IAS Academy
-
ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన: ‘ఓనర్‌కు తెలిసే ఉల్లంఘన’
ఢిల్లీ: భారీ వరద కారణంగా ఢిల్లీలోని రావుస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి నీరు పోటెత్తి.. ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా సృష్టించింది. ఈ కేసులో నిందితులు అయిన రావుస్ కోచింగ్ సెంటర్ ఓనర్.. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు తెలిసి కూడా ఉద్దేశపూర్వంగా బేస్మెంట్ను లైబ్రరీగా వినియోగించారని దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్( సీబీఐ) ఆరోపణలు చేసింది.ఈ నేపథ్యంలో నిందుతులైన కోచింగ్ ఇనిస్టిట్యూట్ యజమాని అభిషేక్ గుప్తా, ఇతర నిందితులు దేశపాల్ సింగ్, హర్విందర్ సింగ్, పర్వీందర్ సింగ్, సరబ్జీత్ సింగ్ , తజిందర్ సింగ్‌లను ‘కస్టడీ విచారణ’ కోసం అనుమతి ఇవ్వాలని దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రత్యేక కోర్టు కోరింది.శనివారం అడిషినల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ నిశాంత్ గార్గ్ ఆరుగురి నిందితులను సెప్టెంబర్ 4 వరకు సీబీఐ కస్టడీకి పంపించారు. రావుస్ కోచింగ్ సెంటర్‌కు సుమారు ఏడాది నుంచి ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ లేదని తమ దర్యాప్తులో తెలిసిందని పేర్కొంది.ఇదే విషయాన్ని గతేడాది ఈ ప్రాంతంలోని కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్లు లేవని హైకోర్టు గుర్తించినట్లు తెలిపింది.దీంతో రావుష్ స్టడీ సర్కిల్ యజమానికి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు కోర్టుకు ప్రత్యేక కోర్టుకు వెల్లడించింది. కాగా.. ఆగస్ట్ 8, 2023న కోచింగ్ సెంటర్ యజమాని ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ కోసం ఎంసీడీకి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. జూలై 9, 2024న ఇన్స్టిట్యూట్కి సర్టిఫికేట్‌ను అధికారులు జారీ చేశారని తెలిపారు. ఈ ఘటనపై జూలై 27న చోటుచేసుకోగా.. భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం కేసు నమోదు అయిది. ఇక.. విచారణను ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ పోలీసుల నుంచి ఆగస్టు 2న సీబీఐకి బదిలీ చేసింది. -
కోచింగ్ సెంటర్లపై సుప్రీం కోర్టు ఆగ్రహం
ఢిల్లీ: ఢిల్లీలోని రాజేంద్రనగర్ సివిల్స్ కోచింగ్ సెంటర్లో విద్యార్థుల మృతి కేసు విచారణను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. భద్రత నిబంధనలపై తీసుకున్న చర్యలపై సమాధానం చెప్పాలని ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా కోచింగ్ సెంటర్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. కోచింగ్ సెంటర్లు మృత్యు కుహరాలుగా మారాయని మండిపడింది. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. భద్రతా ప్రమాణాలు పాటించకపోతే ఆన్‌లైన్‌లోకి మారాలని తెలిపింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవల్సిన భద్రత చర్యలపై ఎన్సీఆర్ వివరణ కోరింది. ఇటీవల ఢిల్లీలోని రావూస్ సివిల్స్ కోచింగ్ సెంటర్లోని బేస్మెంట్లోకి వరదనీరు పోటెత్తటంతో ముగ్గురు అభ్యర్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. విమర్శలు చెలరేగడంతో.. అప్రమత్తమైన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్.. సెల్లార్లలో, అలాగే నిబంధనలను అతిక్రమించిన కోచింగ్ సెంటర్లకు సీజ్ వేసింది. మరోవైపు ఢిల్లీ హైకోర్టు సైతం అభ్యర్థులు ప్రాణాలు కోల్పోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. అధికార యత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. -
రావూస్ కోచింగ్ సెంటర్ కేసు.. సీబీఐకి అప్పగించిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రావూస్ సివిల్స్ కోచింగ్ సెంటర్ భవనం సెల్లార్లో వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన కేసు దర్యాప్తును ఢిల్లీ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారిని నియమించాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌కు యాక్టింగ్ సీజే మన్మోహన్, జస్టిస్ తుషార్రావులతో కూడిన ధర్మాసనం సూచించింది. ఇంత పెద్ద ఘటనలో దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగిందని సమాజానికి భరోసా ఇచ్చేందుకే కేసు సీబీఐకి అప్పగిస్తున్నట్లు కోర్టు తెలిపింది. ముగ్గురు విద్యార్థులు భవనం కింద వరద నీటిలో మునిగి మృతి చెందడంపై ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్, పోలీసులపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఇలాంటి ఘటన ఎలా జరిగిందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది.ఇంకా నయం.. వరద నీటిని అరెస్టు చేయలేదు..విధులు సరిగా నిర్వహించకపోవడంపై ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులను కోర్టు మందలించింది. కోచింగ్ సెంటర్ భవన నిర్మాణ అనుమతులు ఇచ్చిన అధికారులను విచారించకుండా ఘటన జరిగిన సమయంలో కోచింగ్‌సెంటర్ పక్కనుంచి వెళ్లిన కారు నడిపిన వ్యక్తిని అరెస్టు చేయడమేంటని పోలీసులకు కోర్టు చివాట్లు పెట్టింది. దయతలచి భవనం కిందకు వచ్చిన వరద నీటిని అరెస్టు చేయకుండా వదిలిపెట్టారని పోలీసులపై కోర్టు సెటైర్లు వేయడం గమనార్హం. -
ఢిల్లీ కోచింగ్ సెంటర్ల నియంత్రణకు ప్రత్యేక చట్టం: మంత్రి అతిశీ
ఢిల్లీ: ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టం తీసుకువస్తామని రాష్ట్ర మంత్రి అతిశీ అన్నారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ఢిల్లీలో కోచింగ్ సెంటర్లను నియంత్రించేందుకు ప్రభుత్వం చట్ట తీసుకురానుంది. ఈ చట్టం రూపకల్పన కోసం ప్రభుత్వ అధికారులు, పలు కోచింగ్ సెంటర్లలోని విద్యార్థులతో ఓ కమిటిని ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం తీసుకవచ్చే చట్టంలో మౌలిక వసతులు, టీచర్ల విద్యార్హత, ఫీజు నిబంధనలు, తప్పుదోవ పట్టించే కోచింగ్ సెంటర్ల ప్రకటనలకు సంబంధించిన నిబంధనలు ఉంటాయి. చట్ట రూపకల్పన ప్రజల నుంచి కూడా సూచనలు, సలహాలు స్వీకరిస్తాం. ..బిల్డింగ్ బేస్మెంట్ల విషయంలో నిబంధనలు ఉల్లంఘించిన కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్( డీఎంసీ) కఠిన చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే రాజేంద్రనగర్, ముఖర్జీ నగర్, లక్ష్మీ నగర్, ప్రీత్ విహార్‌లో ఉన్న బేస్మెంట్లను కలిగి ఉన్న 30 కోచింగ్ సెటర్లను సీజ్ చేశాం. మరో 200 కోచింగ్ సెంటర్లకు డీఎంసీ అధికారులు నోటీసులు పంపారు. ఈ ఘటనకు సంబంధించిన రిపోర్టును ఆరు రోజుల్లో సమర్పిస్తాం. ఈ ఘటనలో మున్సిపల్ అధికారులు దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం’అని అతిశీ తెలిపారు. ఇటీవల ఢిల్లీలోని రాజేంద్రనగర్ ఉన్న రావూస్ సివిల్స్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి వరద నీరు పోటెత్తిన ఘటనలో ముగ్గురు అభ్యర్థులు మృతిచెందిన విషయంతెలిసిందే. -
ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన: ‘నా భర్త నిందితుడు కాదు.. బాధితుడు’
ఢిల్లీ: ఢిల్లీలోని సివిల్స్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి వరద నీరు పోటేత్తటంతో ముగ్గురు అభ్యర్థులు మృతి చెందిన ఘటనకు కారణం అంటూ ఓ కారు ఓనర్‌ను అరెస్ట్ చేశారు. కోచింగ్ సెంటర్ ముందు రోడ్డుపై వేగంగా కారు నడపటం వల్ల సెల్లారులోకి నీళ్లు పోటేత్తిన కారణం చూపుతూ.. మంజూ కథూరియా అనే వ్యాపారవేత్తను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే మంజూ కథూరియా అరెస్ట్‌పై ఆయన భార్య షిమా మీడియాతో మాట్లాడారు.‘ఇది పూర్తిగా అవాస్తవమైన ఆరోపణ. ఈ ఘటనలో ముగ్గురు అభ్యర్థులు మృతిచెందారు. ఇది కచ్చితంగా సిస్టం ఫెయిల్యూర్. అక్కడ నా భర్త రాష్ డ్రైవింగ్ చేయలేదు. వీడియోలో కూడా కనిపిస్తుంది. నా భర్త అధిక వేగంగా కూడా కారు నడపలేదు. ఆయన కేవలం సురక్షిత ప్రాంతానికి వెళ్లడానికి మాత్రమే ప్రయత్నం చేశారు. అయినా రావూస్ సివిల్స్ సెంటర్ వాళ్లు ఎటువంటి అనుమతి లేకుండా బేస్మెంట్లో లైబ్రరీ ఎలా నడుపుతున్నారు?. భారీ వర్షాలకు పోలీసులు ఎందుకు ఆ రోడ్డును మూసివేయాలేదు. ఎవరిదీ తప్పు ఉందో అధికారులే గుర్తించాలి. నా భర్త ఎటువంటి తప్పు చేయలేదు. నన్యాయ వ్యవస్థపై మాకు పూర్తి నమ్మకం ఉంది. న్యాయ స్థానం కూడా న్యాయమైన నిర్ణయమే తీసుకుంటుంది. వీడియోలో తన భర్త కారు కనిపించటంతో కేవలం విచారణ కోసమే తన భర్తను తీసుకువెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆయన్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు’ అని షిమా తెలిపారు.#WATCH | Delhi: Old Rajinder Nagar coaching centre incident | Shima Kathuria- wife of one of the accused Manuj Kathuria, says "This is a completely wrong allegation. It was a painful incident due to which 3 innocents lost their lives. It is a failure of the system. There was no… pic.twitter.com/1MsNErILWW— ANI (@ANI) July 30, 2024 Another video has surfaced from outside Rajendra Nagar Institute in which it can be seen how the passing of a vehicle increased the flow of water, due to which the gates broke and water entered the basement.#Delhi #CoachingCenter #Flood #HeavyRain #RaoIASCoaching… pic.twitter.com/cZUBkKbNUm— POWER CORRIDORS (@power_corridors) July 28, 2024 -
ఢిల్లీ ఘటన కారకులపై చర్యలు తీసుకోవాలి: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్‌లో రావుస్ ఐఏఎస్ స్టడీ సెంటర్ బేస్మెంట్లోకి వరద నీరు పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. విద్యార్థులు ఇలా జల సమాధి కావడం ఆందోళనకరమని ఆవేదన వ్యక్తం చేశారు.కాగా, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘సివిల్స్ విద్యార్థులు ముగ్గురు జల సమాధి కావడం ఆందోళనకరం. వేలాదిమంది విద్యార్థులు ఎంతో ఖర్చుపెట్టి తమ కలలను నెరవేర్చుకునేందుకు ఢిల్లీకి వస్తున్నారు. వారికి సరైన వసతులు కల్పించాల్సిన బాధ్యత ఉంది. విద్యార్థుల ఆందోళనకు మద్దతిస్తున్నాం. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి’ అంటూ కామెంట్స్ చేశారు. The death of 3 UPSC aspirants in Old Rajinder Nagar due to drowning in the basement of a coaching institute is a matter of concern. Thousands of students come to Delhi and spend lakhs to fulfil their dream. They deserve better. Extending support to their protest. The concerned…— Vijayasai Reddy V (@VSReddy_MP) July 29, 2024 -
ఢిల్లీలో 13 ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు సీజ్
ఢిల్లీ: ఢిల్లీలోని ఓ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి వర్షం నీరు పోటెత్తిన ఘటనలో ముగ్గురు అభ్యర్థులు మృతిచెందారు. ఈ ఘటన నేపథ్యంలో ఓల్డ్ రాజేంద్ర నగర్ ప్రాంతంలో నిబంధనలు ఉల్లంఘించి బేస్మెంట్ ఏరియాను ఉపయోగిస్తున్న 13 కోచింగ్ సెంటర్లపై మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ(ఎంసీబీ) చర్యలు చేపట్టింది. ఈ మేరకు 13 కోచింగ్ సెంటర్లను అధికారులు సీజ్ చేశారు.‘‘ఆదివారం రాజేంద్ర నగర్ ప్రాంతంలోని పలు ఐఏఎస్ కోచింగ్ సెంటర్లలో ఎంసీడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. బేస్మెంట్ ఏరియాను కమర్షియల్ అవసరాలకు ఉపయోగిస్తున్న కోచింగ్ సెంటర్లను సీజ్‌చేశాం. శనివారం జరిగిన ప్రమాదం నేపథ్యంలో తనిఖీలు చేపట్టాం. రాజేంద్రనగర్ ప్రాంతంలో నిబంధనలు ఉల్లంఘించిన కోచింగ్ సెంటర్లను సీజ్ చేస్తాం. అదేవిధంగా ఢిల్లీ మొత్తం ఉన్న కోచింగ్ సెంటర్లు, పలు భవనాల్లో తనిఖీలు చేస్తాం’’ అని ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబేరాయ్ ‘ఎక్స్ ’లో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన కోచింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రావుస్ ఐఎఎస్ స్టడీ సెంటర్లో జరిగిన సంఘటనకు ఎంసీడీ అధికారులు ఎవరైనా బాధ్యులు ఉన్నారా? అనేదానిపై వెంటనే విచారణ జరుగుతోందని అన్నారు. ఈ ఘటన వెనుకు ఎవరైనా అధికారులు దోషులగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.సీజ్ చేసిన 13 ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు ఇవే..ఐఏఎస్ గురుకులంచాహల్ అకాడమీప్లూటస్ అకాడమీసాయి వర్తకంఐఏఎస్ సేతుటాపర్స్ అకాడమీదైనిక్ సంవాద్సివిల్ రోజువారీ ఐఏఎస్కెరీర్ పవర్99 నోట్లువిద్యా గురుగైడెన్స్ ఐఏఎస్ఐఏఎస్లకు ఈసీచదవండి: సివిల్స్ కల జల సమాధి -
ఢిల్లీ ఐఏఎస్ అకాడమీ ఓనర్ అరెస్ట్.. మృతుల్లో తెలంగాణ యువతి
ఢిల్లీ: సెంట్రల్ ఢిల్లీలోని రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటనపై విద్యార్థులు పెద్దఎత్తున నిరసన తెలుపుతున్నారు. తాజాగా రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్ ఓనర్ అభిషేక్ గుప్తా, కో-ఆర్డినేటర్ దేశ్పాల్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున ఘటనా స్థలంలో ఇద్దరు విద్యార్థినులు, ఒక విద్యార్థి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనలో ఓనర్ అభిషేక్ గుప్తా, కో-ఆర్డినేటర్ దేశ్పాల్ సింగ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.Delhi's Old Rajendra Nagar coaching centre incident | The owner and coordinator of the coaching centre arrested: Delhi Police— ANI (@ANI) July 28, 2024 చదవండి: Delhi Tragedy: ‘ముగ్గురు కాదు 10 మంది మృతి’‘‘ఈ ఘటనపై పలు సెక్షన్ల కింది రాజేంద్రనగర్ పోలీసు స్టేషనలో ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. ఈ ప్రమాదంపై ఇప్పటికే విచారణ చేపట్టాం’’ అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ఎం.హార్షవర్ధన్ తెలిపారు. మృతిచెందినవారిని తానియా సోని (25), శ్రేయా యాదవ్ (25), నెవిన్ డాల్విన్ (28)గా పోలీసులు గుర్తించారు. శ్రేయా యాదవ్ ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్, తాన్యా సోనిది తెలంగాణ, నవీన్ డాల్విన్ కేరళలోని ఎర్నాకులానికి చెందిన విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. కోచింగ్ సెంటర్లో మృతి చెందిన తానీయా సోని స్వస్థలం బీహార్. తానియా సోని తండ్రి తెలంగాణ సింగరేణిలో ప్రస్తుతం మేనేజర్‌గా పని చేస్తున్నారు. చదవండి: వీడియో: ఢిల్లీ ప్రమాదం ఇలా జరిగింది.. అభ్యర్థి ఆవేదనకేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దిగ్భ్రాంతి ఢిల్లీ రాజేంద్రనగర్‌లోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్లో వరదల కారణంగా సికింద్రాబాద్‌కు చెందిన తానియా సోని అనే 25 ఏళ్ల యువతి మృతి చెందిన ఘటనపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తానియా సోని తండ్రి విజయ్ కుమార్‌ను కిషన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భౌతికకాయం వీలైనంత త్వరగా సికింద్రాబాద్ చేర్చేందుకు సంపూర్ణంగా సహకరిస్తామని తెలియజేశారు. ఢిల్లీ పోలీసులు, ఇతర అధికారులతో మాట్లాడి.. పెండింగ్‌లో ఉన్న అన్ని ఫార్మాలిటీస్‌ను త్వరగా పూర్తిచేయడంలో చొరవతీసుకోవాలని ఢిల్లీలోని తన కార్యాలయాన్ని కిషన్ రెడ్డి ఆదేశించారు. -
వీడియో: ఢిల్లీ ప్రమాదం ఇలా జరిగింది.. అభ్యర్థి ఆవేదన
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా రాజేంద్ర నగర్‌లోని రావు ఐఏఎస్ అకాడమీ బేస్మెంట్లోకి వరద నీరు చేరింది. ఒక్కసారిగా వరద నీరు చేరడంతో భవనం బేస్మెంట్లో చిక్కుకున్న ముగ్గురు అభ్యర్థులు నీటిలో చిక్కుకుని మృతిచెందారు. మృతులను తానియా సోని(25), శ్రేయా యాదవ్(25), నీవైన్ దాల్విన్(28)గా గుర్తించారు. వీరిలో శ్రేయా యాదవ్ ఉత్తరప్రదేశ్, నవీన్ దాల్విన్ కేరళకు చెందిన వ్యక్తి కాగా... తన్యా సోనీ తెలంగాణకు చెందిన యువతి. ఇక, ఘటనలో అకాడమీ యాజమన్యం, పోలీసుల తీరుపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా, ఈ ఘటనపై ఓ అభ్యర్థి(ప్రత్యక్ష సాక్షి) ట్విట్టర్ వేదికగా ప్రమాద సమయంలో ఏం జరిగిందో వీడియోను పోస్టు చేశారు. ఈ సందర్భంగా అతను.. కేవలం పది నిమిషాల్లోనే బేస్మెంట్లో మొత్తం వరద నీటితో నిండిపోయింది. సాయంత్రం 6:40 గంటలకు మేము పోలీసులకు సమాచారం అందించాం. కానీ, పోలీసులు మాత్రం రాత్రి తొమ్మిది గంటలకు ఇక్కడికి వచ్చారు. ఈ కారణంగానే ముగ్గురు అభ్యర్థులు మృతిచెందారు. పోలీసులు సకాలంలో అక్కడికి వచ్చి ఉంటే వారే ప్రాణాలతో బయటపడేవారు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. వారికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. వారు ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. I'm one of survivor of this horrible incident, within 10 min basement was filled it was 6.40 we called police and ndma's but they reach after 9 PM till then my 3 #UPSCaspirants mates lost their lives 😭 3 are hospitalized pray for them🙏who cares our life😭#RajenderNagar#upsc pic.twitter.com/hgogun1ehF— Hirdesh Chauhan🇮🇳 (@Hirdesh79842767) July 28, 2024మరోవైపు.. రావు ఐఏఎస్ అకాడమీ వద్ద విద్యార్థులు ధర్నాకు చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. ఈ ఘటనకు కారణంగా ఆప్ సర్కార్‌దా? లేక ఢిల్లీ పోలీసులదా? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. వరద నీటిపై పోలీసులకు సమాచారం ఇచ్చిన ఎందుకు స్పందించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఓల్డ్ రాజేంద్రనగర్‌లో ఎక్కువ సంఖ్యలో ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. వేల సంఖ్యలో విద్యార్థులు అక్కడ ఉంటున్నారు. ఇలా భద్రత లేకుండా కోచింట్ సెంటర్స్ నిర్వహించడంపై వారు మండిపడుతున్నారు. ఇక, ఈ ఘటనపై ఢిల్లీ సర్కారు మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. #WATCH | Old Rajender Nagar incident | Delhi: Outside visuals from the IAS coaching centre in Old Rajender Nagar where three students lost their lives after the basement was filled with water yesterday. pic.twitter.com/kJFpdg4xmm— ANI (@ANI) July 28, 2024Heartbreaking situation in Delhi's Karol Bagh one IAS aspirant confirmed dead and two others still missing after basement flooding at an IAS coaching centre due to intense rainfall Thoughts and prayers are with the victims and their families 😭 #DelhiFloods #KarolBagh #IAS #UPSC pic.twitter.com/n7gMElVaem— BLACKWOLF (@wohkhahai) July 27, 2024 -
సీఎం జగన్‌ను కలిసిన ఐఏఎస్ ప్రొబేషనర్స్
-
ఆర్థికాభివృద్ధికి విద్య బలమైన సాధనం: గవర్నర్ హరిచందన్
సాక్షి, విజయవాడ: ఏ సమాజమైనా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే విద్య అత్యంత బలమైన సాధనమని, విద్య, పేదరికం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా వెనిగండ్ల గ్రామం కౌండిన్యపురంలో సోమవారం నిర్వహించిన ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రస్టు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కౌండిన్య ఐఎఎస్ అకాడమీని గవర్నర్ ప్రారంభించి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని అర్హులైన పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకారవేతనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ ఒక వ్యక్తి మంచి విద్యాధికునిగా మారినప్పడు గణనీయమైన ఆదాయార్జనతో పేదరికం నుండి బయటపడే అవకాశాలు మెరుగ్గా ఉంటాయన్నారు. కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ గత కొన్ని సంవత్సరాలలో సుమారు 4,500 మంది పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ.96 లక్షల ఉపకార వేతనాలు అందించడం అభినందనీయమన్నారు. సమాజంలో అర్హులైన బలహీన వర్గాల విద్యార్థులకు శిక్షణ అందించేందుకు ఏర్పాటు చేసిన కౌండిన్య ఐఏఎస్ అకాడమీ ఔత్సాహిక విద్యార్థులకు మేలు చేకూర్చుతుందన్నారు. జాతీయ విద్యా విధానం-2020 విద్యారంగంలో పెద్ద సంస్కరణలను తీసుకొచ్చిందన్నారు. రాబోయే దశాబ్దాల్లో భారతదేశాన్ని విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చగలదని గవర్నర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియా, విజయవాడ పోలీసు కమిషనర్ కాంతి రాణా టాటా, గుంటూరు జిల్లా కలెక్టర్ వేణు గోపాల్ రెడ్డి, ట్రస్టు వ్యవస్ధాపకులు, మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ఇ.వి. నారాయణ, వాణిజ్య పన్నుల శాఖ మాజీ అదనపు కమిషనర్ వై. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు -
ఆన్లైన్లో సివిల్స్ శిక్షణ
సాక్షి, అమరావతి: సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్‌లో ఎనలేని క్రేజ్. ఏటా వేలమంది విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి ప్రతిష్టాత్మక సర్వీసులే లక్ష్యంగా.. సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమవుతుంటారు. యూపీఎస్సీ వందల సంఖ్యలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తే.. దేశవ్యాప్తంగా ఆరులక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకుంటారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ.. ఇలా మూడంచెల సివిల్స్ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించాలంటే.. కనీసం ఏడాదిన్నరపాటు నిపుణుల సలహాలతో అంకితభావంతో ప్రిపరేషన్ సాగించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం కరోనా కారణంగా విద్యార్థులు వ్యక్తిగతంగా క్లాసులకు రాలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థులు వీలున్న సమయంలో నిపుణులు రూపొందించిన వీడియో క్లాసులు వింటూ.. సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యేలా.. క్రిష్ణప్రదీప్ 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో యాప్ ద్వారా ఆన్లైన్ కోచింగ్ అందిస్తోంది. దీనికి సాక్షి మీడియా గ్రూప్.. మీడియా పార్టనర్‌గా వ్యవహరిస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు www.kpias.com లాగిన్ అయి రిజిస్టర్ చేసుకోవచ్చు. కోర్సు కాలవ్యవధి ఏడాదిన్నర. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.25,000. ప్లే స్టోర్ నుంచి క్రిష్ణప్రదీప్ 21 సెంచరీ ఐఏఎస్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా వీడియో క్లాసులు వినొచ్చు. ఈ వీడియోలను ఎప్పుడైనా, ఎక్కడైనా మొబైల్లో చూసుకోవచ్చు. అంతేకాకుండా ఈ యాప్‌లో స్టడీ మెటీరియల్, అసైన్మెంట్స్, ముల్టీపుల్ చాయిస్ కొశ్చన్ టెస్టులు ఉంటాయి. టెస్ట్ సబ్మిట్ చేయగానే ఫలితం వస్తుంది. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నెంబర్లు: 9133637733, 9666637219, 9666283534, 9912671555. పనిదినాల్లో ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు సంప్రదించవచ్చు. -
ఆర్సీ రెడ్డి విజయగాథ
ఆయన సివిల్ సర్వీసుకు ఎంపిక కాలేదు. కష్టపడి మూడు పర్యాయాలూ ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ ఆ వైఫల్యం నుంచి ఆయన పాఠం నేర్చుకున్నారు. ఏ రంగంలో విఫలమయ్యారో అదే రంగంలో విజయముద్ర వేసుకున్నారు. ఎందరో సివిల్ సర్వీసుకు ఎంపిక కావడానికి కారణమయ్యారు. విజయబాట వేశారు. కాదు..విజయబావుటా ఎగురవేశారు..ఆయనే ఏడు పదులు దాటిన ఆర్సీ రెడ్డి..స్ఫూర్తిదాయకమైన ఆయన జీవిత విశేషాలు ఒకసారి పరికిద్దామా.. రాజంపేట: వైఎస్సార్ జిల్లా నందలూరు మండలంలోని ఓ మారు పల్లె. పేరు ఈదరపల్లె.. ఆ ఊరికి సర్పంచ్‌గా పనిచేసిన భూమన మల్లారెడ్డి కుమారుడు రామచంద్రారెడ్డి(ఆర్సీ రెడ్డి). ఆ ఊరిలోనే ప్రాథమిక విద్య చదివారు. తర్వాత రాజంపేట మండలం గుండూర్లు వెళ్లి కొంతకాలం చదివారు. నందలూరులోని జిల్లా ప్రజాపరిషత్ స్కూలులో స్ఎల్ఎల్సీ (ఇప్పటి టెన్తు క్లాస్) ఉత్తీర్ణులయ్యారు. సైన్స్‌మీద మక్కువతో కడప వెళ్లి ఆర్ట్స్ కళాశాలలో బీఎస్సీ చదివారు. ప్రతి క్లాసులోనూ మంచి మార్కులే వచ్చేవి. ఆయన ఆటల్లోనూ దిట్ట. ఎస్వీ యూనివర్శిటీలో హకీ క్రీడాకారుడిగా గుర్తింపు సాధించారు. చదువుతున్నప్పటి నుంచి ఉన్నత స్థానం చేరుకోవాలని ఆర్సీ రెడ్డి అభిలషించేవారు. ముఖ్యంగా ఐఏఎస్ కావాలని ఎక్కువగా పరితపించేవారు. ఇదే ఆకాంక్షను తన తల్లిదండ్రులు మల్లారెడ్డి..భవానమ్మల వద్ద వ్యక్తంచేశారు. వారు కూడా వెంటనే వెన్నుతట్టి ప్రోత్సహించారు. వెంటనే ఆర్సీ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. రావూస్ స్టడీ సర్కిల్లో చేరారు. కష్టపడి చదివారు. సివిల్ సర్వీసు పరీక్ష మూడు సార్లు రాశారు. ఈ మూడు ప్రయత్నాలూ విఫలమయ్యాయి. దీంతో కుంగుబాటు..నిరాశలను దరిచేరనీయకుండా తనకున్న ఆంగ్ల పరిజ్జానంతో కొద్దికాలం ఇంగ్లీషు మ్యాగ్జైన్లో జర్నలిస్టుగా పనిచేశారు. తర్వాత హైదరాబాద్ వచ్చేశారు. తాను ఢిల్లీలో శిక్షణ పొందిన రావూస్ ప్రొద్బలంలో హైదరాబాద్‌లోని అదే శిక్షణా సంస్థ శాఖకు ఎండీగా పనిచేశారు. బలమైన సంకల్పంతో.. రావూస్‌లో చేస్తున్నా ఆయన మస్తిష్కంలో సివిల్ సర్వీసెస్ ఆలోచన నిరంతరం వెంటాడేది. పల్లె నేపథ్యంలో తనలాగే వచ్చిన వారికి తర్ఫీదునిస్తే కొందరయినా సివిల్స్‌కు ఎంపికవుతారని భావించేవారు. మట్టిలో మాణిక్యాలను తవ్వి తీయాలని బలమైన సంకల్పం తీసుకున్నారు. తనకున్న అనుభవసారంతో సివిల్ సర్వీస్‌కు వెళ్లే అభ్యర్థులకు కోచింగ్ ఇవ్వాలనుకున్నారు. 1985లో సాహసంతో ఓ ముందడుగు వేశారు. హైదరాబాద్‌లో స్వయంగా ఐఏఎస్ స్టడీ సర్కిల్ పేరుతో చిన్నగా సివిల్ సర్వీసెస్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తనతోపాటు మంచి ఫ్యాకల్టీని ఎంపిక చేసుకున్నారు. నెమ్మది నెమ్మదిగా ఆసంస్థకు పేరు వచ్చింది. ఏటా సివిల్ సర్వీస్ ఫలితాల్లో కొందరు విజేతలవడం ప్రారంభమైంది. దీంతో ఆర్సీ రెడ్డికి విశేష ఖ్యాతి లభించింది. ఆయన వద్ద కోచింగ్ తీసుకుని సివిల్ సర్వీసుకు ఎంపికైన ప్రముఖుల్లో ఏకెఖాన్, తేజ్‌దీప్ ప్రతిహస్త, ద్వారకతిరుమలరావు, రాజేందర్‌రెడ్డి తోపాటు ఇప్పుడు రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్‌లుగా ఉన్న కృష్ణబాబు, ధనుంజయరెడ్డి లాంటి వారున్నారు. 2001లో ఇండియా టాపర్ సత్యప్రకాశ్(రాజంపేట) ఆర్సీరెడ్డి మార్గదర్శకంలోనే శిక్షణ పొందడం విశేషం. ఇలా సివిల్ సర్వీసుకు ఎంపికైన వారిని తయారు చేసే ఆర్సీరెడ్డి తమ ప్రాంతానికి చెందిన వారేనని ఇక్కడి వారు ఆనందపడుతుంటారు. నందలూరుకు చెందిన ఇద్దరు ఇప్పటివరకూ సివిల్ సర్వీసుకు ఎంపికయ్యారంటే ఆయన ప్రేరణే. గడచిన మూడు దశాబ్ధాలలో ఈ సంస్థలో తర్ఫీదు పొంది 135 మంది ఐఏఎస్, 23 మంది ఐఎఫ్ఎస్, 142 ఐపీఎస్, 643 మంది సెంట్రల్ సర్వీసెస్‌లకు ఎంపికైనట్లు సంస్థ వర్గాలు చెప్పాయి. తాజాగా విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 14మంది విజేతలుగా నిలిచారు. ఆర్సీ రెడ్డికి ఇద్దరు కుమార్తెలు. అమెరికాలో ఉంటున్నారు. భార్య విద్యావేత్తగా పనిచేసి రిటైరయ్యారు. ఆర్సీ రెడ్డి తమకు స్ఫూర్తి అని రాజంపేట పరిసర ప్రాంత యువకులు చెబుతుంటారు. ఆయన ఇక్కడి కార్యక్రమాలకు హాజరై అందరినీ పలకరించి వెళ్తుంటారు. సానపడితే వజ్రాలే.. పల్లెటూళ్ల నుంచి వచ్చారని తక్కువ అంచనా వేయకూడదు. మట్టిలోనే మాణిక్యాలు ఉంటాయి. వారిని గుర్తించి సానబడితే వజ్రాలవుతారు. ఐక్యూ గుర్తించి, సరైన మార్గంలో తర్ఫీదు ఇస్తే వారు తప్పకుండా సివిల్స్ లాంటి రంగాల్లో విజేతలుగా నిలుస్తారు. ఆరంభంలోనే మెరుగైన రీతిలో సాధన పెట్టాలి. అప్పుడే మంచి ఫలితాలు ఆవిష్కృతమవుతాయి. నేను సివిల్స్‌కు ఎంపిక కాలేకపోయినా ఇదే భావనతో సివిల్స్.. గ్రూప్‌వన్ సర్వీసులకు కొంతమందిని అందించగలుగుతున్నాను. ఇది పూర్వజన్మసుకృతంగా భావిస్తుంటాను. – భూమన రామచంద్రారెడ్డి -
ఐఏఎస్ అకాడమీ శంకరన్ బలవన్మరణం
సాక్షి ప్రతినిధి, చెన్నై: సివిల్స్ పరీక్షలు రాయాలని భావించే దక్షిణ భారతదేశంలోని విద్యార్థులకు చప్పున స్ఫురించే పేరు ‘శంకర్ ఐఏఎస్ అకాడమీ’. చెన్నై అన్నానగర్‌లో శంకరన్ ఐఏఎస్ అకాడమీ పేరుతో సివిల్ పరీక్షల శిక్షణ కేంద్రాన్ని నడుపుతుండగా ఇతర రాష్ట్రాల్లోనూ శాఖలున్నాయి. స్వల్పవ్యవధిలోనే శంకరన్ విద్యార్థులు ఐఏఎస్‌లో దేశస్థాయిలో టాప్ 10లో నిలిచారు. 900 మందికిపై ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నతస్థానాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం 1,500 మంది శిక్షణ పొందుతున్నారు. దీంతో దేశం నలుమూలల నుంచి విద్యార్థులు చేరడం ప్రారంభించారు. నాలుగేళ్లలో శంకరన్ అకాడమీ అత్యున్నత స్థానానికి చేరుకుని పేరు ప్రఖ్యాతులు సాధించడంతో దేశంలోని ఇతర ఐఏఎస్ శిక్షణ కళాశాల వారితో పోటీ నెలకొం ది. తమిళనాడులో రెండో స్థానాన్ని అందుకుం ది. భార్య వైష్ణవి (42), సాగణ (12), సాధన (05) అనే ఇద్దరు కుమార్తెలతో చెన్నై మైలా పూరు కృష్ణస్వామి అవెన్యూలో నివసించే శంకరన్‌ది చూడచక్కనైన కాపురం. అయితే విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దే శంకరన్ కుటుంబపరమైన సమస్యలతో సతమతం అవుతున్నట్లు సమాచారం. శంకరన్‌పై అనుమానం పెంచుకున్న భార్య తరచూ ఘర్షణపడేదని చెబుతున్నారు. గురువారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్న శంకరన్‌కు, వైష్ణవికి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్టు సమాచారం. భార్యపై కోపంతో భోజనం చేయకుండానే తన గదిలోకి వెళ్లి గడియపెట్టుకున్నాడు. తగవు కారణంగా భార్య సైతం ఆ గదిలోకి వెళ్లలేదు. ఎంతసేపటికీ గది నుంచి భర్త బైటకు రాకపోవడంతో వైష్ణవి అతని సెల్‌కు ఫోన్ చేసింది. అయితే బదులురాలేదు. రాత్రి 12 గంటల సమయంలో ఇంట్లోని వారంతా కలిసి గదితలుపులు బద్దలుకొట్టి చూడగా బెడ్‌షీట్‌తో ఉరేసుకుని శంకరన్ శవంగా వేలాడుతున్నాడు. భార్యాభర్తల మధ్య పెరిగిపోయిన మనస్పర్థలు, శంకరన్ ఐఏఎస్ అకాడమీ అగ్రస్థానానికి చేరుకోవడంతో పోటీ సంస్థల వల్ల మానసిక ఒత్తిళ్లు శంకరన్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించి ఉంటాయని అనుమానిస్తున్నారు. విద్యార్థుల పట్ల స్నేహభావంతో మెలిగేవాడు, పేదవారికి ఉచితంగా శిక్షణ ఇచ్చేవారని కరుణాకరన్ అనే విద్యార్థి ఆవేదన చెందాడు. ప్రతి విద్యార్థి సివిల్స్ రాయాలి, ఐఏఎస్ కావాలని తపించేవాడని అతడు వాపోయాడు. ఇంతటి మంచి వ్యక్తులు అతికొద్ది మందే ఉంటారు, శంకరన్ మాస్టారిని కోల్పోయామని కన్నీరుమున్నీరయ్యాడు. -
గిరిజన యువతకు ఐఏఎస్ అకాడమీ
సాక్షి, హైదరాబాద్: గిరిజన యువతను సివిల్ సర్వీసెస్ వైపు మళ్లించేందుకు గిరిజన సంక్షేమ శాఖ సరికొత్త కార్యాచరణ రూపొందించింది. సివిల్స్ సాధించాలనుకునే యువతకు కార్పొరేట్ కోచింగ్ సెంటర్లకు దీటుగా ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. ఇందుకు ప్రత్యేకంగా ఐఏఎస్ అకాడమీని అందుబాటులోకి తీసుకొస్తోంది. దీని ఏర్పాట్లు సైతం దాదాపు పూర్తి చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని వైటీసీ (యూత్ ట్రైనింగ్ సెంటర్)లో ఈ అకాడమీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికి రూ. 1.5 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. ఈ అకాడమీలో 150 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనుంది. ఇందులో 50 మంది మహిళలు, 100 మంది పురుషులకు సీట్లు ఇవ్వనున్నారు. ప్రైవేటుకు చెక్... సివిల్స్‌కు సన్నద్ధమయ్యే గిరిజన యువతకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు గతంలో ప్రైవేటు కోచింగ్ సెంటర్లను ప్రభుత్వం ఆశ్రయించింది. ఆయా కోచింగ్ సెంటర్లలో అధ్యాపకులను అంతంత మాత్రంగా ఏర్పాటు చేయడంతో ఫలితాలు సంతృప్తికరంగా రాలేదు. 2016–17 విద్యా సంవత్సరంలో దాదాపు రూ.1.35 కోట్లు ఖర్చు చేసి, వందకుపైగా అభ్యర్థులను ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో చేర్చారు. అందులో కేవలం ఒక్క అభ్యర్థి మాత్రమే సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు స్వస్తి పలుకుతూ సొంతంగా అకాడమీని ఏర్పాటు చేయాలని గిరిజన సంక్షేమ శాఖ భావించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.. నిధులు విడుదల చేసింది. దీంతో రాజేంద్రనగర్‌లోని వైటీసీ భవనాన్ని అకాడమీగా మార్చేందుకు యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ భవనంలో 35 విశాల గదులతో పాటు మరో 25 గదులున్నాయి. శిక్షణ పూర్తయ్యే వరకు అభ్యర్థులకు ఇక్కడే వసతి కల్పించనుంది. ఫ్యాకల్టీగా ప్రఖ్యాత ప్రొఫెసర్లను తీసుకురానుంది. సబ్జెక్టు నిపుణులను ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల నుంచి రెండు నుంచి పది రోజుల వరకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి తీసుకురానుంది. నిర్ణీత వ్యవధిలో సిలబస్ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటోంది. మరోవైపు అడ్మిషన్లు దాదాపు పూర్తి కావచ్చాయి. ఈ బాధ్యతలు అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. ఇప్పటికే రెండు దఫాలుగా రాత పరీక్ష, మౌఖిక పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసింది. కార్పొరేట్ స్థాయిలో... రాజేంద్రనగర్‌లోని వైటీసీలో ఏర్పాటు చేస్తున్న ఈ అకాడమీని కార్పొరేట్ స్థాయిలో గిరిజన సంక్షేమ శాఖ తీర్చిదిద్దుతోంది. విశాలమైన తరగతి గదులు, డిజిటల్ క్లాస్ రూమ్‌లు, డార్మిటరీలు, 2 వేల పుస్తకాల సామర్థ్యం ఉన్న లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, పూర్తిస్థాయిలో ఫర్నిచర్, బయోమెట్రిక్ మెషీన్లతో హాజరు తదితరాలు ఏర్పాటు చేస్తోంది. అకాడమీలో భద్రత కోసం సీసీ కెమెరాలనూ ఏర్పాటు చేసింది. అన్ని రకాల దినపత్రికలు, జర్నల్స్‌ను అభ్యర్థుల కోసం అందుబాటులోకి తేనుంది. అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభం ‘గిరిజన ఐఏఎస్ అకాడమీని అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభించేలా ఏర్పాట్లు చేశాం. అకాడమీని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ప్రారంభించనున్నారు. ప్రైవేట్ అకాడమీలకు దీటుగా ఏర్పాట్లు చేస్తున్నాం. అత్యుత్తమ అధ్యాపకులను తీసుకొచ్చి అభ్యర్థులకు నాణ్యమైన బోధన అందేలా చర్యలు తీసుకుంటున్నాం. అకాడమీ నిర్వహణకు ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించాం. అకాడమీలో డాటాఎంట్రీ ఆపరేటర్లు, గార్డ్లు, కిచెన్ స్టాఫ్, క్లీనింగ్ స్టాఫ్, ఆఫీస్ సబార్టినేట్లు, లైబ్రేరియన్లుగా కొత్తగా 13 మందిని నియమించాం’. – వి.సర్వేశ్వర్‌రెడ్డి, అదనపు సంచాలకుడు, గిరిజన సంక్షేమ శాఖ -
ఐఏఎస్ అకాడమీలో కాల్పులు
ముస్సోరి: ముస్సోరిలోని ప్రముఖ ఐఏఎస్‌ల శిక్షణ కేంద్రం 'లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ ఐఏఎస్ ట్రైనీస్' వద్ద ఓ జవాను కాల్పులు జరపడంతో అతడి సహచరుడు చనిపోయాడు. మరో ఇద్దరు జవాన్లు గాయాలపాలయ్యారు. కాల్పులు జరిపిన అనంతరం అతడు పారిపోయాడు. కాల్పులు జరిపిన సైనికుడు ఇండో-టిబెట్ సరిహద్దు పోలీసు విభాగానికి చెందినవాడు. ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. పారిపోయిన జవానుకోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.