధ్య కార్గిల్ యుద్ధం జరిగింది. ముజాహిదీన్ల ముసుగులో నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చిన శత్రుసేనలు.. కార్గిల్‌లో ఖాళీగా ఉన్న భారత కీలక స్థావరాలను వశం చేసుకున్నాయి. కౌంటర్‌గా ఇండియన్ ఆర్మీ ‘ఆపరేషన్ విజయ్’ పెట్టింది. ఈ ఎదురుదాడితో బెంబేలెత్తిపోయిన పాక్.. తోకముడుచుకుని పారిపోయింది. జులై 26న పాక్ సైన్యాన్ని తరిమి కొట్టినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించగా.. అప్పటి నుంచి ఆ తేదీన కార్గిల్ విజయ్ దివస్ నిర్వహించుకుంటున్నాం.అయితే.. ఈ యుద్ధంతో తమ సైన్యానికి ఎలాంటి సంబంధం లేదని పాక్ చెబుతూ స్న్నేతోంది. ముజాహిదీన్ ఫైటర్లు ఈ దాడులకు పాల్పడ్డారని ఆరోపించింది. తాము పాట్రోలింగ్ మాత్రమే చేశామని చెప్పింది. గతంలో పాక్ ఆర్మీ మాజీ అధికారి ఒకరు కూడా కార్గిల్‌లో తమ దేశ బలగాల పాత్ర నిజమేనని చెప్పారు. ఆ ఆపరేషన్‌ను ‘ఫోర్ మ్యాన్ షో’ అని లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) షాహిద్ అజీజ్ అభివర్ణించారు. అయితే పాక్ ఆయన వ్యాఖ్యలపై స్పందించలేదు. తాజా ప్రకటనతో.. పాక్ ఓటమి గుట్టు బట్టబయలైంది.సంబంధిత వార్త: గెలవలేని యుద్ధం చేసిన పాక్ -
Kargil Vijay Diwas: యుద్ధం: ఈ సినిమాలు పిల్లలకు చూపిద్దాం!
కార్గిల్ వార్‌లో భారత పతాకం విజయగర్వంతో నిలబడి 25 ఏళ్లు. వీరులు శూరులై్రపాణాలను చిరునవ్వుతో త్యాగం చేసి ఎందరో సైనికులు అమరులైతే మనకా విజయం సిద్ధించింది. వారి కథలు గాథలు తలుచుకోవాల్సిన సమయం ఇది. అందుకై ‘రజత్ జయంతి వర్ష్’ పేరుతో ఉత్సవాలు సాగుతున్నాయి. ఆ యుద్ధ సమయపు తెగువను బాలీవుడ్ గొప్పగా చూపించింది. ఆ సినిమాలను పిల్లలకు చూపించాలి ఈ వీకెండ్.పాతికేళ్లంటే కనీసం మూడుతరాలు వచ్చి ఉంటాయ్. దేశం దాటిన క్లిష్ట పరిస్థితులు ఏ తరానికి ఆ తరం స్ఫూర్తిదాయకంగా అందిస్తూ ఉండాలి. అప్పుడే ఆ స్ఫూర్తిని కొత్తతరం అందిపుచ్చుకుంటూ ఉంటుంది. అనూహ్యంగా మన ్రపాంతంలో చొరబడి వాస్తవాధీన రేఖ దగ్గర 1999లో టైగర్ హిల్‌ను ఆక్రమించింది పాకిస్తాన్. వారిని వెనక్కు తరిమి కొట్టడానికి భారత సైన్యం రంగంలో దిగింది. మే 2 నుంచి జూలై 26 వరకు అంటే రెండు నెలల మూడు వారాల రెండు రోజుల పాటు ఈ యుద్ధం సాగింది. ఆక్రమిత ్రపాంతం కొండ కావడంతో పై నుంచి శత్రువులు సులభంగా దాడి చేసే పరిస్థితి ఉండటంతో ఈ యుద్ధం ఒక సవాలుగా మారింది. అయినా సరే మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కలిసి విజయం సాధించాయి. తర్వాతి కాలంలో ఈ యుద్ధ నేపథ్యంలో ఎంతో సాహిత్యం, పుస్తకాలు, సినిమాలు వచ్చాయి. వాటిలో బాలీవుడ్ నుంచి వచ్చిన ముఖ్యమైన సినిమాలు ఇవి... 1) లక్ష్య 2) షేర్ షా 3) ఎల్ఓసి కార్గిల్ 4) గుంజన్‌సక్సేనా 5. ధూప్.1. లక్ష్య (2004)లక్ష్య రహితమైన ఒక యువకుడు కార్గిల్ యుద్ధంలో దేశానికి సేవ చేయడమే తన లక్ష్యం అని గ్రహించడమే ‘లక్ష్య’. హృతిక్ రోషన్ నటించిన ఈ సినిమాలో అమితాబ్, బొమన్ ఇరాని, ఓం పురి వంటి ఉద్ధండులు నటించారు. పెద్దగా బాధ్యత పట్టని హృతిక్ రోషన్ తన స్నేహితుడు రాస్తున్నాడని డిఫెన్స్ సర్వీస్ అకాడెమీ పరీక్షలు రాసి ఇండియన్ మిలటరీ అకాడెమీలో సీట్ తెచ్చుకుంటాడు. కాని ట్రయినింగ్ అతని వల్ల కాదు. పారి΄ోయి వస్తాడు. అయితే అందరూ అతణ్ణి తక్కువ దృష్టితో చూసే సరికి ఈసారి పట్టుదలగా వెళ్లి ట్రయినింగ్ పూర్తి చేసి పంజాబ్ బెటాలియన్‌కు ఎంపికవుతాడు. అదే సమయంలో కార్గిల్ యుద్ధం మొదలవుతుంది. ఆ యుద్ధంలో 1000 అడుగుల కొండ మొనపై ఉన్న పాకిస్తాన్ యూనిట్‌ను కడతేర్చడానికి భారత సైన్యం నుంచి బయలుదేరిన 12 మందిలో హృతిక్ కూడా ఒకడు. వీరిలో ఆరుగురు మరణించినా పాకిస్తాన్ యూనిట్‌ను ధ్వంసం చేసి విజయం సాధిస్తారు. ఫర్హాన్ అక్తర్ దర్వకత్వం వహించిన ఈ సినిమా విడుదల సమయంలో ఆదరణ ΄÷ందక΄ోయినా తర్వాత కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. చాలా మంది కుర్రాళ్లను సైన్యంలో చేరేందుకు ఈ సినిమా ప్రేరేపించింది.2. షేర్షా (2021)‘యుద్ధానికి వెళుతున్నాను. మన దేశపతాకాన్ని ఎగరేసి వస్తాను లేదా అందులో చుట్టబడైనా వస్తాను’ అని చెప్పిన ఆర్మీ ఆఫీసర్ విక్రమ్ బాత్ర బయోపిక్ షేర్షా. కార్గిల్ యుద్ధంలో ఊరికే అరాకొరా శత్రువులను నేల రాల్చడం తన తత్వం కాదని ‘ఏ దిల్ మాంగే మోర్’ తన నినాదమని అందరు శత్రువులను నామరూపాల్లేకుండా చేస్తానని చెప్పిన విక్రమ్ బాత్ర అలాగే చేసి మన పతాకం ఎగురవేసి ్రపాణాలు కోల్పోయాడు. సిద్దార్థ్ మల్హోత్ర, కియారా అద్వానీ నటించిన ఈ సినిమా కోవిడ్ కారణంగా అమెజాన్‌లో స్ట్రీమ్ అయ్యింది. తమ ΄్లాట్‌ఫామ్ మీద అత్యధికులు వీక్షించిన సినిమా షేర్షా అని అమెజాన్ తెలిపింది. తుపాకీ గుళ్లు మరఫిరంగుల ఘీంకారాలు మాత్రమే వినపడే యుద్ధ రంగంలో సైనికుల మానసిక స్థితి, వారు ప్రదర్శించే స్థయిర్యం ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూడాలి. కార్గిల్ వీరునికి గొప్ప నివాళి ఈ సినిమా.3.ఎల్ఓసి కార్గిల్ (2003)1997లో ‘బోర్డర్’ వంటి సూపర్‌హిట్ తీసిన జె.పి.దత్తా కార్గిల్‌వార్ మీద తీసిన 4 గంటల 15 నిమిషాల సుదీర్ఘమైన సినిమా ఎల్ఓసి కార్గిల్. వాస్తవాధీన రేఖను దాటి పాకిస్తాన్ సైన్యం కార్గిల్‌లో తిష్ట వేశాక వివిధ దళాలు ఎన్ని విధాలుగా కార్యరంగంలో దిగుతాయి సైనిక తంత్రాలు ఎలా ఉంటాయి ఆఫీసర్లకు వారి దళాలకు సమన్వయం ఎలా ఉంటుందో ఇవన్నీ దాదాపుగా తెలియాలంటే ఈ సినిమా తీయాలి. నిడివి రీత్యా ప్రేక్షకులు ఈ సినిమాను చూడలేక΄ోయినా దర్శకుడు పట్టుబట్టి అలాగే ఉంచేశాడు. సంజయ్ దత్, అజయ్ దేవగణ్, సన్ని డియోల్, సునీల్ శెట్టి, అభిషేక్ బచ్చన్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో ఉంది.4. గుంజన్ సక్సేనా (2020)‘కార్గిల్ గర్ల్’గా ఖ్యాతి గడించిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ ఇది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జన్మించిన గుంజన్ పైలట్ కావాలని కలలు కంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అమ్మాయిలకు అప్పుడే ప్రవేశం కల్పించినా ట్రయినింగ్ సమయంలో ఆ మగవాళ్ల ప్రపంచంలో సవాళ్లు ఎదుర్కొంది గుంజన్. 1996లో భారతదేశ తొలి ఎయిర్‌ఫోర్స్ మహిళా పైలట్లలో ఒకరైన గుంజన్ 1999లో కార్గిల్‌లో చురుకైన పాత్ర ΄ోషించింది. యుద్ధ సమయంలో గాయపడిన వారిని బేస్ క్యాంప్‌కు తరలించి వైద్యం అందించడంలో లెక్కకు మించి చక్కర్లు కొట్టింది. మిస్సయిల్స్కు అందితే ్రపాణాలు చెల్లాచెదురవుతాయని తెలిసినా ఆమె సాహసం కొనసాగింది. జాన్హీ్వ కపూర్ నటించిన ఈ సినిమా అమ్మాయిలకు సమాన అవకాశాలు అన్నింటా కావాలని చెబుతుంది.5. ధూప్ (2003)యుద్ధంలో బలిదానం ఇచ్చిన వీరులను శ్లాఘించడం సరే నిజ జీవితంలో వారి కుటుంబం ఎటువంటి గౌరవాన్ని ΄÷ందుతోంది అని ప్రశ్నించే సినిమా ధూప్. కార్గిల్ యుద్ధంలో మరణించిన కెప్టెన్ అనుజ్ నయ్యర్ కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితులను ఆధారం చేసుకుని ఈ సినిమా తీశారు. అనుజ్ మరణించాక ప్రభుత్వం వారికి ఒక పెట్రోల్ బంక్ కేటాయిస్తుంది. కుటుంబ సభ్యులు ఇందుకు మొదట నిరాకరించినా కొడుకు స్మృతిని నిలబెట్టడానికి ఇదొక మార్గమని భావించి అందుకు అంగీకరిస్తుంది. అయితే అక్కడి నుంచే కథ మొదలవుతుంది. ప్రభుత్వం కేటాయించిన పెట్రోల్ బంక్ వాస్తవ రూపం దాల్చాలంటే ఎన్ని లంచాలు, ఎన్ని అడ్డంకులు, ఎన్ని అవమానాలు ఎదురవుతాయో ఈ సినిమా చూపిస్తుంది. చివరకు కుటుంబం పెట్రోల్ బంక్ సాధించి దానికి ‘కార్గిల్ హైట్స్’ అని పేరు పెడుతుంది. అమరుల రుణం తీర్చుకునే దారిలో ప్రభుత్వం, ΄ûరులు మరింత బాధ్యతతో వ్యవహరించాలని చెప్పే చిత్రం ఇది. ఓంపురి,రేవతి తారాగణం. -
PM Narendra Modi: పొలిమేరల నుంచే హెచ్చరిస్తున్నా...
ద్రాస్ (లద్దాఖ్): కార్గిల్ యుద్ధంలో చావుదెబ్బ తిన్నా పాకిస్తాన్‌కు ఇంకా బుద్ధి రాలేదంటూ ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఉగ్రవాదం ముసుగులో పరోక్ష యుద్ధాలతో ఇప్పటికీ కవి్వంపు చర్యలకు దిగుతోందని దుయ్యబట్టారు. 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా శుక్రవారం ఆయన లద్దాఖ్‌లో పర్యటించారు. ద్రాస్‌లోని కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అమర జవాన్లకు నివాళులరి్పంచారు. వారి కుటుంబీకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పాక్‌కు తీవ్ర హెచ్చరికలు చేశారు. ‘‘1999లో కార్గిల్ యుద్ధంలో మన సైనిక వీరుల శౌర్యం ముందు పాక్ ముష్కరులు మోకరిల్లారు. అయినా ఆ దేశం ఎన్నో వికృత యత్నాలకు పాల్పడింది. అవన్నీ దారుణంగా విఫలవుతున్నా గుణపాఠం నేర్వడం లేదు. పొలిమేరల నుంచి వారికి నేరుగా వినబడేలా హెచ్చరిస్తున్నా. ఉగ్ర మూకల దన్నుతో పన్నుతున్న ఇలాంటి కుట్రలు సాగవు. ముష్కరులను మన సైనిక దళాలు నలిపేస్తాయి. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించివేస్తాం’’ అన్నారు. పాతికేళ్ల కింద కార్గిల్ యుద్ధ సమయంలో ఓ సామాన్యునిగా సైనికుల మధ్య గడిపే అదృష్టం తనకు దక్కిందని మోదీ గుర్తు చేసుకున్నారు. భూతల స్వర్గమైన కశీ్మర్లో ఆరి్టకల్ 370 రద్దు తర్వాత శాంతిభద్రతలు నెలకొంటున్నాయన్నారు. సైనికులకు ఇవ్వాల్సిన పెన్షన్ నిధులను ఆదా చేసుకునేందుకే అగి్నపథ్ పథకం తెచ్చారన్న విపక్షాల విమర్శలను మోదీ తీవ్రంగా ఖండించారు. అది సైన్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు, నిత్యం యువ రక్తం ఉండేలా, సదా యుద్ధ సన్నద్ధంగా ఉండేలా చూసేందుకు తెచి్చన పథకమన్నారు. ‘‘వేల కోట్ల కుంభకోణాలతో సైన్యాన్ని బలహీనపరిచిన వాళ్లే ఇప్పుడిలా దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశంపై మతిలేని విమర్శలకు దిగడం సిగ్గుచేటు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌పై తప్పుడు వాగ్దానాలు చేసింది కూడా వారే. మేం విజయవంతంగా అమలు చేస్తున్నాం’’ అన్నారు. టన్నెల్లో మోదీ ‘బ్లాస్ట్’ లేహ్‌కు అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ బయటి ప్రపంచంతో సంబంధాలు కల్పించనున్న షింకున్ లా టన్నెల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వర్చువల్‌గా తొలి బ్లాస్ట్ చేసి పనులను ప్రారంభించారు. 15,800 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న ఈ ట్విన్ ట్యూబ్ టన్నెల్ పొడవు 4.1 కి.మీ. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న సొరంగంగా నిలవనుంది.‘విజయ్ దివస్’లో ముర్ము న్యూఢిల్లీ: విజయ్ దివస్ సందర్భంగా అమర జవాన్లకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఘనంగా నివాళులర్పించారు. ‘‘1999లో ఉగ్రవాదుల ముసుగులో కశ్మీర్ మంచుకొండల్లోకి చొరబడ్డ పాక్ సైన్యాన్ని మన సైనిక దళాలు అసమాన శౌర్య సాహసాలతో చావు దెబ్బ తీశాయి. ఆ క్రమంలో అమరుడైన ప్రతి సైనికునికీ శిరసు వంచి అభివాదం చేస్తున్నా’’ అని పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ తదితరులు కూడా నివాళులరి్పంచారు. మోదీపై విపక్షాల ధ్వజం సైన్యం కోరిన మీదటే అగ్నిపథ్ తెచ్చామంటూ మోదీ పచ్చి అబద్ధాలు చెప్పారని విపక్షాలు విమర్శించాయి. విజయ్ దివస్ ప్రసంగంలో కూడా అబద్ధాలు చెప్పి అమర జవాన్లను అవమానించారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. ఏ ప్రధానీ ఇలా దిగజారలేదంటూ ధ్వజమెత్తారు. ఈ పథకం ప్రస్తావనతో ఆశ్చర్యపోయామని నాటి ఆర్మీ చీఫే చెప్పారని కాంగ్రెస్ పేర్కొంది. సైన్యం సామర్థ్యాన్ని పెంచేందుకు, యువ రక్తం నింపేందుకు అగి్నపథ్ పథకం తెచ్చామనడం ద్వారా మన సైనికులను మోదీ ఘోరంగా అవమానించారని తృణమూల్ కాంగ్రెస్, శివసేన (యూబీటీ) తదితర పారీ్టలు దుయ్యబట్టాయి. -
అమర వీరులకు ప్రధాని మోదీ నివాళి
-
Kargil Vijay Diwas: 4 రోజులు.. 160 కి.మీ.లు
ముంబై: కార్గిల్ విజయ్ దివస్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్మీ మాజీ అధికారిణి సాహసోపేతమైన ఫీట్ చేశారు. లెఫ్టినెంట్ కల్నల్ వర్షారాయ్ 4 రోజుల్లో 160 కిలోమీటర్ల పరుగును పూర్తిచేశారు. రన్ జూలై 19న ప్రారంభమై జూలై 22న ముగిసింది. శ్రీనగర్ నుండి ద్రాస్ సెక్టార్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్ వరకు ఆమె సగటున రోజుకు 40 కి.మీ. పరుగెత్తారు. పరుగు పూర్తయిన సందర్భంగా కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులు అరి్పంచారు. ఆమెతో పాటు చినార్ వారియర్స్ మారథాన్ జట్టు కూడా ఉంది. లెఫ్టినెంట్ కల్నల్ వర్షా రాయ్ భర్త కశ్మీర్లో ఆర్మీ అధికారిగా ఉన్నారు. -
గెలవలేని యుద్ధం చేసిన పాక్
కార్గిల్ యుద్ధం జరిగి పాతికేళ్లవుతోంది. మే 3న పాక్ చొరబాట్లను మొదటిసారి కనుగొన్న తర్వాత, జూలై 26న భారత్ తన విజయాన్ని ప్రకటించ డానికి ముందు దాదాపు మూడు నెలలు నెత్తుటి యుద్ధం కొనసాగింది. 18,000 అడుగుల ఎత్తులో, ఎన్నో సవాళ్లతో కూడిన ఈ ప్రాంతంలో యుద్ధం అనేది సైన్యం లాఘవానికి నిజమైన పరీక్ష. అధికారులు, సైనికులు మానవాతీత దృఢత్వాన్ని ప్రదర్శించడం, దేశం కోసం ప్రాణాలు ధారపోయడానికి కూడా సిద్ధమైనందునే విజయం సాధ్యపడింది. భారత్‌కు వ్యతిరేకంగా పాక్ సైనిక పంథాను అనుసరించడం వల్ల ఎటువంటి లాభం లేదని కార్గిల్ విధ్వంసం గట్టిగా బయటపెట్టింది. స్థాయిలోనూ, విస్తృతిలోనూ పరిమితమే అయినప్పటికీ, కార్గిల్ రెండు దేశాలలో లోతైన విశ్లేషణను ప్రేరేపించింది.1999 ఫిబ్రవరి 20న, నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆహ్వానం మేరకు పాకిస్తాన్లో చరిత్రాత్మక దౌత్య పర్యటనకు బయలుదేరారు. మరుసటి రోజు, ఇద్దరు ప్రధానులు లాహోర్ డిక్లరేషన్ పై సంతకం చేశారు. రెండు దేశాల మధ్య శాంతి, స్థిరత్వం, తమ ప్రజల పురోగతి, శ్రేయస్సు గురించిన భాగస్వామ్య దార్శనికతను ఇరువురు నేతలూ ప్రతిబింబించారు.ఉద్రిక్తతలను పెంచిన 1998 అణు పరీక్షల ఛాయల నుండి ఉద్భవించిన ఈ ప్రకటన, సరిహద్దుకు ఇరువైపులా చక్కటి ప్రశంసలు పొందింది. అయితే విచారకరంగా, ఈ ఆశావాదం భ్రమగా మారింది. వాఘా సరిహద్దులో వాజ్‌పేయికి షరీఫ్ అభివాదం చేస్తున్నప్పుడే, పాకిస్తాన్ సైనికులు కార్గిల్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ)ను దాటి ప్రజల జ్ఞాపకాల్లో నిలిచిపోయిన టోలోలింగ్, టైగర్ హిల్ వంటి పర్వత శిఖరాల్లో కందకాలు తవ్వుతున్నారు.18,000 అడుగుల ఎత్తులో ఉన్న కార్గిల్ భౌగోళికపరంగా అసాధారణమైన సవాళ్లతో కూడినది. అటువంటి విపరీతమైన పరిస్థి తులలో యుద్ధం అనేది సైన్యం లాఘవానికి నిజమైన పరీక్ష. అయితే అధికారులు, సైనికులు మానవాతీత దృఢత్వాన్ని ప్రదర్శించడం, దేశం కోసం ప్రాణాలు ధారపోయడానికి కూడా సిద్ధమైనందునే విజయం సాధ్యపడింది.మే 3న పాక్ చొరబాట్లను ప్రాథమికంగా కనుగొన్న తర్వాత, జూలై 26న భారతదేశం విజయాన్ని ప్రకటించడానికి ముందు దాదాపు మూడు నెలల కాలం కార్గిల్‌లో నెత్తుటి యుద్ధం కొనసాగింది. పాకిస్తాన్ సైన్యం ఈ పోరాటంలో తన ప్రమేయాన్ని నిరాకరించింది, నేలకొరిగిన తన సైనికులను గుర్తించడానికి నిరాకరించింది. ఇది వారి త్యాగానికి అంతిమ అవమానం అని చెప్పాలి.స్థాయిలోనూ, భౌగోళిక విస్తృతిలోనూ పరిమితమే అయినప్ప టికీ, కార్గిల్ యుద్ధం రెండు దేశాలలో లోతైన వ్యూహాత్మక విశ్లేషణను ప్రేరేపించింది. వేసుకున్న లెక్కలు తప్పడంపై పాక్‌లోనూ; నిఘా వైఫల్యం కారణంగా చొరబాట్లను గుర్తించలేక పోవడంతో సహా, జాతీయ భద్రతా అంతరాలపై భారత్‌లోనూ పెద్ద చర్చ జరిగింది.యుద్ధం ముగిసిన మూడు రోజుల తర్వాత, పాకిస్తాన్ దురాక్ర మణకు దారితీసిన సంఘటనలను సమీక్షించడానికీ, సాయుధ చొర బాట్లకు వ్యతిరేకంగా జాతీయ భద్రతను కాపాడే చర్యలను సిఫార్సు చేయడానికీ భారత ప్రభుత్వం కార్గిల్ సమీక్షా కమిటీ (కేఆర్సీ)ని ఏర్పాటు చేసింది. రాజకీయ, అధికార, సైనిక, నిఘా సంస్థలు యథా తథ స్థితిపై స్వార్థ ఆసక్తిని పెంచుకున్నాయని ఈ కమిటీ పేర్కొంది. కార్గిల్ అనుభవం, కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం, అణుబాంబుతో కూడిన భద్రతా వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుని జాతీయ భద్రతా వ్యవస్థపై సమగ్ర సమీక్ష అవసరమని కమిటీ నొక్కి చెప్పింది.కేఆర్‌సీని అనుసరించి వచ్చిన మంత్రుల బృందం నివేదిక, జాతీయ భద్రతా సమస్యలపై స్వతంత్ర భారతదేశంలో చేపట్టిన అత్యంత సమగ్ర పరిశీలన అని చెప్పవచ్చు. గూఢచార యంత్రాంగం, అంతర్గత భద్రత, సరిహద్దు నిర్వహణ. రక్షణ నిర్వహణను అంచనా వేయడానికి నాలుగు టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేశారు.ఈ రెండు నివేదికలు జాతీయ భద్రతా నిర్వహణలో అనేక మార్పులకు దారితీశాయి. కేంద్రీకృత కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్‌ను నిర్వహించడానికి 2004లో జాతీయ సాంకేతిక పరిశోధనా సంస్థను ఏర్పర్చారు. సైన్యం నిర్దిష్ట గూఢచార అవసరాలను తీర్చడానికి రక్షణ నిఘా సంస్థ ఏర్పడింది. మెరుగైన ఇంటర్–ఏజెన్సీ సమాచారం భాగస్వామ్యాన్ని, సమన్వయాన్ని పెంపొందించడానికి బహుళ ఏజెన్సీ కేంద్రం కూడా ఏర్పాటయింది. రక్షణ వ్యవస్థ కొంత పునర్ని ర్మాణానికి గురైంది. ఇందులో సమీకృత రక్షణ సిబ్బందిని ఏర్పాటు చేయడం, వ్యూహాత్మక బలగాలు, అండమాన్ నికోబార్ కమాండ్ల స్థాపన, త్రివిధ బలగాలకు ఆర్థిక, పరిపాలనా అధికారాలు పంపిణీ చేయడం వంటివి ఉన్నాయి. మంత్రుల బృందం సిఫార్సు చేసిన విధంగా 2020లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకం జరిగింది.కొన్ని సిఫార్సులు పాక్షికంగా మాత్రమే అమలైనాయి. ‘ఒకే సరి హద్దులో అనేక బలగాలు ఉండటం కూడా బలగాల జవాబు దారీతనం లోపానికి దారితీసిం’దని మంత్రుల బృందం నివేదిక పేర్కొంది. ‘జవాబుదారీతనాన్ని తేవడానికి, సరిహద్దు వద్ద బలగాల మోహరింపును పరిగణనలోకి తీసుకునేటప్పుడు ‘ఒక సరిహద్దు, ఒక బలగం’ సూత్రాన్ని అవలంబించవచ్చు’ అని సూచించింది. ఈ సూత్రాన్ని ఇంకా చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ దగ్గర వర్తింపజేయాల్సే ఉంది. ఇక్కడ భారత సైన్యం, ఇండో–టిబెటన్ సరిహద్దు పోలీసులు వేర్వేరు కమాండ్ ఏర్పాట్లలో మోహరించారు.జాతీయ భద్రతా సిద్ధాంతం లేకపోవడం, ఆర్థిక సంవత్సరానికి మించి సైన్యానికి నిధుల నిబద్ధత లేకపోవడం వంటి బలహీనతలను మంత్రుల బృందం ఎత్తి చూపింది. పరిష్కరించాల్సిన ఇతర సమస్యలు ఏవంటే, త్రివిధ బలగాల హెడ్‌క్వార్టర్స్‌ను ప్రభుత్వంలో మరింతగా ఏకీకృతం చేయడం, సాయుధ దళాలు ఉమ్మడిగా ఉండటం. ఇప్పటికీ ఈ లోటుపాట్లు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ వైపు కూడా, కార్గిల్ పరాజయంపై చాలా బహిరంగ చర్చ జరిగింది. ఆ యుద్ధం పౌర–సైనిక సంబంధాల వక్ర స్వభావాన్ని బహిర్గతం చేసింది. సైనిక లక్ష్యాలను రాజకీయ, దౌత్యపరమైన పరిశీలనలు లేకుండా రూపొందించారు. నసీమ్ జెహ్రా రాసిన ‘ఫ్రమ్ కార్గిల్ టు ది కూ’ పుస్తకంలో, మే 17న సైన్యం అప్పటి ప్రధాని షరీఫ్‌కు కార్గిల్ సైనిక చర్యపై తొలి వివరణాత్మక సమాచారాన్ని అందించిందని రాశారు. ఆ సమయానికి, సైనికులు అప్పటికే నియంత్రణ రేఖ వెంబడి స్థానాలను ఆక్రమించారు.యుద్ధం తరువాత, దానికి పన్నాగం పన్నిన జనరల్స్ పాత్ర పరిశీలనలోకి రావాలి. దీనికి బదులుగా, పాకిస్తాన్ సైన్యం రాజకీయ నాయకత్వానికి నిందను ఆపాదించడానికి ప్రయత్నించింది. పెరుగుతున్న ఈ అపనమ్మకం చివరకు 1999 అక్టోబర్‌లో షరీఫ్‌ను అధికారం నుండి తొలగించిన సైనిక కుట్రకు దారితీసింది.భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ సైనిక పంథాను ఉపయోగించడం వల్ల ఎటువంటి లాభం లేదని కార్గిల్ విధ్వంసం గట్టిగా బయట పెట్టింది. భారత్‌తో ఉద్రిక్తతలను తగ్గించడానికి మార్గాలను కనుగొనే బదులు, పాకిస్తాన్ సైన్యం వెనక్కితగ్గి ఉగ్రవాదులను ఉపయోగించింది. యుద్ధం తర్వాత జమ్మూకశ్మీర్‌లో హింస పెరిగింది. కశ్మీర్‌పై మక్కువ పెంచుకోవడం మానుకోవాలనీ, బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణంపై పాకిస్తాన్ దృష్టి పెట్టాలనీ పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. దేశం తన పరిమితులు, ప్రాధాన్యతల గురించి నిర్దాక్షిణ్యంగా వాస్తవికంగా మారాలని పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త షాహిద్ అమీన్ రాశారు. ఏమైనప్పటికీ, పాకిస్తాన్‌ను గెలవలేని సంఘర్షణలోకి నెట్టిన ప్రధాన సమస్యలు పెద్దగా పరిష్కారం కాలేదు. సైన్యం ఇప్ప టికీ దేశ పగ్గాలను నియంత్రిస్తోంది. కశ్మీర్‌పై వాగాడంబరం కొనసాగు తోంది. ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. పైగా, ఉగ్రవాద సంస్థ లకు పాక్ ప్రభుత్వ మద్దతు కొనసాగుతోంది.నేడు, భారతదేశం చాలా శక్తిమంతమైన దేశం. ఇప్పుడు కార్గిల్ తరహా ఘటన అసంభవంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, 1999 సంఘర్షణ పాకిస్తాన్ రాజ్యయంత్రాంగపు నిర్లక్ష్య స్థాయిని వెల్లడి చేసింది. ఆ దేశంలోని ప్రస్తుత పరిస్థితులు ఆ ముద్రను తొలగించ డానికి పెద్దగా అనుకూలించవు.లెఫ్ట్‌నెంట్ జనరల్ డీఎస్ హుడా (రిటైర్డ్) వ్యాసకర్త మాజీ నార్తర్న్ ఆర్మీ కమాండర్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
Lok sabha elections 2024: వాజ్‌పేయి మేజిక్
ప్రాంతీయ పార్టీల దన్ను లేనిదే సంపూర్ణ ఆధిక్యం అసాధ్యమని గుర్తించిన బీజేపీ 13వ లోక్‌సభ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. 20కి పైగా పార్టీలను నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) గూటి కిందకు తెచ్చి మెజారిటీ సాధించింది. సొంత బలం పెరగకున్నా భాగస్వాముల సాయంతో మళ్లీ అధికారంలోకి వచ్చి దేశాన్ని ఐదేళ్లూ విజయవంతంగా పాలించింది. కాంగ్రెస్ మాత్రం అంతర్గత సంక్షోభంతో బాగా దెబ్బ తిన్నది..1998 ఎన్నికల తర్వాత బీజేపీ ఏర్పాటు చేసిన నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) జాతీయ రాజకీయాల్లో పార్టీ గ్రాఫ్ బలపడేందుకు దోహదపడింది. దీనికి వాజ్‌పేయి తొలి చైర్మన్ కాగా జార్జ్ ఫెర్నాండెజ్ కనీ్వనర్. బీజేపీతో పాటు జేడీ (యూ), శివసేన, టీడీపీ, జేడీ(ఎస్) కూటమిలో ముఖ్ పార్టీలుగా ఉన్నాయి. 1999 లోక్‌సభ ఎన్నికలు సెపె్టంబర్ 5 నుంచి అక్టోబర్ 3 దాకా ఐదు దశల్లో జరిగాయి.కార్గిల్ యుద్ధం, ఫోఖ్రాన్ అణు పరీక్షలు బీజేపీకి బాగా కలిసొచ్చాయి. వాజ్‌పేయి చరిష్మా కూడా తోడై ఎన్డీఏకు 298 స్థానాలు దక్కాయి. 1984 తర్వాత ఏ పార్టీకైనా, సంకీర్ణానికైనా లోక్‌సభలో మెజారిటీ దక్కడం అదే తొలిసారి. బీజేపీకి 182 సీట్లొస్తే కాంగ్రెస్ 114తో పరిమితమైంది.సీపీఎం 33, టీడీపీ 29, సమాజ్‌వాదీ 26, జేడీయూ 21 సీట్లు గెలుచుకున్నాయి. సీపీఐకి కేవలం నాలుగు సీట్లే రావడంతో జాతీయ పార్టీ హోదా కోల్పోయింది! ఫలితాల అనంతరం డీఎంకే వంటి మరిన్ని పార్టీలు చేరడంతో ఎన్డీఏ కూటమి మరింత బలపడింది. అక్టోబర్ 13న ప్రధానిగా వాజ్‌పేయి మూడోసారి ప్రమాణం చేశారు. మొత్తమ్మీద 1996 నుంచి 1999 మధ్య మూడేళ్లలో లోక్‌సభకు ఏకంగా మూడుసార్లు ఎన్నికలు జరగడం విశేషం!కాంగ్రెస్‌లో సంక్షోభంకాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ బాధ్యతలు స్వీకరించిన ఏడాదికే పార్టీలో ముసలం మొదలైంది. జన్మతః విదేశీయురాలైన సోనియాను ప్రధాని అభ్యరి్థగా అంగీకరించేందుకు సీనియర్ నేతలు శరద్ పవార్, పీఏ సంగ్మా, తారిఖ్ అన్వర్ తీవ్రంగా వ్యతిరేకించారు. కలత చెందిన సోనియా రాజీనామా చేశారు. కాంగ్రెస్ ఆమెకు మద్దతుగా నిలిచింది.కార్యకర్తలు నిరసనలు, నిరాహార దీక్షలతో హోరెత్తించారు. చివరికి 1999 మే 20న పవార్, సంగ్మా, అన్వర్‌పై కాంగ్రెస్ బహిష్కరణ వేటు వేసింది. దాంతో సోనియా రాజీనామాను వెనక్కు తీసుకుని పార్టీ సారథిగా కొనసాగారు. ఈ పరిణామం ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారింది. బీజేపీ ‘స్వదేశీ వాజ్‌పేయి – విదేశీ సోనియా’ నినాదాన్ని ఎత్తుకుంది. సోనియా అధ్యక్షతన కాంగ్రెస్‌కు అవే తొలి ఎన్నికలు.పవార్ సొంత పార్టీసోనియాగాంధీ విదేశీయతను ప్రశ్నించి కాంగ్రెస్ నుంచి బయటకు వచి్చన శరద్‌పవార్, పీఏ సంగ్మా, తారిఖ్ అన్వర్ జూన్ 10న నేషనలిస్ట్ కాంగ్రెస్ పేరిట సొంత పార్టీ పెట్టుకున్నారు. తొలి ఎన్నికల్లోనే 2.27 శాతం ఓట్లతో 8 స్థానాలను కైవసం చేసుకున్నారు. గుజరాత్ అల్లర్లునరేంద్ర మోదీ పాలనలోని గుజరాత్లో 2002 ఫిబ్రవరిలో చెలరేగిన మత ఘర్షణలతో వాజ్‌పేయి సర్కారు బాగా అప్రతిష్టపాలైంది. సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు అల్లరి మూకలు నిప్పంటించడంతో అయోధ్య నుంచి తిరిగొస్తున్న 59 మంది హిందూ భక్తులు మరణించారు. తర్వాత నెల పాటు చెలరేగిన హింసలో వెయ్యి మందికి పైనే చనిపోయారు. ఈ హింసాకాండను వాజ్‌పేయి ఖండించినా దాన్ని అరికట్టలేదన్న అపవాదు మూటగట్టుకున్నారు.విశేషాలు...► ప్రధానిగా వాజ్‌పేయి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్వర్ణ చతుర్భుజి పేరిట హైవేలను విస్తరించారు. ప్రధాని గ్రామీణ్ సడక్ యోజనతో రూరల్ రోడ్లకు అక్షరాలా మహర్దశ పట్టింది.► టెలికం సేవల విస్తరణకు కీలక అడుగులు పడ్డాయి. లైసెన్స్ ఫీజుల స్థానంలో ఆదాయ పంపిణీ విధానం ప్రవేశపెట్టారు. 2000 సెపె్టంబర్ 15న బీఎస్ఎన్ఎల్ను ఏర్పాటు చేశారు.► ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ విభాగం ఏర్పాటైంది. బాల్కో, హిందుస్థాన్ జింక్, ఐపీసీఎల్, వీఎస్ఎన్ఎల్ వంటి అగ్రగామి కంపెనీలను ప్రైవేటీకరించారు.►పెట్రోలియం ధరలపై నియంత్రణ ఎత్తేయడానికి వాజ్‌పేయి సర్కారే బీజం వేసింది.13వ లోక్‌సభలో పార్టీల బలాబలాలు(మొత్తం స్థానాలు 543) పార్టీ స్థానాలు బీజేపీ 182కాంగ్రెస్ 114సీపీఎం 33టీడీపీ 29సమాజ్‌వాదీ 26జేడీ(యూ) 21శివసేన 15బీఎస్పీ 14ఇతరులు 109 – సాక్షి, నేషనల్ డెస్క్ -
Kargil Vijay Diwas: ఘర్ మే ఘుస్ కే...
ద్రాస్ (లద్దాఖ్): భారత్ తన గౌరవ ప్రతిష్టలను కాపాడుకోవడానికి నియంత్రణ రేఖను దాటడానికి సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అలాంటి పరిస్థితి వస్తే సైనికులకు సహకారం అందించడానికి పౌరులందరూ సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి 24 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం దేశమంతా విజయ్ దివస్ జరుపుకుంది. ద్రాస్‌లోని కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో రాజ్‌నాథ్ మాట్లాడుతూ రష్యా, ఉక్రెయిన్ మధ్య ఏడాది దాటినా ఇంకా యుద్ధం కొనసాగుతోందని అంటే పౌరులు భాగస్వాములు కావడం వల్లేనని అభిప్రాయపడ్డారు. పొరుగుదేశమైన పాకిస్తాన్ కవి్వంపు చర్యల్ని పరోక్షంగా ప్రస్తావించిన ఆయన మన దేశ గౌరవాన్ని, మర్యాదని కాపాడుకోవడానికి ఎంత తీవ్రమైన చర్యలకైనా దిగుతామని హెచ్చరించారు. పొరుగుదేశం రెచ్చగొట్టే చర్యలకి దిగితే నియంత్రణ రేఖ దాటుతామన్నారు. ‘‘మన దేశంలో యుద్ధం పరిస్థితులు వస్తే సైనిక బలగాలకు ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారు. పరోక్షంగా తమ సహకారాన్ని అందిస్తారు. ఈ సారి అవసరమైతే ప్రత్యక్షంగా యుద్ధభూమిలో పాల్గొనాలని, దానికి తగ్గట్టు మానసికంగా సంసిద్ధులు కావాలని కోరుతున్నాను’’ అని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. దేశ ప్రయోజనాలను కాపాడుకునే అంశంలో మన సైన్యం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కార్గిల్ యుద్ధం సమయంలో భారత ఆర్మీ పాకిస్తాన్కేకాక యావత్ ప్రపంచానికి సందేశం పంపించిందన్నారు. పాకిస్తాన్ మనకి వెన్నుపోటు పొడవడంతో కార్గిల్ యుద్ధం వచి్చందన్నారు. అంతకు ముందు కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ల సమాధుల్ని సందర్శించి పుష్ఫగుచ్ఛాలుంచి నివాళులరి్పంచారు. ప్రధాని నివాళులు కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు రాష్టపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ , కేంద్ర మంత్రులు, ఇతర నాయకులు నివాళులర్పించారు. విజయ్ దివస్ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ట్వీట్ చేశారు. ‘‘మన దేశ సైనికుల అపూర్వమైన విజయాన్ని దేశం గుర్తు చేసుకుంటోంది. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన అమరులందరికీ నివాళులరి్పస్తున్నాను. దేశం కోసం త్యాగం చేసిన వారి గాథలన్నీ తరతరాలకు స్ఫూర్తి దాయకం’’ అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ప్రధాని మోదీ తన ట్వీట్లో కార్గిల్ విజయ్ దివస్ భారత వీరుల ధైర్య గాథల్ని గుర్తు చేస్తుందని, ప్రజలందరికీ వారు స్ఫూర్తిదాయకంగా నిలిచారని పేర్కొన్నారు. అమరులందరికీ హృదయపూర్వక నివాళులరి్పస్తున్నట్టుగా పేర్కొన్నారు. 1999లో కార్గిల్‌ను ఆక్రమించిన పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొట్టి భారత్ విజయ దుందుభి మోగించింది. -
కరడుగట్టిన సైనిక నియంత.. ‘కార్గిల్’ విలన్
భారత గడ్డపై పుట్టి, కార్గిల్ యుద్ధంతో మనల్ని దొంగదెబ్బ తీసిన తెంపరి ముషారఫ్! కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ అంశంగా మార్చడానికే అందుకు తెగించినట్టు తన ఆత్మకథ ‘ఇన్ ద లైన్ ఆఫ్ ఫైర్’లో రాసుకున్నారు కూడా. నాటి ప్రధాని నవాజ్ షరీఫ్‌కు కూడా తెలియకుండా ముషారఫ్ స్వయంగా పథక రచన చేసిన కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్‌కు ఘోర పరాభవం మిగిలింది. 1999 మే 3న మొదలైన యుద్ధం జూలై 26న ముగిసింది. భారత్ 527 మంది సైనికులను కోల్పోగా 4,000 మందికిపైగా పాక్ జవాన్లు హతమయ్యారు. ఢిల్లీలో పుట్టి... పర్వేజ్ ముషారఫ్ 1943 ఆగస్టు 11న నాటి ఉమ్మడి భారతదేశ రాజధాని ఢిల్లీలో సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. మాతృ భాష ఉర్దూ. 1947లో దేశ విభజనతో ఆయన కుటుంబం పాకిస్తాన్‌లోని కరాచీకి తరలివెళ్లింది. తండ్రి సయీద్ ముషారఫుద్దీన్ ఉద్యోగరీత్యా ముషారఫ్ 1956 దాకా టర్కీలో ఉన్నారు. తర్వాత కరాచీ, లాహోర్లలో చదువుకున్నారు. 1961లో పాకిస్తాన్ మిలటరీ అకాడమీలో చేరారు. 1964లో ఆర్టిలరీ రెజిమెంట్‌లో అడుగుపెట్టారు. 1971లో కంపెనీ కమాండర్‌గా భారత్–పాక్ యుద్ధంలో పాల్గొన్నారు. తర్వాత సైన్యంలో అంచెలంచెలుగా ఎదిగారు. 1998లో నాటి ప్రధాని నవాజ్ షరీఫ్ ఆయన్ను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా నియమించారు. ‘జాయింట్ చీఫ్స్ స్టాఫ్ కమిటీ’ చైర్మన్‌గా 1999 ఏప్రిల్ 9న అదనపు బాధ్యతలు సైతం అప్పగించారు. నియంత పాలన పాక్, భారత్ ప్రధాన మంత్రులు షరీఫ్, వాజ్‌పేయి మధ్య 1999 ఫిబ్రవరి 21న చరిత్రాత్మక లాహోర్ శాంతి ఒప్పందం కుదిరిన కొన్ని నెలలకే కార్గిల్ యుద్ధానికి ముషారఫ్ తెగబడ్డారు. దీనిపై ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొన్నారు. తనను తొలగించేందుకు నవాజ్ షరీఫ్ ప్రయత్నించడంతో 1999 అక్టోబర్‌లో సైనిక కుట్రతో ఆయన్ను గద్దె దింపారు. పాకిస్తాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ప్రకటించుకుని పాలకునిగా మారారు. 2001లో దేశాధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. తొమ్మిదేళ్లపాటు పాలించారు. ఉగ్రవాదంపై యుద్ధం పేరిట అమెరికాతో చేతులు కలిపారు. మితవాద, ప్రగతిశీల ఇమేజీ కోసం ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలను నిషేధించి వాటి ఆగ్రహానికి గురయ్యారు. ముషార్రఫ్‌పై పలుమార్లు హత్యాయత్నాలూ జరిగాయి. 2008లో తప్పనిసరిగా పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తానని ప్రకటించారు. ఎన్నికల తర్వాతి పరిణామాల్లో రాజీనామా చేసి దుబాయ్ పారిపోయారు. 2013 మార్చిలో తిరిగొచ్చి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నించినా అనర్హత వేటు పడింది. నవాజ్ గెలిచాక ముషార్రఫ్‌పై మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య సహా పలు కేసులు నమోదయ్యాయి. 2019లో ప్రత్యేక కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘లోక్మత్’ ఆధ్వర్యంలో.. కార్గిల్ స్మారక భవనం
ద్రాస్ (లదాఖ్): జమ్మూ కశ్మీర్‌లోని ద్రాస్ సెక్టర్లో లోక్మత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన కార్గిల్ స్మారక భవనాన్ని జవాన్లకు అంకితం చేశారు. కార్గిల్ యుద్ధ విజయానికి గుర్తుగా నిర్మించిన కార్గిల్ వార్ మెమోరియల్ రక్షణ విధుల్లో ఉండే జవాన్ల సౌకర్యార్థం లోక్మత్ మీడియా గ్రూప్ దీన్ని నిర్మించింది. పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ పద్ధతుల్లో నిర్మించిన ఈ భవనాన్ని లోక్మత్ మీడియా ఎడిటోరియల్ గ్రూప్ చైర్మన్, మాజీ ఎంపీ విజయ్ దర్దా చేతుల మీదుగా జవాన్లకు అంకితం చేశారు. గడ్డ కట్టించే చలిలో స్మారక పరిరక్షణ విధుల్లో ఉండే జవాన్లకు ఈ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా దర్గా ఆశాభావం వెలిబుచ్చారు. కార్యక్రమంలో లెఫ్టినెంట్ జనరల్ అనింద్య సేన్‌గుప్తా, మేజర్ జనరల్ నాగేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: ‘మేమూ ‘యోగి’ స్టైల్లోనే వెళ్తాం’.. బీజేపీ నేత హత్యపై సీఎం హెచ్చరిక! -
రియల్ హీరో.. యే దిల్ మాంగే మోర్!
నాయకుడంటే.. ఏదో ముందుండి నడిపిస్తున్నాడనే పేరుంటే సరిపోదు. లక్ష్యసాధనలో తన వెనకున్న వాళ్లకు సరైన దిశానిర్దేశం చేయాలి. విజయం కోసం అహర్నిశలు కృషి చేయాలి. అవసరమైతే తెగువను ప్రదర్శించాలి.. త్యాగానికి సిద్ధపడాలి. ఇది మిగతా వాళ్ల గుండెల్లో ధైర్యం నింపుతుంది. గెలుపు కోసం చివరిదాకా పోరాడాలనే స్ఫూర్తిని కలగజేస్తుంది. కార్గిల్ వార్‌లో అసువులు బాసిన వీరులెందరో. అందులో కెప్టెన్ విక్రమ్ బాత్రా ప్రముఖంగా వినిపిస్తుంటుంది. కారణం.. పైన చెప్పిన లక్షణాలన్నీ ఆయన ప్రతిబింబించారు కాబట్టి. అన్నట్లు ఇవాళ ఈ కార్గిల్ అమరవీరుడి జయంతి. ఈ సందర్భంగా ఆ రియల్ హీరోను స్మరించుకుంటూ... ►హిమాచల్ ప్రదేశ్ పాలంపూర్ జిల్లా ఘుగ్గర్ గ్రామంలో 1974 సెప్టెంబర్ 9న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించారు. ► చదవులోనే కాదు.. ఆటపాటల్లోనూ రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా పేరు సంపాదించుకున్నారు. ► విక్రమ్ బాత్రా చిన్నప్పటి నుంచే ధైర్యశాలి. కరాటేలో గ్రీన్ బెల్ట్ హోల్డర్. టేబుల్ టెన్నిస్ నేషనల్ లెవల్లో ఆడారు. ► నార్త్ ఇండియా ఎన్సీసీ కాడెట్(ఎయిర్ వింగ్) నుంచి ఉత్తమ ప్రదర్శన అవార్డు సైతం అందుకున్నారు ► డిగ్రీ అయిపోగానే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ల కోసం ప్రిపేర్ అయ్యారు. ► 1996లో ఆయన కల నెరవేరింది. ఇండియన్ మిలిటరీ ఆకాడమీలో చేరారు. ► విక్రమ్ బాత్రా.. మన్నెక్షా బెటాలియన్‌కి చెందిన జెస్సోర్ కంపెనీ(డెహ్రాడూన్)లో చేరి, ఆపై లెఫ్టినెంట్‌గా, అటుపై కెప్టెన్ హోదాలో కార్గిల్ హోదాలో అడుగుపెట్టారు. ► డేరింగ్ అండ్ డాషింగ్ ఆటిట్యూడ్ ఉన్న విక్రమ్‌ను తోటి సభ్యులుగా ముద్దుగా షేర్షా అని పిల్చుకునేవాళ్లు ► గాంభీర్యంగా పైకి కనిపించే బాత్రా చాలా సరదా మనిషి. ఆయన చిరునవ్వే ఆయనకు అందమని చుట్టుపక్కల వాళ్లు చెప్తుంటారు ► ఆయన నోటి నుంచి ఓ ఇంటర్వ్యూలో వచ్చిన ‘యే దిల్ మాంగే మోర్’ డైలాగ్.. తర్వాతి కాలంలో పెద్ద బ్రాండ్‌కి ప్రచార గేయం అయ్యిందని చెప్తుంటారు కొందరు. అందులో నిజమెంతో గానీ.. ఆయన నుంచి మాత్రం ఆ మాట వచ్చిన విషయం వాస్తవం. ► కార్గిల్ వార్‌లో వేల అడుగుల ఎత్తున శత్రువులు సైతం ఊహించని మెరుపుదాడికి సిద్ధమయ్యారు ► దాడిలో తీవ్రంగా గాయపడ్డా కూడా శత్రువులకు వెన్నుచూపెట్టలేదు ఆయన. ముగ్గురు శత్రువుల్ని మట్టుబెట్టిన మరీ 24 ఏళ్లకు దేశం కోసం వీరమరణం పొందారు. ఆ పోరాటం మిగతా వాళ్లలో స్ఫూర్తిని విజయ బావుటా ఎగరేయించింది. ► మరణాంతరం పరమ వీర చక్రతో పాటు రియల్ హీరోల జాబితాలో చోటుసంపాదించుకుని యావత్ దేశం నుంచి గౌరవం అందుకున్నారాయన. ► డిగ్రీ టైంలో డింపుల్ ఛీమాతో నడిచిన ప్రేమ కథ.. విక్రమ్ వీరమరణంతో పెళ్లి పీటలు ఎక్కకుండానే విషాదంగా ముగిసింది. అంతా బలవంతం పెట్టినా విక్రమ్ జ్ఞాపకాలతో ఉండిపోవాలనుకుని ఆమె వివాహం చేసుకోలేదు. ‘రక్త్ సింధూర్’ ప్రేమ కథగా విక్రమ్-డింపుల్ కథ చరిత్రలో నిలిచిపోయింది. విక్రమ్ పుట్టినరోజు, మరణించిన రోజు డింపుల్ తప్పకుండా విక్రమ్ ఇంటికి వెళ్లి.. ఆయన పేరెంట్స్‌తో కాసేపు గడుపుతుంటుంది కూడా. ► రీసెంట్గా సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా వచ్చిన షేర్షా.. ఈయన జీవిత కథ ఆధారంగానే తీసింది. ఇందులో డింపుల్ పాత్రను కియారా అద్వానీ పోషించింది. Heartfelt Tributes to great patriot Param Vir Chakra Captain #VikramBatra on his birth anniversary. He’s an epitome of courage, sacrifice and bravery. His exemplary bravery and valour would always inspire the Nation. #AmritMahotsav pic.twitter.com/2QDQWoYI1n — Ministry of Culture (@MinOfCultureGoI) September 9, 2021 - సాక్షి, స్పెషల్ డెస్క్ -
ఆ సీన్ చూసి వెక్కి వెక్కి ఏడ్చిన హీరోయిన్, వీడియో వైరల్
సాక్షి,ముంబై: హీరోయిన్ కియారా అద్వానీ తన సినిమా చూసి తనే వెక్కి వెక్కి ఏడ్చిన ఘటన వైరల్‌గా మారింది. కార్గిల్ వార్ హీరో కెప్టెన్ విక్రమ్ భాత్రా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘షేర్షా’ సినిమాలోని క్లైమాక్స్ సీన్లను చూస్తూ ఉద్వేగంతో విలపించింది. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుడు విక్రమ్ బాత్రా అంత్యక్రియల సన్నివేశాన్ని చూస్తూ ఆమె భావోద్వేగానికి లోనైంది. ఈ వీడియోను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీంతో ఫ్యాన్స్ కూడా అదే ఫీలింగ్‌ను క్యారీ చేస్తూ కామెట్ చేస్తున్నారు. నిజంగా ఇది చాలా ఎమోషనల్ సీన్ అని కొందరు, ‘నేను కూడా ఈ సన్నివేశంలో చాలా ఏడ్చేశాను" అని మరొకరు వ్యాఖ్యానించారు. సినిమా తరువాత తాను కెప్టెన్ బాత్రా కుటుంబాన్ని కలిశానని, తాను అచ్చం డింపుల్‌లా ఉన్నానని చెప్పడంతో తనకు కన్నీళ్లొచ్చాయని కియారా ఇటీవల ఒక మీడియా ఇంటర్వ్యూలో తెలిపింది. అలాగే నిజజీవిత డింపుల్‌తో కూడా మాట్లాడాననీ, షేర్షా మూవీలోని పాటలు ఆమెను బాగా ఆకట్టుకున్నాయని కూడా చెప్పారు. విక్రమ్ మరణం తరువాత అవివాహితగానే ఉండిపోయిన డింపుల్ చీమా చండీగఢ్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారని కియార్ తెలిపారు. కాగా 25 ఏళ్ల ప్రాయంలోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన దివంగత కెప్టెన్ విక్రమ్ బాత్రా పాత్రలో సిద్దార్థ్ మల్హోత్రా నటించగా, అతని ప్రేయసి డింపుల్ చీమాగా కైరా నటించింది. విక్రమ్ చనిపోయిన తరువాత డింపుల్ పెళ్లి చేసుకోకుండా జీవితాన్ని గడిపేయడం, స్నేహితుడు సన్నీ న్యాయవాది వృత్తిలో కొనసాగడం వంటివి ఈ మూవీలో హైలెట్‌గా నిలిచాయి. విక్రమ్ చేసిన త్యాగానికి గానూ ప్రభుత్వం పరమవీర చక్ర అవార్డుతో సత్కరించిన దృశ్యాలను కూడా చూపించారు. మరీ ముఖ్యంగా ఉగ్రవాదుల దాడి, కార్గిల్ యుద్ధ సన్నివేశాలు లాంటి దృశ్యాలతో పాటు, విక్రమ బాత్రా అంత్యక్రియల వరకూ చాలా ఎమోషన్‌ల్‌గా తీర్చిదిద్దిన దర్శకుడు విష్ణువర్ధన్ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు షేర్షాకు లభించిన అపూర్వ స్పందన, నెటిజన్ల ప్రేమకు నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా సంతోషం వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by kiaraadvani_forever (@kiaraadvani_forever) -
కార్గిల్ విజయ్ దివాస్: సైనికుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరువదు
న్యూఢిల్లీ: కార్గిల్ విజయ్ దివాస్‌ను పురస్కరించుకుని, దేశం కోసం అమరులైన సైనికులకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలు ఘన నివాళులు అర్పించారు. వీరి త్యాగాలు మరువలేనివని, దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన అమర వీరుల్ని భారతజాతి ఎప్పటికీ గుర్తించుకుంటుందని రామ్‌నాథ్, మోదీలు కొనియాడారు. కాగా, కార్గిల్ విజయ్ దివాస్ 21 వార్షికోత్సవ వేడుకలను సోమవారం ద్రాస్‌లో నిర్వహించారు. దీనికి మొదట దేశ ప్రథమ పౌరుడు రామ్‌నాథ్ కోవింద్ ద్రాస్ సెక్టార్‌కు వెళ్లాల్సి ఉండగా, పర్యటన చివరి నిముషంలో రద్దయింది. వాతావరణం పరిస్థితుల కారణంగా పర్యటన రద్దయినట్లు ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా, భారత ప్రధాని నరేంద్రమోదీ నిన్న(ఆదివారం) జరిగిన మన్‌కీ బాత్ కార్యక్రమంలో దేశం కోసం అసువులు బాసిన సైనికులను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా, అమరుల త్యాగాలను ఈ దేశం ఎప్పటికీ మరువదని ట్విట్టర్ వేదికగా సైనికుల ధైర్యసాహసాలను కొనియాడారు. అదే విధంగా, భారత్ హోంమంత్రి అమిత్‌షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావత్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. అమరులైన సైనికులకు తమ ఘనమైన నివాళులు అర్పించారు. వారు చేసిన ధైర్యసాహాసాలను గుర్తుచేసుకున్నారు. అదే విధంగా, ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక స్థూపంవద్ద రక్షణ శాఖ సహయ మంత్రి అజయ్ భట్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా, నేవీ వైస్‌చీఫ్ అడ్మిరల్ జి.అశోక్ కుమార్ నివాళులు అర్పించారు. కార్గిల్ యుధ్దం రక్షణ దళాల శౌర్యం, క్రమశిక్షణకు చిహ్నం అని అన్నారు. కాగా, వారి ధైర్యం, త్యాగానికి సెల్యూట్ తెలిపారు. కాగా, జూలై 26, 1999లో దాయాది పాకిస్తాన్ మన దేశాన్ని ఆక్రమించాలని.. ఎల్ఓసీ వద్ద భారత్ భూభాగంలో ప్రవేశించాయి. ఈ క్రమంలో భారత సైనికులకు, పాక్ ముష్కరులకు మధ్య భీకర యుద్ధం జరిగింది. అయితే, ఈ యుద్ధంలో భారత భద్రతా దళాలు, పాకిస్తాన్ ముష్కరులను సమర్థవంతంగా ఎదుర్కొని మట్టికరిపించిన సంగతి తెలిసిందే.ఈ యుద్ధంలో భారత సైనికులు చాలా మంది మృతి చెందారు. ఈ క్రమంలో.. దేశం కోసం తమ ప్రాణాలు అర్పించిన సైనికులను గుర్తుచేసుకుంటూ ప్రతి ఏడాది జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్‌ను ఆపరేషన్ విజయ్‌గా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. In a message at the Dagger War Memorial at Baramulla, President Kovind paid tributes to the soldiers who laid down their lives defending the nation with indomitable courage and valour. pic.twitter.com/YweORqkf7W — President of India (@rashtrapatibhvn) July 26, 2021 We remember their sacrifices. We remember their valour. Today, on Kargil Vijay Diwas we pay homage to all those who lost their lives in Kargil protecting our nation. Their bravery motivates us every single day. Also sharing an excerpt from last year’s ’Mann Ki Baat.’ pic.twitter.com/jC42es8OLz — Narendra Modi (@narendramodi) July 26, 2021 -
మొదటి కార్గిల్ గర్ల్ నేనే: శ్రీవిద్య రాజన్
కార్గిల్ గర్ల్‌గా పేరు సంపాదించుకున్న గుంజన్ సక్సెనా బయోపిక్‌పై విమర్శలు ఇప్పట్లో ఆగేలా లేవు. సినిమాలోని కొన్ని సన్నివేశాల పట్ల ఐఏఎఫ్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజగా గుంజన్ సక్సెనా సహోద్యోగి శ్రీవిద్య రాజన్ కూడా చిత్రంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె కూడా 1999 కార్గిల్ యుద్ధ సమయంలో గుంజన్‌తో కలిసి ఐఏఎఫ్‌లో హెలికాప్టర్ పైలట్‌గా పని చేశారు. తాజాగా శ్రీవిద్య ఫేస్బుక్ వేదికగా గుంజన్ సక్సెనా చిత్రంపై తన అభ్యంతరాలను తెలిపారు. అప్పటివరకు కేవలం పురుషులే ఉన్న రంగంలో తొలిసారి తాము చేరినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవమే అన్నారు. సహచర మగ ఉద్యోగులు కొందరు తాము అసలు ఈ రంగంలో ఎలా ఉంటామా అని అనుమానంగా చూశారని.. కానీ చాలా కొద్ది సమయంలోనే వారు తమను అంగీకరించారని శ్రీవిద్య తెలిపారు. అంతేకాక ప్రారంభంలో తమకు ప్రత్యేకంగా టాయిలెట్స్ కానీ, డ్రెస్ మార్చుకునే రూములు కానీ లేవని వెల్లడించారు. అలానే శిక్షణలో తాము చేసే కొన్ని తప్పులను ప్రత్యేకంగా ఎత్తి చూపేవారని.. సరిదిద్దుకునే వరకూ ఊరుకోకపోయేవారన్నారు శ్రీవిద్య. ఇవే తప్పులు మగ ఉద్యోగులు చేస్తే పెద్దగా పట్టించుకునే వారు కాదన్నారు. అలానే 1996లో తనకు, గుంజన్‌కు ఇద్దరికి ఉధంపూర్‌లో పొస్టింగ్ ఇచ్చారని.. కానీ సినిమాలో మాత్రం గుంజన్‌ను మాత్రమే ఉధంపూర్ పంపించినట్లు తప్పుగా చూపించారని తెలిపారు. అంతేకాక సినిమాలో చూపించినట్లు చిన్న చిన్న సిల్లీ రీజన్ల వల్ల తమ బాధ్యతలు ఎప్పుడు పోస్ట్‌పోన్ కాలేదన్నారు. ఎంతో అనుభవం, నైపుణ్యం కల స్క్వాడ్రన్ కమాండర్లు తమకు శిక్షణ ఇచ్చేవారని తెలిపారు. ఆడ, మగ ఎవరూ తప్పు చేసినా ఒకేలాంటి శిక్ష విధించేవారన్నారు. అంతేకానీ సినిమాలో చూపించినట్లు అవమానించడం.. సామార్థ్యాన్ని కించపర్చడం లాంటివి చేసేవారు కాదన్నారు. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మొదటి మహిళా పైలెట్ తానే అన్నారు శ్రీ విద్య. కార్గిల్ యుద్ధం ప్రారంభమైనప్పుడు తొలుత తాను ఉధంపూర్ వెళ్లానని.. తరువాత గుంజన్ తన టీంతో కలిసి శ్రీనగర్ వెళ్లిందన్నారు శ్రీవిద్య. అప్పుడు తాము అన్ని విభాగాల్లో విధులు నిర్వహించామని తెలిపారు శ్రీ విద్య. (ఆ విషయంలో గిల్టీగా ఉంది: జాన్వీ) సినిమా క్లైమాక్స్‌లో వచ్చిన సీన్లు పూర్తిగా అబద్దం అన్నారు శ్రీవిద్య. అలాంటి సినిమాటిక్ సీన్లు కేవలం మూవీస్‌లో మాత్రమే ఉంటాయని.. వాస్తవంగా ఎన్నటికి జరగవన్నారు. గుంజన్ సక్సెనా తన కెరీర్లో ఎన్నో విజయాలు సాధించిందన్నారు. ఆమె జీవితాన్ని సినిమాగా తెరకెక్కిస్తే.. యువతకు స్ఫూర్తిగా ఉంటుందన్నారు. కానీ సినిమాలో కొన్ని చోట్ల మహిళలని కించపర్చడం.. ఐఏఎఫ్‌ను తక్కువ చేసి చూపడం తనకు నచ్చలేదన్నారు. మహిళా పైలెట్లుగా తమను ఎంతో గౌరవ మర్యాదలతో చూశారని తెలిపారు. గుంజన్ ఒకసారి వీటన్నింటి పరిశీలించి.. మార్పులు చేసిన తర్వాత సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే బాగుండేదన్నారు శ్రీవిద్య. కార్గిల్ యుద్ధంలో మగ ఆఫీసర్లు తమకంటే ఎక్కువే కష్టపడ్డారని.. కానీ వారు ఎలాంటి గుర్తింపు కోరుకోవడం లేదన్నారు శ్రీవిద్య. తమకు లభించిన ఈ గుర్తింపు కూడా కేవలం జండర్ ఆధారంగానే లభించిందన్నారు. అయితే భద్రతాదళాల్లో సేవ చేసినప్పుడు ఆడ, మగ అనే తేడా ఉండదన్నారు. యూనిఫామ్ వేసుకుంటే ప్రతి ఒక్కరూ ఆఫీసర్ మాత్రమే అని తెలిపారు శ్రీవిద్య. (స్త్రీ స్వాతంత్య్రానికి మగాళ్లు ఓకే అనాలా?) శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, గుంజన్ సక్సెనా పాత్రలో నటించిన ఈ సినిమాకు శరణ్ శర్మ దర్శకత్వం వహంచారు. థియేటర్లో విడుదల చేయాల్సి ఉన్నప్పటికి లాక్డౌన్ కారణంగా ఓటీటీలో విడుదలయిన సంగతి తెలిసిందే. -
సైనిక ఆస్పత్రికి రాష్ట్రపతి 20 లక్షల విరాళం
న్యూఢిల్లీ: కార్గిల్ యుద్ధంలో పోరాడి విజయం సాధించి అమరులైన సైనికులకు నివాళిగా ఢిల్లీలోని సైనిక ఆస్పత్రికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రూ.20 లక్షలు విరాళమిచ్చారు. కరోనాను ఎదుర్కోవడానికి అవసరమైన శ్వాసకోçశ సంబంధిత యంత్రాలను కొనుగోలు చేస్తారని అధికారులు వెల్లడించారు. రూ. 20 లక్షలను చెక్కు ద్వారా అందించారని పేర్కొన్నారు. రాష్ట్రపతి తన ఖర్చులను తగ్గించుకుని ఈ డబ్బును విరాళం ఇచ్చినట్లు చెప్పారు. -
ఆ సాహసం.. సదా స్మరణీయం
న్యూఢిల్లీ: కార్గిల్ యుద్ధవీరుల ధైర్య సాహసాలను ప్రధాని మోదీ స్మరించుకున్నారు. సాయుధ దళాల నైతిక స్థైర్యం దెబ్బతినేలా మాట్లాడకూడదని, వారి ధైర్య సాహసాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని ఆదివారం మాసాంతపు రేడియో ప్రసంగం ‘మన్ కీ బాత్’లో ప్రజలకు సూచించారు. ‘దేశం తరువాతే ఏదైనా’అనే భావంతో ప్రజలంతా ఉంటే సైనికుల ఆత్మస్థైర్యం మరింత పెరుగుతుందన్నారు. కార్గిల్ యుద్ధంలో సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ జరుపుకునే విజయ్ దివస్ (జూలై 26) కూడా ఇదే రోజు రావడంతో ప్రధాని ఆ జ్ఞాపకాలను పంచుకున్నారు. 1999లో ఇదే రోజు కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. స్నేహ హస్తం చాచిన భారత్‌కు ఆనాడు పాకిస్తాన్ వెన్నుపోటు పొడిచిందని ప్రధాని గుర్తు చేశారు. ‘అంతర్గత సమస్యల నుంచి తప్పించుకునేందుకు.. భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలనే దుస్సాహసానికి పాక్ ఒడిగట్టింది’అన్నారు. ‘శత్రు సైన్యం శిఖరాల పైభాగంలో ఉంది. భారతీయ సైనికులు ఆ పర్వత పాదాల ప్రాంతాల్లో ఉన్నారు. భౌగోళికంగా వారికి అనుకూల స్థితి. కానీ భారత సైనికులు అత్యంత ధైర్య సాహసాలు, నైతిక స్థైర్యంతో వారిని మట్టికరిపించారు’అని కార్గిల్ యుద్ధాన్ని ప్రధాని గుర్తు చేశారు. తూర్పు లద్దాఖ్‌లో ఇటీవలి చైనా దుష్ట పన్నాగాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘కొందరు శత్రువులుగానే ఉండాలని కోరుకుంటారు’అని వ్యాఖ్యానించారు. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ దేశ ప్రజలను హెచ్చరించారు. కరోనా ముప్పు నేపథ్యంలో ఈ సారి స్వాతంత్య్ర దినోత్సవం కూడా ప్రత్యేకంగా ఉండబోతోందన్నారు. ఆరోజు స్వావలంబ, కరోనా రహిత భారత్ దిశగా ముందుకు వెళ్తామని యువత ప్రతినబూనాలన్నారు. సామాజిక మాధ్యమాల వినియోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రధాని కోరారు. కార్గిల్ యుద్ధం అనంతరం నాటి ప్రధాని వాజ్‌పేయి చేసిన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాన్ని మోదీ గుర్తు చేశారు. సురినామ్ కొత్త అధ్యక్షుడు చంద్రిక ప్రసాద్ సంతోఖి ప్రమాణ స్వీకారం చేసిన తీరు భారతీయులందరికీ గర్వకారణమని మోదీ తెలిపారు. వేద మంత్రాలు పఠిస్తూ, అగ్ని దేవుడిని స్తుతిస్తూ ఆయన ప్రమాణం చేశారన్నారు. -
కార్గిల్ యుద్ధం : సైనికుల త్యాగానికి జాతి నివాళి
సాక్షి, న్యూఢిల్లీ : దేశ సమగ్రత, భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను గుర్తుచేసుకుంటూ కార్గిల్ విజయ్ దివస్ 21వ వార్షికోత్సవాన్ని ఆదివారం దేశం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు ప్రముఖులు కార్గిల్ హీరోలకు ఘనంగా నివాళులు అర్పించారు. 1999లో సరిగ్గా ఇదే రోజున కార్గిల్ -ద్రాస్ సెక్టార్లో పాకిస్తాన్ చొరబాటుదారులు ఆక్రమించిన భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ విజయ్’ విజయవంతమైంది. కార్గిల్‌లో పాకిస్తాన్ దళాలను గుర్తించడంతో 1999 మే 3 నుంచి జులై 26 వరకూ కార్గిల్ యుద్ధం సాగింది. 1998లోనే పాకిస్తాన్ దళాలు దాడికి ప్రణాళికలు రూపొందించాయి. అంతకుముందు పాకిస్తాన్ సైన్యాధ్యక్షులు ఈ తరహా సూచనలు చేసినా దాడులు యుద్ధానికి దారితీస్తాయనే ఆందోళనతో ఆ ప్రతిపాదనలను పాకిస్తాన్ నేతలు తోసిపుచ్చారు. అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సైతం భారత ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్‌పేయి నుంచి ఫోన్‌కాల్ వచ్చేవరకూ తనకు దాడి గురించి ఎలాంటి సమాచారం లేదని చెప్పడం గమనార్హం. కాగా, ఆపరేషన్ విజయ్ భారీ సక్సెస్‌కు ఒక రోజు ముందు ఏం జరిగిందనే విషయాలను వివరిస్తూ భారత సైన్యం శనివారం ట్వీట్ చేసింది. ‘ఆ రోజు భారత సైన్యం అత్యంత సాహసంతో ముస్కో లోయలో జులూ శిఖరంపై దాడికి పాల్పడింది..మన సేనలు సమరోత్సాహంతో అంకితభావంతో ముందుకు దూకి ప్రత్యర్ధుల ముట్టడిలో ఉన్న మన ప్రాంతాన్ని విజయవంతంగా స్వాధీనం చేసుకున్నా’రని సోషల్ మీడియా వేదికగా సైన్యం పేర్కొంది. జాతి సమగ్రతను కాపాడేందుకు భారత సైనికులు చేసిన సమున్నత త్యాగానికి గుర్తుగా జులై 26ను అమరవీరులకు దేశం అంకితం చేసింది. 12,000 అడుగుల ఎత్తులో మన సైనికులు ద్రాస్, కక్సర్, బటాలిక్, తుర్తుక్ సెక్టార్లలో ప్రత్యర్ధి సేనలకు చుక్కలు చూపారు. ఈ యుద్ధంలో ఇరుపక్షాలకు చెందిన పలువురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పాక్ సేనల చెరలో ఉన్న మన భూభాగంపై భారత సైన్యం తిరిగి పట్టుబిగించడంతో ‘ఆపరేషన్ విజయ్’ విజయవంతంగా ముగిసింది. చదవండి : డబ్బులు తీసుకుని పాత ఆయుధాలిచ్చారు -
మిగ్–27కు వీడ్కోలు
జోథ్‌పూర్: దాదాపు మూడు దశాబ్దాల పాటు సేవలందించిన మిగ్(ఎంఐజీ)–27 యుద్ధ విమానాలు ఇక విశ్రాంతి తీసుకోనున్నాయి. జోథ్‌పూర్ వైమానిక స్థావరంలో శుక్రవారం జరిగిన మిగ్ వీడ్కోలు కార్యక్రమంలో సౌత్ వెస్ట్రన్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఎస్కే ఘోటియా పాల్గొన్నారు. ఈ విమానాలు పోరాటక్షేత్రంలో ముందు నిలిచాయని, 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో అమూల్యమైన సేవలందించాయని తెలిపారు. ఇన్నాళ్లూ జోథ్‌పూర్ ఎయిర్ బేస్‌లో మిగ్–27 రకం విమానాలు ఏడు వరకు సేవలందించాయి. -
డబ్బులు తీసుకుని పాత ఆయుధాలిచ్చారు
చండీగఢ్: రెండు దశాబ్దాల క్రితం కార్గిల్ యుద్ధ సమయంలో ఆకస్మిక సైనిక అవసరాలను తీర్చడానికి అవసరమైన ఉపగ్రహ చిత్రాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి కోసం కొన్ని దేశాలు భారత్ నుంచి అధిక చార్జీలు వసూలు చేశాయని రిటైర్డ్ ఆర్మీ చీఫ్ వీపీ మాలిక్ పేర్కొన్నారు. కార్గిల్ యుద్ధ సమయంలో వీపీ మాలిక్ భారత సైన్యానికి నాయకత్వం వహించారు. మిలిటరీ లిటరేచర్ ఫెస్టివల్లో ‘మేక్ ఇన్ ఇండియా అండ్ ది నేషన్స్ సెక్యూరిటీ’పై చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు. ‘కార్గిల్ యుద్ధ సమయంలో ఇతర దేశాల నుంచి అత్యవసరమైన ఆయుధాల కొనుగోళ్లలో వారు మమ్మల్ని దోపిడీ చేశారు. మేము తుపాకుల కోసం ఒక దేశాన్ని సంప్రదించినప్పుడు వారు మొదట్లో ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత పాత ఆయుధాలను ఆధునీకరించి సరఫరా చేశారు. మందుగుండు సామగ్రి కోసం మరొక దేశాన్ని సంప్రదించినప్పుడు 1970 నాటి పాతకాలపు మందుగుండు సామగ్రిని ఇచ్చారు’అని తెలిపారు. అలాగే కార్గిల్ సమయంలో భారతదేశం కొనుగోలు చేసిన ప్రతి ఉపగ్రహ చిత్రానికి రూ.36 వేలు చెల్లించాల్సి వచ్చిందని, ఆ చిత్రాలు కూడా తాజావి కావని, మూడేళ్ల క్రితం చిత్రాలని వీపీ మాలిక్ పేర్కొన్నారు. -
నాలుగు యుద్ధాలు
1947 పీఓకే జననం ఈ యుద్ధాన్ని మొట్టమొదటి కశ్మీర్ యుద్ధమని కూడా పిలుస్తారు. దేశ విభజనకు ముందు అతి పెద్ద సంస్థానంగా ఉన్న జమ్మూ కశ్మీర్ హిందూ మతానికి చెందిన మహారాజా హరిసింగ్ పాలనలో ఉండేది. 1947 దేశ విభజన సమయంలో సంస్థానాల విలీనాన్ని బ్రిటీష్ పాలకులు వారి ఇష్టానికే వదిలిపెట్టారు. భారత్‌లో కలుస్తారా, పాక్‌లో కలుస్తారా ? లేదంటే స్వతంత్రంగా ఉంటారా అన్నది వారే నిర్ణయించుకోవాలని తెలిపారు. రాజా హరిసింగ్ భారత్‌లో ఎక్కడ కలుస్తారోనన్న ఆందోళనతో పాకిస్తాన్ 1947 అక్టోబర్‌లో కశ్మీర్‌పై దండయాత్ర చేసింది. ఇస్లాం ఆదివాసీలు పాక్ ఆర్మీ అండదండ చూసుకొని కశ్మీర్‌పై దాడికి దిగాయి. దీంతో మహారాజా హరిసింగ్ కశ్మీర్ ప్రాంతాన్ని భారత్‌లో కలుపుతానని ప్రకటించి మన దేశ సైనిక సాయాన్ని అభ్యర్థించారు. ఇరు వర్గాల మధ్య పోరు కొన్నాళ్లు సాగింది. కశ్మీర్లో అత్యధిక భాగాన్ని పాక్ ఆక్రమించుకుంది. అప్పుడే పాక్ ఆక్రమిత కశ్మీర్, వాస్తవాధీన రేఖ ఏర్పడ్డాయి. చివరికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి జోక్యంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించాయి. కశ్మీర్ లోయలో రెండింట మూడు వంతుల భాగం భారత్ కిందకి వచ్చాయి. ఇక పాక్ ఆక్రమించుకున్న ప్రాంతాన్ని ఆజాద్ కశ్మీర్ గిల్జిట్ బల్టిస్తాన్ అని పిలుస్తారు. 1965 పాక్ పలాయనం జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల చొరబాటుకు పాక్ 1965లో భారీ కుట్రకు తెరతీసింది. ఆపరేషన్ గిబ్రాల్టర్ పేరుతో భారత్‌లో మారణహోమం సృష్టించడానికి పన్నాగాలు రచించింది. దీంతో భారత్ పశ్చిమ పాకిస్తాన్‌పై పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రకటించింది. మొత్తం 17 రోజుల పాటు సాగిన ఈ యుద్ధంలో ఇరుపక్షాలకు భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యధికంగా యుద్ధట్యాంకులు వినియోగించింది ఈ యుద్ధంలోనే. దీనినే రెండో కశ్మీర్ యుద్ధం అని కూడా పిలుస్తారు. ఈ యుద్ధంలో కొద్ది రోజులకే పాక్ తోక ముడిచింది. పాకిస్తాన్ మీద భారత్ పైచేయి సాధించింది. అదే సమయంలో అమెరికా, రష్యా దౌత్యపరమైన జోక్యంతో యుద్ధం నిలిచిపోయింది. తాష్కెంట్ డిక్లరేషన్ అమల్లోకి వచ్చింది. 1971 బంగ్లా విముక్తి ఈ యుద్ధంలో వాస్తవానికి కశ్మీర్ ప్రమేయం ప్రత్యక్షంగా లేకపోయినా పాక్‌కు అత్యంత నష్టం కలిగించింది, భారత్ కశ్మీర్లో తిరిగి కొంత భాగాన్ని ఆక్రమించుకుంది ఈ యుద్ధంతోనే. పశ్చిమ, తూర్పు పాకిస్తాన్ల మధ్య సంక్షోభం తలెత్తడంతో తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుతం బంగ్లాదేశ్) పాలకుడు షేక్ ముజ్బీర్ రెహ్మాన్‌కు అండగా భారత్ నిలబడింది. బంగ్లాదేశ్ విముక్తి కోసం పాక్‌తో యుద్ధం చేసింది. పాక్ ప్రభుత్వ ఆగడాలు భరించలేని బెంగాలీలు బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరు బాట పట్టారు. వారికి అండగా నిలిచిన భారత్‌పైకి పాకిస్తాన్ యుద్ధానికి దిగింది. ఎన్నో ప్రాంతాలపై దాడులు మొదలు పెట్టింది. భారత్ ఆర్మీ వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఆ సమయంలోనే పాక్ అధీనంలో ఉన్న కశ్మీర్లో 5,795 చదరపు మైళ్ల భాగాన్ని మన సైన్యం కైవసం చేసుకుంది. రెండువారాల పాటు ఉ«ధృతమైన పోరాటం తర్వాత బంగ్లాదేశ్ విముక్తి జరిగింది. ఆ తర్వాత కుదుర్చుకున్న లాహోర్ ఒప్పందంలో భాగంగా భారత్ కశ్మీర్లో తాను సొంతం చేసుకున్న భాగాన్ని పాక్‌కు తిరిగి ఇచ్చేసింది. ఇరు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలని, కశ్మీర్లో శాంతి నెలకొల్పాలనే భారత్ ఆ నిర్ణయం తీసుకుంది. 1999 కార్గిల్ చొరబాటు 1999 మొదట్లో పాకిస్తాన్ దళాలు వాస్తవాధీన రేఖ వెంబడి కశ్మీర్లోకి చొచ్చుకువచ్చాయి. కార్గిల్ జిల్లాలో అత్యధిక భాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పాక్ చొరబాట్లను అడ్డుకోవడానికి ఈసారి పెద్ద ఎత్తున మిలటరీ చర్యకి భారత్ దిగింది. రెండు నెలల పాటు ఇరు దేశాల మధ్య పోరు సాగింది. పాక్ ఆక్రమించుకున్న ప్రాంతాలన్నింటినీ భారత్ మిలటరీ తిరిగి తన అధీనంలోకి తెచ్చుకోవడం మొదలు పెట్టింది. పాక్ ఆక్రమించుకున్న ప్రాంతంలో 75 నుంచి 80శాతం వరకు తిరిగి భారత్ అధీనంలోకి వచ్చేశాయి. ఇరు దేశాల మధ్య యుద్ధ తీవ్రత ఎక్కువైపోతూ ఉండడంతో పాకిస్తాన్‌ను వెనక్కి తగ్గమంటూ అమెరికా దౌత్యపరమైన ఒత్తిడిని పెంచింది. అప్పటికే పాక్ సైనికుల్లో నైతిక స్థైర్యం దెబ్బతింది. 4 వేల మంది వరకు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆర్థికంగా కూడా ఆ దేశం బలహీనపడిపోయింది. భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న పాక్ యుద్ధాన్ని నిలిపివేసింది. అలా కార్గిల్ యుద్ధంతో భారత్ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. -
కార్గిల్ విజయానికి 20 ఏళ్లు
న్యూఢిల్లీ: కార్గిల్ యుద్ధంలో భారత్ గెలిచి శుక్రవారానికి 20 ఏళ్లయిన సందర్భంగా రణభూమిలో అమరులైన భారత సైనికులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ సహా పలువురు ఘనంగా నివాళుర్పించారు. 1999 మే 3 నుంచి జూలై 26 వరకు పాక్‌తో జరిగిన యుద్ధంలో చివరకు భారత్ విజయం సాధించింది. దాదాపు 500 మంది భారత సైనికులు ఈ యుద్ధంలో అమరులయ్యారు. ఆర్మీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేస్తూ ‘జూలై 26 కార్గిల్ విజయదినోత్సవంగా ఎప్పటికీ నిలిచిపోతుంది. ద్రాస్, కక్సర్, బతాలిక్, టుర్టోక్ సెక్టార్లలో మన సైనికులు గొప్పగా పోరాడారు’ అని తెలిపింది. త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల చీఫ్‌లు వరుసగా జనరల్ బిపిన్ రావత్, అడ్మిరల్ కరమ్‌వీర్ సింగ్, బీఎస్ ధనోవా ద్రాస్‌లో ఉన్న కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. నాడు యుద్ధంలో 17 స్క్వాడ్రన్‌కు కమాండింగ్ అధికారిగా పనిచేసిన ధనోవానే నేడు వాయుసేన చీఫ్‌గా ఉన్నారు. ద్రాస్‌కు వెళ్లలేక పోయిన కోవింద్ ద్రాస్‌లోని యుద్ధ స్మారకం వద్ద జరిగే కార్యక్రమానికి త్రివిధ దళాధిపతులతోపాటు వారికి అధిపతి అయిన రాష్ట్రపతి కోవింద్ కూడా హాజరై నివాళి అర్పించాలన్నది ప్రణాళిక. అయితే వాతావరణం బాగాలేకపోవడంతో కోవింద్ వెళ్లలేకపోయారు. దీంతో ఆయన కశ్మీర్‌లోని బదామీ బాగ్ కంటోన్మెంట్లో ఆర్మీ 15 కార్ప్స్ ప్రధాన కార్యాలయంలో యుద్ధ స్మారకం వద్ద నివాళులర్పించారు. యుద్ధక్షేత్రంలో తన ఫొటోలను పోస్ట్ చేసిన మోదీ అమరవీరులకు ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు. ‘భారత సైనికుల కోసం నేను విజయదినోత్సవం రోజున ప్రార్థిస్తున్నాను. మన సైనికులు ధైర్యం, సాహసం, అంకిత భావాన్ని ఈ రోజు గుర్తు చేస్తుంది. మాతృభూమిని కాపాడేందుకు సర్వస్వాన్ని అర్పించిన శక్తిమంతమైన యుద్ధ వీరులకు నివాళి’ అని పేర్కొన్నారు. యుద్ధం సమయంలోఅక్కడికి వెళ్లినప్పుడు తీసుకున్న ఫొటోలను కూడా మోదీ పోస్ట్ చేశారు. పోరుకు దిగే సామర్థ్యం పాక్‌కు లేదు: రాజ్‌నాథ్ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో మాట్లాడుతూ సైనికుల చెక్కుచెదరని ధైర్యం, గొప్ప త్యాగం కారణంగానే నేడు మన దేశం సరిహద్దులు భద్రంగా, పవిత్రంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం భారత్‌తో పూర్తిస్థాయి లేదా పరిమిత కాలపు యుద్ధం చేసే సామర్థ్యం పాకిస్తాన్‌కు లేదని ఆయన పేర్కొన్నారు. ‘మన పొరుగుదేశం (పాకిస్తాన్) ఇప్పుడు మనతో నేరుగా యుద్ధం చేయలేక పరోక్ష యుద్ధానికి దిగుతోంది’ అని రాజ్‌నాథ్ చెప్పారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కార్గిల్ అమరవీరులకు నివాళి అర్పించారు. కార్గిల్ యుద్ధంపై చర్చ జరగాలని సభలో కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌధురి డిమాండ్ చేశారు. అటు రాజ్యసభలో చైర్మన్ వెంకయ్య నాయుడు సైనికులు ధైర్య సాహసాలను పొగిడారు. వారి త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరువదన్నారు. సభ్యులు లేచి నిల్చొని మౌనం పాటించి అమర సైనికులకు నివాళి అర్పించారు. -
పాకిస్తాన్‌కు అంత సీన్ లేదు!
న్యూఢిల్లీ : భారత్‌తో యుద్ధం చేసే స్థాయి పాకిస్తాన్‌కు ఏమాత్రం లేదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం కార్గిల్ 20వ విజయ్ దివస్‌ను పురస్కరించుకుని యుద్ధ వీరులకు పార్లమెంటు నివాళులు అర్పించింది. ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సభలోనే ఉన్నారు. స్పీకర్ ఓం బిర్లా సహా ఎంపీలంతా యుద్ధంలో అసువులు బాసిన సైనికులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ...‘ భారత్‌తో పూర్తి స్థాయి యుద్ధం చేసేంత సీన్ దాయాది దేశానికి లేదు. ప్రచ్ఛన్న యుద్ధాన్ని ప్రోత్సహిస్తూ, వాళ్లు అక్కడికే పరిమితమవుతారు అని పేర్కొన్నారు. కాగా కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కార్గిల్ యుద్ధం గురించి చర్చ జరగాల్సిందిగా కాంగ్రెస్ లోక్‌సభా పక్షనేత అధీర్ రంజన్ చౌదరి కోరారు. మరోవైపు రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు భారత సైనికుల సేవలను కొనియాడారు. దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన వీరులను జాతి ఎన్నటికీ మరవదని పేర్కొన్నారు. -
మీ త్యాగాలను ఈ దేశం ఎన్నటికీ మరవదు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లేక్కచేయకుండా కార్గిల్ యుద్ధంలో అసువులు బాసి విజయాన్నందించిన జవాన్లకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘననివాళులు అర్పించారు. ‘కార్గిల్ విజయ్ దివస్’ సందర్భంగా ఆయన ట్విటర్ వేదికగా వారి త్యాగాలను, ధైర్యసాహసాలను ఈ దేశం ఎప్పటికీ మరిచిపోదన్నారు. ‘దేశ రక్షణ కోసం ప్రాణాలు వదిలి మమ్మల్ని గెలిపించిన అమరజవాన్లకు నివాళులు.. కృతజ్ఞతలు. వారి ధైర్య సాహసాలు, త్యాగాలను ఈ దేశం ఎన్నటికీ మరిచిపోదు’ అని వైఎస్ జగన్ ట్వీట్లో పేర్కొన్నారు. 20 ఏళ్ల క్రితం కార్గిల్‌ను ఆక్రమించుకోవడానికి దాయాదీ పాకిస్తాన్ పన్నిన కుతంత్రాన్ని తిప్పికొడుతూ... మన సైన్యం సమర్థంగా ఎదుర్కొని ఆ దేశాన్ని చావుదెబ్బ కొట్టింది. నాటి కార్గిల్ యుద్ధంలో మన జవాన్లు చూపిన అసమాన పోరాటమే భారత్‌కు విజయాన్ని అందించింది. అమర జవాన్ల పోరాటాన్ని స్మరించుకునేందుకు భారత్ ఏటా జులై 26న ‘విజయ్ దివస్’ నిర్వహిస్తోంది. Homage and gratitude to the martyrs of Kargil war who defended the nation and led us to victory. This country will always remember the sacrifice, courage and valor of our brave soldiers. — YS Jagan Mohan Reddy (@ysjagan) July 26, 2019 -
‘మరో కార్గిల్ వార్‌కు రెఢీ’
సాక్షి, న్యూఢిల్లీ : మన సైనిక బలగాలు అవసరమైతే మరో కార్గిల్ యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నాయని భారత వాయుసేన చీఫ్ బీఎస్ ధనోవా అన్నారు. చివరి యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని, మరోసారి కార్గిల్ యుద్ధం వస్తే దీటుగా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. కార్గిల్ యుద్ధం జరిగి 20 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవా మాట్లాడారు. ఎలాంటి వాతావరణంలోనైనా శత్రు దేశంపై బాంబులతో విరుచుకుపడగల సామర్ధ్యం వైమానిక దళం సొంతమని చెప్పారు. గురితప్పకుండా లక్ష్యాన్ని ఢీ కొట్టగలిగే మన సామర్ధ్యం బాలాకోట్ వైమానిక దాడుల్లో మనం చూశామని చెప్పుకొచ్చారు. -
సంగ్రామంలో సగం
ఆడపిల్ల నిచ్చెన ఎక్కబోతేనే నివారించే సమాజం ఆమె ఆకాశంలో ఎగురుతానంటే సరే అంటుందా?ఆడపిల్ల తుపాకీ బొమ్మ పట్టుకుంటేనే వద్దనే సమాజం ఆమె యుద్ధ క్షేత్రంలో అడుగు పెడతానంటే సరే అంటుందా?ఆడపిల్ల గట్టిగా మాట్లాడితేనే నిరోధించే సమాజం ఆమె శత్రువు మీద తుపాకీ గురిపెడతానంటే సరేనంటుందా?చదువులో సగం అంటే అతి కష్టం మీద సరే అంది సమాజం.ఉద్యోగాల్లో సగం అంటే అతి కష్టం మీద సరే అంటోంది సమాజం. కాని సంగ్రామంలో సగం అంటే మాత్రం కొంచెం కంగారు పడుతోంది.కాని గుంజన్ సక్సేనా వంటి పైలట్లు మాత్రం యుద్ధ క్షేత్రాల్లో లోహ విహంగాలు ఎగరేసి మేమూ చేయగలం అని నిరూపించారు.ఆమె స్ఫూర్తితో జాన్వీ కపూర్ నటిస్తున్న సినిమా ‘కార్గిల్ గర్ల్’ ఇప్పుడు సెట్స్ మీద ఉంది. నేడు జాన్వి పుట్టినరోజు.గుంజన్ సక్సేనా, జాన్వి.. లాంటి ఈ తరం ప్రతినిధుల స్ఫూర్తి కొనసాగుతూ ఉంటుంది. యుద్ధంలో విమానాలు, హెలికాప్టర్లు ఎంత ముఖ్యమో వాటిని నడిపే పైలట్లు కూడా అంతే ముఖ్యం.పైలట్లు లేని విమానాలు ఒట్టి ఆటబొమ్మలు.ఈ ప్రపంచంలో మగవారిది పైచేయిగా ఉన్నట్టే త్రివిధ దళాలలో కూడా మగవారిదే పైచేయి. ముఖ్యంగా ఎయిర్‌ఫోర్స్‌లో స్త్రీలు ‘ఫైటర్ పైలట్’లుగా ఉండటానికి నిన్న మొన్నటి వరకూ అనుమతి లేదు.అటువంటి దశలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మొదటిసారి ‘ఫిమేల్ ట్రైనీ పైలట్స్’ను భర్తీ చేయ తలపెట్టింది. ఢిల్లీలో చదువుకుంటున్న గుంజన్ సక్సేనా ఏ మాత్రం ఆలోచించకుండా ఆ అవకాశాన్ని దక్కించుకోవాలనుకుంది. ఎందుకంటే అప్పటికే ఆమె తల్లి, తండ్రి సైన్యంలో పని చేస్తున్నారు. ఇంట్లో ఉన్న సైనిక వాతావరణం ఆమెను ఫైటర్ పైలట్ కమ్మని ప్రోత్సహించింది. అయితే ట్రైనింగ్ సమయంలో, ఆమె ‘ఫ్లయిట్ ఆఫీసర్‘ అయినప్పుడు కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు ఏదోలే ఉన్నారులే అనే ధోరణినే మహిళా ఫైటర్ పైలట్ల పట్ల వ్యక్తపరిచేవారు. ఎందుకంటే వొత్తిడి సమయంలో ఆకాశంలో లోహ మరను కంట్రోల్ చేయడం స్త్రీలకు సాధ్యమవుతుందా అని సందేహం. గుంజన్ సక్సేనాకు ఇది కొంచెం నిరుత్సాహం కలిగించేది. తనను తాను నిరూపించే అవకాశం రావాలని పట్టుదలగా ఉండేది. ఆమె ఎదురుచూపుకు తగినట్టే వచ్చిన అవకాశం 1999 కార్గిల్ యుద్ధం. చీటా హెలికాప్టర్లో.. కార్గిల్ యుద్ధం మొదలైంది. ఎయిర్ ఫోర్స్ అందులో కీలకబాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఆకాశ పహారాలో మగ ఫైటర్ పైలట్లు ఉన్నారు. కాని యుద్ధంలో క్షతగాత్రులను తరలించడానికి, ముఖ్యమైన సామాగ్రి తరలించడానికి పైలట్లు కావాల్సి వచ్చింది. అప్పుడు అవకాశం గుంజన్ సక్సేనాకు దక్కింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దగ్గర ఉన్న చీటా హెలికాప్టర్‌ను గుంజన్‌కు ఇచ్చి కార్గిల్ ఎయిర్‌స్ట్రిప్‌కు వెళ్లి తిరిగి బేస్ క్యాంప్‌కు వచ్చే పని అప్పజెప్పారు. ఈ పని చేయడం అంటే శత్రువు లక్ష్యానికి దగ్గరగా వెళ్లి రావడమే. అయినప్పటికీ గుంజన్ భయపడలేదు. ధైర్యంగా అనేకసార్లు కార్గిల్ వార్‌లో అటూ ఇటూ చక్కర్లు కొట్టింది. ఆమెకు తెలుసు.. ఏ క్షణాన్నైనా ఈ హెలికాప్టర్‌ను శత్రువు కూల్చవచ్చని. అందుకని తన దగ్గర ఒక అసాల్ట్ రైఫిల్, ఒక రివాల్వర్ పెట్టుకుని ఆకాశంలో ఎగిరేది. ఎందరో క్షతగాత్రులను ఆమె బేస్ క్యాంప్‌కు తెచ్చి ప్రాణాలు కాపాడింది. ఒకసారి కార్గిల్ స్ట్రిప్ మీద ఆమె హెలికాప్టర్ టేకాఫ్ అవుతూ ఉండగా ఆమెను లక్ష్యం చేసి పేల్చిన రాకెట్ లాంచర్ కొంచెంలో తప్పి పక్కన ఉన్న కొండ చరియకు తాకింది. అయినప్పటికీ చెక్కు చెదరక గుంజన్ విధులు నిర్వర్తించింది. ఈ ధైర్యం, తెగువ వృధా పోలేదు. యుద్ధం ముగిసి మనం గెలిచాక ఆమెకు ‘కార్గిల్ గర్ల్’ అని పాపులర్ బిరుదు వచ్చింది. ప్రభుత్వం ‘శౌర్య చక్ర’ పురస్కారం ఇచ్చి గౌరవించింది. ఇప్పుడు ఆ కథ సినిమాగా రాబోతుంది. జాన్వియే సరైన ఎంపిక... గుంజన్ యుద్ధ క్షేత్రంలో తెగువ ప్రదర్శించి ఉండొచ్చు. కాని జాన్వి నిజజీవితంలో తెగువ ప్రదర్శించింది. ఆమె తల్లి నటి శ్రీదేవి మరణించి మొన్నటి ఫిబ్రవరికి ఒక సంవత్సరం. తల్లి ఎన్నో కలలు కనగా తాను నటించిన తొలి సినిమా ‘ధడక్’ రిలీజ్‌ను చూడకనే ఆమె మరణించడం జాన్వికి తీరని లోటు. ఇంకా పూర్తిగా జీవితంలో స్థిరపడక మునుపే తల్లి లేని పిల్ల కావడం చాలా పెద్ద దెబ్బ. అయినప్పటికీ నిబ్బరంగా ఆమె ‘ధడక్’ పూర్తి చేసింది. రిలీజయ్యాక జాన్వి ఒట్టి అందాల బొమ్మ కాదని, తల్లికి మల్లే మంచి నటి అని జనం గ్రహించారు. మెచ్చుకున్నారు. అందుకే జాన్వికి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ‘కార్గిల్ గర్ల్’లో గుంజన్ సక్సేనా పాత్రను పోషించే అవకాశం రావడం చాలా మంచి విషయం. ఈ సినిమా కాకుండా కరణ్ జోహర్ తీస్తున్న మల్టీస్టారర్ ‘తఖ్త్’లో జాన్వి ఒక పాత్ర పోషి స్తోంది. కరీనా కపూర్, అనిల్ కపూర్, ఆలియా భట్ ఇందులో ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇది కాకుండా రాజ్‌కుమార్ రావ్‌కు ఒక సినిమాలో జోడీ కట్టనుంది. పిత్రోత్సాహం తండ్రి కూతురిని చూసి పొంగిపోతే ‘పుత్రికోత్సాహం’. కూతురు తండ్రిని చూసి పొంగిపోతే ‘పిత్రోత్సాహం’. జాన్వి ప్రస్తుతం పిత్రోత్సాహంలో ఉంది. ఎందుకంటే హిందీలో హిట్ అయిన ‘పింక్’ సినిమాను తమిళంలో రీమేక్ చేయాలనేది శ్రీదేవి కోరిక. అందుకే తాను దక్షిణాదిలో మొదటిసారి నిర్మాతగా ‘పింక్’ను ‘నేర్కొండ పార్వై’ పేరుతో రీమేక్ చేసి విడుదల చేయనున్నారు బోనీ కపూర్. హిందీలో అమితాబ్ చేసిన పాత్రను తమిళంలో అజిత్ చేయడంతో ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. ఫస్ట్ లుక్ కూడా విడుదల అయ్యింది. దానిని చూసిన జాన్వి ‘నాన్న తొలి తమిళ సినిమా. కాన్ట్ వెయిట్’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యాఖ్యానించింది. కూడుతున్న కుటుంబం జాన్వి తల్లి లేని లోటు నుంచి ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా కోలుకుంటోందనే చెప్పవచ్చు. చెల్లెలు ఖుషీ కపూర్‌తో, సవతి సోదరుడు అర్జున్ కపూర్‌తో, సవతి సోదరి అన్షులా కపూర్‌తో ప్రేమానుబంధాలు బలపడ్డాయి. ఇంకా అనిల్ కపూర్ సంతానం సోనమ్ కపూర్, రియా కపూర్ కూడా ఆమెకు బాసటగా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో కూడా మగవారిదే పైచేయి. వారితో సమానంగా నిలిచే సంగ్రామంలో జాన్వి విజయవంతం అవుతుందని ఆశిద్దాం. -
కార్గిల్ యుద్ధ హీరోకు కీలక బాధ్యతలు
న్యూఢిల్లీ : భారత్- పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్గిల్ యుద్ధ హీరో ఎయిర్ మార్షల్ రఘునాథ్ నంబియార్‌ను.. ఐఏఎఫ్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్(డబ్ల్యూఏసీ) చీఫ్‌గా నియమించింది. ఇన్నాళ్లుగా ఈస్ట్రన్ ఎయిర్ కమాండ్ చీఫ్‌గా పనిచేసిన నంబియార్ శుక్రవారం నుంచి పశ్చిమ వాయుదళంలో కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కాగా భారత వైమానిక దళంలోని దాదాపు 40 ఎయిర్‌బేస్‌లు డబ్ల్యూఏసీ నియంత్రణలోనే ఉంటాయి. తద్వారా రాజస్తాన్‌లోని బికనీర్ నుంచి సియాచిన్ గ్లేసియర్ వరకు గల గగనతలాన్ని డబ్ల్యూఏసీ నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఇక కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ సైనిక స్థావరాలపై తన విమానం ద్వారా ఐదు లేసర్ గైడెడ్ బాంబులను విసిరిన నంబియార్.. భారత్ గెలుపులో ప్రముఖ పాత్ర పోషించారు. అంతేకాకుండా ఎయిర్ మార్షల్‌గా మిరాజ్-2000లో సుమారు 2300 గంటల పాటు ప్రయాణించిన ఘనత ఆయన సొంతం. అదేవిధంగా ఐఏఎఫ్ నంబర్ స్క్వాడ్రాన్‌కు నంబియార్ నేతృత్వం వహించారు. మిరాజ్‌తో పాటు తొలి రాఫెల్ ఫైటర్ జెట్‌ను కూడా నడిపిన ఆయన సీనియర్ టెస్టు పైలట్, కమాండింగ్ ఆఫీసర్‌గా కీర్తి గడించారు. లైట్ కమంబాట్ ఎయిర్‌క్రాఫ్టులను పరీక్షించినందుకు గానూ 2002లో వాయుసేన మెడల్ పొందారు. -
అభినందన్ మానసిక స్థితిని ఊహించగలను : నచికేత
న్యూఢిల్లీ : ఓ గంట క్రితం వరకూ కూడా ప్రతి భారతీయుడి మదిలో ఒకటే ప్రశ్న.. వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ వర్థమాన్ పరిస్థితి ఏంటి.. ఎప్పుడు విడుదల చేస్తారు.. అసలు వదిలేస్తారా.. లేదా అనే అనుమానాలు. వాటన్నింటికి సమాధానం దొరికింది. రేపు అభినందన్‌ను విడుదల చేస్తామంటూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే యుద్ధ ఖైదీగా పట్టుబడ్డప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి.. ఆ సమయంలో సదరు వ్యక్తి మానసిక స్థితి ఎలా ఉంటుందో వివరించారు కార్గిల్ వార్ హీరో కే నచికేత. అభినందన్ విడుదల ప్రకటన కంటే ముందు మీడియాతో మాట్లాడారు నచికేత. ఈ సందర్భంగా నచికేత, వింగ్ కమాండర్ అభినందన్‌ను ప్రశంసించారు. యుద్ధ ఖైదీగా ఆయన చూపిన స్థైర్యాన్ని కొనియాడారు. అంతేకాక ‘అభినందన్ ఒక సాహసోపేత పైలెట్ మాత్రమే కాక వృత్తిపట్ల నిబద్ధత కలిగిన వ్యక్తి. రక్షణ రంగంలో ఉన్న వ్యక్తి ఎవరైనా సరే.. స్త్రీ, పురుష బేధం లేకుండా హై కమాండ్ ఆదేశాల మేరకు వారి, వారి విధులను అత్యుత్తమంగా నిర్వహించాల్సి ఉంటుంది. ట్రైనింగ్‌లో కూడా ఇదే అంశాన్ని బోధిస్తారు. విపత్కర పరిస్థితుల్లో నిగ్రహం కోల్పోకుండా ఉండటం గురించి కూడా ట్రైన్ చేస్తారు.. అందుకే యుద్ధ ఖైదీగా పట్టుబడిన వ్యక్తి ఎంతటి హింసనయిన భరిస్తాడు కానీ దేశానికి, సైన్యానికి సంబంధించిన రహస్యాలను మాత్రం చెప్పడ’ని తెలిపారు. అంతేకాక ‘అభినందన్ క్షేమంగా ఇంటికి వస్తాడని నా నమ్మకం. ఇలాంటి కష్ట కాలంలో మనమందరం అతని కుటుంబానికి అండగా నిలవాలి. కానీ దురదృష్టావశాత్తు మీడియా ఈ విషయంలో సరిగా వ్యవహరించలేదు. అత్యుత్సాహంతో అభినందన్ యుద్ధ ఖైదీగా పట్టుబడిన వీడియోలను పదే పదే ప్రచారం చేస్తూ ఆ కుటుంబాన్ని మరింత బాధపెట్టింది. ఏది ఏమైనా అభినందన్ క్షేమంగా వస్తాడు. రావాలని నేను కోరుకుంటున్నాను’ అని తెలిపారు. అయితే నచికేత మాట్లాడిన కాసేపటికే అభినందన్‌ను రేపు విడుదల చేస్తామంటూ ఇమ్రాన్ ఖాన్ ప్రకటించాడు. (చదవండి : కార్గిల్ వార్‌లో పాక్‌కి చిక్కిన పైలట్.. తర్వాత?) -
కార్గిల్ వార్‌లో పాక్‌కి చిక్కిన పైలట్.. తర్వాత?
పాకిస్తాన్‌కు చిక్కిన పైలట్ విక్రమ్ అభినందన్ పరిస్థితి ఏంటి ? ఇప్పుడు ప్రతీ భారతీయుడు మదిలో మెదులుతున్న ప్రశ్న. ఇలాంటి సంఘటనే సరిగ్గా 20 ఏళ్ల కిందట ఎదురైంది.1999లో కార్గిల్ యుద్ధ సమయంలో సరిహద్దు గగనతలంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన మిగ్ 27 యుద్ధ విమానం గస్తీ కాసింది. ఆ యుద్ధ విమానంకు పైలట్‌గా వ్యవహరించారు లెఫ్టినెంట్ కే నచికేత. కానీ, కొన్ని సాంకేతిక లోపాలతో ఆ యుద్ధ విమానం పాక్ సరిహద్దుల్లో కూలిపోయింది. ప్యారచూట్తో దిగిన నచికేతను పాక్ ఆర్మీ యుద్ధ ఖైదీగా పట్టుకుంది. ఆ తర్వాత భారత ఆర్మీ రహస్యాలు చెప్పమని పాక్ సైనికులు నచికేతను చిత్ర హింసలకు గురిచేశారు. పాక్ ఉన్నతాధికారి ఒకరు చిత్రహింసలను ఆపివేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినప్పుడు మాత్రమే సైన్యం నచికేతపై దాడులు ఆపింది. అసలు మరుసటి రోజు చూస్తానో లేదో అన్నట్లుగా వారు హింసించారని నచికేత చెప్పారు. అయితే పాక్ ఉన్నతాధికారి యుద్ధ ఖైదీని విచారణ చేసే పద్ధతి ఇదికాదని చెప్పడంతో వారంతా వెనక్కు తగ్గారని వెల్లడించారు. నాడు భారత ప్రభుత్వం, అంతర్జాతీయ సమాజం నుంచి పాక్ పై త్రీవ ఒత్తిడి రావడంతో ఎనిమిది రోజుల తర్వాత నచికేతను పాక్ వదిలిపెట్టింది. నాడు యుద్దం జరుగుతున్న సమయంలో తన గుండె ధైర్యాన్ని ప్రదర్శించడం, ఎన్ని చిత్రహింసలకు గురిచేసినా భారత రహస్యాలు చెప్పకపోవడంతో అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్, ప్రధాని వాజ్‌పేయిలు అతన్ని హీరోగా కొనియాడారు. నాటి ప్రభుత్వం ఆయన్ను వాయుసేన పథకంతో గౌరవించింది. నచికేతను విడిపించేందుకు ఇస్లామాబాద్‌లో భారత హై కమిషనర్‌గా ఉన్న పార్థసారథి ఎంతగానో కృషి చేశారు. ఆ సమయంలో విదేశీవ్యవహారాల కార్యాలయంలో నచికేతన్ను ఉంచుతామని, తీసుకెళ్లాల్సిందిగా తనకు ఓ ఫోన్‌కాల్ వచ్చిందని పార్థసారథి చెప్పారు. నచికేతను దయ తలచి వదిలేస్తున్నామంటూ పాక్ చెప్పడాన్ని తాను జీర్ణించుకోలేకపోయానని అందుకే తాను అక్కడికి రానని తేల్చి చెప్పినట్లు పార్థసారథి వివరించారు. జెనీవా కన్వెషన్ ప్రకారం పాకిస్తాన్ భారత అధికారులకు అప్పగించాల్సి ఉందని చెప్పారు. యుద్ధ సమయంలో దేశాలు ఎలా వ్యవహరించాలో అంతర్జాతీయ న్యాయసూత్రాలు జెనీవా కన్వెన్షన్‌లో పొందుపర్చారు. ఇక నచికేతను అదే రోజు సాయంత్రం జెనీవా కన్వెన్షన్ ప్రకారం పాక్ అధికారులు తనకు అప్పగించారని గుర్తుచేసుకున్నారు. అక్కడి నుంచి తాము వాఘా సరిహద్దు గుండా భారత్‌కు చేరుకున్నట్లు వెల్లడించారు. అయితే భారత యుద్ధ విమానం మిగ్-21 తమ భూభాగంలో కూలినప్పుడు ప్యారచూట్ సహాయంతో కిందకు దూకిన అభినందన్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పాక్ వెల్లడించింది. అభినందన్ గల్లంతైన విషయాన్ని భారత విదేశాంగ ధ్రువీకరించింది. అయితే ఆయన పేరును వెల్లడించలేదు. ప్రస్తుతం తమ కస్టడీలోనే ఉన్నట్లు చెబుతున్న పాక్, జెనీవా కన్వెన్షన్ ప్రకారం అభినవ్‌ను వదిలేస్తుందా? భారత్ ఎలాంటి వ్యూహంతో అదృశ్యమైన పైలట్‌ను తిరిగి తీసుకొస్తుందో తెలియాలంటే మరికొన్నిరోజులు వేచిచూడాల్సిందే. -
ఆ యుద్దం తర్వాత తొలిసారి ఎల్వోసీ దాటి..
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులు జరిపిన భారత్.. అమర జవాన్లకు ఘనమైన నివాళి అర్పించింది. పాక్ భూభాగంలోకి దుసుకెళ్లిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వందలాది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. నియంత్రణ రేఖను దాటి జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ క్యాంప్‌లపై బాంబుల వర్షం కురిపించి భారత్ సత్తా చాటింది. అయితే కార్గిల్ యుద్ధ సమయంలో కూడా భారత వైమానిక దళం ఎల్వోసీ దాటలేదు. 1971 ఇండో-పాక్ యుద్దం తరువాత తొలిసారి ఐఏఎఫ్.. ఎల్వోసీ దాటి దాడులు జరిపింది. 12 మిరాజ్-2000 యుద్ద విమానాలతో వెయ్యి కిలోల బాంబులను ఉగ్రస్థావరాలపై జారవిడిచింది. ఈ రోజు ఐఏఎఫ్ ఎల్వోసీ పరిసరాల్లోని చాకోటి, ముజఫరాబాద్ పాంతాలపైనా మాత్రమే కాకుండా.. పాక్ భూభాగం బాల్కోట్లోని ఉగ్రస్థావరాలపై ఐఏఎఫ్ పంజా విసిరింది. అయితే కార్గిల్ సమయంలో కూడా ఎల్వోసీ దాటని ఐఏఎఫ్.. నేడు ఉగ్రమూకలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటానికి బలమైన కారణాలే కనబడుతున్నాయి. ఉగ్రవాద సంస్థల విషయంలో పాక్ ఉదాసీనంగా వ్యవహరించడం, పుల్వామా ఉగ్రదాడిపై పాక్ వైఖరి, అంతేకాకుండా జైషే మహమ్మద్ భారత్‌లో పుల్వామా లాంటి మరిన్ని దాడులకు పాల్పడనుందనే సూచనల నేపథ్యంలో ఐఏఎఫ్ ఈ దాడులు జరిపినట్టు సమాచారం. శాంతి కోసం ఉగ్రసంస్థలకు అన్ని రకాల సాయాన్ని నిలిపివేసి.. శాంతి కోసం పాటుపడాలని కోరిన స్పందన లేకపోవడంతో.. దాయాది దేశానికి గట్టి హెచ్చరికలు జారీచేసేందుకే భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పాక్ పట్టించుకోలేదు...అందుకే దాడులు సర్జికల్ స్ట్రైక్ 2 : 300 మంది ఉగ్రవాదులు హతం! -
టేకాఫ్‌కు రెడీ
కార్గిల్ యుద్ధ సమయంలో సైనికులను కాపాడే కార్యక్రమంలో పాల్గొన్నవాళ్లల్లో లేడీ పైలెట్ గుంజన్ సక్సెనా ఉన్నారు. ఈ సూపర్ హీరోయిన్ పాత్రను సిల్వర్ స్క్రీన్ మీద పోషించడానికి రెడీ అయ్యారు జాన్వీ కపూర్. దానికోసం శిక్షణ తీసుకోవడంలో ఫుల్ బిజీగా ఉన్నారు. పైలెట్‌కు సంబంధించిన క్లాస్‌లకు కూడా హాజరవుతున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ లుక్ ఇదే అంటూ ఓ ఫొటో బయటకు వచ్చింది. పైలెట్ సూట్ప్యాంట్లో ఉన్న ఈ లుక్‌తోనే ఈ చిత్రంలో జాన్వీ కనిపించనున్నారట. -
వార్కి రెడీ
యుద్ధం చేయడానికి రెడీ అవుతున్నారట జాన్వీ కపూర్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మహిళా పైలెట్ గున్‌జన్ సక్సేనా కార్గిల్ యుద్ధంలో ప్రతిభ చాటారు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఆమె జీవితం ఆధారంగా హిందీలో ఓ సినిమా రూపొందనుందని బాలీవుడ్ సమాచారం. టైటిల్ రోల్లో జాన్వీ కపూర్ నటించనున్నారట. సక్సేనా జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలను తెలుసుకునే పనిలో పడ్డారట జాన్వీ. తొలిచిత్రం ‘ధడక్’లో గ్లామర్‌గా నటించిన ఆమె ఈ చాలెంజింగ్ పాత్రలో ప్రేక్షకులను ఏమాత్రం మెప్పిస్తారనే విషయం బాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ఓ కీలక పాత్ర చేయనున్నారని వినికిడి. జాన్వీని వెండితెరకు పరిచయం చేసిన కరణ్ జోహార్ ఈ సినిమాని కూడా నిర్మించనున్నారట. త్వరలోనే ఈ చిత్రంపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఈ సినిమా కంటే ముందు కరణ్ జోహార్ దర్శకత్వం వహించనున్న ‘తక్త్’ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జాన్వీ. -
జస్ట్ మిస్
-
భారత జవాన్లకు వైఎస్ జగన్ సెల్యూట్
సాక్షి, హైదరాబాద్ : సరిగ్గా 19 ఏళ్ల క్రితం ఇదే రోజు దాయాది దేశం పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో భారత్ అఖండ విజయం సాధించింది. దేశంలోకి చొరబడిన ముష్కరులపై భారత జవాన్లు కార్గిల్ వద్ద గడ్డ కట్టే చలిలో 60 రోజుల పాటు పోరాడి దేశం మీసాన్ని తిప్పారు. ఆ ఘన విజయానికి గుర్తుగా జరుపుకుంటున్న ‘కార్గిల్ విజయ్ దివస్’ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘కార్గిల్‌లో దేశం కోసం పోరాడిన ప్రతి సైనికుడికి వందనం. సైనికుల వీరోచిత ప్రదర్శన, అసమాన ధైర్య సాహసాలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.’ అని వైఎస్ ట్విటర్లో పేర్కొన్నారు. A big salute to each and every brave soldier who fought valiantly for the country in Kargil. Their impeccable display of strength and valour will always be remembered with pride. #KargilVijayDiwas — YS Jagan Mohan Reddy (@ysjagan) July 26, 2018 -
‘వీర’....నారికి జోహార్
సైన్యం అంటేనే పురుషులు.....అనాదిగా ఇదే ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది. తొలుత మన దేశ సైన్యంలో మహిళలను కేవలం వైద్య సేవలు అందించడానికి మాత్రమే నియమించేవారు. 1992నుంచి ఈ పరిస్థితి మారింది. మహిళలను వైద్య సేవల నిమిత్తమే కాకుండ సైనిక సేవలను అందించేందుకు నియమించడం ప్రారంభించారు. తొలుత కేవలం జూనియర్ రేంజ్లో మాత్రమే తీసుకునేవారు. 2016, ఫిబ్రవరిలో నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి ప్రకటన మేరకు ప్రస్తుతం సైనిక బలగాల్లో మహిళలను ఆర్మి, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో ఆఫీసర్ కేడర్‌లో నియమిస్తున్నారు. త్రివిధ దళాల్లో సేవలు అందించిన, అందిస్తున్న ధీర వనితల గురించి తెలుసుకుందాం. పునిత అరోరా సైన్యంలో రెండో అత్యుత్తమ స్థాయి అయిన లెఫ్టినెంట్ జనరల్ ర్యాంకు, నేవీలో వైస్ అడ్మిరల్ స్థాయికి ఎదిగిన తొలి మహిళ పునిత. పంజాబీ కుటుంబంలో జన్మించిన పునిత 2004వరకూ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ బాధ్యతలు చూసుకున్నారు. ఈ బాధ్యతలు నిర్వహించిన తొలి మహిళ కూడా పునిత అరోరా కావడం విశేషం. పద్మావతి బంధోపాధ్యాయ ఆమె ప్రస్థానం అడుగడుగునా ప్రత్యేకం. భారత వాయుసేనలో చేరిన తొలి మహిళ.ఇంతేనా ఉత్తర ధృవంలో పరిశోధనలు చేసిన తొలి మహిళే కాక వాయుసేనలో ఎయిర్ వైస్ మార్షల్ ర్యాంకుకు ఎదిగిన తొలి మహిళ కూడా పద్మావతి బంధోపాధ్యాయే. 1971 లో భారత్-పాక్ యుద్ధం సందర్భంగా ఆమె చేసిన సేవలకు గాను ‘‘విశిష్ట సేవా పురస్కారాన్ని’’ అందుకున్నారు. మిథాలి మధుమిత సైన్యంలో ప్రధానం చేసే ‘‘సేన’’ పతకానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ పతకాన్ని స్ధాయితో సంబంధం లేకుండా శత్రుసేనలు దాడి చేసినప్పుడు వ్యక్తిగత ధైర్య సాహసాలను ప్రదర్శించిన వారికి ప్రధానం చేస్తారు. ఇలాంటి అరుదైన పురస్కారాన్ని అందుకున్న తొలి సైనికురాలు లెఫ్టినెంట్ కల్నల్ మిథాలి మధుమిత. 2010, ఫిబ్రవరిలో కాబూల్‌లో భారత రాయబార కార్యాలయం వద్ద ఆత్మహుతి దాడి సమయంలో ఆమె ఒంటరిగాసంఘటన స్థలికి చేరుకుని దాదాపు 19మంది ఆధికారులను కాపాడినందుకు గాను 2011లో ప్రభుత్వం ఆమెను ‘‘సేన’’ అవార్డుతో సత్కరించింది. దివ్య అజిత్ కుమార్ సైనిక శిక్షణ చాలా కఠినంగా ఉంటుంది. అందులోను సైన్యంలో ఆఫిసర్‌గా శిక్షణ పొందే సమయంలో పలు ప్రత్యేక అంశాల్లో ప్రతిభను పరీక్షిస్తారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వారికి శిక్షణానంతరం ఇచ్చే విశిష్ట పురస్కారం ‘‘స్వార్డ్ ఆఫ్ హనర్’’. ఇంతటి గౌరవాన్ని అతి పిన్న వయసులోనే (21ఏళ్లకే) పొందారు దివ్య అజిత్ కుమార్. అంతేకాదు భారత సైనిక చరిత్రలో ఓ మహిళ ఈ అవార్డు పొందడం ఇదే ప్రధమం. అంజనా భదురియా మైక్రోబయాలజీలో పీజీ చేసినప్పటికి ఆమె కోరిక మాత్రం సైన్యంలో చేరి దేశ సేవ చేయడం. అందుకు తగ్గట్టుగానే 1992లో భారత ప్రభుత్వం సైన్యంలో మహిళను చేర్చుకునేందుకు ‘‘మహిళల ప్రత్యేక ఎంట్రీ స్కీమ్’’ను ప్రవేశపెట్టింది. మహిళ క్యాడెట్ల తొలి బ్యాచ్ అదే. ఈ బ్యాచ్‌లో చేరి శిక్షణ కాలంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి గోల్డ్ మెడల్ అందుకున్న తొలి మహిళ అంజనా భదురియా. ప్రియ సేంవాల్ సైన్యంలో చేరతామంటే వద్దు అనే కుటుంబాలు నేటికి కోకొల్లలు. అలాంటిది తన భర్త సైన్యంలో వీరమరణం పొందినప్పటికి భర్త జ్ఞాపాకర్థం తాను తన నాల్గు సంవత్సారల కూతురిని సైతం వదిలి సైన్యంలో చేరిన మొదటి ఆర్మీ జవాన్ భార్యగా దేశం పట్ల తనకున్న ప్రేమను చాటుకుని చరిత్ర సృష్టించారు ప్రియ సేంవాల్. గనేవి లాల్జి గనేవి లాల్జి తన కుటుంబంలో సైన్యంలో చేరిన మూడో తరం వ్యక్తి. సాహసాలు అంటే ఎంతో ఇష్టపడే లాల్జి మనాలిలోని వెస్ట్రన్ హిమాలయన్ మౌంటేయినరింగ్ ఇనిస్టిట్యూట్‌లో మౌంటేయినరింగ్, స్కియింగ్లలో శిక్షణ తీసుకున్నారు.2011లో ఆమె సైన్యంలో చేరారు. అనతికాలంలోనే ఆర్మి కమాండర్‌కు కీలక సహాయకురాలిగా నియమితులైన తొలి మహిళగా కీర్తి గడించారు. గుంజన్ సక్సేనా 1994నుంచి భారత వాయుసేనలో మహిళలను తీసుకుంటున్నారు. 25ఏళ్ల గుంజన్ సక్సేనా నాటి తొలి బ్యాచ్‌లో ఒకరు. యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో బాధ్యతలు నిర్వహించిన తొలి మహిళా ఐఏఎఫ్ ఆఫీసర్ గుంజన్ సక్సేనా. కార్గిల్ యుద్ధ సమయంలో శత్రు స్థావరాల్లో గాయపడిన సైనికులను తీసుకురావడం, యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి సైనిక దళాలను చేరవేయడం వంటి బాధ్యతలు నిర్వహించారు. విధినిర్వహణలోనే వీరమరణం పొందారు. ఆమె ధైర్యసాహసాలకు మెచ్చి ప్రభుత్వం ‘‘శౌర్య వీర అవార్డు’’ను ప్రధానం చేసింది. ఈ అవార్డు అందుకున్న తొలి మహిళ కూడా ఈమెనే. శాంతి తగ్గ మూడు పదులు దాటిన వయసు, ఇద్దరు పిల్లలకు తల్లి...ఏ స్త్రీ అయినా ఇంటిపట్టునే ఉండాలనుకుంటుంది. కానీ శాంతి తగ్గ మాత్రం సైన్యంలో జవానుగా చేరారు. శరీర దృఢత్వ పరిక్షల్లో పురుషులకు ధీటుగా రాణించి బ్యాచ్‌లో మొదటి స్థానంలో నిలిచారు. శిక్షణ పూర్తయ్యాక 969 రైల్వె ఇంజనీర్ రెజిమెంట్‌లో విధులు నిర్వహిస్తూ వీరమరణం పొందారు. ఆమె జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. - పిల్లి ధరణి -
కార్గిల్ వార్‌లో ఆసక్తికర ఎపిసోడ్
-
వీరజవానే గూఢచర్యానికి పాల్పడ్డాడా?
-
వీరజవానే గూఢచర్యానికి పాల్పడ్డాడా?
శ్రీనగర్: అతనో వీర జవాన్... భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన సైనికుడు. దేశ సరిహద్దు ప్రాంతంలో శత్రువు కెదురొడ్డి వీరోచితంగా పోరాడిన యోధుడు. మరి అలాంటి యోధుడే.. ఇపుడు దేశద్రోహిగా మారిపోయాడా.. దేశానికి సంబంధించిన కొన్ని కీలక పత్రాలను దేశం దాటించే ప్రయత్నం చేశాడా ..వీర జవాన్ కాస్తా గూఢచారిగా మారిపోయాడా.. జమ్ము కశ్మీర్లో శుక్రవారం చోటు చేసుకున్న పరిణామాలు ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి. జమ్ము కశ్మీర్ కు చెందిన మాజీ సైనికుడు మున్వర్ అహ్మద్ మీర్ ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థకు సమాచారం అందిస్తున్నాడనే ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ క్రైం బ్రాంచ్ , జమ్ము కశ్మీర్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. రాజౌరి జిల్లా నివాసి అయిన మీర్‌పై అధికార రహస్య చట్టం కింద కేసులు నమోదయ్యాయి. కొన్ని రహస్య ప్రతాలను, కీలక సమాచారానికి పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకు చేరవేశాడని పోలీసులు భావిస్తున్నారు. కీలకమైన సమాచారాన్ని ఉగ్రవాద సంస్థకు అందించాడని తమ విచారణలో తేలిందని నిఘా విభాగం అధికారులు తెలిపారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయుడిని కూడా అరెస్టు చేసినట్లు రాష్ట్ర డీజిపి వెల్లడించారు. స్థానిక కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం వీరిని రిమాండ్ కోసం ఢిల్లీకి తరలించామన్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను మాజీ సైనికుడు అహ్మద్ మిర్ ఖండించాడు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తప్పుడు ఆరోపణలతో తనను అన్యాయంగా ఇరికించారని వాదిస్తున్నాడు. కాగా మాజీ సైనికుడు మిర్ అధికార పీడీపీలో చురుకైన కార్యకర్త అని తెలుస్తోంది. -
భారత్ పై అణ్వాయుధాలు వేయాలనుకుంది!
వాషింగ్టన్: 1999 నాటి కార్గిల్ యుద్ధంలో భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన పాకిస్థాన్ అణు ఘాతుకానికి తెగబడాలని ప్రయత్నించిందట! భారత్ పై ప్రయోగించేందుకు పాకిస్థాన్ అణ్వాయుధాలు సిద్ధం చేసుకుంటున్నదని, వాటిని భారత్ పై వేసే అవకాశం కూడా ఉందని సీఐఏ అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ను హెచ్చరించినట్టు వైట్ హౌస్ మాజీ టాప్ అధికారి ఒకరు తెలిపారు. 1999 జులై 4 న అమెరికా పర్యటనకు వచ్చిన అప్పటి-ఇప్పటి పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తో క్లింటన్ సమావేశం కానున్న నేపథ్యంలో ఆయనకు సీఐఏ ఈ విషయాన్ని తెలిపింది. రోజువారీ రహస్య సమాచారాన్ని నివేదించడంలో భాగంగా పాక్ అణు సన్నాహాల గురించి వివరించింది. అప్పటి పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ దుస్సాహసానికి తెగబడి..కార్గిల్ ముట్టడికి ప్రయత్నించడం.. భారత్ సైన్యాలు పాక్ ఆర్మీ దాడిని తిప్పికొడుతున్న నేపథ్యంలో షరీఫ్ యుద్ధాన్ని ఆపడంలో అమెరికా మద్దతు కోరేందుకు ఆ దేశ పర్యటనకు వెళ్లారు. కార్గిల్ యుద్ధంలో ఓడిపోతే అంతర్జాతీయంగా అప్రతిష్టపాలవుతామనే ఉద్దేశంతో ఆయన సామరస్యంగా ఈ యుద్ధాన్ని ముగించాలని భావించారు. ఈ నేపథ్యంలో అప్పటి క్లింటన్-షరీఫ్ భేటీలో పాల్గొన్న అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ జాతీయ భద్రత మండలి సభ్యుడు బ్రూస్ రీడెల్ అప్పటి విషయాలను వెల్లడించారు. 'పాకిస్థాన్ తన అణ్వాయుధాలను సిద్ధం చేసుకుంటున్నది. వాటిని వాడే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి కచ్చితమైన నిఘా సమాచారముంది. ఇందుకు సంబంధించి ఓవల్ ఆఫీస్ లో గంభీర వాతావరణముంది' అని సీఐఏ క్లింటన్ కు చెప్పిందని బ్రూస్ వివరించారు. క్లింటన్ మాజీ జాతీయ భద్రతా సలహాదారు సాండీ బెర్జర్ బుధవారం క్యాన్సర్ తో మృతిచెందిన నేపథ్యంలో ఆయనకు స్మృతిలో రాసిన వ్యాసంలో బ్రూస్ ఈ విషయాలు తెలిపారు. పాకిస్థానే ఈ యుద్దం ప్రారంభించిన నేపథ్యంలో అదే యుద్ధాన్ని ఎలాంటి పరిహరం కోరకుండా ఆపేయాలని, అప్పుడే మరింత ఉద్రిక్తతలు రేకెత్తబోవని షరీఫ్ కు చెప్పాలని క్లింటన్ కు సాండీ బెర్జర్ సూచించినట్టు ఆయన వివరించారు. -
నడవలేదన్నారు.. పరుగెడుతోంది!
ఆమెకు పరుగంటే ఇష్టం.. ఆగకుండా జీవితాన్ని పరుగుపెట్టించడమంటే ఇష్టం.. కాళ్లున్నా లేకున్నా సరే..! నాలుగు గోడల మధ్యా కాలక్షేపం చేయడం ఆమెకు అలవాటు లేనిపని. బయటి ప్రపంచాన్ని చూడాలి. వీధుల్లో తిరగాలి. కాళ్లరిగేలా నడవాలి. అప్పటికీ అలసటొస్తే తనివితీరా పరుగెత్తాలి.. ఇదీ ఆమె తీరు. కానీ, ఓ దురదృష్టకర క్షణాన ఆమె నడవడం సాధ్యం కాదన్నారు. ఆమె వైపు జాలిగా చూశారు. అంతే.. ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. శక్తులు కూడదీసుకుంది. విధి వెక్కిరిస్తేనేం..? కాళ్లు పనిచేసినన్ని రోజులూ ఆమె జింకపిల్ల, పనిచేయనంటూ అవి మొండికేసిన రోజున ఆమె చిరుతపులి. కొన్ని వందల పుస్తకాలు చదివినా దొరకని స్ఫూర్తి, ప్రేరణ.. దీపా మాలిక్‌ను చూడగానే కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. ఎనలేని ఉత్తేజం ఆమె సొంతం. దీపా మాలిక్ దేశంలోనే అత్యుత్తమ మహిళా బైక్‌రేసర్, స్విమ్మర్, అంతర్జాతీయ స్థాయి అథ్లెట్, సాహస క్రీడాకారిణి. జాతీయ, అంతర్జాతీయ పతకాలు, లిమ్కా బుక్ రికార్డులు ఆమె స్థాయి ఏంటో చెబుతాయి. క్రమశిక్షణకు మారుపేరైన ఆర్మీ కుటుంబ నేపథ్యంలో పెరిగిన దీపా ఈ ఘనతలు సాధించడం పెద్ద విషయంగా అనిపించకపోవచ్చు. కానీ, ఆమె ఓ వికలాంగురాలు అని తెలిస్తే మాత్రం చిరు విజయం కూడా కొండంతగా కనిపిస్తుంది. అయితే, ఆమె చిరు విజయాలతో సంతృప్తి చెందే రకం కాదు. శిఖర సమాన ఘనతలు సాధించనిదీ నిద్రను కూడా దరిచేయనీయని మొండిఘటం. సాహసమే ఊపిరి.. 45 ఏళ్ల దీపా మాలిక్ చిన్ననాటి నుంచీ సాహసాలే ఊపిరిగా బతికింది. అందరు చిన్నారులూ ఊయలపై కూర్చొని ఆనందిస్తే.. దీపా మాత్రం వేగంగా ఊగే ఊయలపై నిల్చొని కేరింతలు కొట్టేది. బైక్‌లంటే ఆమెకు ఎనలేని ఆసక్తి. ఆ ఆసక్తితోనే పెళ్లికి ఒప్పుకున్నారామె. 20 ఏళ్ల వయసులో ఆమె తండ్రి ఓ పెళ్లి సంబంధం తీసుకొచ్చారు. దీపా మొదలే చిచ్చరపిడుగు. పెళ్లికి అంత ఈజీగా అంగీకరించే రకం కాదు. అయితే, వరుడు కూడా బైక్ ప్రియుడే. దీపా ఆసక్తిని తెలుసుకుని ఆమెను ఉత్సాహపరిచాడు. ఓ బైక్ కూడా కొనిస్తానని చెప్పాడు. దీంతో ఆమెకు నో చెప్పడానికి పెద్దగా కారణాలు దొరకలేదు. తన తండ్రిలాగే అతడూ సైన్యంలో పనిచేయడం దీపాకు నచ్చింది. ఇంకేముంది పెళ్లి బాజా మోగింది. అనుకున్నట్టుగానే బైక్ కొనిచ్చాడు ఆమె భర్త. కొత్త దంపతులు అన్యోన్యంగా జీవించారు. వారి ప్రేమకు గుర్తుగా ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. కుదుపు.. ప్రేమ, సాహసాల సంగమంగా సాగుతోన్న వారి జీవితంలో 1999లో పెద్ద కుదుపు వచ్చినట్టయింది. దీపాకు వెన్నుముక సంబంధ కణితి ఉన్నట్టు తెలిసింది. వైద్యులు మూడుసార్లు శస్త్రచికిత్స నిర్వహించి దాన్ని తొలగించారు. అయితే, ఆమె నడుం కిందిభాగం మాత్రం చచ్చుబడిపోయింది. ఆమె కాళ్లు పూర్తిగా స్పర్శరహితంగా మారిపోయాయి. ఓ వైపు ఆమె భర్త కార్గిల్ యుద్ధంలో శత్రువులతో పోరాడుతున్నాడు. మరోవైపు దీపా అనారోగ్యంతో..! ఆమె కన్న కలలు నీరుగారిపోయాయి. తనకిష్టమైన బైకింగ్, స్విమ్మింగ్, సాహస క్రీడలు.. ఏవీ ఇకపై చేయలేవంటూ వైద్యులు తెలిపారు. ఈ సమయంలో మరణమే శరణ్యమనుకుంది. కానీ, పసితనంలో ఉన్న తన ఇద్దరు బిడ్డలు ఆమెకు గుర్తుకువచ్చారు. యుద్ధక్షేత్రంలోని భర్త ప్రాణాలతో తిరిగివస్తాడో, లేదో తెలీదు. తను కూడా దూరమైతే వారేమైపోతారోనని భయపడింది. ఆ భయమే ఆమెను ధైర్యంగా బతికేలా చేసింది. అథ్లెటిక్స్‌లో.. బైకింగ్ మాత్రమే కాక, స్విమ్మింగ్‌లోనూ ప్రతిభ కనబర్చిన ఆమె మనదేశం తరఫున పారా ఒలింపిక్ ప్లేయర్‌గా ఎంపికైంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ వికలాంగ మహిళగా గుర్తింపు పొందింది. 2012లో రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డునూ అందుకుంది. స్విమ్మింగ్, జావెలిన్ త్రో, షాట్‌పుట్ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శనలు చేసింది. వైకల్యం అనేది ఓ మానసిక అడ్డంకి మాత్రమేనని నిరూపించింది. మరీ ముఖ్యంగా నాలుగు పదుల వయసులో సాధారణ రేసర్లతో సమానంగా ఆమె పోటీ పడేతీరు నిజంగా ఓ అద్భుతమే. ప్రస్తుతం 2016 రియో పారా ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతోన్న దీపా.. వారాంతాల్లో బైక్ రేసింగ్, సాహస క్రీడల్లోనూ పాల్గొంటోంది. తనలాగే వైకల్యంతో బాధపడేవారందరికీ వారందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. 36 ఏళ్ల వయసులో.. కార్గిల్ యుద్ధం ముగిసింది. దీపా మానసిక సంఘర్షణ కూడా..! భార్యాభర్తలిద్దరూ గెలిచారు. క్షేమంగా ఇంటికి చేరుకున్న భర్త.. దీపా మాలిక్‌కు అండగా నిలిచాడు. అంతులేని ప్రేమ కురిపించాడు. దీంతో మానసికంగా కుదుటపడింది. అయితే, వీల్‌చైర్‌కే పరిమితం కావడం ఆమెకు ఎంతమాత్రమూ నచ్చలేదు. బైక్‌పైన రువ్వుమంటూ దూసుకెళ్లాలని కోరుకునేది. అదే విషయాన్ని భర్తకు చెప్పింది. ఎన్నో కష్టాలు, వ్యయప్రయాసలకు ఓర్చి నాలుగు చక్రాల బైక్‌ను సొంతం చేసుకుంది. రేసింగ్ లెసైన్స్ కూడా సంపాదించింది. అలా 36 ఏళ్ల వయసులో కెరీర్ ప్రారంభించింది. అప్పటి నుంచీ ప్రమాదకర పర్వత ప్రాంతాలు, కొండలోయలు, హైవేలు.. ఇలా ప్రతిచోటా రేసుల్లో పాల్గొంది. ఈ క్రమంలోనే నాలుగు లిమ్కా బుక్ రికార్డులు తన ఖాతాలోకి వేసుకుంది. -
మీరిలా చేస్తారనుకోలేదు..
కార్గిల్ చొరబాటుపై షరీఫ్‌తో దిలీప్‌కుమార్ * షరీఫ్‌ను దిలీప్‌తో మాట్లాడించిన వాజ్‌పేయి * పాక్ మాజీ మంత్రి కసూరి పుస్తకంలో వెల్లడి లాహోర్: కార్గిల్ యుద్ధ సమయంలో నాటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి.. శాంతి సాధన కోసం బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్‌ను రంగంలోకి దించినట్లు తెలిసింది. ఆనాడు కూడా పాక్ ప్రధానిగా ఉన్న నేటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను వాజ్‌పేయి దిలీప్‌తో మాట్లాడించారు. పాక్ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షీద్ కసూరి తన తాజా పుస్తకం ‘నైదర్ ఏ హాక్ నార్ ఏ డవ్’ పుస్తకంలో ఈ సంగతులు బయటపెట్టారు. ఆనాడు షరీఫ్‌కు ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన సయీద్ మెహదీని ఉటంకిస్తూ ఈ వివరాలు వెల్లడించారు. సయీద్ తెలిపిన వివరాల ప్రకారం.. 1999 మే నాటి ఆ యుద్ధ సమయంలో సయీద్, షరీఫ్‌తో మాట్లాడుతున్నప్పుడు వాజ్‌పేయి నుంచి షరీఫ్ఉ అత్యవసరంగా ఫోన్ వచ్చింది. ‘నాకు లాహోర్‌లో సాదర స్వాగతం పలికి, ఆ వెంటనే కార్గిల్‌ను ఆక్రమించుకుని మీరు నన్ను కించపరచార‘ని వాజ్‌పేయి షరీఫ్‌తో అన్నారు. తనకేమీ తెలియదని ఆర్మీ చీఫ్ ముషార్రఫ్‌తో మాట్లాడాక మళ్లీ మాట్లాడతానని షరీఫ్ అన్నారు. సంభాషణ ముగుస్తుండగా.. తన పక్కన కూర్చున్న ఒక వ్యక్తితో మాట్లాడాలని వాజ్‌పేయి షరీఫ్‌కు చెప్పారు. తర్వాత ఫోన్లో దిలీప్ కుమార్ గొంతు వినపడ్డంతో షరీఫ్ ఆశ్చర్యపోయారు. దిలీప్ మాట్లాడుతూ.. ‘మియా సాబ్.. పాక్-భారత్‌ల మధ్య శాంతికి పాటుపడతానని చెప్పుకునే మీ నుంచి ఇలాంటి పరిణామాన్ని ఊహించలేదు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత తలెత్తితే భారతీయ ముస్లింలు ఎంతో అభద్రతా భావానికి గురవుతారని, ఇళ్లనుంచి బయటకు కూడా వెళ్లరని ఒక భారతీయ ముస్లింగా మీకు చెబుతున్నాను. పరిస్థితిని నియంత్రించడానికి దయచేసి ఏదో ఒకటి చేయండి’ అని అన్నారు. పాక్‌లోని పెషావర్‌లో జన్మించిన దిలీప్(అసలు పేరు యూసఫ్ ఖాన్)కు పాక్ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన నిషానే ఇంతియాజ్ అవార్డు వచ్చింది. -
కార్గిల్ యుద్ధానికి 16 ఏళ్లు
న్యూఢిల్లీ: కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం విజయానికి గుర్తుగా జరుపుకొనే 'విజయ దివస్' సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అమర జవాన్లకు నివాళులు అర్పించారు. 'మాతృభూమి కోసం పోరాడి, యుద్ధంలో మరణించిన సైనికులకు సెల్యూట్ చేస్తున్నా. త్రివిధ దళాల శౌర్యానికి, త్యాగానికి ప్రతీక విజయ్ దివస్' అని ట్వీట్ చేశారు. రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అమర జవాన్లకు నివాళులు అర్పించారు. ఢిల్లీలోని అమర్ జవాన్ జ్యోతి వద్ద పుష్పమాల ఉంచి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహా, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. కె. ధోవన్ లు కూడా పాల్గొన్నారు. కార్గిల్ జిల్లాలోని ద్రాస్ వార్ మెమోరియల్ వద్ద శనివారం నాడు ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్.. అమర జవాన్లకు నివాళులు అర్పించారు. కార్గిల్ యుద్ధం ముగిసి నేటికి 16 ఏళ్లు. 1999 మే నెలలో ప్రారంభమైన ఈ యుద్ధం జులై 26 వరకు కొనసాగింది. కశ్మీర్ లోని కార్గిల్ జిల్లా సహా సరిహద్దు వెంబడి మరికొన్నచోట్ల జరిగింది. యుద్ధప్రారంభ దశలో ఇది కేవలం కశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న ఆందోళనగా భావించినప్పటికీ మరణించిన భారత జవాన్ల దగ్గర లభించిన ఆధారాలను బట్టి ఇందులో పాకిస్థాన్ సైనిక దళాల హస్తం కూడా ఉందని రుజువైంది. పాక్ ప్రధాని, సైన్యాధ్యక్షులు చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు బలాన్ని చేకూర్చాయి. దీంతో మన దేశం అప్పమత్తమైంది. వాస్తవాధీనరేఖ దాటి పాకిస్థాన్ ఆక్రమించుకున్న ప్రదేశాలను భారత సైన్యం, భారత వాయుసేన సహకారంతో తిరిగి స్వాధీనపరుచుకుంది. అంతర్జాతీయంగా వస్తున్న వత్తిడిని తట్టుకోలేక పాకిస్తాన్ సైన్యం వెనుతిరిగింది. ఎత్తైన పర్వత ప్రాంతాల మీద జరిగిన యుద్ధాలకి ఇది తాజా ఉదాహరణ. ఇంత ఎత్తులో యుద్ధం జరగడం వల్ల ఇరు పక్షాలకి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అణుబాంబులు కలిగిన దేశాల మధ్య జరిగిన యుద్ధాల్లో ఇది రెండోది. మొదటిది చైనా - సోవియట్ ల మధ్య 1969 లో జరిగింది. కార్గిల్ యుద్ధంలో దాదాపు 500 మంది భారత జవాన్లు, అధికారులు అమరులయ్యారు. -
కార్గిల్ యుద్ధానికి 16 ఏళ్లు
-
కార్గిల్‌లో గెలిచింది మనమే!
కరాచీ: కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ సైన్యం భారత్ పీక పట్టుకున్నంత పని చేసిందని, మూణ్ణెళ్ల పాటు జరిగిన ఆ యుద్ధాన్ని భారత్ మరిచిపోలేదని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ వ్యాఖ్యానించారు. తన పార్టీ ఆల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ యువజన విభాగం ఆదివారంఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలోప్రసంగిస్తూ ‘ద్వితీయశ్రేణి దళాలతో పాటు పాక్ సైన్యం కశ్మీర్‌లోని కార్గిల్ జిల్లాలోకి ప్రవేశించింది. అక్కడి 5 కీలక వ్యూహాత్మకప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. ఒక ప్రాంతంలోని కొంత భాగాన్ని భారత్ తిరిగి వెనక్కు తీసుకోలేకపోయింది. మన సైన్యం భారత్‌పై సాధించిన గొప్ప విజయాన్ని మన రాజకీయ నాయకత్వం సద్వినియోగం చేసుకోలేకపోయింది’ అన్నారు. -
ఒక అర్ధరాత్రి పిలుపు
సైనికుడికి యుద్ధ సమయం కీలకం. కానీ సైన్యంలోని వైద్యుడికి శాంతిసమయం కూడా కీలకమే. యుద్ధం లేనప్పుడు సైనికులు వార్ ఎక్సర్సైజ్ చేస్తారు. అందులో గాయపడిన వారికి వైద్యం చేయాలి, ఎప్పుడు పిలుపు వచ్చినా హాజరు కావడానికి సిద్ధంగా ఉండాలి. అలాంటి పిలుపు ఒక పేదగ్రామీణుడి నుంచి వస్తే! దానికి స్పందించిన లెఫ్ట్‌నెంట్ కల్నల్ డాక్టర్ అశోక్ అనుభవం ఈవారం... మొదట్లో నన్ను విసుక్కున్న సర్జన్ కూడా ‘ఇక నుంచి మీరిచ్చిన ధైర్యంతో సిజేరియన్ ఆపరేషన్లు కూడా చేస్తాను’ అన్నారు. మాది కృష్ణాజిల్లా రేమల్లె. నేను ఆర్మీలో చేరిన నాటికి కశ్మీర్ ప్రశాంతమైన ప్రదేశం. 1990 తర్వాత ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువయ్యాయి. నేను పూంచ్ సెక్టార్లో పని చేసిన రోజుల్లో ప్రతిరోజూ ఒక ఉగ్రదాడి జరిగేది. మేమున్న ప్రదేశం జమ్మూ నగరానికి దాదాపు 250 కిలోమీటర్లుంటుంది. సెలవు రోజుల్లో జమ్మూ నగరానికి వెళ్లాలంటే సరైన రోడ్డు ఉండేది కాదు. ఘాట్‌రోడ్డులో ఏ నిమిషమైనా, ఎక్కడైనా మందుపాతర పేలవచ్చు. వాటికి వెరవకుండా ఉద్యోగం చేయడమే ప్రధానం. సైనికులకు వైద్యం చేయడం నా విధి. స్థానికులకు వైద్యం చేయడం విధి కాదుగానీ ఆసక్తి ఉంటే చేయొచ్చు. నేను వృత్తిరీత్యా ఎనెస్థిటిస్టునే అయినా ఎంతోమంది బిడ్డల్ని డెలివర్ చేశాను, ప్రాణాపాయంలో ఉన్న వారికి అత్యవసర చికిత్స అందించాను. కార్గిల్ సమయంలో... నా ఆర్మీ జీవితంలో కార్గిల్ వార్ మరిచిపోలేనిది. పాకిస్తాన్ వాళ్లు మనదేశంలో బంకర్లు కట్టేసి దాడులు చేశారు. కాల్పులు బయటి నుంచి కాదు, మన ప్రదేశం నుంచే జరుగుతున్నాయి. బంకర్లలో ఉండే శత్రుసైనికులకు ఆహారం వెళ్లే దారులన్నీ మూసేయడంతో పదిహేడు రోజుల్లో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే నాకు సంతోషాన్నిచ్చిన సంఘటన అక్కడి ఓ కుగ్రామంలో జరిగింది. అది 2000 డిసెంబర్. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో స్థానికులు ఒక మహిళను మంచం మీద తెచ్చారు. ఆమె ప్రసవ నొప్పులు పడుతోంది. బిడ్డ అడ్డం తిరిగింది. వెంటనే సిజేరియన్ చేస్తే తప్ప తల్లీబిడ్డా బతకరు. నేను తక్షణమే సర్జన్‌కు ఫోన్ చేశాను. ఆయన కేసు తీసుకోవడానికి సుముఖంగా లేరు. ఆర్మీ డాక్టర్ చేతిలో ప్రాణం పోతే విచారణ జరుగుతుంది. పైగా ఆమె ముస్లిం మహిళ. ఈ ఆపరేషన్ ఫెయిలయితే తీవ్రవాదులు ఆ డాక్టర్ని టార్గెట్ చేయొచ్చు. ఆ భయంతో ‘నేను గైనకాలజిస్టును కాదు’ అని తప్పించుకోజూశారు. కళ్లల్లో కృతజ్ఞతలు ఏం చేయాలి? నాపై అధికారికి ఫోన్ చేశాను. ‘అధికారిగా ఏమీ చెప్పలేను. మీ రిస్కు మీద చేస్తానంటే నాకే అభ్యంతరం లేదు’ అన్నారు. నేను మళ్లీ సర్జన్‌కు ఫోన్ చేసి ‘మీ పై అధికారిగా ఆదేశిస్తున్నాను, వెంటనే రావాలి’ అన్నాను. ‘నాకు సిజేరియన్ ప్రొసీజర్ తెలియదంటే అర్థం చేసుకోరేం’ అన్నారు. ‘ఎన్నో సిజేరియన్ కేసులు దగ్గరగా చూశాను. ప్రతి స్టెప్ నేను చెప్తాను, మీరు చేయండి’ అన్నాను. అలా ఆపరేషన్ మొదలెట్టి, బిడ్డను క్షేమంగా బయటికి తీశాం. గర్భిణి తల్లితోనే నర్సు పనులు చేయించాం. బిడ్డకు వేయడానికి వ్యాక్సిన్ కూడా లేదు. అర్ధరాత్రి కదా, ఉదయాన్నే 90 కిలోమీటర్ల దూరంనుంచి టీకా తెప్పించి వేశాం. ఆ గ్రామస్థుల్లో వ్యక్తమైన కృతజ్ఞత అంతా ఇంతా కాదు. ఆగ్రామ ముఖియా పళ్లెం నిండా ఆక్రోటులు, బాదంకాయలతో వచ్చి ‘మీ సహాయానికి కృతజ్ఞతలు. మీకెంతో ఇవ్వాలని ఉంది. కానీ మా దగ్గరున్నవి ఇవి మాత్రమే’ అన్నారు. అప్పటి నుంచి ఆ గ్రామస్థులు మమ్మల్ని ప్రేమించడం మొదలుపెట్టారు. వాళ్లెవరూ భారత సైన్యాన్ని సొంతవారిగా భావించేవారు కాదు. నేను డాక్టర్‌గా చేసింది తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడ్డమే. కానీ ఆర్మీ వ్యక్తిగా అది దేశమాత రక్షణను పటిష్టం చేయడం! రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి -
‘కార్గిల్’ వీరులకు సెల్యూట్
న్యూఢిల్లీ: ‘విజయ్ దివస్’ సందర్భంగా కార్గిల్ యుద్ధ వీరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాళులర్పించారు. ‘మన సైనిక దళాల అజేయ, అద్భుత ధైర్య సాహసాలు, వారి త్యాగ నిరతిని ఈ విజయ్ దివస్ సందర్భంగా గుర్తు చేసుకుందాం. దేశం ఆ సాహస అమరవీరులకు సెల్యూట్ చేస్తోంది’ అని శనివారం మోడీ ట్వీట్ చేశారు. 1999లో కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ గెలుపును పురస్కరించుకుని ఏటా జూలై 26వ తేదీని విజయ్ దివస్‌గా జరుపుకుంటారు. ఢిల్లీలో త్వరలో అమరవీరులకు స్మారక స్తూపం: జైట్లీ కార్గిల్ యుద్ధంలో అమరులైన వీర జవాన్లకు స్థారక స్తూపాన్ని నిర్మించేందుకు దేశ రాజధానిలో స్థలాన్ని త్వరలో ఖరారు చేస్తామని శనివారం రక్షణశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్లకు నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇండియా గేట్ సమీపంలోని విశాలమైన ప్రిన్సెస్ పార్క్, ఆ పరిసర ప్రాంతాలే దీనికి అనువైనవని భావిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో త్రివిధ దళాధిపతులతో కలసి ప్రిన్సెస్ పార్క్‌ను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. స్మారక స్తూపంపై అమరవీరుల పేర్లను పొందుపరుస్తామన్నారు. దీని నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందన్నారు. సాయుధ బలగాల ఆధునీకరణకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. -
జూలై 26... నిజంగా మరువలేని రోజు
జూలై 26. సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే రోజున కార్గిల్ విజయం భారత్ కి దక్కింది. దాదాపు నెల రోజుల పాటు ప్రపంచంలోని అతి ఎత్తైన ప్రాంతంలో భారత్ పాకిస్తాన్ లు బాహాబాహీగా పోరాడాయి. భారత భూభాగాన్ని చేజిక్కించుకున్న పాకిస్తాన్ పాచికలు పారకుండా, వెనక్కి తరిమేసింది భారత సైన్యం. కార్గిల్ యుద్ధం గురించి కొన్ని విషయాలుః యుద్ధం ఎలా మొదలైంది? మామూలుగా చలికాలం సరిహద్దు సైనిక పోస్టులను ఇరు దేశాల సైనికులూ వదిలేసి వెచ్చని ప్రాంతాలకు వస్తారు. కానీ 1999 శీతాకాలంలో పాకిస్తానీ సైనికులు తమ పోస్టులను వదలలేదు. భారత్ పోస్టులను కూడా ఆక్రమించుకున్నారు. మిలిటెంట్ల రూపంలో పాకిస్తానీలు చొరబడ్డారు. ఈ విషయం మే నెలలో భారత్ దృష్టికి వచ్చింది. దీంతో కార్గిల్ జిల్లాలోని సరిహద్దుల్లో ఉన్న ఎత్తైన మంచు పర్వతాలను తిరిగి చేజిక్కించుకునేందుకు యుద్ధం ప్రారంభించింది. కార్గిల్ ప్రాముఖ్యం ఏమిటి? కార్గిల్ లడాఖ్ ప్రాంతాన్ని కలిపే భాగం. దీన్ని చేజిక్కించుకుంటే లడాఖ్ ప్రాంతం భారత్ చేజారుతుంది. సియాచిన్ గ్లేసియర్ కి వెళ్లే మార్గాలన్నీ మూసుకుపోతాయి. అప్పుడు ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ భూమి సియాచిన్ లో పాక్ జెండా ఎగురుతుంది. అందుకే పాకిస్తాన్ ఈ ఘాతుకానికి పాల్పడింది. కార్గిల్ యుద్ధం ప్రత్యేకత ఏమిటి? కార్గిల్ యుద్ధం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఎత్తు మీద జరిగిన యుద్ధం. పూర్తిగా మంచు కొండల్లో జరిగిన హిమ యుద్ధం. శత్రువు కొండ మీద పాతుకుపోయి ఉన్నాడు. మన సైన్యం కింద ఉంది. కింద నుంచి పైకి ఎగబాకి యుద్ధం చేయడం చాలా క్లిష్టమైనది. ఆ యుద్ధంలో మనం ఘన విజయం సాధించాం. అదీ దీని ప్రత్యేకత. నెల రోజుల పోరాటంలో టైగర్ హిల్, టోలోలింగ్ ఇలా కొండ కొనలపై ఉన్న ఒక్కొక్క స్థావరం నుంచి పాకిస్తాన్ ను తరిమి కొట్టాం. ఈ యుద్ధంలో ఎంత మంది భారతీయ జవాన్లు అమరులయ్యారు? ఇందులో 537 మంది భారతీయ జవాన్లు అమరులయ్యారు. 1363 మంది గాయపడ్డారు. రెండు విమానాలు, ఒక హెలీకాప్టర్ లను నష్టపోయాం. ఒక జవాను శత్రువు చేతిలో ఖైదీగా చిక్కాడు. పాకిస్తాన్ కి చెందిన 453 మంది చనిపోయారు. 665 మంది గాయపడ్డారు. ఎనిమిది మంది బందీలుగా చిక్కారు. కొండ పైకి ఎగబాకి యుద్ధం చేయాల్సి రావడంతో మనకు ఎక్కువ నష్టం సంభవించింది. ఈ యుద్ధంలో గ్రెనేడియర్ యోగేంద్ర యాదవ్, మనోజ్ కుమార్ పాండే, కాప్టెన్ విక్రమ్ బాత్రా, సంజయ్ కుమార్, కాప్టన్ అనుజ్ నయ్యర్, మేజర్ రాజేష్ అధికారి, మేజర్ శరవణన్, స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహూజాలకు అత్యంత పరాక్రమాన్ని ప్రదర్శించారు. కార్గిల్ యుద్ధం వల్ల మనం లాభపడ్డామా, నష్టపడ్డామా? ఈ యుద్ధాన్ని కార్గిల్ కే పరిమితం చేయడం ద్వారా భారత్ ఒక బాధ్యతాయుతమైన దేశంగా మనం ప్రపంచానికి రుజువు చేయగలిగాం. పాకిస్తాన్ సైన్యం మొదట ఈ యుద్ధంతో తనకు సంబంధం లేదన్నా తరువాత అంగీకరించక తప్పలేదు. దీని వల్ల పాకిస్తాన్ కి అంతర్జాతీయంగా దౌత్యపరంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ యుద్ధం తరువాత పాకిస్తాన్ లో ప్రభుత్వమే మారిపోయింది. పాకిస్తాన్ ను ఒక ఉగ్రవాద దేశంగా ప్రపంచం ముందు నిలబెట్టడంలో భారత్ విజయం సాధించింది. -
కార్గిల్ యుద్ద వీరులకు విక్రమ్ సింగ్ నివాళి
జమ్మూ: 1999 కార్గిల్ యుద్ద వీరులకు ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ విక్రమ్ సింగ్ శుక్రవారం నివాళులర్పించనున్నారు. జూలై 31న రిటైర్ కాబోతున్న విక్రమ్ సింగ్ జమ్మూలోని ద్రాసా ప్రాంతాన్ని సందర్శించనున్నట్టు డిఫెన్స్ అధికారులు తెలిపారు. కేవలం ద్రాసాలోని విక్రమ్ సింగ్ పర్యటిస్తారని.. ఆ పర్యటన తర్వాత ఢిల్లీకి చేరుకుంటారని అధికారులు స్పష్టం చేశారు. 1999 నుంచి లడక్ ప్రాంతంలోని కార్గిల్ జిల్లాలోని జరిగిన పాకిస్థాన, భారత దేశాల మధ్య జరిగిన యుద్దంలో మరణించిన వీరులకు విజయ్ దివస్ పేరిట నివాళులర్పిస్తున్నామని అధికారులు తెలిపారు. -
ముస్లిం సైనికుల వల్లే గెలిచాం
కార్గిల్ యుద్ధంపై ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు నోటీసు జారీచేసిన ఎన్నికల కమిషన్ తన వ్యాఖ్యల్లో తప్పు ఏముందని ప్రశ్నించిన ఖాన్ న్యూఢిల్లీ/ఘజియాబాద్: సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్ ‘కార్గిల్’ వ్యాఖ్యలపై బుధవారం పెను దుమారం రేగింది. ఎన్నికల సంఘం ఆయనపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత గెలుపునకు ముస్లిం సైనికులే కారణమని మంగళవారం ఆజంఖాన్ వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై కాంగ్రెస్, బీజేపీ, జేడీ(యు) సహా పలు పార్టీలు విరుచుకుపడ్డాయి. ఆజం వ్యాఖ్యలు సైనికుల సాహసాలను కించపరిచేలా ఉన్నాయని బీజేపీ విమర్శించింది. ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం. మతపరమైన రాజకీయాలకు నిదర్శనమని ఆ పార్టీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది మండిపడ్డారు. సైన్యాన్ని మతపరంగా విభజించడం తగదని, ఈ అంశంపై తగిన చర్యలు తీసుకోవడం ఈసీ పరిధిలోని అంశమని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ పేర్కొన్నారు. సమాజ్‌వాదీ మాత్రం ఈ అంశంపై ఆచితూచి స్పందించింది. సమాజంలో ఓ వర్గాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల వారు అనుభవించే బాధను ఖాన్ చెప్పాలనుకున్నారని పేర్కొంది. మరోవైపు తన వ్యాఖ్యలపై ఇంత దుమారం రేగినప్పటికీ, ఖాన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. తన వ్యాఖ్యల్లో తప్పు ఏముందని, వాటిపై ఎందుకు అంత కోపం తెచ్చుకుంటున్నారని ప్రశ్నించారు. ఆజంఖాన్‌కు ఈసీ నోటీసు... ఆజంఖాన్ ‘కార్గిల్’ వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఎన్నికల కమిషన్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీచేసింది. నిబంధనలు అతిక్రమించినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో 11వ తేదీ సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. -
ఆజంఖాన్ ఏమన్నారో చెప్పండి: ఈసీ
ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ చేసిన ప్రసంగం వివరాలు ఇవ్వాలంటూ ఎన్నికల కమిషన్ ఆదేశించింది. కార్గిల్ విజయానికి కేవలం ముస్లిం సైనికులను మాత్రమే ఆయన కీర్తించడం భారత సైన్యానికి అవమానం అని బీజేపీ ఆరోపించింది. కార్గిల్ శిఖరాన్ని హిందూ సైనికులు గెలుచుకురాలేదని, ముస్లింలు మాత్రమే గెలుచుకొచ్చారని ఆజంఖాన్ వ్యాఖ్యానించినట్లు ఆరోపణలున్నాయి. ఘజియాబాద్‌లో ఎన్నికల ర్యాలీలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి నాహిద్ హసన్ తరఫున ఆయన ప్రచారం చేశారు. ఆజంఖాన్ ఇలా మాట్లాడటం భారత సైన్యానికి తీరని అవమానమని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేదీ అన్నారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం లౌకికవాద పార్టీలు అని చెప్పుకొనేవాళ్లు ఇలా చేస్తున్నారని విమర్శించారు. ఘజియాబాద్ నుంచి లోక్‌సభకు బీజేపీ తరఫున భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ పోటీ చేస్తున్నారు. -
కార్గిల్‌లో మళ్లీ పాక్ కాల్పులు
1999 నాటి యుద్ధం తర్వాత తొలిసారి.. న్యూఢిల్లీ: పద్నాలుగేళ్ల కిందట కార్గిల్‌లోకి చొరబడి భారత జవాన్ల చేతిలో మట్టికరచిన పాక్ సైన్యం తాజాగా మళ్లీ అక్కడ కవ్వింపునకు దిగింది. జమ్మూ కాశ్మీర్‌లోని ఎత్తయిన ప్రాంత మైన కార్గిల్ సెక్టార్లో నాలుగు రోజుల్లో రెండుసార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించింది. పాక్ 14 ఏళ్లలో కార్గిల్‌లో కాల్పులకు పాల్పడడం ఇదే తొలిసారి. సోమవారం రాత్రి ద్రాస్, కార్గిల్‌ల మధ్యలోని కక్సార్లో ఉన్న చెనిగుండ్ పోస్టుపై పాక్ బలగాలు తొలుత చిన్నపాటి ఆయుధాలతో, తర్వాత ఆటోమేటిక్ ఆయుధాలతో కాల్పులు జరిపాయి. గురువారం రాత్రి లడఖ్‌లోని ద్రాస్ సెక్టార్లో సాందో పోస్టుపై ఇదే దుశ్చర్యకు ఒడిగట్టాయి. పాక్ కాల్పులకు భారత జవాన్లు దీటైన ఎదురుకాల్పులతో గట్టి జవాబిచ్చారు. 1999లో పాక్ సైనికులు కార్గిల్‌లోకి చొరబడడంతో ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కార్గిల్ జోలికి రావడానికి భయపడిన పాక్ బలగాలు ప్రస్తుతం సరిహద్దులో కాల్పుల విరమణను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ మళ్లీ కార్గిల్‌లో కాల్పులు జరిపాయి.1999 నాటి యుద్ధంలో భారత యువ లెఫ్టినెంట్ సౌరభ్ కాలియా, ఆయన సహచరులు చెనిగుండ్ పోస్టు వద్దే కనిపించకుండా పోయారు. తర్వాత చిత్రహింసలతో ఛిద్రమైన వారి మృతదేహాలను పాక్ భారత్‌కు అప్పగించింది. కాగా, సరిహద్దులో పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో భారత హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి శుక్రవారం ఉన్నతాధికారులతో కలిసి జమ్మూలో భద్రతా పరిస్థితిని సమీక్షించారు.