War Memorial
-
Kargil Vijay Diwas: ఘర్ మే ఘుస్ కే...
ద్రాస్ (లద్దాఖ్): భారత్ తన గౌరవ ప్రతిష్టలను కాపాడుకోవడానికి నియంత్రణ రేఖను దాటడానికి సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అలాంటి పరిస్థితి వస్తే సైనికులకు సహకారం అందించడానికి పౌరులందరూ సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి 24 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం దేశమంతా విజయ్ దివస్ జరుపుకుంది. ద్రాస్‌లోని కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో రాజ్‌నాథ్ మాట్లాడుతూ రష్యా, ఉక్రెయిన్ మధ్య ఏడాది దాటినా ఇంకా యుద్ధం కొనసాగుతోందని అంటే పౌరులు భాగస్వాములు కావడం వల్లేనని అభిప్రాయపడ్డారు. పొరుగుదేశమైన పాకిస్తాన్ కవి్వంపు చర్యల్ని పరోక్షంగా ప్రస్తావించిన ఆయన మన దేశ గౌరవాన్ని, మర్యాదని కాపాడుకోవడానికి ఎంత తీవ్రమైన చర్యలకైనా దిగుతామని హెచ్చరించారు. పొరుగుదేశం రెచ్చగొట్టే చర్యలకి దిగితే నియంత్రణ రేఖ దాటుతామన్నారు. ‘‘మన దేశంలో యుద్ధం పరిస్థితులు వస్తే సైనిక బలగాలకు ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారు. పరోక్షంగా తమ సహకారాన్ని అందిస్తారు. ఈ సారి అవసరమైతే ప్రత్యక్షంగా యుద్ధభూమిలో పాల్గొనాలని, దానికి తగ్గట్టు మానసికంగా సంసిద్ధులు కావాలని కోరుతున్నాను’’ అని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. దేశ ప్రయోజనాలను కాపాడుకునే అంశంలో మన సైన్యం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కార్గిల్ యుద్ధం సమయంలో భారత ఆర్మీ పాకిస్తాన్కేకాక యావత్ ప్రపంచానికి సందేశం పంపించిందన్నారు. పాకిస్తాన్ మనకి వెన్నుపోటు పొడవడంతో కార్గిల్ యుద్ధం వచి్చందన్నారు. అంతకు ముందు కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ల సమాధుల్ని సందర్శించి పుష్ఫగుచ్ఛాలుంచి నివాళులరి్పంచారు. ప్రధాని నివాళులు కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు రాష్టపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ , కేంద్ర మంత్రులు, ఇతర నాయకులు నివాళులర్పించారు. విజయ్ దివస్ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ట్వీట్ చేశారు. ‘‘మన దేశ సైనికుల అపూర్వమైన విజయాన్ని దేశం గుర్తు చేసుకుంటోంది. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన అమరులందరికీ నివాళులరి్పస్తున్నాను. దేశం కోసం త్యాగం చేసిన వారి గాథలన్నీ తరతరాలకు స్ఫూర్తి దాయకం’’ అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ప్రధాని మోదీ తన ట్వీట్లో కార్గిల్ విజయ్ దివస్ భారత వీరుల ధైర్య గాథల్ని గుర్తు చేస్తుందని, ప్రజలందరికీ వారు స్ఫూర్తిదాయకంగా నిలిచారని పేర్కొన్నారు. అమరులందరికీ హృదయపూర్వక నివాళులరి్పస్తున్నట్టుగా పేర్కొన్నారు. 1999లో కార్గిల్‌ను ఆక్రమించిన పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొట్టి భారత్ విజయ దుందుభి మోగించింది. -
యువత జవాన్లను ఆదర్శంగా తీసుకోవాలి
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని యువత జవాన్లను ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. శుక్రవారం ఇండియా గేటు సమీపంలోని వార్ మెమోరియల్‌ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అమర జవాన్ల స్థూపానికి పుష్పగుచ్చంతో నివాళులర్పించారు. అధికారులు జవాన్లు చేసిన సేవలను ఆయనకు వివరించారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. యుద్ధంలో మరణించిన అమర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వార్ మెమోరియల్ సందర్శన మనసుకు ఎంతో ప్రశాంతతనిచ్చిందని తెలిపారు. దేశంలోని ప్రజలందరూ వార్ మెమోరియల్‌ను సందర్శించాలని సూచించారు. అమర జవాన్ల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులకు ధన్యవాదాలు తెలిపారు. సైనికుల కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉందని అన్నారు. -
అయ్యా మోదీ.. నీ ఎన్నికల సభ కాదిది!
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించిన జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించి జాతికి అంకితమిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీపై మోదీ పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ గత ప్రభుత్వాల హయాంలో సైన్యం, దేశ భద్రత నేరపూరిత నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపించారు. గత ప్రభుత్వంలో తొలి ప్రాధాన్యత వారి సొంత కుటుంబానికి ఉండేదనీ, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ప్రాధాన్యత దేశానికి ఇచ్చామన్నారు. రక్షణ ఆయుధాల సామర్థ్యాన్ని పెంచుకోవడం, బలగాలను బలోపేతం చేయడం తదితరాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు గత ప్రభుత్వం హయాంలో పెండింగ్‌లో ఉండేవనీ, తాము వచ్చాక వాటికి ఆమోదం లభించిందని మోదీ వెల్లడించారు. అయితే వార్‌మెమోరియల్ ప్రారంభ సమావేశంలో మోదీ రాజకీయ ప్రసంగం చేయడంపై పలు పార్టీల నాయకులు, మేధావులు తప్పుబడుతున్నారు. కాంగ్రెస్ అయితే.. ‘మోదీ.. ఇది నీ ఎన్నికల సభ అనుకుంటున్నావా?’ అని ఘాటుగా ప్రశ్నిస్తోంది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లను స్మరించుకునే సందర్భంలో మోదీ రాజకీయ ప్రసంగం చేయడం ఏంటని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది ప్రశ్నించారు. జవాన్ల మరణాన్ని కూడా ఓట్లు, రాజకీయాల కోసం మోదీ వాడుకుంటున్నారని మండిపడ్డారు. అమరుల స్మారక సభను.. ఎన్నికల ప్రచార సభగా మార్చి వీర జవాన్ల త్యాగాలను అవమానించవద్దని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. 70 ఏళ్లుగా ఏర్పాటు కానీ జాతీయ యుద్ధ స్మారక ఏర్పాటు క్రెడిట్ మోదీదేనని, కానీ ఆయన రాజకీయ ప్రసంగమే తీవ్రంగా నిరాశపర్చిందని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఓమర్ అబ్దుల్లా తెలిపారు. ఆయన ప్రసంగంతో స్మారక సభ కాస్త బీజేపీ ఎన్నికల ప్రచార సభగా తలిపించిందన్నారు. ప్రముఖ జర్నలిస్ట్ సాగరికా ఘోష్ సైతం ప్రధాని నరేంద్ర మోదీని తప్పుబట్టారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల శౌర్యాన్ని దేశం గుర్తు చేసుకోవాల్సిన సందర్భంలో రాజకీయప్రత్యర్థులపై విమర్శలు చేయడం సరైన సమయం కాదని అభిప్రాయపడ్డారు. ఇక బ్రిటిష్ కాలం నాటి యుద్ధాల్లో మరణించిన భారతీయ సైనికుల సంస్మరణార్థం నిర్మించిన ఇండియా గేట్ పక్కనే తాజా స్మారకాన్ని 40 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రానంతరం వివిధ యుద్ధాల్లోనూ, శాంతి పరిరక్షణ దళాల్లోనూ ఉంటూ మరణించిన 25,942 మంది అమర వీరుల పేర్లను ఈ స్మారకంపై సువర్ణాక్షరాలతో లిఖించారు. చదవండి: యుద్ధ స్మారకం అంకితం -
యుద్ధ స్మారకం అంకితం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించిన జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాని మోదీ సోమవారం ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. బ్రిటిష్ కాలం నాటి యుద్ధాల్లో మరణించిన భారతీయ సైనికుల సంస్మరణార్థం నిర్మించిన ఇండియా గేట్ పక్కనే తాజా స్మారకాన్ని 40 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రానంతరం వివిధ యుద్ధాల్లోనూ, శాంతి పరిరక్షణ దళాల్లోనూ ఉంటూ మరణించిన 25,942 మంది అమర వీరుల పేర్లను ఈ స్మారకంపై సువర్ణాక్షరాలతో లిఖించారు. కాంగ్రెస్ పార్టీపై మోదీ పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ గత ప్రభుత్వాల హయాంలో సైన్యం, దేశ భద్రత నేరపూరిత నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపించారు. అందుకే స్మారక నిర్మాణం ఇంత ఆలస్యమైందన్నారు. స్మారక ఆవిష్కరణకు ముందు కొంతమంది మాజీ సైనికులతో మోదీ సమావేశమై అక్కడ ప్రసంగించారు. గత ప్రభుత్వంలో తొలి ప్రాధాన్యత వారి సొంత కుటుంబానికి ఉండేదనీ, తాము అధికారంలోకి తొలి ప్రాధాన్యత దేశానికి ఇచ్చామని మోదీ అన్నారు. రక్షణ ఆయుధాల సామర్థ్యాన్ని పెంచుకోవడం, బలగాలను బలోపేతం చేయడం తదితరాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు గత ప్రభుత్వం హయాంలో పెండింగ్‌లో ఉండేవనీ, తాము వచ్చాక వాటికి ఆమోదం లభించిందని మోదీ వెల్లడించారు. మాజీ సైనికుల కోసం ప్రభుత్వం మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నెలకొల్పుతుందని చెప్పారు. నాలుగు ఏకకేంద్రక వృత్తాల్లో.. అమర చక్ర, వీరతా చక్ర, త్యాగ చక్ర, రక్షక చక్ర అనే నాలుగు ఏక కేంద్రక వృత్తాల ఆకారంలో, రూ. 176 కోట్ల నిధులతో స్మారకాన్ని ఏర్పాటు చేశారు. ఈ నాలుగు వృత్తాల కేంద్రంలో ఓ రాతి స్థూపం, అమరజ్యోతి ఉంటాయి. వీరతా చక్రలో భారత సైన్యం పోరాడిన యుద్ధాల నమూనా చిత్రాలను కాంస్య లోహంతో చేసి గోడలపై అమర్చారు. ఆర్మీ, వైమానిక దళం, నౌకాదళం యుద్ధాల్లో పోరాడినట్లుగా చూసే ఆరు కుడ్య చిత్రాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రానంతరం అమరులైన సైనికుల సంస్మరణ కోసం ఓ స్మారకాన్ని నిర్మించాలని దశాబ్దాలుగా ప్రతిపాదన ఉన్నప్పటికీ అడుగు ముందుకు పడలేదు. చివరకు మోదీ ప్రభుత్వం 2015లో స్మారక నిర్మాణానికి పచ్చజెండా ఊపగా, పనులు మాత్రం గతేడాది ఫిబ్రవరిలోనే ప్రారంభమయ్యాయి. ఈ స్మారకంలో గ్రాఫిక్ ప్యానెళ్లు, రాతి కుడ్య చిత్రాలు కూడా ఉన్నాయి. స్మారకం అమరసైనికులకు అంజలి ఘటించే ప్రదేశంగా ఉంటుంది. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ జాతీయ స్మారకాన్ని ఆవిష్కరించడం ఓ చరిత్రత్మాక ఘట్టమనీ, ఇప్పుడు భారతీయుల తీర్థయాత్రలకు మరో ప్రదేశం అందుబాటులోకి వచ్చిందన్నారు. స్మారకం విశేషాలు ► ఇండియా–చైనా(1962), ఇండియా–పాక్ (1947,1965,1971), కార్గిల్(1999) యుద్ధాల సమయంలో, శ్రీలంకలో శాంతి పరిరక్షక దళంలో ఉంటూ అమరులైన 25,942 మంది భారత సైనికుల జ్ఞాపకార్థం దీనిని నిర్మించారు. ► స్మారక స్థూపం పొడవు 15.5 మీటర్లు. కింది భాగంలో అమరజ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఈ రాతి స్థూపం చుట్టూ నాలుగు ఏక కేంద్రక వృత్తాకార వలయాలను నిర్మించారు. ► అన్నింటికన్నా బాహ్య వలయానికి రక్షక చక్ర అని పేరు పెట్టి ఆ వలయం మధ్యమధ్యల్లో 600 మొక్కలు నాటారు. ఈ మొక్కలే సైనికులుగా, దేశానికి కాపలా కాస్తున్న వారుగా దీనిని చిత్రీకరించారు. ► త్యాగ చక్ర వలయంలో 16 గోడలను నిర్మించారు. వీటిపైనే అమర సైనికుల పేర్లను గ్రానైట్ ఫలకాలపై బంగారు వర్ణంలో లిఖించారు. సైనికులకు నివాళి అర్పించే స్థలం ఇదే. ఈ గ్రానైట్ ఫలకాలను పురాతన కాలం నాటి భారతీయ యుద్ధ తంత్రం చక్రవ్యూహం ఆకారంలో అమర్చారు. ► స్మారకంలో భాగంగా ఏర్పాటు చేసిన పరమ్ యోధ స్థల్లో పరమ వీర చక్ర పురస్కారం పొందిన 21 మంది సైనికుల విగ్రహాలను నెలకొల్పారు. వీటిలో సజీవులైన సుబేదార్ మేజర్ బానాసింగ్, సుబేదార్ మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్, సుబేదార్ సంజయ్ కుమార్ల విగ్రహాలు ఉన్నాయి. -
'పాకీస్థానీలనూ ఇండియన్ ఆర్మీ కాపాడింది'
-
'పాకీస్థానీలనూ ఇండియన్ ఆర్మీ కాపాడింది'
భోపాల్: సైన్యం మాట్లాడదు కానీ ప్రరాక్రమం చూపుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అయితే సైనికులంటే కేవలం పరాక్రమానికే కాదు మానవత్వానికి కూడా ప్రతీకలని ఉద్ఘాటించారు. సైనికుల త్యాగాల వల్లే పౌరులు సుఖంగా జీవించగలుగుతున్నరని గుర్తుచేశారు. యుద్ధంలో అమరవీరులైన సైనికుల స్మృత్యార్థం దేశంలోనే మొట్టమొదటిగా భోపాల్ లో నిర్మించిన అమరవీరుల స్మారక కేంద్రం (శౌర్య స్మారక్)ను శుక్రవారం ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్మీ మాజీ ఉద్యోగులను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. 'యుద్ధ వీరులను స్మరించుకోవడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నా. ఆర్మీ అనగానే మొదట గుర్తొచ్చేది వాళ్ల యూనిఫాం. అది పరాక్రమానికేకాదు మానవత్వానికి కూడా చిహ్నంగా ఉంటుంది. జమ్ముకశ్మీర్ ను వరదలు ముంచెత్తినప్పుడు సైన్యం రంగంలోకి దిగి ప్రజలను కాపాడింది.. ఎవరైతే రోజూ తమ మీద రాళ్లు విసురుతారో, అలాంటి ప్రజలను భుజాలపై మోస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అంతెందుకు.. ఈ ఏడాది ప్రారంభంలో యెమెన్ లో అంతర్యుద్ధం తలెత్తినప్పుడు అక్కడ చిక్కుకున్న ఎంతో మంది భారతీయులతోపాటు పాకిస్థానీలను కూడా ఇండియన్ ఆర్మీ కాపాడింది. అసలైన మానవత్వం అంటే ఇదే' అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సైనికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ప్రధాని.. ఏళ్లుగా నానుతోన్న వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకం అమలుతో మాజీ సైనికులకు లబ్దిచేకూర్చామన్నారు. రక్షణ మంత్రి మనోహర్ పారికర్ మాట్లాడుతూ.. శత్రు శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేసిన తరుణంలోనే ఈ స్మారక స్థూపాన్ని ప్రారంభించుకోవడం గర్వంగా ఉందన్నారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహార్ మాట్లాడుతూ అమరులైన సైనికుల కుటుంబ సభ్యులకు తమ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నెలకు రూ.5వేలు క్రమంతప్పకుండా అందిస్తామని ప్రకటించారు. -
నేవీక్షణం
సంద్రమంత సంబరం... అంతర్జాతీయ ఫ్లీట్ రీవ్యూ (ఐఎఫ్ఆర్) గురువారం తూర్పునౌకాదళం ప్రధాన స్థావరమైన విశాఖలో అట్టహాసంగా ప్రారంభమైంది. వార్ మెమోరియల్ వద్ద అమర వీరులకు నివాళులర్పించడంతో ప్రారంభమైన కార్యక్రమం నావికా దళ ఫైటర్ విమానాలు, రెస్య్యూ విమానాల విన్యాసాలతో అబ్బురపరిచింది. సాయంత్రం ఆర్కే బీచ్ రోడ్డులో విదేశీ స్వదేశీ నావికా సిబ్బందితో కూడిన సిటీ పరేడ్ రిహార్సల్స్ కనుల పండువగా నిలిచాయి. వివిధ దేశాల సంప్రదాయాలను ప్రతిబింబించే సాంస్కృతిక ప్రదర్శనలు పరేడ్‌కు ప్రత్యేక ఆకర్షణ. సంద్రమంత సంబరం... అంతర్జాతీయ ఫ్లీట్ రీవ్యూ (ఐఎఫ్ఆర్)గురువారం తూర్పునౌకాదళం ప్రధాన స్థావరమైన విశాఖలో అట్టహాసంగాప్రారంభమైంది. వార్ మెమోరియల్ వద్ద అమర వీరులకు నివాళులర్పించడంతోప్రారంభమైన కార్యక్రమం నావికా దళ ఫైటర్ విమానాలు, రెస్య్యూ విమానాలవిన్యాసాలతో అబ్బురపరిచింది. సాయంత్రం ఆర్కే బీచ్ రోడ్డులో విదేశీ స్వదేశీ నావికాసిబ్బందితో కూడిన సిటీ పరేడ్ రిహార్సల్స్ కనుల పండువగా నిలిచాయి. వివిధ దేశాల సంప్రదాయాలను ప్రతిబింబించే సాంస్కృతిక ప్రదర్శనలు పరేడ్‌కు ప్రత్యేక ఆకర్షణ.