ఢిల్లీ: సెంట్రల్ ఢిల్లీలోని రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్‌లోకి వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటనపై విద్యార్థులు పెద్దఎత్తున నిరసన తెలుపుతున్నారు. తాజాగా రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్ ఓనర్ అభిషేక్ గుప్తా, కో-ఆర్డినేటర్ దేశ్‌పాల్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున ఘటనా స్థలంలో ఇద్దరు విద్యార్థినులు, ఒక విద్యార్థి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనలో ఓనర్ అభిషేక్ గుప్తా, కో-ఆర్డినేటర్ దేశ్‌పాల్ సింగ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Delhi's Old Rajendra Nagar coaching centre incident | The owner and coordinator of the coaching centre arrested: Delhi Police
— ANI (@ANI) July 28, 2024
చదవండి: Delhi Tragedy: ‘ముగ్గురు కాదు 10 మంది మృతి’
‘‘ఈ ఘటనపై పలు సెక్షన్ల కింది రాజేంద్రనగర్ పోలీసు స్టేషనలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం. ఈ ప్రమాదంపై ఇప్పటికే విచారణ చేపట్టాం’’ అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ఎం.హార్షవర్ధన్ తెలిపారు. మృతిచెందినవారిని తానియా సోని (25), శ్రేయా యాదవ్ (25), నెవిన్ డాల్విన్ (28)గా పోలీసులు గుర్తించారు.
శ్రేయా యాదవ్ ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్, తాన్యా సోనిది తెలంగాణ, నవీన్ డాల్విన్ కేరళలోని ఎర్నాకులానికి చెందిన విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. కోచింగ్ సెంటర్‌లో మృతి చెందిన తానీయా సోని స్వస్థలం బీహార్. తానియా సోని తండ్రి తెలంగాణ సింగరేణిలో ప్రస్తుతం మేనేజర్‌గా పని చేస్తున్నారు.
చదవండి: వీడియో: ఢిల్లీ ప్రమాదం ఇలా జరిగింది.. అభ్యర్థి ఆవేదన
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దిగ్భ్రాంతి
ఢిల్లీ రాజేంద్రనగర్‌లోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్‌లో వరదల కారణంగా సికింద్రాబాద్‌కు చెందిన తానియా సోని అనే 25 ఏళ్ల యువతి మృతి చెందిన ఘటనపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తానియా సోని తండ్రి విజయ్ కుమార్‌ను కిషన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు.
కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భౌతికకాయం వీలైనంత త్వరగా సికింద్రాబాద్ చేర్చేందుకు సంపూర్ణంగా సహకరిస్తామని తెలియజేశారు. ఢిల్లీ పోలీసులు, ఇతర అధికారులతో మాట్లాడి.. పెండింగ్‌లో ఉన్న అన్ని ఫార్మాలిటీస్‌ను త్వరగా పూర్తిచేయడంలో చొరవతీసుకోవాలని ఢిల్లీలోని తన కార్యాలయాన్ని కిషన్ రెడ్డి ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment