
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని యువత జవాన్లను ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. శుక్రవారం ఇండియా గేటు సమీపంలోని వార్ మెమోరియల్‌ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అమర జవాన్ల స్థూపానికి పుష్పగుచ్చంతో నివాళులర్పించారు. అధికారులు జవాన్లు చేసిన సేవలను ఆయనకు వివరించారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. యుద్ధంలో మరణించిన అమర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వార్ మెమోరియల్ సందర్శన మనసుకు ఎంతో ప్రశాంతతనిచ్చిందని తెలిపారు. దేశంలోని ప్రజలందరూ వార్ మెమోరియల్‌ను సందర్శించాలని సూచించారు. అమర జవాన్ల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులకు ధన్యవాదాలు తెలిపారు. సైనికుల కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment