కార్గిల్ అమరవీరుల కుటుంబీకులకు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఓదార్పు
ద్రాస్ (లద్దాఖ్): భారత్ తన గౌరవ ప్రతిష్టలను కాపాడుకోవడానికి నియంత్రణ రేఖను దాటడానికి సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అలాంటి పరిస్థితి వస్తే సైనికులకు సహకారం అందించడానికి పౌరులందరూ సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి 24 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం దేశమంతా విజయ్ దివస్ జరుపుకుంది. ద్రాస్‌లోని కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో రాజ్‌నాథ్ మాట్లాడుతూ రష్యా, ఉక్రెయిన్ మధ్య ఏడాది దాటినా ఇంకా యుద్ధం కొనసాగుతోందని అంటే పౌరులు భాగస్వాములు కావడం వల్లేనని అభిప్రాయపడ్డారు.
పొరుగుదేశమైన పాకిస్తాన్ కవి్వంపు చర్యల్ని పరోక్షంగా ప్రస్తావించిన ఆయన మన దేశ గౌరవాన్ని, మర్యాదని కాపాడుకోవడానికి ఎంత తీవ్రమైన చర్యలకైనా దిగుతామని హెచ్చరించారు. పొరుగుదేశం రెచ్చగొట్టే చర్యలకి దిగితే నియంత్రణ రేఖ దాటుతామన్నారు. ‘‘మన దేశంలో యుద్ధం పరిస్థితులు వస్తే సైనిక బలగాలకు ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారు. పరోక్షంగా తమ సహకారాన్ని అందిస్తారు. ఈ సారి అవసరమైతే ప్రత్యక్షంగా యుద్ధభూమిలో పాల్గొనాలని, దానికి తగ్గట్టు మానసికంగా సంసిద్ధులు కావాలని కోరుతున్నాను’’ అని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. దేశ ప్రయోజనాలను కాపాడుకునే అంశంలో మన సైన్యం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కార్గిల్ యుద్ధం సమయంలో భారత ఆర్మీ పాకిస్తాన్‌కేకాక యావత్ ప్రపంచానికి సందేశం పంపించిందన్నారు. పాకిస్తాన్ మనకి వెన్నుపోటు పొడవడంతో కార్గిల్ యుద్ధం వచి్చందన్నారు. అంతకు ముందు కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ల సమాధుల్ని సందర్శించి పుష్ఫగుచ్ఛాలుంచి నివాళులరి్పంచారు.
ప్రధాని నివాళులు
కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు రాష్టపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ , కేంద్ర మంత్రులు, ఇతర నాయకులు నివాళులర్పించారు. విజయ్ దివస్ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ట్వీట్ చేశారు. ‘‘మన దేశ సైనికుల అపూర్వమైన విజయాన్ని దేశం గుర్తు చేసుకుంటోంది. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన అమరులందరికీ నివాళులరి్పస్తున్నాను. దేశం కోసం త్యాగం చేసిన వారి గాథలన్నీ తరతరాలకు స్ఫూర్తి దాయకం’’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రధాని మోదీ తన ట్వీట్‌లో కార్గిల్ విజయ్ దివస్ భారత వీరుల ధైర్య గాథల్ని గుర్తు చేస్తుందని, ప్రజలందరికీ వారు స్ఫూర్తిదాయకంగా నిలిచారని పేర్కొన్నారు. అమరులందరికీ హృదయపూర్వక నివాళులరి్పస్తున్నట్టుగా పేర్కొన్నారు. 1999లో కార్గిల్‌ను ఆక్రమించిన పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొట్టి భారత్ విజయ దుందుభి మోగించింది.
Comments
Please login to add a commentAdd a comment